No transcript for this section.
Transcript begins at 0:00.
[పొగరు] పరశురామ బ్రాహ్మణ సేవా మిత్ర అనేటువంటి ఒక ధార్మిక, సామాజిక సంస్థ నిర్వర్తిస్తున్నటువంటి అనేక ధార్మిక కార్యకలాపాలను గమనించినప్పుడు, ఇటువంటి సంస్థల అవసరం ఎంతో ఉన్నదని, దానికి సమాజం పూర్తిగా సహకరించాలని, తోడ్పాటునివ్వాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ ఎవరూ కోరని విధంగా ఒక వినూత్నమైనటువంటి విషయాన్ని నా ముందుంచి "నారద మహాముని గురించి చెప్పండి" అని అడిగినప్పుడు నా మనస్సు ఆనందతాండవం చేసింది. దానికి కారణం నారదుడు నారదుడు అని అక్కడ ఆగిపోయినాం, ప్రథమావిభక్తి దగ్గర ఆగిపోయినాం. అది ఒక అవిభక్తమైనటువంటి భక్తి ప్రవాహానికి గుర్తు ఎవరు అంటే నారదుడు. ఆయన మహాముని, మహాముని అంటే మౌనము ద్వారా నాలుకపై నారాయణ సంకీర్తనం చేసినటువంటి ఒక అనాహత నాద వేది ఆయన. అంటే ఆ నాదం యొక్క రహస్యం తెలిసినవాడు. రాగ భావ తాళ లయాత్మకమైనటువంటి భావంతో కేవల నారాయణ మంత్రాన్ని "దేనికి సమాధానమివ్వవలసి వచ్చినా నారాయణ" అంటూ నారాయణ స్మరణ చేసినటువంటి నిరంతర చింతనాశీలి, పరమ ఉదారుడు, భగవత్ ఓత్తముడు నారద మహర్షి. మహాముని అనగానే వెనువెంటనే మహర్షి అని కూడా అన్నాం. ఎందుకని అంటే మామూలు వాడు సాధారణమైనటువంటి వాడు మనిషి సాధనా కార్యక్రమంలో నెమ్మదిగా ఋషి అయి బ్రహ్మర్షి అవుతాడు, అక్కడి దాకా చేరుతాడు. బ్రహ్మర్షి కావటం కూడా బ్రహ్మమును ఎరగటమే కానీ మహస్సుని ఎరగటం ప్రధానం. మహస్సు అంటే ఆత్మ. తన యందు ఉన్నటువంటి ఆత్మని తన దేహంలో సర్వాంగీణమైన దేహంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగనాడుల అన్ని ప్రతిస్పందనలు కూడా ఒక భక్తి పారమ్యంతో పులకాంకుర ప్రకరమయ్యేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి మహర్షి స్వరూపమే నారదుడు. అంటే నారద మహర్షి మహస్సుని ఎరిగిన వాడు అని అర్థం. మరి ఆయన కేవలము బ్రహ్మ జ్ఞానం దగ్గరే ఆగిపోయినాడా? నారాయణ స్మరణతోనే ఆనంద పడిపోయినాడా? అంటే కానే కాదు. ఆయన నారద తుంబుర శారద చూడండి. నారదుడు తుంబురుడుని సంగీతంలో మనం చాలా సమున్నతమైన స్థాయిలో వారిని సంకీర్తన చేస్తాం, గౌరవిస్తాం, ఆరాధిస్తాం, పూజిస్తాం. ఎందుకంటే ఆ నారదుడు అనేటువంటి ఆ పదమే అంటే ఎటిమాలజీ అంటాం చూడండి, పదోత్పత్తిలో దాని అర్థం ఏంటంటే నారము అంటే జ్ఞానము అని అర్థం. నారమును అంటే జ్ఞానమును దా అంటే ఇచ్చేవాడు గనుక ఆయన నారదుడు అయినాడు. ఏ జ్ఞానాన్ని ఇస్తాడు? భక్తి యోగం ద్వారా జ్ఞానాన్ని ఇస్తాడు. నిజానికి కర్మ పువ్వు అయినట్లయితే, భక్తి కాయ అయినట్లయితే జ్ఞానం పండు అవుతుంది. జ్ఞానానంద సుధామృందలహరి సంవిత్ ఫలాభ్యున్నతి అంటారు శంకర భగవత్పాదులు. అంటే ఆ సంవిత్ ఫలం దేనిని పొందితే ఇక పొందవలసినది లేదో, దేనిని తెలుసుకుంటే ఇక తెలియబడవలసింది అంటూ ఏమి మిగలలేదో అదే బ్రహ్మము గనుక బ్రహ్మ విజ్ఞాన, బ్రహ్మ జ్ఞాన, విజ్ఞాన, సుజ్ఞాన, ప్రజ్ఞాన పారంగతులు ఎవరు అంటే నారద మహర్షి. కాబట్టి నారదుడు కళా రూపాలలో ఎటువంటి స్వరూపాన్ని తీసుకున్నా అది పామరుడి యొక్క మానవ సంకుచిత పరిధికి లోబడినటువంటి ఒక ఊహా స్వరూపమే తప్ప ఒక సహజమైనటువంటి రూపం నారదుడిది ఏది అంటే సర్వమును విసర్జించి బ్రహ్మ మానస పుత్రుడు అయినటువంటి, పరమాద్భుతమైనటువంటి బ్రహ్మ మానసం అంటే జ్ఞానమే. ఆ జ్ఞానము ఆత్మజ్ఞానమే గనుక ఈ నారదుడు మహాముని, మహర్షి అంతే కాదు భక్తిలో ఆయనను మించిన వాడు లేడు. ఆ తర్వాత ఎవరెన్ని సంకీర్తనలు చేసినా, ఎంతెంతగా విష్ణు పారమ్యాన్ని ఈ ప్రపంచానికి అందించినా, జన జగత్తుల అన్నింటికీ కూడా నారాయణ స్మరణ ప్రభావం చేత భావ కాలుష్యాన్ని సంపూర్ణంగా వివర్జనం చేయగలిగిన అంతటి మహా శక్తి కలిగిన వాడు నారదుడు గనుక ఆయన పేర ఆయన చెప్పిన అనేకమైనటువంటి మాటలు అవే నారద భక్తి సూత్రాలుగా మనకివ్వేళ అందుబాటులోకి వచ్చినాయి. నిజానికి నారద భక్తి సూత్రాల అన్నింటినీ గనక ఆకళింపు చేసుకుంటే అధునాతన మానవుడు ఆందోళనాయుక్తమైనటువంటి జీవితాన్ని భౌతికమైన సర్వ సుఖాలు తన చుట్టూ పరచుకుని, తరచుకుని ప్రవాహ వేగంతో ఉన్నా అశాంతికి లోనవుతున్నటువంటి వాడు చదివి అర్థం చేసుకుని ఆకళింపు చేసుకొని ఆచరణాత్మకం చేసి అనుభవాన్ని పొంది అనుభూతిని చిందించుకోగలిగినటువంటి స్థాయిని నారద భక్తి సూత్రాలు మనకి అనుగ్రహిస్తాయి. అందుకనే నారదుడు మొట్టమొదటే భక్తిరేవ గరీయసీ భక్తిహి ఏవా గరీయసీ భక్తే సర్వోన్నతమైనది అని. ఎందుకంటే ఆ భక్తిలో సమర్పణ ఉన్నది, శరణాగతి ఉన్నది, వినయం ఉన్నది. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్నెన్ని వ్యాఖ్యానాలు చేసినా, ఎంత మహోన్నతమైనటువంటి భౌతిక స్థాయిలో ఒక స్థితిని అందుకున్నా తాను పరమాత్మ శక్తి ముందు విలంబుడు అయి ఉంటాడు గనుక ఇటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనా సౌభాగ్యాన్ని కలిగించగలిగినటువంటి వాడు నారదుడు అవుతున్నాడు గనుక ఆ నారద మహర్షిని, నారద మహామునిని, ఆ నారద ప్రయుక్తమైనటువంటిఅనేకమైనటువంటి ఈ రాగాలు వాటి ప్రస్తారాలు వాటిలో ఉన్న ఉదాత్త అనుదాత్త స్వరాలు వీటన్నింటిని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే నారదుడు ఎంత మహా మహిమాన్విత స్వరూపుడో మనకు అర్థమవుతుంది. నారదుడే లేకపోతే విష్ణునామ సంకీర్తనం మనకెట్లా అలవటు పడేది ఆయనే గనుక నారాయణ స్మరణ చేసి ఉండకపోతే చతుర్దశ భువనాలలో ఏర్పడిన భావ కాలుష్యం ఎట్లా నిర్మూలనం జరిగేది. మనుషుల యందు నారాయణుడి యందు ఒక భక్తిని ఇక్కడ నారాయణ శబ్దం అంటే ఆయన కూడా నారము అయనముగా కలిగిన వాడు నారాయణుడు. నారము అంటే జ్ఞానమే అయనము అంటే ప్రయాణం అని ఒక అర్థం ఆ పాము అని రెండవ అర్థం. కాబట్టి ప్రయాణించే వాడు అంటే కదిలే వాడు ఆయనే కదలని వాడు ఆయనే కానీ కదిలించే వాడు మాత్రం నారాయణుడే గనుక ఈ నారాయణ శబ్దాన్ని మహా మంత్రంగా ఈ ప్రపంచానికి అందించినటువంటి మహా చైత్య పురుషుడే నారద మహాముని గనుక నారద మహర్షి కి మనం నమో వాకాలు సమర్పించాలి. ఈవేళ దురదృష్ట వశాత్తు అనేకమైనటువంటి కళా స్వరూపాలనండి అనేక గ్రంథాలనండి ఆ అనేక సందర్భాలనండి నారదుడిని కలహ ప్రియుడుగా ఆ చిత్రీకరణ చేశారు. ఆయన కలహ ప్రియుడు కాదు కలహం ద్వారా సంఘర్షణ ద్వారా సమన్వయాన్ని సాధించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇవాళ ఏమని చెప్పాలి అంటే ఇంగ్లీష్ లో మంచి ఒక గ్రేట్ అంబాసిడర్ అంటాం. అంటే మంచి రాయబారి ఎవరికి జీవుడికి పరమాత్మకి మధ్య రాయబారి ఆయన. వచ్చి పరమాత్మ గురించి జీవుడికి చెప్తాడు జీవుడి వేదనని పరమాత్మకి విన్నవిస్తాడు గనుక నారద మహర్షి ఈజ్ ది గ్రేటెస్ట్ అంబాసిడర్. ఆయన ఎక్కడ సత్యం దా-దాటడు అసత్యాన్ని ఆశ్రయించడు. సత్యం బ్రుయాత్ ప్రియం బ్రుయాత్ న బ్రుయాత్ సత్యం అప్రియం అప్రియంగా చెప్పిన సత్యాన్ని ప్రియంగా చెప్తాడు. ఒక-ఒకవేళ అప్రియం చెప్పవలసి వస్తే దానిని ప్రియంగా మనకి ఆ అందిస్తాడు. కనుక ఎవరినీ నొప్పించక తాను నొవ్వక ధన్యుడై అన్ని లోకాలు మూడు లోకాలే కాదు చతుర్దశ భువనాలలో కూడా జ్ఞాన స్వరూపి అయి నిరంతర సంచారి అయి ఉండేటువంటి ఒక నిరామయ నికేతన నిరంజన స్థాయిలో నెలకొంది చెందినటువంటి మహాపురుషుడే నారద మహర్షి గనుక అటువంటి నారద మహర్షిని గురించి మనం చాలా తెలుసుకోవలసినది అర్థం చేసుకోవలసినది పైపైన కేవలం భౌతిక స్థాయిలో కాక భౌతిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక. భౌతికం దాటుదాం ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో మనం ఆయన్ని గనుక అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ నారదుడు ఒక జ్ఞాన స్వరూపిగా సంగీత సామ్రాట్టుగా మనకి ఆవిష్కృతం అవుతాడు. అన్నిటికంటే కూడా భక్తి సూత్రాలు మనల్ని సన్మార్గం వైపు సనాతన ధర్మం వైపు ఏం చేయాలో ఏం చేయకూడదో ఎట్లా కొట్టుమిట్టాడాలో తెలియని పరిస్థితిలో మానవుడికి మార్గోపదేశం చేసేటువంటి మహా మహిమాన్విత సారస్వత స్వరూప శ్రేష్ట ఎవరు అంటే నారద మహాముని ఇతి శం.
YouTube · audio
అనాహత నాదవేది నారద మహర్షి,,,ఆధ్యాత్మిక శాస్త్రవేత్త Vsr మూర్తి
అనాహత నాదవేది నారద మహర్షి,,,ఆధ్యాత్మిక శాస్త్రవేత్త Vsr మూర్తి
Source: SRIKARAM TV on YouTube
0:00 / 9:29