Skip to content
Transcript తెలుగు
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన్మందారం వందే సాయి మహేశ్వరం తుర్యాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర జపాకవశత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయిశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పర్దాన్మే భారతీయ అధ్యాత్మ పరంపరకి ఆధ్యాత్మిక నిజగురు పరంపరకి మనసా వచసా శిరసా ప్రణమిల్లుతూ అధ్యాత్మ అంటే మరణానంతర సుఖం కాదు. వేద ప్రామాణికమైనటువంటి మాట ఇహ మీవా అన్నది. అంటే now and here ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడే ఇక్కడే అంటే జన్మలోనే అని అనుకోవాలి. ఎందుకంటే గతించిన జన్మలతో మనకు ఎట్టి సంబంధము లేదు, రాబోయే జన్మలను గురించి ఊహలు లేవు. ఒక అంచనా కూడా లేదు. కానీ ఏది వాస్తవం అంటే ఇప్పుడు జీవితాన్ని మనం గడుపుతున్నామో, ఎట్లా బతుకుతున్నామో, ఎట్లా ఆలోచిస్తున్నామో, కార్యకలాపాలు మన ధ్యా-- మన స్నేహ-- సంపద నిలుపుస్తున్నామో, ఇవన్నీ కూడా వర్తమానాన్ని ప్రతిబింబిస్తూ ఉంటాయి. దశలో కేవలం భారతదేశంలో మాత్రమే spiritual practice గురించి ఒక తీవ్రమైనటువంటి విచార ధార ఉంది మనకి. ఇవాళ కాదు, యుగయుగాలుగా. అధ్యాత్మ సాధన, దీని relevance, దీని అవసరం ఏమిటి అసలు? ఏమి? చక్కని సంసారం ఉంది, సంపాదన ఉంది, బంధుమిత్రులు ఉన్నారు, ప్రపంచంలో అమూల్యమైన కీర్తి ఉంది, ఇక్కడ లేనిదంటూ లేదు అన్ని సుఖాలు సౌఖ్యాలు అన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి. అయినా అధ్యాత్మ సాధన గురించి ఎందుకని ఆలోచన చేయాలి? ఇది ప్రశ్న. ప్రశ్నని మనం మూడు స్థాయిల్లో ఎప్పుడూ విచారణ చేయాలి. ఒకటి physical level భౌతిక స్థాయి, రెండవది metaphysical, మూడవది spiritual. అది విషయమైనా అంతే. కానీ ఇవాళ సాధన అంటే ఏమిటో ముందు తెలుసుకుని, తర్వాత సాధన ఎందుకు చేయాలో తెలుసుకుని, ఎట్లా చేస్తే మన లక్ష్యగమ్యాలని మనం నిర్దేశించుకున్న వాటిని సాధించగలమో తెలుసుకుని, వాటిని సాధించి, తద్వారా మనం అనుభవించేటువంటి ఒక ఆనందం, దాని యొక్క రుచి, దాని యొక్క స్థాయి, దాని స్థితి ఇవన్నీ కూడా మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి సాధన అంటే ఏమిటి అనగానే పాతంజలిక యోగశాస్త్రంలో ఉన్న అష్టాంగ యోగాలు, ధ్యానము, ధారణ ఇటువంటివన్నీ కూడా మన మనసుకు గుర్తుకువచ్చి, ఇది కాదేమో, ఇది అందుకోలేమో అని మనం ఆగిపోతాం. వాటన్నింటికంటే ముందు పూజలు, దానాలు, వ్రతాలు, లౌకిక సంబంధమైనటువంటి కార్యకలాపాలు, ఇవన్నీ కూడా ఎట్లాగూ ఉండనే ఉన్నాయి. ఇది భారతీయ జీవన విధానంలో ఒక చక్కని భాగం అది. సుందరమైన, సౌందర్య విలసితమైనటువంటి భాగం కాబట్టి దానిని గురించి కూడా కాస్త విచారణ చేయాలి. అంటే భౌతిక స్థాయిలో సాధన ఎలా చేయాలి? ఆంతరంగికమైనటువంటి స్థాయిలో ఎలా చేయాలి? కడగా మానసికంగా ఎలా చేయాలి? సాధన మూడు రకాలు కదా! మూడింట్లలో నూటికి తొంభై మంది ప్రాథమికమైనటువంటి స్థాయిలోనే తమ జీవితాన్ని సింహభాగం ఖర్చు పెడతారు. అంటే చక్కగా, శుచిగా, శుభ్రంగా ఉండటం, దీంట్లో దీపం వెలిగించుకోవటం, పరిసరాలు చక్కగా ఉంచుకోవటం, వీలైనప్పుడల్లా దేవాలయానికి వెళ్ళటం లేదా రోజూ దేవాలయానికి వెళ్ళటం, అక్కడ కొన్ని ప్రదక్షిణాలు చేయటం, అక్కడ కొన్ని పూజలు చేయటం, అర్చనలు చేయటం, ఆరాధన చేయటం, వేడుక చేయటం, జాతర చేయటం, ఊరేగింపు చేయటం, ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి physical levelలో సాగేటువంటి అనేకమైనటువంటి సాధనా కార్యక్రమాలు. సాధనలు కాస్త కొంత ముందుకు వెళ్ళిన తర్వాత స్థాయిలో ఒక [బాధాస్పద ధ్వని] దాంట్లో ఉండండి సరిపోతుంది. ధ్యానం చేయండి, చేయండి అని మనకి చెప్తున్నారు. మనం ధ్యానం చేస్తున్నాం అనుకుంటాం. నిజం ఏంటంటే ఇది ధ్యానం కాదు. ఏకాగ్రతతో కూర్చుని ఉండటమే ధ్యానం, అవశ్య స్థితికి వెళ్ళటం ధ్యానం. ఇదంతా కూడా మనం మర్చిపోయి, "నేను ధ్యానం చేసుకుంటున్నా" అని చెప్పి పక్కనుండండి అంటాం. అట్లాగే ఇంకొకరు వచ్చి యోగా చేయండి చాలా మంచిది, శరీరానికి, మనస్సుకి చాలా హాయినిస్తుంది అని వారు చెప్తారు. అది కూడా కొద్దిగా దైహిక స్థాయిని దాటినటువంటి ఒక స్థితే తప్ప అది పరిపూర్ణ స్థితి కాదు.ముందు 50% జనం సాధకులు అయితే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇవి చేస్తున్నారు అని ప్రశ్న. సాధనా మార్గంలోకి ఎందుకు వెళుతున్నా? నిజానికి ఇవే అనే మార్గాలు అనేకమైన మనసులలో వినపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానిని support చేస్తూ చెప్తూ వెళుతూ-- అక్కడేదో net problem ఉన్నట్టుంది సర్. ఏం మహేందర్? అక్కడేదో net problem ఉన్నట్టుంది. [గొంతు సవరించిన శబ్దం] గురువు గారు net problem గనుక ఉంటే, మా అయ్య మూర్తి గారు గురువు గారు ఒకవేళ net problem గనుక ఉంటే మీరు cell phone లో కూడా రావచ్చండి. ఇప్పుడు వచ్చారు ఇప్పుడు. అవును. కర్మానుభవాలన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మానవ జీవితానికి అవసరమా? అని ఒక ప్రశ్న వేసుకుని అక్కడి నుంచి మనం మొదలు పెడదాం. సాధన అనేక రీతులు బహుముఖీనమైనటువంటి స్థాయి అది. It is multifarious, multidimensional. multiple activities అన్నీ కూడా వాటి యందు ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే విచార ధారలో- విచార ధారలో ప్రాథమికమైనటువంటి ఒక సాధనా మార్గం ఏమిటి?- ప్రాథమికమైనటువంటి ఒక సాధనా మార్గం ఏమిటి?- అని అనుకున్నప్పుడు- ప్రాథమికమైనటువంటి ఒక సాధనా మార్గం ఏమిటి?- నిజానికి ప్రపంచంలో ఒక యాభై అరవై ఏళ్ళ క్రితం వెనక్కి వెళ్ళినట్లయితే పురాణ ప్రవచనం దానికి కాలక్షేపం అని పేరు పెట్టారు. దేవాలయానికి వెళ్ళటం రెండవది, దేవుణ్ణి చూసి రావటం రెండు. ప్రాపంచికమైన కామ్యసిద్ధుల కోసం దైవానికి ముడుపులు చెల్లించటం, కట్టడం లేదా ముక్కు ఆయనకు కోరుకుని ముక్కు చెల్లించి వెనక్కి రావటం తద్వారా లౌకిక భౌతికమైనటువంటి కామ్యసిద్ధుల లాభాన్ని పొందటం. ఇదంతా కూడా భౌతిక స్థాయిలో జరిగేటువంటి ఒక విచార ధార. అయితే ఇంతేనా? ఇది సరిపోతుందా? అంటే భారతీయమైనటువంటి తత్వ ధారలో విగ్రహారాధన ఒకటి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం హైందవంలో. మరి ఎందుకని విగ్రహారాధన చేయాలి? అని అన్నప్పుడు బ్రహ్మ సమాజ మతస్తులు లేదా అనుయాయులు ఒకప్పుడు అలాగే మిగిలినటువంటి మతాల వారు హైందవేతరులంతా కూడా విగ్రహారాధన వల్ల ప్రయోజనం లేదని చెప్తే, వైదికమైనటువంటి ఒక భావనలో విగ్రహారాధన దేనికి? నువ్వు ఎట్లా చేశావు? ఏమిటి? కాదు. ఏమి చేసినా కడగా దీని లాభం ఏమిటి? అని విచార చేస్తే, దీని ప్రయోజనం ఏమిటని ఒక విచారణ గనుక చేసినట్లయితే మనోనిగ్రహం కోసమే విగ్రహారాధన అని తెలుస్తుంది. మనం భగవంతుణ్ణి, ఆయన photo పెట్టుకుంటాం. photo లో భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం. ఆయనకి అర్చన చేస్తాం, చక్కగా అలంకారం చేస్తాం, ఆనంద పడతాం. ఆనందం అంతా భగవంతునిది కాదు మనది. ఆనందం ఎవరు అనుభవిస్తున్నారని కాస్త తీవ్రంగా విచారణ చేసినట్లయితే, ప్రాథమిక స్థాయిలో కూడా ఇంద్రియాలు ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. చేసిన చేతులు, చూస్తున్న కళ్ళు, భజన వింటున్నటువంటి చెవులు అంటే శ్రవణేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సర్వేంద్రియాలు ఇవన్నీ కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాయి. అయితే ఇది శాశ్వతమా? తాత్కాలికమా? ఇది కేవల తాత్కాలికమే. Transient and impermanent. మనోనిగ్రహం కోసం చేసేటువంటిది గనక అయినట్లయితే నెమ్మది నెమ్మదిగా విగ్రహం ముందు మనం కూర్చొని ఉన్నప్పుడు మనం ఆయన దానిలో భగవంతుని యొక్క స్వరూపాన్ని స్తోత్రం చేస్తూ ఆయన యొక్క నామాన్ని, గుణ, గాన వైభవాన్ని అట్లాగే అలంకారంలో నుంచి వచ్చేటువంటి ఒక సౌందర్య విలసితమైనటువంటి ఆనంద ప్రవాహాన్ని అన్నింటినీ కూడా ఇంద్రియాలు అనుభవిస్తూ మనస్సు ఒక పరిపాకం చెందే స్థాయికి వెళుతుంది. నిగ్రహింపబడుటనే కాదు ఒక ఉదాత్తమైన స్థాయికి వెళుతుంది. అధో స్థితిలో ఉన్నటువంటి ఒక మనస్సు అంటే ప్రాపంచికమైన మనస్సు, ప్రపంచ భావంతో కూడి ఉన్నటువంటి మనస్సు, ప్రపంచంలో మన చుట్టూ ఏర్పడి ఉన్నటువంటి వస్తువుల పట్ల లేదా వాటి వలన కలిగినటువంటి ఒక భావన-భావన నుంచి మనోభావనలోకి వెళ్ళటానికి ఒక అవకాశం ఇచ్చేటువంటి స్థాయిలో ఇంద్రియాలన్నీ కూడా ఒక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాయి. ఇది నిజానికి సాధనే. సాధనలో పూజ చేస్తాం, తర్వాత స్తోత్రం చదువుతాం. స్తోత్రం ఇంకా కంఠస్థం కానప్పుడు, నోట పట్టనప్పుడు దానిని ఉచ్ఛేశ్వరం తో చదువుతాం. చాలా హెచ్చు స్థాయిలో చదువుతాం. ఎంత హెచ్చు స్థాయిలో చదివితే అంత మంచిది ఆయనకి వినబడుతుంది అనుకుంటున్నాం. అది grasping అది కాదు. అదిప్రాథమికమైనటువంటి very-very lower level నెమ్మది నెమ్మదిగా మనకే ఒక అవగాహన కలిగినప్పుడు భగవంతునికి వినపడకపోవడం ఏంటి? అసలు అనిపిస్తున్నదే ఆయన కదా! అన్న ఒక ఆలోచన కలిగినప్పుడు దానిని మంద్ర స్థాయిలోకి తీసుకొని వస్తాం. మంద్ర స్థాయిలో ఒకే స్తోత్రాన్ని మళ్లీ చదువుతాం. అప్పుడు నేను చదువుతున్నాను అన్నటువంటి ఒక భావన సలసిపోయి నేను చదవగలుగుతున్నాను అనేటువంటి ఆలోచన కలుగుతుంది. చూసారా! ఇది పరిణామం. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత నోటికొచ్చింది, అలవాటైపోయింది, స్థితిలో ఉన్నా అనగలిగిన స్థాయి కూడా ఏర్పడింది అప్పుడు దానిని ఉచ్ఛస్వరంలోనూ చ-చానం మంద్ర స్థాయిలోనూ పలకం. చాలా సుస్వరంగా, సస్వరంగా, నిస్వరంగా, నిశ్శబ్దంగా, మౌనంగా, ప్రసన్నంగా, హాయిగా అనుకుంటూ ఉంటాం. నిజానికి మూడు అనుభవించినటువంటి వ్యక్తిని మనం గనక అడిగినట్లయితే "నీకు నిజమైనటువంటి ఏకాగ్రత ఎప్పుడు కలిగింది?" అని ప్రశ్ని-ప్రశ్నిస్తున్నప్పుడు అతను ఇచ్చే జవాబు ఒక్కటే "పెద్దగా చదివినప్పుడు" అన్నాడు "నాకు కలగలా. మధ్య స్థాయిలో చదివినప్పుడు కూడా కలగలా. కానీ ఇదిగో నాలో నేను, నాతో నేను, నేనై నేను ఎప్పుడైతే చదువుకుంటూ ఉన్నానో క్షణంలో నాకు భగవంతునికి ఒక చక్కని అనుబంధం ఏర్పడింది. నేను పరమాత్మ ఆవరణలోకి దీనికి ఆవరణ జ్యోతి అని ఉపనిషత్తు పేరు పెట్టింది. ఆవరణ జ్యోతిలోకి అంటే కాంతి వలయంలోకి నేను వెళుతూ ఉన్నప్పుడు నేను, నాది, నేను అంటున్నాను అన్న కర్త్రత్వాలు అన్నీ కూడా నా నుంచి సమసిపోతూ ఉన్నాయి." కాబట్టి సాధనా మార్గంలో క్రమశిక్షణ, ఒక భక్తి, ఒక ఏకాగ్రత, ఇవన్నీ ముబ్బిరిగొని ఒకచోట ఉన్నప్పుడు సాధన నెమ్మదిగా ఒక అలవాటుగా మారి అది అనేకమైనటువంటి స్థాయిలలో సంచారం చేసి ఎక్కడో ఒకచోట స్థిమితం అవుతుంది. అయినప్పుడు "పూజాతే విషయోపభోగ రచన" అంటారు శంకర భగవత్పాదులు. స్థాయికి ఇంకా చాలా ముందుకు వెళితే తప్ప అదేమిటో అర్థం కాదు. ముందు ఇవన్నీ కావాలి. దేవాలయానికి వెళ్ళాలి. హైందవుడిగా జన్మ ఎత్తినందుకు వీలైనంత వరకు దేవాలయానికి వెళ్ళాలి. వీలు కాని పరిస్థితిలో ప్రతి ఇంట్లో ఒక దేవాలయం ఉంటుంది, ఒక పూజా మందిరం ఉంటుంది. పూజా మందిరాన్ని దేవాలయంగా భావించాలి. ఇదంతా అసలు నిజానికి బృహదారణ్యకోపనిషత్తు ఏం చెప్పిందంటే ఆవనే భగవంతుడు అని చెప్పింది. ఆవనే భగవంతుడు అంతే. ఇది కరువు పండితుడు కూర్చొని రాసిన మాట కాదు ఇది. అదే బృహదారణ్యకోపనిషత్తు సినిమాకమి ఏమన్నాడంటే మనస్సుని, మానవుడి యొక్క మనస్సుని దయ్యంగా పోల్చాడు. సందర్భం వేరది. పేరు వస్తుంది ఇదే బృహదారణ్యకోపనిషత్తు మనస్సుని దైవం అని భావించమంది. దైవం నిజానికి మనస్సు రెండు భాగాలు. ప్రపంచాన్ని మాత్రమే చూడమనే మనస్సు మన యందే ఉన్నది. ప్రపంచాతీతమైనటువంటి పరమేశ్వర భావాన్ని అందుకోమని చెప్పే మనస్సు కూడా మన యందే ఉన్నది. ఇవన్నీ కూడా సాధనా మార్గంలో మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఇప్పుడు చెప్పుకుంటున్న physical స్థాయిలో సాధన ఎలా చేయాలి? పూజ, విగ్రహారాధన, గుడికి వెళ్ళటం, చక్కగా భగవంతుణ్ణి ప్రత్యేకంగా చూడగలగటం, భగవంతుని యొక్క శక్తిని మనం లోపలికి ఆవాహన చేసుకోగలగటం, ఆవేశింపజేసుకోవటం, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి స్థాయిలలో ఒక్కొక్కడి వృత్తిని బట్టి, మనోవృత్తులను బట్టి అవి ఏర్పడతాయి కాబట్టి సాధనా మార్గంలో చాలా సులభతరమైనటువంటి కొన్ని విషయాలున్నాయి. ఎస్సిసి విషయాలు ఏమిటి అనంటే ముందు కావలసినదంతా కూడా స్వాధ్యాయం కావాలి. డాక్టర్ సత్య స్వాధ్యాయం కంటే ముందు అసలు మనిషి అధ్యాత్మ మార్గంలోకి ఎందుకు వస్తాడు, ఎప్పుడు వస్తాడు, దేనిని ఆశించి వస్తాడు? మూడింటికి కూడా జవాబు తీసుకున్న తర్వాత, పొందిన తర్వాత దానివైపు వెళదాం. ఒకటి, మనందరం ఎవరైనా సరే మన వ్యక్తిత్వంలో ఒక భాగం, ఒక పాలు మాత్రమే మనది. తొలి పాలు మొట్టమొదటి భాగం. The first twenty five percent తల్లిదండ్రుల నుంచి వస్తుంది మనకి. మలి భాగం రెండవ twenty five percent ఏదైతే ఉందో [దగ్గిన శబ్దం] అది మన teachers లేదా గురువులు. ఇవాళ గురువు అనే మాట మనం పెద్దగా అది వాడొద్దు. ఎందుకంటే చాలా పల్చనైపోయింది. కాబట్టి మన teacher. teacher ఇరవై ఐదు percent మనల్ని ప్రభావితం చేస్తాడు. కమ్యూనికేషన్ మిగతా twenty five percent మన స్నేహితుల ద్వారా, సహచరుల ద్వారా, సహాధ్యాయుల ద్వారా మనం ఎవరు-ఎవరితో కూడి ఉన్నామో వారి ద్వారా మనకు twenty five percent వస్తుంది. మరి మిగిలిన twenty five percent మనం జన్మాంతరంగా తెచ్చుకుంటాం. కాళిదాసు అంటారు "జన్మాంతర సమ్హృదాన్" అని. అనేకమైనటువంటి జన్మలలో మనం చేసినటువంటి అనేక కర్మల యొక్క ఫలితాన్ని బట్టి ఈనాడు మన వ్యక్తిత్వ నిర్మాణం కొంత జరిగినప్పుడు మూడు కూడా, మొదట చెప్పిన మూడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు లేదా అధ్యాపకుడు లేదా teacher లేదా మన సహచరులు. ముగ్గురి ప్రభావం మన మీద తీవ్రంగా ఉంటుంది కనుక రైట్ మామూలు సాధన చేయటం వేరుయోగ సాధన చేయటం వేరు, అవన్నీ నడుస్తూ ఉంటది. ఇగ వీళ్ళు కూర్చున్నారు చూడండి, సాయిబాబా. వీళ్ళందరూ చూస్తూ నిల్చుని, నాది photo ఇక్కడ రావాలి, వస్తది నా పేరు వస్తుంది. Spiritual level లో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నప్పుడు, ఇటువంటి నేను కూడా మీటింగ్ లో బాగా ఉన్నా స్థితిలో స్వాధ్యాయం కావాలి మనకి. స్వాధ్యాయం అంటే మామూలుగా peripheral గా ఏంటంటే బాగా గ్రంథ పఠనం చేయాలి, శాస్త్రాచరణ చేయాలి, శాస్త్రాల మీద ఉన్నటువంటి అనేక వ్యాఖ్యానాలు చదవాలి, వాటిని ఆకళింపు చేసుకోవాలి, వాటిని own చేసుకోవాలి, కడగా అది మనం కావాలి. ఇది స్వాధ్యాయం అని ఒకటి. ఇది physical స్థాయిలో దాని అర్థం అంతే. Spiritual స్థాయిది నేను తర్వాత మాట్లాడతా. స్వాధ్యాయం వల్ల ఏం జరుగుతుంది? నేను భారతం చదివా అనుకోండి. లోకంలో నేను ఎలా జీవించాలో నాకు సాధనా మార్గాలు చూపిస్తుంది. ఎలా జీవించకూడదో కూడా అదే భారతం చెప్తుంది. అందువల్ల నేను స్వాధ్యాయాన్ని దృష్టితో చదవాలి. మన perception, మన interpretation, మన Intellectual Quotient, ఇవన్నీ కూడా జతకూడినప్పుడు మాత్రమే భారతం మనకు అర్థమవుతుంది లేకపోతే అది ఒక కవిత్వం, అది ఒక ఇతిహాసం, అదొక కథ, చక్కని కథ. అంతేగాని అది కాదు. దానిలో ధర్మశాస్త్రం ఉంది. సర్వ శాస్త్రాల నిలయం భారతం. కాబట్టి మనిషిని రెండుగా విభజించుకున్నప్పుడు తాను ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో రెండు స్పష్టంగా చెప్పేది భారతం. ఆదిమహాకావ్యమైనటువంటి రామాయణాన్ని నేను చదివినప్పుడు ఎలా జీవించాలో తెలుసు గానీ, ఎంత ఉదాత్తంగా జీవించాలో, ఎంత సహజంగా జీవించాలో నేర్పేటువంటిది రామాయణం. ఏది రాని, ఏది పోని, ఏది జరగని, ఏది జరగకపోని, ఎన్ని ఆఘాతాలు ఏర్పడని, ఎన్ని అననుకూలాలు ఏర్పడని, ఎన్ని జంజామారుతాలు వీయని, ఆకాశం తలకిందులు కానీ ఏమైనా నేను నేనుగా ఉండగలిగినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి వైఖరి ఇవ్వగలిగినటువంటిది రామాయణం గనుక ఒక దివ్య జీవన విధానానికి రామాయణము, యోగవాసిష్ఠము రెండు సమన్వయించేసి చదువుకోవాలి. అందులో వశిష్టులవారు రాముడికి చెప్పినటువంటి బోధ ఇవాళ మనం గనుక చదువుతున్నప్పుడు రాముడికి కాగలిగినట్లయితే, అంటే వినయంగా వినేటువంటి, ఏకాగ్రంగా వినగలిగినటువంటి ఒక స్థాయి మనం సంపాదించుకోగలిగినట్లయితే రెండు గ్రంథాలు ఇటు రామాయణము, ఇటు యోగవాసిష్ఠము రెండు కూడా మనకి ఒక అద్భుతమైనటువంటి, విశ్లేషణాత్మకమైనటువంటి జీవితం యొక్క మార్మికతని, జీవితం యొక్క డొల్లతనాన్ని, కాల ప్రభావాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తాయి. స్వాధ్యాయంలో ఇది ఒక సాధనా మార్గం. ఇక భాగవతం చదువుదాం. భాగవతం గనుక చదివినట్లయితే రేపుకు రూపం లేదు, అతి త్వరలోనే శరీరాన్ని వదిలిపెట్టబోతున్నానన్న స్పృహ ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజుకి శుకావధూత వచ్చి చేసిన బోధ భాగవతం. భాగవతం చదువుతున్నప్పుడు, భాగవతులు అందరి కథలు వింటూ ఉన్నప్పుడు, వారు ఎదుర్కొన్నటువంటి సందర్భాలలో భగవంతుడు వారిని ఎట్లా రక్షించాడో తెలుసుకున్నప్పుడు భాగవతుడి, భగవంతుడి యొక్క ఒక సమన్వయ స్థితి attunement అంటాం. ఎందుకంటే భగవంతుడు లేకపోతే భక్తుడనేవాడు లేడు, వాడికి అస్తిత్వం లేదు. అట్లాగే భక్తుడు లేకపోతే భగవంతుడు కూడా లేడు. మరి ఆయన గురించి విచారణ ఎవరు చేయాలి? భక్తుడే చేయాలి. భక్తుడు అంటే భగవంతునితో నిరంతరము కూడి ఉన్నటువంటి వాడు, అదే ఆలోచనలో ఉన్నటువంటి వాడు. "దేశాం నిత్యాభయుక్తానాం యోగక్షేమం వహామ్యహం" అది కదా మనకి భగవద్గీత చెప్పింది. కాబట్టి భగవద్గీత చదువుతున్నప్పుడు, కృష్ణలీలా వైభవాన్ని సానందంగా పోతన భాగవతాన్ని ప్రధానంగా చదువుతున్నప్పుడు మనం పసిపిల్లలమైపోతాం. మనలో క్రౌర్యము, కాఠిన్యము, మనలో ఉన్న కపటము, మనలో ఉన్నటువంటి వాక్పారుష్యము, ఇవన్నీ నశించిపోయి భగవంతుణ్ణి ఎంత అందంగా, ఎంత స్పష్టంగా, ఎంత సరళంగా, ఎంత హాయిగా, మధుర మధురంగా సంకీర్తనం చేయగలమో భాగవతం మనకు నేర్పుతుంది. అంతేకాదు, భక్తుడైనటువంటి వాడు ఎట్లా వినయశీలి అయి ఉండాలో, అహంకారం లేని దానాన్ని ఎలా దానం చేయాలో, అలాగే విద్య వలన ఏర్పడే వినయాన్ని ఎట్లా జీవితంలో celebrate చేసుకోవాలో, ఉదాత్తమైనటువంటి దైవీ సంపద అనే అంతా దైవీ గుణాలు అన్నింటినీ కూడా ఎట్లా cherish చేయాలో, ఎట్లా అన్వయం చేసుకోవాలో, ఎట్లా లోపలికి ఆవాహన చేసుకోవాలో, ఇవన్నీ కూడా మనకు భాగవతం చాలా చాలా స్పష్టంగా చెబుతుంది. భారత, భాగవత, రామాయణాది గ్రంథాల తర్వాత అదే పాయలో ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి భగవద్గీతను మనం వింటూ ఉన్నప్పుడు, అనుభవిస్తూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకు మూడు యోగాలు ఉన్నాయి అని, మూడు యోగాలని ఏకకాలంలో చక్కగా అనుభవించాలని, మూడుగా కనిపించే యోగాలు మూడు నిజానికి ఒక్కటేనని, అందుకనే ఇది యోగశాస్త్రం అని మనకు అర్థమై జీవితంలో ప్రతి విషయాన్ని ఎంత కూలంకషంగాతీవ్ర అధ్యయనం చేయాలో, ఎట్లా లోలోతులకు వెళ్లి ఆణిముత్యాలను తెచ్చుకోవాలో, దేనిని సాధించలేము అనుకున్న దాన్ని ఎట్లా సాధించగలమో, సాధించిన దాన్ని ఎట్లా నిలబెట్టుకోగలమో, నిలబెట్టుకున్న దాన్ని నలుగురికీ నిరపేక్షంగా ఎట్లా పంచగలమో, ఇవన్నీ కూడా మనకి నేర్పుతుంది భగవద్గీత. భగవద్గీత నిజానికి ఉపనిషత్తుల యొక్క దివ్య సారమది. ఉపనిషత్తులు అనేకంగా అనేక మార్గాలు అనేక విధానాలు చెప్తే యోగేశ్వర కృష్ణుడు అద్వైత భావంలో, అందుకనే దాన్ని అద్వైతామృతవరిషిడి అన్నారు. అద్వైత భావనలో మనకి దాన్ని అప్పజెప్పి ఇదిగో కర్మ, భక్తి, జ్ఞాన యోగాలు మూడింటిని కూడా [పాపం] అనుభవించండి. దైహిక, మానసిక. Disconnected మన మానసిక స్థితిని బట్టి జీవితం విసిరేటువంటి ఒక్కొక్క సవాలు నుంచి కూడా మనం దాన్ని బయట పెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయడానికి ఎట్లా అది ఉపాయాన్ని సూచిస్తుందో, ఇవన్నీ చెప్పేటువంటిది భగవద్గీత. దానిలో ధర్మం, నీతి, నియమం, ఆనందము, సానందము, బ్రహ్మానందము అన్నీ కూడా కలబోసుకున్నటువంటి ఒక ప్రజ్ఞాన భాండాగారమే భగవద్గీత. కారణం అది కవి పండితులు రాసింది కా నారాయణేన స్వయం. భగవంతుడే చెప్పాడు. కనుక వాటి యందు మానవుడు ఉదాత్త మానవుడు కావటానికి, ఉన్నత మానవుడు కావటానికి, నిజ మానవుడు కావటానికి అనేక మార్గాలు సూచించింది గనుక మిగతా విషయాలు జోలికి పోకుండా స్వాధ్యాయాన్ని గనక మనం అర్థం చేసుకోవాలంటే, స్వాధ్యాయం అంటే మనం అంటాం, "ఆయన పదివేల పుస్తకాలు చదివాడండి, పదిహేను వేలు ఆయన చదివినట్టు గుర్తు, ఆయనకి ఇరవై వేల పద్యాలు వచ్చండి" అంటాం. ఇది భారతీయ అధ్యాత్మలో ఇటువంటి వాటికి తావు లేదు. నువ్వు ఒకతను చదువు, ఒక్క వాక్యం నేర్చుకో, దాని ద్వారా నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకో. అది భారతీయ తత్వ సిద్ధాంతం చెప్పేది. ఎంత పోగు చేశాం కాదు. నా దగ్గర ఎన్ని బస్తాల బియ్యం ఉన్నా నా ఆకలికి పిడికెడన్నా నాకు చాలే. ఇది కూడా అంతే. కానీ వీటన్నింటినీ కూడా తులనాత్మకమైన అధ్యయనం చేయాలి. పరిశీలనాత్మక, పరిశోధనాత్మక స్థాయిలో గ్రంథాల అన్నింటినీ కూడా పిడివాదము, పెడవాదము కాకుండా ఒక సామ్యవాదంతో, సమతావాదంతో, సమన్వయ రీతిలో వీటిని గనక సాధించుకోగలిగినట్లయితే స్వాధ్యాయము సంపూర్ణమవుతుంది. ఇది [పాపం] స్థాయి. ఇదే స్వాధ్యాయానికి అసలైన అర్థం ఏమిటి అని గనక విచారణ చేసినట్లయితే, నిజమే ఇదిగో ఇవన్నీ చదివాను, పదిహేను వేల పుస్తకాలు చదివాను, ఇరవై వేల పద్యాలు శ్లోకాలు నోటికి వచ్చు. అంతా బానే ఉంది. కానీ, అవన్నీ తెలిసినాయి గాని నా గురించి నాకేం తెలియల. ఇది దురదృష్టం. అవన్నీ కూడాను నేను తెలుసుకోవటానికి ఉపయోగపడాలి. అది నిజమైన స్వాధ్యాయం. స్వీయ సాధన ఇది మొట్టమొదటిది. మనము. కూడా ఏం తెలియదు మన గురించి. మన గురించి లోకానికి తెలుసు, విచిత్రం ఏంటంటే మనల్ని, మన గురించి తెలుసుకున్న లోకానికి లోకం కూడా తనకు తాను తెలియకుండానే జీవిస్తూ ఉన్నది. లోకము అంటే ప్రజ అని అర్థం. కాబట్టి ఎవరికి వారము చక్కగా గనక విచార ధారలోకి వెళ్లినట్లయితే దీనిలో అర్థం చేసుకోవాల్సింది స్వాధ్యాయము అంటే కేవలం శాస్త్రాధ్యయనం మాత్రమే కాదు, గ్రంథ పఠనం మాత్రమే కాదు, ధారణా శక్తి మాత్రమే కాదు, మనల్ని మనము తెలుసుకునేటువంటి స్థాయికి వెళ్ళాలి. ఇది అధ్యాత్మ సాధనా మార్గంలో ఇది తొలి మెట్టు. ఎప్పుడైనా నాకు జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు, ఒక సవాలు నన్ను వేధిస్తున్నప్పుడు, ఒక పోరాటం చేయవలసి వచ్చినప్పుడు, అననుకూలాలు ఏర్పడినప్పుడు, అమిత దుఃఖాలు కలిగినప్పుడు, పట్టరాని ఆనందం కలిగినప్పుడు, స్వాధ్యాయం నాకు ఉపశమనం కలిగిస్తుంది. వాటన్నింటినీ కూడా సాపేక్షంగా మళ్ళీ తులనాత్మకంగా సమన్వయ రీతిలో అర్థం చేసుకున్నప్పుడు కష్టాలు Mutant విచ్చలవిడిస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. Mutant They are all passing clouds అని ఎక్కడో ఒక వాక్యం నన్ను పరిపూర్ణమైనటువంటి మానవత్వం వైపు నడిపిస్తుంది. నా స్వీయమైన, సహజమైనటువంటి ఒక స్థితిలోకి నడిపిస్తుంది గనుక దానికోసమే స్వాధ్యాయం చేయాలి. ఇక రెండవది, గ్రంథ పఠనం మనం మనల్ని మనం విచారణ చేయటం మాత్రమే కాక, మన కాలం కంటే ఉచ్చమైన దర్శనాలే ఇవాళ భారతీయ వాజ్జానికి ఆయువుపట్టు. తర్వాతవన్నీ వ్యాఖ్యానాలు, తర్వాతవన్నీ వితాట్పర్యాలు, టీకాలు, శబ్దాలు, పదాలు మళ్ళీ దాని చుట్టూ అల్లుకున్న కథా కథనాలు ఇవన్నీ. కానీ మహర్షుల దర్శనాలన్నీ కూడాఉపనిషత్తుల యందు ఉన్నవి గనుక ఉపనిషత్తులు చదివి భగవద్గీత చదవండి అద్భుతం. లేదు భగవద్గీతని తీవ్రంగా అధ్యయనం చేస్తూ ఉపనిషత్తులు అర్థం చేసుకోండి పరమాద్భుతం. కాబట్టి ఇవి ఏవీ భిన్నమైనవి కావు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి అంతే. భిన్న భిన్నమైనటువంటి రీతిలో మానవుడి యొక్క ప్రయాణమంతా కూడా స్వాధ్యాయంలో ఎక్కువ సేపు, అందుకనే ఒకానొక కాలంలో స్వాధ్యాయం ప్రధానమైనటువంటి భూమికని గురుకుల విద్యా విధానంలో ఎందుకని ప్రవేశపెట్టారంటే స్వాధ్యాయంలో వాఙ్మయం, శబ్దం, పదం, ఉచ్చారణ అదే diction modulation తర్వాత దానికి కావలసిన homogenization ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి గనుక స్వాధ్యాయం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఇంద్రాజ్యన వేదిక. అలాగే మనం శ్లోకం చదువుతాం. భగవంతుడి ముందు కూర్చొని ఒక శ్లోకం చదువుతాం. అర్థం తెలియకుండా చదివినా ఫలితం ఉంది లేదని కాదు. అంతా తెలుసుకొని చదివితే ఇంకా ఆనందం కలుగుతుంది. దానిలో భగవంతుడి యొక్క నామము, రూపము, భావము, తత్వము అన్నీ ఉన్నాయి. కాబట్టి స్వాధ్యాయం అనేది స్వీయ అధ్యయనానికి తొలిమెట్టుగా మనం భావన చేద్దాం. దీని తర్వాత స్వాధ్యాయం తర్వాత సత్సాంగత్యం కావాలి. సత్సాంగత్యం అంటే like minded people అని ఇంగ్లీషు వాళ్ళు చెప్తే అదే అనుకుంటున్నాం. ఇక్కడ like minded అనే మాటే అసలు wrong అది తప్పు. ఎందుకంటే no two minds can be alike each mind is unique. మరి like mindedness అంటే common గా interest common interest ఉన్నది అనేదానికి మనం మాట వాడుతున్నాం. common interest ఏంటంటే, "ఇవాళ సత్సంగానికి వెళ్దామా? పది మంది రానీ, ఐదుగురు రానీ ఎవడో రాకపోనీ మనందరం మనం కనీసం విందామా?" అని ఒకడు ఇంకొకడితో కలిసినప్పుడు అది సత్సంగం అవుతుంది సత్సాంగత్యం అవుతుంది. సత్-సత్సాంగత్యంలో ఏది విన్నామో దానిని మననం చేసుకుంటాం. దాన్ని విచారణ చేస్తాం. దాన్ని చాలా analytical approach తో దాన్ని గమనిస్తాం. చెప్పబడిన దాని గురించి విషయం ఏమిటి అని దానిని నిదానవతి ఉపాసనా మార్గంలో తీసుకుంటాం. అంటే ఏం లేదు అంటే పాలల్లో నుంచి నెయ్యి తీసినంత శ్రమపడి, "ఇన్ని విషయాలు చెప్పారు వీటిలలో మనకివ్వాళ ఏం పట్టినాయి? ఏం కావాలి?" అని ఇద్దరో, ముగ్గురో, ముప్పై మందో, మూడు వందల మందో కూర్చొని విశ్లేషించుకునేటువంటిది నిజానికి అది సత్సాంగత్యం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అంటే coherent thought అనే మాట కాదు గాని జరుగుతున్నటువంటి ప్రక్రియలో వారి వారి సంస్కారాన్ని బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, సాధన తీవ్రతను బట్టి వారు ఆయా విషయాల మీద అవగాహనను పెంచుకొని వాటిని పరస్పరం పంచుకుంటూ ఉన్నప్పుడు సత్సాంగత్యం అనేటువంటిది ఒక బలీయమైనటువంటి కలయికగా ఏర్పడు-పడుతుంది. సత్సాంగత్యానికి గొప్ప ఉదాహరణ కృష్ణ భగవానుడు, యోగేశ్వర కృష్ణుడు, అర్జునుడు. అది సత్సాంగత్యం. అది physical level లో ఉంది para physical level లో ఉంది చివరిలో spiritual level లో కూడా వాళ్ళిద్దరే మిగిలారు చూశారా? కాబట్టి స్వాధ్యాయము, సత్సాంగత్యము రెండూ కలిసిన తర్వాత మూడవది సత్సంగము చాలా ప్రధానం. ఇదెవరి వల్ల? సాయి ప్రేరణ, ఆహ్ ప్రారంభించినటువంటి సత్సంగ విశేష కార్యక్రమం. సత్సంగం అంటే, "ఓ యాభై మంది వచ్చారా? నూట ఇరవై మంది వచ్చారా? డ్రాప్ అయిందేంటి?" ఇది కాదు మనకు కావలసింది. కావలసింది ఒకటే ఆత్మ విచార మార్గంలో spiritual practice లో మనందరం కూడా ఎక్కడి నుంచి ఎట్లా మెట్టు ఎక్కుతూ వెళుతున్నాం, ఏయే విషయాలు మన సాధనకు ఉపయోగపడుతున్నాయి, మనం అసలు ఎక్కడ ఉన్నాం, ఇంకా ఎక్కడిదాకా వెళ్ళాలి, మెట్లు ఎక్కవలసిన మెట్లు ఇంకా ఎన్ని ఉన్నాయి, మనమంతా కూడా బయట వెదుకులాటతోనే ఆడిపోతున్నామా, లోపలికి వెళ్ళేటువంటి దాన్ని అరవిందులు వారు looking within అన్నాడాయన. మనకి looking without అలవాటైపోయింది looking within దానివైపు వెళ్ళమన్నారు. రమణ మహర్షి కూడా అదే, "నీ లోపలికి నువ్వు వెళ్ళు" అన్నారు. లోపలికి వెళ్ళటం అంటే మనకర్థం కాదు. అది తర్వాత విచారణ చేద్దాం. అంటే సత్సంగంలో సత్ అనేటువంటి భౌతిక పదార్థాన్ని దాటి సర్వ ప్రపంచానికి, సర్వ ప్రపంచం అంటే పదార్థమూలంగా ఉన్నటువంటి material గా కనిపిస్తున్న ప్రపంచాన్ని ఆధ్యాత్మిక చింతనతో ఇదిగో ఇట్లా సత్సంగం ద్వారా యదార్థమైనటువంటి absolute reality వైపు వెళ్ళటమే నిజమైనటువంటి అధ్యాత్మ. సత్యసాయిబాబా వారిని నాకు బాగా గుర్తు. 1960 నుంచి 1975 పదిహేడు సంవత్సరాల్లో చాలా దిగ్గజంతులైన పండితులంతా ఆయన దగ్గరికి వెళ్లారు. ఆయన్ని అడిగారు, "స్వామీ, అసలు అధ్యాత్మ అంటే ఏమిటో మాకొక్కమాట చెప్పండి, అర్థమయ్యేట్టుగా చెప్పండి." అని ఆయన్ని అడిగారు. ఆయన ఏమన్నారంటే, "ఇదిగో ప్రపంచం ఉంది ఇది పదార్థం, యదార్థం వైపు వెళ్ళాలి, దానికి అధ్యాత్మ అని పేరు పెట్టుకున్నాం." అని ఒక ఉరికే అంటూ, "ఎవరైతే ఒక ప్రభావంలో నుంచి స్వభావంలోకి వెళ్లగలిగితే దానికి పేరు అధ్యాత్మ." అని తెలిపిట్టారు. ప్రభావం ప్రపంచమంతా మనల్ని ప్రభావితం చేస్తుంది. మన స్వభావాన్ని కప్పి ఉంచుతుంది.ఆ కప్పి ఉంచిన దానికి గనక తప్పించుకోగలిగినట్లయితే మూలమైనటువంటి యావార్థిక స్థితిలోకి the so called absolute reality వైపు మనం వెళ్తాం. ఇది ఒక స్థాయి. రెండవ స్థాయిలో 1975 నుంచి 1990 మళ్ళా పదిహేనేళ్ళ మధ్యలో స్వామిని ఇలాంటి ప్రశ్నలే అనేక ప్రశ్నలు వేశారు ఆయన సమాధానాలు చెప్పారు. అందులో మళ్ళీ అధ్యాత్మని మీరు ఇక్కడికి రావటం చేయుట మీదంతా అధ్యాత్మనేనా? ఇది కాక ఇంకేదన్నా ఉన్నదా? అని అడిగితే, "ఏం లేదు. నిన్ను నీ దేహాత్మ భవాల నుంచి పక్కకు తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి ఆత్మ భవంలో గనక తీసుకెళ్లగలిగితే దాని పేరు అధ్యాత్మ" అన్నారు. వాళ్ళకి అర్థమైంది. మళ్ళీ తొంభై ఐదు నుంచి సుమారుగా 2000 సంవత్సరం వచ్చేటప్పటికీ ఫారినిర్స్ అడిగారు ప్రశ్న. అధ్యాత్మకి నిజమైన నిర్వచనం ఏమిటి అని అడిగారు. వాళ్ళకి ప్రభావము, స్వభావము మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఆయనేమో "ఏంటి?" అని అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే "మానవుడు మానవుడిగా జీవించగలిగితే దాని పేరు అధ్యాత్మ" అని చెప్పారు. అంటే ఏమైంది? 1960 నుంచి సుమారు నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కాలంలో మానవుడు కనీసం మానవ స్థాయిలో కూడా జీవించలేదు అని అర్థం. అప్పుడే చెప్పినటువంటి మాట పశువులకి రీసను, సీజను ఉంది. మనిషి రెండూ కోల్పోయినాడు అన్నారు. నిజానికి మానవ సిద్ధానికి అర్థమే తెలుసుకోకుండా జీవిస్తున్నారంటే మా అంటే లేదు మా అంటే కాదు. కొత్త నేను మానవా అంటే కొత్తవాడిని కాదు నేను సనాతనుడిని సనూతనుడిగా కనిపిస్తున్న అనేటువంటి ఒక అధ్యాత్మ అద్వైత భావనా భూమికలోకి గురు స్వరూపమైనటువంటి స్వామిని తీసుకొని వెళ్లారు. అంటే ఇవన్నీ కూడా సత్సంగంలో గనక మనం పంచుకున్నట్లయితే, అట్లాగే వశిష్ఠుల వారు, అట్లాగే రామాయణం వాల్మీకి, అట్లాగే వ్యాసులవారు, అట్లాగే శ్రీ సాయి నాథుని సచ్చరిత్ర వాటిని కథలుగా కాకుండా, కేవలం అంకాలుగా కాకుండా, కేవలం అనుభవాలుగా కాకుండా, వాటిలో దాగినటువంటి తాత్విక భావనను గనక మనం అర్థం చేసుకోగలిగితే సత్సంగాలు ఉపన్యాస వేదికలు కాకూడదు. దురదృష్టవశాత్తు అలా అయిపోయాయి. కాలక్షేపము అయిపోయినాయి. కాలక్షేపము లేదా ఉపన్యాస వేదికలుగా తెలిసింది, తెలియనిది, తెలియనిది కూడా తెలిసినట్లుగా చెప్పగలిగిన ఉపన్యాస కళ వేరు, సత్సంగం వేరు. సత్ సంగమం, సత్తులు సంగమించాలి. దేహాలు కాదు తలుపులు సంగమించాలి. There must be unification of thought. ఎవరు level లో, altitude లో, ఆలోచనా రీతులు సాగుతున్నాయో, అవన్నీ కూడా correlate కావాలి. అనగా అనగా, వినగా వినగా అంటున్నవాడు, వింటున్నవాడు ఒకటైపోవాలి. అది సంపూర్ణమైనటువంటి అధ్యాత్మ. కాబట్టి సత్సంగము వేరు, ఉపన్యాసము వేరు. ఉపన్యాసము వేరు, ప్రవచనము వేరు. ప్రవచనం అంటే ఏం లేదు కాస్త బాగా చెప్పటం అంతే. ఉపన్యాసము అంటే ఉపన్యాసము అది ఒక కరచరణాది అవయవాలతో ఒక అయికథ, పురకథ లేదా భావావేశం, తాదాత్మ్యం చెందటం లేదా తానే అది అనుభవిస్తున్నట్లుగా తాను అనుభవించినట్లుగా ఇదంతా ప్రపంచానికి ప్రదర్శన చేయుట ఇదంతా కూడా ఉపన్యాస కళ. కాబట్టి సత్సంగంలో నిర్మలంగా, నిర్మలంగా, నికేతనంగా, నిరంజనంగా, నిస్తందనందనంగా, హాయిగా, ప్రసన్నంగా విషయావలోడనం చేసుకొని స్వీయమైనటువంటి ఆలోకనము, అవలోకనము. ఆలోకనము బయట చేయాలి, అవలోకనము లోపల చేయాలి. రెండింటి మధ్య ఒక సమన్వయ సాధన చేసుకోగలిగినట్లయితే అది నిజమైనటువంటి సత్సంగం. కాబట్టి స్వాధ్యాయమైంది, సత్సంగమైంది, సత్ సాంగత్యమైంది ఇకపైగా వీటితో పాటుగా సమ్యక్ సంకీర్తన కావాలి. ఒక భజన పాడినప్పుడు, నలుగురు కూర్చొని పాడినప్పుడు, ఒక lead singer పాడుతున్నప్పుడు మిగతా వారంతా ముద్దు కలిగినప్పుడు ఏమవుతున్నది? రాగ, భావ, తాళ, లయాత్మకమైనటువంటి రీతిలో భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉన్నాం అది భజన అంటే. అది సంకీర్తన అంటే. భజనలో రాగం ఉంది, సంగీతం ఉంది. దాని వెనుక భావం ఉంది. దాన్ని convey చేయటానికి ఒక మంచి తాళం ఉంది, rhythm ఉంది, rhyme ఉంది. దానికి ఒక structure ఉంది. కాబట్టి సప్తస్వర అంతర్గతమైనటువంటి ఒక రాగానుసంధాన యోగమే నిజానికి సంకీర్తన, సమ్యక్ సంకీర్తన. శివుడి మీద ఒక భజన చేశాం, కృష్ణుడి మీద, రాముడి మీద భజన చేశాం. చేస్తున్నప్పుడు రాముడి యొక్క రూపం, రాముడి గుణ వైభవం, గుణగణ సంపత్తి ఇవన్నీ కూడా మనకి లోపల imprint అయిపోవాలి. అవి hallucinations కావు. మనసు అనుభవించేటువంటి ఒక దివ్యమైనటువంటి సాధనా స్థితి. అక్కడ గోదండం పట్టుకున్న రాముడు మనకు కనిపిస్తాడు ద్వారకానాథుగారికి కనబడలేదా? రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపించాడు. తాను భీష్ముడైనాడు, తానే అంబరీషుడైనాడు, తానే వామనుడైనాడు అన్నింటినీ కూడా తన యందు ఆవాహన చేసుకున్న కారణంగా దృశ్య సాక్షాత్కార భాధికంగా ఇది తెలుగులో మనం picture is true గా బొమ్మ కట్టినట్లుగా అచ్చ తెలుగులో బొమ్మ కట్టినట్లుగా మన యందు రాముడి యొక్క రూపం ప్రతిష్ఠితం అవుతుంది.అలాగే సాయి రాముడి యొక్క రూపం ప్రతిష్ఠితమవుతుంది. చూడది ప్రతి-ప్రతిష్ఠితమవుతుంది. అంటే ఏమవుతున్నది? దేనిని నీవు ఉపాసిస్తున్నావో, దేనిని చూడగలుగుతున్నావో, ఏమి చేస్తే దాన్ని నీవు చూడగలవో, ఇన్ని కలగలుపు చేసుకొని కలబోసుకొని రూపాన్ని నీ అంతరంగంలో నీవు సాక్షాత్కరించుకోగలుగుతున్నావ్. అటువంటి రీతిలో మాత్రమే భజన సార్థకమే. కాబట్టి భజన అందరం కలిసి గనక పాడినట్లయితే అది సమ్యక్ సంకీర్తన అవుతుంది. సమ్యక్ అంటే comprehensive. అందరం కలిసికట్టుగా అంటాం అయి కలిసికట్టుగా ఉపాసన చేస్తున్నాం. రాముడి భజన చేస్తున్నప్పుడు అది జరుగుతున్నది రామ ఉపాసన. లలితా సహస్ర నామ పారాయణం చేస్తున్నప్పుడు అది శ్రీ లలితా ఉపాసన. కాబట్టి దేవి కదండీ! దేవీ దేవతా స్వరూపాలన్నింటినీ కూడా సంకీర్తన ద్వారా, భజన ద్వారా, చక్కని సంగీతం ద్వా-ద్వారా లయాత్మకంగా, శ్రుతిపత్వంగా, శ్రుతి సౌరభంగా దాన్ని గనక ఆనందించగలిగితే మనసంతా కూడా ఒక ఆనందతాండవం చేస్తుంది. మీ యందు అక్కడ కూర్చున్న ముప్పై మందికి అందరికీ కూడా రాముడు దర్శిస్తూ ఉంటే వాళ్ళు రాముడు కాక ఏమైపోతారు? రాముణ్ణి చూడనంత వరకు ఆయన వేరు, మనం వేరు. కానీ రాముణ్ణి మనం దర్శనం చేసుకున్నప్పుడు లేదా శివుణ్ణి మనం లోపల దర్శనం చేసుకున్నప్పుడు రుద్రానుభూతి మన యందు కలిగినప్పుడు రుద్రుడు మనము ఒకటే. కాబట్టి అపరిణామ ప్రాప్తమైనటువంటి అధ్యాత్మ భావనా భూమికలో అత్యంత ప్రధానమైనటువంటి సంప్రదాయం ఏది అంటే భజన సంప్రదాయం. ఇది ఒక భక్తి ప్రవాహం ఇది. ఈశాన్య భారతంలో చైతన్య మహాప్రభువు ప్రపంచానికి భక్తి సామ్రాజ్యము, భక్తి ప్రవాహాన్ని పరిచయం చేశారు. తర్వాత ఆంధ్రదేశంలో ఇక్కడ తెలంగాణాలో ముఖ్యంగా భావనా-- భావ-- భావనాతీతమైనటువంటి ఒక భావనలో ఒక మహాత్ముడు సంప్రదాయాన్ని భజన సంప్రదాయాన్ని తీసుకువచ్చి భావానంద ఋషి అనేటువంటి ఆయన ఇక్కడి నుంచి చాలా దగ్గర సిద్ధిపేట దగ్గర ఎప్పుడో నూట నలభై, నూట యాభై ఏళ్ల క్రితం భజన సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. పాండురంధ్ర సాక్షాత్కారం పొందారాయన. ఆయన పొందటం కాదు అమెరికాకి ఇప్పించగలిగారు. సాధ్యమేనా? అంటే అయిన వాళ్ళు చెప్పారు. కాబట్టి వీటన్నింటినీ మనము అర్థం చేసుకోగలిగినట్లయితే స్వాధ్యాయము, సత్సంగము, సత్సాంగత్యము, సమ్యక్ సంకీర్తన ఇవన్నీ ఒక ఎత్తయితే వీటికి మూలమైనటువంటి ఒక ప్రధానమైన అంశం ఒకటుంది. సదాచారం. సదాచారం అంటే నా ముత్తాత, నా తాత, నా తండ్రి, నా గురువు, నా చుట్టూ ఉన్న ప్రపంచము దాన్ని ఒక ఆచారంగా, సదాచారంగా, ఒక చక్కని అలవాటుగా, ఒక ప్రణాళికగా, ఒక క్రమశిక్షణగా, ఒక సమర్పణాభావంతో, సర్వాగతితత్వంతో, విభూతిస్థాయితో, వినయంతో, విద్యా ప్రకాశమానమైనటువంటి స్థాయిలో దీన్నన్నింటినీ గనక చేసుకోగలిగినట్లయితే అది సదాచారం అవుతుంది. సదాచారంలో ప్రధానంగా తల్లిదండ్రులకి నమస్కరించడం, మహర్షులను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకోవడం, మాతృ రుణంని తల్లి అవసాన దశలో ఆవిడను లాలించడంలో, ఆదరించడంలో ఆమెకు మనం బిడ్డలం కాదు time లో ఆమె మనకు బిడ్డ అవుతుంది. తండ్రి కూడా అంతే. తండ్రికి మనం బిడ్డ అవుతాము ఇప్పుడు. అప్పుడు వారు పెద్దవారైనప్పుడు మనము తండ్రి అవుతాము. మన బిడ్డ మన తండ్రి మనకు బిడ్డ అవుతాడు. కాబట్టి వారిని గౌరవించటం, పూజించటం, ఆరాధించటం, ఆదరించటం, వారిని అన్ని విధాలా కాపాడుకోవటం, ఇవన్నీ కూడా భారతీయమైనటువంటి సదాచార సంపత్తిలో ప్రధానమైన భాగాలు. అలాగే విద్య నేర్పినటువంటి గురువులకి గురు రుణం తీర్చుకోవాలి. తల్లిదండ్రుల కింతట శ్రాద్ధ క్రమముల ద్వారా లేదు వారిని తలుచుకోవటం ద్వారా వారిని సంవత్సరానికి ఒక్కసారో లేదు ప్రతిరోజూనో వారు వెళ్ళిపోతే తలుచుకోవాలి, ఉండిపోతే ఆదరించుకోవాలి. రెండింటితో పాటు విద్య నేర్పినటువంటి గురువుకి మనం నిత్యమూ కూడా కృతజ్ఞతాభావంతో శిరస్సు వంచి వారి ముందు నీకు ఆయనకి degree PhD లేకపోవచ్చు, నీకు ఉండొచ్చు. కానీ గురువున్నాడే, నీకు PhD రావటానికి ఆయన మార్గం వేశారు. కాబట్టి గురువుకి ఎప్పుడూ కూడా గురువు దగ్గర శిష్యత్వంతోనే ఉండాలి. శిష్యుడు అంటే సేవకుడు కాదు. శిష్యుడు అంటే బానిస కాదు. శిష్యుడు అంటే కేవలం వినేవాడు అని కాదు. తనను తాను నిశ్శేషన్ చేస్తున్నవాడు శిష్యుడు అవుతున్నాడు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమీ లేదు నాకు అసలు ఏమీ తెలియదు. ఇవాళ-ఇవాళ నేను ఒక ఖాళీ వ్యక్తిగా నేను నీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ ఇవాళ నాకు ఏదైనా అనుగ్రహింపుమని సిద్ధంగా ఉండవల్-- ఉండవలసిన వాడు. అంటే సిద్ధుడై, సంసిద్ధుడై, శిష్యుడై, నిశ్శేషుడై, శుద్ధుడై ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే శిష్యులు అవుతున్నారు. మిగతా వాళ్ళంతా కూడా అనుసరించే వాళ్ళు కొందరు ఉంటారు. గురువుని అనుకరించే వాళ్ళు కొందరు ఉంటారు. గురువుని అనుకరించబడదు, అనుసరించాలి. అనుసరించటం అంటే గురువు మార్గంలో మనల్ని వెళ్ళమని చెప్పాడో మార్గంలో మనం చక్కగా, పాయిగా ప్రవేశిం-- ప్రవేశించి మన జీవిత కాలాన్ని దాని యందు గడపాలి. కాబట్టి అధ్యాత్మ సాధనలో ఇవన్నీ కూడా సదాచారంతో పాటు సమ్యక్ సంకీర్తనతో పాటు మూడు ప్రధానమైన విషయాలు అధ్యాత్మలో ఉండాలి. అవి ఏమిటి అంటే ముందు సమర్పణ ఉండాలి.సమర్పణ అంటే మనల్ని మనం అర్పించుకోవటం. అర్పించుకున్నప్పుడు మనదంటూ ఇంకా ఏమీ ఉండదు. గురువు యొక్క ఆవరణలోకి, ఇందాకే చెప్పిన జ్యోతిష్మతి ధ్యానం అనే ఒక మహా ప్రక్రియ ఉంది. దానిలో స్వాధ్యాయము ఆవరణ జ్యోతి అవుతున్నది. ఏకాగ్రంగా చదివితే అది అపోజ్యోతి అవుతున్నది. Critical గా విమర్శనాత్మకమైనటువంటి రీతిలో గనక చదివితే అది అపోజ్యోతి, అపురూపమైనటువంటి జ్యోతి అంటే కాంతి, క్రాంతి. క్రాంతి అంటే పరిణామం. విప్లవం అంటే విధ్వంసం కాదు విప్లవం అంటే మార్పు. మంచి, మంచి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళేది అది విప్లవం అంటే. విప్లవానికి మార్పు, ఇవాళ ప్రపంచంలో విప్లవం వచ్చిందంటే విధ్వంసం అవుతుంది అని. కానీ కాదు, పరిణామగతిశీలమైనటువంటి మానవ సమాజం, మానవుడు మానవుడిగా జీవించడమే అధ్యాత్మ అని స్వామి చెప్పినప్పుడు, మానవుడు మానవుడిగా ఎందుకు జీవించటం లేదంటే తనలో ఉన్నటువంటి పశు ప్రవృత్తిని ఇంకా పోగొట్టుకోవటం లేదు. There are residual animal instincts ఇంకా అక్కడ ఉన్నాయి. కనుకనే అహంకారము, దంభము, గర్వము, ప్రగల్భము, దాంబికము, ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి మమకారము, ప్రాపంచిక వస్తువుల పట్ల లాలస, భోగము, ఇవన్నీ కూడా ఏర్పడి ఉన్నప్పుడు వీడు అధ్యాత్మంలో లేనట్లే లెక్క కాబట్టి పదాల అన్నింటినీ అర్థం చేసుకుని పదాలన్నింటినీ సాధనా మార్గంలో ప్రవేశపెట్టుకుని తనకు అనుకూలమైనటువంటి దివ్య జీవన విధానం వైపు గనక వాడు వెళ్లగలిగినట్లయితే, అంటే మనం వెళ్లగలిగినట్లయితే ఇది నిజానికి అధ్యాత్మ సాధనలో ఎంత పూర్వరంగం ఉంటుంది. ఏదో నాకు అరవై ఏళ్ళు వచ్చాయండి, ఇంతవరకు చదువుకోవటానికి నాకేం time దొరకలేదు, ఇప్పుడే భాగవతం బయటికి తీశానంటే, నేనింటాను ఇప్పటికన్నా తీశారు కదా, తప్పేం లేదు. అయిపోయిందేదో అయిపోయింది దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పటికైనా దానిని సాధనా మార్గంలో మొదటిసారి తెరిచినప్పుడు ఏమీ అర్థం కాదు. కానీ దానిని ఇంతకు పూర్వమే అధ్యయనం చేసి దానిని జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిని వెతుక్కుంటూ ఒక నిరాడంబరమైనటువంటి ఒక బౌద్ధుడి దగ్గరికి అంటే బౌద్ధుడి దగ్గరికి గనక వెళ్ళినట్లయితే భాగవతంలో ఏముందో చెప్తాడు, భాగవతం ఎందుకు చదవాలో చెప్తాడు, చదివితే ఏమవుతుందో చెప్తాడు, ఎట్లా చదివితే ఎంత ఆనంద రేఖలు విచ్చుకుంటాయో చెప్తాడు. కనుక క్షణంలో కొద్ది రోజులు ఆ-అతని సహాయం మనకు కావాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా మన స్వాధ్యాయంలోకి మనం రావాలి. వచ్చి మనలో ఉన్నటువంటి ముందు చెడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం స్వీయ సాధనం ద్వారా చేయాలి. మళ్ళీ ఇక్కడ సాధన అంటే కాస్త మనల్ని మనము గమనించుకోవటం, మనల్ని మనం చూసుకోవటం, మనల్ని మనం చదువుకోవటం, మనల్ని మనం అర్థం చేసుకోవటం. మనలో ఉన్నటువంటి negativities and positivities రెండింటినీ ఖచ్చితంగా తులనాత్మకంగా divide చేసుకుని నాలో అహంకారం ఉన్నది, దీన్ని నేను వదులుకోవాల్సింది ఏంటి పరిస్థితుల్లో అనుకోవాలి. సందర్భాలు ఏర్పడతాయి, అహాన్ని ప్రచోదితం చేసి విజృంభింపజేసేటువంటి సందర్భాలు ఏర్పడతాయి. క్షణంలో కూడా అహంకార ప్రవృత్తిని వదిలిపెట్టి నిరహంకారమైనటువంటి స్థితులు ఉంటాయి-ఉండాలి. అలాగే ప్రపంచం అనేక ఆకర్షణలు మనవైపు నడుతుంది. ఆకర్షణకి లొంగకుండా ఉండేట్టుగా మనస్సును నిభ చేసుకోవాలి. అలాగే comparisons వస్తాయి. వాడు ఇట్లా, వీడు ఇట్లా, ఇతను ఇట్లా, ఆమె ఇట్లా. ఈ-ఈ comparisons నిజానికి spiritual సాధనలో చాలా భయంకరమైనటువంటి స్థితి అది. It's the worst trait. కాబట్టి పోలిక లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం. ఎవరిని వారే ఎలా ఉద్ధరించుకోవాలో అట్లాగే ఎవరికి వారే, కాబట్టి ఎవరికి వారే తమను తాము స్వీయ నియంత్రణ ద్వారా, స్వీయమైనటువంటి ఒక భావన ద్వారా, స్వీయమైనటువంటి క్రమశిక్షణ ద్వారా మనల్ని మనం గనక అర్థం చేసుకోగలిగినట్లయితే మనకి సగం భారం ఉడిలిపోతుంది. ఎప్పుడైతే negativities నెమ్మదిగా మరణించి దూరం అవుతాయో, పలచనై బయటకు వెళుతూ ఉంటాయో, క్షణంలో positivities విజృంభిస్తాయి. అవన్నీ ఒక చోటకి coagulate అవుతాయి అంట, అవన్నీ ఒకచోట కూడుకుంటాయి. కూడినప్పుడు మనలో ఉన్నటువంటి మంచితనము, మనలో ఉన్నటువంటి దయ, మనలో ఉన్నటువంటి జాలి, మనలో ఉండే సానుభూతి, మనలో ఉండే పవిత్రత, మనలో ఉండేటువంటి నిష్కాపట్యము, మనలో ఉండేటువంటి సరళత్వము, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి positivities అన్నీ బయటకు వచ్చినప్పుడు మనం ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. కనుక అధ్యాత్మ సాధన అనేకమైనటువంటి రీతులలో సాగాలి. ఇదంతా కూడా మనం physical level లో మనం మాట్లాడుకున్నాం. అంతే కాదు, ఇది ఎప్పుడు ప్రారంభం కావాలి? ఇప్పుడే అనుకున్నాం అరవై ఏళ్ళు వచ్చింది, ఇప్పుడే భగవద్గీత తీసాం, భాగవతం తీశామని. అది ఒక ఎత్తయితే చిన్నప్పుడే గనక మనం దానిలోకి వెళ్లగలిగినట్లయితే జీవితం మొత్తం కూడా అధ్యాత్మమయం చేసుకోగలుగుతాం. అవకాశాలు ప్రతి వ్యక్తికి వస్తాయి. ప్రతి వ్యక్తికి మార్గం తెలుసుకోనే ఉంటుంది. వెళ్లాలా వద్దా, తరించడమా, అంతరించడమా, Y junction లో వాడు ఎక్కడ ఆగిపోతాడో గనక అంతరించే మార్గంలోకి వెళితే ప్రపంచంలోకి వెళతాడు, తరించే మార్గంలోకి వెళితే అధ్యాత్మ మార్గంలోకి వెళతాడు, అంతే. అక్కడికి ఎవరూ, ఎక్క-ఎవరూ తీసుకుని వెళ్ళని వాళ్ళు లేరు. ఎవరికి వారే వెళ్ళవలసిందే. ఒక మహా చైత్య పురుషుడు మన చేయి పట్టుకుని "ఇదిగో ప్రపంచపు ఆనందం కంటే అసలు ఆనందాన్ని నీకు చూపిస్తాను" అని రా అన్నప్పుడు కూడాప్రాప్తి లేనప్పుడు, పరిపాకం చెందనప్పుడు, పరిపక్వత కానప్పుడు, మన మానసిక స్థితి దాని యందు లేనప్పుడు, లగ్నం కానప్పుడు, దాని యందు ఆసక్తి లేనప్పుడు మనం అంతరించే మార్గం వైపే వెళ్తాం. తరించే మార్గం చిన్నప్పుడే గనక వెళ్ళినట్టయితే తొంబై ఆరు, తొంబై ఏడు సంవత్సరాల పూర్ణాహుతి ఆయువులో సంపూర్ణమైనటువంటి అధ్యాత్మ జీవితం అంటూ లేదు. అధ్యాత్మను జీవించగలుగుతాం. మన వాళ్ళు పిల్లలకి ఆర్టికల్ రాయమనుస్తారు. నిత్య జీవితంలో అధ్యాత్మ, నిత్య జీవితంలో అధ్యాత్మ కాదు నిత్య జీవితమే అధ్యాత్మ కావాలి. మనం విడగొడుతున్నాం. అలాగే కర్మ, భక్తి, యోగ మార్గాల్లో యోగం మంచిది? మూడూ ఒకటే అనేది మనం చెప్పడం మర్చిపోయాం. కర్మ యోగం వేరు, కర్మ యోగంలో ఉంటే వాడు భక్తిలో లేనట్టు, భక్తిలో ఉంటే వాడు పనికిరాని వాడన్నట్టు, పని చేయలేని వాడన్నట్టు. జ్ఞాన మార్గంలోకి వెళ్తే అసలంతా సుఖమే పనే ఉండదని అనుకోవటం. ఇదంతా కానే కాదు. కాబట్టి స్వాధ్యాయం మనకి అనేకమైనటువంటి విషయాల మీద ఒక అవగాహన, స్పష్టమైనటువంటి అవగాహన మనకి నేర్పుతుంది గనుక physical level లో అధ్యాత్మ సాధనకు మనం ఇవాళ ఇవే చేయాలి. ముందు సత్సంగనికి వెళ్ళాలి. సత్ సాంగత్యంతోనే ఉండాలి. ఎవరో వస్తారు, దేవుడు లేడు అంటూ తలుపు తీసుకుని ఒకడు వస్తాడు. వాడితో మనకేం పని లేదు. ఎందుకంటే ఉన్నాడు అని మనం ప్రయాణం ప్రారంభించాం, లేడు అనుకొని వాడు ప్రారంభించాడు. వాడితో వెళితే వాడితో పాటుగా మనం కూడా ఏమీ సాధించలేం. ఉన్నాడు అనుకుంటే ఆయన ఎట్లా ఉన్నాడు? ఎక్కడున్నాడు? రూపం ఏమిటి? ఫామా, ఫామ్ లెస్సా, అరూపమా, స్వరూపమా? అసలు ప్రపంచమంతా ఏమిటి? బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మమే రాముడయినాడా? బ్రహ్మమే కృష్ణుడయినాడా? దీని మూలాలు ఏమిటి? ఇటువంటి తాత్వికమైనటువంటి ఒక విచార ధార ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సత్సంగంలో నుంచి, సత్ సాంగత్యంలో నుంచి వచ్చినప్పుడు we try to sing the glory. ఇందాక ఒక పాట పాడాను, బాబా మీద చక్కగా పాడాను. పాడటంలో ఏమైంది? రాగ, భావ, తాళ లయాత్మకమైనటువంటి ఒక భావన ఎప్పుడైతే కలుగుతుందో మనసు మార్తవాయ్ అని, ఒక లాలిత్యాన్ని, ఒక చల్లదనాన్ని, ఒక ప్రశాంతిని, ఒక హాయిని, ఒక ప్రసన్నతను, ఒక సరళత్వాన్ని, ఒక సూటిదనాన్ని, ఒక స్పష్టతని, ఒక నిశ్చలత్వాన్ని, ఒక నిర్మోహత్వాన్ని అన్నింటినీ అది దానంతట అదే అలవాటు చేసుకుంటుంది గనుక ఇటువంటి భావనా స్థితిలో మనం అధ్యాత్మ మార్గంలోకి రావాలి. అయితే అధ్యాత్మ మార్గంలో ఇందాక చెప్పినట్లుగా రాముడి Parayam వర్ణిస్తాం. మనస్సు మనం కూడా రాముడిని వర్ణిస్తూ ఉన్నప్పుడు మన పిల్లలందరూ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తారు. అప్పుడు ఏ-ఎవరి పిల్లవాడు కనిపించినా రాముడే కనిపిస్తాడు, అది విశేషం. మన మనవడో, మన మనవరాలോ, బ-బాలకానో రాముడిగానే కనపడటం మళ్ళీ స్వార్థమే. కానీ బాలుడైనా రాముడై, బాలికైనా బాలై గనక కనిపించినట్లయితే అది అధ్యాత్మలో ఒక పరిణితి స్థాయి. కనుక అధ్యాత్మ అంటే ఇది చేస్తే, ఇది చేస్తేనే నీ జీవితం అని కాదు. ఇలా కూడా చేయవచ్చు, ఇలా చేస్తే నీకే లాభము, దీని వలన నీ ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది, దీని వలన నీకు ఆనందం కలుగుతుంది అని మనం చెప్పాలి తప్ప, ఇది చేయకపోతే నీ జన్మ వృథా అంటే వేద ప్రమాణం అనండి, పౌరాణిక ప్రమాణం అనండి, శాస్త్ర ప్రమాణం అనండి ఒక మాట చెప్పింది. నువ్వు ఆత్మ విచార మార్గంలోకో, మంచి మార్గంలోకో వెళుతూ ఉన్నప్పుడు భయాలతో, భక్తి అనే పేరుతో భయంతో గనుక నిన్ను ఎవడన్నా గట్టిపడేస్తుంటే వాడిని వదిలిపెట్టాలి. ఆత్మోన్నతికై నీవు వెళుతూ ఉన్నప్పుడు గురువైనా సరే నీ ఆత్మోన్నతికై ఒకసారి అడ్డుపడి "ఎందుకయ్యా ఇప్పడినుంచే ఆత్మ? హాయిగా అనుభవించు జీవితం, భగవంతుడు దక్కించాడు, మంచి సంసారం ఉంది, పిల్లలున్నారు, అనుతూ ఉండు తర్వాత చూద్దాం" అన్నాడా? గురువుని వదిలిపెట్టమంది శాస్త్రం. కాబట్టి పరిమితమైనటువంటి భావనతో పరిమితమైనటువంటి జీవితాన్ని ఒక నందవనంగా, అధ్యాత్మ బృందావనంగా మనం మార్చుకుంటూ అనేకమైన తాత్విక విషయాలు అన్నింటినీ కూడా మనం physical level లో ఇవాళ ఏదైతే మాట్లాడుకున్నామో వాటన్నింటినీ కూడా చక్కగా పునశ్చరణ మనం చేసుకుంటూ దాని యందు లగ్నం చేసి పుస్తకాన్ని ఎట్లా చదవాలి. ఎవరో మహాత్ముడు వచ్చాడు ఊళ్ళోకి, అవకాశం వచ్చింది, వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఆయన అందరూ మహాత్ముడనే అన్నారు. మా మనస్సు ఆయన యందు లగ్నం కానప్పుడు ఆయన మహాపురుషానుభూతి మైన స్థితి మనకు అక్కరకు రాదు. achievement చాలా చాలా important. దాన్నేదో wavelength అంటారు. వాటన్నింటికంటే మనస్సు మనసుతో కలవాలి, హృదయం హృదయంతో కలవాలి. కలిసినప్పుడు మాత్రమే వాటికి ఒక సమగ్రత ఏర్పడుతుంది. అది మళ్ళీ మన ప్రాప్తిని బట్టి ఏర్పడుతుంది గనుక గురు సహాయం కావాలి. గురువు అనేది కాదు I use the word teacher. ఆ-ఆ teacher అంటే బౌద్ధ, మనకు బోధ చేయగలిగిన వాడు, చెప్పగలిగిన వాడు. ఎవరు చెప్పగలడు అంటే పుస్తకంలోది కరెక్ట్, పుస్తకంలో-- వాడు కాదు. ఎవరు బౌద్ధ అంటే ఎవరు దానిని మధించాడో, దేనిని అనుభవించాడో, తాను దేనిని చదివిన దాన్ని ఆచరించగలిగాడో, స్పష్టాస్పష్టత నుంచి కేవల స్పష్టతలోకి వచ్చాడో, దేనిని చదివి అది తానైనాడో అటువంటి వ్యక్తి నుంచి మనకు అద్భుతమైనటువంటి emanations వస్తాయి. vibration వేరు, emanation వేరు. నమ్ములు వింటూ ఉంటాం వెళ్ళినప్పుడు. ఆయన అక్కడ కూర్చుంటే vibrations అద్భుతంగా ఉన్నాయని వీడు అంటాడు. vibration కి అర్థం తెలియక. vibration అంటే వస్తువు ద్వారా కలిగేది vibration.పరావస్తువు ఏదైతే అంటే పరావస్తువు అంటే ఈశ్వర తత్వానికి సన్నిహితంగా ఉండేటువంటి దివ్య భావనలు, ఆవరణలు కలిగే దానికి emanations అని అంటాం. emanations అంటే ఆయన నుంచి మనకి, మన నుంచి కూడా ఆయనకి. రెండు మనకి vibrations ఉన్నావు అక్కడ. ఓన్లీ emanations ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా గమనించుకుంటూ ఉన్నట్లయితే రాబోయే రెండు సత్సంఘాలలో, ఇవాళ physical level లో ఎలా విచార ధారణ మనం చేస్తున్నామో metaphysical level లో దాన్ని ఎలా చేయాలి? తర్వాత మూడవ నెల వచ్చేసరికి March నెలలో అధ్యాత్మ అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన how to go about it? how to indulge in it? దాన్లో ఒక కార్యక్రమంగా చేయాలా? సహజంగా చేయాలా? సహజంగా చేయగలుగుతామా? ఇవన్నీ కూడా తాత్వికమైనటువంటి చింతనా భూమికలో వాటిని మనం చక్కగా విచారణ చేద్దాం. చేయటానికి అనువుగా లోగ స్వాధ్యాయానికి శ్రీకారం చుట్టండి సదరు వారు అంటూ ఉంటే. చదివే అలవాటు లేకపోతే Covid అనేటువంటిది తర్వాత దాంట్లో నుంచి ఇప్పుడున్న by product ఇంకోటి ఇంకేది రానివ్వండి, ఏ-ఎట్లా ఉందనివ్వండి మనదైన స్వీయ స్వాధ్యాయంలో గనక మనం ఉన్నట్లయితే భాగవతం చదవండి. భారతం అర్థం చేసుకోండి. రామాయణాన్ని తెలుగులో మనకి రామాయణం విశ్వనాథవారి కల్పవృక్షం చదవండి. అలాగే పూతన భాగవతాన్ని, చెంపాతి వారిని, భారతము లేకపోతే తెలుగువారి అదృష్టం ఇదంతా కూడా. అట్లాగే శంకర భగవత్పాదుల వాఙ్మయం ఉంది. వాటన్నింటినీ కూడా చక్కగా అధ్యయనం చేయండి. Notes రాసుకోండి. అర్థం తెలియకపోతే చివరిలో ఒకసారి question answer session పెట్టుకొని అట్లా చేసుకొని పరస్పరము అదే సత్ సాంగత్యంలో నుంచి మనం కొన్ని కొన్ని పరిష్కార మార్గాలు, అనేక సందేహాలకు సమాధానాలు మనం పొందుతూ అధ్యాత్మ సాధనని చివరికి కడగా మూడు అయిన తర్వాత అది ఏమిటో మనమందరం కూడా అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చెప్తే it's only a theory. ఊరికే do's and don'ts అనమాట. do's and don'ts పనికిరావు దీంట్లో. దీనిలో కావలసింది చిత్తైక్యాగ్ర స్థితి కావాలి. మనో నిగ్రహం కావాలి. ఆత్మావలోకనం కావాలి. మనల్ని మనం చదువుకోగలిగిన స్థితి మనకు ఉండాలి. అక్కడ నిష్పాక్షికంగా ఉండాలి. న్యాయ నిర్ణాయకమైనటువంటి ఒక impartial judgement మన గురించి మనం చేసుకోగలగాలి. నాకిది వచ్చు, నాకిది రాదు అని అనగలగాలి. నాకన్నీ వచ్చు అన్నాడు అనుకోండి వాడితో మనకు పెద్ద పేచీ లేదు. నాకేమీ రాదు అన్నాడు అనుకోండి వాడితో కూడా పేచీ లేదు. కానీ ఏదీ రాకపోయినా అన్నీ వచ్చు అన్నవాడు, అన్నీ వచ్చినా ఎవరికీ చెప్పని వాడు ప్రపంచానికి బరువే తప్ప పరువు కాదు. కాబట్టి అధ్యాత్మ మార్గంలో మనల్ని మనం నిర్దేశించుకుని పునర్నిర్మాణం చేసుకోవటమే అధ్యాత్మ సాధనగా భావన చేస్తూ సాయి ప్రేరణ ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా ఆనందపడుతూ వచ్చే నెల మనం February లో కలుసుకున్నప్పుడు చక్కగా మళ్ళీ ఇదంతా ఒక్కసారి సింహావలోకనం చేసుకొని recapitulate చేసుకొని దాన్నుంచి మళ్ళీ మనం రెండవ స్థాయిలోకి మనం metaphysical state లో అధ్యాత్మ సాధన అంటే ఏమిటి? అది ఎందుకు చేయాలి? దాని అవసరం ఉన్నదా? అక్కడ ఏమవుతుంది? అవన్నీ కూడా మనం విచారణ చేద్దాం. మీ అందరికీ నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సరటువంటి శుభాకాంక్షలు. ఆంగ్ల, ఆంధ్ర ఇవన్నీ మనము సంకుచిత పరిధి నుంచి విస్తృత పరిధిలోకి వెళ్దాం. వేదం ఏం చెప్పింది ప్రపంచానికి? విశ్వమానవుడివి కమ్మంది. మనిషిగా ఎక్కడ పుట్టినా నీవు విశ్వనరుడివి కమ్మంది. నీ సంపద, నీ ఐశ్వర్యము, నీ కీర్తి, నీ ఆధ్యాత్మిక అనుభూతి ప్రపంచం యొక్క సొత్తుగా దానికి సమర్పించమంది. అట్లాగే సమస్త ప్రపంచము ఒక్క కుటుంబంగా మారాలి, వసుధైక కుటుంబక నిర్మాణంలో మీరందరూ భాగస్వాములు కండి అన్నది. కాబట్టి సంకుచిత పరిధులు మనం దాటి ఒక విస్తృతమైన భావావస్థలో ఆనందంగా విహరించేటువంటి స్థాయిని సర్వోత్తములైనటువంటి గురు పరంపర మనకు మహా పరిపూర్ణమైనటువంటి అమృత వృష్టిగా మనందరిపై వర్షించు గాక అని మంగళాశాసనం చేస్తూ స్వస్తి.
YouTube · audio

Sai Prerana Satsang Meeting

Home

Sai Prerana Satsang Meeting

Source: Sai Prerana and Gow Vaibhavam on YouTube

0:00 / 1:48:45