Skip to content
Transcript తెలుగు
నమస్తే VTV భక్తి channel కు స్వాగతం. సత్యసాయిబాబా కి జై. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ఉత్సవాల నేపథ్యంలో మనతో ఒక special guest అయితే ఉన్నారు. ఆయన ప్రియ భక్తులు అలాగే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినటువంటి వి.ఎస్.ఆర్. మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మరికొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే sir. నమస్తే. Sai Ram. శుభం అమ్మ. Sai Ram sir. చాలా సంతోషం. అయితే శ్రీ సత్యసాయిబాబా గారికి మీకు ఉన్న అనుబంధం గురించి ముందుగా వివరించండి. క్షణానికి నేను ప్రశాంతి నిలయానికి వెళ్లి అరవై మూడు సంవత్సరాలు. ఉమ్ హొన్నొమ్మిది వందల అరవై రెండు June తొమ్మిదో తారీఖున, నా వయస్సు అప్పుడు పన్నెండు సంవత్సరాలు. ఉమ్ స్వామివారిని వెతుక్కుంటూ నా అంతట నేను వెళ్ళటం. అనుబంధం అనేక విధాల కొనసాగి సాగుతూనే ఉన్నది. ఇగో కనురెప్ప వాలేదాకా-- ఉమ్ అది నిరంతరము సాగుతూ ఉంటుంది. అయితే అనుభవం ఏమిటి? అనే ప్రశ్నకి చూట్టం అనుభవం కాదు కదా. ఊహూ వారిని దర్శనం చేసుకున్నాం. చూట్టం ఏంటి? దర్శనం ఏంటి? రెండూ ఒకటి కాదా అంటే, చూట్టం అంటే పై పైన చూసి రావటం. ఉమ్ దర్శనం అంటే లోలోతుల్లో అనుభవించి అనుభూతి చెంది ఈయన పరదైవతమే అనేటువంటి ఒక దివ్య భావనలో మనసు నెలకొల్పి చెందటమే. ఉమ్ అది ఒక అనుభవం కాబట్టి ప్రాపంచిక అనుభవాలను దాటి ఆధ్యాత్మికమైన అనుభవాలు వేలాదిగా ఉన్నాయి. అరవై మూడేళ్ల సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఉమ్ భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక అంటే physical, metaphysical, spiritual అనే మూడు స్థాయిలలోనూ నేను అనుభవించిన అనుభవాలు, నేను పొందిన అనుభవాలు, నాకు చెందిన అనుభూతులు అవి కోకొల్లలు గనుక ఖడగ్గ ఒక్క మాట సత్యసాయి భగవానుడు ప్రపంచంలో నడవటానికి మనల్ని నడిపించటానికి వచ్చినటువంటి ఒక పరదైవతంగా నా భావన. ఉమ్ అది అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. Sir సత్యసాయిబాబా గారు ఎవ్వరైనా సరే బంగారు అని సంబోధిస్తూ ఉంటారు. అయితే దీని వెనుకాల ఉన్న అర్థం ఏంటి అసలు? ఔపదేయంబునకు సత్య నామం బిచ్చి నడత కల్ల ధర్మ నిరతి నెరపి ఎల్ల సృష్టిని శాంతి కాంతుల వెలార్చి వచ్చె మా స్వామి మల్హారమై విచ్చమా స్వామి కల్హారమై అంటే తన శరీరానికి సత్యము అని పేరు పెట్టుకొని తాను నడిచిన, తాను నడిపించినటువంటి ఒక దివ్య జీవన విధాన నేపథ్యంలో శాంతిని, ప్రేమని ప్రపంచానికి ఇచ్చి ధర్మమార్గంలో నడిచి, నడిపించి వచ్చినటువంటి ఒక బంగారమే సత్యసాయిబాబా వారు. ఉమ్ విచ్చ కల్హారమై శతపత్రంగా ఎట్లాగైతే ఒక పుష్పం వికసిస్తున్నదో వారు కూడా వికాసమానం చెందినటువంటి దివ్య దీదేతి అంటాం. ఉమ్ అదొక కాంతి. కాబట్టి బంగారం అని ఎందుకు పిలిచారంటే బంగారము అంటే శుద్ధ చైతన్యం అని అర్థం. ఉమ్ మనందరం కూడా మనకి పేర్లున్నాయి, నేపథ్యాలున్నాయి, ఏం చదువుకున్నామో ఉంది, ఏం ఉద్యోగం చేస్తున్నామో ఉంది. వీటన్నింటినీ దాటిన ఒక మహా చైతన్యం ఏదైతే ఉన్నదో చైతన్యం శుద్ధ చైతన్యం గనుక నేను శుద్ధ చైతన్యాన్ని మీరు కూడా అదే అని చెప్పిన ఒక అవతారమూర్తి బాబా వారు. అంటే నేను వేరు, నేను దేవుణ్ణి, మీరు కాదు అని ఆయన అనలా. ఉమ్ నేను దేవుణ్ణి అని నాకు తెలుసు. మీరు కూడా దేవత
YouTube · audio

We are fortunate to see Sathya Sai Baba with human eyes | Sri Sathya Sai Baba placed Seva at the

Home

We are fortunate to see Sathya Sai Baba with human eyes | Sri Sathya Sai Baba placed Seva at the

Source: V TV Voice Varadhi Bhakthi on YouTube

0:00 / 39:26