No transcript for this section.
Transcript begins at 0:34.
కార్యక్రమం శివంలో జరగటం దానికి నేను రాగలగటం ఇదంతా కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహంగా నేను భావన చేస్తూ, పందొమ్మిది వందల అరవై రెండు అంటే దంతంబుల్ పడనప్పుడే తనువునందరూడి ఉన్నప్పుడే కాంత సంగము రోయనప్పుడే కురుల్ వెల్వెల్లా కానప్పుడే చింతింపన్ బలెని పదాబ్జములన్ శ్రీ కాళహస్తీశ్వరా అంటాడు దుర్జటి. పన్నెండేళ్ళు దాటుతున్నటువంటి వేళ సత్యసాయి భగవానుడి యొక్క దివ్య దర్శనాన్ని పొందిన ఆ అదృష్టం ఇదిగో కనురెప్ప వాలే దాకా సాగేటువంటి ఒక మహా ప్రబంధంగా నేను భావన చేస్తున్నాను. అంటే సుమారు యాభై ఐదు సంవత్సరాలు సత్యసాయి భగవానుడి యొక్క చింతనలో, భావనలో, తలపులతో, సంభావనతో, తత్వ విచారధారతో జీవితాన్ని గడపటం అనేది ఏ జీవి పొందే అదృష్టం కాదది. అది అంత తేలికగా లభించేది కాదు. అందుకనే అన్నివేళలా "మజ్ జన్మాంతర పుణ్య పాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం" అని ప్రార్థన చేసుకుంటాం. ఎన్నెన్ని జన్మలో ఎత్తిన తర్వాత "బహూనాం జన్మ నామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే" అని జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇదిగో సత్యసాయి భగవానుడి యొక్క మహాద్భుతమైనటువంటి ఒక దివ్య అవతారం వచ్చినటువంటి సందర్భంలో మనం కూడా ఒక జన్మ ఎత్తం మనందరం చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావన చేస్తూ సమర్పన్ అనేటువంటి ఈ కార్యక్రమానికి పెట్టిన పేరే ఒక అందమైన పేరు. జీవుడు తనను తాను సమర్పించుకోవాలి. దేనిని సమర్పించుకోవాలి? తనను తాను సమర్పించుకోవాలి. సమర్పించుకున్న తర్వాత ఏం చేయాలి? శరణాగతితో ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? వినయంగా ఉండాలి. సమర్పణ, శరణాగతి, వినయము ఉన్న ఈ మూడు భావనలు కూడా మానవుణ్ణి పరమోన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వెళతాయి. నాకు బాగా గుర్తు తొలి సమాగమంలో ఆరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో కేవలం ముప్పై నలభై మంది మంది మాత్రమే భక్తులు ఉన్నటువంటి ప్రశాంతి నిలయం వరండాలో వాళ్ళు అనంతపూర్ వాళ్ళు, కర్ణాటక అంటే మైసూర్, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా వయసులో పెద్దవాళ్ళు. నేను పన్నెండు, పదమూడు ఏళ్ళు వయస్సు రాని వాడిని నేను ప్రశాంతి నిలయానికి చేరుకున్నప్పుడు స్వామి Ladies వైపు చేతులు వెనక్కి మడుచుకొని నుంచొని అక్కడ ఉన్నారు. నేను అనుకున్నాను స్వామి అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి చాలా time పడుతుంది అని అనుకున్నాను. ప్రయాణం చేసి వెళ్ళిన కారణంగా మాగన్నుగా నిద్ర రాబోయింది. కనురెప్ప ఎత్తేలోగా స్వామి నా ముందున్నారు. నేను చూసిన పరమాద్భుతాలలో అదొకటి. అంటే స్వామిని చూడగానే మీకేమనిపించింది అని నన్ను ఎవరన్నా అడిగితే పరదైవతమే అనిపించింది. ఇంకేం వేరే అనిపించలే. ఎందుకంటే స్వామి గురించి ముందు వెనకా ఏం పుస్తకాలు లేవు. స్వామి అన్నట్లుగా స్వామి పుస్తకాల్లో దొరికే వస్తువు కాదది. హృదయాంతరాళాలలో జన్మ జన్మాంతరమైనటువంటి సంస్కార ధారలో జీవుణ్ణి పరమాత్మ పట్టుకుంటాడు. అప్పుడు ఆ రోజు అన్న మాట ఇప్పటికీ నాకు అశీర్వచకగానే ఉంటుంది. ఆ మాట ఏమిటంటే "కాచుకొని కూర్చుంటినే" అన్నారు. కాస్త అప్పుడు అర్థమైనా కాకపోయినా తర్వాత తర్వాత నాకేమనిపించిందంటే "నిన్ను కాచుటకు నేను కూర్చుంటినే" అని నేను పూర్ణం చేసుకొని స్వామి నాకోసం తన దివ్యమైనటువంటి ఆ కాలాన్ని వినియోగించి దగ్గరకు తీసుకొని ఆ సమయంలో మా అందరి మధ్యలో స్వామి బాసిం పెట్లు వేసుకొని కూర్చొని "ఏం కావాలి?" అని అడిగారు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ discipline అటువంటిది. కానీ స్వామి దయాపూర్ణ సుధాబ్ధి గనుక కుడి చేతిని గాలిలో గిరగిర తిప్పి అందరిలో చిన్నవాడైన నన్ను పిలిచి నా చేతిలో ఒక వస్తువు పెట్టారు. ఆ వస్తువు ఏమిటంటే black హల్వా. చాలా వేడి హల్వా అది. ఇవాళ science కి అందేది కాదు. ఆనాడు అందింది కాదు. అయితే చెయ్యి ఒక్కసారి వేడెక్కింది. పన్నెండేళ్ళ వయసులో బహుశా ఇవాళ ఉన్న అరచేతిలో సగం ఉండి ఉండాలి. స్వామి నా చేతిలో పెడుతూనే అడిగినటువంటి, వేసినటువంటి ప్రశ్న ఏమిటంటే "ఏం చేస్తావు?" అని అడిగారు. ప్రయాణం చేసి వచ్చాను. చిన్నవాడిని. నిద్ర వస్తోంది. ఆకలి వేస్తోంది. చేతిలో నోరూరించే అటువంటి హల్వా ఉంది. ఏం చేస్తాను? తింటాను అనాలి. అదే తరించేది అంతరించే మార్గాలు సూచించే సందర్శనం అది. ఆ సంధి కాలంలో స్వామి అందరికీ ఇచ్చొస్తాను అన్నాను. స్వామి ఒక్కసారి పకాలున నవ్వి "స్వామికి కావలసింది ఇదే, ఇదే, ఇదే" అన్నారు. ఆ అరచెయ్యే పళ్ళెం గా పట్టుకొని అందరి దగ్గరకు వెళ్ళి ఇస్తే నలభై మంది సుమారు తలా కాస్త గిల్లుకుంటే నా చేతిలో ఏం మిగలలే. నేను వచ్చిన seat లోనే కూర్చున్నా. ఎక్కడ కూర్చోవాలో నా place లోనే కూర్చున్నా. స్వామి అలా జాలిగా నావైపు చూసి "పాపం" అన్నారు. అని దగ్గరకు పిలిచారు. ఈసారి గాలిలో చెయ్యి తిప్పలే. నా మునివేళ్ళ మీద తన చేత్తో ఇట్లా ఒక్కసారి నెమ్మదిగా మృదువుగా కానీ గట్టిగా కొట్టారు. ఎంత హల్వా ఖర్చు అయిపోయిందో అంత హల్వా నా చేతిలో ప్రత్యక్షమైంది.అప్పుడు స్వామి అన్నటువంటి మాట ఇదంతా నీకే. ఆ అంతా నాకే ఇచ్చిన తర్వాత మళ్ళీ స్వామిని ఇదిగో ఈ పవిత్ర క్షణం వరకు కూడా స్వామే చెప్పారు "Think of the salt you have eaten here. Help will come from unexpected quarters" ఎవరి ముందు చెయ్యి చాపవద్దు అన్నారు, చాపలేదు. ఎందుకనంటే చాపటం అంటూ వస్తే ఒక్క సత్యసాయి భగవానుడి ముందు మాత్రమే చాపడం జరిగింది. అది పూర్ణంగా చేతిని నిండుగా మనసు పండగ స్వామి ఇచ్చినటువంటి ఆ దివ్యానుగ్రహము, ఆ అనుభూతే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. నన్ను ప్రధానంగా ఇందాక మన MLA స్వామి చాలా చెప్పారు నా గురించి. అవి ఏవీ నేను చేయలేదు. నా ద్వారా స్వామి చేయించారు. అవి అన్నీ కూడా స్వామికే సమర్పించుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను చేశాను అన్నప్పుడు బరువు మోయాలి. నా ద్వారా చేయబడినయి అనుకున్నప్పుడు కాస్త ఆనందాన్ని మిగుల్చుకోవాలి. అసలు చేస్తున్నదే స్వామి, చూస్తున్నది నేను అంటే అది ఒక ఆనందం. అసలు అంతా తానే. అంటే నాకేది మంచిదో, నాకేది చెడుపో నాకంటే బాగుగా నా స్వామికెరుక. అతని చేరినవారికి అతడాయే తల్లిదండ్రి. అతని బిడ్డను నేను. ఇతరము నాకేలా? అన్నటువంటి భావనతో స్వామే మన వారైన తర్వాత స్వామి నుంచి పొందవలసినది ఏమిటి? పోగొట్టుకునేది ఏమిటి అంటే, ఏమీ లేదు. మహోత్కృష్టమైనటువంటి ఒక మానవ జన్మ ఎత్తినటువంటి మన బోటి వాళ్ళం అందరం కూడా అందులో నేను మాత్రమే కాదు, నా బోటి వాళ్ళందరూ కూడా, మన బోటి వాళ్ళందరం కూడా అసలు ఒక అవతారమూర్తిని చూడటమే మహాభాగ్యం. అసలు అవతారమూర్తితో మాట్లాడటం మరొక భాగ్యం. స్వామి యొక్క దివ్య స్పర్శని అనుభవించటం అది మహద్భాగ్యం. 1963 లో యజ్ఞం జరిగినప్పుడు బైరాగి శాస్త్రి గారు, కామావధాని గారు వాళ్ళంతా ఉన్న సమయంలోనే ఒకాయన యాజ్ఞకులుగా వచ్చారు. ఆయన ఎవరు అంటే, ఇవాళ శృంగేరి పీఠానికి ఉత్తరాధికారి అయినటువంటి విధుశేఖర భారతి స్వామి వారి తాతగారు. ఆయన రామగోపాల అవధాని గారు. ఇంకా ఉన్నారాయన. ఆయన మొన్న మధ్య ఐదారేళ్ళ క్రితం కలిసినప్పుడు మీకు ఆ, ఆ రోజుల్లో చెవిపోగులుండేవి. వాటికి ఎర్ర రాళ్ళతో కూడి ఉన్నటువంటి చెవిపోగులు స్వామి వాటితో ఆడుకుంటూ కూర్చోటం నాకింకా గుర్తే యజ్ఞశాలలో అన్నారు. అంటే ఆనాటి ఆ సందర్భాలను నెమరువేసుకుంటూ ఆ మనోహరమైనటువంటి దృశ్యాలని ఇంకా గుండెలో పదిలపరుచుకున్నటువంటి వారు మనమే కాక మనతో పాటు చాలా మంది ఉన్నారన్నమాట. అయితే ఈ యాత్ర, జీవన యాత్ర, ఈ సమర్పణ అంతా జరుగుతున్నటువంటి వేళ ఈ సమర్పణ ఎప్పుడు చేయాలి అని ఎప్పుడూ చేయాలి అన్నది జవాబు. మాట్లాడినా, పాడినా, ఆడినా, కూడినా, దేహం వీడినా అది మొత్తము స్వామికే చెందుతుంది అన్నటువంటి ఒక భావనతో చూసినట్లయితే పరమాద్భుతమైనటువంటి అద్భుతాలని, వాటిని మహిమలను పేరు పెట్టను. అవన్నీ కూడా స్వామి అనుగ్రహాలని కొన్ని వందలు, వేలు ఈ కంటితో చూసినటువంటి అదృష్టం నాకు స్వామి కల్పించారు. అలాగే మానవుడు మానవుడిగా జీవించగలిగితే దానిని మించిన అధ్యాత్మ మరొకటి లేదు అన్నటువంటి ఆ స్వామి యొక్క భావన, ఈ ఆలోచన ఇది ఎక్కడిది? 'అహం సత్యబోధకః' అని స్వామి చెప్తే అవును ఈ సత్యం ఎక్కడ ఆవిష్కరించబడింది? ఈ సత్యానికి మూలాలు ఏమిటి? అని ఒక తత్వాన్వేషణ చేస్తూ ఆ అన్వేషణలో పదహారు, పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాలు వస్తున్నటువంటి వేళ అంటే ఒక Adolescent age మన చే-- మనకి వచ్చే సమయానికి స్వామి ఇరవై ఏళ్ళు రాకుండా ఒకరోజున "నువ్వు అధ్యాత్మ శాస్త్రవేత్తవి అవుతావు" అన్నారు. అప్పటికి కాస్త తెలివితేటలు మనకు వచ్చినయి. స్వామి ఇదేమిటి ఇట్లా అంటారు? అయితే Scientist ని కావాలి లేకపోతే సన్యాసిని కావాలి. ఈ రెండూ కలిపి జమిలిగా అంటున్నారేమిటి? అని ఆలోచన మనసులో కలగగానే స్వామి తలపులు చదవగలిగిన స్వామి, చదివే స్వామి ఏమన్నారో తెలుసునా? Chemistry, Physics, భాష వీటన్నింటికీ ఎట్లా శాస్త్రం ఉన్నదో అధ్యాత్మకి కూడా శాస్త్రం ఉన్నది. ఆ శాస్త్రం కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నది. భగవంతుడు ఎప్పుడైనా ఒక మానవ దేహాన్ని తీసుకుని రావాలి అంటే ఆయన వచ్చినటువంటి ప్రదేశం ఏది అంటే ఒక్క భారతదేశమే. కనుక ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా భగవంతుణ్ణి అన్వేషణతో, సత్యాన్వేషణతో సత్యమూ భగవంతుడు ఒకటే. ఎందుకంటే భగవంతుడు ఎట్లా నిత్య సత్య శాశ్వతుడో అధ్యాత్మ కూడా అటువంటిదే. భౌతిక, అతిభౌతిక, ఆధ్యాత్మిక అనబడేటువంటి మూడు స్థాయిల్లో ఈ భౌతికమైనటువంటి స్థాయి తెరమీద బొమ్మ వంటిది. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. సుఖాలు వస్తాయి, పోతాయి. ఆనందాలు కలుగుతాయి, జారిపోతాయి అనంటూ అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఆధ్యాత్మిక శాస్త్రము అంటే ఏమిటో అంటే Spiritual sciences అనబడేటువంటి మాట ఇంకా ఈ ప్రాంతంలో వినబడని రోజుల్లో సత్యసాయి భగవానుడు ఏ మహదాశీర్వచనం వారు అందించారో తదనుగుణంగానే జీవితం సాగుతున్నది అని అందరూ అంటున్నప్పుడు స్వామి మాట పొల్లుపోతుందా అన్నటువంటి ఒక ఆనందం కలుగుతుంది. అయితే ఇదంతా స్వామి భగవంతుడు అని చెప్పడానికి భగవత్తత్వం మళ్ళీ ఒక మానవ దేహం తీసుకుని వచ్చినట్లయితే ఇది ఎట్లా ఉంటుంది అంటే అది సర్వదేవతా అతీత స్వరూపులైనటువంటి స్వామి వలె ఉంటుంది అన్నదే జవాబు. ఇంకా వేరే ఉండటానికి వీల్లేదు.మిగతా ఎన్నెన్ని అవతారాలు ఎట్లా వచ్చినా ఇది జన జగత్తులతో కూడినటువంటి జగదీశ్వరుడి యొక్క మహా పరిపూర్ణ అవతారం. రామకృష్ణాది అవతారాలు అన్నీ కూడా కాస్త ప్రాదేశికమే. రాముడు సీతాన్వేషణలో శ్రీలంక దాకా నడిచాడు గనుక రాముడు మనకు బాగా దైవమైనాడు. ధర్మాన్ని పాలించాడు "రామో విగ్రహవాన్ ధర్మః" అనిపించుకున్నాడు. కృష్ణ పరమాత్మ అయితే వింధ్య పర్వతాలు దాటి రాలేదు కానీ కృష్ణున్ని మన వాడిని చేసుకున్నాం. వాళ్ళంతా కూడా భారతీయమైనటువంటి ఒక ప్రాదేశికమైనటువంటి పరిధిలో సనాతన ధర్మాన్ని, ధర్మంలో దాగి ఉన్నటువంటి మర్మాన్ని, మర్మంలో ఉన్నటువంటి కర్మని, భక్తిని, జ్ఞానాన్ని, యోగాన్ని ప్రస్పుటంగా మానవ జాతికి తమ జీవన విధానం ద్వారా చూపించారు. అయితే ఇక్కడ తత్వాన్వేషణలో దొరికిన అనేకమైనటువంటి అంశాలు స్వామిని గురించి విచారణ చేసినప్పుడు మనకి కనిపించేటువంటి ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే తాను ఎక్కడ అవతారం తాల్చారో అదే ప్రదేశంలో ఉండి దేహ పరిసమాప్తి వరకు కూడా అంటే ఎనభై ఆరు సంవత్సరాలు అందులో తొలి పధ్నాలుగు ఏళ్ళు పక్కనబెట్టి డెభై రెండు సంవత్సరాలు ఒక బౌద్ధగా తాను ఉన్నటువంటి ప్రదేశంలో తానే ఉంటి ఎక్కడికి వెళ్ళకుండా సనాతన ధర్మాన్ని ఎల్లలు దాటించి నూట ఎనభై ఎనిమిది దేశాలలో ప్రతిష్ట చేసినటువంటి పూర్ణావతారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఎవరి వల్ల కాని పని ఇది. ఎందుకంటే ఎల్లలు దాటింది, సముద్రాలు దాటింది, ద్వీపాలు ద్వీపాలలో వెలుగుతున్నాయి. స్వామి యొక్క నామము స్వామి యొక్క దివ్య వైభవం అన్నింటినీ మించి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఈ మహా ధర్మాన్ని మానవ ధర్మంగా మార్చినటువంటి ఒక సనూతనమైనటువంటి సనాతన సారథి సత్యసాయి భగవానుడు. అది సేవా ధర్మంగా మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి అధ్యాత్మని మనకి ప్రబోధం చేయటం మాత్రమే కాదు ప్రసారం చేస్తూ జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతమైనటువంటి భావనతో స్వామి సమస్తమైనటువంటి జాతులను ఏకం చేసినటువంటి పూర్ణావతారం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంటే మనకి తెలియని వారికి పరిచయం లేని వారికి ప్రపంచంలో ఇంకా స్వామి అంటే అనుభవం లేని వారికి సత్యసాయిబాబా వారు కానీ మనకు మాత్రం మన ప్రియతమ స్వామి. స్వామి అనగానే ప్రపంచంలో ఒక్క సత్యసాయి భగవానుడితో మాత్రమే అది కలిసిపోయినటువంటి పదం. అంటే it has become synonymous with Swami. దీనికి కారణం ఏమిటంటే స్వామి అవతారమూర్తిగా ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు రెండు నిష్టలు చాలా ప్రధానంగా ఆచరించి మనన్నీ కూడా ఆచరించండి అని చెప్పారు. ఒకటి వ్యవహార నిష్ఠ రెండవది బ్రహ్మ నిష్ఠ. బ్రహ్మ నిష్ఠ అంటే తాత్విక విచారణ, అనేక శాస్త్రాల మీద అధికారం, శాస్త్రాలను సమన్వయం చేయటం, తర్క మీమాంస వ్యాకరణాది అనేకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేయటం ఒక ఎత్తయితే దానిని అనుష్ఠాన వేదాంత భూమికలోకి తీసుకువచ్చినటువంటి వారు ఎవరు అంటే భగవాన్ శ్రీ సత్యసాయి. ఎందుకని అంటే భగవద్గీతలో చిట్టచివరి శ్లోకం ఏడు వందల శ్లోకం ఉంది "యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ" అంటే ఒక జ్ఞాని అయినటువంటి యోగీశ్వరుడు అయినటువంటి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వంటి ఒక గురువు లేదా గురువు వంటి ఒక కృష్ణుడు అట్లాగే సర్వ సన్నద్ధుడు, సిద్ధుడు, శుద్ధుడు అయినటువంటి అర్జునుడు వంటి ఒక సాధకుడు గనక కలిసినట్లయితే వారి నుంచి ప్రసారమైనటువంటి విభూతిని మనం ఈ జగత్తుకు అందించగలిగినట్లయితే దానివలన ఈ ప్రపంచానికి విజయము అనేటువంటి ఎప్పటికీ irreversible అయినటువంటి మహావిభూతి షడైశ్వర్యాలకు అతీతమైనటువంటి విభూతి మనకు కలుగుతుంది అనేటువంటి ప్రమాణాన్ని జన సామాన్యంలోకి తీసుకు వెళ్లినటువంటి వారు సత్యసాయి భగవానుడు. అంటే ఇవన్నీ మనం ఇవాళ ఎందుకు చెప్పుకోవాలంటే సమర్పణలో నా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు కారణం ఏంటంటే నాది అంటూ ప్రత్యేకంగా లేదు గనుక ఏం జరిగినా ఏం జరక్కపోయినా సర్వమూ స్వామి వలనే అన్నటువంటి ఒక భావనలో ఉన్నాం కనుక స్వామి ఈ ప్రపంచానికి ఏమిచ్చారు, స్వామి ఈ ప్రపంచాన్ని ఎట్లా నడిపించారు, నడిపిస్తున్నారు, నడిపించబోతున్నారు దానిని గమనించటానికి ఒక దేహాన్ని, ఒక విచక్షణని, ఒక బుద్ధి కుశలతని, సుకౌశలంతో కూడిన ఒక కర్మానుష్ఠానాన్ని, చిత్త ఏకాగ్ర స్థితిలో నెలకొల్పి చెందగలిగినటువంటి ఒక భక్తిని, వివేకము, విచక్షణ, వైరాగ్యము కలిగినటువంటి జ్ఞానాన్ని ఏకకాలంలో స్వామి ఈ ప్రపంచానికి ఎట్లా అనుభూతిమయం చేశారో గమనించినప్పుడు ఇది ఒక్క స్వామికి మాత్రమే సాధ్యమైంది. ఎవరైనా కర్మానుష్ఠానం చెప్పారు, మరొకరు భక్తిని గురించి చెప్పారు, మరొకరు జ్ఞానాన్ని గురించి చెప్పారు. కానీ వీటన్నింటినీ కూడా నిత్య జీవితాన్ని సమస్తమూ ఆధ్యాత్మికమయం చేసుకొని ఏది రాని, ఏది పోని, ఏది జరగని, ఏది జరక్కపోని, ఏ ద్వంద్వాలు, ఏ దుఃఖం రాని, ఏ సుఖం రాని, ఏ సంతోషం కలగని, ఏ ఆనందం కలగని, ఏ కీర్తి రాని అన్నీ కూడా సర్వమూన్ ఈశ్వర ప్రీతికే. మన కర్మానుష్ఠానం అంతా అంటే వ్యవహార నిష్ఠ కూడా మనం ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరొకటి చేసినా పరమేశ్వరుడిని ఆనందింపజేయగలిగినట్లయితే అదే నిజమైనటువంటి వ్యాపారము అదే నిజమైనటువంటి ఉద్యోగం.ఎందుకంటే ఒక రెండు సంఘటనలు మీతో పంచుకోవాలి. పందొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో హైదరాబాద్ నుంచే ఒక ప్రముఖ వ్యాపారవేత్తతో కలిసి నేను పుట్టపర్తికి వెళ్ళాను. అంటే ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం. దారంతా కూడా ఆయన మనసంతా వ్యాపారం మీద, చుట్టుపక్కల ఉన్న వ్యవహారాల మీద నాకు చెప్తూ ఆయన ఏం చెప్పారంటే స్వామి ఇట్లా దర్శనం ఇస్తారు, దర్శనం ఇచ్చి మళ్ళీ వారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం దాకా మనకి ఏం పని ఉండదు అక్కడ. అక్కడ మనం ఒక కారు తీసుకుందాం. ఆ ఊరు, ఆ ఊరు, ఆ ఊరు వెళ్లి మళ్ళీ దర్శనం టైంకి వచ్చి కూర్చుందాం. మళ్ళీ స్వామిని దర్శనం చేసుకుందాం అని చెప్తున్నారు. అది ఆయన మనస్సు. నా మనస్సు వెళుతున్నది స్వామి దగ్గరికి కదా! స్వామిని చూడాలి కదా! స్వామిని చూసిన తర్వాత అనుభూతిని గుండెలో పెట్టుకోవాలి కదా! పెట్టుకొని ఆ చెట్టు కింద కూర్చోవాలి కదా! మళ్ళీ స్వామి ఎప్పుడొస్తారా అని ఎదురు చూడాలి కదా! ఇది కదా తపస్సు అని నా మనస్సు. ఈ రెండు మనస్సులు ప్రశాంత్ నిలయం దగ్గర దిగినాయి. పాపం నన్ను భద్రంగా తీసుకెళ్లారు. ఆయన అన్న ప్రకారమే స్వామి దర్శనం ఇవ్వగానే ఆయన కారెక్కి ఎటో వెళ్లిపోయారు. మళ్ళీ సాయంకాలం నాలుగు నలభై ఐదు, ఐదు గంటల ప్రాంతంలో ప్రశాంత నిలయానికి ఆయన వచ్చారు. కానీ ఆయనకు అప్పటితో అప్పటికే స్వామితో చాలా అనుభవాలు ఉన్నాయి. కాస్త proximity కూడా ఉంది. అయితే మేమిద్దరం కలిసి వచ్చి కలిసి ఒకచోట కూర్చున్నాం గనుక ఆరోజు అతి విచిత్రంగా స్వామి నాతో వచ్చిన ఆయనతో మాట్లాడటం మానేశారు. నన్ను తీసుకొని interview roomలోకి తీసుకొని వెళ్లిపోయారు. అర్థం కాలే. సరే స్వామి లోపల interview room అని అనబడేటువంటి roomలో మేము అందరం కూర్చున్నాం. అట్లా ఒక రోజు అయింది, రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, నాలుగవ రోజు సాయంకాలం మా ప్రయాణం. ఈ నాలుగు రోజులు స్వామి నన్ను లోపలికి తీసుకెళ్లటం, మాట్లాడటం, ఎవరెవరినో పిలిచేవారు. ఐదు ఆరుగురు వచ్చేవారు. ఒక్కొక్కసారి పది పన్నెండు మందిని select చేసేవారు. వాళ్లకు వాళ్లకు ఏమేం కావాలో ఇచ్చేవారు. కానీ నాతో వచ్చిన ఆయనతో మాత్రం మాట్లాడలే. మాట్లాడకపోతే స్వామి. ఈయన ఆలోచనలో పడ్డాడు. ఎందుకని ఎప్పుడైనా రాగానే స్వామి పిలుస్తారు కదా నన్నెందుకు ఈసారి పిలవలేదు అని. కానీ ఆయనకి తోచలే. స్వామి ఆ రోజున evening మేము బయలుదేరి రావటానికి సమయం ఆసన్నం అవుతున్నటువంటి వేళ మీరు ఎప్పుడైనా ప్రశాంతి నిలయానికి వచ్చేట్లయితే, నాకు చెప్పిన మాట, స్వామి కోసమే రండి. మీ వ్యాపారాలు, మీ బంధుత్వాలు, మీ మమకారాలు, మీ అహంకారాలు, మీ ఆభిజాత్యాలు, మీ సమస్తమైనటువంటి ప్రగల్భాలు బయట వదిలిపెట్టి ప్రశాంత నిలయం లోపలికి స్వామి కోసమే రండి. వస్తే స్వామి మీకోసమై పది అడుగులు వేసి మిమ్మల్ని లోపలికి లాక్కుంటాడు అని స్వామి చెప్పారు. అప్పటికి కానీ ఆయనకు అర్థం కాలా. అందుకనే ఆ సూచన ప్రకారమే ఈనాటికి ప్రశాంతి నిలయానికి ప్రయాణమే వెళుతున్న మరుక్షణమే స్వామి ఇచ్చిన ఆ సందేశం, స్వామి చేసిన ఆ సూచన ఆధ్యాత్మిక సూచన గుర్తొస్తుంది. Train దిగి ప్రశాంతి నిలయంలోకి వెళ్ళాక మళ్ళీ ప్రశాంతి నిలయం నుంచి train ఎక్కేదాకా మనసంతా స్వామి యందు మాత్రమే మనం లగ్నం చేయాలి. ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధన. అట్లాగే ఆ రోజుల్లో స్వామి చాలా తరచుగా wait, wait, wait అనేవారు. అంటే తొందర, మనందరికీ తొందర ఉత్తరాలు ఇవ్వాలి, పాద నమస్కారం తీసుకోవాలి లేదు స్వామితో కాసేపు మాట్లాడాలి, కష్టం చెప్పుకోవాలి, ఏదో ఒక ఆనందం కలిగింది అది కూడా స్వామితో పంచుకోవాలన్న ఆతృతతో లేస్తుంటే స్వామి wait, wait అంటూ ముందుకు వెళ్లేవారు. ఓ రోజున చెప్పారు waiting లోనే అసలు weightage అంతా అక్కడే ఉంది wait చేస్తూ ఉండండి అని. ఆ weightage ఏమిటంటే ధ్యానం అన్నమాట. ఇవాళ కళ్ళు మూసుకో ఆ అని ఉన్న చీకట్లు, చీకట్లు రప్పించుకో, వెలుగులు తప్పించుకో కాకుండా మనస్సుని స్వామి యందు లగ్-- లగ్నం చేసి మనస్సు ఆలోచనలు పారుతున్నంత వేళ కూడా స్వామి యొక్క నామాన్ని లోపల అనుకుంటూ ఒక అనాహత నాదంగా గనక మనం అనుకోగలిగినట్లయితే స్వామి యొక్క అనుగ్రహ విశేషం మనం అందుకోలేనంత, పట్టరానంత, మోయలేనంత మనకి ఆ అనుగ్రహం మనకు దండిగా లభిస్తుంది. ఇది స్వామి మాట. మీరు ఏదో అడుగుతారు, ఇది కావాలి అంటారు. అది చాలా అల్పమైంది it's a trivial and trash never ask for it ask for Swami. స్వామి కావాలి అని మీరు కోరుకోండి. స్వామే మీ వారైతే ప్రపంచం అంతా మీది అవుతుంది అంటారు స్వామి. అయి-- అవుతున్నదా కావటం లేదా? అవుతూనే ఉంది. విశాఖపట్నంలో స్వామి చెప్పిన మాటలు, జీవితంలో జరిగే సంఘటనలు స్వామికి సమర్పించుకోవాలి ఇవాళ మనం. ఏడు రోజులు ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత ఏడో రోజున ఒకాయన breakfastకి పిలిచారు. నాతో పాటు ఇంకా ముప్పై నలభై మంది వచ్చారు వాళ్ళింటికి. అంతా అయిపోయింది, అందరం కూర్చొని ఉన్నాం. ఆయన అడిగారు. మామూలుగా ఎవరూ నన్ను వేయని ప్రశ్న ఆయన వేశారు. ఆ ప్రశ్న ఏమిటంటే, "సార్ మీ కుటుంబం ఎంత పెద్దది?" అని అడిగారు. అంటే మీకు పిల్లలు ఎంతమంది? భార్య ఎవరు? ఎలా ఉంటారు? ఇలాంటి ప్రశ్న అన్నమాట అది. దానికి పరిమితమైన ప్రశ్న. నేను అన్నాను, "బహుశా నా కుటుంబం కొన్ని లక్షలు ఇప్పటికే దాటిపోయి ఉంటుంది. స్వామి అనుగ్రహం ఉంటే అది కోట్లు కూడా దాటుతుంది" అని నేను అన్నాను. అనగానే ఆయన ఆశ్చర్యపోయి "అదేమిటి అలా అంటున్నారు?" అన్నారు. నిన్నటి వరకు మీరెవరో నాకు తెలియదు.నేనెవరో మీకు తెలియదు కానీ ఇవాళ స్వామి అనేటువంటి ఒకే ఒక పరమాద్భుతమైన అవతారమూర్తి కారణంగా మనం ఒకళ్ళకొకళ్ళం తెలిసాం. ఇది విస్తృతమవుతూ expand అవుతూ ఉంటుందే తప్ప ఇది సంకుచిత పరిధిలో ఆలోచించదగింది కాదు అని అన్నప్పుడు ఆ తర్వాత ఈ ప్రస్తావన స్వామి దగ్గర వచ్చినప్పుడు కూడా స్వామి అదే అన్నారు. ఒక్క స్వామితో కూడి ఉండండి జగత్తు మొత్తం మీతో కూడి ఉంటుంది. స్వామిని విడిచిపెట్టినారా? జగత్తే కాదు సర్వ లోకాలు మిమ్మల్ని వదిలిపెడతాయి. అప్పుడు ఎవరు మిమ్మల్ని కాచుకునేది? కనుక అన్నివేళలా భగవంతుడితో కూడి ఉండే ప్రయత్నం చేయండి. అందుకనే అంతరంగము కన్నా జాపకుడు లేడు అరయ కాలమే మీకు పరమ గురువు. గ్రంథరాజమగును ప్రత్యక్ష లోకమే ఎవడు స్నేహితుండు? ఈశ్వరుడే. ఇవాళ కీర్తి వెనక పరిగెత్తకూడదు. ఎవరినీ కూడా మనం యాచించకూడదు. ఇవన్నీ స్వామి చెప్పిన మాటలు. మీ ప్రజ్ఞ ఆత్మప్రజ్ఞగా మార్చుకోండి. ప్రతి వ్యక్తికి ఒక ప్రతిభ ఇవ్వబడింది. ప్రతి వ్యక్తికి ఒక ప్రజ్ఞ ఇవ్వబడింది. ఏనకేన ప్రకారేన యస్య కశ్శాపి దేహినా సంతోషం జనయేత్ ప్రజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. మీ ఆలోచన చేత, మీ ఉనికి చేత, మీ వ్యక్తిత్వం చేత నేనెందుకు ఈ జన్మ ఎత్తానన్న ఒక ప్రశ్నలో నుంచి మరొకరికి సాయపడటం కోసమే అన్నటువంటి ఒక్క భావనతో గనక మీరు జీవించగలిగితే తదేవ ఈశ్వర పూజనం. మీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆనందం కలిగించండి. ఆ ఆనందం ప్రేమ ద్వారా, సేవ ద్వారా చేయించండి, కలిగించండి. ఆ ఆనందంలో మీరు భాగస్వాములు కండి. వ్యక్తిపరమైన, వ్యక్తిగతమైనటువంటి ఆనందము ఈ జగత్తుకి సంబంధం లేదు. జగత్తంతా ఆనందంగా ఉంటే దానిలో మీ భాగస్వామ్యం మీకున్నది. ఇవి, ఇటువంటివి స్వామి అనేకమైనటువంటి ఆ interview చెప్పబడ్డవి. అంటే స్వామి పిలిచి లోపల ఏం మాట్లాడేవారు ఆ రోజుల్లో? nineteen ninety five వరకు సుమారుగా ఒక్కొక్క interview గంట, గంటన్నర సేపు ఉండేది. గంటన్నర సేపు స్వామి ఏం చెప్తారు ఆ room లో? అంటే మిగతా వారికి ఎవరెవరికి ఏ వస్తువులు కావాలో సృష్టించో, ఇచ్చో, దుఃఖం తీర్చో వారిని పంపేవారు. కానీ, ఇవాళ మనం మాట్లాడుకునేటువంటి ప్రతి మాట, ప్రతి syllable, ప్రతి శబ్దం స్వామి యొక్క ప్రసాదనంగానే నేను భావన చేస్తాను. ఎందుకంటే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యం, భగవద్గీత, భజగోవిందం, శంకర వాంగ్మయంలో వివేక చూడామణి స్వామి చెప్పని విషయం లేదు. ఆ గంటన్నర సేపు స్వామిని వినటమే ఒక మహా తపస్సు. దానిని మించినటువంటి జ్ఞానం ఏ పుస్తకంలోనూ మనకు దొరకదు. అందుకనే అనేకమైనటువంటి మహాపురుషులంతా కూడా స్వామి దగ్గరకు వచ్చి-- ఎందుకు వచ్చారు వాళ్ళు? కేవలం స్వామిని చూట్టానికి వచ్చారా? స్వామిని దర్శించటానికి వచ్చారా? అంటే కాదు. తాము ఇంకా పోగొట్టుకోవలసింది ఏదో అక్కడ పోగొట్టుకోవటానికి, తాము ఇంకా ఏదన్నా మిగిలి ఉంటే, ఏది పొందటానికి దానిని పొందటానికి ఆ క్షణాలలో స్వామి దగ్గరకు వచ్చారు. కనుకనే ఈ సర్వ ప్రపంచాన్ని కూడా స్వామి ఒక సనాతనమైన ధర్మ వేదిక మీద నిలబెట్టి అందరినీ ఒకటి చేసినటువంటి ఈ అద్భుత సన్నివేశాన్ని మన కంటితో మనం చూశాం. ఇది ఒక ఎత్తైతే, ఎక్కడా కూడా అహంకారము, అనాచారము, అస్పష్టత, అవిద్య, అవివేకము, ఆడంబరము కనిపించని రీతిలో భక్తులు ఉండాలి. ఆ రోజున పాత కాలపు భక్తులు ఇక్కడ ఇవాళ చాలామందిని నేను కలిశాను. ఆ రోజులు గుర్తు చేసుకున్నట్లయితే స్వామికి మనకి మధ్య లేదా ఒక వ్యక్తికి వ్యక్తికి మధ్య జరిగే ఏ సంభాషణ అయినా సరే మూడవ వ్యక్తికి చేరరాదు అని స్వామి ఒక నియమం పెట్టారు. ఆ నియమం ఎందుకని అంటే మూడవ వ్యక్తికి చేరగానే రూపురేఖలు మారిపోతాయి. గాలి దానికి తోడవుతుంది. అందుకనే అధ్యాత్మ సాధనలో మూడు చెప్పారు మనకి. ఒకటి avoid gossip. Gossip వదిలేసేయండి. అది గాలి ఎంత వేగంగా, విస్తృతంగా తీసుకు వెళ్తుందో అది తీసుకువెళ్లి మనిషిని అనాచారం వైపు నడిపిస్తుంది. ఇద్దరు కలిసినా, ముగ్గురు కలిసినా, ఒక్కడుగా ఉన్నా నీకు ఉన్న సమయాన్ని భగవంతుడి యొక్క నామస్మరణలో గడుపు. దాని వలన నీకు లాభం. ఈ వాతావరణానికి, ప్రపంచానికి లాభం. కనుక avoid gossip. మాకు చెప్పిన మాటే మీతో ఇవాళ చెప్తున్నాను. రెండవది, వ్యర్థమైనటువంటి దానిలో వితండవాదానికి వెళ్ళవద్దు. ఎందుకని అంటే ప్రజ్ఞతో, వాదనతో ఎవరినైనా ఓడించచ్చు. మనం ఒకరిని ఓడించాము అంటే మన అహాన్ని మనం చల్లార్చుకున్నాం. మరి ఎవరు విజేత? మనల్ని మనం గనక జయించగలిగితే ఆనాడు మనం విజేతలమవుతాం. అంటూ స్వామి అనేకమైనటువంటి, ఈ ధార్మికమైనటువంటి, శాస్త్రగతమైనటువంటి, పరమ గుహ్యమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా చక్కగా అచ్చమైనటువంటి తెలుగులో ప్రతిబోధ చేస్తూ కృష్ణుడు ఎట్లా భగవద్గీత చెప్పాడో అట్లాగే స్వామి ఆ రోజులలో ఆ interview roomలలో మాకు చెప్పినవన్నీ కూడా నిజ్-- నిజానికి అవే. They are all at the rate of one and half hours minimum. కాబట్టి, ఇవాళ స్వామి పుస్తకాల్లో దొరకరు కదా అని స్వామి మాటల్లో మాత్రం స్వామి దొరుకుతారు. ఆ స్వామి ఎటువంటి స్వామి అంటే అనేకమై-- అనేకమైనటువంటి పెద్దవారుగా లోకం గుర్తించిన వారితో interviews ఇచ్చినప్పుడు వారితో ఉండేటువంటి ఒక అవకాశాన్ని నాకు కూడా ఇచ్చారు. చాలా సార్లు ఇచ్చారు అందులో ఒక్కటే చెప్తాను. చాలా ఉన్నాయి గనుక. విద్యా ప్రకాశానంద గిరి స్వామివారు ప్రశాంతి నిలయంలోవచ్చి స్వామిని దర్శనం చేసుకొని అఖిల భారత సాధు సమ్మేళనాన్ని తిరుపతిలో చేయాలి అని స్వామిని ఆహ్వానించడానికి వచ్చారు. ఆ రోజున వారిని పిలిచినప్పుడు వారితో పాటు నన్ను నాతో పాటు మరొకరు ఎవరినో పిలిచారు. కూర్చున్నాం. విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు స్వామితో మాట్లాడుతూ ఉన్నారు. "స్వామి మీరు రావాలి. తిరుపతి మీ ఆధ్వర్యంలో జరగాలి. ప్రప్రథమ ఉపన్యాసం మీరివ్వాలి" ఇవన్నీ అడుగుతూ ఉంటే అఖిల భారత సాధు సమ్మేళనంలో సాధువు అంటే ఎవరు అని ప్రశ్న వేశారు. తాత్విక చింతనలో మొట్టమొదటగా సాధువు అంటే అన్నీ వదిలిపెట్టిన వాడా? దేనినీ వదిలి పెట్టకపోయినా అన్నీ వదిలిపెట్టినట్లు ఉన్నవాడా? నిజానికి పరబ్రహ్మంతో కూడిన వాడా? ఎవరు సాధువు? అది మనసుకు సంబంధించినదా? గుణానికి సంబంధించినదా? జన్మ సంస్కారానికి సంబంధించినదా? సమాజానికి దానికేదైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? అని ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నప్పుడు ఆయన నిశ్చేష్టుడై అట్లా వింటూ ఉండిపోయారు. అప్పుడు స్వామే సమాధానం చెప్తూ వ్యవహార నిష్ఠ ఎంత పరమ పవిత్రమైనటువంటిదో అంటే లోక సంబంధ కార్యాలు ఎంత పవిత్రంగా, ఎంత పటిష్టంగా, ఎంత perfect గా చేయాలో బ్రహ్మనిష్ఠ కూడా అట్లాగే చేయాలి. బ్రహ్మనిష్ఠ అన్నా ఆత్మనిష్ఠ అన్నా ఒకటే. అంటే నేను పరమాత్మలో నుంచి వచ్చాను. నేను పరమాత్మలో నుంచి వచ్చాను గనుక నేను పరమాత్మ కంటే భిన్నంగా జీవితం సాగించడానికి వీలు లేదు అని నువ్వు నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి నువ్వు స్వామి దగ్గరికి వస్తావ్. నేను స్వామి భక్తుడిని అంటావ్. నువ్వు ఎలా ఉండాలి? స్వామి వలెనే ఉండాలి. వేరే రకంగా ఉండటానికి నీకు అవకాశం లేదు. స్వామిని చూడని వారు, స్వామి గురించి వినని వారు, స్వామి నుంచి అనుభవాన్ని పొందని వారు, అనుభూతి చెందని వారు ఎట్లా ఉన్నా వారిని మార్చవచ్చు. కానీ, నీవు ఒక్కసారి సత్యసాయి భక్తుడివి అని అనిపించుకున్న తర్వాత, నీవు సత్యసాయి భక్తుని వలె కాక సత్యసాయి వలె ఉండాలి. అన్నటువంటిది ముప్పై ఏళ్ల నాటి మాట. సరే ఇవన్నీ స్వామి చెప్తూ ఉన్నారు. ఇది గుణానికి సంబంధించిన సాధువు కాదు. వాళ్లంతా ఎక్కడో హిమాలయాల్లో ఉంటారంటుంటివే. వాళ్లంతా మరి ఇక్కడికి వచ్చి ఏం చెప్తారు? మరి వాళ్లంతా సాధువులైపోయినారు. నువ్వు బ్రహ్మజ్ఞానం బోధిస్తే వాళ్లకు అక్కర్లేదు. లోకజ్ఞానం చేద్దామంటే వాళ్లకు ఉద్యోగాలు లేవు. ఎందుకు పెడుతున్నావు? అని ఇంత విస్పష్టంగా స్వామి అడిగారు. అడిగితే, " ఇంత ఆలోచించలేదు స్వామి. ఒక భారతీయమైనటువంటి ధర్మాన్నంతా కూడా ఒకచోట కూర్చోబెట్టి వాళ్లందరికీ ఈ లోకంలో జరుగుతున్నదంతా స్వామి ద్వారా చెప్పించాలన్న ఒకే ఒక్క కోరికతో నేను వచ్చాను" అంటే అప్పుడు స్వామి ఆ కరుణ ఆ level నుంచి నెమ్మదిగా దిగి వచ్చారు. వస్తూ ఏమన్నారంటే "మనకి ప్రశాంత నిలయంలో ఏం లోటుంది? ఎంతమంది వస్తారు?" అని అడిగారు. "ఎనిమిది వందలు, తొమ్మిది వందల మంది వస్తారు." "అన్నీ ఇక్కడే చేద్దాం. నువ్వు కూడా ఊరికే శ్రమ పెట్టుకోకు. ఇక్కడికి రా. నేనన్నీ చూస్తా." అన్నీ స్వామి ఏర్పాట్లు చేస్తారు. "అది ఇక్కడే చేద్దాం. ప్రతిరోజూ స్వామి కూడా ఉపన్యాసం ఇస్తారు" అంటూ చెప్పినప్పుడు అక్కడికి అది అయిపోలే. అంటే ఒక స్థాయి physical level అయిపోయింది. కాసేపు ఒక మౌనం వహించే స్వామి అడిగారు. "నీకేం కావాలి?" అని అడిగారు. మనల్ని కూడా అడుగుతారు. మనం చాలా అడగాలి స్వామి అంటూ మనల్ని గనక interview కి పిలిస్తే కనీసం ఒక గంటలో వంద ప్రశ్నలన్నా ఆయన వేయాలని ఉంటుంది. స్వామిని చూడగానే ఏవీ గుర్తురావు. ఆయనకు కూడా నిజానికి ఏమీ గుర్తు రాలే. కానీ ఆయన ఏమన్నారంటే "భగవద్గీతే జీవితంగా నేను భావన చేశాను. కృష్ణ తత్వానికి నన్ను నేను సమర్పించుకున్నాను. స్వామి నాకు కృష్ణ దర్శనం కావాలి" అని అడిగారు. "అట్లానా?" అన్నారంతే. నిశ్శబ్దం ఆవరించింది. మేము ముగ్గురమే ఉన్నాం room లో. ఐదు నిమిషాలు తదేకంగా స్వామి సింహాసనంలో కూర్చొని ఆ మూల తలుపు పక్కన కూర్చున్నటువంటి విద్యా ప్రకాశానందగిరి స్వామి కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోయారు స్వామి. ఐదు నిమిషాలు అయ్యేప్పటికి ఆయన కళ్ళంబడి ధార ఆనంద-ఆనంద ధారలు కారుతూ ఉన్నాయి. కారుతూ ఉంటే స్వామి మళ్ళీ ఆయన్ని భాష్య స్మృతిలోకి సింహాసనం నుంచి లేచి వెళ్లి తట్టి "ఇదిగో ఇదిగో ఇదిగో" అంటూ దగ్గర తీసుకొని "ఏమి ఏమి ఏమైంది?" అని అంటే "స్వామి, నేను అనుకున్న కృష్ణుడు వేరు. కానీ భగవద్గీతను పారాయణం చేసుకొని ఈ సత్యసాయి భగవానుడి దివ్య పాదపద్మాల దగ్గర కూర్చున్న ఈ సన్మంగళ వేళ, ఈ అద్భుతమైనటువంటి వేళ నేను కృష్ణుడి యొక్క తేజో రూపాన్ని blue color లో చూశాను స్వామి" అని ఒక్కసారి ఆనందభాష్పం. అంటే స్వామిని ఆయన దేహాతీతంగా చూశారాయన. అదైపోయింది. ఇది రెండవ స్థాయి అయిపోయిన తర్వాత స్వామిది అసలుది ఉంటుంది. అంటే వల విసరటం లాంటిది. ఇంకా మన లో-లోపల ఎక్కడన్నా లోక లోకాంతర ప్రాణాలలో మనకి ఏదన్నా వాసరులు ఉన్నాయా ఈ ప్రపంచంలో ఉంటే దానిని బయటకు వెలికి తేవాలి. అది సద్గురువు యొక్క పని. "కాదు కాదు ఇంకా ఏమి కావాలి?" అని మూడో ప్రశ్న వేశారు. "స్వామితో నాకొక photo కావాలి" అని అడిగా. స్వామితో photo ఇవాళ తేలికే. చాలా తేలిక. మనకి గనక స్వామితో మాట్లాడే అవకాశం ఒక్క క్షణం దొరికితే వెయ్యి photos వచ్చేస్తాయి బయటికి. ఆ రోజుల్లో photo తీయటానికి వీలు లేదు. కెమెరాలు carry చేయటానికి వీలు లేదు. మా విద్యార్థులందరూ ఇంకా అప్పటికి ప్రవేశం-- రంగప్రవేశం చేయని రోజులివి. మేము black pant white shirt తో స్వామి దగ్గరికి వెళ్లిపోయిన వాళ్ళం. మీ పిల్లలందరినీ, విద్యార్థులందరినీ చూసి మేము మా dress మార్చుకున్నాం. మా address కూడా మార్చుకున్నాం. అది ఆ పరిణామం స్వామి మార్చారు. అట్లా స్వామి "దానికేముంది?" అన్నారు. దానికేముంది అంటే ఎట్లా కెమెరా లేదు. స్వామి ఎవరినో బయటకు వచ్చి గడియ తీసి ఎవరినో పిలిచారు. ఆయన కెమెరా తెచ్చారు. photo తీస్తే విద్యా ప్రకాశానందగిరి స్వామివారు ఒక మాట అన్నారు. "స్వామి, ఈ photo నాకోసం కాదు.ఎప్పుడైనా మా ఆశ్రమానికి కాళహస్తి లో ఎవరైనా ఈ భాగవతులు గనక వచ్చినట్లయితే, ఈ విద్యా ప్రకాశానంద గిరి గారు జీవితంలో ఎప్పుడన్నా స్వామిని చూశారా? అని అంటే మీతో ఉన్న ఆ ఫోటో ఒకటి తగిలిస్తే వాడికి ఆ శ్రమ ఉండదు. ఆ ప్రశ్నకి జవాబు దొరికిపోయి మా గురువుగారు కూడా స్వామిని దర్శనం చేసుకున్నారు. అదృష్టవంతులు అని అనుకోవాలనే తప్ప నాకు వ్యామోహం లేదు స్వామి అంటే, నీ మనస్సు నాకు ఎరుక, నీ మనస్సు నాకు ఎరుకే. బంగారు ఏమి చెయ్యాలి? ఈ ఫోటోలన్నీ ఏం చెయ్యాలి? చిత్రంలో చిత్రాన్ని హత్తుకోవాలి బంగారు. ఆ మాట నాకు ఇంకా గుర్తుంది. నిజానికి ఇవాళ మీ ముందు ఒకటి సమర్పించవలసిన భావన. యాభై నాలుగు, యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వామితో కలిసి చేసిన ప్రయాణంలో ఫోటో లేని వాడు ఎవరన్నా గనక ఉంటే ఆ ఒక్కడి పేరు వి.ఎస్.ఆర్.మూర్తి. నాకు ఫోటో లేదు స్వామితో. అక్కరలేదు అనుకున్నాం. కారణం ఏంటంటే దీనికి కూడా ఒక సంఘటన ఉంది. మన Planetarium కి ముందు ఒక కచేరీ జరిగింది. స్వామి అందరినీ పిలిచారు. ఆ రోజున మలేషియా నుంచి ఒక devotee వచ్చారు. స్వామి అందరికంటే ముందు ఆ రోజున అరగంట ముందు వచ్చారు. వచ్చి ఏర్పాట్లన్నీ స్వామి స్వయంగా ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలి చెప్తున్నారు. ఆయన ఒక బండల్ తీసుకొని వచ్చారు. మన పాకెట్ సైజ్ ఫొటోస్ అన్నీ మలేషియాలో ప్రింట్ చేసి పట్టుకొచ్చారు. చాలా costly printing అవి. సరే, ఆయనకి ఏమిటంటే స్వామి గనక అవకాశం ఇస్తే స్వామితో అది release చేసి తన country లో ఆ ఫోటోలన్నీ స్వామికి ఇవ్వాలి అని. నాక్కూడా మనస్సులో ఒకటుంది. ప్రశాంత నిలయం రోడ్డు మీద అమ్మే ఫోటోలు పావలానో, అర్ధ రూపాయో పెడితే దొరుకుతాయి. స్వామి photo స్వామి చేతి మీదుగా మనకోటి దొరికితే బాగుండు అని. ఆ ఆలోచన కూడా స్వామి రానివ్వల. మలేషియా ని పిలిచారు. రమ్మన్నారు. అక్కడికక్కడే ఆ bh-- ఆ ఫోటోలన్నీ release చేశారు. చేసి ఆ రోజున నాతో స్వామి అన్నటువంటి మాట, ఏం చేసుకుంటారు ఈ ఫోటోలన్నీ? స్వామితో కూడిన ఫోటోలు పెట్టుకుంటే స్వామికి వేసినట్లు నీకు దండ వేస్తారా? వేయరే. స్వామికి హారతి ఇచ్చినట్లు నీకు హారతి ఇస్తారా? వేయరే. విమూఢమైన ఈ ఆలోచనలు వదులుచుకోండి. స్వామిని గుండెలలో పెట్టుకోండి. ఆ బొమ్మని హృదయంలో రాసుకోండి, గీసుకోండి, అనుకోండి. దానివలన మీకు ఆనందం కలుగుతుంది. హృదయవాసి అయినటువంటి సాయి ఈ ఫోటోలకు అతీతమైనటువంటి ఆ తేజో రూపాన్ని దర్శనం చేయండి. తత్వానుసంధానం చేయండి. అంటే ఎంత దొరికిన ఐదు, ఆరు నిమిషాలలో ఈ మాటలన్నీ కూడా స్వామి చెప్పారు. అంటే ఇవాళ ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాలి? ఈ కార్యక్రమంలో అంటే స్వామితో కలిసి జరిగిన లేదా అనుభవించిన అనేకమైనవి చెప్పాలి అంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అది ఇవాళ అక్కర్లేదు. కారణం మన జీవితమే స్వామి యొక్క సందేశంగా మార్చుకోవలసినటువంటి తరుణంలో, పైగా ఏప్రిల్ ఇరవై నాలుగు, రెండువేల పదకొండు తర్వాత స్వామి తన అవతారాన్ని ఒక comma పెట్టారు full stop పెట్టలా. మళ్ళీ ప్రేమ సాయిగా అవతారం వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇది షిరిడి స్వామి చెప్పిన మాట కాదు. ఈ ప్రమాణము, ఈ ప్రతిజ్ఞ, ఈ అనుగ్రహము, ఈ అభయము సాక్షాత్తు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారే ఈ లోకానికి చెప్పారు. మూడు సాయి అవతారాల తర్వాత సాయి నామంతో మరొక్కటి రాదు. కానీ ఒక్కటి వస్తుంది అది ప్రేమ సాయి అవతారం అని. ఏమో మనం ఎక్కడ ఉంటామో? ఉంటామో, మళ్ళీ వస్తామో, మళ్ళీ రామో మనకేమీ ఎరుకలేదు. కానీ ఎవరికై చెప్పాలి ఈ మాటలంటే, ఇవాళ స్వామిని CDలలో, చిత్రపటాలలో లేదా మనం చెప్పే అనుభవాలలో నుంచి స్వామిని అనుభూతి పొందవలసిన ఈ కొత్త తరానికి స్వామి ఏం చేశారు ఈ ప్రపంచానికి? అంటే కేవలం సృష్ట వేదాంతం మాత్రం చెప్పలేదు. ఆచరణాత్మకమైన, అనుష్ఠాన గతమైన వేదాంత భూమికని, అటు భారత, భాగవత, రామాయణాలలో చెప్పబడినటువంటి ధర్మాన్ని, ఒక నియతిని, ఒక శీలాన్ని, ఒక ధైర్యాన్ని, ఒక కరుణని, ఒక ప్రేమని, ఒక దయను, ఒక మానవతను ఆవిష్కరిస్తూ వీటన్నింటి ఆధారంగా మీరు మాధవత్వానికి సన్నిహితులు కండి. ఆ మాధవుడు వేరే చోట లేడు. మీరు చేసే పనులలోనే మాధవుడు దాగి ఉన్నాడు. వెలికి పట్టుకోండి. పాలల్లో నెయ్యి ఎట్లా దాగి ఉన్నదో నిదానవతి ఉపాసన, అంగవతి ఉపాసన, అన్యవతి ఉపాసన అనబడేటువంటి అనేకమైన, అపరోక్షమైనటువంటి భావనతో ఎట్లాగైతే పాలల్లో నుంచి చిలికి చిలికి చివరగై నెయ్యి ఎట్లా అవుతుందో, ఒక్కసారి నెయ్యి అయిన తర్వాత నేతి చుక్కలో నుంచి పాల చుక్క ఎట్లా పుట్టలేదో అట్లాగే మీరు భగవంతుడితో కూడిన తర్వాత మీరు భగవంతులే కావాలి తప్ప మళ్ళీ నీచ మానవులు, అల్ప మానవులు వలే జీవించటానికి వీలులేదు. అంతే కాదు, ఈ ప్రపంచానికి ఇవాళ కావలసింది ఆకార మానవులు కాదు ఆచార మానవులు కావాలి. ఏ ఆచారము? సదాచారము. సమ్యక్ సంకీర్తన, సద్భావన, సత్సంగం, సత్సాంగత్యం, సదా నిరంతరమైనటువంటి భగవద్ధ్యానం. వీటన్నింటినీ కూడా మీరు కలబోసుకోండి. జీవితాలని ఆనందమయం చేసుకోండి. అన్నటువంటి ఆ స్వామి మాటలు ఇవాళ మనకి మహోపదేశాలుగా ఒక్కసారి స్పురణకు వచ్చినప్పుడు, పడుకోపోయేటప్పుడు స్వామి ఏం చెప్పారు? ఇవాళ ఆయన చెప్పినట్టుగా వారి భావానికి అనుగుణంగా ఒక్క రోజైనా జీవించగలిగామా అన్న ప్రశ్న. పర్వాలేదు జీవించగలుగుతున్నాము అంటే నిద్ర పడుతున్నది. ఎక్కడన్నా గతి తప్పుతున్నామేమో అన్నప్పుడు నిద్ర జారిపోతున్నది కానీ పరమ ప్రశాంతమైనటువంటి ఈ ప్రకృతికి, ఈ ప్రపంచానికి స్వామి ఇచ్చిన మహత్తర సందేశాల అన్నింటినీ గనక మనం గమనించినట్లయితే మనలో దాగిన మాధవుడ్ని పట్టుకోవటం ఒక ఎత్తయితే స్వామి ఇంకొక్క అడుగు ముందుకు వేసి మరొక్కటి చెప్పారు. నీలో ఉన్న మాధవుడ్ని నువ్వు పట్టుకోవటం నీ వ్యవహారం.అది నీ అధ్యాత్మ సాధన. కానీ నీ ఎదుట ఉన్న వాడిలో కూడా మాధవుడే ఉన్నాడని నువ్వు గమనించగలిగితే అది పూర్ణాద్వైత భావన. చూసారా! అంటే మనం అనుకుంటాం నాలో ఉన్న దేవుణ్ణి, ఆత్మను నేను పట్టుకున్నాను. నాకు ఆత్మసాక్షాత్కారం అయిపోయింది. నాకిక జన్మ రాహిత్యం లేదు. ఈ మాటలన్నీ వాడుతాం. స్వామి అంతటితో ఆగద్దన్నారు. నీ ఎదుట ఉన్న వాడిలో కూడా ఉన్నది అదే ఆత్మ, అదే భగవంతుడు అనబడేటువంటి ఆ భావనని మీరు నిరంతరము కూడా జపిస్తూ ఉండండి. దీనికి రెండు మార్గాలు. ఇవాళ మళ్ళీ ప్రేమ, సేవ గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే నూట ఎనభై ఎనిమిది దేశాలలో గత వారం రోజులుగా జరిగినదంతా కూడా ప్రేమే. ప్రేమ ప్రవాహము, సేవా భావము. ఈ రెండు ప్రపంచాన్ని ఒక దగ్గర చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇందాక అనేకమైనటువంటి సందర్భాలున్నాయి. ఆ సందర్భాలలో వ్యక్తిగతమైనవి కూడా రెండు, మూడు చెప్పమన్నారు. కాబట్టి నాకు అలవాటు లేని పని గనుక కాస్త శ్రమ పడైనా ఒక్కటి మాత్రం చెప్తాను. ఒకటో రెండో చెప్తాను. ఒకటి నా అమెరికా ప్రయాణం. అమెరికా నేను వెళ్ళటం జరిగింది. జరిగిన తర్వాత నేను Connecticut అనేటువంటి ప్రాంతం నుంచి ఆ Long Island వైపుకి నేను రావాలి. రావాలి అంటే via New York రావాలి. రావాలంటే సుమారు తొమ్మిది గంటల ప్రయాణం. కానీ అక్కడొక Ferry ఉంది. Ferry గనుక ఎక్కితే కేవలం నలభై, ముప్పై ఐదు నిమిషాల్లో నేను Long Island కి వెళ్తాను. సో పరదేశీయులం. మనమేదో మన పని మీద వెళ్ళాం. University పని మీద వెళ్ళాం. కాబట్టి ఎంత తొందరగా ఉన్న సమయాన్ని కాపాడుకుంటే అంత మంచిదని ఆ Ferry ఎక్కాలి అని నేను నిర్ణయించుకున్నాను. కానీ అక్కడొక పెద్ద Board ఉంది. ఆ Board లో ఏముందంటే ఇప్పటికే దీని ముందు నూట యాభై accidents అయినాయి. దీనిలో ఊబి ఉంది. ఎక్కితే అక్కడిదాకా వెళుతుందనే నమ్మకం లేదు. ఫలానా వాళ్ళు ఎక్కొచ్చు. ఫలానా వాళ్ళు ఎక్కకూడదు. మీ ఇష్టమైతే మీరు risk తీసుకుంటే మీరు ఎక్కొచ్చు అని ఉంది. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం గుర్తొచ్చి ఊబిని దాటించలేరా మా స్వామి దుస్తర మహా సాగర సంసార సాగరాన్ని దాటించే స్వామి అని హాయిగా కోట్ వేసుకుని ఆ Ferry ఎక్కాను. అతి విచిత్రంగా ఆ రోజున అలలన్నీ సహకరించి కేవలం ఇరవై ఏడు నిమిషాలలో అవతల గట్టుకు వెళ్లిపోయాం. ఇది మొట్టమొదటిది. అయితే నా చేతిలో చిన్న bag మాత్రమే ఉంది. కార్లు జూమ్ అయి వెళ్లిపోతున్నాయి. వందల వేల కార్లు చాలా speed లో వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ్లాగా మనం కనపడగానే ఆగి ఇట్లా reverse అయి వెనక్కి రావడం అనేది అక్కడ లేదు. ముందుకెళ్తే మళ్ళీ వాడు కొన్ని miles తిరిగి రావాలి. అది అందరికీ అనుభవమే. నేను ఎలా వెళ్ళాలి? ఇది దాటి వెళ్ళాలి. Station కి వెళ్ళాలి. సుమారు ఎనిమిది miles దూరం American భాషలో. ఎనిమిది miles నడిచి వెళ్లాలనే నిర్ణయించుకున్నా. కానీ నాకు వేరే అవకాశం లేదు. నుంచున్నా. నాకంటే ముందు నా ముందు నుంచీ ఒక కారు చూసుకుని వెళ్ళింది కాస్త. వెళ్ళిన కారు విచిత్రంగా వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే దాన్ని drive చేస్తున్న ఆమె వయస్సు సుమారు ఎనభై ఏడు సంవత్సరాలు ఉంటాయి. ఆమెన్నే, ఆమె నన్ను వేసిన ఒకే ఒక్క ప్రశ్న "భగవాన్ సత్యసాయిబాబా వారు ఇక్కడికి వచ్చారా?" అని అడిగింది. అడిగితే సత్యసాయిబాబా వారు ఇక్కడికి రావటం ఏంటి? ఇది Prasanthi Nilayam అని మామూలుగా, "No, no, no. I have seen him standing on the pavement. I saw Bhagawan with my own eyes" అన్నది. అని "Where are you from?" అన్నది second question. నేను "From India" "Then where are you to go?" అన్నది. Smith Town అనే ఊరు వెళ్ళాలి అన్నాను. "Please get into my car" అంది. కార్ ఎక్కాం. ఎక్కిన తర్వాత నెమ్మదిగా, ఇది ఎనభై ఐదు ఏళ్ళ ఒక వృద్ధురాలు అమెరికాలో ఒక అపరిచితుడ్ని కారు ఎక్కించుకోదు security reasons వల్ల. కానీ ఎక్కించుకుంది. దారిలో అలా అలా వెళుతూ వెళుతూ "నాకు బాబా గారు అక్కడ నుంచున్నట్టుగా అనిపించింది. నిజం చెప్పండి. రాలేదా?" అని మళ్ళీ అడిగింది పాపం. లేదంటే, లేదు ఎందుకంటే నేను రాజమండ్రి వచ్చాను ఒక ఇరవై ఏళ్ళ క్రితం. సువార్త కూటములు జరిగితే నన్ను పిలిచారు. నేను ఆ రాజమండ్రి వచ్చినప్పుడు సత్యసాయిబాబా వారు రాజమండ్రికి వచ్చారు. అక్కడ నేను వారిని దర్శనం చేసుకున్నా. వర్తమానము చెప్పి దూత వైభవమున పోవుచుండె అని ఆవిడ American lady తెలుగులో ఆ సువార్త కూటమిలో పాట పాడుతూ ఆ అనేక సంగతులు చెప్తూ స్వామి గురించి చెప్తూ ఆ నా గురి-- నా నుంచి అనేక విషయాలు స్వామిని గురించి, అంటే ఇరవై ఏళ్ళ తర్వాత స్వామి విషయాలు తెలుసుకుంటూ ఆమె Smith Town దగ్గరికి తీసుకు వచ్చి నేను ఎక్కడ దిగాలో అక్కడ ఆవిడ దింపేసింది. దింపితే అయిపోయింది. ఆమె address ఇచ్చి ఏదన్నా బాబా మీద మంచి books ఉంటే పంపించమంది. నేను మామూలుగా India కి వచ్చాను. ఆ వచ్చిన రెండో రోజు స్వామి దగ్గర Prasanthi Nilayam కి వెళితే స్వామి ఆ రోజున పిలిచి చాలా విషయాలు మాట్లాడి, అన్నీ చెప్పావు గాని America విషయాలన్నీ చెప్పమన్నారు. ఏం జరిగినాయి? ఎక్కడెక్కడ ఏం జరిగింది? జరిగింది చెప్పాను. అవును అన్నీ చెప్పావు గాని ఆ రాజమండ్రి బామ్మ సంగతి చెప్పవే అన్నారు. అంటే స్వామి సర్వాంతర్యామి. ఆయన Prasanth-- ఆమెకి ఆ రూపంలో అక్కడ సాక్షాత్కారం ఇచ్చి బహుశా నన్ను చాలా జాగ్రత్తగా, భద్రంగా అక్కడికి చేర్చేటువంటి ఒక మహానుభూతిని, ఆమెకు ఒక యోగాన్ని, నాకు ఒక అవకాశాన్ని, ఈ రెండూ కూడా కల్పించారు. ఇటువంటి అనుభవాలు ఎన్నని చెప్పాలి? కొన్ని వేలు వేలు. అవే మానవ జీవితాన్ని నడిపించాలి. సరే వాటి-- ఆ personal aspects లోకి మనం వెళ్ళకుండా ఇందాక చెప్పినట్లుగా Prasanthi Nilayam కి స్వామి కోసమే వెళ్ళాలి మనం. మనం ఏ పని చేసినా, ఎంత పని చేసినా, ఎంత కీర్తిని పొందినా అదంతా స్వామి అనేటువంటి ఒక్క సద్వస్తువు వలన మాత్రమే మనకు లభించిందనేది అన్నివేళలా మనం గుర్తు పెట్టుకోవాలి. స్వామి మరొక్క మాట చెప్పారు. ఇవాళ ఇవన్నీ తలుచుకుంటేఆ కాస్త తాత్విక చింతన ఉంది గనుక emotion కావటానికి వీలు లేదు గాని ఆ తలపులన్నీ గుర్తొస్తున్నప్పుడు అంతరంగమంతా కూడా క్షీరసాగర మథనం జరుగుతుంది. ఆ క్షీరసాగర మథనంలో పరమ ఆనందం కూడా లభిస్తుంది. స్వామి ఒక్క మాట చెప్పారు. స్వామిని అన్నివేళలా నమ్ముకోండి బంగారం. ఈ మాట నా-- ప్రతి సంవత్సరం నాకెవరో ఒకరో diary ఇస్తారు. మొట్టమొదటి రోజు నేను రాసుకునే మాట ఇదొక్కటే. స్వామిని నమ్ముకోండి బంగారం. మీకేం కావాలో స్వామిస్తారు. స్వామిని మాత్రం అమ్ముకోకండి బంగారం అన్నారు. అది. అంటే మనం మన ఏ ప్రజ్ఞని కూడా అమ్ముకోకూడదు. స్వామి మనంత-- ఆయన ఇస్తారు మనకి. అన్ని అవకాశాలు మనకు లభిస్తాయి. జీవితం వడ్డించిన విస్తరిగా ఉంటుంది. విస్తరి ఖాళీ అయిపోతుంది. మళ్ళీ వడ్డించేవాడు ఈ లోకంలో ఉండడు లోకేశ్వరుడు తప్ప. కనుకనే సమర్పణ అనేటువంటి భావనలో తాత్విక చింతనా భూమికలో భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని, బ్రహ్మసూత్రాలని వీటన్నింటిని కూడా స్వామి ద్వారా విని ఆపై చదివే అవకాశం లేదు. మళ్ళీ కానీ ఆ విన్నవన్నీ మళ్ళీ పునః పునః లోపల అనుకుంటున్నప్పుడు ఒక ప్రవాహ వేగంతో ఇవాళ ఎక్కడైనా ఇవాళ ఈ సమర్పించటం కూడా వి.ఎస్.ఆర్. మూర్తి ఏం సమర్పించగలడు? ఆ సమర్పిస్తున్నది ఎవరంటే నీళ్ళల్లో నుంచొని మనం గంగలో నుంచి దోసెడు నీళ్ళు తీసుకుని సూర్యదేవుడికి అర్ఘ్యం ఇచ్చి ఆ నీళ్ళే మళ్ళీ ఆయనకి ఇచ్చినట్టుగా ఈ సమర్పిస్తున్నది కూడా ఎవరు అంటే సత్యసాయి భగవానుడే తప్ప మనం కాదు అనే భావనలో ఉండాలి. అంటే అకర్తృత్వ భావన ఉండాలి. కానీ జీవుడు సాధన లేక సాధనా మార్గంలో నిలకడ చెందలేక అనేకమైన విషయాలు తనకు తాను ఆపాదించుకుని తనను ఒక unique feature గా అనుకుంటాడు. unique feature గాని unique తేజస్సు గాని విశిష్ట, వరిష్ట, గరిష్టమైనటువంటి భావన కానీ భగవంతుడిదే తప్ప భాగవతుడిది కాదు. కనుక ఇవాళ స్వామిని ఇవాళ వేదాలలో కనుక వేదాలన్నీ అధ్యయనం చేసినట్లయితే వేదాధ్యయనంలో సత్యసాయి భగవానుడు సామగానమై కనిపిస్తారు. ఋగ్వేదమై కనిపిస్తారు. మన సనాతన సారథి కవికుమార్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి "మీరు స్వామిని చాలాసార్లు దర్శనం చేస్తారు కదా, ఆ స్వామి వస్తున్నటువంటి వేళ మీ మనసులో ఎటువంటి భావాలు కలుగుతాయి? ఈ స్వామి దేవుడని అనిపిస్తుందా? అందగాడనిపిస్తుందా? బాగున్నారు అనిపిస్తుందా? తేజోమయుడనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? మీ భావన ఏమిటో చెప్పండి" అని అప్పటికప్పుడు నన్ను అడిగారు. నవ్వులు పూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలపులు చదివినట్లు, హంసలు నడిచినట్లు, పరమహంసలు నడిపినట్లు, దండపాణి మార్కన కోదండ పాణియే శరణన్న సత్యసాయి వాక్కు సతతమ్ము ఋక్కు. స్వామి మాట ఋగ్వేద సమానమనే భావన. అంటే సామవేదము, ఋగ్వేదము ఇక కర్మకాండ మనం చేసే పనులు, మన ఆలోచనలు, మనం మరొక వ్యక్తిని గురించి చేసేటువంటి విచారణ, ఈ ప్రపంచం పోకడలు ఒక్కొక్కసారి అర్థం కాక అయోమయంలో పడేసినప్పుడు, ఒక్కొక్కసారి మందిరంలో పరమాద్భుతంగా ఉండే వ్యక్తి మైదానంలో ఎందుకు దిగజారి పోతున్నాడు అన్న ఆవేదన కలిగినప్పుడు స్వామి మాటలు గుర్తొస్తాయి. అహంకారముండెనా గురువు చిక్కడు. గురువు చిక్కెనా అహంకారముండదు. నీకు గురువు అంటూ దొరికాడు, ఈయనే నా గురువు అని గనుక నువ్వు అనుకున్నట్లయితే నీకు అహంకారం ఉండకూడదు. ఉండవలసింది అహంస్ఫురణ. అట్లాగే నీకు గురువు చిక్కిన తర్వాత సమస్తమూ ఆ భారం- నీకు చెప్పడు. కానీ మోస్తాడు. ఆ మోసు మోసు నిన్ను తేలికగా నిన్ను స్వస్థానానికి చేరుస్తాడు. అందుకనే పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత ఒక్కొక్క దశాబ్దం, ఒక్కొక్క దశాబ్దంలో ప్రశాంతిలయం తద్వారా ఈ సర్వ ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు, అనుభవిస్తూ ఉన్నప్పుడు, అదే ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సత్యసాయి భగవానుడే గనుక చిన్నప్పుడు మనల్ని దగ్గర తీసి ఉండకపోతే మనం ఏమైపోయే వాళ్ళం అన్న ఒక భయం కలుగుతుంది. అంటే ఏమయ్యేవాళ్ళం అంటే బాగా డబ్బు సంపాదించి పాప ఆచారాలు మూటగట్టే వాళ్ళమేమో తెలియదు. లేదు బాగా కీర్తి బాగా వచ్చి అహంకరించే వాళ్ళమేమో తెలియదు. కాబట్టి ఇటువంటి ప్రాపంచికమైనటువంటి ముద్రలు ఏమీ లేకుండా పన్నెండవ ఏట ఎట్లా ఉన్నామో ఇదిగో మనం మరణించే ఆ ప్రాణ నిర్గమన వేళ వరకు కూడా అంత స్వచ్ఛంగానూ నిలపగలిగినటువంటి ఎవరైనా సద్గురువు ఉన్నారా అంటే నా దృష్టిలో, నా అనుభవంలో నేను అనేకమంది గురువులు, గురువులుగా అనబడే వాళ్ళని చూశాను. ఈ తాత్విక విచార ధారలో స్వాధ్యాయంలో అందరూ విత్తాపహారులే తప్ప నాకు చిత్తాపహారి దొరకల. చిత్తాపహారి ఒక్క భగవానుడు మాత్రమే. ఆ భగవానుడు శ్రీ సత్యసాయి భగవానుడు మాత్రమే. మన చిత్తాన్ని తనతో కలుపుకొని ఉంచిన కారణంగా డబ్బు మనల్ని వశపరచుకోలేదు. మోహం వ్యామోహం వైపు నడిపించదు. వ్యామోహం వ్యసనం వైపు నడిపించదు. ఆమాయంతు బ్రహ్మచారిణస్స్వాహా అన్నటువంటి ఒక వేదవాక్య ప్రమాణంగా వేదాధ్యయనం చేసేవాడు, వేదానుష్ఠానం చేసేవాడు, వేదభాష్యం చెప్పేటువంటి వాడు. అయ్యా, పరమేశ్వరా! నిన్న ఒక్కరోజు గడిపాను. జీవితాన్ని నేను జీవించగలిగాను. నీ వలన నాకు అనేక అనుభవాలు కలిగినాయి. ఆ అనుభూతిని నాలోనే దాచుకొని మరణించడానికి వీలులేదు. కనుక నా అనుభూతిని పంచుకోగలిగిన, పంచుకోదగిన, పంచుకోవలసిన ఒక్క శ్రోతను నాకివ్వమని అగ్ని కార్యం చేస్తాడు.శ్రోత దొరకడు వినేవాడు రాడు ఆ రోజు ఆయనకు భోజనం ఉండదు మళ్ళీ ఒక రోజు గడపాలి మళ్ళీ అగ్ని కార్యం చేయాలి మళ్ళీ ఒక శ్రోత కోసం పరమాత్మను ప్రార్థించాలి మరి చదువుకున్నది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? జరుగుతున్నది ఏమిటి? ఆలోచించినట్లయితే నిత్య సత్సంగ మహా ప్రవాహాన్ని ప్రతిరోజూ సుమారు రెండు వందల మంది శ్రోతలని ఏ అగ్ని కార్యం చేయకుండా అనుగ్రహించిన స్వామి పరమాత్మ కాక మరొకరు అవుతారా? అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు పరమాత్మే ఎందుకని అంటే ఆయన్ని అడగవలసిన పని లేదు ఏది ఎవరికీ ఎప్పుడు ఎట్లా ఎంతెంత ఇవ్వవలసి ఉన్నదో ఏ ప్రజ్ఞ ద్వారా ఈ ప్రపంచానికి ఆ వ్యక్తి వలన జరగవలసి ఉన్నదో అది స్వామికి ఎరుక గనుక ఆ ఎరుకే మానవుణ్ణి ప్రధానంగా నడిపిస్తుంది నలభై ఆరు సంవత్సరాల సమర్పణకి ఇవాళ ఒక వాలిడిక్షన్ లాగా నాకు అనిపిస్తున్నది ఎందుకనంటే ఏజీస్ ఆఫీస్ నిత్య సత్సంగాలు combined AP state లో సెక్రటేరియట్ లో కొన్ని ఇరవై ఏడు సంవత్సరాలు జరిగినటువంటి సత్సంగాలు post master general మన కోటి సమితిలో తర్వాత రైల్ నిలయంలో ప్రతిరోజూ ప్రతి వారము ప్రతి గురువారం మంగళవారం గంటసేపు జరిగినటువంటి ఆ సత్సంగాలలో దీనివలన ఏదన్నా ప్రయోజనం ఉందా అని చాలామంది నన్ను అడుగుతారు మీరు వెళ్లారు బానే ఉంది మీరేదో వెళ్లారు చెప్పారు చాలామంది వెళ్లారు చెప్పారు అని అంటే అది తృప్తి కాదు అవి విని తమ జీవన విధానాన్ని మార్చుకొని ప్రశాంతి నిలయానికి వెళ్లి స్వామి సేవలో మా జీవితం ధన్యమవుతున్నది అట్లాగే మేము టంచనుగా మాకు ఇవ్వబడిన జీతానికి అనుగుణంగా ధర్మ ప్రకారం మేము ఉద్యోగం చేయగలిగాం దీనివలన మేము పాపపు సొమ్ము ఒక్క రూపాయి కూడా మా ఇంట్లోకి తీసుకు వెళ్లలేదని వారు చెప్పినప్పుడు ఆ సమర్పణ అంతా కూడా సత్య సాయి భగవానుడి యొక్క దివ్య గరిమకు మాత్రమే మనం అందించాలి ఎందుకంటే ఇది విప్లవాలతో ఉద్యమాలతో జెండాలతో ఊరేగింపులతో ఆవేశ పూరితమైనటువంటి స్వరాలతో ఈ ప్రపంచం మారదు ప్రేమ ద్వారా సేవ ద్వారా ఇది మారుతూనే వస్తుంది ఎందుకనంటే ఇవాళ ఇప్పుడు నేను చెప్పినటువంటి organizations వెనక దానిని ఆనాడు నడిపించినటువంటి వారందరూ కూడా స్వామి యొక్క devotees కావటమే ప్రధానమైన కారణం AGs office గాని secretariat గాని మరొకటి గాని మరొకటి గాని అట్లాగే స్వామి ఆవరణలో స్వామి భక్తులతో మనం కూడి ఉన్నప్పుడు మనకి అనేక సందేహాలు మూడు మూడు వందల అరవై డిగ్రీలలో సమాధానం దొరుకుతుంది జీవితాన్ని నడపకూడదు కాలాన్ని గడపకూడదు జీవితాన్ని అనుక్షణం జీవించాలి పనికి పనికి మధ్య విరామ కాలం ఉంది భగవంతుడి గురించిన విచారణ చేయాలి భగవన్నామము భగవత్ తత్వము భగవత్ భావము భగవంతుని యొక్క రూపము మన శరీరాన్ని మనస్సుని ఆవేశించినప్పుడు మన యందు భగవంతుడే ఉంటాడు తప్ప మరొకడు ఉండడు అటువంటి స్థాయికి ఇవాళ మనమందరం కూడా ఆయత్తం కావాలి ఇవాళ చాలా చోట్ల నేను ఒకే ఒక్క విషయాన్ని నొక్కి చెప్తున్నాను స్వామిని స్వయంగా చూసి స్వామితో మాట్లాడి స్వామిని అనేకసార్లు తాకి స్పృశించి స్వామితో గడిపి స్వామితో గడుపుతూ అనేక అనుభవాలు పొందిన మా బోటి వారికంటే స్వామిని చూడక చూసే అవకాశం రాక అవకాశం వచ్చినా పోగొట్టుకొని ఇకపై అవకాశమే లేని మీరు చేస్తున్న ఈ కార్యకలాపాలు మా కంటే మహోన్నతమైనవి ఎందుకంటే మేము చూశాం చేశాం కానీ మీరు చూడలే ఈ తరం ఇంకా చూడలేదు కానీ వాళ్ళు ఇవాళ చేస్తున్న కార్యకలాపాలు చేస్తుంటే వాళ్ళది నిజమైనటువంటి సమర్పణగా నేను భావన చేస్తాను ఎందుకంటే మనం చూశాం proximity ఉంది స్వామి అంటే అనుభవాలు మనకు కలుగుతూనే ఉంటాయి అవి అసలు మానవ జన్మ స్వామి తన అవతార కాలంలో మనకివ్వటమే ఒక మహోన్నతమైనటువంటి మహిమ మరొక్కటి ఆ నన్ను మామూలుగా అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే చాలా miracles ఉన్నాయి కదా ఒక అద్భుతమైన miracle ఏదన్నా చెప్పండి అని ఆ నేనంటే తెలియని వాళ్ళు అడుగుతారు అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే జవాబు ఒక్కటే మనమందరం కుల్వంత హాల్లో కూర్చుంటాం ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఒక్కోసారి డెబ్భై వేలు కూర్చొని ఉంటాం స్వామి వస్తారు దర్శనం ఇస్తారు మన మధ్యలో అట్లా తిరిగి వెళ్తారు మళ్ళీ సింహాసనంలో కూర్చుంటారు స్వామికి హారతి ఇస్తారు స్వామి మౌనంగా లోపలికి వెళ్లిపోతారు మన మనతో ఎవరితో ఆయన ఏం మాట్లాడలే కదా కానీ మనం మన gates లో నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు ఈ యాభై వేల మందినో డెబ్భై వేల మందినో గమనించినట్లయితే డెబ్భై వేల మంది ఒక మాట అంటారు ఇవాళ స్వామి నన్నే చూశారు అని మానవుడికి ఇది సాధ్యమేనా డెబ్భై వేల మంది ప్రతి వాడు ఒక్కొక్కడు connect కాగలడా ఇది భగవత్ తత్వానికి గొప్ప నిదర్శనం ఇది ఆ చూడటమంటే స్వామి యొక్క చూపు ఈ దేహం ఆ దేహాన్ని చూట్టం కాదు అందుకనే మనకో గౌరవాన్ని ఇచ్చారు స్వామి దివ్యాత్మ స్వరూపులారా ప్రేమాత్మ స్వరూపులారా ఇంతకు మించిన title మరొకటి ఉందని నేను అనుకోను ఎందుకని అంటే నువ్వు సుబ్బారావువ్యా అప్పారావువ్యా మరొకడా మరొకడా ఆయనకేం సంబంధం నువ్వు దివ్యాత్మ స్వరూపుడివి దివ్యాత్మ దివ్యమైన ఆత్మ స్వరూపుడివి నువ్వు అది ఆధ్యాత్మిక స్థాయి భౌతిక స్థాయిలో నీవు ప్రేమాత్మ స్వరూపుడివి ఆ దివ్యమైనటువంటి ఆత్మ ప్రేమగా గనక ఫలించకపోయినట్లయితే ప్రతిఫలించకపోయినట్లయితే నీ తోటి మానవుడికి అది అందకపోయినట్లయితేప్రయోజనం లేదు. కనుక స్వామి మనకిచ్చిన ఈ రెండు titles దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమాత్మ స్వరూపులారా అన్నది గనక మనం పెట్టుకున్నట్లయితే, రాగద్వేషాలుండవ్, అహంకారం ఉండదు, మనలో అసహనాలు ఉండవ్. ఉండవలసినదంతా ఒక ప్రేమైక స్వరూపమే. ఇవాళ స్వామి దేహంలో ఉన్నారా లేరా అన్న ప్రశ్న ఎవరి యందు లేదు. నిజానికి రెండో ప్రశ్న నన్నడిగేది పుట్టపర్తి ఎట్లా ఉన్నది అని అడుగుతుంటారు. సమర్పణ భావంతో చెప్పవలసిన ఒక్కమాట, స్వామి దేహంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా పొరపాటు జరిగినా స్వామి చూసుకుంటారులే, క్షమిస్తారులే అని చేసేవాళ్ళం. ఇవాళ స్వామి లేరన్న భావన లేదు. స్వామి కంటికి కనపట్టలేదు గనుక మన యందే ఉన్నారు, మనతో ఉన్నారు అన్నటువంటి భావనతో స్వామి దేహంలో ఉన్న కాలం కంటే ఇంకా పటిష్టంగా, పవిత్రంగా, నిర్దుష్టంగా కార్యకలాపాలు ప్రపంచం మొత్తం సాగుతున్నాయి. ఇది ఒక అద్భుతమైన miracle. ఎందుకంటే ఈ మహాపురుషులు వచ్చి వెళ్ళాక సంస్థలు మూతపడిపోతాయి. బుజు పట్టిపోతాయి. నిర్వీర్యమైపోతాయి. సత్యసాయి భగవానుడి విషయంలో ఇది నిత్యకల్యాణము, పచ్చతోరణమై భాసిస్తున్నది. అనేకమంది యువకులు, అనేకమంది కొత్తవాళ్ళు, పిల్లలు, బాలవికాస్ పిల్లలు, వీళ్ళందరూ కూడా స్వామి ప్రవాహంలోకి వస్తున్నారు. అందుకనే స్వామి చెప్పారు. స్వామి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు <|diarize|>"అనన్యాశ్చింతయన్తో మా యే జనాః పర్యుపాసతే, తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం" అర్థం చేసుకోవాలంటే సంస్కృతం రావాలి. దీనిని స్వామి "తేషాం నిత్యాభియుక్తానాం" అప్పుడప్పుడు కూడేవాడు కాదు, ఎప్పుడూ ఎవరు నాతో కూడి ఉంటారో వారి వెంట, జంట, కంట ఈ మాట మనకొచ్చు. కానీ దాని సందర్భం ఏమిటి? అది ఎవరికి apply అవుతుంది అంటే, ఎవరైతే నన్ను అంటిపెట్టుకొని ఉన్నారో, అన్యచింతన లేకుండా అనన్య భావనతో ఉన్నారో, ఎవరు నాతో అన్నివేళలా కూడి ఉన్నారో వారి యోగాన్ని, క్షేమాన్ని నేను చూస్తాను అన్నటువంటి ఈ భావన మనందరినీ మాత్రమే కాక సమస్త ప్రపంచాన్ని నడిపిస్తుంది. అట్లాగే ఇవాళ ఈ తరం తమను తాము సమర్పించుకోవాలి సనాతనమైన ధర్మానికి, వైదికమైన ధర్మానికి. కనుకనే స్వామి యజ్ఞయాగాదులు చేయించారు. స్వామి వ్రతాలు చేయించారు. ఎందుకంటే సామూహికంగా మనందరం కలిసినట్లయితే అది సంఘటిత శక్తి. సోమయాగం గనక చేసినట్లయితే పీఠాల మీద కూర్చున్న వాడికే పుణ్యం. సత్రయాగం చేస్తే వాకిలికి కట్టిన తోరణానికి కూడా అదే సమాన భాగం లభిస్తుంది గనుక స్వామి సంఘటిత పరిచారు. స్వామి అవతారాన్ని ఈ సమర్పణ భావనతో గనక చూసినట్లయితే, ఈ ప్రపంచానికి ఏం చెప్పారు? వారు వచ్చి చేసిన పని ఏవిటంటే "అహం సత్యబోధకః" అంటూనే స్వామి మనిషిని తయారుచేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో స్వామి సఫలీకృతులైనారు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో కీలక పదవులలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందిన వారే ఇవాళ ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. కనుకనే దాని వెనుక ఒక సత్యము, ఒక ధర్మము, ఒక శాంతి, ఒక ప్రేమ, ఒక అహింస అంతర్వాహినిగా ఉంటుంది. ఎందుకంటే స్వామి దాంట్లో ప్రచారం లేదు, ప్రగల్భం లేదు. ఇవి పెరగకుండా కూడా మనం చూసుకోవాలి. ప్రచార యుగం అయినప్పటికీ కూడా ఏ ప్ర-- నాకు బాగా గుర్తు, మా సోదరుడు నాగరాజు చిన్నప్పుడు ఓ మాట, మీరు last సమర్పణ విన్నారు. నాగరాజు నాకు అన్న లాంటివాడు. 1985, 87 ప్రాంతంలో స్వామి interview roomలోనే చెప్పిన మాట "ప్రచారం ఎవరు చేసుకుంటారో వాడు అల్పుడు. ఎవరు తనను తాను గురించి చెప్పుకుంటాడో వాడు అల్పమతి కలిగినవాడు. ఒక చిన్న బెల్లం ముక్క నీ hallలో పడేసి నిద్రపో. కొన్ని వందల చీమలు దాని దగ్గరికి వచ్చాయి. invitation పంపించామా? అట్లాగే సత్యసాయి భగవానుడు ఒక బెల్లం ముక్క అయితే, ఈ ప్రపంచం అక్కడికి వచ్చి తీరుతుంది. ఇది ఆకర్షణ కాదు, ఇది అద్భుతమైన ఆకర్షణ. ఈ ఆకర్షణ వెనుక మహత్తు లేదు. మీరు చెప్పే మహిమలు లేవు. ఏమున్నదంటే ప్రేమ, ప్రేమ, ప్రేమ. దివ్యమైనటువంటి ప్రేమ. స్వార్థం లేనటువంటి ఒక అవతారం ఇదొక్కటే. ఏం కావాలి నాకు? నాకేమీ అక్కర్లేదు అన్నటువంటి భావన మనం కూడా imbibe చేసుకోవాలి." మా స్వామి ఇంతటి వారు, అంతటి వారు అని కీర్తిస్తే మనకి ఆనందం కలుగుతుందేమో గాని మనల్ని అధ్యాత్మలో ఉన్నత స్థితికి తీసుకువెళ్ళదు. స్వామి ఆలోచనలకు అనుగుణంగా ఏది రాని, ఏది పోని, ఎంత కష్టం కలగని మనం దాన్ని, స్వామి చూడండి eighth standard complete చేయలేదు స్వామి. సర్వ జగత్తుకి కూడా శిరోధార్యమైనటువంటి మణిమకుటం లాగా స్వామి ఈ ప్రపంచానికి తనను తాను సమకూర్చారు. విద్యాలయాలు, మానవతా విలువలతో కూడిన విద్యాలయాలు, కొన్ని వేల మంది ఆయనకి రక్తసంబంధీకులు ఎవ్వరూ లేరు. మనబోటి వారందరినీ తన బంధువులుగా మార్చుకున్నారు. ఏ బంధువునీ తన దగ్గర తీయలేదు. అట్లాగే ఈ పిల్లలందరికీ కూడా ఎన్ని విషయాలు స్వామి చెప్పారు. వాటన్నింటినీ గమనిస్తే మనం కూడా సమర్పణ భావంతో జీవించాలి. ఏమో ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటామో? ఎప్పుడు ఏ క్షణమో ఎవరికీ తెలియదు గనుక జీవించి ఉన్నంత కాలం స్వామికి ఇష్టమైన మూడు పనులు చేద్దాం. ఇది సమర్పణలో ఒక భాగంగా స్వీకరిద్దాం. ఒకటి వేదాన్ని రక్షించాలి మనం. వేదం నిలబడాలి. ఇవాళ విజ్ఞాన శాస్త్రం గాని, కిరణ శాస్త్రం గాని, పక్ష శాస్త్రం గాని, అనేకమైనటువంటి అంతరిక్ష శాస్త్రం గాని సర్వము కూడా మంత్ర పూరితంగా వేదాలలో నిండి ఉన్నది. ఆ వేదాన్ని అనేవాణ్ణి కాపాడాలి, వినేవాళ్ళు తయారు కావాలి, వేదాధ్యయనం చేయాలి, వేదభాష్యం చెప్పాలి. దానిలో అన్నీ scienceలో ఇమడు. కానీ వేదంలో అన్నీ ముడుతాయి.ఆ ఏవేవి ఉన్నాయో వాటన్నింటిని కూడా ఏర్చి, కూర్చి, పేర్చి మనం శివం ప్రాంగణాన్ని ఒక ప్రజ్ఞాన ప్రాంగణంగా, పరమాద్భుతమైనటువంటి వక్తలందరూ వచ్చి ఒకప్పుడు మాట్లాడేవారు ఇక్కడ. మళ్ళీ ఆ వైభవం ఇక్కడికి రావాలి అని నేను మనసా, వచసా కోరుకుంటున్నాను. రెండవది విద్వత్ పోషణ. విద్వత్తు కలిగినటువంటి వాడు, వేదము ఎరిగిన వాడే విద్వత్ పోషణ. వేదము అంటే విద్య, విద్య అంటే చావులేని చదువు. అది ఆత్మవిద్య, లోకవిద్య, బ్రహ్మవిద్య. ఏ పేరు పెట్టండి, అటువంటి విద్వత్ పోషణ జరగాలి. అన్నింటినీ మించి వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం, ఈ దేశానికి ఒక ధర్మం ఉంది. ఆ దేశానికి ధర్మం సత్యం వద, ధర్మం చర. సత్యమే అనబడాలి, ధర్మమే మనల్ని నడిపించాలి. సత్యం ద్వారానే జీవించాలి. ధర్మం ద్వారానే జీవితాన్ని ముగించాలి. ఈ ధర్మావేశం మనకు కలగాలి. ఈ ఆవేశం సూత్రప్రాయంగా, ఒక సేవాకృతిగా, ఒక మహాప్రవాహంగా, ఈ సర్వ ప్రపంచాన్ని ముంచెత్తే దిశగా సత్యసాయి భగవానుడు ప్రతిష్టించిన ఈ శివం ప్రాంగణం మామూలు ప్రాంగణం కాదు సుమా! సత్యం ధర్మక్షేత్రం అయినట్లయితే ఇది ఆచరణ క్షేత్రం. ఈ ఆచరణ క్షేత్రం అనుభూతి క్షేత్రం. అందుకనే స్వామి ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారో, ఎన్నెన్ని బోధనలు చేశారో, ఎంతమందికి ఇక్కడ గానవిద్యను నేర్పారో, స్వయంగా స్వామి బాణీలు కట్టి పాటలు నేర్పారో, అవన్నీ పంచుకున్న మన వాళ్ళంతా మన చుట్టూ ఉన్నారు. మన శేషసాయి, వీళ్ళంతా పిల్లలుగా వచ్చినటువంటి వాళ్ళే. వచ్చి ఇట్లా నెమ్మది నెమ్మది నెమ్మదిగా సత్యసాయి భగవానుడు ఏ కర్తవ్యాన్ని ఇచ్చారో అటువంటి కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అట్లా కొన్ని పేర్లు మనం అనుకోవాలి గనుక చెప్తున్నాం. ప్రత్యేకంగా ఆ పేరు అని అనుకోకండి. మాకు అనేకమంది, మా కైలాష్ ప్రసాద్ గారు, దొర గారు ఇటువంటి వీళ్ళంతా పదవులలో ఉండి స్వామి దగ్గర భక్తుల వలె జీవించినవారు. స్కార్ఫ్ లేకుండా కైలాష్ ప్రసాద్ గారిని నేను ఏ సభలోనూ చూడలేదు. ఆయన CPM, CPMజీ గా ఉండి కరీంనగర్ సభకు వెళితే ఆయన స్కార్ఫ్ వేసుకుని వేదిక మీద కూర్చున్నారు. అది స్వామి యందు వారికి ఉన్నటువంటి భక్తి. ఈవేళ మన శివం ప్రాంగణంలో కూడా ఎవరు సేవా-- సేవకు వచ్చిన ప్రతి వారు కూడా చక్కగా బ్యాడ్జ్ పెట్టుకున్నట్లయితే వారిని కానివారు బయటకు వచ్చిన పలకరిస్తారు. స్వామి దర్శనం నిత్య దర్శనం చేయించాలి. స్వామి మనందరికీ కూడా ఈ సమర్పణ భావాన్ని, స్వామి ఎట్లాగైతే డెబ్బై రెండు సంవత్సరాలు కాలగమనం వాచి మనం మార్చుకోవచ్చు. ఇట్లా హేమంత ఋతువు అయితే ఆ దర్శనం వేళ ఫలానా, పొద్దున ఏడు నలభై ఐదు అంటే ఏడు నలభై ఐదుకు ఆయన వచ్చేసేవారు అంతే. సాయంత్రం ఐదు అంటే ఐదు. చెట్లు, చెట్ల మీద పిట్టలు, పిట్టలు కోకిల రావాలు, ఆ స్వామి వస్తున్నట్టు ఆ వెండి తలుపు తెరుచుకుంటున్నట్లు, interview room లో నుంచి బయటకు వస్తున్నట్లు, మానవులమైన మనం పసిగట్టలేం గానీ చెట్టు మీద ఉన్న పిట్టలు మాత్రం కిలకిల రావాలు చేసేవి. కానీ స్వామి దర్శనానికి నెమ్మదిగా వరండాలో నుంచి స్త్రీల వైపు ఒక అడుగు కుడి కాలు కింద పెట్టగానే పక్షులు నిశ్శబ్దం అయిపోయేవి. మళ్ళీ స్వామి లోపలికి వెళ్ళే దాకా రెక్కలు టపటపలాడించేవి కాదు, కనురెప్పలు వాల్చేవి కాదు, ఎక్కడా కూడా వాతావరణాన్ని పాడుచేసేవి కాదు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి భావనలన్నీ కూడా మనం గతంలో నుంచి స్ఫూర్తిని పొందాలి, వర్తమానాన్ని జీవించాలి, మహోజ్వలమైనటువంటి ఒక భవితని మనం నిర్మాణం చేసుకోవాలి. ఈ రకంగా స్వామి నన్ను ఆ మధ్య ఒక interview లో నన్ను అడిగారు. ఇందాక మన MLA అని చెప్పినట్లే, ఏవో అనేక rewards, awards ఎన్నో వచ్చినా ఈ ఒక్కటే ఎందుకని ఉంచుకున్నారు అంటే, "అవన్నీ నాకు లోకం ఇచ్చినవి, ఇది లోకేశ్వరుడు ఇచ్చింది" అన్నాను నేను, అంతే. లోకము ఇచ్చింది లోకం తక్కువది కాదు. కానీ లోకేశ్వరుడు ఇచ్చినది మహోన్నతమైనటువంటిది. కానీ ఆయన అన్న తర్వాత అది ఎంత బరువో, అది ఎంత కష్టమో, దానికై ఎంత స్వాధ్యాయం చేయాలో, ఎన్నెన్ని విషయాలు ధారణ చేయాలో, ఎన్నెన్ని విషయాలు సరళంగా చెప్పాలో, ఎన్నెన్ని విషయాలు స్వామి పరంగా ఆ ప్రవాహాన్ని మళ్ళించాలో, ఇవన్నీ మన ప్రయత్నం లేకుండానే జరుగుతున్నాయి గనుక It is an effortless effort. కనుక ఏ ప్రపంచం ఇచ్చే గుర్తింపులు అంటారా? అవన్నీ నీటిమీద గీతలు. ఆ బొమ్మలన్నీ ఎవరికీ గుర్తుండవు. అయితే ఆధ్యాత్మికమైనటువంటి నేతృత్వం చేసి, ఆధ్యాత్మికమైనటువంటి భావన కలిగించి, సమాజంలో గనుక మన వంతు మన పాత్ర మనం స్వామి devotees గా మనం గనక చేయగలిగినట్లయితే సమాజం మనల్ని గుర్తిస్తుంది. ఖచ్చితంగా అది మన పట్ల ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తుంది. వారందరి యందు ఒక భావన సత్యసాయి పరదైవతము అన్న భావన కలిగించడమే మన కర్తవ్యం కావాలి. అట్లాగే స్వామి యొక్క మహత్తరమైనటువంటి సందేశాలని, ఉపదేశాలని, ఆదేశాలని మనం అన్నివేళలా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు మాత్రమే గాక భారతదేశంలో ఇవి మాత్రమే కాక విదేశాలలో ఎన్నెన్ని సత్సంగాలలో వెళ్ళినా కనిపించే ఒక్కటే ప్రేమ భావన. మనందరినీ కలిపేటువంటి ఒక వరడు, ఒక సునామీనే అంటుంది వేదం. ఆ మంచి పేరు ఏది అంటే, మహా మంత్రం ఏది అంటే, ఆ gelling factor ఏది అంటే, ఆ tinkering aspect ఏమిటి అంటే, ఆ metallic aspect ఏమిటి అంటే, అది సాయిరామ్ అన్న మూడు అక్షరాలు. ఎవరు మనకెవరు పరిచయం కానక్కర్ల. సాయిరామ్ అనండి, సమస్త ప్రపంచం మన వైపు కదిలి వస్తుంది. మనకేం కావాలో, మనల్ని ఎలా రక్షించుకోవాలో, ఎలా జాగ్రత్తగా మర్యాదగా చూసుకోవాలో దానికి తెలుసు. అటువంటి మర్యాదనిలౌకిక ప్రవృత్తిని, ఆధ్యాత్మిక నివృత్తిని, సమాజగతమైనటువంటి భావాన్ని, ఈ సమాజాన్ని నిత్య సత్యాన్వేషణలో చదవగలిగినటువంటి ఒక నేర్పుని, ఓర్పుని, కూర్పుని, మార్పుని, తీర్పుని, దివ్యానుగ్రహంగా అనుగ్రహించినటువంటి సత్య సాయి భగవానుడి యొక్క దివ్య ప్రాంగణమైనటువంటి ఈ శివంలో మనకివ్వబడినటువంటి యాభై ఎనిమిది నిమిషాలలో మనం చెప్పుకోగలిగినవి మాత్రమే కొన్ని చెప్పగలిగి. ఇవి, ఇవాళ నుంచి రాబోయే సమర్పణలన్నీ ఇంతవరకు నేను-- ఆహ్ మొన్న ఎవరో ఒక లెక్క వేసి "పదహారు వేల సత్సంఘాలు అయిపోయినాయి సార్" అని అంటే "అవునా?" అన్నా. అవన్నీ మనకి లెక్క అక్కర్లా. కావలసింది ఒకటే. ఇవాళ నుంచి ఏం చేయబోతున్నాము అని. ఏం చేయబోతున్నాం అంటే, నా పరంగా ఏ సమితికి వెళ్లినా, ఏ ఇంటికి వెళ్లినా, ఏ వ్యక్తి దగ్గరకు వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా సమర్పన్ కార్యక్రమంగానే జీవితంలో జరిగిన మహానుభూతుల అన్నింటినీ కూడా మళ్లీ స్వామికి సమర్పించుకునే దిశగా ఈ మహిమలు, అనుభవాలు, అనుగ్రహాలు అన్నింటినీ కూడా విశదపరిచే రీతిగా సత్సంఘాలు సాగిస్తూ మనదైనటువంటి తాత్విక ధోరణి. ఎందుకంటే "యోగరతో వా భోగరతో వా సంగరతో వా విషయరతో వా యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందతి ఏవ" అంటారు శంకర భగవత్పాదులు. నువ్వు యోగివా? భోగివా? ప్రపంచంతో ఉన్నావా? పరమాత్మతో ఉన్నావా? ఎక్కడన్నా ఉండు, ఎట్లా అన్నా ఉండు. నీ నిత్య సత్య శాశ్వతమైనటువంటి నీ ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేయగలిగినట్లయితే అది నందతి, ఆనందం. మళ్లీ నందతి, అదే ఆనందం. నందత్యేవ, అది మాత్రమే ఆనందం. అటువంటి దివ్యా నందాన్ని సత్యసాయి భగవానుడు సర్వదేవతా అతీత స్వరూపుడు. కలియుగ అవతారంగా మనం అంటాం గానీ కృతయుగం నాటి సత్యం, త్రేతాయుగం నాటి ధర్మం, ద్వాపర యుగం నాటి శాంతి ప్రేమలు, కలియుగం నాటి అహింస. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అంటే నాలుగు యుగాల యొక్క ఒక ధర్మ స్వరూపము. సత్య స్వరూపము ఏది అంటే అది భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అనగా మన స్వామి అనేటువంటి ఈ దివ్య భావనతో స్వామి యొక్క దివ్య పద పద్మాధీన చేతస్కమైనటువంటి చేతనతో, ఒక విచారధారతో, ఒక ఆత్మార్పణతో, ఒక సమర్పణతో, ఒక వినయంతో, ఒక సమగ్రమైనటువంటి దివ్య జీవన విధానంతో మళ్లీ ప్రపంచంలోకి రేపటి నుంచి సాగే సత్సంఘాల రూపురేఖలన్నీ కూడా నిత్య సమర్పన్ కార్యక్రమాలుగా ఉంటాయి. అలాగే ఉండేట్టుగా స్వామి తమ దివ్యానుగ్రహాన్ని అనుగ్రహించవలసిందిగా స్వామిని ప్రార్థిస్తూ ఆనాటి ఆ తరం లో సాగినటువంటి ఆ-ఆనాటి భక్తులు, మధ్య వయస్సులు, దొరికినటువంటి సన్మిత్రులు, ఇవాళ దొరికినటువంటి యువత. ఈ మూడు తరాలకి ఒక సమన్వయ రీతిగా సాగించినటువంటి సత్య సాయి భగవానుడి యొక్క దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ, శివం ప్రాంగణమంతా కూడా సత్య సాయి భగవానుడి యొక్క దివ్య పాద సంస్పర్శ చేత పునీతమైనటువంటి పుణ్యభూమి ఇది. ప్రతి రేణువులో, ప్రతి అణువులో, ప్రతి కణంలో, ప్రతి భావనలో, ప్రతి ఇటుక వెనక సత్య సాయి భగవానుడి దివ్య సంకల్పం ఉన్నది. కనుకనే సత్యం, శివం, సుందరంలో సత్యసుందరం అని చెప్తారు. శివం ఆలోచనాత్మకమైన భావన. ఇది శివ శాత్యాత్మకమైనటువంటి స్వరూపం. మంగళ స్వరూపము ఇదే. ఇక్కడ స్వామి దక్షిణామూర్తి వలె ఉంటారు. దక్షిణం చూస్తూ ఉంటారు. ఏ దేవుడు దక్షిణం చూస్తూ ఉండడు. కానీ మనల్ని ఉత్తరం వైపు చూస్తూ స్వామి దక్షిణం వైపు చూస్తూ మనల్ని జ్ఞాన భూమికలోకి నడిపిస్తున్నారు గనుక స్వామిని సాక్షాత్తు దక్షిణామూర్తిగా భావన చేస్తూ సమస్త దేవతల యొక్క అంశలన్నీ కూడా కూడి ఐదడుగుల మూడంగుళాల పాంచభౌతికమైనటువంటి కనువిందు చేసిన మనోహర రూపాన్ని మరొక్కసారి తలచుకుంటూ స్వామి యొక్క నామ, రూప, భావ, తత్వములు మనల్ని ముందుకు నడిపించు గాక. ఈ సమస్త ప్రపంచము కూడా సృష్టి ప్రశాంత నిలయమై భాసించు గాక. సర్వ జీవుల యందు స్వామి యొక్క అనుగ్రహం అమృత వృష్టి అయి సాగు గాక. స్వామి చిత్రపటము ఎక్కడ ఉంటుందో, ఎక్కడ దివ్య నామ సంకీర్తన జరుగుతుందో ఆ తరాన్ని మాత్రమే కాక వారి రాబోయే ఇరవై ఒక్క తరాలను కాచుకుంటాను, చూచుకుంటాను అన్నటువంటి స్వామి యొక్క ఆ ప్రతిజ్ఞని, అనుగ్రహాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటూ స్వామి విద్యార్థులు సంకల్పించిన ఈ సమర్పన్ కార్యక్రమంలో నన్ను పిలవటం-- నన్ను foreign countries లో కూడా అడుగుతారు. "Are you a student of Bhagavan? If so, which year?" అని. నేనంటాను "I am not a direct student of Bhagavan but I belong to Swami's school of thought" అని చెప్తాను. స్వామి యొక్క ఆలోచనలకు అతి సన్నిహితమైనటువంటి ఒక జన్మను ప్రసాదించినందుకు స్వామిని, స్వామికి మరొక్కసారి నమస్కరిస్తూ స్వామి విద్యార్థులు అందరికీ కూడా ఇటువంటి దివ్య ప్రేరణలు కలుగుతూనే ఉండాలని, ఈనాడు ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం నాకు మహదానందాన్ని, ఒక తృప్తిని, ఒక సంతృప్తిని, మళ్లీ ఒక్కసారి శివం ప్రాంగణంలో స్వామిని దర్శించిన అనుభూతిని కలిగిందని మీ అందరి ముందు చెప్తూ మీ అందరికీ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని మనసా, వచసా, శిరసా స్వామిని ప్రార్థిస్తూ సాయిరాం.
YouTube · audio
Samarpan at Sivam (November-2017)_59th
Samarpan at Sivam (November-2017)_59th
Source: Samarpan Hyderabad on YouTube
0:00 / 1:27:44