No transcript for this section.
Transcript begins at 0:50.
నలభై ఎనిమిదవ నిమిషం సమయంలో ముప్పది ముక్కోటి దేవతలు. ఆ కోటి అంటే వంద లక్షలు అని కాదు సమూహం అని అర్థం. ముక్కోటి దేవతలు కూడా వచ్చి మూడు లోకాలలో ఉన్నటువంటి దేవీదేవతలంతా కూడా వచ్చి శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని చేసుకొనుటానికి ఉత్తర ద్వారం నుంచి వస్తారు. ఎందుకంటే ఉత్తర దిశ జ్ఞాన వరదాయిని కాబట్టి ఉత్తర ద్వారం నుంచి మనం గనుక వెళ్లి స్వామి వారిని గనుక దర్శనం చేసుకున్నట్లయితే మనకు జ్ఞానం కలుగుతుంది. జ్ఞానము అంటే శాస్త్ర పరిజ్ఞానం కాదు, శాస్త్రాల మీద అధికారం కాదు, శాస్త్రాలు నోట పెట్టటం కాదు, పుక్కిట పెట్టటం కాదు. నేను ఎవరు అన్నటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఆత్మను. ఈ ఆత్మ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తున్నది. ఈ జీవ ప్రజ్ఞ ఆ దైవ ప్రజ్ఞను కూడబోతున్నది. ఆ దర్శనము అంటే మిగతావన్నీ చూసి రావటం. ఇక్కడ దర్శించటం. చూడటం వేరు, దర్శనం చేయటం వేరు. చూడటం అంటే కంటి ఆవరణంలోకి పరిధిలోకి దే-- వచ్చే దేనినైనా చూస్తాం మనం. ప్రయోజనం ఏం లేదు. దర్శనము అంటే ఆంతరంగికమైనటువంటి దర్శనం కాబట్టి ఆ ఆంతరంగికమైనటువంటి దర్శనానుభూతిని మనం పొందాలి అంటే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం గనుక చేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు యొక్క యోగనిద్ర ముద్ర ఆగి సమస్త ప్రపంచానికి అంటే సమస్త లోకాలకి కూడా శాంతిని, సుఖాన్ని అనుగ్రహిస్తుంది గనుక సర్వవ్యాపకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆనాడు ఏకాదశి నాడు ఈ ప్రపంచానికి తన కరుణా వీక్షణ దీక్ష అనుగ్రహిస్తాడు గనుక చూపుల చేత. ఆ తామర పూలవంటి కనులు ఉంటాయే, అవి తెరుచుకున్నప్పుడు ఆ ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని జీవుడు పొందుతాడు గనుక ఉత్తర ద్వార దర్శనం మోక్షము అంటే మరణానంతర సుఖం కాదు. ఇక్కడ ఉండగానే ఇహమేవా. ఇక్కడ జీవుడు ఉన్న-- అంటే నౌ అండ్ హియర్. ఇక్కడ ఉండగానే జీవుడు ఆ ఆనందాన్ని పొందాలి. ఆనందం పొందాలి అంటే మోహాన్ని పోగొట్టుకోవాలి. మోహం గనుక క్షయమైపోతే దాని పేరే మోక్షం. కాబట్టి ఇక్కడే అన్నీ పొందాలి. ఈ జన్మ ఇవ్వబడిందే అందుకు. దీని తర్వాత ఏం లేదు. ఈ దేహం ఇక్కడ వదిలిపెడతాం. కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేటువంటిది కేవలం శ్రీ మహావిష్ణువుని చూసి రావటం కాదు, మహావిష్ణు విగ్రహానికి నమస్కరించి రావటం కాదు, సర్వవ్యాపకుడైనటువంటి మహావిష్ణువు యొక్క తత్వాన్ని, ఆయన భావాన్ని, ఆయన అనంత మహా శక్తిని ఆవాహన చేసుకొని ఈ తోలు కనుల ద్వారా ఆ ఆనందాన్ని లోపలికి తీసుకొని అంతరంగ స్పర్శను అనుభవిస్తూ జీవుడు తనలో దాగి ఉన్నటువంటి, తనలో ఉన్నటువంటి ఆ ఆత్మను దర్శనం చేసుకునే పరమ పుణ్యమైనటువంటి కాలమే ముక్కోటి ఏకాదశి గనుక ఆరోజు మనమే కాదు ముప్పది ముక్కోటి దేవతలు దర్శనం చేసుకుంటారు. దేవగణాలు దర్శనం చేసుకుంటాయి. ఆ ఆ సమయం. అంటే ముప్పది ముక్కోటి దేవతలు ఆయన్ని ఏకకాలంలో దర్శనం చేసుకున్న తర్వాత ఇగో పంచభౌతిక దేహాన్ని ధరించినటువంటి మనబోటి వాళ్ళం అందరం కూడా అక్కడికి వెళ్ళినట్లయితే ఆ కాలగమనం ప్రకారం ఆ అయనం మార్పులన్నీ కూడా ఏర్పడతాయి. ఎక్కడినుంచి ఈ ప్రకృతి శోభిల్లుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు మళ్ళీ యోగనిద్రా ముద్రాంకితుడు అయ్యేదాకా ఈ ప్రపంచాన్ని తను కనరు-- కనురెప్పల మాటున తన కరుణా దృష్టి వెనక తన సర్వవ్యాపకత్వం వైపు, ఒక సమర్ధత వైపు, ఒక విశిష్టత వైపు, ఒక కరుణ వైపు జాతిని భద్రంగా నడిపిస్తాడు గనుక అది ముక్కోటి ఏకాదశి అయినది. ఆ రోజున ఉపవాసము అంటే అన్నం మానేసి అని కాదు. ఉప, పరమేశ్వరుడు విష్ణు భావనకు దగ్గరగా వస-- వాసం చేయటం. ఆ ఆయనకు దగ్గరగా జీవించగలిగిన, ఆ భావనలో జీవించగలిగినటువంటి ఆ ఏకాదశి అంటే మనలో ఉన్నటువంటి ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు ఐదు కలిపితే పది అంటే పది ఇంద్రియాలు, దానికి అధిష్టాత అయినటువంటి మనస్సు కలిపితే పదకొండు. ఈ ఏకాదశములు కూడా రుద్ర భూమికలో ఉంటాయి గనుక ఈ రుద్రులంతా కూడా వెళ్లి పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనానికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు ఎప్పుడైతే వెళతాయో ఆత్మ మళ్ళీ పరమాత్మతో అనుసంధానమై ఒక పూర్ణత్వాన్ని, ఒక శక్తిని, ఒక చైతన్యాన్ని సంతరించుకొని మహా శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మిక భావనా భూమికలో అది నెలకొంది చెందు--తుంది గనుక అది పర్వదినము అంటే పండగ దినము.
YouTube · audio
ముక్కోటి ఏకాదశి విశిష్టత | sreepeetam | mukkoti | god vishnu
ముక్కోటి ఏకాదశి విశిష్టత | sreepeetam | mukkoti | god vishnu
Source: Sreepeetam on YouTube
0:00 / 5:46