Skip to content
Transcript తెలుగు
మిత్రదేవోభవ ఇది హృదయానికి సంబంధించిన విషయం. ఎందుకంటే చెప్పబోయే ముందు ఒక చిన్నమాట కాశీ వెళ్ళొచ్చిన ప్రతి వాడిని ఏమడుగుతారంటే మీరక్కడ ఏం వదిలిపెట్టి వచ్చారు అని. ఎవడో కాకరకాయ, ఎవడో కీకరకాయ ఏదో చెప్తూ ఉంటారు. అసలు అహంకారము, మమకారము వదిలిపెట్టమన్నారు. అది ఎలాగూ చేయలేం గనుక బాగా కంగుమనే గొంతును అక్కడ అప్పజెప్పి వచ్చేశా. ఎందుకంటే బాగా జలుబు బట్టి ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతుంటే హాయిగా విన్నా. ఇప్పుడు నాకిది పరీక్షా కాలం. అయినా స్వామి పాస్ చేస్తారు. ఇంతవరకు ఫెయిల్ చేయలా. అంతరంగము కన్న అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఇంతకుమించి వ్యాఖ్యానం చేయాలా స్వామి చెప్పినట్లు. నీ గురువు నీ అంతరంగంలో ఉన్నాడు. నువ్వు అది చదివాను, ఇది చదివాను, రామాయణం చదివాను, భగవద్గీతకు ఆవుపోసనం చేశానంటే గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని నువ్వు చదువు. నువ్వు పరిచయస్తుల్ని, తెలిసిన వాళ్ళని, నీకు తెలిసిన వాళ్ళని, నువ్వు ఎరిగిన వాళ్ళని అందరూ నా వారు అనుకుంటున్నావే. ఏదో ఒక సమయంలో ప్రాణ నిర్గమన వేళ లక్ష మంది తెలిస్తే, అందులో పదివేల మంది కొద్దిగా తెలిస్తే, వెయ్యి మంది మరింత దగ్గరగా తెలిస్తే, వంద మంది ఇంకొద్దిగా తెలిస్తే, పట్టుమని పది మందికి కూడా ఏమీ తెలియన స్థితిలో నిన్ను అంటిపెట్టుకున్నటువంటి పంచప్రాణాలు నీ నిజమైన స్నేహితులు. వాళ్ళే నీకు వీడ్కోలు పలుకుతారు. పంచప్రాణాల యొక్క స్వరూపం ఏది అంటే ఈశ్వరుడే. ఈశ్వరుడంటే ఎవరికి వినాశనము లేదో, ఎవరికి పరిణామం లేదో, ఎవరు మార్పు చెందరు, ఎవరు అఖండమై, అద్వయమై, అచింత్యమై, అచ్యుతమై, నిరంతరమై, నికేతనమై, నిరంజనమై, ఒక భాతిగా, ఒక వెలుగుగా నీ యందు ప్రకాశమానం చెందుతూ శ్రీమయమై, చరాచరమయమై, వాంగ్మయమై, జ్యోతిర్మయమై వెలుగుతున్నటువంటి నీ ఆత్మను మించిన స్నేహితుడు ఉన్నాడా అని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు వారి చిన్న వయసులో మనకు చెప్పారు. అది. వారి దేహానికి ఇంకా ముప్పై ఏళ్ళు రాలేది పద్యం చెప్పిననాడు. అంటే ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే. ఈశ్వర తత్వాన్ని ఎరిగేటువంటి దిశగా విషయాన్నైనా physical, metaphysical, spiritual. physical level లో పురాణాలున్నాయి. metaphysical లో విశ్లేషణ ఉంది. spiritual లో అధ్యాత్మ ఉన్నది. ఆత్మగతమైన హృదయ సంబంధమైనటువంటి ఒక భావనా ప్రపంచంలో మనం స్నేహాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాధారణంగా మనం ముందు మాట్లాడిన వారు చెప్పిన కొన్ని take homes అంటున్నారే ఇవాళ వాటిని కాస్త పునశ్చరణ చేసుకుంటూ నాలుగైదు విషయాలు మళ్ళీ అవే మనం మోసుకు వెళ్ళాలి కొన్ని-కొన్ని తెలుసుకుని మోసుకు వెళ్ళాలి. clarification కోసమే తప్ప మరొకటి కాదని నేను చెప్తూ. సంస్కృతంలో స్నేహము అంటే జడ్డు కాదు. స్నేహము అంటే నేతి అనేటువంటి పదం ఉంది. నేతి అంటే అది నెయ్యము. ఆజ్యధారయా స్త్రోతసా సమము సరళ చింతనం విరళ తత్పరం. ఎట్లాగైతే హోమాగ్నిలో నిరంతరమైనటువంటి ఒక తైలధార యజ్ఞగుండంలో ప్రవేశిస్తూ ఉంటుందో కాలాజ్య విచ్ఛిన్నమైనటువంటి త్రికాలాభాగ్యమైనటువంటి కాలానికి పొంగని, లొంగని, వంగని, కుంగని మన స్థితిగతులు ఎన్ని మారిపోయినా తాను మారకుండా నిరంతరమైన ఆశ్వాసన ఇవ్వగలిగినటువంటి వాడు స్నేహితుడు అని చెప్తున్నది నెయ్యము అనేటువంటి పదం. కాబట్టి నెయ్యము అంటే ఆజ్యము, ఆజ్యము అంటే నెయ్యి. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే చూడండి అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన, నిదానవతి ఉపాసన అని ఉంది. అంగవతి ఉపాసన అంటే సగుణ ఉపాసన. అమ్మవారి ముక్కు, అమ్మవారి చెవి కమ్మలు, అమ్మవారి వడ్డాణము, ఇదంతా వర్ణన. అది అయిపోతుంది. అన్యవతి ఉపాసన ఇలా ఉండవచ్చు అమ్మవారు, ఇలా ఉండవచ్చు అని ఊహ చేస్తూ చెప్పేది అదొక ఉపాసన. అది అపరోక్షానుభూతిని కలిగించేటువంటి ఉపాసనా మార్గం. మరి నిదానవతి ఉపాసన ఏమిటి అంటే పాలుంటాయి, కాచాలి, తోడు పెట్టాలి, చిలకాలి, వెన్న తీయాలి. వెన్న కరగకుండా నెమ్మదిగా నిదానంగా చేయాలి. చేసి వెన్నని ఉడిసి పట్టాలి. పట్టిన దానిని కాచాలి. కాచిన తర్వాత నెయ్యి కావాలి. పాలలో నుంచి నెయ్యి వస్తుంది తప్ప నేతిలో నుంచి పాలచుక్క పుట్టదే. పునరావృత్తి రహితమైనటువంటి పునర్జన్మే లేనటువంటి ఒక మహాద్భుత మోక్ష సామ్రాజ్య ఫలాన్ని పొందుతారో అటువంటి ఉపాసన పేరే నిదానవతి ఉపాసన. కనుక ఆజ్యము అనేటువంటి పదానికి ఇంత అర్థం ఉన్న తప్ప మనల్ని వదిలిపెట్టని వాడు, మనం వదులుకోలేని వాడు స్నేహితుడు కాడు. ఇది స్పష్టం. ఇక రెండవది శ్రీరామచంద్రుని పరమైనటువంటి ప్రస్తావన చేసినప్పుడు ఆరోజు రాత్రి రాముడి యొక్క స్నేహితులందరూ ఆయనతో కూడి ఆరోజు గడిపారు అని మనం విన్నాం. అది సత్యం కాదు. నిజానికి మర్నాడు అగ్ని పూతంగా యజ్ఞ వేదికని ఆధారం చేసుకొని యజ్ఞ విర్భావితుడైనటువంటి శ్రీరామచంద్రుడుయౌవరాజ్య పట్టాభిషేకానికి వెళ్ళేటువంటి మహా సంమంగళ వేళ వశిష్టుల వారు రాముడికి ఇచ్చినటువంటి సందేశము, ఉపదేశము, ఆదేశము ఏమిటంటే, "రామా! ఏకాగ్ర చిత్తంతో, ఏకాత్మ భావనతో, ఏకాంతంలో ఒక్కడివై, నీ గదిలో నువ్వు విశ్రాంతి చెందుతూ, నీవు ధ్యాన ముద్రాంకితమైన స్థితిలో ఉండి, నీతో నీవు ఉండి యోగాన్ని పొందు. నీలో నీవు ఉండి ధ్యానాన్ని ఆచరించు." అని చెప్పినప్పుడు, అప్పటికే వివాహితుడైనటువంటి రామచంద్రుడి యొక్క భార్య సీతాదేవి కౌసల్యాదేవి దగ్గర ఉన్నది. ఆమె గదిలో ఉన్నది. ఆమె చిన్నపిల్ల. శ్రీరాముడు చిన్నవాడు. శ్రీరాముడు తన గదిలో ఉన్నాడు. మరుజాము వేళ శ్రీరామచంద్రుడు కైక దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టి, "అమ్మా! నేను ఎంత ఏకాంతంలో ఉందామని ప్రయత్నించినా, ఎంత ధ్యానంలో మనస్సును నిలబెట్టుకుందామని ప్రయత్నించినా, నా మనస్సు ఎందుకో నిలవటం లేదు. ఏవో హాహాకారాలు వినిపిస్తున్నాయి. అనేకమైనటువంటి గగనవాణి నా యందు ప్రవేశించి 'రామా! నీవు సింహాసనం ఎక్కద్దు.' అని చెప్తున్నాయి. నన్నేం చేయమంటావు?" అని అడిగాడు. తల్లిని గనక అడిగి ఉంటే, ఆమె ఏమనేదంటే, "ఏమో నాయనా! నాకేం తెలుసు." అనేది. మరొక పినతల్లి సుమిత్రను గనక అడిగి ఉన్నట్లయితే, "నాకు అర్థం కావటం లేదు." అనేది. కైక రాముణ్ణి పెంచుకున్నటువంటి తల్లి. అంటే కౌసల్యాదేవి రాముణ్ణి కన్నతల్లి అయినట్లయితే, కైక శ్రీరాముణ్ణి కనుగొన్న తల్లి. ఆయన దివ్యాత్మ స్వరూపుడని గ్రహించినటువంటి తల్లి గనక ఆమె ఏమన్నదో తెలుసా? "రామా! దైవ నిర్ణయం ఎలా ఉంటే, దానిని నీవు ఆజ్ఞను పాటించు. కాలం ఏవిని ఎట్లా నడిపిస్తే, దానిని అట్లా నడిపించు. విధి వశాత్తు వచ్చినటువంటి జీవులన్నీ కూడా విధి ప్రకారమే నడుస్తాయి. కనుక దైవ నిర్ణయమే దైవాజ్ఞగా భావించమన్నది కైక." కనుక రాముడితో స్నేహితుడు లేడు. ఇది సత్యం. మరి రాముడి పరంగా మనం చెప్పాలి అంటే, మర్నాడు ఆయన ఒంటిమీద ఆభరణాలు ఉన్నాయి యువరాజు గనుక నారచీరలు కట్టుకోమన్నారు. సభలో దశరథ మహారాజు తండ్రి దగ్గరకు వెళ్లి రాముడు అడిగినది ఏంటంటే, "తండ్రీ! నా ఒంటిమీద ఉన్న ఆభరణాలు నావేనా?" "నాయనా! నీకోసమే చేయించాం. అవి నీవే. నువ్వచ్చేదాకా మేం దాచిపెట్టి ఉంచుతాం." ఇవన్నీ చెప్తున్నాడు ఆయన. అప్పుడు అన్నాడు, "నాకు ఒక మిత్రుడున్నాడు. మిత్రుడి పేరు సుయజ్ఞుడు." పేరు కూడా చూడండి. నిత్యము అగ్నిహోత్రం చేసుకుంటాడు. సుయజ్ఞుడు పధ్నాలుగు సంవత్సరాలు నా ఎడబాటును భరించలేడు. అతనికి పధ్నాలుగు సంవత్సరాలయ యాగ్నికమైన కార్యక్రమాలు చేయటానికి తగినటువంటి ఆర్థిక వెనరులు లేవు గనుక, క్షణాన నా ఒంటిమీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా నా మిత్రుడికి నేను ఇస్తున్నాను. తద్వారా తన యజ్ఞ కార్యక్రమాన్ని మళ్ళీ నేను తిరిగి మరలి వచ్చేదాకా కార్యక్రమాన్ని చేసుకుంటాడు." అని తండ్రి అనుమతి తీసుకున్నాడు. అందువలన, "రామో విగ్రహవాన్ ధర్మః". రాముడికి బాల్యమిత్రుడు ఎవరు అంటే సుయజ్ఞుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా బాలవికాస్ గురువులు, వాళ్ళందరికీ తెలియాలి ఇవి. [గొంతు సవరించుకుంటూ] తర్వాత నారచీరలు కైకేయి ఇవ్వలేదు. అరుంధతి దేవి చేత ఇప్పించారు. ఎందుకంటే అరుంధతి దేవి వశిష్టుల వారి భార్య. ఎందుకంటే, అత్తగారికి కూడా నారచీరలు ఇచ్చి పంపించేటువంటి కఠినాత్మ వాళ్ళకి లేదు గనుక. కానీ, సత్యము నిష్ఠూరమైనది, కఠినమైనది, నిజమైనది, ఆచరణ యోగ్యమైనది గనుక, గురు స్వరూపమైనటువంటి వశిష్టుల వారి భార్య అరుంధతి దేవి నారచీరలు ఇచ్చి, "ఇవి కట్టుకో." అని అన్నప్పుడు, దానికో దేవ రహస్యం చెప్పింది. దేవ రహస్యం ఏమిటంటే, "జానకీ!" అంటే జనకమహారాజు కూతురా అన్నది. అంతేగా. "జానకీ! నీవు నారచీరలు ధరించినప్పటికీ, జగత్తు మొత్తానికి నీవు శ్రీమహాలక్ష్మి వలె కనిపిస్తావు." అని ఆశీర్వచనం చేసింది అరుంధతి దేవి. ఇటువంటి పరమ గుహ్యమైనటువంటి రామాయణ రహస్యంలో అది పరమమైనది. తర్వాత దశరథ మహారాజు మిత్రుడు గుహుడు కాదు, జటాయువు మాత్రమే. శ్రీరామచంద్రుడికి మిత్రుడు గుహుడు కాదు. గుహుడు, జటాయువు అంటే ఆటవికమైనటువంటి జానపదులందరినీ కూడా దశరథ మహారాజు ప్రతిసారి అయోధ్యా నగరానికి రప్పించి, వాళ్ళందరినీ సమాదరించి, వాళ్ళకి సంస్కారాన్ని, నాగరికతని, వేద విద్యని, అనుష్ఠానమైన వేదాంత భూమికని, రణతంత్రాన్ని, సమరాంగణ సూత్రాలని, వీటన్నింటినీ కూడా నేర్పించి మిత్రత్వాన్ని పొందినటువంటి వాడు. ఎందుకనంటే, అయోధ్యా నగరానికి చుట్టూ ఉన్నటువంటి సరయుని దాటితే ఉన్నదంతా అడవి. అడవి నుంచి వచ్చేటువంటి శత్రు సమూహాలనన్నింటినీ ముందు అడ్డుకోవాలి అంటే, ఒక మిత్రత్వాన్ని నెరపాలి గనుక ప్రకృతితో, ప్రకృతితో ఉన్న ఆటవిక జనులతో, గిరిజనులతో, పురజనులతో, హరిజనులతో, హరజనులతో అందరితోనూ ఒక మిత్రత్వాన్ని నెరిపినటువంటి వాడు దశరథ మహారాజు. పాయలోనే "ఆత్మావై పుత్ర నామాసి" కనుక శ్రీరామచంద్రుడు కూడా స్నేహం ద్వారానే తన అవతార కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. పాత స్నేహాలను నిలబెట్టుకున్నాడు, కొత్త స్నేహాలను తెచ్చుకున్నాడు. స్నేహంలో ఏర్పడినటువంటిది సుగ్రీవ మైత్రి. సుగ్రీవ మైత్రి, రాముడు వెళ్ళి సుగ్రీవుడితో మైత్రి నెరపలేదు. నెర్-నెరపిన వాడు ఎవరంటే హనుమ. మధుర సంభాషణా వచో విన్నాణంతో శ్రీరామచంద్ర హృదయాన్ని కొల్లగొట్టినటువంటి మారుతి అనుసంధానం చేశాడు.సుగ్రీవా! నువ్వు రాజ్యాన్ని పోగొట్టుకున్నావ్. తార, రమణిని పోగొట్టుకున్నావ్. వస్తున్న దశ-దాశరథి కూడా రాజ్యాన్ని, రమణిని పోగొట్టుకోలేదు గానీ దూరమైనాడు. కానీ మీ దుఃఖం మాత్రం ఒకటే. రెండు దుఃఖాలు ఏకం కావాలంటే మీకు మిత్ర-మిత్ర బాంధవ్యమే శాశ్వతమైనది, సత్యమైనది, పటిష్టమైనది అని ఇద్దరు దుఃఖభాజితులైనటువంటి వాళ్ళు కలిసినటువంటి ఒక పరమాద్భుత సన్నివేశం. ఇది వాల్మీకి యొక్క రమణీయ కల్పనా చాతుర్యం లేదా ఒక యదార్థం కావచ్చు. ఇది ఒకటి. కాబట్టి సుయజ్ఞుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పుత్రకామేష్టి యాగం చేస్తే పున్నామ నరకం నుంచి రక్షింపబడతారని దశరథ మహారాజు అనుకున్నాడో, దశరథ మహారాజే మరణించినప్పుడు, చూడండి విధి ఎలా ఉంటుందంటే, రామలక్ష్మణులిద్దరూ అరణ్యంలో ఉన్నారు. భరత శత్రుఘ్నులిద్దరూ మేనమామ దగ్గర ఉన్నారు. ఒక్క కొడుకు దగ్గర లేడు. కానీ ప్రాణం పోయింది. ఇది వార్త రాముడికి తెలిసే-తెలియటానికి కొంత సమయం పట్టింది. తెలిసినప్పుడు స్నేహ బాంధవ్యంలో ఉదాత్తమైన వైఖరి ఏమిటంటే, తండ్రి ఎలాగూ మరణించాడు. నా తండ్రికి ఉత్తముడైనటువంటి మిత్రుడు ఎవరు అంటే జటాయువు గనుక ఆయనకు అగ్నిసంస్కారం చేసి నా తండ్రిగా భావిస్తున్నాను అన్నది భారతీయమైనటువంటి రామాయణమైనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఉపదేశం. అంటే మన తండ్రి స్నేహితుడు మనకు తండ్రి లాంటివాడు. మన మేనమామ మన తండ్రి లాంటివాడు. మన స్నేహితుడు కాలగమనంలో తండ్రి అంతటి వాడు కావాలి. ఇది చెప్తున్నది భారతీయ వాంగ్మయం. [దగ్గిన శబ్దం] ఇది మాత్రమే కాకుండా విభీషణుడు ఒక మైత్రి నెరిపాడు. ఎవరితో? రాముడితో. రాముడు కూడా విభీషణుడితో మైత్రి నెరపలా. అయోధ్య నగరం నుంచి ఒక్క సైనికుణ్ణి కూడా ఆయన రప్పించుకోలేదు. "నువ్వు ఒక్కడివే వెళ్ళమన్నాడు" అని చెప్పాడే తప్పా, "సైన్యాన్ని రాకూడదు" అని అనలేదు దశరథ మహారాజు. కానీ రాముడు ఉదాత్తమైనటువంటి ధర్మబద్ధమైన జీవితం గడపవలసిన వాడు గనుక ఆయన ఏం చేశాడు? తన చుట్టూ ఉన్న సాంఘిక శక్తులన్నింటినీ, తన చుట్టూ ఉన్నటువంటి resources అంటున్నాం. వానరుల అన్నింటినీ. అవి నరశక్త, వానర శక్త, దానవ శక్త, దీన శక్త, [దగ్గిన శబ్దం] భక్తి శక్త వీటన్నింటినీ సమన్వయం చేసి అధర్మ నిర్మూలనం చేయటానికి రామరావణ సంగ్రామం జరిపినప్పుడు, రాముడు రావణుడి ముందు ఓడిపోతున్నాడేమో అన్న భావన కలుగుతున్నప్పుడు, ఆయా సందర్భాలు ఏర్పడినప్పుడు మళ్ళీ ఆయనకు ఒక అద్భుతమైనటువంటి మంత్రము అంటే మంత్ర శక్తిని, రాముడి దగ్గర యంత్ర శక్తి ఉంది, అస్త్రాలున్నాయి, శస్త్రాలున్నాయి. తరువాత లోకగురువైనటువంటి విశ్వామిత్రుడు చెప్పిన అనేక మంత్రాలన్నీ ఉన్నాయి. కానీ అత్యున్నతమైనటువంటి మంత్ర శక్తి క్షణాన రాముడి దగ్గర లేదు గనుక దానిని పూరించడానికి అగస్త్యులవారు వెళ్లి ఆదిత్యుణ్ణి అడిగినప్పుడు ఆదిత్యుడు మళ్ళీ రామచంద్రుడి పక్కకు వచ్చి ఆయన వాడిన పదము ఏమిటంటే "త్వరా" అన్నాడు. రెండే అక్షరాలు "త్వరా". "త్వరా" అంటే ఇక నువ్వు ఆలస్యం చేయవలసిన పని లేదు. నువ్వు మంత్రం చదవమన్నాడు. రోజు రాత్రి ధ్యాన ముద్ర లో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయాన్ని చదివి మళ్ళీ మరునాడు యుద్ధానికి వచ్చాడు. సూర్యాస్తమయం కొన్ని క్షణాలలో కాబోతున్న వేళకు కూడా రావణుడిని జయింపబట్టం లేదు. క్షణంలో మళ్ళీ ఆదిత్యుడు, సూర్యదేవుడు, సూర్యవంశంలో పుట్టిన రామచంద్రుడి పక్కన నిలబడి చెవిలో చెప్పినటువంటి మాట "త్వరా" ఇప్పుడు బాణం వేయ్ అన్నాడు. అంటే, ఇవాళ ఆదిత్య హృదయం చదవండి మీకు అప్పులు పోతాయి, ఇవన్నీ వదిలిపెట్టండి. ఇవన్నీ టీవీ మాటలు. ఆదిత్య హృదయం చదివితే శరీరము ఒక ధృడత్వాన్ని పొందుతుంది. మానసిక, దైహిక అనేకమైనటువంటి శక్తులు ఒనకూడి మనలో నిద్రాణంగా ఉన్నటువంటి ఒక latent energy kinetic అవుతుంది. Kinetic గా ఉన్నటువంటిది dynamic అవుతుంది. మూడు కానప్పుడు, ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు మూడు మన దగ్గర లేనప్పుడు మనం కార్యము చేయలేం కాబట్టి ఆదిత్య హృదయం చేయాలి. [దగ్గిన శబ్దం] తర్వాత శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం లో ఋషులందరూ జ్ఞానబోధ చేశారు. రాక్షసులందరూ ఆయన వీర, ధీర, గంభీర, శూరత్వాలను బయటకు తెచ్చే అవకాశాలు రాముడికి కల్పించారు. కానీ అణువణువునా ఒక మిత్ర బాంధవ్యంలో సలహాలిచ్చి [దగ్గిన శబ్దం] రాముడి మనస్సుని కర్తవ్య దీక్ష వైపు నడిపించినటువంటిది ఎవరు అంటే సర్వశక్తివంతమైనటువంటి అమ్మవారు సీత. కనుక రామ-రాముడు సత్వగుణ ప్రధానమైనటువంటి వాడు. ఆయన యుద్ధం చేయడు. అవకాశం గనక ఇస్తే పోనీలే రావణుడిని కూడా బతకనివ్వండి అనేవాడు. రాముడు బతకకూడదని నిర్ణయించుకున్నది సీత గనుక సీతలో, రాముడిలో ఉన్నటువంటి శక్తి ఎవరు అనంటే మంత్రత్త-మంత్ర పూర్వకమైనటువంటి మిత్ర అనబడేటువంటి సూర్యుడు. సూర్యుడికి ఖగ, పూష, ఆదిత్య, భాస్కర, త్వక్త అని ఇవన్నీ పేర్లున్నాయి. అనేక పేర్లున్నాయి. అందులో మొట్టమొదటి పేరు మిత్ర. నేను మిత్ర బాన్-మిత్ర బాంధవుడు అంటే మన జీవితంలో పురుషుడికి స్త్రీ స్నేహ బాంధవి. స్త్రీకి పురుషుడు మిత్ర బాంధవుడు. పరస్పరమైనటువంటి ఆధార ఆధేయమైనటువంటి ఒక అనాహతమైనటువంటి దాంపత్య ధర్మానికి ప్రతీకగా స్నేహాన్ని గురించి చెప్పండి, మిత్రత్వాన్ని గురించి చెప్పండి అంటే రామాయణ పురాణ గాథలు కాదు ఇవాళ కావలసింది. దాంపత్య ధర్మము వెయ్యి పడగలలో తొమ్మిది వందల తొంబై ఎనిమిది పడగలు నశించినరెండు పడగలు మాత్రమే ధరిత్రిని కాపాడగలరు అని చెప్పినటువంటి విశ్వనాథ్ వారి వేయి పడగలలో చిట్టచివరి మాట అది స్త్రీ పురుషులు దాంపత్య ధర్మము మాత్రమే. అట్లాగే ఏకవీర నవరత్నలో వాళ్ళు అందరూ కూడా ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకున్నప్పుడు "ఏకవీరా! నువ్వు ఏమైనావు? ఏమైనావు?" అని కుట్టాను సేతుపతి అడిగినప్పుడు "నేను ఒరిగితిని, నేను మిగిలితిని" అన్నది. ఎంత గొప్ప మాట అన్నదో చూడండి. నేను నశించిపోవచ్చు కానీ నేను ఉన్నాను. నేను అఖండమైనటువంటి ఆత్మ. ఆత్మైక భావనా భూమిక స్నేహపరంగా మనం చూడాలి. కాబట్టి స్నేహ బాంధవిగా భావించాలి మనం. ఇది మిత్రత్వం. ఇది పురాణ గాథలో మనం తెలుసుకోవలసినటువంటి విశేషాలు. ఇక వైరాగ్యాన్ని చాలా చక్కగా అందంగా అందరితో మాట్లాడించి ఎప్పుడూ మాట్లాడని ఉదయశంకర్ గారు కూడా ఇవాళ చాలా చక్కగా మాట్లాడారు. ఎన్ని పాయింట్లు రాసుకున్నానో ఇక్కడ, నోట్ చేశారు మన కోసం. ఆత్మ భిన్నం కాదు. ఆత్మ ఒకటే. కానీ ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఉంది కదా! సత్యం ఒకటే. It is told differently by the wise. ఆత్మ అంతా ఒకటే. సూర్యుడు వేరు, సూర్యకిరణాలు వేరు కాదు. చంద్రుడు చంద్రుడు సుషుమ్నా కిరణాలు వేరు కాదు. అభిన్న అద్వైత స్థితి ఏదైతే ఉన్నదో అది ప్రపంచంలో స్నేహ రూపంలో వెలుగుతూ ఉంటుంది గనుక స్నేహం అంటే అపరిమితమైనటువంటి ఒక ఆనందానికి సంకేతం కావాలి. ఒక అపరిమితమైనటువంటి భద్రతకి taken for granted అని వాడతామే. నేను ఎవరి దగ్గరనైనా నేను నా మాట దాచగలనేమో, నా చూపు మరల్చగలనేమో, ఎక్కడన్నా నా విషయాన్ని కడుపులో నుంచి బయటకు తెప్పించుకోలేనేమో కానీ నా స్నేహితుడి మధ్య-- ముందు మాత్రం నన్ను నేను ఆవిష్కరించుకోగలను సంపూర్ణంగా. అటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు స్నేహితుడు అవుతూ ఉన్నాడు. ఇక కాలము, దూరము తర్వాత ముందు వెనకలు ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. తర్వాత నాకు పాటలు ఇవి రావండి సంగీతం అసలు రాదు. ఆయన ఎవరో పాడారు నేను కూడా పాడుతున్నాను అన్నారు. ఆయన పేరే పాటల ప్రసాద్. స్వామి పెట్టిన పేరు అది ఎవరో ఇచ్చిన title కాదు అది. పాటల ప్రసాద్ అని అనిపించుకున్నారు ఆయన స్వామి చేత. చాలా అద్భుతం. ఇది అయిన తర్వాత సరే, రాంబాబు గారు. రాంబాబు గారు ఆయన చిన్న రోజు ఒక watch కొనుక్కోగలడు ఆయన. అవునా? రోజుకోటి. రంగులో ఏది కావాలంటే అది కొత్తది వస్తే తేగలడు. కానీ స్వామి మిత్రుడి ద్వారా watch ఇప్పుడెందుకు ఇచ్చారు అంటే watch అంటే watch your words, watch your actions, watch your thought, watch your character, watch your heart. మాట నేను అనటం లేదు స్వామి చెప్పారు మా అందరికీ. కాబట్టి స్వామి మీకిచ్చిన watch ని పెట్టుకున్నప్పుడల్లా watch your words, watch your action. కదా? కాబట్టి అది స్వామి ఇచ్చిన gift గా భావించండి. అది చాలా బాగుంది. తర్వాత బీనా దేవి జల్లెడమూడమ్మ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో నేను ఉన్నా. ప్రత్యక్షంగా ఉన్నా. ఆయనే judge గారు. Ambassador car లో వచ్చారు. ఆ-ఆ బి. నరసింగరావు. చాలా అద్భుతమైన కథలు. ఆవిడ తర్వాత కూడా రాశారు. ఆవిడకి చాలా ముదిమి వయస్సు, చెవి వినబడని రోజుల్లో కూడా ఆవిడ నాకు phone చేస్తే వాళ్ళ అమ్మాయి అన్నది "ఆయన ఏమన్నా మాట్లాడితే నీకు వినపడదు కదా" అంటే "నాకు వినపడక్కర్లేదు, నేను ఏం చెప్తున్నానో ఆయనకి వినపడితే చాలు. నేను మాట్లాడను నేను" అంటే చమత్కారం పోలి. అప్పటికి ఆవిడకి ఎనభై ఎనిమిదేళ్ళు. రోజున జరిగినది ఏంటంటే, ఆయన చెప్పింది correct. ఆయన communist భావాలు leftist భావాలు. అణగారిన వర్గాల కోసమే కథలు రాశాడు. చాలా గొప్ప కథకుడు. సంస్కారవంతమైన భాషతో ఒకటిన్నర page మించి ఉండేది కాదు కథ కూడా. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరి పేరు బీనా దేవి అని అమ్మకి తెలియదు అని మనం అనుకున్నాం. కానీ ఏమన్నదో తెలుసా? "దేవి బీనా నువ్వు లేవు కదా నాన్న" అంది. [నవ్వు] బీనా దేవిని తిప్పిందామె. తిప్పి "దేవి బీనా నువ్వు లేవు కదా నాన్న, ఇలాగే ఉండండి. ఎవరు రాస్తే ఏమిటి? ప్రపంచానికి మంచి చెప్పాలి కదా" అన్నది. అన్న తర్వాత "అమ్మా నేను మూడు-- బాపట్లలో ఉండేవారు ఆయన. "నేను మూడు గంటలకు ఒక judgement ఇవ్వాలమ్మా. ఇంకా dictation ఇవ్వలేదు. అందరూ ఎదురు చూస్తుంటారు. నేను వెళ్తాను" అని. "కాసేపు ఉండి వెళ్ళు నాన్న" అంది. అని భోంచేశావా అని అడిగా. "భోజనం బాగా సుష్టుగా చేశాను" అన్నాడు. "అయినా వెళ్తానమ్మా, పద్నాలుగు kilometerలే". "కాదు ఉండమ్" అంటుంది అమ్మ. పదిహేను నిమిషాలు అయిపోయింది. ఈవిడ నన్ను ఇవాళ వదిలిపెట్టేటట్టుగా లేదని ఆయన driver కి సం-సంజ్ఞ చేశాడు. driver వచ్చాడు. "సార్ car ready గా ఉంది" అన్నాడు. "ఆ వస్తున్నాను" అని ఎక్కారు. కారు కదలదు. ఇగ్నైట్ అవ్వటం లేదు, వెళ్ళటం లేదు. ఈవిడ బీనా దేవి గారే వెళ్లి కూర్చున్నారు లోపలికి. ఆయన ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత driver ఏమో "కదలటం లేదు సార్" అన్నాడు. ఆయన దిగి వచ్చాడు. ఆమె అన్నది "ఏం నాన్న ఎందుకు వెళ్ళటం లేదు?" "అమ్మా కారు కదలటం లేదు" అంట. "సర్వం కాలాధీనం కదా నాన్న, ఇప్పుడు వెళ్ళండి" అంది. కారు బర్ర్ర్ అని వెళ్ళిపోయింది హాయిగా. గుంటూరు వెళ్ళాడు. ఈస్-- ఇది ఒక మంచి స్మృతి. ఇవన్నీ కూడా మహాత్ముల యొక్క దర్శన స్పర్శన సంభాషణల్లో ఆవరణలో మనం ఉన్నప్పుడు వీటిని record చేసుకోవాలి. ఏదో మనం మన జీవితమంతా మనుషుల్ని చూడటంతో సరిపెట్టకూడదు. దర్శనం చేయాలి. చూడటం వేరు, దర్శనం చేయటం వేరు. దర్శనం చేయటం అంటే ఆంతరంగికమైనటువంటి, సూక్ష్మమైనటువంటి కంటితో చూడాలి. చూడటానికి మన మనస్సుని absolute ఒక తెల్లటి తెరలా పెట్టాలి. అందుకనే మిగిలినదంతా వెండితెరపై చూడండి అనేవాడు. వెండితెర అంటే తెల్లటి తెర. తెర బాగుండాలి. ఇది మిత్ర బాంధవ్యంలో ఇప్పటిదాకా జరిగినటువంటి అనేకమైన విషయాలు. ఇక అసలు సంగతికి రావాలి. అసలు సంగతి చాలామంది అన్నారుఆ అమ్మను గురించి పద్యాలు రాయొచ్చు, పాటలు రాయొచ్చు, ఇమోషనల్, సెంటిమెంటల్ ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చు. కానీ మిత్రుల గురించి ఏం మాట్లాడాలి అని. మిత్రదేవోభవ అనుకున్న నాడు నా మనసులో ఉన్నది ప్రాపంచిక స్నేహాలు కావు. మిత్ర అంటే సూర్యుడు అని మాత్రమే నా అర్థం. ఎందుకంటే సూర్యుడు ఒక్కడే ఒక హేతువాదిని కూడా, ఒక కమ్యూనిస్టుని కూడా అసలు భగవంతుడు అనేది మిత్, ఇది ఎక్కడా లేదు అన్నవాడిని కూడా నువ్వు దేవుణ్ణి చూశావా అంటే, నేను చూడలేదన్న వాళ్ళు వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంబై తొమ్మిది మంది ఉంటే, సూర్యుణ్ణి నువ్వు ఎప్పుడన్నా చూశావా అంటే, రోజూ చూస్తూనే ఉన్నాను అనే వాళ్ళు వెయ్యి మందికి వెయ్యికి ఉంటారు. అంటే నిజమైనటువంటి కర్మ సాక్షి ఎవరు అంటే సూర్యుడు. ఇది మిత్ర బాంధవుడు అయినటువంటి సూర్యుడు. సూర్యుడే గనక రాకపోతే, లేకపోతే, కనపడకపోతే ప్రకృతి విధ్వంసానికి గురైపోతుంది, నశించిపోతుంది. తర్వాత ఆరోగ్యం భాస్కరాజ్ ఇచ్చేత్. భాస్కరుడు గనక లేకపోతే మనలో భాస్వరం పెరగదు. మనలో animated heat రాదు. చెట్లు వికాసమానం చెందవు. ఒక మొగ్గ వికసించదు. ఇవన్నీ జరగటానికి ఒక దేవీదేవతల యొక్క సమ్యక్ సమగ్ర స్వరూపం ఏదన్నా ఉన్నదా? మాకు ఒక్క స్వరూపాన్ని చెప్పండి అంటే నింగిన కాలగమనాన్ని శాసిస్తూ తాను కాల బద్ధుడై కాల నియమాన్ని నీతిని అంగీకరిస్తూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రవర్ధమానం చెందుతూ మధ్యాహ్న కాలంలో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్న మార్తాండుడై ప్రపంచానికి సమస్తమైనటువంటి ఒక పోటీమని, ఒక శక్తిని, ఒక చైతన్యాన్ని, ఒక ఆనందాన్ని, ఒక జీవ ధాతువుని నిరపేక్షంగా అనుగ్రహించేటువంటి వాడు మిత్ర బాంధవుడు అయిన మిత్ర దైవం ఏది అంటే సూర్యుడు అవుతున్నాడు. ఒక రాజు అంతఃపురం మీద, ఒక మురుగు కాలువ మీద, ఒక గంగానది మీద, ఒక పామరుడి మీద, పండితుడి మీద, ఒక జంతువు మీద అన్నింటి మీద సమానమైనటువంటి దృష్టితో తన కిరణాలను అనుగ్రహ వరదానం చేసేటువంటి ఒక నిరపేక్ష నిరతాన్న వరదాత ఎవరు అంటే సూర్యభగవానుడు. సూర్య భగవానుడే లేకపోతే అన్నం లేదు. అన్నం లేకపోతే ప్రాణం లేదు. ప్రాణం లేకపోతే మనస్సు లేదు. మనస్సు లేకపోతే విజ్ఞానం లేదు. విజ్ఞానమే లేకపోతే ఆనందం లేదు. అన్నింటికీ మూలమైనటువంటి అన్నపు మెతుకుకి మూలం ఏది అంటే మళ్ళీ మిత్ర బాంధవుడు అయినటువంటి మిత్ర దేవుడు అయినటువంటి సూర్యదేవుడు అవుతున్నాడు గనుక మిత్రదేవోభవ. ఇది మాత్రమే కాదు, సూర్యోపాసన చేసినటువంటి ఒక కుంతి కథగానే తీసుకున్నా, ఆయన వచ్చాడు సూర్యోపాసన చేసుకుంది ఆవిడ. తెలియని వయస్సు, ఏమవుతుందో తెలియదు. ఒక తుంటరితనంతో ఉపాసన చేసింది. అయినా తన మంత్రానికి ఉన్న బలాన్ని ప్రపంచానికి చెప్పాలి గనుక చెవిలో ఒక మాట చెప్పి నీకు పుత్రోదయం కలుగుతుందని చెప్పి అంతర్ధితుడు అయిపోయినాడు. కనుక ఆయన పేరు చెవి నుండి చెవిలో నుంచి ఏర్పడిన మంత్ర శక్తి వలన పుట్టాడు గనుక, కానీ అసహజమైనటువంటి వేళ పుట్టాడు గనుక, కర్ణము వలన పుట్టాడు గనుక కర్ణము కర్ణుడు అయినాడు. అసహజమైన వేళలో పుట్టాడు గనుక అసంబద్ధమైనటువంటి మిత్రత్వాన్ని నెరిపాడు. దానం చేశాడు అహంకారంతో చేశాడు. మిత్రత్వం చేశాడు అభిజాత్యంతో చేశాడు. ఎవరినీ సరిపెట్టలేదు తనలో ఉన్న అహంకారాన్ని, తనలో ఉన్న ఆత్మన్యూనతాభావాన్ని, ఇవాళ inferiority complex అన్నాం. కర్ణుడు it is a combination of inferiority plus superiority. రెండూ danger ఏ. ఏదో ఒకటి ఉంటే రెండోదాన్ని తగ్గించొచ్చు. కాబట్టి మూలము ఎట్లా ఉన్నప్పటికీ కూడా జీవుడి యొక్క సంస్కారం కూడా బలంగా ఉంటుంది గనుక, రోజు ఇవాళ సూర్యుని సూర్యుడి గురించి చెప్తున్నాం అంటే వేదకాలం అనేది లేదు. వేదము కాలాతీతం. సృష్టి ఆరంభం నుంచి పరాప్రకృతి అంతా కూడా ఉపాసన చేసింది. ఎవరిని చేసింది? రాముణ్ణి చేయలే, కృష్ణుణ్ణి చేయలే, దత్తావతారాన్ని చేయలే. వాళ్ళు ఎవరు లేరు వేదకాలంలో. వేదం తర్వాత పుట్టినవారు. మరి ఎవరిని చేశారంటే నిత్య కర్మ సాక్షి అయినటువంటి సూర్యుణ్ణి ఉపాసన చేశారు. సూర్యోపాసన నుంచి పుట్టినటువంటిదే, బ్రహ్మ ముఖం నుంచి వెలువడినటువంటిదే ద్విపదములతో కూడినటువంటి గాయత్రి. ద్విపదాలు రెండు ఎవరికి ఇవ్వాలి అంటే వశిష్టుల వారికి ఇచ్చారు. వశిష్టులవారు ద్విపదనిమాత అంటే రెండు పదాలలో పాదాలలో ఉన్నది. అది చేస్తూ ఉన్నప్పుడు తాను కూడా వశిష్టుడు అంతటి వాడు కావాలి అని నిర్ణయించుకున్నటువంటి ఒక విశ్వామిత్రుడు భూః భువః స్వః కలిపినటువంటి వాడు విశ్వామిత్రుడు. కనుక ఇవాళ ప్రపంచంలో అనేక సందర్భాలలో గాయత్రీ మంత్రానికి ద్రష్ట ఎవరు? శ్రేష్ట ఎవరు? అంటే విశ్వామిత్రుడు అంటున్నాం. విశ్వామిత్రుడే సంపూర్ణమైన సంప్రదాయ గాయత్రిని ఇచ్చాడు గనుక సూర్యోపాసన చేసేటప్పుడు గాయత్రీ మంత్రాన్ని చదువుతున్నప్పుడు మూడు కాలాలు ఉదయ, మధ్యాహ్నిక, సాయంకాలికమైనటువంటి మూడు వేళల సంధ్యా గాయత్రిని చేయటమంటే సూర్యోపాసన చేయటమే. సూర్యోపాసన చేయటం అంటే మనకు నిత్యమిత్రుడు అయినటువంటి సూర్యుణ్ణి గౌరవంతో నాకు గాయత్రి రాకపోవచ్చు కానీ ఏమి అర్ఘ్యం ఇద్దాం. పిడికెడు నీళ్ళు తీసుకొని ఆయనకి సమర్పించినట్లయితే సంతృప్తుడు అవుతాడు. అవుతాడో కాడో నాకు అనవసరం. కానీ నాకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన కంటే ముందు నేను లేచి సూర్య గాయత్రిని చదువుకుంటా, చందో గాయత్రిని చదువుతా. అంటే నాకు జీవితంలో ఒక discipline, ఒక punctuality, ఒక సమయపాలన, ఒక సమయజ్ఞత, ఒక ధీశక్తి, ఒక సమన్వయము, సంఘర్షణారహితమైనటువంటి జీవితం, అందరికీ అన్నీ ఇవ్వగలిగినటువంటి ఔదార్యం, ఇవన్నీ ఇవ్వగలిగినటువంటి మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు గనుకఅటువంటి సూర్యుడే ఇవేళ మనకి మిత్రదేవోభవ గా సూర్యుడు ఎవరు అంటే ఒక దశలో నిభిని-- నింగిన నభాన్ని అంటుకున్నటువంటి సూర్యుడు ఒకడైతే [కాష్] వాయుపురాణంలో జ్ఞానాదిత్యుడు ద్వాదశ ఆదిత్యులున్నారు అలాగే ఎనిమిది మంది ఆదిత్యులు అని మరొకటి ఉంది. ఏదున్నా పన్నెండు మంది ఆదిత్యులలో జ్ఞానాదిత్యుడు ఒకడు. జ్ఞానాదిత్యుడు ఎవరంటే శంభోర్ మూర్తి శరతిభువనే శంకరాచార్య రూపా ఆదిశంకర భగవత్పాదులే జ్ఞానాదిత్యుడు. అటువంటి జ్ఞానాదిత్యుడు అయినటువంటి శంకరులు జగత్తులోకి రెండువేల ఐదువందల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ప్రపంచానికి మళ్ళీ పునః పరిచయం చేసిన తర్వాత మళ్ళీ సుమారుగా ఒక వంద సంవత్సరాల క్రితం నవంబరు ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరున జ్ఞానాదిత్యుడే, శంకరుడే, సూర్యుడే, గాయత్రియే కోటి సూర్య మండల మధ్యస్తమైనటువంటి మహా త్రిపురసుందరి దేవియే ఈవేళ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు వలె [చప్పట్లు] వచ్చి ఒక సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైన ధర్మాన్ని ఎవరూ చేయలేనట్లుగా సీమోల్లంఘనం చేసి ఖండ ఖండాంతరాలు విస్తృతం చేసి మిగిలిన వారంతా రాముడంతా అయోధ్య నుంచి శ్రీలంక దాకా వెళితే శ్రీకృష్ణుడు వింధ్య పర్వతాలు దాటే రాకపోతే సత్యసాయి భగవానుడు తాను పుట్టిన ప్రదేశంలోనే మాత్రమే ఉండి సనాతన ధర్మాన్ని నూట ఎనభై ఎనిమిది దేశాల చేత తల ఊడి-- ఊగించి ఆడించి ముస్లిముల చేత కూడా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రుద్రం చదివించినటువంటి జ్ఞానాదిత్యుడు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. [చప్పట్లు] ఇది ఒక చారిత్రక మహా సత్యం. స్వామి అనగానే ఉంగరం బంగారము రోగము డబ్బు రుణము ఇదా? ఇది కాదే. ఆయన ఉన్నదే ఎనభై ఆరు ఏళ్ళు. ఎనభై ఆరు ఏళ్ళలో నూట ఎనభై ఎనిమిది దేశాల్లో జాతి, మత, వర్గ, వర్ణాలు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి వసుధైవ కుటుంబక నిర్మాణం చేసి, "మీరందరూ ఒక మానవ జాతిగా ఉండండి. మీరందరూ ఒక్కరై ఉండండి. దేవుడు ఒక్కడే. ఒక్కడు నువ్వు ఎవరిని కొలుస్తావో వాడిని కొలుచుకో. కానీ నమ్మకంతో, విశ్వాసంతో, ఏకాగ్రతతో. నువ్వొక క్రిస్టియన్ గా ఉంటే మంచి క్రిస్టియన్ గా ఉండు. నువ్వొక ఇస్లాంని ఆశ్రయిస్తే ఒక మంచి ముస్లిం గా ఉండు. హైందవాన్ని ఆశ్రయిస్తే..." అందరినీ inclusive చేసుకునేటువంటి సర్వమత సౌభ్రాతృత్వాన్ని నీవు పెంపొందించుకో అని ఉదాత్తమైనటువంటి మానవీయ భావానికి పట్టం కట్టినటువంటి మాధవ స్పర్శ ఏది అంటే నా దృష్టిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. [చప్పట్లు] అందుకని ఎవడు స్నేహితుండు? ఈశ్వరుండే? అని అడిగినప్పుడు నాకు స్నేహితుడు లౌకిక ప్రపంచంలో ఎందరున్నా నిజమైన, అచ్చమైన, స్వచ్ఛమైన స్నేహితుడు ఎవరంటే కేవలం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు మాత్రమే అని చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇది చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. క్షణాన్నే పుటమరించినటువంటి ఒక భావన. series ని కొనసాగిస్తూ మనకు నాలుగు మహా వాక్యాలున్నాయి. అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఆర్.ఎం.కృష్ణారావు గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్షుని స్వామి ఇస్తూ వచ్చే సంవత్సరం అయమాత్మా బ్రహ్మ అనేటువంటి కార్యక్రమాన్ని శివంలో నిర్వహించవలసిందిగా అనుగ్రహాన్ని [చప్పట్లు] స్వామివారికి ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, దిగ్గజలు అయినటువంటి వేద పండితులు, శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారు, శాస్త్రం మీద ప్రమాణంగా మాట్లాడగలిగినటువంటి వాళ్ళని పిలిచి అయమాత్మా బ్రహ్మ అనేటువంటి వేద మహా వాక్యాలకి ఇలాగే మన జీవితంలో ఏడాదిలో రెండు గంటలు వెచ్చించి ఇక్కడికి వచ్చి, ఇవాళ గనుక శివం ప్రాంగణమే మొత్తం నిండిపోయుంటే ఎంత బాగుండేది. ఎవరు చెప్తారు? ఎవరెవరు వారి వారి సమయాన్ని వాళ్ళంతా ఉద్యోగాల్లో ఉన్నారు. అయినా అయినా నేను చివరిదాకా ఉండి వెళ్తా అన్నారు. అంటే స్వామి దగ్గరకు ప్రపంచం ఇప్పుడు రావాలి. ఇక్కడ ఏం జరుగుతున్నదో ప్రపంచానికి తెలియాలి. స్వామి అనగానే మనం పాత కథలు మానేద్దాం. మనకేం జరిగిందో మనం చెప్పక్కర్ల. మనం ఏం పొందాము పొందాం. ఇవాళ what Swami did is not important, how we are going to live in this-- on this planet earth is most important అని భావిస్తూ అయమాత్మా బ్రహ్మకి ఈరోజే స్వాగతం పలుకుతూ మళ్ళీ కాలగమనం ప్రకారం అన్నీ జరగాలని వచ్చిన అందరికీ కూడా సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి మిత్ర రూపంలో మనందరికీ అనుగ్రహ వరదానం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తూ మంగళాశాసనం చేస్తూ సాయిరాం.
YouTube · audio

Sri Sathya Sai Study Circle Prasanthi Nagar Samithi ,Hyd l"SATHSANGH" On "MITHRA DEVO BHAVA" l LIVE

Home

Sri Sathya Sai Study Circle Prasanthi Nagar Samithi ,Hyd l"SATHSANGH" On "MITHRA DEVO BHAVA" l LIVE

Source: Cultural TV live on YouTube

0:00 / 4:14:22

More in this series

Sri Sathya Sai Study Circle — SATHSANGH (Prashanthinagar Samithi)

3 episodes · 13 hr 3 min

  1. 39 min 1

    Sri Satya Sai Study Circle Prashanthinagar Samithi , HYD ll SATHSANGH "ATHIDHI DEVO BHAVA" ll LIVE

  2. 35 min 2

    Sri Sathya Sai Study Circle Prasanthi Nagar Samithi ,Hyd l"SATHSANGH" On "MITHRA DEVO BHAVA" l LIVE

    Now playing
  3. 20 min 3

    Sri Sathya Sai Study Circle, Prashanthnagar Samithi ll SATHSANGH ON AYAM ATHMA BRAHMA