Skip to content
Transcript తెలుగు
ఓం నమో వెంకటేశాయ! కలియుగంలో పరమేశ్వరుడు అనేకమైనటువంటి అంశ రూపాలలో వస్తే జగజ్జనని కోటి సూర్యమండల మధ్యస్త అయినటువంటి మహా త్రిపురసుందరి దేవి. కలియుగనికి అధిష్టాన పరదైవతమై తల్లియై లాలించి పాలించి లాలపోసి లాలి చేసి జగత్తుని ఒక్కసారిగా మాతృ స్థానీయమైనటువంటి ఒక పరమాద్భుత సన్నివేశంలో నిలిపేటువంటి ఒక సన్మంగళ వేళ ఇది. ఇవాళ ఎవరు అమ్మవారు? కనిపిస్తున్నటువంటి మహాలక్ష్మి మూలస్థితి ఏమిటి? కలియుగంలో అని గనక విచారణ చేసినట్లయితే, బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి లలితా సహస్ర నామంలో అమ్మవారు భువనేశ్వరీ దేవిగా మనకు దర్శనం ఇస్తుంది. ఒక అనుభవాన్నిస్తుంది. అందుకనే అమ్మవారు కాలంలో భువనేశ్వరీ దేవి అవుతున్నది. భువనేశ్వరీ దేవి అంటే భువనమునకు ఈశ్వరీ. భువనం అంటే జగత్తు. భువనంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటికి, ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి అమ్మ ఇచ్ఛ, జ్ఞాన, క్రియ మూడు శక్తులు. ముందు ఇచ్ఛ ఆపై క్రియ కడగా జ్ఞాన. మూడు శక్తులు ఏకంగాక అయినట్లయితే అది శక్తి త్రిపుటి అన్నాం. నిన్న మొన్న గడిచిపోయినటువంటి కార్తీక మాసం ఒక రకంగా శివ మాసం లేదా త్రిపురాంతకుడి మాసం మరొక కోణంలో విష్ణు మాసం అది దామోదర మాసం, కార్తికేయ మాసం లేదా స్కంద మాసం. కానీ వీటన్నింటికీ మూలమైనటువంటి శక్తి మాసం. మార్గశిర మాసం అంతా కూడా అమ్మవారి యొక్క జ్ఞానము మనందరికీ కూడా అమ్మవారు మనకు అనుగ్రహ ప్రదానం చేస్తుంది. అందుకనే జగజ్జనానంద కరీం జయాక్షాం యశస్విని యంత సుయజ్ఞయోనిం జతా మితా మిత్ర కృత ప్రపంచాం అని మనం అమ్మవారిని భజామహే శ్రీ భువనేశ్వరీం తాం అంటాం. అంటే తల్లి! అమ్మా! కలికాలం అంతా కూడా నీ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఏదైతే ఉన్నదో మాకు శత్రువులు లేని లోకాన్ని సర్వ ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి నీ దయచేత మేము పొందగలుగుతున్నాము అటువంటి భువనేశ్వరీ దేవికి మేము నమస్కరిస్తున్నాము అని దివ్యమైనటువంటి భావన. అయితే భువనేశ్వరీ మంత్రం మూలమంత్రం గనక అయినట్లయితే అమ్మవారు నిజానికి లలితా సహస్ర నామంలో ఒక అతి కీలకమైనటువంటి ఒకానొక సన్నివేశం మనం గమనించినట్లయితే రాజరాజార్చిత రాజ్ఞి రమ్యా రాజీవ లోచని రంజని రమణి రశ్యా రణత్కింకిణి మేఖలా అంటూ మనం అమ్మని ఉపాసన చేస్తాం. అంటే ఇది భువనేశ్వరీ మంత్రానికి ఒక సమగ్రమైనటువంటి వ్యాఖ్యానం. లలితా స్వరూపిణి, భువనేశ్వరీ స్వరూపిణి, శ్రీమహాలక్ష్మి స్వరూపిణి, పద్మావతి దేవిగా భాసిస్తున్నటువంటి అమ్మని అనేక కోణాలలో మనం దర్శనం చేసుకోవలసిన ఒక అవసరం ఉన్నది కాబట్టి రాజరాజార్చిత అంటే కుబేరుడు, ఇంద్రుడు, అగస్త్యుడు, లోపాముద్ర, పరమశివుడు, శ్రీమహావిష్ణువు తదాదిగా కలిగినటువంటి అంటే బ్రహ్మాది దేవతలందరూ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది తలతలవారేటువంటి మంగళకరమైనటువంటి సన్నివేశంలో జగత్తుని వారువారు సృష్టి స్థితి లయ అనబడేటువంటి మూడు స్థితులలో సంచారం చేస్తూ ప్రపంచానికి మార్గోపదేశనము, ప్రపంచాన్ని శక్తిమంతము చేసేటువంటి దిశగా అమ్మవారి యొక్క అనుగ్రహం కొనసాగుతుంది. అందుకనే రాజరాజేశ్వరి అంటే రాజులకు రాజు ఎవరు అంటే ఈశ్వరుడే రాజు. ఈశ్వరుడి మరొక పేరు కామేశ్వరుడు. కామేశ్వరుడి యొక్క పత్ని కామేశ్వరి అవుతున్నది గనుక ఈశ్వర ఈశ్వరీ భావంతో శివశక్త్యాత్మకమైనటువంటి భావంతో ఒక పూర్ణమైనటువంటి స్థితిని కల్పిస్తూ మహా భక్తులందరూ కూడా అమ్మవారిని రాజరాజార్చిత అనబడేటువంటి నామంతో, భావంతో మనం కొలుచుకోవాలి, తలచుకోవాలి. అలాగే రాజ్ఞి అంటే మహారాణి అని అర్థం. సర్వ సృష్టికి కనిపిస్తున్న పదమూడు భవనాలకి అనుభూతిమయమైనటువంటి పధ్నాలుగవ కింపురుషు లోకం ఏదైతే ఉన్నదో అది స్పర్శా లోకంగా మనం భావన చేస్తాం. అంటే పధ్నాలుగు లోకాలు మనతో పాటుగా నిలకడ చెంది ఉన్నాయి. పధ్నాలుగు లోకాలకి కూడా అమ్మవారు మహారాణి అవుతున్నది. కంటికి కనిపించినా, కనిపించకపోయినా సర్వ జగత్తుని కూడా ఒక ఆధారభూతమైనటువంటి స్థితిలో, ఒక అద్భుతమైనటువంటి స్థాయిలో జీవుడు చైతన్యాన్ని పదే పదే పెంచుతూ.విస్తృతం చేస్తూ విశాలం చేస్తూ ఉద్దీపనం చేస్తూ ప్రచోదితం చేస్తూ ప్రదీప్తమైనటువంటి ఒక భావనలో మనల్ని నడిపిస్తుంది గనుక ఆమె రాణి అయినది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ఒక్క మాట అంటారు. అమ్మా! ఆకాశంలో సూర్యుడు వెలిగిపోతున్నాడు. ఆదిత్య కిరణాలన్నీ కూడా భూమిని సస్యశ్యామలం చేస్తున్నాయి, హరితవనంగా మారుస్తున్నాయి. నిద్రాణమైనటువంటి జాగృతి చేసేటువంటి చైతన్య స్థాయికి జీవులందరినీ కూడా తీసుకుని వెళుతున్నాయి. కనుక తల్లీ! నీవు మహా త్రిపురసుందరి దేవివి, కోటి సూర్యమండల మధ్యస్తవి గనుక నీకు కవిత్వంతో నీరాజనం చెప్పనా, విశ్లేషణతో నీరాజనం చెప్పనా, భావావేశంతో చెప్పనా, నేను ఎట్లా నీకు నీరాజనం ఇతను తల్లీ? సూర్యుడు ముందు ఎట్లాగైనా ఒక దీపం వెలిగించి ఇదిగో నీకు హారతి అని ఇవ్వగలనా? నీ ముందు దీపం వెలిగించగలనా? అంటారు. వినయవినమ్రతమైనటువంటి ఒక భావనతో శంకర భగవత్పాదులు, వా-- అటువంటి పరివ్రాజకులు అద్వైతమూర్తి "శంభోర్ మూర్తి శరతి భువనే శంకరాచార్య రూపా" అని జగత్తు చేత కీర్తింపబడినటువంటి, రుద్రాంశతో వచ్చినటువంటి శంకర భగవత్పాదులు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. ఆయనే ఇంత వినయంగా అంటుంటే అమ్మవారి గురించి నేను ఇవన్నీ చెప్పగలను, మీరు ఇవన్నీ వినగలరు అని చెప్పడానికి జీవుడికి అంత సామర్థ్యం లేదు గనుక సర్వ దేవతల, సర్వ గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన యందు ప్రవాహవేగంగా ఉండుగాక. అంటే రాణి లేదా మహారాణిగా పిలవబడుతున్నటువంటి అమ్మవారు అజీవ లోచన అంటే చక్కగా విచ్చుకున్నటువంటి తామరపువ్వు వంటి కన్నులు గలదాన అని ఒక కవితా భావన అయినట్లయితే అసలు ఏది అంటే తాబేలు వలె నెమ్మదిగా నిస్తంద్ర మంద్రంగా కామాక్షి వలె విశాలాక్షి వలె మీనాక్షి వలె సర్వ జగత్తుని తన చూపు చేత విశాలమైనటువంటి ఒక మాతృభావన చేత కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షంగా కల్పవల్లిగా తల్లి మనకు దర్శనం ఇస్తున్నది. అందుకనే రాజరాజార్చిత రాణి రాజీవ లోచన రంజని అంటే రంజనం చేస్తున్నది. అమ్మని తలుచుకున్నట్లయితే లోపల ఉన్నటువంటి యోగ నాడులు, రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులు మనకు కనిపించి మన అనుభవంలోకి వచ్చే డెబ్బై రెండు వేల నాడులు, అవన్నీ కూడా ఉద్దీపనం చెంది చైతన్య ప్రవాహమై పులకాంకుర ప్రకారం అవుతూ ఉంటాయి. విశాలమైనటువంటి ప్రపంచం అంతా కూడా పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహానికి పాత్రమైనటువంటి వేళ గనుక దీన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవలసినటువంటి ఒక సమయం ఉన్నది. అందుకనే రంజని మనస్సుని రంజింపజేస్తుంది. మనస్సుని రంజింపజేయగలిగినది అమ్మ యొక్క దివ్య సౌందర్యం. అందం వేరు, సౌందర్యం వేరు. అందం అంతా కూడా ఇంద్రియాలను రెచ్చగొడుతుంది. సౌందర్యం ధమాన్ని, క్షమాన్ని ఇంద్రియాల యొక్క సమస్థితిని మనకి అనుభవంలోకి తెస్తుంది గనుక ఆమె రంజని అవుతున్నది. అలాగే రమణి, రమణి అంటే రాశీభూతమైనటువంటి ఒక పూర్ణమైనటువంటి సౌందర్య స్వరూపమే రమణి అవుతున్నది. రమణి యొక్క స్వరూపం, రమణి యొక్క స్వభావం, రమణి యొక్క గుణాత్మకమైనటువంటి ఒక అవిశేషమైనటువంటి ఒక భావనా చాతుర్యం, ఇవన్నీ గనుక విచారణ చేసినట్లయితే అమ్మవారు మనందరికీ కూడా ఒక రమణీయమైనటువంటి స్థాయిలో, స్మరణీయమైనటువంటి భావనలో, వర్ణనీయమైనటువంటి స్థితిలో సర్వ జగత్తుని కూడా హాయిగా నడిపిస్తూ ఉంటుంది గనుక రంజని, రమణి, రస్యా. రస్యా, రసో వై సః. ఈశ్వరుడికి పేరేమిటి, ఈశ్వరుడికి రూపం ఏమిటి, జగజ్జనుని అయినటువంటి అమ్మవారికి రూపం ఏమిటంటే సరస్వతీదేవి ఆమె, ఇదిగో మహాలక్ష్మి ఆమె, అట్లాగే పార్వతీదేవి ఆమె. మూడు తల్లులు, ముగ్గురు తల్లులుగా మనం భావన చేసేటువంటి ముగ్గురు తల్లుల యొక్క మూలము ఏదైతే ఉన్నదో అది జగజ్జనుని అయినటువంటి భువనేశ్వరిగా కలియుగంలో, కలికాలంలో, మన కాలంలో మనకి ఒక ఆవిష్కరణ జరుగుతున్నటువంటి వేళ అమ్మ యొక్క దివ్యానుగ్రహం మనకు లభించే విధంగా రసో వై సః అనేదే రస్యా అవుతున్నది. రూపం లేదు. నువ్వు రూపంలో తలుచుకో ఆనందాన్నిస్తుంది. భావంతో తన్మయీభావంతో మనస్సు గనుక అమ్మవారి యొక్క దివ్య శ్రీ చరణాల యందు లగ్నం చేసినట్లయితే మనకు తెలియకుండానే ఒక ఆనంద అతిశయ రేఖ మన యందు పొడగట్టి మనకు మహదానందాన్ని ఒక ఐశ్వర్య విభూతిగా అనుగ్రహ వర్దానం చేస్తుంది. తర్వాత కడగా రణత్ కింకిణి మేఖలా. రణత్ అదే రణరంగం, యుద్ధం, సంగ్రామం. కింకిణి మేఖలా. మేఖలా అంటే వడ్డాణం. అమ్మవారు ఒక వడ్డాణం ధరించి ఉంటుందట. వడ్డాణం ధరించి ఆమె సంయమనంతో, పరమశాంతమైనటువంటి సహృదయంతో, దివ్య భావనా గరిమతో, చల్లని చూపులతో, సౌందర్యాతిశయంతో, పరమానందాన్ని ఇచ్చేటువంటి ఒక స్థాయిలో అమ్మవారుంటే ఆమె కనులన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే భువన సంచారం చేస్తున్న మనబోటి జీవుల యందున్నది. అమ్మ ఆలోచనలు, అమ్మ భావనలు, అమ్మ తలపులు, అమ్మ తత్వ విచారణలు జీవుడి యొక్క మనస్సు రాగరంజితం అవుతుందో, ఎక్కడ మనస్సు ఏకీకృతం అవుతుందో, ఎక్కడ చిత్తైకాగ్ర స్థితి కలుగుతుందో అటువంటి మహత్తరమైనటువంటి దివ్య భావనా భూమికలో జీవుడు గనుక తన ప్రాణాన్నితన చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో గనుక విలీనం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది అని విచారణ గనుక చేసినట్లయితే మనం శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మన ఆత్మ అనబడేటువంటి ఒక చిన్న మువ్వని ఆమె అంటే గజ్జ నెమ్మదిగా తీసుకుని తన వడ్డాణంలో మేఖలలో రణత్కింకిణి మేఖలా ఆమె మనస్సు ఆనందతాండవం చేస్తుంది అంటే ఏమిటి తల్లికి ఆనందం కలిగించేటువంటి రీతిలో తనయులు తనయులు ఉండాలి అని చెప్తున్నది ఇది మనం లలితా సహస్ర నామంలో భువనేశ్వరి మంత్రానికి ఇది నిజానికి ఒక వ్యాఖ్యానం వ్యాఖ్యానాన్ని శంకర భగవత్పాదులు దయ దేవీ తత్వంగా దేవీ సౌందర్యంగా దేవీ భావనగా ఒక విశాలమైనటువంటి మాతృ స్థితిని ప్రపంచానికి పరిచయం చేస్తూ జగజ్జనని అయినటువంటి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం మనందరి యందు కలుగు గాక అని మంగళాశాసనం చేస్తారు చివర్లో కనుక ఇది ఇందాక అనుకున్నట్లుగా ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తుల యొక్క త్రిపుటి అని అనుకున్నాం ఇచ్ఛాశక్తి ఉండాలి జీవితంలో మనం ఏదన్నా పని చేయాలి ఇది సాధించాలి అంటే ముందు మనం బలంగా ఉండాలి మనం సంకల్పించుకోవాలి అమ్మవారి అనుగ్రహం అన్నివేళలా ఉంటుంది ఎందుకంటే అనుగ్రహం అర్హతను బట్టి తాపత్రయాన్ని బట్టి తప్తమైనటువంటి భక్తి తప్తమైనటువంటి హృదయాన్ని బట్టి సమర్పణ శరణాగతి వినయము అన్నటువంటి మూడు భావనలను బట్టి అమ్మ యొక్క అనుగ్రహం మన యందు ప్రవేశించి మన సంకల్పాలు ద్విగుణీకృతము త్రిగుణీకృతము అవుతూ అవుతూ అవి బలపడి చిన్న ఆలోచనగా మొదలైనటువంటి ఒక భావన చివరికి ఒక తపస్సుగా తమస్సంహారకారిణిగా అమ్మ మన యందు ప్రవేశించి మనకు ఒక చైతన్య స్ఫూర్తిని కలిగిస్తుంది గనుక ఇచ్ఛాశక్తి కావాలి ఇచ్ఛాశక్తి ఎవరికి ఉన్నది అంటే మానవ జన్మ ఎత్తినటువంటి మానవుడికి మాత్రమే ఉన్నది ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు మనతో పాటు కలిసి ఉన్న అందులో పరమోత్కృష్టము మాధవ సన్నిహితము మాధవ సమానము అయినటువంటి మానవ జన్మ పరమ చరమమైనటువంటి జన్మ గనుక నిత్యానుష్ఠానంతో నిత్య భావనతో నిత్య పూజతో నిత్య తలపులతో మానవుడు తన జీవితాన్ని దైవీమయం చేసుకోవాలి దైవీమయం చేయాలి అంటే మనస్సును ముందు మానవీయం చేయాలి మానవత్వాన్ని దాని దాని నిండా నింపుకోవాలి ఒక పరిమళాన్ని సమకూర్చాలి దివ్యమైనటువంటి పరిమళ భావనే నెమ్మది నెమ్మదిగా మానవత్వం గనుక పండు అయినట్లయితే మాధవత్వం ఇంకా మాగినటువంటి పండుగా మనం భావన చేయాలి మాధవత్వానికి మానవత్వానికి ఉన్న దూరం ఎంతంటే చాలా దారపు పొగంత సన్నటి రేఖ దీన్ని దాటడం కోసమే మనకి మహోత్కృష్టమైనటువంటి జన్మ ఇవ్వబడింది అందుకనే మానవ శబ్దానికి అర్థం ఏముందంటే మా కాదు నవ కొత్త నువ్వు కొత్త వాడివి కాదు నువ్వు సనాతనుడివి సనాతనుడివి సనూతనుడిగా కనిపిస్తున్నావ్ నువ్వు ఎప్పటి వాడివో నేను ఎప్పటి వాడినో అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ జగజ్జనని అయినటువంటి అమ్మ ఇటువంటి మహత్పూర్ణమైనటువంటి ఉపాసనా మూర్తులందరికీ మూలమైనది గనుక జగజ్జనానందకరీం జగత్తుకి జనానికి ఆనందం ఇచ్చేటువంటిది ఎవరు అంటే అమ్మవారు గనుక జయాఖ్యాం ఆమెకి ఇంకో పేరు ఉంది భువనేశ్వరి ఒక పేరైతే పద్మావతి దేవి మరొక పేరైతే ఇదిగో రమాదేవి మరొక పేరైతే శ్రీమహాలక్ష్మి ఇంకొకటి అయితే పార్వతి ఇంకో పేరైతే సరస్వతీదేవి భారతి ఇవన్నీ మరొక పేరు అయినట్లయితే ఆమె అసలు పేరు ఏమిటయ్యా కలిగి గలను అంటే జయాఖ్యాం జయ అనేటువంటి పేరుతో ఉంటుంది జయ అంటే అన్నివేళలా విజేతలం కావాలి ఎవరు విజేత అని ప్రశ్నించుకున్నట్లయితే ప్రపంచాన్ని జయించిన వాడు విజేత కాడు తనను తాను జయించినటువంటి వాడు విజేత అవుతున్నాడు తనను తాను జయించినటువంటి విజేత క్షమదమాదుల చేత స్వీయ సంస్కరణ చేత సంస్కార భావం చేత పరిపూర్ణమైనటువంటి మానవత్వం చేత పరిమళించిన మాధవత్వం చేత అనుభవ సిద్ధమైనటువంటి ఒక దివ్య భావనలో నుంచి మానవుని యందు ఉన్నటువంటి మానవత్వం పిలుపుకి మాధవత్వం వైపు అడుగు వేస్తుంది గనుక సహజంగా మానవుడిలో ఉండేటువంటి నాలుగు పర్శ్వాలు తడిమినట్లయితే ఈవేళ అమ్మవారు ఇచ్ఛాశక్తి ద్వారా మూడు విషయాలు ఒకటి మానవత్వం రెండవది మనం అనుకున్నట్లుగా మాధవత్వం రెండింటికంటే ముందు మన యందు దానవత్వము దీనత్వము కూడా ఉన్నాయి దానవత్వము తమస్సుకి అంటే అజ్ఞానానికి అవిద్యకి అనాచారానికి అస్పష్టతకి అహంకారానికి సంకేతం గనుక అయినట్లయితే వీటి అన్నింటినీ కూడా సమసింపజేయగలిగినటువంటి ఒక కోరికను మనం అమ్మవారి యందు అమ్మవారి ముందు మనం ప్రవేశపెట్టాలి అమ్మకు నివేదన చేసుకోవాలి నా అహంకారం మమకారాలు తగ్గించు తల్లీ ఇదిగో ఇవి నాకు రెండు జీవ లక్షణాలుగా ఉన్నాయి రెండు జీవ లక్షణాలు దాటి పూర్ణమైనటువంటి మానవత్వాన్ని నేను అనుభవించేటువంటి ఒక హృదయాన్ని నాకు ప్రసాదించవమ్మా హృద్గూహని తెరవవమ్మా అని అడగగలగాలి అటువంటి భావన అది ఇచ్ఛ ఇచ్ఛ సప్త జ్ఞాన భూమికలలో మొట్టమొదటిదైనటువంటి శుభేచ్ఛ కాబట్టి శుభేచ్ఛకు యొక్క సంకేతం ఏమిటంటే సమస్త లోకాః సుఖినో భవంతు కనిపిస్తున్న కనిపించని అనుభవానికి గురైన అనుభూతి చందించుకున్నటువంటి సమస్త లోకముల యందు ఉన్నటువంటి సమస్త ప్రాణికోటి కూడా.నిత్య మంగళమైనటువంటి నిత్య శాశ్వతమైనటువంటి బ్రహ్మానంద పరమానందమైనటువంటి స్థాయిలో ఉండుగాక. అనేటువంటి ఒక పరమాద్భుత మంగళాశాసనం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, జీవుడి ఇచ్ఛ శుభేచ్ఛగా మారినప్పుడు తన సంకల్పాలన్నీ విశ్వజనీనమైనప్పుడు తన ఆలోచనలన్నీ కాలాతీతమైనప్పుడు తన భావనలన్నీ కూడా సహ-సహజీవన సౌందర్యం వైపు సంఘాన్ని సంస్కరించేటువంటి దిశగా సాగుతున్నటువంటి వేళ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహ విభూతి మన యందు పూర్ణమై ప్రవహించు గాక అనేదే ఇచ్ఛాశక్తి. అది ఇవ్వగలిగినది ఎవరు అంటే జగజ్జనని అయినటువంటి అమ్మవారు గనుక పరమ పవిత్రమైనటువంటి తిరుచానూరు అనబడేటువంటి స్థలంలో అనేకమైన అశేషమైనటువంటి భక్త జనవాహిని ఇక్కడ కూడినప్పుడు ఇది తీర్థమై సకల సర్వతీర్థమై ప్రాణికోటి అందరికీ కూడా ఒక ఆశావహమైనటువంటి స్థితిని కల్పిస్తూ ఉన్నది గనుక ఇచ్ఛ శుభేచ్ఛ కావాలి. శుభేచ్ఛ సర్వ ప్రకృతికి సర్వ ప్రపంచానికి కూడా ఆనందాన్ని పంచే దిశగా ఉండాలి అనేటువంటి ఒక భావన మనం నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. శుభేచ్ఛ ఇచ్ఛాశక్తి తర్వాత క్రియాశక్తి కావాలి. కేవలం ఇది కావాలి అనుకుంటే పని అయిపోలేదు. ఇది కావాలి అంటే సర్వ వనరుల సంభారాలు సమకూర్చుకోవాలి. ప్రపంచంలో అంటే విశ్వంలో ఉన్నటువంటి సర్వ శక్తులని కూడా మనం సమన్వయం చేసుకోవాలి. శక్తులని పుంజీభూతంగా ఏకీకరణంగా సమష్టిగా సమస్తమైనటువంటి ఒక వ్యవస్థగా గనక మార్చుకున్నట్లయితే ఇచ్ఛాశక్తి నెమ్మదిగా క్రియాశక్తి అవుతుంది. అంటే ఇచ్ఛాశక్తి ఒక thought అయినట్లయితే క్రియాశక్తి ఒక action అవుతున్నది. thought action రెండు కలిపితే కలిగేటువంటిదే జ్ఞానం కాబట్టి. ఏది జ్ఞానము అంటే శాస్త్రాల మీద సర్వాధికారము జ్ఞానం కాదు. పరమాద్భుతమైనటువంటి ప్రవచన ప్రవాహాన్ని దుర్లించడము నిజానికి జ్ఞానం కాదు. అట్లాగే సర్వ శాస్త్రాల మీద విశ్లేషణ చేయటం కూడా జ్ఞానం కాదు. ఇదంతా కూడా అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ అనబడేటువంటి విజ్ఞానమయ కోశానికి చెందింది గనుక జీవుడు అక్కడితో సంతృప్తి పడకుండా ఆనందమయ కోశానికి వెళ్ళాలి. ఆనందం అంటే జ్ఞానమే. మరి ఏది జ్ఞానము అంటే దేనివలన మానవుడు తనను తాను ఎరుగు ఎరుకలోకి ప్రయాణం చేసేటువంటి ఒక శుభేచ్ఛ తో ప్రారంభమై శుభేచ్ఛని ఇచ్ఛాశక్తిగా మార్చుకొని క్రియాశీలకమైనటువంటి క్రియాత్మకమైనటువంటి ఒక సక్రియగా ఒక ప్రక్రియగా సకృత్క్రియగా ఎవరైతే మార్చుకుంటారో అది క్రియాశక్తిగా మారి సర్వ ప్రపంచానికి కూడా ఆనందాతిశయాన్ని పంచేటువంటి ఒక జ్ఞానం వైపు అడుగు వేయిస్తుంది గనుక దానిని శంకర భగవత్పాదులు జ్ఞానాన్ని ఎలా పొందాలి అనేటువంటి ఒక విచారణ చేస్తూ శివానందలహరిలో మాట చెప్తారు. మాట ఏమిటంటే శంభుజ్ఞాన వసంతసంగిని హృదారామి అఘజీర్ణచ్ఛదా స్త్రస్సా భక్తిలతాచ్ఛదా విలసితా పుణ్యప్రవాళశ్రితాః దీశ్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానా ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి అంటారు. అంటే పరమేశ్వరా లేదా పరమేశ్వరి అని గనక ప్రార్థించి అంటే ధ్యానించి అంటే యోగించి అంటే కూడి లోలోపల ఉండి తనతో తాను కూడి ఉన్నటువంటి వేళ ఏమవుతుందంటే శంభుజ్ఞాన వసంతసంగిని అసలు ఆలోచనే ధ్యానమే ఒక వసంతంగా తోటలోకి అంటే జీవితం దేహం ఒక కోట మాత్రమే కాదు అది నిజానికి భగవంతుడు అనుగ్రహించినటువంటి సమస్త పుష్పాల తోటగా మనం భావన చేయగలిగినట్లయితే దానిలోకి శంభువు అనగానే శంభువు లేదా శాంభవి భర్గా భార్గవి శివ శివాని భవ భవాని అంటూ ఉండగానే మన యందు ఒక వసంతం ప్రవేశిస్తుంది. శంభుజ్ఞాన వసంతసంగిని హృదారామి. హృత్ అంటే చైతన్యానికి ఆరామ స్థలి హృదయం. ఇదిగో ఇటువంటి విశేషాలన్నీ కూడా మనకి మహర్షులు, ఋషులు, తాత్వికులు, జ్ఞానులు, అవతారమూర్తులు ఎన్నో విధాల ఆవిష్కరిస్తూ వచ్చారు. దాన్ని హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం యహమాహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి పృథివి శం అనశాశ్వం చిన్వతా మజ్జతావ పవనచరణరోధాత్ ఆత్మనిష్ఠో భవత్వం. దీపం వెలిగించి దాని మీద ఒక చెమ్మా పెట్టినట్లయితే ఎంత చుట్టూ గాలి వీచినప్పటికీ కూడా లోపల దీపం ఎట్లా ఆరకుండా ఉన్నదో నవరంధ్రముల కాయంలో హృదయ కుహరం అంటే ఎడమవైపు మరగా ఉన్నటువంటి ఒక మిషన్ గా ఉన్నటువంటి గుండె నుంచి ఒకటిన్నర అంగుళాల దూరంలో కుడివైపున హృదయము అనేటువంటి గుహ ఉన్నదని అది ఖాళీగా ఉన్నదని కానీ దాని యందు ఆత్మ నేను నేను నేను అని ప్రతి నిత్యమూ ప్రతిక్షణమూ కూడా లోపల మనకు కలిపిస్తున్నదని నిజానికి అది అదిగో దీపం వలే ఆరిపోకుండా ఉన్నదని ఏకాదశ పురవిహారిగా ఉన్నదని శంకర భగవత్పాదులు వ్యాఖ్యాన సమన్వయం చేస్తూ జీవుడు తనను తాను ఎరుగు ఎరుకలోకి ఎట్లా వెళ్ళాలో ఒక ప్రస్థాన క్రమ-కార్యక్రమాన్ని మనకు అనుగ్రహ వరదానం చేశారు. కనుకనే శంభుజ్ఞాన వసంతసంగిని హృదారామి ఏహ జీర్ణచ్ఛదా. పాత ఆకులు పాత ఆలోచనలు నిన్నటి వరకు సాగినటువంటి అన్నీ కూడా ఎండిన పండిన ఆకుల వలే టప టప రాలిపోగా ఏమవుతున్నాయో తెలుసునా? దీశ్యంతే గుణకోరకా. జపవచః పుష్పాశ్చ సద్వాసనా. ఎక్కడైతే ఆకులు రాలిపోతున్నాయో ఎండుటాకులు పండుటాకులు రాలిపోతున్నాయో దాని పక్కనే చిగురాకులు మొసులెత్తుతున్నాయి. దాని పక్కనే సత్వ రజస్తమో గుణాలు అనబడేటువంటి మూడు గుణాలు మొగ్గలై వస్తున్నాయి. మొగ్గలు నెమ్మదిగా క్రమ పరిణామంలో ఒక వికాసమానమైనటువంటి భావస్థితిని పొంది అవి తమ దివ్యమైనటువంటి సౌరభాన్ని అంటే పరిమళాన్ని సద్వాసనని దానిలో ఉన్న సొబగుని దానిలో ఉన్న హంగుని దాని యందు దాగిన సమస్తమైనటువంటి వర్ణ వర్ణాంచితమైనటువంటి దివ్యమైనటువంటి స్థాయిని మనకి ప్రసారం చేస్తూ ఉన్నాయి. అంతేకాదు దీశ్యంతే గుణకోరకా జపవచః పుష్పాశ్చ సద్వాసనా. జపము ఇదిగో వాక్కు లేదా వచస్సు లేదా వాగ్విభూతి వాగ్వైఖరి వీటన్నింటినీ గనక సమన్వయం చేసుకుంటే మనలో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట ఈశ్వరార్పితం కావాలి, ఈశ్వరీమయం కావాలి, ఈశ్వరీభూతం కావాలి అని శంకర భగవత్పాదులు చెప్తూ జ్ఞాన ఆనంద సుధామరందలహరి సంవిత్ఫలాభ్యున్నతి. అంటే జ్ఞానము ఆనందముగా మారి ఆనందము జ్ఞానము భిన్న-అభిన్నమైన స్థాయికి వెళ్ళి అది నెమ్మదిగా నిస్సంద్రమందారంగా ఒక సెలయేరులో వెళుతూ ఉన్నట్లయితే ఆనంద ఫలం ఎట్లా ఉన్నదంటే సంవిత్ఫలము. దేనిని పొందాలో దేనిని తెలుసుకుంటే ఆనందం కలుగుతుందో దేనిని తెలుసుకున్నందువలన మానవుడు మాధవుడవుతున్నాడో అటువంటి ఫలం మనకు లభిస్తుంది.
YouTube · audio

SVBC TTD-Dharmika Pravachanam ( )

Home

SVBC TTD-Dharmika Pravachanam ( )

Source: SVBC TTD on YouTube

0:00 / 27:02