Skip to content
Transcript తెలుగు
ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం ఈరోజు హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం studios కి ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా పిలవబడుతున్న వి.ఎస్.ఆర్. మూర్తి గారు రావటం జరిగింది వారితో ముచ్చటిస్తూ మనం ఆయన యొక్క ఆత్మలో ప్రవేశిద్దాం. నమస్కారం అండి మూర్తి గారు నమస్కారం అండి మీతో హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం గతంలో అనేక కార్యక్రమాలు చేసింది ఇప్పుడు చేస్తుంది భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇవాళ అసలు మీ అంతరంగం ఏమిటో తెలుసుకుందామని మీ అంతరంగంతో ముచ్చటిద్దాం అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పిలవటం జరిగింది. మనం విషయాలకు వెళ్లే ముందు అసలు మీ బాల్యం మీ పుట్టుక లేదా ప్రాథమిక విద్యాభ్యాసం ఇది తాత్విక చింతనా భూమికలో ఇది ఒక మూలాన్వేషణ. నా వరకు నాకు ఈరోజు ఆకాశవాణిని నేను ఎప్పుడూ కూడా ఒక విశ్వవిద్యాలయంగా భావించేటువంటి వాడిని ఇప్పటికీ కూడా ముందుగా ఆకాశవాణికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనిషి తన మూలాన్ని తాను తడుముకుంటూ ఉండాలి. రెండు విషయాలు ఉంటాయి మనిషి ఎక్కడో పుడతాడు కానీ ఎక్కడో పెరుగుతాడు ఇంకెక్కడో ఎదుగుతాడు ఇంకెక్కడో వెలిగిస్తాడు ఇంకెక్కడో మలిగిపోతాడు ఇది జీవన ప్రస్థానం. ప్రస్థానంలో నా వరకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తురుమెళ్ళ అనేటువంటి ప్రముఖమైన గ్రామం రోజుల్లో గుంటూరు జిల్లాలో జిల్లా పరిషత్ హైస్కూల్ అంటూ ఉన్నటువంటి ఒకే ఒక్క ఊరు అది చాలా మహాత్ములంతా అక్కడ మహానుభావులు చదువుకున్నటువంటి place అక్కడ నేను జన్మ ఎత్తా అయితే కాల గమనంలో ninth standard కి వచ్చేప్పటికి నేను ప్రకాశం జిల్లాకి వెళ్ళవలసి వచ్చింది మంచి సందర్భం మంచిదే వెళ్ళినందువల్ల అక్కడ అసలు జీవితం అంటే ఏమిటి ఆకలి అంటే ఏమిటి అననుకూలం అంటే ఏమిటి ఇవన్నీ నేర్చుకోవటానికి ఒక ప్రధానమైనటువంటి వేదిక ఏర్పాటయింది అందుకని నేను ఎప్పుడూ జన్మభూమి కంటే కూడా నన్ను ఎదిగించినటువంటి నాలో ఉన్నటువంటి లోక లోకాంతర ప్రాణాలను స్పృశించి నువ్వు ఇదిగో దిశానిర్దేశం చేసుకుని ముందుకు వెళ్ళమని స్ఫూర్తిని ఇచ్చినటువంటి ఒక ప్రదేశం గ్రామం అది కూడా అది కుగ్రామమే దాని పేరు ఇంకొల్లు ఇంకొల్లు అనగానే నా దేహం అంతా కూడా పులకాంకుర ప్రకారం అవుతుంది ఎందుకని పన్నెండు సంవత్సరాల వయస్సు పన్నెండు సంవత్సరాల వయస్సులో ఊళ్ళోనికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా ఆనాడు చుక్క నీరు ఉండేది కాదు మెట్ట ప్రాంతం చాలా మెట్ట ప్రాంతం అంటే dry land ఇంకా నిజం చెప్పాలంటే మొత్తం వర్షాధారమే పూర్తిగా కానీ ఒకవైపు communist భావాలు ఒకవైపు నిరీశ్వర భావాలు రెండూ వేరు భిన్నం వీటి మధ్య చదువుకు వెళ్ళిన నేను మామూలుగా ఇంకొల్లు లాంటి కుగ్రామం నుంచి తెనాలి వంటి పట్టణానికి ఎవరైనా చదువుకు వెళ్తారు నేను తెనాలి వంటి పట్టణం నుంచి ఇంకొల్లు అనే కుగ్రామానికి వెళ్ళటం అది దైవ నిర్ణయం అయితే దానిని ఎప్పుడు తలచుకున్నా ఆనందం ఎందుకు కలుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి సృజన ఒక కళాత్మకమైనటువంటి ఒక శైలి ఒక విన్యాసం రకమైనటువంటి పట్టణ ప్రాంత ప్రభావం లేని ఒక ప్రదేశం నేను వెళ్ళిన రెండేళ్ళ తర్వాతే అక్కడ సినిమా హాల్ వచ్చింది అంతకు ముందు అది కూడా ఉండేది కాదు అంటే ఏమిటి మిమ్మల్ని external గా ఏది ప్రభావితం చేయలేదు మీ చదువు తప్ప మరొక అవకాశం లేదు external influence లేనందువల్ల పిల్లవాడి జీవితం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది చదువు తప్ప వేరే వ్యాపకమే లేదు కానీ పెద్దలతో సంపర్కం ఏర్పడుతుంది కారణం మనలో ఉన్నటువంటి ఒక ప్రతిభ ప్రతిభను మన కంటే పెద్దవాడు ఎప్పుడూ గుర్తిస్తాడు గుర్తించి మనకేం బోధ చేయడు వాళ్ళ జీవన విధానంలో వాళ్ళతో పాటు నడిపిస్తారు కాసేపు ఓహో అంటే జీవితంలో ఇన్ని పార్శ్వాలు ఉన్నాయన్నమాట నిరీశ్వర వాదము కూడా గొప్పదే అంటే నిరీశ్వర వాదంలో ఉన్నటువంటి వాడు లేడు అనుకుని ప్రారంభించి ఉన్నాడు అని తెలుసుకుంటాడు ఈశ్వర వాదంలో ఉన్నటువంటి వాడు ఉన్నాడు అని నమ్మి జారిపోయే అవకాశం వీడికి ఉన్నా తప్ప నిరీశ్వర వాదికి లేదు నిరీశ్వర వాది సమాజానికి ఒక rational approach ని ఇవ్వగలుగుతాడు ఒక scientific temperament ఇస్తాడు సమాజాన్ని ఎలా చదవాలో ఎలా అర్థం చేసుకోవాలో దాని మూలాలు దాని పార్శ్వాలు దాని ఉన్నత శిఖరాలు ఏమిటో అన్నీ బట్టబయలు చేయగలిగినటువంటి ఒక వాదం అది వాదానికి మనం నమస్కరించవలసిందే ఎందుకంటే అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దం అందు అన్ని యుగాలు మొదలాయ యోగం అందు అన్ని జన్మల చివరాయ నరజన్మ అరే నారాయణాన్వేషితం దేవుణ్ణి వెతుక్కోవడానికి ఇది అవకాశం అని ఒక పద్యం అనుకోండి మళ్ళీ దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న నిరీశ్వర వాదే వేస్తాడు ఈశ్వర వాది వేయడు ఆయనే దేవుడు అనుకుంటాడు అంతే తత్వాన్వేషణలో నుంచి మనల్ని మనం ఆవిష్కరించుకుంటూ వెళుతున్నప్పుడు చివరికి తెలియందేమిటంటే దేవుడనేటువంటి వాడు బయట లేడు అన్ని చోట్లా ఉన్నాడు లేని చోటు ఎక్కడో ఉంది చెప్పమని అడిగే స్థాయికి నిరీశ్వర వాదం తీసుకెళుతుంది ఇది నా అనుభవం అంటే ఇది మీకు ఇంకొల్లు మీరు అన్నారు కదా ఇంకొల్లే అది అక్కడ కలిగింది అంటారా అవునండి అక్కడే కలిగింది ఎందుకంటే మీ చుట్టూ ఏమున్నది ఏమీ లేదు ఒక శుద్ధ శూన్య స్థితి నాగరికత నిజానికి కొద్దిగా వెనకబాటు తనమే ఉండేది రోజుల్లో మ్ మరి ఏం నేర్చుకోవాలి అక్కడ అంటే జీవితాన్ని నేర్చుకోవాలి ఇంకొల్లు గ్రామం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి university నా దృష్టిలో బాల్యాన్ని పవిత్ర బాల్యం చేసింది అదే పటిష్ట బాల్యం చేసింది కూడా అదే అందుకే ఎవరైనా అడిగినప్పుడు మీ ఊరు ఏది అని అడిగినప్పుడు నా జన్మభూమి తురుమెళ్ళ నా మాతృభూమి ఇంకొల్లు అని చెప్తా మీరు జన్మభూమి మాతృభూమి అన్నారు కాబట్టి మ్ అంటే రెండింటి మధ్య వ్యత్యాసం ఉందంటారా చాలా తేడా ఉంది. అందరం ఎక్కడో ఒకడ పుడతాం అందులో మన ప్రమేయం ఏమీ లేదుఇక్కడే పుట్టాలని మనం నిర్ణయించుకోలేదు మనల్ని కన్న తల్లి కూడా ఊర్లోనే ప్రసవించాలని ఆమెకు తెలియదు ఆమె ఎక్కడ మనల్ని ప్రసవిస్తే అక్కడ మనం ప్రసవిస్తాము అంతే కదా కానీ అది దాన్ని జన్మభూమి ఇప్పుడు మాతృభూమి అంటే ఏమిటంటే జీవిత లక్ష్యం జీవిత పరమార్థం జీవన గమ్యం ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి మన చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వ నిర్మాణ శైలిని అనుగ్రహించేటువంటిది మాతృభూమి తల్లి వంటిది గనుక నేను ఎప్పుడూ తిరుమలే జన్మభూమి ఇంకొల్లు నా మాతృభూమి అని చెప్పుకుంటా అది ఇంత తేడా ఉంది. అంటే జీవితానికి పునాది మాతృభూమి వేస్తుందంటారు అంతే కదా అంటే ఎట్లా మిమ్మల్ని మలిచిందంటారు అది దానికి అనేకమైన కారణాలు ఇందాక చెప్పిన వాదాలు ఒక పక్కన కమ్యూనిజం ఒక పక్కన కమ్యూనిజం అంటే దేవుడు లేడని కాదు జీవితాన్ని స్పష్టంగా చూడండి మానవతా విలువలను పెంచి పోషించండి ముందు అసలు బ్రతుకు ఏమిటో తెలుసుకోండి బ్రతుకు యొక్క లక్ష్యాన్ని దాని లోతులు ఎరగండి ఇవన్నీ చేయండి తర్వాత దైవము దైవ పరంగా ఎలా చేయాలి మోరల్ ఫిలాసఫీ తర్వాత ఇవన్నీ spirituality ఇవన్నీ తర్వాత వస్తాయి కానీ జీవితమే నాకు అర్థం కానప్పుడు నాకు వ్యక్తిత్వ నిర్మాణమే సమగ్రంగా జరగనప్పుడు నేను ప్రపంచంలో ఎదిగే అవకాశం లేదు ఎదగటం అంటే ఏమిటి ఎరగటానికి ముందు మెట్టు ఎదగటం ఎరిగి ఎదగటం ఉండదండి ఎదిగి ఎరుగుతాడు మనిషి అది రకంగా ప్రభావితం చేసినటువంటి అదొకటి స్కూల్లో మీ ప్రతిభని teachers గుర్తిస్తారు తప్పకుండా గుర్తిస్తారు అది elocution కావచ్చు essay writing కావచ్చు recitation of poems from the scriptures భారతంలో భాగవతంలో మనుచరిత్రలో extempore మనం చెప్పాలి చదవాలి ధారణ చేయాలి వీటన్నిటికీ బహుమతులుండేవి విచిత్రం ఏమిటంటే ఇంకొల్లు లాంటి ఒక కుగ్రామంలో నా పదమూడవ ఏట అంటే 1963 exactly రెండు నాటకాలు ఒకే సమయంలో వేశాం ఒకే రోజు ముందు ఆడపిల్ల వేషం అది అయిపోగానే తెలుగు drama దాని పక్కనే హిందీ drama వేశాం ఇంకొల్లులో ఇంకొల్లులో ఎవరికీ రోజుల్లో హిందీ అంటే తెలియదు హిందీ తెలిసిన వాళ్ళు నేను ఒకడినే అంటే పట్టణ ప్రాంతం నుంచి వెళ్ళాను గనుక తెనాలి ప్రభావం తెనాలి ప్రభావం ఉంటుంది కాబట్టి కానీ నాతో పాటు ఇంకో character అలెగ్జాండర్ పురుషోత్తం సంవాదం అది అవతలి అతను ఇంకొల్లు native అతను script అంతా బాగా బట్టి పెట్టాడు నాకు supportive చాలా బాగా చేశాడు అంటే ఏమిటి నువ్వు ఎదగటానికి అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి ఒడి అది ఏవండీ మనకి ప్రజ్ఞ ఉండం-దాన్ని ప్రజ్వలింపజేసే వాడు ఉండాలి ప్రజ్ఞను ఊదాలి ఊదితే నివురు గప్పిన నిప్పు నివురు పోతుంది నిప్పు బయటకు వస్తుంది ఇది ఒకటి తర్వాత మాకు పావులూరు అని ఒక ఊరు ఉంది ఇంకొల్లుకిను పావులూరుకి మధ్యలో ఒక ఆంజనేయస్వామి గుడి ఉంది పులిమేర ఆంజనేయస్వామి పులిమేర ఆంజనేయస్వామి గుడికి నేను చదువుకున్నన్నాళ్ళు ప్రతి శనివారం ఆయన యందు మరి ఒక అమితమైన భక్తి ఏర్పడింది వెళ్ళేవాడిని భక్తి ఏర్పడటానికి కారణం ఏంటి ఏదో కారణం ఉండాలిగా ఆంజనేయస్వామి ఎందుకని ఉన్నాడు పోనీ గుడి ఏమన్నా అద్భుతమైన గుడి అంటే కాదు open మైదానంలో ఉండే దానికి కప్పే లేదు గుడే లేదు అప్పుడు రోజుల్లో దీనికి కారణం నేను తిరుమలలో పుట్టానని చెప్పాకదా నాకు ఆశీర్వచనం ఇప్పించడానికి నన్ను పెంచుకున్న మా అమ్మమ్మ తెనాలికి తీసుకెళ్ళింది అక్కడ అవధూతేంద్ర సరస్వతీ స్వామి వారిని ఆయన వచ్చి వస్తే మా మనవడిని ఆశీర్వదించండి అన్నది ఆయన పనిలేం చేయలా చిన్న హనుమాన్ చాలీసా బుక్కు నా చేతిలో పెట్టి నువ్వు గనక ఒక దోహా చదివితే సాయంకాలానికి ఒక అరటి పండు ఇస్తాను అన్నారు అరటి పండు సంగతి పక్కనబెట్టి ముందు బుక్కు తీసుకుని వెళ్ళి మందార చెట్టు ఏదో ఉంటే దాని కింద కూర్చుని చదవటం మొదలు పెడితే అది అప్పటికే నాకు వచ్చినట్లు అనిపించింది నా వయసు నాలుగేళ్ళు ఒక అరగంటలో మళ్ళీ స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోయినా ఏంటి అప్పుడే వచ్చావ్ అన్నారు నేను చాలీసా చదువుతానన్నా ఆశ్చర్యపోయి ఒక దోహా ఏముంది చదువు అన్నారు కాదు మొత్తం చదువుతానన్నా చేతులు కట్టుకొని హనుమాన్ చాలీసా అశాంతుము చదివేశా ఆయన ఆరడుగుల మూడంగుళాలు అజానుబాహువు నన్ను చిన్నపిల్లవాడిని కదా భుజాల మీద ఎక్కించుకొని తెనాలి ప్రాంతంలో అరటి గెలలు చాలా పెద్దవి రెండువందల యాబై ముడొందల పండ్లు ఉంటాయి దానికి ఒక పెద్ద కొమ్ము ఉంటుంది నన్ను గదిలో మూల దాకా తీసుకెళ్ళి అక్కడ దింపి నీకు ఒక్క పండు ఇద్దామనుకున్నాను గెల గెల నీదే అన్నారు గెలలో సగం లేను నేను అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఒక రశ్మి లోపల ఉందన్నమాట మనకు తెలియదు అది వయసుతో సంబంధం లేదు రగిలించినటువంటి వారు మొట్టమొదట అవధూతేంద్ర సరస్వతీ స్వామి ఇది ఒకటి పులిమేర ఆంజనేయస్వామి రఘువరదాసు గారు ఇక మూడవది ఇంకొల్లులో ఒక magazine వచ్చేది మాతృశ్రీ అని జిల్లాలో మూడు అమ్మ గురించి వచ్చేది బాపట్ల పక్కన దాంట్లో ఏదో ఆమెను గురించి కవిత్వం ఏదో గేయ కవిత్వం వచన కవిత్వం ఏదో భక్తుల అనుభవాలు ఒకటి రెండు ఆమెని రాజరాజేశ్వరి అని లలిта అని ఇలా ఏదో రకరకాలుగా పిలుచుకొని ఆమె దగ్గరికి వెళ్ళేవారు రోజుకి రెండు మూడు వేల మంది వెళ్ళేవారు రోజుల్లో చూద్దాం అనుకున్నాం చూద్దాం అంటే జేబులో డబ్బులుండాలి కదా బస్సు ఎక్కాలిగా ఎక్కించే వాడు ఉండాలిగా సారీ ఇది దైవేచ్ఛ దైవ నిర్ణయం ఎలా ఉంటుందనటానికి ఉదాహరణ ఏంటంటే గుంటూరు జిల్లాలో ఒక science fair జరుగుతున్నది బాపట్ల Salvation Army School నన్ను select చేశారు నేను ఒక article రాయాలి అందరూ అన్నారు మీ science master ని అడిగి రాయించేసుకో రాయించేసుకుంటే అది చదివేసెయ్ అన్నారు select చేయబడ్డది నేను మా master కాదు నేను ఆలోచించి రాస్తానన్నా కానీ ఆలోచించటానికి ఇంకొల్లులో గ్రంథాలేమీ లేదు సో నేను అక్కడి నుంచి వేటపాలెం వరకు నడిచి వెళ్ళా సారస్వత నికేతన్ ఉంది కదా అక్కడికి వెళ్లి చూస్తే ఏదో ఒక భారత్ magazine దొరికింది దాదాపు ఇంకొల్లు నుంచి వేటపాలెం ఇంకొల్లు నుంచి పదహారు కిలోమీటర్లు వెళ్ళాను వెళితే ఏం రాయాలి అన్నీ గ్రంథాలే అన్నీ పుస్తకాలే reference కావాలి భారత్ దొరికింది అదేదో open చేశాను వరాహమీరుడు అని ఏదో ఒకాయన article ఉంది అది ఏం పెద్ద inputs ఏం లేవు insights లేవు information లేదు కానీ ఏదో ఒక స్ఫురణ కలిగింది కలిగినప్పుడు వరాహమీరుడు బృహత్సంహిత కంటే ముందురామాయణంలో రావణాసురుడు పుష్పక విమానం ఎత్-- అమ్మవారిని తీసుకెళ్లాడు కదా. అంటే త్రేతాయుగంలోనే ఒక విమానం అనేది ఉండేదన్నమాట. వరాహమిహిరుడు మొన్న మొన్నటి వాడు Four twenty eight AD అని అక్కడి నుంచి ఒక ఆలోచన ప్రారంభమై నా అంతట నేను ఒక Original article రాశా. It is a virgin article. నా హృదయంలో నుంచో, మనసులో నుంచో, బుద్ధిలో నుంచో పుట్టింది. అంతా వాళ్ళు తెల్ల కాగితాలంటే టవు అనేవాళ్ళు. టవు ప్రకారంగా రాసుకుని, మడత పెట్టుకుని ఇంటికొచ్చా. File చేసుకున్నా ఇంటికొచ్చి. గబగబా రాసుకుని File చేశా. బాపట్ల వెళ్ళటం, అది నేను Present చేయటం, Judges Presentation ముందు నమ్మలేకపోవటం. ఏంటి పదమూడేళ్ళ వాడు వరాహమిహిరుడు బృహత్ సంహిత అని అనలేడు. ఎవరన్నా చెప్పారేమో అనుకోవటం. అన్ని Contestants అందరూ అయిపోయిన తర్వాత నన్ను మళ్ళీ పిలిచి "ఇందాక చెప్పింది ఇప్పుడు మళ్ళీ చెప్పగలవా" అని అడగటం. మొదటి సారి కంటే ఇంకా భావాత్మకంగా, విపులంగా చెప్పటం. ఎందుకంటే అక్కడ నాకు Time limit లేదు కదా. అప్పుడు నాకు I won the first prize. అంటే నాకొక Scientific temperament ప్రశ్నించటం, అన్వేషించటం, తెలుసుకోవటం, దాని యొక్క ప్రమాణం ఏమిటో తెలుసుకోవటం, దాన్ని నమ్మి నిలబెట్టుకోవటం. ఇవన్నీ ఏర్పరిచినటువంటి ప్రదేశం ఇంకొల్లు. అక్కడ భౌతిక పరిస్థితులు అట్లా ప్రేరేపించినాయ్. అట్లా అట్లా సో Present చేశారు Prize వచ్చింది. వచ్చింది. అప్పుడు జిల్లెళ్ళ ముడ అమ్మ దగ్గరికి వెళ్ళా. అక్కడి నుంచి. అక్కడినుంచి దగ్గరే. వెళ్ళాను. వెళ్తే ఆమె పదకొండు గంటల వేళ మంచం మీద కూర్చుని ఉంది. ఆమెను నేను ఎప్పుడూ చూళ్ళ. "నేను అమ్మని చూద్దామని వచ్చానన్నా." "కూర్చో" నేను చిన్నవాడిని అందరిలోకి. "నువ్వు కూర్చో నెమ్మదిగా పిలుస్తాం" అన్నారు. అప్పుడు ఆమె గది లోపలుంది. నన్ను చూసే అవకాశం లేదు. "వాడిని నేను పిలుచుకున్నాను లోపలికి తీసుకురా" అని లోపల్నుంచి ఆమె ఆదేశం వచ్చింది. ఆశ్చర్యపోయా. అప్పుడు నా చేతిలో Dictionary of science book మాత్రం ఒకటి ఉంది. నాకు Prize వచ్చింది కదా. అన్నీ Shakespearean సాహిత్యం. Eliot, Charles Dickens, H. W. Longfellow, Tennyson ఇవన్నీ ఉన్నాయి. Except science. Science మీద వచ్చింది మాత్రం Book ఏ. అప్పుడు అమ్మకి చేతికిచ్చా. "ఇలా ఇందమ్మా నాకు వచ్చింది" అన్నా. ఆమెను నేను చూడటం అదే మొదటిసారి. ఆమె అటూ ఇటూ browse చేసి "నీకు కాకపోతే ఎవరికొస్తుంది నాన్న నా దగ్గర ఉండు" అన్నది. అది నా ప్రథమ సమాగమం. తర్వాత నేను మూడు సంవత్సరాలు Holidays వచ్చినప్పుడల్లా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని. Three four days ఉండేవాడిని. అనేక విషయాలు వాళ్ళందరితో ముచ్చటిస్తుంటే గ్రహించేవాన్ని. నన్ను దగ్గర పెట్టుకునేది. ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు. అంటే అపరోక్షానుభూతి అని ఒకటి ఉంది. అంటే ప్రత్యక్షంగా గురువు మనకి చెప్పటం ఒకటి. గురువు చెప్పడు. ఎవరికో బోధిస్తుంటే బోధనం మనకు కూడా అన్వయించుకుంటాం. రకంగా జిల్లెళ్ళ ముడమ్మ second step. ఇక్కడితో అయిపోలే. ఇంకొల్లులో అప్పుడే ఆంధ్రప్రభలో ఒక ప్రభ మీద సత్యసాయిబాబా వారు నుంచున్న Photo వేసి ద్వాపర యుగంనాటి శ్రీకృష్ణుడే మళ్ళీ ఇప్పుడు సత్యసాయిగా వచ్చాడని ప్రజలు నమ్ముతున్నారు. ఇది పుట్టపర్తి అనంతపురం జిల్లాలో ఉంది అని అన్నప్పుడు మరి ప్రేరణ తెలియదు, పెద్ద ఆవేశం లేదు. చూద్దాం వెళ్దుద్దాం అన్నట్టు ఇంకా School తరవలా. విచిత్రం ఏంటంటే నేను సత్యసాయిబాబా వారిని చూసిన Date June తొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండు. అంటే ఏంటి? లోపల ఏదో లోకంలోకి వచ్చిన లోకానికి అతీతమైన కొన్ని భావాలు ఎక్కడో లోపల ఉన్నాయి. భావస్థిరాణి జననాంతర సౌహృదాణి అంటాడు కాళిదాసు. అవి ఇప్పుడే రానక్కర్లా. నాలుగేళ్ళ వాడికి రఘువరదాసు గారెందుకు? పన్నెండేళ్ళ వాడికి జిల్లెళ్ళ ముడ అమ్మ ఎందుకు? ఒక సినిమా కావాలి గాని. మళ్ళీ పన్నెండేళ్ళకి సత్యసాయిబాబా వారు అవసరమా? అంటే నువ్వు కారణం వల్ల జన్మ ఎత్తావో నీకు తెలియదు గాని, నీ భవిష్యత్తు నిర్మాణం జరగాలి అంటే ఇవన్నీ ఉండాలి అన్నట్టుగా అనిపించింది. అందువల్ల మళ్ళీ ఈవేళ ఆకాశవాణి ద్వారా, మీ ద్వారా నాకు మాతృభూమి అయినటువంటి ఇంకొల్లుకి నమస్కరిస్తున్నా. ఇన్ని విషయాలు జరిగినాయి ఉన్న మూడేళ్ళలో. తర్వాత మళ్ళీ ఉన్నత విద్యకి ఎక్కడికి వెళ్ళారు? ఉన్నత విద్యకి SSC అయిపోయింది Pre university C. R. Reddy College ఏలూరు One year. ఇదంతా ఎందుకని ఊళ్ళు ఎందుకు మారుతున్నాను అని. నేను మా తల్లిదండ్రుల దగ్గర పెరగలా. నా ఇరవై ఒకటవ రోజున మా మాతా మహులు, అమ్మమ్మ, తాతగారు తీసుకెళ్లారు. పగలంతా గేదె పాలు, రాత్రిపూట ఆవు పాలు. దాంతో శరీరం పోషించబడింది. మరి వాళ్ళు Guardians. వాళ్ళు అప్పటికి డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చేసినాయి. కాబట్టి ఎక్కడ నన్ను ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకి అప్పజెప్పేవాళ్ళు. అందువల్ల అక్కడికి వెళ్ళాను. అయిపోయింది. Pre university రోజుల్లో అంటే ఇవాళ ఊహించలేం మనం. చెప్తే కూడా చాలా ఇది నిజమేనా అన్నట్టు ఉంటుంది. But I got ninety eight percent. అరవై నాలుగు దాటేవరికి, అరవై దాటితే Distinction. తొంభై ఎనిమిది Percent తో Pass అయినా. PUC లైలా College లో Join అవుదామని వెళ్ళా. నాకంటే ముగ్గురు ముందు ఉన్నారు. ఇక నేను Fees కట్టి Join అవ్వటమే. అప్పుడు ఒక మీసాలాయన, ఆయనెవరో నాకు తెలీదు. నన్ను "బాబు ఇటు రా" అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళా. "Marks list ఇలా ఇవ్వ్" అన్నారు. ఓహో ఆయన Verify చేసేవారనుకొని ఇచ్చా. "నువ్ ఇక్కడ కాదు. ఇది Pre university. Professional courses కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ Join అవ్వాలి గాని Degree కోసం ఇక్కడిదాకా College అవసరం లేదు. You can join any degree college" అని అన్నారు. Fees కట్టొద్దన్నాడాయన. నేను పక్కకి తప్పుకున్నా. ముగ్గురు దాటితే నాది సీటు. నా మార్కులే నా బలం. కానీ అలా నన్ను Encourage చేసి సరైన Direction అంటాం, మార్గోపదేశనం చేసినటువంటి ఆయన ఎవరంటే తర్వాత కాలంలో పెద్దిభోట్ల సుబ్బారావు అయ్యగారు. గొప్ప కథకుడు. సాహిత్య లోకంలో అందరికీ తెలుసు కదా. సో అట్లా నేను అప్పుడే పుట్టిన ఒక College తాడేపల్లిగూడెంలో D. R. Goenka College అని ఉంటే దాంట్లో ఒక One year చదువుకుందామని వెళ్ళాను. తర్వాత నేను, నాకు Notification వచ్చింది. కాన్పూర్ వెళ్ళిపోయాను IIT కి అది. కాన్పూర్ IIT లో అవునండి ఉన్నత విద్య Food and ఉన్నత విద్య Food and oil technology. Chemical engineering based. దాంట్లో ఇవాళ యాలకులు, లవంగాలు వాటిలలో నుంచి Extraction ఎలా చేయాలి? అదొకటి. మిగతా ఇరవై రెండు రకాల Oil seeds లో నుంచి ఎలా చేయాలి? Food అంటే దేనికోసం Food and oil technologyదాన్లో నేను రెండు కూడా చేశా అక్కడే తర్వాత ఉన్నత విద్య పూర్తయినాక ఉన్నత విద్య పూర్తి చేసే క్రమంలో ఏదైతే తెలియకుండా మీరు బాల్యం నుంచి ఒక తాత్విక చింతన నడిపిస్తూ ఉందో అది కాన్పూర్ కూడా అంటే PUC తర్వాత కాన్పూర్ లో కూడా జరిగిందా? కాన్పూర్ కాదు ఇప్పుడు నన్ను పిలిచిన క్షణాన కూడా అదే నన్ను నడిపిస్తుంది కారణం ఏంటంటే చింత వేరండి దానికి విరుగుడు చింతనే కదా! ఒక వియోగం కలిగినప్పుడు యోగం కలుగుతుంది యోగం కలిగినప్పుడు సంయోగం కలుగుతుంది సంయోగ వియోగాల రెండింటి మధ్య రెండు వాన చినుకుల మధ్య రధం నడిపినట్టుగా మానవ జీవితం కూడా అలాగే జరుగుతుంది అంతే తర్వాత ఉద్యోగం చేరారా? తర్వాత అక్కడినుంచి నేను Glaxo కంపెనీ Bombay ఇవ్వాళ Campus Selection అంటున్నారు అప్పుడు అది ఉండేది కాదు Director నా పేరు రాసి పూర్తయిపోయింది చదువు ఉద్యోగం ఇవ్వమని ఆయన రాశారు కాబట్టి నన్ను పిలిచారు వెళ్ళాను వెళ్లి అక్కడ కూడా మరి సహజమైన ఒక ప్రతిభ ఉంది అని అనిపించుకున్నాం గనుక ఇక్కడ ఒక విషయం చెప్పాలి కంపెనీలో నన్ను తీసుకుంటున్నప్పుడు ఆయన interview చేశారు చేసిన తర్వాత నేను college నుంచి బయటికి వచ్చానో అప్పుడు Doctor నండూరి రామకృష్ణమాచార్య మహా మేధావి ఆయన నా గురించి మూడు lines రాశారు అందరికీ మామూలుగా Conduct Certificate ఇస్తారు నాకలా ఇవ్వలా testimonials అని ఇచ్చారు అంటే అది కథా పత్రం మన కథ ఒక student కథ ఆయన ఏం రాశారంటే "He is the confluence of sweetness and light, brilliant intellect and fine sentiments. He is one of the very best young men I have ever known. I have great hopes in him" అన్నారు. అది చదివి interview చేస్తున్నాయన లేచి నిల్చున్నారు. ఒక student గురించి ఒక Principal ఇంత అందంగా ఇంత గంభీరంగా రాస్తారా అనేసరికి అవన్నీ మనకు వారు ఇచ్చారు మనం తీసుకున్నాం file లో పెట్టుకున్నాం. ఆయన department లో ఉంటావని అడిగారు నాకు lab వీటిలలో నాకు interest లేదు construction కి వెళ్ళాలి "Construction is always creative. Lab లో creativity ఏం ఉండదు. నిన్న వచ్చిన sample ఇవాళ వస్తుంది. ఇవాళటిది పోయేదాకా అదే ఉంటుంది. Choice నీదే" అన్నారు. అట్లా నేను అక్కడి నుంచి కొంతకాలం Bombay లో ఉండి Bombay నుంచి West Germany కి వెళ్లి అక్కడి నుంచి thousand tons per day capacity ఉండే అనేకమైనటువంటివన్నీ America లో ఉండి మళ్లీ వరల్డ్ బ్యాంక్ projects India కి వచ్చినప్పుడు 1982-83 మళ్లీ నేను India కి వచ్చేసి Delhi లో ఉన్నాను చాలాకాలం తర్వాత మళ్లీ Hyderabad అది నడుస్తున్నది. అంటే క్రమంలో మీరు భారత పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో కలిసి పనిచేశారు సందర్భం ఎట్లా వచ్చింది అలా? నేను ఎన్నడూ Government లో ఉద్యోగం చేయలేదండి. ఉద్యోగం చేస్తే DRDO, DRDL వాటిల్లో చేయాలి అంతే కదా! కానీ ఒక metal కనిపెట్టవలసి వచ్చింది అది ఒక అవసరం అయింది. అవసరం అయినప్పుడు Central Government నాకున్న track record వరల్డ్ బ్యాంకు దాన్ని బట్టి నాకు ఒక ఆరు నెలల time ఇచ్చింది అంటే ఒక వెసులుబాటు ఇచ్చింది. lab నువ్వు వాడుకోవచ్చు కానీ అనేకమైన రహస్యాలు బయటకు చెప్పడానికి వీలు లేదు. అది ఏం చేశామో కూడా ఇప్పుడు కూడా చెప్పడానికి వీలు లే కానీ some Metallurgy లో చేయాలి. రకంగా నేను వచ్చా. వస్తే మొదటి రెండు నెలలు మా నా పని నేను చేసుకున్నా long book లో అన్నీ రాసుకుంటూ ఉండేవాడిని. మూడు నెలలు అయిపోయిన తర్వాత early morning అదే morning eight, eight o clock కి వెళ్లిపోయేవాడిని పనిలో పడిపోయే వాడిని. పదకొండు గంటల ప్రాంతంలో నా book మీద ఒక shadow పడింది. shadow చాలా familiar shadow. peculiar haircut ఉన్నటువంటి ఏంటి ఇలా ఎవరొచ్చారని చూస్తే వెనకాల అబ్దుల్ కలాం గారు. ఆయన చూశారు "I have been watching you" మిమ్మల్ని చూస్తున్నాను "Very very punctual, very meticulous. You come here, you work and go" ఏమిలే పెట్టుకోరు. "ఏంటి can I just have a look?" అన్నారు. నేను generally ఎవరు ఇవ్వరు కదా! నేను అన్నాను "Definitely sir" అని ఇచ్చా. చూశారు "Each derivation is excellent. Each invention is hundred percent right. This is the correct path. దీని ప్రకారం చేస్తేనే result వస్తుంది. All the best" అన్నారు. తర్వాత నేనంటే చాలా ప్రేమాభిమానాలు ఆయనకి చాలా చాలా తీవ్రంగా ఉండేవి. అట్లా కలాం గారితో నేను కలిసి పనిచేయటం వారితో వారు రాష్ట్రపతి అయినప్పుడు రాష్ట్రపతి భవన్ కి పిలవటం అక్కడ కూడా కొన్ని మా-- ఇట్లాగే వాళ్లందరితో మాట్లాడటం. ఆయన President గా అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి యువ సమ్మేళనాలు youth meetings కొన్ని address చేయటం కొన్ని కాదు చాలా address చేయటం. అలా వారి చరమాంకం వరకు కూడా వారితో నా association నడిచింది. నిజానికి వీళ్లు గుర్తు చేసుకోవాలి కలాం గారు దేహం వదిలేసినప్పుడు నన్ను అప్పటి Director ఇక్కడికి పిలిచి "కలాం గారి గురించి కాసేపు మాట్లాడండి" అన్నారు. ఇక్కడే మన వాళ్లే record చేస్తున్నారు. ఒక six minutes చేయండి అన్నారు. I was so involved మన వాళ్లందరూ వచ్చి బయట నుంచొని వింటున్నారు నేను అది గమనించుకోలేదు. పైగా I am a stickler for time. కానీ ఆరోజు భావోద్వేగం కాదు గాని ఆయన పట్ల ఉన్నటువంటి అపారమైన గౌరవం ఎన్నో విషయాలు మాట్లాడించింది. ఎంతగా అంటే మీ ఆకాశవాణి Director "మూర్తి గారిని unending గా మాట్లాడివ్వండి మొత్తం record చేద్దాం no problem" అన్నారాయన as a special case. నేను I think twenty eight minutes మాట్లాడా. అయిపోయింది. ఆకాశవాణిలో ఆరోజు కలాం గారి గురించి చెప్పినటువంటిది తర్వాత అది CD అయి ముప్పై ఎనిమిది వేల మంది students కి అది వెళ్లిపోయిందండి. సో అట్లా నా association with కలాం గారు అది అక్కడికి అయిపోయింది. ఉమ్ కలాం గారితో పాటు ఉమ్ Heart of Living ఉమ్ పండిట్ రవిశంకర్ గారితో కూడా ఉమ్ సాన్నిధ్య సామాన్యం ఆయనతో ఏమైందంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ అనేటువంటిది TTD వాళ్ళు ఆయన్నేదో ఒక interview చేయాలని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఎవరు చేయాలి? ఆయన ఎవరికీ interviews ఎక్కువ ఇచ్చేవారు కాదు రోజుల్లో. అనంటే ఆయన నా పేరు చెప్పారు వీళ్ళు. తప్పకుండా వచ్చేయమనండి అన్నారు. మామూలుగా spiritual leaders తో interactions ఎంతుంటాయో పదిహేను నిమిషాలు ఉంటాయిNDTV నాకంటే ముందు వచ్చారు. వాళ్ళకి ఆయన పదిహేను నిమిషాలే ఇచ్చారు. "fifteenth minute he said it's enough" మధ్యాహ్నం మాది మొదలైంది. మధ్యాహ్నం అంటే one o clock మొదలైంది. అట్లా spread over three days మేమిద్దరం పధ్నాలుగున్నర గంటలు interview చేసుకున్నామండి. Fourteen and half hours marathon interview. అది ఆశ్రమంలో, ఎనభై ఎకరాల ఆశ్రమంలో ప్రతి స్-స్పాట్లో కూడా walk talk తర్వాత ఆయన ఉండే place, వేద పాఠశాల ఇట్లా ఉంటాయి కదా, all centers ని cover చేస్తూ విశాలాక్షి మందిరం అని ఒక amphitheater. amphitheaterలో మేమిద్దరమే ఉంటాం. రోజుల్లో Skype అని ఉండేది. Skype connect చేస్తే hundred and twenty countries కి one to one మాట్లాడుకున్నాం. దేని మీద అంటే లలితా సహస్ర నామంలో quantum physics ఎక్కడుంది, ఎలా దాన్ని evaluate చేయాలి, ఏదో అమ్మవారు దుర్గా ఇ-ఇవి కాదు scientific గా what is there in లలితా సహస్ర నామం అనేది మాట్లాడుకోవటం అలా జరిగింది. అది Art of living రవిశంకర్ తో జరిగిన సంభాషణ. మనం మొదట ఇంకొల్లు గురించి మాట్లాడుకుందాం. ఉమ్ మీరు రోజు ఆంధ్రప్రభలో అవును సత్య సాయి బాబా గురించి ఉమ్ ఒక వాక్యం వచ్చింది. ఉమ్ తర్వాత మీరు అక్కడికి వెళ్లారా? వెళ్లా కదా. వెళ్లాను. ఎక్కడి నుంచి అంటే ఇంకొల్లు నుంచి గుంటూరు. direct bus లేదు రోజుల్లో. ఇంకొల్లు నుంచి చీరాల, చీరాల నుంచి గుంటూరు. అక్కడి దాకా bus. అక్కడి నుంచి గుంతకల్లు passenger. అది పెనుగొండ దగ్గర దింపింది నన్ను. పెనుగొండ లో దిగితే ప్రాంతంలో ఎక్కడో ఉందన్నారు. దిగాను. పన్నెండేళ్ళ వయస్సే కదా. ఎక్కడ పుట్టపర్తి అని అడిగాను. "ఆయనెవరో పాపం, ఆయన చదువు ఉన్నవాడు కాదు. ఇలా వెళ్లి వస్తుంది" అన్నాడు. చాలా దూరం. రోజుల్లో చిన్న పిల్లవాడిగా చేతిలో సంచి, కాళ్ళకి చెప్పులు తప్ప ఏం లేవు. వెళ్లి చిత్రావతి నది దాటి June ninth అక్కడికి చేరుకుంటే చిత్రావతి ఇసుక ఎర్రగా ఉంది. కాలిపోతున్నది. చెప్పుతో నడవలేం. కాబట్టి ఒకవైపు చెప్పులు, ఒకవైపు సంచి తీసుకుని వెళ్లా. అప్పుడు బాబా గారిని ఏం పిలుస్తారో తెలీదు, ఆయన ఎలా ఉంటారో తెలీదు. ఆయన కాస్త దూరంగా నుంచుని ఉన్నారు. ముప్పై మంది ఉన్నారు అంతే. నేను వెళ్లాను. అక్కడ ఒక ఆయన ఉండి "ఆ bag ఇక్కడ పెట్టు" అక్కడ వారున్నారు వెళ్ళమన్నారు. స్వామి అక్కడున్నారంటే ఆయన్ని స్వామిని పిలుస్తారని అప్పుడు తెలిసింది నాకు. నేను calculate చేశా. ఆయన నా దగ్గరికి నడిచి రావటానికి కొద్దిగా time పడుతుంది. మనం పిలిస్తే పైకి వెళ్ళాలి గాని మనం మనంతట మనం వెళ్ళకూడదు అని discipline. విచిత్రం ఏంటంటే పధ్నాలుగు గంటల ప్రయాణం అండి passenger train కదా. ఆకలి వేస్తున్నది, నిద్ర వస్తోంది. ఇలా కనురెప్ప ఇట్లా వాలుస్తున్నా, నా ఎదురుగా ఆయన ఉన్నారు. అంటే time and space ని దాటి రాగలిగినది ఒక యోగ శక్తి. యోగాత్మకమైన శరీరం గాలిలో ఎంత దూరమైనా వెళ్లగలదది. దానికి time లేదు space లేదు. అలా వచ్చారని అనుకున్నా. ఎందుకని background ఏమిటి? నాకు already ఒక award ఉంది science లో. ఆలోటెంపర్మెంట్ ఉంది లోపల parallel గా. అప్పుడు ఆయన అన్న ఒక మాట ఏమిటంటే, కాచుకు కూర్చుంటినే అన్నారు. రాయలసీమలో కాచుకు కూర్చోటం అంటే waiting for you అని. అయితే నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో spontaneity తో, సజ్జస్ఫూరణతో ఈయన నన్ను కాచుకోవటానికి నాకోసం wait చేయుట అంటే నేను ఆయనకి రకంగా ఉపయోగం? నన్ను కాచుటకు ఆయన కూర్చున్నారు అని నేనే నిర్ణయించింది. కాచుట అంటే రక్షించుటకు అని. అప్పుడు ఆయన చెట్టు కింద వేలు పెట్టుకుని తీసుకుని వెళ్ళటం, అందరి మధ్యలో కూర్చోవటం, ఏం కావాలి అని అందరినీ అడగటం, ఎవరూ మాట్లాడకపోవటం, నాతో సహా. కానీ ఆయనే లాల్చీ పైకి ఎత్తి, ఇదంతా ఖాళీ, గాలిలో గిరగిరా చేయి తిప్పి, నన్ను పిలిచి, చిన్నవాడిని నేను అందరిలోకి, వాళ్ళంతా they are forty five plus, నా చేతిలో పెట్టారు. చాలా వేడిగా ఉంది. ఏమిటని చూస్తే అది black హల్వా. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఆశ్చర్యపోయాను నేను. ఏం చేస్తావు అని అడిగారు. అందరికీ ఇస్తాను అన్నా. చాలా సంతోషపడ్డారు. ఇంత ముక్క. ఇప్పుడు-ఇప్పుడున్న నా చేయిలో సగమే ఉంటుంది కప్పుడు. అది అందరూ పంచుకున్నారు. నా place కి నేను వచ్చి కూర్చున్నా. నావైపు చక్కగా చూశారు. పాపం అనుకున్నారు. అంటే నాకేం మిగలలేదు అని. అని దగ్గరకు పిలిచారు. ఈసారి గాలిలో తిప్పటం అదేం లేదు. నా ముని వేళ్ళ మీద ఇలా నెమ్మదిగా ఆహ్ tap చేశారు. ఎంత ఖర్చు అయిపోయిందో అంతా నా చేతిలో వచ్చింది. ఇది ఇంతకాలం science లో మునిగిపోయిన నా జీవితంలో దీనికి answer ఇప్పటికే నాకు దొరకలే. బహుశా దొరకదు. అప్పుడు మరి ఏం చేశారు? వాళ్ళ తల్లిని పిలిచి నన్ను అప్పజెప్పారు. మూడు రోజులు ఉంటాడు, ముద్దపప్పు, నెయ్యి, గడ్డ పెరుగు అరిటాకులో వేసి పెట్టు, మళ్ళీ మూడు రోజుల తర్వాత పంపించు అని. అంటే పొద్దున్న సాయంత్రం కలిసేవాళ్ళం. అప్పుడు ఆయన ఇచ్చిన మొట్టమొదటి బోధ ఏమిటంటే "अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॥" నీ యోగక్షేమాలను నేను వహిస్తాను. నీ ఎవరు? అనన్య చింతనతో ఉండాలి. ఏకాత్మ భావనతో ఉండాలి. నిరంతరము ఉండాలి. కూడి ఉండాలి. "तेषां नित्याभियुक्तानां" అభియుక్తమై యుక్తము అన్నా యోగము అన్నా ఒకటే. యుక్తము అంటే కూడి ఉండటం. యోగం అన్నా అదే. అభియుక్తమై ఉండాలి. ఎక్కడా మిల్లీమీటర్ కూడా gap లేకుండా ఇరుసులోకి ఇరికించినట్టు ఉండాలి. అటువంటి వాళ్ళకి నేను వాళ్ళ యోగము, క్షేమము నేను వహిస్తా. అది నా బాధ్యత అని శ్లోకంతో సత్య సాయిబాబా వారితో నా ప్రస్థానం ప్రారంభమైంది. అప్పుడు నాకు చెప్పారు. మూడు రోజులు అయిపోయింది. నేను వెళ్ళాలి. స్కూల్స్ తెరుస్తారు పదిహేనో తారీఖుకి. ఆయన చెప్పిన మూడు మాటలు. తల్లిదండ్రులని లేదా నిన్ను పెంచి పోషించిన వారిని, వాళ్ళకి గౌరవం తీసుకురా. దేశానికి గౌరవం తీసుకురా. దేశం గర్వపడేలా జీవించు. ఆధ్యాత్మికగా జీవితాన్ని సాగించు అన్నారు. పదమూడేళ్ళకు నాకవన్నీ అర్థమయ్యాయి. ఉమ్ మాటలు వారి నోటి నుంచి వచ్చినవే. తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కలిశారా? ఎప్పుడూ కలుస్తూనే ఉన్నా. చివరి వరకు వారి, ఇప్పుడు నెలలో కూడా ఇంకో నాలుగు రోజుల్లో పుట్టపర్తి వెళ్తా. ఇప్పటికీ రెండు నెలలకి ఒకసారి వెళ్తాను. నాలుగైదు రోజులు ఉంటాను. అక్కడ కూడా ఇట్లాగే మనకి recording center ఉంది. దాంట్లో సుమారుగా ఒక రెండు వేల recordings చేసిచ్చుంటాను. అంటే ఒక మనం చేయవలసిందిమన ప్రజ్ఞని ప్రపంచానికి ఇవ్వాలి దాన్ని అమ్ముకోకూడదు వాక్కును కూడా నమ్ముకోవాలే తప్ప అమ్ముకోకూడదని కచ్చితమైన నిర్ణయం నాది దానికి కారణం ఏంటంటే బాబా గారే ఇది నువ్వు సంపాదించుకున్నది ఎక్కడ ప్రపంచానికి వచ్చిన తర్వాత సంపాదించుకున్నావ్ నీ దగ్గర ఎలా ఉంచుకుంటావ్ నువ్వు మళ్ళీ ప్రపంచానికి ఇవ్వాలి ఎలా ఇస్తావనేది వేరే సంగతి కానీ ఇవ్వాలి నీ దగ్గరే ఉంచుకోకూడదు అని అంటే ఆధ్యాత్మిక చింతన వీటన్నింటినీ చూసి మిమ్మల్ని ఎవరు ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అన్నారు ఇంకెవరు సాక్షాత్తు భగవాన్ సత్యసాయిబాబా వారు అప్పటికి నేను ఇది అవుతానని నాకు తెలియదు పద్దెనిమిది ఏళ్ళు నాకప్పుడు అయితే ఇక్కడ సందర్భంలో ఒక విషయం చెప్పాలి మామూలుగా గురువైనా మిగతా చోట్ల ఏం లేదు ఇక్కడే ఉండు అని అంటారు ఎవరైనా అక్కడ ఏం లేదు ఉన్నదంతా ఇక్కడే అని అంటారు ఆయనన్నారు మానవ జన్మ ఎత్తినందుకు అది నాకు ఇచ్చిన సందేశం కంచి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకో మ్మ్ మళ్ళీ అటువంటి దర్శనం దొరకదు అరుణాచలానికి వెళ్ళు అన్నారు నాకప్పుడు పదహారు ఏళ్ళు పదహారు ఏళ్ళ నాడు లభించినటువంటి సందేశం అనండి ఉపదేశం అనండి ఆదేశం అనండి కంచి పీఠంతో అరవై ఆరు నుంచి క్షణం వరకు కూడా నాకు సంబంధం ఉంది సంబంధం అంటే కాంట్రిబ్యూట్ నేను చేయగలిగింది చేస్తా అందరూ ఒకడు డబ్బు ఇస్తాడు ఒకడు సేవ చేస్తాడు అది ఎవరెవరి ధోరణిని బట్టి వాళ్ళు చేసుకునే అంతే కదా అందరూ ఒకే రకం పళ్ళివారుగా ఒకడు అరటిపండు ఇంకొకడు ఆపిల్ ఇచ్చినట్లుగా మన ప్రజ్ఞని మనం ఇవ్వాలి దీనికి కారణం ఏమిటి అంటే అది బాబా గారి కారణం కంచి పీఠంతో తీవ్రమైనటువంటి అనుబంధం దేంతో నాట్ అడ్మినిస్ట్రేషన్ వారి తాత్విక భూమిక వారి విజన్ వారి ఆలోచనా రీతి అది పరంపరానుగతమైనటువంటి ఒక గురు పరంపర పట్ల ఉండేటువంటి ఒక బలీయమైన విశ్వాసం ఇది ఒకటి అంటే కంచి స్వామి వారికి కూడా తెలుగు మూలాలు ఉన్నాయంటారా అంటే వారికి అన్ని భాషలు వచ్చు ఒకరు కాదు పెద్దస్వామి వారి దగ్గర నుంచి మహాస్వామి ఆయన్ని నడిచే దేవుడు అన్నారు జయేంద్ర సరస్వతి స్వామి పీఠం యొక్క మఠం యొక్క ద్వారాలని అనంత బాహువులను బయటకు తీసుకువచ్చి హైందవ ధర్మాన్ని అంటే మానవ ధర్మాన్ని ప్రపంచంలోకి చొచ్చుకొని తీసుకెళ్లారు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు తమ ఇద్దరు గురువుల యొక్క మేలు కలయిక సదాచారము సంప్రదాయము శాస్త్రము పెద్ద గురువుగారు చెప్తే సమాజ సేవ శంకర నేత్రాలయాలు ఇటువంటి విద్యాలయాలు ఇవన్నీ కూడా ప్రారంభం చేసి ఇద్దరు మూర్తుల ఒక బొమ్మ అయితే ఆయన విజయేంద్ర సరస్వతి స్వామి వారు అవుతారు విజయేంద్ర సరస్వతి స్వామి వారు తెలుగు నాటే ఈస్ట్ గోదావరి మూలాలు కానీ తమిళనాడులో సెటిల్ అయినారు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఖచ్చితమైన తమిళనాడు ప్రాంతం మన పెద్దస్వామి వారు హోయసల బ్రాహ్మణులు కన్నడ కన్నడ వారు కానీ తమిళంలో ఉన్నారు కానీ వారికి తెలుగు బాగా వచ్చు కాబట్టి వాళ్ళకి భాష పెద్ద ఆఫ్టర్ ఆల్ వాట్ ఇస్ లాంగ్వేజ్ ఇట్స్ వెహికల్ ఆఫ్ కమ్యూనికేషన్ భాషలో చెప్పారు అనేది కాదు అది కన్వే అయిందా కాలేదా అది వాళ్ళు శాస్త్రంలో నెంబర్ వన్ అనుష్టానంలో నెంబర్ వన్ మరి ఏం చేస్తారు అనుష్టానం అంతంత పూజలు అంటే సర్వసంగ పరిత్యాగం చేసినటువంటి మహాత్ములు లోక కళ్యాణార్థమే చేస్తారు వాళ్ళ జీవితం అంతా అలాగే ఉంటుంది మనం ఇద్దరు ముగ్గురిని ఒకరోజు కలిస్తే అలసిపోతాం వాళ్ళ కథలు దీనగాథలు వింటే మనం కరిగిపోయి మనం అలసిపోతాం వాళ్ళు అటువంటిది రోజుకు పదిహేను వందల మందిని చూస్తారు పదిహేను వందల పరిష్కారాలు ఇస్తారు ఇట్స్ వండర్ఫుల్ కాన్సెప్ట్ మ్మ్ ఇక్కడ మాట్లాడుతూ మళ్ళీ రమణ మహర్షి గారు మ్మ్ మ్మ్ అరుణాచలానికి వెళ్ళటం సరే బాబా చెప్పారు మనం వెళ్ళాం అనుకున్నాం తర్వాత అరుణాచలం నా స్కీమ్ లో లేనే లేదు కానీ కాలవశాత్ ఒకానొక సందర్భంలో తమిళనాడు ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు చేయవలసి వచ్చింది చేయవలసి వచ్చిన దాంట్లో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టు ఇండియాలో ఏది పెట్టినా నన్ను పిలిచేవారు అలా ఒక ప్రాజెక్టు తిరువణ్ణామలైలో వచ్చింది నూట ఎనభై ఎనిమిది రోజులు అరుణాచలంలో ఉన్నా ప్రతిరోజూ ఆశ్రమానికి వెళ్లి కూర్చునేవాడిని తెల్లవారుజామున ఒక అరగంట సేపు తర్వాత అరుణాచల శిఖరం అంతా కూడా మొత్తం పర్వతం అంతా తిరిగా బాగా తెలుసు తర్వాత కాలంలో సుమారుగా తొమ్మిది పుస్తకాలు రాశా రమణ మహర్షి ఫిలాసఫీ మీద నా అనుభవాలు మహిమలు ఉండవు నా పుస్తకాల్లో మానవ జీవితం ఎలా ఉంటుంది మార్గోపదేశనం చేసేవారు ఏమి చెప్పారు అందుకనే నేను ఒక పుస్తకం రాశా ఎవరో అడిగితే మీ బోటి వారు అడిగితే స్ఫూర్తి పుస్తకం పేరు మహనీయులతో కలిసి నడిస్తే ఏమవుతుంది దాదాపు మీ ఆత్మకథ అనుకోవచ్చు అంటే ఇట్లాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటిదే అది మహనీయులతో కలిసి నడిస్తే ఏమవుతుందంటే మనకి చాలా విషయాలు తెలుస్తాయండి ఎక్కడ ఆపాలో ఎక్కడ నడిపించాలో ఎంతవరకు ఉండాలో ఇవన్నీ కూడా మనకి తేలిగ్గా చెప్పకుండానే అర్థమవుతాయి అలా నేను అరుణాచలంలో వంద గిరి ప్రదక్షిణాలు పూర్తి చేసుకున్నా శరీరంతో డెబ్బై ఆరు నుంచి మొన్న ఫిబ్రవరి ఆరో తారీఖు దాకా వెళ్ళాను వన్స్ ఇన్ టూ ఇయర్స్ వెళ్తాను అరుణాచలు నేను వెళ్తాను మౌనంగా ఉంటాం హాయిగా ఉంటాను వెనక్కి వచ్చేస్తా పుట్టపర్తి అట్లా కాదు పుట్టపర్తిలో అనేకమైన సందర్భాలలో అనేక ప్రదేశాలలో సుమారు ఇరవై ఎనిమిది వేల సత్సంగలు చేశాను అది అంతుపట్టని విషయం అది ఎలా జరుగుతుందంటే తెలియదు జరుగుతుంది అప్పుడు రకంగా నేను అరుణాచలం వెళ్ళాను బాబా గారి వల్లే వారి దయవల్లే రెండు ప్రదేశాలకు వెళ్ళా మీ ఆధ్యాత్మిక స్పిరిట్యువాలిటీ మరోవైపు సాహిత్యం ఇంకొకటి సేవ సేవ మూడు కలగలిపి మీరు నడుస్తున్నారా ఇప్పుడు అవునండి అవును దీన్లో ఏనకేనా ప్రకారేణ యస్య కశ్శాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం అని వేదంలో ఒక మాట ఉంది ఇది ఎవరో కవులు రాసింది కాదు అంటే నేను ఎందుకు వచ్చాను నేను ఏం చేస్తున్నాను నా ఉనికి నా వ్యక్తిత్వము నా అస్తిత్వం వల్ల ఎవరికైనా అసలు లాభం ఉందా లేదా భగవంతుడు నాకేదో ప్రజ్ఞ ఇచ్చాడు కదా ప్రతి వాడికి ఇచ్చాడు ఒక ప్రజ్ఞనాక్కుడా ఏదో ఇచ్చాడు. ప్రజ్ఞ ద్వారా నా చుట్టూ ఉన్నవారికి గనక ఆనందం కలిగించగలిగితే అది మాత్రమే శివ పూజ అని ఉంది శ్లోకార్ధం. ఇది నిరీశ్వర వాదానికి చాలా సన్నిహితం అంటే శివుడి పూజ చేయకపోయినా ఇది చేస్తే చాలని అది సారైన సమన్వయం కాదు. భావంతో గనక నువ్వు చేసినట్లయితే అది శివ పూజతో సమానం అని అర్థం. నిరీశ్వర వాదానికి, నాస్తిక వాదానికి తావులేనిది వేదం. కానీ అదేం చెప్తుందంటే, నీకు చీకటి అనేది ఉంటే కదా నీకు వెలుగు సంగతి తెలిసేది. తెలుసుకునేంత వరకు చీకట్లో ఉన్నాననుకున్నావ్, తెలుసుకున్న తర్వాత వెలుగు లోనికి వచ్చాననుకున్నావ్. కానీ నీకు తెలుసో తెలియదో చీకటి వెలుగులు కలిసే ఉన్నాయి. అది పోతే ఇది వస్తోంది, ఇది ఆగితే అది కనబడుతోంది అనేటువంటి తార్కికమైన భావన. ఉమ్ అప్పుడు రకంగా మనం గనక విచారణ చేసినట్లయితే, రోజు అనుకున్నాను సేవ ఏం చేయాలి? మాట్లాడటం కాదు, ఉపన్యాసం ఇవ్వటం కాదు. మీరంతా లేవండి, మేలుకోండి, పరిగెత్తండి కాదు. స్వయంగా ఏం చేయాలి అనుకున్నప్పుడు నేనుండే కాలనీ, నేనుండేది డిడి కాలనీలో చైల్డ్ లేబర్ చాలా విపరీతంగా ఉండేది. వీళ్లందరినీ చదువులో ఎలా పెట్టాలి? నేను కాలనీకి చాలా ఏళ్ళు President చేశా. నా మీద-- నాకంటే వాళ్ళంతా పెద్దవాళ్ళు వయసులో కూడా. కానీ మాట మన్నించేవారు. మనం ఆడపిల్లలు అంట్లు తోమటానికి, మగపిల్లలు మన పిల్లల బూట్లు తొడవటానికి రాకూడదు, దీని మార్గం ఏమిటని ఆలోచించి, ప్రతి ఇంటింటికి నేను వెళ్ళి convince చేశా. Believe me పదిహేను వందల ఇళ్ళు, అందరూ ఏకగ్రీవంగా అన్నారు "మీరు చెప్పింది correct, మేము child labour పెట్టుకోం. తల్లి, పిల్లవాడికి చదువు చెప్పించమంటే చెప్పిస్తాం పిల్లకి. వాళ్ళు కనీసం tenth standard వచ్చేదాకా మేము చూసుకుంటామని డిడి కాలనీ declaration ఇస్తే International Labour Organization Geneva నుంచి ఒక team వచ్చి, "ఇది ఎక్కడా వినలేదు, child labour ని eradicate చేద్దామని కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెట్టిన అవటం లేదు, ఇక్కడ అయిందని విన్నాం, ఇది నిజమేనా?" అని random గా ఒక పది, పదిహేను ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి interview తీసుకున్నారు. "We hate that child labour" అని చెప్పారు వాళ్ళు. It is a true. మా దగ్గర చూడండి, ఒక్క పిల్ల రాదు, పిల్లవాడిని రానివ్వం మేము. ఒక చిన్న కింద నుంచి ఒక కూరము packet కూడా పైకి తాయనివ్వం. వాడు అసలు రాకూడదు పనికి. అది జీవితంలో నాకు చాలా ఆనందం కలిగించిందండి. కొన్ని వందల మంది పిల్లలు. వాళ్ళంతా pass అయినారు, డిగ్రీలు, పిహెచ్డిలకు వెళ్ళిపోయినారు. అది సామాజిక సేవ అని నేను అనుకోల. సేవ అంటే భావన, చాకిరీ కాదు అని నమ్మకంతో. అలాగే థలసేమియా అని ఒక sickle cell disease అది. దాంట్లో blood చాలా తరచుగా ఎక్కిం-- ఎక్కించకపోతే వాళ్ళు పోతారు. అయితే అది ఒకానొక సందర్భంలో దానిలో నేను involve కావలసి వచ్చింది. ఏం చేయగలను అని ఒక ఆలోచన చేసి, నేను చేయగలిగింది కాదు. నా దగ్గర అంత ఆర్థిక శక్తి లేదు, కోట్ల రూపాయలు కావాలి. కానీ ఎవరికన్నా చెప్తే వింటారేమో అని ఒక్కళ్ళకి విషయమంతా explain చేసి, మీరు స్వయంగా చూసి రండి అక్కడ జరుగుతున్నదని అంటే, వారు వెళ్ళటం. వెళ్ళిన తర్వాత ఇక సేవ చేయలేవు అనే స్థాయిలో పరిస్థితుల్లో ఆయన ఒక కోటి రూపాయలు సంస్థకు ఇవ్వటం. అట్లా వరుసగా ఐదు సంవత్సరాలు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వటంతో మూడు వేల ఎనిమిది వందల మంది పిల్లల యొక్క ప్రాణాలను కాపాడగలిగాను. అది నాకు చాలా ఆనందం. అది సామాజిక సేవలో భాగం. అలాగే నేనున్న కాలనీకి-- ఇవాళ స్వచ్ఛ భారత్ అనేది వింటున్నాం. ఆనాడే మేం చేశాం. అందరం involve అయ్యేవాళ్ళం చాలా బాగా. తర్వాత కాలం మారుతుంటుంది, సమాజం యొక్క స్వరూపం మారుతుంది, మన అవసరాలు మారుతాయి, మన దృక్పథం మారిపోతుంది. దీని యందు ఆసక్తి లేని వాళ్ళు కూడా ప్రవేశిస్తారు. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. ఇది ప్రమాదం. అది జరిగింది, జరుగుతున్నది. కాబట్టి రెండూ నాకు జీవితంలో చాలా తృప్తిని ఇచ్చినటువంటి విషయాలండి. సాహిత్యం వాళ్ళ? సాహిత్యం చాలా అద్భుతమైనటువంటి పారిశ్రామి. నేను spirituality లో ఎంతగా deep గా లోతు-- వెళ్ళానో, సాహిత్యం కూడా అంతే. నాలుగవ ఏట హనుమాన్ చాలీసా మీకు ఉదాహరణ చెప్పా. అదే time లో Hindu Headlines చదివేవాడిని. subheading దాకా చదివేవాడిని. కింద continuous English అప్పటికి రాదు కదా! But అవన్నీ చదవగలిగే వాడిని. దాని వల్ల అభిరుచి. తర్వాత, ఇవాళ నన్ను పెంచుకున్న మా అమ్మమ్మని గుర్తు చేసుకోవాలి. రామాయణ, భారత, భాగవతాలలో కథలు కథలుగా చెప్తూ, అందంగా చెప్తూ, వాటి పట్ల ఆసక్తిని కలిగించినందువల్ల సుమారుగా seventh standard వచ్చేసరికి అంటే అరవై ప్రాంతంలో నేను భారతం, భాగవతం, రామాయణం చదివేశా. పూర్తిగా. ఏదో పైపైన, వచనం కాదు, పద్యాలతో సహా చదివా. మరి పద్యాలు చదువుంటే దాని ధారణ వేరు, దాని అల్లిక వేరు, బిగి, సొగసు, సౌందర్యం, భాషా పాటవం ఇవన్నీ కూడా దాంట్లో ఒదిగి ఉన్నాయి. ఒక నాటకీయత, modulation, ఇవన్నీ ఉన్నాయి. అటువంటి సందర్భంలో నేను చదివినటువంటి కొన్ని నవలలు, విశ్వనాథ వారి నవలలు. గోపీచంద్, అసమర్థుని జీవయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామ, విశ్వనాథ వారి వెయ్యి పడగలు ముప్పై సార్లు చదివుంటా ఇప్పటికీ. చెలియలి కట్ట, చలం గారి మైదానం అంటే భిన్న భిన్నమైనటువంటి కోణాలలో అన్నీ చదువుకుంటూ వెళ్ళినప్పుడు నన్ను తీవ్రంగా వచనంలో ఆకర్షించింది చలం. వచన శైలి ఆయనతో సమానంగా రాయగలిగిన వాడు ఇంకా రాలేదని నా అభిప్రాయం. అది నా అభిప్రాయం. వచన శైలి చాలా గొప్పది. విశ్వనాథ్ వారిది చాలా పటిష్టమైనటువంటి భాష. నవారు బిగించినటువంటి ఆమె. అందువల్ల అవన్నీ చదివి రామాయణ కల్పవృక్షం కూడా చదువుకున్నా. చదువుకుంటే, ఆంధ్రోజ్యమం జరుగుతున్నప్పుడు నండూరి రామకృష్ణమాచార్యుల వారు నన్ను ఆయనకు ఏదో ఉత్తరం ఇవ్వమని పంపటం, ఆయన "నీ గురించి బాగా రాశారు నాయనా, బాగా చదువుకో" అని అంటూ, అంటే నేను "మేనంటే నాకు ఇష్టము" అన్నా. "ఇష్టం అంటే ఏంటి? నేను రాసిన ఒక పద్యం వచ్చా నీకు?" అన్నారు. అడగవలసిన ప్రశ్నే.ఇరవై రెండు పద్యాలు చేతులు కట్టుకొని చదివేశా. అందులో కల్పవృక్షం పద్యాలున్నాయి. ఆంధ్ర ప్రశస్తి ఉంది. వృత్త సంహార కావ్యం ఉంది. ఇవన్నీ కూడా చదివినప్పుడు ఆయన నాకు ఆకేసి అన్నం పెట్టారు. దగ్గర కూర్చొని పెట్టారు. అది విశ్వనాథ వారితో. సరే పంపించిన నండూరి రామకృష్ణమాచార్య వారు ఆయన మహా అద్భుతమైనటువంటి మహాకవి. అయితే పేరు వెనక పడలా. సన్మాన సత్కారాల వైపు అసలు ఆయన వెళ్ళలా. ఏం చేయాలో తెలుగు భాషని పరిపుష్టం చేయాలో అని దానికోసం ఆయన చాలా చేశారు. తర్వాత ఇప్పుడు కృష్ణదేవరాయల కాలం అది అందరూ చూసే ఒక పద్ధతి. ఆయన కోణం దృక్కోణం వేరు. తిక్కన మహాకవి శైలి శిల్పం ఎట్లా అవి. అట్లా సాహిత్యంలో వీళ్ళైతే పుట్టపర్తి నారాయణాచార్యుల వారు. ఉమ్ జాషువా ఇది చెప్పాలి తెనాలిలో నాగకళా మందిరం అని ఉంది మునిసిపల్ హైస్కూల్ లో ఓపెన్ ఆడిటోరియం. జాషువా గారు నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అసలు అటువంటి భావ వ్యక్తీకరణ మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు మూసలో ఒదిగిపోయారు? ప్రతి దానికి మూలంలో ఉన్న భారతం పద్యమో భాగవతం పద్యమో ఆధారం చేసుకొని అల్లుకుపోయారే. కానీ సజీవమైనటువంటి ఒక బలం ఉన్నటువంటి భాష అభివ్యక్తి ఉన్నటువంటిది పెరదసి మహా కావ్యం అది. అది మేము పిల్లలం ఏడో క్లాస్ చదువుతున్నాం. మాతో వేయించారు మాస్టారు. వేయిస్తే నాకు బాగా గుర్తుంది ఒక పద్యం. "సత్యవాక్యం బెవండుల్లంఘింపడో వాడే పో నరుడు ధన్యుండి ధరామండలిన్" అని రాశారు. అయ్యయ్యో ఎంత సార్వకాలికమైన సత్యం. అది పద్యం నేను చదివా. నా పాత్ర చదువుతుంది. చదివితే వన్స్ మోర్ చప్పట్లు కొట్టారు. నాకు భయం వేసింది. ఎందుకని అంటే నేను పాడింది బాలేదని కొట్టారా అని అనుకొని ఆ-ఆగిపోయాను. మళ్ళీ అప్పుడు వన్స్ మోర్ ని మళ్ళీ పాడు అన్నారు. అది తెనాలి కల్చర్. తెనాలి కల్చర్ లో మళ్ళీ నేను ఈసారి మొదటిసారి కంటే చాలా బాగా పాడా. నిజంగా. సరే మా అందరికీ ఏమిస్తారండి రోజుల్లో సబ్బు పెట్టెలు ఇచ్చేవాళ్ళు. అంతేనా? సబ్బు పెట్టెలు, పెన్సిల్స్ అవి బహుమతులు. ఒకాయన వచ్చారు వేదిక మీదికి. "ఈ పిల్లలందరూ నటులు కావాలని నేను కోరుకోవటం లేదు. మానవ మూర్తులుగా తయారు కావాలని కోరుకుంటున్నా. జాతి, మత, వర్గ, వర్ణాలకు అతీతంగా అసలు అతీతం అనేది లేదు. సమాజమే ఒక అసహజ, అసమగ్ర స్థితి. సంపూర్ణమైనటువంటి ఒక సమాజం ఎప్పటికీ ఏర్పడదు. అది నాకు తెలుసు. కానీ ఒక అశావహ దృక్పథంతో కులం ద్వారా, మతం ద్వారా, భావం ద్వారా, భాష ద్వారా మనుషులు విడిపోకూడదని పిల్లల్ని నేను ఆశీర్వదిస్తున్నాను. పిల్లల్లో ప్రత్యేకంగా 'సత్యవాక్యం బెవండుల్లంఘింపడో వాడే పో నరుడు ధన్యుండి ధరామండలిన్' పాడిన పిల్లవాడికి నేను సబ్బు పెట్టె ఇవ్వదలుచుకోలేదు." అని ఆరడుగులు ఉంటారు జాషువా గారు. నన్ను కౌగలించుకున్నారు. అట్లా జాషువా గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. ఎందుకని కౌగిలించుకోవటంలో ఏమున్నది అంటే అంటే భారతీయమైనటువంటి ఒక యోగ ప్రక్రియలో ఒకడి మహా శక్తిని ఇంకోడికి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. శక్తిపాతం అని ఇవాళ ఇవన్నీ శక్తిపాతం కాదు. ట్రాన్స్మిట్ అవుతుంది. కొన్ని చోట్ల ట్రాన్స్లేట్ అవుతుంది. కొన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అలా జాషువా సాహిత్యం బాగా చదివా. చాలా బాగా చదువుకున్నా. సరే భారత, భాగవత, రామాయణాలు అందరూ చదువుతారు. నేను కూడా చదువుకున్నా. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం మాత్రం నన్ను వివశుడ్ని చేస్తుంది. ఇప్పటికీ నాకు టైం అంటూ ఒక అరగంట దొరికితే ర్యాక్ లో నుంచి ముందు తీసి ఇలా ఓపెన్ చేస్తే ఖండం అహల్య ఖండం వచ్చిందా, శబరి ఖండం వచ్చిందా లేకపోతే కళ్యాణ ఖండం వచ్చిందా రెండు మూడు పద్యాలు చదువుకునేప్పటికీ మనస్సు ఆనందతాండవం చేస్తుంది. ఇట్లా సాహిత్యం వలన ఏమవుతుంది? ఇవి చదువుకుంటే నీకు ఆత్మాశ్రయంగా నీకు లాభమేమి? సమాజానికి ఏం లాభం అంటే భావాలు నావు అవుతాయి. భాష నాకు పడుతుంది. ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలుస్తుంది. పాత్రలన్నీ ఒక వ్యక్తి రాశాడు కదా. రామాయణంలో ఉన్న అన్ని పాత్రలు పాత్రలు మాట్లాడలా. వాల్మీకి మాట్లాడాడు సంస్కృతంలో. తెలుగులో విశ్వనాథవారు మాట్లాడారు. అంటే ఒక వ్యక్తి ఇన్ని వేల పాత్రలతో ఇన్ని భావాలు పలికించగలిగినప్పుడు ఒక వ్యక్తిగా మనం ఎదుర్కొనే సన్నివేశాలు ఎన్ని, సందర్భాలు ఎన్ని? దానికి అనుగుణంగా మనం బతకలేమా, ఆలోచించలేమా, వాళ్ళతో సంభాషించలేమా, దానిలో ఒక మర్యాదపూర్వకమైన సంబోధనలు ఉండాలి కదా. ఇవన్నీ కూడా వస్తాయని నేను అనుకొని సాహిత్యం ద్వారా నేను రాహిత్యం వైపు వెళ్ళదలుచుకోలేదు. పోతనగారు ఏమన్నాడంటే శ్రీ కైవల్య పదం కావాలని కోరుకున్నాడు. జగద్ధితంగా ఉండాలన్నారు నన్నయ్య గారు. తిక్కన గారేమో ఇష్టసిద్ధికిన్ అన్నాడు. హరిహరాద్వైతాన్ని ప్రతిపాదన చేసి ఆయన చేశాడు. విశ్వనాథవారేమో జన్మాద్యపాయము తప్పించుతా అంటే ప్రతి వాడికి ఒక కోరిక ఉంది సాహిత్యంలో. సాహిత్యం ద్వారా రాహిత్యం రాదు. కానీ రాహిత్యం వచ్చిన వాడు సాహిత్యం గనక రాయగలిగితే అది సృజనాత్మకం. అది. రాహిత్యం అంటే ఒక స్థాయి. తనను తాను ఎరిగిన ఒక ఎరుక రాహిత్యం. రాహిత్యం అంటే ఏమీ అక్కరలేని స్థితి. దానిలో అది శుద్ధ చైతన్యంలో నుంచి భాష ప్రవాహ వేగంతో బయటకు వస్తుందండి. ఒక మర్యాదపూర్వకైన సమాజ నిర్మాణంలో వ్యక్తిగా మన పాత్ర మనం పోషించాలని, పోషిస్తూ ఉంటే మనల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారే తప్ప మన ప్రచారము, ప్రసారము, ప్రతిబోధ దీని వలన ఎవరూ ఏమీ మారరు. ఇది శుద్ధమైనటువంటి ఒక నిర్ణయం. అది. ఇందాక మనం మాట్లాడుతూ మీరు యోగం అన్నారు. ఆ. యోగం అంటే ఏమిటంటారు? యోగం అంటే యోగము, యుక్తము, సంయుక్తము ఇవన్నీ అనేక పర్యాయపదాలుగా అనిపిస్తాయి. కానీ కావు. ఇవాళ రేపు ఇరవై ఒకటో తారీఖు ఎప్పుడో యోగా చేయబోతున్నాం. అది మనసుకు సంబంధించింది కాదు. లోపల ఉన్న సంస్కారానికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది ప్రాణాయామానికి అదొక ప్రచాంనాయమైనటువంటి ప్రక్రియ. అది కేవల భౌతిక సంబంధం. యోగము అంటే వేరు.యోగము అంటే రెండు రకాలు కదా వాడికి యోగ కాలం వచ్చిందని మంచి యోగం ఉందని జాతకంలో ఉందని చెప్తుంటారు యోగము అంటే అది కాదు ప్రాప్తి అని అర్థం యోగం అంటే ప్రాప్తి ప్రాప్తి అంటే ఏంటి నీకు right time లో right ఆలోచన right decision వస్తే అది ప్రాప్తి. ప్రాప్తి వల్ల లభించింది భగవంతుడి దయ వల్ల ప్రాప్తి అంటాం కదా అంటే లభిస్తుంది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే సరైన time లో సరి నిర్ణయాలు ఇది ఇది యోగము మరి దేనితో కూడి ఉంటే ఇది అవుతుంది అంటే నీ విచక్షణ నీ వివేకం నువ్వు ఇంతవరకు నడిచి వచ్చిన దారి నీకు నేర్పిన పాఠాలు అలాగే గుణపాఠాలు అలాగే నీ సత్సంగ సత్సాంగత్య సదాచార సంపత్తి లో నుంచి నువ్వు ఏర్పరచుకున్న ఒక రూపం భావం గనక అయినట్లయితే దాని పేరు యోగం అయితే యోగం ఎట్లా ఎన్ని రకాలు ఉన్నాయి యోగాలు ఉన్నాయి యోగాన్ని వదిలేద్దాం అసలు యోగము అనేది ఎన్ని రకాలు ఉన్నాయి అంటే శంకర భగవత్పాదులు యోగతారావళి అనేటువంటి గ్రంథంలో సదాశివోక్తాని సపాదలక్షలయావధానాని వసంతిలోకే నాదానుసంధాన సమాధిమేకం అన్యామహేమన్యతమం లయానాం అంటారు ఒక లక్షా ఇరవై ఐదు వేల యోగాలు ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి ఎక్కడా లేవు కాబట్టి యోగము అంటే కూడి ఉండటం ఎవరితో నేను మంచివాడితో అంటే సద్బుద్ధి కలిగిన వాడితో కూడి ఉంటే నా బుద్ధి కూడా పదును ఎక్కుతుంది నా company సరిగ్గా లేదనుకోండి నా సాంగత్యాలు మంచివి కాదనుకోండి నాకున్న సహజ సంస్కారం కూడా మలినం అయిపోతుంది కాబట్టి యోగము అంటే నీతో నీవు కూడి ఉంటే దాని పేరు యోగం స్థూలంగా సూక్ష్మంగా మూడు వందల అరవై డిగ్రీల్లో definition ఇదే ఇది యోగము యోగ అంటే నీవు నీ body తో కూడి ఉండటం అది యోగ ఇది యోగము అది ముఖ్యంగా మీ జీవిత ప్రయాణం దృష్టిలో ఉంచుకుని తరానికి మీరిచ్చే సలహా సూచన సలహా సూచన కంటే కూడా మనందరం మీతో సహా యవ్వనదశ దాటి వచ్చాం కదా యవ్వన దశలో adolescent innocence ఉంటుంది adolescent ignorance ఉంటుంది క్షమించవచ్చు తప్పేం లేదు కానీ adolescent arrogance ఉండకూడదు అహంకారం యుక్త వయసులో అనేది ప్రారంభం అయినట్లయితే అది వ్యక్త అయిపోతుంది కాకుండా ఉండాలంటే భారత భాగవత రామాయణాలు లేదు మిగతా మత గ్రంథాలలో గనక ఉన్నట్లు చదువుకున్నట్లయితే ఏమి చేయకూడదో తెలుస్తుంది ఏమి చేయాలో కూడా తెలుస్తుంది జీవితానికి ఏది అవసరమో తెలుస్తుంది ఏది అక్కరలేదో తెలుస్తుంది ఏది ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుస్తుంది అసలు మాట్లాడవలసిన పనే లేని ఒకానొక మౌనభూమిక ఎప్పుడు ఏర్పరచుకోవాలో చెప్తుంది ఇవన్నీ చెప్పాలంటే మీ దగ్గర మీ గతకాలపు సంస్కృతి గతకాలంలో అంటే కొన్ని యుగ-- త్రేతాయుగం ఎప్పటిది ద్వాపర యుగంలో దుర్యోధనుడు వాళ్ళంతా ఎప్పటి వాళ్ళు అంటే వాళ్ళు మన ప్రతీకలే మనలో ఉన్న అనేక గుణాల ప్రతీకలు అవి ఆయా సందర్భాలలో ఎలా ప్రవర్తించకూడదో మనకు చెప్తాయి ఇలా ప్రవర్తించు మంచిది అని చెప్తాయి గనుక స్వాధ్యాయం చేయండి అని చెప్తాను స్వాధ్యాయానికి రెండు అర్థాలు అంటే నువ్వు study చేయాలి reading కాదు I read a book అంటాం no you deep study చేయాలి between the lines చదవాలి చదివినట్లయితే అణిముత్యాలు బోలెడు దొరుకుతాయి జీవిత సత్యాలు పరిసత్యాలు దొరుకుతాయి కాబట్టి యువత bookish knowledge పోయింది lookish knowledge వచ్చేసింది time అంతా దాంట్లో వృధా అయిపోతున్నది కదా కాబట్టి మళ్ళీ bookish knowledge కి రండి ఎందుకు శాశ్వతమైనటువంటిది కావ్యం శాశ్వతమైనటువంటిది పుస్తకం అది మతం ఇప్పుడు భారత భాగవత రామాయణాలు మత గ్రంథాలు కావుగా దాన్ని యోగశాస్త్రం అన్నాడు భగవద్గీతని అది ఒక శాస్త్రం అధ్యాత్మ శాస్త్రం లాగా అది కూడా ఒక యోగ శాస్త్రం మిగతావి మనుషుల ద్వారా వచ్చినటువంటివి అవి కూడా మనుషులే కానీ ప్రాంతము దాని ప్రదేశము దాని ప్రవేశము దాని ప్రసారము భిన్నం కాబట్టి పోలికలు ఉండవు కానీ వాటిలల్లో కూడా చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి గ్రహించగలిగితే దానిలోనే మౌఢ్యము చాదస్తము ఉంటాయి వదిలిపెట్టగలిగితే వాటిని వదిలిపెట్టితే అది బాగుంటుంది కానీ చదవాలి కదా ప్రయత్నం చేయాలి ఇది రుచిగా ఉన్నది అంటే తింటేనే తప్ప తెలియదు కంటే ఏం తెలియదు కంటే వస్తువు యొక్క బాహ్య స్వరూపం తెలుస్తుంది అంతస్వరూపం తెలియాలంటే వాటిని అనుభవించాలి అనుభూతి చెందాలి కడగా విభూతి స్థాయికి వెళ్ళాలి ఇది ఒకటి సంగీత సాహిత్యాలు రెండు మానవుడి యొక్క మేధని ప్రశాంత పరిచే విషయాలు రెండు కూడా కాబట్టి రోజులో ఒక అరగంట ఒక పావుగంట కనీసం మంచి సంగీతాన్ని వినటం నేర్చుకోవాలి కనీసం జీవితంలో ఒక instrument అన్నా నేర్చుకోవాలి ఎందుకంటే ఏకాంతం ఏర్పడినప్పుడు నీతో సాహచర్యం ఇచ్చేది instrument అది వీణ కావచ్చు violin కావచ్చు simple హార్మోనియం కావచ్చు ఏదన్నా కానివ్వండి కాబట్టి మనం ఇవన్నీ వదిలిపెట్టి అంతా TV లో ఉంది అంతా మన cell phone లో ఉంది ప్రపంచం అంతా నా చేతిలో ఉన్నదని అనుకునే వాళ్ళకి ప్రపంచం నీ చేతిలో ఉన్నదని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ప్రపంచం చేతిలో ఇరుకుపోయావు you cannot even come out of that cobweb అది ఎట్లా అంటే బూజు పట్టి దాంట్లో నుంచి మనం బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సంగీత సాహిత్యాలు చదవండి ఇంతకుముందున్న భాష మనం నిలబెట్టుకోవాలి మనం తెలుగు వాళ్ళుగా పుట్టాం తెలుగు భాష మహత్తరమైనటువంటి భాష అనేకమైనటువంటి కావ్యాలు ఏన్నండి యాభై ఆరు అక్షరాలలో ఎన్ని లక్షల పుస్తకాలు రాశారు అక్షరాలు అవి యాభై ఏడు అక్షరాలు లేదు కదా యాభై ఆరులోనే ఎవరు రాసినా అదే రాశారు కాబట్టి జాతిని ఇంకోటి కూడా యువత మాతృమూర్తిని కన్నతల్లిని మాతృభూమిని ఎదిగిన భూమిని జన్మభూమి కాదు మాతృభూమిని మాతృభాషని మనం మూడింటిని గనక ఆదరించుకోకపోతే పరిరక్షించుకోలేకపోతే తెలుగువాడిగా పుట్టి ఇంగ్లీష్ వాడిగా మరణిస్తాం.అది జరగకూడదు. తర్వాత ఇవాళ ఒకప్పుడు డాక్టర్లు తర్వాత లాయర్లు తర్వాత టీచర్లు ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు ఎవరినడిగినా computer దాన్ని ఏమీ నిందించొద్దు. ఇవాళ timeకి అది అవసరం. కానీ మరి ఇవన్నీ లేకుండా ఒక్కటే ఉంటే ఇవాళ stress ఎందుకు వస్తున్నది? ఎందుకని మనుషులు ఒక అచ్యున్నతమైనటువంటి భారతీయ వివాహ వ్యవస్థ ఇవాళ చిన్నాభిన్నం కావటానికి ఇదిగో instruments కారణం. నీ ప్రపంచం కాని ఒక ప్రపంచంలో నువ్వు ప్రవేశించి నీ సమయాన్ని దాంట్లో దుర్వినియోగం చేసుకుంటూ నన్ను ఎవరో రక్షిస్తారంటే ఎవరూ రక్షించరండి. రక్షించగలిగిన శక్తి ఉన్నవాడు కూడా రక్షించడు. మనల్ని మనమే రక్షించుకోవాలి. మనల్ని మనం ఎరిగే ఎరుకలోకి వెళ్ళాలి ఆధ్యాత్మికంగా. ఆధ్యాత్మికం అంటే మనకు భయమేస్తుంది పూజలు గుడికి వెళ్ళాలి. వెళ్ళండి తప్పేముంది గుడికి వెళ్ళండి. సినిమా హాల్ కి వెళ్తున్నారు ఇంకెక్కడికో వెళ్లరాని చోట్లకు వెళ్తున్నారు గుడికి పది నిమిషాలు వెళ్ళలేరా? వెళ్ళండి. అక్కడ దేవుడు మీతో ఏం మాట్లాడడు. మీకు ఆయనకు లావాదేవీలు లేవు. దండం పెట్టుకుంటావ్ వచ్చేస్తావ్. నీ దగ్గర పది రూపాయలుంటే ఉండిలో వేస్తావ్ వేయకూడదనుకుంటే వేయవ్. డబ్బు వేయటం కోసం వెళ్ళక్కర్ల. కానీ మన శక్తి లోపల ఉన్నటువంటి శక్తి జాగృతం కావటానికి మనందరము కలిసి ఒక ప్రదేశానికి వెళ్ళాలి. అలాగే యువకులు చూడండి వాళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏళ్ళు యువకులు కదా డెబ్బై రెండు ఏళ్ళ జీవితం ముందుంది. డెబ్బై ఏళ్ళ వాడికి ముప్పై ఏళ్ళే జీవితం ఉంది. అందులో చివరి పది ఎందుకు పనికిరావు. కాబట్టి ఉన్నటువంటి పరిపక్వ కాలాన్ని బహుముఖీనంగా నాకు సంగీతం వరకు ఇష్టం నాకు సాహిత్యం వరకు ఇష్టం వరకు అనేది లేదండి అన్నీ నేర్చుకోవాలి. అంతా నేర్చుకోవాలి. కానీ under current underline మాత్రం ఒకటి అది మానవీయత. మానవీయత నా దృష్టిలో మాధవత్వం కంటే చాలా గొప్పది. మానవత్వానికి మాధవత్వానికి మధ్య సీమారేఖ ఎంతంటే పూలమాలలో ఉన్నటువంటి దారపు పోగు దాని diameter ఎంతుందో అంతే దూరం. మానవత్వాన్ని గనుక పరిమళింపజేస్తే నువ్వు మాధవత్వాన్ని అనుభవిస్తావు. అనుభవిస్తున్నప్పుడు నువ్వు మాధవుడవు అవుతావు. దేవుడు కాకుండా మాధవుడు అవుతావు. కాబట్టి elevation ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి ఉదాత్త స్థితికి కడగా యదార్థ స్థితికి మనిషి రావాలి. యదార్థం ఏమిటంటే మేను పోతుంది నేను ఉంటా. అంతే కదా. మేను నశించిపోతుంది. మాట్లాడుతున్న బొమ్మ ఉంటుందో ఉండదో. పంచదార చిలక నీళ్ళలో పడిపోయింది కాలం అనేటువంటి దాంట్లో దారం వేసి కాసేపు పెట్టండి చిలక ఉండదు సిరప్ తయారవుతుంది. కాబట్టి దుర్లభమైనటువంటి ఒక మానవ జన్మ వచ్చినందుకు ఇవాళ ఉన్నటువంటి technologyని అద్భుతంగా వాడుకుంటూ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. మాటలు నేను పది మందికి చెప్పాలంటే నాకు వేదిక కావాలి. ఇది వింటే లక్ష మంది వింటారు. మాధ్యమాలు ఏర్పడ్డాయి. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయ ధర్మాన్ని సనూతన జీవన ప్రక్రియగా జీవన విధానంగా జీవన దృక్పథంగా దాన్ని turn around చేయాలంటాం. మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి దాన్ని ముందుకు నడిపిస్తూ వెళ్ళాలి అనేది యువతకి నేను ఇచ్చేటువంటి సందేశం. intolerance అసహనాన్ని వదిలిపెట్టాలి. సహనాన్ని నేర్చుకోవాలి. జీవితం అండి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దాని పేరు జీవితం కాదు. అనుకోనిది జరిగితే దాని పేరు జీవితం అయితే దాన్ని accept చేయగలిగితే దాని పేరు విచక్షణ. దాని పేరే వివేకం. అంతే. మానవత్వం under current అది లేనిది ఏదీ లేదు. మాటకి విలువే లేదు. మానవత్వాన్ని దాటి ఇంకోటి లేదు. మాధవత్వం ఒక-ఒక thought ఒక భావన. మానవత్వం అనేది pragmatism అంటే అతి వాస్తవిక స్థితి అది. మానవత్వంతో విచక్షణా వివేకంతో మానవులుగా ఈనాటి యువత కూడా యధార్థ స్థితికి రాగలిగితే తప్పనిసరిగా అప్పుడే మాధవత్వం సిద్ధిస్తుంది లేకపోతే మాధవత్వం లభిస్తుంది. అయితే ఏనాడైతే మానవత్వాన్ని వదిలిపెట్టి విచక్షణా వివేకాన్ని కోల్పోతే మనం చరిత్రహీనులుగా మిగిలిపోతాం అనే ఒక గొప్ప సందేశాన్ని తెలియజేశారు. కార్యక్రమంలో ఈనాడు మీ బాల్యం నుంచి మీ తాత్విక చింతన విధంగా పొరలు పొరలుగా వస్తూ ఉంది, ఒక అంతర్వాహికంగా ఎట్లా ఒక ప్రేరణ శక్తిగా మారి మీరు ఎట్లా వ్యాపించారు, పరివ్యాప్తి చెందారు విషయాలన్నీ మా శ్రోతలకు తెలియజేశారండి. నమస్కారండి మూర్తి గారు. నమస్తే గోపీచంద్ గారు it's a beautiful conversation ఎందుకంటే మనల్ని మనం తడుముకోవాలి కదా జీవితంలో ఇవాళ తడుముకోగలిగాం. ధన్యవాదస్మి.
YouTube · audio

మాతృభూమి, జన్మ భూమి ఒకటి కాదు | Int | V Gopichand

Home

మాతృభూమి, జన్మ భూమి ఒకటి కాదు | Int | V Gopichand

Source: AIRHyderabad on YouTube

0:00 / 59:32