No transcript for this section.
Transcript begins at 1:15.
గారు మీ, మీ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా పెద్దది చాలా విస్తృతమైనది అవునవును మరి ఇంక మీ ఉద్యోగంలో మీరు సాధించిన ప్రగతులు దాన్ని ఎలా balance చేసుకునేవారు? ఒక పక్క మీరు ఈ రకమైన science, ఆ రకమైన science అవును ఇట్లాగే ఏదో ఒక మాటల ప్రస్తావన వస్తే అవును ఏం చేశాను అని ఒకసారి వెనక్కి తిరిగి science చదువుకున్నా కదా మరి అది అన్నం పెట్టాలి కదా కడుపునిండా అన్నం పెట్టింది science అవును మనస్సుని చాలా తీవ్రంగా rational గా analytical గా ఒక నిశితమైనటువంటి దృష్టితో ఈ ప్రపంచాన్ని ప్రపంచాతీతమైన భావాన్ని అర్థం చేసుకోవటానికి science నాకు తల్లి దానికి నా నమస్కారం. ఆ, ఆ కారణంగా నేను ఏ రంగంలో నాది oil technology vegetable oil technology దానిలో పరిశోధన చేశాను patenting చేశాను patenting Allyl Isothiocyanate అనేది patent చేశాను ఉహు కానీ అది ఆ patent నేను ఏనాడు అమ్ముకోలేదు. ఉమ్ అది అనేక రంగాలకు ఇచ్చేశాను నేను అలాగే dewatering screw press అని అది ఒకటి కనిపెట్టి అది చేశాను. రెండు వందల పన్నెండు పైగా projects all over India చేశాను. వాహ్ ఇదంతా ఎప్పుడు చేశాను ఎలా చేశానంటే జరిగిపోయినాయి. అదే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ ఓన్లీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఉండాల్సినంత time దాని మీదే మొత్తం full time దాని మీద ఉన్నట్టుగా ఉంది అందుకే నా గురించి మా రంగంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాడికి మూర్తి గారు ఈ రెండు వందల పన్నెండు projects పెట్టారు. ఉమ్ నిజమేనా? ఉహుహుహు మరి అది గనుక నిజమైతే ఈ లోతు ఎలా? ఆ అందరిలాగే మీకు రోజు ఇరవై నాలుగు గంటలే ఇరవై నాలుగు గంటలు దాటలేదు కదా ఉహుహు science రంగంలో మా వాళ్ళు ఏమంటారంటే ఉమ్ ఎప్పుడూ మరి మాతోనే ఉన్నారు oil అంటున్నారు అదంటున్నారు ఇదంటున్నారు laboratory అంటున్నారు పరిశోధన అంటున్నారు. ఈ వేదాలేమిటి? ఈ వేదాంతాలేమిటి? ఉపనిషత్తులేమిటి? భారత భాగవత పద్యాలేమిటంటే ఇందాక మీరు అడిగిన ప్రశ్న ఉన్నది చూడండి బహుశా పూర్వ జన్మలో కాస్త ఆ మిగిలిపోయిన ఒకటి ఏమి పొందాము దాన్ని మళ్ళీ ప్రపంచానికి భగవత్పాదులు అంటారు శంకర భగవత్పాదులు ప్రౌఢ: ప్రౌఢనిజానుభూతి: కరిత దైతేంద్రజాలౌ గురుః సచ్ఛిష్య: బోధయాత్ తత్ సత్యమశ్రితావన్ నువ్వు ఏ అనుభూతిని నువ్వు పొందావు అది నువ్వు hoard చేయడానికి నీకు హక్కు లేదు. ఉమ్ ఈ ప్రపంచానికి ఇచ్చేసేయాల్సి, ఆ ఇవ్వటం కోసం మళ్ళీ ఇట్లాగే ఓ జన్మ ఎత్తి ఉండొచ్చు. కాబట్టి ఇటు science అటు spirituality ఘర్షణ లేని మనస్సు నాది. ఉమ్ ఏమీ లేదు science and spirituality are complementary to each other ఉమ్ science ద్వారా నేను అధ్యాత్మని లోతులకు dive చేయగలిగాను. బహుశా అధ్యాత్మ కాస్త వంటబెట్టినందువలన science యొక్క ఔదార్యం ఏమిటో నాకు తెలిసింది. తెలిసింది ఇవాళ science గనుక లేకపోతే ఇవాళ మనం కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని లక్షల మందిని చూడటానికి science లేకపోతే ఎలా సాధ్యం? ఈ channel లో నుంచి ఎలా బయటకు వెళ్తుంది science ఏగా దానికి నమస్కరించాల్సిందే. కాబట్టి నాకు ఎక్కడా ఆ ఏ రకమైనటువంటి విభేదం లేదు. ఉమ్ వైరుధ్యం లేదు వైవిధ్యం ఉంది. ఉమ్ ఉహుహుహు ఆ వైవిధ్యంలో నుంచి బహుశా నాకున్న సమయం అంతా అలా చక్కగా గడిచింది. ఇదంతా ఈశ్వర కృపగానే నేను భావన చే-- దాంతో పాటుగా మూడో పాయ సాహిత్యాన్ని నిలబెట్టుకోవాలి. మీరు అబ్దుల్ కలాం గారితో కూడా చాలా వేదికలు అవును చేశాను పంచుకున్నారు. అవును అవును చాలా వారు కూడా ఇలా science కొంత spirituality దీని మధ్యలో ఉన్న వ్యక్తి కదా ఆయన అయితే ఆయన ఏమన్నారంటే ఉమ్ scientist కావటం చాలా తేలిక ఉమ్ ఆయన ఎంత వినయంగా చెప్పారో వినండి. ఉమ్ నాకంటే తెలివిగల వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. నాకు కొన్ని అవకాశాలు వచ్చినాయి. Yes scientist కావటానికి చాలామంది ఉన్నారు. కానీ spiritual scientist కావటానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. మీరు బాబా గారితో కూడి ఉన్నందువల్ల మీరు spiritual scientist కాగలిగారు. ఉమ్ I remained a scientist ఉమ్ ఉహుహుహు కానీ మన ఇద్దరం కలిసి చేయవలసిన పనులున్నాయి. అన్నప్పుడు యువతని మేము చాలా address చేశాం. ఉహు ఉమ్ చాలా ఆయన ఎప్పుడూ ఆనందపడేవారు. పందొమ్మిది వందల ఎనభై ఏడులో ఒక metallurgyలో మేమిద్దరం కలుసుకున్న మధుర క్షణం వారి జీవితం చివరి క్షణం వరకు కూడా ఒక తండ్రి కొడుకు relation ఎట్లా ఉన్నదో ఓ అలా సాగింది. ఆయనకు కూడా sentiments ఉంటాయి. మనిషే కదా! ఆయనకీ హృదయం ఉంది. చాలా తొందరగా కరిగిపోతారు. రెండు చెప్పాలనుంది లోనే చెప్పాలివి ఎక్కడో చెప్పేవి కాది కదా అవును ఒకటి చెప్పాలనుంది ఏమిటంటే ఉమ్ సత్యసాయి నిగమాగమం హైదరాబాద్ లోనే ఇద్దరం కలుసుకున్నాం. అట్లా పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇలా నా చెయ్యి మీద చెయ్యి వేశారు. వేసి Your skin is so smooth you see mine is very rough you know why? అని అడిగారు. ఆయనకి ఆ why అనేది ఎప్పుడూ ప్రశ్నే ఆహా ఆయన మాటల్లో ఆ ధోరణి ఉహుహు అంటే నేను I remained silent he has something to answer ఆయన ప్రశ్నకు ఆయనకు జవాబు తెలుసు. నా నుంచి ఆయనకు పొందవలసింది ఏమీ లేదు. ఉమ్ ఆయన ఏమన్నారంటే, "ఈ body undernourished body childhood లో దీనికి పూర్తిగా అన్నం దొరకల. ఉమ్ అందువల్ల అది ఇంత కాలం నెట్టుకొచ్చేసింది. ఆ తర్వాత science లో ఎక్కువ నిమగ్నమైంది. So it is dry you are soaked in spirituality that's why it is smooth" It's beautiful answer ఉహుహు ఆనందపడ్డాను చాలా సంతోషపడ్డా. ఆయన్ని చాలా like చేసేవారు. ఉమ్ అలాగే ఆయన నాకొక pen present చేశారు. pen ఎవరైనా present చేయొచ్చు బజారు నుంచి ఒకటి తెప్పించి ఒక pen ఇస్తే రాసుకునే వాడినని. దాని మీద నా పేరు చెక్కించి ఇచ్చారు. అబ్బా! ఉమ్ నేను మామూలుగా pen ఇచ్చారని తీసుకుంటున్నాను. ఉమ్ No no no you must see your name there I will show you అంటూ like a father father నాకు ఆయనకు ఉన్న relation ఆ పితృ పుత్ర సంబంధమే అని మరి అనుకోవచ్చు. ఉమ్ ఆ not to claim but he is a very great soul ఉమ్ ఈ భారత-- నిజమైనటువంటి ఒక భారతరత్న భారతరత్న అబ్దుల్ కలాం గ్రేట్ soul అనేది వాళ్ళు వెళ్ళిపోయిన విధానం బట్టి కూడా కొంత తెలుస్తుంది ఎంత పని చేస్తూ వెళ్లిపోవడం అనేది కోరుకున్నారు ఆయన ఇప్పుడు ఈ మధ్య మనకు వెళ్ళిపోయిన పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు కానీ అంతేగా ప్రసాద్ గారు అవును ఇలాంటి వీళ్ళు పుణ్యజీవులు పుణ్యజీవులు వాళ్ళు పని చేస్తూ చేస్తూ just అలా వెళ్ళిపోవడం అనమాట అదే ఇవాళ చాలా పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారి గురించి అనుకోవటం మీరు ఇవాళ మనం ధర్మోదకం ఇక్కడి నుంచి ఇస్తున్నాం అనమాట నిజంగా ఉమ్ పుణ్యపురుషుడు ఉమ్ మంచివాడు చాలా మంచివాడు [outro jingle]ఒక విషయం గుర్తొస్తున్నది. ఇవాళ దానిలో మీ మీ గురించిన ప్రస్తావన ఉంది గనుక నన్ను దీన్ని చేయనివ్వండి. ఊహూ నాకు అసలు ఈ TV మీడియా అనేది నాకు పరిచయమే లేదు. అసలు లేదు నేను ఎన్నడూ అనుకోలేదు. ఊ TV తెరమీదకు వచ్చి మాట్లాడతానని గానీ ఇవేవీ నాకు తెలియవు. ఆ రోజులలో ఉపదేశ సారంతో ఉపదేశసారం భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారం ఈ ప్రపంచానికి మన పరిపూర్ణానంద స్వామి వారు కూడా నన్ను ఉపదేశ సారమూర్తి గారు అనే గుర్తుపెట్టుకుంటారు ఆయన. అదే అదే అన్నారు. ఊహూ అప్పటికి ఆయన కాకినాడలో ఉపన్యాసాలు ఇస్తున్న రోజులు. ఊ నేను ఇక్కడి నుంచి అనపర్తి వెళ్లి చెప్పు వచ్చేవాడిని. ఊ ప్రతి నెల మూడో శనివారం ఆదివారం కాబట్టి ఆ దానికి కారణం మీరు. ఆహా ఆ కచ్చితంగా మీరే. ఎందుకంటే అక్కడ ఏ రకమైనటువంటి డబ్బుతో సంబంధం లేదు. ఆ జరిగిపోయింది అద్భుతంగా జరిగింది శాశ్వతంగా నిలబడిపోయింది. ప్రపంచానికి మీరు అందివ్వాల్సింది ఉంది అర్థమయ్యే రీతిలో ఆ ఉపదేశ సారం పుస్తకం చదివితే ఏదో అర్థమైనట్టుగా ఉంటూ ఏం అర్థం కాదు మాకు. అవును మీ నోటి వాట్ చెప్పతేనే మాకు అది అర్థమయ్యే విషయం కదా. అవును అది కూడా మనం దాన్ని అది మనం కావాలి. ఏది చెప్పినా పై పైన చెప్పకూడదు. ఎందుకంటే జిల్లేళ్ళమూడి అమ్మ ఓ మాట అనేది. ఊ నాన్న తోరునోరు కాదురా మంది తాలుమాటలు రాకూడదు. ఆ పైకి కనిపిస్తోంది తోలుతో చేసినట్టుగాని అసలంతా లోపల ఉంది నాన్న. నాకు అరటిపండు ఒలిచి ఆమె పెడుతూ ముందు తోలు తీయాలి పైది ఒలిస్తే తప్ప లోపలది తెలియదు. ఊ లోపలది తింటే తప్ప రుచి తెలియదు. రుచి ఉంటే తప్ప దాన్ని జీర్ణం చేసుకోలేం. జీర్ణం చేసుకోకపోతే శక్తి రాదు నాన్న ఇంత ఉందిరా అనేది. ఊ అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు. మళ్ళీ కథ మొదటికి వస్తుందన్నమాట. ఊహూ కాబట్టి ఇవన్నీ ఎప్పుడూ మనం కృతజ్ఞతాపూర్వకంగా స్మరిస్తూ ఉండాలి. ఊ ఇప్పుడు వాళ్ళని దేవీదేవతలను చేసి ఓ గోడకేసి ఓ ఫోటో కొట్టేసి ఓ దండ వేస్తే ప్రయోజనం లేదు. ఊహూ Remember them అదే అదే With gratitude ఇప్పుడు మీరు ఈ organization పెట్టడం ద్వారా అవును అదే మీరు చేస్తున్నది. అదే అవును వారి పట్ల ఉన్న ఆ కృతజ్ఞతను మీరు కార్యరూపంలో వారి కృతజ్ఞతను తీసుకుస్తున్నారు కార్యరూపంలో నాకు నాకు ఉన్నటువంటి sources తో ఊ ఎవరి దగ్గరికి వెళ్లి ఈ foundation పెట్టాను మీరు నాకు డబ్బు ఇవ్వండని అడక్కుండా అట్లా ప్రారంభమైపోయింది. ఊ మీరు ఆశ్చర్యపో అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఊ మీరు ఎక్కడా ఎన్నడూ నా శ్రీమతి ప్రస్తావన ఇంతవరకు ప్రపంచంలో నేను చేయలేదు. ఆమె ఆ పదమూడో రోజున చేస్తే మా దొరగారు హెచ్ ఏ దొరగారు ఊ ఒక ఆరు నెలలో ఒక one year అయ్యాకే చేద్దాం అని చెప్పిన దాని దీని సంబంధం ఏముంది. ఉమ్ పదమూడో రోజు పన్నెండో రోజు అయిపోయింది. అక్కడి కథ అయిపోయింది. మనం ప్రారంభం చేద్దాం అన్నాం. చేశాం అద్భుతంగా నడుస్తున్నది. నాకు girl child education ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఆడపిల్ల ఉండి కూడా ఆహా ఆ ఆడపిల్ల ఒక్క ఆడపిల్లని గనక మనం protect చేసి ఊ విద్యాధికురాలిని గనక చేయగలిగితే పరిపూర్ణమైన స్త్రీమూర్తి ఈ ప్రపంచానికి అక్కరకు వస్తుంది. కాబట్టి నాకు ఆ ఆడపిల్లని గనక three sixty degrees లో మనం చేయటానికి అంత చేయలేం కొద్దిగా సహాయ పడగలిగినట్లయితే అని పదహారేళ్లుగా చేస్తున్నది ఇవాళ foundation రూపు దాల్చటం ఊ అప్పుడే నాలుగేళ్లు తెలియకుండానే గడిచిపోవడం ఊ ఒక వేద పండితుడికి సత్కారం చేయటం వేద పండితుడు అంటే వేదం చదివేవాడు కాదు. ఊ భాష్యం చెప్పగలగాలి. అటువంటి మేరికలు దొరుకుతున్నారు ఉన్నారు మనం గుర్తించాలి సమాజంలో మన పక్కనే ఉన్నారు. ఊ తీసుకురావటం అలాగే ఇవన్నీ కూడా ఈ అనుకున్న ఈ మాటలన్నీ ఒడిసిపట్టి ఎవరో record చేసి ఏ పుస్తకము నేను కూర్చొని రాయలే ఊ అవన్నీ సత్సంఘాలే ఎవరో ఈ తల్లులంతా కూర్చొని రాసి ఆ DTP చేసి పుస్తక రూపంలో తెస్తే ఒక పద్దెనిమిది పుస్తకాలు అయినాయి. ఊ కాబట్టి ఇదంతా కూడా foundation కూడా అండి ఆ open for everybody ఊ ఆ అయితే దాంట్లో కోటానుకోట్ల రూపాయల కోసం పెట్టింది కాదు రూపాయలు లేవు. ఊ అక్కడ ఏమున్నది అంటే మనిషి ఆనందంగా మళ్ళీ జిల్లేళ్ళమూడి అమ్మ మాట ఒకటి గుర్తొస్తుంది. ఊ నాన్న విలువైనవన్నీ మనకు అక్కర్లేదురా అవసరమే విలువైనది. ఊ విలువైనవన్నీ మనకు అవసరం లేదు కానీ అవసరం ఒక్కటే విలువైనది. విలువైనది అబ్బా ఇప్పుడు ఆకలి వేసినప్పుడు పిడికెన అన్నం అవసరం. చాలా విలువ అప్పుడిది అది విలువ. అంతే కదా. వంద రూపాయలు కావాలి నా దగ్గర తొంభై తొమ్మిది రూపాయలే ఉన్నాయి ఆ ఒక్క ఆ ఒక్క రూపాయే నాకు విలువైంది. ఒక రూపాయి అంటే వంద అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం లోకంతో కూడా సంబంధం పెట్టుకోవాలి. వాటిని సమన్వయం చేయాలి. చేయాలి లోకమును వీడి రసము లేదు అని ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఉన్నంత కాలం ఈ లోకంతో మనం ఉండాలి. సంబంధ బాంధవ్యాలు ఉండాలి, సంఘ మర్యాదలు ఉండాలి, నీతి ఉండాలి, ఉదాత్తమైనటువంటి మానవ సంబంధాలు ఉండాలి, సహజీవన సౌందర్యం ఉండాలి. ఇదంతా ఉండాలి అంటే ప్రాతఃస్మరణీయుల్ని వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఊ వాళ్ళు ఈ ప్రపంచానికి ఏ రకమైనటువంటి భావాలు ఇచ్చారో వాటిని కొన్నైనా మనం జీర్ణం చేసుకొని ఊ మనం అనుష్ఠానం గనక చేయగలిగినట్లయితే అది ధ్యానం కంటే తపస్సు కంటే యోగం కంటే చాలా చాలా గొప్పది. మీరు ఇంత తెలుసుకున్న వ్యక్తి మూలానే మీకు ఇన్ని awards వచ్చినా కూడా ఊ మీరు వాటిని పెద్దగా మీరు అసలు ప్రస్తావిం పెట్టుకోరు ప్రస్తావించరు. అవును ఆ సాయిబాబా వారు పిలిచిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఒక్కటే మీరు ఎప్పుడూ కూడా అదొక్కటే అదొక్కటే మీరు ఎన్నో ఎన్నో వినియోగ దానికి అవును ఎందుకంటే అది భగవంతుడి నోటి నుంచి వచ్చిన మహద ఆశీర్వచనం. ఊ అది నేను అది అవుతానని దాని అర్థమే తెలియని రోజుల్లో అన్నప్పుడు అన్నప్పుడు అవును నేను ఆయన అన్న మాటకు అనుగుణంగా నేను జీవిస్తున్నానా లేదా జీవితాన్ని అలాగే మలుచుకున్నారు మీరు. మలుచుకున్నాను ఊ నాకు మీ గొంతు వింటుంటే మీరు కూడా పాడతారా బాగా అనిపిస్తుంది. ఆ మీకు ఉందా అందులో ప్రవేశం ఉంటే గనుక ఆ శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో మొట్టమొదటి పద్యం ఆయన నిర్గుణోపాసనను ఉపాసన చేశారు. ఊ శ్రీ మంజుషిక భక్త రక్షణ కళా శ్రీ చించువు ఆనందవల్లి మంజు ప్రసవంబు చిద్గగన ప్రాలేయంశున్ మోక్షలక్ష్మి మాణిక్య వినుత్న మేఖల కటాక్షి భూత నిహార రుక్శ్రీమంతంబై పొల్చు వెలుగునొకడే సేవింతు విశ్వేశ్వరా అరే నిర్గుణం అందరికీ అందదు కదా సగుణం కావాలి కదా బొమ్మ కావాలి కదా బొమ్మలో నుంచి బ్రహ్మ ని పట్టుకోవాలి కదా బొమ్మ లేకపో ప్రతిమ ఈశ్వరః అంటే కదా ఈశ్వరుడు కనపడేది కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్రసంస్థాయి తత్ప్రాలేయాచలకన్యకాకుచతటి పర్యంక నిద్రాగతంబు ఆలోలగ్రజటావనీఘటిత నాకౌకసరిత్కంబు దేహాలంకారిత లేలిహానము వెలుగర్చింతు విశ్వేశ్వరా లేలిహాను ఒంటినిండా పాములు కైలాసమంతా వర్ణించారు ఆయన ఇడిగోనయ్యా ఇటువంటి శివుడ్ని నేను ఉపాసన చేస్తున్నాను అన్నాడు శైవోపాసన చేసిన విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షం రాశారు ఇది పూర్ణాద్వైత భావన మూర్తి గారు ఇప్పుడు సత్యసాయిబాబా వారు తత్వాన్ని పట్టుకున్న వ్యక్తి మీరు అవును కానీ ఆయన రకరకాల మహిమల మీద లేదా అక్కడ ఆశ్రమంలో విషయాల మీద గానీ చాలా కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు కొంతమంది మా అబౌట్ వాళ్ళకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది నిజమేంటా అబద్ధమేంటా ఎందుకు ఇలాంటి విషయాలు అనుకుంటున్నారు అన్న భావన వచ్చినప్పుడు ఒక భక్తుని భక్తుడిగా మీకు ఎలా అనిపిస్తుంది ఎలా మీరు దీన్ని సమాధానం ఎలా ఉంటుంది ఆ చాలా మంచి ప్రశ్న లోకానికి ఈ సమాధానం చాలా అవసరం అవసరమైన ప్రశ్న వేశారు మీరు నా వరకు నేను ప్రశాంతి నిలయాన్ని గానీ సత్యసాయిబాబా వారి human relations ని గానీ ఆయన ఒట్టి మనిషి అనుకున్నట్లయితే సాధారణ మానవుడు అనుకున్నట్లయితే ఆయన చేసినటువంటి సేవలు ప్రపంచానికి మానవతా విలువలతో కూడినటువంటి ఒక విద్యా విధానం విధానమే కాదు విద్యాదానం రెండవది వైద్యరంగం నారాయణ వైజో నారాయణో హరిహి అన్న భావన నుంచి వైద్యరంగం వైదొలగినటువంటి వేళ మళ్ళీ కరుణాస్ఫోరకమైనటువంటి ఒక భావనతో ఆ బిల్లులుతో మనిషి పోయే రోజు రాకూడదు మనిషి బతకాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనతో ఆ కారుణ్యాన్ని ప్రదర్శించినటువంటి తీరు ఎన్ని ప్రభుత్వాలు కలిసైనా చేయలేని water projects తర్వాత వీటన్నింటిలో man making process మనిషిని తయారుచేసే పనిలో పడ్డారు ఆయన ఉదాత్తమైన మానవులు సృష్టి చేసే ప్రయత్నం జరిగింది ఇవాళ కంటికి కనిపిస్తున్నటువంటి controversies అనండి వైరుధ్యాలు అనండి ఆ లేదు ప్రపంచంలో చలామణి అవుతున్నటువంటి కొన్ని అపప్రధలు కానివ్వండి ఇవన్నీ సృష్టిలో లోపం లేదు దృష్టిలోనే లోపం బా చాలా బాగా చెప్పారు ఆ ఎందుకంటే ఇన్ని పనులు చేస్తే ఇరవై నాలుగు పేజీల పేపర్ లో మనకి one square centimeter కూడా place ఇవ్వలేదు మ్మ్ మీడియా చూడండి ఇవ్వలేదు ఇన్ని పనులు ఎలా చేయగలిగారు అని ప్రశ్నించుకోవలసింది మ్మ్ ఆ రెండవది ఆయన ఏం చేసినా మీకోసమే అన్నారు నిరాడంబరమైన జీవితాన్ని ఆయన గడిపారు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో ఏ dress వేసుకున్నారో ఎనభై ఆరవ యేట దేహాన్ని వదిలిపెట్టే దాకా అదే dress మనకి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి ఉన్నా తృప్తి లేదు మ్మ్ ఒక minimum ఐదారు జతల బట్టలతో ఆయన ఏడాది గడిపేవారు. వారున్న room కి AC లు లేవు మ్మ్ అక్కర్లేదన్నారు దేనికి ఏం చేసుకో అన్నారు కాబట్టి ఇవేమీ తెలియని వాళ్ళు ఒక ఊహ ప్ర అంటే చుట్టూ ఏర్పడినటువంటి కట్టడాలు చూసి చాలా వైభవం ఉందని అనుకున్నారు గానీ ఆయన చాలా నిరాడంబరంగా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయినారు. వారు దేహంలో ఉండగా కూడా శ్రీకృష్ణుడిది ఎట్లాగైతే ఒక మధుర విషాద గాథో అంతే కదా చాలా బాగా చెప్పారండి అదే కృష్ణుడిది విషాద గాథా కృష్ణుడిది విషాద గాథా మధుర విషాద గాథ మధుర విషాదం అది బాబాగారిది కూడా అంతే మ్మ్ వారు పొందినన్ని అవమానాలు ఎవరూ పొందలేదు మ్మ్ వారి పట్ల ఉన్నన్ని అనుమానాలు ఎవరి యందు ఎవరి పట్ల లేవు కానీ ఆయన వాటిని లక్షించలేదు తాను ఏ పని మీద వచ్చారో దానిని ఆ పని చేస్తూ సనాతన ధర్మాన్ని ఇవాళ మీరు అడిగారు గనుక చెప్తాను ప్రశాంతి నిలయం గడప దాటకుండా సర్వ ప్రపంచాన్ని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు సర్వ మతాల వాళ్ళు హైందవ పరమైన భజనలు చేసేట్లు చేశారు రుద్రం నమకం చమకం నిత్యం వేదం వేదార్థం ఇవన్నీ కూడా చేయటానికి ఆయన చాలా కృషి చేశారు అయితే లోకం దృష్టి హ్రస్వదృష్టి మంచిని సమకాలీనంగా అంగీకరించలేని ఒక దౌర్బల్యం మ్మ్ మన పక్కనే మహాత్ముడు ఉంటాడు గౌరవించం గుర్తించం ముందు మ్మ్ ఆయన దేహం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాతే ఎన్నో చెప్తాం కానీ బాబా గారి దేహంలో ఉండగానే ఇవన్నీ క్రమంగా ఒక్కరోజులో ఆయన సాధించలా నేను బాబా యొక్క దేహాన్ని గానీ ఆయన చేసిన కార్యకలాపాలను గానీ మ్మ్ అన్నింటినీ కూడా ఒక పారమార్థిక దృష్టితో చూసినప్పుడు మ్మ్ శరీరం ఆయన మనలాగానే తాల్చి వచ్చారు మ్మ్ మనలాంటి మనిషే మనిషే అనుకున్నా మనిషి చేయలేనిన్ని పనులు చేశారు చేసారు మ్మ్ అందువల్ల దాన్ని నేను ఆ కోణంలో చూశాను మ్మ్ ఎవరైనా ఒక వ్యాఖ్యానం చేయ అందుకనే బాబా గారు కూడా ఒక మాటన్నారు మ్మ్ విన్నవాడు విమర్శిస్తాడు కన్నవాడు వివరిస్తాడు అన్నారు అబ్బా సింపుల్ గా చెప్పేశారు సింపుల్ విన్నవాడు వీళ్ళందరూ విన్న వాళ్ళు విమర్శే ఎక్కడో వాడన్నాడు వీడన్నాడు ఇట్లాట అట్లాట మ్మ్ అంటాడు కానీ కన్నవాడు వివరిస్తాడు వాడికి తెలుసు ఏం చూశాడో అక్కడుంది ఉంది మ్మ్ ఏముందో అదే కనపడింది అది నా భావన బాగుందండి మరి ఇప్పుడు మీరు physical science అది చాలా చదువుకున్న మూలా ఈ ఆధ్యాత్మిక అనుభవాలు లాంటివి మీకు ఏదన్నా కలిగాయా కలిగినప్పుడు మీరు దాన్ని లాజికల్ గా చూసి విశ్లేషించారా అలాంటివేమైనా జరిగినయా ఆధ్యాత్మిక అనుభవాలంటే వాటికి miracles అని పేరు పెట్టన గానీ మ్మ్ జీవిత గమనాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు చదువుకున్న దానికి తగిన ఫలితం పొందటం కూడా అంత తేలిక కాదుఒక్కోసారి బాగా చదువుకుంటాం ఫలితం అందదు. ఏమి చదువుకోం బోలెడు ఫలితాలు వచ్చేస్తాయి. ఇదేమిటి వైరుధ్యం అనుకుంటాం. కానీ ఏం చదువుకున్నామో దానివలన గౌరవం. దేనివలన గౌరవం పొందాము మళ్ళీ దానికి గౌరవం ఇవ్వగలగటం. అది ఆధ్యాత్మిక రంగం గాని సైన్స్ కానివ్వండి, ఇవన్నీ పెరిఫెరల్ గా బయట. ఇదంతా బహిరంగ విన్యాసం. దాన్ని దాటి లోపలికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతులు కలిగినప్పుడు ఆధ్యాత్మిక అనుభూతి కలగటం ఏంటి? నిస్సేషన్ కావటమే. జీరో అయిపోవటమే. కదా! ఇప్పుడు మనం అనుకున్న ఈ సైంటిస్టు సూపర్ సైంటిస్టు ఇవన్నీ కూడా అవి హీరోలుగా ప్రదర్శన చేయడానికి బాగా పనికొస్తాయి. కానీ నన్ను నేను ఒక అనుభవానికి అనుభూతికి నేను లోనైనప్పుడు నేను సున్నా. సున్నా అంటే నేను పూర్ణుడిని. అంతే. ఆ సున్నా నాకంటే ముందు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఒకటి అనే అంకె ఉంది. ఆ ఒకటి బాబా గారు అయినట్లయితే నేను సున్నా అయితే మేమిద్దరం కలిసి పది. నా సున్నా తర్వాత ఒకటి ఉంటే జీరో వన్ అవుతుంది. జీరో జీరో వన్ అవుతుంది. ఇంకో మూడు సున్నాల తర్వాత ఒకటి అవుతుంది. ఒకటి అక్కడే ఉంది ఏం పెరగటంలే. కానీ ఆ ఒకటిని పట్టుకొని నేను సున్నాను అయితే నా వెనుక వచ్చినవాడు ఇంకో సున్నా కలిస్తే టెన్ హండ్రెడ్ థౌజండ్ లాక్ క్రోర్స్ క్రోర్స్ మల్టిప్లికేషన్ కాబట్టి ఆ ఆత్మానుభూతులు కలుగుతాయి. కలక్కుండా ఎవరికీ ఉండవు. మరి అనుభూతిని కూడా దాటాలి. జీవితంలో ఒక ఆచరణ చేసినప్పుడు ఆచరణ మనకు అనుభవాన్నిస్తుంది. ఆ అనుభవం పండుతున్నప్పుడు అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి నిండినప్పుడు అది మనంతా ఆ నిశ్శేషులం కావాలి. విభూతి స్థాయికి వెళ్ళాలి. మనల్ని మనం జీరో చేసుకోగలిగితే మనం పూర్ణులు అవుతామని నా భావన. చాలా చాలా చాలా సంతోషం మూర్తి గారు మీతో ఇన్ని విషయాలు పంచుకోవడం అనేది నా అదృష్టం. నాక్కుడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎవరి కారణము ఎవరి ప్రేరణ వలన తెరమీద బొమ్మై కనిపించానో మళ్ళీ ఇవాళ మళ్ళీ కలుసుకొని మంచి మాటలు, మంచి మహావ్యక్తులు వాళ్ళు వదిలిపెట్టినటువంటి పురాస్మృతులు పునారూపంగా ఆవిష్కరించుకునేటువంటి ఈ మహా సన్మంగళ వేళ సర్వ దేవతల యొక్క సర్వ గురువుల యొక్క దివ్యానుగ్రహం మీకు మీ కుటుంబానికి మీ రాబోయే ఇరవై ఒక్క తరాలకి అనుగ్రహపూర్వకంగా లభించు గాక అని మంగళాశాసనం చేస్తూ స్వస్తి. నమస్కారం
YouTube · audio
Cheppalani Undi | Medapati Ramalakshmi | Bharat Today
Cheppalani Undi | Medapati Ramalakshmi | Bharat Today
Source: Bharat Today on YouTube
0:00 / 23:43
More in this series