Skip to content
Transcript తెలుగు
రజో, తమో గుణాలను ఉద్దీపనం చేసేటువంటి ఆలోచనలు ఎక్కువ శాతం ఉంటాయి గనుక, సత్వగుణాన్ని ప్రేరేపించే ఆలోచనలు తక్కువ ఉంటాయి గనుక భగవాన్ చెప్తున్నారు మనస్సుని హృదయంలోకి తీసుకెళ్ళప్పా. తీసుకు వెళితే నిజానికి అదే భోగం, అదే యోగం, అదే భక్తి, అదే నిశ్చల తత్వం. నిశ్చలత్వం అంటే అచలం కావాలి మనస్సు. ఘనీభవించిన మౌనంలో నుంచి మాటల ప్రవాహం మరలి మరలి ఒకచోట ఆగిపోయినట్లయితే, మాట్లాడటం గనుక తగ్గించుకోగలిగితే మౌనం నెమ్మదిగా వెలుగుతుంది. వెలిగిన మౌనం మనస్సుని దాని స్వస్థానం వైపు నడిపిస్తుంది. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ, ఇది సాధన. భగవాన్ ఏం చెప్పారు, ఏం చెప్పలేదు కాదు, చెప్పవలసింది చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో మనస్సు ప్రేరేపితం కావటానికి మూడు కారణాలున్నాయి. అవి మన యందున్నటువంటి సత్వగుణము, రజోగుణము, తమోగుణం. మూడింటిని ఎట్లా నియంత్రించాలి, కంట్రోల్ ఎలా చేయాలి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పనే చెప్పాడు. యుక్తాహార విహారస్య. యుక్తమైనటువంటి ఆహారాన్ని తినాలి. మన వయస్సుకి తగిన ఆహారాన్ని తినాలి. పెద్దవారు తక్కువ తినాలి, చిన్నవారు కరెక్ట్ గా తినాలి. ఏం తినాలి? దేనివలన రజోగుణం పెరగదు, దేనివలన తమోగుణం విజృంభించదు, దేనివలన సత్వగుణం పెరుగుతూ వెళుతుందో, రజో, తమో గుణాలు తగ్గుతూ వస్తాయో అటువంటి భోజనాన్ని చేయాలి. భోజనం, ఇవాళ ప్రపంచంలో ఆహార వ్యవహారాలు మారిపోయినాయి. విహారాలు ఎప్పుడో మారిపోయినాయి. ఆహార, విహార, వ్యవహార మూడు చాలా ప్రధానమైనవి. ఏది, మనస్సుని స్వస్థానం వైపు, హృదయం వైపు నడిపించాలి అంటే, ఎటువంటి ఆహారం తీసుకోవాలి అంటే శాఖాహారాన్ని తినాలి. ఉద్రేక పరిచేటువంటివి, మనలో అనేక negative forcesని విజృంభింపజేసేవి, తామస గుణాన్ని పెంపొందించేవి, ఎక్కువ నిద్రను కలిగించేవి, అటువంటివి తినకూడదు. one third తినాలి, two thirds ఖాళీ వదిలిపెట్టాలి. ఒక one third నీటితో నింపాలి. మిగతా one third అంటామే, అది ఎప్పుడూ ఖాళీగా ఉంచుకోవాలి. ఎప్పుడైనా అవసరమైతే నింపుకోవటానికి వీలుగా మనం పెట్టుకోవాలి. తినేటప్పుడే అంతా తిన్నట్లయితే, అమితంగా తిన్నట్లయితే ఆలోచనలు మందగిస్తాయి, భావాలు ప్రకోపనం చెందుతాయి, నెమ్మదిగల తమోగుణం వైపు మనం జారిపోతాం. కాబట్టి మనస్సుని హృదయ స్థానంలోకి తీసుకు వెళ్ళండి అంటూనే భగవాన్ మనస్సుని ఎలా తయారు చేసుకోవాలో చెప్తున్నారు. అది యుక్తాహారం. నడిమి వయస్సులో ఉన్నవాడు నెమ్మదిగా సాధనా మార్గాన్ని ప్రారంభించాలి. అరవై సంవత్సరాలు వచ్చేప్పటికీ చాలా మితంగా తినటం నేర్చుకోవాలి. అరవై దాటిన తర్వాత తన శరీర పోషణకు మాత్రమే భోజనం చేయాలి. జిహ్వ చాపల్యాన్ని చంపుకోవాలి. జిహ్వ చాపల్యం అనేది ఒక వాసన. దానివలన మనకు తెలియకుండానే రోగాలు పెరుగుతాయి, వ్యాధులు ఏర్పడుతాయి. తద్వారా శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీన పడినప్పుడు మనస్సు బలహీనపడుతుంది. రెండూ ఏర్పడిన తర్వాత మనం ఆత్మ విచార మార్గం కాదు కదా, భగవంతుడి యొక్క చింతన కూడా తగ్గిపోతుంది. అందుకనే ఆహారం పట్ల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రప్రథమ నియంత్రణ. ఎప్పుడైతే సాత్విక గుణాన్ని పెంపొందించేటువంటి ఆహారాన్ని తింటామో అది తొందరగా జీర్ణమవుతుంది, పచనం అవుతుంది. తొందరగా జీర్ణమయ్యేటువంటి దానిలో నుంచి అంటే తేలికగా, ఎటువంటి కష్టం లేకుండా జీర్ణమైనటువంటి దానిలో నుంచి ప్రాణం పుడుతున్నది, ఎనర్జీ వస్తోంది. ప్రాణంలో నుంచి ఒక చక్కటి మనస్సు ఏర్పడుతున్నది, అది. మనకు మనస్సు ప్రధానం. మనస్సు నెమ్మదిగా విజ్ఞానమయ కోశంలోకి వెళుతున్నది. దాని వల్ల ధారణ పెరుగుతున్నది. అనేకమైన విషయాలు గుర్తుంటున్నాయి. దీనికి కారణం మనస్సు నియంత్రించబడటమే. నియంత్రించబడని మనస్సు ఎవరి దగ్గర ఉన్నదో వాడికి ధారణ ఉండదు, retention ఉండదు. ఎక్కువ విషయాలు గుర్తుండవు. చాలా త్వరగా మరిచిపోతూ ఉంటాడు. అందుకనే యుక్తాహార. ఇక రెండవది యుక్త విహార. మనకి దైనందిన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత కొంత సమయం ఎక్కడో మనకి దొరుకుతుంది. నేను ఇరవై నాలుగు గంటలు busyగా ఉన్నాను అన్నవాణ్ణి మనం పెద్దగా పట్టించుకోనక్కర్లే. అతనికి సమయ పాలనం ఏమిటో, సమయాన్ని ఎట్లా వాడుకోవాలో తెలియని తనం వల్ల ఇరవై నాలుగు గంటలు busyగా ఉంటున్నాడు. ఎనిమిది గంటలు చక్కగా నిద్రపోవాలి. ఆలోచనలు లేనప్పుడు, పవిత్రమైన ఆలోచనలు మాత్రమే ఉన్నప్పుడుమనస్సుని హృదయ స్థానంలోకి తీసుకు వెళ్ళేటువంటి సాధనలో ఉన్నప్పుడు మనసు హృదయంలోకి ప్రవేశించి ఒక భక్తి ఏర్పడినప్పుడు అది యోగమై, నిశ్చలమై, అచలమై నిలకడ చెందినప్పుడు ఆలోచనలు కూడా నెమ్మదిగా నెమ్మదించి మనోనిగ్రహానికి దారితీస్తుంది గనుక ఎనిమిది గంటల నిద్ర మిగతా పదహారు గంటలు ఉన్నది. దానిలో ప్రాపంచిక కార్యకలాపాలు, ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబం పట్ల బాధ్యత, సమాజం పట్ల బాధ్యత, తోటి వ్యక్తుల పట్ల ఉన్న బాధ్యత వీటిని నిర్వర్తిస్తూనే మధ్య మధ్యలో దొరికినటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఏది చేయవలసినటువంటి అవసరం లేనప్పుడు చేయకుండా ఉండటమే మంచిది. ఏదో ఒకటి చేయకపోతే కాలాన్ని మనం పట్టించుకోలేదని కాలాన్ని వాడుకో లేదని మనం అనుకుంటాం. అనుకొని మనస్సుని బహిర్ముఖం చేస్తాం. మళ్ళీ మనస్సు యాతనామయం అయిపోతుంది. కనుక ఏం చేయాలి అంటే సమయం చిక్కినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు కొద్ది సమయం ఏర్పడినప్పుడు మనస్సుని నియంత్రించుకొని మనతో మనం ఉండేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. మనతో మనం ఉండటం నేర్చుకోవటం అలవాటు అయితే మనకి నిజానికి దుఃఖం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. సమస్తము ఆత్మమయంగా గోచరించేటువంటి ఒక భావన నెమ్మదిగా ప్రారంభం అయ్యేటువంటి దశా అది. ఇవాళ వేగవంతమైనటువంటి ప్రపంచం ఇది. చాలా వేగవంతం. వేగవంతమైనటువంటి ప్రపంచంలో మనకి పోటీ కూడా పెరిగింది. మనసుకి ఘర్షణ ఎక్కువైంది. లాలసా ఎక్కువైంది. లక్ష్య గమ్యాలు short term, long term అంటాం. అవి ఎక్కువైపోయినాయి. చేయవలసినది మర్చిపోతున్నాం, చెయ్యనక్కరలేని వాటి కోసం చాలా సమయాన్ని గడుపుతూ ఉన్నాం. మరి ఏం చేయాలి? యుక్త విహారం చేయాలి. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. మంచి మాట ఎవరన్నా చెప్తే కొంత దూరం వెళ్లి వినాలి. ఎక్కడో దూరం వెళ్లి వినటం కాదు, మన మనస్సే ఒక్కోసారి కొన్ని మంచి మాటలు చెప్తుంది. మనం వాటిని వినటం నేర్చుకోవాలి. దేవాలయానికి వెళ్తాం. ప్రదక్షిణలు చేస్తాం మూడో, ఎన్నో. దేవుడికి కొబ్బరికాయ కొడతాం, దండం పెట్టుకుంటాం, నమస్కారం చేసి మళ్ళీ బయటకు వస్తాం. పూజారి మనకు సగభాగం ఇచ్చేస్తాడు. ఇక్కడే ప్రసాదం తీసుకోవాలి అని మనం కాసేపు గుడిలో కూర్చొని వెళ్ళాలి అని చెప్తారు, దర్శన అనంతరం. ఎందుకు చెప్పారు మాట విచారణ చేసినట్లయితే అది యుక్త విహారం. గుడి దాకా వెళ్ళటం విహారం. ప్రదక్షిణ చేయటం విహారం. అసలు యుక్త విహారం ఏమిటి? దర్శన అనంతరం ఒకచోట సంస్థితమై సమ-సమస్థితిలో కూర్చొని తాను కూర్చొని ఉన్నప్పుడు తన మనస్సుని అంతర్ముఖం చేసుకున్నప్పుడు తాను అప్పటి వరకు దైవ దర్శనం వలన పొందినటువంటి ఆత్మానుభూతిని నెమరు వేసుకుంటూ మనసు నిండా దృశ్యాన్ని, ఆలోచనని నిలబెట్టుకుంటూ కాసేపు ఉండగలిగినట్లయితే ఏమవుతుంది? ధ్వజస్తంభం చిట్టచివర ఉన్నటువంటి చిరు గంటలు గాలికి అల్లల్లాడినప్పుడు ఒక ధ్వనిని సృష్టిస్తాయి. అంటే గంటలు మ్రోగుతాయి. గంటలు మ్రోగుతున్న గంటల యొక్క ధ్వనిని మన మనస్సు record చేసుకోవాలి. దానికి చిత్తైకాగ్ర స్థితి కావాలి. దానికి నిజానికి బహిరంగ ధ్యానం అన్నాం దాన్ని. కళ్ళు మూసుకోలేదు తెరిచే ఉంచాం. కానీ కూర్చున్నాం, ఒకచోట స్థిమితంగా రెండు, మూడు నిమిషాలు కూర్చున్నాం. ఆలోచనా లేకుండా కూర్చున్నాం, యుక్త విహారంలో కూర్చుని ఉన్నాం. సమయంలో ధ్వజస్తంభం చివర ఉన్నటువంటి గంటలు గాలికి కదలి ఒక మోతను సృష్టించినప్పుడు ధ్వనిని మన మనస్సు నిశ్చలమైన మనస్సు ఆకళింపు చేసుకున్నప్పుడు మన మనస్సు ఒక ఆనంద పరవశానికి గురవుతున్నది.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -34

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -34

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:56

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

    Now playing
  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77