No transcript for this section.
Transcript begins at 4:19.
సార్ అండి మా HCV ప్రేక్షకులతో మీ అంతరంగం పంచుకునేందుకు వచ్చినందుకు అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ముందుగా HCV ఛానల్ ఈ చలచల్లని సుప్రభాతం చిత్తనవ ప్రభాత వేళ అంతరంగం అని పంచుకోవటానికి ఆహ్వానించినందుకు మీకు మన అందరితో పాటు ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వీక్షకులకి శుభాభివందనాలు తెలియజేస్తూ. కుటుంబ నేపథ్యం అంటే మనం ఎక్కడెక్కడ పూచినా, కాచినా, పండినా మూలంలోకి రావాలి. నేను గుంటూరు జిల్లాకు చెందిన వాడిని. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ. చాలా ప్రఖ్యాతమైనటువంటి ఊరు అది. కింగ్ జార్జ్ కరోనేషన్ హైస్కూల్ గుంటూరు జిల్లాలో ఉన్న మొట్టమొదటి హైస్కూల్ అది. మేధావులందరు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ హైస్కూల్ అది. అక్కడ పుట్టి ఆ నేల, ఆ గాలి, ఆ వాతావరణం ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైన సమాజం సహజీవన సౌందర్యంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించిన వ్యక్తిగా పెరిగి ఆ అనేక కార్యక్రమాలు చేయగలిగి ఇదిగో ఈవేళ మీ దగ్గరికి రాగలిగాం. అంటే ఈవేళ ఒక స్త్రీమూర్తి తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందాన్ని పొందుతుందో నేను మళ్ళీ నా నేలలోకి వచ్చి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా-- ఎంతో ఆనందంగా ఉంది. మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఇంజనీరింగ్ లో చానా ఉమ్ డీప్ గా study చేశారు. మీకు చిన్నప్పుడే మీకు అసలు ఏదైనా goals లాంటివి ఏమైనా ఉండేదా అండి? అంటే ఒక లక్ష్యాలు అట్లా నేను పలానిది కావాలి అనేది ఒక లక్ష్యం ఉండేదా మీరు? Goals చిన్నప్పుడు ఏర్పడవు కదా. ఏర్పడవు- [అస్పష్టమైన మాట] ఏర్పడవు. లక్ష్యాలు ఉంటాయి. లక్ష్యాలు ఎలా ఉంటాయి అంటే మన చుట్టూ అప్పటికే అదే ప్రాంతం నుంచి వెళ్ళిన ప్రఖ్యాతి పొందినటువంటి వ్యక్తులని ఆ సమాజం ఎంత సమున్నతంగా గౌరవిస్తున్నదో చూసినప్పుడు గౌరవాలు అందుకోవటం కంటే మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఒక భావన మనసులో ఆ రూపుదిద్దుకుంటుంది మనకు తెలియకుండానే. ఇక తర్వాత మనకు ఏర్పడే అవకాశాలనండి మనకి ఈ సమాజం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆ అవకాశాలు. వాటిని అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకోగలిగితే ఆ భావనే ఒక లక్ష్యమై, ఆ లక్ష్యమే ఒక గమ్యమై, ఆ గమ్యం వైపు మన అడుగులు వడివడిగా పడతాయి అనేది నా భావన. దీనికంటే మీ కుటుంబ నేపథ్యం కూడా కొంచెం దోహదపడుతుందండి. మీరు మామూలుగా వ్యవసాయ ప్రధానమైన కుటుంబం అండి. అంటే మీరు- ఆ కుటుంబ నేపథ్యం కుటుంబ నేపథ్యం నా విషయంలో చాలా భిన్నంగా ఉంటుంది. మా కుటుంబంలో ఆధ్యాత్మికం వైపు వచ్చిన వాళ్ళు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. ఏదో teachers, lawyers ఇలా ఉన్నారు తప్ప ప్రత్యేకంగా ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్లాలని, ఇదొక రంగం అని, దీనిలో మనం కూడా ఏదో చేయవచ్చునని ఇన్ని ఊహలు లేవు. కానీ కుటుంబంలో శ్రీరామ భక్తి అసలు భగవంతుని యందు ఒక సడలని విశ్వాసం, భగవంతుని నామం యొక్క విశిష్టతని గుర్తెరిగి వర్తించటం, అందరితో ఉన్నదాన్ని కాస్త పంచుకోవటం ఆనాటి అంటే ఒక అరవై ఏళ్ల నాటి సమాజంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన భావాలు మా కుటుంబంలోనూ ఉన్నాయి. ప్రత్యేకం ఏం కాదు. కాకపోతే ఆ కుటుంబ నేపథ్యం అడిగారు గనుక ముందుగా నేను స్మరించవలసినటువంటిది నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులు, మా నాన్నగారి పేరు నాగభూషణ్ రావు. మా తల్లి పేరు సరోజినీ దేవి. మా ఇంటి పేరు వి అంటే వల్లూరు. వల్లూరు శ్రీరామచంద్రమూర్తి అసలు పేరు అది. ఆ ఇటువంటి నేపథ్యం మనకి పెద్దగా ఇలా ఉండమని చెప్పేటువంటి రోజులు కావవి. పిల్లల మీద తల్లిదండ్రుల దిశానిర్దేశాలు తక్కువ ఎవరికైనా. పిల్లలను స్వేచ్ఛగా హాయిగా పెరగనిచ్చినటువంటి రోజులవి. కాబట్టి ఎవరెవరు వారికి అందిపుచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకొని తద్వారా అల్లుకొని తమకు ఏది ఇష్టం ఏర్పడిందో ఆ ఇష్టాన్ని ఎంత కష్టమైన భరించి ఆ అనుకున్నటువంటి స్థాయికి వెళ్లటం అనేది ఆనాటి సామాజిక ఒక స్థితి. ఆ స్థితిలో నేను భిన్నం మాత్రం కాదు. నేను మామూలుగానే అలాగే అనుకున్నాం. ఇది కుటుంబ నేపథ్యం. వ్యావసాయికమైన కుటుంబ నేపథ్యం. ఏదో అడపాదడపా ఇద్దరు ముగ్గురు ఉద్యోగాల్లో ఉన్నారేమో గాని ఆ చెప్పాగా అది- ఏదన్నా మీరు విద్యావంతుల కుటుంబమే. మామూలుగా అంటే lawyers, teachers- ఆ కుటుంబమే ఖచ్చితంగా మీరు ఆ క్రమంలోనే మీరు కూడా ఒక విద్యావేత్తగానే వచ్చారు. విద్యావేత్తగా గుర్తింపు పొందారు. అవును తర్వాత మీకు B.Tech అవగానే ఫస్ట్ అసలు మీ కెరీర్ ఎట్లా start అయ్యింది అండి అది? ఇది కెరీర్ కంటే ముందు చాలా విశే-విశేషాలున్నాయి. అవన్నీ తలుచుకోకుండా మనం ఒక్కసారే టెక్నాలజిస్ట్ కాలేం. నాకు ప్రథమ గురువు ఎవరు అంటే మామూలుగా మా తల్లి ప్రథమ గురువు అని చెప్తాం. నాకు మా అమ్మ ప్రథమ గురువు. ఆమె నన్ను పెంచింది తురుమెళ్ళలో. వాళ్ళు మాచిరాజు వాళ్ళు. మాచిరాజు దుర్గమ్మ, మాచిరాజు భుజంగరావు గారి అని. చాలా ధార్మికుడు ఆయన. కష్టజీవి. వ్యావసాయికం భావనతో ఉన్నటువంటి వాడు. మూడో సంవత్సరం వయస్సు రాకుండానే ఆయన నాతో Indian Express చదివించేవాడు.Headlines అన్ని చదివే వయస్సు ఆయది. మా అమ్మమ్మ రాముడి కథ చెప్పేది. రాముడిలా జీవించగలిగితే చాలు నాయనా అని చెప్పేది. ఈ భూముల మీద ఆస్తుల మీద పెద్ద నమ్మకాలు పెట్టుకోవద్దు, ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. కాబట్టి స్వశక్తి మీద ఆధారపడి జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి. అంటూ ఆ రాముడు మానవ దేహం తీసుకొని వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు. మనిషికి రానన్ని పుట్టెడు కష్టాలు ఆయనకు వచ్చినా ఎంత ఓర్మితో దానిని జయించి, ఇవాళ పరదైవతంగా భావించబడుతున్నాడు. ఆ రాముడి కథలు ఒకవైపు, ఒకవైపు కృష్ణలీలా తరంగిణి. కృష్ణుడి యొక్క చైతన్యాన్ని, ప్రేమని, సౌందర్యాన్ని ఆమెకు తోచిన రీతిలో ఆమెకు తెలిసిన భాషలో ప్రతిరోజూ కథలు చెప్పి నిద్రపుచ్చినటువంటి ఆమె నాకు మొట్టమొదటి గురువు. ఆమెని వేళ స్మరించుకోవటమే నాకు ఒళ్ళు పులకలు తేలిపోతున్నది. ఆ బీజం ఆవిడ వేసి ఉండకపోతే ఏమయ్యేది అనేది పెద్ద ప్రశ్న. కానీ "జన్మాద్యపాయము తప్పించుతన్నని" భగవంతుడు ఆ అపాయం తప్పించాడు. ఆ తర్వాత నాలు-- నాలుగవ సంవత్సరం వచ్చేప్పటికి తెనాలిలో ఆమె నన్ను రఘువరదాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఏం లేదు తన మనవడికి ఒక ఆశీర్వచనం ఇప్పించాలి అని. అలా వెళ్ళేసరికి ఆయన ఆరడుగుల మూడంగుళాలు అజానుబాహువు ఆయన. ఆయన తెలుగు స్క్రిప్టులో ఉన్నటువంటి చిన్న హనుమాన్ చాలీసా బుక్, సాధన గ్రంథమండలి తెనాలి వాళ్ళు ప్రింట్ చేసింది నా చేతిలో పెట్టి "ఇది నువ్వు చదువు సాయంకాలం నాకు అప్పజెప్తే ఒక అరటి పండు ఇస్తా" అన్నారు. విచిత్రం ఏంటంటే మరి వారి మహదాశీర్వచనం అయి ఉండాలి, భాష మంది కాదు అక్షరాలు తెలుగువి. కరెక్ట్ గా ఒక నలభై నిమిషాల్లో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. ఆయన చేతికి పుస్తకం ఇచ్చాను. "నేను చదువుతాను మీరు వినండి" అన్నాను. "నాకు వచ్చు మీరు చదవమ్" అన్నారు. కానీ పిల్లవాడికి ఎలా ఉంటుందంటే ఆ పుస్తకాన్ని తన చేతిలో ఉంచుకోవటం వాడికి ఇష్టం ఉండదు. ఆ గురువుకో తల్లికో అప్పజెప్పేసి అది ఇష్టం. అలాగే చేతులు కట్టుకొని నేను హనుమాన్ చాలీసా మొత్తం చదివినప్పుడు ఆయన ఆనంద పరవశులై ఒక్కసారి ఎత్తుకొని భుజం మీద కూర్చోబెట్టుకొని, ఆ సాయంకాలం ఆయన సత్సంగము, గానము అన్నీ ఉన్నాయి సంకీర్తన. ఓ మూలకు తీసుకెళ్తే అక్కడ ఒక అరటి పళ్ళ గెల ఒకటి ఉంది. ఆ గెలకి చాలా పెద్ద గెల, చాలా ఆరోగ్యవంతమైన గెల, పెద్ద కొమ్ము కూడా ఉంది దానికి. ఆ మొత్తం గెలలో సగం లేను నేను. నా height ఆ వయసులో. అప్పుడు ఆయన అన్నారు "ఒక పండు ఇద్దాం అనుకున్నాను, ఈ పళ్ళన్నీ నీవే" అన్నారు. ఆ రకంగా ఆధ్యాత్మిక రంగానికి బహుశా బీజప్రాయమైనటువంటి భావనలో నుంచి ఒక మొలక ఎత్తడానికి రఘువరదాస్ గారు కారణమై ఉండాలి. కుటుంబం నుంచి వచ్చిన ఆధ్యాత్మిక భావనా బలం కంటే ఇట్లా వచ్చినటువంటి external forces అంటామే అవే ఎక్కువ అని నాకు భావన. ఆరోజు సాయంకాలం ఆయన సంకీర్తన చేయటం, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని మూడున్నర గంటలు పాట పాడారు. సో, ఆ తర్వాత అట్లా అట్లా నెమ్మదిగా వెళుతున్నప్పుడు బాపట్లలో fifth form చదువుతున్నప్పుడు Salvation Army School లో ఒక National Science Seminar జరిగింది. ఇది ఇవాళ తరం చాలా వినవలసినటువంటి విషయం. ఆ National Seminar కి నేను చదువుతున్న ఇంకొల్లు స్కూల్ నుంచి నన్ను select చేసినప్పుడు మిగతా teachers అందరూ ఏమన్నారంటే, "ఏదో master దగ్గరికి వెళ్తే ఒక మంచి subject రాసిస్తారు, అది చదివి వచ్చేసేయ్" అన్నారు. master రాసింది చదివేటట్లైతే నేనెందుకు master ఏ వెళ్ళొచ్చు కదా! నన్ను కదా select చేసింది నేనేం చేయాలి అని ఆలోచన కలిగింది. I walked up to వేటపాలెం library కి వెళ్ళాను. ఏం రాయాలో తెలియదు, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని, చిన్న వయస్సు పన్నెండేళ్ళు. ఒక library లో, ఆహ్ వేటపాలెం library లో ఒక rack లో ఒక పుస్తకం మీద చెయ్యి వేస్తే ఎప్పటిదో ఒక పాత భారతి మ్యాగజైన్ దొరికింది. ఇలా తెరవగానే వరాహమిహిరుడి మీద ఒక article దొరికింది. బహుశా తర్వాత కాలంలో ఇవాళ మనం అనుకునే ఈ శాస్త్రీయత, శాస్త్రజ్ఞత్వం వీటన్నింటికీ బీజం ఆరోజు అక్కడ పడిందని భావన. చదివితే చాలా జటిలమైన భాషలో ఉంది కానీ విశేషాలు ఉన్నాయి. అవన్నీ ఒక తల్లకాయితం మీద tone down చేసుకొని నేను రాయగలిగిన భాషలో దాన్ని అనువదించుకొని ఒక ఐదారు points రాసుకొని నాకు తోచినవి అప్పటికే కొన్ని ఆలోచనలు ఉన్నాయి గనుక అన్నీ జోడించి వరాహమిహిరుడి బృహత్ సంహిత కావ్యము అందలి అపూర్వ విజ్ఞాన విశేషములను అని ఒక పెద్ద title పెట్టి తీసుకెళ్లాను. And అది చదివినప్పుడు judges ఆశ్చర్యపోయారు. ఒక fifth form చదివే student ఇది రాయగలడా? వాళ్ళు కూడా ఆలోచించారు, ఇదెవరో master రాసిచ్చి ఉంటారు. నా దగ్గర ఆ paper తీసుకొని, ఆ paper దగ్గర పెట్టుకొని "మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పు" అని అడిగారు. correct గా ఏది ఉన్నదో అది యధాతథంగా మళ్ళీ reproduce చేశా. అప్పుడు అది original ఆలోచనే అని ఆహ్ చాలా ఆనందపడ్డారు. Naturally I won the national prize. ఆహ్ అది ఇంకా మా school లో ఉందని విన్నాను. frame కట్టించి ఉంచారని విన్నప్పుడు ఆనందం కలుగుతుంది. అట్లా ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినప్పుడు, బాపట్లలో వచ్చినప్పుడు చాలా బండెడు పుస్తకాలు ఇచ్చారు. science మీద గెలిచిన నాకు వాళ్ళు science పుస్తకాలు వాళ్ళ దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి Shakespeare Complete Works, ఆహ్ తర్వాత T. S. Eliot. Story books. ఇవన్నీ science తప్ప అన్నీ ఇచ్చారు.బట్ అందులో పుస్తకం అన్ని మొయ్యలేను గనుక చాలా పుస్తకాలు ఇచ్చారు National Prize కదా. ఆ బుక్ ఒకటి తీసుకుని అప్పటికి నేను ఎవరిని అంటే ఎవరి గురించి వింటూ ఉన్నానో కానీ ఇంతవరకు ఎవరినీ చూడలేదు. అది జల్లెడ మూడి వెళ్ళాలి అనిపించింది ఎందుకంటే బాపట్ల నుంచి చాలా దగ్గర్లోనే విన్నాను నేను వెళ్ళాను. వెళ్ళేప్పుడు ఆ బుక్ తీసుకుని వెళ్ళాను ఆమెను చూశాను ఆమె చేతిలో ఆ పుస్తకం పెట్టి ఈ విషయమంతా ఇప్పుడు మనం అనుకున్నది మనకి Prize వచ్చింది అని చెప్పాను. చెప్పేసరికి "నీకు కాకపోతే ఎవరికి వస్తుంది నాన్న" అంతే. ఆ తర్వాత మూడు సంవత్సరాలలో నేను ఆ అమ్మని బహుశా రెండు మూడు సార్లు కలిసి ఉంటాను. ఎప్పుడు వెళ్ళినా తన దగ్గర కూర్చోబెట్టుకునేది నాకోసం వచ్చావు నా దగ్గరే ఉండు అనేది తనే అన్నం పెట్టేది. ఎందుకు అలా చేసింది అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఇవాళ ఆలోచించినట్లయితే ఆమె దగ్గరికి అర్ధులు వచ్చారు, అర్ధార్థులు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ముక్తులు వచ్చారు, కడు బీద వాళ్ళు వచ్చారు, అతి ధనవంతులు వచ్చారు. అందరితో అమ్మ ఎలా ఉంది, అమ్మతో వాళ్ళందరూ ఎలా behave చేశారు అనేది బహుశా గమనించడం కోసం నాకు అవకాశం కల్పించిందేమో. సమాజం ఇంత విస్తృతంగా ఇంత వైవిధ్యంతో కూడి ఉంటుంది జాగ్రత్త అందులో నువ్వు సమాజానికంటే పెద్దవాడివి కాదు చిన్నవాడివి కాదు You are a part of the society చూడు నేను ఒక్కదాన్నే కూర్చున్నాను ఎన్ని విషయాలు వస్తున్నాయో చూడు అన్నట్లుగా నా వరకు నేను దాన్ని analyze చేసుకున్నాను అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు ఒక అధ్యయనం చేయటానికి ఒక అధ్యయనం చేసేటువంటి అప్పటికే వరాహమిహిరుడి మీద ఒక analytical mind ఏర్పడిందన్నమాట. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు ఇవేమీ తెలియవు. ఆ purity లో నుంచి వచ్చినటువంటి భావాలే బహుశా నన్ను మరి జల్లెళ్ళ మూడమ్మను చూడాలని నాకెందుకు అనిపించింది, నాకేం భక్తి ఏం లేదు ఆమె అంటే. ఆమె గురించి వినటమే కానీ ఎక్కడో ఒక స్పర్శ ఉందన్నమాట. అట్లాగే ఆ రోజుల్లో ఆంధ్రప్రభ నీలం రాజు వెంకట శేషయ్య గారు editor గా ఉన్నారు దానికి. ఆంధ్రప్రభ daily లో చిన్న photo ఎడ్లబండి మీద నుంచున్న సత్య సాయిబాబా వారి photo వేసి ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడే మళ్ళీ అవతరించాడు అని అందరూ అనుకుంటున్నారు అని ఒక చిన్న caption తో ఉంటే కృష్ణుణ్ణి మనం ఎలాగూ చూడలేదు కృష్ణుడు కృష్ణుడుగానే వచ్చాడా మరి కృష్ణుడి లాగా flute ఇవేం లేవే ఈయన కృష్ణుడు ఎలా అవుతాడు ఈ రూపమేంటి అని ఒక జిజ్ఞాసతో ఇది అమ్మని మే తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు ఇది జూన్ తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు నేను బాబా గారి దగ్గరికి చేరుకున్నా. ఇలా ఈ ఊరే గుంటూరు వచ్చి ఆ రోజుల్లో ఒక మా-- గుంతకల్లు passenger ఎక్కి చాలా కష్టపడి పెనుగొండ లో దిగి ఆ చిత్రావతి ఇసుక పర్రలలో నుంచి నడుచుకుంటూ నేను ఒక్కడినే ప్రస్థానం చేసినప్పుడు ఈ పూటకి నాకు ఆశ్చర్యమే. ఆ రోజున స్వామి నన్ను చాలా సమాదరించారు. నేను బాగా ఆకలి మీద ఉన్నాను, నిద్ర లేదు, కొత్త ప్రదేశం, వయస్సు చిన్నది. ఆ సహజంగా ఆకలి ఎక్కువ ఉంటుంది. ఆ time లో అలా నుంచుని ఉన్నాను ఆయన దూరంగా ఉన్నారు. వారు రావటానికి ఇంకా time పడుతుందిలే అని అనుకుంటున్నాను. అనుకోని ఇలా కనురెప్ప వాల్చి తెరిచేలోగా నా ముందు నుంచున్నారు. వారు అన్నటువంటి ఒకే ఒక్క మాట నన్ను ఇప్పటికీ నడిపిస్తుంది. "కాచుకూర్చుంటినే" అన్నారు. అది రాయలసీమ accent. కాచుకూర్చుంటినే అంటే రాయలసీమ భావంలో నేను ఎదురు చూస్తున్నాను అని ఒక అర్థం. నేను దాన్ని తలకెక్కించుకోలే. నాకోసం భగవంతుడు ఎదురు చూడటం ఏంటి? కాచుకూర్చుంటినే అంటే నిన్ను కాచుటకు నే కూర్చుంటినే అని మార్చుకున్నా. కాప-- కాపాడటానికి నన్ను కాచుకుంటూ కాపాడటానికి నేను ఉండాలి అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆ అమ్మమ్మ చెప్పిన కథల్లో రాముడో కృష్ణుడు ఆ స్వయంగా చూసిన జల్లెళ్ళ మూడి అమ్మో అవన్నీ కలిపితే ఒకటైతే అది సత్య సాయిబాబా వారు అనేటువంటి ఒక పవిత్ర భావన నాకు ఎవ్వరూ చెప్పకుండానే నాకు కలిగింది. అప్పటివరకూ ఆయన గురించి నేను ఏమీ చదవలేదు. ఆయన మహిమలు చేస్తారని కూడా తెలియని చిన్న వయస్సు అది. అదిగో అప్పటి నుంచి ఇప్పటి దాకా ఇప్పటి నుంచి కనురెప్ప వాలే దాకా ఆయన భావనా స్థితిలోనే నా జీవితం సాగుతుంది. ఇవాళ మీరు ఒక ప్రశ్న కుటుంబ నేపథ్యాన్ని... శాస్త్ర విజ్ఞానం అంతా ప్రవృత్తి అయినట్లయితే నివృత్తి అసలు జ్ఞానం. నివృత్తి మార్గంలోకి అడుగు పెట్టడానికి ఈ విద్య ఉపయోగిస్తుంది. మహాత్ముల గురించిన విశేషాలు పదే పదే మననం చేసినందువల్ల వారి పట్ల ఉండేటువంటి గౌరవం వాళ్ళ జీవితంలో ఒక స్థితికి ఎలా వచ్చారు? వాళ్ళు స్థితికి వచ్చిన తర్వాత సమాజంతో ఉన్నారా? సమాజం నుంచి దూరమైపోయినారా? అని ప్రశ్నించుకుంటే ఇవాళ సమాజంతో మమేకమైనటువంటి గురువులకి నేను పాదాభివందనం చేస్తా. అతను ఏ మతస్తుడైనా నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ సమాజం నుంచి ఒక వస్తువును పొంది ఒక కీర్తిని పొంది ఒక ప్రతిభ చేత గుర్తించబడి ఆ సమాజం నాకంటే భిన్నమైంది దానికంటే నేను చాలా పెద్దవాడిని అని గనక ఎవరన్నా అనుకున్నట్లయితే వాడు ఎంతటి వాడైనా వాడి పట్ల నాకు గౌరవం లేదు. ఇది నా స్పష్టమైనటువంటి భావన. మీరు అంటే ఈ ఆధ్యాత్మిక భావన దీని చర్చలోకి మళ్ళా వద్దాం. మీరు ఒక scientist గా మంచి ఉన్నత స్థానంలో ఉన్నత స్థితికి వెళ్లారు. ఆ career నుంచి అసలు మీకు మళ్ళాలని ఎందుకు అనేటంటే ఆ career లో మీకు సంతృప్తిని ఇవ్వలేదా? అసలు అప్పటికే మీకు ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి చిన్నప్పటి నుంచి అవి కూడా మీతో పాటు పెరుగుతా పెంపొందుతా వస్తున్నాయి. అయితే ఈ career మీకు అంతా సంతృప్తికరంగా లేదని మీరు అనుకున్నారా? scientist గా మీరు చాలా మంది ప్రపంచ దేశాలు కూడా తిరిగారు అవును తిరిగాను మీరు అంతా ఎందుకంటే ఒక prestigious గానే అవును మంచి గుర్తింపే వచ్చిందనే అనుకోవాలి. అవునండి ఆఇది చాలా ఒక అందమైన ప్రశ్న డైవర్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది అదే ఆ ప్రశ్నలో చాలా జవాబులు ఉన్నాయి. డైవర్ట్ కానీ పరమ తృప్తికరమైనటువంటి ఒక జీవితాన్ని శాస్త్రీయ రంగంలో ఉన్నటువంటి జీవితాన్ని ఆధ్యాత్మిక పరిమళంతో అద్దుకొని ఇహాన్ని పరాన్ని దృష్టిలో పెట్టుకొని Equanimity, Equilibrium and Equipoise అనబడేటువంటి మూడు మాటల ఆధారంగా సమతుల్యాన్ని పాటిస్తూ లోకరీతిలోని చదువుకున్న చదువుకు ఒక సార్థకత ఉండాలని తద్వారా ఈ సమాజానికి నేను చాలా అందించవలసింది ఉందని నమ్మి అనేకమైనటువంటి ప్రయోగాలు శాస్త్రీయ రంగంలో నేను కూడా చేసి ఎలైల్ ఐసో థయో సైనేట్ అనేటువంటి దానిమీద ఒక పేటెంట్ ను పొంది పేటెంట్ ను పొందినటువంటి శాస్త్రవేత్తగా నేను ఏం చేస్తానంటే మామూలుగా ఐ యామ్ ఏ పేటెంట్ హోల్డర్ అని ప్రింట్ చేసుకుంటా. ఆధ్యాత్మిక భావన లోపల ఉన్నది గనుక ఈ పేటెంట్ నా పేరు మీద ఎందుకు ఉండాలి? దీని ద్వారా నేను ఎందుకు సంపాదించాలి? Is it the end of my life? దీన్ని సమాజానికి ఒక సంస్థకు ఇచ్చేస్తే ఈ knowledge అందరూ అందుకొని అనేక రంగాలలో దానికి ఒక వాణిజ్యపరమైనటువంటి గుర్తింపును తెస్తారని అంటే ఒక concept commercialize చేయటం వ్యక్తి వల్ల సాధ్యం కాదని వ్యవస్థ వల్ల సాధ్యం అయి తీరుతుందని నమ్మి దాన్ని NRDC కి నేను అంకితమిచ్చేసాను. మీ ఇష్టం పేటెంట్ పేటెంట్ ని ఇచ్చేసాను. ఇది ఆధ్యాత్మికమైన భావన నా యందు లేకపోయి ఉన్నట్లయితే దాని మీద కోట్లు సంపాదించే ప్రవృత్తిని పెంచుకుని ఉండేవాడిని. కాబట్టి నాకు science పరమైనటువంటి జీవితం అసంతృప్తి కాదు. ఒక ఆత్మవిశ్వాసాన్ని ఒక గాంభీర్యాన్ని జీవితాన్ని ఒక కలగా గాక వాస్తవంగా అతి వాస్తవికంగా జీవించగలిగిన ఆలోచించగలిగిన ఒక rational దృక్పథాన్ని ఆ ఒక విశాలమైనటువంటి ఒక భావనా స్థితిని attitude ని కల్పించింది science. అందువల్ల దానికి నా నమస్కారం. కానీ అది మాత్రమే ఆ ఒక స్థితి. దేవుడు లేడు There is nothing beyond the science అనేటువంటి దానికి Even science is a part of divinity భగవంతుని యొక్క చిచ్ఛక్తి Leela Vilasam లో ఈ సృష్టి ఒక దివ్యమైన ఆనందకరమైన రహస్యమిది. రహస్యాల అన్వేషణలో వస్తువుని అన్వేషించటంలా పరతత్వాన్ని అన్వేషిస్తున్నాం. కనుక నాకు Science and spirituality They are not contradictory to each other They are complementary to each other. పరస్పరం అభినందనీయమైనటువంటి ఒక రెండు భావనా స్థితులు. ఆ రెంటిని సమన్వయం చేసుకోగలిగితే ఎక్కడ తేడా ఉండదు పీచి ఉండదు. కాబట్టి ఆధ్యాత్మిక రంగంలోకి నేను రావటం అంటూ లేదు. అసలు ఉన్నదే దాంట్లో. ఏది? మానసికంగా కానీ దైహికంగా intellect గా science ఈ ప్రపంచానికి చాలా science లేకపోతే ఇవాళ నేను ఇక్కడ ఈ గదిలో కూర్చొని మాట్లాడుతున్నది ఈ ప్రపంచానికి వినిపించి ఉండేది కాదు. కాబట్టి science కి నా నమస్కారం. Science ని ఆధారం చేసుకుని భగవంతుణ్ణి వెతికే లేదు ఆ భావనను అనుభవించగలిగిన ఒక మానసిక స్థితిని ఇచ్చిన ఆధ్యాత్మికతకి మరొక్కసారి వందనం. మీకు అంటే పరిశీలన అధ్యయనం అనేది అసలు మీకు basic గా చిన్నప్పటి నుంచి ఉన్నది ఏ విషయంలోనైనా అలాగే మీరు science వట్ల కూడా చానా deep గా research చేసి చేసి దాన్ని మీరు ఆధ్యాత్మికంతో మిళితం చేసేసి సమాజానికి అందించాలనే ఒక మంచి సంకల్పంతో అవును వచ్చారు. అసలు actually గా అసలు ఈ science కి ఈ spiritual కి అసలు మన వేదాల నుంచి కూడా ఒక సంబంధం ఉంది. అది ఎట్లా ఉంటుందండి? అది ఈ రెండిటికి మధ్య balance science కిను ఈ sentiment లు మళ్ళా ఇవి different గా ఉంటాయి కదండీ. సాంప్రదాయాలు sentiment లు వీటికి మధ్య balance ఎలా సాధ్యం అవుతుంది? మీరు చెప్పిన ఆచారాలు సాంప్రదాయాలు మనిషి సృష్టించుకున్నవి. మనిషికి ఏది ఆనందం కలుగుతుందో ఆ వస్తువు వెంట పరిగెత్తే అలవాటు ఉంది గనుక సమాజ పరిణామాన్ని గనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉన్నది ఒకప్పుడు spirituality యే ఉంది. ప్రపంచంలో ఈ దేశం అనే కాదు. science లోకొచ్చేప్పటికి ఒక తార్కిక చింతన మొదలైంది. తార్కిక చింతనలో immediate గా instant గా అనుభవాలు కలగవు. దానికి కాస్త ఓపిక కావాలి. ఎప్పుడో ఒకరోజున definitely గా అనుభవం కలుగుతుంది. ఆ ఓపిక లేని ఒక నవ మత నిర్మాణకర్తలు అంటే మతాన్ని మత సామ్రాజ్యాలను నిర్మాణం చేయాలని దాన్ని నెమ్మదిగా rituals లోకి దింపారు. కర్మకాండ. కర్మకాండలో సామూహికంగా అనేకమంది కూర్చొని భగవంతుని గురించి విచారణ చేయటం. ఇది నాస్తికవాదం కాదిది. సమాజంలో ఏర్పడినటువంటి ఒక పరిణామం. ఈ పరిణామం వల్ల ఒక్కడు కూర్చొని ఒక scientist తన science ద్వారా దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్లటం కంటే అందరూ కూర్చొని దైవభావనలో ఉండి తదనుగుణంగా జీవించగలిగినట్లయితే అది కూడా ఉత్తమమైనది అనేటువంటి ఒక సాంప్రదాయం ఏర్పడింది. సాంప్రదాయం నెమ్మదిగా ఆచారం అయిపోయింది. ఆచారం అలవాటు అయిపోయింది. అలవాటు మూఢత్వంలోకి వెళ్ళింది. మూఢత్వం పాశవికత్వంలోకి వెళ్ళింది. మానవత్వానికి దూరమైంది. చూశారా! ఇది అధోగతికి నెమ్మదిగా దారితీసింది. చివరి కడగా ఏమైందంటే నేను నమ్మిన వాడే దైవం నేను నమ్మినదే సిద్ధాంతం అనే భావనలోకి వచ్చాడు. నమ్మవలసిన ఒక సిద్ధాంతం వేద ప్రామాణికమైనటువంటి భావన నుంచి మానవుడి మీద వైదొలగిపోయింది. వైదొలగి ఇవాళ వేదం చదవకుండా వేదంలో ఏమీ లేవట అని ఎవడో ఒకఆ వ్యంగ్యోక్తి విసిరితే అది నమ్మాం తప్ప మనకి తల్లివంటి వేదాన్ని మనం మర్చిపోయినాం. చదవటం-- వేదం అంటే మంత్రాలని, అది ఒక కులస్తులో మతస్తులో చదివే భాష అని, అది పామరులకు అర్థం కాదని, ఇట్లా రకరకాల మనమే నిర్ణయించేసుకున్నాం. వేదం పాపం అదేం అనలే. మీ అందరి కోసం మీ అందరూ నేను, నేనే మీ అందరం. అంటే ఒక మానవుడి మనసులో కలిగిన భావ సంపుటే వేదం అండి. ఆ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టినాయి? వేదాల్లో బృహదారణ్యకోపనిషత్తు. సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై. ఆనాడు తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు. ఉన్న సంస్కృతంలో వాళ్ళు వ్యక్తీకరించారు. దాన్ని మనం గనక ఒక ఔదార్యంతో విశాల బుద్ధితో వేదాలను గనక అధ్యయనం చేస్తే దానిలో లేని శాస్త్రం లేదు. పక్షి శాస్త్రం ఉంది, కిరణ శాస్త్రం ఉంది. ఇందాక ప్రసంగ వశాత్తు నేను చెప్పిన వరాహమిహిరుడి బృహత్ సంహితలో రెండు విశేషాలు ఈ సందర్భంలో ప్రస్తావిద్దాం. ఇవాళ మనం సిమెంట్ సిమెంట్ అనే ఒక ఇంగ్లీష్ మాటని accept చేసాం. మన జీవితంలో భాగమైపోయింది. ఈ సిమెంటు ఉత్పాదన, ఈ సిమెంటు వితరణ, సిమెంటు వినియోగం ఆ కాలంలోనే ఉన్నది అని చెప్పటానికి ఆ రోజున ఆయన దానికి పెట్టినటువంటి పేరు వజ్రలేపనము. మోర్టర్, ఇసుక, సిమెంటు ఇవన్నీ కలిపి తయారు చేస్తాం కదా, కంకర కలిపి. దాన్ని ఆయన వజ్రసంఘాతము అన్నాడు. water divining, నేరేడు, గన్నేరు చెట్టు ఆకు కొమ్మని కట్ చేసి భూమిలో గనక తిప్పినట్లయితే it shows you where the water is. ఆ గిరగిరా తిరుగుతుంది. అదే ఇవాళ రెండు కర్రలు, పుల్లలు పట్టుకొని మనం వెళ్తున్నాం. ఇది వరాహమిహిరుడి యొక్క అనుభూతి. దివ్యమైనటువంటి ఒక మనకి వరదానం అది. కాబట్టి సైన్స్ ని మనం ఆ scientific గా వేదాన్ని చదువుదాం. దానిలో ఉన్న సైన్స్ ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. మనకి మంత్రము, ఆశీర్వచనం వరకే వేదం గనక అయినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని చిటికెన వేలు ఉంగరం వరకు తెచ్చుకొని, అమ్మయ్య మనకంతా వచ్చే-- చిటికెన వేలు ఉంగరం ఎంతండి? రెండు గ్రాముల, మూడు గ్రాముల. అది వేదమా? కాదే. కంఠాభరణం చేయాలి, మేఖలాలు, వడ్డాణాలు చేయించాలి. ఎన్ని వజ్రాలు దాగున్నాయి, ఎన్ని మణులు దాగున్నాయి, ఎన్ని భావనలు దాగున్నాయి. ఒక సమ సమాజ నిర్మాణానికి కావలసినటువంటి ఒక సైద్ధాంతిక భూమిక వేదం ఇచ్చినట్లుగా ఏదీ ఇవ్వలేదు. ఇవ్వలేదు, ఇచ్చే శక్తి మరొక శాస్త్రానికి లేదు. ఇవాళ నేనైనా, మరొకరైనా ఎవరైనా ఒక నోబుల్ లారీయేట్ అయినా నేను దీనిని సాధించాను అని అంటే ఉన్నదేదో బయటకు తీసి చెప్పావు తప్ప, నీవు సృష్టించింది లేదు. నేను patent చేయటానికి ముందు ఎలై ఎసో తయోసై నీట్ ఉంది దాంట్లో. దాని తర్వాత ఉంది. కాబట్టి మధ్యలో నేను ఎవరిని అంటే నా పాత్ర, ఉరికి ఇదొకటుంది. ఉమ్ identify చేశారు Identify చేశారు. Recognize చేసి అట్లా చేసినందు వల్లనే నాకు ఇంత గౌరవం ఉంటే- ఉమ్ వరాహమిహిరుడికి ఏమిద్దాం? ఆర్యభట్టుడికి ఏమిద్దాం? ఏ రకమైన instrument చేతిలో లేకుండా ఖగోళ శాస్త్రాన్ని, భూగోళానికి అందించిన మన మహర్షుల దర్శనానికి మనం ఎప్పటికన్నా రుణం తీర్చుకోగలమా? ఇది నా భావన, ఇది నా అంతరంగం. వేదాలు- ఇప్పుడు అందుకనే NASA లాంటివి కూడా మన వేదాల పైన కూడా ఒక research చేస్తున్నాయని కూడా ఉంటా ఉన్నవండి. అవును నిజమేనండి అవును నిజమండి. ఉమ్ నిజం. మరి అది చన-- అది మన వేదాలకు ఒక గర్వకారణమే అంటాంట. ఆ అంతకంటే ప్రామాణికం ఏం ఉంటది. లేదు. కానీ ఇవాళ ఆ చింతించవలసిన విషయం ఏమిటంటే NASA చేస్తున్నది అని మనం అంటున్నాం. ISRO కూడా చేయాలి. అది మనకు ఆనందం. NASA ఏ ఎందుకు చేయాలి? ISRO కూడా చేయాలి. ISRO కనీసం వాళ్ళు ప్రయోగించేటువంటి ఆ టేప్ ని వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టి, దండం పెట్టి వెళ్తున్నారు. అంటే ఏమిటి? మనిషి వాడు ఎంత శాస్త్రవేత్త అయినా ఈ జాతిలో, ఈ రక్తంలో, ఈ గాలిలో, ఆ ఈ మట్టిలో దైవభావన లోపల ఉండనే ఉంది. దాన్ని ఎవరు కూడా erase చేయలేరు. అమైకమైపోయి అమైకమై-- పూర్తిగా. కాబట్టి భగవంతుడున్నాడు, మనకంటే గొప్ప శక్తి ఏదో ఉంది అనేది నమ్మకం అది. కాబట్టి వేదాలని తులనాత్మక అధ్యయనం చేయాలి. మనకు ఎంతవరకు కావాలో అంత-- దాంట్లో contradictions లేవండి. అంతా complete, it's nothing but pure science. దాన్ని తర్వాత మనకు కావలసిన science లోకి మార్చుకోవచ్చు. [background music]
YouTube · audio
ANTHARANGAM | Part 1 | By Harika Cable Vision
ANTHARANGAM | Part 1 | By Harika Cable Vision
Source: SSP GUNTUR on YouTube
0:00 / 33:33
More in this series