Skip to content
Transcript తెలుగు
[ఇంట్రో మ్యూజిక్] ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో మనము వల్లూరు శ్రీరామచంద్రమూర్తి గారితో ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. గురువు గారు. శంకరాచార్యుల గురించి కొన్ని విషయాలు చెప్తారా? ఆ, శంకరాచార్యులవారు ఆయన మూడవ ఏట, అసలు శంకరాచార్యుల వారి ఆవిర్భావానికి కారణం ఇవాళ మనం గట్టిగా చెప్పుకోవాలి. కలియుగం వచ్చిన తర్వాత కలియుగం పాప యుగంగా చెప్తారు అందరు కానీ ఇది కలిమి బలిమి కలిగినటువంటి యుగం ఇది. కాలంలో జరుగుతున్నంత భగవద్ దర్శన గాని, భగవన్నామస్మరణ గాని, భగవంతుని విశేషాలు గురించి మాట్లాడుకోవటం గాని, యుగంలోనూ జరగల. అది దాని ప్రశస్తి. అయితే శ్రీ మహావిష్ణువు ఇరవై రెండు అవతారాలు ఎత్తాలి. శివుడు పూర్ణావతారంగా రాడు. భ, బ్రహ్మ గారికి అసలు అవ, అవకాశము అవతారము రేలే లేదు. మరి ఇరవై రెండులో ఇరవై ఒకటి అయిపోయినాయి ద్వాపర యుగం వచ్చేప్పటికి. సనక సనందనాదిని మొదలుపెట్టి కృష్ణ పరమాత్మ దాకా. మరి కలియుగానికి ఎవరుండాలి? ఒక అవతారమూర్తి కావాలి కదా అంటే కోటి సూర్యమండల మధ్యస్థమైన మహా త్రిపురసుందరి దేవి బాధ్యత నేను తీసుకుంటానంది. అమ్మా ఒక్క కోటి సూర్య మండలంలో నుంచే లక్షా ఇరవై వేల మైళ్ళ దూరంలో ఉన్న కిరణం నేల మీద పడితే మేము అల్లాడిపోతున్నాం. నువ్వు ఎలా వస్తావ్ అంటే ఇలా వస్తాన లలితా రూపంలో వస్తాను అన్నది. అందువల్లనే శ్రీ లలితా కలియుగానికి అధిష్టాన పరదైవతం. అగస్త్యుల వారు హయగ్రీవుల వారు బ్రహ్మాండ పురాణంలో వాళ్ళిద్దరూ కూర్చొని అమ్మ యొక్క వైభవాన్ని వర్ణించారు. అది ఒక ఎత్తైతే మరి సరే స్త్రీ మరి పురుష రూపమేంటి? నాలో ఉన్న పుం భావమే దత్త స్వరూపంగా వస్తుంది గనుక దత్తాత్రేయుడిగా పుం, పురుష స్వరూపం లలితా దేవిగా స్త్రీ స్వరూపం వచ్చి కలియుగాన్ని నడిపిస్తుంది అని అన్నప్పుడు ప్రారంభమైంది. ప్రారంభమైతే ఈ, దత్త సంప్రదాయంలో అంశావతారాలు, కళావతారాలు, అర్చావతారాలు, ప్రభావ అవతారాలు, ప్రస్వావతారాలు అన్నీ వచ్చేసినాయి. వచ్చి కాస్త కుదుటపడే సమయంలో భారత జాతి దేవుడు ఉన్నాడు అంటూ రోజు మొదలు పెడుతుంది. దేవుడు ఉన్నాడు నాకు ఏం భయం లేదు రేపు నిద్రలేస్తాను అని పడుకుంటుంది. అంతే కదా. అటువంటి సమయంలో బుద్ధుడు వచ్చాడు. బుద్ధుడు సత్యాన్వేషణ చేశాడు. సత్యాన్వేషణలో ఏం చేశాడంటే తన శరీరాన్ని చాలా కష్టపెట్టాడు. ఉపవాసాలు, ధ్యానం. ధ్యానం అనే దాని మీద ఆయన జీవితం అంతా నిజానికి వృధా చేసుకున్నాడు. కానీ ఆయన అదృష్టం ఒకరోజున శరీరాన్ని నాశనం చేసుకుంటే నాలో ఆత్మ నాకు కనపడదు శరీరం పాపం ఏం చేసింది? అది నాకు ఆధారం అని ఎప్పుడైతే enlightenment వచ్చిందో ఆయన బుద్ధుడయినాడు. అయినప్పుడు ఆయన దగ్గర ఉన్నది పన్నెండు మంది శిష్యులు. వచ్చి ఏం ప్రకటన చేశాడంటే దేవుడంటూ వేరే లేడసలు మనలోనే దేవుడున్నాడు నీలోనే దేవుడున్నాడంటే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారంటే నాలో దేవుడున్నాడని గురువుగారు చెప్పారు కదా కాబట్టి నేనే దేవుణ్ణి. నేనే దేవుణ్ణి, నేను చెప్పిందే వేదం. నేను చెప్పింది శాస్త్రం, నేను చెప్పే, దేవుడు లేడు. దాంతో దేవాలయాలు మూతపడ్డాయి. తర్వాత నిరీశ్వర వాదం పెరిగిపోయింది. మన వేదాంతర్గతమైనటువంటి భావాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అనాచారం, అస్పష్టత సమాజాన్ని పీడిస్తున్న సమయంలో మరెవరో రావాలి కదా. అవును పరమశివుడే శంకర భగవత్పాదుల రూపంలో వచ్చారు. రావటానికి ఒక ప్రమాణం వాయు పురాణంలో శంకరులు జ్ఞానాదిత్యులై వస్తారు అని ఉంది. నలుగురు శిష్యులతో వస్తాడు. వచ్చి జ్ఞానాన్ని ఉపదేశించటానికి వస్తారు అని. కనుక ఆయన తన మూడవ ఏట సర్వ వేదాలని ధారణ చేసుకున్నాడు ఆయన. ముప్పై రెండు ఏళ్ళు వచ్చేసరికి చేయవలసిన పనంతా చేశారు. మృత్యువుని శాసించారు. నేను వచ్చిన పని అయిపోయింది మనం వెళదాం అన్నారు. సరే కైలాస పర్వతాల్లో తనను తాను involve చేసుకున్నారు. కాబట్టి ఇవాళ శంకర, ఇవాళ మనం నాలుగు మాటలు మాట్లాడుకున్నా, భగవంతుడికో స్తోత్రం చేయాలన్నా, ఒక మంచి గానం చేయాలన్నా, లేదా మంత్రం, మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేయాలన్నా దీనికి మూలం ఎవరంటే శంకర భగవత్పాదులు. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక్కసారి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన భారతీయ ధర్మాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ దేవాలయాలు తెరిచి దేవుడున్నాడు దేవుడు లేకుండా ఎక్కడుంది? కానీ దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉన్నాడన్నప్పుడు నేను దేవుడిని అనుకోవటం కాదు దేవుడిలా ఉండగలగాలి అని దాన్ని స్పష్టం చేశారు. కాబట్టి వేదాంత భాష్యాలు, ప్రకరణాలు, నూట నలభై మూడు ప్రకరణాలు రాశారు. భగవద్గీత మీద ఎందరో వ్యాఖ్యానం, అసలు వ్యాఖ్యానం రాయనివాడే లేడు కానీ శంకరుల గీతా భాష్యమే ప్రమాణం. జగత్ మిథ్య అంటారు కదా శంకరాచార్యుల ప్రకారం. ఉమ్ జగత్ కనపడతా ఉంది, అనుభవిస్తూ ఉన్నాం మనం. ఉమ్ ఒక చిన్న ముల్లు పొచ్చుకుంటే నొప్పి తెలుస్తుంది. ఉమ్ ఇది మిథ్య అని మనం ఎలా feel అవ్వాలి? సత్యమే చెప్పారు ఆయన. అంటే స, జగత్తు లేదు అని చెప్పలేదు ఆయన. కోటి గ్రంథాలలో ఉన్నటువంటి దానిని నేను ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను. జగత్తు మిథ్య. మిథ్య అంటే మనం ఇక్కడి నుంచి car లో ప్రయాణమై వెళ్తున్నాం. ఎండాకాలం అనుకోండి. వెళ్తూ ఉంటే దాహం లోపల, ఎంత AC car లో ఉన్నా దాహం దాహమే. వేస్తే నీళ్లేం లేవు మన దగ్గర. మన ముందు ఎండ మావులు పరిగెత్తుతూ ఉంటాయి. వాటిని వెంబడిస్తూ మనం వెళ్తూ ఉంటాం. నీళ్లు వచ్చినయేమో నీళ్లు వచ్చినాయని. కానీ అది ఎండ, మావి. అంతే కదా. మావి అంటే మాయ. మాయలో నీళ్లు ఉన్నట్లు భ్రాంతి కలుగుతున్నది తప్ప దాంట్లో నీళ్లు లేవు. అలాగే జగత్తు కూడా నువ్వు శాశ్వతమని అనుకోకు. ఉంది, ఎంతవరకు ఉన్నదంటే నీ మనస్సు చూడగలిగినంత వరకు, నీ బుద్ధి దానితో apply చేయగలిగినంత వరకు, నువ్వు దానిని అనుభవించగలిగినంత వరకు ఉన్నది. కానీ నీకు తెలియకుండానే నువ్వు ఎలాగైతే నీ బాల్యంలో నుంచికౌమార యవ్వన మధ్య వయస్సు ఎలా మారిపోతూ వచ్చిందో మార్పు మనం గమనించుకున్నామా గమనించుకోలే. నా birthday వచ్చింది అన్నాను తప్ప ఓకే ఇయర్ అయిపోయింది అనుకోలేదు అయిపోయిన దానికి birthday చేస్తున్నాం మనం కాబట్టి ఇదంతా మిధ్య మిధ్య అంటే లేదు అని కాదు నాస్తి అని వాడేవారు ఆయన జగన్ నాస్తి అని ఒక శ్లోకం రాసేవారు జగత్తు మిధ్య ఇది ఉన్నది అంటే ఉన్నది లేదు అనుకున్నటువంటి జ్ఞానికి అది కూడా బ్రహ్మమే కనిపిస్తున్నది ఆకు పువ్వు ఒక చిన్న గొంగళి పురుగులో కూడా ఆత్మను దర్శనం చేస్తాడు కాబట్టి ఆయన జగన్ మిధ్య అంటే జగత్తు లేదని కాదు ఇప్పుడు మీరు చెప్పారు ఏదో ఒక చిన్న దోమ కుట్టింది అది irritability అంటే శరీరం యొక్క ప్రతిస్పందన ఏదో వచ్చింది మనది కాని వస్తువు మన మీద వాలింది దాన్ని పోగొట్టడమో చంపడమో ఏదో చేయాలి అని అసంకల్పితంగా జరిగిపోతాయి but ప్రపంచాన్ని మనం శాశ్వతం అనుకుంటున్నాం ప్రపంచాన్ని వదిలేయండి మన దేహాన్ని మనం శాశ్వతం అనుకుంటున్నాం వైరాగ్య భూమికలోకి వెళితే లేదు ఇది లేదు ఉన్నంత కాలం ఉంటుంది లేనినాడు లేదు మరి భావన రావాలంటే మనకు వైరాగ్యం కూడా కావాలి వైరాగ్యం కావాలంటే వివేకం కావాలి వివేకం కావాలంటే విచక్షణ కావాలి వైరాగ్య వివేక విచక్షణలు మూడు కలిపితే దానికి జ్ఞానము అని పేరు మిగతా శాస్త్రాల మీద అధికారం పాండిత్యం పద్యాలు శ్లోకాలు ఇవన్నీ కూడా విజ్ఞానం మాత్రమే knowledge ఉంది ఆయన మంచి knowledgeable man కానీ కష్టం వస్తే తలడిల్లిపోతాడు ఇంకేం knowledge అది జ్ఞాని తలడిల్లడు స్థిమితంగా ఉంటాడు సంస్థితమై ఉంటాడు జీవితం సవాలు విసరని ఎదుర్కుంటాడు కాబట్టి శంకర భగవత్పాదులు వారిని ఆదిశంకరులని ఎందుకన్నారంటే శం అంటే శుభం కర అంటే చేసేవాడు శుభాన్ని కలిగించేవాడు శంకరుడు లోక శంకరుడు లోకానికి శుభం కలిగించాలి లోకానికి శుభం ఎట్లా కల్పించగలం అంటే విద్య ద్వారా ఆనందం ద్వారా జీవితాన్ని చక్కగా అర్థం చేసుకోవటం ద్వారా దాని యధాపూర్వ స్థితిని చక్కగా అతి వాస్తవికంగా జీవితం అంటే ఇంతే జీవితానికి అనేక పరిమితులు ఉన్నాయి జీవితాన్ని ఒక్కొక్కటి మనం దాటుకుంటూ వెళ్ళటమే ఆరోగ్యం అనారోగ్యం ఆయుష్షు ఆయుష్షు లేకపోవడం డబ్బు డబ్బు లేకపోవడం గౌరవం గౌరవం లేకపోవడం ద్వంద్వాలు అన్నీ ఉన్నాయి కానీ వీటి మధ్యలో నుంచే మనం ప్రయాణం చేయాలి చేయాలి ఇది భగవత్పాదులు చాలా వైరాగ్యంలో పరమాద్భుతమైన స్థాయికి తీసుకెళ్లారు సామాన్య మానవుడు భర్త భార్య పిల్ల ఇన్ని బంధాలతో నడుస్తున్నాడు బంధాంతీ లౌకిక లోకంలో నడిచేటప్పుడు ఇదంతా సత్యం కాదు ఇదంతా నేను శాశ్వతం కాదు నా దేహమే నేను శాశ్వతం కాదు అనే దీంట్లో బతకలేడు కదా అట్లా చెప్పలేదు భజగోవిందంలో వారు అనేది అదే మనం ఏమనుకుంటామంటే ముందు నేను శాశ్వతం నేను అంటే నా మేను శాశ్వతం నా భార్య శాశ్వతం నా భర్త శాశ్వతం అని మనం అనుకుంటున్నాం యధాస్థితిలో శాశ్వతం అని నేను చెప్పట్లేదు ఉమ్ కానీ ఉండే బంధాలను ఎట్లా మరిచిపోతాం ఆయన్ని వదిలిపెట్టమని చెప్పలేదుగా ఆయన కూడా బంధం వదిలి పెట్టారు శిష్యులు ఉన్నారుగా ఉన్నారు సంఘం అయి ఉందిగా ఉంది బోధ చేశారుగా చేశారు గురువుగారు ఉన్నారుగా చేశారు మరి ఆయన కూడా వదిలి పెట్టమని అసలు ఇంకొక గొప్ప fundamental గా ఏంటంటే భారతీయ వేదాంతం దేన్నీ వదిలిపెట్టమని చెప్పదు ఒక స్ఫురణలో ఉండమంటుంది attentive గా ఉండండి జాగ్రత్త ఇది శాశ్వతం అని అనుకోకండి అంతే తప్ప అదొక్కటే మనసులో పెట్టుకోమనండి మనసులో పెట్టుకోవాలి అంతేగాని ఒక భార్య దగ్గరికి ఒక భర్త వెళ్ళి నేనే అశాశ్వతం నువ్వు అశాశ్వతం నువ్వు అశాశ్వతం అంటే సంసారం నడుస్తుందా నడవదు అదే నేను అంటున్నది కానీ స్ఫురణ ఎలా ఉండాలంటే నడుస్తున్నంత కాలం ఇది నడుస్తుంది ఇట్లా నడుస్తున్నది రేపు ఎట్లా ఉంటుందో రేపు దానికి రూపం లేదు దాన్ని లేని దాని గురించి ఆలోచించే కంటే జరిగిపోయిన దానిలో నుంచి బాధను తెచ్చుకునే కంటే వర్తమానంలో ఆనందంగా జీవిస్తే చాలు ఆనందం అంటే అందరినీ ఆదరించటం ప్రేమించటం మనకు మనంగా ఉదాత్తంగా జీవించటం ఇది ఆనందం యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ అంటారు శంకర భగవత్పాదులు ఏదిరా ఆనందం అంటే నీ మనస్సు ఎప్పుడైతే నువ్వు కార్యకలాపం చెయ్ వ్యాపారం చెయ్ ఉద్యోగం చెయ్ అసలు ఏమీ చేయకుండా నీ ఇంట్లో నిరామయంగా కూర్చో కానీ నీ మనస్సు గనుక భగవంతుని యందు లగ్నమై ఉన్నట్లయితే అది ఒక ఆనందం ఇస్తుంది దాని పేరు నందతి ఆనందం నిలబడుతుంది నందతి మూడవది అది నిన్ను నడిపిస్తుంది నందత్యేవ అది మాత్రమే ఆనందం మిగతావన్నీ మన సుఖము సంతోషం అంతే కదా వస్తువులు ఆనందాన్ని సుఖాన్నిస్తాయి సంతోషాన్ని మనసుకు కలిగిస్తాయి అందుకనే దేహానికేమో సుఖం కావాలి మనసుకేమో సంతోషం కావాలి హృదయానికేమో ఆనందం కావాలి మూడు స్థాయిల్లో మనం సంచారం చేయవలసిందే కానీ నిత్య స్ఫురణ ఏమిటంటే నేను most impermanent క్షణాన ఉన్నా రేపు సంగతి మరుక్షణం సంగతి నాకొద్దు అని అదే వేదాంతం అదే వైరాగ్యం అది అందుకనే నా దృష్టిలో వైరాగ్యాన్ని మించిన వైభోగం లేదు దాంట్లో ఆనందం ఉంది మిగతా దాంట్లో సంతోషం ఉంది సుఖం ఉంది అనేక అనుభవాలు అనుభూతులు ఏదో తాత్కాలిక ఆనందాలు అన్నీ ఉన్నాయి కానీ ఆనందం అందుకనే మనుష్య మనీష గంధర్వ మానవ గంధర్వ దేవ గంధర్వ పితృ పిత ప్రజా పిత హిరణ్యగర్భానందాలు మనం హిరణ్యగర్భానందం వైపు వెళ్ళాలి బొమ్మను పట్టుకొని బ్రహ్మమును తెలుసుకోవాలి బొమ్మే శాశ్వతం కాదు బొమ్మ manifest అయి ఉంది వ్యక్తమై ఉంది వ్యక్తమైన దాని వెనుక ఉన్న అవ్యక్త భావన ఏమిటంటే ఇదిగో స్వాధ్యాయం ద్వారా సత్సంగం ద్వారా గురు సన్నిధి ద్వారా ప్రధానంగా అటువంటి గురువు గనుక మనకు దొరికితే జీవితం చాలా తేలిక కష్టం వచ్చినా దాన్ని ఒక బాబా గారే చెప్పారు ఒకసారి కష్టం వచ్చిందిఅంటే బెంబేలు పడకండి దాన్ని కర్మనిష్ఠగా భావించండి సర్వశక్తులు కూడగట్టుకుని క-కష్టాన్ని దాటండి అది కూడా passing cloud మేఘం కదిలి పోయినట్టు పోతుంది సుఖం కూడా అంతే వస్తుంది కాసేపు ఉంటుంది వెళ్ళిపోతుంది రెండింటి మధ్య జీవితాన్ని నడపండి ఎవరో చెప్తారు సుఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఒకే sentence లో దాన్ని రెండు వివరించిన రాయమంటే సమయము గడిచిపోతుంది అని చెప్పి రాశారంట సుఖమైనా గడిచిపోతుంది దుఃఖమైనా గడిచిపోతుంది అంటే ఎన్ని అది స్మరణ ఉండాలి అని అదే, అదే నిత్య స్పురణ దానివల్ల ఏమవుతుందంటే భయం ఉండదు రేపు ఏమవుతుందో మనకు ఏమవుతుందో ఏం కాదేమో నాకే ఎందుకు వచ్చింది అంటాడొకడు You Are Not Exception నీకు కూడా రావచ్చు నాకు మాత్రమే కావాలనటం అహంకారం కదా నాకు కూడా కావాలి తప్పులేదు వారికి వచ్చినట్టే నాకు కూడా మంచి కావాలి అనుభవం కావాలి తప్పే లేదు దాంట్లో ఇప్పుడు మన మన జీవితం మనమే రాసుకుని వస్తాం మన కర్మ ప్రకారం పూర్వ జన్మ కర్మ ప్రకారం అంటారు కదా మళ్ళీ మనం ఇక్కడికొచ్చి నాకు అది కావాలి ఇది కావాలి అనుకోవాలా లేకపోతే నాకెందుకు వచ్చింది కష్టం అని అనుకుంటున్నాం అంటున్నాం కదా దీని తెలియజెప్పే వాళ్ళు ఎవరు కర్మ ప్రకారమే ఇలా వచ్చింది ఇది తప్పకుండా అనుభవించాల్సిందే సుఖమైనా అనుభవించాల్సిందే దుఃఖమైనా అనుభవించాల్సిందే అని తెలియజెప్పే గురువులు సమాజంలో ఇంకా ఉన్నారంటారా నిజం చెప్పనా ఇది చెప్పగలిగిన గురువులు లేరు అదే నేను చెప్తున్నా అంతరంగము కన్నా అధ్యాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమగురువు గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు ఈశ్వరుడే మనకు మనమే చెప్పుకోవాలి ఇవాళ మనం ఒక స్థితిలో ఉన్నాం స్థితి ప్రపంచం దృష్టిలో మనం చాలా వైభవంలో ఉన్నాం అది--దాన్ని అనుకోనివ్వండి కానీ వైభవంలో ఉన్నవాడు ఏమనుకుంటున్నాడు important వాడు ఏమనుకుంటున్నాడంటే ఇది నేను తెచ్చుకున్నానా పై వాడో ఎక్కడున్నాడో వాడు వాడు ఇచ్చాడు నన్ను కాసేపు ఇక్కడ ఉండమన్నాడు నేను ఉంటాను ఇది కాదు అనుకున్నప్పుడు ఎక్కడో ఉండమంటాడు అక్కడే ఉంటాను కాబట్టి నన్ను ఉంచిన వాడు ఎవరంటే ఎవడో నాకు తెలియదు నాకు తెలియనక్కర్లేదు అనేటువంటి వైరాగ్య భూమికలో మనం గనక ఉండగలిగితే మనం జన్మకి ఇప్పుడు వచ్చాం చూడండి జ్యోతిష్యుడిని ఎవరినైనా మీరు అడగండి ఆయన్ని కూడా ఒక గురువు అని పిలిచి మాట్లాడితే ఏదో దీని ప్రకారం దీని ప్రకారం వచ్చినాయి దీని ప్రకారం ఇవి పోతాయి ఇవన్నీ చెప్తాడు ఏదీ కాదు మనం ఇవాళ చేసిన ఇవాళ విత్తు నాటామో మొక్కే వస్తుంది. మామిడి టెంక నేలలో పాతితే మామిడి చెట్టే వస్తుంది కదా అలాగే బంగారాన్ని కోస్తే వెండి రాదుగా బంగారమే వస్తుందిగా కాబట్టి మన కర్మానుభవాలు గతించినటువంటి జన్మలు అంటే సనాతన ధర్మంలో పునర్జన్మలు ఉన్నాయి ఉన్నాయి మిగతా వాటిల్లోలో పునర్జన్మలు లేవు మనకుంది కాబట్టి ఉన్నదాన్ని నమ్ముకుని గనక మనం మాట్లాడినట్లయితే ఏవో కొన్ని మంచి పనులు మనకు తెలియకుండానో తెలిసో చేసాం conscious గా ఇక్కడికొచ్చాం "బహూనాం జన్మ నామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" భగవద్గీత. ఆయన అంటాడు అనేక జన్మల చివరన వేళ జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఏమిటి గురువు అంటే ఏమిటి అసలు గురు సన్నిధి ఏమిటని అడుగుతున్నావు అంటేనే నువ్వు పరమ చర్మమైన స్థాయికి వచ్చావు కానీ క్రితం జన్మలో నువ్వు అడగలా కానీ ఇవి అడగటానికి కావలసిన అన్ని అర్హతలు ఇప్పటికి సంపాదించుకున్నావ్ సంపాదించటం ఎలా సంపాదించాం "న కర్మణా ప్రజయా ధనేన చాగేనైకే అమృతత్వమానశుహు" డబ్బు వలన గానీ జన ప్రవాహం జనబలం చేత గానీ అనేక సత్కర్మలు చేత గానీ నువ్వు అమృత పుత్రుడివి కాలేవు ఇది వేదం చెప్పింది ఎలా అవుతాయంటే "చాగేనైకే అమృతత్వమానశుహు" త్యాగం వలన త్యాగం అంటే చందా, దానం కాదు కదా త్యాగం అంటే అహంకారం మమకారం విసర్జితమైన భావనే త్యాగం నేను దేహము మాత్రమే కాదనుకోవాలి నేను దేహమే నేను దేహం కాదు అంటే తప్పది ఉందిగా నేనున్నా శరీరమాజ్యం ఖలు కర్మ సాధనం శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం మంచి కర్మ చేయాలి శరీరం కావాలి ప్రశ్న వేయాలి మీకు శరీరం కావాలి జవాబు చెప్పాలి నాకు శరీరం కావాలి ఇది ప్రపంచానికి చూపించాలి అందరికీ శరీరం కావాలి కాబట్టి శరీరము కాదు కాదు నేను శరీరము మాత్రమే కాదు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవన్నీ కూడా క్రితం జన్మలో వీటిమీద ఆలోచన చేసి తదనుగుణంగా గనక మంచి జీవితాన్ని గడిపి ఉన్నట్లయితే దాని ఫలితమే మనకి ఒక జన్మ ఇవ్వబడుతుంది ఇప్పుడు జన్మలో ఏం చేయాలంటే మాత్రం స్పురణ ఉంది కాబట్టి పొరపాటు చేయకూడదు దీని తర్వాత జన్మే లేని స్థితి అది తర్వాత తర్వాత తర్వాత కానీ అందరికీ గురువు లభించి ఇది చెప్పలేరు కదా అప్పుడు వాళ్ళు మార్గంలో వెళ్ళాలి గురువు అనేవాడు ఇది చెప్పాలి గురువు అందరికీ దొరకడు కదా గురువు దొరికించుకుంటాడు ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది మీకు ఒక పాయింట్ ఏమిటంటే గురువును మీరు వెతుక్కోలేరండి అదొక ఎండమావి గురువు అంటే గురువు రావాలి గురువు తనంతట తాను వెతికి వెతుక్కుంటూ వస్తాడు రావాలి రావాలి వచ్చి ఇదిగో వ్యక్తికి నేను మార్గం చూపించాలి చక్కని సన్మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు నేను వెళ్ళి నాకు తోచిన మంచి మాటలు స్పష్టంగా మభ్యపెట్టకుండా లేదు మీరు ఇదిగో మంత్రం చదివేసేయండి అన్నీ అయిపోతాయి ఏమీ కాదు బాబా గారిని ఒకాయన అడిగారు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటున్నారు స్వామి బయట పుటపర్తిలో మంత్రాలకు చ--ఆయన మరి రాయలసీమ rustic personality ఆయన ఏమన్నారో తెలుసా ఏముంది చింతకాయలు కొట్టడానికి మంత్రాలు ఎందుకు నాను రాలు చాలుగా తప్ప అన్నారు అయిపోయింది [నవ్వు] అది కాబట్టి మంత్రము తంత్రము యంత్రము ప్రపంచంలో ఇమిడి ఉన్నాయి సందేహం లేదు అయితే సామాన్య మానవుడు ఎవరు అనేది ప్రశ్న ఎవరు సామాన్య మానవుడు బాగా ఇప్పుడు భ-భజగోవిందంలో ఆయన అంటాడు మూఢమతే అంటారు ఎవరు మూఢమతే అంటే చదువులేని వాడు కాదు నేను బాగా చదువుకున్నాను అన్నవాడిని మించిన మూఢమతి మరొకడు లేడు అసలు నాకు అన్నీ వచ్చు నాకు మాత్రమే వచ్చు అన్నవాడు వాడు గురువు కాడు విజ్ఞాని కాదు అహంకారి అంతేకాబట్టి ఇక్కడ సామాన్యున్ని ఇవాళ గురువులు అనేటువంటి వాళ్ళు వెతుక్కొని దగ్గరకు వెళ్ళాలి రోజుల్లో వెళ్లారా? రోజుల్లో వెళ్లారు పాద పాద యాత్ర దేశ పర్యటన చేసేవాళ్ళు చేసారు కానీ ఇప్పుడు ఆరాట పోరాటంలో ఉండే మనిషికి సమయమే లేదు. ఇంతకుముందు ప్రతి ఒక్క మనిషికి ఆరాట మీరు చెప్పిన ఆరాట పోరాటాలేమో మనిషికున్నాయి ఉన్నాయి ఆరాట పోరాటాలేమో గురు స్వరూపాలకు ఉన్నాయి ఉన్నాయి మరి గురువు గారికి అన్నీ కావాలి ఎట్లా? మరి దీన్ని దాటాలి కదా! నిజ ఇప్పుడు రమణ మహర్షి ఏంటి యాభై రెండు డిగ్రీల బండరాయి మీద కూర్చుని ఆయన హాయిగా ధ్యానంలో ఉన్నారు. ఇవాళ ఏసీ రూమ్ లో ధ్యానం నేర్పుతా ఉంటున్నారే, అంటే చల్లదనం ధ్యానం నుంచి రావాలి గాని ఏసీ నుంచి చల్లదనం రాకూడదు కదా! అంటే ఇక్కడ వస్తువు మీద ఆధారపడుతున్నాడు. అట్లా ఇవాళ మనం మంచి గురు సన్నిధి యొక్క శక్తిని మాట్లాడుతున్నాం కాబట్టి గురువులు ప్రపంచంలోకి రావాలి. ముందు వాళ్ళు బాగా చదవాలి, జీవితాన్ని కాచి వడగట్టాలి. జీవితాన్ని దాటి ఇంకోటి లేదు. ఏదున్నా జీవిత పరిధిలోనే. చెప్పేవాడికి జీవితం ఉంది, వినేవాడికి జీవితం ఉంది. వీడికి ఇబ్బందులు ఉన్నాయి, వాడికి ఇబ్బందులు ఉన్నాయి. ఉన్నాయి కదా! మరి గురువుగారు ఏం చేయాలంటే వెళ్ళవలసిన చోటికి తాను నిరపేక్షంగా వెళ్ళాలి. నేను కాసేపు మాట్లాడతాను నాకు యాభై వేలు ఇవ్వండి అంటే వాడు ఎగురువు అవుతాడు. కాదు కదా! వెళ్లి త్యాగం చేయాలి. తనకున్న జ్ఞానాన్ని ప్రపంచాన్ని చక్కగా బోధించాలి. దానికి కేవలం moral philosophy చెప్తే ప్రయోజనం లేదు. దాన్ని తన జీవితంలో తాను ఆచరించి ఉండాలి. కాబట్టి వీటన్నింటినీ గనక సమన్వయం చేసుకున్నట్లయితే ఇవాళ సామాన్యున్ని కూడా ఒక ఉదాత్త స్థాయికి మనం తీసుకెళ్లగలుగుతాం. దానికి గురువు గురుస్థానీయుడు అందుకనే రెండు పదాలున్నాయి. వారు గురుస్థానీయులు అంటాం, ఈయన గురువుగారు అంటాం. గురుస్థానీయుడు అంటే అక్కడి దాకా వెళ్ళాడు అని. గురువు ఎవరంటే అక్కడికి వెళ్లి ఉన్నాడు అని అర్థం. వెళ్లి ఉన్నాడు. గురువుగా ఉన్నాడు. గురువుగా అంటే నా గురోరధికం గురువును మించి అధికం ఏదీ లేదు నా గురోరధికం నా గురోరధికం శివ సాంద శివ సాంద శివ సాంద అంతే కదా! ఉమ్ కాబట్టి గురువును మించిన మరొక పెద్ద వస్తువు అంటూ ఏం లేదు. గురువు ఎక్కడున్నాడు అంటే ఆత్మజుడై ఉన్నాడు, లోపలున్నాడు. లోపల ఉన్నటువంటి ఆంతరంగికమైన గురువుని గనక మనం ప్రతిరోజూ ఆలకించగలిగితే, మీరు ఏకాంతంలో కూర్చోండి మీ ఇంట్లోనే మీ అంతర్వాణి మీకు వినిపిస్తుంది. మీరు చేస్తున్నది right wrong అది చెబుతుంది. మన అహంకారం వల్ల మనం path మనం ఎన్నుకొని వెళ్ళిపోతుంటాం. కాబట్టి మానసికమైన training గురువు ఇవ్వాలి. శాస్త్రాధ్యయనం ఒక ఎత్తమ్మా, వేదాధ్యయనం ఒక ఎత్తమ్మా. దాని వల్ల వాతావరణ కాలుష్యం పోతుంది తప్ప గురువు అనేటువంటి వాడు సర్వ శక్తిమంతుడై ఉండాలి. అందరినీ నడిపించగలిగిన నాయకుడు ఆధ్యాత్మిక నాయకుడై ఉండాలి. నాయకత్వంలో తనను తాను పోగొట్టుకున్న యుద్ధంలో ముందు ఎవరు పోతారు? మనుష్యులు కాబట్టి అదే రా రాజవిద్య, అదే ఆత్మవిద్య, అదే శ్రీవిద్య, అదే బ్రహ్మవిద్య. సో వీటన్నింటినీ కూడా ఇవాళ గురువులు మేమున్న చోటికి మీరు రండి కాదు. ఎవరికి కావాలో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. కాస్త ఇబ్బంది అననుకూల ఇవాళ ఇప్పుడు వ్యవస్థలన్నీ కూడా దెబ్బతిన్నాయి ఉమ్ వివాహ వ్యవస్థ దెబ్బతినింది, కుటుంబ వ్యవస్థ దెబ్బతినింది, ఆదాయ వ్యవస్థ దెబ్బతినింది. ఇన్ని వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు మనిషి దానికి importance ఇస్తాడే గాని సాధ్యాయానికి importance ఇవ్వడు. సాధ్యాయం చదవకపోతే అతనికి జ్ఞానం రాదు. మరి ఎలా అతను ఇదవుతాడు? అంటే స్వాధ్యాయం చేసినటువంటి వాడు బాధ్యతను తను తీసుకోవాలి. సమాజం నీకు అవకాశం ఇచ్చింది స్వాధ్యాయం చేసుకోవటానికి, వెసులుబాటు కల్పించింది మరి సామాన్య మానవుడు ఎలా తేరుకుంటాడు, ఎలా వస్తాడు పైకి? సామాన్య మానవుడికి కూడా కోరిక ఉండాలి. కోరిక ఉండాలి అంటే నేను జన్మ-- నేను దీంట్లో పుట్టాను, నేను సామాన్యుడిని, నాకు పెద్ద చదువులు లేవు. కానీ ఆయన మహానుభావుడు చాలా విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర అన్నప్పుడు ఇతను ఆయన దగ్గరికి వెళుతూ ఉండాలి. మనం అందదులే, ఆయన ఎవరో మా పండితుల కోసం, కవుల కోసం, మహాత్ముల కోసం, VIP కోసం, VVIP కోసం ఉన్నాడని అనుకోని వీడు ఇక్కడ నేను అసలు వచ్చింది వాళ్ళ కోసం కాదు వీళ్ళ ప్రాపకం కోసం వచ్చానని వీడు అనుకున్నట్లయితే అనుసంధానం కాదు. నేర్చుకోవాలి అన్న జిజ్ఞాస నాకు ఉండాలి basic గా. ఉన్నప్పుడు గురువును నేను ఎప్పుడూ చెప్తా గురువు తోడు చుక్క శిష్యుడే గొప్పవాడు. గొప్పవాడు అంటే వాడు కాగి కాగి ఉన్నాడు. చిన్న మజ్జిగ చుక్క దాంట్లో వేస్తే రాత్రి ఆపితే గడ్డకట్టిపోతుంది, పెరుగు అయిపోతుంది. అంటే ప్రేరకుడు catalyst అంటాం. ప్రేరకుడు ఎవరంటే గురువై ఉండాలి. మనల్ని చివరిదాకా నడిపించగలడు గాని మోక్షం వైపో, మరణానంతర సుఖం వైపో గురువుగారు కూడా తీసుకెళ్లలేడు. కానీ మార్గం చెప్పాలి. గురితో చూపించిన వాడే గురువు అవుతాడు. గురి కల్పించగలిగిన వాడే గురువు అవుతాడు. కాబట్టి ఇవాళ నా దృష్టిలో గురువులది బాధ్యత ఎక్కువమ్మా. ప్రవచనం చేసేవాడు విజ్ఞాని. తనకున్న జ్ఞానాన్ని చక్కగా నలుగురికి చెప్తున్నాడు, అంతవరకే. జ్ఞాని ఎవరంటే ఇటు శాస్త్రము చెప్తాడు, అటు జీవితము చెబుతాడు. రెండింటినీ నడిపించేటువంటి శక్తి అయినటువంటి దైవాన్ని గురించి చెప్తాడు. అన్నింటికంటే మనం గడుపుతున్న జీవితాన్ని గురించి చెప్తాడు. అతడు సర్వోత్తమమైన గురువు. శంకర భగవత్పాదుల భజగోవిందం అంతా అదే. దాని నిండా జీవితాన్ని గురించే మాట్లాడారు. సంసారం గురించి చెప్పారు. కాతే కాంతా కస్తే పుత్రః కుతాయాతః అంటాడు. ఎవరు భార్య, ఎవరు పిల్లవాడు? వీళ్లంతా ఎక్కడినుంచి వచ్చారు? అంటే స్వగతం. అంటూ వీళ్ళందరూ వచ్చారు కానీ ఉండనివ్వండి. నాతో సహచరుడిగా ఉంటాడు నాతో నేనొక్కడినే కాదు, ఒంటరివాడిని కాదు. నా భార్య నడుస్తోంది, మేమిద్దరమే కాదు నా కడుపున పుట్టిన బిడ్డ కూడా నడుస్తున్నాడు అని కలుపుకొని వెళ్ళమని చెప్తారు ఆయన. అంతేతప్ప భార్య వద్దు, పిల్లవాడు వద్దు, సంసారం వద్దు అని చెప్పలే. శంకర భగవత్పాదులు గారే ఇంత వేదాంతము, ఇంత బ్రహ్మసూత్రాలు రాసినాయన మళ్ళీ అన్ని దేవుళ్ళకి అష్టోత్తరాలు అన్ని పూజలు చేయమని చెప్పారు.అంటే పూజ చేస్తూ ఉంటే మనిషికి గురువు అనేది వస్తాడా లేకుంటే పూజ దాటి జపం జపం నామస్మరణలోకి వెళితే అతనికి గురువు అనేది వస్తాడా? దీన్లో చాలా జటిలమైనటువంటి విషయం ఏంటంటే పూజాతే విషయోపభోగ రచన పూజలన్నీ కూడా అసలు విషయానికి ఉపభోగాలు. పూజ ఎందుకు చేయాలి విగ్రహారాధన ఎందుకు చేయాలి అంటే మనో నిగ్రహం కోసం చేయాలి. విగ్రహానికి అలంకారం ఎందుకు చేయాలి అంటే మనకు ఆనందం కలగటం కోసం చేయాలి. కర్పూర నీరాజనం ఎందుకు ఇవ్వాలి అంటే మనల్ని మనం సమర్పించుకొని చివరికి ఇంతే కదా. ఇంతై నేను జ్యోతై జ్యోతి కూడా ఆరగా మిగిలింది నేను కదా కాబట్టి నేను నిశ్శేషమైపోతా అంటే అంతరార్థాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయవలసిందే. పూజ, ధ్యానము, తపస్సు, అజపము ఇవన్నీ కూడా వరస. ఇవన్నీ చేస్తూ చేస్తూ వెళ్ళగా మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ వెళ్ళగా పైకి వెళ్ళగానే మొదటి మెట్టుతో మనకు సంబంధం లేదు ఇంకా. అవన్నీ నెమ్మదిగా వదిలి పెడతాం. అందుకనే పూజ చేసే వాడి సగుణోపాసన కోసం స్తోత్రాలు రాశారు. సగుణోపాసన ఇప్పుడు కృష్ణ పరమాత్ముని గురించి రాయాలి చెప్పాలి జిహానం జిహానం సుజనేన మౌఖ్యం దుహానం దుహానం సుదీర్ఘైరపాంగ ఇవన్నీ చదువుతాం. అంటే ఏంటి మా కృష్ణుడు ఇలా ఉన్నాడు వేణునాదం ఇట్లా ఉంది ఆకాశం అవని కలిసినంత గా ఉన్నాడు మహానంద సర్వస్వమైనాడు ఇవన్నీ అనుకుంటూ ఉంటే భావం చాలా సాత్విక భావం అవుతుంది. కనుక పూజలు ఉండాలి వ్రతాలు ఉండాలి దానధర్మాలు ఉండాలి అయితే ఇవి మాత్రమే కాదు. దీని తర్వాత మౌనంలోకి వెళ్ళాలి. నామస్మరణలోకి వెళ్ళాలి నామస్మరణ జపము అజపము తపస్సు ఒక నామస్మరణ వల్ల నామం ఇప్పుడు కృష్ణుడి గురించి మీరు నామస్మరణ చేస్తే కృష్ణ స్వరూపం అంతా కనిపిస్తుంది కృష్ణ భావం అంతా కనిపిస్తుంది. అలాగే లలితా సహస్ర నామం చదువుతున్నప్పుడు మీరు రాజరాజార్చితా రాజ్ఞి రంజా రాజీవ లోచనా రంజని రమణి రశ్య రణత్కింకిణి మేఖలా అనంగానే అమ్మవారి యొక్క విరాట్ మూర్తి భువనేశ్వరీ మంత్రం మనకి ఆవిష్కృత అవుతుంది ఆనందం కలుగుతుంది. అయితే ఆనందం నుంచి అది మానసికమైన ఆనందం దాని నుంచి మనం గనక ఇంకాస్త ముందుకు వెళ్లగలిగినట్లయితే వయస్సు వస్తుంది ఉదాహరణకి మనకు ఒక తొంబై ఏళ్లు వచ్చాయి అనుకుందాం మాట్లాడగలమా? పరిగెత్తగలమా? కొండను నడిచేస్తామని ఎప్పుడైనా ధైర్యంగా మొక్కగలమా? చేయలేం కాబట్టి ప్రతిదానికి ఒక వయస్సును బట్టి అనుభవాన్ని బట్టి కర్మ పరిపాకాన్ని బట్టి జ్ఞాన సంపత్తిని బట్టి జీవుడు తనను తాను మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకానొక రోజున ఇవేవీ లేకపోయినా ఈశ్వరుడు నాయందున్నాడు. శంకర భగవత్పాదులు రెండే కాదు పూజలు చెప్పారు సగుణోపాసన నిగుణోపాసన అదే చెప్పారు ఇదే చెప్పారు అదే చెప్పారు చెప్పి మధ్యలో ఇంకోటి చెప్పారు ఏనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినా సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం అన్నాడాయన. ఇంత చెప్పినటువంటి ఆయన ఒక హేతువాదిలాగా చెప్పారు ఆయన. హేతువాది శ్లోకం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను నేను ఏం చేశాను నాకు ఇదిగో పాడే శక్తి ఉంది మాట్లాడే శక్తి ఉంది నలుగురికి బోధించే శక్తి ఉన్నది నలుగురికి ఆనందం కలిగించే శక్తి ఉన్నది ఉన్నట్లయితే దాన్ని గనక నువ్వు ప్రకారంగా ఏన కేనా ప్రకారేణ యస్య కస్యాపి దేహినా నీకున్న ప్రజ్ఞ ద్వారా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి గనక ఆనందం కలిగించగలిగితే అది మాత్రమే శివపూజ అన్నాడాయన. శివపూజ అంటే మళ్ళీ అర్చన ఆరాధన ఇవన్నీ పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే అవి ఉండాలి కానీ సర్వోత్తమమైనటువంటి అధ్యాత్మ సంపద ఏదంటే సేవ. సేవ చేయాలి చూపించారు demonstrate చేశారు మామూలుగా కాదు. నూట ఎనభై ఎనిమిది దేశాలలో జాతులు లేవు మతాలు లేవు వర్గాలు లేవు వర్ణాలు లేవు అందరినీ అక్కున చేర్చుకొని ఆయన అద్భుతంగా ఇదిగో ఇలా చేయగలిగారు, చేయండి మీరు కూడా. ఆయన చేసినంత చేయలేమని అనొద్దు. ఇవి చేశారు గనుక ఆయన దేవుడైనాడు. ప్రతి మానవుడికి అవకాశం ఉంది కానీ మనం ప్రలోభం చేత మాయ చేత మనకుండే పరిమితమైన శక్తుల చేత సమాజాన్ని దగ్గర చేర్చుకోలేని ఒక అసహాయత వల్ల ఏదో చేసిందే చాల్లే ఇంతవరకు అనుకుంటాం. చేయాలి అని గనుక సంకల్పించినట్లయితే నిజానికి సంకల్పమే శక్తి. శక్తికి దేవీదేవతల అనుగ్రహాలు అవన్నీ direct గా మనకొచ్చి వాళ్ళు చెప్పరు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం భగవంతుడు silent listener ఆయన వింటూనే ఉన్నాడు ఇవన్నీ. నా గురించి వీళ్ళు తాత్వికంగా ఇది కూడా మాట్లాడుకుంటున్నారా? గురు సన్నిధి అంటే ఇట్లా ఉంటుందా? గురు సన్నిధిలో ఇంత బలం ఉన్నదా? అని ఇవాళ తరం వాళ్ళు కూడా గురువును వెతుక్కుంటూ వెళ్ళాలి. గురువు కూడా నిజమైన శిష్యుడు కోసం ఆయన కలిసి రావాలి. వస్తాడు. నా జీవితం ఉదాహరణ. అరుణాచలం ప్రదర్శన చేస్తే తప్పకుండా గురువు దొరుకుతాడని ఒక నానుడి ఉంది. తప్పకుండా దొరుకుతాడని. ఖచ్చితంగా. అందులో పధ్నాలుగు kilometerలు మనం నడిచి వెళుతూ ఉన్నప్పుడు వచస్యేకమ్ మనస్యేకమ్ కర్మణ్యేకమ్ మహాత్మనః అరుణాచల గిరి ప్రదక్షిణం అయ్యేప్పటికీ ఏం మాట్లాడుతున్నామో ఏం ఆలోచిస్తున్నామది మాట్లాడతాం. ఏం మాట్లాడుతున్నామో పని చేస్తాం. మూడు ఏకమైనప్పుడు మహాత్ముడవుతున్నాడు. తనలో ఉన్న ఆత్మ దర్శనాన్ని అతను చేసుకుంటాడు. అప్పుడు ఇంకా కొద్దిగా మిగిలింది అనుకుందాం ఇప్పుడు రమణ మహర్షి ప్రస్తావన వచ్చింది గనుక రమణ మహర్షి దగ్గరికి పరమహంస యోగానంద, శివానంద, మన నారాయణ గురువు, జిల్లాల్లమూడి అమ్మ వీళ్ళందరూ వెళ్లారు. ఎందుకు వెళ్లారు వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో గొప్పవాళ్ళు కదా అంటే అసలుది కనిపెట్టాలిగా. తమ తమ వచ్చినటువంటి సాధన పరిపూర్ణమని తెలియాలి అంటే అసలుది అక్కడ ఉంది. అక్కడికి వెళ్లగలిగారు. రమణ మహర్షితో మనకేం పని అని వాళ్ళు అనుకోలా. పరమహంస యోగానంద్ వస్తే కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని ఏమన్నారంటే అఖండ తేజో రాశి వెలిగిపోతుంటే ఇక్కడ మీరు కళ్ళు మూసుకు కూర్చున్నారేమిటి వారిని చూడండి అన్నాడు. వారిని చూడటం అయిపోయింది నన్ను నేను చూసుకోవటానికి కూర్చున్నానన్నారు.అంటే అటువంటి వాళ్ళు కూడా అక్కడికి చేరుతారు. ఎందుకంటే confirmation కావాలి. సాధన correct గా ఉందా లేదా? దీనికి ఎవరు certify చేయగలరు? "దైవో భూత్వా దైవం యజేత్" అని ఒక మాట ఉందమ్మా. అంటే దైవాన్ని గురించి పరమాద్భుతంగా వర్ణన చేసేటువంటి వాడు కాదు. వాడు హరికథకుడు చెప్తాడు, బుర్రకథ చెప్పేవాడు చెప్తాడు, పల్లెల్లో చెప్పరా? వాళ్ళు ఇంతకంటే బాగా చెప్తారు. సామాన్య జనులను ఉత్తేజపరచగలగడానికి వాళ్ళని తీసుకెళ్ళి గజేంద్రుడు గజేంద్రమోక్షంలో involve చేస్తారు. కానీ దైవాన్ని గురించి ఎవరు చెప్పగలరు అంటే దైవత్వాన్ని, దివ్యత్వాన్ని పొందిన వాడు మాత్రమే చెప్పగలడు. ఎందుకని? అతడు దర్శనం చేశాడు. అనుభూతిని తనదిగా చేసుకున్నాడు. ఇన్ని కారణాల వలన ఆయన చెప్పేటువంటి వాక్కుకి చాలా బలం ఏర్పడి ఉంటుంది. మీరు ఇంకొకటి కూడా రాశారు శంకర భగవత్పాదుల రాసిన యోగతారావళి. యోగతారావళి. Yes. దాని గురించి కొంచెం నూట ఇరవై సంవత్సరాల తర్వాత పుస్తకం గురించి రాయవలసిన యోగం నాకు కలిగింది. నాకు అంటే ఉపాధికి కలిగింది. యోగతారావళి అంటే తారావళిలో కొన్ని కోట్ల నక్షత్రాలున్నాయి ఖగోళంలో. కానీ సంఖ్యాశాస్త్ర జ్యోతిశ్శాస్త్ర ప్రకారం ఇరవై ఏడు నక్షత్రాలను మనం నిర్ణయం చేసుకున్నాం. నిర్ణయించుకున్నాం. అశ్విని నుంచి చివరిదాకా. కాబట్టి ఇరవై ఏడు శ్లోకాలలో యోగవిద్యని మొత్తం చెప్పేశారాయన. అంటే నాదానుసంధాన యోగం ఏంటి? లయ యోగం ఏంటి? హఠ యోగం ఏమిటి? ఉమ్మని యోగం ఏమిటి? మనోన్మని యోగం ఏమిటి? యమనస్క ముద్ర ఏమిటి? కేవల కుంభకం ఏమిటి? రాజ యోగం ఏమిటి? ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్లారు ఒక్కొక్క శ్లోకం. అది మనం గనుక దాన్ని శ్రద్ధగా చదివినట్లయితే, ఎందుకంటే నేను పుస్తకంలో శ్లోకానికి అర్థం రాయలా. శ్లోకానికి అర్థం రాస్తే ఇరవై ఏడు into ఒకటి ఇరవై ఏడు పేజీల పుస్తకం అయ్యేది. ప్రయోజనం లేదు. శరీరాన్ని మనం ఆధారం చేసుకుని ఒక్కొక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ వెళితే you realise yourself. మీ ఆత్మను మీరు గ్రహించగలుగుతారు. ఆత్మను పట్టుకోవటం, పరిగెత్తటం, యాతన పెట్టడం ఉండదు. చిట్టచివరికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెడతారు. ఇంద్రియాలను జయించటం గొప్ప కాదు. జయించిన ఇంద్రియాలతో జీవించగలగాలి. ఇవన్నీ కూడా దాంట్లో మహా రహస్యాలున్న యోగతారావళి. అని ఆయన పేరు. అందుట్లో రాజయోగం అని కుంభక యోగం మనం రమణ మహర్షి విషయంలో వింటాం. ఆయనకి cancer వస్తే anaesthesia లేకుండా సంభవమేనా? సంభవమే. అదే కేవల కుంభక యోగం. సదాశివ బ్రహ్మేంద్రుడు వారి చెయ్యి తెగిపోయినా వారు గనుక గాలిలో నడిచారు. చెప్పుకుంటూ నడిచారు. చతుకుంది. ఇది science కి అందనిది ఇది. అందనిది. అంటే ఏమిటి? శరీరంలో ప్రాణాలు జైల్లో పెడితే కూడా మళ్ళీ బయటకు వచ్చేశారు. బయటకు వచ్చారు. కుంభకం చేశారు. కాబట్టి కుంభక యోగంలో ఏంటంటే మనం కూడా గనక స్థాయికి ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యం కాదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు pre qualified ఉన్నాడు. కానీ వాడి ఆలోచనలు దేని వెంట వెళుతున్నాయి, ఏం కావాలని కోరుకుంటున్నాయి దాన్ని బట్టి జీవితమంతా ప్రతిక్షణం గడిచిపోతుంది. మరి వాళ్ళు అలా అనుకోలే. రమణ మహర్షి ఆయన అరుణాచలానికి వచ్చి పొందిన ఆత్మానుభవాలేం లేవు. పొందిందంతా తిరుచుళ్ళిలో పొందారు. పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదిగో ఇట్లా ఉండవచ్చు. మరణించేది మరణించేది మరణం అంటే మార్పు. మార్పు శరీరానికే తప్ప లోపల అఖండ చిద్ఘన రసమైన ఆత్మకు లేదు. ఇదిగో ఆయనొకాయన వచ్చి మీరు మృత్యుంజయులు అన్నారు. మాట ఎప్పుడూ వాడకండి. మృత్యువుని ఎవ్వరూ జయించలేరు. మృత్యు భావనను జయించాలి. మృత్యు భావన పోతే దుఃఖం లేదుగా. త్రయంబక మంత్రం అంతా అర్థం అదే కదా. అంతే కదా. దోసకాయ ప-- ఎట్లా పండు ఊడినట్టు ఊడిపోవాలి అని అంతే. అదే మనకు మృత్యుంజయ మహా మంత్రం అంటే అదే కదా. మంత్ర భావన అదే. మీరు ముగ్గురు గురువుల దగ్గర అంటే అమ్మ దగ్గర, సాయి దగ్గర, రామ-రామన్నని మీరు తత్వంగా మీరు లోపల మీరు అనుభూతి చెందారు. అవును. సో ముగ్గుర్నీ మీ ముగ్గురు గురు సన్నిధిలో మీ యొక్క అంతరంగ ప్రభావం ఏంటి? చాలా-- ఎంత మంచి ప్రశ్న వేశారండి మీరు. చాలా మంచి ప్రశ్న వేశారు. రఘువరదాసు గారి నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే రుచి లేకుండా బతకగలం, బతకాలి. భౌతికమైనటువంటి పదార్థం నుంచి వచ్చే రుచి కంటే నామ సంకీర్తనంలో నుంచి, నామస్మరణలో నుంచి భగవంతుడి యొక్క ఉదాత్త వైఖరిని అనుభవించవచ్చు. ఎప్పుడైతే ఆనందాన్ని అనుభవించామో వస్తుపూర్వకమైన ఆనందాలు ఇవి ఆనందాలు కానే కావు. అది వారు నాకు నేర్పారు. అలాగే రెండవది గురువు సౌశీల్యవంతుడై ఉండాలి. character conduct. మైదానంలో ఒక రకంగా మందిరంలో ఒక రకంగా ఉండటానికి వీల్లేదు. జీవితం open గా ఉండాలి. తెరిచిన పుస్తకమై ఉండాలి. పరిచిన వెన్నెలై ఉండాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. ఎవరన్నా ఏదన్నా అడిగితే చెప్పగలిగిన శక్తిని సంపాదించి ఉండాలి. దీని వలన నాకేమిటి లాభం ఉన్నవాడు వాడు గురువు కాడు. అట్-- అనేది ఆయన నుంచి నేను నేర్చుకున్నా. వారితో పాటు ఒకటి రెండు చోట్ల భిక్షకి నన్ను వెంబడి పెట్టుకొని వెళ్లారు. అంటే వారిని ఇంటికి పిలుస్తారు. మా ఇంట్లో భోంచేయాలి. వెళ్తారాయన. పక్కనున్న వాళ్ళు గు-గురువు గారికి ఇది ఇష్టం, ఇది ఇష్టం, ఇది ఇష్టం అని చెప్తారు. వీళ్ళు అడుగుతారు పాపం గృహస్తు ఏం పెట్టాలి మాకు తెలియదు కదా అని అడుగుతారు. వాళ్ళు ఏదో చెప్తారు. రఘువరదాసు గారు ఒక మాట అనేవారు. ఇవన్నీ ఇష్టం అని ఎప్పుడన్నా మీకు నేను చెప్పానా? మీకు ఇష్టమైనవన్నీ వాళ్ళ మీద రుద్దుతున్నారే. వారు ఇంట్లో అమ్మ ఏం పెడితే నేను అది తిని బయటకు వస్తా. దీన్నే మనము నడిచే ఏమో శంకర-- శంశేఖర్ చ- శంశేఖర్. జీవితంలో పోయి హరస్ జీవితంలో కూర్చొని చూస్తాం మనం. అవును. ఆయనకి ఆకుకూర అంటే ఇష్టం అని చెప్పి తోటకూర. తోటకూర. వాళ్ళ పక్కనుండి ఆయన చెప్పాడని రోజూ కొంతమంది తోటకూర క-తీసుకొని వచ్చి ఇచ్చేవాళ్ళంట. ఎందుకు చెప్పాననుకున్నాడో ఆయన. లాస్ట్ కి ఆయన్ని అడిగారంట. ఎందుకు రోజూ వండుతున్నావ్ అంటే భక్తులు కట్టలు కట్టలు తెచ్చిస్తున్నారు అందుకని అండి. ఇది ఎట్లా బయటకు వచ్చిందంటే నేనే చెప్పాను ఏమిష్టం అంటే తోటకూర పప్పు ఇష్టం అని అన్నానంటే లాస్ట్ లో నన్ను తోటకూర పప్పు స్వామిని చేశామనేసి చేశారు. అవును. మూడు రోజులు ఆయన ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉన్నారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. Correct, correct. అది నేను రఘువర వ్యాస్ దాసు గారి దగ్గర. తర్వాత ఎవరైనా ఏదన్నా గు-గురువు అంటే గురువుకి దక్షిణ ఇస్తారు. ఇది దేశ సంప్రదాయం.అది పత్రం పుష్పం ఫలం తోయం అది భగవద్గీతలో అదే చెప్పాడు పాకెట్లోకి వచ్చాడు గనుక పల్లెలో కాళ్లు పెట్టాడు గనుక రెండు లక్షలు ఇవ్వమని ఎక్కడా లేదు కదా లేదు పత్రం పుష్పం ఫలం తోయం సరే రఘువరదాస్ గారికి ఎట్లా ఎవరైనా రోజుల్లో ఏముందమ్మా పది రూపాయలు అక్కడ ఇస్తే మరి దాన్ని తాకేవారు కాదు అవి తీసుకుని హనుమాన్ చాలీసా ప్రింటింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఇచ్చేసేయండి అనేవారు లేకపోతే ఇంకేదో పుస్తకం దానికి ఇచ్చేసేయండి అవి నేను కాపలా కాయలేను అనేవారు అది తీసుకుంటారు డబ్బాలో పెట్టానా పుస్తకంలో పెట్టానా ఎక్కడ పెట్టానో అదే ఆలోచన అందుకనే ఆయన ఆయన నుంచి నేను చాలా నిజాయితీతో చెప్తున్నాను నన్ను చాలా ప్రభావితం చేసింది నాకు డబ్బు అవసరమే గాని డబ్బు నన్ను శాసించలేదు నన్ను కొనలేదు ఎందుకంటే నాకు అక్కర్లేదు అంతే కావాలి ఎంత కావాలంటే వాడు ఇస్తాడు ఏం కావాలో వాడు ఇస్తాడు వాడెవరో నాకు ఇంకా తెలియదు అనుకుందాం ఆహారం వరకు దేవుడు ఇస్తాడట ఇస్తాడు బిర్యానీ కావాలంటే మనం కష్టపడాలి కష్టపడాలి ఎవరినైనా మోసం చేయాలి అదే బిర్యానీ కావాలంటే కష్టం సుఖం మనం పంచుకోవాలి నీడ్ గ్రీడ్ అదే రోజు తినాల్సిన ఆహారం అయితే రోజు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా దొరుకుతాయి ఇది వారి దగ్గర నేర్చుకున్నాను తర్వాత ఆయన అనేక సంగీత పరికరాలు వాయించేవారు ముఖ్యంగా హార్మోనియం అద్భుతం గాత్రం హిందూస్థానీ కర్ణాటక సంగీతంలో వారి సంకీర్తన గనక మీరు వింటే మీకు వెయ్యి ధ్యానాలు వెయ్యి రోజుల ధ్యానం ఒక సంకీర్తనతో మీరు అక్కడికి వెళ్తారు అక్కడికి తీసుకెళ్తారు ఆయన తీసుకెళ్లటం అంటే ఆయన వెళ్తారు ఆయన వెనక మనం వెళ్లిపోతాం కాబట్టి అది ఎప్పుడు అంటే మనస్సు శుద్ధమైనప్పుడు మాత్రమే జరుగుతుంది ఆయన వాసుదేవ అని మధ్యలో ఒక ట్రాన్స్ లో అరిచినప్పుడు వాసుదేవుడు అక్కడ ఉన్నాడేమో అని మనకు కలుగుతుంది అది ఆయన నుంచి నేను నేర్చుకున్నది జల్లమూడి అమ్మని చాలా దగ్గరగా మిగతా వాళ్ళంతా చూసి వచ్చారేమో నేను దర్శనం చేశా ఆమె ఆమెతో ఉన్నటువంటి ఆప్యాయత వాత్సల్యం నేను డైరెక్ట్ గా అనుభవించా కానీ ఆమెని ఎలా నేను అనుభవించాను అంటే నా దగ్గర పది రూపాయలుంటే తొమ్మిది రూపాయలే నావి పదివేలుంటే తొమ్మిది వేలే నావి మిగతా వెయ్యి ప్రపంచంలో ఎవరికో అవసరం ఉండి ఉంటుంది వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు ఎవరో వస్తారు నాకు తెలియదు అంతే తప్ప నేను వెయ్యి రూపాయలు పక్కన పెట్టాను మీరు ఎవరో ఒకళ్ళు రండి అని పిలిచేది లేదు వస్తే కాదనేది లేదు కాబట్టి త్యాగము అనేటువంటిది అంటే దాని డబ్బు ఇందాక చెప్పాను డబ్బు అవసరమే కానీ మితిమీరిన అవసరం నాకు అక్కర్లేదు సంపద నాకు వద్దు అసలు దానివల్ల నన్ను స్వస్వరూపానుసంధానం నశించిపోతుంది తర్వాత జాతి మత వర్గ వర్ణాలు కులము ఇవి ఏమీ లేకుండా ఒక తొంభై ఆరు ఏళ్ల క్రితం సంగతి ఇది అందరినీ తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఆవిడ దగ్గర తీసుకుంది ఆవిడ ఏది ఇల్లాలి గృహస్తాశ్రమాన్ని ఒక పక్కన చూసుకుంటూ ఎవరి నుంచి మళ్ళీ అవి కూడా డబ్బు కలెక్ట్ చేయకుండా ఒక నిజమైనటువంటి గురు స్థానంలో ఉండి మాతృ స్థానము దాని యొక్క రుచిని చూపించింది సరే నేను నాది ప్రత్యేకం నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగినా మా అమ్మ దగ్గర పెరగలేదనే దిగులు నాకు అప్పుడు లేదు ఇప్పుడు లేదు మా అమ్మని మరపించిన అమ్మమ్మ అందుకే జల్లమూడి అమ్మతో నేను వచ్చేసేటప్పుడు కొద్దిగా మరి మూడేళ్ళు సాహచర్యం ఉందిగా వస్తాను అమ్మ అన్నా వెళ్ళొస్తాను అమ్మ ఇంక చదువు పై చదువులకు వెళ్లిపోవాలి వెళ్తున్నాను అంటే వెళ్ళరా నాన్న అని అన్నది అంటే అమ్మమ్మ అనేటువంటిది భౌతిక స్థితిలో biological grandmother నాకు నువ్వు మా అమ్మకు కూడా నువ్వే అమ్మవి మా అమ్మమ్మకు కూడా నువ్వే అమ్మవి అన్నప్పుడు ఇటు రా నాన్న అంది ఇటు రా రా దగ్గరికి రా కావలిన్చుకొని ఇలాగే ఉండాలి ఇదే జీవ భావం ఇదే అందరూ నన్ను దేవి దేవత అని చేస్తున్నారు నాన్న అంది దిగులుగా పాపం అది ఆమె నుంచి నేను వాత్సల్యం అండి నాకు నేను ఎవరినైనా అభిమానించినా వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు అనేటువంటి భావం కలిగినా దాని వెనుక చాలా ఉదాత్త భావన ఉంటుంది లౌకిక సంబంధం ఏది నాకు అక్కర్లేదు దాని దాటి ఎప్పుడో అసలు లేదు మొదటి నాలుగో ఏట వెళ్ళిన వాడికి ఎక్కడి నుంచి పుడతాయి పుట్టవు కదా ఇక మూడవది సత్య సాయిబాబా వారు ఆయన్ని స్మరించకపోతే అది మహాపరాధం highest thinking simple living ఏది రాని ఏది పోని ఒక శిలవలె నిలబడమన్నారు అన్ని కోట్లు ఆయన దగ్గర ఉన్నా గాని మధ్యాహ్నం ఒక పూట ఆయన రాగి సంకటి మాత్రమే తినేవారు రాగి సంకటి రెండు స్పూన్లు రసం రసం అయిపోయిందనేవారు అంతే ఏం లేదురో రోజంతా తిక్కల్తా అంతే అంతే తర్వాత ఐదే డ్రెస్సులు ఒక పుట్టు పండుగ నుంచి మళ్ళీ పుట్టు పండుగ దాకా ఐదు డ్రెస్సులు చిత్రావతికి వెళ్ళాలి బట్టలు చలవ చేయాలి వాటిని మళ్ళీ సాయంకాలం కానీ పొద్దున్న సాయంత్రం మార్చుకునేవారు అంతే కానీ ఆరో జత ఏడో జత అట్లే డెబ్బై జతలు లేవు అప్పుడు నేను నేర్చుకున్నది ఆయన నుంచి ఏంటంటే ఆయన కూడా బోధించి కాదు చూసి punctuality ఉండాలి సమయపాలన చేయాలి నిన్ను ఎవరన్నా దేనికైనా మీరు రావాలి అని నన్ను పిలిచారనుకోండి పిలవబడిన దాని వెనుక ఏమున్నది అనేది ఆలోచించినట్లయితే అది వాళ్ళ అవసరం నన్ను పిలిచారు నా డ్యూటీ ఏమిటి నేను వెళ్ళాలి వెళ్ళటం ఎట్లా వెళ్ళాలి శుద్ధితో వెళ్ళాలి ఇష్టపడి వెళ్ళాలి సమయానికి వెళ్ళాలి నాకిచ్చిన పని నేను పూర్తి చేయాలి నిరపేక్షంగా మళ్ళీ మా ఇంటికి నేను వెళ్ళిపోవాలి అసలు నియమం నిబద్ధత అద్భుతం ఎన్నో ఇలా ఆయన నుంచి మానవీయమైనటువంటి కోణాలు తర్వాత నాకు వారు ఇచ్చిన సందేశం మూడు లైన్లలో చెప్తానునీ వ్యక్తిత్వంతో నువ్వు పెరుగుతూ పెరుగుతూ దేశానికి కీర్తి తేవాలి. నీ తల్లిదండ్రుల గౌరవాన్ని, వంశ గౌరవాన్ని నిలబెట్టాలి. ఇక మూడవది, గురువుల యెడల కృతజ్ఞతాభావంతో ఉండాలి. నాల్గవది, ఆంధ్రులకి తెలుగు వారందరికీ కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి కులదైవం. మిగతా వారందరూ ఇల దైవాలే. ఇది అద్భుతమైన statement. నన్ను తిరుపతి పంపించారు. ఇదో చిన్న అనుభవం మీతో share చేస్తా. నేను అప్పుడు ఢిల్లీలో ఉండేవాడిని. ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి ఆంధ్రాకి ఏదో సెలవుల మీద రావటం, అందరూ వచ్చినట్టే నేను వచ్చి పుటపర్తి వెళ్ళాలి అని అనుకున్నాం. వెళ్ళాం. వెళ్తే, నేను వెళ్ళిన రోజు స్వామి పుటపర్తిలో లేరు. వైట్ ఫీల్డ్ లో ఉన్నారు. అయ్యో మనకు సెలవులే ఉన్నవే ఐదారు రోజులు మళ్ళీ ఆహ్ ఇంకో రోజు ఇక్కడైతే ఎట్లా? ఏదో చూసి వెళ్దాం అని అంటే ఆయన లేరే అనుకుంటే ఒకాయన అన్నారు, "అట్లా అనుకోకండి, any time he will come" అన్నారు. మేము ఉండిపోయాం. మర్నాడు పొద్దున స్వామి వచ్చారు. బెంగుళూరు నుంచి వచ్చారు. ఏడు నలభై ఐదుకి. రోజు కూడా గంట, గంటన్నర మాట్లాడారు. అనేక విషయాలు చెప్తూ చెప్తూ అనేక సంగతులు అయిపోయిన తర్వాత, నా ticket ఉంది వెంకటాద్ర ఎక్స్ప్రెస్ తిరుపతి వెళ్ళాలి అని. తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మళ్ళీ ఎటు? బెంగుళూరు, బెంగుళూరు to ఢిల్లీ. అది నా route. సరే, జేబులో ticket ఉంది. నేను ఆయనకేమి తిరుపతి వెళ్తున్నానని చెప్పలే. ఇది యదార్థంగా జరిగిన సంఘటన. ఆయన అన్నారు, "తిరుపతి వెళ్ళరా. ఎందుకంటే ఇంత దూరం వచ్చి వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోకుండా ఎట్లా?" అన్నారు. అంతే. సరే, ఏదో ఆశీర్వచనం ఇచ్చారనుకున్నాం. వెళ్ళాం. వెళ్లేసరికి మాకు తెలీదు రోజు బ్రహ్మోత్సవాలు మొదటి రోజు. ఒక యాభై, అరవై వేల మంది ఉన్నారు. అప్పుడు విజయ కౌంటర్ ఒకటి ఉండేది. మెట్లు-- ఏం మాకేం తోచలేదు. జనంలో మనం వెళ్ళేది లేదు, ఆయన దర్శనం లేదు, అక్కడే ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అని కూర్చున్నాం. అదే సమయంలో విజయ కౌంటర్ అతను open చేశాడు. ఎందుకు చేశాడంటే ఏదో మర్చిపోయి వచ్చాడు. మేము దానికి exact గా ముందు కూర్చున్నాం. ఓ-open చేస్తాడని తెలీదు. టక్కుమని ఇలా తీసి రెండు tickets ఇచ్చాడు. అప్పుడు ఇరవై ఐదు రూపాయాల ticket. సరే తీసుకున్నాం. ticket ఉంది గానీ జనంలో ఎటు పోవాలి? ఎట్లా వెళ్ళాలి? అయ్యేది కాదు. ticket అయితే కొనుక్కున్నాం అనుకున్నాం. అని సరే మనం ఇక్కడ కూర్చోవటం కాదు, కిందకి వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం అని కిందకి వెళ్తే ప్రతిజయం గారు వస్తున్నారు అప్పుడు. వారెవరో, ఆయన, ఆయన పరివారము, ఆయన వస్తున్నారు. ఆయన మరి నన్ను చూసి ఆహ్ సైగ చేశారు. వచ్చేసేయండి అన్నారు. నన్ను కాదనుకున్నా. నేనేమి AP ని కాదు. ఇలా అనగానే, "ఎవరన్నారు? పిలుస్తున్నారు" అన్నారు. సరే వెళ్ళాం. స్వామి దర్శనం చేసుకున్నాం. స్వామి దర్శనం అద్భుత దర్శనం రోజు. నన్ను ఆయన ఉండమన్నారు. కాసేపు కూర్-- నించొని దర్శనం చేసుకొని వెళ్ళండి. చాలా దూరం, చాలా దూరం నుంచి అందరూ వస్తారు. వస్తారు. కొండను నుంచి కొండలోకి ఎవరు రారు కదా. నాలాగానే అందరూ వచ్చారు. కానీ అనుభవం కలిగిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళిపోయా. ఢిల్లీ వెళ్ళిపోయి మళ్ళీ నెలకి నేను బెంగుళూరు వచ్చి బెంగుళూరు నుంచి పుటపర్తికి వచ్చా. స్వామి మాట్లాడుతూ మాట్లాడుతూ "తిరుపతి వెళ్ళావు కదా, దర్శనం అయ్యిందా?" అని అడిగారు. అప్పుడు ఇదంతా చెప్పా. చెప్తే, "భగవద్దర్శనాన్ని నువ్వు నిజంగా కోరుకుంటే భగవంతుడే నీకు దారి చూపిస్తాడు." అంతే. "కనుక నువ్వు కావాలి అని కోరుకున్నావు..." అంటే అప్పుడు నేను అన్నాను, "స్వామి తిరుపతి వెళ్ళాలి, దర్శనం చేసుకోపోతే ఎట్లా అని మీరు అన్ననాడే మాకు అప్పుడు అర్థమైపోయింది" అన్నాను నేను. "అబ్బే నేనేం చేయలేదు. స్వామి దయవల్ల నువ్వెళ్ళావు, వచ్చావు. claim లేదు." సో ఇవన్నీ చాలా ప్రభావితం చేసినయమ్మ. గురువు గారు అమ్మా చాలా బాగా-- అంటే మీకు యోగము కలిసింది మీ జీవితంలో అవును గురు సన్నిధి అద్భుతంగా కలిసింది. ఉమ్ మీ జీవితం ఒక వరప్ర-వరప్రసాదం అనుకోవచ్చు. లేదా అందుకని అన్నీ చాలా బాగా విపులీకరించి చెప్పారు గురు సన్నిధి గురించి.
YouTube · audio

Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP11

Home

Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP11

Source: SVBC TTD on YouTube

0:00 / 51:01

More in this series

Gurusannidhi (with Y. Swarna Latha Reddy)

3 episodes · 2 hr 41 min

  1. 51 min 10

    Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP10

  2. 46 min 11

    Gurusannidhi | Smt Y Swarna Latha Reddy | EP11

    Now playing
  3. 54 min 117

    Gurusannidhi | Y.Swarna Latha garu | EP117