Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] మైల్డ్ చేసుకున్నటువంటి mind ని మనం నెమ్మదిగా bend చేసుకోవాలి. Bend చేసుకున్న దాన్ని mend చేసుకోవాలి. Mend చేసిన దానిని end చేయాలి. మనసే లేని స్థితికి మనం వెళ్ళాలి. మనసే లేని స్థితి గురించి చాలా చెప్పుకున్నాం. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కానీ, ఇప్పటికీ మనస్సుని అనాహతం నుంచి మన హృదయ స్థానం దాకా తీసుకు వెళ్ళిన వాళ్ళం కనుక, మనోలయం అయ్యింది. ఆపై మనోనాశనమై ఒక యోగత్వాన్ని పొందాం కనుక, అంటే మనసు తన ఉనికిని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, రూపురేఖలని, దాని స్వభావాన్ని, దాని గుణాన్ని, దాని బలాన్ని, దానికున్న సమస్త కోణాలని తాను పోగొట్టుకున్నది గనుక, అటువంటి మనస్సు ఇవాళ హృదయంతో కూడి ఉన్నది. నిన్న చెప్పుకున్నాం మనం, భగవాన్ వంటి మహాత్ములు, అవతారమూర్తులు, జ్ఞాన సంపన్నులు. అటువంటి ఆత్మానుభూతిని పొంది కూడా ఇంకా ప్రాపంచికమైన విషయాల పట్ల ప్రశ్నిస్తున్నారే, అడుగుతున్నారే, పని జరిగిందా లేదా అని విచారిస్తున్నారే, దీనిని ఎలా మనసుతో చేస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు భగవాన్ చెప్పారు. ఉన్నది ఒకటే మనస్సు. పూర్ణ మనస్సు, శుద్ధ మనస్సు. మనస్సుని గూట్లో నుంచి జ్ఞాని బయటకు తెచ్చి దైనందిన కార్యకలాపాలు నాలుగు ముగించుకొని మళ్ళీ గూట్లో పెడుతున్నాడప్ప అన్నారు. ఎంత అందమైన మాటో చూడండి! అద్భుతమైన మాట. అంటే పరమ పవిత్రీకరణమైనటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో, మనస్సు యొక్క మూలంలోకి వెళ్ళమంటారు భగవాన్. విషయమైనా మూలంలోకి వెళ్ళండి. Go to the roots. Fruits అన్నీ బయట కనిపిస్తున్నాయి, roots కనపట్టలా. కనబడుతున్న వాటిని మనం తింటున్నాం, అనుభవిస్తున్నాం, బాగుందన్నాం, బాగా లేదన్నాం. మరి కనబడుతున్న దానికి మూలం ఏది అంటే fruit కి మూలే-మూలం ఏదంటే కనపడని root, వేళ్ళు. వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. వేటి పని నిజానికి పనులు చేసుకుంటూ వెళుతున్నాయి. మానవ జీవితంలో కూడా మనం చేయవలసిన పని మనం చేయాలి. మనకు నిర్దేశింపబడిన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. మనకు ఆదేశించబడినటువంటి ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. అది వ్యక్తి ధర్మమై, కుటుంబ ధర్మమై, సమాజ ధర్మమై, దేశ, ప్రాదేశిక ధర్మమై, చివరకు విశ్వధర్మమై పాలించబడుతూ ఉన్నది గనుక ధర్మాన్ని ఆచరిద్దాం. మతంలో, మార్గంలో నడుస్తూ వెళ్దాం, అంతే. మతాన్ని మతికి ఎక్కించుకోకూడదు. ఎందుకంటే, మతి మా మతానికి పుట్టిల్లు గనుక, మతిలో నుంచి అంటే మన ఆలోచనలో నుంచి అది పుట్టింది గనుక, మన సంస్కారాలన్నీ కలబోసుకుని ఉంటుంది గనుక, మతానికంటే మహోన్నతమైనటువంటి ధర్మం వైపు మనం వెళ్దాం. సనాతనమైనటువంటి ధర్మమే ధర్మం. ఎందుకంటే మిగతావన్నీ ఏవొచ్చినా, ఎన్ని వచ్చినా, ఎన్ని రూపు పోకడలు పోయినా మూలం కదలనటువంటి, అద్భుతమైనటువంటి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో-ఉన్నదో సనాతన ధర్మం మానవుడిని మానవుడిగా ముందు తీర్చిదిద్దుతుంది. మానవుడిలో నాలుగు భాగాలున్నాయి. దీనత్వము, దానవత్వము, మానవత్వము, మాధవత్వం. నాలుగు మనం గుర్తు పెట్టుకోవాలి. మనందరిలో ఉన్నాయి. మనలో దానవుడున్నాడు, మనలో రాక్షసుడు, రావణుడున్నాడు, కంసుడున్నాడు, కీచకుడున్నాడు, హిరణ్యకశిపుడున్నాడు. లేని వాళ్ళు ఎవరు, బయట ఎవరూ లేరు మనలోనే ఉన్నారు. దంభము, ప్రగల్భము, గర్వము, అతిశయము, అహంకారము, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. రాక్షస గుణాలను నెమ్మదిగా పోగొట్టుకుంటూ ఉంటే మనలో దీనత్వం కూడా ఒక పాలుంది. చెయ్యి చాపే ఒక అలవాటు. వస్తువునో మనది చేసుకుందాం అనేటువంటి ఒక దురాలోచన. రెండింటిని మనం దాటాలి, అధిగమించాలి. ఎప్పుడైతే మనం రెండూ దాటుతామో, అధిగమిస్తామో, ఇక మిగిలినవి రెండు. ఒకటి మానవత్వం, రెండవది మాధవత్వం. మానవత్వానికి, మాధవత్వానికి సన్నని దారపు పోగంత దూరం ఉందంతే. గడప ఇవతల, గడప అవతల. అవతల ఉన్నదంతా ప్రపంచం, ఇవతల ఉన్నదంతా లో ప్రపంచం కాబట్టి లోకంలోకి, లోలోకంలోకి వెళ్ళాలి, గోలోకం నుంచి. పరిపూర్ణమైనటువంటి మానవ వికాసం జరగాలి. మానవతా శోభిల్లాలి, అది పరిమళించాలి, సద్వాసనలు కురిపించాలి. అంటే మూలం ఏదైతే ఉన్నదో దానిని మనం పట్టుకోవాలి, మనస్సుని పట్టుకోవాలి. యోగి మనస్సుని హృదయంతో కలిపాడు. మనోలయం చేశాడు. కొన్నాళ్ళ తర్వాత మనోనాశనం కూడా చేసుకున్నాడు. యోగి అయిన తర్వాత తత్వదర్శనాన్ని సాధించాడు. తత్వదర్శనం అంటే చిత్వ దర్శనమేనన్నారు భగవాన్ రమణులు. రెండూ పెద్ద భిన్నం కాదన్నారు. ఎందుకంటే గురువు, దైవము, ఆత్మ, వెలుగు అంతా నీలోపలే ఉన్నది గనుక అన్నమాచార్యులవారు అన్నట్లుగా "చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం". చిత్తంలో పుట్టిన గురు స్వరూపమా, ఆత్మ! నీకు నమస్కారం.ఆ ఆత్మ, పరమాత్మ, దైవం, వెలుగు, జ్యోతి, జ్ఞానం పేరు పెట్టుకున్నా లోపల ఉన్న వస్తువు ఒకటే. అది సద్వస్తువు. సద్వస్తువుని చూపించేటువంటిది మాత్రము మళ్ళీ మన-మనలో ఉన్నటువంటి మనస్సు అవుతున్నది గనుక మనస్సు మన చేతుల్లో టార్చ్ లైట్ లాంటిది. టార్చ్ లైట్ చేతిలో ఉంచుకొని నేను నడవను నన్ను గమ్యానికి చేర్చమంటే టార్చ్ లైట్ పని చేయలేదు. మార్గం మీద వెలుగును ప్రసారించి మార్గంలో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? బాగానే ఉన్నదా లేదా వెలుగును చూపిస్తుంది అంతే. దాని పని అంతే. నడవవలసింది మనమే, చేరవలసింది మనమే, పొందవలసింది మనమే, ఆనందించవలసింది మనమే, అనుభవించవలసింది మనమే అనేటువంటి ఒక విషయాన్ని భగవాన్ ఇక్కడ చాలా చాలా స్పష్టం చేస్తూ దీనికి మూలమైనటువంటి ఒక భావన ఎక్కడ అని ఆలోచిస్తే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ "ఉద్ధరేరాత్మానాత్మానం" ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఇవాళ ప్రపంచం ఎవరో ఉద్ధరిస్తారని, ఎవరో ఉపదేశిస్తారని, ఎవరో ఏదో చెప్తారని, వాళ్ళే మన బాధ్యత వహిస్తారని, బాధ్యత వహించే వాడు మరొకడు ఉన్నాడు అని మనల్ని మనం వంచన చేసుకుంటాం. "ఉద్ధరేరాత్మానాత్మానం" మన ప్రయాణం మనం చేయాలి. మన ఆకలికి అన్నం మనమే తినాలి. మనకి దాహం వేస్తే మన నీరు మనమే తాగాలి. మనకి ఆనందం కలగాలి అంటే మన స్వాధ్యాయం మనమే చేయాలి. చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైనా పరిష్కారం కావాలంటే మహాత్ముల్ని దర్శనం చేయాలి. ఎక్కడైనా ఒక ఆలోచనను విస్తృతమైన పరిధిలోకి తీసుకుని వెళ్ళాలి అంటే మనకంటే ఉన్నతుడైన వాడి దగ్గరకు మనం వెళ్ళాలి. సాంగత్యం చక్కగా మనం ఏర్పరచుకోవాలి. సాన్నిహిత్యంలో నుంచి ఒక ఆనందానుభూతిని మనం పొందాలి అని చెప్తూ భగవాన్ మనస్సు యొక్క మూలంలోకి కాస్త వెళ్ళండప్ప అంటున్నారు. వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మనం చక్కగా చేస్తూ ప్రయత్నాలనే, ప్రయత్నాన్నే మనం అధ్యాత్మ సాధనగా భావన చేస్తూ సాధనా మార్గంలో మన మనస్సుని మనం పవిత్రీకరించుకుంటూ మనం హాయిగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా, సరళంగా, సూటిగా, గంభీరంగా, ఉన్నతంగా, ఉదాత్తంగా మన అధ్యాత్మ ప్రయాణాన్ని మనం కొనసాగి
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -59

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -59

Source: TFC Spiritual on YouTube

0:00 / 9:51

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

    Now playing
  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77