No transcript for this section.
Transcript begins at 6:11.
శ్రీ వి.ఎస్.ఆర్.మూర్తి గారు. వీరు జగమెరిగిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. ఈరోజు అమ్మను గురించి అమ్మ ఏర్పరిచిన అందరి ఇంటి విధానాల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను వారిని ఈరోజు కలిసాం. మనతో వారి అభిప్రాయాలు పంచుకునేందుకు వారు దయతో అంగీకరించారు. వారి అభిప్రాయాలు మనతో పంచుకోబోయే ముందుగా మన కొరకుగా వారి గురించి, వారి కుటుంబ నేపథ్యాన్ని గురించి తెలియజేయవలసిందిగా వారిని ప్రార్థిస్తున్నాం. ఒక వ్యక్తి కుటుంబ నేపథ్యం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి శ్రీకారం చుడుతుంది. బహుశా ఈ నేపథ్యమే ఇవాళ మనం ఇక్కడ కూర్చొని జగజ్జనని అయినటువంటి అమ్మ గురించి మాట్లాడుకునేటువంటి ఒక మహా యోగాన్ని ఒక తపస్సాఫల్యంగా పొందగలిగామని భావిస్తున్నాను. తర్వాత మీ చిన్నప్పటి ఇష్టదైవం ఆ రోజుల్లో ఎవరన్నా? అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ప్రథమ ఆరాధ్యదైవం ఎవరంటే శ్రీరామచంద్రమూర్తి. అమ్మను గురించి మీరు మొదటిసారిగా ఎట్లా విన్నారు? మీకు దర్శనం చేసుకోవాలనే ఆలోచన ఏ వయసులో, ఎప్పుడు కలిగింది? మీ అనుభూతిని మాతో పంచుకోండి. అమ్మ దగ్గరికి నేను జిల్లేళ్ళమూడి వచ్చేప్పటికీ సుమారుగా పదకొండు, పన్నెండేళ్ళ మధ్య వయస్సు. జిల్లేళ్ళమూడి రావటానికి ముందు ఈ శరీరానికి ప్రప్రథమ గురువు ఎవరు అంటే అవధూతేంద్ర సరస్వతీ స్వామివారు. రఘువరదాసు గారు. రఘువరదాసు గారు. ఆయన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సర్వ రామాలయాల్లో హనుమాన్ చాలీసాని రాళ్ళమీద చెక్కించి జ్ఞాన వరదానం చేశారు. అటువంటి మహాత్ముణ్ణి జిల్లేళ్ళమూడిలో కూర్చొని ఇవాళ తలుచుకోవటం కూడా నా భాగ్యం విశేషంగా నేను భావిస్తూ. 1962 నేను ఫోర్త్ ఫామ్ చదువుకున్నటువంటి సమయం, అది ఇంకొళ్ళు. అప్పుడు మా బాబు గారు, ఆయన బాపట్లలో వస్తూ జిల్లేళ్ళమూడి వెళ్ళాలని ఆయనకే అనిపించి "జిల్లేళ్ళమూడి అనే ఊరు వెళ్తున్నాం. అక్కడ ఒక అమ్మవారు ఉంది. చూద్దాం." సరే అని అనుకున్నాం. కానీ అట్లా జరగలే. ఆయన నాతో అన్నారే గానీ, ఆయన రాలేకపోయినారు. ఎప్పుడైతే అమ్మవారు ఉన్నది అనే భావన మనసుకు కలిగిందో, ఓ రోజు వాళ్ళకి చెప్పి నేను నా అంతట నేను బాపట్లలో వచ్చి బాపట్లలో నుంచి జిల్లేళ్ళమూడి నా అంతట నేనే చేరుకున్నాను. కనుక ప్రేరణ కలిగించినటువంటి వ్యక్తి ఆయన అయితే, కారణం అమ్మ అయితే, చివరికి నేను జిల్లేళ్ళమూడి చేరుకోవటం జరిగింది. కానీ దీనిలో ఒక తీవ్రమైన శుభేచ్ఛ కూడా నా యందు ఉన్నది ఆ సమయంలో. ఆ శుభేచ్ఛ ఏమిటంటే, ఈ అమ్మ ఎలా ఉంటుంది చూద్దాము. అలా జిల్లేళ్ళమూడి చేరుకోవటం. ఇవాళ ఉన్న జిల్లేళ్ళమూడికి 1962 లో ఉన్న జిల్లేళ్ళమూడికి చాలా మార్పుంది. అప్పుడు జన కోలాహలం. అమ్మ దర్శన, స్పర్శన, సంభాషణల కోసం ఎక్కడెక్కడి నుంచో ఎందరెందరో రావటం. ఇదంతా ఇంకా కళ్ళకు కట్టినట్లే ఉంటుంది. నేను సహజమైనటువంటి నా స్వభావానికి అనుగుణంగా నేను ఏ పని మీద వచ్చాను, అమ్మను చూడాలి. అమ్మ కూడా కాదు అమ్మవారిని చూడాలి అని గదా వచ్చాను. కాబట్టి ఎక్కడ ఉంటుంది ఆమె అని అడిగాను, అదిగో అని చూపించారు. నా అంతట నేను వెళ్లి అక్కడ నుంచొని వెళ్ళిపోతున్నాను. ఓ పెద్దాయన నన్ను ఆపేశారు. ఆపి, "నేను తర్వాత పంపిస్తాను, కాసేపు బయట కూర్చో." అన్నారు. నేను ఆయన మాట మన్నించి వెనక్కి రాబోతున్నాను. ఇది ఆశ్చర్యం! అమ్మకి నన్ను ఏ చిన్న సందులో నుంచో, కంతలో నుంచో చూసే అవకాశం అమ్మకి లేదు. కానీ లోపల్నుంచి ఒక ఉచ్ఛైశ్వరంతో బయటకి నాకే వినపడేట్టుగా ఓ కంఠం వినిపించింది. "వాణ్ని నేను పిలుచుకున్నాను, లోపలికి తీసుకురా." నన్ను ఆపిన ఆయన ఒక్కసారి ఆయనలో ఒక సంభ్రమం, ఆశ్చర్యం, ఒక తొట్రుపాటు నేను గమనించాను. Still నా మనసులో అది చాలా ముద్ర వేసుకుంది. రమ్మని లోపలికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అమ్మ మంచం దగ్గర నేను మామూలుగా కూర్చున్నాను. ఎందరెందరో వస్తున్నారు, వెళ్తున్నారు. అమ్మ మాట్లాడినంత సేపు ఆ లోపలంతా మౌనం, నిశ్శబ్దం. అమ్మ మాట ఆపగానే, "నీ దయ కావాలి, నీ వల్లే ఇదైంది, నీ వల్లే ఇదైంది. ఇంకా ఎంతకాలం అమ్మ?" ఎన్నో విభిన్నమైనటువంటి ధోరణులతో సుమారుగా ఒక గంట, గంటన్నర సమయం అయిపోయిన తర్వాత నెమ్మదిగా అమ్మ నావైపు తిరిగి మాట్లాడుతూ... అప్పటికి నాకు చెవిపోగులుండేవి, ఎర్ర కెంపులు చెవిపోగులు. వాటిని చూస్తూ, ఆనందిస్తూ, ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, అనేక విషయాలు చెప్తూ నెమ్మదిగా ఒక అరటిపండు తీసింది. తీసి తూలు వలవటం ప్రారంభించింది. చేసి ఒక అరటిపండు తుంచి నోట్లో పెడుతున్నది. పెడుతుంటే ఎంగిలి అవుతుందేమో అమ్మ చెయ్యి. అమ్మ ఆ క్షణంలో ఒక శుభ్ర జ్యోత్స్నలా ఉంది. అది ఒక దృశ్యం అంతే, అది ఆత్మానుభూతి, నిజానికి మామూలు మాటలు కవిత్వానికి అందే సౌందర్యం కాదది. ఆ అరటిపండు పై తొక్క తీస్తూ అరటిపండును తుంచుతూ ఓ మాటంది. "పై తోలు తీస్తే కదా నాన్న లోపల పదార్థం కనపడేది. ఆ పదార్థాన్ని చూస్తే ఏం ప్రయోజనం? తింటే కదా అనుభవం కలిగేది, ఆత్మారాముడికి శాంతి కలిగేది." అంటూ ప్రారంభించింది. అవి అమ్మ తొలి వాక్యాలు.అంటే ఉన్నదంతా లోపలే ఉందని పై పైనే ఏం లేదని లోపలికి వెళితే తప్ప అసలు విషయం అర్థం కాదని కేవలం చూట్టంతో మాత్రమే కాదు అనుభవించవలసిన యోగ్యత ఉన్నదని బహుశా ఈ అర్థాలన్నీ ఇప్పుడు స్పురిస్తున్నాయి మీకు అప్పుడు అమ్మ గురించి కలిగిన ఆ నాడు ఆ వయసులో పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులో కలిగిన భావాలు వర్ణించగలరా తప్పకుండా అనుభవం ఏంటంటే ఆమె దర్శనం చేయడమే తొలి అనుభవం ఆమె చేతి వేళ్ళు నా నోట్లో పట్టడమే నాకు ఆమె అనుగ్రహించిన స్పర్శ అలాగే నేనేమీ అడక్కుండానే సంభాషణ ఎక్కడ ప్రారంభించాలో ఆలోచనలు అర్థం అవుతున్నాయి కేవలం నా ఆకలి నింపడం కోసం అరటి పండు తీలే ఆమె ఏదో అనుగ్రహాన్ని ఇస్తున్నట్టు వలె ఏం చేసిందంటే తత్వబోధ చేస్తూ ప్రారంభించింది ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు అనుభవాలు అనుభూతులు వెంటనే స్పురణకు రావు కాలగమనంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దాన్ని co relate చేసుకుంటే ఆ విషయాలు అర్థం అవుతాయి ఓ అయితే ఆ క్షణంలో నాకు అమ్మను గురించి ఏ అనుభూతి కలిగింది అని మీరు అడిగారు మొదట్లో అనుభూతి లేదు అనుభవం సాగుతోంది కొంత సాగాలి కదా అయిన తర్వాత ఇంతలో భోజనం వేళ అయింది అమ్మ ఒక పళ్ళెంలో ప్రత్యేకంగా అన్నం తెప్పించింది ముద్దలు కలిపింది ఆరోజు నాకు బాగా గుర్తు కాస్త వొట్టి పప్పును ఎక్కువ నెయ్యి తీసుకురా అని ఎవరికో చెప్పింది అమ్మ తీసుకొచ్చారు ముద్దలు కలిపి చాలా సేపు పెట్టింది పెడుతూ అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూనే ఉందమ్మ నాతో ఏం మౌనం వహించలే నేను ఊ కొడుతున్నాను తింటున్నాను ఊ కొడుతున్నాను నా పని నేను చేస్తున్నా ఆమె పని ఆమె చేస్తున్నది ఈవేళ మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు ఒక అనుభూతి ఏమిటంటే అమ్మ కేవలం నాకు ముద్దలు పెట్టి దైహికమైన ఈ కడుపు నింపలే ప్రతి మెతుకులోనూ జ్ఞానాన్నాన్ని వరదానం చేసింది ఇవాళ జరుగుతున్నటువంటి జీవనశైలి గాని జీవన దుర్భరదం గాని దాన్ని గమనించినప్పుడు అవే మనకి అర్థం అవుతాయి ఇది అయిపోయిన తర్వాత భోజనానంతరం మాత్రం అమ్మ అడిగింది ఇంట్లో చెప్పొచ్చావు కదా నాన్న అవునమ్మా చెప్పొచ్చాను అవును నాకోసమే వచ్చావు కదా అవునమ్మా నిన్ను చూద్దామని వచ్చాను ఇదంతా ఒక అద్భుతమైన వాతావరణంలో నా ప్రథమ సమావేశం అమ్మతో సాగుతున్న వేళ ద్రాక్ష పళ్ళు గుత్తి అక్కడుంది చాలా పళ్ళు ఉన్నాయి చుట్టూ ఓ గుత్తి తీసి దానిలో నుంచి మళ్ళీ ఓ పండు తీసి నోట్లో పెట్టి ఇదంతా నీకోసం ఇదంతా నాకోసం ఓ అంది మ్ అన్న తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఆ అరటిపండు పెడుతున్న వేళ ఎంగిలి అవుతుందేమో ఈ నోట్లో అమ్మ చేతులు చాలా బంగారు వర్ణంలో ఉన్నాయి ఇవి అని మనసులో నాకు అనిపించిన మరుక్షణం అమ్మ వెంటనే అన్నది ఎంగిలికి కానిదే ఉన్నది నాన్న బ్రహ్మ ముట్టనిదేమన్నా ఉన్నదా ఈ చేస్తున్నదంతా గిలి కోసమేరా నాకోసంరా అంది అంటే ఆ పెట్టడంలో ఆనందం నేను తింటున్నప్పుడు నేను పొందే ఆనందానికి కారణం తన ఆనందం వీటన్నింటిని సమన్వయం చేసి చాలా చిన్న మాటల్లో చాలా brief గా పరమాద్భుతంగా చేసి ఆ సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో ద్రాక్ష పళ్ళ గుత్తి చాలా నల్ల ద్రాక్ష పళ్ళు చాలా పెద్ద గుత్తి నా చేతిలో పెట్టింది పెట్టి ఓ పది రూపాయల నోటు తీసింది అక్కడి నుంచి చేతిలో పెట్టి చక్కగా వెళ్ళు నాన్న బాగా చదువుకో పైకి రా వస్తూ ఉండు అమ్మను చూసుకుంటూ ఉండు మీరు అమ్మ దగ్గర గడిపిన ఈ సందర్భంలో సుమారుగా ఎంతమంది చుట్టుపక్కల ఉండి ఉండొచ్చు ఆ గదిలో ఒక పది మంది ఉన్నారు ఉన్నారు సుమారుగా బయట చాలా మంది ఉన్నారు మీరు దేనికోసం గా ఈ అమ్మ మీకు అమ్మ అంటే భగవంతుడు అనండి అమ్మ అనండి బాబా అనండి మీకు ఈ శరీరాన్నిచ్చి తీసుకువచ్చారో అది ఏ రకంగా జరగబోతుందో అమ్మకు తెలుసు కాబట్టే పదకొండు పన్నెండు సంవత్సరాల వయసులో ఉన్న మీతో ఇంతటి తత్వ సంబంధించిన సంభాషణ అమ్మ చేసిందని మేము అనుకోవచ్చా ఖచ్చితంగా అంటే అమ్మ నా భవిష్యత్తు యొక్క రూపకల్పన ఆనాడే చేసేసింది తర్వాత మనం అనుకుంటాం చదువుకున్నదేంటి చేస్తున్నదేమిటని మనం అనుకుంటాం కానీ అవును ఈ లోక సంబంధమైన విద్యకి అసలు విద్యకి ఖచ్చితమైన తేడా అమ్మకు తెలుసు తర్వాత మీరు ఆ తర్వాత మళ్ళీ గిల్లెడమూడి మీకు వచ్చిన జ్ఞాపకం ఎట్లా ఏ రకంగా లేదు అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు మూడేళ్లు వరుసగా అమ్మతో వస్తూనే ఉన్నా వస్తూనే ఉన్నా చాలా తరచుగా ఆ ఆ తరచుగా ఆ అంటే సెలవులు వచ్చినాయి అంటే అమ్మ దగ్గరికి రావడం మ్ కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నన్ను అమ్మ జన సందోహంతో కలవనిచ్చేది కాదు మ్ మరి ఎట్లా కనిపెట్టేదో నాకిప్పటికీ తెలియదు గానీ అమ్మా నేను వచ్చానని చెప్పడానికి నేనేం VIP ని కాదు ఇగో ఫలానా ఆయన వచ్చాడని తీసుకెళ్లడానికి VVIP ని కాదు చిన్న పిల్లవాడిని అంతేగా కానీ అమ్మ ఏం చేసేదంటే మంచం దగ్గర కూర్చోబెట్టుకునేది ఎక్కడికి వెళ్లద్దనేది నువ్వు నా దగ్గర ఉండు నాన్న నా కోసం వచ్చావనేది ఆమె కోసం వచ్చానని నాకు తెలుసు కానీ అక్కడ కూర్చోబెట్టేది దానివల్ల నేను ఇవాళ మళ్ళీ నమరు వేసుకుంటే ఏం తోస్తుందంటే ఒక అవతారమూర్తి ఒక జగజ్జనని మాన్యుడితో సామాన్యుడితో అసామాన్యుడితో ఎట్లా interact అవుతుంది నేను గమనించా ఓ అతి కడు బీదవారు పామరులు ఏవీ తెలియని వాళ్ళు విద్యాగంధం లేని వాళ్ళు వాళ్ళు ఒక అవతారమూర్తి నుంచి ఏం కోరుకుంటారుఇవన్నీ నేను observe చేయటానికి బహుశా నన్ను అమ్మ ఆ దృశ్యంలో నిలబెట్టింది కూర్చోబెట్టిందనేదే నా గట్టి నమ్మకం మీరు ఎన్ని సార్లు తర్వాత వచ్చారు అన్నారు కదా మీరు ఒక్కరే వచ్చారా మీతో పాటు మీ పెద్దలు ఎవరైనా ఎవ్వరూ లేరు నేను ఒక్కడినే వచ్చా మీరు B.Tech పూర్తి చేసి ఆయిల్ టెక్నాలజీలో ఇంజనీరుగా బాధ్యతలు నిర్వహించారు తర్వాత అనేక ఆధ్యాత్మిక సత్సంఘాల ద్వారా అనేక వేల మందిని ప్రభావితం చేస్తూనే ఉన్నారు మళ్ళీ సామాజిక కార్యక్రమాల్లో కూడా మీ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఇవన్నీ ఏకకాలంలో వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేని వీటిని సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా నిర్వర్తించడానికి పూర్తిగా స్ఫూర్తి మీరు ఎవరి ద్వారా పొంది ఉంటారని మేము భావించవచ్చు ఒక జీవిత లక్ష్యం నివృత్తి మార్గం అయినప్పుడు ప్రవృత్తి అడ్డం రాదు వృత్తి అడ్డం రాదు నివృత్తి అనే పదమే మనకు తెలియదు అనుకోండి వృత్తిలోన రాణిస్తాం ప్రవృత్తిని నా పదిలక్కించుకుంటాం వృత్తితో ప్రవృత్తితో సంబంధంలేని పరమోత్కృష్టమైనటువంటి నివృత్తి మార్గంలో వెళ్ళే వాడికి ఇవి మామూలుగా రోడ్డు వెంబ-- రోడ్డు వెంబడి మనకు కనిపించే మైలురాళ్ళు వంటివే తప్ప ఇవి ఎప్పుడూ interfere కావు అయితే ఒక ప్రభావం మీరు అడిగారు ఎవరు స్ఫూర్తి కలిగించారు అని నేను రఘువరదాసు గారి సంకీర్తన కార్యక్రమాలు చూశాను వేల మందిలో ఆయన ఏకాకిగా ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించేవారు మళ్ళీ సమూహంలో ఒక్కడిగా ఉండేవారు ఆయన అమ్మ దగ్గర కూడా నేను అదే చూశాను. ఈమె ఏం చదువుకోలేదు కదా ఈమె దగ్గర ఏ degree లు లేవు కదా ఈ గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఆమెకు ఎందుకు దండం పెడుతున్నారు ఆమెను చూడగానే ఎందుకని ఏడుస్తున్నారు ఈ భావ స్పందనలన్నీ కూడా వాళ్ళకి ఎలా కలిగిస్తున్నది ఈమె వాళ్ళతో ఏం మాట్లాడటం లేదు వాళ్ళని ఏం తాకటం లేదు మీ కష్టాలు ఏంటో చెప్పేసేయండి అనటం లేదు కానీ వస్తున్నారు వస్తూనే చూస్తూనే ఒక భావ విషయానికి లోనవుతున్నారు ఇవన్నీ గమనించినప్పుడు ఈ అమ్మ ఇన్ని వేల మందితో ఏకకాలంలో అక్కడి నుంచి కదలకుండా ఎలా చేయగలుగుతున్నది ఇది మానవ శరీరం కాదు అని అనిపించింది ఓ అక్కడ అది అయిపోయింది. అమ్మని నేను June తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండులో దర్శనం చేసుకున్నా మొదటిసారి మొదటిసారి correct గా ఒక నెల రోజులకి ఆంధ్రప్రభ newspaper లో ఇంకొలంలో ఉండగానే ఒక చిన్న news item చూశాను చాలా చిన్న news item ఎడ్లబండి మీద సత్య సాయిబాబా గారు నుంచొని ఉన్నటువంటి ఒక photo వేశారు ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడే మళ్ళీ అవతరించినారు ఆయనే పుటపర్తి సత్య సాయిబాబా ఇంతే ఏం వివరాలు లేవు అది దాంతో నేను connect అయినా ఎందుకు connect అయ్యానో నాకు తెలియదు పుటపర్తి ఎక్కడ ఉందో కూడా తెలియదు కాస్త లోతుగా తెలుసుకున్నప్పుడు పుటపర్తి అనంతపురం జిల్లాలో ఉందని వెళ్ళటం చాలా కష్టం అని అనుకున్నా ఇట్లాగే అమ్మ దగ్గరికి ఎట్లా వెళ్ళానో గుంటూరు వెళ్లి గుంతకల్లు ఎక్స్-- passenger train ఎక్కి బుక్కపట్నం వెళ్లి ఉమ్ అక్కడి నుంచి ప్రశాంతి నిలయానికి వెళ్ళినప్పుడు ప్రశాంతి నిలయంలో కూడా సత్య సాయిబాబా గారు ఏమన్నారంటే నేను కాచుకు కూర్చుంటినే అన్నారు ఎవరి కోసం ప్రపంచమంతా ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తే ఖచ్చితంగా అమ్మని దర్శనం చేసిన నెల రోజులకి May తొమ్మిది అరవై రెండు అమ్మ దగ్గర June తొమ్మిది అరవై రెండు బాబా గారి దగ్గర అంతే బహుశా మీరు అడిగిన ఆ ప్రశ్నకి సమాధానం భక్తి యోగం నాలో ప్రవేశించి చాలా త్వరగా నిష్క్రమించింది ఆ స్ఫూర్తి రఘువరదాసు గారు అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాతృమూర్తి యొక్క ప్రేమ ఇవాల ఉన్నటువంటి పరిణితమైనటువంటి వయసులో ఒకసారి గనుక దాన్ని నెమరువేసుకుంటే కలిగే భావం ఏంటంటే వాళ్ళు దిద్దుతారు వాళ్ళకి కావలసిన ఒక పరిముట్టను ఎంచుకుంటారు దానికి కావలసిన శక్తిని వాళ్ళు ప్రసారం చేస్తారు నిక్షిప్తం చేస్తారు ఇటు లోకరీతిలో అటు పారలౌకిక రీతిలో ఆ భావాలు కలిగిస్తాయి ఈ ఇద్దరితో పాటు సత్య సాయిబాబా వారి ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది భగవంతుడు అంటూ ఉంటే వాడు ఇలాగే ఉంటాడు రెండు రూపాలుగా ఉన్నటువంటి ఒక చిచ్ఛక్తి స్వరూపం రెండు భాగాలైతే రెండు రూపాలు తీసుకుంటే నేను పొందిన అదృష్టం ఏంటంటే ఆ రెండు అవతార మూర్తులతోను మమైకమైన వాళ్ళకి వాళ్ళ గురువులు లేరు అమ్మకు గురువు లేరు స్వామి గురువు లేరు కాబట్టి గురువే అవసరం లేని దైవమే నా గురువు రెండు రూపాలుగా ఇటు స్త్రీ స్వరూపంగా అటు పురుష స్వరూపంగా ఇది నేను చేసుకున్న పుణ్యమే అని నా ఖచ్చితమైన భావన శ్రీ రమణుల పట్ల కూడా ఆకర్షణ్ అవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా ఒక World Bank project తిరువణ్ణామలైలో చేశా ఉమ్ నూట ఎనభై రోజులు ఉన్నాను నేను అక్కడ నూట ఎనభై రోజుల్లో ఒక తొంభై గిరి ప్రదక్షిణాలు చేసుకున్నా ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకు రమణాశ్రమానికి వెళ్ళేవాడిని మళ్ళీ eight o clock నా site work కి నేను వెళ్లిపోయేవాడిని కాబట్టి ఇదంతా రమణ మహర్షి యొక్క ఆ-ఆ మౌనం వెనక దాగినటువంటి మార్మికత ఆయన బోధ వెనక దాగినటువంటి ఒక సమన్వయ సిద్ధాంతం. దైవం అనే మాట ఆయన వాడలే రాముడు కృష్ణుడు ఆయన ఎప్పుడూ వాడలే ఎవరో అడిగారు ఆయన్ని God అంటే ఎవరు అని "God is nothing but a force and a feeling within" అన్నారు. ఆ within అనేది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇవన్నీ నన్ను చాలా ఆకర్షించటం మాత్రమే కాక బహుశా నా జన్మ సంస్కారానికి ఆ alignment attunement చాలా perfect గా జరిగింది అంటే ఏమైంది రమణ మహర్షి ఏం చెప్పారో దాన్ని demonstrate చేసే అమ్మ ఇక్కడ కూర్చుందిఆయన ఏం చెప్తున్నారు ఆచరణ పూర్వకంగా ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ అమ్మ కూడా ఏం మాట్లాడటం లేదు. కష్టాలు తీరుతాయి అన్ని వాడు చేస్తున్నాడు అనుకో అంటున్నది ఈమె దేవుడి గురించి చెప్పటం లేదు. నువ్వు రాముడికి దండం పెట్టుకో, కృష్ణుడికి దండం పెట్టుకో ఇవేం చెప్పలే అమ్మ. She didn't prescribe. ఎవరికి మహా మంత్రాలు ఇవ్వలే, ఉపదేశాలు లేవు, తాయత్తులు లేవు, గండరగోళం లేదు. Same thing is happening in ప్రశాంతి నిలయం. కాబట్టి అప్పుడు నాకు అనిపించింది ఈ మూడు మహత్తర స్వరూపాలు ఇవి. నా దృష్టిలో వీటి మధ్య ఏ బేధం లేదు. నీకు అమ్మ ఇష్టమా? బాబా గారు ఇష్టమా? నువ్వు చూడని రమణ మహర్షి ఇష్టమా అంటే ఒకటే ఇష్టం. ఆ ఒక ఇష్టం మూడు పాయలు అయింది. అది త్రిపథ. సుదీర్ఘ కాల వ్యవధి తర్వాత అమ్మ మహా సమాధి పొందిన తర్వాత మీరు జల్లెళ్ళమూడి వచ్చి మీ మనస్సును కేంద్రీకరించి అమ్మ తత్వ ప్రచార యజ్ఞంలో ప్రధాన భూమికను పోషిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అమ్మత్వం అనే గ్రంథాన్ని కూడా మీరు రచించారు. ఈ గ్రంథం అనేక మంది అమ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి దారి చూపిస్తూనే ఉంది. ఈ విధంగా మీరు అమ్మ సేవకు పునరంకితం కావడానికి అమ్మ ప్రసాదించిన ప్రేరణ ఏదైనా ఉందా మీకు? కానీ ఇక్కడ మీకు ఒక చిన్న సందర్భం చెప్పాలి. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నా, నా పూజా సామాన్లో ఈ ముగ్గురి చిత్రపటాలు ఉన్నాయి. రమణ మహర్షి, సత్యసాయి బాబా వారు, అమ్మ. అమ్మ నేను మళ్ళీ జల్లెళ్ళమూడి రావటానికి నలభై నాలుగు ఏళ్ళ time పట్టింది. నలభై నాలుగు ఏళ్ళు అమ్మని నేనేం వదిలిపెట్టలే. అమ్మ కూడా నన్ను వదిలి పెట్టలే. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పానుగా నాకు ఈ పూజలు, వ్రతాలు ఆ వీటికంటే కూడా కర్తవ్య నిష్ఠ చాలా ఇష్టం. దాన్ని చాలా సమర్థవంతంగా చేయాలని, దేనిని ఆశించకుండా చేయాలని, ఏ సేవ, ఏ చిన్నది మనకు భగవంతుడు ఇచ్చిన అది వాడికే కైంకర్యం చేయాలని, అందులో మనం నిమిత్త మాత్రులమని, ఇవన్నీ నా స్పష్టమైన అభిప్రాయాలు. కాబట్టి నలభై నాలుగు ఏళ్ళు సాగి సాగి సాగిన తర్వాత ఒకరోజున మోహన కృష్ణ గారు నాకు phone చేశారు. "ఇలా తత్వ చింతన సదస్సుని పెట్టుకున్నాం. మిమ్మల్ని ఒకసారి కలుస్తాను. విషయాలన్నీ చెప్తాను. మీరు దాంట్లో ప్రసంగం చేస్తే బాగుంటుందని మేమందరం అనుకున్నాం. అలాగే కలవండి." ఆయన మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వస్తే ఆరోజు మా ఇల్లంతా కోలాహలంగా సుమారు గంటన్నర సేపు ఆయన అలా కూర్చొని ఓపిగ్గా నాతో మాట్లాడాలని ఎదురు చూశారు. "చెప్పండి, ఇప్పుడు చెప్పండి మోహన కృష్ణ గారు చెప్పండి" అన్నాను. "తత్వ చింతన సదస్సు అని చెప్తూ మీరు మాట్లాడాలి, రావాలి." నా పక్కన కుప్పా కృష్ణమూర్తి గారు కూర్చుని ఉన్నారు. మీరు రావాలి అని అడిగినప్పుడు నా భర్త ఖాయం అయిపోయింది. నేను వెళ్ళాలి జల్లెళ్ళమూడి. నేను ఒక్కడినే కాదు అమ్మ దగ్గరికి ఇటువంటి గొప్ప వ్యక్తి నాతో మా ఇంట్లో ఆ క్షణంలో ఉన్నారని, "కృష్ణమూర్తి గారు మీరు కూడా జల్లెళ్ళమూడి వస్తున్నారు. Be prepared" అన్నాడు. "అవశ్యం" అన్నాడు. అంతే. ఇవన్నీ క్షణాలలో జరిగిపోయినాయి. కాబట్టి ఈ అమ్మ పట్ల ఉన్నటువంటి అపారమైనటువంటి, బూడిద కట్టుకున్నటువంటి ఆ అమిత ప్రేమ ఉన్నందే అది నన్ను జల్లెళ్ళమూడికి తీసుకొచ్చింది. ఆ రోజున ఇదే ప్రాంగణంలో జల్లెళ్ళమూడిలో నేను మాట్లాడుతూ ఏమన్నానంటే, "నా కనురెప్ప వాలే దాకా అమ్మకి సేవ చేస్తా" అన్నాను. కుప్పా కృష్ణమూర్తి గారు నాకు మిత్రుడు అన్నా కదా, నన్ను ఒక్కసారి ఇలా చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కి అయిపోయిన తర్వాత, "ఏమిటి అలా అన్నారు? మీకు ఎన్ని పనులున్నాయి. ఈ జల్లెళ్ళమూడి ఏదో ఒకసారి రాగలం పోగలం గాని కనురెప్ప వాలే దాకా అని commitment ఇచ్చేస్తున్నారు. ఆలోచించుకొనే అన్నారా?" అ-అంటే బహుశా ఆలోచించి గనక ఉంటే ఆ మాట అనగలిగే వాడిని కాదేమో. నేనేమీ ఆలోచించలే. ఎందుకంటే తల్లి ఒడిలోకి నేను వచ్చా. నాకేదో ఒక కర్తవ్యం, నేనేదో చేయాలి ఇక్కడ. నాకేదో ఒక designated duty అదేమిటో నాకు తెలియదు. కానీ అదంటూ ఏర్పడితే నేను మాత్రం చేస్తా. And I stand by what I said అన్నా. అట్లా జరగటం అలాగే అనేక సందర్భాలలో అమ్మ భాగం లేకుండా ఒక్క సత్సంగం సాగలేదు. శ్రీ సత్యసాయి బాబా వారితో మీరు చాలా కాలం గడిపారు చాలా సన్నిహితంగా. ఎప్పుడన్నా అమ్మను గురించి ప్రస్తావన ఎప్పుడన్నా జరిగిందా? ప్రశాంతి నిలయంలో canteen open చేస్తూ అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని, బంగారు విగ్రహాన్ని స్వామి సృష్టించి ఒక మాట అన్నారు. "ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో అన్నదానంగా అనబడినటువంటి ఈ మహాయజ్ఞం జల్లెళ్ళమూడి అమ్మ కారణంగా ఇది నిరంతరంగా సాగుతూ ఎవరి భోజనం ఎవరి ముద్ద వాళ్ళు తినేటువంటి రీతిలో సాగింది. ప్రేరణ అదే, కారణము అదే" అన్నారు. అమ్మ తత్వానికి సత్యసాయి బాబా తత్వానికి తేడా, భావం, సాముఖ్యం ఏమిటి అనేది మాకు వస్తా, తెలియపర్చండి. ఒక్కటే స్త్రీగా మాతృమూర్తిగా వచ్చింది గనుక అమ్మ దివ్య ప్రేమంతా వాత్సల్యంగా ప్రవహించింది. పురుష రూపంలో సత్యసాయి భగవానుడు వచ్చారు గనుక అది దివ్య ప్రేమ దివ్య ప్రేమగానే ప్రసరించింది. అమ్మ దివ్య ప్రేమని ఒక hypothesis లాగా ఒక abstract గా కాకుండా దగ్గర తీసుకోవటంతో ఆమె వాత్సల్యా మృత వర్షిణి అయిందని మనం ఈవేళ కీర్తిస్తున్నాం. ఒకే ప్రేమ స్వరూపం మారింది. అమ్మగా ఎలా ఉండాలో అమ్మగానే ఉన్నది ఆమె. అయ్యగా లేదు. అయ్యగా వచ్చారు గనుక అయ్యగా ఎలా ఉండాలో అట్లాగే correction process చేశారు. ఇది ఒకటి. రెండవది మీ జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ, మీ సంపద కానీ, మీ కీర్తి కానీ, మీ intellectual, emotional, sentimental quotients కానీ సమాజహితం కాకపోతే నీ జీవితం అసంపూర్ణం అని స్వామి ఎలా చెప్పారో అమ్మ కూడా "అన్నం లేకుండా ఉన్నారు నాన్న"వాళ్ళని గురించి కూడా కాస్త ఆలోచించండి కలిగిన వాళ్ళంత నలిగిన వాళ్ళని కాచుకోండి అని అమ్మ చెప్పింది తేడా ఏముందండి? అట్లాగే రమణ మహర్షి కూడా మీరు వారిని కూడా బాగా అధ్యయనం చేశారు అమ్మ చెప్పిన విధానం ఆయన చెప్పిన విధానానికి విధానంలో ఏమైనా తేడా ఉందా? ఇక్కడ అమ్మ మాటల్ని రమణ మహర్షి బోధలని కొద్దిగా ఇంటెన్ట్ గా గనుక విన్నట్లైతే వాళ్ళిద్దరూ కూడబెట్టుకుని చెప్పారు అన్నట్టు ఉంటుంది ఒకటి రమణ మహర్షి సుదీర్ఘ వ్యాఖ్యానం ఎక్కడైనా ఉంటే దాని సంక్షిప్త స్వరూపము ఒక్క వాక్యంలో ఇక్కడ వినపడేది ఇక్కడ అమ్మ ఎప్పుడైనా సుదీర్ఘమైన వ్యాఖ్యానం చేస్తే ఒక ఏక వాక్యంగా అక్కడ తిరువణ్ణామలై లో వినపడేది చూశారా ఒక వ్యాఖ్యానానికి సంక్షిప్త రూపం అమ్మ అమ్మ గనక వ్యాఖ్యాన ముద్ర అయితే రమణ మహర్షి యొక్క వ్యాఖ్యానం ఒక వ్యాఖ్యాన ముద్ర ఇక్కడ అమ్మ పది మాటలు మాట్లాడితే అక్కడ ఒక మాట అక్కడ ఆయన పది మాటలు చెప్తే అమ్మది ఒక మాట ఈ రెండు ఇంతే తర్వాత మీరు వీరినే కాక అనేక మంది సిద్ధపురుషుల జీవితాన్ని కూడా అధ్యయనం చేశారు ఈ క్రమంలో వారు చెప్పే ఆధ్యాత్మిక సందేశాలకి అమ్మ చెప్పిన దానికి ఏదైనా సారూప్యం గాని తేడా గాని ఏమైనా ఉందా అని మీరు భావించారా? సిద్ధపురుషుల్ని అమ్మతో పోల్చలేం సర్వసిద్ధుల్ని తన అరచేతిలో పెట్టుకున్నటువంటి అమ్మ ఒక్క సిద్ధిని కూడా తనకు వాడుకోకుండా అతి బాల్యంలోనే సమాజహితం చేసిందే అందువల్ల ఆమె విశ్వజనని అయింది జిల్లేళ్ళమ్మోడి విషయానికి వస్తే హైమ కిని మీరు ఎప్పుడైనా సశరీరంగా చూశారా? అందమైన బొమ్మ నడిస్తే ఎలా ఉంటుందో హైమ అలా ఉండేది ఒక అందమైన సుందరమైన బొమ్మ చూట్టమేంటి నేను మాట్లాడిన ఇక్కడ ఒక చిన్న ప్రస్తావన మాత్రం చేస్తాను లోకం కోసం with no hypocrisy with no prejudice ఎవరిని కించపరచడానికి కాదు కానీ ఇది అవసరం హైమ అటు ఇటు తిరుగుతుండేది అమ్మ దగ్గరికి వస్తుండేది వెళ్తుండేది చేతులు చాలా అలవోకగా చిన్ముద్ర ధరించిన ట్టుగా ఉండేవి అది నిత్య చిన్ముద్ర చాలా విశేషం అది సిద్ధ పురుషులకు మాత్రమే సాధ్యం అది కూడా వాళ్ళు సాధన చేసేటప్పుడు చిన్ముద్ర వేస్తారు చిన్ముద్ర తోనే జీవించిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క హైమయే అది ఆమె ప్రత్యేకత అంటే తల్లి గర్భం నుంచి పుట్టినప్పుడే విడిపోయినటువంటి మహా తపస్విని ఎవరు అంటే హైమ తనను తాను సిద్ధం చేసుకుంటున్నది ఏదో బృహత్తర ప్రణాళికకి తర్వాత ఎవరిని చూసినా నా బిడ్డలే అనిపిస్తుంది అని నిర్ద్వందంగా ఆవిడ ప్రకటించారు అట్లాంటి అమ్మ హైమను ప్రతిష్టించి ఆలయాన్ని కూడా కట్టించింది అమ్మ అందరూ బిడ్డలే అనుకున్న అమ్మ తన బిడ్డకే ఎందుకు అలా చేసింది అనేది కొంతమంది ఆలోచన దానికి మీ యొక్క స్పందన సమస్త లోకం తరఫున వేసిన ప్రశ్న ఇది చాలా నిగూఢమైన ప్రశ్న ఈ లోకం ఎప్పుడూ కూడా దీని కృతజ్ఞత అంటే తెలియదు త్యాగం విలువ తెలియదు దివ్యత్వం తెలియదు మహాపురుషుల పోకడలు తెలియవు మన స్థాయిలో విచారణ చేసినప్పుడు పుట్టేటువంటి ప్రశ్న ఇది అయినా సమాధానం తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గనుక ఇందాక అన్నాను చిన్ముద్ర ధారిణి అయినటువంటి హైమ హైమని కన్నాను అన్నది కన్నాను అంటే తెచ్చుకుంది పెంచాను అన్నది అంటే దానికి ఒక రూపకల్పన చేసింది చంపుకున్నాను అన్నది దేనిని చంపింది ఆమెకి ఆ సమయం ఆసన్నం కావటానికి అమ్మ ఒక ప్రణాళిక వేసుకుంది తన సర్వశక్తులను కూడా ఒక పాత్రలో నింపి ఈ ప్రపంచానికి ఇవ్వాలి శక్తికి వారసుడు లేడు ఈ శక్తిని అమ్మ హైమ అనేటువంటి దేహంలో నిక్షిప్తం చేయాలి అంటే హైమ దేహాతీతం కావాలి దేహాతీతం కావాలి అంటే ఆ శోకాన్ని ఆ క్లేశాన్ని అమ్మ ఇక్కడ అనుభవించాలి ఈ అనుభవించాలి అంటే తాను ఎంతో పొగుడుతుకుంటే తప్ప ప్రపంచానికి ఆమె ఈ ఉపకారం చేయలేదు అమ్మని అమ్మగా చూడటం గనక మొదలు పెట్టినట్లయితే సామాన్యమైనటువంటి స్త్రీ మనలాంటిది అని గనక ఒకవేళ క్షణం అనుకున్నా అమ్మ చేసిన మహత్తర త్యాగం తాను కుటుంబుని గృహస్థాశ్రమంలో ఉంది పిల్లలున్నారు బంధువులున్నారు వీళ్ళందరూ ఉండగా సర్వ ప్రపంచాన్ని ఒళ్ళో చేర్చుకోవటం చాలా ధైర్యం కావాలి దానికి చాలా శక్తి కావాలి ముందు నలుగురు మనుషులతో మనం మాట్లాడితే అలసిపోతాం ఎన్ని వేల మంది యధాభరితమైనటువంటి జీవితాలు ఉన్నాయి వాటన్నింటికీ సమాధానం చెప్పాలంటే ఎంత శక్తి ఉండాలి దేహం పరిమితం శక్తి అనంతం ఈ అనంత శక్తిని ఎక్కడో ఒకచోట నిక్షిప్తం చేయాలి గనుక హైమని తెచ్చుకుంది హైమని ఘటాకాశం నుంచి చిదాకాశం చేసింది తన సర్వశక్తులను దాంట్లో కూర్చోబెట్టింది తాను ఉండగానే హైమాలయ ప్రతిష్ఠ చేసింది హైమను ఎలా పూజించాలో గౌరవించాలో నేర్పింది ఆ పదహారు వర్ణాలు చిట్కలతో సహా తన కళతో సహా హైమయందు నిక్షిప్తం చేసింది కాబట్టి హైమది ఒక ప్రత్యేకమైన పాత్ర ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో హైమ ఒక భాగం ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తాను చాలా ధైర్యంగా నిస్సంకోచంగా అనసూయేశ్వరాలయంలో ఉన్న అమ్మ కంటే హైమాలయంలో ఉన్నటువంటి ఆ శక్తి ఉన్నది చూడండి చాలా గొప్ప శక్తి ఎందుకంటే ఇవాళ అమ్మ శక్తి మనకు అక్కర్లా అమ్మ ప్రేమ ఎప్పుడూ మార్పు లేదు కావలసింది శక్తి ఇచ్ఛాశక్తి కావాలి క్రియాశక్తి కావాలి జ్ఞాన శక్తి కావాలి ఈ త్రిపుటి తాను దేహంలో ఉండగా తన గర్భసంజాత అయినటువంటి హైమ శరీరాన్ని వదిలిపెట్టిన వేళ మొత్తం శక్తిపాతం చేసి కూర్చోబెట్టింది ఇది చరిత్ర అంతా చూశారు కాబట్టి ఇందులో ఏది ప్రధానమైనటువంటి శక్తి క్షేత్రం అంటే అప్రధానం అంటూ ఏమీ లేదు ఇది ఒక పార్శ్వం అదొక పార్శ్వం హైమాలయానికి ఉన్న ప్రత్యేకత అది హైమలయంలో.కూర్చొని గనుక హైమ ని గురించో మన గురించో అమ్మని గురించో ఆలోచించినట్లయితే హైమ యందు ఉన్నటువంటి ఆ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి శక్తి అనేక విధాలుగా మనకు అక్కడికి వస్తుందనేది నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం దీనికి ఇంకొక సారూప్యం కూడా చెప్తాను ఇలాంటిది చరిత్రలో జరిగిందా అంటే రామకృష్ణ గురుదేవులు నరేన్ అనేటువంటి ఒక వ్యక్తికి తన తపస్సు అంతా ధారపోసి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి మనం నరేన్ నాటి రాముడు నాటి కృష్ణుడు కలిపితే రామకృష్ణుడు అయి వచ్చారే నా సర్వశక్తులు నా తపస్సు అంతా నీకు ధారపోస్తున్నాను అమ్మ చేసింది exact గా అదే పని. ఇట్లాగే అమ్మ పతిదేవులు శ్రీ బ్రహ్మాండ నాగేశ్వరరావు గారు వారి శరీర త్యాగం అనంతరం కూడా అనసూయ స్వరాళయంలో సుహాసాలతో అమ్మే ఆయన్ని ప్రతిష్టించింది అమ్మ అలా చేయటానికి ఏవైనా కారణం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు శక్తి ఆచరణ ఆలోచన ఆచరణ పార్వతీ పరమేశ్వర లక్ష్మీనారాయణ బ్రహ్మ సరస్వతి ఇది కదా భారతీయ సాంప్రదాయం దాంపత్య ధర్మము కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో అని చెప్తూ ఒక అనసూయ మాతృశ్రీ గా ఒక పరిణామం చెందటం వెనుక బ్రహ్మాండ నాగేశ్వరరావు గారి పాత్ర చిరస్మరణీయమైన పాత్ర ఏ భర్త తన సహజ సౌందర్య విలసితమైనటువంటి భార్య ఒళ్ళో కొన్ని వేల మంది పరాయి పురుషులు వచ్చి సేద తీరుతున్నప్పుడు సామాన్యుడు అయితే భరించలేడు భరించగలడా కష్టం కానీ ఆయన భరించారు అంటే ఆమె యొక్క దివ్యత్వాన్ని ఆయన అప్పటికే గ్రహించారు ఇది ఆయన పరంగా అమ్మ పరంగా చూస్తే నేను జగత్తుకి తల్లిని గాని ఒక పురుషుడికి నేను భార్యని ఉమ్ ఆయనకు ఇవ్వవలసిన గౌరవాన్ని నేను ఇవ్వవలసిందే అని ఏం చేసింది సమస్త స్త్రీలోకానికి మీ మూలాలు అన్ని మీ కుటుంబంలో ఉన్నాయి కుటుంబంలో ఒక సమన్వయ సాధన చేసుకోండి దైవం అంటూ వేరే లేడు మిమ్మల్ని భరించేవాడు మిమ్మల్ని కాపాడేవాడు మీకు సమాజంలో ఒక భద్రత ఒక ముద్ర ఇచ్చేవాడు అని వివాహ వ్యవస్థకు అమ్మ వేసిన బలమైన ముద్రే నాగేశ్వరరావు గారిది కాబట్టి కడకుంగున అమ్మ నాగేశ్వరుడు అనేటువంటి ఒక జీవశక్తిని ముడివేసుకుని భద్రంగా సంచారం చేసింది. శాస్త్రాలన్నీ కూడా కర్మ జన్మ సిద్ధాంతాన్ని బాగా ఘోషిస్తున్నాయి అమ్మ అందరికీ సుగతే తార్తమ్యాలు లేకుండా అందరికీ సుగతే అనేది ఆవిడ ప్రకటించింది ఈ రెండింటిని ఎట్లా సమన్వయ పరచుకోవాలి సామాన్యులు సుగతి అంటే జన్మ లేకపోవడం కాదు కదా అమ్మ గ్యారెంటీ ఇవ్వలేదు కదా ఉమ్ సుగతి అంటే మంచి గతి ఉత్తమ గతి ఉత్తమ స్థితిని అనుగ్రహించింది తప్ప ఉమ్ మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పునర్జన్మ లేకుండా చేస్తానని మనకు విల్ నామా రాసే వెల ఏం చేసిందంటే సుగతి అంటే ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి వెళతారు ఇంకోటి కామా పెట్టి కాస్త ముందు వెనక అన్నది హైందవ సిద్ధాంతంలో పునర్జన్మలు ఉన్నాయి అమ్మ ఈ మంచి పనులలో మీరు ఉండండి నాన్న మీకు సుగతి ఉంటుంది అందరికీ ఉంది ఇది ఎవరికో ప్రత్యేకంగా నా అనుగ్రహం ఏ ఒక్కడి మీద ఉందని అనుకోకండి కాస్త ముందు వెనకగా అందరినీ నేను చూసుకుంటాను అన్నటువంటి ఒక అభయ ముద్ర దాంట్లో దాగి ఉంది. అమ్మ తన అనుభవ సారాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న పదాలతో వివరించింది చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో అనుభవం శాస్త్రాల్ని ఇస్తుందని కూడా చెప్పింది అమ్మ వాక్యాలు శాస్త్రాలతో సమన్వయ పరచవచ్చా పరిస్తే ఎట్లా? అసలు ముందు శాస్త్రం అంటే ఏమిటో తెలుసుకుందాం శాస్త్రం అంటే కవిలికెట్ట కాదు చేతిలో పుస్తకం కాదు శాస్త్రం అంటే జ్ఞాపకం అని అర్థం ఉమ్ దాన్ని మన పాతకాలం వాళ్ళు స్మృతి అన్నారు స్మృతి జ్ఞాపకం జ్ఞాపకమే శాస్త్రం ఆ శాస్త్రంలో విధివిధానాలు ఉంటాయి కాలానుగుణంగా అవి మార్పులు చెందుతూ ఉంటాయి అది గోడమీద రాత కాదు అట్లానే నీటి మీద రాత కూడా కాదు పదే పదే దాన్ని మనం update చేసుకుంటూ ఉండవలసినటువంటిది కనుక అమ్మ ఇంకో హెచ్చరిక చేసింది సాహిత్యంతో రాహిత్యం రాదు నాన్న అని చెప్పేసి అంటే సాహిత్యం ఒక మంచి భావానికి భాషకి ఆలంబనం అవుతుందే తప్ప అది యదార్థాన్ని చూపించలేదు కవిత్వానికి ఆ శక్తి లేదు ఆత్మాంశ్రయ కవిత్వానికి అస్సలు లేదు నేను అమ్మని గురించి ఎట్లా అనుకుంటే దానితో అనుగుణంగా పద్యం రాస్తా అమ్మ యదార్థ స్థితిని గురించి పద్యం రాయమనండి యదార్థ స్థితి తెలిసిన తర్వాత పద్యంతో పని ఏముంది కనుక అనుభవం ఉండాలి అంటే తల్లి అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఇవన్నీ అక్కర్లే అమ్మ ఏం చదివింది బాబా గారు ఏం చదివారు ఉమ్ రమణ మహర్షి ఏం చదివారు ఉమ్ వాళ్ళు ఈ జగత్తు చేత దేవీదేవతలుగా పూజింపబడుతున్నారే అమ్మ మాటలకి శాస్త్ర ప్రమాణం ఉన్నదా అంటే అసలు అమ్మే శాస్త్రం కాకపోతే శాస్త్రం భాష్యలు చెప్పడానికి మిగతా వాళ్ళు ఉన్నారు అది అమ్మ పని కాదు అమ్మ ఎంచుకున్న మార్గం సరళ మార్గం ఆద్యధారయా స్త్రుతశాసనం సరళ చింతనం విరళ తత్పరం అంటారు ఉపదేశ సారంలో రమణ మహర్షి అమ్మ దానికి సహకారం తర్వాత ఈ అద్వైత సిద్ధాంతాన్ని అమ్మ చాలా చిన్న చిన్న మాటలతో అందరికీ అర్థం అయినట్టుగా చెప్పింది ఈ అద్వైత ఆ సిద్ధాంతం ఒరిజినల్ గా శంకరులు చెప్పిన దానికి అమ్మ చెప్పిన దానికి ఏ ఒకటే అయినా కూడా చెప్పే విధానంలో ఏదైనా తేడా ఉందా? ఏం లేదు శంకరుల ముందు కూడా అద్వైతం ఉంది అద్వైతం మతం కాదు ఉమ్ అద్వైతం ఒక మానసిక స్థితి సనాతన ధర్మం ఏం చెప్తున్నది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మమే అది నెమ్మదిగా అద్వైతంలోకి వచ్చింది అద్వైతం అంటే రెండు లేవు అని అమ్మ వరకు వచ్చేప్పటికీ రెండు లేవు మాయం అయిపోయింది అమ్మ ఏం చెప్పిందంటే రెండు లేవు అంటున్నావే అంటే ఏదో ఉందని అది రెండుగా ఉందని అనుకుంటున్నావారెండు లేవు కాదు నాన్న ఉన్నది ఒకటి ఇది అద్వైతం అమ్ముతో సహా ఎందరో ప్రవక్తలు ఒకే శక్తి ఎన్నిగా రూపాంతరం చెంది ఉందని చెప్పి చెబుతున్నారు అంటే ఏకోహం బహుష్యామి ఈ అంత అయిన అంతకి అంత గురించి ఎప్పుడూ స్మరణ ఎందుకు రావడం లేదు సృష్టికి ముందున్నది సత్తు సత్తు అంటే ఇది బ్రహ్మ పదార్థం అది సూక్ష్మ సూక్ష్మేతరంగా ఉంది అది ఓ రోజు సంకల్పించింది ఈ ఒక్కటిగా ఏ పరిణామం లేకుండా ఎట్లా నన్ను నేను పరిచ్ఛిన్నం చేసుకోవాలి అని సృష్టి జరిగింది ఉమ్ సృష్టిలో నుంచి ఏదో ప్రవేశించింది విశ్వం విశ్వం విశ్వంగా ఉంటే గోళాలు ఖగోళాలు భూగోళాలు ఇయన్ని ఉంటే ఎవరికి కావాలి అది సంసారం అయింది అది ప్రపంచం అయింది అది కుటుంబం అయింది అది వ్యక్తి అయింది అంటే వ్యష్టి సమష్టి సృష్టి పరమేష్టి ఈ నాలుగింటికీ మూలం పరమేష్టి అంతం కాదు పరమేష్టి ఫైనల్ కాదు సత్తే మూలం ఆద్యంత రహితం అయింది ఆ ఇంటర్నల్ గా నిత్య సత్య శాశ్వతమైనటువంటి ఆ సత్తు భావనే ఆ మూలం కాబట్టి ఈ మహా ప్రవక్తలు ఏం చెప్పినా సత్తు గురించే చెప్తారు అయితే మీరు మీ ఆలోచనలు కలిగినటువంటి ఒక భావన ఏంటంటే అందరికీ ఎందుకు కలగటం లేదు అని కలగదు అందుకోగలిగిన వాళ్లకు అదే కలుగుతూ ఉంటుంది మొత్తానికి ఆ సత్తు వైపే అందరం నడుస్తాం అదే సుగతి కాస్త ముందు కాస్త వెనక ఆశ్రయించిన అనేక మందికి అమ్మ వాళ్ళ గురుతర బాధ్యతలు వహించింది వాళ్ళకి మార్గదర్శకం కూడా చూపించింది కానీ అమ్మ తన మాటల్లో నేను గురువుని కాదు మీరు శిష్యులు కాదు నేను మార్గదర్శిని కాదు మీరు బాటసారులు కాదు నేను అమ్మను మీరు బిడ్డలు అనే అంది ఇలా అనటానికి కారణం ఏమిటి అమ్మ ఎలా అన్నాలే నాకేంది అమ్మ గురువు అయిపోతే అమ్మ దూరం అయిపోద్ది గురువు గారు అమ్మ కాలేడు గాని అమ్మ గురువు కావచ్చు ఎప్పటికైనా గురువు గారు అమ్మ కాలేడు గురువు దైవము కాలేడు కానీ అమ్మ గురువు కాగలదు దైవము కాగలదు ఇక్కడ అమ్మత్వం ఏదైతే ఉన్నదో దానికి పూర్ణ పతాక ప్రతీక అమ్మ కనుకే ఆమె ఏ language లో ఏ భాషలో చెప్పాలో అట్లాగే ఆమె తన నిజ స్వరూపాన్ని ప్రకటన చేసింది ఒకే అమ్మని కొందరు ప్రేమ స్వరూపునిగా మరి కొందరు అవతారమూర్తిగా ఇంకొందరు సంఘ సంస్కర్తగా ఈ మూడు ఒకే అమ్మలో చూస్తున్నారు మీ అమ్మని ఎలా భావిస్తున్నారు మళ్ళీ మూడు పాయలు అమ్మ తన కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఎంతమంది నలుగురు వాళ్ళను పక్కన పెట్టి సర్వ ప్రపంచాన్ని తన కోసం వచ్చే బిడ్డలుగా తన దగ్గరికి వచ్చేట్లుగా చేసుకుని వాళ్ళ జీవితంలో పొందలేని దాన్ని అనుగ్రహించింది గనుక ఆమె వాత్సల్యము ఆమె గుణమే ప్రేమ ఆమె తత్వమే సంఘ సంస్కరణ ఆ స్థాయికి చెందిన వాళ్ళకి సంఘం ఉన్నదా అని శుక్ల శోణితాళ్ళకి ఏ కులం ఉందో అది నా కులం అన్నదే ఎంత గొప్ప మాట అది మామూలు విషయం కాదది మనం ఊరికే బాగా చెప్పింది అంటాం బాగా చెప్పలే సత్యం చెప్పింది సత్యం చెప్పింది కనుక అది బాగుంది అంతే ఏ విధానం లేకపోటే నా విధానం అని కూడా అమ్మ అంది అమ్మ నెలకొల్పిన అందరింటి నిర్వహణ కోసం గా శ్రీ విశ్వజనీ పరిషత్తు ప్రస్తుతం కృషి చేస్తుంది ఈ సంస్థ సభ్యులు విధానం ఏర్పరచుకోవాలా అక్కర్లేదా ఆమె ఏం చెప్పిందండి విధి విధానాలు నాకు లేవన్నది గాని మీకు లేవని చెప్పిందా ఆమె విధి విధానాలు నాకు లేవు నాకు తోచిన రీతిలో నేను నడుపుతా కానీ మీరే దీన్ని నడపవలసి వస్తే మీకు విధివిధానాలే తల్లి అవుతుంది ఏ విధానం లేకపోవటమే నా విధానం అనటంలో అవతారం aspect చెప్పింది తప్ప నేను ఉన్నా లేకపోయినా మీ ఇష్టం వచ్చినట్టు గోల చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆ license ఇచ్చిందా ఆమె ఎప్పుడైతే సంస్థని మాతృమూర్తిగా మనం భావన చేస్తామో విధివిధానాలు మనల్ని శాసించాలి మనల్ని నడిపించాలి లేకపోతే మనలో ఒక అలసత్వం ఒక విశృంఖలత్వం ఒక పశుత్వం ఒక ధనుషత్వం విజృంభించి ఇంత చేసుకొని ఒక మహా కారుణ్య మూర్తి దగ్గరకు వచ్చి జ్ఞానైక స్వరూపిణి దగ్గరకు వచ్చి చిచ్ఛక్తి స్వరూపిణి ఒళ్ళో పడుకున్న మనం చేజేతులా మరకత మాణిక్యాలు పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి విశ్వజనీ పరిషత్తుకు విధి ఉండాలి విధానము ఉండాలి అంటే planning ఉండాలి policy ఉండాలి schedule ఉండాలి scheme ఉండాలి execution ఉండాలి కానీ అంతర్ వాహిని బహిర్ వాహిని అమ్మ కావాలి ప్రస్తుతం అమ్మను దర్శించ వచ్చే కొత్తవారికి అమ్మ తత్వం తెలుసుకుందాం అని అర్థం తెలుసుకుందాం అనే వాళ్ళకి వారందరికీ అమ్మని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏ రకంగా దర్శించాలి అనేది మీరేదన్నా మీ సందేశం ద్వారా తెలియపరచండి అసలు అమ్మ పుట్టిన ఊరు పేరు గుర్తుకు రాకపోయినా నాకు ఏమనిపిస్తుంది అంటే శబ్దార్థం అని తీసుకుంటే మత్త నవ్వ నేను కొత్త కాదు అని చెప్పింది అంటే సనాతన ధర్మ స్వరూపం మన్నవ పక్కనే ఇంకెక్కడో పుట్టొచ్చుగా ఆమె ఇంక మరోచోట అవుతా మన్నవ నేను పాత దాన్ని కాదు కొత్త దాన్ని కాదు సనాతనమైన దాన్ని నేను అని చెప్పినటువంటి అమ్మని దేహంగా చూసే అవకాశం ఇప్పుడైతే లేదు hypothetical impossible impractical దేహంగా చూసిన వాళ్ళంతా అమ్మ దేహాతీత స్థితిలోకి తత్వంలోకి వెళ్ళాలి ఇవాళ అమ్మను గురించి తెలియాలి అంటే technology ప్రకారం పుస్తకాలు CDలు DVDలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరిగే కార్యకలాపాలు ఇవే దిక్కు కాబట్టి అమ్మతో కూడి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యందు ఒక బాధ్యత ఉన్నదండి అమ్మత్వాన్ని తమ జీవన విధానం ద్వారా ప్రచారం చేయాలి తత్వ ప్రచారం అనేటువంటి మాట mind నుంచి erase చేసేసేయాలి తత్వాన్ని మీరు ప్రచారం చేయలేరు మీ వల్ల కాదుతత్వాన్ని ప్రసారం మాత్రం చేయగలం. కష్టం వచ్చింది. అమ్మ హైమ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు అమ్మ ఎట్లా ఉన్నది? నాకమ్మను గురించి ఆ రోజుల్లో నేను ఎప్పుడూ అనుకోనేవాడిని. అమ్మకి "ఏమిటండీ జిల్లేళ్ళమూడి అమ్మ కూతురు పోయిందట కదా, పాపం గర్భశోకం ఆవిడకి తప్పలే" అని అన్నప్పుడు, ఆ మాట విన్నప్పుడు, నేనేం పెద్దవాడిని ముసలివాడిని కాదు. నేను అన్నాను "అసలు ఆగర్భ శోకంతోనే ఆమె వచ్చింది. మీ కంటికి కనిపిస్తున్నది ఒక హైమే. ఎంతమంది రాలిపోతే ఆ గర్భం దాన్ని అనుభవించిందో ఆవిడకి నాకు తెలుసునా?" అని అడిగా. అవును. ఆహా. ఆగర్భ-- గర్భ సంజాతం అంటున్నాం కానీ అమ్మది ఆగర్భ శోకం. ఈ సృష్టి ఉన్నంత కాలం శోకంగా కనిపిస్తుంది. ఓమాట చెప్తా, ఆవిడ ఏమీ అనుభవించలే. ఆవిడ అభినయించింది. ఏడవలేదనుకున్నాం. ఏడుపు రాకుండా ఎలా ఉందంటాం. కనుక మన కోసం ఏడ్చింది. మేము ఈ మధ్య అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా నివసించిన బాపట్లలో చిదంబరం రావు తాతగారింటిని దర్శించామని విన్నాం. దర్శించినప్పుడు మీ కలిగిన భావాలు ఏమైనా ఉంటే మాతో పంచుకోండి. ఇది కూడా అమ్మ అన్న మాటకే ఒక గొప్ప నిదర్శనం. "సర్వం తరుణాధీనం నాన్న" అన్నది. ఆ బాపట్ల స్టేషన్ లో ఎన్నిసార్లు వచ్చామో, కదా. అవును. దానికి ఎదురుగ్గా ఉంద ఆ ఇల్లు. మరి ఇప్పుడే ఎలా చూడగలిగాను, ఎందుకు చూడగలిగాను అంటే, అది ఆ తరుణాధీనం గనుక చూశాను అది సమాధానం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ నడయాడినటువంటి, అమ్మ కూర్చున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సజీవంగా ఆ వయస్సులో ఉన్న అమ్మని నేను దర్శనం చేసుకున్నా. ఇది hallucination కాదు. నన్ను నా కన్ను కనకట్టు చేయలేదు. ఓ! నా మనస్సు ఒక భ్రాంతికి లోనయ్యే అవకాశం నా వరకు నాకు తెలిసి లేదు, నేను కాలే. ఎందుకంటే నాకు బాబా గారితో ఉన్న యాభై రెండేళ్ళ అనుబంధంలో నాకెప్పుడూ ఆయన స్వప్న దర్శనాలు ఇవ్వలే. ఊ. ఒక్కసారి కూడా. కలలోకి రావటం, నాతో మాటలు-- ఇవి ఏమీ లేదు. కష్టంలోనూ రాలేదు సుఖంలోనూ రాలేదు. అవును. కాబట్టి నా మనస్సు భ్రాంతికి భ్రమకి లోనయ్యే మనసు మాత్రం కాదు, కాదు. అలాగే అమ్మ నాకెప్పుడూ క-- నన్ను "నువ్వు జిల్లేళ్ళమూడి రా, తత్వ చింతన సదస్సు పెడుతున్నారు. నువ్వచ్చి మాట్లాడకపోతే అక్కడ చాలా లోటు" ఇవేమీ చెప్పలే నాతో. యాదృచ్చికంగా అవి జరిగిపోతాయి. దాన్లో మనం ఉన్నాం. అలాగే చిదంబరం రావు తాతగారి ఇంటికి వెళ్లటం అంటే, మళ్ళీ అమ్మ పసితనపు అడుగుల్లో మళ్ళీ మన బాల్యం పదముద్రలను పోల్చుకోవడానికి అమ్మ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళినప్పుడు నేను ఆమె బాల్యం గురించి నాదగ్గర ఏమీ పుస్తకాలు లేవు. నేనేం చదవలే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం కుడికాలు లోపల పెట్టగానే దేహం మొత్తం మాత్రం ఒక ప్రశాంతతని, ఒక స్థిమితాన్ని, ఒక అద్భుతాన్ని అది అనుభవించింది. ఇంకాస్త అడిగారు గనుక చాలా ఏమీ దాచుకోకుండా చెప్తున్నాను. తెరమీద బొమ్మ ఎట్లాగైతే ఆ twenty four film అంటాడే, అట్లా సాగిపోయినట్టుగా అమ్మ సశరీరంగా బాల్యంలో ఎలా ఉందో, ఆ రోజులలో గనుక ఎటువంటి పట్టు పెరకిణీ కట్టుకుందో, ఆ దృశ్యం మొత్తం నేను ఏకకాలంలో అనుభవించేశా. ఇది సత్యం. ఈ జిల్లేళ్ళమూడి క్షేత్రాన్ని గురించి మీరు భావిస్తున్న భవిష్యత్ దర్శనం ఏదన్నా ఉందా? అసలు జీవితమంతా ఒక exalted state అయిపోతున్నప్పుడు భవిష్యత్తు చాలా స్పష్టంగా కనబడుతుంది. దానికి astrology తెలియక్కర్లేదు, అరణ్యాలకు పారిపోయి తపస్సు చేయక్కర్లేదు. Keep your mind clean. జిల్లేళ్ళమూడి క్షేత్రంలోనే కూర్చున్న నాకు ఇది ఎట్లా కనిపిస్తున్నది అంటే ఇప్పుడు, సాధనలో ఒక చివరి దశకు చేరుకున్న వాళ్ళంతా ఇక్కడికి చేరుతారు. ఒక grand finale అంటాం చూడండి, దానికోసం వస్తారు. సాధనే ఎరగని వాడు సాధన స్వీకారం చుట్టుకోవటానికి వస్తాడు. మహాత్ములు వస్తారు, పీఠాధిపతులు వస్తారు, రాజాధిరాజులు వస్తారు. ఎందుకనంటే ఇంకొక చిన్న విషయం, వింధ్య పర్వతాలకి ఇవతల ఒక స్త్రీమూర్తి అర్చా రూపంలో వచ్చింది ఒక్క జిల్లేళ్ళమూడి అమ్మే, ఇంకెవరూ కాదు. ఇదొక విశేషం. చూపిచ్చింది ఇంకొళ్ళని. కాబట్టి నా దర్శనం, ఇది తపోభూమి కాకపోతే అమ్మ దీనిని తను మెట్టవలసిన ప్రదేశంగా ఎన్నుకునేది కాదు. 1958లో నలుగురికి అన్నం పెట్టాలి అన్నటువంటి ఒకేఒక ఆలోచనతో తాను రూపొందించినటువంటి గాడిపోయి అఖండంగా నిత్యంగా వెలిగిపోతూ, ఇవాళ ఆధునిక కాలానికి అనుగుణంగా అన్నపూర్ణాలయం ఒక పునర్నిర్మాణం, రూపాంతరీకరణం జరగటమే అమ్మ అనుగ్రహం ఈ స్థలం మీద ఎంత బలంగా ఉన్నదో మనకు నిదర్శనం. కాబట్టి నా దర్శనం మాత్రం ఒకటే. ఈ మహాత్ములందరూ వచ్చినప్పుడు అమ్మతో కూడి ఉన్నవారు, అమ్మని దైవంగా భావించిన వాళ్ళు, అమ్మ మాదే మాకే అనుకున్న వాళ్ళు కూడా తమ విధానాలు సవరించుకుంటూ మహాత్ములకి సాదరంగా ఆదరపూర్వకంగా ఆహ్వానం పలకాలి. మన అల్పత్వాన్ని మహాత్ములకి అంటకట్టకూడదు. ఓ మహాపురుషుడు వస్తాడు, ఓ నలభై రోజులు ఇక్కడ ఉండాలని ఆయన అనుకుంటాడు. మీకోసం, నాకోసం కాదు ఆయన కోసమే వస్తాడు. ఏం చేయగలం? ఏం విసుగుబాటు కల్పించగలం? ఆయన ద్వారా ఈ స-సమస్త సృష్టికి మూలమైనటువంటి భగవదంశులకి మనం ఏ రకమైన సేవ చేయగలం అనేటువంటి భావనతో గనుక ఉన్నట్లయితే, ఇవాళ ఈ దర్శనం సహకారం కాలుస్తుంది. ఆ దిశగానే జిల్లేళ్ళమూడి కాలంలో చాలా వేగంగా పరిగెత్తుతున్నది. కానీ ఇవాళ తేజస్సుతో పరిగెత్తడానికి మాత్రం అమ్మ ఎంచుకున్నటువంటి ఒక బృహత్తర కాలం ఉంది. అమ్మ అధ్యాత్మ తత్వానికి, అవతార స్ఫూర్తికి మన అన్ని కుటుంబాలు కూడా ఒక సోదాహరణ పూర్వకంగా నిలబడాలి. ఇది నా భావన. ఇంకేదన్నా చెప్పదలచింది, మా అందరికీ తెలియపరచవలసింది ఏదన్నా ఉంటే తెలియపరిస్తే సంతోషం. అధ్యాత్మ కూడా అంగడి సరుకు అయిపోతున్నటువంటి వేళ, నమ్మకాలు సైతం అమ్మకానికి పెట్టబడుతున్న ఈవేళ, జిల్లేళ్ళమూడి జిల్లేళ్ళమూడిగా తన శుద్ధత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి సందర్భంలోఇది గురుస్థానంలో నిలబడి సర్వాత్మన సమస్త ప్రపంచానికి కూడా ఒక light house కావాలి. ఆ కావటంలో మనల్ని మన అమ్మ చేసిన త్యాగం ముందు మనం దీనికోసం వెచ్చించే సమయం కానీ, దీనికోసం ఇచ్చే డబ్బు గానీ ఏది లెక్కకు రావు ఒకటి. అమ్మ చేసినదంతా గనక రూపాయల్లోకి మార్చి లెక్క కట్టినట్లయితే మన అమ్మకి చాలా ఋణపడిపోతాం. అది తీర్చుకునే ఋణం కాదు. మనం ఒక కొంత ద్రవ్యం ఇక్కడ ఇచ్చి నేను ఇచ్చాను అన్న భావన వదిలిపెట్టేసేయండి. అమ్మకి ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మా అమ్మకి ఈ చీర కొన్నాను, ఈ గాజులు కొన్నాను అని చెప్తున్నామా? ప్రపంచంలో మనం ఎంత మర్యాదగా ఉన్నామో అంతకంటే వెయ్యి రెట్లు మర్యాదగా, వినయంగా ఈ ప్రాంగణంలో ఉండాలి. ఇక్కడ నుంచి అమ్మ అనుభూతిని ప్రపంచానికి తీసుకొని వెళ్ళాలి. దాన్ని గురుతర బాధ్యత చేసుకుందాం. మనం తరచూ కలుసుకుంటూనే ఉందాం. సత్యార్థ ప్రకాశమానమైనటువంటి స్థాయిలో మనం నడిచి వెళుతూ ఉందాం. ఆ దిశగా మనం నిష్కామ కర్మబద్ధులమై అమ్మకి ఎదిగి వచ్చిన బిడ్డలుగా మన ఋణం మనం తీర్చుకుందాం. అమ్మని దైవంగా మనం ఒక ఆలయంలో ప్రతిష్టించుకున్నాం గనుక ఒక దేవతకి ఇవ్వవలసిన గౌరవాన్ని, మర్యాదని మనం అక్కడ ఇద్దాం. సంస్కరింపనేల సంఘమంతటినీవు, సజ్జనుండవగుము స్వార్థముడిగి, ఒక్క నీచుడప్పుడు ఉరివిలో తగ్గును. ఇంతకు మించి భావన లేదని మనం ఏ పని చేయగలం? మన ప్రజ్ఞని జిల్లలు మూడుగా ఎట్లా వినియోగించగలం అని మనందరం ఒక సమన్వయ స్ఫూర్తితో ఆ-ఆ ఐక్యతాభావంతో అమ్మ ఏ అమ్మ అక్కయ్యలు, అన్నయ్యలు అని పేరు పెట్టిందో దానికి అనుగుణంగానే జీవిద్దామని నేను భావన చేస్తూ మళ్ళీ పునః పునః కలుసుకుంటూనే ఉందాం. తప్పకుండా. చాలా సంతోషం. అమూల్యమైన మీ సమయాన్ని వెచ్చించి తెలియని మా అందరికోసం గా అమ్మ అందరింటి యొక్క విశిష్టతను గురించి అమ్మ తత్వాన్ని గురించి వివరంగా మా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియపరచిన మీకు ధన్యవాదాలు మురళి గారు. అమ్మ అనుగ్రహం
YouTube · audio
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Spiritual Scientist
Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Spiritual Scientist
Source: Sree Viswajananee Parishat Trust - Jillellamudi on YouTube
0:00 / 59:01