Skip to content
Transcript తెలుగు
వేద గమనమే ఉగాది. మధుష్య మాధవస్య వాసంతికావృతౌ అంటుంది యజుర్వేదం. నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల కాలాన్ని కలిగిన కలియుగం ఆరంభమైన వేళ గనుక ఇది ఉగాది. అయనాలలో మొదటిది ఉత్తరాయణం. ఋతువులలో మొదటిది వసంత ఋతువు. మాసాలలో మొదటిది చైత్ర మాసం. పక్షాలలో మొదటిది శుక్లపక్షం. తిథులలో మొదటిది పౌ పాడ్యమి. కాలంలో మొదటిది పగలు. ముహూర్తాలలో మొదటిది బ్రాహ్మీ ముహూర్తం. త్రిముహూర్తులలో మొదటిది బ్రహ్మ. అంటే సృష్టి రచన ప్రారంభమైన వేళ గనుక ఇది ఉగాది, ఇది యుగాది. మానవుడు మాట నేర్చినటువంటి తొలి కాలం గనుక ఇది ఉగాది. అంటే ఉక్ అంటే మాట అని అర్థం. పంచభూతాలు ప్రకృతి ధర్మం ప్రకారం కొత్తదనాన్ని సంతరించుకొని ఆరు ఋచులను ఔషధీ గుణాలతో ప్రసాదిస్తున్నది గనుక ఋతువు వసంత ఋతువు. శంభుద్యాన వసంత సంగినీ హృదారామేఘ జిర్ణచ్ఛదా, స్రస్తా భక్తిలతాచ్ఛదా విలసతా పుణ్యప్రవాళ శ్రితాః, దీశ్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా, జ్ఞానా ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి అంటారు శంకర భగవత్పాదులు. అంటే పరమేశ్వర నామస్మరణంతో శిశిరం వెళ్లి వసంతం ఆగమించినప్పుడు వసంతం కేవలం ప్రకృతిలోనే కాదు మానవ హృదయంలో కూడా ఉంటుందని, అక్కడ భక్తి అనే సన్నని తీగ పాకి, దానిమీద త్రిగుణాలు అనబడేటువంటి మూడు మొగ్గలు పుట్టి, మూడు మొగ్గలు కాల పరిణామ క్రమంలో వికాసమానం చెంది, అవి పుష్పాలై సౌరభాన్ని వెదజల్లుతూ నెమ్మది నెమ్మదిగా అవి ఫలాలై, ఫలాలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి ఆనందం అనే మహా స్రవంతిలో ఒక సంవిత్ ఫలాన్ని ఇస్తున్నది అని భగవత్పాదుల యొక్క దర్శనం. సంవిత్ ఫలం అంటే దేనిని పొందాలో దానిని పొందినట్లు ఒక జీవుడు పొందవలసినటువంటి అనుభూతి గనుక అరణ్యవాసం రామాయణ పరంగా సీతాపహరణం, సుగ్రీవ మైత్రి, హనుమ లంకా విజయం, రామ పట్టాభిషేకం ఇవన్నీ రామాయణంలో విరిసిన వసంత పువ్వు వన్నెలు. కోయిల రాగాలు, మామిడిల్లు, చలువ పందిళ్లు, వేప పూతలు, తీయని మధువులు ఇదంతా ఉగాది. ఇదంతా వసంతంతో కూడిన ఉగాది. అంటే ఆకాశం, అంటే సూర్యబీజం. శూన్యంలో మొలచినటువంటి జ్ఞానాదిత్య కాంతులు అంటే సూర్యకాంతులు ప్రకృతికి చైతన్యం కలిగించిన కాలం ఇది. బరువుగా సాగే కాలం. వివరణంతా ప్రకృతి పరంగా ఖగోళ గతం. దీనిని తొలిసారిగా భారతదేశంలో ఆవిష్కరించినటువంటి మహాపురుషుడు వరాహమిహిరుడు. ఆయనను మనం స్మరించుకోవాలి. పరమాత్మతో మనసును అనుసంధానం చేసుకునే ఈరోజు ఇది ఉగాది. అంతేకాదు, ఆరు రుచుల కన్నా భగవన్నామం మరింత రుచికరం కాబట్టి రాగాలు సంగీతము కలిసి దివ్యనాదం అవుతున్నది గనుక దివ్య నామము కలుషహారం అవుతూ ఉన్నది. అంతేకాదు, కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడు కూడా వేదగతమైనవి. త్రయీ విద్యా స్వరూపం కాబట్టి జీవుడు కర్మానుబంధి మనుష్యుని లోకే కర్మ చేయాలి, భక్తితో చేయాలి, యోగించి చేయాలి. యోగించి అంటే పరమాత్మ భావనతో కూడి. జీవ ప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ రెండూ కలిసినప్పుడే ఒక పరిపూర్ణతను సంతరించుకుంటాయి గనుక అటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఆరంభ క్షణాలే ఉగాది. అంతేకాదు, మానవుడికి ముందే చెప్పినట్లు మాట నేర్పినది ఉగాది, మౌనం నేర్పింది కూడా ఉగాది. మానవుడికి మాధవత్వాన్ని అనుగ్రహించింది కూడా ఉగాది. అంటే మానవుడు తనలోని దానవత్వ, దీనత్వ, దివ్యత్వాల మూడింటిలోనూ మానవత్వాన్ని దాటి పరిమళించినటువంటి దివ్యత్వాన్ని తనలో తాను ఆంతరంగికంగా అనుభవించవలసినటువంటి కాలం కాబట్టి కాలానికి నమస్కారం. కాల గమనం అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనం అంటే ఖగోళం. శూన్యంలో నుంచి పూర్ణాన్ని, పూర్ణంలో నుంచి శూన్యాన్ని ఏకకాలంలో అనుభవించగలిగినటువంటి శుద్ధాద్వైత కాలమే ఉగాదిగా మనం భావన చేసి ఉగాదికి కాలాయ నమః, కాలత్రయాయ నమః, కాలాతీతాయ నమః అని కాలానికి మనం నమస్కరిస్తాం. ఈవేళ కాలపురుషుడికి, మహాచైత్య పురుషుడికి మనందరం కూడా మనసా, వచసా, శిరసా నమస్కరిస్తూ మన దైనందినమైనటువంటి కార్యక్రమాలన్నిట భగవత్ తత్వాన్ని అన్నింటితో పాటు, నిజానికి వీటన్నింటికంటే మానవత్వాన్ని గనక మనం నింపుకొని మన జీవితాన్ని ఒక సార్థకమైనటువంటి దిశలో నడిపించుకోగలిగినట్లయితే ఉగాది మనకు అనేక పాఠాలను, అనేక గుణపాఠాలను కూడా నేర్పుతుంది గనుక ఉగాది మనకు గురు స్వరూపంగా మనం భావన చేయాలి. అంటే కాలమే గురువు, అనంతమైనటువంటి పరమాత్మే గురువు, ఇదంతా కూడా పరమాత్మ అంటే మన బయట లేడని ఒక అనంత మహాశక్తిగా, శాంతి వేదికగా మన యందే ఉన్నాడు అన్నటువంటి భావనని నిరంతరము మనం గమనిస్తూ వెళ్ళాలి గనుక ఉగాది సర్వజన మనోల్లాస పులకిత పుంభితమై అంటే నిండుగా మానవ జాతిని మహదాశీర్వచనం చేయవలసిందిగా కాలపురుషుడికి నమస్కరిస్తూ, కరోనా అనబడేటువంటి ఒక మహమ్మారి దానిని జయించాలి అంటే మనల్ని మనం నియంత్రించుకోవాలి. మన నిగ్రహాన్ని పాటించాలి. ప్రకృతికి లోబడి ఉండాలి. ప్రకృతి యొక్క ధర్మాన్ని మనం గౌరవిస్తూనే మన జీవితాన్ని చక్కగా వెలార్చుకోవాలి గనుక ఉగాది సర్వజనులకి, సమస్త ప్రపంచానికి కూడా ఆరక్షణై నిలుచు గాక అని మంగళాశాసనం చేస్తూ, ఉగాదికి మరొక్కసారి నమస్కరిస్తూ స్వస్తి.
YouTube · audio

కాల గమనమే ఉగాది | VSR మూర్తి | Kaala Gamaname Ugadi

Home

కాల గమనమే ఉగాది | VSR మూర్తి | Kaala Gamaname Ugadi

Source: AIRHyderabad on YouTube

0:00 / 6:12