Skip to content
Transcript తెలుగు
ఎప్పుడైతే మనం రకమైన ఆలోచనలో ఉన్నామో ప్రపంచ శాంతిని మనం కోరుకుంటాం. ప్రపంచ శాంతిని ఎప్పుడైతే కోరుకుంటామో మన మనస్సు మనోలయమైనట్లే [కాష్] ప్రపంచం అంతా బాగుండాలి అనుకుంటాం. సమస్త లోకాః సుఖినో భవంతు అంటాం. మనోలయమైనట్లే. పెదవుల మీద నుంచి కాదు హృదయంలో నుంచి మాట రావాలి. హృదయానికి భాష మనం నెమ్మదిగా నేర్పాలి. మనస్సు, ఇంద్రియాలు, కరచరణాది అవయవాలు, సర్వాణువులు మనోలయ సాధనకు గురై యోగత్వాన్ని పొందినప్పుడు [కాష్] యోగి పూర్ణుడవుతున్నాడు. శుద్ధ మనస్కుడవుతున్నాడు. శుద్ధ మనస్కుడై ప్రపంచ శాంతిని, వ్యక్తి శాంతిని తన యందు ముందు పొంది ప్రపంచానికి తన నుంచి వచ్చే ఎమనేషన్స్ ద్వారా ఒక భావ సంపదని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి యోగికి, నిజానికి స్థాయికి వెళ్ళినటువంటి యోగికి ప్రపంచం పడుతుందా? ప్రపంచంలో జరిగేవన్నీ ఆయనకి అవసరమా? మరి దేనియందు లగ్నం లేకుండా వీటన్నింటికీ అతీతంగా ఎలా ఉండగలుగుతున్నాడు అంటే భగవద్గీతలో మనం పునః చెప్పుకుందాం. గీతను వింటూ వింటూ వింటూ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అన్న అర్జునుడికి కృష్ణ పరమాత్మ ఇచ్చిన బోధ ఏమిటి అంటే "యోగివికా అర్జున" అన్నాడు. యుద్ధభూమిలో వీరుడై, ధీరుడై, శూరుడై, గంభీరుడై, సవ్యసాచియై శత్రు సైన్యాన్ని కకావికలు చేయటానికి మనస్సును దృఢ పరుచుకున్నటువంటి అర్జునుడితో నువ్వు వీరుడివిగా, ధీరుడివిగా అనలే. "యోగివికా" అన్నాడు. మనోలయం చెయ్. ఇప్పటివరకు నీవు మనసుతో ఆలోచించినందువలన త-తాతలు, మేనమామలు, నీ బంధువులు, నీకు కావలసిన వాళ్ళందరూ కనిపించారు. విన్నావు చాలా వరకు విన్నావు. విని, విని, విని నీకు మనోలయం నెమ్మదిగా జరుగుతూ వచ్చింది. మనోలయం సాధించేటువంటి సమయంలోనే నువ్వు ప్రశ్న వేశావు. అయితే నువ్వు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అంతకుముందు ఏం చెయ్యనో చెప్పావు. ఎందుకు చెయ్యనో చెప్పావు. యుద్ధం ఎందుకు వద్దో, రాజ్యం ఎందుకు వద్దో, కాంక్ష-- కీర్తి కాంక్ష ఎందుకు లేదో అన్నీ చెప్పావు. అది మనో పరిధులు అనేది. ఎప్పుడైతే నువ్వు మనోలయం చేశావో, హృదయ క్షేత్రంలోకి వెళ్ళావో, నీ స్వస్థానంలోకి నిన్ను గీత నడిపించిందో, మాటలు నడిపించినయో క్షణాన అడుగుతున్నావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని. మనం కూడా చూడండి. మొదట్లో ఇంకోడు చెప్పేది వినం. వాడు ఎంత గొప్ప మాట చెప్పినా మనం వినం. కానీ అధ్యాత్మ సాధన మార్గంలో ప్రవేశించిన తర్వాత అందరూ చెప్పినవి వినటం మొదలు పెడతాం, విశ్లేషించుకుంటాం. ఏది మనకు అవసరమో, దేనివలన మనకు ముందు ఆనందం కలుగుతుందో, తద్వారా ప్రపంచానికి ఆనందం కలుగుతుందో వస్తువుని, విషయాన్ని, సూచనని, సలహాని గౌరవిస్తాం, అంగీకరిస్తాం, స్వీకరిస్తాం. అప్పుడు దానిని ఆచరణాత్మకంగా కూడా చేస్తాం. అంటే వింటాం, తెలుసుకుంటాం, అవును అనుకుంటాం, నిజమే అని అనుకుంటాం, ఇది మంచిదే అనుకుంటాం, ఆచరించటం మొదలు పెడతాం. ఈ, ప్రక్రియ అంతా కూడా మనోలయ సాధనలో ఒక భాగమే. ఈవేళ భగవాన్ రమణుల ఉపదేశ సారం సాధారణమైనటువంటి మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇదిగో ఇది. దాని పేర్లు కాసేపు పక్కన పెడదాం. పేర్లు గంభీరంగా ఉంటాయి. మనోలయము అనంగానే అమ్మో ఇదేదో మనకు అర్థం కాదు అని. ఏం కాదు. మనలో జరిగేటువంటి పరిణామ దశలు అన్నీ కూడా యోగాలే. పరిణామాలు జరుగుతున్నాయి అని గమనించగలిగితే అహం స్పురణ. వాటిని వేటిని పట్టించుకోకపోయినట్లయితే అది అహంకారం, అంతే. అహంకారం నుంచి అహం స్పురణ వైపు మనం ప్రస్థానం చేయాలి గనుక, దిశగా మనం హాయిగా వెళ్ళవలసి ఉన్నది గనుక, నిజంగా గనక అక్కడిదాకా వెళ్లగలిగినట్లయితే, చిత్తవృత్తులన్నీ నిరోధించగలిగితే, మనోవృత్తులన్నీ నాశనం కాగలిగినట్లయితే, మనస్సు హృదయ స్థానంలోకి వెళ్లగలిగినట్లయితే లేదా మనం తీసుకువెళ్లగలిగినట్లయితే ఆపై మాటా లేదు, ఆపై దృశ్యమూ లేదు. విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు రెండు మనకు అవసరం లేదు. డైరెక్ట్ పాత్ ఇదే భగవాన్ సూటి మార్గం. సూటి మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు కలిగేటువంటి ఒక ఆంతరంగికమైన అనుభూతి. చూడండి ఎప్పుడైనా ప్రయాణం చేస్తాం. చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి. మొదటి రోజు మనకి అడ్రస్ అంత తేలిగ్గా దొరకదు. దాని ఎదురుగ్గానే ఉండి ఎక్కడో తిరుగుతూ ఉంటాం, ఇంకెక్కడో ఉందని అనుకొని. కానీ రెండో రోజుకి అది ఎక్కడ ఉన్నదో తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ గా వచ్చి కూర్చుంటాం. డైరెక్ట్ పాత్ అంటే అది. మొదటి రోజు ఉన్న కన్ఫ్యూషన్ రెండో రోజు లేదసలు. ఒక్క రోజులోనే మార్పు. మనోలయానికి, మనోనాశనానికి ఇంత తేడా ఉంది. మనోనాశనం చేసుకోవలసిన అర్జునుడు ఇంకా మనోలయంలోనే మళ్ళీ అడుగుతున్నాడు నన్ను ఏం చేయమంటావు అని. "యోగీర్భవ అర్జున" యోగివి కావయ్యా.అదేమిటి యుద్ధం చేయాలి కదా నేను యోగిని అయితే యుద్ధం ఎలా చేస్తాను అన్న వాడికి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు యోగి అంటే గడ్డం మీసాలు పెంచుకొని కాషాయ బట్టలు కట్టుకోవడమా? యోగత్వం అంటే నీలో జీవ ప్రజ్ఞ ఉన్నది అర్జునా! నాలో ఉన్న దైవ ప్రజ్ఞతో అనుసంధానం చెయ్ have that connectivity అదే అవసరం. ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో ఇక నీ యందు జీవ ప్రజ్ఞ కంటే దైవ ప్రజ్ఞ బలవత్తరమైనది శక్తివంతమైనది గనుక అదే ప్రపంచానికి అక్కరకు వచ్చి తాను చక్కబెట్టవలసిన కార్యక్రమాన్ని తాను చక్కబెడుతుంది. అంటే ఇకపై నేను యుద్ధం చేయను అన్న నీవు నీవే నేను యుద్ధం చేస్తాను అంటున్నావే. ఇకపై నీవు యుద్ధం చేస్తున్నట్లు కనిపించినా అనిపించినా యుద్ధం చేస్తున్నది మాత్రం ఎవరు? చేయిస్తున్నది మాత్రం ఎవరు? ఎవరు అంటే వాడి పేరు ఆత్మ. భగవంతుడు ఇంత స్పష్టంగా భగవద్గీతను చెప్తూ ఉంటే మనం శ్లోకాలు అర్థాలు ఇంకా వెతుక్కుంటూ శబ్దారణ్యంలో ప్రవేశించి శబ్దం ఇట్లా శబ్దం ఇట్లా అనుకుంటే తత్వ విచార ధారలోకి మనం వెళ్ళేది ఎప్పుడు. ప్రశ్న వేసుకోమంటున్నారు భగవాన్. మీకు ఒక direct path సూటి అయిన సరళమైన అటువంటి ఒక మార్గం ఇది. మీరు జపాలు దానాలు ధర్మాలు పూజలు క్రతువులు యాగాలు ఇవన్నీ కూడా చేయండి. కానీ అవన్నీ చేయగా చేయగా ఇకపై ఏమిటి అన్న ప్రశ్న వేసుకోవాలి కదా. బ్రహ్మసూత్రాలలో మొట్టమొదటి సూత్రం ఏమిటి? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇప్పటివరకి ఇది పొందాం ఇకపై ఏమిటి. మనం కూడా ఒక పని కాగానే తర్వాత ఏం చేయాలి అంటాం. రోజు అయిపోతుంటే రేపు ఏం చేయాలి అంటాం. రేపు సాగుతూ ఉంటే వచ్చే వారం ఏం చేయాలి అంటాం. వచ్చే నెలలో ఏం చేయాలి అంటాం. వచ్చే ఏడాదికి ప్రణాళికలు వేస్తాం. ప్రాపంచికంగా మనకి అలవాటైన పని. మరి అధ్యాత్మ సాధనలో కూడా దీని తర్వాత ఏమిటి భగవంతుడ్ని అవతారమూర్తిని లేదు మహాత్ముడ్ని గురువుని సద్గురువుని జగద్గురువుని దర్శనం చేస్తాం. చేయగానే అయిపోయిందా? తర్వాత ఏమిటి అనేది ప్రశ్న. దర్శన మాత్రం చేతనే అన్నీ జరగవు తర్వాత ఏమిటి. తర్వాత ఏం చేయాలి యోగి అయిన వాడు మనోనాశనం చెందిన వాడు మనకి మార్గోపదేశం చేస్తాడు గనుక యోగి ప్రాపంచికమైనటువంటి ధర్మాన్ని అనుష్ఠాన మార్గం ద్వారా ప్రబోధం ద్వారా కంటి చూపు ద్వారా చేతి కదలిక ద్వారా నేత్రాంచలాలలో దాగినటువంటి ఒక సందేశం ద్వారా మహానిశ్శబ్దం ద్వారా మనకి directions ఇస్తారు మార్గోపదేశనం చేస్తాడు. కానీ చేస్తున్నటువంటి వ్యక్తికి ప్రాపంచికమైన దృష్టి గాని విషయ వాంఛలు గాని విషయాల పట్ల ఆసక్తి గాని విషయాలను తెలుసుకోవాలన్నటువంటి తపన గాని ఇవి ఏవీ ఉండవు. ఎందుకంటే ఇవన్నీ దాటి ఆయన యోగి అవుతున్నాడు గనుక యోగత్వంలోకి నెమ్మదిగా ప్రస్థానం చేయమంటున్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -50

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -50

Source: TFC Spiritual on YouTube

0:00 / 10:39

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

    Now playing
  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77