No transcript for this section.
Transcript begins at 169:43.
ఇప్పటిదాకా అయమాత్మ బ్రహ్మ అనేటువంటి ఉపనిషత్తు వాఖ్యానికి సవిస్తరింగా అనేకమైనటువంటి ఉపనిషత్తుల నుంచి తీసుకుని ప్రధానంగా బృహదారణ్యకోపనిషత్తుని ఆధారం చేసుకుని వ్యాఖ్యానం చేసినటువంటి మసని చెన్నప్ప గారు రెండు మూడు ఆలోచనలు రేకెత్తించారు. శంకర భగవత్పాదులది, ఆయన అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించలేదు. అద్వైతము అంటే ఒక మానసిక భావన అంటే అది సిద్ధాంతము కాదు, రాద్ధాంతము కాదు. మన మనస్సు ఎప్పుడైతే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటువంటిది అనుభవంలోకి వస్తుందో అదే అద్వైతం అవుతూ ఉన్నది. నిజానికి. ఈశ్వరుడు, ఈశ్వరీ, అర్థనారీశ్వర తత్వంలో అద్వైతమే ఇమిడి ఉన్నది. ప్రతి పురుషుడిలో ఒక స్త్రీ ఉన్నాడు, ఉన్నది. ప్రతి స్త్రీలో ఒక పురుషుడున్నాడు. ఇది అద్వైత సిద్ధి. ఈ అద్వైత సిద్ధిలో దీనిని ఎవరు చెప్పాలి అంటే గురుముఖతః నేర్చుకుని స్వాధ్యాయం చేసి లోలోతులకు వెళ్లి శబ్దార్థ విచారణ దాటి అంతరార్థాన్ని దాటి యదార్థాన్ని అనుభూతి పరం చేసుకుంటారో వారు మాత్రమే చెప్పగలరు. దానికి ప్రమాణం ఏమిటంటే దేవో భూత్వా దేవం యజేత్. దైవాన్ని గురించి చెప్పాలి అంటే నువ్వు ఆ దివ్యత్వాన్ని పొందాలి. లేకపోతే ఆయనకు మనకు ద్వైతంలోనే మనం ఉండిపోతాం. నీవు నేను, నీవు నేను అని ఆగిపోతాం. అయితే దీనిని సత్యసాయి భగవానుడు చాలా పరమ ఆర్ద్రంగా, పరమ రమణీయంగా, గంభీరంగా, స్పష్టంగా ఒక మాట చెప్పారు. నీవు నేను అని రెండు లేవు, ఉన్నది ఒకటే. నేను నేనుగా మీరు మీరుగా ఉన్నారే తప్ప మనందరము ఒకటే. కాబట్టి ఈ అయమాత్మ బ్రహ్మ అనేటువంటి దానికి ఒక గొప్ప బోధకుడు ఎవరు అంటే నా అనుభవంలో కేవలము సత్యసాయి భగవానుడు మాత్రమే. [చప్పట్లు] ఆయన అలాగే జీవించారు. అలాగే తమ అవనీ సంచారాన్ని మొదలు పెట్టారు. తర్వాత రెండవది ఆ వారి దర్శనంలో పరా పశ్యంతి మధ్యమా వైఖరిలో మసని చెన్నప్ప గారు స్వామిని యోగిగా భావన చేశారు. ఇక్కడ ప్రత్యక్షానుభవము ఉండాలి, అపరోక్షానుభూతి ఉండాలి. ఈ రెండూ ఉన్నప్పుడు అనుభవం ఏమిటంటే ఆయనకి, ఆయన నిత్యము యోగించే ఉన్నారు, యోగిగా లేరు. యోగి అంటే ఒక title అది. యోగత్వము అంటే ఒక పూర్ణత్వం. దేనితో కూడి ఉన్నారు? సమస్త జీవుల యందు ఎచటనున్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచెనన్ పత్రిని లేను, పరితిని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటినను సత్యము తెలుపగా వచ్చెను. సాయియై సత్యసాయియై. అంటే అలా వచ్చాను నేను. నాకు ఇల్లు, వాకిలి నాకేం లేదు, మీ హృదయాలే నా మందిరాలు అని ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేశారు. ఇక మూడవది శంకర భగవత్పాదులు మిధ్యా అనేటువంటి దానిని చక్కగా వ్యాఖ్యానం చేశారు. అయితే దానికి కొనసాగింపుగా ఒక dynamics, ఒక dimension మనం మాట్లాడుకోవాలి కాబట్టి, మిధ్యా అంటే లేదు అని కాదు. ఉన్నట్టుగా కనబడుతున్నది అని. ఎండమావి వంటిది. ఎండమావి అనే రూపంలో అది ఉండనే ఉన్నది కానీ అది ఎండమావిలో నీరు ఉన్నదనేది భ్రాంతి. ఎండమావి భాతి, అది ప్రకాశం. భాతి నుంచి భ్రాంతి, భ్రాంతి నుంచి భాతికి జీవుడు అటూ ఇటూ పరిగెడుతూ ఉంటాడు గనుక జీవుడు సర్వకాల అవస్థల యందు కూడా పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు. ఇవాళ ఏది ఉపనిషత్తు అంటే వేలాది వందలాది ఉపనిషత్తులు కావు, దశోపనిషత్తులు మాత్రమే కావు. ఎవరైతే భగవంతుని సన్నిధిలో భగవంతుని దివ్య భావనకు దగ్గరగా ఉప అంటే దగ్గరగా నిషత్తు అంటే కూర్చొని. ఇవాళ మనందరం ఎవరు ఎక్కడున్నాం అంటే అందరము ఉపనిషన్మూర్తులై సత్యసాయి భగవానుడి పాదాల దగ్గర కూర్చున్నాం. హృదయమొక పూర్ణకుంభమై ఎదురువచ్చి మూర్తిమంతమై రస జగన్మూలమైన స్వాగతము లేల తోరణచ్ఛాయ లేల జగము జగమంత ఒక వింత సాయి లీల. ఇది సర్వేశ్వరుడు అయినటువంటి స్వామి యొక్క దివ్య లీలా వైభవంలో ఇది ఒక విభూతి రేఖ. ఈ విభూతి రేఖని పరమా ఆర్ద్రంగా, నిర్దుష్టంగా ఎందుకంటే మసని చెన్నప్ప గారు తర్వాత స్వాధ్యాయం చేశారు గాని ఆయనకి నిర్దుష్టంగా దయానంద సరస్వతి గురు స్వరూపం, తర్వాత గోపదేవులు మరొక గురువు. అంటే లౌకిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక ముగ్గురు గురువుల దగ్గర సుశ్రూష చేశారు గనుక దానికి తగిన శిష్యుడుగా అధ్యయనం చేశారు గనుక అనేకమైనటువంటి భావాలు మనసులో అటూ ఇటూ పా రాడుతూ ఉంటాయి. అన్నింటినీ ఒడిసి పట్టుకున్న నేను సత్యసాయి భగవానుడి యొక్క దివ్య అనుగ్రహం. ఆయన యందు, ఆయన వాక్కు యందు, ఆయన జీవితమందు వెన్నెల వలె పరచుకొని వెలుగై నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ తర్వాత కార్యక్రమం. [చప్పట్లు] అయమాత్మ బ్రహ్మను గురించి కమలాకర్ శర్మ గారు ఒక సాధనా మార్గాన్ని, ఒక సాధకుడు ఎలా వెళ్ళాలి చాలా సవిస్తరంగా చెప్పారు. దీనిలో రెండు విషయాలు, ఆనంద శబ్దానికి శంకర భగవత్పాదులు ఓ మాట చెప్పారు. యోగరతోవా, భోగరతోవా, సంగరతోవా, విషయరతోవా, యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి ఏవా. నువ్వు యోగివ్యా, భోగివ్యా, లోకాసక్తుడివ్యా, విషయాసక్తుడివ్యా, సంబంధం లేదు. నువ్వు ఎలాగైనా ఉండు.కానీ నువ్వు ఏ పనిలో ఉన్నా ఎట్లా ఉన్నా నీ మనస్సు భగవంతుని యందు లగ్నమై ఉన్నట్లయితే అది నందా అది నందము నందతి అది ఆనందము నందత్యేవ అది మాత్రమే ఆనందము దాని పేరు సానందము ఆ నందము ఆనందము సానందము బ్రహ్మానందము పరమానందము ఇవన్నీ కూడా పర్యాయపదాలు ఇది ఒక మంచి భావనాత్మకమైనటువంటి విషయం. తర్వాత లయిస్తే ఆలయం అవుతుంది దేహము అని సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసన్తి లోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేమాన్యతమం లయానాం అంటారు మనందరికీ తెలియకుండా ఒక లక్షా ఇరవై ఏడు వేల లయ యోగాలు ఉన్నాయి అందులో నాదానుసంధాన యోగమే అత్యున్నతమైనది అది మాత్రమే లయ యోగము నాదం అంటే సంగీతం కాదు నాదం నుంచి పుట్టింది సంగీతం సంగీతానికి ఆధారం గీతం గీతానికి ఆధారం వాక్కు వాక్కుకి ఆధారం అక్షరం కాబట్టి ఇదంతా కూడా పరంపరానుగతమైనటువంటి భావన సాధనా మార్గంలో మనవి ఉప-- ఈ ఉపనిషత్ వాక్యాన్ని ఎలా వాడుకోవాలో చక్కగా చాలా చక్కగా మనకు విశదీకరించారు వారికి స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అలాగే [చప్పట్లు] వారి చుట్టూ ఉండి వారిని సమాశ్రయించి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి తత్వచింతన పరిపూర్ణంగా సిద్ధించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయిరాం. అటువంటి పనము అంటే ఆ మూలం ఒక్కటే ఆ మూలం ఒక్కటే అనేటువంటిది కనుక అది బ్రహ్మమై ఉన్నది మరి ఆత్మ అంటే ఏమిటి దీనికి రంగు లేదు రూపు లేదు నాశనము లేదు అది అవినాశి అపరాజిత అని అనేక పేర్లు ఉన్నాయి అయితే ఏమిటి ఆత్మ అంటే ఆత్మ విచారణ చేశారు ఆత్మబోధ చేశారు ఇవన్నీ చెప్పి ఆత్ అంటే ఏమి మా అంటే లేదు దాని పేరే ఆత్మ అన్నారు మరి ఆత్మసాక్షాత్కారం ఏమిటి ఆత్మను పట్టుకోవటం ఏమిటి ఆమె దగ్గరికి వెళ్ళటం ఏమిటి ఆత్మని అంటే దానికి సత్య సాయి భగవానుడు ఒక అద్భుత వ్యాఖ్యానం చేశారు భగవానుడు ఒక అద్భుత వ్యాఖ్యానం చేశారు ఆత్మసాక్షాత్కారం అంటే నీ లోపల్నుంచి ఇంకో మనిషి బయటకు రావటం కాదు ఆత్మ కాసేపు ఆగు నెమ్మదిగా చెప్పు ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది ఆ ఆత్మ అంటే నువ్వే దేహము ఆత్మ దేహి ఆత్మ కాదు దేహి పరమాత్మ దేహము యందు ఉన్నటువంటి వాడు దేహి ఆ దేహి పరమాత్మ నీ యందున్నాడు గనుక ఆత్మగా అఖండంగా నువ్వు వెలుగుతున్నావు మాట్లాడగలుగుతున్నావు చూడగలుగుతున్నావు అని అనేకమైనటువంటి కార్యకలాపాలు చెప్తూ ఈ ఓంకారము ఎట్లాగైతే బ్రహ్మమవుతున్నదో తురీయము కూడా బ్రహ్మమే అని అన్నది మాండూక్యోపనిషత్ తురీయము అంటే ఏమిటి పుణ్యపాకవ్యసత్ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరమ్ ఈ కన్ను ముక్కు చెవి ఇంద్రియాలు ఏమిటంటే విశ్వనాథవారు శ్రీమద్ రామాయణ కల్పవృక్షంలో పరమాద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసి పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయేని ఈ శరీరంబు నీదే కన్ను విప్పుట కన్ను మూయుట నీవు కలుగకెట్లు ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడనున అష్టమ తనువు వాడు ఆ వాడు ఎవరంటే ఆత్మ మనం అంటున్నాం కన్ను నేను కాదు చెవి నేను కాదు కాళ్లు చేయి నేను కాదు కరచరణాది అవయవాలు నేను కాదు కానీ ఇన్ని అన్నీ కలిపితే నేను అవుతున్నాను అని మనం అనుకుంటున్నాం ఇన్ని కలిపితే నేను కావట్ల మేము అవుతున్నాం ఈ మేముని దాటి ఒక నేను ఉన్నది ఆ నేను అఖండమైనటువంటి నేను అచ్చ తెలుగు పదం ఆత్మకి పదం ఏమిటంటే నేను ఆ నేనుని పట్టుకోవాలి మూలాన్వేషణ చేయాలి కాబట్టి ఈ పంచభూతాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే అసంకల్పితంగా జరుగుతున్నాయి అంటాడు ఒకడు సంకల్ప మాత్రం చేతనే జరుగుతున్నాయి అంటుంది ఉపనిషత్ అక్కడ దేవుడనే పదం లేనేలేదు భగవంతుడు అన్న పదం లేనేలేదు పరమాత్మ అన్నటువంటి పదం మాత్రమే వాడబడింది ఇక్కడ స్త్రీలుగా పురుషులుగా బాలురుగా వృద్ధులుగా ఎవరమేవరు ఎట్లా ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఉన్నదంతా కూడా సత్ ఆత్మ అది నిత్యమూ సత్యమూ శాశ్వతమూ మనం కూడా ఏదో రోజు ఈ శరీరం వదిలి పెడతాం శరీరం వదిలి పెడుతున్నాం అంటున్నాం మనల్ని మనమేం వదులుకోవట్ల మనము అంటే ఆత్మ ఈ ఆత్మ మళ్ళీ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది దాని కర్మ ఫలాన్ని అనుభవించడానికో లేదు యోగభ్రష్టుడై వస్తాడు ఒకడు భ్రష్టయోగಿಯే రెండో వాడు వస్తాడు మన్మహాయోగ నిష్ఠా సమాధి నుండి విక్రియాపేత బ్రహ్మ భావించు వేళ పట్టరాని సౌందర్య పిపాస దగిలి భ్రష్ట యోగిని కవి జన్మ బడసినాడ అంటే ఇవన్నీ చెప్పటానికి మనం రావాలి మనం వచ్చాం ఎందుకు వచ్చాము ఏం-ఏం చూసి వచ్చాం అంటే బ్రహ్మ లోకం దాకా వెళ్లి బ్రహ్మ సృష్టి రచన చేస్తుంటే అది చూసి అంతా తెలుపే తెలుపైన అమ్మవారు తెల్లచీర కట్టుకొని అక్కడ కూర్చుని ఉంటే నిస్తంద్ర మంద్రంగా వీణా గానం చేస్తుంటే నాదం సృష్టిస్తుంటే ఈ మహా సౌందర్యం ఇట్లా ఉన్నది అని చెప్తే బాగుండును ఇక్కడిదాకా రాని వాడికి అనగానే భ్రష్ట యోగి అయి వచ్చాడు నేను సాధన చేశాను పెద్ద పెద్ద గృహిణి బ్రహ్మ ప్రకృతంతయు బ్రహ్మ కాలమంతయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ నేను కూడా బ్రహ్మమునే భిన్నంగా ఏం లేదు ఉపాధిని తీసుకొని వచ్చాను నేను మీరు పరబ్రహ్మమూర్తి అంటున్నారు కానీ ఆయన మనతో equate చేసి సర్వమును తెలియు ఈ సభయు బ్రహ్మ సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు సత్యము సర్వము ఏదైతే కంటికి కనిపిస్తున్నదో వాక్కుకి మనస్సుకి అనుభూతికి అనుభవానికి లోనై మన దొరుకుతూ ఉన్నదో ఇదంతా అఖండమై చిద్ఘనమై అనాహతమై నిరంతరమై నిత్యమై సత్యమై శాశ్వతమై మరణమే ఎరుగనటువంటిది ఎట్లా మరణము లేదు రణము లేదు చారణము లేదు విచారణ లేదు ఉన్నదంతా తారణమేఈ తారణము అంటే ముక్తి మోక్షాన్ని గురించిన విచారణ చేసినప్పుడు మోక్షం అంటే మరణానంతర సుఖం మరణించిన తర్వాత ఈ దేహానికి ప్రకృతికి సంబంధమే లేదు మరి ఏమిటి ఏ మోక్షాన్ని మనం కోరుతున్నాం అంటే మళ్ళీ సత్య సాయి భగవాన్ వెడల్పాటి మీద వచ్చిన స్వామి ఒక మాట చెప్పారు ఆ మాట ఏమిటంటే మిమ్మ భగవంతుణ్ణి చూశావా అని ప్రతి వాడిని ప్రశ్నించింది ఈ లోకం భగవంతుని గురించి చెప్పే ప్రతి వాడిని అడిగింది మిమ్మల్ని కూడా అడుగుతారు అడిగితే మేము భగవంతుణ్ణి చూశాము అని చెప్పండి ఎట్లా చెప్పాలి అంటే పుట్టపర్తి లో చూశామని యదహర్తి చెప్పండి అన్నారు గుండె మీద గట్టిగా చెప్పండి అంటే భగవంతుని యొక్క తత్వం ఏమిటంటే రూపం కాదు ఉండేది కాదు నామము కంతరే కౌసేయేన మనోహరేణ ధవలేన అచ్ఛాదితా సర్వతః కర్పూరాంచిత దీప దీప్త మిళితే రమ్యోపధాన ద్వయే పార్వత్యాః కరపద్మ లాలిత పదం మృత్యుంజయమ్ భావయే ఎంత అద్భుతమో చూడండి వేదాలు ఒక మంజూషిక ఒక రత్న సౌధంలో ఉన్నట్టే ఇవన్నీ కూడా ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే నవోజ్వల దళాకీర్ణాంచ తల్పాంతరే అనేకమైనటువంటి దళాలు చిగురాకులు మోసులెత్తుతున్నాయి వాటి అన్నింటి మధ్యలో కౌసేయేన మనోహరేణ ధవలేన స్వచ్ఛంగా శుద్ధంగా అచ్ఛంగా తెలుపుగా తెల్లగా తెలిపేదిగా బ్రహ్మముగా పరబ్రహ్మముగా సానందంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము ఎలా ఉన్నది అని అంటే కర్పూరాంచిత దీప దీప్త మిళితే కర్పూరం వెలిగించినప్పుడు వెలుగు వస్తుంది పరిమళము వస్తుంది ఇంకా దేనికి రావు అగ్గిపెట్టె వెలిగించినప్పుడు వాసన వస్తుంది కర్పూరాన్ని వెలిగించినప్పుడు పరిమళం వస్తుంది కర్పూరాంచిత దీప దీప్తి మిళితే రమ్యోపధాన ద్వయే రమ్యమైనటువంటి ఉపధానం అంటే వస్త్రం ఆ ఉపధానాన్ని ధరించి ఉన్నదట ఇది అంటే వేదం అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కాదు రాముడు అంటాడు నేను దశరథ రాజు కుమారుడిగా చెప్పినా అనేక సార్లు విశ్వనాథవారు కల్పవృక్షంలో ఓ మాట అంటాడు వృక్షామాకృతి యజ్ఞమూర్తి అంటాడు సామవేదము ఋగ్వేదము యజుర్వేదము మూడు కలిపితే రాముడు అన్నాడు ఆయన కృష్ణుడు ఏమన్నాడంటే నేను వేదములలో సామవేదాన్ని అంటే విశ్వనాథవారు ఆయన్ని అట్లా అననివ్వండి కానీ రాముడు మాత్రం మూడు వేదాలు కలిపి వచ్చినటువంటి ఒక మూర్తి మూర్తి అంటే ఒక బొమ్మ ఆ బొమ్మని దాటితే బ్రహ్మ కనిపిస్తాడే ఆ బ్రహ్మము వైపు వెళ్ళటానికి మీరు ఈ ఉపాసనా మార్గంలో ఈ ఉపనిషత్తులన్నీ చక్కగా అధ్యయనం చేయండి అని చెప్పటానికి ఇవాళ అయమాత్మా బ్రహ్మ అనేటువంటి దాన్ని మరింత లోతుకి నేను వెళ్ళకుండా కాస్త కవితా భావనతో ఎందుకంటే వీటి మీద వ్యాఖ్యానం చేసిన శంకరులు సాక్షాత్తు శంకరులు అలాగే ఉపనిషద్ వాహినిని ప్రపంచానికి స్వయంగా రాసి ఇచ్చిన సత్య సాయి భగవానుడు పరదైవతం ఎవరన్నా ఎవరైనా ఏ సిద్ధుడైనా శుద్ధుడైనా మళ్ళీ ఉపనిషత్తుల తర్వాత వ్యాఖ్యానాలు రాశారు గాని సరళ గంభీరమైనటువంటి దానిని మూలాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఉపనిషద్ వాహిని మనకు స్వామి అందించారు మనం కృతజ్ఞతాపూర్వకంగా ఆ సరస్వతీ స్వరూపాన్ని తలుచుకోవాలి అది లేకపోతే ఇది లేదు అంతే కదా అది అంటే పరబ్రహ్మము ఇది అంటే జీవము ఈ జీవ పరమాత్మల రెండింటి యొక్క ఐక్యతే అనుసంధానము ఇందాక ఓ మాట చక్కగా చెప్పారు కలిసిపోవడం అంటే మరణించడం కాదు మన ఈ ఉనికి అస్తిత్వము వ్యక్తిత్వము నశించి అదే నేను తత్వమసి ఆ తర్వాత మాట్లాడుకుందాం రెండేళ్ళ తర్వాత కాబట్టి ఇవాళ ఈ పరమాద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం కేవలం ఒక సభగా నేను భావించక సర్వాధ్యక్ష స్వరూపమైనటువంటి స్వామి యొక్క సన్నిధిలో పరమ ప్రశాంత చిత్తంతో ఏకాగ్ర చిత్త ఏకాగ్ర స్థితిలో దీనిని విచారణ చేసినందుకు చేయించినందుకు అన్నందుకు మేము విన్నందుకు మీరు మనం కలిసి అన్న వాళ్ళము విన్న వాళ్ళము ఒకటైనందుకు ఇలా కలిపినందుకు తత్వ సత్య తత్వానుసంధాన మూర్తి అయినటువంటి స్వామికి మరొక్కసారి మనసా వచసా శిరసా ప్రణమిల్లుతూ ఇలాగే వచ్చే సంవత్సరం మనం అహం బ్రహ్మాస్మి వైపు వెళదాం అహం బ్రహ్మాస్మి వన్ ఇయర్ ముందే అనౌన్స్ చేస్తాం కాబట్టి ఆ రోజున ఎవరు వచ్చి మాట్లాడుతారు ఎవరు చెప్పబోతున్నారో ఆ క్షణాన స్పురిస్తుంది గనుక ఆ సభకి కూడా మసని చెన్నప్ప గారు మా కమలాకర్ శర్మ గారు ఇద్దరూ ఈ నాలుగు వాక్యాలకి ఈ మూడేళ్లు రాబోయే మూడేళ్లు కూడా పర్మనెంట్ ఆహ్వానితులుగా మేము ఆహ్వానం చేస్తూ ఆరోజు కూడా ఆదివారం అయితే మంచిది తయారవ్వాలి అది వన్ ఇయర్ టైం ఇచ్చాం మీకు కాబట్టి అహం బ్రహ్మాస్మి మీద అందరూ వక్తలు మాట్లాడుతారు మనం సమన్వయం చేద్దాం ఇది సామూహికంగా చేసుకున్న నిజమైనటువంటి సత్సంగం సత్తులు సంగమించినై తలపులు కలిసినై తనువులు కలవటం కాదు అది భౌతిక స్థాయి తలపులు కలవాలి సానందం ఆనందం అందం అంటారు శంకర భగవత్పాదులు ఆ సానంద స్థితి వైపు మనమందరం నడవాలని ఇదిగో ఒక అవతార మూర్తికి సమకాలీనంగా వచ్చినందుకు మన జన్మ ధన్యమైందని భావిస్తూ భువనమొక వేదికాయ వేద వేదాంత వేద్యునకు విశ్వ పాలన ఒక వేడుకాయ విశ్వవిభునకు ఆజ్యునకు అవని బృందావనం అయ్యే అనవర్త వంజ్యునకు స్వర్ణ చందునకు వేల శరత్తులొక్క పరి అరసి వేల ఇంద్రాణులొక్క తరిమెరసి వేల శరత్తులు కలవాలి అది స్వామి ఆ స్వామి యొక్క దివ్య స్వరూపం ఇది కాబట్టి అటువంటి ఆ స్వామికి మనం అంజలి ఘటిస్తూ మనందరం కూడా ఇంకా రెండు నిమిషాల టైం నేను తీసుకున్నా నాకుంది టైం వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీనే అయింది మీరందరూ కూడాసరళమైనటువంటి ఉపనిషత్తుల మీద చాలా మంచి గ్రంథాలు ఉన్నాయి. ఇగో నాకు ఇందాకే చెప్పారు, "మేమంతా ఒక చిన్న group గా ఏర్పడి ఇవన్నీ వ్యాఖ్యానించుకుంటూ ఉంటాం" అని కమలాకర్ శర్మ గారు చెప్పారు. అది ప్రపంచానికి చేసే మహోపకారం. నేను నా స్వాధ్యాయం చేసుకొని నా ఇంట్లో కూర్చుంటే పనికిరాదు. ప్రౌఢప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః సచ్ఛిష్యబోధయా తత్సత్యమాశ్రితావన్. అయ్యా! అగ్ని కార్యం చేశాను, "ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహా" అన్నాను. నేను నిన్న ఒక బతుకు బతికాను. నీ గురించిన విచారణ చేశాను, నీ కథలు విన్నాను. ఏదో ఒక అనుభవం కలిగింది. దానిలో నుంచి ఒక అనుభూతి ఏర్పడింది. ఆ అనుభూతి ప్రౌఢంగా ఉన్నది, గాఢంగా ఉన్నది. దీనిని మళ్ళీ రేపు మరొకరికి అప్పచెప్పాలి గనుక అందుకోవలసినటువంటి వాడిని ఒక్కణ్ణి నా దగ్గరికి పంపండి అని అగ్నిని ప్రార్థిస్తాడు నిజమైన గురువు. నిజమైన గురువు ఎవరంటే తానొక్కడు వెలిగేవాడు కాదు. జ్యోతిస్సజ్యోతి జలాతే చలో. ఒక దీపం రెండో దీపాన్ని వెలిగిస్తూ వెళ్ళాలి. గుణాతీతుడు, రూపరహితుడు అయినటువంటి గురువు, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే. ఎప్పటికైనా కనుగొనవలసినటువంటి, చూడవలసిన ఈశ్వరుడు, కనిపెట్టవలసిన ఆత్మ రెండూ కలిస్తే ఆ గురువు అవుతున్నాడు గనుక ఆ గురువుకి మనం నమస్కరిస్తూ, గురు గోవింద్ దోనో ఖడే కాకే లాగో పాయే, బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే. గురువే లేకపోయినట్లయితే ఇతడు గోవిందుడు, ఇతడు మాధవుడు, ఇతడు రాముడు, ఇతడు సత్యసాయి అని ఎవరు చెప్పాలి? అటువంటి వాడు మాత్రమే గురువు అని అటువంటి గురువుకి కబీరు నమస్కరించినట్లుగా, ఇవాళ మనకి దైవం వైపు, సనాతన ధర్మం వైపు, ఆర్షమైన భారతీయమైన అనాహతమైనటువంటి వాంగ్మయ జెరిని మనకు పరిచయం చేసి, దానిలో మీరు ఉండండి. ఈ ఆనందాన్ని గ్రోలండి. అనేకమైనటువంటి స్థాయిలలో విచారణ చేయండని ప్రబోధించి, ప్రచారం చేసి, ప్రసారించినటువంటి సర్వోత్తమ గురు స్వరూపమైన సత్యసాయి భగవానుడి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.
YouTube · audio
Sri Sathya Sai Study Circle, Prashanthnagar Samithi ll SATHSANGH ON AYAM ATHMA BRAHMA
Sri Sathya Sai Study Circle, Prashanthnagar Samithi ll SATHSANGH ON AYAM ATHMA BRAHMA
Source: Cultural TV live on YouTube
0:00 / 4:15:41
More in this series
Sri Sathya Sai Study Circle — SATHSANGH (Prashanthinagar Samithi)
-
39 min 1 Sri Satya Sai Study Circle Prashanthinagar Samithi , HYD ll SATHSANGH "ATHIDHI DEVO BHAVA" ll LIVE
-
35 min 2 Sri Sathya Sai Study Circle Prasanthi Nagar Samithi ,Hyd l"SATHSANGH" On "MITHRA DEVO BHAVA" l LIVE
-
20 min 3 Sri Sathya Sai Study Circle, Prashanthnagar Samithi ll SATHSANGH ON AYAM ATHMA BRAHMA
Now playing