Skip to content
Transcript తెలుగు
నమస్కారం. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహిమాన్విత మహా గురువులను స్మరించుకునే మహా పర్వదినం గురు పౌర్ణమి. విత్తాన్ని దోచుకునే వాడు గురువు కాదు, చిత్తాన్ని దోచుకునే వాడు మాత్రమే గురువు. అలాంటి మహిమాన్విత మహా గురువులు మనకెందరో ఉన్నారు. గురు పౌర్ణమి రోజు అలాంటి వారిని సమస్మరించుకోవటం కోసం, వారి తత్వాన్ని, గురుతత్వాన్ని మనకి ఆవిష్కరించడం కోసం ఇరువురు గొప్ప విశిష్ట అతిథులు మన దగ్గరికి వచ్చారు. వీరు ఆధ్యాత్మికవేత్తలు, అనాది మహిమలకు పునాది అయిన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మరింతగా తమ కార్యక్రమాల ద్వారా పరిఢవిల్లే చేస్తున్న గొప్ప వ్యక్తులు. ఒకరు వి.ఎస్.ఆర్. మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఓలేటి పార్వతీశం గారు. నమస్కారం అండి. అయ్యా మూర్తి గారు, గురు పౌర్ణమి రోజు వ్యాస భగవానుడిని ఎందుకు స్మరించుకోవాలి? ప్రారంభానికి ముందు గురు వందనం చేద్దాం. తప్పకుండా సార్. ప్రత్యక్ష కళ్యాణ భువే సునామ్నే ప్రత్యర్థ పీయూష దుహే స్వధాంనే ప్రత్యక్షర స్వాదురసైక సీమ్నే భూమ్నే నమస్తే నిగమాగ్రధాంనే. అది గురువు యొక్క స్థితి. వేద వేదాంతములకు చిట్టచివర చిటారు కొమ్మన ఒక మిఠాయి పొట్లం ఎట్లా ఉంటుందో అట్లా గురువుని అందుకునేటువంటి ప్రయత్నం పిపీలికాది బ్రహ్మ వరకు కూడా చేయాలి. వ్యాస పౌర్ణమిని గురుపౌర్ణమిగా ఎందుకు మనం భావించాం అంటే, పద్దెనిమిదవ వ్యాసుల వారి కంటే ముందు పదిహేడు మంది వ్యాసుల వారు వచ్చారు. వ్యాసులనేది ఒక విషయాన్ని విస్తృతంగా చెప్పేటువంటి ప్రతి వాడు వ్యాసుడే. కానీ పదిహేడు మంది ఏం చేశారో చరిత్ర లేదు. పద్దెనిమిదవ వారైనటువంటి ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు, బాదరాయనుడు అనేటువంటి అనేక నామాలతో ప్రసిద్ధి చెందినటువంటి వ్యాసుల వారిని మనం ప్ర-ప్రథమ లోకగురువుగా ద్వాపర యుగంలో సంభావన చేశాం. ఎందుకని ఆయన పేరు మీదే ఇది గురుపౌర్ణమి ఎందుకయింది అంటే, ఆయన అష్టాదశ పురాణాలు రచన చేశాడు. అలాగే ఒక ముద్దగా ఉన్నటువంటి వేద రాశిని సామవేదం అనేటువంటి దాన్ని పాటగా లేదా పాటని సామవేదంగా, మాటని ఋగ్వేదంగా, కర్మకాండాన్ని యజుర్వేదంగా వేద విభజన చేశాడు. అయితే చతుర్వేదం అంటారు కానీ మనం నిజానికి త్రయీ విద్యే వేద విద్య. మూడే. మిగిలిపోగా వీటిలలో వదగని అన్నీ కూడా అధర్వణ మహాముని పేరు మీద అధర్వణ వేదంగా, నాల్గవ వేదంగా మనం చెప్పుకుంటాం. అంతే కాకుండా బ్రహ్మసూత్రాలకి భాష్యం చెప్పకుండా బ్రహ్మసూత్రాలు ఉన్నాయి అని చెప్పినటువంటి ప్ర-ప్రథమ లోకగురువు వేదవ్యాసుల వారు. అలాగే, వ్యాసేన గ్రథిత పురాణములినా మధ్యే మహాభారతం అని కదా! భగవద్గీతని లోకానికి అందించినటువంటి ఆయన. విష్ణు సహస్రనామాన్ని అందించినటువంటి వారు. కాబట్టి ఒక వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఒక వైజ్ఞానిక వాంగ్మయ భూమికని ప్రపంచానికి ద్వాపర యుగం నాడే పరిచయం చేసి తద్వారా భారతీయ సంస్కృతిని ముందుకు తీసుకు వెళ్లటానికి ఒక పౌర్ణిమ అంటే ఒక సంపూర్ణమైనటువంటి వెన్నెలని, వెలుగుని ఏకకాలంలో ప్రసారం చేసిన తొలి లోకగురువు వ్యాసులవారు గనుక వ్యాసుల వారు ఆషాఢ పౌర్ణమి ప్రధానంగా గురుపౌర్ణమిగా మనం భావన చేస్తాం. గురువు ఎవరంటే కేవల లోక గురువా, కేవల విద్యా గురువా, కేవల భౌతిక, సూచక, వాచక, మోచక, నిషిద్ధ, దీక్షా, మంత్ర గురువు అంటే అన్నీ కలిపినటువంటి కారణ గురువే వేదవ్యాసుల వారు. అంటే కర్మ యోగాన్ని, భక్తి యోగాన్ని, యోగాన్ని, జ్ఞానాన్ని అన్నింటినీ కూడా ఒక సమ్యక్ స్వరూపంగా, వాంగ్మయంగా జగత్తుకు అందించినందువల్ల ప్రథమ పూజని ఆయనకే మనం చేస్తాం. అందువలన ఇది వ్యాస పౌర్ణమి అయింది. సమస్త జ్ఞాన సమాహారంగా వ్యాస భగవానుడి గురించి చాలా చక్కగా వివరించారండి. చాలా ధన్యవాదాలండి. యా పార్వతీశం గారు, గురువుల వైశిష్ట్యాన్ని గురించి ఇంకా మనకి నేటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా అన్వయించుకోవాలి, అనాది కాలం నుంచి ఎలా వారిని ఆరాధిస్తున్నారు, వారి వైశిష్ట్యత ఏమిటి? అందరికీ నమస్కారం. ఇవాళ గురుపౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మం ఒక హైందవ ధర్మ పరిరక్షణ, దీక్షా కంకణ బద్ధులైనటువంటి ఛానల్ కార్యక్రమం నిర్వహించడం నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ముఖ్యంగా మూర్తి గారు గురుపౌర్ణిమ అసలు వ్యాస పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమనే గురుపౌర్ణిమ అనడానికి ఉండేటువంటి ఔచిత్యాన్ని చాలా శుభగ సుందరంగా వారు వర్ణించినందుకు ముందు వారికి కూడా ధన్యవాదం తెలియజేస్తూ. గురువు వైశిష్ట్యం అనేది నిజానికి దేశం నుంచి మనం చూడాలి. భారతీయ సంస్కృతి అనేది బహుశా ప్రపంచ దేశాలన్నీ కూడా అనుసరించదగ్గినటువంటి స్థాయిలో ఉన్నాయి. గొప్పతనం కేవలం భారతదేశంలోనే ఉంది. గురువుని మనం ఎప్పుడూ దైవ స్వరూపంగా చూసేటువంటి సంస్కృతి ప్రపంచ దేశాలలో ఎక్కడా కనపడదు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం నమస్కారం చేస్తాం. అంటే గురువులో ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు ఆరాధనీయులు కదా భారతీయ సంస్కృతిలో. త్రిమూర్తి స్వరూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలలో గురువులో భగవంతుణ్ణి చూడడం అనేటువంటి ఆలోచన ఎక్కడా లేదండి. ఇది కేవలం భారతదేశంలోనే.కనుక గురువు వైశిష్ట్యాన్ని ప్రపంచంలో ఎవరు నేర్చుకున్నా మన దగ్గర నుండి నేర్చుకోవాలి. భారతదేశం నుంచి మాత్రమే నేర్చుకునేటువంటి పరిస్థితి. గురువు సాధారణంగా మనకి చదువు చెప్పేవాడినే గురువు అనేటువంటి ఒక తత్వం అది. అది సరైనది కాదు అన్నది కాదు నా భావన. మనకి అక్షరాభ్యాసం చేయించి లు దిద్దించే వాడు కూడా గురువే కాదనడానికి లేదు. అంటే లౌకికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏదైతే విద్య అవసరమో ప్రాథమికంగా దాన్ని నేర్పే వాడు కూడా గురువే. అయితే జీవితాన్ని ఇవ్వడం అనేది ఇప్పుడు సాధారణంగా జన్మ ప్రపంచంలోకి మనం ఎలా వస్తున్నాం? మన సంకల్పం వల్ల మన రావటం లేదు. మనం కోరుకుని నేను అనకాపల్లిలో పుట్టాలా? హైదరాబాద్ లో పుట్టాలా? కరీంనగర్ లో పుట్టాలా? అన్నది నా choice కాదు. మా తండ్రి ఎవరు? మా తల్లి ఎవరు? నా choice కాదు. కానీ ఏదో ఒక సంకల్పం ఎక్కడో జరిగి, భగవత్ సంకల్పం మనం భూమి మీద ప్రవేశిస్తూ ఉన్నాం. భూమి మీద మనం ప్రవేశించాం అంటే దానికి ఇద్దరు కారకులు ఒక తల్లి, ఒక తండ్రి. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అన్నాం. తల్లికి తండ్రికి మనం దైవ స్థానం ఇచ్చిన తర్వాత దైవ స్థానం ఇస్తున్నటువంటి మూడో వ్యక్తి మనకి సంబంధం లేని వ్యక్తి ఎవరంటే గురువు. ఇది ఎంత విశేషమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చారు. అంటే భౌతికమైన శరీరాన్ని దాంట్లో ఉండేటువంటి నాడీ స్పందన, ప్రాణం ఇదంతా కూడా తల్లిదండ్రుల ద్వారా మనకి సంక్రమించింది. కానీ పుట్టిన తర్వాత ప్రతి మనిషికి మరణం అనేది అనివార్యం. అంచేత జననం మరణం మధ్య ఉండే రెండు అవధుల మధ్య కొంత కాలవ్యవధి ఉన్నది. అది పది సంవత్సరాలు, యాభై సంవత్సరాలు, వంద సంవత్సరాలు జీవించే జీవికి కూడా తెలియదు. కనుక మధ్యలో ఉన్నదంతా జీవితం. కాలవ్యవధి. జీవితాన్ని సక్రమంగా నడపడం కోసం మనం సక్రమంగా నడుస్తూ మన చుట్టూ పరివేష్టించి ఉన్న సమాజానికి కూడా మార్గదర్శనం చేయడం కోసం, మనం నడుస్తున్న నడక ఇతరులకు కూడా అనుసరణీయమయ్యేటువంటి విధానం ఉండడం కోసం, ఏదైతే ఉపకరణాలు అవసరమో, జ్ఞానం అయితే ఉపాయనంగా మనకి అందివస్తుందో వివరాలను మనకు బోధించేవాడు గురువు. కనుక అనివార్యమైనటువంటి మరణం, అసంకల్పితంగా వచ్చినటువంటి జన్మ, మధ్యలో మనం గడపవలసినటువంటి జీవన వ్యవహారం, జీవన వ్యాపారం ఏదైతే ఉన్నదో దానికి కావలసిన ఉపాయనం అందించేవాడు గురువు. కనుక గురువు యొక్క వైశిష్ట్యాన్ని భారతదేశం గమనించినంతగా ప్రపంచ దేశాలు మరి ఎక్కడా గమనించనటువంటి దాఖలాలు లేవు. ఇది మొదటి నుంచి కూడా మీకు వస్తే ఇవాళ ఆధునిక కాలంలో ఉండి మనం గురువు గురించి వైశిష్ట్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇది పురాణ కాలం నుంచి ఉంది. ఇందాక మూర్తి గారు సంభాషించారు కదా. ఒక వ్యాసుణ్ణి తొలి గురువు అనుకుంటే, వాల్మీకి కూడా గురువే. వశిష్టుడు గురువు. విశ్వామిత్రుడు గురువు. విశ్వామిత్రుడు అంతటి వాడు అవతారమూర్తి అయినటువంటి రామచంద్రుడి చేత విద్యాభ్యాసం చేయించిన వాడు. అందుకే కదా ఆయన్ని వనసీమకు తీసుకు వెళ్ళిన వాడు. రకమైన అస్త్రశస్త్ర విద్యలన్నీ బోధింపబడినవి ఎవరి ద్వారా? అసుర సంహారం చేయడానికి ఉపాయనం అవసరమో శ్రీ రామచంద్రమూర్తి అంతటి వాడికి కూడా ఇచ్చినవాడు గురువే. కానీ తండ్రి బాధపడ్డాడు అతన్ని పంపించడానికి. కానీ మొత్తంలో వశిష్టుడు చెప్పడం చేత గురువుగారి వెంట వెళ్లడం అనేది రామచంద్రమూర్తికి కూడా అవసరమనేటువంటి విషయం పురాణ కాలం నుంచి వచ్చింది. అందుకే మన ఇంట్లో మన అమ్మానాన్న కూడా ముందు పాఠశాలలోనో, తర్వాత కళాశాలలోనో, తర్వాత విశ్వవిద్యాలయాల్లోనూ ఉత్తమ గురువుల దగ్గర ప్రవేశపెట్టడం అనేది ఉండగా వాళ్ళు కూడా ఇవాళ రకరకాల పీఠాలు పరివేష్టించి ఉన్నాయి దేశంలో. యతీశ్వరులు చెప్పినటువంటి మార్గంలో పయనిస్తూ మనకు కూడా కొంత మార్గసూచన చేస్తూ ఉంటారు. రకంగా గురువు వైశిష్ట్యం అనేది దేశంలో ఒక అనూచాన సంస్కృతిగా ప్రవహిస్తూ ఉంటది. అసంకల్పితమైన జన్మకు, అనివార్యమైన మరణానికి మధ్య ఉన్న కాలానికి సంబంధించిన గురువు ప్రాధాన్యత లౌకిక పరంగా, అలౌకిక పరంగా కూడా చక్కగా విశ్లేషణ చేశారండి. చాలా ధన్యవాదాలు. సర్ మూర్తి గారు, అజ్ఞానాంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్న వాడికి జ్ఞానోపదేశం చేసి జ్ఞానదీపం వెలిగించిన వాడే గురువా? అలాంటి గురువులను నేటి కాలంలో ఎలా అన్వేషించుకోవాలి? ఎలా గుర్తించుకోవాలి మనం? దీన్లో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారికి దారి చూపించేవాడని మాత్రమే కాదు. అది గు అంటే అజ్ఞానం, రు అంటే పోగొట్టు చాలా అలసిపోయిన మాట అది. గుణాతీతుడు, రూపరహితుడు గురువు. గుణాతీతుడు, రూపరహితం ఏది? ఆత్మ. నిజానికి ఒక spiritual level లో ఆధ్యాత్మిక స్థాయిలో గురువు ఎవరు అంటే ఆత్మే గురువు. ఎవడు నిజమైన స్నేహితుడు ఎవరు అంటే ఆత్మే. మిగతావన్నీ ప్రాపంచికమైనవి. కాబట్టి గురువు కేవలము జ్ఞానదీపం వెలిగించేవాడు మాత్రమే కాదు. లౌకిక, భౌతిక, నైతిక, పారలౌకిక, ఆధ్యాత్మిక విషయాలని సుస్పష్టం చేస్తూ, మానవ జీవిత పరమార్థం ఏమిటో తెలియజెప్తూ మన యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించేటువంటి శిల్పాచార్యుడు గురువు. సత్యాచార్యుడు గురువు. అచ్చమైనటువంటి ఆచార్య స్వరూపమే గురువు. అందుకనే తల్లి తండ్రి గురువు దైవం ఇది పరంపర. తల్లి మనం జన్మ ఎత్తగానే అడుగో నీ తండ్రి అని చూపిస్తుంది. కనురెప్ప ఎత్తటం కూడా తెలియని బిడ్డ సమూహంలో ఉన్న తన తండ్రిని గమనిస్తాడు, గుర్తిస్తాడు. తల్లి తండ్రి ఇద్దరూ కలిసి గురువు దగ్గరకు తీసుకెళతారు. ఆనాటి కాలంలో వేద విద్యాభ్యాసం కోసం ఐదేళ్లప్పుడు ఒకప్పుడు, ఎనిమిదేళ్లప్పుడు రెండోసారి తీసుకుని వెళతారు. అంటే వేద విద్యను గురుకుల విద్యా విధానంలో నేర్పడానికి అర్హత ఎవరికి ఉన్నదంటే ఎవరు నిష్ఠాగరిష్టుడై తపస్సు, ధ్యానము, ధారణ ఇవన్నీ కూడా తన వ్యక్తిత్వంలో ఒక పూర్ణత్వాన్ని నింపుకున్నటువంటి గురువుతన శిష్యున్ని నెమ్మదిగా శిష్యుడుగా తీసుకుంటాడు. బోధకుడు సాధకుడు అవుతాడు తర్వాత. తర్వాత ఆచార్యుడు, అంతేవాసి అవుతాడు. ఇవన్నీ కూడా అనేకమైన స్థాయిలు. అంతేవాసిత్వాన్ని పొందే దాకా గురువు వదిలిపెట్టడు. ఇక ఆధునిక కాలంలో గురువుని అన్వేషించటం అంటే, ప్రాచీన కాలంలో కూడా మనం గురువుని అన్వేషించలేం. గురువును వెతుక్కుంటూ ఈయనే నా గురువు అని వెళ్ళలేం. గురువే మన జీవితంలో అవసరమైనప్పుడు ప్రవేశించి, తన ప్రవేశం ద్వారా మన మానసిక పరిస్థితిని గమనించి మనకి విద్య గనక నేర్పితే దానిలో ఉత్తీర్ణతను సాధిస్తామో, మళ్ళీ సాధించినటువంటి విద్యని సమాజహితం ఎలా చేస్తామో, అవన్నీ కూడా సంపూర్ణంగా ఒక వ్యక్తిత్వ వికాసం అంటే అది. అది చేసేటువంటి వాడు మాత్రమే గురువు గనుక గురువుని అన్వేషించటం లేదు. అది, అది చాయిస్ లాగా, ఛాన్స్ లాగా, యాక్సిడెంటల్ గా, ఇన్సిడెంటల్ గా వచ్చేవాడు గురువు కాదు. గురువు మన జీవితంలో ప్రవేశిస్తాడు, అవసరమైతే. గురువు వచ్చినా ఈయన గురువు అని గ్రహించలేని స్థితిలో మనం ఉంటే ఆయన ఎందుకు వస్తాడు? కాబట్టి మన పాత్రత, మన అర్హత, మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి జిజ్ఞాస, ఇవన్నీ కూడా ఒక గురువుని ఆకర్షించి ఆయనే మన వైపు నడిచి వచ్చేట్టుగా చేస్తాయి. అది. సంతోషం అండి. నిరాకార నిర్గుణ సంపన్నమైన పరబ్రహ్మ తత్వానికి ఏకత్వ ప్రతీక రెండక్షరాలు అనే విషయాన్ని గురించి కొత్త గురుకు శబ్దానికి మంచి అర్థం చెప్పారు. ఒక భిక్షగాడు అం, గృహస్తురాలి దగ్గరికి వెళ్లి "భౌతీ భిక్షాందేహి" అంటే వచ్చి భిక్ష తీసుకొచ్చిన తర్వాత "ఓరేయ్ వెధవా! నీ పాత్ర శుభ్రం చేసుకోరా భిక్ష వేస్తా"నంటే, గురు కృప కూడా అలాంటిది అంటారు మీరు ఖచ్చితంగా. ఎందుకంటే మన దేహం అనే క్షేత్రం పరిశుభ్రంగా ఉంటేనే గురు కృప అయాచితంగా అది నడుచుకుంటూ మన దగ్గరికి వస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి. సంతోషం అండి. మనం శుభ్రం చేసుకున్నా, చేసుకోకపోయినా- ఉమ్. ఏమాత్రం కొంత మాలిన్యం ఉన్నా గురువు దయా రూపుడై వస్తాడు. ఉమ్. దాన్ని కూడా ఆయనే క్లీన్ చేస్తాడు. అదే. అది. అంటే సంకల్పం వీడికి ఉండాలి. నేను, నన్ను నేను శుద్ధి చేసుకోవాలి- అంటే స్వీయ లోపం తెలియదుగా. అవును, అవును. స్వీయ లోపాన్ని తెలుసుకోగలిగిన శక్తివంతుడు ఎవరంటే గురువు. మనకి మనమే మన స్వీయ లోపాన్ని తెలుసుకోగలిగితే గురువు యొక్క అవసరమే లేదు మనకి. అదే. అది. పది అడుగులు వేయాల్సిన సమయంలో కనీసం ఒక ఐదారు అడుగులైనా వేస్తే- అవును. ఇక వాడు వేయలేకపోతున్నాడు శక్తి లేదు కాబట్టి నేను, నా అవసరం ఉందని చెప్పనే భావనతోటి- అవును. ఆయన వస్తారు మన దగ్గరికి. అవును. విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. పార్వతీ సింగ్ గారు చాలా నానుడు అన్నమాట ప్రజల్లో. పండితుడు, పామరుడు దగ్గర నుంచి కూడా మాట అనుకుంటూనే ఉంటూ ఉంటారన్నమాట. "గురువు లేని విద్య గుడ్డి విద్య" అసలు ఎందుకు వచ్చింది మాట? గురువుతో, గురువు ప్రస్తావన ఉండాలా? విద్య నేర్చుకోవాలన్నా గురు-గురువుతో, గురువు సా-సమక్షంలో నేర్చుకోవాలా, గురువు ద్వారా నేర్చుకోవాలా, మంత్రోపదేశం గానివ్వండి ఇంకోటి, ఇంకోటి ఏదైనా సరే. గురువుతో అనుసంధానమై ఉన్నది జీవితం కాబట్టి విద్య నేర్చుకున్నా గురువు ప్రాధాన్యత, ప్రాముఖ్యత మనకు కావాలనే ఉద్దేశం ఇందులో ఉందనుకుంటున్నా బహుశా. మీ మాటల్లో చెప్పండి. ఇది ఒక రకంగా మనం ఆలోచిస్తే కొన్ని పరిపాటి మాటలు వచ్చేస్తాయి. ఇందాక ఆయన అన్నారు. అవి. అవి గురు, 'గు' శబ్దానికి ఇది, 'రు' శబ్దానికి ఇది, ఇవన్నీ నానుడులుగా అలా పరివ్యాప్తం అయిపోవడం తర్వాత వాటి విలువను మనం గ్రహించలేం. అవును. గ్రహించేటువంటి ఆలోచనను పెంచుకోవడమే మనిషి యొక్క జ్ఞానానికి ప్రతీక అవుతుంది. ఇందాక ఆయన "గురువు ఒక శిల్పాచార్యుల లాంటి వాడు" అన్నారాయన ఒక మాట, ఆయన మాట్లాడుతూ. మనం మామూలుగా ఒక మట్టి ముద్ద లాంటి వాళ్ళము, గండసలం లాంటి వాళ్ళము, కొండ ముక్క లాంటి వాళ్ళము, ఇలాంటి వాళ్ళం. దీంట్లో ఒక ఆకారాన్ని చెక్కీ లోకం ముందు ఆకారాన్ని, అంటే మనకి మానవుడిగా భౌతికమైన శరీరం అమ్మానాన్న ఇచ్చిన ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది, అది చెక్కడానికి శిల్పి కావాలి. కేవలం మనిషి రెండు కాళ్ళు, రెండు చేతులు, ముక్కు, చెవులు వీటితో పాటు అమ్మానాన్న జన్మనిస్తారు. కానీ ఇలాంటి కోటానుకోట్ల జీవులు ఉన్నారు కదా! కోటానుకోట్ల జీవులలో ఒక మనిషికి వ్యక్తిత్వం ఏర్పడాలి కదా! మిగతా జన్మ తల్లి ఇచ్చినా, తండ్రి ఇచ్చినా ప్రధానమైంది. కానీ దీన్ని చెక్కీ వ్యక్తిత్వం వంద మందిలో వీడు, వెయ్యి మందిలో వీడు, కోటి మందిలో వీడు అని ని-నిలబెట్టగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని ఎవరు ఇస్తారు? చెక్కే శిల్పి ఎవరని చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. ఊహూ. మన వ్యక్తిత్వాన్ని ఆయన చెక్కుతాడు. చెక్కేటువంటి విషయం కావాలి. అందుచేత గురువు కావాలి. అది. విద్యకి ఎందుకు కావాలి అంటే మనం ఇప్పుడు అక్షరాభ్యాసం చేయిస్తారు అమ్మానాన్న ఇంటి దగ్గర కూర్చొని. లు నేర్చుకుంటాం. లు తర్వాత ఏదో మాట, మాట నేర్చుకుంటాం. అత్త అంటాం, అమ్మ అంటాం, మరొకటి. మాటలు ఒక్కొక్కదాని ప్రక్కన చేర్చడంలో ఒక వాక్యం ఏర్పడుతుంది. కానీ వాక్యం కావ్యమై పరిఢవిల్లాలంటే మధ్యలో వ్యాకరణం ఉంది. ఊహూ. కేవలం "అమ్మ ఆకలేస్తోంది, అన్నం పెట్టు" అని మాట్లాడేటువంటి వాక్యం తర్వాత దాన్ని ఒక మహాకావ్యం, ఆకలి మీద ఒక మహాకావ్యం రాయాలంటే మధ్యలో కొంత జీవన వ్యాకరణం ఉంది. భాషా వ్యాకరణమే కాదు, జీవన వ్యాకరణం కూడా ఉంది. ఇది తెలియజేయాలంటే గురువు అవసరం. ఎందుకంటే మనం చీకటిలో నుంచి వస్తాం. అమ్మ గర్భవాసం చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉండేదంతా చీకటే అండి. అమ్మ గర్భవాసం మనం చేస్తున్నప్పుడు, మాతృ గర్భంలో ఉన్నప్పుడు మనకు ఏమీ తెలియదు. మనకు కేవలం చీకటి, ఎక్కడున్నామో కూడా తెలియదు, స్పృహ లేదు. భూమి మీదకి బయటకు వచ్చేదా- అమ్మ ద్వారాలు తెరిచిన తర్వాత మనం ప్రపంచంలో ప్రవేశించే వరకు అక్కడ గర్భవాసంలో ఉంటాం. పుట్టిన తర్వాత భౌతికమైన జన్మ తప్ప తదనంతరమైనటువంటి స్పృహ మనకు లేదు ప్రపంచంలో. అమ్మ కొద్దిగా నేర్పుతుంది. అందుకే తొలి గురువు ఎవరంటాం అంటే అమ్మ అంటాం మనం. దీనికి కారణం అది. ఎందుకంటే అమ్మ ఇందాక ఆయన చెప్పారు, నాన్నని పరిచయం చేసేది. అమ్మ అనేది నిజం అండి. నాన్న అనేది విశ్వాసం. నాన్న ఎవరో నిజంగా మనకు తెలియదు. కానీ అమ్మకి పుడతాం కనుక, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సాక్ష్యం చెబుతారు కనుక ఈవిడ మీ అమ్మరా అని చెప్పడానికి అది నిజం. కానీ, "ఈ తండ్రి ఫలానా వాడు" అని అమ్మ చెబుతుంది చూశారా, దాన్ని నమ్ముతాం మనం, అది విశ్వాసం.అంచేత ఒక నిజం ఒక విశ్వాసం రెండు ఆధారం చేసుకుని ప్రవేశిస్తాం మనం ఇక్కడ మిగతా ప్రపంచ లౌకిక ప్రపంచ విషయాలు జీవన వ్యవహారాలు తెలియవు అంచేత నీ వ్యక్తిత్వాన్ని నువ్వు సమకూర్చుకోవాలంటే విషయాలు నేర్చుకోవాలో వీటి పట్ల రకమైన అవగాహన ఉండాలో తెలియచేసే వాడే గురువు. కనుక గురుముఖంగా నేర్చుకోవలసినటువంటి విద్యను గురువు ద్వారా సంక్రమింప చేసుకోవాలి తప్ప మనకి వ్యాకరణం వచ్చు నాలుగు వాక్యాలు వచ్చు ఇది చదువుదాం పద్యం నేర్చుకుందాం అంటే తప్పని కాదు విషయం పరిజ్ఞానం పరిఢవిల్లేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. అవతారమూర్తులు కూడా భాగవతంలో ఒక పద్యం అంటాడు ఆయన పోతనగారు "ఉర్విన్మానవులెవ్వరైన గురువాక్యోజ్జుప్తులై గానీ ఉర్విన్మానవులెవ్వరైన గురువాక్యోజ్జుప్తులై గానీ తత్పూర్వారంభము సేయబోలదనుచు బోధించు చందంబునన్ సర్వజ్ఞత్వముతో జగద్గురువులై సంపూర్ణులై యుండియున్ సర్వజ్ఞత్వముతో సంపూర్ణులై జగద్గురువులై యుండియున్ గురువంగీకరణంబు సేయజనిరా గోవిందుడున్ రాముడున్" అంటాడు. గోవిందుడు కృష్ణుడు రాముడంటే బలరాముడు వీళ్లిద్దరూ వెళ్లారు ఎక్కడికి వెళ్లారు సాందీపుని ఆశ్రమానికి వెళ్లి విద్య నేర్చుకున్నారు కృష్ణం వందే జగద్గురు అనే సంస్కృతండి కృష్ణుడు జగద్గురువు అని దండం పెడతాం ఆయన వెళ్లి చేతులు కట్టుకొని గురువుగారి ముందు కూర్చొని చదవడం ఏమిటి? సాందీపుడు అవతారమూర్తి కన్నా గొప్పవాడా? ఇక్కడ విషయం ఏమిటంటే ఒక గురుముఖంగా విద్యనైనా నేర్చుకుంటే తప్ప దానికొక సమగ్రత లేదు అనేటువంటి విషయం మనకి తెలియడం కోసం జగద్గురువైనటువంటి శ్రీకృష్ణుడు కూడా సాందీపుని దగ్గరికి వెళ్లి విద్య నేర్చుకున్నాడు. ఇది గురువు యొక్క గురువు యొక్క అవసరం ఎందుకు గురువు లేని విద్య దాక గుడ్డి విద్య అని అన్నారు ఒక మాట ఇది కారణం అంచేత ప్రపంచంలో ఏదైనా గురుముఖంగా నేర్చుకుంటే తప్ప నీ విద్యకు ఒక స్థితి ఏర్పడదు అది రాణించదు అనేటువంటి విషయాన్ని సాక్షాత్తు కృష్ణ భగవానుడే మనకు తెలియజేసినటువంటి ఒక గొప్ప నేపథ్యం ఉన్నది. రకంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. సంతోషం అండి అవతార పురుషుడైన కూడా అమ్మ గర్భాన పుట్టి గురువు దగ్గరికి వెళ్లి విద్యలు నేర్చుకొని తన జన్మ కార్యక్రమం ఎందుకైతే జన్మించారో జన్మ పరమార్థం నెరవేర్చుకున్నారు అలాంటి మహాపురుషులు ఎంతో మంది ఉన్నారు మీరు చెప్పింది అక్షరాలనేది ఉండి చక్కగా చెప్పారు అన్వయించుకొని. ధారలో చిన్న విషయం శ్రీరామచంద్రుడు కృష్ణుడి కంటే ముందు వచ్చాడుగా ఆయన ఎనిమిది ఏళ్లప్పుడు అయోధ్యా నగరం చూసేద్దామని రథం ఎక్కి వెళ్ళాడు వెళ్లి వచ్చాడు ఒక విషన్న హృదయంతో కూర్చున్నాడు సభలో వశిష్ఠులవారు వచ్చారు ఏంటి రాముడు ఇలా కూర్చున్నాడు అని ఆయన జ్ఞాన దృష్టి కదా మిగతా వ్యాసంగంలోకి దిగకుండా రాముడి ముందు కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాడు. అవి ముప్పై మూడు వేల శ్లోకాలతో యోగవాశిష్ఠం అయింది లేదా వశిష్ఠ గీత. చిట్టచివరికి రాముడిని వశిష్ఠులవారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నీ మనస్సు ఎట్లా ఉన్నది అని అడిగారు రాముడి జవాబు ఏంటంటే గురువర్యా నేను ఇప్పుడు మనస్సన్యాసిని అన్నాడు మనస్సును గనక సన్యసించకపోతే అంటే వదిలిపెడితే అని కాదు సన్యాసం అంటే ఏంటి వదిలిపెట్టడం కాదు సమన్యాసమే సన్యాసం నా మనస్సుని ఇంట బయట ద్వంద్వాలలో నిలబెట్టుకునేటువంటి ఒక సమస్థితి ఏర్పడింది అని జవాబిస్తాడు కాబట్టి అటువంటి రామచంద్రుడికి జ్ఞానబోధ చేయడానికేమో ఇంట్లో వశిష్ఠులవారు ఉన్నారు. రావణ సంహారం ఆయన కర్తవ్యం కాబట్టి అస్త్రశస్త్ర నైపుణ్యాన్ని వరదానం చేయాలి అంటే మరొక బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడే కావలసి వచ్చింది కాబట్టి రాముడి విషయంలో ఇద్దరు బ్రహ్మర్షులు గురువులైనారు ఇక మనమెంత. ఖచ్చితంగా సమస్థితి అనేది ఎలా అలవర్చుకోవాలనేది వశిష్ఠ ఆయన చెప్పిన తర్వాత రాముడు దాన్ని గ్రహించి మనశ్శాంతితో హాయిగా ఉన్నారాయన కొంచెం మనసు తేలికపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు అట్లాగే నవరసాలు ఒలికించిన అవతారాల్లో శ్రీకృష్ణావతారం సంపూర్ణమైనది మరి ఆయన్ని అన్ని రకాలుగా అన్నింట్లోనూ వెలిబెట్టారు అనే నవరసాలు ఒలికించారు మరి కృష్ణ పరమాత్మ అంటారు ఆయన్ని కృష్ణం వందే జగద్గురు అంటారు దీనికి కారణం ఏంటి? కారణం ఒక్కటే కర్మయోగం భక్తియోగం జ్ఞానయోగం మనం మూడు పుస్తకాలు చదువుకున్నాం ఆయన మూడు మహా ఇతిహాసాలలో తనను తాను వ్యాపింపజేసుకున్నాడు కృష్ణ పరమాత్మ కర్మయోగం అంతా కృష్ణుడి కర్మయోగం ఎట్లా పట్టుకోవాలి అంటే భారతం చదవండి కృష్ణుడు విష్ణు స్వరూపంగా ఉన్నదాంట్లో భక్తియోగం ఎక్కడున్నదంటే భాగవతం నిండా అదే ఉంది తర్వాత జ్ఞానయోగం ఎక్కడున్నదంటే భగవద్గీత నిండా యోగీశ్వర కృష్ణుడయినాడు కనుక లోక గురువైన వ్యాసులవారు తొలి కొస అయితే ద్వాపర యుగంలో చివరి కొస కృష్ణ పరమాత్మ. అందుకనే ఆయన ఇందాక పార్వతీశం గారు చెప్పారు కోటిలో ఒకడు లక్షలో ఒకడు వెయ్యిలో ఒకడు పదిలో ఒకడు ఐదుగురిలో ఒకడిని ఎన్నుకున్నాడు ఆయన బోధ చేయటానికి అర్జునుడు ధర్మరాజు మంచివాడు కదా ఆయనకి చెప్పొచ్చు కదా జ్ఞానం అంతా చెప్పలే ఎందుకంటే యుద్ధం అయిన తర్వాత ఆయన సన్యాసి కాబోవటం లేదు మహారాజు కాబోతున్నాడు రాజుకి ఇది అవసరం లేదు రాజు తన సాత్విక రాజసిక తామస గుణాలతోనే పాలన చేయాలి రెండోవాడు భీముడు బుద్ధిబలం తక్కువై దేహబలం ఎక్కువైనవాడు ఇది ఎక్కదు సొక్కదు ఇక తర్వాత ఇద్దరూ చిన్నవాళ్ళు పరిణితి చెందిన వాళ్ళు కారు.కనుక జ్ఞానాన్ని అందుకోగలిగినటువంటి పాత్రత ఎవరి దగ్గర ఉన్నదంటే, "యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః" సిద్ధుడై, శుద్ధుడై, సంసిద్ధుడై నిత్యమూ ధనుర్ధారి అయినటువంటి ఒక సాధకుడు గనుక దొరికినట్లయితే బోధకుడి పని సులువవుతుంది. ఏం బోధించాలంటే చదువులన్నీ చదివి చావంగా నేటికి చావులేని చదువు చదువవలెను. అదే పోతనామాత్యుడు భాగవతంలో చెప్పింది. చావులేని చదువే జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని మూడు యోగాల ద్వారా కృష్ణ పరమాత్మ ద్వాపరాంతంలో ఈయన్ని అద్భుతంగా ఆవిష్కరించాడు. కనుక మనం ఆయన్ని "కృష్ణం వందే జగద్గురు" అన్నాం. బాల-బాల్యంలో ఉన్నటువంటి కృష్ణునికి మనం నమస్కారం చేయం, ముద్దు పెడతాం. "జిహానం జిహానం సుజానేన మౌధ్యం దుహానం దుహానం సుధాం వేణునాదైః లిహానం లిహానం సుదీర్ఘైరపాంగై మహానంద సర్వస్వమీతం నమస్తాత్" అంటాడు లీలాశుకుడు. అంటే నందుడికి మహానందాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి వాడా అని ఒక అర్థమైతే, మహానందం గనక ఒక రూపం తీసుకుంటే అది కృష్ణుడు. అది ఎప్పుడు? బాలకృష్ణుడు. తర్వాత ప్రౌఢ కృష్ణుడు మధ్య వయస్కుడైన వాడు. ఎనభై తొమ్మిదవ ఏట యుద్ధానికి వెళ్ళిన కృష్ణ పరమాత్మ జ్ఞానవృద్ధుడు. కనుక అక్కడ ఆయన జగద్గురు స్థానాన్ని తీసుకుని జగత్తుకి, ఏది? అంతరించబోతున్న ద్వాపర కోసం చెప్పలా, ద్వార-ద్వాపర యుగం కోసం చెప్పలా, అవతరించబోతున్న కలియుగానికి జ్ఞాన వరదానం చేశాడు. కనుక "కృష్ణం వందే జగద్గురుమ్" ఆయన జగద్గురువై వచ్చాడు. అది. మిగతా రసాలన్నీ ఆయన జీవితంలో ఒక ప్రవాహంగా, ఒక అంతర్వాహినిగా సాగిపోయినయి. అది లీలా, మాయ, మానుష్యంగా సాగినయి. నిజానికి కృష్ణ పరమాత్మ జీవిత గాథంతా ఒక మధుర విషాద గాథ. అది ఎంత మాధుర్యమో అంత విషాదం. ఎందుకంటే ఆయన పొందినన్ని అను-అనుమానాలు, అవమానాలు, అవహేళనలు జాతి చేత, కులం చేత, చేష్ట చేత, చూపు చేత, సౌందర్యం చేత ఎవరు అవతారమూర్తి పొందలా. కనుక ఇవన్నీ దాటి "ఇది కాదు, అసలు నేను వచ్చింది ఎందుకు?" "యది యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత Abhyutthānam adharmasya tadāt mānam sṛjāmyaham" "నన్ను సృష్టించిన వాడు లేడు, నన్ను నేనే సృష్టించుకొని వచ్చా. కాలమంతా గడిచిపోయింది. ఇప్పుడు ఇదిగో జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను" అన్నందువలన అర్జునుడి ద్వారా సమస్త కలియుగ ప్రజకి ఆయన జగద్గురువైనాడు. కనుకనే "కృష్ణం వందే జగద్గురుమ్" అది. పార్వతీశం గారు, గురుదక్షిణ సమర్ధనీయమేనా? [నవ్వు] మంచి మాట అది. చక్కగా అన్నారు. సాధారణంగా ఏమనుకుంటాం అంటే, ఇవాళ ఒక లౌకికమైన జీవితం మనం గడుపుతూ ఉన్నాం. ఏదో పాఠశాలకు వెళితే దానికి వెయ్యి రూపాయలో, రెండు వేలో, కొన్ని చోట్ల లక్షలు ఫీజులు కట్టడం అనేది [నవ్వు] ఎందుకంటే విద్య మనం నేర్చుకోవడం కోసం అన్నది ఒక లౌకిక వ్యాపారంగా కనబడుతూ ఉన్నది మనకి. కానీ గురుదక్షిణ అనే మాటకి రకమైనటువంటి ఆలోచన మనకి ఉండకూడదు. ఇవాళ ఏంటంటే వర్తమానంలో జీవిస్తున్నాం కనుక, ఇవాళ ఒక మంచి స్కూల్లో చేరాలంటే కనీసం మా అబ్బాయికి నేను పదివేలో, పాతిక వేలో, ముప్పై వేలో ఫీజులు కింద కట్టాలి కనుక, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు, లెక్చరర్లకు జీతం అవ్వచ్చు, ఏదో కారణం కావచ్చు. అంచేత ఇక్కడ నిలబడి నేను ఆలోచిస్తున్నాను, ఇవాళ బతుకుతున్నాను గనుక. అవునా, రోజుల్లో కూడా గురుదక్షిణ ఇచ్చారు కదా, గురువుకు డబ్బులిచ్చారు కదా, గురు శుల్కం ఉంది కదా అన్నట్టుగా ఆలోచన సాగుతుంది. అది మన సంస్కృతిని ఆలోచించేది ఎప్పుడుప్పుడు కూడా, ఇందాక ఆయన చెప్పారే, ఒక ద్వాపరం, ఒక త్రేతాయుగం, ఇప్పుడు నడుస్తున్నది ఒక కలియుగం. ఇలా యుగ ధర్మాన్ని బట్టి మన జీవన పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. అది అందరికీ తెలిసినదే. కనుక మనం ఇవాళ నివసిస్తున్న వాళ్ళం ఆనాటి తరం లో ఒక ఋష్యాశ్రమంలో వాడు విద్య నేర్చుకుని వచ్చేటువంటి రోజుల్లో ఉండేటువంటి పరిస్థితిని అంచనా వేసి మాట్లాడవలసినటువంటి విషయాల్లో గురుదక్షిణ ఒకటి. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా రమణ మహర్షి ఒక గురువు. రమణ మహర్షి దగ్గరకు ఒక శిష్యుడు వెళ్లి అడిగాడట. "అయ్యా! నేను చాలా అశక్తుణ్ణి. మీరేమో మరి ఇంతకాలం నన్ను గురువుగా ఉండేలా చేశారు. నేను గురుదక్షిణ ఇవ్వలేకపోతున్నాను." అన్నాడట. ఆయన అడిగింది లేదు. వీడు వెళ్లి చెప్పడం ఎందుకు ఆయనకి? "ఒరేయ్! నువ్వు నీ స్థితి నుంచి నువ్వు జారిపోతున్నావు. ఇంతకాలం నేను చెప్పిన మాటలు విన్నావో, ఇంకోటేదో చేశావో, నీ ఆత్మ స్థితి నుంచి జారిపోతున్నావు. అలా జారకుండా నువ్వు నిలబడడమే నాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ. నన్ను అనుసరిస్తూ ముందుకు నడుపుతున్నావు కదా, ముందుకు అడుగేస్తున్నావు కదా, కనుక నేను చెప్పే మార్గంలో పక్కకు వెళ్ళకుండా ఋజుమార్గంలో నడవడం కన్నా గురుదక్షిణ వేరే ఏం ఉండదని" ఇవాళ ఆధునిక కాలంలో నిన్న మొన్నటిదాకా ఉండేటువంటి గురువు కూడా చెప్పాడు. కనుక గురుదక్షిణ అనేటువంటి మాటని కనుక మనం సవ్యంగా కాలమాన పరిస్థితుల ఆధారంగా కనుక మనం చెప్పుకోకపోతే తప్పనపాట అవుతుంది. ఎందుకంటే ఇవాళ కొన్ని వ్యతిరేకమైన భావాలు చాలా విస్తృతంగా వచ్చాయి. ఇప్పుడు ద్రోణుడు ఉన్నాడు. ద్రోణుడు అంత గొప్ప శిష్యుడి దగ్గర బొటనవేలు తీసుకున్నాడు. "ఎంత అన్యాయమండీ! ఎంత కర్కశుడండీ! ఎంత క్రూరుడండీ!" అని మనం మాట్లాడుతాం ఇవాళ ద్రోణుడి గురించి. వాటి పట్ల అవగాహన లేదు కనుక. ఇవాళ మనం జీవిస్తున్న కాలం వేరు, కాలం వేరు. నిజమే ఇప్పుడు పాండు కుమారుని ఎంచుకు-ఇందాక ఆయన ధర్మరాజుకి ఎందుకు చెప్పలేదు, అర్జునుడికే ఎందుకు చెప్పాడు అని ఒక అద్భుతంగా రీచ్ చెప్పారు ఆయన. అంచేత గురువు అనేటువంటి వాడు కూడా తన శిష్యుణ్ణి తాను ఎంచుకుంటాడు. మనం ఎలాగైతే గురువుని అన్వేషిస్తూ అది చేసో, ఇది చేసో మనం పాకులాడతామో, గురువు కూడా "వీడు నా దగ్గర ఉండదగిన వాడా?" లేకపోతే పది మంది శిష్యులు ఉంటే పది మంది ఒక్కలా ఎందుకు తయారవ్వటం లేదు? కాదు కదా! కనుక గురువు అన్వేషణ కూడా ఒకటి ఉంటుంది.ఇప్పుడు పాండు కుమారులకు విద్య చెబుతున్నాడు అటు కౌరవులకి గురువంశంలో ఉండేటువంటి బాలురు అందరికీ. ఏకలవ్యుడికి చెప్పడానికి కొన్ని వ్యవహారాలు అడ్డం వచ్చాయి చెప్పలేదు ఇవన్నీ సరే కథలు మనం పక్కన పెడదాం. తర్వాత ఏకలవ్యుడు గురువుగారి విగ్రహం పెట్టుకోవడం చాలా గొప్ప విలుకాడు అవడం ఇది కూడా మనం చదువుకున్న విషయమే. అయితే అంతఃమందిరంలో ఇందాక ఆయన గీతా బోధ కోసం అర్జునుడిని ఎలా ఎంచుకున్నాడు విలువిద్యలో కూడా ప్రపంచంలో సాటిలేని విలుకాడిగా చేయగలిగిన వాడు ఒక్కడే అని అర్జునుడిని నమ్మాడు ఆయన. అది నిజం కూడా వాస్తవం కూడా. విధంగా అద్భుతంగా తయారు చేశాడు. తర్వాత కుమారులందరూ కలిసి వేటకు వెళ్ళినప్పుడు వాడితో కూడా సునకం వెళ్ళింది. కుక్క మొరుగుతూ మొరుగుతూ మొరుగుతూ ఉంది అప్పటికి అభ్యాసం చేస్తున్నాడు అక్కడ అడవిలో ఉన్నటువంటి ఏకలవ్యుడు. తన అభ్యాసానికి భంగం కలిగిస్తున్నది. అలా భంగం కలిగిస్తున్నటువంటి సునకం పైన అతను శబ్దవేధి విద్యతో బాణప్రయోగం చేశాడు. ఎలా చేశాడు? దాని నోట్లో నుంచి ఒక నెత్తురు చుక్క కూడా బయటికి రాకుండా బాణాలతో దాని నోరు కట్టడి చేశాడు బాణాలను ప్రయోగించేసి. వీళ్ళంతా అక్కడికి వెళ్ళే అప్పటికి ఆయన కనపడ్డాడు. కుక్క మొరగట్లేదు అది బంధించబడి ఉంది. అప్పుడు నన్ను లోకోత్తరమైన వీరుడిని తయారు చేస్తానన్నటువంటి గురువు ఇదేమిటి ఇంతకన్నా లోకోత్తరుడు వీడు ఇక్కడ కూడా ఉన్నాడే అంచేత నేను ఇంకా వాడి స్థాయికి చేరలేదే అని వాడికి భావం కలిగింది తప్ప ఇతన్ని ద్రోణుడిని అవసరం-- తర్వాత మనకి కథ తెలుసు కదా ఆయన నీ బటను వేలు ఇరా అన్నాడు ఖండించాడు ఇచ్చాడు అంతా విషయం. కానీ ఇక్కడ ఏకలవ్యుడి పైన విముఖత ఉందో లేదా అర్జునుడికి ఇచ్చిన మాట నిలబెట్టడానికో తన బటను వేలు అడగలేదు. ఒక మూగజీవి పైన తనకి భంగం కలిగిస్తోంది అభ్యాసానికి అని తెలిసినటువంటి ఒక మూగజీవి పైన శబ్దవేధి లాంటి ఒక అద్భుతమైన విద్యను ప్రయోగించాడు. అంటే ఎక్కడ విద్యను ప్రయోగించాలో ఎరిగినవాడు. తెలియనటువంటి ఒక పరిస్థితికి అతను శిక్ష వేశాడు తప్ప అర్జునుడి కోసం బటను వేలు అడగలేదు. అంతే కదా. ఒక మూగజీవి కదా కుక్క ఏం చెప్పగలదు అది ఏం చెప్పాలన్నా అరిచే కదా చెప్పాలి. అంచేత తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మూగజీవిని అద్భుతమైనటువంటి విద్య శబ్దవేధి తోటి మొత్తం దాని నోరు కట్టడి చేశాడు. ఇటువంటి పరిస్థితి చేయకూడదు. పిసుక మీద బ్రహ్మాస్త్రం అంటాం మనం. అవును. అంచేత ఎక్కడ ఏది ప్రయోగించాలి నీకు తెలియాలి ముందు. అందుకే ఇందాక మనం గురుముఖంగా విద్య నేర్చుకోవడం అనేది ఇదీ కారణం. అది గురువు ద్వారా నేరిస్తే తప్ప మరి ఆయన స్వయంకృష్టుడిగా ఆడు గురువు బొమ్మ పెట్టుకున్నాడు పెద్ద విలుకాడి అయిపోయాడు. ఇది గురుముఖంగా జరగలేదు. గురువు యొక్క మూర్తి మాత్రమే ఉంది గురువు దానిపై వివరాలు చెప్పలేదు. ఇలా చెప్పకపోవడం వల్ల ఇందాక మనం మాట్లాడుకున్న విషయాలు. రకంగా ఏకలవ్యుడు చేసినటువంటి పని సమర్థనీయం కాదు కనుక దానికి ఇచ్చినటువంటి శిక్ష తప్ప అర్జునుడి కోసం ఏదో పక్షపాత బుద్ధితో చేసిన విషయం కాదు. ఇలాంటి వివరాలు మనం తెలుసుకోవాలి. అలాగే ఇందాక కృష్ణుడి గురించి మనం ప్రస్తావన చేశాం సాందీపుడు. సాందీపుడు కూడా గురుదక్షిణ అడిగాడు. ఏం గురుదక్షిణ అడిగాడు? తన కుమారుడు ప్రభాసతీర్థంలో.. మునిగిపోయినాడు. స్నానాది కార్యాలు ముగించడానికి వెళ్ళినప్పుడు దాంట్లో మునిగిపోయాడు. చనిపోయాడు. ఇదంతా అంతకు ముందే జరిగింది. దానికి ఆయన అద్భుతం పద్యం రాశాడు. "అంభోరాసి ప్రభాసతీర్థమున మున్న అస్మత్తనూసంభవుండు అంభోగాహము సేయుచున్ మునిగి లేడయ్యే గృహామ్-కృపాంబోనిధులు శుంభద్వీరులు మీరు గురునకు చోజ్యంబుగా శిష్యతన్ గాంభీర్యంబున పుత్ర దక్షిణ యిడం కర్తవ్యము హింపరే" రకమైన గురుదక్షిణ ఇవ్వడం మీ కర్తవ్యం అని మీకు అనిపించటం లేదా? నా కొడుకు ఒకడు ఇంతకు ముందే ప్రభాసతీర్థంలో మునిగి మరణించాడు. వాణ్ణి తెచ్చి ఇవ్వాలనేటువంటి శుంభద్వీరులైనటువంటి మీకు అనిపించటం లేదా అని సాందీపుడిని అడిగాడు. సరే వారు వెళ్లారు తెచ్చారు ఎవరితో అవన్నీ జరిగాయి తీసుకొచ్చారు. ఇక్కడ గురుదక్షిణ వాళ్ళు చెల్లించారు. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవలసింది ఏమిటంటే ఒక విద్య శిష్యుడికి ఇచ్చిన తర్వాత అది స్థాయిలో స్వీకరింపబడిందో అది సద్వినియోగం చేయబడుతున్నదా లేదా అనేటువంటి పరీక్ష నిర్వహించవలసినటువంటి బాధ్యత కూడా గురువుకు ఉంటుంది. ఒక అద్భుతమైన విలువిద్య చెప్పాడనుకోండి లేదా ఒక గదావిద్య చెప్పాడు, ఖడ్గప్రహారం చెప్పాడు లేదా ఒక వేదా విద్య నేర్పించాడు. ఇవి వాళ్ళకి ఎంతవరకు జీర్ణమయ్యాయి అనేటువంటి విషయం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. ఇవాళ మరణించినటువంటి కొడుకుని తిరిగి పునర్జీవితుణ్ణి చేసి తేవాలంటే ఎంతటి శక్తివంతుడై ఉండాలి. శక్తి వాడికి సమకూరిందా లేదా తాను ఇచ్చిన విద్య వృధా అయిందా ఇది తెలుసుకోవాలంటే గురుదక్షిణ తీసుకోవాలి. అదే. అటువంటి ప్రయోగం చేస్తాడు ఆయన. కానీ అక్కడ కూడా ఇంకా విశేషమైన ఇంకొక ప్రయోగం ఉన్నది అక్కడ. కేవలం భౌతికంగా మన కొడుకు గురించే అడిగాడు. "అస్మత్తనూభవుండు" నాలోనే పుట్టింది. నాలోనే పుట్టాడు వాడు. నాలో ఏముంటుంది? నా జ్ఞానం ఉంటుంది. దాని స్థాయి వేరుండొచ్చు. అది అజ్ఞానమా లేకపోతే జ్ఞానమా జ్ఞానం స్థాయియా ఇది నాలోనే ఉంది. కానీ ఎక్కడ మునిగింది? సముద్రంలో మునిగిపోయాడు. సముద్రం? నేను లౌకికమైన సంసార సముద్రంలో ఉన్నాను కదా మునిగిపోయాడు. కనుక మునిగిపోయిన వస్తువు తిరిగి తేవాలంటే నాలో నశిస్తున్నటువంటి జ్ఞానం తిరిగి నేను ఇంతవరకు నీకు బోధించాను కదా తిరిగి ఇవ్వగల శక్తి నీకుందా లేదా అని సాందీపుడు పెట్టినటువంటి ఒక పరీక్ష అది. కేవలం భౌతికంగా కొడుకుని తేవడమే కాదు.ఈ లౌకికమైనటువంటి జగత్తులో పడి నాతో అస్మత్ అనుభవం నాతో పుట్టింది అది నాలో ఉంది ఇప్పుడు లేదాయె ఇప్పుడు లేదు. ఎందుకు లేదు మునిగింది ఎక్కడ మునిగింది సంసారం అనే సయొధిలో మునిగిపోయింది. అలా మునిగిపోయిందాన్ని తిరిగి తేవాలంటే అసలు నీ దగ్గర ఒక జ్ఞానం ఉండాలి. గురువు దగ్గర నుంచి నువ్వు స్వీకరించిన జ్ఞానంతో తిరిగి ఎదుటి వాడికి జ్ఞానాన్ని ఇవ్వగలవా లేదా అనేటువంటి విషయం పైన అద్భుతమైన అవగాహన కలిగిన వాడు సందీప్. అలా గురుదక్షిణ కి కొన్ని ప్రత్యేకమైనటువంటి వివేచన చేయవలసినటువంటి అవసరం ఉంది. గురుదక్షిణ సమర్థనీయమైనటువంటి విషయం. సంతోషం అండి. ఇంకో విషయం ఏంటంటే విద్య కూడా ఉచితంగా పొందకూడదు. ఊహూ సముచితంగా గురువుకి సమర్పించుకోవాలి. సమ-- ఇక్కడ సందీపుడు తన కుమారుడ్ని అంటే జ్ఞాన స్వరూపుడైన కుమారుడ్ని తెచ్చి మళ్ళీ లోకంలో సంస్థాపన చేశాడు. ప్రయత్నం ఊహింపరే అన్నాడు. ఆలోచించండి అన్నాడు. అవును అడగలే ఊహించండి మీ శక్తులు వచ్చాయి కదా అని. అసలు దక్షిణ అనేటువంటి పదానికి ఒక నిమిషం మాట్లాడుకుందాం. గురువు దగ్గరికి వెళ్ళాం గురుకులంలో వేదవిద్యో, బ్రహ్మవిద్యో నేర్చుకున్నాం బయటికి వస్తున్నాం. గురువు గారికి ఒక నమస్కారం చేస్తాం. చేయబోయే ముందు ప్రదక్షిణ చేస్తాం అది సంప్రదాయం గురు ప్రదక్షిణ చేస్తాం. అక్కడ ప్రదక్షిణ అంటే ఈవేళ పదకొండు సార్లు, నూట పదకొండు సార్లు ఇది కాదు. అంటే దమము, మదము నశించగా పుట్టాలి మనయందు దమం పుట్టాలి. క్షి అంటే క్షిప్ర ప్రసాదులం కావాలి. ఎవరైనా ఏదైనా సహాయం గనుక కోరితే వెనువెంటనే ఇవ్వగలిగిన మనస్సు యొక్క నిర్మాణం జరగాలి. రెండూ ఎలా జరుగుతాయి? జరిగినప్పుడు ఏమవుతుందంటే నకారము జ్ఞాన మార్గం అది. దక్షిణ అంటే అది. ఊహూ Not cash it is ash అంటే విభూతి. [నవ్వు] వారు చెప్పినట్టుగా నేను చెప్పిన విద్యను మీరు ఎంతవరకు స్వీకరించారు? దాన్ని మీరు ఎంతవరకు సద్వినియోగం చేయగలిగి-- చేయగలిగినటువంటి శక్తి మీలో ఉన్నది అనే విషయాన్ని పరీక్ష చేయడం కోసమే అన్నాడు గాని లౌకికమైన బంధాలకి, దుఃఖానికి కట్టుబడే అయ్యో నా కుమారుడు పోయాడు అనే విషయం కాదు. చక్కగా చెప్పారండి. ఉమ్ దానికి అద్భుతమైన కోణం అది. అది అర్థం చేసుకున్న వాళ్ళకి చక్కగా దాంట్లో పరమార్థం ఏంటో అర్థమవుతుంది. చేసుకోవాలి. చేసుకోవాలి. చేసుకున్న వాడు చేసుకోకుండా పద్యం ఉండిపోతే ఏముంది? అవును పద్యం బాగా పాడారు, బాగా చెప్పారు కాదు. ఆయనకి విద్య నేర్పాడు కాబట్టి నా కొడుకుని బతికించి మాన్నాడు అనుకుంటారు తేలిగ్గా అది కాదు ఇది. కానే కాదు. అంతర్లీనంగా ఉన్న నీకూడ మరి ఇంతటి పరమార్థం ఉన్నదని చక్క-- చక్కగా చెప్పారండి. దక్షిణ అనే పదానికి [నవ్వు] ఇంకో రకమైన అది spiritual అవును correct ఖచ్చితంగా ఖచ్చితంగా. మన హిందూ ధర్మంలో గురువులకున్న ప్రాధాన్యత ఏమిటి? ఎక్కడికెళ్ళినా ఎక్కడికి ఎవరు వెళ్ళినా కూడా తల్లియే తొలి గురువు అంటారు కదా. ఎక్కడికెళ్ళినా గురువే, గురువే, గురువే, గురువే. గురువు లేనిది ఇక్కడ ఏమీ లేదా? అసలు గురు సాంప్రదాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అసలు గురువు యొక్క విశిష్టత ఏంటి? అయితే ఒక భారతదేశంలో చాలా ప్రముఖంగా గురువుల ప్రస్తావన గాని గురువుల ప్రాధాన్యత గాని ఇక్కడే ఉన్నది ఎక్కడా లేదు. ఇందాక వారు చెప్పినట్లుగా. అవునండి. దీనికి వేదోక్తమైనటువంటి ఒక మాట ఉంది. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణే అని ఒక మాట ఉంది. అంటే కంటికి కనపడని ఈశ్వరుడు ఎప్పటికైనా కనుగొనవలసిన ఆత్మ రెండూ కలిసి ఒక సహకారం అయితే దాని పేరు గురువు అని. కాబట్టి గురువే ఈశ్వరుడు, గురువే ఆత్మ. ఈశ్వరో గురుహు ఆత్మ ఇతి. ఎట్లా మూర్తి భేద విభాగిణే మూడు మూడు బొమ్మలుగా కనిపిస్తున్నాయి కానీ మూడు నిజానికి బ్రహ్మమే. బొమ్మని పట్టుకుంటూ బ్రహ్మమును పట్టుకో అని చెప్పటానికి చెప్తూ గురు సాంప్రదాయాన్ని ఇక్కడ ఇవాళ ఆధునిక కాలంలో గురువుల గురించి ప్రస్తావన చేయటం గురికే సమయం వృధా. దాన్ని పక్కన పెడదాం. గురుపాదుకా స్తవంలో కూడా శ్రీ భూయుత శ్రీహరి చిహ్నితాభ్యాం అగస్త్య రేఖా దవిరంచతాభ్యాం నిగూఢ బీజాక్షర సమన్వితం నమో నమః సద్గురు పాదుకాభ్యాం అని ఒక మాట ఉంది. అంటే మనకి హస్తరేఖలు ఎలాగైతే పామిస్ట్రీ ఉందో గురువు యొక్క అరికాళ్ళలో అగస్త్య రేఖలు ఉంటాయి. మనకి కర్మ రేఖలు ఉంటాయి. గురుపాదం మీద అంటే పాదుక మీద చేయి పడ్డప్పుడు కర్మ రేఖలు అగస్త్య రేఖలను తాకినప్పుడు కర్మలు నశిస్తాయా అంటే నశించవు క్షమిస్తాయి. అంతే కదా తగ్గుతాయి. తగ్గినప్పుడు ఇది తగ్గిందే హాయిగా ఉన్నదే గురు సంస్పర్శ చేత, గురు దర్శనం చేత, గురువుతో సంభాషించిన కారణంగా మనసు ఒక ఉల్లాసాన్ని, ఒక హలాదిని, సంతోషాన్ని పొందుతున్నది అనేటువంటి భావన వలన ఒకటి గురువు యొక్క ప్రాశస్త్యం ఏర్పడింది. మనిషికి ఏం కావాలండి? సుఖము దేహాంది, సంతోషం మనస్సుది, ఆనందం హృదయానిది. మనం ఆనందం దాకా వెళ్ళటంలా సుఖాన్ని సంతోషంగా, సంతోషాన్ని ఆనందంగా భావన చేస్తే జీవితాన్ని గడుపుతున్నాం. శరీరానికి ఆనందం లేదు కానీ దానికి సుఖం కావాలి. మనస్సుకి ఆనందం తెలియదు దానికి సంతోషం మాత్రమే తెలుసు. మరి లోపల అంతర్గతంగా ఉన్నటువంటి మన సంస్కార గుహ ఏదైతే ఉన్నదో దాన్ని హృద్గుహ అన్నాం. అక్కడ ఆనందం తాండవం చేస్తుంది. మనం సహజంగా ఆనంద స్వరూపులం కాబట్టి నీది ఆనంద స్వరూపము, నీది ఆనంద స్వభావము, నీ గుణమే ఆనందము అది మనుష్యానందమై, మనీషా నందమై, గంధర్వా నందమై, మానవ గంధర్వా నందమై, దేవ గంధర్వా నందమై, పితృ పితా నందమై, ప్రజాపితా నందమై, హిరణ్య గర్భా నందం వైపు నువ్వు నడువు అని చెప్పటానికి గురువు యొక్క సమాశ్రయం కావాలి. అందుకనే గురువుల గురించి చెప్పినప్పుడు సాల్య-- సాలోక్య, సామీప్య, సాన్నిధ్యాలు మూడు ఎవరికి దొరుకుతాయో సాయుజ్యం చివరి. నేను నీతో నువ్వు నాతో సామీప్యంగా ఉండు నాకు దగ్గరగా ఉండు అది ఉపనిషత్. నాకు దగ్గరగా కూర్చో నా భావాలు గ్రహించు. తర్వాత సాన్నిధ్యంలో ఉండు. నిరంతరమైనటువంటి ధ్యాన ముద్రాంకితమైన మనసుతో ఉన్నట్లయితే మోహాలన్నీ పోయిన తర్వాత మిగిలే దాని పేరే మోక్షం.మోహ క్షయమే మోక్షం అదే సాయుజ్యం అది నేను నువ్వై పోవడం నువ్వు నాలో లీనం కావడం ఇవన్నీ కూడా ఒక కళాత్మకమైన భావనే తప్ప ఎవరు ఎవరిలోనూ లీనం కారు మనలో మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ కొస మళ్ళీ లోపలికి వెళ్లి దండ పూర్తయినట్లుగా పునరావృత్తి రహితమైనటువంటి ఒక జన్మ స్థితికి రావటానికి గురువు పెద్ద ఆధారం ఆయన నావికుడు ఆయనే నావ ఆయనే తరచాప ఆయనే నీరు ఆయనే గాలి మనమేం చేయాలంటే నావలో కూర్చోవాలి అంతే కాబట్టి గురు ప్రాశస్త్యం ఇంత అంత అని చెప్పటానికి లేదు ఒక గురువు ఇందాక పార్వతీ సింగ్ గారు మొట్ట మొదట్లో ఒక మాట చెప్పారు అక్షరాభ్యాసం చేసిన వాడు గురువే నిజమే కానీ ఆయన కడదాకా ఉండడు మరి వాళ్ళు ఏం చేస్తారంటే శబ్దార్థం చెప్తారు ముందు కథ చెప్తారు తర్వాత వాడు శబ్దార్థం చెప్తాడు తర్వాత విశేషార్థం చెప్తాడు తర్వాత అంతరార్థం చెప్తాడు యదార్థాన్ని నీ అంతట నువ్వు గ్రహించమని చెప్పిన వాడు గురువే తప్ప ఇది యదార్థం అని బట్టబయలు చేసేవాడు గురువు కాడు మనల్ని అలా prepare చేస్తాడు చేసి నెమ్మది నెమ్మదిగా మనల్ని ఒక్కొక్క అంతస్తు ఎక్కించుకుంటూ వెళ్లి సోపాన క్రమంలో పరమము చరమము అయినటువంటి స్థాయిలో నిలబెట్టి గురువుని ఆకాశంగా అందుకనే సంస్కృతంలో శ్లోకం ఉంది ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాంమే అంటే ఆకాశం వలె శూన్యుడు ఆకాశం వలె పూర్ణుడు ఆయనకు ఆధారం లేదు ఆకాశానికి ఆధారం లేదు కానీ అన్నింటికీ ఆధారమైంది ఆకాశం ఆయన శబ్ద బ్రహ్మమై బోధ చేస్తాడు నిశ్శబ్ద బ్రహ్మమై మౌన వ్యాఖ్య చేసి దక్షిణామూర్తి వలె సర్వోత్తమ గురువుగా భాసిస్తాడు కనుక గురువు యొక్క పారిశ్రావలు అనేకం అనేకానేకం వాటన్నింటిలో శిష్యుడు గనుక ఒదగగలిగితే ఉండగలిగితే గురువు యొక్క అనుగ్రహం ప్రాశస్త్యం ఒక లక్షా ఇరవై వేల సంవత్సరాల ఒక హైందవ ధర్మంలో దాగి ఉన్న బలమైన శక్తి ఏదంటే గురు శక్తే బలమైన శక్తి అది అందువలన అజ్ఞానం అనేటువంటిది ఒక చీకటి అని భావిస్తే దాంట్లో ఒక చిన్న వెలుగు దివ్యాన్ని వెలిగించగలిగిన శక్తిమంతుడు ఎవరు దివ్య ఏది అంటే పరమాత్మ అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురువు అందుకనే గురుర్ బ్రహ్మ అంటాం బ్రహ్మ దీర్ఘం గురుర్ విష్ణుః గురుదేవో పరమేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అని హ్రస్వంలో ఆపుతాం అంటే పరబ్రహ్మ అన్నాం అంటే సంబోధన పరబ్రహ్మ గురువు పరబ్రహ్మమే ఇంకా నువ్వు దేవుడికి ఎక్కడ దేవులాడుతావ్ ఆయనే నీ ఎదురుగా ఉన్నాడుగా అని చెప్పేటువంటి ఒక అపూర్వమైన భారతీయ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది విశిష్టమైనది వరిష్టమైనది ప్రపంచానికి అందుకనే భారతదేశం గురుస్థానీయం కాదు ఇది గురువే సంతోషం అండి కర్మలనే ఒక కర్మలనే కుండపోత వర్షాన్ని తీవ్రతను తగ్గించటం కష్టం మనకి వర్షం ఎలాగో వద్దని చెప్తే ఆగదు గురు కృప అనేది ఒక గొడుగు లాంటిది వాడిని కాపాడుకుంటాడు తన శిష్యుడు కర్మలు ఇందాక చెప్పినట్టుగా మహర్షి రేఖలు కర్మ రేఖలు ఉంటాయి అని చెప్పన్నారు కాబట్టి దాన్ని సృజించగానే కర్మల తీవ్రతను తగ్గించుకొని వీడు వర్షంలో తడవకుండా ఒక ఆధారంగా గొడుగు ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళు నాయనా క్షేమంగా అని ఎలా పంపిస్తాడో అదే గురు కృప చక్కగా వివరించారండి సంతోషం. అయ్యా పార్వతీ సింగ్ గారు గురువుకి ఆచార్యుడికి రెండు సమానార్థకాలేనా? ఇది కూడా ఇందాకే అడిగాడు నిజానికి నైఘంటికమైన అర్థంలో మనం మాట్లాడుకుంటే గురువు ఆచార్యుడు రెండు సమానార్థాలుగానే మనం భావించాలి కానీ కొంత నిశితంగా మనం పరిశీలిస్తే మనకి అవగతం కావలసినటువంటి ఒక అంశం ఏమిటంటే ఇప్పుడు ఆచార్యుడు అనేది మనం ఎలా వాడుతాం అంటే ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నాడనుకోండి ప్రాథమికంగా lecturer గా ఉంటాడు తర్వాత reader అవుతాడు తర్వాత professor అవుతాడు professor అనే మాటని మనం తెలుగులోకి అనువదించుకుని అతన్ని ఆచార్యుడిని అని పిలుస్తాం. మనకి ఎవరైతే పాఠం చెబుతున్నాడో ఆయనకి ఆచార్య శబ్దం ముందు పెడతాం ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు అంటే విశ్వవిద్యాలయంలో వాళ్ళు చేసినటువంటి స్థానం ఏదైతే ఉందో దాన్ని చూసి చెబుతున్నాం మనం గురువు అన్నప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాళ్ళు అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుంచి పాఠం చెప్పేవాళ్ళు ప్రతి వాళ్ళు గురువే కానీ ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో భౌతికమైన లౌకికమైన విద్యలతో పాటు దానికి పైన ఒక ఉదాత్తమైనటువంటి ఒక స్థితి ఉంది ఒక విద్యను ఏర్పడడం విద్యలో మనల్ని సమున్నతుల్ని చేయడం ఇవన్నీ గురువు చేసేటువంటి బాధ్యతలైనా ఆచార్య శబ్దం ఎప్పుడు వాడవలసి వస్తుందంటే విద్యను బోధిస్తూనే తాను ఆచరిస్తూ తాను ఆచరించిన దాన్ని మనకి చెప్పడం అయితే ఏదైతే ఉంటుందో అతడు ఆచార్యుడు అవుతాడు ఆచరణ సాధ్యం కాని విషయాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు జగద్గురువు అంటున్నాం మనం ఎందుకంటే కృష్ణుడు చేసేటువంటి ప్రతి పనిని ఏనాటికీ మనం ఆచరించలేం అది అదే ఆదిశంకరాచార్య అంటున్నాం కంచి పీఠాధిపతులు పరమాచార్య అంటున్నాం ఆచార్యులు ఎంత నిరాడంబరమైన జీవితం ఎంత ఉపాసనా మార్గంలో వాళ్ళు ఎలా ప్రవేశించారు కనీసం దాన్ని అనుసరించేటువంటి ఒక ప్రయత్నం ఉంది అక్కడ అంటే ఆచరించడానికి వాళ్ళు ఒక మార్గం చూపిస్తున్నారు ఆచరిస్తామా లేదానే నువ్వు చేయగలవు అలా ఆచరిస్తూ బోధించేటువంటి వాడు ఎప్పుడూ ఆచార్య స్థానంలో ఉంటాడు. త్యాగరాజ స్వామి ఉన్నాడు ఆయన ఎప్పుడో పాడుతూ పాడుతూ సంగీతాన్ని అలవోకగా పాడితేలేదా మాధూకరం తీసుకుంటూ తన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటే సామాన్యమైన జీవితంలో ఒక భక్తి భావానికి తారాస్థాయి ఎలా ఉంటుంది ఒక తాదాత్మ్యం ఎలా ఉంటుందో ఆయన ఎప్పుడూ బోధించలే. ఆయన అనుసరించినటువంటి శిష్యులు తమకి తాము జీర్ణం చేసుకొని ముందుకు వెళ్లారు అందుకే ఆయన ఆచార్యుడు. అలాగే ఒక సిద్ధేంద్రయ్య ఉన్నాడు నృత్యంలో, ఆయన కూడా ఒక ఆచార్యుడు తాను ఒక్క విన్యాసాన్ని ఎలా చేయగలగాలో దానికి ఎంత ఉపాసన అవసరమో ఇవన్నీ ఆచరించి చూపించి శిక్ష క్రమాన్ని తయారుచేసిన వాడు ఆయన. కనుక అటువంటి వాళ్ళు ఆచార్యులు అవుతారు. ఇవాళ భౌతికంగా మనం మాట్లాడుకునేటువంటి గురువులు ఎందరైతే ఉంటారో అంటే భౌతికమైన జీవనానికి అవసరమయ్యేవి ఇచ్చేటువంటి విద్యార్థులు విద్య నేర్పేటువంటి వాళ్ళు గురువులుగానే ఉంటారు వాళ్ళు. అయితే గురువులు కూడా ఇవాళ పీఠాధిపతులుగా కొంతమంది ఉన్నవాళ్ళని మనం పలికిస్తూ గురువుగారు అంటాం స్వామి అంటున్నాం మరొకటి ఏదో సంబోధిస్తున్నాం. వాళ్ళు గురువులే కానీ ఆచరించి ఎవరైతే చేస్తాడో అటువంటి వాడు ఒక ఉత్తమ శ్రేణి గురువు అవుతాడు అందుకే ఆచార్య చర్పం. సంతోషం అండి. ఆచార్యుడు ఆచార్యతత్వము గురువుకి ఉన్న వ్యత్యాసం ఏంటి నేటి సమకాలీన ప్రపంచంలో వీళ్ళు అన్వయించుకొని ముందుకు కొనసాగగలిగేటువంటి చక్కటి ఆలోచన మీరు చెప్పారండి చాలా సంతోషం అండి. నేటి సమాజంలో అసలు మహా గురువులను ఎలా మార్గదర్శకం చేసుకొని వెళ్ళాలి మహా గురువుల యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే చంచలమైన మనసును అచంచలం చేయటమే కాకుండా లౌకికమైన విషయాల్లో గురువులకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి వారి మార్గదర్శకత్వం ఎలా మనం తీసుకుని ముందుకు సాగాలి. ఇక్కడ మీరు మహా గురువు అనేటువంటి పదాన్ని వాడారు మహా గురువులు అంటే ఎవరు లేరండి. ఊ. అంతా గురువులే. అంటే గురువులు ఉన్నారు వారు ఉత్తమ స్థాయికి చెందితే పరమ గురువులు అవుతున్నారు జగద్గురువులు అవుతున్నారు సద్గురువులు అవుతున్నారు. ఊ. కాబట్టి సద్గురువు సత్తుని బోధించేవాడు సద్గురు. జగత్తును గురించి బోధ చేస్తూ జగత్తులో మనం ఎలా మెసులుకోవాలో ఎలా మెసలితే మానవ జన్మ ఒక పరిపూర్ణతను సంతరించుకుంటుందో చెప్పేవాడు జగద్గురువు. ఇక మిగిలిన గురువులందరూ మనం ఇందాక చాలామంది సిరీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గురువు అంటే మార్గాన్ని దర్శనం చేసి ఉపదేశం చేసేటువంటి వాడు నిజమైనటువంటి గురువు. ఆధునిక కాలంలో గురువుల్ని ఎలా మనం అన్వేషించటం అనేది లేదనుకున్నాం మరి వాళ్ళు ఎలా మనకు మార్గోపదేశం చేస్తారంటే ఇవాళ ప్రచారంలో ఉన్నటువంటి ఒక మాట ధర్మ ప్రచారానికి ఒక పరిషత్తు పెడుతున్నాం అవునా. అవును. ప్రచారం తగ్గాలి ప్రబోధం ద్వారా ప్రసారం జరగాలి. ఆ. ప్రచారాన్ని వెనక్కి పెడదాం ఎందుకంటే ప్రతిభ వేరు ప్రాచుర్యం వేరు. ప్రతిభ ఉన్నవాడికి ప్రాచుర్యం popularity ఉండకపోవచ్చు. కానీ popularity లేని వ్యక్తికి అత్యంత ప్రతిభ ఉండి ఉండొచ్చు కాబట్టి గురువుని మనదైన దృష్టితో మనకున్నటువంటి శక్తితో కాస్త వెతుక్కునే ప్రయత్నం గనక చేస్తే ఒకే గురువు మనకి జీవితకాలం అంతా రాలేదండి ఎలిమెంటరీ స్కూల్, హైస్కూల్, కాలేజ్ తర్వాత యూనివర్సిటీ తర్వాత పీహెచ్డీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆయా దేశ కాల పరిస్థితులను బట్టి మన జీవన గమ్యాన్ని బట్టి గమనాన్ని బట్టి గతి ధృతి అధృతి ఇవన్నీ కూడా ఏర్పరిచిన ఏర్పడినప్పుడు గురువు ఒక్కొక్క గురువులా ప్రవేశం చేసి మన మార్గాన్ని సుగమం చేస్తాడు. ఆయన పని ఏమిటయ్యా అంటే నాయనా నువ్వొక్కడొ ఒక బిందువై ఆనంద బిందువై పుట్టావ్ నదివై ప్రవహిస్తున్నావ్ పల్లనికే వెళుతున్నావ్ నీవు వెళుతూ వెళుతున్న దారినే శుభ్రపరుస్తున్నావ్ నిన్ను నీవు శుభ్రపరుచుకుంటున్నావ్ కానీ పరమ చరమమైన నీ లక్ష్యం ఏమిటి నీ సిద్ధి ఏమిటి అని అనుకున్నట్లయితే అది సాగర సంగమమే. పరమాత్మలో అంటే నీలో నీవు కలుసుకోవటమే నీలో నీవు నిలకడ చెంది ఉండటమే ఇదిగో ఇది మార్గం అని చెప్పేటువంటి అటువంటి ఉదాత్త వైఖరి ఉన్నటువంటి గురువులు మనకు గనక దొరికినట్లయితే విద్యా గురువులు విద్య బోధిస్తారు ఖచ్చితంగా ఇందాక ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక దివాకర్ల వెంకటావధాని గారు ఒక నండూరి రామకృష్ణమాచార్యుల గారు వీళ్లంతా మహా గురువులు వీళ్ళు మీరు చెప్పిన మహా గురువులు వీళ్ళు. ఊహూ. గురువులు లోక విద్యలో నిన్ను మంచి మార్గంలో పెడతారు మీకు అభిరుచి కలిగిస్తారు జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తారు జీవితాన్ని యాదార్దికమైనటువంటి స్థితిలో ఆవిష్కరిస్తారు కానీ ఇది మాత్రమే చాలదు నీ లోపలికి నీవు ప్రవేశించాలి ఆంతరంగిక అన్వేషణ ప్రారంభం కావాలి అన్వేషణలో నీవు ఆత్మని ఎరగాలి అని చెప్పేటువంటి ఆచార్య సత్తములందరూ కూడా మనకి శంకర భగవత్పాదులు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యుల వారు అందుకనే వారిని మనం ఆచార్య త్రయం గా నమస్కరిస్తాం. ఒక సింధువుగా పుట్టి నదిలా ప్రవహిస్తూ ముందుకు గమనం ఎలా ముందుకు కొనసాగుకుంటూ తనను తాను శుభ్రపరుచుకుంటూ పరిసరాలను శుభ్రపరుచుకుంటూ ఎలా ముందుకు కొనసాగుతారో నీలోనికి కూడా నువ్వలా ప్రయాణం చేసి నిన్ను నీలో కలుపుకోవటమే చాలా గొప్ప విషయం అనే ఒక పరమార్థ రహస్యాన్ని చక్కగా వివరించారండి చాలా సంతోషం. గురుపౌర్ణమి పర్వదినం సందర్భంగా మనకి కోనేటి పార్వతీశం గారు వి ఎస్ వి ఎస్ ఆర్ మూర్తి గారు గురువుల గురించి గురుతత్వాన్ని గురించి నేటి కాలమాన పరిస్థితుల్లో గురువు యొక్క ప్రాధాన్యత గురించి గురుతత్వంతో మనం ఎలా మమేకమై ముందుకు కొనసాగాలి అనే విషయాల్ని చాలా చాలా చాలా చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలండి.
YouTube · audio

Guru Pournami Special : గురు సాక్షాత్ పరం బ్రహ్మ..! | Oleti Parvateesam | Hindu Dharmam

Home

Guru Pournami Special : గురు సాక్షాత్ పరం బ్రహ్మ..! | Oleti Parvateesam | Hindu Dharmam

Source: Hindu Dharmam on YouTube

0:00 / 54:33