Skip to content
Transcript తెలుగు
సొందరీ సార సర్వస్వం సాయిరాం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం తురీయాతీత పదస్థితాం కరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విసత్ ప్రాప్తం సద్గురుం సత్య సాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పర్దాన్మే పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఉపనిషద్ వాహినిలో ఈశావాస్యోపనిషత్తుని మనం అందంగా ముగించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. జీవుడు జగత్తు జగదీశ్వరుడు ఒక్కటేనని, ఈశ్వరుడు గురువు ఆత్మ ఒక్కటేనని రెండుగా విభజించి అంటే ఆరు పార్శ్వాలు ఈశావాస్యోపనిషత్తు అంతా కూడా ఆవరించి ఉన్నది. దీని యందు దాగి ఉన్నటువంటిది అనేకంగా కనిపిస్తున్నటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి. ఏకత్వాన్ని అనుభవించాలి అంటే అనేకమైనటువంటి సాధనా రీతులు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా ఇవాళ మనం చక్కగా విచారణ చేద్దాం. అద్వైతా మృతధార కురియ అంతరంగమరిడి పాత్ర తెరచి ఉంచు బోర్లించి ఉండగా బుట్టైన చిక్కదు తెరచి ఉంచిన చాలు తరచనగును. ఏదైనా విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు open mind తో ఉండాలి conditioned mind తో ఉండకూడదు. mind ఎప్పుడైతే condition అవుతుందో సత్యం మనకు బోధపడదు. కానీ సత్యం చుట్టూ ఆవహించి ఉన్నటువంటి మాయ, దాని వలన కలిగేటువంటి అనేక ప్రభావాలు మన స్వభావాన్ని కప్పిపెట్టి ఉంచుతాయి గనుక ఈశావాస్యోపనిషత్తు లో మనం తీవ్ర విచారణ చేశాం. ఈశ్వరుడు ఇంకా కంటికి కనపడలా, ఆత్మని ఇంకా అనుభవంలోకి తెచ్చుకోలా కానీ గురువు ఎవరో చూశాం. కనుక ఈశ్వరుడన్నా, గురువు అన్నా, ఆత్మ అన్నా ఒకటే అయినప్పుడు గురువుగా కనిపించేటువంటి ఒక వ్యక్తి ఈశ్వరుడు అయి ఉన్నాడు ఆత్మ కూడా ఉన్నది. కానీ గురువు యందున్న ఆత్మని పట్టుకోవటంతో మన సాధన పూర్ణంకాలే. అది ఎట్లాగూ పరమాత్మే కానీ మనలో ఉన్న ఆత్మని మనం ఎలా వెతికి పట్టుకోవాలి? దీనికి ఒక చక్కని సమాధానం ఈశావాస్యోపనిషత్తు మనకి చెప్తుంది వివరిస్తుంది. అలాగే ఇక జగత్తు కంటికి కనిపిస్తూనే ఉంది దీన్నే మనం నమ్ముకొని ఉంటాం, మనం శాశ్వతం అనుకుంటాం లేదా మనం కొన్న వస్తువు కూడా శాశ్వతం అనుకుంటాం. ప్రపంచం అంతా శాశ్వతం అని అనుకుంటాం. కానీ ప్రపంచానికి ఉన్న ఒకే ఒక్క స్వభావం ఏమిటంటే నిరంతరము పరిణామం చెందుతూ ఉంటుంది. పరిణామం అంటే మార్పు చెందుతూ ఉంటుంది. మన ఊహకి అందని రీతిలో మార్పు చెందేది కొంత, మనకు ఊహకు అంది అనుభవ పరిమితంగా ఉండేటువంటి మార్పు కొంత. అంటే ఒక చెట్టు పువ్వు పూయటం, ఒక ఋతువులో పూయటం, ఒక ఋతువులో కాయటం, ఒక time లో పండటం, ఇదంతా కంటికి కనిపించేది. కానీ కంటికి కనిపించని, మనం మన ఊహకి అందని, మనం పట్టుకోలేని, మన శక్తికి మించినటువంటి పరిణామం జరుగుతూ ఉంటుంది. ఇది నిత్య పరిణామ శీలమైనటువంటి ఒకే ఒక్క స్వభావంతో ఒక గుణంతో ఉండేది. ప్రకృతి కాబట్టి ప్రకృతిని కూడా పరమాత్మగా భావించమని చెప్పింది ఇదిగో ఉపనిషత్తు. ఇక జీవుడు అంటే మనం మన బోటి వాళ్ళం అందరం జీవాత్మలు గా వచ్చాం. అంటే [గొంతు సవరించుకు] జీవుడుగా, ప్రాణిగా, మనస్సుగా, చైతన్యంగా అనేక రకాలుగా మనల్ని మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నప్పటికీ కూడా మనం ఎవరంటే ఆత్మతో కూడి ఉన్నాం గనుక మనం జీవాత్మలమైనాం. పరమ చరమమైనటువంటి ఒక సంపూర్ణమైన పూర్ణమదః పూర్ణమిదం అనేటువంటి దానికి పూర్ణంలో నుంచి మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి స్వామి చెప్పినట్లుగా మనకు పరమాత్మకి ఒక అభేద అద్వితీయ అద్వయమైనటువంటి ఒక స్థితి మనకు ఏర్పడి ఉంటుంది. కానీ మాయావరణ ప్రభావం చేత అనేక శాస్త్రాలు చదివిన దానివలన కలిగేటువంటి ఒక చిన్న సాత్వికాహంకారం చేత మనల్ని మనం వేరుగా భావించుకుంటాం. పరమాత్మ తనను తాను వేరుగా భావించుకోడు. స్వామి ఉపన్యాసాలు గాని, స్వామి మాటలు గాని, స్వామి ఎప్పుడైనా వ్యక్తిగతంగా చెప్పినప్పుడు గాని, "నీకు నాకు ఏమీ తేడా లేదు. నేను పరమాత్మనని నాకు తెలుసు నీకు తెలియదు." అని అంటారు. అంటే ఏమిటి? మనం కూడా పరమాత్మే అన్న భావనలోకి మనం వెళ్ళాలి. వెళ్ళటం అనుకోవటం తేలికే గాని పరమాత్మగా ఉండటం చాలా కష్టం. దానికి మార్గోపదేశం చేస్తూ ఒక్కొక్క దానిని ఒక్కొక్క దానిని తొలగించుకుంటూ వెళ్ళేటువంటి మార్గాన్ని చెప్తూ జగత్తుని పరమేశ్వరుడిగా భావించు. అలాగే జీవుడిగా నువ్వు శాశ్వతం కాదు. ఎందుకంటే నువ్వు దేహాన్ని ధరించి వచ్చావు. ఒక చెట్టు చిగురాకులు వస్తాయి, మల్లెరాకులు వస్తాయి, తలరాకులు వస్తాయి, పండు టాకులు వస్తాయి, ఎండు టాకులు వస్తాయి. తాను అంటుకున్న కొమ్మ నుంచి తాను కిందకు రాలిపోతుంది, సమయం వచ్చినప్పుడు. అట్లాగే జీవుడు కూడా తల్లి గర్భాలయం నుంచి బయటకు వచ్చి జగత్తుతో మమేకమై జగత్ భావనలో తనను తాను ముంచెత్తుకొని తన స్వరూపాన్ని, తన స్వభావాన్ని, స్వధర్మాన్ని మరిచిపోయి కేవల ప్రాపంచిక లౌకిక భౌతిక వ్యాపారంతో మనస్సును చెదరగొట్టుకుంటాడు గనుక మళ్ళీ మనస్సును వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే, నీవు పరమాత్మని అనుభవించేటువంటి స్థాయిని నీ అంతట నీవే తెచ్చుకుంటావు. తెచ్చుకోవాలి, ఇది ఎవరో తెచ్చి మనల్ని అక్కడ పెట్టరు. కానీ మార్గం సూచిస్తారు. ఇలా వెళ్ళండి, మార్గంలో వెళ్ళండి, పని చేయండి లేదా సేవ చేయండి, ఇట్లా అందరినీ ప్రేమించండి, ఇవన్నీ చెప్తారు. కానీ అవన్నీ మనం చేయాలి.చేస్తే మనకు ఒక అనుభవం కలుగుతుంది కాబట్టి అనుభవ రస సిద్ధం అయ్యేటువంటి స్థాయిలో మనం జీవాత్మలుగా ఉన్న మనం కూడా పరమాత్మ మన మూలంతో ఎప్పుడూ కూడా, చూడండి మనం అనేక దేశాలు world tour అంటాం వెళ్లి వస్తాం అనేక countries వెళ్లి వచ్చేస్తాం. ఎన్ని countries లో ఉన్నా ఎంత తిరిగినా ఎన్నేళ్లకు మళ్ళీ తిరిగి వచ్చినా మన స్వస్థానమైన మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అన్నీ వెనక్కి వెళ్లిపోతాయి మన స్వస్థానంలో మనకు ఆనందం ఉంటుంది ఎందుకంటే అది మనది కనుక. మిగతావి ఏవీ మనవి కావు కనుక. అందుకే "స్వధర్మ ye నిధనము శ్రేయః పరధర్మో భయావహః" అంటాడు కృష్ణుడు భగవద్గీతలో. స్వధర్మాన్ని మించిన ధర్మం మరొకటి లేదు. పరధర్మం అంటే నీది కానిది నాది అనుకోవటం అంటే నాదేదో ఇది కాదు కానీ ఇది కూడా నాదే అనుకున్నట్లయితే దానిలో దుఃఖం ప్రారంభం అవుతుంది గనుక ఉపనిషత్తులు వీటన్నింటినీ కూడా మానవుడి యొక్క మనస్తత్వాన్ని చక్కగా ప్రోది చేసి సన్మార్గంలో పెట్టి ఆలోచనలు, భావనలు దాని యందు పుట్టేటువంటి అనేకమైనటువంటి అమృతోత్పాదమైనటువంటి భావనలన్నింటినీ కూడా సమన్వయం చేసి ఈశ్వరార్పితం చేసే దిశగా ఆధ్యాత్మిక భూమికలోకి తీసుకువెళితే గనుక మనం ఈశావాస్యోపనిషత్తుని కేవలం మంత్రాలుగా, కేవలం ఏదో సంస్కృతంగా అనుకోక్కర్లేదు, అనుకోకూడదు. రోజుల్లో సంస్కృతం ఉంది గనుక భాషలో చెప్పారు. దాన్ని ఇవాళ మనం చక్కగా అర్థం చేసుకుని అనుభవించి అర్థం చేసుకున్నట్టు టీకా, తాత్పర్యము, వివరణ, విచారణ అది కాదు. దానిని అనుభవించాలి. ఎలా అనుభవిస్తాము? మన జీవితం ఒక అద్భుతమైన వేదిక. ప్రతి రోజూ ప్రతి క్షణమూ ఒక అవకాశం. అవకాశంలో మనం దేనిని నేర్చుకున్నామో, దేనిని మనం చక్కగా మనకున్నటువంటి intellect తో దాన్ని అర్థం చేసుకున్నామో, దానిని జీవితంతో సమన్వయం గనుక చేసుకున్నట్లయితే జీవితం చరితార్ధము, పునీతము, పావన భావనామయం అవుతుంది గనుక ఈశావాస్యోపనిషత్తులో జీవాత్మకు ఉన్నటువంటి స్థితి ఇది అని చెప్తుంది. బావుంది. జగదీశ్వరుడు, ఆయన్ని కాసేపు పక్కన పెడదాం అది చాలా పెద్ద subject కాబట్టి. పక్కన పెడదాం అంటే ఇవ్వేళ పక్కన పెడదాం అసలు ముందు ఆయన గురించి మాట్లాడాలి. కానీ అది ఇక్కడ ఎక్కువ మాట్లాడబడదు. ఈశావాస్యంలో "ఈశావాస్యమిదం జగత్" అనటంతోనే ఈశ్వరుడు, ఈశ్వర స్పర్శ లేకుండా అసలు జగత్తు లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పదార్థంలో, ప్రతి అణువులో, అణువు ఆహ్ పరమాణువులో కూడా పరమాత్మే దాగి ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని ఆవిష్కరించేదే ఈశావాస్యం కాబట్టి జగదీశ్వరుడిని కాసేపు పక్కనబెట్టి మనం చేయవలసింది ఏమిటంటే జీవాత్మగా మనం మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం. అంటే జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు. జగదీశ్వరుడే చివరికి. కాబట్టి జీవుడిగా మనకున్నటువంటి మనం రెండు వారాలు వివరణగా మాట్లాడుకున్నాం. ఇవాళ జగత్తు గురించి కాస్త విచారణ చేద్దాం. "ఈశావాస్యమిదం జగత్" అంటే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అన్న భావన ఒకటైతే అసలు భావన ఏమిటంటే అసలు జగత్తంతా ఆత్మమయమే. ఆత్మ అనే మహాసముద్రం గనుక అయినట్లయితే ప్రకృతి అంతా సముద్రంలో మనం ఆనంద బిందువులుగా ఉన్నాం ఇక్కడ. బిందువు లేకుండా సింధువు ఏర్పడలే. సింధువు అంటే సముద్రం. బిందువులన్నీ కలిసి సింధువు అయినాయి కాబట్టి బిందువు బిందువుగా కనిపిస్తున్నది, అనిపిస్తున్నది దీని స్వరూప, నామ, భావ, తత్వార్ధాలను బట్టి. ఇదంతా కలిసినప్పుడు సముద్రమై పోతున్నది గనుక ఒక్క బిందువుగా, ఒక్క చుక్కగా ఉంటే బిందువు అన్నాము. అన్ని బిందువులు కలిస్తే దాన్ని సింధువు, సముద్రం అన్నాం కాబట్టి మనకి, జగత్తుకి ఒక అభేదం ఏర్పడిపోయింది. ఇది నిజమైనటువంటి ఒక అద్వైత స్థితి. నిజమైన ఆత్మని అంటే అన్ని-అన్ని చోట్ల ఆత్మను చూడాలి, బ్రహ్మమును చూడమని స్వామి చెప్పారు. బ్రహ్మము అంటే జగదీశ్వరుడి యొక్క ఒక మూలతత్వాన్ని చెప్పారు. ఇక్కడికి వచ్చి సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను నీవు గనుక దర్శనం చేసుకుంటే నీకు కలిగే లాభం ఏమిటి? ఇది ప్రశ్న. అంటే మనకెలా తెలుస్తుంది నేను దీన్ని ఆత్మగా చూశాను అని? చూడండి మనం ఒక చెట్టును పెంచుతాం. చెట్టు మామూలుగా దాని ధోరణిలో నాలుగైదు మొగ్గలు వేస్తుంది అనుకుందాం. మీరు దానిని రోజూ పలకరించండి. నీళ్లు అలా విసిరి పోయకుండా దానిమీద చల్లండి. ఆకు ఆకుకి నీరు అందేట్టుగా, అతికేట్టుగా, అలదేట్టుగా చల్లండి. దానిని చల్లగా, మెల్లగా స్పృశించండి, తాకండి. నలభై మొగ్గలు వేస్తుంది. మనం అడిగామా? కేవలము నాలుగు చుక్కల నీళ్లు, ఒక చిన్న స్పర్శ. ఏదో నేలలో విత్తనం వేశాం అదే వచ్చింది, అదే పూస్తుంది, అదే-- అంటే ఏమిటి? అది ఎంతవరకు రావాలో అంతవరకు వస్తుంది అంతే. కానీ మన స్పర్శ చేత, ఈశ్వర స్పర్శ చేత జీవుడు తన యందున్నటువంటి వాత్సల్యాన్ని, ప్రేమని దానియందు కూడా చూపించినప్పుడు నలభై పూలు పూస్తాయి. నలభై పూలు కోసే హక్కు నిజానికి మనకు లేదు. ఎందుకని? చెట్టు గనుక తల్లి అయితే పువ్వు బిడ్డ. తల్లిని, బిడ్డని వేరు చేయటానికి మనకి అవకాశం లేదు. కానీ మరి పూలు వినియోగ పడాలి కదా! వాటిని కూడా స్వస్థానానికి చేర్చాలి కదా! ఎక్కడికి చేర్చాలి? పరమేశ్వరుడి పాదాల దగ్గరికి తీసుకొని వెళ్లాలి గనుక నాలుగు పూలు పూస్తే ఒక పువ్వే మనం భగవంతుడి కోసం కోయాలి. నాలుగు కోసి తల్లిని ఏమీ లేనిదాన్ని చేయకూడదని ఉపనిషత్తు చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే ప్రకృతిలో పొట్టి చెట్టే కదా, పూల చెట్టే కదా అనుకుంటాం. కానే కాదు. పూల చెట్టు యందు ఒక ఆత్మ ఉన్నది. ఆత్మానుసంధాన తత్వ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో దానివలన చెట్టు ఆనంద పరవశమై తనను తాను ఆవిష్కరించుకుంటుంది ఎట్లా ఒక పువ్వు రూపంలో. కొన్ని చెట్లల్లో పువ్వే నెమ్మదిగా కాయగా మారుతుంది. కాయే కాలక్రమంలో పండు అవుతుంది. పండే ఎండితుంది, ఎండి రాలుతుంది.ప్రాణి మళ్ళీ చక్కగా ఒక పునర్జన్మను ఎత్తుతుంది గనుక సమస్తమైనటువంటి జగత్తు కూడా పరిణామగతమైనది అని మనం అర్థం చేసుకోవాలి. మన యందు ఆత్మ ఉన్నదో, పరమాత్మని మనం పరమాత్మగా అంటే పరిపూర్ణమైన, పరమమైన, చరమమైనటువంటి ఆత్మగా మనం భావన చేస్తున్నామో ఆత్మే దీని యందు ప్రతిఫలిస్తూ ఉన్నది గనుక ఒక సూర్యుడి యొక్క ఒక కిరణం రాగానే మనల్ని తాకగానే సూర్యుడే మనల్ని తాకినట్టుగా భావిస్తాం. కదా? అట్లాగే మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వస్తువుల యందు ఇటువంటి అభిమానాన్ని, ఇటువంటి రాగాన్ని, ఇటువంటి అనురాగాన్ని అన్నింటినీ మించిన నిస్వార్థమైనటువంటి ప్రేమని మనం గనుక అలవాటు చేసుకోగలిగినట్లయితే, ఇదిగో ఇది ఇట్లాగే ఇవాళ పొద్దున పుట్టింది, రాత్రి మొగ్గగా ఉంది, తెల్లవారు లేచేప్పటికి పుష్పమైంది, అన్ని చోట్ల చక్కగా వాసనలు వెదజల్లింది, పూలు బాగా పూచినయ్యాయి అనుకున్నాం. నాలుగింట్లలో ఒక భాగం మాత్రమే పరమాత్మ పాదాలకు అందించాం. దానితో దాని జీవితం ధన్యమై-- పువ్వు దానంతట అది ఇక్కడికి రాదు. అది పరమాత్మను చేరుకోవాలి. చేరుకోవటానికి మనం మీడియం కావాలి. కాబట్టి మన యందున్న జీవాత్మ, చెట్టు యందున్నటువంటి జీవాత్మ రెండూ పరస్పరము సంభాషించుకోదగిన స్థాయికి మన మనస్సును తీసుకుని వెళ్లినట్లయితే చెట్టున పూచిన పువ్వును తెస్తాం, స్వామి పాదాల దగ్గర, భగవంతుని పాదాల దగ్గర పెడతాం. దాని జన్మ ధన్యం. చేర్చినందుకు మనము సేవ చేసినట్లు అవుతాం. రీతిగా దీన్ని మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్న-- ఉదాహరణకి మన ట్యాప్ లో నీళ్లుంటాయి. ఒక గ్లాసులో నీళ్లు పట్టుకున్నాం. మన ఇంట్లోవే, మన ట్యాపే, మన గ్లాసే. తెచ్చాం స్వామి దగ్గర, భగవంతుడి దగ్గర కూర్చున్నాం. ఐదు నిమిషాలు అయిపోయేదానికి కాస్త మంత్రం చదువుకొని స్వామికిలా సమర్పించగానే మనం తెచ్చిన నీళ్లే తీర్థం అయిపోతున్నాయి. ఎట్లా అయినాయి? అవి ఎక్కడికి చేరినయ్యో దాని కారణంగా పవిత్రతని సంపాదించుకున్నాయి. స్థాన విశేష మాత్రమున అని తామరాకు మీద నీటి బొట్టు అనుకుంటుందట నేను ముత్యంలా వెలిగిపోతున్నాను అని. అహంకరించొద్దు. ఎందుకంటే నువ్వు తామరాకు మీద ఉన్న నీటి బొట్టువు మాత్రమే. సూర్యుడు ఎక్కువగా ఎండ కాస్తే ఆవిరైపోతావు. గాలి గనుక వీస్తే తామరాకు నిన్ను మళ్ళీ నీళ్ళలో పడేస్తుంది. కాబట్టి నువ్వేవన్నా ముత్యాల మాలగా మారించగలవా? ఎక్కడికన్నా నిన్ను తీసుకు వెళ్తారా? నువ్వు చేతికి అందుతావా? అంది ప్రయోజనం లేదు. తామరాకు మీద నుంచి బయటకు రాగానే నువ్వు కేవలం నీటి బిందువువే గనుక ప్రకృతిలో పరమాత్మను చూడనంతవరకు నీవు ఒట్టి జీవివి మాత్రమే. ప్రకృతిలో నువ్వు పరమాత్మను చూడగలిగితే నీవు జీవాత్మవు అవుతావు అని ఎంతో స్పష్టంగా, ఎంతో అతి వాస్తవికంగా అంటే rational గా మనకు బోధించేటువంటి ఉపనిషత్తు ఆ.. ఈశావాస్య ఉపనిషత్తు. అయితే జగత్తు ఎట్లా ఉన్నది? ఇగో బిందువులన్నీ కలిస్తే సింధువన్నాం. అట్లాగే అణువులన్నీ కలిస్తే పదార్థం అవుతున్నది. ఇది భౌతికవాదం. physical level లో మనకున్నాయి కదా physical, metaphysical, spiritual ఎప్పుడూ చెప్పుకుంటాం. మూడు స్థాయిల్లో ప్రపంచాన్ని చూస్తే దూరంగా కొండ చూస్తే పొట్టి కొండ అది. అన్ని కొండల్లాగానే ఉంది. కానీ ఏడుకొండల స్వామి, ఏడుకొండల స్వామి ఎక్కడ ఉన్నారో ఏడుకొండలు మన ఒట్టి మట్టివే అనుకోం కదా. ప్రతి అణువులోనూ శాలగ్రామం ఉన్నదని, విష్ణు శాలగ్రామాలు, శివ శాలగ్రామాలు అన్నీ ఉన్నాయని, అదంతా అతి పవిత్రమైనటువంటి ఏడుకొండలు అని మనం ఎందుకు భావిస్తున్నాం అంటే అక్కడ పరమేశ్వరుడు ప్రతిష్ఠితమై అర్చా మూర్తిగా ఉన్నాడు గనుక దానివలన శోభాయమానమై-- అవుతాయి కాబట్టి పదార్థం అంతా కూడా ఒక పారమార్థికమైన స్థితిని, ఒక అద్భుతమైనటువంటి పవిత్రతని ఎలా సంచరిం-- సంతరించుకుంటుంది అంటే మన address వల్ల. మనం ఎక్కడున్నామో దానిని బట్టి. ఆహార, విహార, వ్యవహారాలు మూడు కూడా మన వ్యక్తిత్వాన్ని, మన శీలాన్ని శాసిస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం? ఎవరితో కూడి ఉన్నాం? ఎట్లా ఉన్నాం? ఉండి ఏం చేస్తున్నాం? ఇన్ని ప్రశ్నలు మన యందు ఉన్నాయి గనుక జీవుడు జీవాత్మగా ఉండాలి అంటే ప్రతి కొండలో, ఎప్పుడూ చెప్పే ప్రతి పుట్టలో, మట్టిలో, పిట్టలో అన్నింట్లలో ఆత్మను దర్శనం చేయాలి. మహాత్ములు దర్శనం చేశారు. స్వామి ఉదాహరణకి మనందరి యందు దివ్యాత్మలను దర్శనం చేశారాయన. మనందరినీ ప్రేమాత్ములుగా చూసుకున్నారాయన. మనం ఆయన్ని ఆ.. పుట్టపర్తి బాబా అనుకున్నాం. అంటే మనం కాదు, అనుభవం లేని వాళ్ళు. మనం స్వామి అంటాం అది వేరే, స్థాయి వేరు. సరే స్వామి యందు వ్యక్తిని చూడటం మనం చేసుకునేటువంటి పొరపాటు. మన యందు ఉన్నటువంటి దివ్యత్వాన్ని గమనించినటువంటి వారు ఎవరు అంటే ఆయనే దివ్యుడు గనుక ఆయనకు అదే కనిపించింది. మన స్థితిగతులతో ఆయనకి సంబంధం లేదు. అలాగే మనకున్నటువంటి అందచందాలతో ఆయనకి ప్రమేయం లేదు. మనం కులంలో, మతంలో ఉన్నాం ఆయనకి ప్రమేయం-- మరి దేనితో ప్రమేయం ఉన్నదంటే తాను అఖండ చిద్ఘనమైనటువంటి పరమాత్మ గనుక జీవాత్మ యందు రశ్మిగా, కిరణంగా, ప్రకాశమానంగా నేను నేను నేనంటూ లోపల వెలుగుతున్నటువంటి అఖండమైనటువంటి జ్యోతి ఏదైతే ఉన్నదో జ్యోతిర్మయమైనటువంటి ఆత్మను స్వామి మన యందు చూశారు. స్వామి మనకు దర్శనం ఇవ్వటానికి వచ్చారని మనం అనుకున్నాం. స్వామి అట్లా అనుకోలా. ఎన్ని ఆత్మలు కూడి ఉన్నాయే అందుకని వాటిని దర్శనం చేయటానికి వచ్చారని స్వామి అనుకున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి భావన. లేకపోతే ఆయనకు మనతో ఏం పని ఉంది? నిజానికి ఏం పని లేదు కదా. దూరం నుంచి చూసి వెళ్లిపోవచ్చు. కానీ వెళ్ళలే. ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చారు. కష్టంలో, సుఖంలో ప్రతివాడిలో ఆత్మను చూశారు. ఆత్మని తెలియక వీడు క్షేదము, మోదము, విషాదము, వినోదము అనేటువంటి ద్వంద్వాలలో కొట్టుమిట్టాడుతున్నాడు గనుక వాడికి కష్టం గనుక తీర్చేస్తే వాడు మంచి మార్గంలోకి వస్తాడు అన్నదే ఆయన ప్రణాళికలో ఒక ప్రధానమైనటువంటి భాగం గనుకఈ ఈశావాస్యోపనిషత్తు లో చెప్పబడినటువంటి అంతరార్థానికి ఒక నిరుపమానమైనటువంటి సోదాహరణ ఏదంటే సత్యసాయి భగవానుడి యొక్క అవతారం. దీన్ని మనం సమన్వయం చేసుకోవాలి. లేకపోతే మనము చూశాం స్వామిని ఉంది కదా చాలాసార్లు చూశాం, చాలాసార్లు మాట్లాడాం అలా అనకూడదు. చాలాసార్లు నువ్వు మాట్లాడేది ఏం లేదు, నీతో స్వామి ఏం మాట్లాడారు? నీకు ఏం చెప్పారు? దాన్ని నువ్వు జీవితంలో పాటించావా లేదా? లేదు నాతో స్వామి మాట్లాడారని అహం దగ్గరే ఆగిపోయినావ్ అంటే పరిణామం లేదు. తడిగుడ్డ నేలమీద పడేసినట్లుగా అది ఎక్కడికి కదలలేదు, ఎప్పుడేదో పాత స్మృతి అదే చెప్పుకుంటూ మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదు. నిత్య నూతనమై నవనవోన్మేషమై దివ్యాత్మ భావనతో ప్రకృతి ఎట్లా ప్రతిరోజూ సూర్యోదయం నుంచి మళ్ళీ చంద్రోదయం దాకా, మళ్ళీ సూర్యోదయం దాకా ఎట్లాగైతే చలత్ చలితమైన జగత్తంతా కూడా ఆనందమయమై ఒక ఆనంద నిలయమై భాసిస్తున్నదో అటువంటి స్థితిలోకి మనందరం వెళ్ళాలి అని చెప్తూ జగత్తు అంటే మామూలుగా అంటే పుట్టేది, గత్తు అంటే పొయ్యేది. అంటే పుట్టేది మనం కూడా పుడతామ్ కదా. గత్తు అంటే పొయ్యేది, రోజున ఎప్పుడో పోతామ్ కదా. ఇది నిత్యమే కదా, ఇది సత్యమే కదా. మరణము అమంగళం కాదు. మంగళాత్మకమైనటువంటి భావనే మరణం. మరణంలో ఏమున్నది అంటే రణము ఉన్నది, పోరాటం ఉన్నది. దేనితో? నీలో ఉన్నటువంటి ప్రతీప శక్తులతో నువ్వు పోరాటం చేయాలి. శివానందలహరిలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు. శివుడ్ని గురించి సంబోధన చేస్తూ, "నువ్వు ఆది కిరాతకుడివి. అడవుల్లో విల్లంబులు పట్టుకొని అమాయకమైనటువంటి మృగాల వెనక ఎందుకయ్యా పరిగెత్తి వాటిని వేటాడుతావు? నా శరీరంలో ఆరు మృగాలు సంచారం చేస్తున్నాయి, అరిషడ్వర్గాలు. ఆరింటినీ బాణం వాటిమీద ప్రయోగించే కంటే నామీద ప్రయోగించి ఆరింటినీ కూడా నువ్వు సంహారం చేయవా శివా?" అంటారు భగవత్పాదులు. అంటే ఒక విశాలమైనటువంటి భావన కలిగినప్పుడు మనకు కూడా అట్లా అనిపిస్తుంది. స్వామితో మనం మాట్లాడటం ఏంటి? స్వామి మనతో మాట్లాడాలి. మనకు అద్వైత బోధ చేయాలి. ద్వయ-- ద్వంద్వంగా, ద్వైతంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని నమ్ముకోకు. ద్వంద్వాతీతమైన, త్రిగుణ రహితమైన, ఏకమైన, అచలమైన, విమలమైన సర్వధీ సాక్షిభూతమైనటువంటి ఆత్మ నీ యందే ఒక గురువుగా ఉండగా ఇంకా మళ్ళీ బయట ఉం-కా-కావలసిన గురువులు అవసరమా? ఆత్మే గురువు అన్నటువంటి నిశ్చితమైన అభిప్రాయాన్ని సత్య సాయి భగవానుడు కూడా పరిపూర్ణంగా మనకి ఆవిష్కరించారు. సరే, అయ్యా ఈశావాస్యోపనిషత్తు చాలా బాగుంది. కానీ దీని వలన ఇది చదివాము, బాగా అర్థమైంది, ఇంకా బాగా అర్థమైంది, మూల గ్రంథాలన్నీ గట్టిగా చదివాము. కానీ ఇది చదివాను అన్న ఫలితం నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం నదిలోకి వెళ్తాం లేదా వానలో వెళ్తాం. తడిసాము అంటే వాన గట్టిగా కురిసినట్లు, ఎండలో మాడిపోయినాం, ఎండ బాగా కాసినట్లు మనం చెప్తున్నాం. అట్లాగే ఈశావాస్యోపనిషత్తు చదివిన తర్వాత మనకు కలగవలసినవి ఏమిటి? ఏమి కలిగితే ఉపనిషత్తు అర్థమైనట్లు అంటే ఏకత్వం. రెండవది సమత్వం. మూడవది విస్తృత మమకారం. ఇది ఈశావాస్యోపనిషత్తు కి కీ ఇది, జగత్తు పరంగా. ఏకత్వం. నా ముందు స్త్రీలు కూర్చుంటారు, పురుషులు కూర్చుంటారు, పిల్లలు కూర్చుంటారు. అందుకే మీరు ఒకసారి స్వామి ఉపన్యాసాన్ని కోరిలేట్ చేసుకోండి. నేను స్త్రీలలో స్త్రీని, పురుషులలో పురుషుడను, బాలురలో బాలుడను, వృద్ధులలో వృద్ధుడను, నేను నేను అన్నారు. అంటే ఆయనకి లింగ భేదం లేదు. అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా? మగవాళ్ళు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? వాళ్ళేమైనా అనుకుంటారా? పెద్దవాళ్ళు ఉన్నారా? వాళ్ళకి నేను కనిపిస్తున్నానా? ఆయనకేం లేదు. అప్రమేయమైనటువంటి భావనలో ఆత్మని దర్శనం చేసినటువంటి చైత్య పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్థాయిలోనే ఆలోచిస్తారు. ఏకత్వం సర్వం ఖల్విదం బ్రహ్మ. ఏకమేవా అద్వితీయం. ఒక్కటే, ఉన్నది ఒక్కటే రెండోదంటూ లేదు. రెండోదంటూ లేదన్నటువంటిది వాళ్ళు సోదాహరణంగా వాళ్ళ జీవితంలో చూపిస్తారు. మనం చూపించలేం. ఒక దివ్యమైన సత్సంగాన్ని వింటున్నప్పుడు మనం కూడా అట్లా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ మన మనస్సు మన చేతిలో ఉండదు గనుక మళ్ళీ మాయావరణంలో ఆహ్ రెండుగా విభజించటం, ఏకాన్ని అనేకం చేసుకోవటం, అది ఇట్లా, ఇది ఇట్లా అని విచారణ చేయటం మన మనస్సుని మనమే చెదరగొట్టుకుంటాం గనుక ఈశావాస్యోపనిషత్తు ఖచ్చితంగా విన్నటువంటి వారు, బాగా చదువుకున్నటువంటి వారు లేదా ఆచరించేటువంటి వారికి కలిగేటువంటి అనుభవం ఏమిటంటే ముందు ఏకత్వం ఏర్పడుతుంది. ఏకత్వంతో పాటు ఒట్టి ఏకత్వం కుదరదు. సమత్వం కూడా కావాలి. సమత్వం అంటే Equanimity, Equipoise అండ్ Equilibrium మూడు మాటలున్నాయి. స్థితి ఏది రాని, మహా కష్టం వచ్చి మనల్ని ముంచెత్తని, ఆనందం వచ్చి ఒళ్ళో పడిపోని మనం నిశ్చలంగా ఉండాలి. Equipoise అయి ఉండాలి. ప్రతిదానిని దేనినైనా స్వీకరించగలిగిన స్థాయికి వెళ్ళాలి. అన్ని స్థితులలోనూ కుంగక, పొంగక, లొంగక సమస్థితిలో ఉండాలి. ఇవి ఏర్పడితే ఈశావాస్యోపనిషత్తు అర్థమైనట్లు లెక్క. కాబట్టి ఏకత్వం వస్తుంది, సమత్వం వస్తుంది. చదవక ముందు ఏకత్వం అంటే తెలియదు. అన్నీ ఒకటి ఎట్లా అవుతాయి? కుర్చీ కుర్చీయే, బల్ల బల్లే, ఇంకోటి ఇంకోటే, షోకేస్ షోకేసే అనుకుంటాం. కానీ స్వామి చెప్పినట్లు బంగారములు వేరు, శృంగారం ఒకటే అన్నట్లుగా అన్నీ విభిన్నమైనటువంటి ఆభరణాలు కనిపిస్తున్నాయి గానీ మూల పదార్థం ఏమిటి అంటే అది బంగారమే అవుతున్నది కాబట్టి సమస్తమైనటువంటి జీవులు నదీనదాలు, కొండలు, కోనలు, వాగులు, వంకలు అన్నింటియందు చలత్ చలితంగా ప్రవహిస్తున్నటువంటి ప్రతి వస్తువు పుడుతున్నది, పెరుగుతున్నది, పోతున్నది అంతా కూడా బ్రహ్మమయమే, ఆత్మమయమే. కనుక ఏకత్వమే.ఒక దుంగ కలప దుంగ తెచ్చి దాంట్లో నుంచి మనం ఒక stool చేయిస్తాం. ఒక dining table చేయిస్తాం. కూర్చోటానికి ఒక కుర్చీ చేయించుకుంటాం. రాసుకోవడానికి ఒక plank తయారు చేస్తాం. ఇవన్నీ పేర్లు వచ్చినాయి కానీ మూలం ఏమిటంటే దుంగ మూలం. కాబట్టి మూలం ఏమిటంటే పరమాత్మ, పరమాత్మ నుంచి ఏర్పడిన జగత్తు. జగ-- పరమాత్మని, జగత్తుని అనుభవించడానికి చూడండి పరమాత్మకి అనుభవాలే అక్కర్లేదు. ఆయనకసలు ఏమీ అక్కర్లేదు గనుకే ఆయన పరమాత్మ అయినాడు. ఇక జగత్తు అంటారా చెట్టున కాయలు కాస్తాయి, పూలు పూస్తాయి, అట్లాగే మంచి పళ్ళు కాస్తాయి అవి ఏవీ చెట్టు తినదు. మనకిచ్చేస్తుంది. అంటే జగత్తుని జీ-- పరమాత్-- జగదీశ్వరుడిని అనుభవించడానికి ఎవడున్నాడు అంటే ఇగో మరొకటి జ-జీవ-జీవాత్మలమంతా కూడా ఉన్నాం. కానీ మనకి ఏకత్వం గనుక అలవాటు కాకపోయినట్లయితే, ఏకాత్వము రాకుండా నేను స్వామి devotee ని కాబట్టి నాకు ప్రేమ చాలా ఎక్కువుందని అనుకోకూడదు. ఏకత్వం రావాలి. వస్తే అప్పుడు స్వామి చెప్పిన ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. సమత్వం కూడా రావాలి. అధికులు అల్పులు అంటూ రెండు వర్గాలు లేవు. మన మనస్సు యొక్క గారడీ అది. ఎవరు అధికులు? అందరం ఒకే రీతి జన్మ ఎత్తాం. ఒకే రీతి అంగాంగీభావంతో వచ్చాం. Internal anatomy is one and the same. ఏముంది? చర్మము, ఎముకలు, మాంసము, మజ్జ. ఒకటి స్త్రీ రూపం తీసుకుంది, ఇంకొకటి పురుష రూపం తీసుకుంది. రెండింటికీ విధివిధానాలున్నాయి. ఇవి కూడా కాల, కార్య, కారణ, కర్తవ్య, నిమిత్తమై వచ్చినాయి. కాలంతో పాటు ఉంటాయి, కాలం చెల్లగానే పోతాయి. ఇది సత్యం కదా! సత్యం ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఒక స్త్రీ యందు, ఒక పురుషుని యందు, ఒక బాలుడి యందు, ఒక వృద్ధుడి యందు, ఒక పామరుడి యందు, ఒక మహా జ్ఞాని యందు సమభావం మనకుంటుంది. అందరినీ ఏకంగా చూడగలిగిన సమత్వ భావన. సమత్వ భావన ఎప్పుడైతే లేదో సమాజం పెడదారుణ పడుతుంది కనుకనే "అంతా ఒక్కటే" అనేటువంటి భావనకు రావాలి. అయితే సహజంగా ఉపనిషత్తులు ప్రశ్నించుకోమన్నాయి. ఖచ్చితంగా ప్రశ్నించుకోమన్నాయి. అయ్యా అంతా సమత్వం గనక అయితే మనందరికీ ఒకే పేరు పెట్టేస్తే ఎట్లా? అంటే అందుకనే కొన్ని కొన్ని exemptions ఉన్నాయి. మనందరికీ different పేర్లున్నాయి. భిన్న భిన్నమైనటువంటి పేర్లు. ఎందుకంటే మందలో, గుంపులో మనం తప్పిపోకుండా ఉండటానికి మనకు పేర్లు ఇవ్వబడ్డాయి, అంతే. దాని మించి మరొకటి ఏమీ లేదు. ఇక రెండవది, సమాజం సమ సమాజం అంటూ అసలు ఉన్నదా అని గనుక ప్రశ్నిస్తే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, సమాజంలో ఉన్నదంతా ఒక్కటే కానీ సమాజం మాత్రం రెండుగా ఉంటుంది, భిన్న-భిన్నంగా ఉంటుంది. లేనివాడు, వాడి పక్కనే ఉన్నవాడు. పామరుడు, ఆయనకు దగ్గరగానే మరొక పండితుడు. మరి వీళ్ళంతా ఉంటారు. contrast ఉంటుంది. ఎందుకుంటుంది అంటే కలిగిన ప్రతి వాడు నలిగిన ప్రతి వాడిని జాగ్రత్త పెట్టుకోవాలి. అంటే జ్ఞాని జ్ఞానబోధ ప్రపంచానికి ఇవ్వాలి, అమ్ముకోకుండా ఇవ్వాలి. వెలగట్టి చేస్తే ప్రయోజనం-- అది కూడా ఒక profession. కానీ నీకు కలిగినటువంటి జ్ఞానం, నీవు పొందినటువంటి జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చింది? నీకంటే ముందు వచ్చిన మహర్షులు, మహాత్ములు, జ్ఞానులు వారంతా కూడా నిరపేక్షంగా జగత్తుకు అందించారు గనుక ఇవాళ మనమందరం నాలుగు మాటలు మాట్లాడుకోగలుగుతున్నాం అనాలి తప్ప దీన్ని మళ్ళీ మనం ఒక commodity గా తయారు చేయకూడదు. అంటే దానిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, దానిలో ఉన్న profundity ని, దానిలో ఉన్న గాంభీర్యాన్ని అర్థం చేసుకుని మర్యాదగా వాటిని మనం మళ్ళీ ప్రపంచానికి అందించాలి. ప్రౌఢ ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః స్వచ్ఛుష్య బోధయాత్ సత్యం అశ్రితావన్. ప్రపంచంలో ఎవరైనా గనుక వచ్చి "నాకీ విషయం తెలియటం లేదు" అని అడిగితే చెప్పవలసిన బాధ్యత గురువు యందున్నది. మీరు స్వామితో direct interaction ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా మనం స్వామికి కృతజ్ఞతగా "స్వామి మీ అనుగ్రహం వల్ల ఇది జరిగింది" అని అంటే "అవునే నేనే చేశాను, నేను ఆశీర్వదించాను" అని ఎన్నడూ ఇంతవరకు అనలా. అనగా నేను వినలా. ఏమిటి అంటే ఆయన ఏమంటారంటే "అది నా బాధ్యత" అంటారు స్వామి. దాంతో మనం ఒక్కసారి పరవశం చెందుతాం. ఏమిటి స్వామి మన బాధ్యత తీసుకున్నారా? అది ఆయన నోటి నుంచి వచ్చే మాట. అది this is my duty. ఇది నా బాధ్యత. అది జగదీశ్వరుడి aspect. జగత్తుకు కూడా మన యందు బాధ్యత ఉన్నది. అందుకనే నీటిని, ఎండని అంటే పంచభూతాలు అన్నింటినీ సమన్వయం చేసి జీవాత్మ నీకోసం ఇవన్నీ ఇవ్వబడ్డాయి. దీంట్లో ఒక్క కానీ కాసు ఖర్చు లేదు. అన్నీ మనకు free. ఇవ్వాళ డి విటమిన్ కావాలంటే ఐదు నిమిషాలు ఎండలో కూర్చుంటే పోలెడంత డి విటమిన్. దాన్ని టాబ్లెట్లు వేసుకో అక్కర్లా. మనం ఎండలో కూడా వెళ్ళలేం. మన-మన pocket లోనే ఎండ కాస్తున్నా సరే అక్కడికి కూడా విసనకర్ర తీసుకుని వెళ్తాం. D3 మనకెందుకు వస్తుంది? కాబట్టి జగత్తులో వైద్యం ఉంది, ప్రాణం ఉంది, చైతన్యం ఉంది, ఆలోచన ఉంది, భావన ఉన్నది. జరుగుతున్న దాన్నంతా గన మొత్తాన్ని మనం గనుక జాగ్రత్తగా చూసినట్లయితే రెండు రకాల చూపులుంటాయి మనకి, జీవుడికి. ఏమిటా చూపులంటే ఒకటి మనసుతో చూట్టం, రెండవది హృదయంతో మాత్రమే చూట్టం. మనం ప్రపంచాన్ని మనసుతో చూట్టం మొదలు పెట్టామనుకోండి, అంతా భిన్న భిన్నంగా, గందరగోళంగా కనిపిస్తుంది. హృదయంతో చూట్టం మొదలు పెట్టామనుకోండి, అంటే unconditional ఓపెన్ మైండ్ తో గనుక ప్రపంచాన్ని చూస్తే జగతి యెల్ల మధుర సౌందర్యమయమంచు కన్నుమూసి కలలు కాంచినాను. కన్ను విప్ప తెలిసే కర్తవ్యమును చేయ వాసయోగ్యమగును వసుధయెనుచు. ప్రపంచంలో ఇన్ని పనులు చేస్తున్నాయి, ఒక చెట్టు చేస్తున్నది, పుట్ట చేస్తున్నది, గాలి వీస్తున్నది రకమైన ఫలితాన్ని మన నుంచి ఆశించకుండా నేనేం చేశాను ఇవాళ నిద్ర లేచినప్పటి నుంచి?జీవాత్మగా ఇంత మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మని ఒక అద్భుతమైన శరీరాన్ని పొందిన నేను ప్రపంచానికి అసలు ఏమైనా ఉపయోగ పడ్డానా? అని ప్రశ్న ప్రతిక్షణం వేసుకోమంటుంది. వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మాత్రమే, ఇది ఎప్పుడు వేసుకుంటాం అంటే ఏకత్వము సమత్వము రెండు ఏర్పడినప్పుడు. ప్రశ్న వేసుకుంటే రెండు రావు. రెండు ఏర్పడితే ఇటువంటి ప్రశ్నలు పుడతాయి. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు మంత్ర భాగంగా కాక యాంత్రిక తాంత్రిక భాగంగా గాక ఒక జీవితాన్ని స్పష్టమైన అవగాహనతో చూసుకుని దర్శనం చేసినట్టుగా మన హృదయాన్ని విప్పదీసి హృదయంతో ప్రపంచాన్ని చూడగలిగినట్లయితే ఇది మళ్ళీ పునః ఇది నందనారకం అవుతుంది. ఇది ఆనంద నిలయం అవుతుంది. మనసుతో చూడండి మన చుట్టూ జరుగుతున్న అనేక అనాచారాలు, అస్పష్టతలు, అవిద్యలు, క్రూరత్వాలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ కూడా మనకి ఆందోళన కలిగిస్తాయి. కాసేపు మనసుని పక్కనబెట్టి హృదయంతో చూడండి. జరుగుతున్నదంతా సృష్టిలో ఎంత? What is its percentage? Maybe point zero zero zero one. దాన్నే మనం తట్టుకోలేకపోతున్నాం. అందుకనే పరమాత్మ ఉపనిషత్తులని, వేదాలని, ఇతిహాసాలని, పురాణాలని, వాంగ్మయాన్ని మనకు అందించి దీనిలో సేదతీరు, దీన్ని అధ్యయనం చేయి. దీని ద్వారా నీ జీవితాన్ని-- అందుకనే సంస్కరింప నేల సంఘమంతటినీవు సజ్జనుండవగుము స్వార్థముడిగి ఒక్క నీచుడెప్పుడుర్విలో తగ్గును. అంటే ఎవరికి వాళ్ళమే మనల్ని మనం సంస్కరించుకోవాలి గనుక దిశగా వెళ్ళమని చెప్తుంది. కాబట్టి ఏకత్వం, సమత్వం. ఇక మూడవది విస్తృత మమకారం. ఇదే చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. విస్తృత మమకారం. నేను కన్న బిడ్డల యందు, నన్ను కన్న నా తల్లిదండ్రుల యందు మమకారం సహజంగా ఉంటుంది. మా అమ్మ నాన్న నాకిష్టం, నాకు దైవాలు. దైవం అవునో కాదో తెలియదు గానీ నాకు చాలా ఇష్టం. మామూలు భాషలో. తర్వాత నా కడుపున పుట్టిన బిడ్డలు బంగారు బిడ్డలు పుట్టాడు భగవంతుడు నాకిచ్చాడు అంటున్నావ్. అంటే నీ మమకారాన్ని నిన్ను కన్నవాళ్ళ దగ్గర, నువ్వు కన్న వాళ్ళ దగ్గర ఒక పరిధి గీసి ఆపిస్తున్నావ్. ఉపనిషత్తు ఇది ఒప్పుకోవటం లేదు. దీన్ని విస్తృత మమకారం చెయ్. అట్లాగే నీ దగ్గర, నీ చుట్టూ ఉన్న, నీ ఇంట్లో నీకై పని చేస్తున్నటువంటి maid servant కూడా ఒక daughter, ఒక కూతురు ఉంది అనుకుందాం. నీ కూతురు వలె కూతుర్ని గనక చూడగలిగితే అది అద్భుతమైనటువంటి భావన. అంటే మమకారం చంపుకోమని, దీన్ని తగ్గించుకోమని కాదు. మమకారాన్ని అక్కడికి extend చెయ్యమని చెప్తుంది ఉపనిషత్తు. చూడండి మనందరం ఉన్నాం. మన ఇంట్లో మనం కూర్చుంటున్నాం ఆరు నెలలుగా. మన ఇంట్లో మనం కూర్చున్నంత సేపు we are insulated. మనకేం కాదు హాయిగా ఉన్నాం అని అనుకున్నాం. గడప దాటి ఒక అడుగు బయటకు వేయండి మన ఇల్లు వెనక్కి వెళ్ళిపోయింది మనం ముందుకెళ్ళిపోయినాం. ముందుకు వెళ్లి మనం ప్రపంచంలో ఒకళ్ళం అయిపోయినాం. మన ఇంట్లో మనం ఒక్కళ్ళుగా ఉన్న మనం ప్రపంచంలోకి వెళ్ళగానే మనం సమూహం అయిపోయాం తెలియకుండానే. మనతో పాటు పది మంది, వంద మంది, వెయ్యి మంది, లక్ష మంది వీళ్ళందరూ మన వాళ్ళే అంటే మన వాళ్ళు అవునో కాదో కానీ నువ్వు దానిలో భాగం అయినావు గనుక నీ బాధ్యత ఏమిటి అంటే విస్తృత మమకారాన్ని పెంచుకో. అహం మమత్వా శిథిలాయమానే అంటారు శంకర భగవత్పాదులు. నేను, నాది అన్నటువంటి భావనని తగ్గించుకోవాలి, వదులుచుకోవాలి. వదులుచుకోవటం చాలా కష్టం కానీ తగ్గించుకోవాలి, క్షమింపజేసుకోవాలి. కానీ విస్తృత మమకారం. నా కన్ను-- కడుపున పుట్టిన నా బిడ్డని ఎట్లాగైతే నేను పెంచగలిగానో, ఎట్లా ఒక ఆదర్శమూర్తిగా నేను తీర్చిదిద్దగలిగానో అట్లాగే అవకాశం లేని కానీ సమర్ధత ఉండి, రకమైన ఆర్థికమైనటువంటి బలం లేని వాళ్ళని గనక అక్కున చేర్చుకొని అంటే విద్యాదానం చేయగలిగితే, వైద్యదానం చేయగలిగితే, వాళ్ళు ఆకలి వేస్తున్నప్పుడు ఒక ముద్ద అన్నం పెట్టగలిగితే, ఇదంతా కూడా విస్తృత మమకారంలో నుంచి ఏర్పడుతుంది. ఏకత్వము, సమత్వము, విస్తృత మమకారము మూడు కలిపితే నిజానికి దాని పేరు ప్రేమ. ప్రేమ అంటే అదేం ప్రత్యేకమైన గుణం కాదు అది. అదొక utopian thought కాదు. ఊహాజనితమైనది కాదు. అతివాస్తవికమైనది absolute reality ఏమిటంటే ప్రేమే. మనమందరం రాగంలో ఇరుక్కుపోయినాం, అనురాగంలో కూడా ఇరుక్కుపోయినాం. ప్రేమ దాకా వెళ్ళలే. కానీ మనం స్వామి ప్రేమమూర్తి, ప్రేమమయుడు, ప్రేమే ఆయన వచ్చింది రూపం వచ్చి కవిత్వం రాస్తాం. కానీ ప్రేమని స్వామి మనందరికీ ఎట్లా పంచారు? మనం వేళ స్వామిని ఎందుకు తీసుకోవాలంటే ఉపనిషత్తులలో ఏం చెప్పబడిందో స్వామి అలా అవనీ సంచారం చేశారు. అది చెప్పడానికి. ఇది ఇవన్నీ మీరు చెప్తున్నారు ఇది సాధ్యమేనా అనే వాడికి ప్రశ్న ఏమిటంటే, ఎంత సాధ్యం అంటే మీరు స్వామిని చూడండి అన్నీ ఇవే ఉంటాయి. విస్తృత మమకారం. ఆయనకీ మనకేం blood relation ఏముంది? ఏమన్నా ఉందా? లేదు. పోనీ ఆయనకీ మనకు లావాదేవీలు ఉన్నాయా? లేవు. మరి ఆయన నుంచి మనం ఏమైనా లాభాలు పొందామా? మనం ఆయన్ని ఏమన్నా అడిగామా? అవీ ఏవీ లేవు. మరి ఆయన ఉంటే మనకు కొండంత ధైర్యం అంటున్నాం. స్వామి పంచిన ప్రేమ వేయి తల్లుల ప్రేమ అని మనం బాలవికాసులో చెప్తూ ఉంటాం. అసలు ఒక తల్లి ప్రేమే మనకు అర్థం కావట్ల. మన ప్రేమ biological mother దగ్గర ఆగిపోయినాం మనం. దీన్ని దాటమని చెప్తుంది ఉపనిషత్తు. విస్తృత మమకారంలోకి వెళ్ళండి. విస్తృత మమకారం demonstrate చేసినటువంటి ఏకైక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్య సాయి. ఇంకెవరూ కాదు. ఇది ఖచ్చితంగా మనం చెప్పాలి జగత్తుకి. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడి వారో తొలినాళ్లలో నలభై యాభై మంది నుంచి నాలుగు లక్షల మంది వరకు వచ్చిన నాలుగు లక్షల మంది యందు స్వామిది ఒకే రీతి ప్రేమ ఉన్నది. ఎట్లా ఉన్నది? ఇది ఆయన ఉపనిషన్మూర్తి. కనుక మనం ఒక, ఒక వ్యక్తిని సంపూర్ణంగా unconditional గా అతని నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించగలిగామా అని ఒక ప్రశ్న వేసుకుంటే లేదు అనేది జవాబు. ఇదే నిజం. ఇది సత్యం.కాదండి నేను స్వామి చెప్పింది ముప్పై ఏళ్ళు విన్నాను నేను ఎప్పుడో మారిపోయాను. [మ్యూజిక్] తన శిరో-- అక్క-- మూడు దాటినప్పుడు జగత్తు సర్వమూ ఆత్మమయంగా ఉన్నది అనేటువంటిది సిద్ధాంతీకరింపబడుతుంది గనుక మన మమకారాలు, మనకున్న మమతలు, మనకున్నటువంటి అభిమానాలు, మనకున్నటువంటి ప్రేమ అనే మాట అంత తేలికగా వాడలేంగాని కానీ అందరికీ అర్థం కావాలి గనుక ప్రేమ అందరి యందు ఒకే రీతి ప్రవర్తిల్లేట్టుగా మనల్ని ప్రేరేపిస్తుంది ఇశావాస్యోపనిషత్. అయితే ఇశావాస్యోపనిషత్ ని చివరగా ఒక భాగంలో దాన్ని ఎలా sum up చేసుకోవాలి అంటే, ప్రపంచమంతా పదార్థమయంగా ఉన్నప్పటికీ కూడా పదార్థమయంగా ఉన్నా, పారమార్థికమైన స్థితికి మనల్ని నడిపిస్తాయి గనుక కొండలో, కోనలో అన్నింటి యందు ఆత్మను చూడాలి అనేటువంటిది ఒకటి. కాబట్టి ఇవన్నీ కలిపితే మీరు, నేను, మనము, ప్రపంచము, వస్తువులు, జంతు జాలాలు అన్నీ కలిపి ఇది ప్రపంచము జగత్తు గనక అయినట్లయితే, ప్రపంచం అణుక్షేత్రంగా ఉన్నది. అణువులుగా ఉంది. We are all atoms. ఆట-- ఆ-- atoms ఏవైతే అణువులుగా ఉన్నాయో, ఇవన్నీ కూడా పరమాణువు వైపు వెళ్ళాలి. పరమాణువు వైపు వెళతాయి. ఎట్లా వెళతాయి అంటే Law of Physics అని ఒకటి ఉంది. దాంట్లో ఒక సిద్ధాంతం ఉంది. అది భారతీయ తత్వానికి చాలా దగ్గరైన సిద్ధాంతం అది. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఉదాహరణకి నేను అనబడేటువంటి వి.ఎస్.ఆర్.మూర్తి అనబడే ఒక వ్యక్తి ఒక చిన్న అణువు ప్రకృతిలో, సృష్టిలో, జగత్తులో అనుకున్నట్లయితేఒక అణువు ఆయన నుంచి ఎనిమిది లక్షల మైళ్ళ దూరంలో ఉందది. ఎక్కడో ఉంది. అది అవి ఇది, ఇది అవి కలవాలి అంటే కలిసి తీరుతాయి. కలవవలసిన అవసరం లేదు అంటే అవి కలవు. అంతే. సిద్ధాంతం ఖచ్చితం. కాబట్టి ఇక్కడ కూడా ప్రపంచం అంతా మనల్ని కలుపుకుంటుంది మనం కూడా ప్రపంచాన్ని కలుపుకోవాలి. ప్రపంచం మీద మన అధికారం ప్రకృతి మీద అధికారం చెలాయించకూడదు. అట్లా అని మనం ప్రకృతికి బానిసలము కాదు, ప్రకృతికి యజమానులము కాదు. మనం ప్రకృతిలో ఒక అందమైన అంతర్భాగం. కాబట్టి అణుక్షేత్రంలో ఉన్నటువంటి మనం నెమ్మదిగా ఆత్మ క్షేత్రం వైపు వెళ్ళాలి. మనం ఎక్కడో అనుకుంటాం, ఎక్కడ ఉన్నది ఆత్మ? దీన్ని ఎక్కడ పట్టుకోవాలి? కృష్ణుడేమో అనేక భావాలు చెప్పాడు. నీటనానదు నిపునకాలదు కూలదు ఇవన్నీ చెప్పాడు ఆయన. శంకర భగవత్పాదులైతే ఆత్ అంటే ఏమీ మా అంటే లేదనీ ఆయన చెప్పారు. అంతా చాలా పరస్పర విరుద్ధంగా ఉన్నది అనుకుంటాం. విరుద్ధంగా చెప్పలే, వైవిధ్యంతో చెప్పారు. అంతే తేడా. భిన్నమైన కోణాల్లో వాళ్ళు ఆవిష్కరించారు. ధర్మ స్వరూపంలో ఆత్మ ఉన్నది. ఆత్మే ధర్మం అవుతున్నది. వీటన్నింటినీ సమన్వయం చేసుకున్నప్పుడు ఏమిటి మన జీవితానికి పరమార్థం అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. ఆత్మ క్షేత్రంలోకి వెళ్ళాలి మనం. మనం బ-బజారు వెళ్తాం, బయటికి వెళ్తాం, విదేశాలకు వెళ్తాం మనకున్నటువంటి ఆ-అది చాలా objective గా వెళ్తాం. అసలు subject ఏమిటంటే మళ్ళీ మన ఇంటికి సురక్షితంగా క్షేమంగా వెళ్లి లాభంతో రండీ అని ఒక ఆశీర్వచనం ఉంది. అట్లాగే లాభంతో ఎక్కడికి వెళ్లాలంటే జగత్తులోకి వచ్చినందుకు, మానవ జన్మ ఎత్తినందుకు, పరమాత్మ సాయి వంటి ఒక మహా చైతన్య పురుషుడు అవతారమూర్తితో కూడి జీవించినందుకు మనం కూడా జీవాత్మల వలె మనం ఇక్కడ జీవించాలి. మనలో ఉన్నటువంటి ఆత్మను నారాయణుడుగా తెలుసుకోవాలి. దీనికి శరీరము సాధన, అలాగే ప్రపంచం ఒక వేదిక. ప్రపంచంలో శ్రీ దత్తుడే మాటన్నాడు. నాకు ఇరవై నాలుగు మంది గురువులున్నారు ప్రతి వాళ్ళ నుంచి ఒక్కోటి నేర్చుకుంటానన్నాడు. మనం కూడా నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండాలి. నిత్య ఆ-గమన శీలనంలో ఉండాలి. విద్యార్థి స్థాయిలో ఉండాలి. దేనిని ఆకళింపు చేసుకున్నామో దానిని ఆచరించాలి. ఆచరించిన దానిలో నుంచి అనుభవం, అనుభవంలో నించి అనుభూతి పొందుతూ ప్రపంచం ద్వారానే మళ్ళీ అణుక్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రంలోకి నువ్వు చక్కగా ప్రవేశం కా. దానికి ప్రేమను మించిన భావన లేదు. ప్రేమతో పాటు స్వామి మనకు చాలా గట్టిగా చెప్పినటువంటిది సేవ. సేవ అంటే చాకిరీ కాదు. సేవ అంటే సమర్పణ, సేవ అంటే భావన, సేవ అంటే దివ్యమైనటువంటి భావన. ప్రపంచానికి నా వలన ఏం లాభం కలుగుతుందో, ఇవాళ నిద్రలేచాను మళ్ళీ పడుకోబోతున్నాను. లోగా నేను ఎవరికీ ఉపయోగపడకుండా నా జీవితం సాగితే ఎట్లా? రెండవది, అంతా నాకే లభించేట్లుగా, లాభించేట్లుగా ఉంటే ఎట్లా? అనే ప్రశ్నని దాటి ఎవరైతే నిస్వార్థత పూరితమైనటువంటి భావనతో తమ జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఆత్మ క్షేత్రం వైపు వెళతారు. ఆత్మసాక్షాత్కారము అని మాట ఉంటుంది. ఎవరినో చూస్తాం, ఈయనకి ఆత్మసాక్షాత్కారం అయిపోయిందండి అని మనం చెప్తాం. మనకి ఆత్మ తెలియదు. సాక్షాత్కారం అంటే అసలు తెలియదు. అందుకనే ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది. దేహిగా ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక దేహాన్ని తీసుకున్నది. అదే ఆత్మసాక్షాత్కారం. అంతే తప్ప మనలాగా ఉన్న మరో మనిషి మన లోపల్నుంచి బయటకు వచ్చి వాడు మళ్ళీ మనకు కనపడటం కాదు. అది కళా ప్రపంచం చూపిస్తుంది అట్లా, అది కాదు. మనల్ని మనం ఎరగటం అంటే ఎక్కడ ఉన్నామో అట్లాగే ఉండాలి. ఏది రాని, ఏది పోని, నిశ్చలంగా, నిర్మమంగా, నికేతనంగా, నిరంజనంగా, హాయిగా, ప్రసన్నంగా ఉండాలి. ప్రపంచం విసిరే ప్రతి సవాలిని గంభీరంగా ఎదుర్కోవాలి. ఎవరికీ అపకారము కలిగించే రీతిలో జీవించకూడదు. అట్లాగే ఎవరి వలన అపకారం పొందకుండా కూడా జీవించాలి. పరస్పర మైత్రి భావంతో ఉండాలి. ఆత్మ మైత్రి నెలపాలి. ఇటువంటివన్నీ కొన్ని వేల వందల ఆ-మార్గాలు మనకి ఆత్మ క్షేత్రం వైపు వెళ్ళటానికి. ఈశావాస్యోపనిషత్తు తొలి మెట్టు. కాబట్టి జీవాత్మ అంటే ఏమిటి? జగత్తు అంటే ఏమిటి? జగత్తు ఎలా మారిపోతూ ఉంటుందో జీవుడు అలాగే మారిపోతూ ఉంటాడు. ఒక సునామీ వస్తుంది, ఒక భూకంపం వస్తుంది, ప్రకృతే మారిపోతుంది. ఇదిగో ఆరు నెలలుగా ఒక కరోనా అనేది ఏదో ఎవరికీ తెలియని ఒక విషయం ఇక్కడికి రాగానే మన జీవన విధానం, మన జీవన దృక్పథం, మన ఆలోచనలు, మనకున్న అతిశయాలు అన్నీ అణిగిపోయినాయి. ఎన్ని వేల కోట్ల రూపాయలు దగ్గర ఉన్నా అది ఎవరినీ ఉపేక్షించదు, అపేక్షించదు. ఏమో ఎంత కాలం ఉంటాం అనేటువంటి ఒక వైరాగ్య స్థితిని అది మనందరి యందు కల్పించింది. కాబట్టి కరోనాని కూడా మనం గురువుగా భావించాలి. అది ఎక్కడ పుట్టింది? ప్రకృతిలోనే పుట్టింది. జగత్తుని మనం ఎప్పుడైతే, ప్రకృతిని ఎప్పుడైతే మనం విధ్వంసం చేయటం మొదలు పెడతామో ప్రకృతి ఎదురు తిరుగుతుంది. ఎదురు తిరిగి మనకి ఇటువంటి వాటినన్ని సృష్టిస్తుంది గనుక వీటన్నింటినీ కూడా మన అధ్యాత్మ భా-భావన ద్వారా, సాధన ద్వారా, మంచి మనసు ద్వారా, సత్కర్మల ద్వారా, ఏకత్వము, సమత్వము, విస్తృత మమకారము అన్న మూడు భావనల ద్వారా, ప్రేమ ద్వారా, అన్నింటికంటే కూడా ప్రపంచంలో మహత్తరమైన త్యాగం దారా-ద్వారా. నా కర్మణాన ప్రజాయాన ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః ఇది కూడా వేద మహా వాక్యమే. త్యాగం చేయాలి. త్యాగం అంటే మనకున్నదాంట్లో ఇంకొకడి అవసరాన్ని, ఆకలిని తీర్చడమే త్యాగం. మనకున్న అహంకారం, మమకారాలు వదులుకోవటమే పరిత్యాగం. ప్రాపంచిక భావన నుంచి, దేహాత్మ భావన నుంచి ఒక విస్తృతమైన పరమాత్మ భావన వైపు మనం వెనక వెళ్లగలిగినట్లయితే అలా అప్పుడు మాత్రమే నీకు ఆత్మ క్షేత్రం పరిచయం అవుతుందని చెప్తూ జీవుడి గురించి, జగత్తును గురించి క్షుణ్ణంగా మాట్లాడినటువంటి ఉపనిషత్తే ఈశావాస్యోపనిషత్తు గనుక అటువంటి ఈశావాస్యోపనిషత్తుని మనం ఈవేళ ముగించుకుంటూ..మళ్ళీ కేనోపనిషత్తు లోకి ప్రవేశించడానికి కారణాలు ఏమిటి? అవి ఎప్పుడు ప్రవేశించాలి? ఎందుకు ఏం నేర్చుకోవాలి అక్కడ? అనేటువంటివి అంటే ఉపనిషద్ వాహిని అంతా కూడా ఒకే సూత్రం మీద నడుస్తుంది. ఇది ప్రయాణం మజిలీ, ఒకదానింట- నుంచి మరొకటి. ఎట్లా అంటే అణు క్షేత్రాన్ని గురించి విచారణ చేశాం. అణువులో-- అణువులన్నీ కలిసి ప్రకృతి అయింది మనం కూడా ఒక అణువుగా ఉన్నాం. ప్రకృతి మనం కనిపిస్తూ ఉన్నాం కంటికి కనిపించని జగదీశ్వరుడు ఎక్కడున్నాడు? వాడి స్థూల స్వరూపం ఏమిటి? అని విచారణ చేస్తూ వెళ్ళేదే కేనోపనిషత్తు కాబట్టి దానివైపు మళ్ళీ చక్కగా ప్రస-ప్రసన్నంగా, గంభీరంగా, స్పష్టంగా ఉపనిషత్తులను అర్థం చేసుకునేటువంటి రీతిలో మనకి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి సర్వదేవతాతీత స్వరూపులైనటువంటి స్వామికి మరొక్కసారి ప్రణమిల్లుతూ మనం మళ్ళీ కలుసుకునే సరికి కేనోపనిషత్తు వైపు మనం సాగుదాం. పది ఉపనిషత్తులు మనం నెమ్మదిగా చెప్పుకుంటూ ఇట్లా వీటన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకుంటే తప్ప ఉపనిషత్తులు అంటే ఒక భయం, భయపడవలసినది లేదు. ఉపనిషత్తులు ప్రశ్న వేయమంది, సమాధానం పొందమన్నది. అలాగే జీవితంలో సమాధాన పడకూడదు, సమాధానం పొందాలి. అంటే ఇంగ్లీషులో కాంప్రమైజ్ కాకూడదు. అది మన ఎస్టీమ్ ని పడగొడుతుంది. జీవితంలో మనమందరము ఎడ్జస్ట్ కావాలి. ఇది తప్పదు. అనివార్యమైనటువంటి దానిని, జీవుడి యొక్క స్థితిని, వాడికున్న పరిమితిని, ప్రకృతి యొక్క స్థితిని, దానికున్న శక్తిని రెండింటినీ నడిపించేటువంటి కనిపించని పరదైవతం ఏదైతే ఉన్నదో, దేనిని చిచ్ఛక్తి అని మనం అంటున్నామో, మూల కారణం ఎవ్వడు అని మనం చెప్పుకున్నామో మూల కారణాన్ని విచారణ చేస్తూ అణుక్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రంలోకి సునాయాసంగా, సులభంగా ఆత్మ విచార మార్గంలో మనం వెళుతూ వెళుతూ అనేకమైనటువంటి విషయాలన్నీ ప్రస్తావన చేసుకుంటాం. చేసుకునే అవకాశాలన్నీ కూడా స్వామి మనకు అనుగ్రహించు గాక అని మండలాశాసనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యా విభాగం తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని నేను మనసా, వచసా సంపూర్ణంగా అభినందిస్తూ చక్కని కార్యక్రమంగా నేను భావన చేస్తూ అందరూ చక్కగా ఉపనిషత్తులంటే భయం వదిలిపెట్టండి. ఉపనిషత్తులలో ఉన్న సత్యాన్ని గ్రహించండి. తద్వారా జీవితాన్ని మళ్ళీ రీడిఫైన్ చేసుకోండి, రిఫైన్ చేసుకోండి. అట్లా జీవితంలో ప్రవర్తిల్లండి అని మాత్రమే కోరుకుంటూ మీ అందరికీ సాయిరాం.
YouTube · audio

Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 3

Home

Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 3

Source: Sai-Showers on YouTube

0:00 / 1:03:35

More in this series

Upanishad Vahini — Samagra Vyakhyanamu

3 episodes · 3 hr 26 min

  1. 58 min 1

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 1

  2. 1 hr 1 min 2

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 2

  3. 51 min 3

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 3

    Now playing