Skip to content
Transcript తెలుగు
[సంగీతం] ప్రాతఃకాలిక సౌఖ్యశాయనిక వాగారంభవ జల్పతాం అంబాయాహ ముఖమంటపే ప్రచలతాం ఘంటారవాణాం సఖా వాయుర్ మాం స్ప్రుశతి ప్రతిక్షణనవోర్నీలత్ సుఖాపాదకః మాతుర్భక్తగణాః పరస్పరమిదం సౌహార్దమాచింవతే. సుప్రభాతం చిత్తనవ ప్రభాత వేళ. సర్వ శ్రోతలకి విజయదశమి శుభాకాంక్షలు.[దగ్గు] విజయదశమికి ముందు జరిగిన తొమ్మిది రోజులు శరన్నవరాత్రులుగా మనం అభివర్ణిస్తూ వచ్చాం. శరన్నవరాత్రులు ఎందుకైనాయి అంటే శరత్కాలంలో వచ్చిన నవరాత్రులు అని అర్థం. మరి ఇవే నవరాత్రులా వీటికే ప్రత్యేకమైన పేరా అంటే వీటిని దేవీ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. నిజానికి నవ అంటే శివుడు, రాత్రి అంటే అమ్మవారు. నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు అని ఒక అర్థం, ప్రతిరోజూ కొత్త రాత్రి అని రెండో అర్థం. అసలర్థం ఏమిటంటే అర్థనారీశ్వర తత్వానికి ప్రతీకాత్మకంగా శరన్నవరాత్రులు అని మనం పేరు పెట్టుకున్నాం. వ్యావహారిక భాషలో దీనిని దసరా అని అంటాం. ఉత్తరాది వారు దీనిని దశరా అంటారు. రెండూ కరెక్టే. ఎందుకంటే దసరా అనేటువంటి మూడు అక్షరాలలో మూడు బీజాక్షరాలున్నాయి. ఒకటి ద, అది దుర్గా శక్తి. రెండవది స, అది శారదా శక్తి. ర, అది రమా శక్తి. ముగ్గురమ్మలైనటువంటి త్రిమాతలైనటువంటి పార్వతి, లక్ష్మి, సరస్వతి. ముగ్గురు యొక్క శక్తులు కూడా ప్రపంచాన్ని ఆవహించి ఉంటాయి గనుక ఒకే అమ్మవారు మూడు మూర్తులుగా, మూడు అమ్మలుగా, మూడు బొమ్మలుగా, మూడు శక్తులుగా తమను తాము విభజించుకొని మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని వరదానం చేసేటువంటి ఒక బృహత్తర ప్రణాళికే శరన్నవరాత్రులు. దుర్గా శక్తి, శారదా శక్తి, రమా శక్తి కలిపి దసరా అయింది. దసరా తొమ్మిది రోజులలో అమ్మవారు అనేకమైనటువంటి అలంకారాలతో అనేకమైనటువంటి దివ్య పూజా విధానాలతో మూర్తిమత్వంగా అంటే ఇది సమయాచారం అంటాం. సమయాచారం అంటే సగుణ బ్రహ్మోపాసన అని అర్థం. అంటే బొమ్మగా కనిపిస్తున్న అమ్మకు వందనం. ఇది అచ్చ తెలుగులో అర్థం. బొమ్మ కనపడకపోతే మనకి బ్రహ్మ అర్థం కాదు. అర్థం అయిన తర్వాత బొమ్మతో పని లేదు. ఇది, ఇది భారతీయ తత్వ సిద్ధాంతం. ఇక కాలంలోనే శరత్కాలంలోనే అమ్మవారు ఇట్లా ఎందుకు వస్తుంది, నవరాత్రులు ఎందుకు జరుగుతాయి అంటే వాటికి కాస్త మూలంలోకి మనం వెళ్ళినట్లయితే మనం అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ అంటాం. చాల పెద్దమ్మ ఎవరంటే త్రిమాతలకు మూలమైనటువంటి ఒక శక్తి. శక్తి ఎవరు అంటే కోటి సూర్యమండల మధ్యస్త అయినటువంటి మహా త్రిపుర సుందరి దేవే శక్తి. కలియుగం ఆరంభ వేళల్లో ఒక మీమాంస ఏర్పడినప్పుడు బ్రహ్మ అవతారాలు తాల్చిరాడు ఆయనది సృష్టి రచన. రెండవది శివుడు అప్పుడప్పుడు వస్తాడు గానీ పూర్ణావతారంగా రాడు. అవతారాలు తాల్చటం విష్ణుమూర్తి యొక్క పని. కానీ నిజానికి కలియుగ ఆరంభ వేళలకే ఆయన ఇరవై ఒక్క అవతారాలు ఎత్తాడు. కళావతారాలు, అంశావతారాలు, అర్చావతారాలు, ప్రభవావతారాలు, ప్రసవావతారాలు, కారణావతారాలు, ఆవేశావతారాలు, భిన్న భిన్నమైనటువంటి రూపాలలో వచ్చి వేదోద్ధరణ, ధర్మోద్ధరణ సకల జన ఉద్ధరణ చేసి భగవంతుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు. ఇరవై రెండవ అవతారం కలియుగ అంతంలో వస్తుంది. అంటే ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాల తర్వాత ఆయన తెల్ల గుర్రం ఎక్కి వస్తాడని పురాణాలు, భవిష్యత్ పురాణం చెప్తున్నది. అంటే విష్ణువు రాడు. విష్ణువే రానప్పుడు శివుడు రాడు. బ్రహ్మ రానే రాడు. మరి ఎవరు కలియుగాన్ని నడిపించాలి అంటే కోటి సూర్యమండల మధ్యస్తైన మహా త్రిపుర సుందరి దేవి ఉన్నదో ఆమె దగ్గరకు ముప్పై ముక్కోటి దేవతలు, అష్టదిపాలకులు, త్రిమూర్తులు, త్రిమాతలు, అగస్త్యుడు, లోపాముద్ర, ఇంద్రాది దేవతలు, కుబేరుడు వీళ్ళందరూ వెళ్లి మొరపెట్టుకున్నారు. అమ్మా మరి కలియుగం కూడా ఒక యుగం కదా దానికి ఆరక్షణ బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే దయగల తల్లి గనుక, కారుణ్య వారాశి గనుక బాధ్యత నేనే నిర్వర్తిస్తాను అన్నది. మహదానంద పడిపోయినారు కానీ ఒక చిన్న సంశయం ఏర్పడింది. కోటి సూర్యమండలంలో ఉన్నటువంటి నీవుఇట్లాగే భూలోకంలో కొస్తే అసలు సృష్టి నిలబడుతుందా? ఎక్కడో ఒక లక్షా ఇరవై వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక గోళం నుంచి ఒక కిరణం భూమిని తాకుతున్నప్పుడు మనుషులు ప్రకృతి దడదడలాడిపోతున్నదే, మరి కోటి సూర్యమండల మధ్యంలో ఉన్న నువ్వు ఇలా వస్తావా-- వస్తే ఏమవుతుంది అని అంటే, "వస్తే, ఇట్లా వస్తానా? శ్రీ లలితా దేవిగా వస్తాను" అన్నాడు. అట్లా కలియుగ అధిష్టాన పరదైవతం ఎవరు అంటే శ్రీ లలితాదేవి. శ్రీ లలితాదేవి పురుష రూపంలో శ్రీ దత్తుడిగా ఉంటాను స్త్రీగా శక్తి స్వరూపిణిగా దత్తుడు నేను అంటే దత్త స్వామితో కలిపి కలియుగాన్ని మేము శాసించి, నడిపించి, రక్షించి, లాలించి, పాలించి, ఆలించి, అదలించి నడిపిస్తాం అని ప్రమాణం చేసింది. కనుక కలియుగానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒక పార్శ్వం లలితాదేవి ఆమె శక్తి స్వరూపిణి, రెండవది దత్త స్వరూపం. దత్త స్వరూపం అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ప్రపంచానికి తమను తాము దత్తం చేసుకున్న వారు అని ఒక అర్థం, ప్రపంచాన్ని దత్తత తీసుకున్న వారు అని రెండో అర్థం. అంటే వాళ్ళు ఎప్పుడూ జన జగత్వంతో కూడి ఉంటారు. అట్లా వచ్చినటువంటి ప్రప్రథమ దత్తావతారం ఏది అంటే శ్రీపాద శ్రీవల్లభుడు తెలుగునాట పిఠాపురంలో. అయితే ఆయన కొన్ని నిబంధనలు పెట్టాడు అవతారం వచ్చినప్పుడు తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు నిబంధనలు ఉల్లంఘించి ఆయన్ని వివాహం చేసుకోమన్నారు. అంతే నిబంధన ఉల్లంఘించారు గనుక నేను ఇక్కడి నుంచి దూరమై పోతున్నాను అన్నారు. ఆయన ఇవాళ రాయచూరు జిల్లా ప్రాంతంలోకి వెళ్లి అక్కడ తన దేహాన్ని పంచభౌతికంగా వదిలేశారు. అయితే తర్వాత నరసింహ సరస్వతి, అక్కల్కోట మహారాజు వంటి అనేకమైనటువంటి దత్తాంశ రూపాలనేవి కూడా లోకంలోకి వచ్చినయి. అట్లా వచ్చినటువంటి ఒక అవతారం ఏమిటి అంటే సంత దేశమైనటువంటి మహారాష్ట్రంలో శివ, రామ, కృష్ణ, మారుతి, విఠోబ, ఖండోబ, నాథ సాంప్రదాయాలతో కునారిల్లి పోతున్నటువంటి, అతలాకుతలం అయిపోతున్నటువంటి, మత విభజనతో యాతన పడుతున్నటువంటి జనా-- జనాళిని రక్షించడానికి ఆయన వచ్చిన అవతారమే షిరిడీ స్వామి. షిరిడీ అంటే నిజానికి షిరిడీ అది కాదు దాని పేరు శిలాడి. శిలాడి అంటే చెరుకు తోట అని అర్థం. చెరుకు తోట మధ్యలో ఒక వేప చెట్టు ఉంటే, వేప చెట్టు కింద కూర్చొని తన తాత్వికమైన విచార ధారని ప్రపంచానికి అనుగ్రహించారు. కానీ మొట్టమొదటి సారి షిరిడీ గ్రామం ప్రవేశించినప్పుడు ఒక రాత్రి ఖండోబా దేవాలయంలో తలదాచుకుందామని అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజారి "మహల్ సాపతి ఇక్కడి నుంచి నువ్వెళ్ళిపో" అన్నాడు. మారు మాట్లాడకుండా ఆయన వెనక్కి వెళ్ళిపోయినారు. అప్పటికి ఆయన ఊరు, పేరు ఏం తెలియదు. కానీ కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఒక పెళ్లి బృందంతో షిరిడీ గ్రామం ప్రవేశం చేసినప్పుడు పూజారి అయినటువంటి మహల్ సాపతి వద్దన్నాడో ఆయనే ఈయన దివ్య తేజస్సును చూసి "ఆవో సాయి" అని పిలిచాడు. అప్పటి వరకు సాయి నామం ఎక్కడా పురాణ కాలంలో గాని, పురాణ వాఙ్మయంలో గాని, వ్యాస, వాల్మీకులు గాని, అంతకు ముందు రాసినటువంటి ఎవరు కూడా ప్రస్తావన తేలే. కాకపోతే సాయి అనేటువంటి నామానికి ఒక పూర్వ రంగా ఉన్నది. మహా మంత్రా రత్న గ్రంథం అని ఒకటి ఉంది. దానిలో ఈశ్వరుడి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు "సర్వభ్యహా సర్వ-- సర్వభ్యహా" అంటే సర్వుడు ఆయనే, శర్వుడు ఆయనే. అంతా తానే, అన్నీ తానే అని తెలుగులో అర్థం. కాబట్టి సర్వ అనేటువంటి శబ్దాన్ని మూల ధాతువులోకి వెళితే ఈశ్వరుడి అసలు పేరు ఏమిటంటే సహ. అది ఏకాక్షరమైనటువంటి నామం. మరి అర్ధనారీశ్వర తత్వంలో ఇంకో ఆ-మరొక వామ భాగం ఉంది కదా పార్శ్వం అది ఏమిటి అంటే అది మహారాష్ట్ర దేశం కాబట్టి ఆయి అంటే తల్లి అని అర్థం. సహ ప్లస్ ఆయి సాయి. సర్వనామ దిగ్వంద అయిపోయింది అక్కడికి. కాబట్టి సాయి నామం కొత్తది కాదు. సాయి నామం మహా మంత్రా రత్న గ్రంథం రోజుల నుంచి దీన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకుంటే తప్ప నామం విలువ మనకి తెలియదు. అట్లా వచ్చి ముప్పై తొమ్మిది సంవత్సరాలు తమ దేహానికి వచ్చే వరకు కూడా ఆయన ఎవరూ బయట పడలేదు. బయట పడిన తర్వాత ఆయన సర్వమత సమన్వయం చేశారు. జ్ఞానబోధ చేయలేదు, అజ్ఞానం అంటే ఏంటో చెప్పారు. మేము బాగా చదువుకున్న వాళ్ళం, శాస్త్రాల మీద అధికారం ఉంది, మాకు డిగ్రీలు ఉన్నాయి అని వెళ్ళిన ప్రతి వాడికి వాతని గొల్లతనాన్ని బయట పెట్టి అజ్ఞానం అంటే తెలుసుకుంటే మిగిలేంది జ్ఞానమేనని ప్రతిపాదించినటువంటి, పరిపూర్ణమైనటువంటి ఒక అవతారం ఏమిటంటే షిరిడీ బాబా. పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇవాళ రోజున అయితే విజయదశమి నాడు మనం మాట్లాడుకుంటూ ఉన్నామో క్షణాల్లోనే షిరిడీ మహాస్వామి సమాధి చెందినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షణాలు ఇవి. చూడండి భగవంతుడు ఎట్లా మన-- అన్నీ కలుగుతాడో. సమాధిగతం కావటానికి ముందు, దేహాన్ని వదిలిపెట్టడానికి ముందు వారు ఒక్క మాటన్నారు. మళ్ళీ ఎనిమిది సంవత్సరాలకి ఆంధ్రదేశంలో మరొక అవతార రూపంలో నేను వస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున పుట్టపర్తి గ్రామంలో ప్రాదుర్భవించినటువంటి మహా పరిపూర్ణ అవతారమే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. వారిని సర్వ ప్రపంచము స్వామి అని పిలుచుకుంటుంది. స్వామి అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞాని అని అర్థం. జ్ఞాని అంటే ఇక ఆయనను తెలుసుకుంటే, ఆయనను చూస్తే, ఆయనతో సంచలిస్తే, ఆయనతో సంచరిస్తే ఇక చేయవలసినదంటూ ఏమీ లేదు అని అర్థం. ఇక మనందరికీ తెలుసు సత్య సాయి భగవానుడి యొక్క అవతార వైభవం. ఇంకా అది నడుస్తూనే ఉంటుంది కల్పాంతం వరకు. అంటే సాయి నామంతో మూడు అవతారాలే వస్తాయి.ఒకటి షిరిడి సాయి అది అయింది. రెండవది సత్య సాయి అది అయింది. మూడవది రాబోయే ప్రేమ సాయి దాని గురించినటువంటి వివరాలు మన దగ్గర లేవు గనుక దాన్ని భవిష్యత్ కాలానికి వదిలిపెడదాం. మూడు సాయులు అయిన తర్వాత నాలుగవ సాయుడు ప్రపంచంలోకి రారు. అక్కడికి-- అంటే దత్తుడు దత్తాత్రేయుడు ప్రపంచం మొత్తాన్ని ఆవహించి ఉంటాడు కల్పాంతం వరకు. నిజానికి యుగాంతం వరకు. ఎవరు? కల్కి వచ్చేదాకా ఇటు దత్త సంప్రదాయము ఇటు శ్రీ లలితా దేవి శక్తి ఇది అది. రెండూ కలిపి ప్రపంచాన్ని మార్గోపదేశనం చేస్తూ మంచి మార్గంలో నడిపిస్తాయి గనుక దత్త స్వాములు అందరికీ కూడా నమస్కారం మనం చేయాలి ప్రణుతి. దత్త స్వాములు అంటే మేము దత్తాంశులం అని చెప్పుకునే వారిని కాదు ఎవరు జనజగత్తుల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి భౌతిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక స్థాయిలో మానవుణ్ణి పరిపూర్ణ మానవత్వం వైపు నడిపిస్తారో వారు మాత్రమే దత్త సంప్రదాయంలో ఉంటారు. కనుక దత్త స్వాములకి మరొక్కసారి ప్రణమిల్లుతూ ఇటు శ్రీ లలితా దేవి దగ్గరికి వచ్చినప్పుడు లలితా దేవి దత్తుల వారికంటే కొద్దిగా ముందే వచ్చింది. ఎందుకంటే శక్తి ముందు ప్రవేశించాలి. రామావతార కాలంలో కూడా శ్రీరామచంద్రమూర్తి రావటానికి ముందే సీతాదేవి వచ్చి జనక మహారాజు ఇంట్లో నేలలో నేలమాళిగలో పెట్టెలో ఆమె తనను తాను శక్తి స్వరూపిణిగా భద్రతమంగా నిలబెట్టుకున్నది. ఎందుకనంటే శక్తి లేకపోయినట్లయితే ప్రపంచమూ సృష్టి సాగదు. ఏది మాట్లాడాలన్నా, వినాలన్నా శక్తి కావాలి. కాబట్టి ప్రపంచం మొత్తం ఇవాళ భాషలో ఎనర్జీ అని వాడుదాం. ఒకే ఎనర్జీ అది మల్టీ డైమెన్షనల్ మల్టీ డైనమిక్స్. అది విధంగా ఉంటుందో తెలియదు మనకి. రకంగా ప్రకృతిని ముందు వృద్ధిలోకి తీసుకు వెళుతుందో తెలియదు. ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. ఎప్పుడు ఉత్పాతం ఏర్పడుతుందో తెలియదు. ఇదంతా కూడా ప్రకృతి మాత యందు అంతర్భాగమై దాగినటువంటి ఒక శక్తి ప్రకటనగా వీటిని మనం భావిస్తూ ఉండాలి. ఇక లలితా దేవిని ఒక్క నిమిషం అక్కడ పెడితే మనమున్నాం. మూడు శక్తులు మనయందు కూడా ఉన్నాయి. ఎట్లా ఉన్నాయి? ఒకే శక్తి మూడుగా ఉంది అని అర్థం. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఒక్క క్షణం ఇచ్ఛాశక్తి అనే పదంలో శక్తిని తీసేద్దాం. ఏం మిగిలింది? ఇచ్ఛ. క్రియాశక్తిలో శక్తి లేదు, క్రియ. జ్ఞాన శక్తిలో శక్తి లేదు ఒట్టి జ్ఞానం. శక్తి లేని కోరిక సాధ్యమేనా? మనకో కోరిక కలిగింది, సాధించుకోవాలి, సొంతం చేసుకోవాలి. దానికి ఏం కావాలి? శక్తి కావాలి. పని చేయాలి. పని చేయాలి అంటే చేద్దాం అనుకోవటం ఇచ్ఛ అయితే, చేయటం కర్మకాండ అయితే కర్మ చేయాలి అంటే కూడా మళ్ళీ ఒక శక్తి కావాలి. అది ద్రవ్య శక్తి కావాలి, వస్తు శక్తి కావాలి, జనశక్తి కావాలి, అట్లాగే జగత్తు యొక్క శక్తి కావాలి. వీటన్నింటినీ నడిపించేటువంటి మూల శక్తి కావాలి. ఇక మూడవది జ్ఞాన శక్తి. జ్ఞానం కలిగింది నేను ఆత్మ అన్న భావనలో నెలకొని చెందాడు జ్ఞాని. ఆయన దగ్గర గనుక జ్ఞానమే శక్తి అయిపోతుంది. జ్ఞానము శక్తి భిన్నం కాదని భావన చేస్తూ ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తులు మూడు కూడా తొమ్మిది రోజులు లలితా దేవి అనబడేటువంటి లేదా మహా త్రిపురసుందరి దేవి అనేక విధాలుగా మనందరికీ తెలుసు తొమ్మిది రోజులుగా మనం నడిపాం కదా, రోజు అలంకారం ఎందుకు చేశాం ఇవన్నీ ఇవి ఎన్ని అలంకారాలు చేసినా అవన్నీ కూడా దుర్గా శక్తి, శారదా శక్తి తరువాత పార్వతీ శక్తి శక్తితో కూడి ఉన్నాయి. ఇక దుర్గా శక్తి అంటే ఏమిటి? దుర్గమము అంటే దాటటానికి వీలు లేనిది అది. దుర్గము అంటే కోట అని రెండో అర్థం. రాజుగారి కోటలోకి శత్రువు అయినా మిత్రుడైనా ప్రవేశించాలి అంటే అంత తేలిక కాదు. కదా. కనుక పనైనా చేయాలన్నా, భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలనుకున్నా, చేసుకున్న దర్శనంలో నుంచి మనిషి నిలబడాలన్నా, మనిషి నడవాలన్నా, మనిషి జీవించాలన్నా, శ్వాసించాలన్నా దీనికి శక్తి కావాలి. దుర్గా శక్తి మనయందు ఉంటే అది దైహిక శక్తి, మానసిక శక్తి, ఆత్మ శక్తి. మూడు కలిపితే దుర్గా శక్తి. ఇక రెండవది శారదా దేవి అంటే సరస్వతీ దేవి. వాక్ వైభవం అంతా కూడా అమ్మవారి దయ వల్ల మనకు కలుగుతుంది. శారద నీర దేందు ఘన సార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ప్రడీ శకుంత మందార సుధాపయోధి శితతామర సాగర వాహిని శుభాకార తను పునెన్ను మదిగానగ ఎన్నడు తలంతు భారతీ. ఇది ప్రమాణం. అంటే అంతా తెలుపే. వస్తువులన్నీ తెలుపే. ఏమిటి తెలుపు అంటే తెలిపేది తెలుపు. అసలుని చెప్పేది తెలుపు. తెలుపు అమ్మవారి యొక్క సంకేతం. అమ్మవారి యొక్క స్ఫూర్తి. అమ్మవారి సత్వగుణ ప్రధాన సంపన్నమైన అటువంటిది. కనుక శారదా దేవి లేకపోయినట్లయితే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మాట్లాడటం అనేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి వాడు ఒక్కడు మానవుడు మాత్రమే. మరికెవ్వరూ జంతువును క్రిమి మాట్లాడలేదు. కానీ మనిషికి మాట్లాడేటువంటి శక్తి ఉన్నది. అది ఆధ్యాత్మిక విషయాలలో ఆలోచించినట్లయితే మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత చక్రాలు దాటికంఠస్థానమైనటువంటి విశుద్ధ చక్రం దగ్గరికి వచ్చినప్పుడు భావము లేదా ఆలోచన, భావము, భావన ఒక రూపాన్ని తీసుకుని ఒక వాక్కై, ఒక ప్రవాహమై మన నుంచి వస్తుంది. అది మాట కావచ్చు, పాట కావచ్చు. రెండింటికీ శృతిలయలు కావాలి. కాబట్టి అమ్మవారు ఎక్కడ ఉన్నది అంటే కంఠగతమై ఉంటుంది. ఇక్కడి నుంచే మాటలు వస్తాయి. కానీ పుట్టటం ఎక్కడో మూలాధారంలో అగ్ని స్వరూపంగా పుట్టి ఇందాక చెప్పిన చక్రాలన్నీ దాటి దాటి వచ్చి ఒక ఆలోచన మాటగా మారటానికి కొంత సమయం తీసుకుంటుంది గనుక, ఇదంతా కూడా అమ్మవారి దయ, శారదాదేవి యొక్క శక్తి. అమ్మ దయ గనుక ఉన్నట్లయితే ఉచ్చారణ, వాక్సిద్ధి, వాక్శుద్ధి, వశ్యవాక్కు, లోకానికి హితకరమైన, సమ్మోహనకరమైనటువంటి భాషా అభివ్యక్తి, భావము, పరమేశ్వరుణ్ణి స్తుతించాలి, నృతించాలి, గీతించాలి, గానం చేయాలి అంటే మాట కావాలి. పాట పాడాలి అంటే భాషాభావము కావాలి. నాదము, సంగీతము కావాలి. కాబట్టి ఇటు సాహిత్యము, అటు సంగీతము రెండూ కలిపిన ట్లయితే అది శారదా శక్తి. అందుకే సాహిత్యం, సంగీతాలు సమంగా అలంకృతమై ఉన్నటువంటిది శారదా మూర్తి. శారదాదేవి. మనందరికీ పలుకు తల్లి. పలుకు కలికికి ఆ-- అనంతమైనటువంటి శక్తి ఉంది. ఎందుకనంటే వేదాలన్నీ కూడా శారదా స్వరూపమే. ఉపనిషత్తులు, భారతీయ వాఙ్మయము, మనం ఈవేళ ఓం నమశ్శివాయ అని ఫలక మీద రాసినా అది శారదా స్వరూపమే. కాబట్టి సరస్వతీ శక్తి గనుక ఉన్నట్లయితే విద్య వలన అనేక విషయాలు తెలుస్తాయి. విద్వాన్ సర్వత్ర పూజ్యతై. వాడి అందచందాలతో లోకానికి పని ఉండదు. వాడి స్థితిగతులతో వాడికి, లోకానికి అస్సలు పని ఉండదు. ఏముంటుంది అంటే విద్వత్తు, ప్రతిభ, ప్రజ్ఞ, ఉపజ్ఞ, ధీషణ ఇవన్నీ కలిపితే శారదాదేవి యొక్క మహా శక్తిగా మనం భావన చేయాలి. కాబట్టి అది కూడా మనకు కావాలి. అందుకే మనకి దేశంలో అక్షర అభ్యాసానికి ఒక పండుగ చేస్తాం. దాన్నక్షరాభ్యాసం. అంటే అక్షరాలను నేర్వటం. కదా. ఫలక మీద ఓం నమశ్శివాయ తో మనకు ప్రారంభమవుతుంది చదువు. అక్కడ నుంచి ఇక మనం వెళ్ళే కొద్ది ఆకాశమే హద్దుగా, భూమే ఆధారంగా, ఆకాశమే అవకాశంగా మానవుడు తన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి స్థాయికి తీసుకుని వెళతాడు. అలాగే శాస్త్రాల మీద అధికారం గాని, శాస్త్ర విశ్లేషణ గాని, శాస్త్రాలను వివరించడం గాని, శాస్త్రాలను అర్థం చేసుకోవాలి గాని వీటన్నింటికీ కూడా మూలాధారం ఏది అంటే శారదా శక్తి కావాలి. అటువంటి శారదకి మనం నమస్కరించాలి. కదా. రెండు. ఇది అయిన తర్వాత మూడవది రమా శక్తి. ఎంతటి జ్ఞాని అయినా ఆతని డొక్క ఎండిపోతే ప్రయోజనం లేదు. డబ్బు కావాలి, సంప-- ఐహిక సంపద కూడా కావాలి. ఐహిక సంపద వల్ల మనిషికి బలం ఉంటుంది. ఎందుకంటే మనిషికి ఉన్నదే పుష్టి, పశువుకి తిన్నదే పుష్టి. కానీ ఇవాళ ఎట్లా మారిపోయి, ఇవాళ ఏమైపోయింది అంటే పశువుకి-- పశువుతో పాటు ఒకప్పుడు ఉన్నది చాలు, ఉన్నంతలో చాలు అనుకున్న వాడు అట్లా అనుకోవటం లేదు. ఉన్నది శక్తి కావాలి, తిన్నది కూడా శక్తి కావాలనే కాల మహిమ వల్ల ఏర్పడింది గాని నిజానికి ఉన్నది అంటే, ఏమి ఉన్నది అంటే భౌతిక సంపద. అంటే పొలాలు, స్థలాలు, ఇల్లు, డబ్బు ఇది. ఇంతేనా? కాదు. కావాల్సింది కలలనిసిరి కావాలి. ఇవన్నీ మారిపోతాయి. ఒకడు ఒక పొలం అమ్ముతూ ఉంటాడు, కొనుక్కునే వాడు ఉంటాడు. "వాళ్లిద్దరు అంటాడు, 'ఇగో ఈ-ఈ క్షణం నుంచి భూమి నాది.' అంటాడు కొనుక్కున్నవాడు. 'అవును నీదే.' అంటాడు అమ్మిన వాడు. వాళ్లిద్దరినీ చూసి భూదేవి నవ్వుకుంటుంది. 'ఇట్లా ఎంతమందిని విన్నాను.' అని అనుకుని 'వసుంధరా బ్రహ్మదత్తా' అంటుంది. అంటే వసుంధర, భూమి బ్రహ్మ చేత అంటే పరమాత్మ చేత ఇవ్వబడిందే గాని వాడు అమ్మింది లేదు, నువ్వు కొన్నది లేదు అన్నది. బాగుందిగా. ఇది. రెండు జరుగుతాయి. లోకరీతిలో అదొక వ్యాసంగం అంతే. వాడు భూమిని పెళ్ళగించి తీసుకెళ్లగా 'ఈ భూమి నాదే' అని తవ్వుకుని వెళ్లిపోతాడని వెళ్ళిన వాడు మళ్ళీ అక్కడే ఉంటాడు. మళ్ళీ ఒకరోజు కొన్నవాడు అమ్ము-- అమ్మేవాడు అవుతాడు. ఇదంతా ఏమిటంటే మానవుడు వినియోగపరుచుకోవటానికి వీలుగా లక్ష్మీదేవి చల-- చలితమైనటువంటి దేవిగా నడుస్తుంది. ఒక్కసారి మీరు ఊహించండి. సరస్వతీదేవి ఫోటో ఒకచోట పెట్టుకుందాం. లక్ష్మీదేవి ఫోటో కూడా పక్కనే పెట్టుకుంటాం. లక్ష్మీ-- సరస్వతీదేవి పద్మంలో కూర్చోదు. రాయి మీద కూర్చొని ఉంటుంది. ఎందుకనంటే ఆమె కదలదు. ఆమె చేతిలో వీణ ఉంటుంది. దానితో సప్తస్వర రాగాంచితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి భావతరంగాలను ప్రపంచానికి విద్యా వరదానము, జ్ఞాన వరదానము చేస్తూ వెళుతూ ఉంటుందామె. ఆమె కదలదు. ఆమె పక్కనే లక్ష్మీదేవి నుంచొని ఉంటుంది. పైగా అతి సున్నితమైన పువ్వులో నుంచొని ఉంటుంది. పువ్వు ఉండదు, ఆమె అక్కడ ఉండదు. ఎందుకంటే మీ దగ్గరున్న వందనోటు నా దగ్గరికి వస్తుంది, నా దగ్గరున్నది మూడో వాడి దగ్గరికి వెళుతుంది. అది ఎవరి దగ్గరికి వెళుతుందో, ఎప్పుడు వెళుతుందో, ఎందుకు వెళుతుందో, ఎన్ని రకాలుగా మారిపోతుందో, ఎంతగా విభజించబడుతుందో మనకు తెలుసు. కాబట్టి చలచలితమైనటువంటి సంపద కాదు, కలలనిసిరి కావాలి. కలలనిసిరి ఏమిటంటే జ్ఞానం. అందుకే దూర్జటి అంటాడు, "శ్రీ విద్యుత్ కలితాజవంజవ మహాజీమూత పాపాంబుధారా వేగంబు నన్నన్ మనోజ్జ సముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా. కరుణాశరత్ సమయమింతే చాలు చిర్భావనా సేవన్ తమరతంబరై మలియదన్ శ్రీ కళహస్తీశ్వరా" అంటాడు. ఎంతో సంపాదించాను, ఎంతో పోగొట్టుకున్నాను.అవి ఎట్లా వచ్చినయో ఎట్లా పోయినయో నాకు తెలియదు పోనీలే పోతే పోయినాయి. ఓహో ఇది పోగొట్టుకోబడటానికే వచ్చిందని తెలుసుకున్నాను చూడు. క-- ఇది నీ కరుణ వల్లనే నాకు లభించింది గనుక ఇప్పుడు నేను ప్రాపంచికమైన సంపద కాక నిన్ను గురించిన ఆలోచనలతో నా జీవితాన్ని చిద్భావనా సేవన్ తామరతంపరే expand అవుతూ ఉంటాను క్షణం నుంచి అంటాడు. అలాగే రాజు మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురంఠయాన తురిగి పురుషాదులు ఆత్మం యధా బీజము తదపేక్ష చాలు పరితృప్తిం జెందితిన్ జ్ఞానలక్ష్మి జాగ్రత్ పరిణామంబు ముదయతో శ్రీ కాళహస్తీశ్వర. ఏనుగులు చూశాను గుర్రాలు చూశాను ఉగ్రహారాలు చూశాను పల్లకీలు చూశాను క్షీని చీరాంబరాలు చూశాను ఆభరణాలు చూశాను అవన్నీ నాకు ఇప్పుడు అక్కర్లేదు. జాగ్రదవస్థలో నా కళ్ళు కాళ్ళు కీళ్ళు నడుస్తున్నప్పుడే పని చేస్తున్నప్పుడే నాకు జ్ఞానలక్ష్మిని వరదానం చేయమని పరమేశ్వరుని ముందు దోసిలి వొగ్గి అడుగుతూ ఉన్నాడు దుర్జటి. అంటే కదలని జ్ఞానము వలె కదలని సిరి కూడా కావాలి. అయితే ఒట్టి జ్ఞానం వలన డొక్క నిండదు. బాగా డబ్బుంది గనుక వాక్కు రాదు. కాబట్టి ఇద్దరూ లక్ష్మీ సరస్వతులు ఇద్దరూ కూడా మనకి కావాలి. లక్ష్మి ఉన్నది సరస్వతి ఉన్నది కానీ నేను ఎవరికీ ఏం చేయను డబ్బుంది అది నాది చదువుంది నాది అని గనుక అనుకున్నట్లయితే దానివలన ప్రయోజనం లేదు. దీన్ని సత్యసాయి భగవానుడు ఒక్క మాట అన్నారు "దాచిపెట్టుకున్నావా మొత్తం పాచిపోతుంది పంచిపెట్టు" అన్నారు. కాబట్టి పంచి పెట్టాలి అంటే జ్ఞాని అయినటువంటి వాడు వాక్కును అమ్ముకోకూడదు. జ్ఞాని అందరికీ జ్ఞానాన్ని ఇస్తూ వెళ్ళాలి. డబ్బున్నవాడు సంపద ఉన్నవాడు అంటే కలిగిన వాడు కలిగిన వాడిని కాపాడుకోవాలి. ప్రతిరోజూ ఒక్కడికి ఒక్క ముద్ద పెట్టగలిగి, ఒక బట్ట ఇవ్వగలిగి, ఒక్కడికి చదువు చెప్పించగలిగి, ఏదో సేవ గనుక చేయగలిగినట్లయితే సంపదకి జ్ఞానానికి ఒక పరమార్థం ఉంటుందని చెప్తూ రెండూ జరగాలి అంటే దుర్గా శక్తి కావాలి. చూశారా? అది దసరా. అంతేగాని దసరా సెలవులు కాదు. దసరా is not to just spend away time. తొమ్మిది రోజులు ఒక నిష్టతో, నియతితో, నియమంతో ఏమిటి నేను జన్మ ఎత్తాను? వయస్సు వచ్చేస్తున్నది జారిపోతున్నది తెలియకుండానే నేనంటూ వచ్చి ప్రపంచానికి ఎప్పుడైనా ఉపయోగపడ్డనా? నా క్రోధము, నా మదము, నా మాత్సర్యము, అసూయ, అహంకారము, దంభము, గర్వము, ప్రగల్భము ఇవన్నీ పోగొట్టుకోగలిగానా? సాత్విక చింతనావమికిలో నిలకడ చెందగలిగానా? అని ప్రతిరోజూ ఒక్కొక్క దేవీ స్వరూపంగా ఒక్కొక్క శక్తిని మనం ఇక్కడ ఉపాసన చేస్తూ ఉన్నాం. అంటే రూపాలు మనం-- అమ్మవారు అలంకారం బాగుందని ఫోటోలు పెట్టడం కాదు, అలంకారం వెనుక ఏమున్నది? మాయా చాటున దాగిన మహిత తత్వం ఏమిటో విచార ధారలోకి వెళ్ళాలి. తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత మన మీద మనం గనుక ఒక విజయాన్ని సాధిస్తే ఆరోజు మన విజయ దశమి అవుతాం. తొమ్మిది రోజులు self audit చేసుకోవాలి. Self analysis చేసుకోవాలి. Introspection చేసుకోవాలి. Perception ఉండాలి. Interpretation ఉండాలి. Application ఉండాలి. అవును, నాలో కోపం ఉండేది తొమ్మిది రోజుల క్రితం కూడా. తొమ్మిది రోజుల నియమం వల్ల కాస్త తగ్గింది. అహంకారం కొద్దిగా నెమ్మదించింది. ఒకే రోజు పోదు అది. ఇట్లా ఎన్ని దసరాలు అయిన తర్వాత పదవ రోజు it is in fact a celebration. ఎవరికి celebration అంటే మనం అమ్మ పరంగా అంటాం. జనని శివ కామణి అని పాటలు పాడేస్తాం. అది కాదు. ఆమె ఎప్పుడూ విజేతే. అసలు ఆమెకు ఒక పేరుంది అపరాజిత అని పేరు. అపరాజిత అంటే పరాజయము ఇరుగనిది అని ఒకటి, రెండవది ఆమెను ఎవరూ గెలవగలిగిన వాడు కూడా ప్రకృతిలో లేడు గనుక అపరాజిత అద్భుతమైన పేరు. అపరాజిత వంటి అనేక పేర్లు శతాక్షి అని, వి౦జవాసిని అని, మలయవాసిని అని అనేక నామాలున్నాయి. మీరు నామంతో పిలిచినా శక్తిని పిలిచినట్లే. ఇక్కడికి దత్తమైంది. తొమ్మిది రోజులు మనం ఏం చేయాలో తెలుసుకున్నాం. పదో రోజు విజయదశమి అంటే ఏమిటో కూడా తెలుసుకున్నాం. విజయదశమికి ఇంతకీ కారణమైనటువంటి, మూలమైనటువంటి లలితాదేవి కలియుగానికి అధిష్టాన పరదైవతం కాబట్టి మన కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని అమ్మవారి గురించి ఒక మాట చెప్తాడు. అద్భుతమైన మాట. అనేక రూపాల్లో నువ్వు కనిపిస్తావు కదా అమ్మా! ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసునా? అర్చా కాలే రూపగతా సన్నుతి కాలే శబ్దగతా. అర్చా కాలే రూపగతా. నిన్ను అర్చిస్తున్నప్పుడు రూపం కనిపిస్తున్నావు. అన్నపూర్ణ అన్నావు, ఇంకోటి అన్నావు, శాకంభరి దేవి అన్నావు అంతా రూపమే కనిపిస్తున్నది. కానీ నిన్ను సన్నుతి చేస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు సన్నుతి కాలే శబ్దగతా. నువ్వు శబ్ద స్వరూపంగా కనిపిస్తున్నావు. చింతన కాలే ప్రాణగతా. ధ్యానంలో ఉండి ధారణ చేసుకొని తపస్స్వాధ్యాయాలు చేసినప్పుడు నీ నామం మీద, నీ రూపం మీద, నీ భావం మీద, నీ తత్వం మీద నా మనస్సు లగ్నమైనప్పుడు నాలో ఉన్న సమస్త ప్రాణుల యందు నువ్వున్నావని కనిపిస్తున్నది కదా తల్లి. ఇక నాలుగవది, ఇదంతా కూడా సన్నుతి అయింది, అర్చన అయింది, ఇదిగో చింతన రూపం అయింది. తత్వ విచారే. నీ మూలం ఏమిటో నేను విచారణ ప్రారంభం కాగానే, అవును కనిపిస్తున్న తొమ్మిది రోజుల అలంకారాలు మాత్రమేనా? అని ఒక ఆలోచన కలిగితే, దానిని మేము విజయదశమిగా ఒక celebration చేస్తూ ఉంటే, నీ మూల తత్వ విచార ధారలోకి నా మనస్సు వెళ్ళినప్పుడమ్మాతత్వ విచారే సర్వగతా అసలు నువ్వు శబ్దము కాదు, రూపము కాదు, నామము కాదు అన్నీ నువ్వే సర్వము నీవై తొస్తున్నావు తల్లి అంటారు. అది ఒక్క కావ్య కంఠులు మాత్రమే అనగలిగిన మాట. అంటే మనం కూడా అనేక స్థాయిలు దాటుకుంటూ దాటుకుంటూ వీటన్నింటినీ అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక పరిపూర్ణమైన భావనా స్థితి. ఇక శ్రీ లలితా దేవి ప్రపంచానికి అధిష్టాత అయినటువంటి పరదైవతం. ఈమె, ఈమెను గురించి బ్రహ్మాండంతర్గతమైనటువంటి అంటే బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుల వారు కూర్చొని దీనన్నింటినీ కూడా అమ్మ యొక్క నామాలన్నీ కూడా శక్తి స్వరూపిణి కదా! దానిని మంత్ర తంత్ర యంత్రాత్మకంగా చెప్పారు. లలితా సహస్ర నామం అంటే అది. ప్రపంచంలో మంత్రము, ప్రపంచంలో మంత్రముంది. మంత్రం అంటే ఏమిటి? మనః త్రయతే ఇతి మంత్రః మాట అంటూ అంటూ అంటూ ఉంటే అది మంత్రం అయిపోతుంది. మంత్రానికైనా సరే ఓం చేరిస్తేనే బలం ఉంటుంది. అలాగే యజ్ఞంలో యజ్ఞగుండంలో మనం నెయ్యి వేసినప్పుడు స్వాహా అననేటువంటిది గనక చేయకపోతే అది దేవతలకు చెందదు. అది చేసినప్పుడు స్వాహా అని మంత్ర ప్రారంభ వేళలో ఓంకారం చెప్పాలి. ఎందుకంటే ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ: బ్రహ్మ స్వరూపమే ఓం. అకారోకార మకార యుక్తమగు ఓంకారాభిధానం. అకారం, ఉకారం, మకారం. అకారం అగ్ని బీజం, మకారం చంద్ర బీజం, ఉకారం ఉమా బీజం. ఉమా అంటే మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి స-సర్వ దేవతా సంక్షిప్త స్వరూపం ఏది అంటే అక్షర రూపంలో ఏకం అది ఓం. అది ఒక్కటై ఉన్నది. ఏకము అనేకమై వెళ్ళిపోతున్నది గనుక ఓం అనేటువంటి శబ్దాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే శ్రీ లలితా సహస్ర నామ రహస్యాన్ని, దానికి రహస్యం అని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? పారాయణం చేయటం మాత్రమే కాదు రహస్యం తెలుసుకో, తెలుసుకోవలసినది వెనకాల ఉంది, లోపల ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్తున్నటువంటి ఒక విశేషమైనటువంటి భావన. కాబట్టి లలితా సహస్రనామంలో మొదటి ఐదు నామాలు అమ్మవారి యొక్క అస్తిత్వం, ఆమె ఉనికి, ఆమె శక్తి. ఏది? శ్రీమాత్రి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగిరి పుండ సంభూతా. ఇవి ఉన్నాయి కదా! ఐదు దాటిన తర్వాత డెబ్బై ఒకటవ శ్లోకం వరకు అమ్మవారి యొక్క పరివార వర్ణన. అమ్మవారు, ఆమె గుర్రాలు, ఆమె ఆవరణలు, ఆమె బయటికి రావటాలు, యుద్ధానికి రెడీ అయి రావటాలు ఇదంతా వర్ణన. అసలు శ్రీ లలితా స్తోత్రము, నామము ఎక్కడ ఉన్నది అంటే డెబ్బై ఒకటవ శ్లోకం నుంచి. అక్కడ అమ్మవారు కేవలం శ్రీ లలితాదేవి మాత్రమే కాదు. ఆమె ఎవరు అంటే భువనేశ్వరి. భువనేశ్వరికి ఒక మాట ఉన్నది. ఏంటంటే జగజ్జనా నందకరీం జయాక్షాం యశస్వినీం యంత్ర సుయజ్ఞయోనీం జితా మితా మిత్ర కృత ప్రపంచాం భజామహే శ్రీ భువనేశ్వరీం తామ్. జగత్తుకి, జనానికి ఆనందం కలిగిస్తూ జయరా మంత్రం ఉన్నటువంటి తల్లి, నీవు నిర్మలమైన, విమలమైన, అర్చమైన, స్వచ్ఛమైన, ధవళమైన, పూర్ణమైన వెలుగు పుంతవి నువ్వు. వెలుగు మూలానివి నువ్వు. అట్లాగే యంత్ర సుయజ్ఞయోనీం సమస్త భూమండలం సృష్టిలో నుంచి నువ్వు ఆవిర్భవించావు. నిజానికి నీ నుంచి సృష్టి ఆరంభించబడింది. అలాగే నిన్ను నమ్మి, నిన్ను కొలిచి, తలచి ఉన్నట్లయితే జయించబడినటువంటి మిత్రులు. ఒక మిత్రుణ్ణి జయించటం చాలా కష్టం. శత్రువుని జయించటం చాలా తేలిక. యుక్తి చేత, ఓర్పు చేత, కూర్పు చేత, నేర్పు చేత, మార్పు చేత శత్రువుని జయించవచ్చు. కానీ మిత్రుణ్ణి జయించుకోవటం ఎట్లా? ప్రేమ చేత, సేవ చేత, వాత్సల్యం చేత, అనురాగ్యం చేత, అవ్యాజ కరుణ చేత అట్లా. కాబట్టి నిన్ను తలచుకుంటే జితా మితా మిత్ర కృ-కృత ప్రపంచాం ప్రపంచమంతా నాకు స్నేహమయం అయిపోతుంది. అటువంటి భువనేశ్వరి దేవి నిన్ను భజామహే నిరంతరము స్మరిస్తూ ఉంటాను అని అంటూ రాజరాజార్చితా రాణ్యై రణ్యా రా-రాజీవ లోచనా రంజని రమణి రస్యా రణతింకిణి మేఖలా అన్న ఒక్క శ్లోకం ఆయువు పట్టు లలితా సహస్ర నామంలో. ఇది రెండు వందల యాభై ఆరు సార్లు చదివినట్లయితే తొమ్మిది వందల కోట్ల జపం చేసినటువంటి ఫలితం ఉంటుందని ఇట్ ఈస్ ప్రూవ్డ్. అది చక్కగా నిర్ధారణ అయినటువంటి విషయం. కాబట్టి లలితా దేవి లలితా సహస్ర నామాలన్నింటినీ కూడా అగస్త్యుల వారు మనకి, ప్రపంచానికి అందించారు. అయితే ఇతర భగవత్పాదులు సరస్వతీ స్వరూపం. ఆయన గీతకి భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. అనేకమైనటువంటి వాఙ్మయ మహా సృష్టి చేశారు. కానీ ఆయనలో చిన్న కొరత ఏర్పడింది. ఇన్ని రాశాను, ప్రపంచానికి అందించవలసినటువంటి లలితా సహస్ర నామానికి భాష్యం రాయలేదని అనిపించి, వారు అనుకుంటే ఎంత సేపు? ఒక నిమిషం పని. దానిలో నుంచి సౌందర్యలహరి సృష్టించారు. సౌందర్యలహరిలో మొదటి నలభై ఒక్క శ్లోకాలు ఆనందలహరి. మిగిలినవంతా మంత్ర తంత్ర యంత్రాత్మకమైనటువంటి వ్యాఖ్యానం. దేనికి వ్యాఖ్యానం? వేయి నామాలు ఉన్నటువంటి లలితా సహస్ర నామానికి ఒక సమగ్ర సుందర సంయుక్త వ్యాఖ్యానం అనేది అంటే దాని పేరు సౌందర్యలహరి. దానిలో పదో శ్లోకం, పదహారో శ్లోకం, ముప్పై రెండో శ్లోకం ఇట్లా తొంభై తొమ్మిది వరకు శ్లోకాలన్నింటా ఆయన బీజాక్షరాలన్నీ కూడానిలబెట్టి షోడశి మహా మంత్రాన్ని కూడా నిక్షిప్తం చేసి సౌందర్యలహరి రాశారు. ఇది ఆయన జగత్తుకు చేసినటువంటి మహోపకారం. అయితే ఆధునిక సమకాలీన కాలంలో మహా త్రిపురసుందరి దేవిని బాలగా ఉపాసన చేసినటువంటి మహా మహిమాన్విత స్వరూపం చందోలు రాఘవ నారాయణ శాస్త్రి గారు. వారిని చందోలు శాస్త్రి గారు అంటారు. చందోలు శాస్త్రి గారి ఉపాసనా బలం, దాని యందున్నటువంటి నిజాయితీ ఎంత గొప్పది అంటే ప్రతిరోజూ అభిజిత్ లగ్నంలో పన్నెండు గంటలకు బాలగా ఆయన వాకిట్లోకి వచ్చి ఆమెను ఉంచునేది. "అమ్మా! నిన్ను అందరూ పెద్ద, పెద్ద పేర్లతో పెద్దమ్మ అని వేయి నామాలతో పిలుస్తారు. నువ్వు నాకు ఇట్లా కనిపిస్తున్నావు. నిన్ను చిన్నమ్మ అని పిలవవచ్చునా?" అని అడిగారాయన. "నీ ఇష్టం రా" అన్నది. అటువంటి మహా స్వరూపం. ఎవరు? నాఘ-- రాఘవ నారాయణ శాస్త్రి గారు. ఆయన తన జీవితం యావత్తు కూడా బాలా త్రిపురసుందరి దేవిని ఉపాసన చేసి ఉపాసన వలన ఆయనకి అనేక సిద్ధులు కలిగితే, సిద్ధులన్నీ కూడా ప్రపంచానికి చక్కగా, నిరపేక్షంగా ఆయన వరదానం చేస్తూ వెళ్లారు. ఆయన ఏమీ మిగుల్చుకోలేదు. దానిని, దాని వలన డబ్బు సంపాదించాలని ఆయన అనుకోలేదు. అమ్మ అనుగ్రహమే వచ్చిన తర్వాత ఇంకా కావలసినది ఏమున్నది అనుకున్నారు. అందుకనే కంచి మహాస్వామి వారు కూడా, కంచి దాకా ఎవరన్నా వెళితే "ఎందుకు ఇంత దూరం శ్రమ పడి వస్తారు? పొన్నూరు దగ్గర చందోలు గ్రామంలో నారాయణ శాస్త్రి గారు ఉన్నారు కదా, వారి దర్శనం చేసుకోండి. అది బాలా త్రిపురసుందరి దేవి యొక్క మరొక అంశావతారం. వారి వాకిట్లో ఉన్నటువంటి బావి కాశీలో ప్రవహిస్తున్నటువంటి గంగ పాయ దాంట్లో ఉన్నది. మీరు అక్కడ చేస్తే గంగా స్నానం చేసినట్లే" అని పెద్ద స్వామి వారు చెప్పేవారు. ఎవరు? చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. ప్రియవా అన్నమాట. కాబట్టి అటువంటి మహాత్ముడు తమ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు స్మశానానికి దేహాన్ని తీసుకుని చితి పేర్చి దాని మీద పడుకోబెట్టినప్పుడు చితి అంటించగానే ఆయన వక్ష స్థలంలో నుంచి అమ్మవారు అందరికీ ఆరోజు ఎవరెవరున్నారో వారికి దర్శనమిచ్చింది. ఇదేం పెద్ద కల్పిత కథ కాదు, పాత కథ కాదు. 1985 లో జరిగింది ఇది. అది ఆనాడు ప్రముఖ పత్రికలన్నీ కూడా ప్రకటించినయి. అంటే ఉపాసన అంటే అట్లా తీవ్ర స్థాయిలో చేయాలి. స్వార్థం కోసం, పేరు కోసం, popularity కోసం, identity crisis అనుభవించ like పరిస్థితిలో ఇవన్నీ చేయకూడదు. అవి ఎట్లా చేసినా అవి నామాచారం కిందనే వస్తాయి. సమయాచారం సమున్నతమైనది, ఉత్కృష్టమైనది, సాత్వికమైనది, సులభమైనది, సరళమైనది, ఆనందదాయకమైనది అన్నింటికంటే సాధ్యమైనది. కాబట్టి శ్లోకాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తొమ్మిది రోజులు మనల్ని మనం సమీక్షించుకోవాలి. ఏమాత్రం కొద్దిగా మార్పు మనలో కలిగినా దాన్ని మనం విజయ దశమిగా celebrate చేసుకోవాలి. అంతే. కాబట్టి శరన్నవరాత్రులన్నీ కూడా మనందరికీ కూడా ఆహ్ ఆత్మ విచార మార్గంలోకి, వారన్నారు కదా ఆహ్ "తత్వ విచారే సర్వగతా" అన్నారాయన. సర్వమూ అమ్మవారే ఉన్నటువంటి భావనలోకి రావాలి. ఇప్పటివరకు మనం నామరూపాల వరకే ఆనందపడుతున్నాం. అమ్మవారి అలంకారం ఎంత బాగుందో, ఎన్ని పూలతో చేసామో, ఎంత బంగారం తొడిగామో, ఎంత అద్భుతమైన ముత్యాలు పెట్టామో, ఇవన్నీ కూడా ప్రాపంచికమైన అర్చనా రీతి. అర్చన తర్వాత అమ్మని స్తుతించాలి. స్తుతించినప్పుడు శబ్ద స్వరూపంగా వస్తుంది. పాడాలి, ఆడాలి, కూడాలి ఇవన్నీ కూడా. కాబట్టి నవరాత్రులు అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క అభిన్న, అద్వయ, అద్వైత స్వరూపానికి మనమెత్తేటువంటి నిరాజనం కాబట్టి తొమ్మిది రోజులు రాత్రులన్నీ కూడా పరమాద్భుతంగా సాగినయి. ఇవాళ విజయ దశమి చేసుకోబోతున్నాం. విజయ దశమిలోనే ఉన్నాం. మనం చేసినా, చేయకపోయినా అది విజయ దశమి. విజయ దశమిలో మనం ఇంకా ఉన్నాం. అది మన అదృష్టం. కాబట్టి అమ్మవారికి జయఘేటలు ఎత్తుతూ అమ్మ నిజంగా వాత్సల్య కారిణి, ఆనంద ప్రదాయిని, సకల ఐశ్వర్య ప్రదాయిని, విద్యా ప్రదాయిని, బుద్ధి ప్రదాయిని, సిద్ధి ప్రదాయిని గనుక మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రపంచం అంతా ప్రశాంతి నిలయమై ఎటువంటి అననుకూలాలు లేకుండా, రెండు సంవత్సరాలు సమస్త సృష్టి కల్లోలితమైపోయింది. మానవ సంబంధాలన్నీ పల్చబడిపోయినయి. మనిషికి మరణ భయం పెరిగింది. దేహాత్మ భావన వదిలిపెట్టమనంటే దేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలో దాంట్లో రెండేళ్ళు అందరికీ గడిచిపోయింది. భయం నుంచి నిర్భయ, అభయ స్థితిలోకి అమ్మ మనందరినీ నడిపించాలని చివరగా ఒక్కమాట. పురాణగతమైనటువంటి విచారణ అంతా మనం ఎలా అయితే చేశామో, సాధారణమైన స్థాయిలో విచారణ చేస్తే శక్తులు అన్నింటికీ కలిపి అచ్చ తెలుగు పేరు అమ్మ. మన అమ్మ. అమ్మ లేకపోతే దేహం లేదు. అమ్మ లేకపోతే పాలన లేదు. అమ్మ లేకపోతే పోషణ లేదు. అమ్మ లేకపోతే ఆశీర్వచనం లేదు. అమ్మ లేకపోతే ఏమీ లేదు. కనుక ఇవాళ మాతృ రూపేణ సంస్థిత అంటాం. మనం మిగతా దేవీ దేవతలందరికీ నమస్కరించామో లేదో తల్లి ఉన్నవారందరూ విజయ దశమి నాడు తల్లికి నమస్కరించుకోండి. పాదాభివందనం చేయండి. ఆమెకి ఇవ్వవలసిన సముచిత గౌరవాన్ని, సత్కారాన్ని చేయండి. ఆమెను ఆనంద పరచండి. ఆమె మీ-- మన నుంచి ఏం కోరుకోదు. తల్లి దేహంలో ఉంటే ఇది. దేహంలో లేకపోయినట్లయితే ఆమె ఎంత కష్టపడిందో, స్థితికి రావటానికి ఆమె ఎంత మహత్తర త్యాగం చేసిందో, అనేక శక్తులు మాట్లాడుకున్నాం. శక్తులన్నీ మన అమ్మాయి యందు ఉన్నాయి. ఇల్లు చూసింది, వంశాన్ని చూసింది, కులగోత్రావులను చూసింది.పిల్లలను సమానంగా ప్రేమించింది అందరినీ చక్కగా వృద్ధి లోకొచ్చేట్టుగా చేసింది తన కర్తవ్యాన్ని తాను అవిరామంగా ఎక్కడా rest తీసుకోకుండా చేసింది కనుక కనిపిస్తున్న అమ్మ నిజానికి సకల దేవతా స్వరూపిణిగా నేను భావన చేస్తాను ఎందుకంటే వేదమే చెప్పింది మాతృదేవోభవ దైవము మాతృమూర్తియై ఉన్నది అని అర్థం కాబట్టి విజయదశమి నాడు మనందరం కూడా మన తల్లులకి చక్కగా నమస్కారం చేసుకొని అమ్మల యొక్క ఆశీర్వచనాన్ని అమ్మ అంటే అమ్మలో అయ్య ఉన్నాడు అమ్మ లేదు గనుక అయ్యా అక్కర్లేదు కాదు అమ్మలో అయ్య ఉన్నాడు అయ్యాలో అమ్మ కూడా ఉన్నది గనుక అది ఎప్పుడూ సంపూర్ణమైన నారీ స్వరూపం వర్ధనారీశ్వర స్వరూపం కాబట్టి అనేకమైన వినూత్న భావజాలంతో పరిపూర్ణమైనటువంటి సంతృప్తితో ఆనంద అతిశయ రేఖలతో మన జీవితాలన్నీ పల్లవించు గాక అట్లాగే ప్రపంచం అంతా కూడా విజయోత్సాహంతో దేశం భారతదేశం ఇంకో దేశం మీద ఇంతవరకు యుద్ధం చేయలేదు చరిత్రలో భారతదేశం మీద యుద్ధం చేసిన ఎవరూ గెలవలేదు ఇది రెండవ అర్థం దీనికి శక్తి ఎవరంటే రాజకీయ నాయకుల తెలివితేటలు కాదు దేశానికి అపరాజిత శక్తి ఉన్నది కాబట్టి అందులో కాసేపు మనం ఉంటాం మనం ఏం claim చేయకూడదు అపరాజిత ఓటమి ఎరగనిది ఎప్పుడూ గెలుస్తూనే ఉండేది గనుక అటువంటి భారత ధాత్రికి భారత ధాత్రి కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపిణి కాబట్టి ఆమెకు మరొక్కసారి ప్రణమిల్లుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు విన్నంత తెలుసుకున్నంత ఇప్పటివరకు కన్నంత మీ తర్వాత్తరానికి నెమ్మదిగా కూర్చోబెట్టి దేశ విశిష్టతని పురాణ వాఙ్మయాన్ని సనాతన వైదిక ఆర్షమైన ధర్మాన్ని మనిషి మనిషిగా బతకగలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని వాళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వక్కర్ల ఉద్బోధలు చేయక్కర్ల మనము దానికి అనుగుణంగా గనుక జీవిస్తూ నటిస్తూ నడిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు మనల్ని చూసి చక్కగా నేర్చుకుంటారు నటించకూడదు అనుకరించకూడదు అనుసరించాలి ఎట్లా అయితే ఒక ఆవుని దూడ అనుసరించినట్లుగా మనం కూడా దేశం పరమ పవిత్రమైనటువంటి దేశం దేశం యొక్క చాలులో జాలులో దేశం యొక్క ఛాయలో మనందరి జీవితాలు పరమాద్భుతంగా అలాగే పరమ సృష్టి అంతా కూడా ప్రశాంతకరమై భాసిల్లు గాక అని మంగళాశాసనం చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణిభ్యః శుభమస్తు నిత్యం సమస్త లోకాః సుఖినో భవంతు
YouTube · audio

Shakti Roopini

Home

Shakti Roopini

Source: SATHYA PEETHAM on YouTube

0:00 / 45:55