No transcript for this section.
Transcript begins at 0:30.
అందువల్ల ఈ ఆత్మ విచార మార్గం హుయామై ఆయనతో అనుసంధానమై ఉన్నది గనుక ఈ ఆత్మ గురించిన విచారణ ఇంతగా సాగి అది ఎక్కడ ఉన్నదో చెప్పటానికి వారు వచ్చారు గనుక వారిని గురించి ఆ వైభవాన్ని మనం రెండు రోజులు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఎవరు ఈ యమన మహర్షి? ప్రతి వాళ్ళకు మూలాలు ఉంటాయి. ఇప్పుడే నన్ను వారు అడిగారు మీ మూలాలు చెప్పండని. మూలాలు ఎవరికి కావాలి? ఫలించిన పండు కావాలి, కాచే కొమ్మ కావాలి, వేసిన చిగురాకులు కావాలి. కానీ మూలాలు మర్చిపోవటానికి వీల్లేదు. తనువుకి కారణమైనటువంటి తల్లిదండ్రులను స్మరించిన అంటే ఈ ప్రపంచంలో ఇన్ని వేల సందర్భాలలో మాట్లాడిన తల్లిదండ్రుల ప్రస్తావన జరిగింది ఇదిగో ఇవాళ మొట్టమొదటిసారి. ఎవరికీ తెలియదు. అయితే చెయ్యకూడదని కాదు. అది గతించిన కాలానికి సంబంధించిగా ఇవాళ-ఇవాళ మనం ఏం జరుగుతున్నాం, నిన్న ఏమిటి ప్రయోజనం లేదు, రేపు ఏమిటి మన చేతుల్లో లేదు. కానీ ఇవాళ ఏమిటంటే నేను ఇవాళ మాట్లాడబోతున్నాను అని నేను, నేను వినబోతున్నానని మీరు మనం అనుకొని ఇక్కడకి వచ్చాం గనుక ఈ నేను ప్రస్తుతమైనది this is power of presence or present whatever సరే. మదురై జిల్లాలో ఒక ప్లీడర్ గుమస్తా గారి కడుపున పుట్టినటువంటి వెంకట్రామన్ పదహారు సంవత్సరాలు వచ్చే వరకు ఆటపాటలతో గడిపాడాయన. వైగై నదీ తీరంలో అందరు పిల్లల్లాగానే మనలాగానే బాల్యంలో ఆటపాటలు సాగినాయి. చదువులో పెద్ద శ్రద్ధ చూపించకపోయినా కావలసిన మార్కులు మాత్రం వస్తూ ఉండేవి. కానీ ఒకరోజున ఒక సెలవు రోజున తాను ఉన్నటువంటి ఇంట్లో పై అంతస్తులో మేడ మీద ఆయన పడుకొని ఉన్నారు. పడుకొని ఉండగా ఆయనకి తెలియకుండా ఒక అనుభవం కలిగింది. ఆ అనుభవం ఏమిటంటే తనలో నుంచి ఏదో ఒక వస్తువు, ఏదో ఒక శక్తి తన నుంచి విడిపోతున్నట్లు తద్వారా ఇంతకాలము ఆడిన పాడిన కూడిన ఈ శరీరం కేవలం ఒక కట్టె వలె పడి ఉన్నది కాబట్టి పోతున్నది ఏమిటి? ఉండబోతున్నది ఏమిటి? అని ఒక ప్రశ్న కలిగినప్పుడు కేవల క్షణకాలంలోనే ఒక ఆత్మ స్ఫురణ కలిగింది. ఏదంటే ఉండబోయేది ఆత్మే తప్ప ఉండబోవనిది అది శరీరమే కాబట్టి నేను ఈ శరీరం కాదు అని నిర్ణయం తీసుకున్నారు. ఈ శరీరం పోయినా నేను మరణించినా నాలో జ్వలజ్వలితమైనటువంటి ఒక చైతన్య జ్వాల, చైతన్య స్ఫూర్తి ఆ వెలుగు నిరంతరము ప్రకాశమానమై వెలుగుతుంటుంది గనుక అదే నేను అన్న భావనకు వచ్చారాయన. వస్తే [జలుబు] దానికి ఆయన ఆత్మ అని ఏం పేరు పెట్టుకోలే. మనం ఇవాళ విచారణలో ఎకడమిక్ గా ఆత్మ అని పేరు పెడుతున్నాం. ఓహో! ఈ పురాణాలు, ఇతిహాసాలు, వాఙ్మయాలు చెప్పేటువంటి కైలాస వైకుంఠాలు అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట అని స్ఫురణ కలిగింది. ఆయన వేదాలు చదవలా. ఇక్కడే ఉన్నాయి అనేదానికి ఆనాటి భాషలో ఇహమేవా అన్నారు. అంటే ఇప్పుడే ఇక్కడే now and here [జలుబు] మనం అంటాం నువ్వు మంచి పని చెయ్ స్వర్గానికి వెళ్తావ్ లేకపోతే నువ్వు ఇంకో పని చెయ్ నరకానికి వెళ్తావ్. ఈ రెండూ ఉన్నాయి అని అనకపోతే మనం బాగుపడం. అక్కర్లేదు అక్కర్లేదు. కాబట్టి జరగవలసినది ఏమిటి అంటే అరయ నారాయణాన్వేషితము అని ఇందాక అనుకున్నాం. ఈ నారాయణుడు ఎవరు? ఎక్కడున్నాడు? అన్నమాచార్యులవారు ముప్పై రెండు వేల సంకీర్తనలు చేశాడాయన, రాశాడు. ఒక్క వెంకటేశ్వర స్వామి చుట్టూ తిప్పాడాయన కీర్తనలన్నీ. దొరకల. టైం అయిపోవస్తుంది. ఇక ఉండటానికి వీల్లేదు ఇక్కడ. చిట్టచివరగా ఏమన్నాడంటే చిత్తజ గురుడా నీకు శ్రీ మంగళం అన్నాడు. అక్కడ వెతికాను, ఇక్కడ వెతికాను, నన్ను చూడ్ అన్నాను, అదన్నాను, ఇదన్నాను అవేం కాదు నువ్వు నాలోనే ఉన్నావు అన్నాడు. నాలోనే ఉన్నావని అన్నమాచార్యులవారు అనేశారు. చాగరాజ స్వామి వారు తొంభై కోట్ల రామనామ జపం చేశారు. ఆయన లక్ష్యం ఒకటే రామదర్శనం కావాలి. ఎన్నిసార్లు అయింది రామదర్శనం? ఒక్క క్షణమాత్రం కలిగింది ఆయనకి. రావటం-రావటమే పంచాయతనంగా వచ్చాడు. సీతా, రామ, లక్ష్మణ, హనుమత్ సమేతంగా దర్శనం ఇచ్చాడు. ఆ రాముడు ఎంత సేపు ఇచ్చాడో తెలుసునా? కనురెప్ప ఎత్తి వాలే లోగా ఒక్క నిమిషమాత్రం. అయిపోయింది అక్కడికి. అంటే భగవద్దర్శనానికి ఆత్మదర్శనానికి తేడా ఏం లేదు. ఆత్మానుభవాలు కలుగుతూ ఉంటాయి గనుక ఈయన అనుకున్నారు, అవును ఇదేమిటి నాకెందుకు కలిగింది ఇది? నేను స్కూల్ కి వెళ్ళాలి కదా, చదువుకోవాలి కదా, ఇదేమిటి ఇట్లా నాకు ఈ వైరాగ్యం ఎందుకు వచ్చింది అని ఒక క్షణం అనుకున్నారు. దాన్ని వదిలేశారు. కానీ ఆ క్షణం నుంచి ఆ అనుభవం ఆయన్ని వెన్నాడుతూ వచ్చింది. వెన్నాడుతూ వస్తే ఒకరోజున ఆయన అన్నగారు స్కూల్ ఫీజు కట్టమని డబ్బు ఇచ్చారు. పుస్తకం లోపల పెట్టుకు-- మనకి ఆ రోజుల్లో పర్సులు, ప్యాంట్లు ఏం లేవు. స్కూలు బుక్కులోనే ఆ డబ్బు పెట్టుకున్నాడాయన. ఆ బుక్కుతో స్కూల్ కి వెళ్తాడు గనుక ఫీజు కట్టాలి అని ఆయన ఉద్దేశ్యం. కానీ వాళ్ళ ఇంటికి ఒక బంధువు వచ్చాడు. వచ్చి ఆయన రెండు మూడు రోజులు ఉన్నాడు. ఉన్న తర్వాత వెంకట్రామన్, ఈయన-ఈయన తండ్రి ఆయన్ని బస్ స్టాండ్ లో దింపటానికని వెంబడి పెట్టుకొని వెళ్తున్నారు. ఆ ఇద్దరి వెనక నడుస్తూ వెళ్తున్నారు ఈ వెంకట్రామన్.వెంకట్రామన్ తండ్రి ఏమడిగారంటే, "అవును మూడు రోజులుగా మా ఇంట్లో ఉన్నారు బానే ఉంది. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు?" అని ఒక ప్రశ్న వేశారు. ఆయన అన్నారు "అరుణాచలం నుంచి" అన్నారు. ఈ అరుణాచలం వినపడలే అరుణాచల వినపడింది ఎవరికి వెనక నుంచి ఉన్న వెంకటరామన్ కి. ఒక్కసారి భావావేశం కలిగింది, భావోద్వేగం కలిగింది. కలిగి అరుణాచల అనేటువంటి నామం ఆయనను ఒక్కసారి కైవసం చేసుకుంది, పట్టేసింది. అంతే వెనుదిరిగి వెనక్కి వెళ్ళిపోయినాడు. ఆ రాత్రి ఎలా గడిపాడో తెలియదు గానీ మరనాడు ఒక చిన్న ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏం రాశారంటే, "స్కూలు ఫీజు కట్టబడలేదు." నేను పోయింది అప్పటికే. నేను కట్టలేదు అని రాయలే కట్టబడలేదు. "దీనికై వెదకకండి. రెండు రూపాయలు తీసుకొనబడినవి." అని ఆ చిన్న స్లిప్పు పెట్టి ఆయన అరుణాచలం ఎక్కడ ఉందో తెలియదు, అది ఎంత దూరంలో ఉందో తెలియదు, ఆ జేబులో పెట్టుకున్న రెండు రూపాయలు దగ్గర పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. As if he were travelling in trance. ఒక exalted state అంటాం. ఆత్మానుభూతిలో దేహాత్మ భావాన్ని నశించి ఒక దేహాతీతమైన, మనోతీతమైనటువంటి దివ్య భావనతో నడుస్తూ వెళుతూ ఉంటే, చూడండి అతి విచిత్రంగా ఇవాళ మనకి సినిమాలలో, కథలలో జరిగినట్టే వారి జీవితంలో జరిగింది. వారు అలా రైల్వే స్టేషన్ కి వెళ్లారు. ఒక train వచ్చి ఆగింది. అది ఎటు వెళుతుందో, ఎక్కడికి తీసుకువెళుతుందో ఆయనకి బాహ్య స్మృతి లేదు. వారు ఆ train లోకి ఎక్కారు. ఎక్కితే ఆ రోజుల్లో general compartments ఎక్కువ ఉండేవి. ఆయన కూడా దాంట్లో కూర్చున్నారు. చుట్టూ కోలాహలం. వస్తువులు అమ్మేవాళ్ళు, తినేవాళ్ళు, ఏడిచేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, లౌకిక సంబంధ మాటలు మాట్లాడేవాళ్ళు. వీళ్ళందరి మధ్య నిశ్చలంగా కూర్చున్నారు. అసలు ఏమీ పట్టనట్లుగా, ఏదీ తాను వింటున్నట్లుగా కాకుండా, నడిస్తే ఒక మౌల్వీ ఇతనిని గమనించి, "ఏమిటీ? ఇతని వయస్సు పదహారేళ్ళు దాటినట్లుగా లేదు. ఇంత వైరాగ్యంతో ఎలా కూర్చున్నాడు? ఆకలి లేదు, మంచి నీళ్ళు అడగటం లేదు." అని అనుకుంటున్నాడు గానీ గమనిస్తున్నాడు. ప్రయాణం సాగింది. ఆ station విల్లుపురం అనేటువంటి ఒక ఊరుకొచ్చి ఆ station దగ్గర train ఆగిపోయింది. అందరూ దిగిపోయినారు. ఒక్క ఈ వెంకట్రామన్ తప్ప. అప్పుడు ఈ మౌల్వీ వెళ్ళి భుజం తట్టి, "ఈ train ఇక్కడి నుంచి ఇకపై ముందుకు వెళ్ళదు. ఇది ఆఖరి station" అని ఆయనా దిగిపోయారు. ఆయన వెంట వెంకట్రామన్ కూడా దిగారు. దిగి మరి ఎవరో పిలిచినట్లుగా, ఎవరో నడిపిస్తున్నట్లుగా అక్కడ నుంచి ప్రారంభమై సుమారు మూడున్నర రోజులు నడిచి తిరువణ్ణామలై చేరుకున్నారు ఆయన. తిరువణ్ణామలై చేరుకుంటే తిరువణ్ణామలైలో అరుణాచల దేవాలయం ఉంది. ఆ అరుణాచల దేవాలయం ఆరోజు వారు అక్కడికి September ఒకటి చేరుకున్నప్పుడు అభిజిత్ లగ్నంలో సుమారు పన్నెండు గంటలు, పన్నెండు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ఆ దేవాలయ ప్రవేశం చేశారు ఆయన. అక్కడ కూడా ఎవరో తనని లాగుతున్నట్టుగా వెళుతున్నారు గర్భగుడి దాకా. మరి మామూలుగా పూజాది కాలం అయిపోయిన తర్వాత పూజారి గర్భాలయానికి తాళం వేసుకుని బుడ్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి. ఆ రోజున తాళం తీసుకువెళ్ళాడు గానీ తాళం వేయటం మర్చిపోయినాడు తలుపులు తీసున్నాయి. కాబట్టి తలుపు తోసుకుంటూ, తెరుచుకుంటూ వెంకట్రామన్ వెళ్ళి అరుణాచలేశ్వర లింగాన్ని ఆలింగనం చేసుకుని ఒక భావావేశం తనను నడిపిస్తుండగా, మనస్సు నెమ్మదించగా, స్థిమితమైనటువంటి మనీషాయత్తమైనటువంటి చిత్తంతో, అంటే ఇక స్థిమితమైన బుద్ధి, స్థిమితమైన మనస్సు, అలజడి లేదు, ఆందోళన లేదు, వ్యాకులం లేదు, నాకెట్లా అన్న ప్రశ్న లేదు. ఆ లింగాన్ని ఆలింగనం చేసుకుని ఒక్క మాట అన్నారు, "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను. ఇకపై అంతా నీ ఇష్టం." అంతే. కాసేపు ఆ లింగాన్ని కౌగలించుకున్నారు. బయట పడిపోయారు. బయట పడిపోయి అక్కడి నుంచి నెమ్మదిగా అక్కడున్న పుష్కరిణి దగ్గరకు వెళ్లారు. శిరోముండనం చేయించుకున్నారు. తను కట్టుకొచ్చినటువంటి బట్టలు పక్కన పడేశారు. కౌపీనం కట్టుకున్నారు. తలస్నానం చేశారు. మిగిలిన నాలుగు నాణేలు పుష్కరిణిలో వదిలిపెట్టారు. మళ్ళీ ఎవరో పిలిచినట్లుగా పాతాళ లింగం అని చాలా లోతుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ లింగం వెనక ఉండిపోయారు. మామూలుగా కవులు వీళ్ళంతా ఆయన జపం చేశారు, తపస్సు చేశారు, ధ్యానం చేశారు, ఏమీ చేయలేదు. ఆయన ఒక సహజ సమాధి స్థితిలో అలా ఉండిపోయారు. ఆ ఉండిపోయిన తర్వాత అక్కడ కంచి నుంచి వచ్చినటువంటి శేషాద్రి స్వామి అని, ఆ శేషాద్రి స్వామి ఉన్మత్తుడు. బాలుడు, ఉన్మత్తుడు, పిశాచి, దైవము ఒక్కటే. వాళ్ళు అలా behave చేస్తారు. మనలాగా నాగరీకంగా ఉండరు. మనలాగా చాలా సాంఘిక మర్యాదలు వాళ్ళకేం తెలియవు. దేహస్మృతులే ఉండవు. భావం మీద control ఉండదు. కానీ ఎలా ఉంటారు? ఉదాత్తంగా ఉంటారు. వాళ్ళు ఏది ఆలోచించినా అవధూత లక్షణం అదే. ఆ అవధూతలు ఏంటంటే, ఆ-వ-ధూ-త ఆ నాలుగు బీజాక్షరాలు అవి. మొట్టమొదటి ఆ అంటే అమదానందము విమలధామమై మనకి మదముతో కూడిన ఆనందాలు కలుగుతాయి. బాగా డబ్బు సంపాదించాం. అది మదముతో కూడిన ఆనందం. కానీ వాళ్ళకి డబ్బు అక్కర్లా. అమదానందము విమలధామమై వర్తమాన వర్తిత అవ్యధాకారకమై వర్తమాన జీవితంలో మనతో పాటే ఉంటూ, దుఃఖమే తెలియని జీవితాన్ని గడుపుతూ ఉంటూ, ఇక మూడవది తమోరహిత తపోతత్వ భూమికలో నిలకడ చెంది నిర్మల నిశ్చల సచ్చరిత ఆతడే అవధూత. అందుకనే షిరిడీ సాయినాథుడి చరిత్రకు మాత్రమే సచ్చరిత్ర అని పేరు ఇవ్వబడింది.ఇంకా ఎవరి చరిత్రకి సచ్చరిత్ర పేరు లేవు. నా పేరు పెట్టుకొని మూర్తి గారి సచ్చరిత్ర రాస్తే మహా పాతకం అలా రాయకూడదు. షిరిడి స్వామిది మాత్రమే సచ్చరిత్ర. సచ్చరిత్ర అంటే ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు కాదు, అవన్నీ చక్కగా అర్థం చేసుకుంటూ వెళితే ఆ కథలన్నీ సత్తు వైపు నడిపిస్తాయి గనుక అది సత్తును గురించిన చరిత్ర. అది బాబా గారి చరిత్ర కాదు దానిలో భక్తులున్నారు, అనుభవాలున్నాయి, వేదాంతం ఉంది, అనేకమైన హెచ్చరికలున్నాయి, పాఠాలున్నాయి, గుణపాఠాలున్నాయి. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి గనుక వీటిని చక్కగా సమన్వయం చేసుకున్నట్లయితే ఆ అవధూత శేషా-- శేషాద్రి స్వామి గనుక మరి చాలా కాలం ఉన్నారాయన తిరువణ్ణామలైలో. ఏదైనా చూడండి. మీరు ఇరవై ఏళ్ల క్రితం కలిసుంటే బాగుండేది అంటాం. మీరు పదేళ్ల నాడు కలిస్తే ఇంకా బాగుండేది అంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కలవాలో దైవ నిర్ణయం మన వల్ల కాదది. మీరు నేను కలుద్దాం అంటే కలవం. దీనికి ఆ అటామిక్ ఎనర్జీ లో చిన్న ఉపమానం ఉంది. ఇక్కడ ఒక ఆటం ఉంది, ఒక అణువు ఇక్కడ ఉంది. ఎనిమిది లక్షల మైళ్ల దూరంలో ఇంకో అణువు కూడా ఉంది. ఈ అణువు ఆ అణువుని కలవాలి, కలవవలసి ఉన్నది అంటే దానిని ఆపగలిగిన వాడు లేడు కలిసి తీరుతారు. ఎప్పుడు అంటే ఆ time వచ్చినప్పుడు. ఆ time మనం గౌరవించాలి. అందుకనే సత్యసాయిబాబా వారు కూడా "బాబా మీ దగ్గరికి ముప్పై ఏళ్ల క్రితం వస్తే" అంటే "రాలేదుగా, అయిపోయిన దాన్ని గురించి ఎందుకు? ఇప్పుడు వచ్చావుగా, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకో" అనేవారు. కాబట్టి మనం పోయిన దాన్ని గురించి ఎక్కువ మాట్లాడతాం. నడుస్తున్న దాన్ని, పొందిన దానిలో నుంచి ఆనందాన్ని పొందాలి గనుక ఈ శేషాద్రి స్వామి అక్కడ నుంచున్నాడు. అలా ఒక దేవదాసి వెళుతున్నది గుడిలోకి, ఆ దేవదాసిని పిలిచారు. అసలు శేషాద్రి స్వామి వారు ఒక దేవదాసిని పిలవటమే ఆమెకు ఆనందం, భగవంతుడు పిలిచినట్టే. "చూడు, నువ్వు లోపలికి దిగు. పాతాళ లింగం మూలంలో ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఈ ప్రపంచం కోసం వచ్చాడు. ముందు ఆయన్ని బయటకు తీసుకురా" అన్నాడు. ఆజ్ఞ పాటించింది. ఆ స్త్రీమూర్తి ఆయన్ని మోసుకుని బయటకు తీసుకొస్తే ఆయన శరీరం అంతా కూడా పాములు, తేళ్లు, పురుగులు తినేసి ఉన్నాయి. కానీ కళ్ళు జ్వజ్వల్యమానంగా వెలిగిపోతున్నాయి. అంటే కన్ను తెరిచినటువంటి ధ్యాన ముద్రలోనే ఉన్నారాయన. ఒక అతీంద్రియమైనటువంటి, దివ్యమైనటువంటి భావన. గోళ్లు పెరిగిపోయి ఉన్నాయి. కేశ సంస్కారం లేదు, చాలా ఏళ్ళు అయిపోయింది. అప్పుడు శేషాద్రి స్వామి వీరికి సంస్కారం అంతా చేసి "మీ పని మీద మీరు వెళ్లిపోండి" అంటే ఆ దేవదాసి ఆయనకు స్నానం చేయించింది, బట్ట కట్టింది, కౌపీనం కట్టి-- బట్ట కట్టి ఆయన్ని మళ్ళీ ప్రపంచంలో అక్కడ అప్పజెప్పి వెళ్లిపోయింది. కానీ ఇవి ఏవీ ఆయనకు తెలియదు. అక్కడ నుంచి అరుణాచల శానువుల మీదిగా అరుణాచలం పైకి నడుచుకుంటూ వెళ్ళిపోయినారు భగవాన్. అప్పుడు ఆయన పేరు బ్రాహ్మణ బాలకుడు లేదా మౌనస్వామి అని రెండు పేర్లు. ఏ చెట్టు ఉంటే అక్కడ కూర్చుంటే trance లోకి వెళ్ళేవారు. దానికి వారు ధ్యానాలు, తపస్సులు చేయలేదు. మనం కొన్ని కొన్ని ప్రపంచంలో చెప్పే వాడి వలన ప్రచారాలు అపప్రధలు అయిపోతాయి. ధ్యానం అంటే ఏమీ చేయకపోవడం ధ్యానం. ఏదైనా చేసేది ధ్యానం కాదు. అక్కడ కూడా ఏదో చేస్తున్నాం అంటే మనసు ఉన్నట్లే లెక్క. ఇవన్నీ కూడా గమనించుకుంటూ వెళ్లినట్లయితే కొన్నాళ్ళకి కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని అని ఒకాయన మంత్ర ద్రష్ట, మహానుభావుడు. సంస్కృత భాష ఆయన వెనక పరిగెత్తుకొచ్చేది. మంత్రాలలో ఉన్నటువంటి బీజాక్షరాల వెనక ఉన్న సర్వాధిష్టాన దేవతలని ఆయన దర్శనం చేసుకున్న మహాపురుషుడు ఆయన. ఆయన ఒక ముస్లిం Humphrey's అని వెల్లూరు దగ్గరకు వచ్చి "అయ్యా, ఏమిటో తపస్సు చేశాను, వేదవాదాలు చేశాను. కానీ నాకు చిత్తశాంతి మాత్రం దొరకటం లేదు. దీనికి మార్గోపదేశం ఏమైనా ఉందా? ఎవరైనా మన చుట్టూ ఉన్నారా ఒక్కసారి చెప్పండి" అంటే "అరుణాచలం మీద ఒకాయన ఉన్నారు. ఆయన పేరు మౌనస్వామి లేదా బ్రాహ్మణ స్వామి అని పిలుస్తారు. అక్కడికి వెళితే మీకేదన్నా లాభం కలుగుతుందేమో" అన్నారు. ఈ-ఇదంతా ఎందుకు చెప్పాలి అంటే భగవాన్ రమణ మహర్షి వస్తూనే ఆత్మవిచార మార్గంలోకి వెళ్ళలే. ఇంత నేపథ్యం ఉంది. ఆ ఆత్మ ఎక్కడ ఉన్నదో మనకు చెప్పడానికి వచ్చారు గనుక, వారసుల అరుణాచలానికి ఎందుకు వచ్చారో మనం తెలుసుకోవాలి గనుక సరే కావ్యకంఠులు బయలుదేరి వెళ్లారు. అదే సమయంలో కావ్యకంఠులు అరుణాచలం పైకి ఎక్కుతున్నారు. మహర్షి పైనుంచి కిందకి, అప్పటికి ఇంకా మహర్షి కాదే వెంకట్రామన్, ఆయన దిగి వస్తున్నారు. వచ్చి ఒక రాయి మీద కూర్చుండి పోయారు. దక్షిణ దిక్కుగా, దక్షిణ దిక్కున చూస్తూ మామూలుగా ఆయన తనలో తాను కూర్చొని ఉన్నారు. గణపతి ముని వెళ్లారు, వెళ్లి నమస్కరించారు. ఆయనేం మాట్లాడలేదు. పెద్దగా కళ్ళు ఆయన వైపు చూడలేదు. కానీ ఒక మాట అడిగారు. "పధ్నాలుగు ఏళ్ళ చిరంతన తపస్సు చేశాను. అది సుదీర్ఘమైనటువంటి తపస్సు, తీవ్ర తపస్సు. మంత్రశాస్త్రం మీద అధికారాన్ని సంపాదించాను. సమస్త పురాణాలు, వాంగ్మయం అంతా నా వెనక పరిగెత్తుకొని వస్తోంది. వేద వాదనలో నన్ను మించిన వాడు లేడని కూడా అనిపించుకున్నాను. కానీ నాకు చిత్తశాంతి దొరకటం లేదు. తపస్సు చేశాను అని అనుకుంటున్నాను. ఇంతకీ తపస్సు అంటే ఏమిటి?" అని అడిగాడు. చాలా ఏళ్లుగా మాట్లాడకుండా ఉన్నందువలన వెంకట్రామన్, విశుద్ధ చక్రం అంటాం ఇది, కంఠనాళాలు అన్నీ బిగుసుకుని ఉన్నాయి. బిగుసుకున్నందువలన నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క పదాన్ని కూడబలుకుతూ నెమ్మదిగా బయటకు తెప్పిస్తూ అత్యంత కఠినమైన శ్రమకి ఓర్చి ఒక్కమాట చెప్పారు. "నేను అన్న భావన ఎక్కడ పుడుతున్నదో గమనించిఆ నేను ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నదో గమనించి మళ్ళీ ఆ నేను దేనిలో లీనమై పోతున్నదో ఎక్కడ ముగుస్తున్నదో గమనించుకోగలిగితే దాని పేరు తపస్సు అని అడిగారు. ఆయనకు అర్థమైపోయింది. అయితే వెంటనే మరో ప్రశ్న వేశారు మరి నేను తపస్సు చేశాను అనటానికి నాకు గుర్తు ఎట్లా? అప్పుడు నెమ్మదిగా వెంకటరామన్ సమాధానం ఇచ్చారు. నీవు తపస్సు చేయటానికి ముందు ప్రపంచంలో ఉంటావు తపస్సు ఫలించిన తర్వాత సమస్త ప్రపంచము నీ యందు ఉంటుంది అంతే ఇదే తపస్సు అన్నారు. అర్థమైపోయింది ఈయన మహానుభావుడు అని ఆయనకు అర్థమైంది అదే సమయంలో దక్షిణ దిక్కుగా ఆరు కిరణాలు కాంతి కిరణాలు వచ్చి వారి ఆజ్ఞాచక్రం మనం బొట్టు పెట్టుకునే చోట కనుబొమ్మల మధ్య తాకింది తాకితే దానిని గమనించారు కావ్యకంఠులు గమనించి మీరు స్కందులా అని అడిగారు ఆరు కిరణాలు వచ్చినాయి కాబట్టి ఆరు ముఖాలు ఉన్నటువంటి కార్తికేయుడా సుబ్రహ్మణ్యస్వామ్య మీరు అని అడిగాడు. వీరు ఎవరో తెలుసుకుంటే మీకు కలిగే ప్రయోజనం ఏమున్నది మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదే పూర్ణమైన అటువంటి ఆత్మానుభవం అని ముగించారు. అప్పుడు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని మహా కవీశ్వరుడు పండితుడు సమస్త శాస్త్రాలని కూడా అధ్యయనం చేసినటువంటి కావ్యకంఠుడు ఆయన మామూలు వాడు కాదు అటువంటి ఆయన నీవు ఎవరో తెలుసుకో అని ప్రశ్న వేశారు అంటే ఆత్మానుభూతిని ఎంత గాఢంగా అనుభవించారో వీరు అని అనుకొని ఈనే నా గురువు అని స్థిమిత పడ్డాడు ఆయన చూడండి. ఆయన అనుకున్నారు శాంతిర్నితాంతమహిత పరమాశ్యశక్తి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్ర జ్ఞానం నిరన్న కుహనం మధురంచ వృత్తం ఋణాం నిదర్శనమయం రమణో మహర్షి. ఒక్కసారిగా వారి నోటి నుంచి ఒక శాంతము మహాసముద్రం ఒక నిర్లిప్తత కరుణ మహాసాగరంగా ముప్పిరిగొని ఉన్నది. వైరాగ్యం చూద్దామా ఏమీ లేదు కౌపీనం తప్ప వైరాగ్యం అద్భుతతమం జ్ఞానం నిరన్న కుహనం ఎంత జ్ఞాని అంటే నాకు చాలా తెలుసు అన్న నా అజ్ఞానాన్ని ఖండించగలిగిన జ్ఞాన ఖడ్గం ఉన్నటువంటి వారు ఈయన ఇన్ని ఉన్నా మధురంచ వృత్తం నాబోటి వాడు ఒక ప్రశ్న వేస్తే ఎంత ఉదాత్తమైన సమాధానం ఇచ్చారు ఋణాం నిదర్శనమయం నిజం ఋణాం అంటే absolutely in reality without any doubt అంటామే నిస్సందేహంగా గురువు అంటే ఈతడే ఈతడు రమణ మహర్షి అన్నారు. [సంగీతం]
YouTube · audio
Sri Ramana Maharshi Vybhavam Part II
Sri Ramana Maharshi Vybhavam Part II
Source: P V S on YouTube
0:00 / 22:24
More in this series