Skip to content
Transcript తెలుగు
సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమామ్ అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్. భారతీయ గురు పరంపర ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలోనే అతి స-సమున్నతమైనటువంటిది. కారణం ఏమిటంటే దేశకాల పరిస్థితులను బట్టి ధర్మగ్లాని జరిగినప్పుడల్లా ఒక చిచ్ఛక్తి అంటే పరమేశ్వరుడు ఒక అవతారం తాల్చి రావటం ఎంత సహజమో దేశంలో, ఆచార్య సత్తములు రావటం కూడా అటువంటివి అంశమే. కారణం వచ్చినవారు కేవలము అవతారమూర్తులు మాత్రమే కాదు, వారు గురు స్వరూపమై వచ్చి జగత్తుకి "ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణే" లేదా "మూర్తిత్రయ విభాగిణే" ముగ్గురు కూడా నామరూప భేదాలతో వస్తారు. తత్వాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించడానికి వచ్చి జాతి ధర్మపథం నుంచి వైదలుగుతున్నప్పుడు లేదా సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన భారతీయ ధర్మానికి అన్వయం చెప్పలేనప్పుడు, అన్వర్ధం చెప్పబడుతున్నప్పుడు, దీనిని సమర్థవంతంగా మళ్ళీ జన జాగృత రేఖలో ప్రపంచానికి అందించటానికి మహా చైత్య పురుషులు అవతరిస్తూ ఉంటారు. వాయు పురాణంలో ఒక ప్రమాణం ఉంది. ఏమిటా ప్రమాణం అంటే కలియుగ ఆరంభ వేళల్లో నలుగురు శిష్యులతో కూడినటువంటి ద్వాదశాదిత్యులలో ఒకరైనటువంటి జ్ఞానాదిత్యుడు జగత్తులోకి వచ్చి మళ్ళీ భారతీయ వాంగ్మయానికి పునఃప్రతిష్ఠ చేస్తారు అని ప్రమాణం. దాని ప్రకారం వచ్చినటువంటి వారే శంకర భగవత్పాదులు. "శంభోర్ మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా" పరశివావతారమైనటువంటి శంకరులే జగత్తులో నరయాడి బౌద్ధ వాంగ్మయం కారణంగా నిరీశ్వర వాదం ప్రబలి సనాతన ధర్మం ఒక్క క్షణం స్తబ్ధ-స్తబ్ధతకి గురైనప్పుడు దానిని సరి చేసి మళ్ళీ సమన్వయం చేసి బౌద్ధ జైన మత ప్రభావం నుంచి హైందవాన్ని బయటకు తీసుకొచ్చి ఇది జాతి వైభవం ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి నడుచుకోవాలి. మనకి అనేకమైనటువంటి దేవీదేవత రూపాలన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ భిన్నభిన్న స్వరూపాలుగా కనిపిస్తున్న "ఏకోహం బహుష్యామ్" ఒకటే అనేకంగా కనిపిస్తున్నాయి. వీటి మౌలికమైనటువంటి తాత్విక చింతనా భూమిక కూడా ఒకటే. "ఏకం సత్ విప్రా బహుధా వదంతి" సత్యం ఒకటే ఎవరు చెప్పినా కానీ, విజ్ఞులైనవారు, విబుధులైనవారు, జ్ఞానులైనవారు, తత్వజ్ఞులైనటువంటి వారు, మర్మజ్ఞులైనటువంటి వారు అదే సత్యాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరిస్తారని చెప్పారే తప్ప, మతం మతానికి, దాని అభిమతానికి అభిమతం సమకూడదని ఎక్కడా, ఎన్నడూ, ఎప్పుడూ, ఎవరూ చెప్పలేదు. నేపథ్యంలో శంకర భగవత్పాదులు వచ్చి సర్వ జన సమీకరణ కంటే కూడా హైందవ ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి, ధ్వజారోహణం ఎలా చేయించాలి అని ఒక విచార ధారని ఆధారం చేసుకొని అనేక భాష్యాలు, నూతులు, గీ-గీతాలు, సంగతులు, భాష్యాలు, ప్రకరణాలు ఇవన్నీ కూడా రాసి జగత్తుకి మహోపకారం చేశారు. అంటే శంకర భగవత్పాదులు సమాజ ఉద్ధరణ కంటే కూడా వాంగ్మయ ఉద్ధరణ ప్రధానం. అలాగే భక్తి ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా కర్మ, భక్తి, జ్ఞాన అనబడేటువంటి మూడు యోగాలని కూడా మానవజాతి సరైన రీతిలో అర్థం చేసుకోవాలి అని వారి ముప్పై రెండు సంవత్సరాల చాలా సంక్షిప్తమైనటువంటి అవని సంచారంలో తమ మూడవ ఏటనే ప్రజ్ఞాపూర్వకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ నుంచి వారు కాలడిలో ప్రారంభించి కైలాసం వరకు అంటే కేదారం వరకు తమ ఆధ్యాత్మిక యాత్రని సంపూర్ణమూ, సుసంపన్నమూ చేసి మళ్ళీ భారత జాతిని జ్ఞానం వైపు, తత్వం వైపు, భక్తి వైపు, ముక్తి వైపు పరమాద్భుతంగా నడిపించినటువంటి వైఖరి. అందుకనే ద్వాపర యుగంలో తొలి గురువు వ్యాసులవారైతే శంకర భగవత్పాదులు కలియుగంలో తొట్ట తొలి గురువు అంటే జగద్గురువు. తొలి జగద్గురువు అందుకనే వారిని ఆది శంకరులు అంటారు. నిజానికి శంకర భగవత్పాదులనే ఆది శంకరులు అనటం వెనుక ఉన్న పరమార్థం ఏమిటంటే, పరమేశ్వరుడు ఒక శివుడు అవతారమై వచ్చి జగత్తులోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఆసేతు సీతాచలము, వారు జన్మ ఎత్తినటువంటి కాలడి నుంచి అంటే దక్షిణాపథం నుంచి సర్వజ్ఞ పీఠాధిరోహణం వరకు కూడా ఆసేతు సీతాచలము అద్భుతంగా పర్యటించి సంఘర్షణకు లోనవుతున్నటువంటి సమాజాన్ని సమన్వయం చేశారు. కనుక ఆయన సరస్వతీ స్వరూపము, ఆయన సమన్వయ భారతి ఆయన. అంటే వాంగ్మయం ద్వారా జగత్తునంతా కూడా ఒక చోటికి చేర్చారు. జగత్తు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తు కేవలం భారతదేశం మాత్రమే గనుక. కనుక శంకర భగవత్పాదులని ఆది శంకరులని జగద్గురువని మనం శతతా మనం స్మృ-ఆ... స్తుతిస్తూ ఉంటాం. అంతే కాదు "శృతి స్మృతి పురాణాలయం క--శృతి స్మృతి పురాణాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం" అది కదా! అంటే శృతులు, స్మృతులు, పురాణాలు వీటన్నింటికీ ఎవరు మూలం అంటే వారే మూలమైనారు.అయితే ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారు కరుణాలయం అంటే దయ జాలి సానుభూతి మనిషి లక్షణాలు అయితే కరుణ ఒక్కటే భగవంతుడి లక్షణం. దాన్ని బట్టి వారు కరుణాలయం కరుణ ఒక ఆకారమైనట్లయితే ఒక నిధి అయినట్లయితే నిధానం అయినట్లయితే అట్లా వచ్చినటువంటి వారు శంకర భగవత్పాదులు. వారు ప్రతిపాదించింది అద్వైతం అద్వైతం అంటే మతం కాదు అద్వైతం అంటే సిద్ధాంతం కాదు అద్వైతం అంటే ఒక మనోభావనా భూమిక దానిలో రెండు అంటూ లేవు ఉన్నదంతా ఒకటే. ఒకటి రెండుగా కనిపించవచ్చు రెండు దాటి అంతా కూడా సహస్రమే కాబట్టి అనంతంగా కనిపించవచ్చు అమేయంగా కనిపించవచ్చు అప్రమేయంగా కనిపించవచ్చు అద్భుతంగా అవ్యయంగా కనిపించవచ్చు ఎట్లా కనిపించిన మూలంలోకి వెళ్లినట్లయితే ఒక్కటే అది చాలా పరమాద్భుతమైనటువంటి ఒక భావనా ధోరణిలో ఆత్మను గురించి ఆత్మబోధ చేసిన ఆత్మ విచార మార్గాన్ని గురించి చెప్పిన ఆత్మను గురించిన సలక్షణాలన్నీ భగవద్గీతను దాటి ఇంకా వివరించిన వారు చాలా rational గా చాలా ఉదారంగా చాలా liberal గా అన్ని కాలాలకు సరిపోయేటట్టుగా ఆత్మను వారు నిర్వచించిన విధానం సర్వోన్నతమైనది ఏమిటంటే ఆత్మ కనపడదు ఆత్మ నీట నానదు నిప్పున కాలదు కుంగదు పొంగదు లొంగదు వంగదు అన్న భగవత్పాదులే అసలు ఇంతకీ ఆత్మ అంటే ఏమిటి అని ఏక వాక్యంలో శాసనం చేశారు అదేమిటంటే ఆత్ అంటే ఏమి మా అంటే లేదు. అంటే ఏమీ లేదు అదే ఆత్మ అదేంటి ఇందాక అనేక స్వభావాలు చెప్పుకున్నాం కదా అంటే ఆత్మ అంటూ ప్రత్యేకంగా లేదు ఉన్నదంతా ఆత్మే సర్వం ఖల్విదం బ్రహ్మ ఇది ఒక నిరూపణ బ్రహ్మసూత్ర భాష్యాలు ఐదు వందల యాభై ఐదు సూత్రాలకి భాష్యం రాయటం ఒక అసమాన ప్రజ్ఞ. దానిలో అదాత్తో బ్రహ్మ జిజ్ఞాస తో ప్రారంభమైనటువంటి వ్యాఖ్యానం గనుక చదివితే లోక లోకాంతర పురాణాలు కదిలిపోతాయి. అలాగే ఇవాళ ప్రపంచం నేర్వవలసినది అర్థం చేసుకోవలసిన ఒక విశేషం ఉన్నది. నిజానికి శంకరులు రామానుజులు మధ్వాచార్యులు వీళ్ళ ముగ్గురినీ కూడా కలిపి మనం త్రిమతాచార్యులు అంటాం. అంటే వారిలో భేదభావాలు మనం పెట్టుకోకూడదు ముగ్గురు మూడు దారులు చూపించటానికి వచ్చారు అందులో తొలిదారి చూపించినటువంటి శంకరులు గనుక వారు ఆది శంకరులు అయినారు. అయితే శంకరులు ప్రతిపాదించిన అద్వైతము అంటే రెండు లేవని ఉన్నది ఒకటే నని మనం మాట్లాడుకున్నాం. ఇవాళ మనకి జాతి మత వర్గ వర్ణాల కారణంగా జాతి అనేకమైనటువంటి మార్పులకు లోనై ఏది అర్థం కాని పరిస్థితికి వచ్చినప్పుడు శంకర వాంగ్మయాన్ని గనుక మనం చదువుకున్నట్లయితే మనకి చాలా విస్పష్టమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఆలోచనలలో చాలా ప్రధానమైనటువంటిది ప్రస్తుత కాలంలో క్షణాల్లో మాట్లాడుకుంటున్నది సమతావాదం కదా మితవాదం అయింది మతవాదం అయింది అమితవాదం అయింది తీవ్రవాదం అయింది అన్నీ పోగా కొత్తగా ఏదో సమతావాదం వచ్చినట్లుగా మనం అనుకుంటున్నాం. అయితే సమతావాదానికి మొట్టమొదటి బీజం వేసినటువంటి వారు మళ్ళీ శంకర భగవత్పాదులే. మనీషా పంచకం చదివినప్పుడు మనకి వారు ఎంత సమతా మూర్తో మనకు అర్థమవుతుంది. చండాలోస్తు ద్విజోస్తు అంటూ ప్రారంభం అయ్యేటువంటి మనీషా పంచకంలో వాడు చండాలుడు అయినా సర్వోత్తముడు అయినటువంటి బ్రాహ్మణుడు అయినా ఎవరైనా సరే గురువు యందు ఒక గౌరవాన్ని భక్తిని కలిగి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటారో అటువంటి వాడికి నేను నమస్కరిస్తున్నాను ఇది నా మనీషా మనీషా మమ అని వారు నిర్వచనం చెప్పారు. కనుక వారు సమతా మూర్తి. కాలం ఎప్పుడూ శంకరులతోనే ఉండదు శంకరుల తర్వాత మరొకరు రావాలి అలా వచ్చినటువంటి వారే మన రామానుజాచార్యులు. రామానుజాచార్యుల వారు శంకరుల కంటే భిన్నంగా ఒక ఆలోచన చేశారు. ఎందుకు ఆలోచన చేశారంటే బౌద్ధము వెనక్కి వెళ్లి సంఘర్షణ నశించి మళ్ళీ భారతీయ ఆత్మ మేల్కొలిపి జాగృతమైనటువంటి ఒక గొప్ప సమయంలో రామానుజుల ఆవిర్భావం జరిగింది. వారు సంఘమే అంటే సమాజమే దేవాలయం అని అనుకున్నటువంటి వారు రామానుజులు. కనుక తన చుట్టూ ఉన్నటువంటి అల్లుకున్న పరచుకున్నటువంటి విశాల ప్రపంచాన్ని గమనించారు. గురు శుశ్రూష చేసిన గురు సాన్నిధ్యంలో అనేక విషయాలు వారు పొందినా వాటన్నింటినీ కూడా ఆంతరంగికంగా అవలోకనం చేసుకున్నారు. అవలోకనం చేసుకున్నప్పుడు కేవలము సామాన్యమైనటువంటి ఒక భక్తుడు లేదా ఒక వ్యక్తి మోక్షం వైపు ఎలా వెళ్ళాలి దీనికి మార్గం ఏమిటి అని ఆలోచించారు. శంకరులే ప్రతిపాదించిన అద్వైతాన్ని ఆధారమే చేసుకున్నారు ఆయన. చేసుకొని దానికి విశిష్టాద్వైతం అని పేరు పెట్టారు. అంటే విశిష్టాద్వైతం ఏంటంటే అద్వైతం మూలమైనట్లయితే విశిష్టాద్వైతం ద్వారా సర్వ జగత్తుని కూడా సమన్వయం చేసుకొని సర్వ జీవుల యెడల ఉండవలసినటువంటి సహజ మమకారము అపేక్ష ఒక మానవతావాదము వీటన్నింటినీ కూడా కలిపి సర్వ శాస్త్రీయమైనటువంటి వాటిని ఏక నామంగా వారు స్వీకరించి దీక్షా గురువుగా తా-తనను తాను భావన చేసుకొని ఓం నమో నారాయణాయ అనేటువంటి ఒక మంత్రాన్ని వారు ప్రపంచానికి గురువుని ధిక్కరించి జగత్తుకిచ్చారు. గురువు ఏమన్నారు నువ్వు గనక మంత్రం జగత్తుకిస్తే నువ్వు నరకానికి పోతావు అన్నారు.వీరు పరిణితి చెందిన మనస్కులు కాబట్టి ఒక మాటన్నారు. గురువుగారు మంత్రం చెప్పినందువలన కోట్లాది మంది గనుక స్వర్గానికి వెళుతూ ఉంటే నేనొక్కడినే నరకానికి వెళితే ఏమీ ఇబ్బంది లేదు నేను వెళ్తాను పర్వాలేదు అని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే శాస్త్రాలు వీటన్నింటినీ కూడా వారు సామాన్యులు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే సామాన్యులకి అర్థం కాదో తర్క మీమాంస వ్యాకరణాది విషయాల్లో మునిగిపోతారో జ్ఞానమే పరమావధి అని గనుక చెప్పినట్లయితే వర్గ వర్ణాలకు అతీతంగా అందరూ అనుకోదగినటువంటిది ఏది అంటే గురు మంత్రం నారాయణ మంత్రం కనుక నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చెప్పారు. చెప్పినప్పుడు వారు మరి నమో నారాయణాయ అని ఎందుకన్నారంటే వారు వైష్ణవ సాంప్రదాయాన్ని అంగీకరించారు గనుక. వైష్ణవ సంప్రదాయం అనేది ఎక్కడో పుట్టింది కాదు ఎవరో సృష్టించింది కాదు. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే భగవత్పాదుల తర్వాత మూడు వందల సంవత్సరాలకు రామానుజులు వస్తే మధ్యలో ఏర్పడినటువంటి భాగ సాంప్రదాయంలో నుంచి భాగవతులు పుడితే భాగవతులంతా కూడా భాగవతం చదివితే భాగవతానికి, భారతానికి, భగవద్గీతకి మూలమైనటువంటి కథానాయకుడు మూల శక్తి విష్ణువు కాబట్టి సర్వం వాసుదేవమయం అనేటువంటి ఒక భావంలో వైష్ణవాన్ని స్వీకరించి వారు విస్తృతం చేశారు. అయితే దీనిలో నారద భక్తి సూత్రాల్లో ఉన్నటువంటి ఒక సూత్రం ఏమిటి అంటే భక్తిరేవ గరీయసీ జ్ఞానం అందరూ ఆచరించటానికి వీలైనటువంటి విషయం కాదు. కేవలం కర్మ వలన ప్రయోజనము లేదు కానీ భక్తి భగవంతుని యొక్క భావనకి దగ్గరగా తీసుకుని వెళుతుంది గనుక భక్తి అనేటువంటి ఒక భావనని అందరి యందు సమకూర్చి సమాజాన్ని ఉద్ధరించేటువంటి ప్రయత్నంలో వారు దానిని చాలా ముందుకు తీసుకుని వెళ్లారు. అయితే దేహో దేవాలయ ప్రోక్తో జీవత్ దేవ జీవః సనాతనః అన్నటువంటి శంకర భగవత్పాదులు లేదా వేదవాంగ్మయం నుంచి రామానుజులు వచ్చేప్పటికి పరమాత్మ వేరు జీవుడు వేరు జీవులందరూ నాయికలు పరమాత్మ ఒక్కడే నాయకుడు కాబట్టి గోప గోపిక జనంగా భావించబడే పదహారు వేల మంది జీవులకు సంకేతమైతే యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ఒక్కడే నాయకుడు అని ఒక ప్రతిపాదన చేసి దానికి విశిష్ట అద్వైతము అని పేరు పెట్టారు. అయితే అద్వైతానికి చేరుకోవటానికి అద్వైత భావనకి లోపల ప్రవేశించడానికి విశిష్టమైన భక్తి మార్గాన్ని వారు సమాశ్రయించారు. కనుకనే వారు శ్రీ భాష్యం రాసినా, గీతా భాష్యం రాసినా అనేకమైనటువంటి రచనలు చేసినా వాదాలలో అనేకమందిని ఓడించే ప్రయత్నం చేసినా దశావతారాల్లో ప్రధానమైనటువంటి రామకృష్ణ అవతారాలను ప్రాతిపదికగా చేసుకుని మళ్లీ ఒకసారి భక్తి మార్గంలో అంటే చైతన్య మహాప్రభువు ఒక మీరా ఒక కబీరు అభంగులు, సన్తులు వీళ్లందరినీ కూడా తీవ్రమైన ప్రభావానికి గురి చేసినటువంటి వారు రామానుజులు. అంతేకాదు బాలగంగాధర తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటడానికి వెనక కూడా రామానుజుల యొక్క దేశభక్తి, దైవభక్తి, జీవ భక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి జీవుడు ఈశ్వరుడు భిన్నంగా కనిపిస్తున్నా ఎప్పటికైనా ఇదే ప్రపంచంలో నుంచి అంటే అనాత్మగా కనిపిస్తున్న మ్యానిఫెస్ట్ వరల్డ్ లో నుంచి మళ్ళీ తన మూలంలోకి అంటే తన పరదైవతం వైపు వెళ్లాలని వెళ్ళటమే అధ్యాత్మ అదే విశిష్టాద్వైతం అని వారొక అద్భుతమైన వ్యాఖ్యానం చేసి విశిష్టాద్వైతాన్ని వారు ప్రపంచానికి అందించారు. వారు అలా అందించి వెయ్యి సంవత్సరాలు అయింది. వెయ్యి సంవత్సరాల కాలంలో పరిణామ గతిశీలమైనటువంటిది ఏదన్నా జరిగిందా అనేది పెద్ద ప్రశ్న ఇవాళ. నిజానికి చాలా చక్కగా విచారణ గనుక చేసినట్లయితే వెయ్యి సంవత్సరాలలో రామానుజుల యొక్క భావం కానీ వారి భావ సంపద గాని వారు సూచించినటువంటి పరమత సహనం కానీ అందునా హైందవంలో ఉన్న ఇతర శాఖల పట్ల ఉండవలసినటువంటి కనీస మర్యాదలు గాని పాటించబడలేదు ఇది సత్యం. అయితే మళ్లీ ఇవాళ వెయ్యి సంవత్సరాలకి ఏదో సమతా స్ఫూర్తిగా రామానుజుల యొక్క విగ్రహం వచ్చింది గనుక ఇవాళ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? నేను ఏం ఉపాధ్యానో మీకు చెప్తాను. నా ఆలోచన ఒక్కటే వెయ్యి సంవత్సరాలు పదమూడు వందల యాభై సంవత్సరాల క్రితం శంకరులు అద్వైతాన్ని చెబితే వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజులు విశిష్టాద్వైతం చెప్తే జాతి మీద వాఙ్మయ ప్రభావం ఉన్నది, భక్తి ప్రభావం ఉన్నది కానీ మనిషిలో మానసిక ప్రవర్తన శూన్యమైపోయింది. మనిషిలో ఉండవలసిన మానవత్వం నశించిన తర్వాత అది బహుదూరమైన తర్వాత సమతావాదానికి చోటు ఎక్కడ? సమతా అంటే సర్వ మతాలని కూడా ఒకచోట గుండె దగ్గరకు చేర్చుకోవలసినటువంటి భావన. అంతేగాని నామరూప వేష భావాలతో మనం గనుక జన ప్రవాహాన్ని విడగొట్టుకుంటూ వెళితే రామానుజుల పట్ల మనం చేసేది అపచారం. ఆయన నూట ఎనిమిది దివ్య క్షేత్రాలు కాలినడకన దర్శనం చేసి ఎంత పరమాద్భుతంగా అందరినీ కూడా భక్తి చైతన్య మార్గంలో నడిపించి చైతన్య మహాప్రభువు ఎక్కడ? ఈస్ట్ బెంగాల్. ఈశాన్య భారతంలో ఆయన రావటానికి కారణమైనవారు రామానుజులు. కాబట్టి రామానుజుల ప్రణాళిక కేవలము కాలబద్ధమైనది కాకూడదు.అలా అయినందుకు మనం విచారిస్తూ ఇప్పటికైనా మేల్కొని మనం మళ్ళీ సమాజంలోకి రామానుజుల యొక్క నిజా స్ఫూర్తిని మనం అర్థం చేసుకోగలిగితే అది వైష్ణవమా? శంకరీయమా? లేదు శైవమా? లేదు జైనమా? లేదు బౌద్ధమా? వీటిలల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని దోషాలు తొలగించుకుంటూ గనుక మనం వెళ్లగలిగినట్లయితే అటు శంకరుల అద్వైతము, ఇటు రామానుజుల విశిష్టాద్వైతము జా-జాతికి భద్రతమమై ఒక శాసనంగా నిలబడుతుందని నేను భావిస్తున్నా. ఇది విశిష్టాద్వైతం. రెండిటికీ కొద్దిగా భిన్నంగా మూడవ మతమైనటువంటి అంటే మూడవ మార్గమైన మూడవ భావన అయినటువంటి ద్వైత మార్గం ఏర్పడింది. [గొంతు సవరించిన శబ్దం] ద్వైత మార్గం కర్ణాటక దేశంలో పుట్టింది. తులనాడు దాని పేరు అక్కడ అది ప్రారంభమైంది. వారు మధ్వాచార్యుల వారు. వారు కూడా పరమోన్నతమైనటువంటి జ్ఞాన శిఖ. మామూలు వారు కాదు. అయితే ఆయన దర్శనం వేరు. జీవుడు, జీవుడు వేరు. [గొంతు సవరించిన శబ్దం] జీవుడు, దైవము వేరు. జీవుడిలో ఉన్న అణువు, అణువు వేరు. అంటే రెండూ ఏదీ కూడా ఒకటిగా లేవు, ఒకటై లేవు. భిన్న భిన్నంగా ఉన్నప్పటికీ వాటి యందున్నటువంటి అంతః శక్తి అంతా ఒక్కటేనని, ఒక్కటి పరస్పరమైనటువంటి గౌరవంతో పరమాత్మ వైపు గనుక నడిపించుకుంటూ జీవితాన్ని గడపగలిగితే జీవుడు అనాత్మ ప్రపంచంలోనే పరమాత్మని దర్శనం చేసి తనను తాను మహోదారమైన స్థితిలో నిలకడ చెందించుకోగలడు అని చెప్పి వారు కూడా భక్తికి పెద్ద పీట వేశారు. అంటే ఇటు రామానుజులు, అటు మధ్వాచార్యుల వారు ఇద్దరూ భక్తి మార్గాన్ని ఉపదేశనం చేశారు. శంకర భగవత్పాదులలా కాకుండా కర్మ, భక్తి, జ్ఞాన. కర్మ ద్వారా భక్తి లేదా కర్మతో కూడిన భక్తి, కర్మ భక్తులతో కూడినటువంటి జ్ఞానము ఉండాలి. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే కదా! మానవ జన్మ ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. అంత తేలికగా లభించింది కాదు. లభించినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మానవ జన్మని ఏం చేయాలి అంటే, అన్ని శబ్దాలు పుట్టె నిశ్శబ్దమందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయ నారాయణాన్వేషితం. నారాయణున్ని అన్వేషించాలంటే నారాయణుడు అంటే చతుర్భుజుడు అయినటువంటి విష్ణువు కాదు, కాదు. నారము, అయనము దా గలిగిన వాడు జ్ఞాన స్వరూపుడైనటువంటి హయగ్రీవుల వారు దక్షిణామూర్తి మనకు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటి వైపు వెళ్ళాలి. జ్ఞానాన్ని గనుక మనం పొందకపోయినట్లయితే, జ్ఞానము అంటే విజ్ఞానం కాదు. శాస్త్రము, ప్రవచనము ఇదంతా విజ్ఞాన పరిధి. జ్ఞాన పరిధి ఏమిటంటే సర్వ-- సమతా దృష్టి, సర్వ సమన్వయ భావనా రేఖ. వీటన్నింటినీ గనుక సమన్వయం చేసుకోగలిగితే ఇప్పటికీ, ఎప్పటికీ కాలాజ్య విచ్ఛిన్నమైనటువంటి శంకరుల భావధార, అలాగే సమాజ సంస్కరణ వాదమైనటువంటి రామానుజ ప్రభ, అలాగే జీవ దేవులకి ఏదో ఒక కొంత దూరం, ఎడము ఉన్నదని కానీ కడగా జీవుడు దైవంలో కలవటమే ప్రధానమని బోధించినటువంటి అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత అనబడే మూడు మార్గాలు భారత జాతిని మహోన్నతమైనటువంటి అధ్యాత్మ శిఖరంలోకి చేర్చు గాక, చేరుస్తాయి అని అనుకుంటూ అదే మంగళాశాసనం చేస్తూ స్వస్తి.
YouTube · audio

Dvaitam-Advaitam-Vishishtadvaitam Wonderful Interpretation

Home

Dvaitam-Advaitam-Vishishtadvaitam Wonderful Interpretation

Source: DARSHANAM TV on YouTube

0:00 / 22:44