Skip to content
Transcript తెలుగు
మధ్యలో కట్టె ఎట్లా ఉన్నది? అదేం అనటం లేదు. ఏం మాట్లాడటం లేదు. దానికేం తెలియదు. ఎవరిని కొట్టిందో తెలియదు, ఎందుకు కొట్టిందో తెలియదు, ఎవరు కొట్టమన్నారో తెలియదు. కనుక భగవంతుడు కర్మలన్నీ కూడా భగవంతుడే అనేటువంటి వాడికి సమాధానం ఇస్తున్నారు. కర్మ కిం పరం? అదేమన్నా పరదైవమా? కర్మ తజ్జడం. అలాగే ప్రపంచంలో మీరు ఎన్ని కార్యకలాపాలు చేసినా, ఎన్నెన్ని రీతుల మీరు చక్కగా సత్కర్మలు చేసినా, మంచి భావనలు చేసినా, ఇవన్నీ కూడా మీకు కావలసినటువంటి ప్రాప్తిని, ఫలితాన్ని నెమ్మదిగా అవే ఇస్తాయి. అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇదే మాటని ఇంకో కోణంలో చెప్పాడు. నువ్వు ఫలితాన్ని ఆశించకుండా పని చెయ్యి అని చెప్తూనే, దాని పక్కనే ఇంకో మాటన్నాడు. కర్మ చేయటంకంటే కర్మఫల త్యాగం గొప్పది అన్నాడు. అంటే కర్మ చేస్తే ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు ఆయన కూడా. కానీ ఫలితాన్ని కూడా నువ్వు త్యాగం చేసేసెయ్. నాకు దాంతో ఏం పని? మనం నెలంతా పని చేస్తాం. ఎవరో మనకి జీతం ఇస్తారు. జీతం మన ఫలితం. ఏం చేస్తున్నాం మనం? ఫలితాన్ని మనం తీసుకుని మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు అనుకుని వెళ్ళిపోతున్నాం. కాబట్టి కర్మ అనేటువంటి ఫలితాన్ని మనము ఆశించకుండా త్యాగం చేయక్కర్లా. పని నేను చేశాను అన్న భావన నుంచి విడిపమ్మని చెప్తూ భగవాన్ "కర్తృరజ్జ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం" అంటున్నారు. "వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్య యే జంగలికాయమానే సంసార హారా హలమోహ శాన్యే". కరుణాపూర్ణ సుధాబ్ధే అయినటువంటి భగవాన్ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవాన్ ఉపదేశ సారంలో మొదటి శ్లోకంలో "కర్తృరజ్జ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం" అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం విచారణ చేస్తూ ఉన్నాం. ఇది నిజంగా భగవాన్ జీవితంలో కూడా ఏమన్నా జరిగినయా? ఇది ప్రశ్న. చెప్పుట సులభము, చేయుట కష్టము. కదా. చెప్పడమేముంది చాలా తేలిగ్గా చెప్పేసేయొచ్చు. కానీ భగవాన్ జీవితంలో ముగ్గురు వ్యక్తులు. వాళ్ళ చుట్టూ భగవాన్ చూపించినటువంటి కరుణ చాలా different గా మనకు కనిపిస్తుంది. మూడింటిని మనం గనక open mind తో అర్థం చేసుకోగలిగినట్లయితే, శ్లోకానికి సంపూర్ణమైనటువంటి అర్థం మనకు లభిస్తుంది. భగవాన్ అరుణాచలానికి వచ్చిన కొత్తల్లో తల్లి వెతుక్కుంటూ వచ్చింది. మొత్తానికి చేరుకుంది ఆమె. "ఏం నాయనా! కడుపున పుట్టిన బిడ్డలందరికీ నేను అన్నం పెట్టగలుగుతున్నానే, నీకో ముద్ద పెట్టలేని పరిస్థితి నాకు ఉన్నదా? ఎందుకు ఇల్లు వదిలిపెట్టి వచ్చావు నాయనా?" అని అడిగింది. ఆత్మానుభవాన్ని పొందిన భగవాన్ రమణులు దానికి చెలించలే. sentiment emotion ఆయన్ని ఏం కదిలించలే. ఘనీభవించిన గండ శిలవలె కూర్చున్నారు. ఒక పక్కన తల్లి అడగమ్మ రోదిస్తున్నది. కనీసం ఒక్కసారి మాట్లాడమని అడుగుతున్నది. మాటలు అక్కర్లేదనుకున్న భగవాన్ అప్పటికీ చెలించలే. కానీ చుట్టూ ఉన్నటువంటి భక్తులంతా "అడుగుతున్నది మీ తల్లి. ఆమె విషాదాన్ని మేము చూడలేకపోతున్నాం. ఆమె రోదిస్తూ ఉన్నది. ఏదన్నా చెప్పండి" అన్నప్పుడు ఒక పలక మీద రాశారు. "కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. మనం ఒక పనిని ఎంత గాఢంగా చేయాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా అది జరగదు. పని జరగకూడదు అని మనం ఎంత నిరోధించినా అది జరగక మానదు. అంటే అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు." ఇందులో మరి మనం ఏం చేయాలి? మౌనం వహించటమే ఉత్తమం. ఇది నిజానికి భగవాన్ రమ-రమణ మహర్షి అవతార చరిత్రలో ఇది ప్రప్రథమ సందేశం ఇది. సందేశం మాతృదేవికి, మాతృమూర్తికి ఇచ్చారాయన. మాతృమూర్తి ద్వారా మనందరికీ ఇచ్చారు అని అర్థం. అంటే మనం చాలా అనుకుంటాం, జీవితం అంటే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని. నిజానికి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం కాదు. అనుకోనిది జరిగితే దాని పేరు జీవితం గనుక జీవితాన్ని చక్కగా అధ్యయనం చేయమని, అర్థం చేసుకోమని చెప్తూ తల్లికి ఆయన సందేశం ఇచ్చారు. సరే తదనంతర కాలంలో ఆమె కూడా మహర్షి దగ్గర ఉండిపోయినారు. ఉండిపోతే సమయంలోనే ఇదిగో ఉప-ఉపదేశ సారం ముందు అనుభూతి సారంగా రాసినటువంటి మురుగనార్ ఒకరోజు అన్నాడు, "భగవాన్ మీరెవరు?" అన్న ప్రశ్న మేము వేయకుండా ఉండలేం. కావ్యకంఠులు మిమ్మల్ని స్కందులా, మీరు కుమారస్వామి అవతారమా అడిగినప్పుడు "నీకెందుకు?" అని పక్కకి నెట్టేశారు. "నేనా? మీరు ఫలానా కదా?" అని అడుగుతున్నప్పుడల్లా మీరు దాన్ని పక్కకి నెడుతున్నారు. మీరు చెప్పటం లేదు. అయితే నా భావనలో, అంటే ఈయన కవి గనుక, నా భావనలో మీరు సాక్షాత్తు కైలాసాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశారు. అరుణాచలం కైలాసం అయినట్లయితే వచ్చినటువంటి గణపతి అంటే వినాయక స్వామి ఎవరు అంటే గణపతి ముని, వాశిష్ఠ గణపతి ముని. మీరు కుమారస్వామి. ఇక అపీతకుచాంబిక ఇక్కడ ఉండనే ఉన్నది, అమ్మవారు పార్వతీదేవి. శివుడా అరుణాచలం. కనుక ఇదంతా శివ కుటుంబమే. అంటే చమత్కారమే, మీరు చెప్తూ ఉండండి, మేము వింటూ ఉంటాం అన్నారు. దానిని అవును అనలేదు, కాదు అనలేదు. అంటే...ఎవరి కారణంగానో ఇదంతా జరిగిందన్నారే తప్ప, నా కారణం వల్ల ఇదంతా జరిగిందని భగవాన్ ఎన్నడూ చెప్పలేదు. ఇది ఒక అకర్త్రుత్వ భావన. తల్లి అలా ఉండిపోయినారు. తర్వాత ఒక రెండవ పాత్ర స్కందస్వామి అని భగవాన్ అరుణాచలం పైన కొండమీద మామూలుగా చెట్టు కింద ఉండేవారు. ఎండకి ఎండితూ, వానకి తడుస్తూ. ఆకలి అయినా ఆకలి కాకపోయినా తన స్థితిలో తాను ఉండేవారు. స్కందస్వామి అనేటువంటి భక్తుడు దీనిని చూడలేక ఒక చిన్న కుటీరం లాగా వేసి దానికి రమణాశ్రమము అని పేరు పెట్టాడు పైన. రోజు భగవాన్ పై కరుణాచలం పైకి వెళ్లారు. అక్కడ ఏదో కొత్తగా కట్టడం వెలసింది ఏమిటిది అని చూస్తే దానిమీద రమణాశ్రమం అని ఉంది. స్కందస్వామిని పిలిచారు. పిలిచి, "ఇది నేను కట్టానా? ఇది కట్టమని నేను అడిగానా? నేను అడగకుండానే ఇది జరిగిందే. ముందు బోర్డు తీసి పక్కన పెట్టేసేయ్" అన్నారు. అయితే ఏం పేరు పెట్టాలి అని, "దీనిని నిర్మించింది నువ్వు గనుక దీనికి స్కంద-స్కంద అన్నా, స్కందాశ్రమం అన్నా ఒకటే. కాబట్టి స్కందాశ్రమము అని పేరు పెట్టు. నువ్వు కట్టింది నీ ఇంట్లో నేను ఉండబోతున్నా" ఇది అకర్త్రుత్వం. చూశారా? ఎక్కడ తాను చేశానని కానీ, తన వలన ఇది జరిగిందని కానీ, విచారణ లేకుండా, కర్తృ రాజ్ఞాయ ప్రాప్యతే ఫలం. ఇక్కడే ఎండుతున్నాను, తడుస్తున్నాను అని భగవంతుడికి తెలిసింది గనుక ఒక చిన్న కుటీరం ఏర్పడిందా అని నవ్వేశారు. ఇది స్కందస్వామి కథ. అడగమ్మ తల్లి కథ ఒకటైతే, స్కందస్వామి కథ మరొకటైతే, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని మనం చెప్పుకున్నాం. ఏమని? వెంకట్రామణ అనబడేటువంటి బ్రాహ్మణ బాలకుడికి, మౌనస్వామికి భగవాన్ శ్రీ రమణ మహర్షి అని నామకరణం చేసి, ఈయన స్కందులే, కుమారస్వామి యొక్క అవతారమే, స్వభావమంతా దక్షిణామూర్తి యొక్క స్వరూపమే అని నిర్ణయించినటువంటి ఒక వ్యక్తి గణపతి ముని. ఆయన తమ చరమ కాలంలో ఇక్కడి నుంచి ఖరగ్‌పూర్ వెళ్ళిపోయి అక్కడ యోగ విద్య ద్వారా యోగ సాధనలో తన జీవితాన్ని, తన దేహాన్ని వదిలినప్పుడు, తన జీవితాన్ని పండించుకున్నప్పుడు, భగవాన్ అరుణాచలంలో ఉండగా ఒక సాయంకాలం వారికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ చదువుకున్నారు. చదివి, టెలిగ్రామ్ పక్కనే పెట్టి, "మళ్లీ నాయన వంటి వారు వస్తారా?" గణపతి మునిని భగవాన్ రమణ మహర్షి నాయన అని పిలిచేవారు. మళ్లీ నాయన వంటి వారు వస్తారా? అంటే రారు అని అర్థం. ఇటువంటి జన్మ ఎత్తినటువంటి మహాత్ముడు అని ఒక కాంప్లిమెంట్ చేశారు. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి మన బోటి సాధకుడు అన్నాడు, "భగవాన్ మీరు స్కందస్వా-స్కందస్వామికి ఇచ్చినట్లుగా, తల్లి అడగమ్మకు ఇచ్చినట్లుగా ఉద్ధారణ గణపతి మునికి కూడా ఇచ్చారా?" అంటే భగవాన్ ఏం చేశారంటే స్కందస్వామి తన దేహాన్ని వదిలిపెట్టే సమయంలో పరుగు పరుగున వెళ్లి స్కందస్వామి మరణావస్థలో ఉన్నప్పుడు దగ్గర కూర్చొని జీవుడు దేహాన్ని ప్రాణ నిర్గమనం చాలా సునాయాసంగా, అనాయాసంగా చేసేట్లుగా ఉపశమనం చేశారు. కానీ నేను ఉద్ధారణ ఇచ్చానని, దివ్యలోకాలకు పంపానని అని గానీ, లేదా ఇదిగో ఇతను మహాత్ముడని ఏమీ మాట్లాడలే. సేవ చేశారు. ప్రాణం సులువుగా పోయేట్లుగా పక్కన ఉపశమనంగా కూర్చున్నారు. తల్లి అడగమ్మ దేహాన్ని వదిలిపెట్టినప్పుడు ఆమె కుడి రొమ్ము మీద చెయ్యి పెట్టి అనేకమైనటువంటి జన్మలను దాటించి దాటించి దాటించి ఒక్క క్షణం అయిన తర్వాత, "అంతా అయిపోయింది. ఇక భోజనాలకు లేవండి" అన్నారు. అంటే అంతవరకు ఏం చేశారు అంటే తల్లి ఋణాన్ని పరివ్రాజకుడైనా సరే తీర్చుకోవలసి ఉన్నది. తల్లి ఋణాన్ని అంచక్రియల ద్వారా, వారికి చేసేటువంటి శ్రాద్ధ కర్మల ద్వారా, వారు ఆశించినట్లుగా జీవించే దివ్య విధానం ద్వారా మాతృ ఋణాన్ని తీర్చుకోవాలి. తల్లికి అపకీర్తి తెచ్చేవాడు వాడు ఉన్నా మరణించినట్లే లెక్క. గాంధారి కొడుకు దుర్యోధనుడిని మనం గౌరవించం. కుంతి కొడుకు ధర్మరాజుని మనం గౌరవిస్తాం. గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? శిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదిగో తల్లి నుంచి, తండ్రి నుంచి వచ్చింది గనుక ఇక్కడ కూడా శంకర భగవత్పాదులు ఎట్లాగైతే తమ తల్లి దేహాన్ని వదిలిపెట్టినప్పుడు తమ చుట్టూ ఉన్నటువంటి సాంప్రదాయ సమాజం, "నువ్వు పరివ్రాజకుడివి, నీవు సన్యాసివి, నీవు నీ తల్లికి అంచక్రియలు చేయటానికి వీలు లేదు" అన్నప్పుడు, "నా తల్లి కంటే అధికమైన వస్తువు మరొకటి ప్రపంచంలో లేదు. సన్యాస స్వీకారం నా తల్లి ఇచ్చిన జన్మ తర్వాత ఏర్పడింది గనుక నేను చేయవలసిందే" అన్నారు. నేను ఎంత సాంప్రదాయవాదినైనా, ఎంత పరివ్రాజకుడనైనా, ఎంత సన్యాసినైనా, నా తల్లి తనువుకి కారణమైంది. నా తల్లికి నేను అంచక్రియలు నిర్వర్తించవలసిందే అన్న ప్రప్రథమ జగద్గురు శంకర భగవత్పాదులు. కారణంగానే తల్లి శరీరంలో నుంచి రెండు ఎముకల మధ్య ఒక అగ్నిని సృష్టించి అగ్నితో తన తల్లి దేహానికి సంస్కారం చేశారు. అంటే భగవాన్ రమణ మహర్షి కూడా అంత ఆత్మ అయినప్పుడు తల్లి దేహానికి సంస్కరణ ఎందుకు చేశారు అంటే ఒక యతి ధర్మాన్ని, ఒక పరివ్రాజక ధర్మాన్ని, ఒక కుమారుడి ధర్మాన్ని తాను ఆచరిస్తూ తల్లికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగే దిశగా అనేక జన్మలుగా పేరుకొని పోయి ఉన్నటువంటి వాసనలన్నీ క్షయం చేస్తూఏ రకమైన యాతనలైనటువంటి ఒక సునాయాస మరణాన్ని వారు అనుగ్రహించారా? జరుగుతున్న దానికి సాక్షిభూతంగా ఉన్నారా? పక్కన వదిలిపెట్టినట్లయితే తల్లి పట్ల వారు చూపించినటువంటి ఆదరణ, కరుణ అటువంటిది. కందస్వామికి చేశారు. తల్లి అడగమ్మకు చేశారు. కాబట్టి మన బోటి వాడు అడిగారు. కావ్యకంఠులు కూడా దేహం వదిలిపెట్టారని వచ్చింది కదా వార్త. వారికి కూడా ఉద్ధారణ ఇచ్చారా భగవాన్ అని. కర్తృ రాజ్ఞాయ ప్రాప్యతే ఫలం. కర్త ఎవరికి ఉన్నాడో తెలియదు. అప్పుడు భగవాన్ అన్న మాట మన వాసనలు బలవత్తరంగా ఉన్నప్పుడు గురువు నిస్సహాయుడు అన్నారంతే. అంటే గురువు ఏం చేయలేడు. మనకి ఇంకా జన్మ ఎత్తాలి. మాట ఎందుకు అన్నారు అంటే కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని భాషాభిమాని. సంస్కృత భాషాభిమాని. భారతదేశ అభిమాని. తన వాదనల ద్వారా, తన ఉపన్యాసాల ద్వారా, తన ప్రజ్ఞ ద్వారా, తన వాఙ్మయం ద్వారా, తన భావ ప్రచారం ద్వారా, తన కదలికల ద్వారా భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలని ప్రయత్నించినటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకడు. అయితే జమునాలాల్ బజాజ్ ఆయనతో పాటు మన రాజేంద్ర ప్రసాద్ భగవాన్ రమణ మహర్షి దగ్గరకు వెళ్ళి, ఎన్నాళ్ళీ దాస్య శృంఖలాలు? బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్లరా? దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వస్తుంది? సంకెళ్ళు ఎప్పుడు విడిపోతాయి? అని అడిగినప్పుడు భగవాన్ ఇచ్చిన సమాధానం చాలా గొప్పది. ఎందుకు? ఏ-- సమాధానం ఏమిటంటే, ఎవరు సంకెళ్ళు వేయించుకోబడ్డారో వాటిని విడిపించుకునే శక్తి వారికే ఉంది. మన పని మనం చేస్తూ వెళదాం అన్నారంతే.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -07

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -07

Source: TFC Spiritual on YouTube

0:00 / 15:24

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

    Now playing
  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77