No transcript for this section.
Transcript begins at 0:26.
[పాట] అందరికీ నమస్కారం Literary Guru కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, రచయిత వి.ఎస్.ఆర్. మూర్తి గారు మనతో ఉన్నారు. వి.ఎస్.ఆర్. మూర్తి గారు ముప్పై ఆధ్యాత్మిక గ్రంథాలు రచించారు. వారు oil technologist. వారి సాహిత్య ప్రయాణాన్ని వారి మాటల్లో విందాం. వి.ఎస్.ఆర్. మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే తురుమేలలో మొదలైన మీ ప్రయాణం అంచెలంచెలుగా సాగుతూ ఒక పక్కన మీరు oil technologist ఇంకో పక్కన ఆధ్యాత్మికత ఇన్నిటినీ పెనవేసుకుంటూ సాగుతూ వచ్చింది. ఒక్కసారి మా అందరికీ ఆ journey ని కాస్త వివరిస్తారు. తప్పకుండా. తురుమేలలో పవిత్ర బాల్యం ప్రారంభమైంది. ఊ అక్కడి నుంచి ప్రకాశం జిల్లా ఇంకొల్లు. అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదట రచనా వ్యాసంగం. ఈ - అప్పటికి పన్నెండేళ్ళు, దానికంటే ముందు... ఊ నాలుగవ ఏట హనుమాన్ చాలీసా ధారణ చేయటం. ఊ రఘువరదాస్ గారు చాలా ఆనంద పడటం అదొక అద్భుతమైన దృశ్యం. ఊ నాలుగవ ఏట. మళ్ళీ ఎనిమిదేళ్ళ తర్వాత ఇంకొల్లు వెళ్ళినప్పుడు స్కూల్ వాళ్ళు నన్ను ఒక science fair కి select చేసినప్పుడు ఏదన్నా ఒక మంచి వ్యాసం present చేయమని అడిగారు paper presentation వేళ. ఊ సరే అందరూ నన్ను ఒక మాస్టారు దగ్గరికి వెళ్ళి science మాస్టారు దగ్గరికి ఒక article రాయించుకుని వెళ్లి చదివి వచ్చేయ్ అన్నారు. Select చేసింది నన్ను కాబట్టి నేను ఏం రాయాలో నేను నిర్ణయించుకుంటానని, ఆ పల్లెటూరులో ఏ గ్రంథాలయం పుస్తకాలు reference ఏం లేవు. I walked up to వేటపాలెం. ఊ సరస్వత నికేతనానికి వెళ్ళి అక్కడ భారతి అని popular magazine. ఆ రోజుల్లో అందరికీ తెలుసు. దాన్లో చూస్తే వరాహమిహిరుడి మీద ఒక వ్యాసం ఉంది. But జటిలమైన తెలుగు. ఊ సంపూర్ణ గ్రాంథి కంలో ఎవరో రాశారు అది. But దాన్ని అర్థం చేసుకుని ఆలోచనలు రేకెత్తినప్పుడు దీన్ని గనక మనం ఇవాళ అర్థం చేసుకుని రాయగలిగితే బాగుంటుందని అక్కడికక్కడ కూర్చొని ఒక article తయారు చేశా. దాన్లో ఆ రావణాసురుడి పుష్పక విమానం గురించి ఒకటి, వరాహమిహిరుడి కాలంలో ఇవాళ మనం దేన్నైతే సిమెంట్ అంటున్నామో ఆయన వజ్రసంఘాతం అని పేరు పెట్టారు. Morter ఏదైతే ఉందో దాన్ని వజ్రలేపనం అని పేరు పెట్టారు. అలాగే water divining ఎలా చేయాలి, భూగర్భ శాస్త్రం ఉంది. ఇవన్నీ రాసినప్పుడు నాకు తెలియని లోక లోకాంతర పురాణాలలో ఇంత మహా వాంగ్మయాన్ని మహానుభావుడు ఈ ప్రపంచానికి ఇచ్చారు అని బహుశా నేను రాసిన మొట్టమొదటి article, వ్యాసం అదే. ఊ అది ఎక్కడికి నేను బాపట్ల Salvation Army School లో జరిగినప్పుడు దానికి వచ్చిన judges అంతా IITians, IIT professors. ఊ వాళ్ళకి నేను చెప్పినప్పుడు ఒక్కసారి వాళ్ళు ఆశ్చర్యపోయారు. "పన్నెండేళ్ళ వాడు ఇవన్నీ ఎలా రాయగలిగాడు?" అని ఆ paper తీసేసుకున్నారు. ఊ తీసుకుని "మళ్ళీ ఇప్పుడు చెప్పగలవా?" అని అడిగారు. ఊ యథాతథంగా చెప్పా. అసలు ఏ రకమైన ఒక syllable కూడా తేడా లేకుండా చెప్పా. ఆ And naturally I won the first prize and it was the first national award. పన్నెండేళ్ళ వయసులో పన్నెండేళ్ళ వయసులో అయితే అంతకు ముందు బాల్యంలో మీరు నాలుగేళ్ళ వయసులో హనుమాన్ చాలీసా ధారణ చేయడం గురించి- అవును మీరు సూచిప్రాయంగా చెప్పారు గాని సూచ- అంటే రఘువరదమ్మా నన్ను పెంచుకున్న మా అమ్మమ్మ- ఊ నాకు ఆశీర్వచనం ఇప్పించాలని ఒక స్వామి వారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన స్వామి వారు కాదు, సంకీర్తనాచార్యులు. ఊ తీసుకెళ్తే ఆయన ఆశీర్వచనాలు అలాంటివి ఏం చేయకుండా హనుమాన్ చాలీసా చేతిలో పెట్టారు. ఊ భాషేమో తెలుగు. ఊ లిపి. ఊ దాని ఆ వెనక ఉన్నటువంటి భావం అంతా తెలుగు కాదు అది. అది ఏదో భాష. కానీ తెలుగు లిపి చదవచ్చుగా. సరే ఆయన అన్నారు ఒక దోహా గనక చెప్తే అరటిపండు ఇస్తాను. సాయంకాలం వరకు time ఇచ్చారు. కానీ ఒక అరగంటలో నేను అటూ ఇటూ చూసుకున్నట్టున్నాను. దాని కారణం ఏమిటనేది మనం ఇవాళ విశ్లేషిస్తే నిజానికి జవాబు లేని ప్రశ్న అది. ఒక అరగంటలో ఆయన దగ్గరికి వెళ్ళి "నేను మళ్ళీ హనుమాన్ చాలీసా మీ ముందు అప్పజెప్తాను" అన్నా. ఆయన బుక్ ఇవ్వబోతుంటే "నాకు వద్దు, నువ్వు చదువు" అన్నారు. ఆ పుస్తకం నాకు అక్కర్లేదని చేతులు కట్టుకొని ఆయనకి చదివి వినిపించా. ఊ ఆయన మంచి అజానుబాహువు. నేను సరే చిన్నవాడిని. ఆయన భుజం మీద ఎక్కించుకొని ఆ గదిలో ఒక మూలకు తీసుకొని వెళ్లారు. అక్కడ పెద్ద అరటి గెల ఉంది. రెండువందల యాభై, మూడువందల అరటి పండ్లు ఉంటాయి. దానికి ఒక కొమ్ము. ఊహూహూ ఆయన అన్నారు. ఆయన కళ్ళ వెంబడి కన్నీరు కారుతున్నది. ఆనందం. ఊ కన్నీరంటే కంటి నుంచి వచ్చిన ఆనందభాష్పాలు. ఊహించలేదు నేను. ఒక అరటిపండు అనుకున్నాను. "ఈ గెలంతా నీదే" అన్నారు. ఆ గెలలో సగం లేను నేను. ఊహూ అది హనుమాన్ చాలీసా ధారణ గురించినటువంటి విషయం. లిటరరీ Guru కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, రచయిత వి.ఎస్.ఆర్. మూర్తి గారు మనతో ఉన్నారు. వి.ఎస్.ఆర్. మూర్తి గారు మీకు ఇష్టమైన పాట ఒకటి మనం శ్రోతలకు వినిపిద్దామండి. తప్పకుండా ఆ ముక్కోటి దేవతలు ఒక్కటైనారు పాట మీకు బాగా ఇష్టం. ఎందుకని ప్రత్యేకంగా? అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దేవతా స్వరూపాల మీద రాగమాలికలో అంత భావయుక్తంగా పాడగలిగిన వారు మరొకరు లేరు, ఘంటసాల గారు తప్ప. అది ఎప్పుడు విన్నా రసాత్మకమైనటువంటి భావన కలుగుతుంది. అందువల్ల చాలా ఇష్టం. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ మనం శ్రోతలను కలుసుకుందాం. తప్పకుండా. [పాట] ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడచక్కని పాపను ఇక్కడుంచారు ఎక్కడున్నా గానీ దిక్కువారే కదా చిక్కులను విడదీసి దరిచేరలేరా ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు ఆలి ఎడబాటు కూడు అనుభవించెడి వాడు అలమేలు మంగపతి అవనిలో ఒకడే ఎడుకొండల వాడు ఎల్లవేళల యెందు దోగాడు బాలు నీకి తోడు నీడవు తాడు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు నెల్లూరి సీమలో చల్లంగ సేయ నించు శ్రీరంగ నాయకా ఆనందదాయక తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు దయసేయుమా నీవు క్షణము ఎడబాయక ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు ఎల్ల లోకాలకు తల్లివై నీవుండ పిల్లవానికి ఇంక తల్లి ప్రేమ కొరత బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు బరువాయె బ్రతుకు చెరువాయె కన్నీరు కరుణించి కాపాడు మా కనకదుర్గా ముక్కోటి దేవతలు ఒక్కటైనారు చక్కని పాపను ఇక్కడుంచారు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఈ పేరు వెనుక ఉన్నటువంటి వాస్తవ కథ కామాని చాలా నాకెప్పుడూ కూడా నేను ఎదుర్కొనే ప్రశ్నల్లో ఇదొకటి ఊ సత్యసాయిబాబా వారు నాకు పద్దెనిమిది ఏళ్ళ వయసున్నప్పుడు ఒకసారి వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఊ నువ్వు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తవి కావాలి అవుతావు అన్నారు అర్థం కాలే ఆధ్యాత్మిక శాస్త్రంలో అధ్-అధ్యాత్మలో గనక ఉన్నట్లయితే ఒక పీఠాధిపతి స్థాయికి వెళ్ళగలను నాలో శక్తి గనక ఉంటే సైంటిస్ట్ ని కాగలను ఊ బట్ ఈ రెండు కలిపారేమిటి అనుకున్నా అప్పుడు బాబా గారు రసాయన శాస్త్రము భౌతిక శాస్త్రము గణిత శాస్త్రము భాషా శాస్త్రం ఎట్లా ఉన్నాయో భారతదేశంలో అధ్యాత్మ శాస్త్రం ఉంది ఒక పురాణాన్ని ప్రవచనం చేయటం వేరు ఒక పురాణాన్ని గానం చేయటం వేరు ఒక పురాణాన్ని జనరంజకంగా చెప్పటం వేరు చలోక్తులతో కానీ ఆ పురా--సంస్కృతి పురాణం అంటే పాతది ఊ ఆ పాత దానిలో ఉన్నటువంటి సంస్కృతిని దానిలో దాగిన వైజ్ఞానికమైనటువంటి కోణాలని సంపూర్ణంగా ఆవిష్కరిస్తూ చెప్పగలిగితే దాని పేరు అధ్యాత్మ శాస్త్రము ఊ అది కావాలి అవుతావు అన్నారు ఏదో నేను అనుకోలే కానీ తర్వాత తర్వాత జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది అయినాను ఊ ఇవాళ నన్ను వి ఎస్ ఆర్ మూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అని రాసేస్తారు వాళ్ళే ఊ ఎందుకని అదేం బిరుదు కాదు అంటే నేను ఏం కావాలో దిశానిర్దేశం జరిగింది వారి మాట పొల్లుపోకుండా నా జీవితంలో ఈ రెండింటిని కూడా సమాంతరంగా ఊ ఒకవైపు అధ్యాత్మని రెండోవైపు సైన్స్ ని ఆయిల్ టెక్నాలజీని వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళినప్పుడు అధ్యాత్మకి ఈ సైన్స్ కి మధ్య ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే లిటరేచర్ ఊ ఊ బావుంది అనుసంధానం చేస్తూ అనుసంధానం చేస్తూ ఎందుకని నాకో భావం ఉంది మీతో మాట్లాడాలి తగిన భాష కావాలి కదా అవును ఏదో మా చాలా క్యాజువల్ గా మాట్లాడటానికి లేదు కదా దానికి నిర్దుష్టమైన భాష దానికి ఒక గతి ఒక శృతి ఒక లయ ఇవన్నీ కూడా లేకపోతే ఆ వాక్యం రసాత్మకం కాదు అని గట్టిగా నమ్మిన వాడిని గనుక ప్రాచీన ఆంధ్ర సాహిత్యం తీవ్రంగా చదివా అవును తీవ్రంగా ఊ ఇష్టం కొద్దీ చదివా ఆ ఒక్కొక్క ఇష్టం లో ఒక్కొక్క వాళ్ళ నుంచి ఒక్కొక్క అదొక పెద్ద పూల తోట అయితే [నవ్వు] ఆ పూల తోటలో నుంచి ఆ ఆ ఒక్కొక్క తేనె బిందువుల్ని ఒక భ్రమరం లాగా నేను పట్టుకోగలిగాను అని అనుకుంటా మరి ఇక్కడ అడగాలి మిమ్మల్ని ఆ పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వనాథ వారిని కలిశారు కదా అవునండిసో పద్దెనిమిదేళ్ళ వయసు కుర్రాడు అసలు విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఒక ఒక ఆ మార్తాండ్ తేజుని కలవడం ఎట్లా సాధ్యం ఎట్లా జరిగింది? ఎట్లా అంటే దానికి మళ్ళీ మా డైరెక్ట్ గురువుగారు నండూరి రామకృష్ణమాచార్యుల వారు. ఉమ్ ఆంధ్రోద్యమం జరుగుతున్న సమయం అది. ఉమ్ నాకు ఉత్తరం ఇచ్చి "నాయనా! నువ్వు విజయవాడ వెళ్లి విశ్వనాథ్ వారి చేతిలో ఈ ఉత్తరం పెట్టు. ఉమ్ మళ్ళీ జవాబు ఇవ్వవు-- ఇవేమీ అడగొద్దు నువ్వు. ఆ ఉత్తరం ఆయనకి ఇచ్చేసేయ్. ఆయన ఏం చేస్తారో చూడు." అని అన్నారు. సరే నేను వెళ్ళాను. అప్పటికి నేను విశ్వనాథ్ వారి వేయి పడగలు. ఉమ్ ఏకవీర, చెలియలి కట్ట తర్వాత ఆంధ్ర ప్రశస్తి. ఉమ్ ఈ పద్యాలన్నీ నాకు కంఠోపాఠం. ఉమ్ ఆ ఆ ఊరు నుంచి ప్రయాణం వెళ్తున్నప్పుడల్లా ఈ పద్యాలన్నీ లోపల తిరుగుతున్నాయి. శ్రీమద్రామాయణ కల్పవృక్ష పద్యాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో ఆయన చేతికిచ్చానో సైలెంట్ గా ఉండమన్నారు, ఉన్నా. అంతే. ఉత్తరమంతా చదువుకున్నారు. చివర్లో "ఏమై? మీ గురువు గారికి ఇంత లౌక్యం ఎప్పుడబ్బింది?" అన్నారు. ఉమ్ "ఏమిటా లౌక్యం నాకు తెలీదు. ఆ ఉత్తరం ఏముందో నాకు తెలీదు కదా." ఉమ్ "మిమ్మల్ని దర్శించటానికి మా రామచంద్రమూర్తికి అన్యార్హతలు ఉన్నాయి." అని రాశారు. "ఇక నేను ఏం చేయను?" అన్నారు నవ్వుతూ. అప్పుడు ఆయన చాలా మంచి దీంట్లో ఉన్నారు. మూడ్ అంటామే. ఉమ్ ఆ టైంలో "మీరంటే నాకు ఇష్టం." అన్నా. ఎందుకంటే నేను ఆయన్ని దర్శనం చేయాలని కోరిక. అప్పటికే ఆయన సహస్రం చదివేసారు. చదివేశాను. "మీరంటే నాకు ఇష్టం." అన్నా. అప్పుడు అసలు విశ్వనాథ్ వారు బయటికి వచ్చారు. ఉమ్ అంటే "నేను రాసిన ఒక పద్యం వచ్చా నీకు?" అన్నారు. చేతులు కట్టుకొని ఇరవై రెండు పద్యాలు వరుసగా చదివాను అండి. ఆయన-- నేను చదివినంత సేపు ఆయన కంఠం పైకి కిందకి ఊగుతున్నది. పద్యం చదవటం ఒకచోట ఆపేశాను. అవి ఇరవై రెండు పద్యాలు. ఉమ్ అంటే సుమారు ఒక గంట చదివాను. ఆ ఆ one hour. One hour ఆ ఆయన అలా పీట మీద కూర్చుని, ఆయన కుర్చీలో వేల-- పీట మీద కూర్చున్నారు. ఉమ్ కూర్చొని వింటూ వింటూ ఆయన కళ్ళెంబడి సన్నగా... అశ్రుధార మళ్ళీ అశ్రుధార, ఆనందధార కారుతూ ఉ-ఉంటే "నేను పోతాను. ఏదో రోజు పోతాను కదా! కానీ నేను రాసిన పద్యాలు ఉంటాయి. ఇష్టం అంటే ఇది ఇష్టం. అసలు చదవకుండానే అభిప్రాయాలు ఏర్పరుచుకుంటే ఎట్లా? నువ్వు వీళ్ళకిక్కడ భోంచేసి వెళ్ళాలి." అన్నారు. ఆ భోజనం ఆయన స్వయంగా వాళ్ళింట్లో బావి పక్కన ఒక అరటి చెట్టు ఉంటే ఉమ్ అక్కడ ఒక ఆకు కోసి, కడిగి ఉమ్ తువాలుతో తుడిచి ఉమ్ నాకు అన్నం పెట్టి ఒక రిక్షా పిలిచి "బస్ స్టాండ్ లో బస్సు ఎక్కించి నువ్వచ్చి నా దగ్గర రిక్షా డబ్బు తీసుకో." అని అతనికి అప్పజెప్పి అంత బాధ్యతగా సాగినటువంటి విశ్వనాథ్ వారిది అది పరమ రమణీయమైన, అటు ఆర్ద్రమైన సన్నివేశం. అనే నా జీవితంలో. ఉమ్ తర్వాత అదే రామాయణ కల్పవృక్షాన్ని వారి అనుగ్రహం అనుకుంటా ఉమ్ పద్నాలుగు నెలలు మొత్తం కావ్యగానం చేశా. ఓ ఉమ్ లిటరరీ గురు కార్యక్రమంలో ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ప్రముఖ రచయిత వి.ఎస్.ఆర్. మూర్తి గారు మనతో ఉన్నారు. మూర్తి గారు మరొక పాట మీకు ఇష్టమైంది. బాలమురళి గారి పాటలు రెండు ఇష్టం మీకు. ఆ ఒకటి సలలిత రాగ సుధారస- సుధారస సారం రత్నశాల చిత్రం. అవును, అవును. అది ఎందుకు ఇష్టం అంటే ఉమ్ ఒక ధీరోదాత్త నాయకుడు ఉమ్ అయినటువంటి అర్జునుడు ఒక బృహన్నల రూపంలో నాట్యాచార్యుడిగా తనలో ఉన్నటువంటి సలలితమైనటువంటి, లలితాత్మకమైనటువంటి ఒక భావన ద్వారా నృత్యాన్ని తన శిష్యురాలికి నేర్పుతున్నప్పుడు గాంభీర్యం లేని ఒక గొంతులో నుంచి సారళ్యం రావాలి గనుక దానిని ప్రవహింపజేసిన వారు బాలమురళి కృష్ణ. అందుకని నాకు చాలా ఇష్టం అది. ఆ పాట విని మనం శ్రోతలుగా- తప్పకుండా విందాం. [పాట] ఆ ఆ ఆ ఆ [వీణ ధ్వనులు] ఆ ఆ ఆ ఆ [మృదంగం, తబ్లా, హార్మోనియం, గిటార్ సంగీతం] సలలిత రాగ సుధారస సారం సలలిత రాగ సుధారస సారం సర్వకళామయ నాట్య విలాసం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారస సారం [వీణ, మృదంగం, తబ్లా, హార్మోనియం, గిటార్ సంగీతం] మంజుల సౌరభ సుమకుంజ ములా మంజుల సౌరభ సుమకుంజ ములా రంజిలు మధుకర మృదు శంకారం రంజిలు మధుకర మృదు శంకారం సలలిత రాగ సుధారస సారం సర్వకళామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారస సారం [వీణ, మృదంగం, తబ్లా, హార్మోనియం, గిటార్ సంగీతం] నిరాద తనీ ప నిధా ప మగ మధ ప సర్దిగ ఆఆఆఆ కల్పనలో పూజించిన కోయలు ఆఆఆఆ కల్పనలోఅయితే ఇంకో పక్క మీరు ఆయిల్ టెక్నాలజీ చదవటం కోసం కాన్పూర్ వెళ్ళారట. అవునండి కాన్పూర్ అప్పట్లో IIT ఇంకా IIT పూర్తిగా form కానీ అవుతూ ఉన్న time అది ఇంకా పూర్తిగా కాదు అక్కడ చదివారు మరి మీ మీరు West Germany లో కొంతకాలం పని చేసినట్టున్నారు. అక్కడి నుంచి America వెళ్లారు. మళ్ళీ World Bank project కి వచ్చారు Project కి India ఈ రకంగా traversing through the world లా చేశారే. ఆ ఇది ముఖ్యంగా వీటన్నింటికీ ఏమిటి కారణం అని ఆలోచించాను. ముందు మనం ఏం చదవాలో నిర్ణయించుకోవాలి. ఏం కావాలో నిర్ణయించుకోవాలి professional గా. నేను ఆ ప్రయత్నం చేశా. scientist వేరు technologist వేరు. నేను spiritual scientist అనేది రాసినా కింద oil technologist అనే పదం వదిలిపెట్టాను. ఎందుకని అంటే scientist ఒక విషయం గురించి పరిశోధన చేస్తాడు technologist దాన్ని apply చేస్తాడు. Technologist లేకపోతే అది పుస్తకంలో ఉండిపోతుంది పరిశోధనా గ్రంథంలో. ఈ రెండు కారణాల వలన ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ The applicability of a science is real technology. అందువల్ల నేను ఎలైలైసోథయోసయనేట్ అని దాని మీద patent చేశాను. Patent చేస్తే బోలెడు డబ్బులు వస్తాయి చాలా డబ్బులు వస్తాయి అమ్ముకుంటే. కానీ మళ్ళీ ఇవాళ సత్యసాయి బాబా గారిని గురించి నేను తలుచుకోవాలి. ఆ రోజున నాకు Telegram వచ్చింది జేబులో ఉంది కూర్చున్నాము "knowledge నిను సంపదని hoard చేయకూడదు ప్రపంచ పరం చేయాలి ఇది ధర్మం" అని అన్నారు ఎవరితోనో అన్నారు. అదే రోజు సాయంకాలం post office కి వెళ్ళి I relinquished all my patent rights ఇచ్చి దీన్ని ఆ ఏదన్నా ఒక సంస్థకి ఇచ్చేసేయండి. దాని వల్ల వాళ్ళు commercialize చేసి ఇది ఆ ప్రపంచంలోకి అది వెళ్ళిపోతుందని ఇచ్చేసి నాలుగు గంటలకు వచ్చి కూర్చున్నా. అప్పుడు మాట్లాడారు ఆ బాబా గారు. ఏమనంటే "గురువుని సేవించటము భగవంతుణ్ణి నమ్మటము అంటే పూజలు చేసి ఊరేగింపులు చేయటం కాదు చెప్పిన మాట వినటమే. దానిని మించిన గురుదక్షిణ లేదు. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది" అని అన్నారు. చాలా సంతోషం నిజంగా అండి. అది ఇది చాలా ఒక మధుర స్మృతిని గుర్తు చేశారు. మళ్ళీ మీరు World Bank project ద్వారానా ఆ తిరువణ్ణామలై వెళ్లి కొంతకాలం ఉన్నారు ఇవన్నీ అండి trust with destiny అండి. మళ్ళీ ఈ పద్దెనిమిదవ ఏటే ఏ అధ్యాత్మ శాస్త్రవేత్త అవుతా ఉన్నప్పుడు ఆ సంవత్సరంలోనే మళ్ళీ బాబా గారు ఏమన్నారంటే ఆ మానవ జన్మ ఎత్తినందుకు ఒక్కసారైనా తిరువణ్ణామలై వెళ్ళాలి అసలంతా అక్కడ ఉంది అన్నారు. మామూలుగా సాధారణమైన గురువు అయితే అట్లా అనరు. అంతా ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళద్దు అంటారు. అసలు ఉన్నదంతా అక్కడే ఉన్నది అన్నారు. కానీ ఆ తిరువణ్ణామలై ఎక్కడో నాకేం తెలియదు. ఈ World Bank projects scheme లో తిరువణ్ణామలై లో ఒక World Bank project పెట్టవలసి వచ్చింది. సో ఆ నన్ను select చేసుకున్నారు automatic గా. నేను Bombay నుంచి తిరువణ్ణామలై వెళ్ళా. ఆ వెళ్ళటానికి మధ్యలో I was all poised అంటే నేను వెళ్ళాలి ఎక్కడ Raichur లో ఏడు projects లకి incharge గా వెళ్ళాలి. నా books నా drawings అన్నీ ready అయినాయి. కానీ ఆ రోజున chairman "ఎవరు వెళ్తున్నారు ఈ seven projects కి" అన్నారు. ఇలా మూర్తి గారు "No no no we should not just anchor him there he is the great force మన projects అన్నీ Tamil Nadu లో ఉన్నాయి అక్కడికి పంపిద్దాం" అన్నారు. అట్లా నేను తిరువణ్ణామలై వెళ్ళటం రమణాశ్రమం అదే తిరువణ్ణామలై లో ఉండటం one hundred and eighty eight days ఉన్నానండిమొన్న ఈ two thousand twenty February కి just before corona I completed hundred గిరి ప్రదక్షిణలు ఓహ్ అరుణాచల ప్రదిక్షణ అరుణాచలగిరి ప్రదక్షిణం వంద పూర్తి చేసుకున్నా అదేం record కాదు అసంభవమూ కాదు కానీ మనకి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాని పట్ల నిష్ఠ ఉండాలి శ్రద్ధ ఉండాలి పట్టుదల ఉండాలి time frame లో జరిగిపోవాలి అంతే రమణ మహర్షి ఆశ్రమం తిరునామాల్లి వెళ్ళినప్పుడు మీరు అక్కడ మీకు కలిగినటువంటి ఒక enlightenment గురించి చెప్పండి అసలు మొట్ట మొదట ఇందాక చెప్పాను కదా project కోసం వెళ్లినప్పుడు రమణాశ్రమంలో నేను అడుగు పెడుతున్నప్పుడు ఇవ్వాల చెప్పగలను నా భావాలు సర్వాంగీనమైనటువంటి దేహంలో నాకు తెలియని ఒక ప్రశాంతత ఒక నిర్లిప్తత ఒక ఆనందం ఉమ్ ఏ state of neutrality అంటాం అది అడుగుపెడుతుండంగా నేను అనుభవించా అప్పటికి భగవాన్ లేరు ఆయన ఎప్పుడో nineteen fiftyలోనే దేహం చాలించారు మాములుగా గుడిలోకి వెళ్తారు ధ్యానం మందిరం లోకి వెళతారు లేకపోతే అక్కడున్న వస్తువులు చూస్తూ ఉంటారు నేను direct గా వారి నిర్వహణ గది అని ఒకటి ఉంటుంది where he left his body అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెలియకుండా నా కళ్ళు From నీళ్లు వచ్చినాయి తర్వాత ఆశ్రమము అంతా నాకు ఇంతకు ముందే తెలిసినట్లు నేను అక్కడ సంచారం చేసినట్లు నాకేదీ కొత్త అనిపించలేదు మోడలి సారి వెళ్ళినట్టు అనిపించలేదా ? అసలు లేదు అసలు నాకు చాలా పరిచయమైన ప్రదేశానికి వెళ్ళానని అనిపిచ్చింది అది నన్ను అరుణాచలం లో స్థిమితం చేసింది అరుణాచలం పై వరకు ఎన్ని ఆదివారాలు వెళ్ళానో లెక్కే లేదు ఎన్ని గిరి ప్రదక్షణాలు ఇందాక చెప్పా కదా అయితే అక్కడ ప్రశస్త ఏమిటంటే ఏమి పొందాను అంతా అక్కడే ఉంది అన్నారుగా ఆ అంతా ఏమిటి అని ఏ దేనినైతే అంతా నా దగ్గర ఉన్నదని కున్ననో దానిని దాటిన అతీతమైనటువంటి ఒక ఆత్మ లేదా ఆత్మ పరమైనటువంటి ఒక దివ్యభావన ఇది నాయందే ఉన్నది బయట కనిపించే దేవీదేవతలు కూడా Na వంటి స్వరూపాలే కానీ అరూపమై నిర్గుణమై నిశ్చులమై నికేతనమై నిరంజనమై నిత్య సత్య శాశ్వతమై ఏది నా యందున్నదో అది నేను అని మేను బావాన్ని దాటి నేను లోకి ప్రవేశించడమే నే పొందిన అనుభుతి literary guru కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రచయిత విఎస్ఆర్ మూర్తి గారు మనతో ఉన్నారు ఆ మూర్తి గారి మరొక పాట మీకిష్టమైంది తెనాలి రామకృష్ణ చిత్రంలోది చేసేది ఏమిటో అవునండి ఆ పాట వెనుక.. దాని వెనుక... తాత్వికత ఆ తాత్వికత ఒకటి మనిషి కేవలం తనకోసం మాత్రమే కాదు రాబోయే తరం కోసం కూడా బతకాలి తాను జీవించినటువంటి జీవితాన్ని కాలం అనేటువంటి ఇసుక ఎడారి మీద పద ముద్రలు వదిలిపెట్టి వెళ్ళాలి రెండు మూడు ఇవ్వాలా మనం ఏ విత్తనం నాటామో దాని ఫలం ఈ జీవితకాలంలో మనమే అనుభవించాలని లేదు రేపటి తరాన్ని గురించి కూడా ఆలోచించాలి అని ఒక అద్బుతమైనటువంటి సందేశం తరతరాలకి ఉపయోగపడేటటువంటి సందేశం కాబట్టి అది నాకు చాలా ఇష్టం ఆ పాట విని మనం శ్రోతలని మళ్ళీ కల్సుకుందాము తప్పకుండా చేసేది ఏమిటో చేసి సోటిగా వేసి పాగా ఈ కోటలో చేసేది ఏమితో చేసెయ్యు సూటిగా వేసెయ్యు పాగా ఈ కోటలో చేసేది ఏమితో చేసెయ్యు సూటిగా వేసెయ్యు పాగా ఈ కోటలో ఎన్ని కష్టాలు రానీ నష్టాలుగానీ నీ మాట జక్కించుకో బాబయ్యా ఎన్ని కష్టాలు రానీ నష్టాలుగానీ నీ మాట జక్కించుకో బాబయా బాబాయా చేసేది ఏమిటో చేసెయ్యు సూటిగా వేసెయ్యు పాగా ఈ కోటలో నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ కొమ్మ కొమ్మ విరగ పూసి వేలాదిగా ఆ ఆ ఆ ఆ నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ కొమ్మ కొమ్మ విరగపూసి వేలాదిగా ఇక కాయాలి బంగaru కాయలు పోంచెయ్యాలి మీ పిల్లకాయలు కాయాలి బంగారు కಾಯಲು పొంచೆయ్యాలి మీ పిల్లకాయలు చేసేది ఏమిటో చేసెయ్యు సూటిగా వేసెయ్యు పాగా ఈ కోటలో సహదారి వెంట మొక్క నాటిరమణ మహర్షి మీద మీరు దాదాపు ఒక ఆరు, ఏడు పుస్తకాలు- రాశాను. రాశారు. సో ఆ పుస్తకాల గురించి కాస్త మాట్లాడుకుందాం. మొట్టమొదటి పుస్తకం సాయి రమణీయం. ఊ. మళ్లీ సాయి ఎందుకు వచ్చారు ఇక్కడ? అంటే ఆ పుస్తకంలో ఏముందంటే "All gurus are one but all are not gurus" అది theme. ఊ. కనిపించిన ప్రతివాడు, కాషాయం కట్టిన ప్రతివాడు గురువు కాదు. గురుస్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఇక్కడ అందరూ ఒకటే. అంటే ఒక శంకరులు, ఒక సత్యసాయి, ఒక రమణులు, ఒక అరవిందులు. వీళ్లంతా ఒక స్థాయికి చెందిన వాళ్ళు అని. But మిగతా వాళ్ళంతా ఆ path లో వెళుతున్నవారు. వాళ్ళ గురించి ప్రస్తావన అక్కర్లేదు. ఊ. ఇక రెండవది మౌనోపదేశం. ఊ. మౌనోపదేశం అంటే ఉపదేశ సారం. ఊ. నన్ను spiritual scientist అని ఎలా అంటారో నన్ను ఉపదేశసారమూర్తి గారిని కూడా పిలుస్తారు. ఊహూ. చాలా గంభీరమైన విషయం అది. అది అనేక మాధ్యమాల్లో దాని గురించి మాట్లాడటం- ఊ. ఉపదేశ సారాన్ని సమగ్రంగా సత్సంగ రూపంలో ఇవ్వటం ఆ జరిగింది. అది రెండవది. మూడవది ఉన్నది నాల్పదని ఉన్నది నలభై అదే అద్వైతం. ఊ. దాన్ని దర్శన పౌర్ణమి అని రాశాను. ఆ. పౌర్ణమి దర్శనాలు మన తాతలంతా చేశారు, మనం కూడా చేస్తాం. అవునండి. అంటే ఆకాశంలో సహస్ర చంద్ర దర్శనం అని ఉందిగా. అవునండి. అంటే మా తాతగారు ఆకాశంలో మేలిముసుగులో దాగినటువంటి చందమామను అనేక సార్లు చూశారు అని. వెయ్యి సార్లు. వెయ్యి సార్లు. ఊ. నేనన్నాను అది కాదు, దర్శన పౌర్ణమి కాదు. పౌర్ణమిని దర్శించా పౌర్ణమి దర్శనం కాదు, దర్శన పౌర్ణమి. ఆ. అది నా యందున్న illumination ని నేను చూడగలగాలి. ఊ. అది నేను ముప్పయ్యేటప్పుడు చూస్తే ఆ నేను సహస్ర చంద్రాన్ని దాటిన వాడిని అని rational గా దాని మీద వ్యాఖ్యానం చేశా. అవును. అది అట్లా ఆ తర్వాత రమణాయణం అని రాశాను. ఆ. ఇప్పుడు ఏ అవతారమూర్తి గాని, ఏ జ్ఞాని గాని లేదు ఏ వ్యక్తి గాని మామూలు మన బోటి సాధారణులను కూడా evaluate direct గా చేయలేం. By comparison and contrast ఏ చేయగలం. ఇంకోటితో పోలిస్తే తప్ప మన ఎక్కువ తక్కువ తూకం తెలియదు. కాబట్టి రమణ మహర్షి దగ్గరికి ఎవరెవరు వెళ్లారు, ఎటువంటి వాళ్ళు వెళ్లారు? ఊ. పరమహంస యోగానంద, శివానంద. వీళ్లందరికంటే ముందు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఊ. తర్వాత రామస్వామి రామదాసు. ఇలాంటి వాళ్లంతా అక్కడికి నారాయణ గురువు ఆ ఆ వీళ్లంతా అక్కడికి వెళ్లారు అంటే ఎందుకు వెళ్లారు అని ఆలోచించా. ఊ. వాళ్లకు అవసరం లేదనేది పరమహంస యోగానందకి రమణ మహర్షిని దర్శనం చేయవలసిన పని లేదు ఆయనకి. ఊ. In his own right he is a very great guru. ఊ. ఎందుకని అంటే అప్పటివరకు వాళ్ళు పొందిన అనుభూతులు సత్యమే. ఒక స్థిమితం, మనస్సు స్థిమితం చెందాలి అంటే అక్కడి దాకా వెళ్ళాలి అని వీళ్ళందరూ వెళ్లారు అనేటువంటిది అది నేను రమణాయణం, రామాయణంలో రమణుల కథలో వీళ్ళందరూ ఎలా వచ్చారు, వారు ఎలా తనను తాను ఆవిష్కరించుకున్నారు, అదంతా ఆ గ్రంథంలో చెప్పాను. అవును. తర్వాత రమణ పదం. ఊ. అసలు What is the core concept of రమణ మహర్షి? ఊ. ఆయన ఎవరితో మాట్లాడలేదట. ఊ. అని ఎవరున్నారు? ఎవరో అనుకున్నారు, అందరూ అదే అనుకున్నారు. ఊ. చాలా మాట్లాడారు. ఊ. మాట్లాడవలసినప్పుడు మాట్లాడారు. ఊ. మాట్లాడవలసినంత మాట్లాడారు. ఏది మాట్లాడితే ఆత్మోన్నతికి దారితీస్తుందో అది మాత్రమే మాట్లాడారు. ఊ. అని రమణ పదాన్ని, గిరి ప్రదక్షిణానికి ఉన్న importance ఏమిటి, మౌనం యొక్క శక్తి ఏమిటి, ఇవన్నీ ఒక ఐదు chapters ల కింద మొత్తం రమణ మహర్షి philosophy ని condense చేస్తూ అది నేను రాశాను. ఊహూ. ఇట్లా. ఊ. అదే సమయంలో ఆ మీరు చలం గారిని కూడా కలిసినట్టు ఉన్నారు కదా. ఊ అదే డెబ్బై ఆరు. ఊ. డెబ్బై ఆరులో- ఊ. చలం గారిని ఆ చూడాలని ఉండేది చిన్నప్పుడు. ఊ. ఎందుకనంటే ఒకవైపు మైదానం చదివి ఏంటి ఇలా రాశాడు అనుకునే లోగా విశ్వనాథ్ వారి చెలియలి కట్ట జవాబుగా చదివి- ఊ. సమన్వయం చేసుకొని ఈ శైలి మాత్రం పరమాద్భుతం. ఊ. చలం శైలి. ఇంత అందంగా ఎలా రాయగలడు అని ఒక ఆ adolescent age లో ఆ కొంత ఆ దాన్నేమిటంటారు భావ స్పందన ఉంటుంది. ఊ. పైగా పెద్దవాడు. ఊ. ఆయన popular personality అని నేను వెళ్ళలే. ఊ. ఆయన శైలి వల్ల, వచన శైలి చాలా గొప్పది. అవును అవును. దానికోసమని వెళ్ళాను. అప్పటికే ఆయన ఇక పరమ చరమ దశలో ఉన్నారు ఇంకా. ఊ. But ఒక one hour ఆయనతో గడిపాను. ఊ. చాలా అద్భుతమైన- ఊ. రమణి చలాంచలాల నుండి రమణాచల సానువుల్లోకి అని చలాని గురించి రాశాను. ఊ. అప్పుడే ఆయన అన్నారు "సమాజం నన్ను వెలివేసినట్టు చేసింది, ఎందుకు చేసిందో తెలీదు. నేను సమాజాన్ని మీద నా ఉక్రోషం కూడా చెప్పలేదు. ఇటువంటి సమాజంలో ఉన్నానే అని నన్ను నేను తిట్టుకున్నాను." ఆ ఆనాటి భావాలవి అని చెప్తూ ఉంటే అప్పుడు నేను interview ని అయి- ఊ. "అవును చలంగా ఉన్నప్పుడు అలాగే రాయాలి. ఇక్కడికి వచ్చి అచలమైపోయారుగా ఇప్పుడు ఇది మాట్లాడుతున్నారు" అన్నారు. చాలా ఆనందం. "దగ్గరికి రా" అని పిలిచారు పాపం. పడక కుర్చీలో పడుకున్నారు. ఊ. "పండు, పండు అయిపోయినారు" అన్నారు. ఊ. ఇలా నా చెయ్యి నొక్కుతూ "అవును చలనం చలం కావటమేగా జీవిత పరమావధి. అయినానా?" అన్నారు. It's a beautiful thing. బాగా చేశారు. ఆ. Literary Guru కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, ప్రముఖ రచయిత వి.ఎస్.ఆర్. మూర్తి గారు మనతో ఉన్నారు. ఆ మళ్ళీ మీకు భావమర్దం చిత్రంలో నీలి మేఘాల్లో పాట ఒకటి ఇష్టం. చాలా మందికి ఇష్టం, మీకెందుకు ఇష్టం చెప్పండి.నీలి మేఘాలు గాలి కెరటాలు ఇవన్నీ కూడా ఒక adolescent age లో ప్రకృతిని ఎంత రమణీయాత్మకంగా దర్శనం చేయొచ్చు చేసి మనస్సుని అమలిన శృంగారంతో ఎట్లా నింపుకోవచ్చు భావ సౌందర్యాన్ని ఎంత అలవోకగా సున్నితంగా అనుభవించవచ్చునో అది ఘంటసాల గారి కమనీయ కంఠంలో నుంచి అది జాలువారుతున్నప్పుడు ఎంత పరమాద్భుతమైన దృశ్య సాక్షాత్కార భాజకం అంటాం picturesque గా అది మన గుండె లోతులని తడిమి తడిమి తడిపి తడిపి నడిపిస్తుంది గనుక ఆ పాట నాకు చాలా ఇష్టం ఆ పాట విని మళ్ళీ మన శ్రోతలు కలిసికుందాం అండి [పాట] నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపింతునే వేళ నీలి మేఘాలలో [పాట] ఏ పూర్వ పుణ్యమో నీ కొందుగా మారి ఏ పూర్వ పుణ్యమో నీ కొందుగా మారి అపురూపమై నిలిచే నా అంతరంగనా నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపింతునే వేళ నీలి మేఘాలలో [పాట] నీ చెలిమిలో నున్నా నెత్తావి మా తురులు నీ చెలిమిలో నున్నా నెత్తావి మా తురులు నా హృదయ భారమునే మరపింపజేయు నీలి మేఘాలలో [పాట] అందుకో జాలని ఆనందమే నీవు అందుకో జాలని ఆనందమే నీవు ఎందుకో తేరువై దూరమవుతావు నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపింతునే వేళ నీలి మేఘాలలో [పాట] విఎస్ఆర్ మూర్తి గారు శంకర్ భగవత్పాదుల భజగోవిందం కావచ్చు యోగతారావలి అవి రాశారు చాలా పుస్తకాలు రాశారు అవునండి సో శంకర్ భగవత్పాదుల ఆ మార్గం గురించి కాస్త వివరించండి. శంకర భగవత్పాదులు సంభోర్ మూర్తః శరతి భువనే శంకరాచార్య రూపా ధర్మగ్లాని జరిగినప్పుడు అంటే మానవుడు తాను ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించనప్పుడు ఏదో ఒక రూపంలో నేను వస్తానని ఈ జాతి నమ్ముతుంది ఇది భారతీయ ఆత్మ ఉమ్ ఒక మతం వచ్చి నిరీశ్వరవాదానికి దారితీసినప్పుడు భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో శంకర భగవత్పాదులు ఈ ప్రపంచంలోకి వచ్చారు. ఒక ప్రమాణం ఏమిటంటే వాయు పురాణంలో నలుగురు శిష్యులతో ఒక పరాశక్తి ఈ ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ భారతీయమైనటువంటి వాంగ్మయాన్ని ప్రపంచానికి సనాతన ధర్మ రూపంలో అనుగ్రహిస్తుందని ప్రమాణం ఉంది ఉమ్ దానికి అనుగుణంగా వచ్చారు అని ఒకటి ఉమ్ రెండవది వారి రచనలు చదివినప్పుడు అద్భుతమైన శృతి అద్భుతమైన లయ సంగీతం సాహిత్యం ఉమ్ కవిత్వం భావుకత భక్తి ఒక రస ప్రవాహం అది అవి నేను చదివినప్పుడు నన్ను ఆనంద పరవశం చేసినటువంటి వాంగ్మయం శంకర వాంగ్మయం తర్వాత అద్వైతం మతం కాదని అద్వైతం సిద్ధాంతం కాదని అద్వైతం అంటే మామూలుగా చెప్పేటప్పుడు రెండు లేవు ఉన్నది ఒకటే అదే అద్వైతం అని మామూలుగా చెప్తారు ఉమ్ అది కాదు అనుకున్నా అసలు రెండు లేవు అనే మాట ముందెందుకు అనాలి రెండు ఉన్నాయి అని మీ మైండ్ లో ఉందన్నమాట ఉమ్ తర్వాత కాదు అనుకుంటున్నావ్ అనమాట అసలు ఉన్నది ఒకటే అనేటువంటి ఆ భావన స్థిరమైనప్పుడు ఆ నాకు చాలా ఆనందం కలిగి సత్సంగ రూపంలో భజగోవిందాన్ని ఈవేళ సమాజానికి contemporary society కి దాన్ని దాన్నే అది కీర్తన కాదు దేవీ స్తుతి కాదుదాని వల్ల వచ్చే ఇలా ఒళ్ళో వచ్చి పడే పాపాలు ఎక్కడికి పోవు? కర్మఫలం అనుభవించాలి. మరి భజగోవిందం ఎందుకు రాశారు అంటే వైష్ణవులు అంతా ఏమన్నారంటే గోవిందుడిని భజించమని శంకరాచార్య వారు చెప్పారా నా ద్వైత కదా అన్నారు. కాదు. భజ అంటే స్మరించు. ఉమ్ గోవింద అంటే ఎవరంటే గురువు. శంకర భగవత్పాదుల గురువు ఎవరంటే గోవింద భగవత్పాదులు. ఉమ్ ఆయనను మకుటంగా పెట్టుకొని వారు మానవ జీవన వికాసం, మానవ జీవన విధానం, మానవ జీవన దృక్పథం, డబ్బు, బంధువులు, స్నేహితులు ఈ ప్రపంచం యొక్క అస్తిమితత్వం వీటన్నింటినీ కూడా ఆవిష్కరిస్తూ ఒక కవితా స్వరూపంగా ఆవిష్కరించిన భజగోవిందం ఉమ్ ఎన్ని సంవత్సరాలు యు-- యుగాంతాల వరకు అది అట్లాగే ఉంటుంది. అందువల్ల అది రాశాను. శంకరులు రాసినటువంటి ఇంకొకటి యోగతారావళి. ఉమ్ అది నూట ఇరవై సంవత్సరాల తర్వాత దాని మీద సమగ్ర వ్యాఖ్యానం చేసే అవకాశం, యోగము నాకు కలిగింది. ఉమ్ ఐదు సత్సంగాలు, ఐదు రోజులు. ఉమ్ ఇరవై ఏడు శ్లోకాలలో యోగశాస్త్రం మొత్తం దాంట్లో పెట్టేశారు. ఉమ్ అద్భుతమైనటువంటి ఇవాళ యోగా-- యోగా అంటున్నామే ఈ యోగా అంతా కూడా ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్ ఇది కాదు. నేను ఈ శరీరాన్ని మాత్రమే కాదు నాలో ఉన్న అఖండ చిద్ఘనమైన ఒక ఆత్మ ఉన్నది అని వేదాంత భాషలో నేను అర్థం చేసుకున్నప్పుడు ప్రాక్టికల్గా దాన్ని నేను ఎట్లా తెలుసుకోవాలి? ఒక laboratory లాంటిది. శరీరమే laboratory. ఉమ్ అక్కడి నుంచి మొదలుపెట్టి ఈ శరీరంతో మొదలై శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎట్లా ఉంటుంది అని అర్థం చేసుకుంటూ యోగతారావళి మీద చేశాను. ఉమ్ మన కంచి ఆ స్వామి వారు అంటే విజయేంద్ర సరస్వతి స్వామి వారు యోగతారావళి చదివారు. ఆయన తెలుగు వారు. ఉమ్ చదివి ఒకరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ పన్నెండు ఒంటిగంట అవుతుంటే phone చేశారు. ఉమ్ చేసి శంకర భగవత్పాదులు ఆంధ్రదేశంలో జన్మించి ఉంటే ఉమ్ వారు తెలుగులో యోగతారావళి చెప్పి ఉంటే అది ఇట్లాగే ఉండుండేది. లేదు అండి. గొప్ప ప్రశంస సార్. చాలా. ఉమ్ అది అంటే ఒక పరమాచార్యుణ్ణి, ఒక పీఠాధిపతిని, అందిన శంకర పీఠానికి సంబంధించినటువంటి వారు. ఆ శంకర వాఙ్మయంలో ఉన్నటువంటి ఆ మార్మికత సులభ శైలిలో అంటే సులభ శైలి అంటే భావం చెప్పేటప్పుడు తూకమైన భాష లేకపోతే తేలిపోతుంది. ఉమ్ ఎవరికీ పట్టదు. భాషా భావము సమన్వయం కావాలి. దానికి తగిన భాష కావాలి. ఉమ్ అవన్నీ దైవానుగ్రహంగా అట్లా వచ్చిందని నేను అనుకుంటూ కానీ మీ భాష సరళంగానే ఉంటుంది, వచనం సరళంగానే ఉంటుంది. ఆ అప్పుడప్పుడు కొంత గుబాలింపులు ఉంటాయి. పద బంధాలు గుబాలింపులు ఉంటాయి. ఈ భాషకు సంబంధించి చేసిన కృషి ఏమిటి అసలు? దీనికి మామూలుగా ఈ ప్రశ్నకి జవాబు ఏమిటంటే తేలిగ్గా తప్పించుకునే ఒక మాట ఉందండి. ఏమో నాకు తెలియదు. [నవ్వు] అవన్నీ నేనా రాశానా? ఆ ఎవరో రాయించారు. ఇవి వ్యర్థమైన మాటలు. రాసింది నేనే. అవునా? అవును వాడిన భాష నాదే. ఇది సత్యం. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇవాళది యువత కూడా-- నేను యువకుడిగా ఉండగా ఏ పని చేశానో అది ఇవాళ యువతకు చెప్తున్నా. ఉమ్ ప్రాచీన వాఙ్మయాన్ని బాగా చదవాలండి. చదివితే భాష వస్తుంది. ఉమ్ భాషలో కొన్ని పదాలు రూపాంతరీకరణం జరగొచ్చు కాక. ఉమ్ కానీ కొన్ని కొన్ని పదాలు ఒక జాతి యొక్క ఆత్మను నిలబెడతాయి. ఉమ్ పైగా ఒక గంభీరమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు ఒక పొందికైన ఉద్ధిక-- ఉన్నటువంటి భాషను గనక వాడినట్లయితే ఆ భావం మనిషి హృదయంలోకి వెళ్తుంది. ఉమ్ మనసులోకి వెళ్ళేది జారిపోతుంది. మనసు దానికి జారే తత్వం ఉంది కదా. హృదయంలోకి వెళ్లి నిలబడ్డప్పుడు కాలాజ్యవిచ్ఛిన్నంగా శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి ఈ భాష ఇలా వాడగలగటానికి తీవ్రమైనటువంటి ఆ అధ్యయనం చేయటం ఒకటి, ఆ భాష పట్ల ఒక గౌరవం ఒకటి. ఈ-ఈ పదాలు చాలా ఇష్టమైనవి. పద లోభాలు ఉంటాయి. ఉమ్ రాసేటప్పుడు. పద ప్రలోభాన్ని కూడా దాటి పద ప్రయోగం గనక చేస్తూ వెళ్లినట్లయితే ఏం చెప్పదలచుకున్నామో దాని అభివ్యక్తి సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. కనుక నేను రాసిన వ్యాసాలు ఒకదానికొకటి పొంతన ఉండవు. subjects different. ఇప్పుడు మీరే రమణ మహర్షి. అవును ఆయన గురించి చెప్పేటప్పుడు దానికి తగినట్లే ఉండాలి. బాబా గారి గురించి చెప్పినప్పుడు అట్లా ఉండాలి. అలాగే ఇవాళ యువత కోసం వెదురు వేణువు కావాలంటే అని ఒక పుస్తకం రాశాను. రాశారు. ఉమ్ వెదురు ఒక్కరోజులో వేణువు కాదు. It's a great process. ఇవాళ మనిషి పుట్టాడు, లేచాడు, పరిగెత్తాడు, అందుకున్నాడు, రాలిపోయినాడు. కాదు. ఏ అడుగు వెయ్యాలి, అడుగు నిలదొక్కుకోవాలి. నెమ్మది నెమ్మదిగా అడుగులను సాగించాలి. తర్వాత వడివడిగా జీవితాన్ని గడపాలి. మళ్ళీ ముదిమి వయసులో మళ్ళీ it's a great retreat. ఉమ్ మళ్ళీ వెనక్కి రావాలి. It's a process. అందులో ఏ ఒక్కడూ exception కాదు అని గట్టిగా నమ్మి ఇవాళ యువత ఒక నిరాశావాదాన్ని ఉమ్ నేను అనుకున్నది ఇది జరగటం లేదు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగటం లేదు. అసలు ఆశ్చర్యం ఏంటంటే అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాని పేరు జీవితం కాదు. ఉమ్ మనం ఏది అనుకోలేదో జరిగినప్పుడు దానిని అలాగే accept చేసినప్పుడు, అంగీకరించినప్పుడు ఉమ్ తదనుగుణంగా జీవించినప్పుడు దాని పేరు జీవితం. ఇవి ఆ యువతకు అప్పజెప్పాలి అని నేను. వెదురు వేణువు కావాలి. వెదురు మొక్క పైకి రావటానికి చాలా time పడుతుంది. ఉమ్ కానీ ఒకసారి వచ్చిన తర్వాత పైకి చాలా ఎత్తు పెరిగిపోతుంది. ఎందుకని అంత time తీసుకున్నది అంటే ఇవాళ్టి భాషలో లో-- అడుగున నెట్వర్కింగ్ జరగాలి. [నవ్వు] దానికి కాండము, శాఖోపశాఖలు ఉండవు. నిటారుగా పెరుగుతుంది. అది గాలి తాకిడికి నేలమీద పడిపోకుండా ఉండాలి అంటే base బాగుండాలి. ఉమ్ కాబట్టి ఆ నెట్వర్కింగ్ జరిగేదాకా ఆ మొక్క పైకి రాదు. ఉమ్ అంతే. Literary Guru కార్యక్రమంలోఆధ్యాత్మిక శాస్త్రవేత్త ప్రముఖ రచయిత వి.ఎస్.ఆర్.మూర్తి గారు మనతో ఉన్నారు. మూర్తి గారు బాలమురళి గారిదే ఆ మరొక పాట మీకిష్టమైంది. "మౌనమనీ భాష ఓ మూగమనసా" అవును ఇది కూడా ఒక తాత్వికతతో కూడినటువంటి పాట ఇది తాత్వికత మాత్రమే కాదు బృహదారణ్యకోపనిషత్తు - ఉమ్ మనసే దైవం అని చెప్పింది. ఉమ్ అది ఒక భావనా ప్రపంచానికి ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి వ్యాఖ్యానం అది. ఈ పాటలో ఆధునిక కవి మనసు చేసే గారడి - ఉమ్ మనసు చేసే మోసం, మనసు కల్పించే అలజడి. వీటన్నింటినీ కూడా చాలా సాదృశ్యంగా అద్భుతంగా ఆవిష్కరించారు గనుక, ఏది దైవం అనుకున్నామో అది దయ్యం అని కూడా మనం దర్శనం చేయవచ్చు అని చూపించారు గనుక నాకు చాలా ఇష్టం. ఈ పాట విన్న తర్వాత మళ్లీ మనం స్వరతను కలుసుకుందాం అండి. [పాట] మౌనమే నీ భాష ఓ మూగమనసా. మౌనమే నీ భాష ఓ మూగమనసా. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు. కళ్ళలు కాగానే కన్నీరు తావు. మౌనమే నీ భాష ఓ మూగమనసా ఓ మూగమనసా. [పాట] చీకటి గుహ నీవు. చింతల చెలి నీవు. నాటక రంగానివే. మనసా తెగిన పతంగానివే. ఎందుకు వలచేవో? ఎందుకు వగచేవో? ఎందుకు రగిలేవో? ఏమై మిగిలేవో? ఎందుకు రగిలేవో? ఏమై మిగిలేవో? మౌనమే నీ భాష ఓ మూగమనసా ఓ మూగమనసా. [పాట] కోర్కెల చెలి నీవు. గురిమి వల నీవు. మూగన ఉయ్యాలవే మనసా. మాయల దయ్యానివే. లేనిది కోరేవు. ఉన్నది వదిలేవు. ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు. మౌనమే నీ భాష ఓ మూగమనసా. తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు. కళ్ళలు కాగానే కన్నీరు తావు. మౌనమే నీ భాష ఓ మూగమనసా ఓ మూగమనసా. మీరు ఆ యువతకు సంబంధించి యువతలో ఒక personality development చూడదంటే ఒక వ్యక్తిత్వ వికాసం లాంటి సంబంధించి అనేక ప్రసంగాలు మీరు చేస్తున్నారు. ఉమ్ దాంట్లో మీరు మా మీరన్నట్టు ఆ సంప్రదాయ సాహిత్యాన్ని అందులో ఉండేటువంటి కొన్ని ఆ విషయాల్ని వీరికి అర్థమయ్యే రీతిలో తీసుకొస్తున్నారు. అవును ఉపనిషత్తును కూడా మీరు - చేశాను కొంచెం పరిచయం చేశారు. చేశాను ఉపనిషత్తుల వక్స్ కొంచెం చెప్పండి ఒకసారి. దశోపనిషత్ సార సర్వస్వం అని రాశాను. ఉపనిషత్తు సుధ. ఉమ్ ఉపనిషత్తు అనంగానే, "అమ్మో! ఇది మనది కాదు ఇది. ఇది ఎవరో చదవాలి, ఎవరో చెప్పాలి." ఆ చెప్పాలి అన్నవాడు చెప్పడు. ఉ తెలుసుకుందాం అని చెప్తే నేను చదువుకో అంటాడు. అది రెండు వేల పేజీలు, మూడు వేల పేజీలు ఉంటుంది. అసలు what is the quint essence of upanishad? ఉమ్ పదే కదా! అనేక ఉపనిషత్తులను శంకర భగవత్పాదులు దశోపనిషత్తులుగా చెప్పారు. పది ఉపనిషత్తులలో ఉన్న quint essence ఏమిటి? ఆ link ఏమిటి? ఈశా కేన కఠ ఒక క్రమంలో పెట్టారు. ఉమ్ ఈశతో మొదలై బృహదారణ్యకంతో ముగుస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి పరిణామ దశ అంతా కూడా linkup చేస్తూ ఆ వ్యావహారికమైనటువంటి భాషలో - ఉమ్ నేను ఇట్లా ఎట్లాగైతే మాట్లాడుతున్నానో అలా రాశా. అది ఆ చాలా తేలికైనటువంటి భాష. ఉమ్ కానీ ఆ మూలం ఆకార గ్రంథం అంటామే - ఉమ్ మూల గ్రంథంలో ఉన్నటువంటి ఉపకథలు, ఉపనిషత్ కథలు, దాని మీద తర్కము, అదెట్లా ఇదెట్లా అవేమీ ఉండవ్. ఏముంటుందంటే, ఈశావాస్యోపనిషత్తులో ఇది ఉన్నది. ఉమ్ కేనోపనిషత్తులో ప్రశ్నించమంటుంది. కఠోపనిషత్తులో మృత్యు రహస్యం ఏమిటి? ఇట్లా ఒక్కొక్క దానిని విమరిస్తూ వెళ్లినప్పుడు అది మన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, వేటవల్ రామబ్రహ్మం గారు, తరువాత రంగ రామానుజాచార్యుల వారు, అటువంటి వారు పరమానంద భరితులైపోయారు. ఉమ్ ఎందుకంటే దశోపనిషత్తులో ఉన్నది ఇంతే అని చెప్పాలంటే ధైర్యం కావాలి. ఉమ్ ధైర్యం కావాలి అంటే నేను లోకానికి పెద్ద సేవ చేశానని అనుకోను కానీ ఆకార గ్రంథాలు మొత్తం ముందు ఒకసారి చదివా. ఇది లాభం లేదు. ఇది నా కడుపున పుట్టిన మా అమ్మాయో మా అబ్బాయికో ఇచ్చిన వాడు, "నాన్నగారు మాకు వద్దండి" అంటాడు. "మాకెందుకండీ ఇవన్నీ?" ఏదన్నా బాగా మంచి ఉద్యోగం వచ్చే చదువు చెప్పమని అడుగుతారు. కానీ ఇదన్నా చేద్దామని కేవలం చాలా తక్కువ timeలో రాశాను. అదే సార్ అవును. అదే ఉపనిషత్ సుధ. ఉహు. అలాగే మీరు చేసేటువంటి ఈ వ్యక్తిత్వ వికాస ప్రసంగాల్లో, సో యువతకి ఆ ఏ రకమైనటువంటి సందేశాలు మీరు చెప్పడం జరుగుతుంటుంది? ప్రధానమైన సందేశం ఏమిటంటే, అంటే degree level. ఉమ్ Degree level తర్వాత PG levelతర్వాత ప్రొఫెషనల్ ఉమ్ కాలేజెస్ తర్వాత ఇప్పుడు ఇన్-ఇన్ఫోటెక్, విప్రో ఇలాంటి కంపెనీస్ వీటన్నింటికీ నేను ఒక గెస్ట్ స్పీకర్ గా వెళ్లి నెవర్ ఏ రిసోర్స్ పర్సన్, గెస్ట్ స్పీకర్. ఉమ్ జీవితం పట్ల ఆశావహ దృక్పథం ఎలా ఉండాలి? అందరూ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పినప్పుడు నేను ఆ పదాన్ని విసర్జించా. ఉమ్ Personality development is a western concept. ఉమ్ నా భారతీయమైనటువంటి ఆస్పెక్ట్, కాన్సెప్ట్ ఏమిటంటే వ్యక్తిత్వ వికాసం కాదు. ఉమ్ Unfoldment ఉమ్ Personality unfoldment జరగాలి. ఉమ్ ఏది వికాసం జరుగుతుందో ఆ పరిణామం అయిపోతుంది. ఏది సంపూర్ణంగా unfold అవుతుందో development అయిపోతుంది. వికాసం ఏది జరుగుతుందో ఉండిపోతుంది. కాబట్టి "Youth shall reshape the world" ఉమ్ అని ఒక statement but with a comma, of course with the help of adults అని close చేశా. ఉహుహు అంటే ఏమిటి? ఎప్పటికప్పుడు ఈ ప్రవహించేటువంటి జనజీవనంలో youth ఎప్పుడూ కూడా constant factor అది. అవునండి And very powerful. ఇక్కడ energy ఉంది. కాలం గడిచి వచ్చిన వాడి దగ్గర experience ఉంది. ఈ energy, experience రెండూ గనక కలిస్తే అంటే the teacher and taught, the guru and sishya అంతే కదా. అవునండి ఈ రెండూ గనక అర్థం చేసుకోగలిగినట్లయితే ఈ యువత నిరాశావాదాన్ని అసలు రానివ్వకూడదు. కృష్ణశాస్త్రి గారు అంటారే "శీతవేళ రానీయకు, శిశిరానికి చోటియ్యకు" అది. అది ఒక ఆశావహ దృక్పథం. అది కేవలం కవిత్వ భాష కాదు. కాబట్టి వీటన్నింటినీ కూడా అనేకమైన western concepts లో అలాగే western philosophers దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు, అలాగే ప్రాచీన ఆంధ్ర వాఙ్మయాన్ని, తెలుగు వాఙ్మయాన్ని ఎలా చదివానో అలాగే ఇంగ్లీషులోనిది కూడా చదివినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని వర్ణించటంలో పరమాద్భుతమైన శైలి చూపించారు వాళ్ళు. Shelley గాని అవును Tennyson గాని H. W. Longfellow గాని అలాగే Shakespearean dramas గాని ఇవన్నీ చదివినప్పుడు ఏమవుతుందంటే ఒక పట్టు, ఒక అవగాహన ఏర్పడుతుంది. కానీ వాళ్ళంతా కూడా కంటికి కనిపిస్తున్న వస్తువుని, జరుగుతున్న జీవితం మీద వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఉమ్ భారతీయ వాఙ్మయం జరిగిన దానికి, జరగబోతున్న దానికి, వర్తమానానికి మూడు కాలాలని సమన్వయం చేసి విశ్వజనీనం చేశారు అని నా స్థిమితమైనటువంటి అభిప్రాయం. చాలా అందంగా, చాలా చక్కగా చెప్పారు. ఆ ఈరోజు literary guru కార్యక్రమంలో పాల్గొని తురుమెళ్ళలో మొదలైన మీ ప్రయాణాన్ని అనేక పార్శ్వాల్లో సాగింది. అటు టెక్నాలజిస్ట్ గాను, ఇటు ఆధ్యాత్మిక రచయిత గాను దాంతోపాటుగా ఎన్నో పుస్తకాలు రచించి యువతకి ఒక మార్గదర్శనం చేస్తున్నటువంటి వ్యక్తిగా మీ ప్రయాణాన్ని మాతో పంచుకున్నారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వి.ఎస్.ఆర్. మూర్తి గారు. నమస్కారం అండి. నమస్తే [outro jingle]
YouTube · audio
#LiteraryGuru
#LiteraryGuru
0:00 / 58:24