No transcript for this section.
Transcript begins at 0:13.
కరుణాపూర్ణ సుధాబ్ధే కబళితఘనవిశ్వరూపకర్కిరణావలియా అరుణాచల పరమాత్మ అరుణాచల పరమాత్మ అరుణోభవ చిత్తకంజ సువికాయ అరుణోభవ చిత్తకంజ సువికాసాయ నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసితో యజబాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతుపితరం వటమూలవాసం తం స్మారయంతమచలం తమనుస్మరామి ఓం నమో భగవతే శ్రీ రమణాయ నేను ఎవరు ప్రశ్న చాలా చిన్నది పైకి కనిపిస్తుంది అట్లా కేవలం ఐదు అక్షరాల ప్రశ్న ఒక మనిషి జీవిత కాలంలో ఎంత సాధన చేసినా ఎంత శాస్త్రాధ్యయనం చేసినా ఎన్నెన్ని పుణ్య కార్యాలు చేసినా ఎంత సమున్నతమైన ఉదాత్తమైన జీవితాన్ని గడిపినా మానవుడి జీవలక్షణాలైనటువంటి అహంకార మమకారాల వలన తనను తాను తెలుసుకోకుండానే కనుమూస్తాడు మరి ఈ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్న దాన్ని రమణాస్త్రంగా రమణులు ఈ ప్రపంచానికి విసిరిన బ్రహ్మాస్త్రంగా మనం భావిస్తాం సర్ ఒక్క నిమిషం నిజానికి సర్ excuse me ఒక్క నిమిషం ఇది ఒక ఉపనిషత్తులో చర్చింపబడిన విషయం అయితే సర్ కొంచెం కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి రమణులు ఈ ప్రపంచంలోకి ఒక దేహాన్ని తీసుకుని వచ్చి మానవ జాతిని సమున్నతమైన జ్ఞానం వైపు అంటే అచ్చ తెలివి వైపు తనను తాను ఎరుగు ఎరుకలోకి తీసుకు వెళ్లటానికి ఈ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నని అందించారు ఆయన సందించి- సర్ excuse me sir sir అందిచింది ఎందుకంటే అందుకోవలసిన వాడు అందుకుంటాడు అందుకోని వాడు కథాకాలక్షేపం చేసి తన జీవితాన్ని చెల్లగొట్టుకుంటాడు ఈ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నలో ఒక జవాబు ఉన్నది అంటే ఈ కనిపిస్తున్న పాంచభౌతిక దేహంతో కనబడుతున్న నేను ప్రపంచం చేత గుర్తింపబడిన నేను ప్రపంచానికి అక్కరకు వచ్చిన నేను నా కీర్తి నా సౌందర్యము నా సంపద నాకున్న స్థితిగతులు నావిగా భావించిన నేను అన్నింటికంటే నేను ధరించిన ఈ దేహమే శాశ్వతమని భావిస్తున్న నేను దీనిని దాటి ఒక ప్రశ్న వేసుకో వలసిన అవసరం ఉన్నది గనుక వేసుకోకపోయినట్లయితే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ శాశ్వత వస్తువులుగా భావన చేసి మాయావరణంలో ఇరుక్కుపోతాం కనుక అఖండమైనటువంటి భారతావనిలో దక్షిణాపథంలో వింధ్య పర్వతాల కివతల భగవాన్ శ్రీ రమణ మహర్షి తాను ఏ అనుభవాన్ని పొందారో ఏ సత్యాన్ని కనుగొన్నారో తమ పదహారు, పదిహేడు ఏళ్ల మధ్యలో అంటే అతి పిన్న వయస్సులో తన నుంచి ఏమి వెళ్ళిపోతున్నది నేను నేను అను నేనుని భావించిన ఆ నేను ఏమైపోతున్నది నేను పోతున్నది నేను ఉంటున్నది మన కళ్ళ ముందే మన బంధువులు మన స్నేహితులు మనకు తెలిసినవారు తెలియనివారు ఎందరెందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు మనకి ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఒక్కడు వెనక్కి వచ్చి ఫలానా చోటికి వెళ్ళాను అక్కడ బాగుంది బాగాలేదని చెప్పిన వాడే లేడు కనుక ప్రాపంచికమైన లౌకిక భౌతిక అవస్థను దాటి వైరాగ్యాన్ని వైభోగంగా స్వీకరించి తమ అధ్యాత్మ సాధనని ఎవరైతే పదును ఎక్కించుకుంటారో బాహ్య దృష్టిని వదిలి అంతర్ దృష్టి వైపు ఒక్కసారి తమ మనస్సుని మరల్చుకోగలుగుతారో ఈ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నకి ఎప్పటికైనా సమాధానం పొందాలనేటువంటి జిజ్ఞాస కలిగి ఉంటారో మహాత్ముల మహర్షుల ఆత్మానుభూతిని పొందినటువంటి వ్యక్తుల సమాగమం చేత సమాశ్రయం చేత సత్సంగం చేత సత్సాంగత్యం చేత సదాచారం చేత సమ్యక్ భావనా రీతి చేత ఆ ప్రశ్నకి జవాబు కనుక్కుంటూనే ఉంటాడు అయితే వీరందరూ కూడా సహాయపడతారే తప్ప ఆ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నకి నిజానికి నన్ను నేను తెలుసుకోకపోయినట్లయితే ప్రపంచం మొత్తాన్ని తెలుసుకుని ప్రయోజనం శూన్యం అందుకే యోగేశ్వర కృష్ణుడు మోక్షాన్ని గురించి ఉద్ధారణ గురించి చెప్తూఉద్ధరే ఆత్మనాత్మానం అన్నాడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అని. ఈ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అనేటువంటి దానికి అనుబంధమైనటువంటి ఒక ప్రశ్న. ఆ ఎవరు అంటే నేను. నేను అనగానే నా బయోడేటా, నా-నే రాసిన పుస్తకాలు, నాకెవరో ఇచ్చిన బిరుదులు లేకపోతే నన్ను చాలా గొప్పవారు అన్న మాటలు ఇవన్నీ అనుకొని అవన్నీ నేను అని భ్రమిస్తూ ఉంటానే దానిని గనక దాటగలిగినట్లయితే, లోకాన్ని లోకంగా దాన్ని జరగనివ్వండి, వెళ్ళనివ్వండి. దానితో మనకి ప్రమేయం లేదు. ప్రమేయం ఎంతవరకు ఉన్నదంటే లౌకిక సంబంధ కార్యక్రమాలు జరిగే వరకు ఈ ప్రపంచంతో మనకు సంబంధం ఉంటుంది, అది ద్వంద్వం. అది నేను, అంటే నేను, ఈ ప్రపంచం. ఇది ఎరుక కాదు. ఇది ఒక అస్పష్టమైనటువంటి అవిద్య భూమిక ఇది. అనాత్మని ఆత్మగా భావించేటువంటి ఒక అజ్ఞాన క్షేత్రం. దీని నుంచి కనిపిస్తున్నటువంటి అనాత్మ కూడా ఆత్మే అన్నటువంటి భావనలోకి వెళ్ళాలి గనక గురు సమాశ్రయం చేత కొంత లాభం కలుగుతుంది. మహాత్ములు ఇంతకుముందు మనం ఈ భూమండలం మీద రావటానికి ముందే ఎందరెందరో, ఎన్నెన్నో విషయాలు అనేక రీతుల ఒకే సత్యాన్ని మనకు బోధించారో, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. Truth is one, but it is told differently by the wise. ఇది మనందరికీ తెలుసు. వాటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ, నిజ వైరాగ్య భూమికలో ఈ ప్రపంచాన్ని సాక్షిగా చూడగలుగుతూ, అందరి వలె మసలుకుంటూ, అందరి వలె మనగలుగుతూ, కానీ ఆంతరంగికమైనటువంటి ఒక విశుద్ధ వైరాగ్య భూమికలో గనక నిలకడ చెందినట్లయితే ఈ నేనెవరు అన్నటువంటి ప్రశ్నకి తొలి అడుగు పడుతుంది. లేకపోయినట్లయితే భగవాన్ చెప్పారు కాబట్టి ఇదేదో పట్టుకుందాము అంటే అది సాధ్యం అయ్యేది కాదు. భగవాన్ ఎందుకు చెప్పారు అంటే ఇదిగో ఒక వెంకట్రామన్ గా ఆ పోతున్నదేమిటి, ఉంటున్నదేమిటి అన్న రెండు ప్రశ్నలు వేసుకున్నప్పుడు పోతున్నదేమో నేను ధరించిన, భరించిన ఈ దేహం, ఉంటున్నదేమో దానిలో దాగినటువంటి ఆత్మ. అది ఎక్కడికి వెళ్ళటం లేదు, అరుణాచలాన్ని వదిలిపెట్టి వెళ్ళటం లేదు. కేవలం నా దేహం నుంచి బహిర్గతమై సర్వాత్మ అయినటువంటి ఒక భావనలో ఉండి మళ్ళీ తాను ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఎట్లా ఎట్లా ఉండాలో అది సంచారం చేస్తూ ఒక విశ్వభావనా ధారణతో అది ఉంటుంది కనుక ఆ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నలో ఆయనకు దొరికినటువంటి సమాధానం ఏమిటంటే, నేను అఖండ చిద్ఘన రసమైనటువంటి ఆత్మను. చిదానంద రూపం శివోహం శివోహం అన్నీ నేనే కానీ ఏదీ నేను కాను. ఇది విరోధాభాస. అన్నీ నేనైనప్పుడు ఏదీ నేను కాదంటే ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి పంచభూతాలు, సూర్య చంద్రులు, నక్షత్ర తారకాగణం, ఇదంతా నేను అని గనక అనుకున్నట్లయితే కాదు. పంచభూతములు దివాకరుండు నిశాకరుడు నీ తను సప్తకంబయైన ఈ శరీరంబు నీదే. కన్ను విప్పుట, కన్ను మూయుట, నీవు కలుగకెట్లు? ఏతదధిష్ఠాత ఎవడో యజమానుడైన అష్టమ తనువు వాడు. అంటే, ఈ కనిపిస్తున్నటువంటి నీరు, నిప్పు, గాలి ఇవన్నీ ఉన్నాయి కదా పంచభూతాలు. సూర్య నాడి, చంద్ర నాడి ఐదు. ఈ రెండూ కూడా కలిపితే ఏడు. దీనికి తను సప్తకము అని పేరు పెట్టారే. తను సప్తకం అంటే ఏడు శరీరాలు. ఈ ఏడు శరీరాలు కూడా నడవటానికి, చూడటానికి, వినటానికి, అనుకోవటానికి, అనుభవం పొందటానికి, అనుభూతి చెందించుకోవటానికి, కడగా విభూతి వైపు దారి తీయటానికి ఎవరు కారణం అవుతున్నారు తెలియదు. కన్ను విప్పుట, కన్ను మూయుట, నీవు కలుగకెట్లు? ఆ నీవు ఎవరంటే భగవాన్ రమణ మహర్షి ఎప్పుడూ దేవుడు, రాముడు ఈ మాటలు మాట్లాడలేదు. ఆయన కర్త అని ఒక్క పదం వదిలేశారు. దేవుడు చాలా పరిమితమైనటువంటి భావం. దేవుడు అంటే మనతోపాటు కూడి ఉండేవాడు, మనలాగా ఉండేవాడు, మన చేత నడిపించేవాడు, మనతోపాటు నడిచేవాడు, మనలాగా ఉండేవాడు. కాబట్టి ఆయనకు కూడా పరిమితులు చాలా ఉన్నాయి. కానీ కర్తకి పరిమితులు లేవు. అపరిమితము, అనంతము, అచ్యుతము, అవ్యయము, అవినాశమైనటువంటి ఒక భావన ఏదైతే ఉన్నదో దానిని కర్తగా గనక మనం భావించగలిగినట్లయితే కన్ను మూయుట, కన్ను మూయటానికి మనం కారణం కాదు. కన్ను తెరవటానికి ఆయన కారణం కాదు అంటే జన్మ ఎత్తటానికి మనం కారణం కాలేదు, జన్మ ముగించుకోవటానికి మనం కారణం కాలేదు. కానీ ఈ రెండింటికీ కారణమైన కర్త ఎవడంటే, ఏతత్ అధిష్ఠాత ఎవడో యజమానుడన, ఈ ఏడు గదులు దాటిన తర్వాత, ఏడు స్థాయిలు దాటిన తర్వాత ఇంకా అనుభవంలోకి రాని, ఇంకా ఉన్నది అనుకుంటున్నటువంటి ఒకానొక ఆత్మ, అదే అధిష్ఠాత. దానిని వాడు అంటున్నాం. Third person. నీవు, నేను కాదు వాడు. ఆ వాడు కనపడడు. ఆ వాడు ఆ ఇంద్రియాలకు లోబడిన వాడు కాదు. మన తపస్సుకి, మన ధ్యాన ధారణాతీత స్థితులకి, మనం చేసేటువంటి సత్కర్మలకి అంత తేలికగా లభించే వాడు కాదు. ఆ వాడు అనేటువంటి పదం అచ్చ తెలుగులో వాడాం గనక నిజానికి అది అన్నమాట, that. సంస్కృతంలో తత్. ఆ that అన్నా, తత్ అన్నా, అది అన్నా, ఆ అది అంటే ఏది కంటికి కనపడటం లేదోదేనిని ఈ కనులు మనం చూడలేమో కనులతో కానీ దేనివలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మమై ఉన్నది గనుక బ్రహ్మము అన్నా, ఆత్మ అన్నా, పరమాత్మ అన్నా, పరబ్రహ్మ అన్నా అన్నీ కూడా పర్యాయ పదాలే. కనుక భగవాన్ శ్రీ రమణ మహర్షి ఈ జగత్తులోకి వచ్చి తాము పదహారు, పదిహేడు సంవత్సరాల మధ్యలో పొందినటువంటి ఒక మరణానుభూతి. ఆ మరణానుభూతి లో నుంచి తనను తాను ఎరుగు ఎరుకను సంప్రాప్తింపజేసుకొని తాను విచలుడు కాలే అచలుడై, అక్కడి నుంచి అచల అరుణ కలిసినటువంటి అచల అంటే కదలని, అరుణ అంటే బాంధవ్యమే లేని, బంధలే లేని, వ్యామోహమే లేని, వ్యసనమే లేనటువంటి ఒక నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ఆవాహన చేసుకున్నటువంటి వెంకట్రామన్ అరుణాచలానికి వచ్చి వారు అక్షర మణమాలలో చెప్పినట్లుగా "అరుణాచల మనసు స్మరించు వారలహము నిర్మూలింపు అరుణాచల" అంటే ఆ నేను, నాది అన్న రెండు భావాలు గనక పోకపోయినట్లయితే మనం జ్ఞానులము కాదు, ఆత్మను ఎరిగిన వాళ్ళము కాదు, ఆత్మ స్వరూపులము కాదు. నిజానికి ఆత్మ బంధువులము కాదు. ఈ పదాలు చాలా తేలికగా మనం వాడతాం, అలా వాడకూడదు. సరే, ఇక్కడ పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరమే మనకు ఆధారమవుతున్నది గనుక సర్వ అంగములను కూడా కరచరణాది అవయవాలను అంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, కీళ్ళు అన్నీ నడవటానికి ఒక చోదక మహాశక్తి మన యందు ఉన్నది గనుక, అది రెండు పాయలుగా ఉన్నది గనుక ఒకటి మోక్ష-మోక్షానికి దారి తీసేట్లుగానూ, రెండవది మోక్షం వైపు వెళ్ళకుండా అడ్డుపడుతున్నట్లు గానూ ఉన్నది గనుక అది మనస్సు అయినట్లయితే, ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు కలిసి పది ఇంద్రియాలు అంటే దశేంద్రియాలు అయితే దీనికి ఒక యజమాని ఎవడు అంటే మన మనస్సు గనుక. ఈ పదకొండును కూడా ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, ఇవే నీలో ఉన్న ఏకాదశ రుద్రాలు అని చెప్పింది. ఈ ఏకాదశ రుద్రములు, ఈ పదకొండు గనుక మనం అర్థం చేసుకున్నట్లయితే నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నకు కొంత జవాబు దొరుకుతుంది. అయితే ఇది విన్నంత మాత్రాన, అధ్యయనం చేసినంత మాత్రాన, ఎవరెవరో చెప్పిన ఇంటర్‌ప్రిటేషన్స్ ని చదివినంత మాత్రాన ఆ నేను ఎవరికీ అనుభవం దొరకదు. కానీ మార్గం దొరుకుతుంది. అందుకే భగవాన్ దేవరాజు మొదలి వారితో ఒక మాట అంటారు. ఆయన మహా జ్ఞాని అండి అని ఎవరు అంటే, ఎవరు ఆయన అంటే ఎవరో బాగా చెప్పేవారు, అనేవారు అలాంటి ఆయన అంటే, ఆయన ఏమన్నారంటే "Intellectual interpretation is not జ్ఞాన, it is only విజ్ఞాన" అన్నారు. అది. అంటే ఒక శాస్త్రాన్ని తీసుకుని లేదా ఓ పురాణ గాథను తీసుకుని ఒక గంట సేపు మాట్లాడితే మనం జ్ఞాని అంటాం. అనద్దు అన్నారు. ఎందుకంటే మనం జ్ఞాని అంటాం, జ్ఞాన పుత్రుడు అంటాం, జ్ఞానానికి పుత్రుడు లేడు. జ్ఞానానికి వారసులు లేరు. జ్ఞానము is unique. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పదాలు మనం చాలా జాగ్రత్తగా, చాలా సంయమనంతో వాడాలి. మరి ఇంతకీ విజ్ఞానానికి, జ్ఞానానికి ఏమిటి తేడా అంటే విజ్ఞానం అంటే శాస్త్రం మీద అధికారం, శాస్త్ర పరిచయం. శ్లోకాలు, పద్యాలు, ఇంటర్‌ప్రిటేషన్, ఎక్స్ప్లనేషన్, ఎక్స్‌ప్లోరేషన్ ఇవన్నీ కూడా విజ్ఞానమయ కోశం దాకా వస్తాయి. మరి పరమ ఆనందమయమైనటువంటి ఆనందమయ కోశంలో ఎవరు ఉంటారంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ వీళ్ళెవరూ కూడా అక్కడ ఉండరు. జ్ఞాని అయినటువంటి వాడు ఆనందమయ కోశంలో అన్నివేళలా నిలకడ చెంది ఉంటాడు. ఇవాళ ఈ నేను ఎవరు అన్నటువంటి ప్రశ్నని ఎక్కడ మొదలు పెట్టాలి, జవాబు వెతకటం, అక్కడ నుంచి ఆ జవాబు ఎట్లా పొందాలి కాసేపు విచారణ చేద్దాం. ఉదాహరణకి ఎవరికీ వాళ్ళ మీ-- అంటున్న నాతో పాటు వింటున్న మీరందరూ కూడా మీ దేహాన్ని ఒక్కసారి స్-స్పర్శాభూతితో, అనుభూతితో చూడండి. ఇప్పటిదాకా నేను ఎవరు అనే ప్రశ్నే మనం వేసుకోం. ఎంతసేపు నువ్వు ఎవరు, వాడు ఎవరు చెప్తాం. ఒక రాముడు గురించి ఒక వ్యాసం రాయండి అంటే పుస్తకమే రాసి చేతిలో పెడతాం. అంతెందుకు భగవాన్ రమణ మహర్షి గురించి ఓ బుక్కు రాయండి, ఏదైనా కాస్త చెప్పండి అంటే రెండు వందల పేజీల పుస్తకం రాస్తాం. దక్షిణామూర్తి గురించి రాస్తాం, శంకర భగవత్పాదుల గురించి రాస్తాం, అందరి గురించి రాస్తాం. మీ గురించి కాస్త నాలుగు మాటలు మీరే చెప్పండి అంటే ఒక్క నిమిషం తటపటాయిస్తాం. ఎందుకంటే మనం కాకుండా ఉన్న ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరి గురించి మన దగ్గర విషయం ఉంది, information ఉంది. దాన్ని మనదైనటువంటి భాషలో, మనదైనటువంటి రీతిలో చెప్తాం. మన గురించి మనం ఎందుకు చెప్పుకోలేకపోతాం, నాలుగు మాటలు చెప్పుకోలేము అంటే మన గురించి మనకు ఏమీ తెలియదు గనుక. అంతే, ఇదే జవాబు. మన గురించి మనకు తెలిసిన రోజున అసలు చెప్పటానికంటూ ఏం లేదు. అది. చెప్పటానికంటూ ఏమీ మిగలలేదో, నేను అన్న భావన ఎప్పుడైతే సమసిపోయిందో, "అహం మమత్వా సిధిలాయమానే" అంటారు శంకర భగవత్పాదులు యోగతారావళిలో. అహం పోవాలి, మమత్వం పోవాలి. అంటే నాది అన్న భావన పోవాలి. ఇవి అంత తేలిగ్గా పోతాయా? పోవు. కానీ ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత ఒక సాధకుడి మీద ఉన్నది గనుక ఆ తత్వ విచారణ చేద్దాం. శరీరాన్ని మనం మూడు శరీరాలుగా అందరికీ పరిచయమైన మూడు శరీరాలు ఉన్నాయి.స్థూల శరీరం ఒడ్డు, పొడుగు, ఎరుపు, నలుపు, తెలుపు ఇట్లా రంగుతో అందంతో అనేక విషయాలు తెలిసినటువంటి వ్యక్తిత్వంతో పైకి కనిపిస్తున్నటువంటి ఒక బాహ్య రూపం ఒకటి ఉన్నది. దానిని నేను అనుకుంటున్నా. ఈ నేను ఎక్కువ సేపు పద్దెనిమిది గంటలు సుమారుగా జాగ్రత్ అవస్థ లో ఉంటుంది లేదా పదహారు గంటలు ఉంటుంది. జాగ్రత్ అవస్థలో తనంతట తాను ఏ పని చేయలేదు కర్మ తజ్జడం. కాబట్టి, ఏమీ చేయనటువంటి ఈ దేహాన్ని ఆశ్రయించి ఈ దేహం ద్వారా, ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, సంస్కారం ద్వారా, జీవన దృక్పథం ద్వారా, జీవన విధానం ద్వారా మనం అనేకమైన కార్యకలాపాలు చేస్తాం. పాడుతాం, ఆడుతాం, కూడుతాం, వీడుతాం, దుఃఖిస్తాం, ఆనందంతో నృత్యం చేస్తాం, విషాదంతో కురుకుపోతాం. ఇవన్నీ కూడా మనస్సు చేసేటువంటి ఒక గారడీకి లోనై సర్వేంద్రియాలతో సర్వాంగీనమైనటువంటి ఈ దేహం ఒక్కసారి దానికి బానిస అయిపోతున్నది గనుక, ఈ పద్దెనిమిది గంటలో, పదహారు గంటలో జాగ్రత్ అవస్థలో ప్రకృతితో, ప్రపంచంతో అంటే ఈ జగత్తుతో, జనులతో ఇక్కడ జరుగుతున్న అనేకమైనటువంటి కార్యకలాపాలతో ఒక సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకొని దాని దుఃఖాన్నే మన దుఃఖంగా, దాని సంతోషాన్నే మన సంతోషంగా, ప్రకృతి వెలార్చేటువంటి అనేక సౌభాగ్య రేఖలన్నింటినీ కూడా మనవిగా భావించి ప్రతిస్పందిస్తూ మనం చాలా జాగ్రత్ అవస్థ లో ఉన్నాము అని అనుకుంటాం. ఆ అనుకునేటువంటి ఆ దశ పేరే జాగ్రత్ అవస్థ. ఈ జాగ్రత్ అవస్థ చాలా సమయం తీసుకుంటుంది. జీవుడి ఒక రోజు కాలాన్ని గనుక తీసుకున్నట్లయితే పదహారు, పద్దెనిమిది గంటలు అయిపోతుంది. తర్వాత దేహం లౌకిక సంబంధ కార్యక్రమాల్లో విసిగిపోయి, అలసిపోయి, సొలసిపోయి కాస్త నిద్రలోకి వెళుతుంది. అది జార్జ్య నిద్ర అన్నారు. ఈ జార్జ్య నిద్ర అంటే రోగంతో కూడిన నిద్ర అని. నిద్రలోకి వెళ్లినా జాగ్రత్ అవస్థ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుభూతులు, అనుభవాలు, అవమానాలు అలాగే జయాపజయాలు ఈ ద్వంద్వాలన్నీ కూడా ఒక రూపుదిద్దుకొని స్వాప్నిక అనుభవాన్ని మనకిస్తూ మళ్ళీ మనల్ని అక్కడ మనస్సు వెన్నాడుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే మనము అజార్జ్య నిద్రలోకి వెళ్ళే దాకా జార్జ్య నిద్రలో ఉంటాం. అంటే దానికి నిద్రావస్థ. ఈ నిద్రావస్థలో స్థూల శరీరం ఏమైపోతున్నదో మనకు తెలియదు. మనం మంచం మీద పడుకుంటాం. కాలు ఎక్కడో, చెయ్యి ఎక్కడో తెలియదు. చుట్టూ ఏం జరుగుతున్నదో తెలియదు. ప్రపంచంలో జరిగే ఏ విషయంతోనూ మనకు బాంధవ్యం లేదు. అసలు ప్రపంచం మనల్ని పట్టించుకోదు ఆ రాత్రి. మనము ప్రపంచాన్ని పట్టించుకోం. అంటే మనకు తెలియకుండానే ఒక సెపరేషన్ జరిగిపోతున్నది అన్నమాట. అయినా ఇంకా మనస్సు అక్కడ యాక్టివ్ గా ఉన్నది కాబట్టి, అచేతనావస్థకు వెళ్ళలేదు కాబట్టి మనస్సు అనేకమైనటువంటి మన భావాలన్నింటినీ కూడా కలలుగా చూపిస్తూ మనకి నిద్రని అటూ ఇటూ కాని స్థితిలో ఉంచుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆ స్థితిలో అనుభవించేటువంటి ఆ శరీరానికి పేరు సూక్ష్మ శరీరము అని పేరు. అది కొద్దిసేపు ఉంటుంది ఆరేడు గంటలు. లేదు, అది పద్దెనిమిది గంటలు అయితే ఇది ఆరు గంటలు, ఆ ఐదున్నర గంటల పైన ఉంటుంది. ఈ స్థూల శరీరము అచేతనమైంది. మనకు చేతుల్లో లేదు. సూక్ష్మ శరీరం మళ్ళీ తలతల వారుతున్నటువంటి వేళ సుమారుగా బ్రాహ్మీ ముహూర్తంలో ఆ వేకువజామున మనం నెమ్మదిగా జాగ్రత్ అవస్థ లోకి వచ్చేటువంటి, ప్రవేశించి అంటే తిరిగి ప్రవేశించేటువంటి విషయంలో అప్పుడు కాసేపు నిద్రపోతాం. కాసేపు మనల్ని మనం మైమరచి ఉంటాం. ఆ మైమరపు కలిగించేటువంటివి కొన్ని క్షణాలు మాత్రమే. దానికి కారణ శరీరము అని పేరు పెట్టారు. ఇక్కడి వరకు ఆగినట్లయితే స్థూల శరీరమా మంచం మీద పడుకున్నది. అది ఒట్టి కట్టె ఆ క్షణంలో. మనం అనుకున్నటువంటి సూక్ష్మ శరీరమా మనస్సు వలన కలలు కంటున్నది. కలలో ఏనుగు వస్తున్నది, మన పక్కన కూర్చుంటున్నది, మనతో మాట్లాడుతున్నది, మనం కూడా దానితో మాట్లాడుతున్నాం. కళ్ళు తెరిచాం, ఏనుగు లేదు, మాట్లాడటం లేదు. దేశకాల కరణా వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు. అంటే కల ఏదైనా కల్లే. Just a reflection of what we are thinking. ఆ ఆలోచన అక్కడ ఆగిపోయింది గనుక, ఆలోచన సంపూర్ణం కాలేదు గనుక, ఆలోచనకు ఒక రూపం ఇవ్వాలని మనం సంకల్పించుకున్నాం గనుక, మనం మన మనస్సుని స్థిరపరుచుకున్నాం గనుక ఇదిగో ఇది ఇట్లా, ఇది ఇట్లా, ఇది ఇట్లా అని చూపిస్తున్నది అది నిజం కాదు. పోనీ ఈ కారణ శరీరము శాశ్వతమా అంటే వెంటనే తల వారుతుంది. ఇంద్రియాలు నెమ్మది నెమ్మదిగా నిద్రావస్థ నుంచి, స్వాప్నిక అవస్థ నుంచి జాగ్రత్ అవస్థలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అక్కడ నిద్ర లేస్తాం. నిద్ర లేస్తూనే ఆ గదిలో నుంచి మన హాల్లోకి వచ్చి, "ఇవాళ రాత్రి ఎంత హాయిగా ఉన్నదో! ఎంత మంచి నిద్ర పోయానో!" అని చెప్తున్నాం. నిద్ర పోయినట్టు నీకు తెలుసా? నిద్ర, ఆ అనుభవాన్ని నీవు పొందటానికి ఎవరు పొందారు? ఆ పొందిన వారు ఎవరు? శరీరమా? ఇందాకే చెప్పాం, ఒట్టి జ-జనపకట్టె అది, జడము అది. స్వప్నమా? ఇంద్రియాలకు లోబడినటువంటి ఒక అవస్థ అది. అక్కడ మనస్సు ప్రేరేపితం చేస్తున్నది. ఇక మూడవది కారణ శరీరమా? క్షణకాలమై ఉన్నది. అది కేవలం ఒక ఆనందాన్ని, ఒక హాయిని ఇచ్చింది. ఈ మూడు శరీరాలు ఒకే శరీరం అనుకున్న మనకి ఇప్పటికే మూడు శరీరాలు ఏర్పడిపోయినాయి.ఇక నాలుగవది మనస్సు. ఇగో ప్రపంచంలోకి వచ్చాం. హాయిగా ఉన్నది అన్నావు రాత్రంతా. ఎందుకన్నావు? పదహారు గంటల నిడుపాటి జాగ్రదావస్థలో ఎన్నో ఇగో ఇట్లా మాట్లాడాం, విన్నాం. చాలా సంపాదించుకున్నాం. చాలా చోట్లకు వెళ్ళాం. చాలా మందితో కూడాం. ఎన్నెన్నో అనుభవాలు మూటగట్టుకున్నాం పదహారు గంటల్లో. కానీ, నిద్రపోయే సమయంలో ఏమంటున్నావ్ అంటే అలసిపోయాను అంటున్నావ్. బాగా పని చేశావు కనుక అలసిపోయినావ్. స్వప్నావస్థలో నీకు పనే లేదు. ఎవరో మనస్సు కలగంటున్నది నీకు చెప్తున్నది. నీ మనస్సే resonance గా reflection గా resound గా నీకు వినిపిస్తున్నది. అది కూడా నేనే అనుకుంటున్నావ్ కానీ నువ్వు కాదు. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం అక్కడ అది కూడా ఒక మన ఇంట్లో ఉన్నటువంటి అద్దం. ఆ అద్దంలో మన బొమ్మ మనకు కనిపించినట్లు. తెరమీద బొమ్మ వలే ఉందన్నమాట. అదీ అయిపోయింది. కారణ శరీరము హాయిని ప్రకటిస్తున్నది కానీ అది అనుభవించిందా అంటే ఏమో తెలియదు. అది ఇంకా అనుభవించింది అని ఎప్పుడు చెప్తున్నది? అనుభవం ఉండగా చెప్పడంలా. నిద్ర మెలుకువలోకి వచ్చి, ఇలలోకి వచ్చి కలలో నుంచి బయట ఉన్నటువంటి వారికి, అందుబాటులో ఉన్నవారికి నేను చాలా హాయిగా ఉన్నాను అని చెప్తున్నావ్. అంటే ఏమీ చేయకపోతే ఒక హాయి కలుగుతుంది అన్నమాట. ఏమీ చేయకుండా ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి అంటే అన్నీ చెయ్యి కానీ దేంతోనూ ప్రమేయం పెట్టుకోకు. ఇది జవాబు. ఈ మూడింటిని కాసేపు అక్కడ పెట్టినట్లయితే మనకర్థమైంది ఈ మూడు శరీరాలు మనవి కావు. ఇక నాలుగవది మనస్సు ఒక శరీరం. మనస్సు అంటే అది దానికి రూపం లేదు. కానీ బహు శక్తివంతమైనది. ఆలోచనా సమూహమే మనస్సు కదా. The bundle of thoughts is the mind. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే ఒక సంస్కారంలో నుంచి పుడుతున్నాయి. సంస్కారం ఎక్కడి నుంచి పుడుతున్నది అంటే జన్మలో నుంచి, కర్మలో నుంచి పుడుతున్నది. కర్మలో నుంచి ఏం పుడుతున్నది అంటే జన్మ పుడుతున్నది. జన్మలో నుంచి, జన్మ ఎక్కడ నుంచి అంటే వాసనలలో నుంచి, మూల వాసనలలో నుంచి పుడుతున్నది. అంటే మూల వాసనలు, వాసనలు, జన్మలు, కర్మలు తద్వారా ఏర్పడినటువంటి ఒక ఆనందమో, దుఃఖమో ఏదో ఒక అనుభవం కలుగుతూ ఉన్నది గనుక ఆ ఆలోచన అనేకమైన ఆలోచనలు గనుక ఒకచోట గుదుగుచ్చినట్లై, అయినట్లయితే దాని పేరు మనస్సు అని పేరు పెట్టుకున్నాం. మరి ఈ మనస్సు ఎక్కడ ఉన్నది ఈ దేహంలో? పైదేహం కనిపిస్తున్నది. ఏది? చర్మము, ఎముక, మాంసము, మజ్జ, రక్తము దీనితో కూడి అస్థిపంజరాలతో కూడి ఉన్నటువంటి శరీరం కనపడుతూనే ఉన్నది. మరి ఈ కనపడుతున్నటువంటి ఈ శరీరంలో కనపడని మనస్సు ఎక్కడ ఉన్నది అని ప్రశ్న వేస్తే, అది మన ఆలోచన ఎక్కడ కలిగితే అది అక్కడ ఉన్నది. కాళ్లో ముల్లు గుచ్చుకున్నది. కాలు ఎప్పుడూ ఏడవలేదు. దానికి తెలియదు ఏడవటం. కన్ను ఏడుస్తున్నది. ఎక్కడ కాలు? ఎక్కడ ఈ కన్ను? అంటే కంటికి కాలుకి ఒక సంబంధం ఉన్నది. ఆ సంబంధం ఏర్పరిచింది ఎవరంటే మళ్ళీ మన మనస్సే. ఈ మనస్సు సర్వాత్మకమై ఉన్నది. అది ఎక్కడ ఉంటుందో తెలియదు. మనకు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటుంది అది. ఉండి మనలో పుట్టి మనతో ఉండి మన కంటికి కనపడకుండా మనల్ని మహాదుఃఖానికి గురిచేస్తున్నది. తెలియని ఆనంద డోలికలలో విహారాలు ఊపుతూ ఉన్నది. కనుక ఈ మనస్సు ఒక శరీరమై మనలో ఒక భాగం, ఒక పొరగా ఉన్నది. ఈ మనస్సుని మనం శుద్ధమనస్సుగా చేసుకోవాలి. ప్రాపంచికమైనటువంటి ఒక మనస్సుకి లాలస ఉన్నది, భోగమున్నది, ఆశ ఉన్నది, ఆకాంక్షలున్నాయి. అలాగే నిస్పృహలున్నాయి, నిరాశలున్నాయి, వైఫల్యాలున్నాయి, వైక్లభ్యాలున్నాయి. ఇవన్నీ మనస్సు పరమైనటువంటి భావాలు. వీటన్నింటినీ గనక దాటగలిగితే, ఎలా దాటాలి? ఆ దాటటానికి మొట్టమొదట మనం అనుకోవలసింది స్థూలంగా కనిపిస్తున్న ఈ పాంచభౌతిక దేహము నేను కాదు. నెంబర్ వన్. నెంబర్ టు. స్వప్నావస్థలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని నేను కాదు. మహానందాన్ని అనుభవించానని అనుకుంటున్నటువంటి కారణ శరీరము కాదు. ఇదిగో ఇన్ని పనులు చేయిస్తున్న, ఏడిపిస్తున్న, ఆనందింపజేస్తున్న, హర్షాతిరేకమైనటువంటి భావనతో మనల్ని ఉయ్యాలలూపుతున్నటువంటి ఈ మనస్సు మనలో గర్వము, ప్రగల్భము, దర్పము, అహంకారము, మమకారము, మమతా ఇవన్నీ కూడా ఏర్పడినటువంటి, మూలమైనటువంటి ఒక మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సు కూడా నేను కాదు. కాబట్టి ఏ మనస్సు నువ్వు ఒక సంస్కారంతో ఈ జన్మ తీసుకొని వచ్చావో అది ప్రాపంచికమైన మనస్సుగా గనక ఉన్నట్లయితే దానిని మానవీయమైనటువంటి మానవతాభావంతో దాన్ని తీర్చిదిద్దు. దానిని దైవీభావం, దైవీగుణాలతో ఆ మనస్సుని పునర్నిర్మాణం చెయ్. ఇక మూడవది spiritualize చేయాలి. అంటే అధ్యాత్మ అంటాం. అధ్యాత్మ అంటే చాలా అందమైనటువంటి మాట. అక్కడ జాతి లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, కులం లేదు, ఏమీ లేదు. నిజానికి లింగభేదం లేదు. అసలు ఒక జంతువుకి, ఒక మానవుడికి అంటే మనకి మిగతా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి కూడా ఏమీ తేడా లేదు అనేటువంటి భావన ఇదిగో ఈ మనసుకు గనక మనం ఇచ్చే శక్తిని, దానిని ఆలోచింపగలిగినటువంటి ఒక విన్నానాన్ని మనం గనక దానికి నేర్పగలిగినట్లయితే మనస్సు మన అధీనంలో ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏ పని జరిగినా ఎవరి వలన జరుగుతున్నది అని గనక అనుకున్నట్లయితే ఆ ఎవరి వలన అన్నటువంటి ప్రశ్నమనం వేసుకుంటే మన వల్ల కావటం లేదు, మన వల్ల జరగటం లేదు, ఎవరి వల్లనో జరుగుతున్నది. ఆ జరుగుతున్న దాంట్లో మనం ఉన్నాం ఇది spirituality. అధ్యాత్మ మరణానంతర సుఖం కాదు, మరణానంతరం సుఖము లేదు, దుఃఖము లేదు అని అధ్యాత్మ చెప్తూ ఉంటే, ఇదే అధ్యాత్మ మనకి ఏం చెప్తుంది అంటే, నిజానికి ఈ లోకంలో నువ్వు ఉండగా కూడా సుఖము లేదు, దుఃఖము లేదు. ఎప్పుడు లేదది? నీ మనస్సుని నీవు కావలసినట్లుగా మలుచుకున్నప్పుడు, నీ మనస్సు నీ మాట వింటున్నట్లుగా ఉన్నప్పుడు, ఏ ప్రభావానికి లోను కాని స్వభావ స్థితిలో నీవు ఉండగలిగినప్పుడు, వృత్తి, ప్రవృత్తిని దాటి నివృత్తి మార్గంలో నీవు సంచారం చేయగలిగినప్పుడు, అంతా కూడా ఏకమేవాద్వితీయం బ్రహ్మ. రెండోదంటూ లేదు. మన మనస్సు ఉన్నంత కాలం దుఃఖం ఉన్నది, మన మనస్సు ఉన్నంత కాలం సుఖం ఉన్నది. మనకి ఇది దుఃఖం అని, ఇది సుఖం అని చెప్తున్నది ఎవరంటే, ప్రాపంచికమైన మనస్సు. కాస్త దాన్ని దాటినట్లయితే, ఒక శుద్ధ మనస్సు ఏర్పడితే, ఏర్పడుతుందా? అంటే, ఏర్పడుతుంది. సాధనలో ఆ శుద్ధ మనస్సు అంటే ప్రాపంచికమైన మనస్సుని దాటినటువంటి ఒక ఉదాత్తమైన, ఉన్నతమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, సంస్థితమైన మహాస్థితి కాబట్టి దాంట్లో గనక మనల్ని మనం అర్థం చేసుకొని, ఏమిటి ఈ మనస్సు? మనస్సు చెప్తే నేను లొంగుతున్నానా? మనస్సు చెప్తుంటే నేను దుఃఖిస్తున్నానా? మనస్సు ఏడవమంటే ఏడుస్తున్నానా? ఆనందించమంటే ఆనందిస్తున్నానా? ఎవరీ మనస్సు? నా యందు పుట్టినది, నా మీద ఆధిపత్యం వహిస్తూ, నన్ను నిర్వీర్యుడిని చేస్తున్న ఈ మనస్సు నాకు అక్కర్లేదని వాసనారహితమైనటువంటి ఒక మనోనిర్మాణాన్ని సాధకుడు చేసుకోవాలి. ఇది ధారణ వలన, ధ్యానం వలన, సదాచారం వలన, సమ్యక్ సంకీర్తన వలన, ఇదిగో సత్సంగం వలన, సత్సాంగత్యం వలన, సద్గురు సమాశ్రయం వలన, సద్గోష్ఠి వలన, ఇవన్నీ గనక ఒనగూడినట్లయితే శుద్ధ మనస్సు నెమ్మది, నెమ్మది, నెమ్మదిగా రూపుదిద్దుకుంటుంది. కానీ సుమా! గుర్తుంచుకోండి మనస్సు అక్కడే ఉంది. కాకపోతే ప్రాపంచికమైన మనస్సు శుద్ధ మనస్సుగా మారింది. శుద్ధ మనస్సుగా మారినటువంటి సమయంలో ఆ మనస్సు కూడా అణగిమణగి ఉంటుంది. మనల్ని ఉద్వేగానికి గురిచేయదు. ఏది రాని, ఏది పోని, ఏది జరగని, ఏది జరక్కపోని, ఎన్ని మాన, అవమానాలు జరగని, ఎన్ని పోగొట్టుకొని, ఎన్ని రాబట్టుకొని స్థిమితంగా, neutral గా అంటామే అలా ఉంటుంది. అక్కడే Equanimity, Equilibrium and Equipoise అని ఈ మూడు స్థితులు మనకు సమస్థితిలో ఏర్పడుతాయి. కనుక దుఃఖానికి లొంగక, ఆనందానికి పొంగక, మహా విషాదానికి కుంగక, ప్రాపంచికమైన ఏమై-ఏ రకమైనటువంటి ఆకర్షణకు లొంగక, ఒంగక ఎవరైతే ఉంటారో వారికి శుద్ధ మనస్సు ఏర్పడుతున్నట్లు లెక్క. ఏర్పడినట్లు కాదు. కాబట్టి ప్రాపంచికమైన, లౌకిక, భౌతికమైన, లాలసామయమైనటువంటి మనస్సుని శుద్ధ మనస్సుగా రూపాంతరీకరణం తీసుకో-చేసుకోగలిగినట్లయితే, చేసుకుని ఆ మరుక్షణం మనకి మనం-మనస్సు తర్వాత బుద్ధి ఏర్పడింది. అది ఒక శరీరం. ఇప్పటికి నాలుగు శరీరాలు అయిపోయినాయి. ఐదవ శరీరం బుద్ధి గనక అయినట్లయితే, బుద్ధి అంటే మనం ఇవాళ intellect అనే మాట వాడుతున్నాం, అనుకున్నాం. ప్రజ్ఞ, మేధాశక్తి. ఈ intellect, ఈ బుద్ధి, ఆ, అంతా కర్మను బట్టి బుద్ధి ఉంటుంది అనేదో అంటారు, అవన్నీ వేదాంత భాష. ఇక్కడ స్పష్టమైనటువంటి, సూటి అయినటువంటి, గంభీరమైనటువంటి direct path గురించి మనం మాట్లాడుతున్నాం. భగవాన్ రమణ మహర్షి ఇచ్చిందే direct path. దానికి అటు, ఇటు deviations లేవు. కాబట్టి ఇక్కడ ఈ బుద్ధి ఏమిటి అంటే, బుద్ధత్వం ఎవరి యందు ఉంటుందో, అంటే enlightenment, ఇప్పటిదాకా పైకి కనిపిస్తున్న దేహము నేను కాదు, స్వప్నావస్థలో ఉన్న దేహం నేను కాదు, కారణ శరీరం నేను కాదు, ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఆ మనస్సు కూడా నాది కాదు అనుకున్నారో, ఆతడి యొక్క బుద్ధిలో ఒక enlightenment, దానిని ప్రబోధ సమయే అంటారు భగవత్పాదులు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా, యస్సాక్షాత్కృతే ప్రబోధ సమయే. ఆ state of enlightenment మనందరికీ ఉంటుంది. కానీ మనం పట్టుకోం. ఎన్నో సార్లు మనకి ఆ enlightenment కలుగుతుంది. వెంటనే ప్రాపంచికమైన మనస్సుగా శుద్ధ మనస్సుని మనం మార్చుకుంటాం, ఇబ్బంది పడిపోతాం. కాబట్టి ఈ బుద్ధి అంటే, నాకు ఎన్ని PhDలు ఉన్నాయి, నాకు ఎవరెవరు ఏ బిరుదులు ఇచ్చారు, నాకు ఎంత ఆస్తి ఉంది, నాకు శిష్యులు ఎంతమంది ఉన్నారు, నేను మహా గురువుని అయిపోయాను అని ఎవరైతే భ్రాంతిలో ఉంటారో, ఆతడికి enlightenment లేదు అని అర్థం. అనునిత్యమూ, అనుక్షణమూ నేను ఇంకా, ఇంకా, ఇంకా, నన్ను నేను ఎరుగు ఎరుకలోకి వెళుతున్నాను అని ఒక్కొక్క గడి దాటుతూ, దాటుతూ గనక వెళ్లినట్లయితే, ఆ బుద్ధి ఏమవుతుందంటే సద్బుద్ధిగా మారుతుంది. సత్ బుద్ధి. ఆత్మ విచార మార్గంలోకి కావలసినటువంటి ఒక పదునైనటువంటి intellect, sharp intellect అంటాం. sharp intellect అంటే గ్రహించటం, ఏదో గుర్తుపెట్టుకోవటం, IQ లో చాలా ఒక level కి వెళితే, ఇవేవీ కాదు. ఇవన్నీ కూడా ప్రాపంచికమే. ఇక్కడ ఈ బుద్ధి ఏమిటంటే, దేనిని గ్రహించాలో, దేనిని పొందాలో, దేనిని వదిలిపెట్టాలో, ఎంత కావాలో, ఏది అక్కరలేదో, దానికి విచక్షణ అని ఒక పేరు ఉంది. ఈ విచక్షణని వాడటానికి ఓ వివేకం కావాలి. వివేకము ప్లస్ విచక్షణ ఈజ్ జ్ఞాన. ఇది derivation, ఇది equation. కాబట్టి ఈ రెండూ మనస్సుని ఎప్పుడైతే శుద్ధ మనస్సుగా ఏర్పరచుకున్నామో...మన ముందు జరిగిపోతున్నటువంటి అనేకానేక సంఘటనలు అందులో ఆనందాలున్నాయి, విషాదాలున్నాయి, అవమానాలున్నాయి అన్నీ తెరమీద బొమ్మగా చూపించే ఒక బుద్ధి మనకు ఏర్పడింది గనుక దానికి సద్బుద్ధి అని పేరు పెట్టుకుందాం. లేకపోతే ఆ మనసుకు లొంగని విధికి కూడా లొంగని విధిలిపి నాశయంతి అంటుంది ఆత్మ. కాబట్టి విధి లిపి ఏదో బ్రహ్మ రాత రాశాడు ఎవరు చెరపలేరు ఇవన్నీ కూడా చాలా పైపై మాటలే తప్ప లోతైన మాటలు కావు. మన విధి రాయబడి ఉంటే దానిని సక్రమంగా తీర్చిదిద్దుకోగలిగినటువంటి ఒక అనంత మహాశక్తి మన యందు ఉన్నది, దానివైపు మనం వెళుతున్నాం. కాబట్టి ఈ బుద్ధి ఎప్పుడైతే ఒక విశ్లేషణాత్మకమైన, వివరణాత్మకమైన, విస్తృతమైన ఎందుకు ఇవి అంటే స్పర్శానుభూతి, స్పర్శ అంటే విమర్శ. మనం ఇంకో-ఇంకొకరిని విమర్శించడం చాలా తేలిక. మనల్ని మనం విమర్శించుకోవటం చాలా కష్టం. మనకు తెలియదు. దేనిని విమర్శించాలో, దేనిని వదిలిపెట్టాలో, అసలు నేనేమిటో తెలియనప్పుడు, నన్ను నేను విమర్శించను. అవతల వాడిని గురించి నాకు ఏమీ తెలియకపోయినా వాడిని గురించి విమర్శిస్తా. చూశారా, ఇది అశుద్ధ మనస్సు, అపరిపక్వ మనస్సు, శుద్ధ మనసుకు ఇది లేదు. దాని ఉదాహరణలు తర్వాత చెప్పుకుందాం. కాబట్టి ఈ బుద్ధి ఏ స్టేట్ ఆఫ్ ఎన్లైటెన్మెంట్ లోకి అడుగు పెడుతున్నటువంటి వేళ ఏర్పడినటువంటి వివేకము, విచక్షణతో కూడినటువంటి జ్ఞానాత్మకమైన జ్ఞాన సంపన్నమైనటువంటి జ్ఞాన సమాశ్రితమైనటువంటి బుద్ధి గనుక మనం దేనిని కూడా ఒక విచక్షణా భావంతో చూడం. అంటే మనకి డిస్క్రిషన్ లేదు, డిస్క్రిమినేషన్ ఈ రెండూ కూడా లేవు. కాబట్టి మనం కూటస్థంలో తటస్థంగా ఉంటాం. ఆ కూటస్థత-తటస్థము అంటే ఎక్కడైతే మన కనుబొమల మధ్య మన తిలక ధారణ చేస్తామో, త్రికూట నాముని స్థమితే అంతరంగే అంటారు భగవత్పాదులు. అది అంతరంగంలో ఉన్నది, కనుబొమల మధ్య ఉన్నది అందువల్ల అక్కడ విభూతి ధారణ చేసే చోటు ఆజ్ఞాచక్రానికి గుర్తు గనుక మనం అక్కడ ఉంటాం. అంటే లోకం దాటి లోకాతీతమైన భావనలోకి వెళ్లి శరీర భావాన్ని దాటి, మనోవృత్తులను దాటి, సద్వృత్తుల వైపు నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వేళ మనకి నెమ్మదిగా కలిగేటువంటి ఒక భావన ఏమిటంటే అయమాత్మా బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ ఈ మూడు అక్కడ ఏర్పడతాయి. అంటే మనకి మనం తెలుస్తూ ఉన్నాం. మన-మనం ఇప్పటివరకు ఈ ప్రపంచంలో సంపాదించుకున్న విద్య గాని, కీర్తి గాని, ఎవరో ఇచ్చిన బిరుదులు గాని, ఇవి ఏవీ కూడా మనవి కావు. మనం తర్వాత ఇక్కడికి వచ్చి We acquired them. వాటిని నిలబెట్టుకోవటానికి అనేక యాతనలు పడిపోతాం. సరే ఈ బుద్ధి ఏం చెప్తుంది అంటే, ఇవి ఏమీ చెప్పదు. ఆ నీకేమిటి, నీకు నాలుగు పిహెచ్‌డిలు ఉంటే How-how does it matter? Are you ok? నిన్ను నీవు తెలుసుకున్నావా? అని ప్రశ్నిస్తుంది. మనల్ని ఎవరూ ప్రశ్నించరు. లోకం మనల్ని ప్రశ్నించదు. మనల్ని ప్రశంసిస్తుంది. ప్రశంసిస్తే పర్వాలేదు, పొగుడుతుంది. పొగుడుతూ, పొగుడుతూ మనల్ని అనాహత చక్రంలోకి దింపి, అక్కడి నుంచి మ-మూలాధారంలో పడేస్తుంది గనుక మనం అప్పటిదాకా అద్భుతంగా యోగ ప్రవాహంలో ప్రయాణం చేసిన మనం యోగభ్రష్టులమైపోతాం. సంపాదించుకున్నదంతా బూడిదపాలు అయిపోతుంది. కనుక లోకం మెచ్చటం కాదు, లోకేశ్వరుడు మెచ్చాలి. ఆ లోకేశ్వరుడు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఇది ప్రశ్న. ఈ బుద్ధి వచ్చేపటికి చిత్తము ఉన్నది తర్వాత. ఈ చిత్తము ఇప్పుడు ఏర్పడేది కాదు. మనస్సు ఇప్పుడు ఏర్పడేది. బుద్ధి ఇప్పుడు మరమ్మత్తైనది. చిత్తము ఇప్పటిది కాదు, ఎప్పటిదో. హైందవ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో పునర్జన్మ ఉన్నది. దీన్ని మనం గౌరవించాలి. దాన్ని మనం అనేక జన్మలు ఇప్పటికి మీరో, నేనో, మనందరం కూడా ఎన్నో జన్మలు గడిచి గడిచి గడిపి గడిపి ఇక్కడికి ఈ పూటకొచ్చి, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అయ్యా నేను అవి చేశాను, లోక-అయిపోయినాయి. ఆ జన్మలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నాకు జ్ఞానం అంటే ఏమిటో కాస్త చెప్పండి అని ఎవరినో మనం అడుగుతున్నాం. మనల్ని కూడా ఎవరో అడుగుతున్నారు. ఇది ఈ స్థితిలో ఉన్నాం మనం-మనం. కనుక ఇక్కడ మీ చిత్తం వచ్చినట్లు చేయండి అని ఒక మాట. పాతకాలంలో ఉత్తరాలు రాసినప్పుడు చిత్తగించవలెను ఈ పదాలు వాడేవాళ్ళు. ఈ చిత్తు, ఆ చిత్తు ఒకటి కాదు. ఇక్కడ చిత్తము అంటే జన్మాంతరంగా మనం వదుల్చుకొని, వదుల్చుకొని, వదుల్చుకొని, విధుల్చుకొని ఇంకా గరుడ పక్షి యొక్క గోళ్ళ సందున దాగినటువంటి పాము యొక్క Remnants ఏవైతే ఉన్నాయో, ఆ గోళ్ళకి చుక్కుకున్నటువంటి కొన్ని వాసనాస్ ఏవైతే ఉన్నాయో, అవి చిత్తముగా రూపుదిద్దుకొని మనతో జన్మతః వస్తాయి. తల్లి గర్భాలయంతో మొదలై సమాధి గతమయ్యే వరకు ఆ చిత్తం అక్కడే ఉంటుంది. కాబట్టి మనస్సు ఇప్పటిది, చిత్తము ఎప్పటిదో మన చేతుల్లో లేదది. కానీ మధ్యలో మనకు బుద్ధి ఏర్పడింది, ఎన్లైటెన్మెంట్ ఏర్పడింది. కాబట్టి మనం ఆ చిత్తాన్ని, అదేదో చెప్తుంది. ఇవాళ ఈ పని చేసెయ్, ఆ పని చేసెయ్ అంటుంది. కానీ శుద్ధ మనస్సున్నదే, అది అవసరమా? అది జరక్కపోతే ఏమన్నా అయిపోతుందా? అది ఉంటేనే నీ బతుకు తలవారుతుందా? ఇన్ని ప్రశ్నలు వేస్తుంది ఆ శుద్ధ మనస్సు. లేదా అసలు ప్రశ్నే వేయదు, దాన్ని Cognize చేయదు. అంటే దాన్ని గుర్తించదు. ఈ చిత్తము నెమ్మది నెమ్మదిగా, అది కూడా పోవాలి కదా ఈ జన్మలో. ఈ చిత్తము పోవాలి అంటే యోగః చిత్తవృత్తి నిరోధకః అన్నాడు పతంజలి. భగవాన్ కూడా అదే అంటారు. ఈ చిత్తము దీన్ని గనుక నెమ్మదిగా వదుల్చుకోగలిగినట్లయితే, చిత్తం ఏం చేస్తుందప్పా, నీ నుంచి అదే పారిపోతుంది అంటారు భగవాన్. కాబట్టి ఈ చిత్తము యోగం ద్వారా, యోగం అంటే మళ్ళీ ఏదో వాసనాలు అవన్నీ కాదు. యోగము అంటేకూడి ఉండటం ఎవరితో కూడి ఉండాలి ఎవరితో కూడి ఉన్నట్లయితే నీకు ఆనందం కలుగుతుందో వారితో కూడి ఉండాలి దుఃఖం కలిగించే వాడి దగ్గరికి వెళ్ళకూడదు విచార మార్గాన్ని గౌరవించని వాడి దగ్గరికి వెళ్ళకూడదు మనదైనటువంటి ఆలోచనా రీతిని గౌరవించి మనతో అడుగులు వేస్తున్న వాడితో వెళుతూ ఉన్నట్లయితే ఈ చిత్తము అనేక జన్మల ద్వారా తెచ్చుకున్నటువంటి అనేకమైన పరస్పర విరుద్ధ భావజాలాలన్నీ నశించిపోయి చిత్తము కూడా ఒక పూర్ణత్వాన్ని సంపూర్ణత్వాన్ని ఒక పవిత్రతని అది సంపాదించుకుంటుంది కనుక ఆ చిత్తము ఇంకో శరీరం ఇప్పటికి ఆరు శరీరాలు అయిపోయినాయి ఇందులో నేనా నా మనస్సు నేనా కాదు నేను ఇంకా దాన్ని చూడలా నా మనస్సు ఎక్కడ ఉన్నదని మీరు అడిగితే సమాధానం లేదు నా దగ్గర అలాగే మీ చిత్తం ఎక్కడ ఉన్నది అయ్యో తెలియదండి అదొకటి ఉందా అంటాం కాబట్టి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు మూడు దాని పక్కనే మనో, బుద్ధి, చిత్, అహంకారములు చిత్తము వరకు వస్తే అహంకారం ఒక వై జంక్షన్ అహంకారం దగ్గరకు వచ్చేప్పటికి తరించడమా అంతరించడమా తెలుసుకో అంటుంది తరించడము అంటే పునర్జన్మ లేకుండా ఉండటం అని కాదు జన్మని సార్ధకం చేసుకోవటం అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దమందు అన్ని యుగాలు మొదలాయే యోగమందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరయా నారాయణాన్వేషితము నారాయణున్ని అన్వేషించటానికే ఈ జన్మ ఇవ్వబడింది ఎవరు ఈ నారాయణుడు చిత్తజ గురుడా నీకు శ్రీమంగళం అన్నాడు అన్నమాచార్యుల వారు నా చిత్తములో నా హృదయములో పుట్టినటువంటి నీకు జయమంగళం అన్నాడు ఎవరు ఆ పుట్టింది అహంకారం వరకు వచ్చేప్పటికి అంతరించే మార్గం అంటే లోకంలో సమసిపోవటం ఏదో ఆకర్షణలు, భోగాలు ఇక్కడ జరిగేటువంటి వినోదాలు, విషాదాలు దానికి లోబడి ఎక్కడో పుట్టి ఎక్కడో మెట్టి ఓ రోజున గిట్టే ఆ జీవితాల గురించి కాదు అధ్యాత్మ సాధనా సంపత్తి కలిగినటువంటి సాధకుడు ఏం చేయాలి అంటే తరించే మార్గం వైపు వెళ్ళాలి తరించడము అంటే స్వర్గానికి వెళ్ళటం కాదు తరించడము అంటే నరకాన్ని తప్పించుకోవటం కాదు వేదం స్వర్గ నరకాల గురించి చెప్పలేదు పురాణాలు చెప్పినాయి ఇహమేవా అన్నది ఇహమేవా అంటే ఉన్నదంతా ఇక్కడే ఉన్నది విశ్వనాథ సత్యనారాయణ గారు దీన్ని అచ్చ తెలుగులో లోకమును వీడి రసము లేదు అన్నాడు రసము అంటే పరమేశ్వరుడు అంటే ఈ లోకమే పరమేశ్వర స్వరూపం అనే భావన చేసినప్పుడు ఈ లోకము దీనిలో ఉన్నటువంటి జడాత్మకమైనవి చల అచలమైనటువంటివి ఇనర్ట్ గా ఉన్నటువంటివి మహా చైతన్యం తో ఉన్నటువంటివి ప్రాణైక శక్తులు ఇవన్నీ కూడా ఆత్మ స్వరూపమే గనుక ఈ అహంకారాన్ని గనుక తరించే మార్గం వైపు మనల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం వైపు నేను ఎవరికీ సమాధానం వెతుక్కునే వైపు గనుక వెళితే ఈ ఏడు గదులు దాటిన తర్వాత ఎనిమిదవది ఏది అంటే ఆత్మ అంటే ఏడు గదులు దాటిన తర్వాత మనం ఇంత సాధన చేసి లోపలికి వెళితే ఏం కనుక్కుంటున్నాం అంటే నేను ఆ దేహాన్ని కాదు నేను ఆత్మని అసలు నేను ఇదే ప్రాకారమైంది, శ్రీకారమైంది, ఓంకారమైంది పోయిందంతా కూడా సాకారం కూడా దాటి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వానుభూతి ఏదైతే ఉన్నదో అదే ఆత్మగా మన యందు భాసిస్తున్నది గనుక భగవాన్ శ్రీ రమణ మహర్షి ఈ ఆత్మ విచార మార్గంలో హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి హృది విశ మనసా స్వం చిన్దతా మధతా వా పవన చరణ రోధాత్ ఆత్మ నిష్ఠు భవత్వం ఆత్మని యందే ఒక వెలుగుగా జ్యోతిర్మయంగా, వాంగ్మయంగా, చరాచర మయంగా, నిశ్చలంగా, నిర్మమంగా, నిరంజనంగా, నికేతనంగా, హాయిగా, ప్రసన్నంగా, అఖండంగా, అనంతంగా, అమృతత్వంతో కూడి వెలుగుతూ ఉన్నప్పుడు ఈ ఆత్మను నువ్వు ఎక్కడ పట్టుకుంటావు అంటూ ఆత్మ ఎక్కడ ఉన్నదో భగవాన్ పరిష్కారం చేశారు కనుక ఇవాళ నేను ఎవరు అన్న ప్రశ్నకు జవాబు ఒక్కటే నేను ఆత్మని నేను ఆత్మను అయ్యా మరి పాంచభౌతిక దేహం ఉంది నాకు డిగ్రీలు ఉన్నాయి ఉద్యోగం ఉంది సంపాదన ఉంది ఇల్లు ఇల్లాలు ఇవన్నీ ఉన్నాయి మరి ఏం చేయును భగవాన్ మహర్షినే అడిగారు భగవాన్ మీరు ఆత్మ అంటే నేను ఆత్మ స్వరూపుడిని అని అనుకోండి అట్లాగే ఉండండి అన్నారే మరి సోమసుందరం బండి దిగాడా ఇవాళ వంటలన్నీ అయినయా ఆ పుస్తకం ప్రూఫ్ రీడింగ్ అయిందా నెమళ్ళు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారే మరి మీరు ఏ మనసుతో అడుగుతున్నారు అని అడిగినప్పుడు భగవాన్ ఒక్కటే చెప్పారు ఎరుక కలిగినటువంటి వాడు ఆయన జ్ఞాని అనే మాట వాడలా ఎరుక కలిగినటువంటి వాడు తన హృదయ స్థానంలో నిలుపుకున్నటువంటి ఈ మనస్సుని కించిత్ మనస్సుని కొన్ని క్షణాలు బయటకు తెచ్చి లోక సంబంధ కార్యక్రమాలన్నీ పూర్తి కాగానే మళ్ళీ ఆ మనస్సును తన గూట్లో పెట్టుకుంటాడు ఈ ఎరుక లేనివాడు మళ్ళీ మానసికమైనటువంటి భ్రాంతికి లోప-లోబడి మాయావరణ మాయామయమైనటువంటి ఈ జగత్తులో తన తనువును తల్లవార్చుకుంటాడు ఇది జవాబు కాబట్టి ఆత్మను ఎరగటం ప్రధానం కాదు ఆత్మను తెలుసుకోవటమే ప్రధానం కాదు ఆత్మగా జీవించగలిగినటువంటి ఒక స్థితి సాధ్యమేనా అంటే సోదాహరణ భగవాన్ శ్రీ రమణ మహర్షి పదహారు ఏళ్ళప్పుడు ఆయనకి ఒక అనుభవం కలిగినప్పుడు ఆయనకు నిజానికి ప్రపంచంతో గాని తన దేహంతో గాని పని లేదు పైగా వారు పొందిన ఈ మరణానుభవం అరుణాచలంలో జరగలా తిరుచ్చుళి మధురైలో జరిగింది మరి అరుణాచలానికి ఎందుకు వచ్చారు అంటే అక్కడికి వెళ్ళాలి గనుక స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలం అది వారు అక్కడికి వెళ్ళాలి కడగా యాభై నాలుగు సంవత్సరాలు అదే స్థితిలో ఇందాక చెప్పిన కించిత్ మనసుతో ప్రపంచంతో ఉంటూ తనదైనటువంటి పూర్ణ అద్వైత భావనా స్థితిలో ఆత్మైక స్థితిలో తనతో తాను తనలో తాను నిలకడ చెంది ఈ ప్రపంచానికి ఒక మహర్షిత్వాన్ని మార్గోపదేశనం చేసినటువంటి పరమాద్భుతమైనటువంటిమా మహా చైత్య పురుషులు ఎవరు అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఈవేళ మనం పారాయణం చేయాలి కొంత సాయం పడుతుంది, ధారణ చేయాలి కొంత సహాయం పడుతుంది. కానీ, నేనెవరు అన్నటువంటి ప్రశ్న గనక వేసుకోకపోతే మనం కూడా చూడండి, నన్ను కూడా అడుగుతారు మీ బయోడేటా ఇవ్వండని. బయోడా-డేటా ఈజ్ ఎ థింగ్ ఆఫ్ పాస్ట్. అయిపోయిన దాని కథ. అది ఇవాళ ఎవరికీ అక్కరలేదు. ఈరోజు, ఈ క్షణాన నేను ఏమిటి అన్నది ప్రశ్న. రేపు ఏమిటా? రేపుకు రూపం లేదు. ఉంటామో ఉండమో తెలియదు. జరిగిందంతా నీ వలన జరిగిందంటే, నీ ద్వారా జరిగింది. ఇవన్నీ కూడా ఆత్మ విచార మార్గంలో మనం పొందవలసినటువంటి సాధనా ఫలాలు కాబట్టి భగవాన్ శ్రీ రమణ మహర్షి పరిపూర్ణమైనటువంటి ఒక భావనా స్థితిలోకి ఈ నేనెవరు అన్నటువంటి ప్రశ్నని కేవలం వేదాంతంగా కాక, అనేక శాస్త్రాల యొక్క సమగ్ర సమ్యక్ సమాహార స్వరూపంగా ఒక్క ప్రశ్నను మనకు సంధించి మనం వెళ్తాం. భగవాన్ దగ్గరే అందరూ భజన చేస్తూ ఉంటే భగవాన్ కూడా భజన చేశారు. అదేమిటి భగవాన్ మేము మీ గురించి రమణ రమణ అని మేము అన్-- పాడుతుంటే మీరు భజన చేస్తున్నారు ఏమిటి అన్నప్పుడు, మీరు దీన్ని రమణులు అనుకున్నారు, నేను కూడా వారిని అట్లాగే అనుకున్నాను కానివ్వండి అన్నారు. అలాగే మనస్సును నిర్మూలించటం సాధ్యమేనా, మనస్సు లేకుండా జీవించటం అంటే, భగవాన్ శరీరాన్ని వదిలిపెట్టే క్షణాలు గుర్తు తెచ్చుకుందాం. వారికి సార్కోమా వచ్చినప్పుడు చుట్టూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా భగవాన్, ఈ ఆతరం, ఈ ఆతరం మేము చూడలేకపోతున్నాం. మా రోగాలు పోగొట్టారు, భవరోగం పోయే మార్గం చెప్పారు, ప్రాపంచికమైన అన్ని కష్టాలు మిమ్మల్ని తలుచుకుంటే పోయినాయి, మీరు ఒక్కసారి సంకల్పించండి ఆ పుండు మానుతుంది అన్నారు. భగవాన్ అన్నారు, నిజమే మీరందరూ వచ్చారు ఇందులో ఏ ఒక్కరినైనా ఇక్కడికి రమ్మని పిలిచామా? లేదే! మీరు వచ్చారు, వారు అలాగే వచ్చారు, వారిని అలా ఉండనివ్వండి. వారు వెళ్లే రోజునే వెళ్తారు. వారితో మనకేం పని అన్నారు. ఇది దేహాత్మ భావన దాటిన ఒక జ్ఞాని యొక్క స్థితి. ఇక రెండవది, కాదు భగవాన్ మీరు ఎట్లాగైనా సరే సంకల్పించాలి అన్నప్పుడు, ఒక పసివాడి వలె, ఏమీ తెలియని వాడి వలె, అసలు ఏ ప్రాపంచికమైన ఏ స్పృహ లేని వాడి వలె, ఒక మాట ఏమన్నారంటే, అవును సంకల్పించుకోవటానికి మీ అందరికీ మనస్సులున్నాయి. మరి ఇక్కడ మనసే లేదే! దేనితో సంకల్పించను? దాన్ని వదిలిపెట్టండి అన్నారు. ఈ స్థితికి మనం మానసికంగా వెళ్ళాలి. భౌతికంగా సమస్త కార్యక్రమాలు చేయాలి. గృహస్తులుగా మన ధర్మం చేయాలి. సాధకుడుగా మన నీతి నియమాలు, నిష్టలు పాటించాలి. అన్నీ పాటించవలసిందే కానీ, ఒక వైరాగ్య విభూతిలో మనతో మనము, మనలో మనము నిలకడ చెంది యోగించి ఉండగలిగినట్లయితే అప్పుడు ఆ నేనెవరు అన్న ప్రశ్న మనకి సమసిపోయి, నేను కేవలం దేహ మాత్రమే కాదు, నేను ఆత్మను. ఆ ఆత్మ అంటే భగవత్పాదులకు విలక్షణమైన, అద్భుతమైన సమాధానం ఇచ్చారు. ఆత్మ అంటే ఆ భగవాన్ రమణులను కూడా ఒకాయన అడిగారు. ఆత్మసాక్షాత్కారం ఇప్పించండి అని అడిగితే భగవాన్ నవ్వుతూ ఏమన్నారంటే, ఆత్మసాక్షాత్కారం ఇప్పించటం ఏమిటి, ఆత్మసాక్షాత్కారం పొందటం ఏమిటి, ఎందుకిలా ఈ పదాలు వాడుతున్నారు? ఏమయ్యా! ఆలోచించు ఆత్మ సాక్షాత్తు ఆకారమై ఉన్నది నువ్వే అది అన్నారు. చూశారా, ఇందాక మనం చెప్పుకున్న ఇన్ని మాటలకి భగవాన్ ఏకవాక్య సమాధానం. ఆత్మసాక్షాత్కారం అంటే దేనినో పొందటం కాదు. మనల్ని మనం పొందటం, మనల్ని మనం తాకటం, మనల్ని మనం అనుభవించటం, మనం మనంగా జీవించటం, ఆత్మ వలె తామరాకు మీద నీటి బొట్టు వలె పద్మపత్రమివాంభసా. ఆకూ ఉంది, నీళ్ళు ఉన్నాయి, నీటి బిందువు ఉంది. మనం కూడా ఈ ప్రపంచంలోనే ఉండాలి. రమణులు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. సత్యసాయిబాబా వారు ఇక్కడే ఉన్నారు. శంకరులు ఇక్కడే ఉన్నారు. ఇక్కడికే రావాలి వాళ్ళు. వచ్చి మనకి మార్గోపదేశనం చేయాలి గనుక అటువంటి మహాస్థితిని పొందుతూ భగవాన్ శ్రీ రమణ మహర్షి నేనెవరు అన్న ప్రశ్న వేసుకుని, నేను అన్నీ వదిలేశానండి. ఆ పొరపాటు ఎన్నడూ చేయలేదు, చేయొద్దు. ఎందుకంటే భగవాన్ అన్నీ వదిలేసినా అన్నీ భగవాన్ చుట్టూ చేరినాయి. కోతులున్నాయి, కుక్కలున్నాయి, నెమళ్ళున్నాయి, గోవులున్నాయి, అన్నీ ఉన్నాయి. మనమూ ఉన్నాం, ఇంకా ఉన్నాం, ఇంకా తిరుగుతూనే ఉన్నాం. ఆయన వదిలిపెట్టిన మనం ఆయనను వదిలిపెట్టలేదు. ఆ ఆయన, నేను ఈ రెండూ కలిపితే ఒకటే అఖండము, చిద్ఘనము, అనంతము అయినటువంటి ఈ ఆత్మే. నేనెవరు అన్న ప్రశ్నకి జవాబు నేను ఆత్మను అని. ఆత్మ వలె జీవించాలి, ఆత్మ వలె శ్వాసించాలి, ఆత్మ దేనిని దేనికి పొంగదో, దేనికి కాలదో, దేన-దేనియందు నానదో, దేనివలన మార్పు చెందదో, అపరిణామ ప్రాప్తమప్రమేయమ్మది అచ్చ తెలివి. ఆ ఆత్మ విద్యన్నా, శ్రీ విద్యాన్నా, బ్రహ్మ విద్యాన్నా వీటన్నింటినీ వదిలిపెట్టి మనల్ని మనం తెలుసుకోవటానికి ఈ జీవితాన్ని మనం చక్కగా అధ్యాత్మ సాధనా మార్గంలోకి వెళ్ళాలి. ఈవేళ ఈ పరమ పవిత్రమైనటువంటి క్షణాలలో భగవాన్ రమణులు మనందరికీ కూడా అనుగ్రహించినటువంటి నేనెవరు అన్నటువంటి ఒక ప్రశ్న ఇంకా తీవ్రాతితీవ్రంగా విచారణ చేయవచ్చు. నిజానికి విస్తృతంగా చేయవలసిన దాన్ని మనం క్లుప్తంగా, సరళంగా, సూటిగా, గంభీరంగా, ఉదాత్తంగా, హాయిగా, ప్రసన్నంగా మనం ఏ అనుభూతిని పొందామో ఆ అనుభూతిని మళ్ళీ ప్రపంచానికి ఇచ్చే దిశగా, ప్రౌఢప్రౌఢనిజానుభూతి కలిత దైతేంద్రజాలౌ గురుః సత్యశ్యబోధయా తత్సత్యమశ్రితావన్. మనకు ఏమి తెలుసో, దేనిని అనుభవించామో అదే చెప్పాలి. నేనేమీ చెయ్యను, మీరందరూ అనుభవించండి, ఇలా చేయండి అని చెప్పకూడదు. వాడు గురువు కాడు. గురుస్థానయుడు కూడా కాదు. ఎవరు అంటే ఆత్మ వలె సంచారం చేసి దే-దేహాన్ని పాము కుబుసం విడిచినట్లుగా విడవగలిగిన స్థాయికి గనక ఎవరైనా వెళ్లగలిగితే ఆతడు మహాగురువు అవుతున్నాడు, ఆతడు బౌద్ధ్ అవుతున్నాడు. అటువంటి శాంతిర్నితాంతమహితా పరమామ్యశక్తి వైరాగ్యమద్భుతతమం కరుణాతు సాంద్రా జ్ఞానం నిరన్నకుహనం మధురంచ వృత్తం మృణాం నిదర్శనమయం రమణో మహర్షిహి. మనం అనుకున్న దానికంతా కూడా, అయ్యా మీరు ఇన్ని విషయాలు చెప్పారు, ఒక్క మనిషిని చూపించండి ఇవన్నీ చేసినవాడు అంటే మృణాం నిదర్శనమయం రమణో మహర్షిహి. రమణ మహర్షిని మించినటువంటి ఉదాహరణ మరొకటి లేదు లేదు అని భావన చేస్తూ, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోవిడ్ అనేటువంటి ఒక కరోనా అనేటువంటి ఒక వైరస్ అనుగ్రహించినటువంటి ఈ పుణ్యకాలానికి నమస్కరిస్తూ, ఈ సమయమంతా ఇట్లాగే చక్కగా పారమార్థిక చింతనతో మనందరి జీవితాలు నవ్యమై, భవ్యమై, దివ్యమై, పూర్ణమై, ధవళమై, తరళమై, సరళమై, అత్యున్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోకి మనందరినీ నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
YouTube · audio
Pravachanam Nenu Evaru
Pravachanam Nenu Evaru
0:00 / 56:11