Skip to content
Transcript తెలుగు
ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తద్బ్రహ్మ స్పురతాం మే. భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ భగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారంలో మూడు శ్లోకాలు దాటి అంటే కర్తను గురించి చేయవలసిన కార్యకలాపాల గురించి చెప్తూ ఫలితాలన్నీ కూడా భగవంతుడు ఇస్తాడని అంటే కర్త ఇస్తాడని కార్యకలాపాలు ఎక్కడా ఆగకూడదని చెప్తూ కర్మలు దైవాలు కావని అవి జడాలని వాటి ప్రమేయం చాలా తక్కువని మానవుడు తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళటానికి అనేక సోపానాలు ఎక్కవలసిన మెట్లు ఎన్నో ఉన్నాయి అని చెప్తూ కర్మలు చేయకుండా ప్రపంచం జరగదు మనం అనుకున్నాం కర్మానుబంధి మనుష్య లోకే కర్మలు చేయటానికే మానవ జన్మ ఎత్తాం మనం మరి కర్మ చేయకుండా ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు కర్మలు ఎలా చేయాలో చెప్తున్నారు భగవాన్ శ్రీ రమణులు. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం అంటున్నారు. చాలా అందమైనటువంటి సూటి అయినటువంటి గంభీరమైనటువంటి ఉదాత్తమైనటువంటి భావనా స్థితి ఇది. పని చేసినా ఈశ్వరుడికి సమర్పణ చేస్తున్నానన్న భావనతో చెయ్. ఈశ్వరుడు అంటే ఇక్కడ కర్త అని అన్ని కాలాల్లో ఉన్నవాడు ఉండేవాడు ఆతడు మాత్రమే నిత్యుడు సత్యుడు శాశ్వతుడు అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి భావన భగవత్పరమైనటువంటి ఆలోచనకు అనుగుణంగా ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం నేచ్ఛయా అంటే నా ఇచ్ఛయా. నాదేం లేదు ఇది భగవంతుడు చేయిస్తున్నాడు నాకు దీని నుంచి రావలసిన లాభం లేదు నష్టం లేదు నేను చేయవలసినది ఉన్నది గనుక చేస్తూ ఉన్నాను అనేటువంటి భావన వలన మనస్సు పరిశుద్ధమై మనిషికి డూయర్షిప్ పోతుంది. ఇప్పుడు చూడండి మనం ప్రపంచ కార్యకలాపాల్లో ఉన్నాం నేను మాట్లాడుతున్నాను నేను పొందాను నేను పోగొట్టుకున్నాను నేనే చేశాను నేను మాత్రమే చేయగలిగాను ఇది నా వలననే అయింది అని ఒకవైపు ఇది నా వల్ల కాలేదు నేను చేయలేని అసమర్ధుడిని అని రెండోవైపు మానవుడి యొక్క మనస్సు రెండుగా చీలపోయి ఉన్నటువంటి వేళ అసలు ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడు అందులో మనం కేవలం పనిముట్టు మాత్రమే అనుకున్నట్లయితే అది మనస్సుని శుభ్రపరిచే అటువంటి అద్భుత ప్రక్రియ. అంటే భగవాన్ ఏం చెప్తున్నాడంటే నేను అన్నటువంటి భావాన్ని వదిలిపెట్టేసేయ్. దానివలన చాలా సుఖాలు ఉన్నాయి నేను అన్నది నాది అన్నది రెండు అహంకారమమకారాలకు గుర్తులు గనుక నిజానికి ఆత్మవిచార మార్గంలోకి వెళ్ళటానికి రెండే అడ్డం గనుక భగవాన్ చెప్తున్నారు అహాన్ని తొలగించుకో మమకారాన్ని మమత్వాన్ని అంటే నేను చేస్తున్నాను అన్న భావన నేను మాత్రమే చేయగలను అన్న అహంకారాన్ని గనుక వదిలిపెట్టినట్లయితే మనసు శుభ్రపడుతుంది. అయితే ఎవరో చేయించే వాళ్ళు ఉండాలి మనం మొట్టమొదటి శ్లోకంలో అనుకున్నాం కర్మ కింపరం కర్మ తజ్జడం కర్మ ఏముందది దానికి మనం అంటే ఉంది లేకపోతే లేదు నేను చేస్తున్నాను అనుకున్నా పని జరుగుతున్నది ఎవరో చేయిస్తున్నారు అన్న పని జరుగుతున్న ఉన్నది కాబట్టి ప్రపంచంలో చాలా ప్రధానమైన విషయం ఏంటంటే పని జరగటం ప్రధానం. ఎవరు చేయించారు? దానికి కారణం ఎవరు? దానికి ప్రేరణ ఎవరు? దానికి చోదకం ఎవరు? దానికి ప్రోద్బలం ఇచ్చినవారెవరు? ప్రోత్సహించినవారెవరు? అవన్నీ పక్కన పెడితే జగత్తుని మొత్తాన్ని నడిపించేటువంటి ఒక పరా ఈశ్వరుడు ఉన్నాడు. దాన్ని భగవాన్ ఈశ్వరుడని రాముడని అనలేదని అనుకున్నాం కర్త అనే మాట వాడారు. అంటే కాసేటర్ అంటాం ఇవాళ ఆంగ్ల భాషలో. కాసేషన్ ఎవరు కల్పిస్తున్నారో అతడు కాసేటర్ అవుతున్నాడు. అంటే ఇదంతా లీల అంతా ప్రపంచపు పోకడంతా నడకంతా దీని గతి అంతా దీని ధృతి అధృతులంతా కూడా దేనిమీద ఆధారపడినయి అంటే కనపడని కర్త మీద ఆధారపడినయి. కానీ కర్త ఏం చేస్తున్నాడు అంటే ఆయన ప్రణాళిక ప్రకారం దీన్ని నడిపిస్తున్నాడు అందులో మనం కూడా మన పాత్ర నిర్వర్తిస్తున్నాం. ఎంత హాయిగా ఉంది. ఇది నేనే చేస్తున్నాను అనుకోండి చేయలేని రోజు వస్తే, ఇది నేను మాత్రమే చెప్పగలను అనుకోండి చెప్పలేని రోజు వస్తే ఏం చేయాలప్పుడు? దుఃఖం మిగులుతుంది. కనుక ఇవాళ జరుగుతున్న కార్యకలాపం అంతా ఈశ్వరుడి పరంగా సర్వమున్ ఈశ్వర ప్రీతికే సమస్తము ఈశ్వర ప్రీతి కోసం చేయు. ఈశ్వరుడు మళ్ళీ ఎక్కడో బయట లేడు అంతర్యామి అయి ఉన్నాడు. వారు పదే పదే చెప్పినటువంటి మాట యహమహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి. నా లోపల నేను నేను నేను అని వెలుగుతున్నటువంటి జ్యోతిర్మయమైనటువంటి భావననే భగవంతుడిగా నీవు భావించగలిగినట్లయితే లోపల ఉన్న ఈశ్వరుడు చోదక శక్తై ప్రచోదక శక్తై నిన్ను నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట మాట్లాడాలి ఎక్కడి నుంచి వస్తుంది మాట? దీని మూలం ఏమిటి? విచారణ చేస్తే వాక్కు అగ్ని స్వరూపము అన్నది వేదం. నిజానికి అది చిదగ్ని స్వరూపం అందరూ మాట్లాడలేరు. కానీ మాట్లాడేది ఏదైనా అక్కడినుంచి రావలసిందే. కానీ మూలం ఎక్కడ అంటే మూలాధారంలో నుంచి ప్రారంభమవుతుందది. అది నెమ్మది నెమ్మదిగాస్వాధిష్ఠాన మణిపూరక చక్రాలు దాటి హృదయ స్థానమైన అనాహత చక్రం వరకు వచ్చి స్థిమితపడి అక్కడి నుంచి కంఠము అనబడేటువంటి విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు అది సరస్వతీ పీఠంగా కంఠంలో ఉంటుంది గనుక ఒక వాక్కుని సంతరించుకొని ఒక భాష ఒక భావము దాని వెనుక దాగిన తత్వము అభివ్యక్తి అన్నీ కలిసి ఒక వాక్కు అవుతున్నది. వాక్కు అంటే ఇది తోలు నోరు కదా! తాలు మాటలే వస్తాయి. కానీ లోపల నుంచి గనక వచ్చినట్లయితే మూలాధారం నుంచి వచ్చినట్లయితే వాక్కుకి ఒక పవిత్రత ఒక గాఢత ఒక లోతు ఒక ఎత్తు ఒక శుభగ శయ్య ఒక శైలి ఒక శృతి ఒక లయ ఒక అభివ్యక్తి అన్నీ కూడా ఉంటాయి. అప్పుడు మాత్రమే వాక్కు బాగుంది అంటాం. దాన్ని శుద్ధ వాక్కు అన్నాం. శుద్ధ వాక్కుతో పాటుగా వశ్య వాక్కు అని రెండో మాట ఉన్నది. అంటే ప్రపంచ క్షేమాన్ని కాంక్షించినటువంటి వ్యక్తి "ఈ సమస్త లోకా: సుఖినోభవంతు" అని అన్ని వేళలా ఎవరైతే నిలకడ చెంది ఉంటారో పక్కవాడి సౌభాగ్యాన్ని నిరంతరం కాంక్షిస్తూ ఉంటారో వాడిది శుద్ధ వాక్కు. వాక్కు ఫలించింది. అయ్యా మీరు చెప్పారు అది అయిపోయింది అంటున్నాం. చెప్పిన వాడి తత్వంలో లేదది. చెప్పిన వాడి వాక్కులో ఉన్న బలం అది. ఏమిటి వాక్కు అంటే వీడికి మంచి జరుగు గాక అనుకొని నీకు మంచి జరుగుతుందిలే అన్నాడు. అది అయిపోయింది. లోపల వీడికి మంచి జరగటానికి వీలు లేదని అనుకుంటూ పైకి నీకు మంచి జరుగుతుందిలే అన్నాం అనుకోండి అది ఫలించదు. కాబట్టి ఫలించటానికి ఫలించపోవటానికి శుద్ధత్వము సిద్ధత్వము సంసిద్ధత్వము కారణమవుతున్నాయి గనుక పనులన్నీ కూడా కార్యకలాపాలన్నీ కూడా పరమేశ్వరుడికి సమర్పించేటువంటి రీతిలో చేయమంటున్నారు భగవాన్. నిజానికి మనం దేనినీ భగవంతుడికి సమర్పించం. అహంకారం వల్ల. మనం మన శక్తి సామర్ధ్యాల మీద ఎక్కువ నమ్మకం ఉన్న వాళ్ళం గనుక జరుగుతున్నదంతా మన వల్లనే జరుగుతున్నదని మన వల్ల మాత్రమే జరుగుతుందని తెలియకుండా ఒక అహంకారపు చీకటిలో పడిపోతాం. దానివలన వాక్ పారుష్య ఏర్పడుతుంది. వాక్కులో ఒక పదును తెలియనటువంటి ఒక విరుక్త భావం ప్రతికూల భావనాలు ఇవన్నీ కూడా వాక్కుని ఆక్రమిస్తాయి గనుక "ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం" నే నా ఇచ్ఛ ఇది ఇట్లా జరగాలి అన్న భావన లేకుండా పనులు జరగనీయవు. కానీ ఒక ఇచ్ఛ ఉండాలి. సప్తజ్ఞాన భూమికలలో మొట్టమొదటిది శుభేచ్ఛ. శుభమైనటువంటి కోరిక ఉండాలి. ఏది శుభం? నీ వలన ప్రపంచానికి మంచి జరిగితే అది శుభం. నీ వలన ప్రపంచానికి హాని జరగకపోతే అది శుభం. కాబట్టి నీ వల్ల మంచి జరగాలి అంతేకాదు చెడు జరగకుండా కూడా ఉండాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈశ్వరుడికి సమర్పించిన తర్వాత. పవిత్రత ఏర్పడుతుంది. నిజమేనా? ఆలోచిద్దాం. మన కుళాయిలో నీళ్లు పట్టుకుంటాం. ఒక గ్లాసులో పట్టుకుంటాం. అప్పుడే మనమే పట్టుకొచ్చాం నీళ్లు. అందరికీ వచ్చినట్లే మనకి వచ్చినయి. భగవంతుడి దగ్గరికి వెళ్లి కూర్చొని మంత్రోక్తంగా దాని గురించి కాసేపు మాట్లాడుకొని భగవంతుడికి అర్పించి దానిలో పువ్వు పెట్టి నాలుగు తులసి దళాలు వేసి అనేకమైనటువంటి నదులను ఆవాహన చేసి మనవాళ్ళు చేసేది అదే కదా! ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత దాన్ని మనం నీళ్లు అనటంలే తీర్థం అంటున్నాం. చూశారా? తీర్థము అనే పడేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే శుద్ధత్వంలో నుంచి ఏర్పడింది గనుక పరిపూర్ణమైనటువంటి భావనా స్థితిని అలాగే రెండవది ఒక స్త్రీమూర్తి లేదా ఒకరు వంట తయారు చేశారు. అది వంటే ఎవరైనా వండవలసిందే వండారు. భగవంతుడికి నైవేద్యం పెట్టారు. మనం వండినంత సేపు అది కేవలం సాధమే. భగవంతుడికి సమర్పించిన తర్వాత అది ప్రసాదం అవుతున్నది. నీరు ఎట్లాగైతే తీర్థంగా మారిందో సాధం ఎట్లాగైతే ప్రసాదంగా మారిందో భగవదర్పితం చేసిన కర్మకలాపాలు కార్యకలాపాలన్నీ కూడా పవిత్రీకరింపబడతాయి. దానివలన ఒక శుద్ధత్వం ఏర్పడుతుంది. దానివలన ఒక బలం ఏర్పడుతుంది. దానివలన లోకానికి చాలా ఉపకారం జరుగుతుందని చెప్తూ "ఈశ్వరార్పితం నిశ్చయా కృతం". ఇది నాది ఇది నాకు కావాలన్న భావన లేకుండా చేయటం ఇది చాలా చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడ మనం విచారణ చేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే అకర్తృత్వ భావన non-doership నేను చేశానన్నటువంటి భావన నుంచి మనస్సును బయటకు నెట్టేయటమే. ఎందుకంటే అన్ని పనులు అన్ని వేళలా మన వల్ల కావు. కొన్ని పనులు అవుతాయి కొన్ని కావు. అయ్యే పనులు కూడా ఒక్కొక్కసారి వైఫల్యాన్ని చెందుతాయి. దీనికి కారణం ఏంటంటే భగవంతుడికి మనం సమర్పించకుండా చేస్తున్న కారణం వలన వాటికి బలం లేకపోతూ ఉన్నది. అలాగే భగవంతుడు అనబడేటువంటిది విగ్రహం ఉన్నది. విగ్రహం ఎందుకున్నది? నిగ్రహం కోసం ఉన్నది. విగ్రహారాధన అనబడేటువంటి ఒక పవిత్రమైన భావన మన మనస్సు యందున్నప్పుడు విగ్రహం దగ్గరకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తున్నాం? అయ్యా ఇవాళ నేను పరీక్ష రాయబోతున్నాను, ఇవాళ వ్యాపారం చేయబోతున్నాను, ఇవాళ ఏదో ప్రవచనం చెప్పబోతున్నాను, ఇవాళ ఏదో మంచి పని చేయబోతున్నాను, నీ అనుగ్రహం కావాలి అంటున్నాం.అంటే ఏం చేశాం? మనకంటే అధికమైనటువంటి ఒకానొక శక్తి ముందు మనం మోకరిల్లి, సమర్పణ, శరణాగతి, వినయము అన్నటువంటి మూడు భావముల చేత మన ఆలోచనకి బలాన్ని తెచ్చుకున్నాం. జీవ ప్రజ్ఞని దైవ ప్రజ్ఞతో అనుసంధానం చేశాం. విగ్రహాన్ని మనం చూస్తూ ఉన్నంత సేపు మన మనస్సు అటూ ఇటూ పోలే, చూసారా. ప్రపంచంలో మిగతావన్నీ చూసినప్పుడు మనస్సు అటూ ఇటూ పోయింది. కానీ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు మన మనస్సు మన దగ్గరే ఉంది. మనదైనటువంటి భావనా స్థితిని మనం గనక అర్థం చేసుకోగలిగినట్లయితే, ఈశ్వరుడు ఇంకొక మాట "ప్రతిమా ఈశ్వరః" అని ఒక మాట ఉంది. అంటే బొమ్మ బ్రహ్మకి సంకేతం. బ్రహ్మము కనపడదు, బొమ్మ కనపడుతూ ఉంటుంది. కనబడుతున్నటువంటి బొమ్మలో నుంచి మనం బ్రహ్మం వైపు ప్రస్థానం చేయాలి. బొమ్మ సగుణమైనట్లయితే బ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ తత్వం. మళ్ళీ అక్కడ పరబ్రహ్మ స్వరూపం లేదు, అరూపం అయిపోయింది. కాబట్టి తీవ్రమైనటువంటి విచార ధారలో విగ్రహం ఈశ్వరుని విగ్రహంగా భావించినా, నిగ్రహ స్వరూపంగా భావించినా, శాలంకృతమైన విష్ణువుగా చూసినా, నిర్వికార నిర్విశేషమైనటువంటి జడంగా ఒక లింగ స్వరూపంగా చూసినా, దేవీదేవతా స్వరూపాన్ని మనం దర్శనం చేసినా, దాని వెనక ఉన్న తత్వాన్ని గ్రహించాలి గనుక హైందవమైన సనాతనమైనటువంటి ధర్మంలో అనేక కోణాలున్నాయి. [గొంతు సవరించిన శబ్దం] మిగతా వారికి ఒకే కోణం ఒకే దారి అలా వెళుతూ ఉంటారు. కానీ ఇది బహుముఖీనమైనటువంటి విస్తృతమైనటువంటి విచార ధార గనుక, నువ్వు మార్గాన్ని ఎంచుకొని వెళ్ళినా నువ్వు చేరవలసిన గమ్యం ఇదేనని చెప్తూ, "ఈశ్వరార్పితం నిశ్చయాకృతం" దీని వల్ల ఏమిటి ఫలితం? సమాధానం ఇస్తున్నారు రమణులు. "చిత్తశోధకం ముక్తి సాధకం" చిత్తము అంటే జన్మాంతరంగా మనం తెచ్చుకున్నటువంటి సంస్కార ఫలాల మూట చిత్తం. మనస్సు అంటే ఆలోచనల కట్ట. అది మన యందే పుట్టింది. అది ఇప్పుడు పుట్టింది. మనస్సు పాతది కాదు మనస్సు ఇప్పటిది. చిత్తము ఇప్పటిది కాదు ఎప్పటిదో అనేక జన్మలు మనం గడిచి, గడిచి, గడిచి నడిచి, నడిచి వచ్చాం గనుక ఆయా జన్మలలో మిగిలిపోయినటువంటి వాసనలన్నీ కూడా ఆగామి, సంచిత, ప్రారబ్ధ అనబడేటువంటి మూడు కర్మలుగా ఏర్పడిన కారణంగా వాటన్నింటినీ వదులుచుకునేటువంటి ప్రయత్నం కోసమే మానవ జన్మ ఇవ్వబడింది. ఇందులో శోధించవలసింది అంటే అన్వేషించవలసింది, వెతకవలసింది, పట్టుకోవాల్సింది, పట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవాల్సింది ఏది అంటే చిత్తమే. [బ్యాక్ గ్రౌండ్ music]
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -12

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -12

Source: TFC Spiritual on YouTube

0:00 / 16:14

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

    Now playing
  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77