No transcript for this section.
Transcript begins at 6:08.
నిలారవింద సుహృద సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేణ బ్రాహ్మణ్యం స్థితోతు పితరం వటమూల వాసం సంస్మారయంతమచలం తమనుస్మరామా ఓం నమో భగవతే శ్రీ రమణాయ మహాత్ముల దర్శనం మహాత్ముల స్పర్శనం మహాత్ముల సంభాషణం ఈ మూడు మాత్రమే గాక మహాత్ముల తలపు కూడా అత్యుత్తమమైనది అది దుర్లభం చాలా కష్టం వారితో మాట్లాడటం అనేది జరుగుతుందో జరగదో వారిని తాకవచ్చునో లేదో అసలు వారిని మాట్లా-- వారితో మాట్లాడగలమో లేదో వారిని గురించి తలపైనా తలపగలమో లేదో మనకు తెలియదు నిత్య స్పృహణీయమైనటువంటి భావనలన్నీ ఈ అనుభవాలన్నీ కలగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం తప్ప మరొకటి కాదు మన తపన మన ఆర్తి మన వేదన సంవేదన నివేదన ఒక ఎత్తయితే గురువు అనుగ్రహం మరొక ఎత్తు ఎలాగైతే స్వామి మనతో మాట్లాడాలి భగవాన్ మన-- మనతో మాట్లాడాలని అనుకుంటామో గురువు కూడా ఉత్తమ సాధకుడు మనతో మాట్లాడితే బాగుండు అని కూడా అనుకుంటాడు అనుకొని ఆయన తలపులలో మనం ఉండిపోతాం ఉన్నప్పుడు కనపడినప్పుడు వారి ఆలోచనలో మనం నెలకడ చెందినప్పుడు సాలోక్య సామీప్య సాన్నిధ్యాలు పొందినప్పుడు ఒక్కసారి స్పర్శ దొరికితే చాలు అండి స్పర్శ అంటే అది కింపురుష లోకము అని అర్థం దానిలో ఆప్యాయత ఉన్నది వాత్సల్యం ఉన్నది అనురాగం ఉన్నది రాగం ఉన్నది ప్రేమ ఉన్నది ఇవి పొందగలిగితే అది ఒక సౌభాగ్య భాగ్యం ఇక మూడవది వారితో మాట్లాడటం నేను ఫలానా మహనీయుడిని interview చేశాను అంటాడు ఒకడు చాలా తేలిక మనం ఆయన్ని ప్రశ్నించడానికి మనకి భయమే ఉంది కానీ ఆయనే మనల్ని గనక ప్రశ్నిస్తే మన దగ్గర జవాబులు ఉండవు కాబట్టి ఆయనే మనల్ని అడగాలి దానివల్ల అదొక meter మనం ఎక్కడున్నాం భగవంతుని అనుగ్రహానికి దగ్గరగా ఉన్నామా ఇంకా మొదలే కాలేదా అయితే భగవాన్ చరిత్ర ఒక పరమాద్భుతమైనటువంటి దివ్య లీల ఈ దివ్య లీలలో అనేకమంది కొన్ని వేల మంది అప్పుడు దర్శనం చేశారు ఈ కాలంలో కొన్ని లక్షల మంది అరుణాచలానికి వెళ్తున్నారు వస్తున్నారు ఇది భగవాన్ లేని సమయం ఇది అంటే భౌతికంగా లేని సమయం భౌతికంగా ఉన్నప్పుడు వారితో ఇందాక చెప్పిన సాలోక్యంగా సామీప్యంగా సాన్నిధ్యంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అన్ని అనుభవాలు పొందారని చెప్పడానికి ఆ ఏమీ వీలు లేదు కానీ పొందని వారు ఉంటూ లేరు వాళ్ళకి పొందారో లేదో కూడా తెలియదు అయితే చరిత్రలో కొన్ని పాత్రలు మనకి గుర్తుస్తాయి వాళ్ళంతా భగవాన్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వాళ్ళు వాళ్ళల్లో మొట్టమొదటి వాడు కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని గణపతి మునిని స్మరించకుండా గణపతి ముని యొక్క వాఙ్మయాన్ని గురించి మాట్లాడకుండా భగవాన్ గురించి గనక మాట్లాడితే అది నిజానికి incomplete ఎందుకంటే భగవాన్ ఎవరో తెలియనటువంటి ఒక కావ్యకంఠ గణపతి ముని వేలూరు నుంచి అరుణాచలానికి చేరుకున్నప్పుడు ఆయన బ్రాహ్మణ బాలకుడు మౌనస్వామి Humphrey's చెప్పిన కారణంగా నువ్వు వెళ్ళవయ్యా వెళ్లి దర్శనం చేసుకో నీకు ఇంకా సందేహాలు ఉంటే అవన్నీ పోతాయి అన్నప్పుడు ఆయన అరుణాచలానికి చేరుకున్నప్పుడు భగవాన్ దర్శనం చేసినప్పుడు భగవాన్ ఆయనతో ఏం మాట్లాడలా కానీ వీరు ఏం అడిగారంటే అయ్యా వేద వేదాంగాలు పుక్కిట పెట్టాను వాఙ్మయం నా వెనక పరిగెత్తుకొని వస్తుంది సంస్కృత భాష అనర్గళంగా నేను మాట్లాడగలను పైగా గంభీర ఉపన్యాసాలతో దైవభక్తిని దేశభక్తిని ప్రపి-- ప్రజలలో ఒక చైతన్య ప్రవాహంగా సాగించగలిగాను అనేక గ్రంథాలు చదివాను రాశాను స్తుతులు నుతులు గీతాలు కూడా రాశాను కానీ నాకు చిత్తశాంతి లేదు దీనికి కారణం ఏమిటి అని భగవాన్ ని ప్రశ్నించారాయన అవును మీరు నీవు ఎవరో తెలుసుకో అని ఎప్పుడూ అంటుంటారని విన్నాను నేను అంటే ఏమిటి అని అడిగారాయన భగవాన్ అనేక సంవత్సరాలు మౌనం ముద్రలో ఉన్న కారణంగా కంఠనాళాలన్నీ బిగుసుకుపోయిన కారణంగా కావ్యకంఠంతో మాట్లాడటానికి ఒక తీవ్ర ప్రయత్నం చేసి వారితో ఒక మాటన్నారు ఏ నేనుగా నీవు కనబడుతున్నావో ఆ నేనుని దాటి దాటి వెళ్లి ఇదే నేను అన్న ఒక భావనలో గనక నెల-- నెలకడ చెందితే దాని పేరు తపస్సు మరి చాలా సంతోషం నా తపస్సు ఫలించింది అని నాకు ఎట్లా గుర్తు ఎట్లా అది కూడా చెప్పమని అడిగారు గణపతి ముని ఏమీ లేదు తపస్సు ప్రారంభించిన క్షణం నుంచి కొంతసేపు సాగేదాకా నువ్వు ఈ ప్రపంచంలోనే ఉంటావు కానీ ఎప్పుడైతే సమస్త ప్రపంచము నీ యందు ప్రవేశిస్తుందో ఆ క్షణాన నీవు-- నీ తపస్సు పూర్ణమైనట్లు నీవు తపస్వి అయినట్లు అంటే నీ నా అనేటువంటితరతమ భేదం లేకుండా శుద్ధ చైతన్యంలో నీ మనస్సు నెలకొంది చెందినప్పుడు మిగతావన్నీ కూడా కాలంలో కాలంతో పాటు నడిపిస్తూ వెళతాయి ఇది ఇంతే. అంతేనా అని ఒక చిన్న ప్రశ్న వేసినప్పుడు ముందంతా ఉండేది తమస్సు అది జారిపోతే దాని పేరు తపస్సు అని ముగించారు. అదే సమయంలో దక్షిణాపథం నుంచి రమణ మహర్షి పాలభాగం మీద ఆజ్ఞాచక్రం మీద అంటే రెండు కనుబొమ్మల మధ్య ఆరు కాంతి పుంజాలు వచ్చి తాకినప్పుడు మహాకవి మహా తపస్వి దార్శనికుడు అయినటువంటి గణపతి ముని ఒక్కసారి అనుకున్నారు ఈయన స్కందులు అయి ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది mind శాంతిర్నితాంతమహితా పరమాశశక్తిహి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరస్తకుహనం మధురంచ వృత్తం ఋణాం నిదర్శనమయం రమణో మహర్షి ఆ క్షణం వరకు ఆయన వెంకట్రామణ. ఈ శ్లోకం కావ్యకంఠుల హృదయంలో నుంచి శుద్ధ చైతన్యంలో నుంచి ఆ క్షణాన తమస్సు పోగా తపస్సు మిగిలిన సందర్భంలో ఆ వైభవంలో పెల్లుబికి వచ్చిన ఒక కవితా ప్రవాహం మాత్రమే కాదు ఒక చైత్యపురుషుడికి నామకరణం చేసిన ఒక సందర్భం. శ్రీ రమణ మహర్షి అనే పేరు పెట్టింది కావ్యకంఠ గణపతి ముని. అక్కడితో అది ఆగలేదు దర్శనం అయింది సంభాషణ అయిపోయింది ఇక ఎలా ఉండాలి గణపతి మునికి భగవాన్ కి మధ్య అంటే అసామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఒక అవతారమూర్తి ఒక చైత్యపురుషుడు తన స్థాయిలో తన స్థితిలో తాను ఎప్పుడూ నెలకొంది చెందే ఉంటాడు. ప్రాపంచికమైనటువంటి ఎన్ని కార్యక్రమాల్లో మనస్సు నిమగ్నమై ఉన్నా మనోతీతమైన భావనా స్థితిలో తమయందు తాము సంచారం చేస్తారు. ఆ సంచారంలో నుంచి వచ్చిన పాటే అప్పడపు పాట. గణపతి ముని తర్వాత భగవాన్ తో పెనవేసుకుని అనేకమైనటువంటి పరిష్కారాలు పొంది ప్రశ్నలు వేసి అంటే ఉపనిషత్తులు మనకిచ్చిన హక్కు అది ప్రశ్న వెయ్యాలి జ్ఞాని సమాధానం చెప్పాలి అది ఆయన బాధ్యత. ఈ రెండింటిని నెరవేరుస్తూ గణపతి ముని అనేకమైనటువంటి కార్యకలాపాల వల్ల అరుణాచలాన్ని దాటి బయటకు వెళ్ళినప్పుడు ఆయన మనస్సు తహతహలాడింది భగవాన్ నుంచి దూరమైపోయినట్లు మనస్సు యాతన పడింది. భగవాన్ కు ఉత్తరాలు రాసేవారు ఎంత బాగా రాశేవారు అంటే ఆ ఉత్తరాల నిండా ఒక తపన ఒక ఆర్తి ఒక ఆర్ద్రత ఒక ప్రేమ భగవాన్ పట్ల ఆ ఉత్తరాలని కూడా నిక్షిప్తమైనవే They are on record. సరే అది ఒక పార్శ్వం రెండవది ఎంత భగవాన్ ఆవరణలో ఉన్న కావ్యకంఠులు స్వయం సిద్ధులు అంటే ఆయనకొచ్చిన సిద్ధి వాఙ్మయ సిద్ధి ఆ వాఙ్మయ సిద్ధి బలీయమైనటువంటి ఒక అంగం అయిపోయింది ఆయనకి కనుక అప్పుడప్పుడు భగవాన్ ని ఏమని ప్రశ్నించేవారు అంటే ఒక ప్రశ్న భగవాన్ అనేకమైనటువంటి కొండలు అనేకమైన చల్లని ప్రదేశాలు ఉన్నాయి కదా భారతదేశంలో దక్షిణాపథంలో కూడా ఉన్నాయి కదా మీరు ఇంత భంగారకంగా ఉండేటువంటి అంటే మార్స్ చాలా వేడిగా ఉండేటువంటి అరుణాచలాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగారు దానికి వారు సమాధానం ఏమిచ్చారంటే నేను ఎన్నుకున్నానా ఎంచుకోగలనా ఏదో ఒక శక్తి నన్ను అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చింది తప్ప పైకి తీసుకెళ్ళింది కిందకి దింపింది పాతాళంలో కూర్చోబెట్టింది నా ప్రమేయం లేకుండా నా జీవితంలో ఇవన్నీ జరిగిపోయినాయి అని అంటే అదే అంటున్నా అరుణాచలం అని ఇంకేదైనా ప్రశస్తి ఉన్నదా అని అడిగారు. ఆ ఎందుకు లేదు ఎంతో మంది ఇక్కడికొచ్చి భవాన చేసుకుని ఇక్కడ అరుణ ప్రభావాన్ని పొందుకుని ముక్తులైన వాళ్ళున్నారు అని పక్కనే ఒక కవర్ ఉంటే ఎవరో ఉత్తరం రాశారా ఉత్తరానికి ఒక కవర్ ఉంది ఆ కవర్ ని నెమ్మదిగా చింపి expand చేసి అక్కడ ఒక పిచ్చుక అరుణాచలం బొమ్మ ఒకటి గీశారు భగవాన్. గీసి దాన్ని వదిలిపెట్టలా కింద రాశారు స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచల నిధి అని రాశారు. అప్పుడు గణపతి ముని అడిగినటువంటి ఆశ్చర్యపడ్డది ఏమిటంటే మీకు తెలుగు వచ్చును ఇంత బాగా వచ్చునా నాకు తెలియదే అని అనుకున్నారు భగవాన్ అప్పుడన్నారు మీరు అనుకున్నది నేను నాకు తెలిసినది భిన్నం కావచ్చు కదా తెలిసేదాకా రెండుగా ఉంటాయి తెలిసిన తర్వాత అంతా ఒకటే మరి ఆ పరముక్తి అంటే It is an internal liberation అది అరుణాచల శివ నిజానికి శివ కూడా అనక్కర్ల అరుణాచల అనేటువంటిది పంచాక్షరి కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి ఒక బొమ్మని drawing line drawing ని దాని కింద ఈ శ్లోకాన్ని ఈ లోకానికి అందించటానికి కారణము ప్రేరణము అయినవారంటే మళ్ళీ కావ్యకంఠ గణపతి ముని. ఇక ఆ తర్వాత మళ్ళీ జీవుడికి ప్రారబ్ధం తప్పదు కదా అరుణాచలం నుంచి సిరిసి వెళ్ళినప్పుడు ఒక ఆవేశంలో భక్తి ఆవేశంలో దేశభక్తికి సంబంధించిన ఆవేశంలో నా కవితా గానంతో భారతదేశానికి స్వాతంత్ర సిద్ధి కోసం ప్రయత్నం చేస్తానని అనుకుంటూనే అప్పటికే యోగనిద్రా ముద్రాంకితమైనటువంటి ఒక భావనా స్థితిలోసంచారం చేస్తున్నటువంటి కావ్యకంఠులకి యోగము కరతలామలకమైపోయింది. మూలాధార క్షేత్రం నుంచి సహస్రార క్షేత్రంలోకి వెళ్ళటం స్వయంసిద్ధులు గనుక కపాల భేదనం ఎలా చేయాలో, అది ఎప్పుడు చేయాలో, ఎప్పుడు జరుగుతుందో, ఊహ తెలిసి స్ప్రుహలో ఉండి ఎలా జరుగుతుందో తెలిసినటువంటి యోగాత్మ ఎవరు అంటే కావ్యకంఠ గణపతి ముని. మరి ఆయన మీద రమణుల ప్రభావం, వాఙ్మయ ప్రభావం ఉన్నదా? వ్యక్తిగత జీవితం మీద ప్రభావం ఉన్నదా? ఆయన ఆలోచనలను ప్రభావితం చేసిందా అంటే ప్రభావితం చేసింది, ప్రభావితం-- ప్రభావితం కాకుండా ఉండేట్లుగా ఎక్కడికక్కడ గణపతి మునికి స్మ-- సవరణ చేస్తూ వెళ్లారు. సవరణ అంటే వారన్నారు కదా "అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలింపు అరుణాచలా" దేహం, కోహం, నాహం, సోహం అని కదా క్రమం. ఆ దేహం దగ్గర మనస్సు దగ్గర ఎప్పుడైతే గణపతి ముని ఆ కవితాధారలో ఆగిపోయారో, పోయే సం-సందర్భాలు వచ్చినయో మిగతా విజయాలన్నీ పక్కనే ఉన్నాయి కానీ అప్పుడప్పుడు మనస్సు ప్రాపంచిక మనస్సుగా మారుతున్నప్పుడల్లా భగవానుని యొక్క దివ్య అనుగ్రహం గణపతి మునిని జీవన్ముక్తుడ్ని చేసింది. ముందు ముక్తజీవుడ్ని చేసింది. ఆ తర్వాత జీవన్ముక్తుడై తన యోగాభ్యాసం వలన యోగవిద్యని కరతలామలకం చేసుకున్న కారణంగా కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని ఇవాళ ఒక చారిత్రక మహా తపస్విగా భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఆయన పుటని అంటే ఆయన పేజీని ఆయన నిలబెట్టుకున్నారు. ఇది గణపతి ముని మీద రమణ మహర్షి యొక్క దివ్య ప్రభావం. దీన్ని మనం మరవకూడదు. ఎందుకంటే ఉమాసాహస్రం చేసిన, ఇంద్రాణి సప్తశతి రాసిన, ఏది రాసిన, ఏది చేసిన అంతరంగంలో అంటే లోక లోకాంతర ప్రాణాలలో మిగిలి ఉన్నటువంటి సద్గురువు ఎవరు అంటే గణపతి మునికి ముందు గురువులు ఎవరూ లేరు. ఒక ఆధ్యాత్మిక గురువు ఏర్పడి కొంత ప్రయాణం చేసిన తర్వాత ఆ గురువు భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ఉండిపోయింది. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ఆ Paradigm shift అంటారు ఇవాళ ఇంగ్లీషులో. అంటే ఊహాతీతమైనటువంటి ఒక మలుపు. ఆ మలుపు twist with the divinity అది destiny కాదు. ఆ divinity తో వారు సజీవంగా, హాయిగా, ప్రసన్నంగా జీవితాన్ని కొనసాగించారు. ఇక రెండవది రామదాస్. ఆయన రామనామం తప్ప ఏదీ చేసేవాడు కాదు. ఆయన అరుణాచలానికి వచ్చారు. వచ్చి భగవాన్ దగ్గర కూడా రామనామమే చేసుకున్నారు. అయితే ఆయనకు ఓ రోజు "అవును ఈ రామనామం చేసినందువల్ల నాకేమిటి ప్రభావం? రోజు కొన్ని కోట్లు, లక్షలు చేసుకుంటున్నాను నాకింకేం తెలీదు. మరి వీరి దగ్గరికి వచ్చాను. వీరిని ఒక్కసారి అడుగుతాను. ఆ ప్రభావం నా మీద అసలు ఉందో లేదో తెలియదు, నేనైతే చదువుకుంటూ పోతున్నాను. జపంగా మారిపోయింది, తర్వాత అజపం అయిపోయింది." అని అన్ని ప్రశ్నలతో ఎదురుగా కూర్చున్నారు. కూర్చుంటే భగవాన్ ఆయన వైపు చూశారు, అంతే. అప్పుడు ధైర్యం చేసి లేచి నిల్చొని ఇప్పుడు మనం అనుకున్న ప్రశ్నలన్నీ భగవాన్ ముందు పోస్తే "ప్రభావం లేదు అని మీరెందుకు అనుకుంటున్నారు? ఏ రాముడిని గురించి మీరు తలచుకుంటూ జీవితం గడిపారో ఆ రామనామ మహిమే మమ్మల్ని అరుణాచలానికి తీసుకుని వచ్చింది." అని మౌనం వహించారు. అంటే అరుణాచలానికి వెళ్ళటానికి దారులు ఎన్నో, ఆలోచనలు ఎన్నో, ప్రణాళికలు ఎన్నో, ఎన్ని ఎన్ని భిన్న భిన్నంగా బయట కనిపించినా గురువు యొక్క అనుగ్రహం it is a pull లాగుతుంది అది. అందుకే భగవాన్ మన బోటి వారందరికీ కూడా చెప్పారు. ఎట్లా ఉంటుంది అంటే ఒక జ్ఞాని యొక్క ఆలోచన, జ్ఞాని ఒక పులి అనుకున్నట్లయితే పులి నోట ఒక మాంసపు కండ గనక పడ్డట్లయితే అది జీర్ణమయ్యే దాకా పులి ఎట్లా వదిలిపెట్టదో ఒక గురువు యొక్క ఆవరణంలోకి వెళ్ళినప్పుడు ఆ మనస్సు గురువు యొక్క మనసుతో లీనమైపోతుంది. కాబట్టి అందుకనే అరుణాచలానికి వచ్చినప్పుడు అరుణాచల లింగాన్ని ఆలింగనం చేసుకున్న భగవాన్ ఒక్కమాటన్నారు, "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను. ఇకపై అంతా నీ ఇష్టం." ఆ నీ ఇష్టం చాలా కష్టం. ఎందుకంటే మనం surrender అయిపోయాం, శరణాగతి పొందాం, చాలా సాధించామనుకుంటాం. మనం మన చేతిలోనే తాడు ఉంది, మేక మెడలో తాడు అక్కడే ఉంది. మనం కునుకు తీసినా ఆ తాడు మన చేతిలోనే ఉన్నందువలన ఆ మేక తప్పించుకోలేదని ఒక పామరుడికి ఎట్లా తెలుసో అన్నీ తెలుసనుకున్న మనం కూడా మనల్ని మనం మోసం చేసుకుంటాం. శరణాగతి చెందామంటాం, చెందము. ప్రపంచానికి మనస్సునిచ్చి ఉంచుతాం. అప్పుడప్పుడూ భగవాన్ వైపు చూస్తాం. అప్పుడప్పుడు భగవాన్ ఏం చెప్పారు, ఆహా! బాగా చెప్పారు అనుకుంటాం. అది ఒక, ఒక రకమైనటువంటి ప్రభావం. కాబట్టి రామదాసు అలా అయినాడు. తర్వాత మౌనస్వామి. మౌనస్వామి ఆంధ్రుడు. ఆయన పేరు మౌనస్వామి కాదు. ఆయన తెనాలి ప్రాంతంలో, బాపట్ల ప్రాంతంలో తిరిగినటువంటి ఒక అవధూత. అయితే ఆయన కాలజ్ఞాని. కాలజ్ఞానం ఏముంది, రేపు ఏం జరుగుతుందో చెప్పగలం. ప్రయోజనం ఏమన్నా ఉందా? దాన్ని ఆపగలం? ఆపలేం. ఆపగలమా అంటే ఆపలేం. కాదు ఇంతకంటే బాగా చేద్దామా అంటే మనం చేయలేం. మరి ఆ కాలజ్ఞానం, కాలం తెలిసి ఏం ప్రయోజనం? కాలానికి అనుగుణంగా co current గా మన జీవితాన్ని మనం సాగించాలి గనుక మౌనస్వామి కూడా అరుణాచలానికి వెళ్లేదాకా ఆ పేరు అది కాదు. అక్కడికి వెళ్ళాక అనుకున్నాడు, ఏమిటీ మాటలు! ఎన్నిసార్లు చెప్పను, ఎంతమందికి చెప్పను, ఇది ఆగదా? ఇది నాకొక ప్రారబ్ధమా? అనుకున్నటువంటి వాడు అరుణాచలానికి వెళ్లి భగవాన్ దర్శనం తర్వాత నేను మౌనంలోకి వెళ్లిపోతాను because silence is eloquence.అది ఒక అమృత భాష దానికి లిపి లేదు దానికి ఏ రకమైనటువంటిది లేదు మరి ఏమున్నదయ్యా అంటే మాటలు మలగుతాయి మౌనం వెలుగుతుంది మలగటం అంటే ఆరిపోవటం మాట ఆరితే ఆగితే తప్ప మౌనం అంత తేలికగా వెలగదు ఒకవేళ వెలిగినా అది కష్ట మౌనంగా తర్వాత వాచా మౌనంగా ఏదో గురువారం నాడు మాట్లాడను మంగళవారం అసలు ఎవరితో పలకరించను నేను పలకరించను పలక మీద రాస్తా ఇట్లా కాదు కదా అసలు మాటే లేని ఒకానొక స్థితికి వెళ్లగలగాలి అది నిజానికి మాటలు మలిగినప్పుడు మనస్సు లీనమవుతుంది మనస్సు లీనమైనప్పుడు మనస్సు లయమవుతుంది ఆ తర్వాతే మౌన ఆశ్రయం అవుతుంది భగవాన్ లీనము ఆ దాని యందు కూడి ఉండటం దానితో లయించటం కడగా మన మనస్సు నశించిపోవాలి మరి మనస్సు నశించిన తర్వాత మానవుడికి మనుగడ లేదేంటే అసలు జీవితం అంతా మనస్సు నశించిన తర్వాతే మిగతాదంతా ప్రపంచం చెప్పినట్లు మనం మనం చెప్పినట్లు ప్రపంచం నడుస్తుంది ఇది ద్వంద్వాతీతం కాదు ద్వంద్వంలో మాత్రమే ఉంటుంది కనుక తీవ్ర ప్రభావాన్ని పొందినటువంటి వారు మౌనస్వామి ఆ మౌనస్వామి కృత్తాలలో పీఠం పెట్టి కృత్తాల పీఠాధిపతియై సిద్ధేశ్వర ఆ స్వామి ఈవేళ సిద్ధేశ్వరా నంద భారతి ఇట్లా వరుసగా చాలామంది అక్కడ కూడా గురు పరంపర ఏర్పడితి ఆ పరంపరానుగతమైనటువంటి ఒక స్థాయిని ఒక స్థితిని కల్పించినటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి అది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ప్రభావం అలాగే సంఘ సంస్కర్త సంస్కరణ వాది నిజానికి హేతువాది అయినటువంటి నారాయణ గురువు నారాయణ గురువు దేవుడిని నమ్మల్ నమ్మలేదు మానవుడిని మించిన వాడు మరొకడు లేడని గట్టిగా నమ్మిన వాడు సమాజాన్ని ఆరోగ్యవంతంగా నడిపిన వాడు అనేక ఆలోచనలు పంచిన వాడు సంస్కర్త తర్వాత అన్నింటికంటే కూడా ఎవరి యందు ద్వేషం లేనటువంటి తన భావాలు కానీ ఆయనకు ఒకరోజున ఒక కోరిక కలిగింది భగవాన్ ని చూసి రావాలి ఎవరు ఈ రమణ మహర్షి అంటూ వెళ్లారు ఐదు రోజులు అరుణాచలంలో ఉన్నారు భగవాన్ ఉలకలేదు పలకలేదు మరి అప్పటికే నారాయణ గురువు చాలా ప్రసిద్ధుడు ఆయనతో పాటు నలభై మంది శిష్యులు వచ్చారు వాళ్ళు ఏమన్నారంటే ఆయనేం మాట్లాడటం లేదు కదా మన దారిలో మనం ఇంటికి వెళ్లిపోదాం పాకెట్లోకి వచ్చినా పలకరించటం లేదు ఆయన అని అంటే ఆయన ఒక్క మాట చెప్పారు ఆయన పలకరించాలి మాట్లాడాలి అని నేను అనుకోలేదు వారిని చూడాలి అనుకున్నాను చూశాను అని ఒక ఐదు శ్లోకాలు రాసి అక్కడ కాగితం పెట్టి వెళ్లిపోయారు అప్పటికి భగవాన్ మాట్లాడలా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత కుంజ స్వామిని పిలిచి కుంకుమ విభూతి రెండు పొట్లాలు చేతిపై చేతికిచ్చి ఇది నారాయణ గురువుకి ఇచ్చి రమ్మని పంపించారు కుంజ స్వామి వెళ్ళాడు వెళ్తే ఆయన మరణ శయ్య మీద ఉన్నారు ఆయనకెలా తెలిసింది కుంజ స్వామి వస్తాడని అంటే అప్పటికి తనకున్నటువంటి మానవీయ భావాలను దాటి మానవీయ మూర్తిగా తనలో వెలుగుని తాను చూసుకోవటం మొదలు పెట్టారు అప్పుడు ఒక్క మాటన్నారు భగవంతుడు నాకోసం ఈ ప్రసాదం పంపారా అని కుంకుమని విభూతిని తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే వారు దేహం చాలించారు అంటే గురువు అనుగ్రహానికి బరా మీటర్స్ లేవు అది ఇట్లా జరిగితే ఉన్నట్లు అట్లా జరగకపోతే లేనట్లు కాదు గురువు అనుగ్రహం ఎప్పుడూ ఒక్కలాగానే ఉంటుంది భగవాన్ కేవలం గురువు కాదు ఆయన సద్గురువు సద్గురు రమణులు ఆయన కాబట్టి ఒక్కసారి వచ్చినప్పుడు అంటే ఆ నారాయణ గురువుకి మాటలు చెప్పడం లేదు ఆయన చేతల వాడు కాబట్టి ఆయనతో భగవాన్ మాట్లాడి ఆ వృధా చేయదలుచుకోలేదు లేదు నీ మార్గం మార్చుకో ఇదిగో ఈ మంత్రం చదువుకో ఇంకా బాగా పైకి ఇవేమీ చెప్పలేదు భగవాన్ జీవితంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా మధ్య పెట్టలేదు ఏ ఒక్క వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని ఖండించలేదు ఎక్కడైనా చెప్పాలి అనుకుంటే రెండు మాటలు చెప్పేవారు దాంతో ప్రభావితం అయ్యేవారు ఇది ఈ వ్యక్తుల పేర్లు వీళ్ళని ఎందుకు చెప్తున్నాం అంటే వీళ్ళంతా ఐడెంటిఫై అవుతారు మనం కూడా ప్రభావితం అయినాం కానీ అవన్నీ ఇప్పుడు మనం చెప్పకూడదు మనం దేహం చాలించిన తర్వాత లోకం చెప్పుకుంటుంది దాన్ని కాలానికి వదిలేస్తాం ఇదొకటి భగవాన్ మహర్షి దగ్గరికి రాధాకృష్ణన్ వచ్చారు నాలుగు రోజులు కూర్చున్నాడు కూర్చున్న తర్వాత నాలుగవ రోజు ఆయన కూడా భగవాన్ మాట్లాడాలని అనుకోలేదు వచ్చారు దండం పెట్టి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూర్చుని నాలుగు రోజులు అయిపోయింది ఆయన దండం పెట్టుకొని వెళ్ళిపోయారు గేటు దాటుతున్నారు అప్పుడే ఒకతను ఒక ప్రశ్న వేశారు ఏంటి ఆ ప్రశ్న అంటే భగవాన్ అసలు మాయ అంటే ఏమిటి అది కొద్దిగా మాకు చెప్పండి అని మాయ అంటే ఏం లేదప్పా ఇప్పటిదాకా అందరూ ఇక్కడ ఉన్నారు అరుగో వారు వచ్చి వెళ్ళిపోతున్నారే ఇక్కడ అన్నీ వదిలిపెట్టి వారి వెనక వెళ్లారే దాని పేరే మాయ అన్నాను అంటే మనకి సంపద పదవి హోదా ప్రపంచంలో పాపులారిటీ ఇవన్నీ ఉన్నవాడి వెనక వెళ్తాం మరి ఇవేమీ భగవాన్ కోరుకోలే ప్రపంచం ఆయన్ని కోరుకుంది ఆయన ప్రపంచాన్ని కోరుకోనే లే కాబట్టి ఇటువంటి మాయ ఇటువంటి వాటిని ఆ రోజున బహుశా అక్కడ ఉన్నటువంటి ఒక వంద మంది మీద ఈ ఒక్క మాయ అనేటువంటి దాని మీద ప్రభావితం అయి ఉండాలి అవ్వకపోతే అది వాళ్ళ ప్రారబ్ధం కానీ భగవాన్ అట్లా ఇండైరెక్టుగా అపరోక్షంగా ఒక అద్భుతమైనటువంటి ప్రభావాన్ని చూపించేవారు ఇకనిరంజనానంద స్వామి. ఆయన చరిత్ర మనందరికీ తెలుసు. ఆయన ధర్మాధికారి, సర్వాధికారి. ఆ, ఆయన ఆశ్రమానికి చెందిన ఒక రాగి విల్ల కూడా తీసుకోకుండా ప్రతి దానికి account maintain చేసి ఆశ్రమంలో ఏ రకమైన, ఆ, పరస్పర విరుద్ధ భావజాలాలు లేకుండా తన జీవితాన్ని తాను భగవాన్ కి సమర్పించుకున్నారు. ఎలా వచ్చారు administration లో ఎలా ఉండాలో అలాగే ఉండేవారు ఆయన. ఎవరు? నిరంజనానంద స్వామి. ఏనాడూ భగవాన్ మా అన్నగారని ఎన్నడూ ఆయన అనుకోలేదు. అనుకోకుండా ఆయన జీవితం సాగించాడు. ఇవన్నీ ఒక ఎత్తయితే తల్లి అడగమ్మ వచ్చింది భగవాన్ దగ్గరికి. ప్రభావం అంటే ఎట్లా ఉంటుందంటే ఆమె కన్నీరు మున్నీరైంది. ఏడెనిమిది రోజులు భగవాన్ దగ్గర కూర్చుంది, ఏడుస్తున్నది. "ఏం ఈ మిగతా వాళ్ళందరికీ పెట్టానంటే నీకో ముద్ద పెట్టలేనా? ఇల్లు వదిలిపెట్టి వచ్చావ్. ఈ అరణ్యం ఏమిటి? కీకారణ్యం ఏమిటి? ఈ మనుషులు ఏమిటి? ఇదంతా ఏమిటి? పదా మనం వెనక్కి వెళ్ళిపోదాం." అంటే ఉలకలేదు పలకలేదు. అప్పుడే భక్తులకి ఆమె మహర్షి తల్లి అని తెలిసి "భగవాన్! ఆమె రోదిస్తున్నది. మీరు ఏదైనా ఆమెకి సందేశం ఇవ్వండి. ఒకసారి మాట్లాడండి." అంటే అప్పుడు పలక మీద రాశారు. ఏం రాశారంటే "కర్త జీవుడి ప్రారబ్ధాన్ని బట్టి ఆడిస్తూ ఉంటాడు. మనం ఇది జరగాలి అనుకున్నప్పుడు అది జరగదు, జరగకూడదు అనుకున్నప్పుడు నువ్వు ఎంత నిరోధించినా అది జరగక మానదు. కనుక మౌనం వహించుటయే ఉత్తమము." ఇది మాతృ సందేశం. తల్లికి ఇచ్చిన సందేశం. అది ఇవాళ ఈ జగత్తులో ఉన్న నూ-- నూట నలభై ఏడు కోట్ల భారతీయులకి, ప్రపంచంలో ఉన్న ప్రతి వాడికి apply చేయవలసిన సందేశం. అప్పుడు మరి అడగమ్మ ఏం చేయాలి? ఆయన్ని తీసుకుని వెళ్ళటానికి వచ్చిన అడగమ్మ తల్లి ఆశ్రమంలో ఉండిపోయింది. అయితే ఆమెకు కొన్ని నియమాలు ఉండేవి. ఆ నియమాల్లో ఒకటి ఏంటంటే ఉల్లిపాయ తినకూడదు అని. ప్రభావం అంటే ఎలా ఉంటుందో చూడండి. చిన్నది కావచ్చు. ఎప్పుడైనా ఏదైనా ఉల్లిపాయతో చేస్తే ఆమె రుధిర్ వచ్చేసేది కాదు. సరే, భగవాన్ మరి చెప్పాలి కదా! ఆమెను కాపాడుకోవాలి. అక్కడ ప్రభావం చూపించాలి. ఒకరోజు భగవాన్ స్వయంగా వంటశాలలోకి వెళ్లి కూర్చుని ఓ చిన్న ఉల్లిపాయని చేతిలోకి తీసుకుని, "ఓ ఉల్లిపాయా! నువ్వు మా అమ్మ మోక్షం-- మోక్షానికి వెళ్లే దారిలో చాలా అడ్డంగా ఉన్నావు కదా! చూడు పైన ఎండిపోయినటువంటి నీ పైన ఉండేటువంటి ఆకులన్నీ తీసేస్తాము. తర్వాత చాలా దళసరి ఉంటాయి ఆకులుంటాయి. ఇంకాస్త వెళితే కొద్దిగా పలచటివి ఉంటాయి. వెళ్ళగా వెళ్ళగా ఆ ఉల్లిపాయ యొక్క central point లో కేంద్ర స్థానంలో లోలోపల ఉండే చిన్న పిండ లాగా ఉంటుంది. దానికి రంగు, రుచి, వాసన ఏం ఉండదు. ఒక రంగు మాత్రం తెల్లగా ఉంటుంది. మరి దేహం కూడా అంతే కదా! epicarp, endocarp అని ఇట్లా ఉన్నాయి పొరలు పొరలు పొరలు దాటగా స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ దాటిపోతే ఆత్మ ఉంటున్నది కదా! ఉల్లిపాయ లోపల ఉన్న ఆత్మ ఏ రకమైన వాసనలే-- వాసనారహితంగా ఉన్నది కదా! మనం లోపలికి వెళ్ళకుండా పై పైన చూస్తే ఎట్లాగో ఉల్లిపాయ. మా అమ్మని ఈ భావం నుంచి నూ రక్షించు." అని పరోక్షంగా ప్రత్యక్షంగా ఆమె పక్కనే కూర్చుని ఈ మాటలు భగవాన్ చెప్పారు. ఇక ఆ తర్వాత ఆ dogma వదిలిపోయింది. ఆమెకు కూడా ఆ ఉల్లిపాయ వల్ల ఏదో అవుతుందని. అంటే అతి, ఆ, ప్రాథమిక స్థాయి నుంచి జితేంద్రియ స్థాయికి వెళ్ళిన జీవుడికి కూడా రమణుల ప్రభావం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఇవాళ మరణం అంటే మార్పుయే అని భగవద్గీత చెప్పింది. అది కృష్ణ పరమాత్మ చెప్పాడు. మహర్షి దానిని నిజం చేశారు. He demonstrated. ఆయన అన్నారు "అరుణాచలానికి రాకముందు నాకు అనేక మరణానుభూతులు కలిగినాయి." మరణానుభవం కాదది. అందరూ మహర్షి అనుభవ-అనుభవ-- అనుభూతి కలిగింది. అలాగే అరుణాచలం వచ్చిన తర్వాత కూడా బ్రాహ్మణ బాలకుడిగా, మౌనస్వామిగా అరుణాచల శిఖరం మీద పైన నేను తిరుగుతున్నప్పుడు ఇలాంటి సందర్భాలు చాలా ఏర్పడ్డాయి. కానీ ప్రపంచంలోకి వచ్చినప్పుడు కర్మ, ప్రారబ్ధాలు రెండూ అనుభవించవలసి ఉన్నది గనుక "వాటిని జరగనివ్వండి. ఎలా జరుగుతాయో జరుగుతాయి. వాటితో మనకేమి పని?" అన్నారు. ఈ మనకేమి పని అన్నటువంటి వాళ్ళు ఇవాళ బయట పడరు గాని భగవాన్ ప్రభావానికి లోను కానివాడు లేడు. ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే మరణానికి భయపడం, కష్టానికి భయపడం, సుఖానికి లొంగిపోం, కుంగేది లేదు, పొంగేది లేదు, లొంగేది లేదు, ఎక్కడా ఒంగేది లేదు. అంటే మనం మనంగా నిలకడ చెందేటువంటి ఒక దివ్య భావనా గరిమని అనుగ్రహించినటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. [అసంపూర్ణ వాక్యం] వాళ్ళిందరూ MP పండిట్లు వచ్చేవాళ్ళు అరవింద ఆశ్రమం నుంచి. వచ్చినప్పుడు ఆయన ప్రభావం మళ్ళీ గణపతి ముని మీదే. ఎందుకంటే అందరికీ తెలుసు గనుక. గణపతి ముని ఒకసారి అరవింద ఆశ్రమానికి వెళ్ళాడు. The Mother ఉంది అప్పుడు ఆ time లో. ఆమె అన్నది "మనమిద్దరం కూడా ధ్యానంలో కూర్చుందాము. ధ్యానము ఎంత వేగంగా జరుగుతుందో చూసుకోవాలని ఉన్నది." అని. అలాగే అన్నారు గణపతి ముని.గణపతి ముని, ది మదర్ ఎదురెదురుగా కూర్చున్నారు. ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి ఇద్దరూ. గణపతి ముని less than one second ఒక నిమిషమాత్రంలో highest స్థాయికి వెళ్ళిపోయారు. ఆమె ఇంకా నే-నేలకని చెందాలి, నిబ్బరంగా ఉండాలి, నిగ్రహంగా ఉండాలి, మెట్టెక్కాలి జరుగుతున్నది. అప్పుడు ఆమె ఏమడిగిందంటే, "మీరు అరవింద ఆశ్రమంలో ఉండిపోరాదా, ఏమిటసలు ఈ స్థితి ఇంత తొందరగా ధ్యానంలో అత్యుత్తమ స్థాయికి ఎలా వెళ్ళిపోయినారు?" "బ్రహ్మైవాస్మితి సద్వృత్యా నిరాలంబ్యతా స్థితిః ధ్యాన శబ్దేన విఖ్యాతా పరమానందదాయిని" అని శంకరులు చెప్పలేదా? అదే జరిగింది అని గణపతి ముని సంస్కృతంలో ఈ శ్లోకం చెప్పినప్పుడు ఆమె మళ్ళీ ఏమడిగిందంటే, "రమణాశ్రమాన్ని వదిలిపెట్టి అరవింద ఆశ్రమానికి మీరు రండి ఇది మా కోరిక" అంటే గణపతి ముని ఒక్కమాట అన్నారు. అది ప్రతి భక్తుడు నేర్చుకోవాలి. ఆయనన్నారు "రమణ గురు సన్నిధిని వదిలి, రమణాశ్రమాన్ని వదిలి, రమణుల భావనా ఆవరణంలో నుంచి బయటకు వచ్చే ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే నాకు తొలి గురువు ఆయనే, మలి గురువు ఆయనే, అంత్యంగా గురువు ఆయనే. కనుక ఆ ప్రభావం అని అనకుండా ఇంత అవకాశం వచ్చిన ఆయన రమణాశ్రమాన్ని వదిలిపెట్టలా." ఇది ప్రభావం. తర్వాత వ్యక్తులుగా పేర్లు చెప్పను గాని, పెద్దవాళ్ళ పేర్లు పక్కన ఇంకా చాలామంది ఉన్నారు. మనకున్న సమయంలో చాలా స్వల్పమైన ఆహారం తీసుకోవటం. భగవాన్ చెప్పినట్లుగా second help అక్కర్లేదు. ఒక మనిషి శరీరానికి కొద్ది కొన్ని ముద్దలు చాలు. అక్కర్లేనిది తినక్కర్లేదు. ఇదొకటి. సాత్వికాహారం ఒకటి. అలాగే మనకి జీవితం అంటే ఆ స్పష్టత ఏమిటో చెప్పడానికి భగవాన్ ఓ రోజు Arthur Osborn పక్కనే కూర్చుని ఉన్నాడు భోజనశాలలో, భోజనం జరుగుతున్నది. జరుగుతూ ఉంటే అరిటాకు, అరిటాకులో ఆ భోజనం జరుగుతుంది. ఆయన అడిగారు, "ఈ నేను కాదు, మేను కాదు, దేహం కాదు అంటున్నారు కదా భగవాన్, అది ఏమిటిది?" అని అడిగితే వారన్నారు. అన్నంతే భోజనం అయిపోయింది. విస్తరాకు కడిగి పెట్టుకోపోయినాడు ఆయన. భగవాన్ అన్నారు "ఎందుకు దాన్ని ఎందుకు పడేస్తున్నారు?" అన్నారు. "భోజనం చేయటం అయిపోయింది కదా, ఎంగిలి ఆకు కదా" అన్నారు. "ఈ దేహం కూడా పులి విస్తరాకు వంటిది. భోజనానంతరం విసిరివేయబడవలసినటువంటి దేహం ఇది. దీనికి ఎన్ని ఉంటాయి అపేక్షలు, ఉపేక్షలు, ఆనందాలు, దుఃఖాలు, సుఖాలు. జీవితం కదా, ఇవన్నీ ఏర్పడుతూనే ఉంటాయి. ఎక్కడికక్కడ ఒక ఆనందాన్ని, ఎక్కడికక్కడ సంతృప్తిని, ఎక్కడికక్కడ కష్టాన్ని ఎదుర్కోగలిగిన ధీశక్తిని ఉం-ఉంచుకోవాలి. మరి అన్నం తిన్నటువంటి విస్తరాకు మీరు పడేస్తున్నట్లే దేహం-దేహాన్ని బయ-బయట పడేయడమే కాదు, దేహాత్మ భావనను దాటాలి. ఈ దేహం ఉండదని, దీనికి కొంత పరిమితి ఉందని, శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆయుష్షు ఉందని, ఆ ఆయుష్షు కులిపోయినప్పుడు కన్ను కనపడదు. కంటికంతే ఆయుస్సు ఉంది. చెవి వినపడదు, చెవికంతే ఆయుస్సు ఉంది. మనిషి మొత్తానికి కలిపితే ఒక ఆయుస్సు ఉంది. దాన్ని ముగించినట్లయితే దాని పేరు మరణం. దాని పేరే మార్పు." అని ఆ పాశ్చాత్యుడికి బోధన చేసి భగవాన్ చాలా అద్భుతంగా ఆ ప్రభావితం చేశారాయన. ఆ తర్వాత వచ్చినటువంటి foreigners అందరికీ కూడా భగవాన్ సూచించిన మార్గం వల్ల ఆ మద [స్పీకర్ 1 నిశబ్దం] సజ్జన దాన్ని తినటమే అంటున్నారు భగవాన్. దానికి మళ్ళీ మీకు కావలసిన రుచితో తింటున్నారే, ఇదెంత అవసరమా, ప్రపంచంలో ఎన్ని లేవు తినటానికి. అంటూ ఒక సత్ విత్తాహార యుక్తాహార విహారస్య ఏం తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో అదే చేయాలి. అది దేనికి తినాలో తెలిసి తినాలి. ఏది పెట్టినా తినకూడదు. అందువలన అధ్యాత్మ సాధనలో భోజనం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. వీటన్నింటినీ కూడా ప్రపంచం మొత్తం మీద ఇవాళ చూడండి, ఆ ఈ-ఈ ప్రభావం ఏమిటంటే మౌనం వహించటం, తృప్తిగా జీవించగలగటం. వీటన్నింటినీ గనక గమనించినట్లయితే ఆ భగవాన్ ప్రభావం గురించి ఓ ముప్పై నిమిషాల్లో, ఇరవై నిమిషాల్లో ముగించే వస్తువు కాదిది. మళ్ళీ కలుసుకున్నప్పుడు మళ్ళీ అనేక విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం. మీ అందరూ ముఖ్యంగా ల-లావంగా రావు గారు. ఆ వయస్సు ఏమిటి, ఆ తపన ఏమిటి, భగవాన్ పట్ల ఆయనకున్న భక్తి ఏమిటి, ఆ commitment ఏమిటి, వెంబడిపడి ఎలాగైనా ఈ Zoom meeting లు జరపాలనేటువంటి ఒక ఉత్సాహం ఏమిటి, వీటిని గమనించినప్పుడు రమణుల ప్రభావం ఆయన మీద లేకపోతే చాలు, చాల వయస్సు వచ్చేసింది కాళ్ళు జాపడుకుందాం అనుకునేవారు. కాబట్టి ఇవాళ ఈ వింటున్న వారందరి మీద కూడా రమణుల ప్రభావం తీవ్రంగా ఉన్నదని నేను భావన చేస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ. మళ్ళీ కలుసుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి అనేక సంగతులున్నాయి. కనీసం ఏడు, ఎనిమిది సార్లు మనం కలుసుకుంటే తప్ప ఈ ప్రభావం అంటే ఏమిటి, అసలు ఆ ప్రభావం ఎందుకుండాలి, అవన్నీ తాత్విక విచారణా భూమికలో మనం మన పని కొనసాగిద్దాం. మళ్ళీ మరొక్కసారి భగవాన్ ఆ దివ్య పాదారవిందాలకి దివ్య మహాస్మృతికి ప్రాణజలి ఘటిస్తూ అరుణాచల శివ.
YouTube · audio
VSR - Influence of Bhagawan on Individuals
VSR - Influence of Bhagawan on Individuals
0:00 / 42:47
More in this series