No transcript for this section.
Transcript begins at 0:00.
రఘునందనా హే రఘునందనా రఘునందనా హే రఘునందనా రఘునందనా హే రఘునందనా రాజీవలోచన రఘునందనా రాజీవలోచన రఘునందనా దశరథ తనయ్యా రఘునందనా దశముఖ మార్ధన రఘునందనా జానకి జీవన రఘునందనా జానకి జీవన రఘునందనా రఘునందనా హే రఘునందనా రఘునందనా హే రఘునందనా నమస్కారం ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి రాముడు ఆజానుబాహుడు మరి చైత్ర శుద్ధ నవమి నాడు కరకాటక లగ్నంలో మన శ్రీరాముడు జన్మించాడు మరి ఇదే నవమి నాడు అభిజిత్ లగ్నంలో ఆ సీతమ్మ తల్లిని వివాహమాడాడు మరి లోక కళ్యాణార్థం మరి సీతారాముల జంట ప్రతి ఒక్కరికీ ఆదర్శవంతులు మరి శ్రీరామ తత్వం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మరి శ్రీరామ తత్వాన్ని శ్రీరామ నవమి సందర్భంగా ఈనాటి మన కార్యక్రమంలో మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఎన్నో విలువైన రచనలను మనకు అందించిన సాహితీవేత్త వి ఎస్ ఆర్ మూర్తి గారు మరి వారి మాటల్లో శ్రీరామ తత్వాన్ని గురించి మరిముంచి వివరాలు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. అమ్మ శుభం. ముందుగా మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శుభం. గురువు గారు మామూలుగా మనకు ఈ శ్రీరామ నవమి, కృష్ణాష్టమి వస్తూనే ఉంటాయి అంటే శ్రీరామ నవమి రోజు వస్తేనే రాముడికి టెంపుల్ కి వెళ్లడం జరుగుతూ ఉంటుంది అందరూ ఇప్పుడున్న యువత అందరూ చూసుకుంటే అంటే అసలు శ్రీరామున్ని ఆ రోజే మనం పూజించాలా ఆ రోజే గుర్తించాలి అంటారు? ఇది ఇవాళ అధునాతన యువత మదిలో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న చాలా అందమైన ప్రశ్న కారణం ఏంటంటే శ్రీరామ నవమి నాడే రాముడిని తలుచుకొని కృష్ణాష్టమి నాడే కృష్ణున్ని తలుచుకునే జాతి కాది ఇది. ఈ భారతీయమైనటువంటి ఒక తత్వంలో భారతీయ జీవన విధానంలో శ్రీరాముడు ఒక భాగం శ్రీరాముడు దేవుడు అని నిర్ణయించుకున్నది మనం విచిత్రం ఏంటంటే శ్రీరాముడు ఎప్పుడూ తాను తనను తాను భగవంతుడిగా చెప్పుకోలే నేను విధి ఎట్లా నడిపిస్తే నా జీవితాన్ని అట్లా నడిపిస్తానని నిర్ణయించుకొని వచ్చిన అవతారం అది ఒక ప్రత్యేకత రెండవది అన్ని అవతారాలు వచ్చిన తర్వాత వాళ్ళకి నామకరణం జరిగింది కానీ శ్రీరాముడు అవతరణకు ముందే శ్రీ మహావిష్ణువుగా ఉన్న సమయంలో అనేకమంది వెళ్లి ఇట్లా భూమ్మీద చాలా అనాచారం జరుగుతున్నది మతద్వేషం పెరిగింది నువ్వు రావాలి ఏదన్నా ఒక రూపం తీసుకుని ధర్మ సంరక్షణ చేయాలి అని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉన్న సమయంలో తప్పకుండా వస్తాను సమయం ఆసన్నమైంది దశరథ నందనుడుగా వస్తా దశకంఠుడి పది తలలు ఉత్తరిస్తా దశయుగాల వరకు శ్రీరామ నామం వినపడేలాగా శ్రీరామచంద్ర నామంతో వస్తానని ఆయనే పేరు పెట్టుకొని వచ్చాడు కాబట్టి శ్రీరాముడు నవమి అనేది మనకు ఒక క్యాలెండర్ ఈవెంట్ అంతే స్పష్టంగా చెప్పాలంటే ఒక ధర్మం ఒక జాతి జీవనంలో గనక ప్రవాహం కాగలిగితే స్రవంతి కాగలిగితే అది రాముడు. అంటే ఇప్పుడు రాముడు ధర్మ సంస్థాపనార్థం కోసమే పుట్టాడంటారా లేదంటే ఖచ్చితంగా రావణ సంహారం కోసమే పుట్టాడంటారా? రావణ సంహారం ఒక మిష మిషన్ ఏంటంటే ధర్మ సంస్థాపన ధర్మ సంస్థాపన చేయుటంటే ధర్మం అంటూ ప్రత్యేకంగా లేదు అధర్మాన్ని అణిస్తే అది పోతే మిగిలింది ధర్మమే. ఏ జాతి తాను చేయవలసిన కర్తవ్యాన్ని తాను మరిచిపోయి జీవన విధానాన్ని మార్చుకొని అధార్మికమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఒక సమాజం గతి, ధృతి, ఆధృతి తప్పుతూ ఉన్నప్పుడు భగవంతుడు ఇంటర్వీన్ అవుతాడు లేదా వస్తాడు కాబట్టి ధర్మ సంరక్షణ ప్రధానం మరి అధర్మం ఎవరి వల్ల జరుగుతున్నదో తెలుసు గనుక ఆయన రావణ వధని లక్ష్యం చేసుకున్నాడు ఒక రావణుడి వంటి మనస్తత్వం గనక పోతే ధర్మం నిలబడుతుంది కాబట్టి రామాయణం ఇతిహాసం కాబట్టి అంటే కథా కథన రీతిలో సాగుతుంది కాబట్టి ఒకటి సాత్విక గుణ ప్రధాన సంపన్నమైనటువంటి ఆర్యుడు రాముడు ఆర్యుడు అంటే ఆర్యుడు ద్రావిడ కాదు అసలు ఆర్యపుత్రుడు అంటే ఎవరంటే పుడమి మీద ఉన్న జీవరాశి అంతా మమ్మల్ని కాపాడమని వేడుకున్నప్పుడు తపస్సు చేసినప్పుడు ఆ తపః ఫలితంగా వచ్చేటువంటి మూర్తి ఆయనే ఆర్యపుత్రుడు అవుతాడు ఆర్యుడు అవుతాడు అందువలన మీరు సంస్కృత నాటకాలు చూసినా రామకథ వాల్మీకియంలో మీరు చదివినా అమ్మవారు అంటే సీతాదేవి రామా అనలేదు నాథా అనలేదు ఆర్యపుత్రా అన్నది చూసారా కాబట్టి అధర్మాన్ని సంహారం చేయాలి అది ఈ సృష్టిని ఎవరు సృష్టించారో దీనిని ఎవరు బాధ్యతాయుతంగా నడపవలసి ఉన్నదో వాళ్లే మళ్లీ ఆ బాధ్యతను తీసుకొని దీన్ని సక్రమంగా నడిపిస్తారు అలా వస్తారు ఈ అవతార మూర్తులు. అవతారం. అవతరణ అంటే ఏం లేదు దిగిరా-రావటం. మ్. భగవంతుడిదేమో అవతరణ ఆయన దిగి వస్తాడు.మానవుడిదేమో ఆరోహణ పైకి వెళ్ళాలి. ఉమ్ ఈ మానవ మాధవీయమైన సంబంధం అంతా కూడా ఆరోహణావరోహణాలతో సాగుతుంది కాబట్టి ఇది జీవేశ్వర దైవేశ్వర సంయోగంగా అవతారాలు సాగుతూ ఉంటాయి. అయితే గురువు గారు మీ చిన్న వయసులోనే ఒక శాస్త్రవేత్తగా అలాగే ఎన్నో చక్కటి రచనలు అందించారు మీకు ఎంతో మందికి స్ఫూర్తిగా ఉన్నారు అంటే మళ్ళీ ఆ పుట్టపర్తి బాబా వారి మధురమైన కంఠంతో ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా కూడా అనిపించుకున్నారు. అవును నిజంగా ఆయన ఒక మహనీయుడు అంటే ఆయనతో మీ సంబంధం అలాగే ఆయన మిమ్మల్ని ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అన్న తర్వాత మీ జర్నీ అసలు ఎలా ఉంది? అసలు అనక ముందే జర్నీ లో ఉన్నా ఉమ్ ఎట్లాగంటే నా నాల్గవ ఏట అవధూతేంద్ర సరస్వతి స్వామి వారు నాకు రామ నామాన్ని గురించి విశ్లేషణ చేసి చెప్పారు. నా చేతికి హనుమాన్ చాలీసా పుస్తకం ఇచ్చి చదువు అరటి పండు ఇస్తాను అన్నారు. ఒక అరగంటలో దాన్ని ధారణ చేశా. వారికిచ్చేశా. వారు ఒక అరటి పళ్ళ గెల దగ్గరికి తీసుకెళ్ళి ఒక అరటి పండు ఇద్దామనుకున్నాను ఈ గెల అంతా నీదే అన్నారు. అట్లా ప్రారంభమైంది అంటే ఏదైనా ఒక విత్తనంగా ప్రారంభం కావాలి కదా బీజ ప్రాయంగా. ఉమ్ ఆ బీజమే నా పన్నెండేళ్ళు వచ్చేప్పటికి సత్య సాయి భగవానుడి యొక్క దర్శనం నేను కోరి శ్రమకు ఓర్చి నడిచి పెనుగొండ నుంచి బుక్కపట్నం మీదుగా పుట్టపర్తి వెళ్లి స్వామిని నేను దర్శనం చేసుకోవటం అది మొదలు. That is called twist with destiny అంతే. ఓకే విధి అలా ఒక చిన్న మలుపు తిప్పింది. ఆ తొలి కలయికలోనే స్వామి కాచుక్కుంచుంటినే అన్నారు. ఉహు అంటే waiting for you అంటాం కదా Waiting for you కానీ నేను దాన్ని అలా అనుకోలేదు. అప్పటికే కాస్త భక్తి పారమ్యము ఒక వివేకము ఉన్నది కాబట్టి ఉమ్ ఆయన నా కోసం ఎదురు చూడటం ఏమిటి నన్ను కాచుటకు ఆయన ఎదురుచూస్తూ ఉన్నారు నన్ను రక్షించటానికి అని నేను నిర్ణయించుకున్నా మనసుకి అట్లా ప్రారంభమైంది. నాకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పటికే స్వామితో అనేక సందర్భాల్లో కలవటం మాట్లాడటంతో ఉమ్ ఆయన రాముడి కథ, కృష్ణుడి కథ, భగవద్గీత, యోగవాసిష్టం ఇవన్నీ చెప్తూ ఉండేవారు. ఆ చిన్న వయసులో అవన్నీ నాకు అర్థమయ్యేవి. పద్దెనిమిదేళ్ళ వయసులో ఆయన అన్న మాట ఏమిటంటే నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవి అన్నారు. అనగానే ఇదేంటి ఇలా ఇదే కొత్త పదం వింటున్నానే అయితే నేను ఆధ్యాత్మిక వేత్తని కావాలి లేదా శాస్త్రవేత్తని కావాలి. అవును ఆధ్యాత్మిక వేత్తని అయితే ఏదో సన్యాసిని కావాలి శాస్త్రవేత్తని అయితే ఒక ఆ హై ranging scientist ని కావాలి. ఈ రెండు కలిపారేమిటి అనుకుంటున్నా అప్పుడు ఆయన చెప్పారు ఎట్లాగైతే భాషకి ఉమ్ రసాయన శాస్త్రానికి, భౌతిక శాస్త్రానికి అన్నింటికీ తత్వానికి శాస్త్రం ఎట్లా ఉన్నదో అధ్యాత్మకు కూడా శాస్త్రం ఉన్నది. అధ్యాత్మ అంటే కేవలం ప్రవచనం కాదు, ఉపన్యాసం కాదు, పురాణ కాలక్షేపం కాదు, జపతపాదులు కాదు. వీటన్నింటికీ మూలమైనటువంటిది ఏదో అది కనిపెట్టి అది ప్రపంచానికి ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. ఉమ్ అది ఎవరు చెప్పగలరు analysis ఉన్నవాడు rational గా ఆలోచించగలిగిన వాడు చెప్పాలి అది నువ్వు అన్నారు. అది వారు అన్నప్పుడు నా వయసు చిన్నది నేను అవుతానో కానో నాకేం తెలియదు కానీ వీళ్ళ లోకమంతా అవును అంటున్నప్పుడు స్వామి ఆశీర్వచనం ఫలించిందని నేను ఆనందిస్తూ ఉంటా అంతే. నిజంగానే అదొక ఆశీర్వచనం లాగా భావించి అవును మీలాంటి గురువులతో మేము కలవడం మా అదృష్టం కూడా అవునండీ అంటే మీ చిన్న వయసులోనే రామ భంటు హనుమాన్ చాలీసా హనుమంతుడి చాలీసాతో మీ journey start అయింది అవును అవును అయితే ఆ రాముడి గురించి మాట్లాడుకుంటే అసలు రామతత్వాన్ని మనం ఎలా స్వీకరించాలి అంటారు అసలు రామతత్వం ఒకటి ఏంటంటే రామో విగ్రహ్వాన్ ధర్మః ఉమ్ ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే రాముడి కథ చెప్పేస్తే చాలు అదే ధర్మం. దానిలో వ్యక్తిపరమైన రాముడు, కుటుంబ పరమైన రాముడు, మంచి కొడుకైన రాముడు, మంచి భర్త అయిన రాముడు, మంచి స్వామి అయిన రాముడు అంటే మంచి యజమాని అయిన రాముడు అలాగే అన్నింటినీ మించి సర్వోత్తమమైనటువంటి మానవుడైన రాముడు. ఉమ్ ఇది రామత్వాన్ని మనం రామతత్వం అన్నా రామత్వం అన్నా మనం ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. జీవితమంతా కూడా మనం రామాయణాన్ని గానం చేస్తాం రామాయణంలో సుందరకాండని పారాయణం కూడా చేస్తాం కానీ రామకథని స్థూలంగా లేదు సూక్ష్మ సూక్ష్మేతరంగా అర్థం చేసుకోగలిగితే దానిలో ఏమున్నదంటే ఆఘాత రామాయణం అది. ఇదో విచిత్రమైన పదం కదా ఆఘాత రామాయణం. ఆయన జీవితంలో ఏదీ మనం అనుకున్నట్లుగా అది నడవదు. రేపు పట్టాభిషేకం అనంగా కాదు అడవులకు వెళ్ళాలి. ఇక అయిపో వచ్చింది అంటే అమ్మవారు అగ్నిలో ప్రవేశం చేయాలి. అయోధ్యకు వచ్చాడు మళ్ళీ రాజ్యం వెళ్తున్నాడు, వెళ్ళబోతున్నాడు అనగా మళ్ళీ భార్యని కాంతార వాసానికి పంపాలి. ఆమె ఎక్కడ ఉన్నదో తెలియదు, ఏ ఏ పిల్లలు పుట్టారో తెలియదు, పిల్లలు ఎక్కడ పెరుగుతున్నారో తెలియదు. అంతా అయి వాళ్ళని కనుక్కొని ఓహో నా భార్య సీత ఇక్కడ ఉన్నది, నా పిల్లలు ఇక్కడ ఉన్నారు అనుకునే లోగా నేను వచ్చిన పని అయిపోయింది అని ఆమె వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఏమైంది జీవితంలో ఒక దాంపత్య ధర్మాన్ని ఎంత ఉదాత్త స్థాయిలో నడిపారో రాముడు తాను నిజంగా ఒక జీవితాన్ని దాంపత్య జీవితాన్ని అంటే ఏంటి దాంపత్య జీవితం అంటే యవ్వన దశలో ఉన్నది కాదు వార్ధక్యంలో ఉండేటువంటి ఆ ఆ మైథున్యం అంటాం. ఉమ్ దానిని అనుభవించే సమయంలో సీతమ్మవారు వెళ్ళిపోయింది వెనక్కి వెళ్ళిపోయింది. ఉమ్ బాధ్యత ఆ ఇద్దరు పిల్లల మీద బాధ్యత ఆయన మీద పడింది. అందులో ఆయన కుషుణ్ణి రాజుని చేశాడు. చేసి కుశుడు చక్కగా నిజానికి రాముడి కంటే బాగా పాలిస్తున్నాడని ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఉమ్ జలప్రవేశం అంటే సరయున నదిలో ప్రవేశం చేసి తన అవతారాన్ని పరిసమాప్తం చేసుకున్నారు. ఉమ్ కాబట్టిమీరు ఏది ఆలోచించండి రాముడి జీవితంలో రామాయణం రామాయణమే రామ-రాముడి ప్రయాణం కదా అవును దానిలో ప్రతి సంఘటనా ఆఘాతమే దాన్ని వాళ్ళు English లో a chain of separation, a ch-chain of union ఎక్కడా లేదు ఆయనకి. మన జీవితాలు కూడా అలా వెనక్కి తిరిగి చూస్తే ఏ బాల్యం పోగొట్టుకున్నాం. మనకు తెలియకుండానే కౌమార యవ్వనాలు వెళ్లిపోయినాయి ఉమ్ మధ్య వయస్సు వచ్చింది అది జారిపోతుంది. రేపో మాపో వృద్ధాప్యంలోకి వస్తాం లేదు వచ్చాం అది వెళ్ళిపోతుంది కాబట్టి ఉంటున్నది ఏమిటి అని ప్రశ్న ఏమీ లేదని జవాబు. అయితే గురువు గారు ఉమ్ ఇప్పుడున్న మన యువత గురించి మాట్లాడుకుంటే పిల్లలైగాని ఎవరి గురించి మాట్లాడుకున్నా ఫలానా అబ్బాయి ఏదన్నా అల్లరి పనులు కానీ చిలిపి చేష్టలు చేస్తే ఏంట్రా కృష్ణుడి లాగా ఉన్నావ్ అంటాడు కానీ ఆ అతను నిజంగా మంచి బాలుడిలాగా ఉంటే రాముడు మంచి బాలుడిలాగా ఉ-- అంటారు. అంటే రాముడిని అంత మంచిగా ఊహించుకుంటాము రాముడి లాగా నువ్వు ఉండాలి అని అనుకుంటాం కానీ రాముడికున్న కష్టాలు అలాంటివే ఉన్నాయి మీరు ఇప్పుడు అన్నట్టు మరి అంటే ఎలా మనము రాముడిని example గా తీసుకోవాలి? అనే విధాలా తీసుకోవాలి. ఎందుకంటే రాముడు మంచి బాలుడు అంటే సౌశీల్యము రాముడి యొక్క ప్రధానమైనటువంటి భూమిక సౌశీల్యం character and conduct అంటాం ఆ దానికి కారణం ఏంటంటే రఘువంశానికి కొన్ని సూత్రాలున్నాయి. ఆయన వచ్చిందే రఘువంశము ఆ లేదా ఇక్ష్వాకు వంశం రెండూ ఒకటే. రఘువంశంలో పుట్టిన వారందరికీ ఒక విషయం ఏంటంటే ఆజన్మ శుద్ధులు వాళ్ళు. అంటే శుద్ధులై పుడతారు పుట్టి శుద్ధులు కావటం లేదు ఆజన్మ శుద్ధులు కాబట్టి వాళ్ళల్లో negativities ఉండవ్ ఉహు చిలిపి చేష్టలు ఉండవ్. వాళ్ళు ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి idealistic personalities గా మనకి ఆవిష్కరింపబడతారు. అంటే ఒక వ్యక్తి మానవ జన్మ ఎత్తినటువంటి ఒక పురుషుడు అనుకోండి ఎలా ఉండాలో ఒక్క రాముడిని గనక మనం చక్కగా అర్థం చేసుకుంటే అది మనకు ప్రామాణికం. కనుక రాముడు మంచి బాలుడయినాడు. తరువాత అధర్మ వర్తన చేసినప్పటికీ ధర్మాన్ని నిర్మ-నిర్మాణం చేసి నెలబెట్టేటువంటి ఒకానొక దశలో వాళ్ళకి వాడిలో పరివర్తన తెవ్వటానికి ముందు ప్రయత్నం చేస్తారు వెంటనే వధించరు. రాయబారం చేస్తారు కాస్త సంధి చేస్తారు మంచి మాటలు చెప్తారు అప్పటికీ వినకపోతే అప్పుడు దండన వేస్తారు ఉమ్ తప్పుకు తగిన దండన విధిస్తారు. వాడు తప్పు చేయకపోయినా ఏదో అడవిలోకి వేటకు వెళ్ళినట్టుగా మృగరాజుల్ని చంపరు. ఆ అక్కడున్న పశుపక్షాదులను కలవరపరచరు. అలాగే ఆ సౌశీల్యం ఎంత గొప్పదంటే సౌశీల్యం అంటే కేవలం character అని కూడా కాదు అసలొక మానసిక భావన ఉమ్ ఆ ప్రపంచం మొత్తాన్ని తనదిగా తాను ఈ ప్రపంచానికి ప్రతినిధిగా బింబ-ప్రతిబింబ భావం అంటామే అలా చూడగలిగినప్పుడు ఏమవుతుంది ఉదాహరణకి కొన్ని సందర్భాలు చెప్తాను ఉమ్ అరణ్యవాసానికి ఆయన వెళ్ళాలి వెళ్ళబోతున్నాడు అప్పుడు దశరథ నందనుడైన రాముడి ఒంటిమీద ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలతో వెళ్ళటానికి లేదు కదా నారచీరలు కట్టుకున్నాడు కదా! అప్పుడు ఈ ఆభరణాలన్నీ తీసి ఆయన ఆ కోశాగారానికి ఇవ్వలా సుమంతుల వారిని పిలవలా తన స్నేహితుడైన సుయజ్ఞుడు అనేటువంటి ఒక అబ్బాయి తన వయస్సు వాడిని పిలిపించాడు ఆ "సుయజ్ఞ పద్నాలుగు సంవత్సరాలు నేను మళ్ళీ అయోధ్యకు రాను అంతవరకు అరణ్యంలో ఉంటా. నువ్వు నీకు సంపాదన లేదు నువ్వు తపోధనుడివి మామూలు ధనం నీ దగ్గర లేదు ఇదిగో ఈ ఆభరణాలు మొత్తం మూటగట్టి నీకిస్తున్నా. దీని ద్వారా నీ ధార్మిక జీవితాన్ని గడుపుతూ నువ్వు నీ తపస్సు, నీ నిష్ఠ, నీ స్వాధ్యాయము, నీ అనుష్ఠానం ఇవన్నీ సాగిస్తూ ఉండు ఇంతలోకే నేను రానే వస్తా" అన్నాడు. మహత్తరమైన పరిత్యాగం అది కదా. అంటే స్నేహం యొక్క గొప్పతనం స్నేహం స్నేహం ఉమ్ అంటే ఆ స్నేహితుడి కష్టం ఆయనకు తెలుసు రాజకుమారుడు అయినప్పటికీ ఉమ్ వాళ్ళిద్దరూ ఒక గురువు దగ్గర చదువుకున్నారు కదా చదువుకున్నందువల్ల అతడు బీదరికంలో ఉన్నాడని తెలుసుగా కాబట్టి తన ధర్మాన్ని స్నేహం పట్ల నిరూపణ చేశాడు. ఇది ఒకటి. ఇక రెండవది అయోధ్యా నగర ప్రజలందరూ కూడా నది దగ్గరకు వచ్చి "నువ్వు లేని అయోధ్యలో మేముండలేము మేము వచ్చేస్తాం" ఉమ్ ఆయన ఏమన్నాడో తెలుసా? "ఒకవేళ నేను పధ్నాలుగు ఏళ్ళు అయోధ్యలో ఉన్నా రోజూ మిమ్మల్ని నేను కలుస్తానా? అవకాశం ఉందా? మీరు రోజూ నా అంతఃపురం దగ్గరకు వచ్చి కలుస్తారా? కలిసే అవకాశం లేదు కదా" అవును "కనుక నేను అంతఃపురంలో ఉన్నాను అని అనుకోండి" [గొంతు సవరించిన శబ్దం] కానీ ఎలా అనుకుంటారు నేను అరణ్యానికి వెళ్తున్నా కదా. ఆయనే ప్రశ్న ఆయనే జవాబు. అని ఆయన ఏమన్నారంటే "చూడు అక్కడ పశువులు, పక్షులు, పాములు, పసరాలు, మునులు, తపస్సులు, స్వాధ్యాయాలు, యజ్ఞకుండాలు ఎన్నెన్నో ఉన్నాయి అక్కడ. ఆ అరణ్యంలో ఉన్నటువంటి ఫలాలు ఉమ్ కొమ్మలు, చెట్లు, నీళ్ళు అవన్నీ కూడా అక్కడ ఉన్న జంతుజాలానికి అవసరమైనవన్నీ అక్కడ ఏర్పడి ఉన్నాయి. అయోధ్యా నగర ప్రజలందరూ గనక నాతో వచ్చినట్లయితే ఆ జంతువులకి ఆహారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? పద్నాలుగు ఏళ్ళు మీరు తింటూ ఉంటారు ఆ నేను ఒక్కడినే వెళ్తున్నా ఇదిగో సీత వస్తోంది, లక్ష్మణుడు ఉంటాడు మేము ముగ్గురం పెద్ద భరువు కాదు అరణ్యానికి కాబట్టి మీరు అయోధ్యలోనే ఉండండి ఇది ధర్మం" అన్నాడు. అంటే ఒక అనాత్మ అయినటువంటి ఒక ప్రకృతిని కాపాడటంలో రాముడు చూపించినటువంటి ఒక మహా ఔదార్యం. అలాగే దశరథ మహారాజుకి అసలు రాముడు ఎందుకు పుట్టాడు? పుత్రకామేష్టి ఎందుకు చేశాడు? తనను పున్నామ నరకం నుంచి రక్షించటానికి ఒక కొడుకు కావాలనుకున్నాడు అవును కనుక పుత్రకామ ఇష్టి చేశాడు. విచిత్రం చూడండి ఆఘాతం అన్నామే, దశరథుడు మరణించినప్పుడు ఆయన ఒక్క కొడుకు చాలు అనుకుంటే నలుగురు వచ్చారు. అంతేనా? రాముడు, భరతుడు, లక్ష్మణ, శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు దశరథుడు ప్రాణం పోగొట్టుకున్నప్పుడు శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు భరత శత్రుఘ్నులు ఇద్దరూ మేనమామల దగ్గర ఉన్నారు. రామలక్ష్మణులిద్దరూ అరణ్యంలో ఉన్నారు. ఏమన్నా ఫలించిందా? ఉమ్ లేదు కదా! కాబట్టిమరి ఏం చేయాలి? ఇట్లా దశరథుడు తండ్రి మరణించాడు అని రాముడికి చెప్పాడు. అప్పటికి ఆయన దహనకాండ అయిపోయింది. మరి ఏం చేయాలి? అంటే తన తండ్రి అయిన దశరథ మహారాజు కు ఉత్తమ మిత్రుడు అయినటువంటి జటాయువు తన సేవలో రెండు చేతులు రెండు రెక్కలు పోగొట్టుకున్నప్పుడు జటాయువుకి అగ్నిసంస్కారం చేసినటువంటి పరమ పవిత్రుడు శ్రీరామచంద్రుడు. తన తండ్రి స్నేహితుడ్ని మనమైన అంతే మన నాన్నగారి స్నేహితుడ్ని మన నాన్నగారు అంటాం అంతే కదా. వాళ్ళు కూడా మనల్ని అమ్మాయి అబ్బాయి అని పిలుస్తారు మనల్ని. కనుక తన తండ్రికి చేయదగినటువంటి అంత్యేష్టి అది జటాయువుకి చేశాడు. ఇట్లా మనం ఒక్కొక్క సంఘటనలో రాముడి ప్రవర్తన రాముడి ఆలోచనా విధానం మనం తీసుకుని వెళుతుంటే ఎంత అతి వాస్తవికంగా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందువలన మంచి బాలుడు. ఇంకొకటి పరమ గోప్యమైనది. రావణ వధ అయిపోయింది. రావణుడి శరీరం శవమై పడి ఉంది. మండోదరి పరిగెత్తుకు వచ్చింది. పరిగెత్తుకు వచ్చి ఏడుస్తున్నది. శ్రీరామచంద్రుడు ఏమన్నాడో తెలుసా? అమ్మా! నీకు జీవితంలో కలగరాని కష్టాన్ని నేను కలిగించాను. నీ దుఃఖానికి నేను కారకుడిని అయినా నేను నీకు ఇప్పుడు ఏం చేయగలను చెప్పు అన్నాడు చేతులు జోడించి. ఆమె మహాపతివ్రత. ఐదుగురు పతివ్రతల్లో ఆవిడ ఒకరు. ఆవిడ ఏమన్నది అంటే, రామా! నన్ను నిత్య సుమంగళిగా చేయన్నది. ఎలా చేస్తారు? శవం పడి ఉంది భర్త శవం. ఈమె అడుగుతున్నది అది. అప్పుడు రాముడు విజ్ఞుడు, ప్రాజ్ఞుడు, కాలం ఎరిగిన వాడు, కాలజ్ఞుడు, దైవాన్ని తెలిసిన వాడు, దైవజ్ఞుడు, దైవమే తానైన వాడు. కనుక ఆయన ఏమన్నారంటే, జరిగినది అయిపోయింది. ఈ రావణ శరీరాన్ని చితి మీద పేర్చండి. కానీ కాష్టం ఆరకుండా చూసుకోండి. ఈ కాష్టము ఆరనంత వరకు నీవు నిత్య సుమంగళివే. అందుకనే ఈవేళ మన జనజీవితంలో ఏదన్నా కోర్టు కేసులు, తగాదాలు, ఇంట్లో దాయాదుల గొడవలు ఉంటే అవి ఎప్పటికీ తరతరాల్లో తెగవు ఏమంటాం అంటే రావణ కాష్టంలో సాగుతున్నది అంటాం. గురువు గారు అయితే మన శ్రీరాముని ఉనికి మన భారతీయ వ్యవస్థ అలాగే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ఎలాంటి ప్రభావం చూపిందంటారు? అది చాలా తీవ్రమైన ప్రభావం. అది సాత్వికంగా నడిపింది. ఎందుకంటే రావణ వధ అనంతరం ఇక్కడ మనకి రెండు పదాలు ఉన్నాయి. అస్తేయము, అపరిగ్రహము అని రెండు మాటలున్నాయి. భారతీయ తత్వ సిద్ధాంతాల్లో అంటే ఎవరి నుంచి ఏది ఆశించకుండా జీవించటం ఒకటి. రెండవది పరుల సొమ్ము నాది అని అనుకోకుండా జీవించటం. బావుంది కదా! రావణ వధ అయిపోయినప్పుడు పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. లంకానగరం ఎట్లా ఉన్నది? బంగారంతో తయారు చేసుకున్నాడు రావణుడు. షష్టిర్యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వార పురీ లంకాం సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకం చైవ నవకోటి శివాలయం చాతుర్లక్షంచ విధీనాం రావణేన సురక్షితం. అంటే వాస్తు శాస్త్రం ప్రకారం వాడు లంక కట్టుకున్నాడు అద్భుతంగా. అయితే ఈ యుద్ధం అయిపోయింది. అంటే లంకనే గెలిచాడు కదా రాముడు. మరి లక్ష్మణుడు మామూలు రీతిలో అన్నాడు, అన్నా! అయోధ్య మనకు ఎలాగూ ఉంది కదా. లంకను కూడా మనమే ఏలుదాం అన్నాడు క్షణికమైనటువంటి ఒక భ్రాంతిలో. అప్పుడు రాముడు అన్నాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి. మనం ఏలుకోవటానికి అయోధ్య ఉన్నది. లంకను ఏలుకోవటానికి రావణ సంతతి ఉన్నది. అందులో సత్పురుషులు ఉన్నారు. ఆ రాజ్యం మనది కాదు. మనది కానిది మనదిగా భావించకూడదు. రావణ సంహార క్రీడతో మన ఆట ముగిసింది. మనం మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి. పరుల ఆస్తిపై, పరుల వస్తువుపై మనం అపేక్ష పెంచుకోకూడదు అన్నాడు. అది ఈవేళ ఈ జాతి నేర్చుకోవాల్సి-- మర్చిపోయింది ఈ జాతి. ఎందుకంటే తన ఆస్తి అంటే తన వస్తువు తనకు ఉండగా ఇంకొకడి వస్తువును కూడా తనకు కావాలని కోరుకుంటున్నటువంటి ఒక జాతిగా నిర్మాణం అయింది ఇప్పుడు. రామత్వం అంటే బాణం వేయటము, చంపటము లేకపోతే ఊరికే ప్రవచనం చేయటం, మంచి మాటలు చెప్పటం, ఏమి జరిగినా మౌనంగా ఉండటం ఇది కాదు. మౌనం అనేటువంటి మహా శక్తి ద్వారా ఈ ప్రపంచంలో జరుగుతున్న అనేకానేక దుస్తర పరిణామాలని నిరోధించగలగటం, నిగ్రహించగలగటం, నిర్మూలించగలగటం ఇది రామత్వం. ఒక ఆదర్శ మానవుడిగా ఎలా ఉండాలి అనే ప్యారామీటర్స్ అన్నీ కూడా రామావతారంలో మనకు కనిపిస్తాయి. కృష్ణావతారం ఇందాక మీరు అది కూడా ప్రస్తావన చేశారు. చిలిపి కృష్ణుడు అన్నాడు. ఆ యుగానికి ఆ చిలిపితనము, తుంటరితనము అన్నీ కావాలి. రాముడు లీల చేయలేదా? మహిమ చేయలేదా? అంటే శంకర భగవత్పాదులు ఓ శ్లోకం చెప్తారు. అసలు రాముడి గురించి అంతా కలిపి ఒక్క మాటలో చెప్పండి అని అడిగారనుకోండి. ఎలా చెప్పాలి? రాముడు మంచి బాలుడు, రాముడు ఉత్తముడు, పురుషోత్తముడు ఇవన్నీ చెప్పాలి. ఆయన ఏమన్నారంటే, జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో. రామా! నీ నామ మహిమ తెలియాలి అంటే ఒక్క ఈశ్వరుడికి తెలుసు. ఇంకెవరికీ తెలియదన్నాడు. ఈశ్వరుడు అంటే మన క్యాలెండర్ ఈశ్వరుడు కాదు. సదాశివుడు. కాబట్టి జానాతి రామ తవ నామ రుచిమ్ మహేశో. జానాతి గౌతమసతి. గౌతమసతి ఎవరు? అహల్య. ఆమెకు ఒక్కరికే తెలుసుట చరణ ప్రభావం. నీ పాదాల ప్రభావం ఆమెకు ఒక్కరికే తెలుసు. జానాతి దూర్బల పరాక్రమ మీశచాపు. నీ పరాక్రమం రావణుడిని అడిగితే వాడు ఏం చెప్పలేడు. తెలుసుకునే లోగానే పోయినాడు. అరణ్యంలో చాలామంది ఆయన చేతిలో పోయినారు. కానీ ఎవరికి తెలుసు అంటే ఒక్క శివధనుస్సుకు తెలుసు. ఆయన బలమేంటి అని ముట్టుకున్నాడో లేదో విరిగి రెండు ముక్కలై చేతికి వచ్చింది. జానాత్యమోఘ పటు బాణగతిః పయోధిః అన్నాడు.ఆ బాణ ప్రయోగంలో ఉన్నటువంటి పటుత్వం ఎక్కడ ఉన్నది అని తెలిస్తే ఇలా నారి సారించాడో లేదో సముద్రుడు పైకి వచ్చి క్షమించమన్నాడు దారిస్తున్నాను అన్నాడు. ఉమ్ అంటే రాముడి యొక్క ఈ సర్వ లక్షణాలు వాళ్ళకి ఎలా తెలుసో మనం రాముడిని గనక అట్లా అర్థం చేసుకోగలిగితే రామత్వం మనకు అర్థమవుతుంది. ఇక దాంపత్య విషయానికి వద్దాం రాముడు సీత అయోనిజ అయిన సీత యోనిజుడైన రాముడి ఎలా కలిసింది? వాళ్ళ దాంపత్య జీవితం ఎంతో ఇప్పుడు మనం ఈరోజు రా నవమి రోజే ఆయన పుట్టినరోజు నవమి రోజే కళ్యాణం జరిపించుకుంటాం అంతటి భద్రాచలంలో మరి సీతారాముల కళ్యాణం లాగా మన కళ్యాణం జరగాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆయన పాటలే ఇప్పటికీ పెళ్లిళ్లలో ఉంటూ ఉంటాయి. సో దాంపత్య జీవితం అసలు భార్యాభర్తల మధ్య ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ life style ఎలా ఉంటుందంటారు? ముందుగా సీతాదేవి అయోనిజ అనేది పురాణ ప్రకారం correct రాముడు అయోనిజుడు తప్పు ఎందుకంటే ఆయన విష్ణు శక్తి అంతా కూడా మనకి అవతారాలు ఎలా ఉన్నాయి అంటే కళావతారాలు, అర్చావతారాలు, అంశావతారాలు, ప్రభవావతారాలు, ప్రవేశావతారాలు, అనుప్రవేశ అవతారాలు, కారణావతారాలు అని ఇన్ని ఉన్నాయి. ఉమ్ ఇందులో ఈయన ప్రవేశ అవతారం. ఏది కౌసల్య గర్భంలో ప్రవేశించిందంటే పాయసం లో ప్రవేశించింది అంతే కదా. అవును పాయసం తిన్నందువల్లనే వాళ్ళు గర్భవతులు అయినారుగా. అంటే ఈ పాయసం లో ఉన్నటువంటి ఆ విష్ణు శక్తి నాలుగు భాగాలై ఒకటి శంఖనాదమై ఒకటి ఆదిశేషువై ఇట్లా నాలుగు భాగాలు అయినాయి. కాబట్టి ఆయన కూడా అయోనిజుడే. ఉమ్ ప్రభవం వేరు ప్రసవం వేరు. అవును ప్రసవము అంటే అక్కడ పుట్టి బయటకు వచ్చి బయటకు స్రవిస్తుంది గనుక అది ప్రసవము. అది ప్రభవించింది దగ్గరగా కాంతి. ఓకే అతే అందుకనే విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో రాముడిని గురించి ఓ మాట అంటాడు. ఉమ్ దిక్సీమాంత నివిడ జ్యోతి అంటాడు రాముడిని మీ మరి మీరంతా కోదండరాముడు, జానకీరాముడు అంటున్నారు. దిక్కు సీమలు దిక్కులకు సీమలు ఉన్నాయి కదా. అవును దానికి అంతంలో ఏదన్నా ఉంటే అక్కడ వెలుగుతున్నటువంటి జ్యోతి ప్రకాశమే రాముడు నా రాముడు అంటాడు ఆయన. దిక్సీమాంత నివిడ జ్యోతి పరమాద్భుత ప్రయోగం. కాబట్టి రాముడు అయోనిజుడు అమ్మ అయోనిజ అయోనిజ సరే ఆయనేమో పాయసం లో నుంచి వచ్చారు. యజ్ఞం ద్వారా వచ్చాడు. అవును ఇందాక అనుకున్నాం భూమండలీ పుణ్య కృతావతారుడు రాముడు అందరూ ప్రార్థిస్తే ఆయన వచ్చాడు ఆర్యుడు వచ్చాడు. ఈమె ఆయన రావటానికి ముందే వచ్చింది. ఉమ్ ముందే జనకుడి ఇంట వచ్చింది. ఎలా వచ్చిందంటే యోగమాయగా వచ్చి లోకమాయగా తనను తాను తీర్చిదిద్దుకుంది. కనుక జనకుడి కంట కనపడే వరకు కూడా ఆమె యోగ మాయ. ఉమ్ ఒక-ఒక చిన్న పాప ఒక పెట్టెలో నాగేటి చాలున భూమిలో ఉన్నప్పుడు అవును నాగలు నడుస్తూ ఉన్నప్పుడు ఒక చార ఏర్పడుతుందే దాని పేరు సీత. అది గీతగా కనబడుతున్నది కానీ దాని అసలు పేరు సీత. ఉమ్ అందుకనే ఆయన సీత అని పేరు పెట్టాడు. ఉమ్ కాబట్టి వీళ్ళిద్దరికీ దాంపత్యం ఏర్పడింది, వివాహం ఏర్పడింది. ఉమ్ అంటే మళ్ళీ ఇక్కడ మీమాంస అంటే సీతాదేవి పెద్దదా రాముడు చిన్నవాడా అంటే అవును ఆమె మహాలక్ష్మి ఆయన మహావిష్ణు. ఉహు ఆ వివాహ వయస్సులను మనం నిర్ణయించే శక్తి గాని ప్రమాణాలు గాని మన దగ్గర లేవు. కానీ దీనిలో శ్రీరామచంద్రుడు చాలా కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. క్షత్రియ వంశంలో పుట్టిన రాముడు వశిష్టుల వారి దగ్గర యోగవాశిష్టం నేర్చుకున్నాడు, విన్నాడు. యోగవాశిష్టం అంటే మనస్సు యొక్క మర్మం తెలుసుకున్నాడు. ఈ మనస్సు ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఆనందంగా ఉంటుంది, ఎందుకు ఎగిరి ఎగిరి పడుతుంది, ఎందుకు అణిగి అణిగి ఉంటుంది. ఇవన్నీ యోగవాశిష్టం లో నేర్చుకున్నాడు అంటే జ్ఞానం. అదే సమయంలో విశ్వామిత్రుడు వచ్చి అరణ్యాలకు తీసుకెళ్లాడు. తీసుకెళ్లినప్పుడు బల, అతిబల విద్యలు అస్త్రశస్త్రాల రహస్యాలన్నీ కూడా చెప్పాడు. చైతే రాముడి జీవితంలో మొట్టమొదట ఆయన చంపింది ఎవరినంటే తాటకిని. ఉమ్ రాముడన్నాడు, "క్షత్రియ వంశంలో పుట్టి నేను చివరికి ఒక అబలైన స్త్రీని చంపానా ఇదేమిటి నా ప్రారబ్ధం?" అని అడిగాడు. "నువ్వు సాక్షాత్ నారాయణ మూర్తివి కానీ పంచభౌతిక దేహంలో వచ్చావు. నీలో కూడా మూడు గుణాలు ఉంటాయి తామస, రాజస, సాత్విక. ఉమ్ తాటక సంహారంతో రామ నీలో తామసం సంహరింపబడింది నడువు" అన్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అహల్య శాపవిమోచనం అయ్యింది. అవును రాతిలో నుంచి ఒక స్త్రీ మూర్తి వచ్చేప్పటికి ఆ అబ్బురపడిపోయినాడు, ఆశ్చర్యపోయినాడు ఆయనకి ఇవన్నీ తెలియవు. ఉమ్ నమస్కరించాడు. "ఇది ఏమిటి?" అని అడిగాడు. "నీలో రాజస గుణం నశించింది తామసం పోయింది. అక్కడ సంహారం జరిగింది ఇక్కడ సంస్కారం జరిగింది. ఇక పదా" అన్నాడు. మిథిలా నగరానికి వెళ్ళాడు. శివధనుర్భంగం చేశాడు స్వయంవర కథంతా మనకు తెలుసు. సీతమ్మవారిని వివాహం చేసుకున్నాడు. అప్పుడన్నాడు, "ఇప్పుడు నువ్వు పూర్ణ సత్వగుణ ప్రధాన సంపన్నమైన పూర్ణమైన యోగ్యమూర్తివి" అన్నాడు. ఉమ్ యోగమూర్తి కాదు యోగ్యమూర్తివి. యోగ్యమూర్తి యోగ్యం ఉంది నీకు ఇప్పుడు. దేనికి యోగ్యం అంటే ధర్మాన్ని నెలబెట్టడానికి. దానికి నీవు ఆశ్రయించవలసినటువంటి మార్గం దాంపత్య ధర్మం. ఉమ్ నిజానికి అరణ్యానికి వెళ్ళమని ఎవరిని అడిగారు? రాముడిని అడిగారు. అవును సీతను వెళ్ళమని అడగలేదుగా. "నువ్వు లేని అయోధ్య నాకు అరణ్యం, నువ్వు ఉండే అరణ్యమే నాకు అయోధ్య. నేను నీతో వస్తాను" అంది. "నేన్ను ఎవరు చూసుకుంటారు? నేను చూసుకోవాలి ఇది నా ధర్మం ఉన్నది." "సరే" ఇదైంది వాళ్ళు వెళ్ళబోయే ముందు రాముడు ఒక గంట మాట్లాడాడు వాల్మీకి రామాయణం ప్రకారం. "నువ్వొద్దు ఎక్కడో భూమిలో పుట్టావు. జనకమహారాజు వంటి జ్ఞాని నిన్ను పెంచుకున్నాడు. నన్ను నమ్మి నిన్ను నాకిచ్చి పెళ్లి చేశాడు. ఇక్కడ మా అమ్మలు ముగ్గురూ నువ్వంటే చాలా ఇష్టం. ఏముంది పధ్నాలుగు ఏళ్ళు నేను పితృవాక్య పరిపాలన చేసి వెనక్కి వస్తాను."వాళ్ళని అత్తలుగా నువ్వు భావించటం లేదు వాళ్ళు నిన్ను కోడలిగా అనుకోవటం లేదు నువ్వు అంతఃపురంలో ఉండు అంటే కాదు నీతో వస్తాను అన్నది అప్పుడు ఆయన ఏం చేశాడు పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి బ్రహ్మ రాక్షసులు ఎత్తుకుపోతారు అంట మనుషుల్ని నరరూప రాక్షసులుంటారు సీతా నువ్వు రావద్దు అన్నాడు. ఉమ్ ఇవాళ స్త్రీవాదులందరూ నేర్చుకోవలసిన మాట ఒక్కమాట అన్నది ఏమన్నదో తెలుసునా నువ్వు వీరుడువని ధీరుడువని గంభీరుడువని శూరుడువని నా తండ్రి జనకుడు నీకిచ్చాడు బ్రహ్మ రాక్షసుల్ని జయింపలేని పిరికివాడివా రామా నువ్వు ఉండగా వాళ్ళు నన్ను ఏం చేస్తారు నీతో నేను వస్తున్నాను అంది చూసారా అంటే కష్టంలో భార్య నిలబడగలిగితే కష్టాలు వస్తాయి రాకుండా ఎందుకు ఉంటాయి జీవితం అంతా పడుగు పేకదమ్మ వస్తాయి వచ్చినప్పుడు ఆ భార్య ఖచ్చితంగా నిలబడి పోతాయి ఈ రోజులు పోతాయి మంచి రోజులు వస్తాయి అప్పటిదాకా తలవంచుకుందాం ఊ అని అనగలిగి జీవిత భాగస్వామ్యం అంటే ఆస్తులకు భాగస్వామ్యం కాదు అన్నింట్లో గనక ఉండగలిగితే అది అద్భుతమైన దాంపత్యం ధర్మం. గురువు గారు దాంపత్య జీవితం గురించి చాలా చక్కగా వివరించారు అయితే ఇప్పుడు ఒక ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళినప్పుడు శ్నుషా దశరథ శ్యామం అని సీతమ్మ తల్లి తన పరిచయం లంకలో చెప్పుకుంది అంటే నేను ఫలానా ఇంట్లో పుట్టాను అని చెప్పుకోలేదు దశరథ మహారాజు కోడెల్ని అని చెప్పుకుంటూ తన పరిచయం చేసుకుంది అవును అయితే ఒక ఆడపిల్ల మెట్టినింటికి వెళ్ళిన తర్వాత తన ప్రవర్తన ఎలా ఉండాలి తనను తాను అక్కడ ఎలా పెంపొందించుకోవాలి ఒక కోడలిగా కానీ తల్లిగా కానీ ఇంక తర్వాత అన్ని దశలు తను మారుతూ ఉండాలి కాబట్టి. చమత్కారంగా చెప్తాను వెళుతూ వెళుతూనే వేరు కాపురం పెట్టకూడదు నెంబర్ వన్ బాగుంది అత్తగారిని మామగారిని వృద్ధాశ్రమంలో పడేయకూడదు తర్వాత భర్తని అక్రమ సంపాదన ఎట్లాగైనా సంపాదించి నాకు ఆ కోరిక తీర్చు ఇది చేయి అది చేయి అని అడగకూడదు తన భర్త ధార్మికంగా ఎంత సంపాదిస్తున్నాడు తన భర్త యొక్క వంశానికి ఉన్నటువంటి చరిత్రని పవిత్రతని గాంభీర్యాన్ని అర్థం చేసుకుని. ఆ జీవితాలు అంతవరకు ఎలా నడిచినయో ఆ సరళిలోనే తాను కూడా నడుస్తూ అవసరమైనటువంటి చోట్ల మార్పులు చేరుస్తూ మెరుగులు దిద్దుతూ ఆ నదీ ప్రవాహం ఎట్లాగైతే నెమ్మదిగా నిస్తంద్ర మంద్రంగా సాగిపోతూ ఉంటుందో అలాగనక ఆ స్రవంతిలో ఆమె తనను తాను గనక ఆ నడిపించుకోగలిగినట్లయితే అది అనుకూలమైనటువంటి దాంపత్యం వైరుధ్యం లేనిది వైవిధ్యం ఉండాలి వైరుధ్యం ఉండకూడదు వైవిధ్యమే బహు సుందరమైనది అంతకు ముందు ఉన్నదే రిపీట్ చేయమని ఎక్కడా లేదు దాన్ని మెరుగులు దిద్దుతూ ముందుకు వెళ్ళాలి అలాగే భర్త ఇవాళ్టి రోజులకు కూడా సమన్వయం చేద్దాం ఊ ఆ రోజుల్లో భర్త సంపాదిస్తే భార్య జీవితం గడిపేది అని అంటారు అవును మరి ఆ రోజుల్లో కూడా సంపాదించని భర్తలు సంపాదనే తెలియని భార్యలు ఇద్దరూ కూడా కాపురాలు చేశారుగా కానీ వాళ్ళ లక్ష్యం సంపాదన కాదు వాళ్ళ లక్ష్యం ఏమిటంటే రెండు భిన్న నేపథ్యాల నుంచి వచ్చినటువంటి స్త్రీ పురుషులు వివాహం చేసుకున్నప్పుడు ఆ పాత నేపథ్యాన్ని పక్కకు నెట్టాలి నెట్టి ఆమె అందుకే తన మెట్టినింటిని విషయం చెప్పింది ఎందుకు చెప్పిందంటే నా తండ్రి జనకుడు అని చెబితే రావణాసురుడికి భయమే ఉండదు ఎందుకంటే జనకుడు యుద్ధమే చేయడు జనకుడు జ్ఞాని రాజర్షి సత్పురుషుడు శుకదేవుడు వంటి వానికి గురువు కాబట్టి నేను నా తండ్రి జనకుడు అంటే ఓ అయితే నా పని మళ్ళీ తేలిక అయిపోయింది అనుకుంటాడు కానీ ఆమె ఎందుకు చెప్పింది అరవై మూడవ రాజైన దశరథ మహారాజుకు నేను కోడల్ని అన్నది మా మామగారే ఇంత గొప్పవాడు అయినప్పుడు ఆయనకు పుట్టిన నా రాముడు ఎంత నా రాముడు అని చెప్పడానికి లేదు అన్యాపదేశంగా ఎంత తెలివిగా ఎంత అద్భుతంగా ఆ ఒక జానతనంతో సమాధానం సీతమ్మ ఇచ్చిందో చూడండి అంటే అసలు ఆడపిల్ల అంటే ఏంటమ్మా మేల్ ఫీమేల్ పిచ్చి ఇంగ్లీష్ మాటలా ఆడపిల్ల అంతే కదా ఆడ అక్కడ ఉండే పిల్ల అండే పిల్ల అక్కడ ఉండవలసిన పిల్ల ఎప్పటికైనా అక్కడే ఉండే పిల్ల ఇది కదా తల్లిదండ్రులు కన్యాదానం చేసినప్పుడు ఆ పిల్లని అక్కడికి పంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు మానసికంగా సిద్ధపడతారు పోనీలే ఇది ఎలాగూ తప్పదు ఎక్కడన్నా ఉండని సుఖంగా ఉండని అంతే కదా కాబట్టి ఆమె దేనిని ఆశ్రయించి జీవించాలి అంటే మెట్టినింటిని పుట్టినింటిది ఎక్కువ గనక అధికంగా చేయితే మెట్టినింట పలచన అయిపోతుంది కనుక జనకుడి విషయం ప్రస్తావన సీతమ్మవారు తేకపోవటంలో ఈ పరమ రహస్యం ఇమిడి ఉన్నది అది సీతమ్మవారిలో నుంచి ఇవాళ స్త్రీలు నేర్చుకోవలసినటువంటిది ఇక రెండవది ఇందాకే చెప్పాను అది గనక ఏదైనా ఒక సత్యాన్ని చెప్పవలసి వస్తే నిర్భయంగా చెప్పాలి కానీ పరుషంగా చెప్పకూడదు కదా she is very frank in talk very good but she should not be brutally frank అది చెప్పేది పారుష్యం లేకుండా లాలిత్యంతో మార్ధవంతో convince చేస్తూ అద్భుతంగా గనక చెప్పగలిగితే అవతల వాడు వింటాడు వినేట్టుగా చెప్పుకోవాలి వినేట్టుగా చెప్పాలి మాట వినకపోతే వినేట్టు అంటే ఖచ్చితంగా చెప్పాలి నువ్వు గనక ఈ మార్గంలో వెళ్ళినట్లయితే ఈ సంసారం నిలబడదు నా నుంచి ఎక్కడా దోషం కనపట్టలేదు ఒకవేళ నా దోషం ఉంటే నాకు చెప్పు సీత అడుగుతుంది కదా ఇప్పుడు బంగారు లేడీని అడిగింది అవును రాముడు అన్నాడు సీతా ఒక్క నిమిషం ఆలోచించు నువ్వు నన్ను ఏమీ అన్నాడు అడగలేదు నాతో ఉండాలని వచ్చావు బంగారంతో ఎక్కడన్నా లేడీ తయారవుతుందా జింకలు ఉంటాయా అయోధ్యా నగరానికి వెళ్ళిన తర్వాత స్వర్ణకారులను పిలిపిస్తామన అభ్యంతర మందిరంలో శయ్యా మందిరంలో చుట్టూ నేను శిల్పకారులతో చెక్కిస్తా కానీ ఇది నువ్వు కోరరాని కోరిక అన్నాడు. రామా నిన్ను ఎప్పుడన్నా కోరానా నాకిది కావాలని అది మాయ ప్రభావం కలియుగ ప్రభావం అంటే ఇది. అంటే కోరకూడనిది కోరినందువలన ఆమెకి సీత దక్కలేదు రాముడు దక్కలేదు జింక దక్కలేదు రాముడు దక్కలేదు ఆమె రెండు విధాలా పోగొట్టుకుంది ఏమైంది అంటే దాంపత్య ధర్మం నుంచి కొంతకాలం వైదొలగింది. కాబట్టి ఈవేళ ఆధునిక ప్రపంచంలో కూడా ఈ వైరుధ్యాలు మనం ఎందుకు చూస్తున్నాం అంటే పరస్పరమైన అవగాహన లేకపోవడం ఒకటి. ఉమ్ ఈవేళ కేవలం చదువులు డిగ్రీలు ఆ పాండిత్య ప్రదర్శకి పొట్టకూటికే తప్ప అవి నిజమైన సంస్కారాన్ని ఇచ్చేటువంటి విద్యలు కాకుండా పోయాయి. అందుకనే ఆనాటి ఇప్పుడు సీతాదేవి జనకుడి ఇంట ఏమి చదువుకోలేదా అంటే ఎన్ని మాటలు విని ఉంటుందో ఎన్ని మంత్రాలు విని ఉంటుందో ఎన్నెన్ని వాగ్వివాదాలు విని ఉంటుందో జనకుడి సభలో మనకు తెలియదు కాబట్టి అవన్నీ ఆకళింపు చేసుకున్నప్పుడు ధర్మ సూక్ష్మాలన్నీ ఆమెకు తెలుసు. ఏ శాస్త్రం ఏ బుక్కు ఉండుండకపోవచ్చు కానీ ఈవేళ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నా అవి మనం చదవటం లేదు. ఉమ్ చదివినా అవి మనకు కాదు అనుకుంటున్నాం పక్కవాడికి ఇస్తాం ఆ పుస్తకం అది మన కోసమే ఉమ్ కాబట్టి జీవితాన్ని ఈవేళ ఆధునిక యువతి గాని యువకుడు గాని ఒక యువతే కాదు ధర్మం ప్రకారం గనక సంపాదిస్తేనమ్మా ఆ ఒక్కటే మనకు శాంతిని ఇస్తుంది. ఈవేళ మనకి మెకాలే విద్యావిధానం వల్ల ఉమ్ మనం మన మూలాలు పోగొట్టుకున్నాం. ఇవి revive కావటానికి మళ్ళీ సుమారుగా ఒక రెండు వందల సంవత్సరాలు పడుతుంది. ఇది రేపో ఎల్లుండో మారేది కాదు ప్రారంభం ఇంకా కాలేదు కావాలి మన బోటి వాళ్ళం ప్రారంభం కావాలి కావాలి అంటున్నాం గానీ మొదలు పెట్టేవాడే దొరకటంలే ఉమ్ కదా కాబట్టి మీరు ఏం చేస్తుంటారు అని అడిగాననుకోండి I am a house wife అంటుంది అంటే నేను చదువుకోలేదు అని చెప్పలేదు I am a house wife అంటుంది బాగా చదువుకున్నది అనుకున్నాం I am ఆ ఏదో I am B.Tech I am MBA I am PG ఇవన్నీ చెప్పి still I am a house wife అంటుంది. నువ్వు ఒక్కరికే wife నీ husband కి అంతేనా ఉమ్ నీ house కి నువ్వు wife వి కాదు నువ్వు ఆ ఇంటికి ఇల్లాలిగా యజమానివి యజమానురాలివి ఉమ్ వీటన్నింటినీ సమన్వయం చేసి ఏ స్త్రీమూర్తి అయితే నా ఇంట్లో నేను గృహలక్ష్మిని అని అనగలిగితే ఆనాడు ఆ ఇల్లు ఆ దాంపత్యం నిలబడుతుంది. ఉమ్ గృహలక్ష్మి గృహలక్ష్మి అది అనిపించుకోవాలి అనిపించుకోవాలి దానికి ప్రయత్నం చేయాలి అవును అయితే ఇప్పుడున్న relationships అంటే మాంగల్యం తంతునా నేనా మమ జీవన హేతునా అని తాళి కట్టించుకుంటుంది తలవంచుకొని స్త్రీ ఆడపిల్ల కట్టేవాడు కడతాడు కానీ ఇప్పుడున్న relationships ని మనం మాట్లాడుకుంటే అంత దృఢంగా ఉన్నాయా గురువు గారు? లేవు ఇది ఖచ్చితమైన విస్పష్టమైన జవాబు ఉమ్ ఎప్పుడైతే registered marriages వచ్చినయో ఎప్పుడైతే వైదిక ధర్మాన్ని వదిలిపెట్టి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోవటం పోయిందో ఉమ్ యా సప్తపది నశించిపోయిందో మీరు అవన్నీ ఆశించకూడదు. రాముడు మనకు అందించిన రామతత్వాన్ని అంటే ధర్మతత్వాన్ని అలాగే సీతమ్మ తల్లి పంచిన ప్రేమను ప్రేమను అలాగే ఆ గౌరవాన్ని ఇప్పుడున్న సామాజిక పరంగా ఎలా ఉండాలి అనే దానిపై అలాగే శ్రీరామ తత్వం గురించి మాకు చక్కగా వివరించినందుకు అమ్మా ధన్యవాదాలు గురువుగారు శుభం శుభం
YouTube · audio
నిత్య ఆదర్శం వారి దాంపత్యం..! | Sri Rama Thathvam | Vanitha TV
నిత్య ఆదర్శం వారి దాంపత్యం..! | Sri Rama Thathvam | Vanitha TV
Source: Vanitha TV on YouTube
0:00 / 40:05