Skip to content
Transcript తెలుగు
సీత నుండి ఇంత ఆనందదాయకమైన సందేశాన్ని తెచ్చిన నీకు నా గాఢ పరిష్వంగం ఇస్తున్నాను. ఇంతకన్నా ఇవ్వగలిగింది నా దగ్గర ఏమున్నది అని రాముడు అంటాడు. ఎక్కడ? మౌని వాల్మీకి రామాయణంలో. అటువంటి హనుమ కు జయం. హనుమ అసలు పేరు సుందరుడు. అది ఆయన తల్లి పెట్టుకున్న పేరు. అంజని పుత్రుడు అయినందున ఆయన ఆంజనేయుడు అయినాడు. ఈయనకు హనుమ అనే నామం ఎట్లా వచ్చింది? తన ముద్దుల పు-- పట్టిని వదలి తల్లిదండ్రులు వారి పని మీద వెళ్ళిన క్షణాన ఆంజనేయుడు అప్పుడే ఉదయించిన భాస్కర బింబాన్ని ఫలంగా భావించి వేల యోజనాల దూరంలో ఉన్న సూర్యబింబం దగ్గరకు వెళ్ళాడు. సూర్యున్ని గ్రహణం చేయటానికి రాహువు సిద్ధమవుతున్న వేళ రాహువు బాలకుడిని చూసి భయపడి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి గ్రహణాధికారం పోతున్నది అని వాపోయినాడు. అప్పటికే బాలాంజనేయుడు సూర్యబింబాన్ని మింగుతూ ఉన్నాడు. ఇంకేముంది లోకాలన్నీ చీకటిమయమైపోయినయి. క్షణంలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో సుందరుడి మూతి మీద దెబ్బ కొట్టాడు. మరొకరు మరొకరైతే మరణం తధ్యం. కానీ అలా జరగలేదు. దెబ్బకు బాలుడు కింద పడ్డాడు. విషయం తెలిసిన వాయుదేవుడు గాలిని బంధించాడు. సర్వలోకాలు భీతిల్లినయి. సర్వ దేవతలు వాయుదేవుని ప్రార్థించగా "మీ అందరిలో ఉన్న శక్తిని, సుగుణాలను మా ఆంజనేయుడికి ఇవ్వాలి" అని కోరాడు. అంతే. సూర్యుడు విముక్తుడయినాడు. గాలి విడుదలయింది. ఆంజనేయుడు తెప్పరిల్లాడు. కానీ వంకర తేలిన హనువుతో అంటే దవడలతో క్షణం నుంచి సుందరుడు హనుమ అయినాడు. ఇది కథేనా? కాదు కాదు. ఆంజనేయుడి గురువు ఆదిత్యుడు. గురువును చూడగానే గురువును కలుసుకోవాలన్న తహతహ ఆయన్ను వశుణ్ణి చేసింది. సూర్యుడిని మింగటం అంటే పెను వెలుగును తన లో వెలుగుగా అనుభవంలోకి తెచ్చుకోవటమే. ఆపై వజ్రాయుధం దెబ్బకు మరణించవలసిన వాడు కేవలం మూర్చిల్ల్లటం ఆయన చిరంజీవిత్వానికి సంకేతం. రాహువు ఇంద్రాదులు భీతిల్లటం అంటే అనుగ్రహం పొందిన వాడిని గ్రహాలు ఏమీ చేయలేవు అన్న విషయాన్ని స్పష్టం చేయటమే. సూర్యమండలం చేరినగ-- చేరగలిగిన వాడికి ఆపై లంక చేరటం పెద్ద విషయం కాదు అని ఒక సూచన, ఒక స్పష్టత. వాయుదేవుని ద్వారా తాను పొందినంత మహా శక్తి సద్గుణ ఐశ్వర్య సంపద అంతా లోకహితం కోసమే, స్వామి కార్య నిర్వహణ కోసం వినియోగించవలసి ఉన్నది అని ఒక భావన. అటువంటి హనుమ కు జయమగు గాక. అటువంటి హనుమ జ్ఞాన సాగరుడు, గుణ సాగరుడు కూడా. ఆయన నవ వ్యాకరణ పండితుడు. వ్యక్తులను బట్టి ఆయన ప్రవర్తన ఉంటుంది అంటే వివేకము, విచక్షణ మేలు కలయిక హనుమ. అవధులు లేని జ్ఞాన పారావారమే హనుమ. అన్నిటికన్నా వినయము జ్ఞాన సాగరానికి చెలీలికట్ట. సర్వ శాస్త్రములు, వేదములు ఎరిగిన జ్ఞాన సముద్రుడు వినయ వినమ్రత గాత్రుడు కావటం కాక మరి ఏమవుతాడు. జయ కపీష్డు అంటే కపి శ్రేష్టుడు, కపివరుడు అయినటువంటి హనుమ సర్వోన్నతుడు. సర్వ శాస్త్ర పారంగతుడు. వాలి వలన కలిగిన భయాన్ని సుగ్రీవుడు హనుమ అభయం వలన, సాంగత్యం వలన భయం విడిచి ధైర్యంగా ఉండగలిగాడు అంటే ఆయన కపిరాజు మాత్రమే కాదు, రాజులకే తలమానికమైనటువంటి వాడు. అంతే కాదు, కపి అంటే నిరంతరము బ్రహ్మానందమును కోరువాడు అని అర్థం. అంటే ఆనందం, పి అంటే తాగువాడు. ఏది అనంతమో అదే ఆనందం. అనంతానందమే బ్రహ్మానందం. ఆనందమును తాగువాడు కపి. దానికి ఈషుడు అయిన వాడు, శ్రేష్టుడైన వాడు కపీశ్వరుడు అయినాడు. అటువంటి కపులకునూ ప్రాణదాత అయినందువలన ఆయన కపీషుడు అయినాడు. మూడు లోకాలని ప్రకాశమానం చేయగలిగినటువంటి, ఆంతరంగికమైనటువంటి ప్రభాసంపన్నుడు హనుమ. మూడు లోకాలు అంటే అన్ని లోకాలని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని అంటే సర్వాణువులని అని అర్థం. భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మికం అని మరొక అర్థం. అంటే అన్నిటా అంతటా ప్రకాశించువాడని, అన్ని లోకములను ప్రకాశింపజేయువాడు అని విశేషార్థం. వెలుగుకు మూలమైన సూర్యుడు హనుమకు గురువు కదా! ప్రకాశించటం, ప్రకాశింపచేయటం ఆయనకు సహజం. అది ఆయన లక్షణం, ఆయన లక్ష్యం. అటువంటి జ్ఞానగుణ సాగరుడు అయినటువంటి హనుమకు, కపీషునకు సమస్త లోకముల యందు ప్రకాశిస్తూ వాటిని వెలిగిస్తున్నటువంటి హనుమకు జయమగు గాక. వైభవము నందు ఆసక్తిని జయించిన కారణంగా ఆయన వైరాగ్యమూర్తి. అంటే ఏమి చేసినా స్వామి కార్యం యందు మాత్రమే తన ప్రజ్ఞను లగ్నం చేశాడు. తనకై తాను విషయము చేయకుండా, రకమైన లాభాన్ని కోరకుండా, నిస్వార్థమైనటువంటి సేవ, నికామమైనటువంటి సేవ చేశాడు గనుక హనుమ కేవల కింకరుడు కాదు, ఆయన శంకరుడే. కనుక ఆయన రుద్రాంశుడు అయినాడు. శ్రీరామచంద్రుని ధ్యానించటంతో పాటు ఆయనను సేవించాడు. ఆయన తన మనస్సును జయించినటువంటి జితేంద్రియుడు. ఇంద్రియాలను జయించటం కష్టం కాదు. కానీ జయించబడిన ఇంద్రియాలతో కలకాలం జీవించగ-- కటమే మహాద్భుతమైన సాధన. అందువలన అటువంటి ఆయనకు జయము అంటూ ప్రత్యేకంగా లేదు. ఉన్నదంతా జయమే, విజయమే సర్వత్రా. అటువంటి హనుమను స్మరించినట్లయితే సర్వలోకములలోనూ జయమవుతుంది అని అనుకోవటమే సమ్మతం. అది సర్వజనహితం. నిరంతరము నీ నామస్మరణ చేసేటువంటి ఉత్తములని గ్రహపీడలు, అపశకునాలు బంధిస్తాయా? కష్టాలు కేవలం మిడతల దండు వంటివి కదా! అవి అగ్నిని కప్పేయగలవా? నీ నామస్మరణతో నీ సేవ చేసి మనుష్యులు ఆనంద జీవనులు కారా? కారాదా?అని అనుకోవాలి అవరోధాలు దాటకుండా అంతిమ గమ్యం చేరలేము కష్టాలు ఎదుర్కోకుండా సుఖాలను పరిపూర్ణంగా అనుభవించలేము అనుగ్రహం పొందిన వాడికి గ్రహాలు ఏమీ అడ్డు కావు స్వాత్మ నిష్టతో జయము తప్ప అన్యమెరుగని వానికి జయము అసలు పేరు కదా ఇది ఈనాడు హనుమజ్జయంతి అంటే హనుమా అంటే ఓంకారము అని మరొక అర్థం అకారో కార మకార యుక్త మగు ఓంకారాభిధానం అంటాడు దుర్జటి అకారము మకారము ఉకారము కలిస్తే ఓం అవుతున్నది ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అసలు మొట్ట మొదటి అక్షరము ఏది అంటే ఓం అవుతున్నది అందులో హనుమా అనేటువంటి మూడు బీజాక్షరాలని గనక గమనించినట్లయితే అకార ఉకార మకారాలు దాని యందు నిండి ఉన్నాయి గనక హనుమా అన్నా ఓంకారమన్నా అది ఓంకార ప్రణవోపాసన గా భావన చేసినప్పుడు మన యందు సాగే ఇరవై ఒక్క వేల ఆరు వందల మార్లు మన యందు సాగేటువంటి ప్రాణాయామం ఏదైతే ఉన్నదో ప్రక్రియ అంతా ఓంకార ప్రణవ నాద సమ్మిళితమై మన దేహ దేహాంతరమైనటువంటి స్థితులని పరమ పావనము పరిపూతము చేసేటువంటి దివ్యమైనటువంటి మహా మంత్రం కాబట్టి హనుమా రామా శివ మూడు కూడా నిజానికి ఒక్కటే ఇది అద్వైత భావనలో హనుమను కేవలము రాముడి దాసుడిగా రాముడి దూతగా రామానుజుడిగా అనుజుడు అంటే అనుసరించిన వాడు అని కూడా ఒక అర్థం కాబట్టి అలా కాకుండా రామ హనుమ రని అద్వైత భూమికలో గనక మనం విచారణ చేసినట్లయితే ఇద్దరూ కూడా శివకేశవులు జగత్తు లోకి వచ్చి ఒక అభేద అద్వయ అద్వితీయ రమణీయ మనోజ్ఞ భావనా భూమికలో మానవుడి యొక్క హృదయాన్ని తడుముతూ తడుపుతూ నడిపించేటువంటి దివ్యుడు అయినటువంటి హనుమ కు ఈరోజు మనమందరం కూడా ప్రణమిల్లుతూ హనుమ కు జయమగు గాక అంటే హనుమ నామస్మరణంతో మనందరికీ జయము కలుగు గాక అని భావన చేయవలసి ఉన్నది స్వస్తి.
YouTube · audio

జయ హనుమాన | శ్రీ VSR మూర్తి గారి ప్రసంగం | Jaya Hanumaana | Talk

Home

జయ హనుమాన | శ్రీ VSR మూర్తి గారి ప్రసంగం | Jaya Hanumaana | Talk

Source: AIRHyderabad on YouTube

0:00 / 8:19