Skip to content
Transcript తెలుగు
[ back ground music] అందరికీ నమస్కారం literary guru karfi man lo ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రచయిత వి.ఎస్.ఆర్.మూర్తి గారు మనతో ఉన్నారు వి.ఎస్.ఆర్.మూర్తి గారు ముప్పై ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు వారు oil technologist. వారి సాహిత్య ప్రయాణాన్ని వారి మాటల్లో విందాం. వి.ఎస్.ఆర్.మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే తురుమేలలో మొదలైన మీ ప్రయాణం అంచెలంచెలుగా సాగుతూ ఒక పక్కన మీరు oil technologist ఇంకో పక్కన ఆధ్యాత్మికత అన్నిటినీ పెనవేసుకుంటూ సాగుతూ వచ్చింది. ఒక్కసారి మా అందరికీ journey ని కాస్త వివరిస్తారు. తప్పకుండా [ throat clearing] తురుమేలలో పవిత్ర బాల్యం ప్రారంభమైంది. ఉమ్ అక్కడి నుంచి ప్రకాశం జిల్లా ఇంకొల్లు. అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదట రచనా వ్యాసంగం అప్పటికి పన్నెండేళ్ళు దానికంటే ముందు ఉమ్ నాలుగవ ఏట హనుమాన్ చాలీసా ధారణ చేయటం ఉమ్ రఘువరదాసు గారు చాలా ఆనంద పడటం అదొక అద్భుతమైన దృశ్యం ఉమ్ నాలుగవ ఏట మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇంకొల్లు వెళ్ళినప్పుడు స్కూల్ వాళ్ళు నన్ను ఒక science fair కి select చేసినప్పుడు ఏదన్నా ఒక మంచి వ్యాసం present చేయమని అడిగారు paper presentation ఇవాళ ఉమ్ సరే అందరూ నన్ను master దగ్గరికి వెళ్లి science master దగ్గరికి ఒక article రాయించిను వెళ్లి చదివి వచ్చేయ్ అన్నారు select చేసింది నన్ను కాబట్టి నేను ఏం రాయాలో నేను నిర్ణయించుకుంటానని పల్లెటూరులో గ్రంథాలయం పుస్తకాలు reference ఏం లేవు I walked up to వేటపాలెం ఉమ్ సరస్వత నికేతనానికి వెళ్లి అక్కడ భారతి అని popular magazine రోజుల్లో అందరికీ తెలుసు దానిలో చూస్తే వరాహమిహిరుడి మీద ఒక వ్యాసం ఉంది but జటిలమైన తెలుగు ఉమ్ సంపూర్ణ గ్రాంథికంలో ఎవరో రాశారు అది but దాన్ని అర్థం చేసుకుని ఆలోచనలు రేకెత్తినప్పుడు దీన్ని గనక మనం ఇవాళ అర్థం చేసుకుని రాయగలిగితే బాగుంటుందని అక్కడికక్కడ కూర్చొని ఒక article తయారు చేశా. దానిలో రావణాసురుడి పుష్పక విమానం గురించి ఒకటి. వరాహమిహిరుడి కాలంలో ఇవాళ మనం దేనినైతే సిమెంట్ అంటున్నామో ఆయన వజ్రసంఘాతం అని పేరు పెట్టారు. mortar ఏదైతే ఉందో దాన్ని వజ్రలేపనం అని పేరు పెట్టారు. అలాగే water divining ఎలా చేయాలి? భూగర్భ శాస్త్రం ఉంది. ఇవన్నీ రాసినప్పుడు నాకు తెలియని లోక లోకాంతర ప్రాణాలలో ఇంత మహా వాంగ్మయాన్ని మహానుభావుడు ప్రపంచానికి ఇచ్చారు అని బహుశా నేను రాసిన మొట్టమొదటి article వ్యాసం ఉమ్ అదే అది అక్కడికి నేను బాపట్ల Salvation Army School లో జరిగినప్పుడు దానికి వచ్చిన judges అంతా IITians, IIT professors. ఉమ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు ఒక్కసారి వాళ్ళు ఆశ్చర్యపోయారు. పన్నెండేళ్ళ వాడు ఇవన్నీ ఎలా రాయగలిగాడు? అని paper తీసేసుకున్నారు. ఉమ్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు చెప్పగలవా అని అడిగారు. ఉమ్ యథాతథంగా చెప్పా. అసలు రకమైన ఒక syllable కూడా తేడా లేకుండా చెప్పా and naturally I won the first prize and it was the first national award. పన్నెండేళ్ళ వయసులో పన్నెండేళ్ళ వయసులో అయితే అంతకు ముందు బాల్యంలో మీరు నాలుగేళ్ళ వయసులో హనుమాన్ చాలీసా ధారణ చేయటం గురించి అవును మీరు సూచిప్రాయంగా చెప్పారు గాని సూచ అంటే రఘువరదమ్మ నన్ను పెంచుకున్న మా అమ్మమ్మ ఉమ్ నాకు ఆశీర్వచనం ఇప్పించాలని ఒక స్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన స్వామి వారు కాదు సంకీర్తనాచార్యులు. ఉమ్ తీసుకెళ్తే ఆయన ఆశీర్వచనాలు అలాంటివి ఏం చేయకుండా హనుమాన్ చాలీసా చేతిలో పెట్టారు. ఉమ్ భాషేమో తెలుగు ఉమ్ లిపి ఉమ్ దాని వెనక ఉన్నటువంటి భావం అంతా తెలుగు కాదు అది, అది ఏదో భాష. కానీ తెలుగు లిపి చదవచ్చుగా సరే అని అన్నారు ఒక దోహా గనక చెప్తే అరటి పండు ఇస్తాను సాయంకాలం వరకు time ఇచ్చారు. కానీ ఒక అరగంటలో నేను అటూ ఇటూ చూసుకున్నట్టున్నాను. దాని కారణం ఏమిటి అనేది మనం ఇవాళ విశ్లేషిస్తే నిజానికి జవాబు లేని ప్రశ్న అది. ఒక అరగంటలో ఆయన దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ హనుమాన్ చాలీసా మీ ముందు అప్పజెప్తాను అన్నా. ఆయన book ఇవ్వబోతుంటే నాకు వచ్చు నువ్వు చదువు అన్నారు. పుస్తకం నాకు అక్కర్లేదని చేతులు కట్టుకొని ఆయనకి ఉమ్ చదివి వినిపించా. ఆయన మంచి ఆజానుబాహు నేను చాలా చిన్నవాడిని. ఆయన భుజం మీద ఎక్కించుకొని గదిలో ఒక మూలకు తీసుకొని వెళ్లారు. అక్కడ పెద్ద అరటి గెల ఉంది. రెండువందల యాబై, మూడువందల అరటి పండ్లు ఉంటాయి దానికి ఒక కొమ్ము ఉహుహుహు ఆయన అన్నారు. ఆయన కళ్ళ వెంబడి కన్నీరు కారుతున్నది, ఆనందం ఉమ్ కన్నీరంటే కంటి నుంచి వచ్చిన ఆనంద భాష్పాలు. ఊహించలేదు నేను ఒక అరటి పండు అనుకున్నాను గెలంతా నీదే అన్నారు. గెలలో సగం లేను నేను ఉహుహు అది హనుమాన్ చాలీసా ధారణ గురించినటువంటి విషయం. తర్వాత మళ్ళీ జరిగినటువంటిది వరాహమిహిరుడు ప్రవచనం వరాహమిహిరుడు ప్రవచనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. పేరు వెనుక ఉన్నటువంటి కాస్త కథ కామాన్ని చాలా నాకెప్పుడూ కూడా నేను ఎదుర్కొనే ప్రశ్నల్లో ఇదొకటి ఉహుహు సత్యసాయిబాబా వారు నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసున్నప్పుడు ఒకసారి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉమ్ నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవి కావాలి, అవుతావు అన్నారు. అర్థం కాలే. ఆధ్యాత్మిక శాస్త్రంలో అధ్-అధ్యాత్మలో గనక ఉన్నట్లయితే ఒక పీఠాధిపతి స్థాయికి వెళ్ళగలను. నాలో శక్తి గనక ఉంటే scientist ని కాగలను. ఉమ్ బట్ రెండూ కలిపారేమిటి అనుకున్నా. అప్పుడు బాబా గారు రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, గణిత శాస్త్రము, భాషా శాస్త్రం ఎట్లా ఉన్నాయో భారతదేశంలో అధ్యాత్మ శాస్త్రం ఉంది. ఒక పురాణాన్ని ప్రవచనం చేయటం వేరుఒక పురాణాన్ని గానం చేయటం వేరు, ఒక పురాణాన్ని జనరంజకంగా చెప్పటం వేరు చలోక్తులతో కానీ పురా సంస్కృతి పురాణం అంటే పాతది. పాత దానిలో ఉన్నటువంటి సంస్కృతిని, దానిలో దాగిన వైజ్ఞానికమైనటువంటి కోణాలని సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ చెప్పగలిగితే దాని పేరు అధ్యాత్మ శాస్త్రము. అది కావాలి, అవుతావ్ అన్నారు. ఏదో నేను అనుకోలే, కానీ తర్వాత తర్వాత జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది అయినాను. హ్మ్ ఇవాళ నన్ను వి.ఎస్.ఆర్.మూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని రాసేస్తారు వాళ్ళే. హ్మ్హ్మ్ ఎందుకని? అదేం బిరుదు కాదు. అంటే నేను ఏం కావాలో దిశానిర్దేశం జరిగింది. వారి మాట పొల్లుపోకుండా నా జీవితంలో రెండింటినీ కూడా సమాంతరంగా ఒకవైపు అధ్యాత్మని, రెండోవైపు సైన్స్ ని, ఆయిల్ టెక్నాలజీని వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్లినప్పుడు అధ్యాత్మకి, సైన్స్ కి మధ్య ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే లిటరేచర్. హ్మ్ హ్మ్ బాగుంది అనుసంధానం చేస్తూ. అనుసంధానం చేస్తూ. ఎందుకని? నాకో భావం ఉంది, మీతో మాట్లాడాలి. తగిన భాష కావాలి కదా. అవును ఏదో మా చాలా casual గా మాట్లాడటానికి లేదు కదా. దానికి నిర్దిష్టమైన భాష, దానికి ఒక గతి, ఒక శృతి, ఒక లయ. ఇవన్నీ కూడా లేకపోతే వాక్యం రసాత్మకం కాదు అని గట్టిగా నమ్మిన వాడిని గనుక ప్రాచీన ఆంధ్ర సాహిత్యం తీవ్రంగా చదివా. ఓహ్ తీవ్రంగా. హ్మ్ ఇష్టం కొద్దీ చదివా. ఒక్కొక్క ఇష్టం లో ఒక్కొక్క వాళ్ళ నుంచి ఒక్కొక్క, అదొక పెద్ద పూల తోట అయితే పూల తోటలో నుంచి ఒక్కొక్క తేనె బిందువుల్ని ఒక భ్రమరం లాగా నేను పట్టుకోగలిగాను అని అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ అడగాలి మిమ్మల్ని. పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వనాథవారిని కలిశారు కదా. అవునండి, అవును. సో పద్దెనిమిదేళ్ళ వయసు కుర్రాడు అసలు విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక, మార్తాండ్ తేజుని కలవడం ఎట్లా సాధ్యం, ఎట్లా జరిగింది? ఎట్లా అంటే దానికి మళ్ళీ మా direct గురువుగారు నండూరి రామకృష్ణమాచార్యుల వారు. హ్మ్ ఆంధ్రోద్యమం జరుగుతున్న సమయం అది. హ్మ్ నాకు ఒక ఉత్తరం ఇచ్చి, "నాయనా! నువ్వు విజయవాడ వెళ్ళి విశ్వనాథవారి చేతిలో ఉత్తరం పెట్టు." హ్మ్ "మళ్ళీ జవాబు ఇవ్వూ, ఇవేం అడగొద్దు నువ్వు. ఉత్తరం ఆయనకి ఇచ్చేసేయ్. ఆయన ఏం చేస్తారో చూడు" అని అన్నారు. సరే అని వెళ్ళాను. అప్పటికి నేను విశ్వనాథవారి వేయి పడగలు. హ్మ్ ఏకవీర, చెలియలి కట్ట, తరువాత ఆంధ్ర ప్రశస్తి. హ్మ్ పద్యాలన్నీ నాకు కంఠోపాఠం. హ్మ్ ఆ, ఊరు నుంచి ప్రయాణం వెళ్తున్నప్పుడల్లా పద్యాలన్నీ లోపల తిరుగుతున్నాయి. శ్రీమద్రామాయణ కల్పవృక్ష పద్యాలు, ఇవన్నీ కూడా. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో, ఆయనకి చేతికిచ్చానో silent గా ఉండమన్నారు, ఉన్నా. అంతే. ఉత్తరమంతా చదువుకున్నారు. చివరిలో "ఏమోయ్ మీ గురువు గారికి ఇంత లౌక్యం ఎప్పుడబ్బింది?" అన్నారు. హ్మ్ "ఏమిటా లౌక్యం నాకు తెలీదు, ఉత్తరం లో ఏముందో నాకు తెలీదు కదా." హ్మ్ "మిమ్మల్ని దర్శించటానికి మా రామచంద్రమూర్తికి అన్యార్హతలు ఉన్నాయి" అని రాశారు. "ఇక నేనేం చేయను?" అన్నారు నవ్వుతూ. అప్పుడు ఆయన చాలా మంచి దీంట్లో ఉన్నారు mood అంటామే. హ్మ్ time లో "మీరంటే నాకు ఇష్టం." అన్నా. ఎందుకంటే నేను ఆయన్ని దర్శనం చేయాలని కోరిక. అప్పటికే ఆయన సహస్రం చదివేశారు. చదివేశాను. "మీరంటే నాకు ఇష్టం." అన్నా. అప్పుడు అసలు విశ్వనాథవారు బయటికి వచ్చారు. హ్మ్ అంటే "నేను చదివిని, నేను రాసిన ఒక పద్యం వచ్చా నీకు?" అన్నారు. చేతులు పెట్టుకొని ఇరవై రెండు పద్యాలు వరుసగా చదివానండి. ఆయన, నేను చదివినంత సేపు ఆయన కంఠం పైకి, కిందకి ఊగుతున్నది. పద్యం చదవటం ఒకచోట ఆపేశాను. అవి ఇరవై రెండు పద్యాలు. హ్మ్ అంటే సుమారు ఒక గంట చదివాను. one hour. One hour ఆయన అలా పీట మీద కూర్చుని, ఆయన కుర్చీలో వేయన, పీట మీద కూర్చున్నారు. హ్మ్ కూర్చొని వింటూ వింటూ ఆయన కళ్ళెంబడి సన్నగా. అశ్రుధార మళ్ళీ అశ్రుధార, ఆనందధార కారుతూ ఉంటే "నేను పోతాను. ఏదో రోజు పోతాను కదా, కానీ నేను రాసిన పద్యాలు ఉంటాయి. ఇష్టం అంటే ఇది ఇష్టం. అసలు చదవకుండానే అభిప్రాయాలు ఏర్పరుచుకుంటే ఎట్లా? నువ్వు ఇవాళ ఇక్కడ భోంచేసి వెళ్ళాలి" అన్నారు. భోజనం ఆయన స్వయంగా వాళ్ళింట్లో బావి పక్కన ఒక అరటి చెట్టు ఉంటే. హ్మ్ అక్కడ ఒక ఆకు కోసి, కడిగి. హ్మ్ తువాలుతో తుడిచి. హ్మ్ నాకు అన్నం పెట్టి, ఒక రిక్షా పిలిచి, "బస్ స్టాండ్ లో బస్సు ఎక్కించి నువ్వచ్చి నా దగ్గర రిక్షా డబ్బు తీసుకోమని" అతనికి అప్పజెప్పి అంత బాధ్యతగా సాగినటువంటి విశ్వనాథవారిది అది పరమ రమణీయమైన, ఆర్ద్రమైన సన్నివేశం. సన్నివేశం నా జీవితంలో. హ్మ్ తర్వాత అదే రామాయణ కల్పవృక్షాన్ని వారి అనుగ్రహం అనుకుంటా. హ్మ్ పద్నాలుగు నెలలు మొత్తం కావ్యగానం చేశా. ఓ! హ్మ్ అయితే. హ్మ్ ఇంకో పక్కన మీరు ఆయిల్ టెక్నాలజీ చదవటం కోసం కాన్పూర్ వెళ్ళారట. అవునండి కాన్పూర్. అవును అప్పట్లో IIT. ఇంకా IIT పూర్తిగా form కాని. అవుతూ ఉన్న time అది. time ఇంకా పూర్తి కాలే. అక్కడ చదివారు. హ్మ్ మరి మీ-మీరు వెస్ట్ జర్మనీలో కొంతకాలం పనిచేసినట్టున్నారు. చేశా అక్కడి నుంచి అమెరికా వెళ్లారు. హ్మ్ మళ్ళీ World Bank project కి వచ్చారు. project కి India. రకమైన traversing through the world లా చేశారే. ఇది, ముఖ్యంగా వీటన్నింటికీ ఏమిటి కారణం అని ఆలోచించాను. హ్మ్ ముందు మనం ఏం చదవాలో నిర్ణయించుకోవాలి. హ్మ్ ఏం కావాలో నిర్ణయించుకోవాలి professional గా. నేను ప్రయత్నం చేశా. scientist వేరు, technologist వేరు. హ్మ్ నేను spiritual scientist అనేది రాసినా కింద oil technologist అనే పదం వదిలిపెట్టాను. హ్మ్ ఎందుకని అంటే scientist ఒక విషయం గురించి పరిశోధన చేస్తాడు. Technologist దాన్ని apply చేస్తాడు. బాగుంది. హ్మ్ Technologist లేకపోతే అది పుస్తకంలో ఉండిపోతుంది. రైట్ పరిశోధనా గ్రంథంలో. రైట్ రెండు కారణాల వలన రెండింటినీ సమన్వయం చేసుకుంటూThe applicability of science is real technology. మ్ అందువల్ల నేను ఎలై లైసో థయో సయనేట్ అని దాని మీద patent చేశాను Patent చేస్తే బోలెడు డబ్బులు వస్తాయి చాలా డబ్బులు వస్తాయి అమ్ముకుంటే కానీ మళ్ళీ ఇవ్వాల సత్యసాయి బాబా గారిని గురించి నేను తలుచుకోవాలి మ్ రోజున నాకు టెలిగ్రామ్ వచ్చింది జేబులో ఉంది కూర్చున్నాము "knowledge నిన్ను సంపదని hoard చేయకూడదు మ్ ప్రపంచ పరం చేయాలి ఇది ధర్మం" అని అన్నారు ఎవరితోనో అన్నారు ఆహా అదే రోజు సాయంకాలం post office కి వెళ్ళి I relinquished all my patent rights మ్ ఇచ్చి దీన్ని ఏదైనా ఒక సంస్థకి ఇచ్చేసేయండి దాని వల్ల వాళ్ళు commercialize చేసి ఇది ప్రపంచంలోకి అది వెళ్ళిపోతుందని ఇచ్చేసి నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నా మ్ అప్పుడు మాట్లాడారు బాబా గారు. ఏమనంటే "గురువుని సేవించటము భగవంతుణ్ణి నమ్మటం అంటే పూజలు చేసి ఊరేగింపులు చేయటం కాదు చెప్పిన మాట వినటమే దానిని మించిన గురు దక్షిణ లేదు ఇవ్వాళ చాలా సంతోషంగా ఉన్నది" అని అన్నారు చాలా సంతోషం నిజంగానే అండి ఇది చాలా ఒక మధుర స్మృతిని గుర్తు చేశారు మ్ మళ్ళీ మీరు World Bank project ద్వార-ద్వారాన తిరువణ్ణామలై వెళ్ళి World Bank కొంతకాలం ఉన్నారు ఇవన్నీ అండి trust with destiny అండి మ్ మళ్ళీ పద్దెనిమిదవ ఏటే అధ్యాత్మ శాస్త్రవేత్త అవుతావు అన్నప్పుడు సంవత్సరంలోనే మ్ మళ్ళీ బాబా గారు ఏమన్నారంటే మానవ జన్మ ఎత్తినందుకు ఒక్కసారైనా తిరువణ్ణామలై వెళ్ళాలి అసలంతా అక్కడుంది అన్నారు మ్ మామూలుగా సాధారణమైన గురువు అయితే అట్లా అనరు అంతా ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళద్దు అంటారు అసలు ఉన్నదంతా అక్కడే ఉన్నది అన్నారు కానీ తిరువణ్ణామలై ఎక్కడో నాకేం తెలియదు. World Bank projects scheme లో తిరువణ్ణామలై లో ఒక World Bank project పెట్టవలసి వచ్చింది మ్ సో నన్ను select చేసుకున్నారు automatic గా నేను Bombay నుంచి తిరువణ్ణామలై వెళ్ళా మ్ వెళ్ళటానికి మధ్యలో I was all poised అంటే నేను వెళ్ళాలి ఎక్కడ Raichur లో మ్ ఏడు projects కి incharge గా వెళ్ళాలి నా books నా drawings అన్నీ ready అయినాయి మ్ కానీ రోజున chairman "ఎవరు వెళ్తున్నారు seven projects కి" అన్నారు "ఇలా మూర్తి గారు no no no we should not just anchor him there మ్ He is the great force మన projects అన్నీ తమిళనాడులో ఉన్నాయి అక్కడికి పంపిద్దాం" అన్నారు అట్లా నేను తిరువణ్ణామలై వెళ్ళటం మ్ రమణాశ్రమం అదే తిరువణ్ణామలై లో ఉండటం రైట్ One hundred and eighty eight days ఉన్నానండి మ్ మొన్న two thousand twenty February కి మ్ Just before corona I completed hundred గిరి ప్రదక్షిణస్ జన్-ఈ జన్మలో అరుణాచల ప్రదక్షిణస్ అరుణాచల గిరి ప్రదక్షిణం వంద పూర్తి చేసుకున్నా అదేం record కాదు అసంభవమూ కాదు కానీ మనకి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాని పట్ల నిష్ఠ ఉండాలి మ్ శ్రద్ధ ఉండాలి పట్టుదల ఉండాలి time frame లో జరిగిపోవాలి అంతే రమణ మహర్షి ఆశ్రమం తిరునామలై వెళ్ళినప్పుడు మీరు అక్కడ మీకు కలిగినటువంటి ఒక enlightenment నాది చెప్పండి అసలు మొట్టమొదట ఇందాక చెప్పా కదా project కోసం వెళ్ళినప్పుడు రమణాశ్రమంలో నేను అడుగు పెడుతున్నప్పుడు ఇవ్వాళ చెప్పగలను మ్ నా భావాలు సర్వాంగీణమైనటువంటి దేహంలో నాకు తెలియని ఒక ప్రశాంతత ఒక నిర్లిప్తత ఒక ఆనందం మ్ మ్ మ్ A state of neutrality అంటాం మ్ అది అడుగు పెడుతుండంగా నేను అనుభవించా అప్పటికి భగవాన్ లేరు మ్ ఆయన ఎప్పుడో nineteen fifty లోనే దేహం చాలించారు మామూలుగా గుడిలోకి వెళ్తారు ధ్యాన మందిరంలోకి వెళ్తారు లేకపోతే అక్కడున్న వస్తువులు చూస్తుంటారు నేను direct గా వారి నిర్వాణ గది అని ఒకటి ఉంటుంది Where he left his body మ్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నా కళ్ళେం బడి నీళ్ళు వచ్చినాయి మ్ తర్వాత ఆశ్రమం అంతా నాకు ఇంతకు ముందే తెలిసినట్లు మ్ నేను అక్కడ సంచారం చేసినట్లు నాకేదీ కొత్త అని అనిపించలేదు అంటే మొదటిసారి వెళ్ళినట్టుగా అనిపించలేదా అసలు లేదు మ్ అసలు నాకు చాలా పరిచయమైన ప్రదేశానికి వెళ్ళానని అనిపించింది మ్ అది నన్ను అరుణాచలం లో స్థిమితం చేసింది మ్ అరుణాచలం పై వరకు ఎన్ని ఆదివారాలు వెళ్ళానో లెక్కే లేదు మ్ ఎన్ని గిరి ప్రదక్షిణాలు ఇందాక చెప్పా కదా చెప్పారు అవును అవును అయితే అక్కడ ప్రశస్త ఏమిటంటే ఏమి పొందాను అంతా అక్కడే ఉందన్నారుగా మ్ అంతా ఏమిటి అని దేనినైతే అంతా నా దగ్గర ఉన్నదనుకున్నానో మ్ దానిని దాటిన అతీతమైనటువంటి ఒక ఆత్మ మ్ లేదా ఆత్మ పరమైనటువంటి ఒక దివ్య భావన అది నాయందే ఉన్నది మ్ బయట కనిపించే దేవీదేవతలు కూడా నా వంటి స్వరూపాలే కానీ అరూపమై నిర్గుణమై నిష్ఠులమై నికేతనమై నిరంజనమై నిత్య సత్య శాశ్వతమై ఏది నా యందున్నదో అది నేను అని నేను భావాన్ని దాటి నేను లోకి ప్రవేశించడమే నేను పొందిన అనుభూతి అవును రమణ మహర్షి మీద మీరు దాదాపు ఒక ఆరు, ఏడు పుస్తకాలు రశాను రశారు రశారు సో పుస్తకాల గురించి కాస్త మాట్లాడుకుందాం మొట్టమొదటి పుస్తకం సాయి రమణీయం మ్ మళ్ళీ సాయి ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే పుస్తకంలో ఏముందంటే "All gurus are one but all are not gurus" అది theme మ్ కనిపించిన ప్రతి వాడు కాషాయం కట్టిన ప్రతి వాడు గురువు కాడు గురు స్థానం లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ ఒకటే అంటే ఒక శంకరులు ఒక సత్యసాయి ఒక రమణులు ఒక అరవిందులు వీళ్ళంతా ఒక స్థాయికి చెందిన వాళ్ళు అని బట్ మిగతా వాళ్ళంతా పాత్ లో వెళ్తున్న వారు వాళ్ళ గురించి ప్రస్తావన అక్కర్లేదు మ్ ఇక రెండవది మౌనోపదేశం మ్ మౌనోపదేశం అంటే ఉపదేశ సారం మ్ నన్ను spiritual scientist అని ఎలా అంటారో నన్ను ఉపదేశ సారం మూర్తి గారని కూడా పిలుస్తారు మ్ చాలా గంభీరమైన విషయం అదిఅది అనేక మాధ్యమాల్లో దాని గురించి మాట్లాడటం ఉమ్ ఉపదేశ సారాన్ని సమగ్రంగా సత్సంగ రూపంలో ఇవ్వటం జరిగింది అది రెండవది. మూడవది ఉన్నది నలభై అని ఉన్నది నలభై అదే అద్వైతం ఉమ్ దాన్ని దర్శన పౌర్ణమి అని రాశాను పౌర్ణమి దర్శనాలు మన తాతలంతా చేశారు మనం కూడా చేస్తాం అవునండి అంటే ఆకాశంలో సహస్ర చంద్ర దర్శనం అని ఉంది కదా అవునండి అంటే మా తాతగారు ఆకాశంలో మేలిముసుగులో దాగినటువంటి చందమామను అన్ని సార్లు చూశారు అని వెయ్యి సార్లు వెయ్యి సార్లు ఉమ్ నేను అన్నాను అది కాదు దర్శన పౌర్ణమి కాదు పౌర్ణమిని దర్శించ పౌర్ణమి దర్శనం కాదు దర్శన పౌర్ణమి అది నా యందు నా illumination నేను చూడగలగాలి ఉమ్ అది నేను ముప్పయ్యేట చూస్తే నేను సహస్ర చంద్రాన్ని దాటిన వాడిని అని rational గా దాని మీద వ్యాఖ్యానం చేశా అది అట్లా తర్వాత రమణాయణం అని రాశా ఇప్పుడు అవతారమూర్తి గాని, జ్ఞాని గాని లేదు వ్యక్తి గాని మామూలు మన బోటి సాధారణలను కూడా evaluate direct గా చేయలేం by comparison and contrast చేయగలం. ఇంకోటితో పోలిస్తే తప్ప మన ఎక్కువ తక్కువ తూకం తెలీదు. కాబట్టి రమణ మహర్షి దగ్గరికి ఎవరెవరు వెళ్లారు? ఎటువంటి వాళ్ళు వెళ్లారు? ఉమ్ పరమహంస యోగానంద, శివానంద వీళ్లందరికంటే ముందు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఉమ్ తర్వాత రామస్వామి, రామ్ దాస్ ఇలాంటి వాళ్లంతా అక్కడికి నారాయణ గురువు వీళ్లంతా అక్కడికి వెళ్లారు అంటే ఎందుకు వెళ్లారు అని ఆలోచించా ఉమ్ వాళ్లకు అవసరం లేదండి పరమహంస యోగానందకి రమణ మహర్షిని దర్శనం చేయవలసిన పని లేదు ఆయనకి ఉమ్ In his own right he is a very great guru ఉమ్ ఎందుకని అంటే అప్పటివరకు వాళ్ళు పొందిన అనుభూతులు సత్యమే. ఒక స్థిమితం మనస్సు స్థిమితం చెందాలి అంటే అక్కడి దాకా వెళ్ళాలి అని వీళ్ళందరూ వెళ్లారు అనేటువంటిది అది నేను రమణాయణం. రామాయణంలో రమణుల కథలో వీళ్ళందరూ ఎలా వచ్చారు? వారు ఎలా తనను తాను ఆవిష్కరించుకున్నారు? అదంతా గ్రంథంలో చెప్పాను తర్వాత రమణ పదం ఉమ్ అసలు what is the core concept of రమణ మహర్షి? ఉమ్ ఆయన ఎవరితో మాట్లాడలేదట ఉమ్ అని ఎవరున్నారు? ఎవరో అనుకున్నారు అందరూ అదే అనుకున్నారు ఉమ్ చాలా మాట్లాడారు ఉమ్ మాట్లాడవలసినప్పుడు మాట్లాడారు ఉమ్ మాట్లాడవలసినంత మాట్లాడారు. ఏది మాట్లాడితే ఆత్మోన్నతికి దారి తీస్తుందో అది మాత్రమే మాట్లాడారు ఉమ్ అని రమణ పదాన్ని గిరి ప్రదక్షిణానికి ఉన్న importance ఏమిటి? మౌనం యొక్క శక్తి ఏమిటి? ఇవన్నీ ఒక ఐదు chapters కింద మొత్తం రమణ మహర్షి philosophy ని condense చేస్తూ అది నేను రాశా. ఉమ్ ఇట్లా అదే సమయంలో మీరు చలం గారిని కూడా కలిసినట్టు ఉన్నారు కదా ఉమ్ అదే డెబ్బై ఆరు ఉమ్ డెబ్బై ఆరులో ఉమ్ చలం గారిని చూడాలని ఉండేది చిన్నప్పుడు ఉమ్ ఎందుకనంటే ఒకవైపు మైదానం చదివి ఏంటి ఇలా రాశాడు అనుకునేలోగా విశ్వనాథ్ వారి చెలియలి కట్ట జవాబుగా చదివి ఉమ్ సమన్వయం చేసుకొని శైలి మాత్రం పరమాద్భుతం ఉమ్ చలం శైలి. ఇంత అందంగా ఎలా రాయగలడు అని ఒక adolescent age లో కొంత దాన్నేమిటంటే భావ స్పందన ఉంటుంది ఉమ్ పైగా పెద్దవాడు ఉమ్ ఆయన popular personality అని నేను వెళ్ళలే ఉమ్ ఆయన శైలి వల్ల, వచన శైలి చాలా గొప్పది అవును అవును దానికోసమని వెళ్ళాను అప్పటికి ఆయన ఇక చరమ పరమ చరమ దశలో ఉన్నారు ఇంకా ఉమ్ But ఒక one hour ఆయనతో గడిపాను ఉమ్ చాలా అద్భుతమైన ఉమ్ రమణి చలాంచలాల నుండి రమణాచల సానువుల్లోకి అని చలంని గురించి రాశా ఉమ్ అప్పుడే ఆయన అన్నారు "సమాజం నన్ను వెలివేసినట్టు చేసింది ఎందుకు చేసిందో తెలీదు. నేను సమాజాన్ని మీద నా ఉక్రోషం కూడా చెప్పలేదు. ఇటువంటి సమాజంలో ఉన్నానే అని నన్ను నేను తిట్టుకున్నాను." అలాంటి భావాలవి అని చెప్తూ ఉంటే అప్పుడు నేను interview నే ఉమ్ అవును చలంగా ఉన్నప్పుడు అలాగే రాయాలి. ఇక్కడికొచ్చి అచలమైపోయారుగా ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు అన్నా. చాలా ఆనందం దగ్గరికి రా అని పిలిచారు పాపం పడక కుర్చీలో పడుకున్నారు ఉమ్ పండు పండు అయిపోయినారు ఆయన ఉమ్ ఇలా నా చెయ్యి నొక్కుతూ "అవును చలనం చలం కావటమేగా జీవిత పరమావధి. అయినా నా" అన్నారు It's a beautiful బాగుంది తర్వాత V S Murthy గారు శంకర భగవత్పాదుల భజగోవిందం కావచ్చు యోగతారావణి అవి రాశారు చాలా పుస్తకాలు రాశారు అవునండి సో శంకర భగవత్పాదుల మార్గం గురించి కాస్త వివరించండి. శంకర భగవత్పాదులు शम्भोर्मूर्तश्चरति भुवने शंकराचार्यरूपा. ధర్మగ్లాని జరిగినప్పుడు అంటే మానవుడు తాను ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించనప్పుడు ఏదో ఒక రూపంలో నేను వస్తానని జాతి నమ్ముతుంది. ఇది భారతీయ ఆత్మ. ఉమ్ ఒక మతం వచ్చి నిరీశ్వరవాదానికి దారితీసినప్పుడు భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో శంకర భగవత్పాదులు ప్రపంచంలోకి వచ్చారు. ఒక ప్రమాణం ఏమిటంటే వాయు పురాణంలో నలుగురు శిష్యులతో ఒక పరాశక్తి ప్రపంచంలోకొచ్చి మళ్ళీ భారతీయమైనటువంటి వాఙ్మయాన్ని ప్రపంచానికి సనాతన ధర్మ రూపంలో అనుగ్రహిస్తుందని ప్రమాణం ఉంది ఉమ్ దానికి అనుగుణంగా వచ్చారు అని ఒకటి ఉమ్ రెండవది వారి రచనలు చదివినప్పుడు అద్భుతమైన శృతి, అద్భుతమైన లయ, సంగీతం, సాహిత్యం ఉమ్ కవిత్వం, భావుకత, భక్తి ఒక రస ప్రవాహం అది. అవి నేను చదివినప్పుడు నన్ను ఆనంద పరవశం చేసినటువంటి వాఙ్మయం శంకర వాఙ్మయం. తర్వాత అద్వైతం మతం కాదని, అద్వైతం సిద్ధాంతం కాదనిఅద్వైతం అంటే మామూలుగా చెప్పేటప్పుడు రెండు లేవు ఉన్నది ఒకటే అదే అద్వైతం అని మామూలుగా చెప్తారు. అది కాదు అనుకున్నా అసలు రెండు లేవు అనే మాట ముందు ఎందుకు వినాలి? రెండు ఉన్నాయి అని మీ మైండ్ లో ఉందన్నమాట. తర్వాత కాదు అనుకుంటున్నాం అన్నమాట. అసలు ఉన్నది ఒకటే అనేటువంటి భావన స్థిరమైనప్పుడు నాకు చాలా ఆనందం కలిగి సత్సంగ రూపంలో భజగోవిందాన్ని ఈవేళ సమాజానికి contemporary societyకి దాన్నే దాన్నే అది కీర్తన కాదు, దేవీ స్తుతి కాదు. దాని వల్ల వచ్చే ఇలా ఒళ్లో వచ్చి పడే పాపాలు ఎక్కడికి పోవు? కర్మ ఫలం అనుభవించాలి. మరి భజగోవిందం ఎందుకు రాశారు అంటే వైష్ణవులంతా ఏమన్నారంటే గోవిందుడిని భజించమని శంకరాచార్యులవారు చెప్పారా నా అద్వైత కదా అన్నారు. కాదు భజ అంటే స్మరించు. గోవింద అంటే ఎవరంటే గురువు. శంకర భగవత్పాదుల గురువు ఎవరంటే గోవింద భగవత్పాదులు. ఆయనను మకుటంగా పెట్టుకొని వారు మానవ జీవన వికాసం, మానవ జీవన విధానం, మానవ జీవన దృక్పథం, డబ్బు, బంధువులు, స్నేహితులు ప్రపంచం యొక్క అస్తిమితత్వం వీటన్నింటినీ కూడా ఆవిష్కరిస్తూ ఒక కవితా స్వరూపంగా ఆవిష్కరించిన భజగోవిందం ఎన్ని సంవత్సరాలు యుగయుగాంతాల వరకు అది అట్లాగే ఉంటుంది. అందువల్ల అది రాశాను. శంకరులు రాసినటువంటి ఇంకొకటి యోగతారావళి. అది నూట ఇరవై సంవత్సరాల తర్వాత దానిమీద సమగ్ర వ్యాఖ్యానం చేసే అవకాశం యోగము నాకు కలిగింది. ఐదు సత్సంగాలు ఐదు రోజులు. ఇరవై ఏడు శ్లోకాలలో యోగశాస్త్రం మొత్తం దాంట్లో పెట్టేశారు. అద్భుతమైనటువంటి ఇవాళ యోగ యోగ అంటున్నామే యోగ అంతా కూడా aerobics, gymnastics ఇది కాదు. నేను శరీరాన్ని మాత్రమే కాదు నాలో ఉన్న అఖండ చిద్ఘనమైన ఒక ఆత్మ ఉన్నది అని వేదాంత భాషలో నేను అర్థం చేసుకున్నప్పుడు practicalగా దాన్ని నేను ఎట్లా తెలుసుకోవాలి? ఒక laboratory లాంటిది శరీరమే laboratory. అక్కడి నుంచి మొదలుపెట్టి శరీరంతో మొదలై శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎట్లా ఉంటుంది అని అర్థం చేసుకుంటూ యోగతారావళి మీద చేశాను. మన కంచి స్వామివారు అంటే విజయేంద్ర సరస్వతి స్వామివారు యోగతారావళి చదివారు. ఆయన తెలుగువారు. చదివి ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ పన్నెండు ఒంటిగంట అవుతుంటే phone చేశారు. చేసి శంకర భగవత్పాదులు ఆంధ్రదేశంలో జన్మించి ఉంటే వారు తెలుగులో యోగతారావళి చెప్పి ఉంటే అది ఇట్లాగే ఉండుండేది. గొప్ప ప్రశంస సార్. చాలా. అది అంటే ఒక పరమాచార్యున్ని ఒక పీఠాధిపతిని అందిన శంకర పీఠానికి సంబంధించినటువంటివారు. శంకర వాఙ్మయంలో ఉన్నటువంటి మార్మికత సులభ శైలిలో అంటే సులభ శైలి అంటే భావం చెప్పేటప్పుడు తూకమైన భాష లేకపోతే తేలిపోతుంది. ఎవరికీ పట్టదు. భాషా భావము సమన్వయం కావాలి. దానికి తగిన భాష కావాలి. అవన్నీ దైవానుగ్రహంగా అట్లా వచ్చిందని నేను అనుకుంటూ. वजीरआज़म ने टीका उत्सव को कोरोना के खिलाफ दूसरी बड़ी जंग करार दिया। यह मुहिम ज्योतिबा फुले की यौम-ए-पैदाइश पर आज से शुरू हो रही है जो इस महीने की चौदह तारीख तक वस्तु रहित के बीमार डॉक्टर बीआर अंबेडकर की यौम-ए-पैदाइश तक जारी रहेगी। वजीरआज़म ने आवाम से अपील की है कि वह शख्शी सफ़ाई के साथ-साथ समाजी हिफ़्ज़ान-ए-सेहत पर भी तवज्जो दें। मरकज़ी वज़ीर इतलात नशरियात प्रकाश जावड़ेकर ने तेयक़न दिया कि महाराष्ट्र में कोरोना की cases में इज़ाफे के पेश नजर इस रियासत को बहुत जल्द एक हज़ार एक सौ वेंटिलेटर्स रवाना किए जाएंगे। मरकज़ी वज़ीर ने महाराष्ट्र के Deputy Chief Minister अजीत पवार के साथ COVID के सूरत-ए-हल पर एक जायज़े इजलास में शिरकत की। मरकज़ी हुकूमत ने कोरोना की cases में इज़ाफे के पेश नजर बड़े पैमाने पर vaccination मुहिम चलाने का फ़ैसला किया है। यह मुहिम आज से चार दिनों तक जारी रहेगी जिसके लिए वसीतर इंतज़ामात किए गए हैं। अज़ला की सनअतों में काम करने वाले पैंतालीस साल से ज़ायद उमर के अफ़राद को टीके देने के लिए महकुमे सेहत की जानिब से इंतज़ामात किए गए हैं। रियासत में कोरोना की cases में इज़ाफा हो रहा है। ताज़ा तौर पर इस वायरस के तीन हज़ार एक सौ सतहतीस मामले सामने आए हैं जबकि कल आलमी वबा से सात अमबात हुई। ताहल इस वायरस से होने वाली अमबात की तदाद एक हज़ार सात सौ उनसठ तक पहुंच गई। इसी असना में कल सात सौ सतहतीस अफ़राद रुबे सेहत हुए। रियासत में अभी तक इस वबा से छिपाया होने वालों की तदाद तीन लाख पांच हज़ार तीन सौ पैंतीस तक पहुंच गई है। महात्मा ज्योतिराव बाफुले का आज यौम-ए-पैदाइश है। उन्होंने एक सौ पचास साल क़बल इस बात की निशानदही की थी कि तालीम के ज़रिए ही तरक़्क़ी मुमकिन है और इसके लिए तहरीक चलाई। उन्होंने कमज़ोर तबकात और ख़वातीन की तरक़्क़ी के लिए अंतक जद्दोजहद की। ज्योतिबा फुले को अहम शख्सियतों ने ख़राजे ख़िदत पेश किया। रियासती वज़ीर श्रीनिवास गौड़ ने कहा कि ज्योतिबा फुले वो अज़ीम शख्सियत हैं जिन्होंने ज़ात-पात की इम्तियाज़ के ख़िलाफ़ जद्दोजहद की। उन्होंने ज्योतिबा फुले की यौम-ए-पैदाइश के मौक़े पर इनकी तस्वीर पर फूलमाला चढ़ाते हुए इन्हें ख़राजे ख़िदत पेश किया। रियासती वज़ीर गंगुला कमलाकर ने कहा कि Chief Minister चंद्रशेखर राव महात्मा ज्योतिबा फुले के ख़्वाबों को शर्मिंदा ताबीर करने के मकसद से ख़िद्मात अंजाम दे रही हैं। तेलंगाना हुकूमत BC तलबा को मुलाजिमतों की बराहमई के मकसद से आगे बढ़ रही हैं। रियासती वज़ीर सत्यवती राठोड़ ने कहा कि साबेक़ हुकूमतों की जानिब से सिर्फ़ ज्योतिबा फुले की यौम-ए-पैदाइश और यौम-ए-वफात के मौक़े पर तख़ारीब का इन्क़ात किया जाता था लेकिन TRS हुकूमत ने इक़तदार में आने के बाद इनके ख़्वाबों को शर्मिंदा ताबीर करने के लिए ख़िद्मात अंजाम दे रही हैं। BJP के रियासती सदर बंडी संजय ने कहा कि BJP ज्योतिबा फुले की तवक्क्ुआत को पूरा करने के मकसद के रहित काम कर रही हैं। उन्होंने हैदराबाद में ज्योतिबा फुले की तस्वीर पर गुलाया ख़िदत चढ़ाते हुए इन्हें ख़राजे ख़िदत पेश किया। इस मौक़े पर बंडी संजय ने कहा कि ज्योतिबा फुले ने पस्मांदा तबकात की बेहतरी के लिए काफ़ी जद्दोजहद की।మార్కజీ వజ్రి దాఖిల అమిత్ షా మగ్రిబి బెంగాల్ అసెంబ్లి ఎంతెహ్వాత్ కి పేషి నజర్ చే జల్సౌ ఔర్ ఏక్ రోడ్ షో మే హిస్సా లేంగే. వో శాంతి పురా మే రోడ్ షో మే హిస్సా లేనే కే బాద్ జల్సౌ సే ఖితాబ్ కరేంగే ఔర్ షాం రోడ్ షో మే హిస్సా లేంగే. వాజిర్ హై కి మగ్రిబి బెంగాల్ మే ఆట్ మర్హలో కి తెహర్ ఎంతెహ్వాత్ హో రహే హై. జమ్మూ కాశ్మీర్ కే షుఫియాన్ జిలే మే సెక్యూరిటీ దస్తౌ ఔర్ ఎంతెహ్యాప్ పసందొ కే దర్మియాన్ హువి ఫైరింగ్ మే తీన్ దహ్షద్ గద్ మరే గయే. ఎంతెహ్యాప్ పసందొ కే రూపోష్ హోనే కి ఇత్లా పర్ సెక్యూరిటీ దస్తౌ కి జనీబ్ సే తలాషీ ముహిమ్ శురూ కీ గయీ. ఇస్ తరహ్ ఉనొనే సెక్యూరిటీ దస్తౌ పర్ ఫైరింగ్ కీ. జవాబీ ఫైరింగ్ మే తీన్ ఎంతెహ్యాప్ పసంద్ మరే గయే. రియాసత్ కే బాజ్ ముఖామత్ పర్ గర్జు చమక్ కే సాత్ బారిష్ హో రహీ హై. కల్ జిలే ములుక్ కే బాజ్ ముఖామత్ పర్ బారిష్ హుయీ. మెహకమే మూసమియాత్ కే ముతాబిక్ భీర్ తక్ తేజ్ హవావో ఔర్ బారిష్ కి పేష్ కైస్ కీ గయీ హై. ఓహదారో కే ముతాబిక్ ఆజ్ రాత్ హవావో కే సాత్ బారిష్ కా ఇమ్కాన్ జాహిర్ కియా గయా హై. మీ భాష సరళంగానే ఉంటుంది వచనం సరళంగానే ఉంటుంది అప్పుడప్పుడు కొంత గుబాలింపులు ఉంటాయి పదబంధాలు గుబాలింపులు ఉంటాయి భాష సంబంధించి మరి ఒక మీరు ఒక హై టెక్నాలజిస్ట్ గా ఉంటూ రకమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఉంటూ భాష సంబంధించి చేసిన కృషి ఏమిటి అసలు? దీనికి మామూలుగా ప్రశ్నకి జవాబు ఏమిటంటే తేలిగ్గా తప్పించుకునే మాట ఉందండి. ఏమో నాకు తెలియదు. అవన్నీ నేను రాశానా? ఎవరో రాయించారు. ఇవి వ్యర్థమైన మాటలు. రాసింది నేనే. అవునా? వాడిన భాష నాదే. ఇది సత్యం. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇవాళ ఇది యువత కూడా, నేను యువకుడిగా ఉండగా పని చేశానో అది ఇవాళ యువతకి చెప్తున్నా. ప్రాచీన వాంగ్మయాన్ని బాగా చదవాలండి. చదివితే భాష వస్తుంది. భాషలో కొన్ని పదాలు రూపాంతరీకరణం జరగొచ్చు కాక. కానీ కొన్ని కొన్ని పదాలు ఒక జాతి యొక్క ఆత్మను నిలబెడతాయి. పైగా ఒక గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఒక పొందికైన ఉద్ధిక ఉన్నటువంటి భాషను గనక వాడినట్లయితే భావం మనిషి హృదయంలోకి వెళుతుంది. మనసులోకి వెళ్ళేది జారిపోతుంది. మనసు దానికి జారే తత్వం ఉంది కదా. హృదయంలోకి వెళ్లి నిలబడ్డప్పుడు కాలాజ్యవిచ్ఛిన్నంగా శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి భాష ఇలా వాడగలగటానికి తీవ్రమైనటువంటి అధ్యయనం చేయటం ఒకటి, భాష పట్ల ఒక గౌరవం ఒకటి. పదాలు చాలా ఇష్టమైనవి పదలోభాలు ఉంటాయి రాసేటప్పుడు. పద ప్రలోభాన్ని కూడా దాటి పద ప్రయోగం గనక చేస్తూ వెళ్ళినట్లయితే ఏం చెప్పదలచుకున్నామో దాని అభివ్యక్తి సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. కనుక నేను రాసిన వ్యాసాలు ఒకదానికొకటి పొంతన ఉండవు. subjects different ఇప్పుడు మీరే రమణ మహర్షి. ఆయన గురించి చెప్పేటప్పుడు దానికి తగినట్లే ఉండాలి. బాబా గారి గురించి చెప్పినప్పుడు అట్లా ఉండాలి. అలాగే ఇవాళ యువత కోసం వెదురు వేణువు కావాలంటే అని ఒక పుస్తకం రాశాను. వెదురు ఒక్క రోజులో వేణువు కాదు. It's a great process. ఇవాళ మనిషి పుట్టాడు, లేచాడు, పరిగెత్తాడు, అందుకున్నాడు, రాలిపోయినాడు. కాదు. అడుగు వెయ్యాలి, అడుగు నిలదొక్కుకోవాలి, నెమ్మది నెమ్మదిగా అడుగులు సాగించాలి, తర్వాత వడివడిగా జీవితాన్ని గడపాలి, మళ్ళీ ముదిమి వయసులో మళ్ళీ it's a great retreat. మళ్ళీ వెనక్కి రావాలి. It's a process. అందులో ఒక్కడూ exception కాదు అని గట్టిగా నమ్మి ఇవాళ యువత ఒక నిరాశావాదాన్ని నేను అనుకున్నది ఇది జరగటం లేదు, అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం లేదు. అసలు ఆశ్చర్యం ఏమిటంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాని పేరు జీవితం కాదు. మనం ఏది అనుకోలేదో జరిగినప్పుడు దానిని అలాగే accept చేసినప్పుడు, అంగీకరించినప్పుడు, తదనుగుణంగా జీవించినప్పుడు దాని పేరు జీవితం. ఇవి యువతకు అప్పజెప్పాలి అని నేను వెదురు వేణువు కావాలి. వెదురు మొక్క పైకి రావటానికి చాలా time పడుతుంది. కానీ ఒకసారి వచ్చిన తర్వాత పైకి చాలా ఎత్తు పెరిగిపోతుంది. ఎందుకని అంత time తీసుకున్నది అంటే ఇవాళ్టి భాషలో అడుగున నెట్వర్కింగ్ జరగాలి. దానికి కాండము శాఖోపశాఖలు ఉండవు. నిటారుగా పెరుగుతుంది. అది గాలి తాకిడికి నేలమీద పడిపోకుండా ఉండాలి అంటే base బాగుండాలి. కాబట్టి నెట్వర్కింగ్ జరిగేదాకా మొక్క పైకి రాదు. అంతే. మీరు యువతకు సంబంధించి యువతలో ఒక personality development చూసేదంటే ఒక వ్యక్తిత్వ వికాసం లాంటికి సంబంధించి అనేక ప్రసంగాలు మీరు చేస్తున్నారు. దాంట్లో మీరు మీరన్నట్టు సంప్రదాయ సాహిత్యాన్ని అందులో ఉండేటువంటి కొన్ని విషయాల్ని వీరికి అర్థమయ్యే రీతిలో తీసుకొస్తున్నారు. అవును ఉపనిషత్తులు కూడా మీరు కొంచెం పరిచయం చేశారు. ఉపనిషత్తుల వక్ష కొంచెం చెప్పండి ఒకసారి. దశోపనిషత్ సార సర్వస్వం అని రాశాను. ఉపనిషత్తు సుధ. ఉపనిషత్తు అనంగానే అమ్మో ఇది మనది కాదు ఇది. ఇది ఎవరో చదవాలి ఎవరో చెప్పాలి. చెప్పాలి అన్నవాడు చెప్పడు. ఉమ్ తెలుసుకుందాం అని చెప్తే నేను చదువుకుంటాడు ఇది రెండు వేల pages మూడు వేల pages ఉంటుంది. అసలు what is the quint essence of upanishad? పదే కదా! అనేక ఉపనిషత్తులను శంకర భగవత్పాదులు దశోపనిషత్తులుగా చెప్పారు. పది ఉపనిషత్తులలో ఉన్న quint essence ఏమిటి? link ఏమిటి? ఈశా కేన కఠ ఒక క్రమంలో పెట్టారు. ఈశతో మొదలై బృహదారణ్యకంతో ముగుస్తుంది. మధ్యలో ఉన్నటువంటి పరిణామ దశ అంతా కూడా link up చేస్తూ వ్యావహారికమైనటువంటి భాషలో నేను ఇట్లా ఎట్లాగైతే మాట్లాడుతున్నానో అలా రాశా. అది చాలా తేలికైనటువంటి భాష కానీ మూలం ఆకార గ్రంథం అంటామే మూల గ్రంథంలో ఉన్నటువంటి ఉపకథలు, ఉపనిషత్ కథలు, దానిమీద తర్కము, అదెట్లా ఇదెట్లా అవేమీ ఉండవు. ఏముంటుందంటేఈశావాస్య ఉపనిషత్తులో ఇది ఉన్నది. కేనోపనిషత్తులో ప్రశ్నించమంటుంది. కఠోపనిషత్తులో మృత్యు రహస్యం ఏమిటి? ఇట్లా ఒక్కొక్క దానిని విమరిస్తూ వెళ్ళినప్పుడు అది మన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, వేదవల్లి రామబ్రహ్మం గారు, తరువాత రంగ రామానుజాచార్యుల వారు, అటువంటి వారు పరమానంద భరితులైపోయారు. ఉమ్ ఎందుకంటే దశోపనిషత్తు లో ఉన్నది ఇంతే అని చెప్పాలంటే ధైర్యం కావాలి. ధైర్యం కావాలి అంటే నేను లోకానికి పెద్ద సేవ చేశానని అనుకోను కానీ ఆఖరి గ్రంథాలు మొత్తం ముందు ఒకసారి చదివా. ఇది లాభం లేదు. ఇది నా కడుపున పుట్టిన మా అమ్మాయో మా అబ్బాయికో ఇచ్చిన వాడు "నాన్నగారు మాకు వద్దండి" అంటాడు. "మాకు ఎందుకండీ ఇవన్నీ" ఏదన్నా మంచి ఉద్యోగం వచ్చే చదువు చెప్పమని అడుగుతారు. కానీ ఇదన్నా చేద్దామని కేవలం చాలా తక్కువ time లో రాసాను. అదే సార్ అదే ఉపనిషత్ సుధ. అలాగే మీరు చేసేటువంటి వ్యక్తిత్వ వికాస ప్రసంగాల్లో so యువతకి రకమైనటువంటి సందేశాలు మీరు చెప్పడం జరుగుతుంటుంది? ప్రధానమైన సందేశం ఏమిటంటే అంటే degree level degree level తర్వాత PG level తర్వాత professional colleges తర్వాత ఇప్పుడు ఇన్ఫోటెక్, విప్రో ఇలాంటి companies వీటన్నింటికీ నేను ఒక guest speaker గా వెళ్లి never a resource person guest speaker. ఉమ్ జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఎలా ఉండాలి? అందరూ personality development అని చెప్పినప్పుడు నేను పదాన్ని విసర్జించా. ఉమ్ Personality development is a western concept. ఉమ్ నా భారతీయమైనటువంటి aspect concept ఏమిటంటే వ్యక్తిత్వ వికాసం కాదు ఉమ్ Unfoldment personality unfoldment జరగాలి. ఉమ్ ఏది వికాసం జరుగుతుందో పరిణామం అయిపోతుంది. ఏది సంపూర్ణంగా unfold అవుతుందో development అయిపోతుంది. వికాసం ఏది జరుగుతుందో ఉండిపోతుంది. కాబట్టి Youth shall reshape the world అని ఒక statement but with a comma of course with the help of adults అని close చేశా. ఉహు అంటే ఏమిటి? ఎప్పటికప్పుడు ప్రవహించేటువంటి జనజీవనంలో youth ఎప్పుడూ కూడా constant factor అది. అవునండి And very powerful. ఇక్కడ energy ఉంది. కాలం గడిచి వచ్చిన వాడి దగ్గర experience ఉంది. energy experience రెండూ గనక కలిస్తే అంటే the teacher and taught the guru and shishya అంతే కదా. అవునండి రెండూ గనక అర్థం చేసుకోగలిగినట్లయితే యువత నిరాశావాదాన్ని అసలు రానివ్వకూడదు. కృష్ణశాస్త్రి గారు అంటారే "శీతవేళ రానీయకు శిశిరానికి చోటియ్యకు" అది. అది ఒక ఆశావహ దృక్పథం. అది కేవలం కవిత్వ భాష కాదు. కాబట్టి వీటన్నింటినీ కూడా అనేకమైన western concepts లో అలాగే western philosophers దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు, అలాగే ప్రాచీన ఆంధ్ర వాఙ్మయాన్ని తెలుగు వాఙ్మయాన్ని ఎలా చదివానో అలాగే ఇంగ్లీషులోది కూడా చదివినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని వర్ణించటంలో పరమాద్భుతమైన శైలి చూపించారు వాళ్ళు. షెల్లీ గాని టెన్నిసన్ గాని HW లాంగ్ ఫెల్లో గాని అలాగే Shakespearean dramas గాని ఇవన్నీ చదివినప్పుడు ఏమవుతుందంటే ఒక పట్టు ఒక అవగాహన ఏర్పడుతుంది. కానీ వాళ్ళంతా కూడా కంటికి కనిపిస్తున్న వస్తువుని జరుగుతున్న జీవితం మీద వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఉమ్ భారతీయ వాఙ్మయం జరిగిన దానికి జరగబోతున్న దానికి వర్తమానానికి మూడు కాలాలని సమన్వయం చేసి విశ్వజనీనం చేశారు అని నా స్థిమితమైనటువంటి అభిప్రాయం. చాలా అందంగా చాలా చక్కగా చెప్పారు. ఈరోజు literary guru కార్యక్రమంలో పాల్గొని తురుమెళ్ళలో మొదలైన మీ ప్రయాణాన్ని అనేక పార్శ్వాల్లో సాగింది. అటు technologist గాను ఇటు ఆధ్యాత్మిక రచయితగాను దాంతోపాటుగా ఎన్నో పుస్తకాలు రచించి యువతకి ఒక మార్గదర్శనం చేస్తున్నటువంటి వ్యక్తిగా మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదాలు విఎస్ఆర్ మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే
YouTube · audio

Literary Guru

Home
0:00 / 41:21