Skip to content
Transcript తెలుగు
పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ చల్లని సాయంకాలం సాయి కాలంగా మారిన వేళ జాతి మత కుల వర్గ వర్ణములకు అతీతంగా ఒక సనాతనమైనటువంటి వైదిక ధర్మాన్ని ఆర్ష ధర్మాన్ని సర్వ జగత్తుకి కూడా అరటి పండు వలిచి చేతిలో పెట్టినట్లుగా అటు వేదవాణిని ఇటు ఉపనిషద్ వాణిని పౌరాణికమైనటువంటి అనేకానేకమైనటువంటి విషయాలు ఉన్నటువంటి మార్మికతలు ధర్మ సూక్ష్మాలు అన్నింటినీ కూడా కథా కథన రూపంలో వాఙ్మయ రూపంలో సత్యసాయి భగవానుడు ప్రపంచానికి వాహినీ స్వరూపంగా అందించారు. ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల పదకొండు వరకు స్వామి మనతో ఉన్నారు క్షణం నుంచి మనలో ఉన్నారు. స్వామే మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే స్వామి వలె ఉండాలి స్వామి వలె జీవించాలి స్వామి వలె మాట్లాడాలి స్వామి వలె జీవితాన్ని పూర్ణంగా అనుభవించాలి గనుక సత్యసాయి భగవానుడి యొక్క దివ్య ప్రణాళిక కేవలం నాలుగు రోజులకు పరిమితమైనది కాదు. ఇవాళ తిరుపతిలో రేడియో సాయి అనబడేటువంటి రికార్డింగ్ స్టూడియో ప్రారంభమైంది. ఏం జరగబోతుంది? స్వామి డెబ్బై రెండు సంవత్సరాలలో కోటానుకోట్ల జీవులను ప్రభావితం చేశారో సాయివాణి ప్రపంచానికి ఒక ఆనంద మాత్ర అయినదో దివ్య జీవన సూత్రం అయిందో స్వామి యొక్క దివ్య జీవన విధానంలో కలిగినటువంటి అనేక లీలలు ఎన్ని ఏర్పడి ఉన్నాయో అవన్నీ ఇక్కడ నుంచి మహాద్భుత శక్తి తరంగాలై సర్వ ప్రపంచాన్ని ప్రేమ తరంగాలుగా ముంచెత్తబోతున్నటువంటి వేళ ఇది. స్వామి పదే పదే "నా విద్యార్థులే నా ఆస్తి" స్వామి యొక్క ఆశీస్సే బలంగా మానవుడి యొక్క కర్తవ్య దీక్షే ఒక వ్రతంగా ప్రారంభమై అందులో స్వామి విద్యార్థులు అయినటువంటి వారందరూ కూడా తమ తమ శక్తిని ప్రజ్ఞని దాని యందు ప్రవేశపెట్టి సేవా సంస్థ చిత్తూరు జిల్లాలో మకుటాయమానంగా ఇక్కడ ఉన్నదో అక్కడే స్వామి తన దివ్య వాణిని వినిపించబోతూ ఉన్నారు. ఎట్లా అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు కావాలంటే ఏది కావాలంటే వింటూ ఉండటమే.
YouTube · audio

Inauguration of Radio Sai Recording Studio at Tirupati :)

Home

Inauguration of Radio Sai Recording Studio at Tirupati :)

Source: Preetham Sai on YouTube

0:00 / 29:05