Skip to content
Transcript తెలుగు
అనేకమైనటువంటి విషయాలను కర్తతో ప్రారంభించి కర్మ క్రియలని విచారణ చేయిస్తూ చేయిస్తూ పూజాదికాలు దాటి వాక్కుని దాటి జపాన్ని దాటి అజపాన్ని దాటి తపస్సుని దాటి తమస్సుని దాటి పూర్ణమైన అటువంటి ఆత్మ విచార ధారలోకి నెమ్మదిగా భగవాన్ మనల్ని ప్రవేశ పెడుతున్నారు. అంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళాలి అన్నదే ఆత్మ విచార మార్గం. భగవాన్ అవతారం వెనుక వారి రాక వెనుక ఉన్నటువంటి ప్ర ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం కూడా మనిషిని మహోన్నతుడిని చేయటమో మనిషిని Reform చేయటమో లేకపోతే మనిషిని మార్చడమో ప్రధానం కాదు. నేను ఎవరు ఉన్నటువంటి ఒక అద్భుత ప్రశ్న వేసుకుని పైకి కనిపిస్తున్నటువంటి దేహం గాని దాని నామరూపాలు గాని మానవుడు తన జీవిత కాలంలో తాను సంపాదించుకున్న పదవులు, ఆస్తులు, కీర్తి ఇవి కాదని, ఇవేవీ కాదని దేహము మాత్రమే నేను కాదని, నేను అంటే ఆత్మ అని, ఆత్మ అఖండమై చిద్ఘనమై అనంతమై అప్రమేయమై లోపల ఉన్నదని లోపల ఎక్కడ ఉన్నది అంటే హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం షలోమ్ సాక్షాత్తు ఆత్మ రూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వతా మర్జతావ పవన చరణ రోహాత్ ఆత్మ నిష్ఠో భవత్వం. ఇదంతా మనం విచారణ చేశాం. అయితే ఇక్కడి నుంచి విచారణ అంతా కూడా నేను చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నేనుని పట్టుకోవటం చాలా అసాధారణమైనటువంటి విషయంగా మనం భావన చేస్తాం. ప్రపంచంలో ఉన్న అనేక విషయాలను గురించిన అవగాహన సంపూర్ణంగా మనకి లభిస్తూనే ఉంటుంది. అది మన మేధాశక్తి ద్వారా తార్కిక గ్రహణం ద్వారా లేదా మానసికమైనటువంటి స్థితిగతుల ద్వారా అనేక వస్తువులను మనం సంపాదించుకుంటూ వెళ్తాం. వాటి పరిచయాలు పెరుగుతాయి. వాటి గుణగణాలు తెలుస్తాయి. తెలుస్తూనే ఉంటాయి. వాటి స్వభావాలు తెలుస్తుంటాయి. వాటి ప్రయోజనాలు మనకి అర్థం అవుతూ ఉంటాయి. కానీ ఇవన్నీ కదలిపోతున్నటువంటి వస్తువులే. వస్తువులు ఎట్లా ఉన్నా నిజానికి మనము ఇక్కడ నుంచి జరిగిపోయేవారమేనంటారు భగవాన్. మనము అంటే దేహం జరిగిపోతున్నది దేహం జరక్కుండా ఉన్నది. దేహం జరిగిపోతూ లోపల ఉన్న దేహి జరగకుండా ఉన్నాడు. దేహంలో ఉన్నటువంటి దేహికి ఆత్మ అని పేరు. ఆత్మ ప్రకాశమానమై వెలుగు జ్వరవారుతూ ఉన్నది అద్భుతమైనటువంటి ప్రజ్ఞగా అఖండ ప్రజ్ఞగా దాన్నే ఇవాళ సత్తా అనే మాట వాడుతున్నారు. ఏది వాడినా ఎట్లా ఉన్నా దాన్ని current అన్నా fluid అన్నా power అన్నా చైతన్యం అన్నా consciousness అన్నా supra mental consciousness అన్నదానికి పేరు పెట్టుకోండి దాని పేరు ఆత్మే. ఆత్మ అంటే ఇంటా ఉన్నది బయటా ఉన్నది లోపల ఉన్నది వెలుపల ఉన్నది చీకట్లో ఉన్నది వెలుగులో ఉన్నది. అన్నీ తానై ఉన్నది, అంతా తానై ఉన్నది, అఖండమై ఉన్నది. కానీ కదలకుండా ఉన్నది. కదులుతున్నటువంటి చరాచర ప్రకృతి కదలికల అన్నింటికీ తాను మూలమై ఉన్నది గనుక సర్వోపనిషత్ సారమైనటువంటి ఒక ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మని పట్టుకొని నేను ఆత్మను అన్న భావనలో నిలకడ చెందటమే దాని పేరు ఆత్మ నిష్ఠ లేదా బ్రహ్మ నిష్ఠ. బ్రహ్మము అన్నా ఆత్మ అన్నా నిజానికి ఒకటే. ఆత్మ అనేటువంటి పదం వినగానే ఇదేదో వేదాంతులు చాలా బాగా చదువుకున్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరని మనం అనుకుంటాం. నిజానికి ఆత్ అంటే ఏమీ మా అంటే లేదు. ఇది భగవత్పాదుల వ్యాఖ్యానం. అంటే ఏమీ లేదు అంటే ప్రత్యేకంగా ఏదీ లేదని ఉన్నదంతా బ్రహ్మమే నని, పరబ్రహ్మమూర్తి అయినటువంటి పరబ్రహ్మము మూర్తి మత్వం గనక అయినట్లయితే అది ఒక అవతారం అని, అవతారం జాతిని అన్నివేళలా నడిపిస్తూనే ఉంటుందని, అవతారానికి కొన్ని లక్షణాలు, లక్ష్యాలు, గమ్యాలు ఉంటాయి అని, అది మోక్షం ఇవ్వటానికి రాదని మోక్షానికి మార్గాన్ని చూపిస్తుందని మాత్రమే మన సర్వోపనిషత్తులు వ్యాఖ్యానం చేస్తున్నాయి. శాస్త్రమూ మోక్షాన్ని ఇవ్వదు. సాధన చేయవలసింది జీవుడు, సాధించుకోవలసింది జీవుడు. అటువంటి మోక్ష పదాన్ని ఇక్కడ ఉండగానే జీవన్ముక్తి స్థాయిలో అనుభవించాలి. కారణం ఆత్మానుభవం అనేటువంటిదో మోక్షం అనేటువంటిదో మరణానంతర సుఖం కాదు అన్నటువంటి భావనని భగవాన్ రమణులు ఇంకా స్పష్టం చేయాలి, సాధకుడికి ఇంకా మార్గోపదేశనం సుగమం చేయాలి, సరళతరం చేయాలి అనేటువంటి భావనతో నేనుని నేనుగా భావిస్తున్నాను, నేనుని నేనుగా అనుభవించాలి అన్నటువంటి ఒక మీమాంసలో సాధకుడికి అత్యద్భుతమైనటువంటి ఉపదేశాన్ని దాని సారాన్ని అందిస్తున్నారు. అది భగవాన్ జాతికి చేసినటువంటి మహోపకారం. అవతారమూర్తి అయినా మహాత్ముడైనా ప్రపంచంలోకి వచ్చాడు అంటే తన కోసం తాను రాడు, తనకేమీ అక్కరలేదు. మరి ఎవరి కోసం రావాలి అంటే సర్వాత్మన అజ్ఞానంతో, అవివేకంతో, అస్పష్టతతో, అనాచారంతో, అహంకారంతో, అభిజాత్యంతో, దంభంతో, ప్రగల్భంతో జీవిస్తున్నటువంటి జీవుడు అజ్ఞానాంధకారం నుంచి బయటకు వచ్చి తన జీవన పరమార్థాన్ని తనంతట తానే తెలుసుకొని జీవితానికి ఉన్న లక్ష్యగమ్యాలు తన జీవన కాలంలో సాధించుకోవాలి అని చెప్పేటువంటి పరమోత్కృష్టమైన ఉదారమైనటువంటి భూమికే ఆత్మ విచారం.అందుకే మొదట్లో పూజలు, దానాలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, యోగాలు ఎన్ని చేసినా కడగా ఎరగవలసినది, అనుభవించవలసినది, సాక్షాత్కారాన్ని పొందవలసినది, అనుభూతిని చెందించుకోవలసినది ఆత్మే గనుక ఆత్మవిచార మార్గంలో అతి జటిలమైనటువంటి, ఇంతవరకు చాలా complex గా ఉన్నటువంటి విషయాన్ని చాలా simplify చేస్తున్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఏది నేను, ఏది నేను కాదు. ఇది విచారణ. నేను అనగానే మన శరీరాన్ని చూపిస్తున్నాం. నేను అనగానే మన పేరు, మన bio data, మన biography అంతా చెప్తున్నాం. మీరు ఇంతవరకు ఏం చేశారు అంటే అన్నీ నేనే చేశాను అని చెప్తున్నాం. కానీ చేయిస్తున్న కర్త ఒకడు ఉన్నాడు అనేది మర్చిపోతూ ఉన్నాం. స్మృహలో నుంచి నెమ్మదిగా అంటే దేహాత్మ భావన లో నుంచి దేహి భావన లోకి, దేహ భావన కాదు దేహి భావన. అంటే ఆత్మ భావన లోకి వెళ్ళటమే అధ్యాత్మ. అది spirituality. ఇవ్వేళ religion కి అంటే మతానికి, ధర్మానికి, అధ్యాత్మకి, మూడు పదాలకి అర్థం ఒకటైపోయినటువంటి, కలగాపులగం కాకుండా అన్నీ ఒకటైపోయినాయి. సీమారేఖలు చెరిగిపోయినాయి. కారణం ఏమిటంటే మూడింటి యొక్క స్థితిగతులు వేరు అని తెలియకపోవటమే. ఒకటి మతం. మతం అంటే కేవల మార్గం. మార్గం మనకంటే భిన్నంగా ఆలోచించినటువంటి ఒక వ్యక్తి మార్గంలో వెళ్ళండి అని చెప్పాడు గనుక, మార్గం మంచిది అని మనం నమ్మాం గనుక, మన పూర్వీకులంతా అందరూ మార్గంలో వెళ్లారు గనుక మతాన్ని మనం అంగీకరిస్తున్నాం. కనుక మతం అనేది శాస్త్రాలు ఏర్పరచలేదు. మానవుడే ఏర్పరచుకొని తన దారిని తానే నిర్మాణం చేసుకొని దారిన నడుస్తూ నా మతం గొప్పది అన్నటువంటి ఒక భావనలో అయిపోతున్నాడు. ఇది అమానుషమైనటువంటి అజ్ఞానపు పొరకి సంబంధించినటువంటి విషయం. మతాన్ని కేవలం మార్గంగా తీసుకున్నట్లయితే, మార్గం అయితేనేమి చేరవలసిన గమ్యాలు ఒక్కటే. ఇక ధర్మమా, ఇవాళ ధర్మానికి అధర్మానికి తేడా తెరిగి-- చెరిగిపోయింది. "స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః" అంటాడు జగద్గురువైన కృష్ణుడు భగవద్గీతలో. స్వధర్మం అంటే ఏంటంటే ఒక స్థాయిలో నువ్వు చేయవలసిన పని నువ్వు చేయటం, అది నీకు ఆనందం. నువ్వు చేయలేని పని గనుక చేస్తే అది పరధర్మం. చేయలేనిది, చేయనక్కరలేనిది, నీది కానిది, నీ వలన కానిది, నీకు శక్తిలేనిది, పని పరధర్మం అవుతుంది. అది భయాన్ని కొలుపుతుంది. మనకు అలవాటైన పని చేయటం స్వధర్మం. అలవాటు ఒక స్థాయిలో మంచి పనులు చేయటం, సత్కర్మలు చేయటం, మంచిగా ఉండటం, మంచిగా మాట్లాడటం, మానవ సంబంధాలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవటం, ఇవన్నీ కూడా స్వధర్మానికి చెందినవి. ఇది ఒక స్థాయి. ఆధ్యాత్మిక స్థాయిలో విచారణ చేసినట్లయితే స్వధర్మము అంటే ఆత్మ ధర్మమే. స్వ శబ్దం అది. పరధర్మము అంటే ఆత్మకు సంబంధించినది కానిదంతా పరధర్మమే. అది ఇగో మన లోకానికి, మన దేహానికి, మన కీర్తికి, మన పదవులకి, మనకు-- మన దగ్గర ఉన్న డబ్బుకి, మనకున్నటువంటి అందచందాలకి, మన మనస్సుకి, వీటన్నింటికీ కూడా లోబడినటువంటిది గనుక అనాత్మ భావనలో నుంచి ఆత్మ భావనకు రండి. దేహాత్మ భావనలో నుంచి దేహ భావనలో-- దేహి భావనలోకి రండి అంటూ ధర్మం అనేటువంటిది చాలా అనూచానమైన, సాంప్రదాయకమైనటువంటి ఒక code of conduct ఇవాల్టి భాషలో. అంటే ఏది కాల పరీక్షకు నిలబడిందో, ధర్మం మానవ జాతిని సముద్ధరిస్తుందో, ధర్మం వలన మానవుడు పూర్ణుడవుతాడో, ధర్మం వలన చరాచర జగత్తు చక్కగా, హాయిగా, ప్రసన్నంగా నడుస్తుందో, ధర్మం వలన మరొకరికి హాని జరగదో, ధర్మం వలన ప్రపంచం అంతా స్థిమితంగా ఉంటుందో, అతలాకుతలం కాదో, కకావికలు కాదో అటువంటి ధర్మమే ధర్మం గనుక, ధర్మాన్ని ఆశ్రయించమని చెప్పేది వేదం గనుక వేదోఖిలో ధర్మమూలం. వేదము అనగానే మనకి స్పష్టంగా చెప్పేది అని అర్థం
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -69

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -69

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:48

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

    Now playing
  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77