Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సత్యం శివం సుందరం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మానవాళిని భక్తి యోగ జ్ఞాన మార్గాలు నడిపించడానికి అవతరించిన మహితాత్ముడు పుట్టపర్తి సత్యసాయిబాబా వారు. భారతదేశంలోని ప్రపంచంలోని కోట్లాది మంది భక్తులు నేటికీ భగవాన్ సత్యసాయి ని ఆరాధిస్తూనే ఉన్నారు. వీరి అడుగడుగు అద్భుతాల పుట్ట. వీరి జీవనం ఒక మహిమల కాసారి. ఇంతటి సత్యసాయిబాబా వారి గురించి మనకు ఎన్నో అద్భుత విషయాలను తెలియజేయడానికి ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ప్రవచన కర్త మాన్యులు వి.ఎస్.ఆర్. మూర్తి గారు ఇక్కడకు విచ్చేశారు. వారిని అడిగి సత్యసాయిబాబా వారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారమండీ గురువు గారు. సాయిరాం అమ్మ. గురువు గారు బాబా వారు ఇప్పటికీ జీవించి లేకపోయినప్పటికీ కూడా కోట్లాది మంది భక్తులు ఇప్పటికీ విదేశీయులు కూడా బాబా వారిని ఆరాధిస్తూ ఉన్నారు. మరి పుట్టపర్తి సాయిబాబా ను భగవాన్ సత్యసాయి అని అంటారండి ఎందుకచేత? చాలా మంచి ప్రశ్న ఇది. తరానికి. ఎందుకంటే భగవాన్ అనే పదం అతి కొద్దిమందికి మాత్రమే సరిపోతుంది. వేదవ్యాసుల వారు మొట్టమొదటిసారిగా భగవాన్ అని పించుకున్నారు. తర్వాత కాలంలో వచ్చిన శంకర భగవత్పాదులు భగవత్పాదులైనారు. మళ్ళీ భగవాన్ శబ్దం రమణ మహర్షికి మాత్రమే వాడేవారు. ఇది అయిన తర్వాత సమకాలీనంగా అంటే సుమారుగా తొంబై ఏడు సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో పుట్టపర్తి లో జన్మ ఎత్తినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భగవాన్ అనేటువంటి పదానికి పరిపూర్ణమైనటువంటి సార్ధకతను చేకూర్చారు. అంటే వెలుగు అంటే జ్ఞానం. జ్ఞానము ద్వారా వెలుగు వెలుగు ద్వారా జ్ఞానం. రెండూ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే భగవాన్ అవుతారు. ఉమ్ జ్ఞానము అంటే విజ్ఞానం కాదు శాస్త్ర జ్ఞానం కాదు. జ్ఞానము అంటే తమను తాము ఎరిగిన ఎరుకలో సంస్థితమై ఉండేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి స్థితి. అది దైవం కంటే కూడా గొప్పది. ఉహు కనుక సత్యసాయిబాబా వారిని భగవాన్ అని పిలవటం భక్తులు అది ఆయనకిచ్చిన టైటిల్ కాదది. భ-- ప్రపంచంలో ఉన్నటువంటి కోటానుకోట్ల భక్తులు వెలుగుని జ్ఞానాన్ని వారి ద్వారా, వారి జీవన విధానం ద్వారా, జీవన దృక్పథం ద్వారా, వారు చేసిన అనేక కార్యక్రమాల ద్వారా, సంకల్పాల ద్వారా, స్థితప్రజ్ఞ ద్వారా, మర్యాద ద్వారా, సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక ధర్మాన్ని ఒక హైందవ ధర్మాన్ని పతాక స్థాయికి తీసుకు వెళ్ళినందువల్ల శతాబ్దంలో భగవాన్ అని అనిపించుకున్నటువంటి ఏకైక మహిమా మహిమాన్విత మూర్తి ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. గురువు గారు మరి షిరిడి సాయిబాబా వారు కావచ్చు సత్య సాయిబాబా వారు కావచ్చు వీరిరువురు కూడా దత్త అవతార పరంపరలోని వారేనా? మనం ఎట్లా అనుకుంటే అట్లా. ఉమ్ ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమేని. అంతే కదా. అవును అంటే దత్త పరంపరలో అనేకారమైన అని అంటే [స్టెప్] నిజానికి కలియుగం కంటే ముందు భాగవత ప్రమాణం ప్రకారం భగవంతుడు ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాలి. ఉహు అందులో సుమారు ఇరవై అవతారాలు అయిపోయాయి. ఉమ్ కృతయుగం అయిపోయింది. త్రేతాయుగంలో రామచంద్రుడు వచ్చాడు. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ వచ్చాడు. మరి కలియుగం వచ్చేప్పటికీ విష్ణుమూర్తికి అవతారాలు ఎత్తే అవసర-- అవకాశం పోయింది. లేదు. ఇంక ఎప్పుడో రావాలి ఆయన. కలియుగం చివర్లో రావాలి. మరి శివుడు అవతారాలు ఎత్తి రాలే ఇప్పుడు. పూర్ణంగా రాలే. అంశ అవతారాలుగా వచ్చాడు. బ్రహ్మకి అవతారాలే లేవు. మనకు అవతారం ఎత్తాలి పురుష రూపంలో అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. సృష్టి, స్థితి, లయ. అంతే కదా. ఉమ్ ముగ్గురికి అవతారాలే లేని ఒక యుగం ఏర్పడింది. దాని పేరు ఇదిగో మనం ఉన్న కలియుగం. మరి ఎవరు కలియుగానికి అధిష్టాత? ఎవరు రావాలి? ఎప్పుడో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల నాటికి కల్కి అవతారం వస్తుందని అంటాం కదా. అని అన్నప్పుడు కోటి సూర్యమండల మధ్యస్తమైనటువంటి మహా త్రిపుర సుందరి దేవి, "నేను కలియుగానికి అధిష్టాతనే వస్తాను" అన్నది. అమ్మా ఒక సూర్యమండలం నుంచే లక్షా ఇరవై వేల మైళ్ళ దూరంలో ఒక కిరణం ఇక్కడ పడితే తట్టుకోలేకపోతున్నాం. ఉమ్ కోటి సూర్యమండల మధ్యస్తేన నువ్వు ఎలా వస్తావ్ అని బ్రహ్మాది దేవతలు, అగస్త్యుడు, లోపాముద్ర, అష్టదిపాలకుల అందరూ కూడా ఆమెను అడిగారు. "నేను వస్తే ఇలా వస్తానా శ్రీ లలితా అనేటువంటి నామంతో వస్తాను." ఉమ్ కాబట్టి కలియుగం అంతా కూడా నా అధీనమై ఉంటుంది అన్నది. అంటే శ్రీ లలితా దేవి కలియుగానికి అధిష్టాతమైనటువంటి పరదైవతం. అయితే స్త్రీ శక్తి అంటే స్త్రీ ఆలోచన పురుషుడు ఆచరణ. అమ్మవారు స్త్రీ రూపంగా మనం ఆరాధన చేస్తాం కాబట్టి పురుష రూపంలో కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కనుక అది దత్తమై వస్తుంది అనుకున్నారు. ఉహు వచ్చినటువంటి దానికే మనం దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నాం. ఉహు దత్తము అంటే జగత్తుని అడాప్ట్ చేసుకునేవాడు. దత్తత తీసుకునేవాడు. తనను తాను జగత్తుకి దత్తం చేసుకునేవాడు. అతడి పేరే దత్తాత్రేయుడు. కనుక ఉమ్ దత్తాత్రేయ అంశ లో అనేకమైనటువంటి అవతారాలు వచ్చినాయి. కానీ ప్రప్రథమ దత్త అవతారం వచ్చింది ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుడే మొట్టమొదటి దత్తావతారం. ఉమ్ కానీ పరిమిత కాలం. సమయంలోనే తర్వాత అనేకమైన అంశ అవతారాలు వచ్చినాయి. కానీ మళ్ళీ ఒక పూర్ణమైనటువంటి అవతారం ఎప్పుడొచ్చిందంటే సంత దేశమైనటువంటి మహారాష్ట్ర దేశంలోశివ రామ కృష్ణ మారుతి విఠోబ ఖండోబా అనేటువంటి అనేకమైనటువంటి సంప్రదాయాలు ఆచారాలు ఉన్న సమయంలో నాథ సంప్రదాయం కూడా అక్కడే ఉన్నది. కనుక నాథ సంప్రదాయము సంత దేశమది. సంతలు పుట్టే place కాబట్టి అక్కడ జన్మ ఎత్తి వచ్చినటువంటి వారు షిరిడి బాబా. ఉహు నిజానికి ఇవాళ మనం షిరిడి షిరిడి అంటున్నాం అది షిరిడి కాదు. మరాఠీలో శిలాధి అంటే చెరుకుతోట. ఉహు చెరుకుతోటని ఎంచుకొని దానిలో ఒక సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ అని మనం చదువుతాం. అంటే వేప చెట్టుని ప్రపంచం అంతా నిజానికి నందనవనం బృందావనం కానీ ఎక్కడో చెడు ఉండకుండా ఉండదు అది వేప వృక్షం గనక అయినట్లయితే దానిని ఆధారం చేసుకొని సమస్త ప్రపంచాన్ని కూడా సర్వానందమయమైన ఒక ఆనంద ఆధ్యాత్మిక అనుభూతిలోకి తీసుకు వెళ్లడానికి వచ్చారు గనుక ఆయన షిరిడి బాబా. నిజానికి ఆయన శిలాధి బాబా. బాబా అంటే తండ్రి అని అర్థం. ఉమ్ అమ్మా కాబట్టి ఆయన అక్కడికి వచ్చారు. వస్తే-- షిరిడి సాయినాథుడు వచ్చే సమయానికి రెండు మతాల మధ్య వైరుధ్యం ఉంది. అది ఇస్లాం హిందూ అది మొదటి నుంచి ఏర్పడి ఉన్నదే. ఉమ్ కానీ పరిమితమైనటువంటి ప్రాంతంలో తాను కూర్చొని తనలో ఉన్నటువంటి అతిమానుషమైన శక్తులన్నింటినీ ప్రపంచానికి ప్రదర్శిస్తూ నిరూపణ చేస్తూ తాను ద్వారకమాయి అనేటువంటి ఒక దాంట్లో ఉండి అంటే తలుపులు లేనిది అని అర్థం. ద్వారకమాయి దానికి తలుపులు లేవు. ఉహు మనసుకి తలపులు ఉన్నాయి తలుపులు ఉన్నాయి హృదయానికి తలుపులు లేవు తలుపులు లేవు అటువంటి చోట ఉండి తన అవతార కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రప్రథమ సంపూర్ణ పరిపూర్ణ దత్త అవతారంగా వచ్చినటువంటి వారు షిరిడి మహాస్వామి. ఉమ్ షిరిడి స్వామి వచ్చినటువంటి ఆనాటి ప్రబలమైనటువంటి సంప్రదాయం నాథ సంప్రదాయం కాబట్టి ఆయనని షిరిడి సాయినాథుడు అని పిలుస్తాం. అక్కడ నాథ శబ్దం అది కింగ్ అని కాదు అంటే చక్రవర్తి కాదు ఎంపరర్ కాదు ఏదీ కాదు నాథ సంప్రదాయాన్ని పరిపోషిస్తూ హైందవ ధర్మాన్ని అద్భుతంగా సాగిస్తూ తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా జ్ఞానేశ్వరి చదువుకోండి లలితా సహస్రనామం చదువుకోండి విష్ణు సహస్రనామం చదువుకోండి అని ఒక పక్క చెప్తూ రామలాల ఉత్సవాలు చేస్తూ మరొక పక్క ముస్లిం సోదరులు అందరినీ కూడా సన్మార్గంలో ప్రవేశపెట్టి మతం ఎప్పుడూ చెడ్డది కాదు మనిషి మతి మాత్రమే చెడ్డది అని రెండింటిని సమన్వయం చేస్తూ వచ్చినటువంటి అవతారమే దత్తావతారం అయినటువంటి పూర్ణ దత్తావతారం షిరిడి బాబా. ఉహు వారు 1918 విజయదశమి నాడు శరీరాన్ని అవతారాన్ని చాలించేటువంటి సమయంలో సరిగ్గా ఎనిమిది సంవత్సరాల నాటికి ఆంధ్రదేశంలో మళ్ళీ నేను పునః రెండవ అవతారంగా వస్తాను అని అన్నప్పుడు ఉహు నవంబర్ 23, 1926 పుటపర్తి గ్రామంలో ఉద్భవించిన ప్రాదుర్భవించిన ప్రభవించిన దత్తావతారం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అయితే దత్తావతారం చాలా expansive గా చాలా విస్తృతమైనటువంటి అవతారం. ఇక్కడ కేవలం హిందూ ముస్లిమ్స్ రెండు కాదు. ఉమ్ అసలు సర్వమతాలు ఒకటే. ఉమ్ మానవ భాష ఒకటే దాని పేరు హృదయ భాష జాతులన్నీ ఒకటే మా వెళ్లే మార్గాలు వేరు అనుసరించే ఆచరణీయ విధానాలు వేరు తప్ప ఉన్నదంతా ఒకటే అనేటువంటి ఒక అఖండమైనటువంటి సంపూర్ణమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆచరణ యోగ్యం చేశారు గనుక షిరిడి బాబా సత్య సాయిబాబా వారు దత్తావతారులేనా అంటే మూలాలు అవే కావచ్చు గానీ ఒకటి దత్త అవతార సంప్రదాయానికి పరిమితమైంది రెండవది దానిని అవధులు దాటించి ప్రపంచానికి సనాతన ధర్మాన్ని పరిచయం చేసిన మహా పరిపూర్ణ అవతారం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. గురువు గారు మరి సత్య సాయిబాబా వారిలో ఉన్నటువంటి మానవతాతీత శక్తుల గురించి మాకు తెలియజేస్తారా అండి? అసలు ఆయనే శక్తి. అతిమానుషమైన చర్యలు ఎన్ని ఉన్నాయి అంటే భాగవతం నిండా శ్రీకృష్ణలీల విన్నాం చదివాం. ఉమ్ కృష్ణుడి జన్మ దగ్గర నుంచి మహా పరినిర్వాణం వరకు జరిగిందంతా కూడా లీలా విగ్రహం అది. లీలా విగ్రహ స్ఫూర్తి అది. ఉమ్ శ్రీరామచంద్రుడు కూడా మానవుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాడు గనుక ఆయన కూడా శవధనుర్భంగం చేశాడు వారధి కట్టాడు కోతి మూకల సాయంతో రావణ వధ చేశాడు అవేం చిన్న విషయాలు కావు. కాబట్టి ఎవరి ఎవరు అవతార మూర్తిగా వచ్చినా వారు అతిమానుషమైనటువంటి కొన్ని శక్తులను ప్రదర్శన చేయాలి. ఉమ్ చేయకపోతే లోకం అసలు నమ్మదు. ఎట్లా? మామూలు మనలాగానే ఉన్నారు. ఏదో పుట్టారు పెరిగారు వెళ్లిపోయినారు. ఏదో పుట్టారు సంపాదించుకున్నారు వెళ్లిపోయినారు. అట్లా కాదు కదా జగద్ధితంగా జగత్తుకి తమ ఉనికి చేత వ్యక్తిత్వం చేత అస్తిత్వం చేత దివ్య ప్రభాసంపన్నమైనటువంటి ఒక అతీంద్రియమైన అతిమానుషమైన ఒకానొక శక్తి ద్వారా మళ్లీ ధర్మసంస్థాపన చేయాలి. ఉమ్ అందువలన అతి శక్తి ఉన్నది అంటే అణిమాది సిద్ధులన్నీ ఆయనకి వైభవం అయిపోయినాయి. ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దాని కోసం ప్రత్యేకంగా చేసిన సాధనలు అంటూ ఏం లేవు. రావటం రావటమే ప్రభవించి అందుకనే ఆయనది ప్రసవం కాదు ఆయనది ప్రభవం. ఉమ్ పరిపూర్ణమైన మహా చైతన్యం ప్రపంచంలోకి వచ్చి తన చుట్టూ సమాజంలో ఉన్నటువంటి అనేకానేక శక్తులన్నింటినీ కూడగట్టి ఉమ్ సమన్వయం చేసి సంఘటిత పరిచి ఏకోన్ముఖమైనటువంటి ఏకాత్మ భావనలోకి నడిపించి సమస్త జాతులు కూడా ఒకటే. ప్రపంచమంతా వసుధైవ కుటుంబకం అని వేదం ప్రామాణికంగా చెప్పిందో దాన్ని నిరూపణ చేసినటువంటి స్వామి ఒక అనంత మహా శక్తి. ఇది శక్తి అని చెప్పటానికి లేదు. అది సృష్టించగలదు ఉమ్ ఉపసంహారం చేయగలదు కానీ అదంతా చాలా సాత్విక గుణ ప్రధాన సంపన్నంగా ఉండి అందరిలో ఉన్నటువంటి మానవత్వాన్ని మేల్కొలిపి దేవుడు ప్రత్యేకంగా లేడు దేవుడనగా వేరు దేశమున లేడు.తాను చేయు పనుల యందు తగిలి ఉండు. మనం మంచి పనులు చేస్తే ఎక్కడైనా ఎవరికైనా ఒక చిన్న సాయం అవసరమైనప్పుడు చేస్తే దేవుడల్లే వచ్చి కాపాడావ్ అంటాం. అవునా? అవును గురువుగారు దేవుడల్లే అంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. టైంలో ఎవరంటే మనకు సాయం చేసిన వాడు దేవుడు గనుక ఉన్నదంతా దైవమే సర్వం ఖల్విదం బ్రహ్మ అనే అనేకమైనటువంటి వేదోపనిషత్తు వాక్యాలకి శక్తులు అన్నింటినీ కూడా జోడించి జాతి మత కుల వర్గ వర్ణాలకు అతీతంగా ఒక ఏకమైనటువంటి ఒక అఖండమైన స్థాయిని ప్రపంచానికి నిరూపణం చేశారు కాబట్టి ఇది శక్తి అనటానికి లేదు. మానవుడికి మూడే శక్తులు ఉంటాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. వీటన్నింటికీ మూలమైన శక్తి ఏదన్నా ఉన్నదా అంటే. అసలు దేవుడినే నమ్మని కొందరు విదేశీయులు సత్యసాయిబాబా వారిని ఎందుకు నమ్మారు? ప్రశ్నలోనే చమత్కారం ఉంది. మంచి అందమైన ప్రశ్న ఇది. ఎందుకంటే విదేశీయులకు దేవుడు ఎక్కడున్నాడు? అసలు భూమండలం మీదికి మహా సృష్టి అనంత మహా సృష్టి అంటాం. దీనిలోకి ఎప్పుడైనా ఒకడు దైవంగా రావాలి అనుకుంటే మూల శక్తి ఏదైతే ఉందో ఇంగ్లీషులో phenomenon అంటాం. అది దైవం కంటే గొప్పది. చిచ్ఛక్తి అంటాం సంస్కృతంలో. చిచ్ఛక్తి ఎప్పుడైనా ఒక మానవ దేహం తీసుకుని రావాలి అంటే ప్రకృతిలో సృష్టిలో వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రదేశం ఒక్క భారతదేశం మాత్రమే. మిగతా దేశం కాని మిగతా అన్ని దేశాలలో ప్రవక్తలు వచ్చారు. అనేకమంది మహాత్ములు వచ్చారు. కానీ దైవం వచ్చిన దేశం ఏదన్నా ఉన్నదా అంటే అది ఒక్క అఖండమైన భారతదేశం మాత్రమే. ఆసేతు సీతాచలం ఒక ప్రాంతం అని కాక అన్ని ప్రాంతాలలో దైవం అనేకమైనటువంటి రూపాలలో గురువుగా, అదూతలుగా, సత్-- సత్పురుషులుగా ఇలా వచ్చారు. కాబట్టి విదేశీయులకు ఆకర్షణ కాదది. తమకు లేని, తాము పొందలేని, అనుభవించలేని భౌగ-- భోగ ప్రపంచం నుంచి యోగ ప్రపంచంలోకి ఎలా వెళ్ళాలి అని ఒకడికి ఆలోచన కలిగినప్పుడు వాళ్ళ దృష్టి అంతా కూడా ఇదిగో మన భారతదేశం వైపు చూసినప్పుడు ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మహాత్ముడు అవతరించినా విదేశీయులంతా వచ్చి భారతదేశంలో సత్పురుషుల సమాశ్రయం కోసం వచ్చారు. అందువలన సత్యసాయిబాబా వారిది ఒక విస్తృతమైనటువంటి canvas. చిన్నది కాదది. చాలా పెద్దది. ఏదో ప్రాదేశికం, భౌగోళికం, గ్రామం దానికి పరిమితమైనది కాదు. అనంత మహా విస్తృతమైనటువంటి శక్తిని గమనించటానికి, చూడటానికి, దర్శించటానికి, అనుభవించటానికి, అనుభూతి చెందటానికి ఒక పరమ చరమమైన విభూతి స్థాయికి వెళ్ళటానికి విదేశీయులు, పరదేశీయులు అంటూ లేరు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడూ ఆకర్షితుడై ఇక్కడికి వచ్చారు. అంతే. గురువుగారు మరి సత్యసాయిబాబా వారు ఎన్నో అద్భుతమైన లీలలు చూపించారు. వాటిలో ఒకటి మా కోసం చెప్తారా అండి? ఇప్పుడు లీల చాలా చిన్న విషయం అమ్మా. భాగవతం నిండా అది అందుకనే మనం లీలా విగ్రహం అంటాం. లీలా మానుష విగ్రహం అంటాం. తర్వాత శ్రీరామచంద్రుడిని మాయా మానుష విగ్రహం అంటాం. సత్యసాయిబాబా వారిది లీలా మాయా మానుష విగ్రహం. సామాన్య మానవుడి వలె మనందరి మధ్య సంచారం చేస్తూనే అతీంద్రియమైన, అలౌకికమైన, అతిమానుషమైన, దైవీపరమైనటువంటి అనేకమైనటువంటి శక్తులని ప్రదర్శన చేశారు. వస్తు సృష్టి ఒకటి. అంటే వస్తువు ఎలా సృష్టింపబడుతుంది? నాకు ఉంగరం కావాలి. నేను బజారుకెళ్ళాలి. బంగారం కొనాలి. స్వర్ణకారుడి దగ్గరికి వెళ్ళాలి. నా size ఇవ్వాలి. ఆయన కొలిమిలో దాన్ని కాల్చాలి. దాన్ని చెక్కాలి. నా చేతికి ఇవ్వాలి. కదా? కానీ సత్పురుషులకి సంకల్ప మాత్రం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని శక్తులని కూడా సమీకరించి తాము సంకల్పించిన వస్తువును తాము సృష్టించగలరు. అదే ఆయన చేసింది. ఉమ్ నిజమేనా? మీరు scientist అంటున్నారు. science చదువుకున్నారు కదా. మీరు కూడా మాయలో పడిపోయారా? మీరు కూడా నమ్ముతున్నారా? అని నన్ను ప్రశ్నించిన వాళ్ళున్నారు. నేను మాయలో పడలా. సత్యాన్ని కనుక్కున్నా. E is equal to mc square. అంటే మనిషి భౌతిక పదార్థంలో నుంచి ఒక దాన్ని సృష్టిస్తాడు. అంటే బొగ్గు తీసుకుంటే దాంట్లో నుంచి నిప్పును సృష్టిస్తాడు. అంటే energy ని సృష్టిస్తాడు. ఉమ్ భగవంతుడు energy లో నుంచి వస్తువును సృష్టిస్తాడు. అంతే. ఉహు ఇది నిజమైనప్పుడు అది నిజమే. అంతే. ఉమ్ అయితే మీరు ఒక ప్రశ్న వేశారు. ఒకటి కాదు. లీలలు చెప్పుకుంటూ వెళ్లాలంటే వినే వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. స్వామి ఇంతటి మహాత్ముడని అనిపిస్తుంది. కానీ నా దృష్టిలో ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహిమ ఏది అంటే సమస్తమైనటువంటి జాతులని జొరాస్ట్రియన్స్ అలాగే బుద్ధిజంలో ఉన్నటువంటి బౌద్ధులు మతాశ్రయులైనా సరే, మత అనుయాయులైనా సరే వాళ్లందరినీ కూడా తీసుకొచ్చి ఒక గొడుకు కింద కూర్చోబెట్టగలిగారు. అది ఒక పరమాద్భుతమైన మహిమగానే భావిస్తా. ఇద్దరు మనుషుల్ని మనం జీవితంలో కలపలేం. అసలు భార్యాభర్తల్నే కలిపించలేని రోజులు వచ్చాయి. అటువంటి చోట భిన్న సంస్కృతులు, భిన్న నాగరికతలు, భిన్న భిన్న భిన్నమైనటువంటి నేపథ్యాలు, వైవిధ్యాలు, వైరుధ్యాలు వీటన్నింటినీ సమన్వయం చేసి ఉన్నది ఒకటి అది మానవజాతి. మీరందరూ మానవులుగా పుట్టారు. నిజానికి మానవులుగా పుట్టిన మీలో దివ్యత్వం ఉన్నది. ఉమ్ అది మీరు గమనించుకున్నట్లయితే మీరు కూడా దివ్యులే. త్వమేవాహం సంశయః. నీకు నాకు తేడా లేదు. మీరు కూడా భగవంతులే. You are potentially divine. అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసి మానవుడిలో ఉన్నటువంటి మృదుత్వాన్ని, మానవుడిలో ఉన్నటువంటి మానవత్వాన్ని, ఒక మాధురి మహిమతో కూడినటువంటి మాధవత్వాన్ని...పెంపొందిస్తూ మనిషిలోనే ఉన్నటువంటి దీనత్వాన్ని దానవత్వాన్ని నెమ్మదిగా సంహారం చేస్తూ వచ్చారు సంహారం అంటే సంస్కరించటం సంహారం అంటే నశింప చేయటం కాదు సంస్కరణ దాని నుంచి మానవుణ్ణి మహోన్నతమైన స్థాయికి తీసుకు వెళ్ళే ప్రయత్నం ఆయన చేశాడు అందుకనే బాబా గారి ప్రధానమైనటువంటి అవతార లక్ష్యం ఏమిటి అంటే man making process అంతే ఒక మనిషిలో ఉన్నటువంటి మానం పోకూడదు మనిషి మనిషిగా ఉండాలి చేరగలిగితే చేయగలిగితే సాధించగలిగితే తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తాను తనంతట తన స్వీయ సాధన ద్వారా జీవన సాఫల్యం ద్వారా జీవితాన్ని అనుభవించటం ద్వారా జీవితాన్ని పరిపూర్ణంగా ఒక అనుభూతి స్థాయిలో పొందటం ద్వారా తాను తాను కూడా దివ్యుడే అనేటువంటి స్థాయికి వెళ్ళవచ్చును అని చెప్పినటువంటి వారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు గురువుగారు మరి ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాని నీటి సరఫరా ప్రాజెక్టుని సత్య సాయిబాబా వారు అందరికీ ఎలా అందజేయగలిగారు చాలా చిన్న విషయం ఇందాక చెప్పుకున్నవన్నీ విన్నప్పుడు ఇది ఎంత చిన్న విషయం అంటే వారు ఏం చేశారంటే భక్తులందరినీ కూడా తమ సంకల్ప మార్గంలోకి మరల్చారు వారి హృదయాలని వాళ్లలో ఉన్న ప్రజ్ఞని శక్తిని సమీకరించారు చేసి గవర్నమెంట్లు చేయటానికి rules regulations ఉంటాయి ప్రకృతిని శాసించగలిగినటువంటి ఒక పరమాత్మకి ప్రకృతే వచ్చి ఆలంబనమై అదే సహాయకారియై కావలసినటువంటి మార్గాన్ని తెరిచి పరచి సులభంగా చేసేట్టుగా చేస్తుంది కాబట్టి అక్కడ డబ్బు ప్రధానం కాదు డబ్బు ఎవరి దగ్గర లేదు అందరి దగ్గర ఉంది కదా ఉందండి సంపదలు ఉన్నాయి కదా ఉంది ప్రజ్ఞలు ఉన్నాయి కదా సంకల్పాలే లేవు వారిది ఉక్కు సంకల్పం ప్రాజెక్టు చేపట్టినా పదకొండు నెలల్లో పూర్తయిపోవాలి అయిపోయేది అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వందల కోట్లు పెట్టి కడితే పదకొండు పదో నెలకల్లా రెడీ అయిపోయింది అలాగే వాటర్ ప్రాజెక్టు ఇటు చెన్నైకి ఇచ్చారు మెహబూబ్ నగర్ కి ఇచ్చారు ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు ఈస్ట్ గోదావరిలో గోదావరి ప్రవహిస్తున్న అప్లాండ్ ఏరియాలో నీళ్లు లేవు అక్కడి నుంచి మళ్ళీ వాటర్ ఇచ్చారు ఉహు ఇది సరే మనం అనంతపూర్ జిల్లా మొత్తానికి ఇచ్చారనేది అందరికీ తెలుసు ఇది కేవల సంకల్పము సమగ్రమైనటువంటి ఒక భావన నిస్వార్థమైనటువంటి ఒక ప్రేరణ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటుందో జనరంజకమైనటువంటిది కాదిది జనామోద యోగ్యమై జనానికి ఆనందాన్ని కలిగించి వాళ్ళ జీవధారణను నిలబెట్టేటువంటి స్థాయిలో గవర్నమెంట్లు అచ్చల్పం చాలా చిన్నవి విషయాలు వ్యవస్థ చాలా చిన్నది ఇక్కడంతా ఉద్యోగం చేస్తాం గవర్నమెంట్ లో మనమే పని చేస్తాం మనకేం వస్తుంది జీతం వస్తుంది అవును అక్కడ సాయి సామ్రాజ్యంలో పని చేస్తే అక్కడ జీతం రాదు ఆనందం కలుగుతుంది ఉహు ఆనందం కొన్ని వేల వేల రెట్లు కలుగుతుంది కాబట్టి ఆనందాన్నంతా కూడా చోట తీసుకొచ్చి ఇది మీకు మాత్రమే కాదు మీ మీ దగ్గర ఉన్న ప్రజ్ఞని సమాజహితం చేయండి సమాజానికి అందించకపోతే మానవ జన్మకి రకమైన సార్థకత లేదని నిరూపిస్తూ ఆయన జలధారని అద్భుతంగా సాగించారు ఒక్క ప్రాజెక్టులే కాదు ప్రాజెక్టు కొన్ని వందల వేల ప్రాజెక్టులు ఉన్నాయి అన్నింటికీ కూడా భక్తులు జాగధనులు స్వామి యందు ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రేమ కలిగినవారు భక్తి కలిగినవారు గౌరవం ఉన్నవారు ఎవరెవరి శ్రమని ఎవరెవరి ధనాన్ని ఎవరెవరి తనువుని ఎవరెవరి మనస్సుని హృదయాన్ని అక్కడ సమర్పణం చేసినందువలన ఇది సాధ్యమైంది శ్రీరామచంద్రుడు వారధి కట్టాడంటే ఎవరితో కట్టాడు ఎవరు కట్టిన వాళ్ళు ఎవరు సైన్యం వచ్చిందా లేదే ఆయుధాలు ఉన్నాయా లేవే మరి శ్రీకృష్ణ పరమాత్మ ఆయుధం ధరించకుండా కురుక్షేత్ర సంగ్రామం మొత్తం ఎలా నడిపించాడు శక్తితో నడిపించాడు కాబట్టి దైవీపరమైన అటువంటి ఆలోచనలు మనం చేసేటప్పుడు మన పురాణ వాంగ్మయాన్ని కూడా స్పురణకు తెచ్చుకోవాలి పురాణ పురుషులైనటువంటి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎలాగైతే చేశారో బాబా గారు కూడా కలియుగంలో హేతువాదులు కూడా స్వామి దగ్గరికి వచ్చారు స్వామివారు ఏమన్నారో తెలుసమ్మా హేతువాది అంటే సత్యం ఉన్నదా లేదా ఉంటే సత్యం ఏమిటి అంటూ అన్వేషిస్తూ వచ్చి తెలుసుకున్న వాడు ఇతడు నిలబడతాడు భక్తుడు నమ్మి నిలబడతాడు హేతువాది తెలుసుకొని నిలబడతాడు భక్తుడి భావం అటు ఇటు ఎప్పుడైనా మారొచ్చు హేతువాది ఒకసారి నమ్మి అంటే హేతువుని నమ్మినవాడు తెలుసుకున్న వాడు అతడు కలకాలం శాశ్వతంగా ఉంటాడు తన శక్తులన్నీ కూడా ప్రజా ప్రజా ప్రయోజనం కోసం వినియోగిస్తాడని చెప్తూ అందరినీ inclusiveness అంటాం అందరినీ కలుపుకునే అటువంటి ఒక ధర్మం ఏదన్నా ఉంటే అది ఇవ్వాళ మనం హిందూ ధర్మం అంటున్నాం అది సనాతన ధర్మం హైందవ ధర్మం ధర్మం ఒకటే దానికి పేరు పెట్టినా గురువు గారు మానవాళి శ్రేయస్సు కోసం అవతరించినటువంటి భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి గురించి బాబా వారి అద్భుత లీలలన్నీ గురించి మా ప్రేక్షకులకి మాకు అద్భుతంగా వివరించారండి గురువు గారు ధన్యవాదములు శుభం భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి జీవిత పరమార్థ విశేషాలను ఈనాటి సత్యం శివం సుందరం ప్రత్యేక కార్యక్రమాలు ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా తిరిగి మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం [Outro music] సనాతనం సనూతనం సదాతనం హిందూ ధర్మం
YouTube · audio

సత్యం శివం సుందరం | puttaparthi Sai Baba | Hindu Dharmam

Home

సత్యం శివం సుందరం | puttaparthi Sai Baba | Hindu Dharmam

Source: Hindu Dharmam on YouTube

0:00 / 24:00