No transcript for this section.
Transcript begins at 11:57.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం. వందారు జనవందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వైశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాన్మే పరమ మహేశ్వర స్వరూపుడు సత్యచంద్రా నంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ సత్యసాయి సేవా సంస్థలు పశ్చిమగోదావరి జిల్లా ప్రారంభించినటువంటి ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకునేటువంటి ఒక అవకాశాన్ని కల్పించిన స్వామికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి కేవలము ఒక మానవ దేశం ధరించి వచ్చినటువంటి దేవుడు మాత్రమే కాదు. ఈ మాట ఎందుకంటున్నాను అంటే దేవుడికి పరిమితులున్నాయి. సత్యసాయి బాబా వారిని ఒక దేవుడిగా గనుకంటే ఆ పరిమితులలోనే మనం మాట్లాడుకోవాలి. స్వామి is not mere a god it is a phenomenon అది బ్రహ్మ పదార్థం. ఈ నేలమీద నడిచి నడవటానికి నిర్ణయించుకొని సనాతనమైన వైదికమైనటువంటి ఒక ధర్మాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి మానవుణ్ణి సజ్జనుడిగా తీర్చిదిద్దేటువంటి పరమోత్కృష్ట కార్యక్రమం కోసం వచ్చిన అవతార విభూతియే భగవాన్ శ్రీ సత్యసాయి. ఈ నేపథ్యంలో స్వామిని తులనాత్మక అధ్యయనం చేయాలి. మన మేధ మన హృదయము ఎంతవరకు అందుకుంటుందో అంతవరకు స్వామిని చక్కగా అనుభవించాలి. ఆ అనుభవంలో నుంచి అనేకమైన విభూతులు అనుభూతులు పొందాలి. కడగా అవి మనల్ని సన్మార్గంలో నడిపించే దిశగా సహాయకారులు కావాలి. ఇది నిజానికి సత్యసాయి అవతార వైభవం. నిన్న భౌతిక స్థాయిలో అంటే physical level లో సత్యసాయి వారు ఎలా వచ్చారు? వారు ఏం చేశారు? వారు చేసినటువంటి ఆ సామాజిక పరమైనటువంటి కార్యకలాపాలు ఏమిటి? కాస్తగా ముచ్చటించుకున్నాం. అయితే అది మాత్రమే చాలదు. అవతార వైభవం బహుముఖీనం. అనేక పారిశ్రావలతో ఇమిడి ఉన్నటువంటిది గనుక రామకృష్ణాది అవతారాలతో ఒక రకంగా తులనాత్మక అధ్యయన రీతిలో గనుక మనం మన మనస్సుని దానిలో ప్రవేశపెట్టిన ట్లయితే స్వామి ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతారు. అర్థం కాలేదని కాదు కానీ మనకి అర్థమైంది చాలదు అని అర్థం. కాబట్టి ఈ స్వామి ఈ జగత్తులోకి వచ్చి నిన్ననే మనం అనుకున్నట్లుగా physical, meta physical and spiritual ఈ మూడు స్థాయిల్లో స్వామిని చూడాలి. physical level లో మనందరికీ తెలుసు మనం ఆయన్ని చూశాం. స్వామి మాట్లాడటం విన్నాం. స్వామితో మనము మాట్లాడాం. దర్శన స్పర్శన సంభాషణలు చాలా చక్కగా అనుభవించాం. ఏదో జీవితాన్ని మనకు తోచిన రీతి చక్కగా మలచుకొని ఈ ప్రపంచానికి ఏ విధమైనటువంటి హాని కలగని రీతిలో జీవితాలను మనందరం కూడా సాగిస్తూ ఉన్నాం. సరిపోతుందా? అని. సరిపోదు అనే జవాబు. మరి ఏం చేయాలి? స్వామిని metaphysical level లో కూడా చూడాలి. ఏమిటి ఈ metaphysical level? ఇదేదో కొత్త పదం మాత్రం కాదు. ఈ metaphysical అంటే స్వామి సత్తు అయినట్లయితే స్వామి పాంచభౌతికమైనటువంటి ఒక దేహాన్ని తీసుకొని చెమ్మయ రూపుడై ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఆయన ఈ ప్రపంచాన్ని పరమోత్కృష్టమైనటువంటి భావనతో పరమ ఉదారమైనటువంటి రీతిలో ఈ జగత్తుని చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. కనుక అది సత్తుగా ఉన్నటువంటి ఒక పదార్థమే తన ముప్పై రెండు దశలను దాటి చిత్ అంటే existence అనేటువంటి భావనలోకంటే మనవలె ఉంటూ మనవలె మాట్లాడుతూ మనవలె నవ్వుతూ మనవలె అనేకమైన కార్యకలాపాలు చేస్తూ చేయిస్తూ అప్పుడప్పుడు మాయలో పడవేస్తూ ఈయన కూడా మనలాగే ఉన్నారే అని అనిపిస్తూ ఉన్నప్పుడు ఈ metaphysical level లో స్వామిని కాస్త జాగ్రత్తగా అధ్యయనం గనుక చేసుకున్నట్లయితే ఇంకా అవతార వైభవం మనకి స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. భువనమొక వేదికాయ వేదవేదాంత వేద్యునకు విశ్వపాలనమొక వేడుకాయ విశ్వవిభునకు ఆద్యునకు అవని బృందావనమ్మయ్యే అనవరత వంజునకు స్వర్ణచ్ఛందునకు వేల శరత్తులొక్క పరి అరసి వేల సర్వాణుల యొక్క తరి మెరసి ఈ ప్రపంచమంతా కూడా కాంతిమయము శాంతిమయము దాంతిమయము క్రాంతిమయము ప్రసన్నమయము ప్రశాంతిమయము చేయటానికి వచ్చినటువంటి ఒక పూర్ణమైనటువంటి సరళ భావనలతో వచ్చినటువంటి స్వామి ఒక సరళ సమీరణం లాగా ఈ ప్రపంచాన్ని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళంగా చుట్టుముట్టారు.చేశారు పరవశులు అంటే కేవలం ఆనందం కాదు కేవలం సంతోషం కాదు పర ఈశ్వరునికి వశం చేశారు ఈ లోకాన్ని. అంటే ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పాలి అని ఆయన అనుకున్నారు. ఒక్కసారి పౌరాణిక నేపథ్యాన్ని గనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఒక అవతారమూర్తికి ఒక ప్రవహించేటువంటి జీవనదికి సంబంధం ఉంది. వారణాసిలో కాశీనాథుడి పక్కన ప్రవహిస్తున్నది గంగా. అలాగే ఒక్కొక్క అవతారమూర్తి శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో అయోధ్య పక్కన ప్రవహిస్తున్నది సరయు నది. శ్రీకృష్ణ పరమాత్మ సంచారం చేసినదంతా యమునా నది తీరంలో చేశాడు ఆయన. ఇటు దక్షిణాపథంలోకి రాబోయే ముందు గోదావరి పక్కన షిరిడి సాయినాథుడు అక్కడ ఉన్నాడు ఆయన. దక్షిణాపథంలో కాస్త చొచ్చుకుని పోయినట్లయితే కావేరి పక్కన సదాశివ బ్రహ్మేంద్రుడు వారు యతి వారితో పాటు అర్చా మూర్తి అయినటువంటి శ్రీరంగనాథుడు అక్కడ ఉన్నారు. ఇక కృష్ణానది ఒడ్డున దుర్గామాత ఉన్నది. ఈ పరంపరలో గనుక నెమ్మదిగా మనం అర్థం చేసుకుంటూ వెళితే సత్య సాయి భగవానుడిది అవతారము అని చెప్పటానికి ఆయన పక్కన ప్రవహించిన నది పేరు చిత్రావతి. అంటే నది మూలాలు నిజానికి మనం చెప్పుకోకూడదు, ఋషుల మూలాలు అసలు ముట్టుకోకూడదు కానీ అవతారమూర్తుల యొక్క అవతరణ మాత్రం మనం చెప్పుకొని తీరాలి. లేకపోయినట్లయితే సంపూర్ణంగా అర్థం కాక అర్థం అయినట్లుగా ఒక భ్రాంతిలో మన జీవితాన్ని సాగిస్తాం. కనుక ఈ metaphysical level లో సత్య సాయి భగవానుడు చేసిన పని ఏమిటి? ఇది విచారణ. మళ్లీ ఒక్కసారి త్రేతాయుగంలోకి వెళ్లాం. సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తి వృక్షామాస్కృతి అంటే వృక్షు సామము అయినటువంటి ఈ యజుర్మూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు యోగదాస్ వశిష్టాన్ని విన్నాడు, ఆయన రాయలే. అన్నది ఎవరు అంటే వశిష్టులవారు. ద్వాపరయుగానికి వచ్చేప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత అన్నాడు. కానీ ఆయన, ఆయన కూడా అది రాయలే. రాసిన వాడు ఎవరు? ఆర్దాయ ప్రతిబోధితా భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితా పురాణ మునినా. ఆ పురాణ ముని అయినటువంటి వ్యాసులవారు భగవద్గీతని రాశారు. అందుకనే ఏడు వందల శ్లోకాలలో ఎక్కడా కూడా కృష్ణ ఉవాచ అని మనం వినం. భగవాన్ ఉవాచ అనే ఉంటుంది. ఒకే ఒక్క చోట మాత్రం Madhusudana ఉవాచ అని ప్రయోగం చేశాడు వ్యాసుల వారు. దీనికి కారణం ఏంటంటే కృష్ణుడు యదుకుల నందనుడు అయినటువంటి యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడు మనకు చెప్తున్నాడు. అంటే కృష్ణ దేహంతో ఆయన చెప్తున్నాడు అంటే కాదు మమైవాంశో అంటున్నాడు. అంటే నేను, నేను, నేను అంటున్నాడు. ఆ నేను ఎవరంటే సర్వాంగీణమైనటువంటి సౌందర్య విలసితమైనటువంటి దేహధారి అయినటువంటి కృష్ణుడు కాదు. ఎవరు అంటే ఆత్మ. పరమాత్మ స్వరూపమై తాను తన అభిప్రాయాలని, తన భావాలని, తన ఉపదేశాలని, సందేశాలని, ఆదేశాలని అర్జునుడు అందుకోగలిగిన పాస్త్యత, అర్హత ఉన్నది గనుక అర్జునుడికి ప్రతిబోధ చేస్తూ ఉన్నాడు. బోధ monologue, ప్రతిబోధ ఇద dialogue. అందువల్ల అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు మళ్లీ, మళ్లీ అర్జునుడు అడుగుతున్నాడు ఇది సాగినటువంటి వైనం. ఏతావాతా చెప్పవలసింది ఏమిటంటే రాముడు గ్రంథం రాయలే, కృష్ణుడు ఏ గ్రంథమూ రాయలే. వాళ్ళంతా రాముడు విన్నాడు కృష్ణుడు చెప్పాడు అంతే. ఇంకొక సామ్యం కూడా ఉంది. గురువు లేకుండా ఒక అవతారం ఏదన్నా ఈ జగత్తులోకి ఇప్పటిదాకా వచ్చిందా? భారతీయమైన వైదిక సంస్కృతి ఒక లక్షా ఇరవై వేల సంవత్సరాలుగా చెప్తారు. సరే అది మనము చెప్పలేము కానీ మనకు అందుబాటులో ఉన్నటువంటి కలియుగ ఆరంభ వేళలు ఏవైతే ఐదువేల నాలుగు వందల తొంభై మూడు సంవత్సరాల క్రితమే కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. కృష్ణుడి కంటే రాముడు ఇక్కడే ఉన్నాడు. రాముడు ఈ జగత్తులోకి పరబ్రహ్మమూర్తియై వచ్చినప్పటికీ కూడా ఆయనకు ఇద్దరు గురువులు ఉన్నారు. ఒకరు జ్ఞాన గురువు అయినటువంటి వశిష్టుల వారు. రెండవది శస్త్రాస్త్ర സംവിധాన విధానాన్ని జగత్తుకు అందించినటువంటి విశ్వామిత్రుల వారు ఉన్నారు. సీతా రాముల కల్యాణం జరిగే వరకు రామాయణంలో వరిష్ఠమైనటువంటి పాత్ర పోషించి కేవలం జ్ఞానం మాత్రమే కాదు ఈ ప్రపంచానికి ఒక practical అనుష్ఠాన వేదాంతం కావాలి theory కాదు practice కూడా కావాలి. బాణము అంటే తెలుసుకోవటం ఒక ఎత్తయితే ప్రయోగం చేయటం రెండవ ఎత్తు. అలాగే ఒక ప్రయోగం చేయటం శక్తి అయినట్టయితే ఉపసంహారానికి కూడా శక్తి కావాలి. ఈ రెండు వశిష్టుల వారు బోధించలే రాముడికి. విశ్వామిత్రుల వారు బోధించారు. అంటే రామావతారంలో శ్రీమన్నారాయణుడు రాముడుగా వచ్చినప్పుడు ఇద్దరు గురువులనే ఎన్నుకున్నాడు ఆయన. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ సాందీప మహర్షిని కొద్ది రోజులు లేదా కొద్ది కాలం తన గురువుగా స్వీకరించాడు. రాముడికి ఇద్దరు గురువులైతే కృష్ణ పరమాత్మకు ఒక గురువు అయినట్లయితే షిరిడి సాయినాథుడు కూడా ప్రప్రథమ పూర్ణ దత్తావతారం అయినప్పటికీ కూడా ఆయన నాకు వెంకూశ అనేటువంటి ఒక గురువు ఉన్నాడు అది ఆ...ఆ ఇటుక ముక్క నా గురువు యొక్క స్వరూపం ప్రతీక అని ఆయనే ప్రకటించారు. కాబట్టి షిరిడి సాయి నాథుడికి కూడా గురువున్నాడు. మరి సత్య సాయి నాథుడికి గురువు ఎవరు అని ప్రశ్న వేసుకున్నట్లయితే, గురువే లేని, గురుణాం గురువు ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్య సాయి. ఆయనకు గురువు అక్కర్లేదు. సర్వ వేదముల సారము నిక్కమైనటువంటి ఒక్క రూపమై వచ్చి, పరోపరిషత్తుల యొక్క భావనా స్వరూపమై మన ముందు నిలబడినట్లయితే, అటు వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భారత, భాగవత, రామాయణ, భగవద్గీతాదులు వీటితో పాటు శంభోర్మూర్తి శరసి భువనే శంకరాచార్య రూపాన్ని కీర్తించి, ఆరాధించి, అనుసరించి ఆ-ఆనందాన్ని పొందే మనకి శంకరులు అనుగ్రహించిన భజగోవిందంతో సహా సత్య సాయి భగవానుడు ప్రాచీన వాఙ్మయాన్ని మళ్ళీ తమదైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శైలిలో సరళ వ్యాఖ్యానంతో మూలంలో లేనటువంటి అనేకమైనటువంటి విషయాలని మనకి తెలియజేస్తూ, విడమరుస్తూ స్వామి నిజానికి తన దేహానికి నలభై సంవత్సరాలు రాకుండానే స్వయంగా కూర్చొని వీటన్నిటికీ వ్యాఖ్యానం రాశారు. రామకథా రసవాహిని కావచ్చు, వాహిని సంపుటి కావచ్చు, భాగవత వాహిని కావచ్చు, భజగోవిందం కావచ్చు, ఇవన్నీ కూడా స్వామి తమ చిన్ననాటనే ఈ జగత్తుకి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వాఙ్మయాన్ని ఇచ్చాడు గనుక స్వామి ఎవరు అంటే స్వామి శారదా ప్రవాహం. సరస్వతీ స్వరూపం, వాగ్ రూపం, వాగ్ విభూతి, వాఙ్మయం, శ్రీమయం, చరాచరమయం సర్వమూ తానైనటువంటి ఒక ఆత్మ, అఖండ చిద్ఘనమైనటువంటి ఒక పరమాత్మ, పాంచభౌతికమైనటువంటి ఒక చిన్మయ రూపాన్ని తీసుకుని ఒక దేహాన్ని ధరించి జగత్తులోకి వచ్చి మళ్ళీ నేను రామాయణంలో ఏమీ లేదు, భారతంలో ఏమీ లేదు, అవన్నీ ఇంతకుముందు చెప్పినవన్నీ కూడా సరిగ్గా లేవు, నేను కొత్తది చెప్పబోతున్నాను అని మాత్రం ఆయన రాలేదు. ఆయన ఏమన్నారంటే ఉండవలసిన సత్యమంతా కూడా ఉండవలసినటువంటి విషయాలన్నీ కూడా ప్రాచీనమైనటువంటి వాఙ్మయంలో సాహిత్య రూపంలో ఉన్నాయి. కనుక నేను ఎందుకు వచ్చాను? సత్య సాయిగా ఎందుకు వచ్చాను అంటే, అహం సత్యబోధకః. నేను సత్యాన్ని చెప్పటానికి వచ్చాను. ఈ సత్యము అంటే సదాశివుడి యొక్క ఈ ముప్పై రెండు ముఖాలలో ముప్పై రెండు aspects అంటాం. వాటిలల్లో ఈ సత్ అనేటువంటిది కూడా ఈశ్వర నామం ఇది. ఆ ఈశ్వర నామాన్ని సత్య సాయి ధరించి జగత్తులోకి వచ్చి తనని తాను నివర్తించుకున్నటువంటి పరమాద్భుత సన్నివేశము సత్య సాయి అవతార వైభవంలో అది ఒక మెరుపు, అది ఒక జిలుగు, అది ఒక వెలుగు. దీన్ని ఇట్లా అర్థం చేసుకున్నప్పుడు స్వామి వాహినిని ఎందుకు రాశారు, రామాయణం ఉంది కదా! పైగా రెండు వందల యాభై భాషల్లో ఉంది కదా! మళ్ళీ కొత్తగా రసవాహిని అని ఎందుకని రాశారంటే, రసో వై సః. ఈశ్వరుడు రస స్వరూపుడు. సత్యము రస స్వరూపమే. కాబట్టి ఆ రసాన్ని పిండి మనకప్ప చెప్పాలి. రా-రామకథా రసవాహినిలో స్వామి ఆవిష్కరించిన పరమాద్భుతమైన సన్నివేశం ఏమిటి అంటే హనుమ యొక్క జన్మ. ఎవరూ చెప్పలేదు. హనుమ రుద్రాంశుడన్నాం, స్వామికి సహాయపడ్డాడన్నాం, బంటు అన్నాం, దాసుడన్నాం, దూత అన్నాం, ఆయనను మించిన సద్భక్తుడు లేడన్నాం. కానీ స్వామి నిజానికి శ్రీరామ పంచాయతనంలో హనుమని దాంట్లో ప్రవేశపెట్టారు. మరి నలుగురు అన్నదమ్ములు సీతా అమ్మవారు అప్పటికే ఐదుగురైనారు కదా! మరి హనుమ గనుక ఉంటేది పంచాయతనం కాదు అది ఆరోదు అవుతుంది కదా అంటే స్వామి చేసిన వ్యాఖ్యానం ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఏమిటి ఆ వ్యాఖ్యానం? ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పినవి, బయట చెప్పినవి కావు. ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే నేను అనుకున్నట్లుగా ఏదో ఉంగరం ఇచ్చారు, గొలుసు ఇచ్చారు, ఇవి కావు. ఆయన పరమాద్భుతమైన [చuckles] వైదిక రహస్యాలని చాలా సరళంగా, హేతుబద్ధంగా, logicalగా మనకర్థమయ్యేట్లుగా సరళంగా చెప్పారు. నిజానికి పాయసా ప్రదానం తన భార్యలకు దశరథుడు చేసేటువంటి వేళ సుమిత్రాదేవి మంగళ స్నానం చేయటానికి వెళ్ళినటువంటి వేళ గరుత్మంతుడు వచ్చి ఆ పాత్రని తన్నిన కారణంగా కొన్ని బిందువులు ఎత్తుకొని వెళ్ళిందని అవి అంజనాదేవి స్వీకరించిందని కనుక హనుమ వచ్చాడని ఒక స్వామి చేసిన అద్భుతమైనటువంటి ఒక revelation. కనుకనే శ్రీరాముడు, భరతుడు, లక్ష్మణుడు, మనక్కడ శత్రుఘ్నుడు అని రాయాలి. ఎందుకు రాయ- పంచాయతనంలో శత్రుఘ్నుడు ఎందుకని లేడు అంటే భరత శత్రుఘ్నులు ఇద్దరూ ఒక్కటే. వాళ్ళు భిన్నమైన వారు కాదు. ఎందుకని అంటే శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయినాడు, ఆయనకి సేవ చేయటానికి లక్ష్మణస్వామి వెంబడి వెళ్ళాడు. భరతుడు శత్రుఘ్నుడు మేనమామల దగ్గర ఉన్నారు. దశరథుడు మరణమైన తర్వాత రామలక్ష్మణులు అయోధ్యకు రాలేదు. భరతుడు కూడా అయోధ్యకు రాలేదు, నందిగ్రామంలో ఉండిపోయినాడు. మరి శత్రుఘ్నుడు ఏం చేశాడు అని. అయోధ్య అంటే యుద్ధము లేనిది అని అర్థం. యుద్ధం లేకుండా చేసినవాడు తన రాజ్యం మీదకి, అందులో దశరథుడు మరణించాడు, రాముడు లేడు, భరతుడు లేడు, లక్ష్మణుడు లేడు, కడు చిన్నవాడైనటువంటి శత్రుఘ్నుడ్ని జయించవచ్చు అని ఏ రాజు కూడా దరిచేరలేదు, ఆలోచన కూడా చేయలే. అంటే శత్రువులని నివారించగలిగినటువంటి పరమ దైవిక శక్తితో ఉన్నటువంటి శత్రుఘ్నుడు ఎవరితో కూడి ఉన్నాడో తెలుసురా? భగవంతుని యందు భక్తి ఉన్నటువంటి భరతుడితో కూడి ఉన్నాడు.కనుక భరత శత్రుఘ్నులు ఒక్కరు అయితే సీతారామలక్ష్మణభరతశత్రుఘ్న అక్కడికి నలుగురు అయిపోయినారు. ఐదవ వాడు ఎవరంటే హనుమ అయినాడు. ఇది స్వామి చేసినటువంటి పరమ రమణీయ అస్పదమైనటువంటి వ్యాఖ్యానం. ఏ పండితుడు అయినా చేశాడా? ఏ ప్రవచన కారుడైనా నాకు ఇంతవరకు ఈ రహస్యం తెలియజెప్పాడా? ఇటువంటివి కొన్ని వందలు ఉన్నాయి దాని నిండా. అంతే కాదు భాగవత వాహిని మనం కేవలం దాన్ని పారాయణం చేసి నలభై రోజుల పారాయణం చేసి-- అది కాదు చేయవలసింది. స్వామి ఏం చెప్పారో రామాయణం ఎందుకు చదవాలి అంటే స్వామి చెప్పారు మానవ జీవితాన్ని అతి భద్రంగా మానవీయ సంబంధాలతో ఒక అక్షమైనటువంటి కొడుకుగా, భర్తగా, అన్నగా, రాజుగా, యజ్ఞాన్ని రక్షించేటువంటి క్షత్రియుడుగా ఎలా జీవించాలో పూర్ణ మానవుడుగా ఎలా జీవించాలో రాముడు మనకు చెప్తున్నాడు గనుక మనం రాముడి వలే జీవించాలి రామాయణాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి రామాయణం అంతా అఘాత రామాయణమే. అంటే ఒక ఆనందము దాని పక్కనే దుఃఖము ఒక దుఃఖము దాని పక్కనే ఆనందం రామాయణం అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. రేపు పొద్దున పట్టాభిషేకము అది ఆనందం కాదు అరణ్యవాసానికి వెళ్ళాలి అది దుఃఖం. జరిగింది కదా! ఏదో సీత వెంబడి ఉన్నది కదా వెళ్తున్నాం కదా అని అనుకున్నవేళ సీతా వియోగాన్ని అనుభవించవలసి వచ్చింది రామచంద్రుడు. అంటే సంయోగ వియోగాల మధ్య చీకటి వెలుగుల మధ్య ద్వంద్వాల మధ్య అపురూపంగా సాగినటువంటి రాముడి యొక్క జీవితం మనందరి కథ. మనందరి జీవితాలలో ఆనందాలు సుఖాలు దుఃఖాలు అన్నీ పడుగు పేకల వలే వస్తూ ఉన్నాయి alternately and simultaneously అంటాం చూడండి. కూడి దుఃఖాలు వస్తాయి కూడి ఆనందాలు వస్తాయి. ఆ ఆనందాలు మనం కోరుకోలే కానీ వచ్చినాయి. దుఃఖాన్ని మనం ఆహ్వానించలే కానీ అవి వచ్చినాయి. రాముడు దిగులు పడలే ధీమంతుడై శక్తివంతుడై ఆత్మ శక్తితో వాటిని ఎదుర్కొని మానవీయమైనటువంటి మానవతావాదాన్ని భావాన్ని ఈ ప్రపంచానికి సహేతుకంగా నిరూపణాత్మకంగా నిదర్శన పూర్వకంగా ఆయన దానిని demonstrate చేశారు. ప్రదర్శన చేశాడు మనకి ఇదిగో ఈ కష్టం వస్తే నువ్ ఇట్లా ఉండవచ్చును అని. ఎన్ని మానవమానాలు మనకు సంభవించినా మనలో ఉన్నటువంటి ఉదాత్త శైలిని మనం వదిలిపెట్టకూడదు. సరే! భారతానికి వచ్చినట్లయితే ఈ లోకము చేత మోసగించబడకుండా ఉండటానికి ఈ లోకాన్ని మోసం చేయకుండా బతకటానికి కావలసిన విధివిధానాలు అన్నీ భారతంలో పరుచుకొని ఉన్నాయి. అంటే భారతమంతా కూడా కర్మయోగం. భాగవతంలోకి వచ్చేసరికి ప్రతి భక్తుడు చూడండి ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు ఎవరి పేరు ఏ పేరు చెప్పినా వీళ్లంతా కూడా చాలా కష్టాల పాలైనారు. కానీ కష్టాల చివర the end of the tunnel అంటామే అక్కడ ఎవరున్నారంటే పరమేశ్వరుడు వెలుగు వెలకని కనిపించాడు. ఆ వెలుగు జీవుడి వెలుగుతో కలుపుకోవటానికి వచ్చినటువంటి ఆ పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ తేజస్సు ఆ ఆవరణ అంతా కూడా భాగవతం నిండా పరుచుకొని ఉంది. [దగ్గిన శబ్దం] కనుక భాగవతాన్ని చదివినట్లయితే మనస్సు స్వాదువు అవుతుంది లలిత లలితం అవుతుంది ఎవరు ఎన్ని రకాల క-కష్టాలు మనకు కలిగించినా భగవంతుడున్నాడు వాడు వచ్చి కాపాడుతాడు భగవంతుడు ఖచ్చితంగా ఆయన మనల్ని వచ్చి రక్షిస్తాడు అది కష్టం ముందు వెనుకగా వస్తాడనే నమ్మకం ఇది భారతీయ తత్వ సిద్ధాంతానికి మూలమైనటువంటి ఒక metaphysical state. కాబట్టి భాగవతాన్ని మనం అట్లా చదవాలి. సరే భారత భాగవతాలు రెండు అయిపోయిన తర్వాత భగవద్గీతని కర్మ, భక్తి, జ్ఞాన యోగాలుగా మూడుగా సమన్వయం చేసి ఇస్తే స్వామి వాటన్నింటితో పాటు ఉపనిషద్ వాహిని రాశారు. ప్రశ్నోత్తర వాహిని రాశారు. రాయనిదంటూ ఏం లేదు సమస్త ఉపనిషత్తులు తమదైనటువంటి రీతిలో ఒక పరమాత్మ కనుక వ్యాఖ్యానం చేస్తే ఎలా ఉంటుందో అలా రాశారు ఆ వాహినులు. చూడండి మనమంతా తెలుగు వాళ్ళం కనుక నన్నయ్య గారు భారతం రాసేటప్పుడు సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం జగద్ధితం కోసమే రాస్తున్నానన్నాడు. జగత్తు కోసమే ఇది రాస్తున్నాను భారతాన్ని తెరిగిస్తున్నానన్నాడు. తిక్కన గారు శ్రీయన గౌరి నాపరగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రా ఇస మూర్తియై హరిహరంబగు రూపము దాల్చి విష్ణురూపాయ నమః శివాయ అని కొల్చడి భక్తజనంబు వైదిక ధ్యాయిత కి-కిటమెత్తు పరతత్వము గల్-చడ ఇష్టసిద్ధి కిన్నన్నాడు. ఆయనకి ఇష్ట సిద్ధి ఏమిటో తెలుసునా? ఆ కావ్యం బాగా అందంగా ఎవరో ప్రింట్ చేయాలని, ఈ వేల ప్రతులు అందరికీ పంచి పెట్టాలని ఇది కాదు. శివకేశవుల మధ్య అభేద అద్వితీయ అద్వైతమయమైనటువంటి భావన ఈ ఇద్దరూ ఒకటే ఏకోహం బహుష్యాం అనేటువంటి భావనని శివకేశవుల మధ్య భేదాన్ని సృష్టించకుండా ఉంటే బాగుందని హరిహరాద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి తిక్కన గారు భారతాన్ని తెరిగించారు. అంటే ఆయనకు ఒక లక్ష్యం ఉంది. నన్నయ్య గారికి ఒకటుంది తిక్కన గారికి ఒకటుంది. పోతనగారైతే సూటిగా చెప్పారు శ్రీ కైవల్య పదంబు కోరుకుటనే చింతించెదన్ అన్నాడు. ఆయనకి కావలసింది కైవల్యం కావాలి. కైవల్యము అంటే మరణానంతర సుఖమైన మోక్షం కాదు జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితికి నేను వెళ్ళాలి అని అనుకున్నాడు. కనుక పోతన గారు కూడా లక్ష్య సిద్ధితో రాశారు. తెలుగునాట విశ్వనాథ సత్యనారాయణ గారు జనాధ్యపాయంబు తప్పించుతన్ అన్నాడు. ఈ జన్మ పరంపరలో ఎన్ని జన్మలు ఎత్తానో ఇంకా ఎన్ని ఎత్తవలసి ఉన్నదో రామా! ఈ జన్మ వచ్చినందువలన కలిగే అపాయం గురించి అసలు జన్మే అపాయం.దాన్నుంచి తప్పించుకోవటం కోసం నేను రామాయణ కల్పవృక్షం రాస్తున్నాను అమరీకైశిక పారిజాత కుసుమోస్వాదువి-కుసుమోహస్వాదువి బాలకాండము అని ఆయన-ఆయన చెప్పుకున్నారు. అంటే కవులందరూ కూడా మోక్షాన్ని కోరి ఇష్టసిద్ధిని కోరి జగత్తులో కావ్య నిర్మాణం చేశారు. ఈ మోక్షం అంటే మోక్షానికి జ్ఞానం అని కూడా ఒక పేరు ఉంది. అంటే జ్ఞానము కోరి విజ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. అంటే metaphysical ని ఆధారం చేసుకొని spiritual వైపు వెళ్ళాలి అని ఇవన్నీ కూడా రాశాడు, రాశారు. వాళ్ళతో పాటు దూర్జటి కూడా, కలహస్తీశ్వర శతకం. ఆయన నిజానికి శతకం రాసేనాటికి పూర్తిగా కృష్ణదేవరాయల ఆస్థానంలో ఇరుక్కుపోయి ఉన్నాడు. [గాలి] రాయలవారి మీద, రాయలవారి భా-భార్య మీద, రాయలవారి రాజనర్తకి మీద, ఈ లోకం మీద, లోకం మీద, వస్తువుల మీద పద్యాలు రాయటంతో ఆయన అలసిపోయినాడు. ఇంతేనా? "ఈ అమ్మవారు నాకు అనుగ్రహించిన ఈ ప్రజ్ఞను వీళ్ళందరి కోసం పెట్టనా? రాజులు మత్తులు. వారి సేవ నరకప్రాయంబు. వారిచ్చు అంభోజాక్షి చతురం తయా నసురవి భూషాదులు ఆత్మవ్యధా బీజముల్. తదపేక్ష చాలు. పరితృప్తీం జన్దతన్ జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామ మమ్మో దయతో శ్రీ కలహస్తీశ్వరా" అన్నాడు. అంటే బతికి ఉండగానే నాకు ఆ జ్ఞానలక్ష్మి ఏమిటో చెప్పవయ్యా! లక్ష్మీదేవి వచ్చింది ఇంటికి. దాని నిండా ఏనుగులు వచ్చినయి, గుర్రాలు వచ్చినయి, యజ్ఞహారాలు వచ్చినయి, పల్లకీలు వచ్చినయి, ఆడు గుర్రాలు వచ్చినయి, ఆభరణాలు వచ్చినయి, చీని-చీనాంబరాలు వచ్చినయి. ఏం చేసుకోను అవన్నీ మారిపోయి మాసిపోయేవి. ఖాళీవి కూలిపోయేవి అవే నాకు దొరికింది అని అనుకున్నప్పుడు ఆయన కలహస్తీశ్వర ఆ శతకం రాశాడు ఆయన. అవి జీవన వేదాంతానికి పరమాద్భుతంగా దర్పణం, అద్దం పెట్టినటువంటి పద్యాలవన్నీ కూడా. తెలుగు వాఙ్మయం ఎంత గొప్పదో అందుకనే స్వామి మాతృభాష మీద, తెలుగు భాష మీద ఆయనకి ఏ భాష రాదు గనుక అనువాదకుణ్ణి పెట్టుకున్నారు. జర్మన్స్ వెళ్లారు, ఇటాలియన్స్ వెళ్లారు, ఆ స్కాండినేవియన్స్ వెళ్లారు. ఆయన దగ్గరికి వెళ్ళని వారు లేరు. ఇరాస్టియన్స్ వెళ్లారు. భారతదేశంలో ఉన్న వివిధ భాషల్లో గిరిజనులతో సహా వెళ్లారు. అందరితో మాట్లాడినటువంటి స్వామి తెలుగు భాషలోనే. సాయిరాం సార్! ఆ మ్యూట్ అయి-మ్యూట్ అయి ఉన్నారు. ఒకసారి చూడమండ్రా. మ్యూట్ లో నుంచి రండి, బయటికి రండ. వచ్చా. ఓకే. మ్. రైట్ సార్. హలో, హలో. అవతరించె నేడు ఆంధ్రదేశము నందు జగతిన్ ఉద్ధరింప సత్యసాయి. ఆతడుపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాష అయ్యే తెలుగు నేడు. అంటే దేవతలంతా కూడా సంస్కృతం మాట్లాడతారు. అది అమృతభాష, అమరభాష అంటాం. కానీ సత్యసాయి భగవానుడు ఆంధ్రదేశంలో అవతారమెత్తిన కారణంగా, ఆయన తెలుగులోనే మాట్లాడిన కారణంగా, ఉపన్యసించిన కారణంగా తెలుగు భాష దైవభాష అయింది. ఆయన కనుక ఆయన దైవమే. ఇది metaphysics. అంటే కంటికి కనిపిస్తున్నటువంటి ఒక వస్తువుని మనం చూసేటువంటి దృష్టిని ఈ మహాద్వారం నుంచి మనం అసలుని అందుకోవటానికి ఏర్పడేటువంటి స్థాయి, స్థితి అది. అలాగే ఇప్పుడు మన ఇల్లుంది. సింహద్వారానికి గడప ఉంది. గడప లోపల అంతా కూడా spiritual ఏ. గడప బయట అంతా metaphysics. అనేకమైన విభిన్నమైనటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. వాటితో మనకి సంపర్కం ఉంది. వాటి వలన కలిగేటువంటి వ్యధలు, గాధలు అనేకమైనటువంటి ఆ సంస్కారాలన్నీ కూడా మనం మోసుకొని ఇంట్లోకి వస్తాం కానీ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అంటే ఒంట్లోకి అని, బయట నుంచి లోపలికి అని, బయటకు అంటే ఇదిగో ఈ వస్తువు ప్రపంచం. ఇప్పుడు ఈ మాట్లాడటం ఇదంతా కూడా metaphysics. తర్వాత మాట్లాడకుండా మౌనం "వ్య్యాక్షా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువారం" అనేటువంటి దక్షిణామూర్తి స్థాయిలోకి మనం గనుక వెళ్లగలిగినట్లయితే అది spiritual. ఈ రెండింటినీ స్వామి సమన్వయం చేస్తూ మనకి ప్రాచీన వాఙ్మయాన్ని చక్కగా ఇచ్చి అనేకమైనటువంటి దర్బార్లు నిర్వహించి భారతీయమైనటువంటి సంకీర్త సంప్రదాయాన్ని అనేకమంది సంగీత కళాకారుల చేత తమ ముందు ప్రదర్శన చేయించి నీతి, ఒక రీతి, ఒక గీతి, ఒక గమకము వీటన్నింటినీ కూడా స్వామి కళా స్వరూపాలుగా అంటే నాటకాలుగా, నాటికలుగా, ఏకాంకికులుగా, భ్రూణ విజయాలుగా, కవన విజయాలుగా వాటన్నింటినీ కూడా తమ సన్నిధానంలో ప్రదర్శి- సాయిరాం సార్! అది ఎవరో నొక్కుతున్నారు, మిమ్మల్ని mute చేస్తున్నారు ఒకసారి. చేత లేదు, ఎవ్వరూ లేరు ఇక్కడ. అది ఎందుకు అవుతుందో తెలీదు. సరే, ఏం కాబట్టి వీటన్నింటినీ స్వామి చక్కగా సమన్వయం చేస్తూ ప్రాచీన వాఙ్మయాన్ని మనందరికీ పరిచయజీవితాన్ని భగవద్గీతను చదవటం ద్వారా ఈ జీవితం ఎంత అశాశ్వతమైనదో ఎంత అల్-- ఎంత సంకుచితమైన పరిధిలో ఇది నడుస్తూ ఉంటుందో! బంధువులు స్నేహితులు అనబడేటువంటి ప్రాపంచిక బంధనాలన్నీ కూడా ఎంతగా brittle గా ఎంత fragile గా ఉంటాయో చెప్తూ స్వామి మనల్ని ఉదాత్తమైనటువంటి వైరాగ్య స్థితం నుంచి ఒక వైభోగ స్థితలోకి తీసుకుని వెళ్లారు. ఇది ఏ అవతారమూర్తి అయినా ఇంతవరకు metaphysical level లో ఇవన్నీ చేశారా అని ఆలోచిస్తే ఎవరూ చేయలేదు. వ్యాఖ్యానాలు చేయలేదు, రచనలు చేయలేదు, ఉపన్యాసాలివ్వలేదు, ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానం చేయలేదు. మళ్లీ సామాన్యమైనటువంటి ఇవాళ ఆధునిక మానవుడు అంటే ఇవాళ మన ముందున్నటువంటి ఒక యువత ఒక ఆ- సమకాలీనమైనటువంటి ఒక generation దానికి వాంగ్మయాన్ని సరళమైనటువంటి భాషలో స్వామి ఆనాడు శిష్ట వ్యవహారిక భాషలో చెప్తూ ఇదిగో ఇంత అమూల్యమైనటువంటి విజ్ఞాన భాండాగారం ఇక్కడ ఉన్నది దీనిని మీరు అందుకోండి, అందుకై ప్రశాంతి నిలయానికి రండి. ఇవన్నీ చదువుకుంటూ చదువుకుంటూ మీరు ఎక్కడ ఉన్నా గనుక వాటి అర్థం తెలుసుకుని జీవితం గడిపితే అది పారమార్థిక చింతన వైపు దారి తీస్తుంది అని మనకి చక్కగా చెప్పారు. అంటే రామావతారం కేవలం రావణ వధ కోసం మాత్రమే రాలేదని నిన్న చెప్పుకున్నాం. కృష్ణావతారం కేవలం కురువంశ నిర్మూలనం చేయటానికి వచ్చిందని కాదని చెప్పుకున్నాం. అలాగే సత్య సాయి భగవానుడు కూడా వస్తు సృష్టి చేయటానికి వచ్చినటువంటి పరమాత్మ కాదు. ఆ వస్తు సృష్టి ఒక దివ్యత్వానికి కలియుగంలో హేతువాది ఉన్నాడు, నిరీశ్వరవాది ఉన్నాడు, ప్రశ్నించే వాడున్నాడు, మాకు నిదర్శన కావాలి అని అడిగే వాడున్నాడు. వీళ్లందరికీ కూడా దివ్యమైనటువంటి భగవత్ శక్తి యందు ఒక అపురూపమైనటువంటి గురి కల-కలగాలి, కుదరాలి అనేటువంటి ఒక భావనతో స్వామి ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. అలాగే అన్నింటికీ స్వామి devotees స్వామి ఆవరణలో లేని వారికి ఆ five D's, F లు చెప్పక్కర్లే, అవన్నీ మనకు తెలుసు. లేనివారికి తెలియదు గనుక వారు ఈ ఆ-dedication, devotion, discrimination ఇవన్నీ కూడా చెప్తూ ఆంగ్ల పదాలని కూడా వాడుతూ అధ్యాత్మను బోధించారు. అధ్యాత్మ విజ్ఞానాన్ని బోధించారు. ఇవాళ శాస్త్రాలు విశేషంగా మన పురాణ వాంగ్మయాలు వీటన్నింటినీ అధ్యయనం చేసి శ్లోకాలు, పద్యాలు, పాటలు, తర్కాలు, వ్యాకరణ మీమాంసాలు అట్లాగే వీటన్నింటి మీద గంభీరమైనటువంటి అసంఖ్యాక అనేక ప్రవచనాలు మనం చేసినా తెలుసుకోవాల్సింది ఒక్కటే. ప్రవచనం చేసేవాడు జ్ఞాని కాడు. వాడు విజ్ఞాని మాత్రమే. Intellectual interpretation is not జ్ఞాన, it is only విజ్ఞాన. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశం వరకు వచ్చి వాడు ఆగుతాడు. ఆనందమయ కోశం వైపు ఎట్లా వెళ్లాలో తెలియదు గనుక మనం ఒక్కసారి యుగాల్లోకి వెనక్కి వెళ్ళినట్లయితే కృతయుగం అంతా కూడా అస్థిగతం. త్రేతాయుగం అంతా మాంసగతం. ద్వాపరయుగం అంతా రక్తగతం. కలియుగం అంతా అన్నగతం. ఈ నాలుగూ మనం అర్థం చేసుకోకపోతే స్వామి అర్థం కాదు. కృతయుగంలో తపస్సులు, స్వాధ్యాయ సంపన్నులు అంతా కూడా అరణ్యాల్లో ఉన్నారు ఇంకా అప్పటికి నగరాలు పుట్టలే. జనజీవనం అంతా కూడా అరణ్యాలకే పరిమితమై ఉన్నది గనుక అరణ్యవాసం చేస్తూ అడవిలో ఉన్నటువంటి అనేక వృక్షాల ఆకులలో నుంచి నానానాథ సందోహంగా వచ్చిన నాదాలను పట్టుకొని తమ అంతర్ దృష్టితో వాటన్నింటినీ ఒకచోట పెట్టి వేదాలను ఒక ముద్దగా చేసింది కృతయుగం. అంటే ఏమిటి? కృతయుగంలో పుట్టిన ప్రతి మానవుడు వస్తువుని ఆధారం చేసుకోలే. తపస్సు, స్వాధ్యాయము, ధ్యానము, ధారణ. స్వాధ్యాయం అంటే పుస్తకం చదవటం కాదు. తనను తాను ఎరుగు ప్రయత్నం. దాన్ని ఎలా తెలుసుకున్నాడు? ధ్యానం ద్వారా, ధారణ ద్వారా. వీటన్నింటి ద్వారా తెలుసుకుంటూ పరమేశ్వరుడితో సూటిగా direct path అంటాం. దానితో connection పెట్టుకున్నాడు గనుక కృతయుగ మానవులందరూ కూడా సత్యయుగాన్ని అనుభవించారు. ముక్కారు పంటలు పండినయ్. ఎక్కడా అగ్నిపర్వతాలు బద్దలు కాలే. రూపుదిద్దుకున్నాయ్. నదీనదాలు నిశ్శబ్ద మందిరంగా సలయేళ్ళ వలె మధుర మధురంగా ప్రవహించినయ్. కొండలు స్థిమితంగా ఉన్నాయ్. భూమి నెర్రలు విచ్చలేదు. ఎట్లా ఉండాలో పంచభూతాలు అన్నీ కూడా తమతమ స్థితిలో చక్కగా ఉన్నాయ్. గ్రహాలు అన్నీ కూడా తమతమ పరిధిలో అవి ఆవృత్తం అవుతూ వస్తూ ఉన్నాయ్. ఆ వేదాల ద్వారా జరిగినటువంటి ఈ గమనమంతా కూడా "మధుశ్చ మాధవశ్చ వసంతీ కా వృతయే" అంటుంది వేదం. అది మధువు పుట్టేది అప్పుడే, మాధవుడు పుట్టింది ఇక్కడే. మధుమాధవుల యొక్క కలియక ఈ భూగోళం గనుక ఈ భూగోళానికి ఖగోళానికి లంకె వేస్తూ ఒక bridge వేస్తూ ఈ మహర్షులందరూ కూడా పరమాద్భుతమైనటువంటి వైజ్ఞానిక విభూతిని మనకు అందించారు. ఇది కృతయుగం చేసింది. కనుక వారి శరీరాలు సృష్టించిపోయినయ్. శరీరంలో ఉన్నటువంటి అస్థిపంజరాల మీద దానిమీద కప్పబడిన చర్మాలు పలచబడిపోయి లోపల అస్థిపంజరాలు distinct గా కనబడుతూ వచ్చినయ్. కనుక అది అస్థిగతమైంది. యుగం మారింది, కాలం మారింది. ధర్మం మారుతూ వస్తోంది, విలువలు మారుతూ వస్తున్నాయి. త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం అంతా కూడా మాంస యుగమైంది.మాంసం తినటానికి కూడా పదార్థం అయింది. మాంసం మీద ఆధారపడి జనవృత్తులన్నీ కూడా సాగినయి. తర్వాత ద్వాపరయుగం వచ్చింది, అది రక్తయుగం అయింది, రక్తగతం అయింది. కనుకనే ద్రౌపది దేవికి వస్త్రాపహరణం చేసినప్పుడు దుశ్శాసనుడి గుండె చీల్చి ఆ రక్తంతోని కురులు సవరిస్తానన్నాడు భీముడు. అంటే రక్తము లోపల ఉన్నటువంటి మనకున్నది ఏమిటి? ఎముకలు, రక్తము, మాంసము, మజ్జ. ఈ నాలుగే నాలుగు యుగాలు పంచుకున్నాయి. అని ప్రతిజ్ఞ చేసినప్పుడు అది రక్తగతం అయింది. భీషణమైనటువంటి రజోగుణం తీవ్రమైంది. లాలస పెరిగింది. కలియుగానికి వచ్చేప్పటికి దీనిని పాపకాలంగా కవులు వర్ణిస్తారేమో కానీ, నా దృష్టిలో, నా అంతఃశోధనలో కలియుగము బా మహా పుణ్యకాలం ఇది. ఈ కలియుగంలో జరిగినటువంటి సగుణోపాసన గాని, నిర్గుణోపాసన గాని, శాస్త్రాధ్యయనం కానీ, ఇవి ఏవి ఏ యుగంలోనూ ఇంతగా జరగలేదు. జరిగుంటాయి కొంత. ఎట్లా జరిగింది? ఎందువలన జరిగింది? కలియుగం చేసుకున్న పుణ్యం ఏమిటి? ఇన్ని అరాచకాలు, అమానుషాలు, అవిద్యలు, అస్పష్టతలు, అనాచారాలు మన చుట్టూముట్టి ఉంటే కలియుగం పుణ్య కాల-- ఆ-యుగం ఎట్లా అయిందనేటువంటి ఒక ఆలోచన పొటమరించినప్పుడు సమాధానం ఒక్కటే, అది అన్నగతం. మేఘం వర్షిస్తే, మేల కులకిస్తే, ఒక బియ్యపు గింజ ధాన్యం మనకు ఏర్పడితే, ఒక బియ్యం దొరికితే, దానిలో నుంచి అన్నం ఏర్పడితే, "అన్నం బహు గురువీత" ఇది వే-- ఉపనిషత్ వాక్యం. అది లోపలికి వెళ్ళింది. ఆ అన్నం ద్వారా ఒక ప్రాణశక్తి ఏర్పడి ఆ-అది అన్నమయమైనటువంటి ఆ కోశం ప్రాణమయ కోశం అయింది. ప్రాణమయ కోశం మనోమయ కోశం అయింది. మనోమయ కోశం విజ్ఞానమయ కోశం అయింది. కనుకనే ఇవన్నీ మనం మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి ఈ కలియుగానికి నిన్న చెప్పుకున్నట్లుగా అధిష్టాతలైనటువంటి శ్రీ లలితా దేవి ఆచరణ రూపం, ఆలోచనా రూపమైనటువంటి శివాత్మకమైనటువంటి ఈశ్వరుడు దత్త స్వరూపంగా ఈ జగత్తులోకి రావాలి గనుక అతి గుహ్యమైన, ఎవరూ అందుకోలేనంత subtlest of the subtle అంటాం. వాటన్నింటినీ పట్టుకోవటానికి గల మార్గాన్ని సత్యసాయి భగవానుడు చక్కగా గుట్టు విప్పి, "ఇదిగో దీంట్లో ఇది ఉన్నది" కానీ అన్నిటా అంతటా భగవంతుడున్నాడు. "సర్వం ఖల్విదం బ్రహ్మ" అంటే మనకర్థం కాదు. ఇది అంటే ఏమిటండి అంటాం. ఈ ఉన్నదంతా బ్రహ్మమే అని చెప్పాలి. మరి స్వామి ఏం చేశారు? కొన్ని వందల పద్యాల రూపంలో భారతీయమైనటువంటి, వైదాంతికమైనటువంటి అంటే వేదాంతికమైనటువంటి, శాస్త్రపరమైనటువంటి, మెటా ఫిజికల్ గా వస్తువులుగా కనిపించే వాటన్నింటినీ చెప్తూ, "ఈ కనిపిస్తున్నదంతా బ్రహ్మమే" అని చెప్పారు. ఒకప్పుడు ఈ దేశంలో బ్రహ్మ సమాజం అనేటువంటి ఒక వాదన ఉండేది. దానిని సత్యసాయి భగవానుడు reverse చేశారు. ఎలా చేశారంటే, బ్రహ్మ సమాజం ఏమిటి? అసలు సమాజమే బ్రహ్మము అన్నారు. దానికి స్వామి పద్యం మనం చెప్పుకోవాలి. "చుక్కలన్నియు బ్రహ్మ సూర్యుండు బ్రహ్మ చంద్రుడన్నను బ్రహ్మ జలము బ్రహ్మ తల్లి అన్నను బ్రహ్మ తండ్రి అన్నను బ్రహ్మ వాళ్ళభ్యమది బ్రహ్మ పుట్టించునది బ్రహ్మ పోషించునది బ్రహ్మ కిట్టించునది బ్రహ్మ గృహిణి బ్రహ్మ కర్మలన్నియు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ ఆదిశక్తియు బ్రహ్మ సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ" అని నిరూపించారు. నేను మీకంటే భిన్నంగా లేను, నేను మీలాగానే ఉన్నా, మీతోనే ఉన్నా, మీరెట్లా వచ్చారో నేను కూడా అట్లాగే వచ్చాను. ఇట్లా చెప్పిన అవతార ముక్తి ఎవరైనా ఉన్నారా? సత్యసాయి వైభవంలో ఇది చాలా ప్రధానమైన భూమిక. రాముడు సరే నేను మానవుడిగా ఉంటానన్నాడు, అంతవరకే. మీరందరూ దేవుళ్ళు కాండి అని చెప్పలేదు. అధ్యాత్మను జీవించాడు, అధ్యాత్మను ప్రబోధించలా. కృష్ణ పరమాత్మ ಜೀವ-జీవితం మొత్తం అధ్యాత్మమయం చేశాడు. నిష్కామ కర్మ యోగం చేశాడు ఆయన. ఎవడు రాజైతే ఆయనకేమి, ఆయనకొచ్చిన లాభమేమి అని ఆయన అనుకోలా. ధర్మమును ఎవరైతే పాలిస్తారో వాళ్ళు రాజు కావాలి అని శ్రమించాడు ఆయన. కలియుగంలోకొచ్చేప్పటికి సత్యసాయి భగవానుడు ఒక విస్తృతమైనటువంటి విరాట్ మూర్తివలె, అంటే ఇవాళ్టి భాషలో it's the biggest canvas ever. దానిమీద ఆయన చెప్పనిదంటూ ఏం లేదు. మళ్ళీ కాస్త వెనక్కి వెళదాం. నేను కూడా బ్రహ్మనేనన్నారు, మీలాగానే. అంటే స్వామి అందరూ వేదాంతులు, తర్కం చెప్పేవాళ్ళు, ప్రవచనకారులు, "అది బ్రహ్మవిద్యయా, మీకర్థం కాదులే, బ్రహ్మమును ఎరగకపోతే లాభం లేదు, జీవితం పాడైపోతుంది" అని చెప్తున్నారు. అసలు బ్రహ్మం అంటే ఏమిటి స్వామి చెప్పండి మాకు అర్థమయ్యేట్లుగా అంటే, మామూలు వాడైతే గంట మాట్లాడతాడు ఆయన ఒక్క వాక్యంలో చెప్పారు. "దేనిని ఈ కనులు చూడలేవో కానీ దేనివలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము" అన్నారు. అయిపోయింది. అంటే చూస్తున్న మనం బ్రహ్మము, చూపిస్తున్నవాడు బ్రహ్మం, పరమాత్మ. మనం ఆత్మగా, జీవాత్మగా చూస్తున్నాం. ఈ చూస్తున్నటువంటి వాడికి లోపల పరమాత్మ ఉండి చూపిస్తూ ఉన్నాడు. అది రెటీనా కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, అంతర్జ్యోతి ఏదైతే ఉన్నదో అది అని స్వామి ఇంకా అనేకమైనటువంటి కొన్ని వేల వందల వాక్యాలన్నీ కూడా మన పరం చేశారు. కానీ స్వామి ఒక్కసారి, స్వామి విషయంలోనే వెనక్కి వెళితే తీవ్రమైనటువంటి అధ్యాత్మ బోధంతా ఆయన యువకుడుగా ఉండగా చేశారు. ఆయనకి శరీరానికి వయసు వస్తున్న వేళకి జనసామాన్యం పె-- అంటే సామాన్య జనం పెరిగిపోయినారు.మొదటి ఉపన్యాసాలు మొదటి తరంలో ఉన్నవన్నీ కూడా చాలా గంభీరమైనవి ఉదాత్తమైనవి లోతైనవి ఘనమైనవి. తర్వాత తర్వాత చేసిన ఉపన్యాసాలలో కథలు కూడా చెప్పారు స్వామి. ఎందుకంటే అక్కడికి వచ్చిన వారంతా పండితులు కారు. అనేక రకాల భిన్న భిన్నమైనటువంటి నేపథ్యాలు ఉన్నటువంటి భక్తులు గనుక కథా రూపంలో కూడా వాగ్మయాన్ని ప్ర-పరిచయం చేశారు. అయితే దురదృష్టం ఏంటంటే మనం కథలు పట్టుకున్నాం అసలు విషయాన్ని వదిలిపెట్టాం. కానీ అది స్వామి పొరపాటు కాదు మన పొరపాటు. స్వామి ఎంత బాగా చెప్పారు ఎంత అద్భుతంగా చెప్పారు కానీ ఏం చెప్పారు మనకు తెలియదు. ఆ పరిస్థితిలో సత్య సాయి భగవానుడి ఈ అవతార వైభవంలో ఈవేళ మనందరం పునః నిత్య స్మరణీయం చేసుకోవలసిన మరొక aspect ఉన్నది. ఆ aspect ఏమిటంటే ఏది చేసినా aim for perfection. There is nothing called perfection, it is a near perfection. సాధ్యమైనంతవరకు క్రమశిక్షణతో సమయపాలనతో నిష్కామ కర్మతో పరిశుద్ధమైనటువంటి బుద్ధితో చిత్తాహంకారాలను వదిలిపెట్టి ఏ పని చేసినా లక్ష్య గమ్యాలు చేరుకునే స్థాయిలోకి వెళ్ళాలి. ఇది సత్య సాయి భగవానుడు స్థూలంగా మనకు నిర్దేశించినటువంటి ఒక లక్ష్య లక్షణ విధానం ఇది. కనుకనే స్వామి అనేకమందికి అనేక రూపాల్లో దర్శనం ఇచ్చారు వాటి జోలికి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే అవన్నీ వైయక్తికాలు. అలాగే స్వామితో మనకున్నటువంటి ప్రాపంచిక బంధనాలున్నయే లేదా ప్రాపంచికంగా మనం claim చేసే proximities ఉన్నయే అవి లోకానికి పెద్దగా ఉపయోగపడేవి కావు. ఏది ఉపయోగపడుతుంది అంటే మన హృదయం స్వామి హృదయంతో కలిసిందా లేదా? స్వా-స్వామి కోరుకున్నది అదే. మీ హృదయాన్ని నా హృదయంతో, నా అంటే పరమాత్మతో కలపండి. కలిపితే మీరు పరమాత్మలు గానే ఉంటారు. మీరు పరమాత్మలే ఇప్పటికే కానీ మీకు తెలియదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ చిన్న వెలుగు వెళ్ళి పెను వెలుగుని గనక కలిసినట్లయితే పెను వెలుగు చిన్న వెలుగు అంటూ రెండు ఉండవు, రెండూ ఒకటి అయిపోతాయి. ఈ zero watt, hundred watt, two hundred watt, five hundred watt వెళ్ళి మూలల్లో generation ఎక్కడ అవుతుందో అక్కడ కలిసిపోతే దానికి watts లేవు amps లేవు ఏం లేవు కదా. కాబట్టి వీటన్నింటినీ కూడా ఇంత scientific గా ఒక వైజ్ఞానిక భూమికలో వేదాంతాన్ని బోధిస్తూ బోధిస్తూ స్వామి మానవ జీవన వికాసంలో జీవన ప్రమాణంలో అనేకమైనటువంటి మార్పులు తీసుకువచ్చారు. మార్పు చెందిన వాడికి తెలుస్తుంది. తెలియని వాడికి ఇంకా స్వామి, పూజ, వ్రతము, దానము, ధర్మము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, అవన్నీ జరగాలి. కానీ ఈ metaphysical పరిధిలో విచారణ చేసినట్లయితే రామావతారంలో రాముడి కాలంలో ఆయనని సమస్త జనులు కూడా పరదైవతంగా భావించినప్పటికీ, ఋషులంతా ఆయనను ఉపాసన చేసినప్పటికీ, మునులంతా మౌనంగా ధ్యానంలో తపస్సులో అనుభవించినప్పటికీ ఎవ్వరూ కూడా శ్రీరామచంద్రుడికి ఆయన పరంగా గాయత్రీ మంత్రాన్ని చెప్పలే. సూర్యవంశంలో పుట్టిన ఆ గాయత్రి సూర్యోపాసన అయినప్పటికీ నిజానికి ప్ర-ప్రథమ ప్రణవ ఓంకారం అనేటువంటి ఆ శబ్దం ఏదైతే ఉన్నదో నాదం ఏదైతే ఉన్నదో అదే గాయత్రిగా మూడుగా విభజన చెంది వచ్చిందని మనందరికీ తెలుసు. అటువంటిది శ్రీరామ గాయత్రి రాముడు ఉండగా రాలే. కృష్ణ గాయత్రి కృష్ణుడు ఉండగా రాలే. శ్రీనివాస సాయినాథుడి గాయత్రి లేదు. సత్య సాయి భగవానుడికి మాత్రం వారు దేహంలో ఉండగానే గాయత్రి ఏర్పడింది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఛందోబద్ధమైనటువంటి ఒక గాయత్రి ఈ ప్రపంచానికి అందించినప్పుడు గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి ముఖతః ఒక్కసారిగా వెలువడినప్పుడు కాయన ఆయన వేద పండు గనుక స్వామి దగ్గరకు ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లి వేదిక మీద "స్వామీ! దీనిలో రెండు పొరపాట్లు జరిగినాయి" అన్నారు. ఏమో గాయత్రి ఇంకో గాయత్రి తీసుకొని గాయత్రి రాస్తే అయిపోతుందిగా ఈవేళ గురువులు అట్లా ఉన్నారు కదా. ఎవడి గాయత్రి వాడు రాసుకుంటున్నాడు కదా. స్వామి ఏమన్నారు, "ఏమి జరిగింది?" అని అడిగారు. "స్వామీ! మీరు సత్య సాయి నామంతో ప్రపంచంలో ఉన్నారు కదా, మిమ్మల్ని తన్నః సత్యః అని అనాలి కదా నేను, కానీ తన్నః సర్వః అని నా నోట్లో నుంచి వచ్చింది" అని అంటుండగానే "శాస్త్రి! నీకు మహా మంత్రార్ణవ గ్రంథం గుర్తున్నది కదా! మహా మంత్రార్ణవ గ్రంథంలో పరమేశ్వరుడిని ఏమన్నారు? సర్వభ్యః సర్వ సర్వభ్యః అని అనలేదా? కాబట్టి సర్వః అన్నా సత్యః అన్నా రెండూ ఒకటే" అని నివృత్తి చేశారు. ఏక ఒక్క second time కూడా ఆయన తీసుకోలేదు. అప్పుడు ఆయన నెమ్మదిగా ఒక count లెక్కబెట్టి "స్వామీ! ఏ గాయత్రికైనా నూట ఎనిమిది బీజాక్షరాలు ఉంటాయి. కానీ ఈ మీ పరంగా వచ్చిన ఈ గాయత్రిలో నూట తొమ్మిది కనిపిస్తున్నాయి నాకు. అదేమిటి?" అని వారు అడిగారు. అడిగితే "మిగతా ఏ గాయత్రుడైనా సరే కొంతకాలం దాని గాయత్రి ఉపాసన చేస్తే తప్ప మీకు కామ్యసిద్ధి కలగదు. ఏదైనా పని జరగాలి, ఆయుష్షు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఇవన్నీ జరగాలి అంటే కొంతకాలం గాయత్రి జపం చేయాలి. కొంతమంది లక్షల లక్షల కోట్ల గాయత్రి జపం చేస్తారు. కానీ సత్య సాయి గాయత్రిలో నీకు కనిపిస్తున్న నూట తొమ్మిదవది ఏదో తెలుసునా? అది స్వామి యొక్క అనుగ్రహమే దాని యందున్నది."నేను గాయత్రి చెయ్యాలి అని నువ్వు అనుకుంటూ ఉండగానే అనుగ్రహం ప్రారంభమవుతుంది. కనుక అది క్షిప్ర ప్రసాదం. అంటే అనుకోగానే వెనువెంటనే మీకు ఆ లబ్ధి కూరుతుంది గనుక అది స-సత్య సాయి గాయత్రి అని స్వామి పరిష్కారం చేశారు. అలాగే అనేకమైన విషయాలు స్వామికి బృహదారణ్యకోపనిషత్ ని ఎప్పుడు చదివారు? ఎక్కడ చదివారు? మరి గురువు లేడని చెప్పుకున్నాం మరి ఈయనకి ఇవన్నీ ఎట్లా తెలిసినయి అంటే, ఇవి జ-జవాబు లేని ప్రశ్నలు అని అందరూ అంటారు. కానీ నేను ఒక్కటే మాట అంటాను జవాబు ఒక్కటే వేదములు స్వామి. స్వామి భజన చేసినప్పుడు సంకీర్తన చేసి చేయించినప్పుడు తొలినాళ్లలో భజన మందిరంలో ఆయన సామవేద స్వరూపం. సామగాన స్వరూపం అంటే సామవేదమే స్వామి. ఇక వారి మాటలు ఒక్క పొల్లు మాట ఉండదు, నిరర్థకమైన పదం ఉండదు, ఎవరినీ కించపరిచే మాట ఉండదు. ఎక్కడ జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతమైనటువంటి దివ్య భావనా గరిమని ఈ ప్రపంచానికి తమ దివ్యోపన్యాసాల ద్వారా ప్రపంచానికి అందించినప్పుడు ఆ స్వామి ఋక్ అంటే మాట. నా దృష్టిలో స్వామి ఋగ్వేదం. తర్వాత యజుర్వేదం ఎట్లా అయింది అంటే యజుహు అంటే యజ్ఞం. యజ్ఞం అంటే కర్మకాండ. ఆ కర్మకాండ ఆనాడు త్రేతాయుగంలో గాని ద్వాపర యుగంలో గాని స్వాహాకారాలు చేస్తూ యజ్ఞాలు చేస్తే ఇవాళ ఆ యజ్ఞాన్ని స్వామి మనందరి చేత సేవ అనబడేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి యజ్ఞ వేదికని మనందరికీ కూడా అంటే ప్రపంచానికి అందరికీ కూడా ఏర్పాటు చేసి మీరు సేవాయోగంలో ఉండండి, సేవా యజ్ఞంలో పాల్గొనండి. ఇగో ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అంతా కూడా వాచక యజ్ఞమే. కాబట్టి స్వామి ఒక్కరే చేశారంటే ఆయన ఏమీ చేయక్కర్లే చేయించటానికి ఆయనే ఉన్నారు. కాబట్టి ఏది చేసినా ఇవాళ సర్వమో ఈశ్వర ప్రీతికే అనే భావనతో మనం చేయటానికి సత్య సాయి భగవానుడు ఈ దేశానికి అందించినటువంటి ఒక మహత్తరమైనటువంటి సేవాయోగం. కనుక స్వామి సామవేదము స్వామి, ఋగ్వేదము స్వామి, యజుర్వేదము స్వామి ఇక అక్కడక్కడ అక్కడక్కడ అప్పుడప్పుడూ ఎడనెడా చేసేటువంటి, చేయించేటువంటి కొన్ని-కొన్ని పనులన్నీ కూడా అధర్వణ వేదంలోనే మిగిలిపోయి ఉన్నాయి గనుక నిజానికి వేదాలు మూడే. వేద విద్యకు పేరు త్రయీ విద్య అని. సామవేదము, ఋగ్వేదము, యజుర్వేదము. నాల్గవది అధర్వనుడి పేరు మీద వచ్చింది అది చతుర్వేదం. దాన్ని కాస్త పక్కన పెడితే వేద విద్యలన్నీ కూడా త్రయీ విద్యలు మూడే. ఆ మూడే సత్య సాయి భగవానుడు మనందరికీ కూడా పరిచయం చేసి దానిని గంభీరమైన ఒక పండిత భాషలో కాకుండా సరళమైన, సూటియైన, గంభీరమైన, మర్యాదపూర్వకమైనటువంటి అచ్చ తెలుగులో వీటన్నింటినీ కూడా మనకు అందించారు. అది ఎప్పుడూ స్వామి చెప్పేవారు "అర్థం తెలియకుండా నువ్వు ఏ పని చేసినా వ్యర్థమే. ఏ పని చేయాలన్నా అర్థం ఎరిగి తెలియాలి, కిటుకు తెలియాలి, కొడుపు ఉండాలి, కూర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, మార్పు ఉండాలి, తీర్పు ఉండాలి. ఇన్ని ఉంటే గాని ఆ పని లక్ష్య సిద్ధికి నోచుకోదు గనుక నువ్వు చేయవలసిన పనులన్నీ ఇలా చెయ్యి" అని మెటా ఫిజికల్ లెవెల్ లో చెప్పిన ఈ మాటలన్నీ మనం ఇవాళ అర్థం చేసుకున్నట్లయితే ప్రపంచంలో సత్య సాయి భగవానుడి పేరు మీద జరుగుతున్నటువంటి అనేకమైన సేవా కార్యక్రమాలను గమనించినప్పుడు రాముడు చేయిస్తే ఆయన రాజు అని చెప్పుకున్నాం, కృష్ణుడు చేయిస్తే రాజుల చేత చేయించాడు ఒప్పుకున్నాం. మరి ఒక సామాన్యమైనటువంటి నిరుపేద దగ్గర నుంచి అత్యధికంగా ధనవంతుడు అయినటువంటి వాడి వరకు కూడా స్వామి వారందరి మనస్సులని కూడా సమాజ సేవలో అభిముఖం చేశారు. అంటే నువ్వు గనుక సేవ చేయకపోతే నీ జీవితం పరిపూర్ణం కాదు, అది ఫలప్రదం కాదు. జీవన సాఫల్యం దేనిలో ఉన్నదంటే మరొకరి కన్నీరు తుడవటంలో ఉన్నది, మరొకరికి ఆత్మీయ వాక్యం ఇవ్వటంలో ఉన్నది, వాత్సల్య పూరితమైనటువంటి స్పర్శలో ఉన్నది గనుక వీటన్నింటినీ కూడా మనకు అలవాటు చేశారు తర్వాత. మిగతా యుగాలలో ఏ రకమైనటువంటి సంఘటితమైనటువంటి భావనలు లేవు. ఎవరికి వారుగా ఉన్నారు. కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, రావణుడు రావణుడే, రాముడు రాముడే. ఇక్కడ స్వామి ఒక్కమాట చెప్పారు "శిక్షిస్తూ పోతే కలియుగంలో ఒక్కడు మిగలడు సుమా. శిక్షణ ఇస్తూ పోతే ఈ జనబలమే జాతి బలం అవుతుంది" గనుక ఆ శిక్షణ ట్రాన్స్ఫర్మేషన్. స్వామి ఒకసారి అడిగారు IIT అంటే ఏమిటి అని. ఏదో మనకు తోచింది చెప్పాం. స్వామి అన్నారు "అది కాదు. దాని అర్థం ఏమిటంటే ముందు కావలసినంత ఇన్ఫర్మేషన్ గాదర్ చేసుకో. ఆ ఇన్ఫర్మేషన్ అంతా దేనికోసం అంటే నీలో కలిగేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కోసం కావాలి. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడవుతుంది అంటే మధ్యలో ఇంప్లిమెంటేషన్ ఉంటే తప్ప ట్రాన్స్ఫర్మేషన్ కి దారి దొరకదు." కనుక IIT అంటే Information Leading to Implementation and Finally Ending up in Transformation. దేనిలో అంటే మన Attitude లో, మన జీవన దుర్ప్రథంలో, మన విశాలమైనటువంటి భావనా స్థితిలో. వీటన్నింటిలో గనుక మార్పు పరిణామం చెందకపోతే మనం స్వామి దగ్గరకు వెళ్లినట్టా వెళ్లనట్లా ఎవరికి వెళ్లమే మనం ప్రశ్న వేసుకోవాలి. కనుక సత్య సాయి గాయత్రిని మనం చదువుకుంటూనే స్వామి యొక్క పనులన్నీ చూస్తూనే ఇంకొక సాపేక్షమైనటువంటి ఒక భావన మనసులో కలిగేది ఏమిటంటే ఒక మనిషి తన జీవన కాలంలోవాడు వంద ఏళ్ళు ఉన్నాడు అనుకుందాం తొలి ఇరవై ఏళ్ళు ఆటపాటలలో గడిచిపోతుంది చివరి ఇరవై ఏళ్ళు వృద్ధాప్యం ముంచేస్తుంది మధ్యలో అరవై ఏళ్ళలో నలభై ఏళ్ళు జీవితం గడిచిపోతుంది అంటే ఇంకో ఇరవై ఏళ్ళు మిగిలింది అందులో సగభాగం నిద్రలో అయిపోతుంది మిగిలిన జాగ్రదావస్థ అంతా అంతా కలిపితే వంద ఏళ్ళల్లో ten percent ten years ఈ ten years లో మనం ఏం చేశామంటే మనం ఇల్లు కనుక్కున్నాం ఒక కారు కొనుక్కున్నాం సంసారం వృద్ధి చేశాం ఏదో దానం ధర్మం తృణం ఫణం చేశాం చాలా చేశామని అనుకున్నాం కానీ మనం ఏం చేయలే. ఒక్కసారి సత్య సాయి భగవానుడిని సాధారణమైన ఒక మానవుడిగా విచారణ చేద్దాం metaphysical ఆయన కూడా మరి ఇదే ప్రపంచంలో ఉన్నారు కదా. సామాన్యమైనటువంటి ఒక మానవుడు గనుక అయినట్లయితే eighth standard కూడా complete చేయనటువంటి ఒక సత్యసాయి భగవానుడు. విశ్వ విఖ్యాతమైనటువంటి ఒక university ని పెట్టగలరా పెట్టారా లేదా? ఒక అద్భుతమైనటువంటి వైద్యశాల నిర్మాణం చేశారా లేదా? నీళ్లలో ఎర్రగిన్కినటువంటి నీళ్లను పైకి తెచ్చి జనుల దాహార్తిని తీర్చారా లేదా? ఇవన్నీ కేవలం మానవ దేహం తోనే చేశారా అంటే మానవ దేహంలో ఉన్న దివ్య సంకల్ప శక్తి చేత చేశారు మనకు కూడా ఆ ప్రజ్ఞలున్నాయి కానీ ఎవరి గురించైనా మనం ఇంతగా శ్రమపడి చేశామా అంటే మనం ఇంకా ఏం చేయలే. మన తాత ముత్తాతలు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఎనభై ఆరు తొంభై ఆరు ఏళ్ళు బతికారు ఏం చేశారంటే నాలుగు ఎకరాల పొలం ఉంటే ఇరవై ఎకరాలు చేసి మనకిచ్చారు మనం ఆ ఇరవై ఎకరాలను నలభై ఎకరాలు చేశాం లేకపోతే పోగొట్టాం ఇదే చేశాం కానీ సత్యసాయి భగవానుడిని కేవలం నరమాత్రుడుగా గనుక ఆలోచించినట్లయితే ఇవాళ సమస్త ప్రపంచంలో ఒక organisation ప్రారంభించారు ఆయన. ఆ organisation ఏమిటి అంటే శ్రీ సత్య సాయి సేవా సంస్థలు సేవ organisation అసలు సేవకి organise ఎవరు చేయగలరు ఎవరైనా చేయగలరా ఎవరికి మన-- మనకి అనేకమైన సంస్థలున్నాయి ప్రపంచంలో అనేక విధాల సేవలు జరుగుతున్నాయి కానీ సంధణితంగా physical, metaphysical, spiritual మూడింటినీ సమన్వయం చేసి సేవ చేసేటువంటి ఒక దివ్య వేదికని సత్యసాయి భగవానుడు ప్రారంభించారు. ఆయనకి Harvard University లో degree లేవు Cambridge లో చదువుకోలేదు మనకి ముందు వెనుక ఉన్న PhDలు లేవు నాకు బాగా గుర్తు ఒకసారి ఒక అతనికి PhD వచ్చింది చాలా ఆనందంగా వచ్చాడు స్వామి దగ్గరికి ఆ రోజుల్లో వచ్చి స్వామి నాకు PhD వచ్చింది అని చెప్పారు స్వామి ఆనందించారు ఆనందించి ఏమీ తెలియనట్లుగా PhD అంటే ఏమిటి అని అడిగారు doctorate in philosophy అన్నాడు ఓహో philosophy అంటే వేదాంతం వేదాంతానికి doctor కి సంబంధం ఏమిటి ఎక్కడ ఈ కోలిక లేదే ఈ పదం వేరు ఆ పదం వేరే అంటూ స్వామి నెమ్మదిగా చెప్పు చెప్పు నీకు ఏం అర్థమైందో అంటూ చెప్తున్నారు doctorate in philosophy is PhD స్వామి that much I know అన్నాడు కాదు pure heart is divine అది గుర్తుపెట్టుకో నీకు ఎన్ని PhDలు ఉండని నీకు ఎన్ని degrees ఉండని నీ దగ్గర tons of money ఉండని భూభాగం అంతా నీది కానీ నీలో గనక దివ్యత్వం లేకపోయినట్లయితే నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గ్రహించలేకపోయినట్లయితే నీది pure heart కాదు poor heart గా మిగిలిపోతుంది PhD కి అర్థం కూడా చెప్పుకోవచ్చు. నీవు PhD లో research చేశావా implement చేశావా ఆ రోజుల్లో computers లేవు అంటే cut and paste అదే కదా PhD అంటే ఎక్కడ ఉన్నదో నాలుగు చోట్ల ఉన్నది గుదిగించి ఒక వ్యాసం రాస్తే ఒక project చేస్తే అది PhD అవుతుందా అని తక్కువ చేయలే అసలు PhD కి ఆయన ఇచ్చిన spiritual explanation పరమాద్భుతం మరి దానికి ఆయన దగ్గర PhD లేవు. ఇదే metaphysical world లో ఆయన ఉంటూ ఒక విద్యా విధానాన్ని వైద్య విధానాన్ని అలాగే నిజానికి జల సంపత్తిని జన సామాన్యుడికి అందించేటువంటి విధానంలో ఇవాళ మనం తలుచుకోవాలి ఒక వ్యక్తిని ఆ వైభవంలో తన పాత్రని తాను నిరదుష్టంగా మౌనంగా గంభీరంగా ఉదాత్తంగా నిర్మమంగా నిశ్చలమైన భక్తితో చేసినటువంటి వ్యక్తిని తలుచుకోవాలి. ఆనాటి ఆనాడు స్వామి water projects మొదలు పెట్టినప్పుడు గవర్నమెంట్ స్థలాలు కావలసి వచ్చినప్పుడు ఈ project ఎవరు చేస్తారు అని అడిగినప్పుడు సత్యసాయిబాబా వారు స్వయంగా చేయిస్తున్నారు అని మన వాళ్ళు చెప్పినప్పుడు నాటి chief minister ఎన్.టి.రామారావు స్వామి చేస్తున్నారు అంటే మనం వారికి అన్ని విధాలా సహకరించవలసిందే ఎందుకంటే వారు పరదైవతం కాబట్టి అని ఒకే రోజున మూడు జీవోలు ఆ రోజుల్లో private వాళ్ళకి land ఇచ్చేవారు కాదు కానీ స్వామి నిరూపణ చేశారు అనుకున్నదానికంటే ముందే అనుకున్న ఖర్చు కంటే అన్ని ఉమ్ మిగతా చోట్ల one twenty percent ఖర్చు అయితే ఇక్కడ కేవలం twenty, twenty five percent ఖర్చుతో ఒక project ను పూర్తి చేశారు అంటే ఒక spiritual persona ఒక పరమాద్భుతమైనటువంటి అవతార మూర్తి ఇదే జగత్తులో ఇన్ని పనులు ఎలా చేయించారు? దీని వెనుక ఉన్నది ఏమిటి? అని మనం ఎప్పుడూ విచార-- మనం సమాధానం ఒకటి స్వామి దేవుడు కదండీ ఆయన ఏదైనా చేయగలడు అది సమాధానం కాదు metaphysics లో అది కాదు spiritual ఏదన్నా మాట్లాడండి స్వామి దేవుడు కాబట్టి అని నేను ఎప్పుడూ నమ్మి నేను అందరికీ చెప్పే ఒకే ఒక్క మాట ఆయన దేవుడే ఇవన్నీ చేయలే ఇవన్నీ చేశారు గనుక ఆయన దేవుడయ్యాదేవుడనగా వేరు దేశమున లేడు తాను చేయు పనుల యందు తగిలి ఉండు. ఇది స్వామి మాటే, మనం రాసిన పద్యం కాదు. దేవుడు లేడు అని స్వామి కూడా బుద్ధుడి దగ్గరే చెప్పాడు. వేరు దేశంలో లేడు, నువ్వు చేసే పనిలోనే ఆయన ఉన్నారు. ఆ పని నిష్కామ కర్మ. ఈ నిష్కామమైనటువంటి కర్మ విభూతిని కూడా ప్రపంచానికి అందించి సామాన్యమైనటువంటి మానవుడు స్వామి దగ్గరకు గనుక ఎవరైనా, ఒక నిరీశ్వరవాది, ఒక నాస్తికుడు గనుక వెళితే కాలక్రమంలో వాడు ఆస్తికుడు అవుతాడు. ఆ ఆస్తికుడు వెళ్ళగా వెళ్ళగా భక్తుడు అవుతాడు. భక్తుడు అవుతూ అవుతూ జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయి కడగా ప్రేమమయుడు అవుతాడు. ఇది ఫలితం. సత్యసాయి దర్శనం చేయడమంటే ఊరికే చూసి వచ్చి వెళ్లే విధానం కాదది. ఇన్ని మార్పులు మనలో ఆ పరిణామం, ఆ IIT లో ఉన్న T ఉందే, దాన్ని ఇట్లా సాధించుకోవాలి. This is all about the metaphysical aspect of Bhagwan Sri Sathya Sai Baba. స్వామి! అందుకే చూడండి తాను ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి సమస్త జనులకి కూడా కావలసిన భద్రతనిచ్చారు. ప్రపంచానికి మీరంతా నిష్క్రాములై ఉండకండి, అంతా దైవమే చూసుకుంటుందని మీరు అనుకోకండి అన్నారు. ఏమన్నారో తెలుసునా? ఒక వెండి కంచానికి లేదా బంగారు కంచానికి కూడా గోడ కావాలి. ఒక ఆలంబన కావాలి. మీరంతా జీవ ప్రజ్ఞామూర్తులై వచ్చారు. ఒట్టి దైవ ప్రజ్ఞ ఈ ప్రపంచంలో పనికిరాదు. దైవ ప్రజ్ఞ ప్లస్ జీవ ప్రజ్ఞ ఈ ప్రపంచానికి పనికొస్తుంది. అంటే కర్మ యోగము, జ్ఞాన యోగము రెండూ కలిసి ఉండాలి. దానిలో భక్తి ఉండాలి. భక్తి అంటే పూజలు, దానాలు, వ్రతాలు కాదు. భ అంటే భక్తి అంటే, భ అంటే వెలుగు, క్తి అంటే కూడి ఉండటం. వెలుగుతో కూడి ఉండటం. ఏ వెలుగుతో? సూర్యుడు వెలుగా పన్నెండు గంటలు, చంద్రుడు వెలుగా రాత్రి పన్నెండు గంటలు. ఆ రెండూ భిన్నమైనవి. ఒకటేమో లలితమైనది, రెండవది తీక్షణమైనది. సూర్యుడు రాకపోతే వెలుగు రాదు, చంద్రుడు రాకపోతే అమావాస్య చీకటి. కానీ సూర్యుడు వచ్చినా రాకపోయినా, చంద్రుడు పైకి వచ్చి కనబడినా కనబడకపోయినా, మన లోపల అంతఃస్వరూపంలో తేజోమయుడైనటువంటి పరమాత్మ పరిపూర్ణంగా ఉన్నాడు. ఆ వెలుగుని ఆశ్రయించండి. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ పరమార్థ భూతమై. వెలుగును తన్ను మించి మరి విశ్వము నందు వేరు చోట లేవు. అలగుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ రాహమూర్తికిన్, వెలుగుల నిధికిన్, గురుత్వమునకున్, జగదక్షునకున్ నమస్కరించెదన్. మనమందరం కూడా లో వెలుగు కోసమే ప్రయాణం చేయాలి. ఇవాళ సత్యసాయి సేవా Organization లో మనం సేవ చేయటం మాత్రమే చేయాలి. చాకిరీ చేయకూడదు. చాకిరీ అంటే ప్రతిఫలాన్ని ఆశించి నాలుగు గంటలలో అయ్యే పని నలభై గంటలు చేసి, నా time అంతా స్వామికి ఇచ్చానని కాదు. నలభై గంటలలో అయ్యే పనిని చిత్తవికాగ్ర స్థితిలో కేవలం నాలుగు గంటలలో పూర్తి చేయగలిగితే దాని పేరు సేవ. ఆ సేవ మనం ఎవరికి చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము? విచక్షణతో చేస్తున్నామా? వివక్షతో చేస్తున్నామా? వీటన్నింటినీ గనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే చాకిరీ నుంచి మన మనస్సు సేవ వైపు వెళ్లి సేవా యోగంలో metaphysical level లో సత్యసాయి భగవానుడిని మనం ఆవిష్కరించుకునేటువంటి ఒక దివ్యానుభూతి మనకు కలుగుతుంది. కనుకనే మనందరి చేత, ఇవాళ చూడండి, ప్రపంచం అంతా ఏడుస్తున్నది, రోదిస్తున్నది, ఘర్షణ పడుతున్నది. కానీ సత్యసాయి భగవానుడి యొక్క భక్తులు అనబడేటువంటి మనందరం కూడా స్వామి యొక్క దివ్యగుణ గాన, అవతార వైభవ కీర్తిని గానం చేస్తూ మనస్సుని ఆనంద రసతుందీరం చేసుకుంటున్నాం. ఇది సత్యసాయి భగవానుడు మనకు అనుగ్రహించినటువంటి విభూతి యోగంగా భావన చేస్తూ మనం నెమ్మదిగా, ఈ metaphysical కి spiritual కి పెద్దగా తేడా లేదు. కానీ తారకుపోగంత తేడా ఉన్నది. అది ఏమిటి? దానిని స్వామి ఎలా చేశారు? దాన్ని మనం చక్కగా రేపు తీవ్రమైన, గంభీరమైనటువంటి ఒక విచార ధారని కొనసాగిద్దాం. దానికి కావలసిన శక్తిని సర్వదేవతా తీర్థ స్వరూపుడైనటువంటి స్వామి మనందరికీ కూడా ప్రసాదించు గాక! ప్రసాదనం చేయు గాక! అని స్వామిని మనసా, వచసా, శిరసా ప్రార్థన చేస్తూ సాయిరాం.
YouTube · audio
Sri Sathya Sai Avatara Vaibhavam | Day-2
Sri Sathya Sai Avatara Vaibhavam | Day-2
Source: Sri Sathya Sai Seva Organisations, West Godavari on YouTube
0:00 / 1:18:40
More in this series