Skip to content
Transcript తెలుగు
సమతావాద స్ఫూర్తి భగవత్ రామానుజుల దివ్య మహా స్మృతికి ప్రాంజలి ఘటిస్తూ. ఋషిత్వము సంఘ సంస్కరణ వేదాంతం కలబోసిన ముచ్చటైన బొమ్మ శ్రీమద్రామానుజులు. అంటరానితనం హరిజనులకు దేవాలయ ప్రవేశ నిషిద్ధం సమాజాన్ని విడదీస్తున్న సన్నివేశంలో శ్రీ పెరంబుదూరులో ఆవిర్భవించిన భక్తి అవతారమే శ్రీమద్రామానుజులు. శ్రీ యామునాచార్యుల వారి శిష్యరికంలో సారథ్యంలో స్వామివారి భక్తి వేదాంత సంస్కరణోద్యమం తీవ్రమైంది. కొన్ని దశాబ్దాల పాటు వారు సాగించిన ప్రచారం అఖండ భారతావనిని భక్తి దృష్టిలో తడిపింది. పరమ పురుషుడైన నారాయణానుభవానికి మార్గోపదేశనం చేసింది. బ్రహ్మసూత్రాలపై శ్రీభాష్యం, వేదాంత సారం, వేదాంత దీపం, వేదాంత సంగ్రహం వంటి ఉద్గ్రంథాలు రచించి రామానుజుల వారు ఆచార్య సత్తములైనారు. గుహుడు శబరి వంటి సద్భక్తుల పట్ల శ్రీరామచంద్ర ప్రభువు ఎటువంటి దయను చూపించారో అటువంటి దయని, కరుణని స్వామివారు అందరి యెడల చూపించారు. జాతి, మత, వర్గ, వర్ణాతీతమైనటువంటి ఒక భావనా సముద్ర ముద్ర అది. లక్షలాది మాన్యులను, సామాన్యులను భక్తి మార్గం వైపు మరల్చి శ్రీ వైష్ణవ మత ప్రవక్త అయినారు. శంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతము భావనా భూమిక అయితే శ్రీమద్రామానుజులు ప్రతిపాదించినటువంటి విశిష్టాద్వైతము ఆచరణాత్మక భూమిక. ఒక ఆదర్శవాదము ఒక ఆచరణ వాదము రెండు జమిలిగా సాగిన, సాగించిన మహోన్నతమైనటువంటి ప్రదేశమే భారతదేశం. పరతత్వమైన దైవం సద్గుణ సంపన్నుడు అని అది నిరాకారం కాదని సర్వ భావ సమ్మేళనమని ఆరాధనీయమని అర్చా స్వరూపమని అదే విశిష్టాద్వైతమని శ్రీమద్రామానుజులు భావించారు. విషయాన్ని నిర్ద్వంద్వంగా జగత్తుకు బోధించారు. పరమాత్మ సర్వ స్వతంత్రుడని సర్వవ్యాపకుడని జీవుడు జగత్తు సర్వ జగన్నాథమని రెండు జగదీశ్వరుడి దేహమని ప్రతిపాదించారు. సమస్త సృష్టి ఒక జనార్ధన లీలగా అభివర్ణించారు. జీవుడు ప్రకృతితో కూడిన వేళ బద్ధుడని పరమాత్మతో కూడితే బద్ధుడే బుద్ధుడని ముక్తుడని రెండు స్థితులలోనూ తన అస్తిత్వం నిలుపుకొని ఉంటాడని సిద్ధాంతీకరించారు. అంటే బద్ధుడైన బుద్ధుడైన అర్చా స్వరూపమైనటువంటి పరమాత్మను గనక కొలిచి కైంకర్యం చేసినట్లయితే తనలో ఉన్నటువంటి ఆంతరంగికమైన అధ్యాత్మ భావనా దీప్తి ఉజ్జ్వలమై తనను తాను ప్రకాశమానం చేస్తుందని ఆత్మ స్వరూపుడిగా నిరూపించుతుందని ప్రబోధన చేశారు. జీవుడు ముక్తి పొందిన తర్వాత హరివాసమైనటువంటి వైకుంఠాన్ని చేరుకొని శుద్ధ సత్వంగా ఉంటాడని సాఫల్యం కోసమే భక్తి ప్రపత్తిని ఆశ్రయించాలని సంగతిని వివరించారు. అంటే జీవుడు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అని ప్రశ్న కలిగినప్పుడు ప్రశ్న పొటమరించినప్పుడు శైవులంతా జీవుడు కైలాసానికి వెళ్తాడని వైష్ణవులంతా వికుంఠానికి వెళతారని ప్రచారం చేసిన సందర్భంలో శ్రీమద్రామానుజులు శుద్ధ సత్త్వంలో నుంచి మూలంలో నుంచి తనను తాను ఆవిష్కరించుకొని ఒక నామరూప భావ తత్వాలని సమన్వయం చేసుకొని జీవుడిగా వచ్చాడో మళ్ళీ మూలంలోకే వెళతాడని మూలము సత్యమని అది నిత్యమని శాశ్వతమని అది ఆనందధామమని ప్రతిపాదన చేశారు. ఇది రామానుజుల యొక్క మానవీయమైనటువంటి కరుణా స్ఫూర్తికి ఇది నిదర్శనం. అంతే కాదు నూట ఇరవై సంవత్సరాల సుదీర్ఘ వనీసంచారం ముగించుకొని మరి వారు ఎక్కడికి చేరుకున్నారు వికుంఠ స్థానంలోనే నిలకడ చిందారు. అక్కడి నుంచి వారి భావనా అనుగ్రహ తరంగాలు జగత్తుని, జనాన్ని, జన జగత్తులని జగదీశ్వరుడి వైపు నడిపించేటువంటి దిశగా వేగ ఆవేగాలతో శ్రీమద్రామానుజుల యొక్క భావ పరంపర భావనా బలిమి అంతా కూడా నడిపిస్తున్నది. ఇది ప్రధానంగా సహస్రాబ్ది గనక వెయ్యి సంవత్సరాల నాడు రామానుజులు జగత్తులోకి వచ్చి సర్వ సమతా సమతోద్ధరణ చేసి జాతిని సంపూర్ణమైనటువంటి ముక్త స్థాయిలో నడిపించారు. కనుకనే ఆచార్య త్రయంలో ఒకరైన శ్రీ రామానుజులు ప్రాతఃస్మరణీయులు.
YouTube · audio

Bhakti Parimalam Sreemadramanujulu

Home

Bhakti Parimalam Sreemadramanujulu

Source: AIRHyderabad on YouTube

0:00 / 4:52