Skip to content
Transcript తెలుగు
మూర్తి గారు నమస్కారమండీ నమస్కారమ్మా చెప్పాల్నుంది కార్యక్రమానికి స్వాగతం. మీరు చాలా చిన్నతనంలో పన్నెండేళ్ళ వయసు అప్పుడే బృహత్ సంహిత లాంటి విషయాల మీద వ్యాసాలు రాసి శాస్త్రవేత్తగా చిన్నతనంలోనే పేరు తెచ్చుకుని మళ్ళీ సాయిబాబా వారితో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని పేరు కూడా ప్రశంస కూడా పొందారు. శాస్త్రం నుంచి ఆధ్యాత్మిక శాస్త్రం వైపు అసలు మీ ప్రయాణం ఎలా మొదలయ్యింది? మంచి ప్రశ్న వరాహమిహిరుడు వంటి ఒక మహాత్ముణ్ణి స్మరిస్తూ మన మాటలు ప్రారంభమైనాయి. నిజానికి పన్నెండవ ఏట వరాహమిహిరుడు బృహత్ సంహిత లో చాలా scientific advancements ఉన్నాయి. అవన్నీ కూడా విశ్లేషిస్తూ ఒక article రాశా పన్నెండవ ఏట. అది శాస్త్రానికి సంబంధించి science కానీ నా నాల్గవ ఏట అవధూతేంద్ర సరస్వతి స్వామి వారిని వారు నాకు చాలీసా హనుమాన్ చాలీసా చేతిలో పెట్టి "ఇది నువ్వు గనక సాయంకాలం లోగా అప్పజెప్తే అరటి పండు ఇస్తాను" అన్నారు. నాలుగో సంవత్సరం అండి నాలుగో ఏట నేను ఒక అరగంటలో దాన్ని ధారణ చేశా. ఒక అరగంట. నేను వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆయన ఆరడుగుల మూడంగుళాలు అజానుబాహువు. ఆయనకి పుస్తకం చేతిలో అంటే ఒక పిల్లవాడు ఒక తల్లి చేతిలో బుక్కు పెట్టి నాకు పాఠం వచ్చింది విను అంటాడే అట్లా ఆయన చేతిలో పెట్టా. "నాకొచ్చు నువ్వు చదువు" అన్నారు. నాకీ పుస్తకంతో పని లేదు అని ఆయన చేతిలో పెట్టా. చాలీసా మొత్తం చదివా. ఇది తెనాలిలో జరిగింది. అప్పుడు నన్ను ఒక అరటి గెల దగ్గరికి తీసుకెళ్ళి "నీకో అరటి పండు ఇద్దామనుకున్నాను గెలంతా నీదే" అన్నారు. ఊహూ నేను బహుశా గెలలో సగం కూడా లేను నా height. ఆహా అట్లా నా అధ్యాత్మ నాలుగవ ఏట ప్రారంభమైంది. కాబట్టి పన్నెండవ ఏట శాస్త్రవేత్త కావటానికి బీజప్రాయంగా ఒక సద్గురువు యొక్క అనుగ్రహం బహుశా అధ్యాత్మ లోకి ప్రయాణం చేయించిందని అనుకుంటున్నా. అంటే ఎలా అండి గురువు గారితో పరిచయం ఎలా అంటే మీ కుటుంబ నేపథ్యం కూడా కొంత ఇలా ఉండేదా? పరిచయం అంటే ఏం లేదు నన్ను మా అమ్మమ్మ పెంచుకుంది. ఆహా మనవడికి ఆశీర్వచనం ఇప్పిద్దాం ఊళ్లో ఒక పెద్దాయన వచ్చారని తీసుకెళ్ళింది. అంతే తీసుకెళ్లిన కారణంగా ఆయన దగ్గర తీసుకున్నారు. బాగా తెల్లగా పండల్లే ఉన్నానని ఊహూ మాట అంటూ అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. దగ్గర తీసుకొని "ఇట్లా కాదు చదువు" అంటూ అలా మొదలు పెట్టారు. తర్వాత తర్వాత అసలు రామనామం గాని భారతీయ ఆధ్యాత్మికం గురించి ఆయన ఉపన్యాసాలు గాని ఇటు కర్ణాటక అటు హిందుస్తానీ రాగాలు ఆయన సాగించినటువంటి కచేరీలు అంటే వాటిని మనం సంకీర్తనలు అంటాం. సంకీర్తనలు three and half hours ఉండేవి ఎవరివి? అవధూతేంద్ర సరస్వతి స్వామి వారివి ఎవరండీ వారసలు? వారిని రఘువరదాసు గారు అంటారు. ఆహా ఇవాళ ఆంధ్రదేశంలో ఉన్న రామాలయాల్లో గోడ మీద ఉన్నటువంటి హనుమాన్ చాలీసా రాన్ని చెక్కబెట్టడానికి ఆయన కారణం. తెలుగువారు తెలుగువారు ఊహూ అచ్చ తెలుగువారాయన గురు పరంపర ఏమన్నా ఉందా? ఆయనకేం గురు పరంపర లేదు లేదు. ఆయనే అవధూతగా ఆయన అవధూత అయినారు అవధూతగానే జీవించారు అవధూతగానే ఊహూ వారు వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. అటువంటి మహాత్ముడితో అనుబంధం అట్లా ఏర్పడింది అండి దాంతో మీ పేరు కూడా శ్రీరామచంద్రమూర్తి అవును కావుట ఆయన నన్ను పరమ ఆనందంగా పూర్తి పేరుతో పిలిచేవారు ఆయన. ఆహా పిలిస్తే రాముణ్ణి ఇలాగే పిలవాలి అని ప్రేమ కాస్త అతిశయించినప్పుడు ఒరేయ్ రాముడు అనేవారు. అది చాలా అందమైన పిలుపు. అంటే ఆయనతో మీ ప్రయాణం చాలా కాలం సాగిందా అండి? లేదు నాలుగో ఏట లేదు లేదు అప్పుడే అప్పుడే ఒక one or two years. రెండేళ్ళ తర్వాత మళ్ళీ నేను ఉద్యోగము చదువుకి యా ప్రాంతాలకు వెళ్ళటం అట్లా నేను మళ్ళీ గుంటూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్ళటం అక్కడ మళ్ళీ చదువుకోవటం ప్రారంభం అక్కడే బృహత్ వరాహమిహిరుడు బృహత్ సంహిత గురించి రాయటం జరిగింది. మీకసా thought ఎలా వచ్చింది అండి? అది ఎంత పెద్ద ఆలోచన చాలా పెద్ద చిన్న వయసులో ఎలా వచ్చింది అది మీకసలు అది చీరాల దగ్గర ఇంకొల్లను కుగ్రామం ఇంకొల్లలు అక్కడ జడ్పీ హైస్కూల్ ఇంకొల్లలో ఉంటే state level science fair జరుగుతుంది. దాంట్లో paper presentation చేయాలని కాల--స్కూలుకి పంపారు. అందులో నన్ను select చేశారు. చేస్తే వాళ్ళు అన్నారు టీచర్ దగ్గరికి వెళ్ళి ఏదో vitamins మీద దాని మీద రాసి present చేసి వచ్చేయ్ అన్నారు. అది నే చేయటం ఎందుకు ఆయనే వెళ్లి మాట్లాడొచ్చు కదా నేను రాస్తానని అక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్లు వేటపాలెం libraryకి వెళ్ళా. ఇప్పటికీ ఉంది అద్భుతమైన library అది. ఊహూ మామూలుగా తంజావూరులో సరస్వతీ సరస్వతీ గ్రంథాలయం గ్రంథాలయం అంటారు ఉంది బట్ వేటపాలెం గ్రంథాలయం గాంధీగారి కంటే ముందు ఉన్నది. అబ్బా చాలా గొప్ప గ్రంథాలయం గర్విం ఆంధ్రులు గర్వించదగినటువంటిది. అక్కడికి నడుచుకుంటూ వెళితే గ్రంథాలయం అంటే మీకు తెలుసు ఎన్ని పుస్తకాలు వందలు అందులో అసలు ఎక్కడ మొదలు పెట్టాలి? నాకేం కావాలి? కాకతాళీయం, ఈశ్వరీచ్ఛ, ఇట్లా ఒక పుస్తకం మీద చెయ్యి వేస్తే అది ఆనాడు వచ్చేటువంటి చాలా ప్రముఖమైనటువంటి journal సాహిత్య journal అది భారతి ఒక భారతి నా చేతిలోకి వస్తే దాంట్లో వరాహమిహిరుడు అని పేరు ఎందుకో ఒక అద్భుతం అనిపించింది. open చేస్తే భాష తెలుగు భాషే గానీ జటిలంగా ఉంది. దీని కానీ విశేషాలు తెలుస్తున్నాయి. ఏం విశేషాలు నన్ను ఆకర్షించినయి అంటే విమాన నిర్మాణం ఉంది దాంట్లో అబ్బా రెండవది ఇవాళ మనం సిమెంటుగా చెప్పబడుతున్న దాన్ని ఆయన వజ్రలేపనము అన్నాడు. ఊహూ ఇవాళ మనం సిమెంటు ఇసుకన్నీ కలిపి కాంక్రీట్ కాంక్రీట్ చేస్తున్నాము కదా దాన్ని వజ్రసంఘాతం అని పేరు పెట్టాడు. అలాగే water divining ఎలా చేయాలి? భూగర్భ శాస్త్రం ఉంది, భూగోళ ఉంది, ఖగోళ ఉంది ఎన్ని సా-సం Astronomy ఉంది Astrology ఉంది. ఇహ article నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. అప్పుడు తెల్లకాయితం వాళ్ళని అడిగి తీసుకుని టకటక ఒక పన్నెండు points రాసుకుని నాదైనటువంటి భాషలో నా పన్నెండవ ఏట నేను ఎట్లా present చేయగలనో ఒక original article రాశా. రాసి Salvation Army School అని బాపట్లలో ఓకే అక్కడ దాన్ని present చేయటం జరిగింది. అయితే అప్పుడు తెలీదు కదా చిన్నతనం కదా వరాహమిహిరుడి బృహత్ సంహిత కావ్యము అందలి అపూర్వ విజ్ఞాన విశేషములు అని ఒక పెద్ద title పెట్టాం. ఆహా పెడితే వచ్చిన judges "ఇది ఎవరో master రాసిచ్చుంటారు. పన్నెండేళ్ళ వాడు ఎలా రాస్తాడు impossible అని అని కాయితం తీసుకున్నారు. ఇప్పుడు చెప్పు అన్నారుధారణ అంటే ఈవేళ గుర్తుస్తుంది అన్నమాట. మళ్ళీ చేతులు కట్టుకొని ఏం చెప్పానో మళ్ళీ ఏం చదివానో మొత్తం మళ్ళీ చెప్పా. ఉమ్ చెప్పావి ఏంటో కూడా explain చేస్తూ చెప్పా. ఇంకా దెన్ they awarded me state award. అది. అట్లా science field లోకి రావటానికి బహుశా అది బీజప్రాయం అయి ఉండాలి. ఉమ్ అధ్యాత్మ లో రావటానికి తదూరదాసు గారి వల్ల హనుమాన్ చాలీసా శాస్త్రం పట్ల అంటే శాస్త్రీయమైనటువంటి ఒక దృక్పథం పట్ల ఉమ్ విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి కలగటానికి మహాత్ముడు వరాహమిహిరుడి మహదాశీర్వచనం అని ఇప్పటికీ నేను భావిస్తూ ఉంటా. ఆ. నాన్నగారు అమ్మగారు ఏంటి నిన్ను encourage చేసేవారా? అంటే నేను చెప్పాను కదా నేను చాలా చిన్న ఇరవై ఒక్క రోజులకే మా అమ్మమ్మ నన్ను తీసుకెళ్లి పెంచుకుంది. ఓహో సమమ్మగారి దగ్గరే పెరిగారు. గాడారి మనవడు అయితే మీరు. గాడారి మనవడు తర్వాత ఆవిడ అప్పటి కాలానికి డెభై నాలుగు ఏళ్ళు అబ్బో బాధ్యత తీసుకుంది. ఉమ్ సో నన్ను పెంచాలి. పెంచాలి అంటే పగటిపూట గేదె పాలు, రాత్రిపూట ఆవు పాలు, పడుకోపోయేటప్పుడు రాముడు కృష్ణుడు కథలు ఉమ్ ఉహు ఓళ్ళో పడుకోబెట్టుకొని పక్కలో పడుకోబెట్టుకొని ఉమ్ ఎప్పటికైనా ఉత్తమ మానవుడిగా జీవించాలి బతికితే రాముడిలా ఉండాలి ఇవన్నీ ఆమె చెప్తూ చెప్తూ బహుశా అవన్నీ జీర్ణమై ఉంటాయి. ఉమ్ తల్లిదండ్రుల దగ్గర నేను లేను ఉమ్ కాబట్టి వాళ్ళ ప్రభావం నా మీద ఉండే అవకాశం లేదు. ఉమ్ ఉమ్ ఉమ్ అది మరి జల్లెళ్ళ మూడు అమ్మవారితో ఎలాంటి మీ పరిచయం చిన్నతనంలోనేనా అది కూడా? అప్పుడే పన్నెండవ ఏట వరాహమిహిరుడిది రాసినప్పుడే ఉమ్ ఊరికి ప్రాంతంలో ఉంది కదా బాపట్ల అంటే జల్లెళ్ళ మూడు దాకా వెళ్లాలని అనిపించి అందరూ ఆమె గురించి చెప్తున్నారని పుస్తకాలన్నీ నాకు presentation ఇచ్చారు. వాళ్ళకి science మీద ఇవ్వటానికి science books ఏం లేవు వాళ్ళ దగ్గర ఉమ్ ఏం books ఉన్నాయంటే కిట్స్ హ్మ్హ్హ్ తర్వాత computer except Shakespeare అన్ని literature books ఉమ్ ఒక్క dictionary of science ELBS series లో ఉమ్ కానీ చాలా books ఇచ్చారు state level prize కదా అది చాలా books. అయిన తర్వాత నా పని అయిపోయింది prize తీసుకున్నాను కిందకి వచ్చాను ఇంక పనేం లేదు సాయంకాలం దాకా. అప్పుడు జల్లెళ్ళ మూడు ఎక్కడ అని అడిగి నేను జల్లెళ్ళ మూడు వెళ్ళటం ఉహు ఒక పుస్తకం తీసుకొని వెళ్ళటం అప్పుడు ఆమెను first చూశా. ఉమ్ చూసి ఆనందంలో ఆమెకి book ఇచ్చి ఇప్పుడే prize వచ్చిందమ్మా అంటే ఆమె నవ్వుతూ "నీ కాపీ ఎవరికో వస్తుంది నాన్న" అంది. అది మా first సమాగమమే అది. ఉమ్ అది ఒక blessing. అట్లా మూడేళ్లలో ఒక ఆరు సార్లు జల్లెళ్ళ మూడు వెళ్ళి ఉంటా. ఉమ్ ఇప్పుడు quarterly, half yearly ఇవి వస్తాయి కదా ఉమ్ Holidays అట్లా నాలుగైదు సార్లు ఎప్పుడు వెళ్ళినా ఆమె తన దగ్గర కూర్చోబెట్టుకునేది. ఉమ్ ఒక మాట అంటుండేది "నాకోసం వచ్చావు నాన్న నా దగ్గర ఉండరా ఉమ్ బయట నీకేం పని" అని దగ్గర పెట్టుకునేది. ఉమ్ అన్నం ముద్దలు కలిపేట్టేది అట్లా అట్లా ఎస్ ఎస్ ఎల్ సి పూర్తయిపోయింది. ఉమ్ ఇహ జిల్లాతో మళ్ళీ నలభై నాలుగు ఏళ్ళ తర్వాత ఉమ్ మధ్య రెండు వేల పదకొండులో జల్లెళ్ళ మూడు మళ్ళీ వెళ్ళా. అన్నా అన్నాడు మీరు వెళ్ళలేదు. వెళ్ళలే, అవకాశం లేదు నాకు. అంటే అమ్మ తరహా మీకు పరిచయం అయినంత వరకు కొంతకాలం ఆవిడ ఉన్నారా అండి? ఉన్నారు ఉన్నారు తర్వాత ఇది అరవై రెండు కదా ఉమ్ ఆమె ఎనభై ఐదు దాకా ఉన్నారుగా సో మళ్ళీ మీరెప్పుడూ ఉన్నా నేను ఎన్నడూ వెళ్ళలే ఉహు ఎందుకంటే నేను అక్కడి నుంచి ఏలూరు రావటం ఉమ్ చదువులు, అక్కడి నుంచి కాన్పూర్ వెళ్ళటం HBTI కి ఉమ్ అక్కడి నుంచి బొంబాయి వెళ్ళిపోవటం ఉద్యోగం ఉమ్ అమ్మ ప్రభావం ఏంటంటారు జల్లెళ్ళ మూడు అమ్మవారి అమ్మ ప్రభావం నేను ఆమెతో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు దగ్గరే ఉండటం అనేది కదా ఒక లాభం అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడేం తెలియదు మనకి. బహుశా ఆమె మహాత్ములతో ఆమె దగ్గరికి మహాత్ములు దర్శనానికి వచ్చేవారు. ఉమ్ వాళ్ళతో ఆమె ఎలా interact అయ్యేది, వాళ్ళు అమ్మతో ఎలా interact అయ్యేవాళ్ళు నేను చూడగలిగేవాడిని. ఉమ్ అలాగే ఏమీ చదువుకోని పామరులు వచ్చేవాళ్ళు, పండితులు వచ్చేవారు, శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు, సినిమా actors వచ్చేవాళ్ళు అందరితో ఒక సమానమైనటువంటి ఆదరంతో ఉమ్ జాతి, మతం, కులం అవి పెట్టుకోకుండా వాళ్ళ స్థితిగతులతో సంబంధం లేకుండా ఉమ్ పరమ ఆర్ద్రంగా, దయగా, వాత్సల్యంతో దగ్గర తీసుకునేది. ఉమ్ కొన్ని చోట్ల మౌనం వహించేది. మౌనం చాలా తీవ్రమైన భాష అనుకుంటున్నా ఇప్పుడు. మాట్లాడేది అర్థం అవుతుండేది అంతరార్థాలు చాలా ఉమ్ చక్కగా తెలుస్తుండేవి. వెరసి ఆమె మమతల తల్లిగా నేను భావన చేశాను. మరీ సాయిబాబా వారు సత్యసాయిబాబా వారు మిమ్మల్ని ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అన్నారు. ఉహు అసలా వారితో మీకు చాలా అనుబంధం యాభై నాలుగు ఏళ్ళు యాభై నాలుగు ఏళ్ళపాటు మీరు యాభై నాలుగు ఇదే పన్నె పన్నెండవ ఏట చాలా crucial బహుశా నా వరకు నా life లో అది కూడా పన్నెండవ ఏటే పన్నెండవ ఏటే ఇది అయిన వెళ్ళకే జూన్ మే తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు జల్లెళ్ళ మూడు అమ్మని చూశా. ఉమ్ జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు ఆంధ్రప్రభలో ఒక article పడింది. article కాదు ఒక చిన్న news item ఉమ్ ఎడ్లబండి మీద సత్యసాయి photo దాని కింద ఏం రాశారంటే ద్వాపర యుగన్నాటి శ్రీకృష్ణుడే మళ్ళీ సత్యసాయిబాబాగా వచ్చాడు అని జనం నమ్ముతున్నారు అని ఏదో article రాశారు కృష్ణుడు ఏమిటి? యుగం మారిపోయింది. ఆయన సత్యసాయిబాబా అయి రావటం ఏంటి? అసలు కృష్ణుడిని ఎలాగూ చూడలేదు ఈయన ఈయనని చూద్దాం. కానీ ఈయన చేతిలో flute, కిరీటాలు ఏం లేవు. ఇవన్నీ ఆలోచనలు చిన్నప్పుడే. అంటే rational scientific approach ఎక్కడో ఉంది mind లో ఉమ్ బట్ అది నన్ను ఏం చేసిందంటే పుట్టపర్తికి తీసుకెళ్ళిపోయింది. ఉమ్ నా అంతట నేనే ఒక ovalteen colored నిక్కర్ white shirt వేసుకొని అటువంటిదే ఇంకో జత ఒక చిన్న సంచిలో పెట్టుకొని గుంటూరు వచ్చి అక్కడి నుంచి ఒక passenger ఎక్కి పెనుగొండలో దిగి అమ్మో అక్కడి నుంచి బుక్కపట్నం వెళ్ళి వాళ్ళందరినీ అడుగుతూ ఇది కూడా నా పన్నెండవ ఏటే. మీ అమ్మమ్మగారు మిమ్మల్ని అలా పంపించారా? పంపించారు. ఉమ్ ఉమ్ చెప్పి చెప్పి బయలుదేరాను నేను. నమ్మ maturity ఉండి ఉంటుంది బహుశా నమ్మకంవెళ్లాను వెళ్లేసరికి ఇట్లాగే పొద్దున పదకొండు గంటల వేళ ముప్పై మంది ఉన్నారు ఆయన చుట్టూ. ఉమ్ ప్రశాంతి నిలయం కట్టబడి ఉంది ముపై మంది ఉన్నారు ఎవరు అన్నారు బ్యాగ్ నాకు మాకు అక్కడ పెట్టేసి వెళ్ళి సుబాబా గారు అక్కడే ఉన్నారు అన్నారు. ఆయన కొద్దిగా దూరంగా ఉన్నారు అక్కడ అవతల వైపు. మంచి ప్రయాణం చేశాం ఆకలి మీద నిద్ర వస్తుంది అలా కళ్ళు మూసుకున్నా. కళ్ళు రెప్ప వాల్చి ఎత్తేలోగా ఆయన నా దగ్గరికి వచ్చారు. ఉమ్ Then I felt ఇది impossible. మనిషి నడిచి రావాలంటే రెండు మూడు నిమిషాలు పడుతుంది. ఉమ్ ఇది ఎలా జరిగింది అని అని ఇలా కళ్ళు తెరిచి ఒకసారి చూసేప్పటికి నా ఎదురుగా ఉన్నారు. ఉమ్ నేనేం మాట్లాడలే కానీ ఫోటోలో ఉన్న వ్యక్తిని మనం సజీవంగా చూసినప్పుడు సహకారంగా దర్శనం చేసినప్పుడు అది కూడా ఒక ప్రభావితమైనటువంటి దర్శనం అయినప్పుడు ఒక్కసారి మనలో తెలియని ఉద్వేగాలు కలుగుతాయి. ఉమ్ ఇవన్నీ నాలో కలుగుతూ ఉండగానే ఆయన ఒకే మాట అన్నారు "కాచుకూర్చుంటేనే" అన్నారు. అబ్బా I was waiting for you అది ఎంత అద్భుతమైన మాట అంటే రాయలసీమ accent లో కాచుకూర్చుంటేనే అంటే నేను తర్వాత తర్వాత వారితో అనుబంధం పెరిగిన తర్వాత ఆయన నా కోసం wait చేయుటువంటి కాచుకూర్చడం అంటే wait చేయడం. అంతే కదా "నిన్ను కాచుటకు నేను కూర్చుంటేనే" అని నేనే పూర్తి చేసుకుని [నవ్వు] వారికి నమస్కారం చేసి నా నెంబర్ పెట్టి వెళ్లారు. ఉమ్ అక్కడ మధ్యలో కూర్చున్నారు అందర్నీ అడిగారు ఏం కావాలి ఏం కావాలి అని అడిగారు ఎవరు ఏం మాట్లాడలే. వాళ్ళు కర్ణాటక వాళ్ళు అనంతపూర్ వాళ్ళు మైసూర్ వాళ్ళు వీళ్ళే ఉన్నారు. ఉమ్ అందరిలో చిన్నవాడిని నేనే అందరూ చాలా నలభై నలభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు. ఉమ్ బాబా కూడా చిన్నవారే thirty six ముప్పై ఆరు ముప్పై ఏడు ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఏం కావాలి అంటున్నారు గానీ ఎవరు ఏమి అనటంలే ఇది కావాలని అనటం లేదు అప్పుడు ఆయన లాలి చెయ్యి ఇలా పైకి తీసి ఉమ్ కుడి చెయ్యి గాలిలో గిర గిర గిర తిప్పి ఇట్లా అన్నారు. ఉమ్ అని నన్ను పిలిచారు. ఉమ్ పిలిచి నా చేతిలో పెట్టారు. ఏమిటి పెట్టారంటే ఒక black హల్వా. వేడి హల్వా. మీకు ఆకలి వేస్తుంది కదా ఆకలి వేస్తుంది కదా [బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్] వేడి హల్వా మీకు ఆకలి వేస్తుంది కదా ఆకలి వేస్తుంది కదా మామూలుగా అబ్బా చేతిలో పెట్టి ఏమన్నారంటే "ఏం చేస్తావు?" అని అడిగారు. ప్రయాణం చేసి వచ్చా, వయస్సు చిన్నది, నిజంగా ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి కావాలి తినటానికి. "నేను తింటాను అనలే అందరికీ ఇచ్చి వస్తాను అన్నా". ఊమ్ అనే పట్టిక ఆయన ఆనంద పడిపోయారు "సరే సరే" అన్నారు. అప్పుడు చెయ్యి పోస్తే సగంగా ఉంటుంది. ఊమ్ అంత చిన్నది చిన్నది కదా మరి చిన్న చెయ్యి అలాగే అదే పళ్ళెం ఊమ్ అందరూ తలా కాస్త తీసుకున్నారు. నా చేతికి నేను వచ్చి నాకు సీట్లో నేను కూర్చున్నా. ఊమ్ కింద కూర్చోగానే పాపం నన్ను చాలా దయగా చూశారు. చాలా అది వాత్సల్యాన్ని నేను వర్ణించలేను. ఊమ్ "పాపం" అన్నారు. అంటే నాకేం మిగలలే చేతికి మాత్రం నెయ్యి అంటుకొని ఉంది. అప్పుడు నన్ను ఇలా పిలిచారు. ఈసారి ఆయన చెయ్యి గాలిలో తిప్పలే. ఊమ్ మునివేలు మీద ఇట్లా కొట్టారు నెమ్మదిగా tap చేశారు. ఎంత హల్వా ఖర్చు అయ్యిందో అంత హల్వా నా చేతికి వచ్చింది. మామా బాబా "ఇదంతా నీకే" అన్నారు. ఊమ్ తినమన్నారు. తిని బయటికి వెళ్ళి చెయ్యి కడుక్కుని మళ్ళీ రావటం రెండు మూడు రోజులు ఆయన దగ్గర ఉండటం. తర్వాత తర్వాత చాలా interactions సుమారుగా యాభై నాలుగేళ్ళ అనుబంధంలో personal interactions ని వాళ్ళు అక్కడ interview అని పిలుస్తారు. ఊమ్ నేను అనుకునే వాడిని interview ఎవరు ఎవరిని చేయగలరు? ఆయన్ని మనం అడగలేం. ఆయన అడిగిన వాటికి మన దగ్గర జవాబులు లేవు. ఊహూ కాబట్టి ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన చెప్పినవి విని ధారణ చేసుకుంటే చాలు అని. అవే తర్వాత సత్సంగ ప్రవాహాలు అయినయి. ఊమ్ సమయంలో నాకు ఇరవై ఏళ్ళు ఇంకా రాలేదు అప్పటికి. అప్పుడు రోజున "నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవి" అన్నారు. spiritual scientist వి అన్నారు. మళ్ళీ doubt వచ్చింది ఒక doubt అందరికీ వచ్చినట్లే. నేను spiritual person ని సన్యాసిని అయినా కావాలి లేదా పీఠాధిపతినో కావాలి. ఉమ్ లేదా మంచి scientist ని కావాలి. ఉమ్ నాకు temperament ఉంది గనుక. ఉమ్ రెండూ కాకుండా spiritual scientist అన్నారేంటి? ఊహూ అని ఆలోచన కలుగుతుండంగానే thought reading complete చేస్తూ ఊమ్ ఏం లేదు chemistry physics ఇట్లా శాస్త్రాలు ఎట్లాగైతే ఉన్నాయో భారతదేశం మాత్రమే పొందిన spiritual sciences ఉన్నాయి. ఊమ్ అవి ఆధ్యాత్మిక శాస్త్రం అది ఎరిగిన వాడివి అవుతావు అన్నారు. ఆధ్యాత్మిక శాస్త్రం ఒక subject శాస్త్రం it's a spiritual science science అంటే భౌతిక వాదం నుంచి ఊమ్ అంటే పదార్థ వాదం నుంచి పరమార్థ వాదంలోకి వెళ్ళి పరమార్థ వాదంలో నుంచి యదార్థ వాదంలోకి వెళ్ళి శంకర భగవత్పాదులు చెప్పినటువంటి సర్వ ప్రపంచం యొక్క సూక్ష్మ స్థూలమైనటువంటి ఒక భావనే వ్యక్తి ఒక సంక్షిప్త స్వరూపం the condensed form ఊమ్ of the whole creation is a human ఊమ్ అనేటువంటి భావనకి spiritual senses మనకి ద్వారాలు తెరుస్తాయి. ఊమ్ ఉదాహరణకి లలితా సహస్ర నామం ఉంది quantum physics తో సమన్వయం చేసి చెప్పాలి. ఊమ్ చెప్పటానికి చాలా ఉన్నాయి. ఉన్నాయి ఊమ్ సో ఇవన్నీ ఆధ్యాత్మిక శాస్త్రం. ఊమ్ అది వారు అది అప్పటికప్పుడే నాకు clear చేసేశారు. ఊమ్ అంటే బాబా వారు మీ జీవితంలో ఒక తండ్రి పాత్రగా చూడాలంటారా? గురువు పాత్ర తీసుకున్నారా? ఎందుకని మీకు మీ తండ్రి వారితో అంతగా లేదు లేదు ఇది పరిచయం లేనందుకు. ఏది ఎవరి ప్రభ అంటే ఎవరి role ఆయన తీసుకున్నారంటారు? నేను భారతీయ సాంప్రదాయంలో ఊమ్ మనందరికీ మీకు నాకు ఎవరికైనా సరే తల్లి ప్రథమ గురువు. తల్లే మనం పుట్టగానే తల్లి సమూహంలో ఉన్న పురుషుల్లో ఒకరిని చూపి అడుగు నీ తండ్రి అంటే కనురెప్ప ఎత్తని వాడు కూడా ఎత్తలేడు ఇంకా కనురెప్పలే form కాలే పూర్తిగాఅంత సమూహంలో తండ్రిని గుర్తుపడతాడు కదా. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఎనిమిదేళ్లు వచ్చేప్పటికి మనను మంచి గురువు దగ్గరికి తీసుకెళ్తారు. ముగ్గురూ కలిసి దైవం వైపు నడిపిస్తారు. ముగ్గురిలో ఎవరూ దైవాన్ని చూపించలేరు. ఉమ్ దైవం వైపు నడిచే మార్గాన్ని మాత్రం చూపించగలరు కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం అని నాలుగింట్లలో దైవం గనుక కంటికి కనపడని వస్తువు అయినట్లయితే రమణ మహర్షి అన్నట్లుగా ఏముంది God అంటే Nothing but a force and feeling comma within అన్నారు. [నవ్వు] Without కాదు within Within within అదే కష్టం అదే కష్టం. within ని మనం గనుక అనుభవించగలిగితే ఉమ్ నాకు నాలుగు కలిపితే అది నా దృష్టిలో భగవాన్ సత్య సాయిబాబా వాడు. ఉమ్ మొత్తం అందరూ వారే నాలుగు Four dimensions అవి. ఉమ్ సో ఉమ్ సాయిబాబా వారే మీకన్నీ నాకన్నీ అన్నీ అంతా కూడా ఆయనే. ఉమ్ మరి ఆయన భౌతికంగా లేని భావం ఎలా ఉందండి మీరు? అది emptiness గా అనిపిస్తుంటుందా? ఆర్ మీ మనసులోనే ఉన్న భావం ఎలా ఉంటుందా feeling? ఇదే ప్రశ్న నన్ను బాలమురళి కృష్ణ గారు అడిగారు ఉమ్ అడిగితే నేను చెప్పాను When he was in form he was formless to me. Now he is formless no He is full of form to me అని చెప్పి. సహకారంగా ఉన్నప్పుడు నా దృష్టిలో ఆయన నిరాకారుడు ఉమ్ It's a beyond ఇప్పుడు నిరాకారుడు కాబట్టి సహకారమైన ప్రపంచం నిండా నా భావన నిండా నా అంతస్సు నిండా నా ఆలోచనల నిండా నా సంస్కారం నిండా నా అడుగుల నిండా అన్నింటియందు ఆయన ఉన్నారనేటువంటి దివ్యభావన ఆయన మహిమలు నాకు అప్పుడు ఆకర్షణ ఆకర్షించలేదు. ఎప్పుడూ ఎప్పుడూ అవి ఆకర్షించవు. అవి ఎవరికోసమో ఉద్దేశింపబడినవి. నా బొట్టు వాడి కోసం కాదు. ఒక జన్మ ఎత్తినందుకు ఉదాత్తమైనటువంటి స్థాయిలో జీవిస్తూ యదార్థమైన స్థాయిలో గనుక మనం కూడా అవనీ సంచారం ముగించగలిగితే ఉమ్ అది గురువు మనల్ని చక్కగా సక్రమంగా నడిపించినట్లు. బాధ్యత ఆయనదే తప్ప మనది కాదు. అవును అది నడవటం మన కర్తవ్యం. బాధ్యత ఎవరిదంటే గురు స్వరూపాయనది. అది మీరు అంత పూర్తి సమర్పణ భావంతోనే ఉన్నారు ఖచ్చితంగా ఆయన పట్ల ఖచ్చితంగా ఏది రాని ఏది పోని ఉమ్ జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎన్ని జరగనివ్వండి ఏనాడూ నేను బెదరలేదు. కారణం ఏమిటంటే అవి జరుగుతూ ఉంటాయి. తెరమీద బొమ్మల్లా సంఘటనలు అలా జరుగుతూ జరుగుతూ ఉంటాయి. ఎట్లాగైతే మనం తెరమీద బొమ్మ బొమ్మను ఎట్లా అంటించుకోదో, తామరాకు మీద బొట్టు నీటి బొట్టు ఎట్లా అంటుకోదో మనం కూడా నడుస్తున్న చలచలితమైన ప్రపంచంతో గనుక అలా ఉండగలిగితే ఉమ్ అది ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకిస్తుందది. ఉమ్ పరసుఖదశౌ పరీపాక రమణీయకమసంగు కచ సాన్నిధ్యాత్త రమణ ప్రథమ స్పర్శ ప్రరూఢి నడనొలిచ సూత్రబంధన వేళన్. నిజంగా మాట చెప్పనా నిజము నా శరీరాస్తి కృష్ణార్పణం. ఆమెకు వస్తు సృష్టి ఇచ్చారు. ఉమ్ ఎందుకంటే ఆమె ఆయనకు పరీక్ష పెట్టింది. నువ్వు దేవుడివైతే అంటూ కాబట్టి పరీక్ష ఆయన Pass అయ్యారు భక్తురాలి పరీక్షలో Pass అయ్యారు ఆయన Pass అయ్యారు
YouTube · audio

Cheppalani Undi | Part-1 | Medapati Ramalakshmi | Bhaarat Today

Home

Cheppalani Undi | Part-1 | Medapati Ramalakshmi | Bhaarat Today

Source: Bharat Today on YouTube

0:00 / 22:55

More in this series

Cheppalani Undi (with Medapati Ramalakshmi)

4 episodes · 1 hr 35 min

  1. 21 min 1

    Cheppalani Undi | Part-1 | Medapati Ramalakshmi | Bhaarat Today

    Now playing
  2. 21 min 1

    Cheppalani Undi | Medapati Ramalakshmi | Bharat Today

  3. 22 min 2

    Cheppalani Undi | Part-2 | Medapati Ramalakshmi | Bhaarat Today

  4. 22 min 3

    Cheppalani Undi | Part-3 | Medapati Ramalakshmi | Bharat Today