Skip to content
Transcript తెలుగు
ఇక్కడ మనస్సు హృదయంలోకి వెళుతూ ఉన్నప్పుడు లేదా వెళ్ళినప్పుడు హృదయంతో లీనమై పోతున్నప్పుడు చిన్న వెలుగు పెద్ద వెలుగుని కలిసినప్పుడు తాను పెద్ద వెలుగు అయినట్లుగా. కించిత్ మనస్సు హృదయంతో కలిసినప్పుడు అది పూర్ణ మనస్సు అవుతున్నది. మనస్సు భాష వేరు. మనసుకు ఉన్నటువంటి చలనాలు వేరు. మనసుకు ఉన్నటువంటి కదలికలు లేవు. అవన్నీ వేరు, భిన్నంగా ఉన్నాయి. పరమ పవిత్రమైనటువంటి ఒక భావనా స్థితి ఏర్పడాలి అంటే మనస్సుని హృదయ స్థానం వైపు మనం తీసుకుని వెళ్ళాలి. మనస్సు బహిర్ముఖం అయినంత కాలం మనకి నిదానం లేదు, నిశ్చింత లేదు, నిర్మలత్వం లేదు, నిలకడ లేదు, నిజానికి ఆనందం లేదు. మనస్సు అంతర్ముఖం కావటం మొదలు కాగానే హిమాలయాలకు మనం దగ్గరవుతున్నప్పుడు చల్లని పవనాలు మనకి ఎట్లాగైతే ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయో, వస్తువుకి దగ్గరగా జరుగుతూ ఉన్నప్పుడు ఒక మనస్సు ఎంత పరిమళభరితమవుతున్నదో, అది ఎంత ఆత్మానందాన్ని అనుభవిస్తున్నదో, ఆనందం అనుభూతమయ్యేటువంటి ఒక మనస్సు ఏర్పడుతున్నదో, అసలు శిశలైనటువంటి సౌందర్యాన్ని చూడటం అలవాటు చేసుకుంటున్న మనస్సుగా అది ఎప్పుడో మారిపోతున్నదో, అది చూడటం నుంచి మనం దర్శనం వైపు వెళతాం. ఇది దర్శనానుభూతి. దర్శనానుభూతి లో నుంచి దర్శనం అయ్యాక ఏమవుతుంది అని. ఏమవుతుంది అంటే భగవాన్ రమణ మహర్షి జీవితమే మనకి గొప్ప ఉదాహరణ. పదహారు, పదిహేడు సంవత్సరాల మధ్య కాలంలో వయస్సులో తాను పొందినటువంటి ఆత్మానుభూతిని, ఒక అనుభవాన్ని యాభై నాలుగేళ్ల పాటు పాంచభౌతికమైనటువంటి దేహంలో నిలబెట్టుకోవటం ఇది అధ్యాత్మ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఇంతకు ముందు జరగలేదు, తెలియదు. జరుగుతుందా అంటే జరిగితే మంచిదే. ఇప్పటివరకు జరగలేదు. దైనందినమైనటువంటి అనేక కార్యకలాపాల్లో తాము నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా ఒక ఆశ్రమ ధర్మాన్ని, ఒక సాంఘిక ధర్మాన్ని, ఒక సనాతన ధర్మాన్ని అతిక్రమించకుండా భగవాన్ జ్ఞానాన్ని బోధించారు. బోధించారు అంటే వారు ఉపన్యాసం ఇచ్చారని కాదు. ప్రవచనంతో మనల్ని పరిగెత్తించారని కాదు. మనస్సును నిలకడ చేసేటువంటి అనేక ప్రక్రియలు తమ దివ్య జీవన విధానం ద్వారా మనకు చూపించారు. రమణాశ్రమంలో ఒకసారి భక్తులంతా ఒక రాత్రిపూట భోజనానంతరం భగవాన్ చుట్టూ చేరి కూర్చొని, అందులో ఒకాయన లేచి "భగవాన్ దక్షిణామూర్తి స్తోత్రంలో దక్షిణామూర్తి యొక్క అనుభవం, అనుభూతి అది అసలు నిజానికి ఏమిటి? పెద్ద చెట్టు ఉందన్నారు, యువకుడైన శిష్యుడు కూర్చుని ఉన్నాడన్నారు, వృద్ధులైన జ్ఞానులైనటువంటి వారంతా శిష్యులై కూర్చున్నారు, గురువుగారు యువకుడు, శిష్యులు జ్ఞాన వృద్ధులు. ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. దాని మీద వ్యాఖ్యానం ఏమిటి?" అని అడిగారు. అలా మామూలుగా గనక అయితే విశ్వం దర్పణ దృశ్యమానంతో మొదలుపెట్టి తొమ్మిది శ్లోకాలు మనం గడగడా చదివేసి మనం కంగారు పెట్టతం, కంగారు పడతాం. భగవాన్ జ్ఞాని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాని ఏమంటున్నారు? ఏమీ అనలేదు. దక్షిణామూర్తి అనగానే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం కదా! మరి రమణలు కూడా మౌనవ్యాఖ్య చేయాలి. మౌనంతో వ్యాఖ్య ఎలా చేయటం అని, చూపుతో మంత్రం లేకుండా దీక్ష ఇవ్వటం ఎట్లా అని, రెండూ భగవాన్ జీవితంలో జరిగినయి. మౌనం ద్వారా సమస్త సంశయాలు పటాపంచలు చేశారు. ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఇస్తూనే వెళ్లారు. ఆయనకు మాటలతో పనిలేదు. తమ హృదయాన్ని అడుగుతున్న వాడి హృదయంతో అనుసంధానం చేశారు. కనుకనే సమస్యలు, సంశయాలు సమసిపోయి సర్వానందమయమైనటువంటి ఒకానొక స్థితి సాధకుడి యందు ఏర్పడింది. అది మౌనవ్యాఖ్య. అలాగే సమూహంలో ఎందరో ఎన్నెన్ని రకాలుగానో భగవాన్ కరుణని, అనుగ్రహాన్ని కోరుకుంటున్నప్పుడు వారు చేయెత్తి దీవించలేదు, నేనున్నానన్న అభయం ఇవ్వలేదు, నేను అనే శబ్దం వాడలేదు, పైగా వాళ్ళకేం ప్రబోధం చేయలేదు. కరుణాపూర్ణమైనటువంటి, కరుణాంచితమైనటువంటి, కరుణార్ద్రమైనటువంటి తమ దివ్యమైనటువంటి చూపులు బారులు కట్టి, కట్టించి సాధకుడి వైపు నిర్నిమేషంగా అంటే రెప్ప వాల్చకుండా వారు అనుగ్రహాన్ని ప్రసారం చేసినప్పుడు సాధకుడికి ఆనందం కలిగింది. ఇది వీక్షణ దీక్ష. మాటతో పనేముంది? మీనాక్షి వలె ఒక చేప తన గుడ్లను దూరం నుంచి ఎట్లా పొదిగి అవి పిల్లలయ్యే దాకా కరుణని, మమకారాన్ని ఎట్లా ప్రసారం చేసిందో, భగవాన్ ఒక విశాలాక్షి వలె, వీణాక్షి వలె దివ్యమైనటువంటి తమ అనుగ్రహాన్ని, కరుణని వీక్షణ ద్వారా ప్రసారం చేసి భక్త హృదయాలకిఒక సమాధానాన్ని ఇచ్చారు. అలాగే రోజున ఎవరైతే దక్షిణామూర్తి యొక్క తత్వం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు వారు ఉపన్యసించకుండా, మాట్లాడకుండా [దగ్గిన శబ్దం] ఒక్క శబ్దం కూడా చేయకుండా వారు ఉండిపోయారు. వారు ఉండిపోవటం కాదు అక్కడ ఉన్న వారందరినీ స్థితిలో ఉంచేశారు. నిజానికి అది ఏదో కొన్ని సెకన్లో కొన్ని క్షణాల్లో కొన్ని నిమిషాల్లో కాదు. కొన్ని గంటలపాటు దక్షిణామూర్తి తత్వంలో అంటే దక్షిణము అమూర్తమైనటువంటి తత్వంలో ఒక భావ శూన్య స్థితిలోకి ఉన్న వారందరినీ తీసుకుని వెళ్లారు. తీసుకుని ఎలా వెళ్లారంటే, మీరందరూ వెళ్ళండి అనలా వారు ముందు వెళ్లారు. వారు తమను తాము స్థితిలో నిలకడ చెందించుకొని సంస్థితులై తమ చుట్టూ ఉన్న వారందరినీ కూడా స్థితిలోకి తీసుకుని వెళ్లారు కనుక, అభేదమైనటువంటి స్థితిని ఒక భావ శూన్య స్థితిని వరదానం చేశారు. అంటే నిజమైనటువంటి జ్ఞాని మాట్లాడవలసిన పని లేదు. జ్ఞాని యొక్క ఆవరణం, జ్ఞాని యొక్క సన్నిధి, వారి సన్నిధానం, వారి అనుగ్రహం ప్రసరించినంత మేర ఒక శాంతము, ఒక కరుణ, ఒక ఆనందం, ఒక వైరాగ్యం, ఒక అనుభూతి తద్వారా ఒక విభూతి వాటంతట అవే క్రమంగా ఏర్పడతాయి గనుక. విజ్ఞాని ఆలోచనను రేకెత్తించగలడు లేదా పదును ఎక్కించగలడు లేదా మన ఆలోచనలని confirm చేయగలడు. జ్ఞాని ఇవేం చేయడు. మళ్ళీ మనకి కావలసినటువంటి సమాధానాన్ని ఒక రసోత్పత్తి చేసి మనస్సుని హృదయం దాకా వెళ్ళింది కదా అమృత భావనామయం చేసి ఒక యాదార్ధికమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తాడు. అంటే He makes an understand the reality He makes us indeed He doesn't give us. ఆయన ఇవ్వరు. మనం తెచ్చుకునే స్థితిని శక్తిని సన్నివేశాన్ని సందర్భాన్ని సంఘటనని తాను సృష్టించి తాను మిన్నకుంటాడు, ఊరుకుంటాడు. ఊరక ఉండగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి భగవాన్ రమణులు ప్రతిపాదన చేస్తూ, వస్తువుని చూట్టం ఆపండి తగ్గించుకోండి. ఆపితే ప్రయోజనం లేదు మళ్ళీ పని జరగదు. వస్తువుని చూడాలి, వస్తువుని తాకాలి, వస్తువుని తెచ్చుకోవాలి, దైనందిన కార్యక్రమం సాగిపోతూ ఉండాలి. భగవాన్ కూడా అవసరమైనప్పుడు మాట్లాడారు, విస్తళ్ళు గుట్టారు, పిండి రుబ్బారు, తన బట్టలు తానే ఉతుక్కున్నారు, అందరితో కలిసి భోంచేశారు. చిన్న ఉదాహరణ, శాంతమ్మ అని ఒక వంట ఆమె. వంట గదిలో కొన్న ఏళ్ళు వంట చేసింది భక్తులందరికీ భగవాన్ కి కూడా. భగవాన్ ఏకాంతంలో భోంచేసే అలవాటు ఆయనకి లేదు. అందరితో పాటు కూర్చొని భోంచేసేవారు. శాంతమ్మ ఆలోచిస్తుంది. నా జీవితం అంతా ఇంకా ఇంతేనా? ఎలాగైనా భగవాన్ ని అడగాలి. మరి నాక్కూడా ముక్తి కావాలి. నాక్కూడా అనేక విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అవేవీ లేకుండా తెల్లవార్లు పొద్దుగూకులు వంట చేయటం, పెట్టడమేనా, వడ్డించడమేనా? అని ఒక ఆలోచన కలిగింది. ఇవాళ ఎలాగైనా సరే భగవాన్ ని పట్టుకోవాలి, అడగాలి అనుకుంది. సమయం ఆసన్నమైంది. రోజున భగవాన్ అందరికంటే చివరగా చేయి కడుక్కోటానికి వెళ్లారు. సమయంలో శాంతమ్మ ధైర్యం చేసి కాస్త దూరంగానే నిలబడి చనువు తీసుకుని, "భగవాన్ ఒక చిన్న విన్నపం." "ఏమ్మా ఏమి?" "ఏం లేదు భక్తులందరూ మన భోజనశాలలోకి వచ్చి, ఇవాళ భగవాన్ ఇది చెప్పారు, అది చెప్పారు, ఏదో అద్భుతం చేశారు, అద్భుతం చేశారు, ఎంత హాయిగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో అని ఇవన్నీ వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు, అనేకమైనటువంటి విషయాలు, అధ్యాత్మ విషయాలు భగవాన్ ఇవాళ పరిష్కారం చేస్తూ కాసేపు మాట్లాడారు అని ఇవన్నీ వింటున్నప్పుడు, భగవాన్ నా జీవితం ఇంకా ఇంతేనా? ముప్పై రెండేళ్ళు గడిచిపోయింది ఇక్కడ. ఇట్లా వంట చేస్తూనే నా జీవితం నేను ముగించుకోవాలా? నా పరిస్థితి, నా స్థితి ఏమిటి?" అని విన్నవించుకున్నప్పుడు భగవాన్ క్షణం ఆగకుండా ఒక్క మాట అన్నారు. "శాంతమ్మ విచారించకు." ఎందుకంటే అక్కడ భగవాన్ దగ్గర కూర్చున్న వారందరి మనస్సులు ఏమంటున్నాయి అంటే, ఇవాళ శాంతమ్మ వంట చేసిందో, పిండివంట చేసిందో, భోజనాలకి సమయం ఎప్పుడవుతుందో అనుకుంటూ వాళ్ళ మనస్సంతా భోజనశాల మీద ఉంది. తాము చేయబోయే భోజనం మీద ఉంది. తాము తినబోయే పిండివంటల చుట్టూ ఊహలు అల్లుకుంటున్నాయి. ఇక నీ సంగత? నీ కర్తవ్య నిర్వహణలో నీవు వంట చేస్తున్నా, నీ మనసంతా ఇవాళ భగవాన్ ఏం చెప్పారు, భగవాన్ ఏం చేశారు, నేను చేస్తున్నటువంటి భోజనం భగవాన్ కి భక్తులకి తృప్తి కలిగించే రుచికరంగా ఉంటుందా ఉండదా, రీతి ఏమిటి అంటూ నీ ఆలోచనలన్నీ భగవాన్ మీద ఉన్నాయి. వారి ఆలోచనలన్నీ భోజనం మీద ఉన్నాయి. ఆలోచించుకో అన్నారు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -31

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -31

Source: TFC Spiritual on YouTube

0:00 / 13:25

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

    Now playing
  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77