Skip to content
Transcript తెలుగు
తెలుసుకోవలసిన, అనుకోవలసిన విషయం. అది మౌనము దాని శక్తి. దానికే మౌన శక్తి అని పేరు పెట్టుకున్నాం. మౌన శక్తి మరి మౌన శక్తి అనంగానే శక్తి అనంగానే Energy అని వాడాలి కదా Efficacy అని మనం ఎందుకు వాడాం అని ఎవరైనా కాస్త English వచ్చిన వాళ్ళు సందేహ పడకుండా ముందు విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తాను. Power అనేటువంటిది ఒక consolidated energy. Efficacy అనేది Efficiency కాదు. Efficacy is entirely different. ఏదైనా ఒక desired results అంటే కోరికను సాధించుకోవాలి, లక్ష్యాన్ని సాధించుకోవాలి, గమ్యం చేరుకోవాలి, గురు పాదపద్మాల దగ్గరకు ఎలాగైనా చేరుకోవాలి అని ఒక తీవ్రమైనటువంటి కాంక్ష ఉన్నప్పుడు, దానికై focused గా చేసే ప్రయత్నం పేరే Efficacy అది. Efficacy ని ఒక action లోకి translate చేయటానికి కావలసింది Efficiency. కాబట్టి Efficacy, Efficiency and Power. మూడు నిజానికి మూడు స్థాయిలు అవి. ఇవాళ మనం Efficacy అనే దాన్ని ఎందుకని ఎంచుకున్నాం అంటే మరి Efficacy అనే శక్తి ఎట్లా ఉన్నదీ, ఎలా ఉండాలి? మరి భగవాన్ రమణులు మనందరికీ కూడా లేదా ప్రపంచం మొత్తానికి వారి అధ్యాత్మ [గాలి] విచారధారలో ఒకే ఒక్క లక్ష్యాన్ని తద్వారా సాధించవలసిన గమ్యాన్ని నిర్దేశించారు. అదేమిటంటే ఆత్మ విచార మార్గమే అత్యున్నతమైనటువంటి మార్గము. బంధనాలు లేవు, విగ్రహ పూజలు లేవు, మంత్ర-తంత్ర-యంత్రాలు లేవు. మరి ఏమున్నదయ్యా? ఆత్మ విచార మార్గానికి తొలి మెట్టు ఏమిటి అంటే "నేనెవరు?" అన్న ప్రశ్న వేసుకో అని చెప్పినంత తేలిక కాదది. కానీ, ప్రశ్న ప్రతి వాడి జీవితంలోనూ ఎప్పుడో ఒక్కసారి "నేనెవరు? వృత్తి ఏమిటి? నా ప్రవృత్తి ఏమిటి? చివరికి నాకు మార్గం లభిస్తుంది? ఏదో పుట్టాను. మంచి డిగ్రీలు సంపాదించాను, పాండిత్యం సంపాదించాను. తర్వాత ఏదో రోజున కన్నుమూస్తాను. ఇంతేనా? ఇంతకీ నేనేమిటి? వృత్తిలో ఉన్న నేనా? కుటుంబంలో ఉన్న నేనా? సంసారగతమైన బంధనాల్లో ఉన్నటువంటి నేనా? ఏమీ తెలియకుండానే జీవితాన్ని గడిపిన నేనా? నేను ఎవరు?" అనేటువంటి ప్రశ్నని భగవాన్ రమణులు పదే పదే పదే చెప్పి చివరికి దానిని రమణాస్త్రంగా మార్చారు. రమణులు ప్రయోగించిన అస్త్రం ఏమిటి అంటే, అంటే వారి, వారి దగ్గరకు వచ్చి ఎవరైనా లేనిపోనివి, అక్కరలేనివి, కావలసినవి, సందేహాలు వెలిబుచ్చినప్పుడు, ప్రశ్నలు వేసినప్పుడు చాలా సహనంగా, ఓపికగా జవాబు ఇచ్చేవారు. ఇక ప్రశ్న వేసిన వాడు తికమక పడుతూ, అర్థం చేసుకోలేక, భగవాన్ చెప్పింది అర్థం కాక, తనదైన రీతిలో తాను ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు "అయితే ఇక బ్రహ్మాస్త్రం తీయనా?" అనేవారు. అంటే "నేనెవరు?" అన్న ప్రశ్న వేస్తే ఇహ ప్రశ్న వేసుకుంటూ వాడి దారిన వాడు వెళ్ళిపోతాడు. అది చమత్కారం. అయితే, చూడండి అనేకమంది గురువులు ప్రపంచంలోకి వచ్చారు. ఎలా వచ్చారు? బోధ చేసిన వాళ్ళున్నారు, మంత్రం చెప్పిన వాళ్ళున్నారు, మంచి చెడు చెప్పిన వాళ్ళున్నారు, పని చేయండి, ఇలా చేయకూడదు అని చెప్పిన వాళ్ళున్నారు. కానీ, కేవలము దృష్టి ద్వారా అంటే ఒక కంటి చూపు ద్వారా, అవతల వాడి ప్రశ్నలకి అన్నింటికీ కూడా నోరు మెదపకుండా, ఒక వాక్కు ఒక పలుకు వాడకుండా సమాధానం ఇచ్చి, సమాధాన పరచి, ఆతడిని ఉన్న స్థితి నుంచి మరొక మెట్టు ఎక్కించినటువంటిది భగవాన్ రమణులు చేసినటువంటి అపారమైనటువంటి కరుణా దృష్టి. దానికే మనము వీక్షణ దీక్ష అని పేరు పెట్టుకున్నాం. అంటే కేవలము వారు చూస్తే చాలు. ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి పండితుడు కూడా వారి దగ్గరికి వచ్చినప్పుడు, శివానంద వారి దగ్గరికి వచ్చినప్పుడు, పరమహంస యోగానంద వారి దగ్గరికి వచ్చినప్పుడు, నారాయణ గురువు వచ్చినప్పుడు, పేర్లన్నీ ఎందుకంటే వీళ్ళంతా వారి వారి స్థితులలో ఒక ఉన్నతమైన స్థాయికి చెందినటువంటి గురు స్వరూపాలు వీళ్ళు. అటువంటి వారందరూ కూడా రమణ మహర్షి దగ్గరకు వచ్చి, ఏమీ ప్రశ్నోత్తరాలు లేవక్కడ. ఉపన్యాసాలు లేవు, ప్రవచనాలు లేవు, సందేహాలకి సమాధానాలు లేవు. మరి ఏమున్నది అంటే ఘనీభవించినటువంటి మౌనాకృతి ఎవరు అంటే భగవాన్ రమణులు. మౌనంలో నుంచి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక తరంగాలు వారి వారి, అంటే ఎదురుగా కూర్చున్న వారి వారి స్థాయిని బట్టి, ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి తరంగాలు వారి యందు ప్రవేశించి ప్రశ్న అడగటానికి ముందే సమాధానం దొరికి ఆనందపడిపోయేవారు. అంటే, భారతీయ అధ్యాత్మ చరిత్రలో ముగ్గురే ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు ఇట్లా చేసినవారు. ముగ్గురు ఎవరో ముందు ఒక్కసారి స్మరించుకొని మనం మౌనంలోకి వెళ్దాం. అంటే మాట్లాడకుండా ఉండటం కాదు. అసలు మౌనం గురించి మాట్లాడటమే ఒక విచిత్రం. మౌనం గురించి మాట్లాడకూడదు కదా! మాట్లాడకుండా ఉండటమే మౌనమని కదా! ఇంతకీ ముగ్గురు ఎవరు అంటే...మొట్టమొదట పౌరాణిక వాఙ్మయము శంకర వాఙ్మయం ప్రకారంగా తొట్ట తొలి నోరు విప్పని, పలుకే పలకని, రకమైనటువంటి భాషని వాడని, ఎవరితోనూ సంభాషించని, స్వరూపం ఏందంటే శ్రీ దక్షిణామూర్తి స్వరూపం. "మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం" అంటూ దక్షిణామూర్తి స్తోత్రానికి వారు చెప్పారు. అంటే వారు మౌన వ్యాఖ్య చేశారట. వ్యాఖ్య చేయాలంటే ఇదిగో మాటలు కావాలి కదా! సద్గురువు అయినటువంటి వాడు, మౌనం యొక్క అంశులు తెలిసిన వాడు, లోతులు ఎరిగిన వాడు, మౌనాన్ని ఎక్కడ ఆపాలో, మౌనాన్ని ఏం చేయాలో పూర్తిగా తెలిసిన వాడు, దానిమీద ఒక సాధికారత ఉన్నటువంటి వాడు మొట్టమొదటి వాడు ఎవరు అంటే దక్షిణామూర్తి. వారిని మౌన స్వరూపంగా మనం భావిస్తాం. ఇక రెండవ వారు అంటే పౌరాణిక వాఙ్మయము శంకర కాలము దాటి ఆధునిక కాలంలోకి సమకాలీనంగా గనక వచ్చినట్లయితే కేవలం మౌనం ద్వారా సందేహాలను పటాపంచలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి అవతార స్వరూపం ఏందంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఇది నిస్సందేహంగా. అలాగే సుమారు ఎనభై ఆరు సంవత్సరాల అవనీ సంచారంలో చివరి ఎనిమిదేళ్ళు కేవల మౌన భూమికలో నిలకడ చెంది, అంతకుముందు డెభై ఎనిమిదేళ్లుగా చేయని పనులన్నీ కూడా కేవలము మౌనం ద్వారా, సౌజన్యం ద్వారా, చూపు ద్వారా, క్రీగంట చూస్తూనే ప్రపంచాన్ని పరమాద్భుతమైన ఆధ్యాత్మిక శక్తిలోకి నడిపించిన వారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు. అది చివరి ఎనిమిదేళ్ళు. 2003 నుంచి 2011 వరకు. వారెవ్వరితో మాట్లాడలా. మౌనాన్ని, మౌనాన్ని ఆయన ఆశ్రయించలేదు, మౌనం ఆయన్ని ఆశ్రయించింది. అంటే ఒక ఆత్మ శక్తి దక్షిణామూర్తి కానీ, భగవాన్ శ్రీ రమణులు గాని, భగవాన్ సత్య సాయిబాబా వారు గాని వారి యందు శక్తి ఉన్నది అంటే అణిమాది సిద్ధులున్నాయి, అనేక దర్శనాలున్నాయి, అనేకమైనటువంటి మహిమా స్వరూపాలున్నాయి. ఇవన్నీ మనం చెప్తాం. కానీ వారు ప్రపంచంలోకి వచ్చి ప్రపంచంలో ప్రదర్శించిన శక్తి ఏది అంటే ఆత్మ శక్తి. ఆత్మకు ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మాట్లాడకుండా ఉన్న ఎనిమిదేళ్ళు బాబా గారైతే, జీవితంలో సుమారు తొంభై ఎనిమిది percent మౌనం వహించినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి అయితే, అసలు నూటికి నూరుపాళ్ళు మౌనమే సాకారమైనటువంటి దక్షిణామూర్తి. ముగ్గురినీ కూడా మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. మిగతా వారంతా వారి వారి దారిలో, వారి పంథాలో వారు ప్రపంచానికి మహోపకారం చేశారు. ఉపన్యాసం ఇచ్చే ఆయన ఉపన్యాసం ఇవ్వాలి, ప్రవచనం చేసే ఆయన ప్రవచనం చేయాలి, వ్యాఖ్యానం చేసేవారు వ్యాఖ్యానం చేయాలి. లేకపోతే విషయాలు ఎలా తెలుస్తాయి? అందరూ మౌనంలో ఉండలేరు కదా! మౌనాన్ని అర్థం చేసుకోలేరు కదా! సౌజ్ఞాపూర్వకమైనటువంటి ఒక సాంకేతికమైన విధానంలో అధ్యాత్మ అసలే అంతు పట్టదు కదా! కానీ ముగ్గురు మాత్రం, అంటే మూడు స్వరూపాలు. ఊరికే అకాడమిక్ గా ముగ్గురు ముగ్గురు అంటాం. ఉన్నదంతా ఒక్కటే. అది అఖండము, అనంతము, అవ్యయము, అచ్యుతము అయినటువంటి ఆత్మే గనుక అఖండ చిద్ఘన స్వరూపమైనటువంటి ఆత్మ స్వరూపులైనటువంటి భగవాన్ రమణులు మౌనాన్ని ఎలా ప్రయోగించారు లే-లేదా ఉపయోగించారు, వినియోగించారు, వితరణ చేశారు, అనుగ్రహించారు. ఇవన్నీ ముందు మౌనాన్ని గురించి తెలుసుకుని తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా మౌనం అంటే ఏమిటి? రెండు మౌనాలు. ఒక మౌనం ఏమిటంటే మాట్లాడకుండా ఉండటం. మాట్లాడకుండా మనం కూడా ఉంటాం. ఎప్పుడు ఉంటామంటే రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ తెల్లవారు నిద్ర లేచే వరకు మనమేం మాట్లాడం. ఇది సత్యం. కానీ వాచా మౌనం ఉండదు కానీ మనస్సు మాత్రం మాట్లాడుతూనే ఉంటుంది తెల్లవార్లూ. నిన్నటిది, మొన్నటిది, ముప్పై ఏళ్ళది, నలభై ఏళ్ళది, రాబోయేది, జరిగింది, జరుగుతున్నది, జరగబోతున్నది వాటన్నింటినీ కూడా మనస్సు విశ్లేషించుకొని తాను ఆవాహన చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పాత్రలతో, వ్యక్తులతో, సందర్భాలతో, సంఘటనలతో, సన్నివేశాలతో మమేకమై మనస్సు మాట్లాడుతూ ఉంటుంది మౌనంగా, నిస్వనంగా, నిశ్శబ్దంగా. కానీ మాటలు ఆగలా. చూశారా! ఇక రెండవ మౌనం వాచా మౌనం. మనం సాధారణంగా వింటూ ఉంటాం. మామూలు ఒక ప్రాథమిక స్థాయికి చెందినటువంటి వారందరూ కూడా "ఇవాళ మే గురువారం అండి, మేము మౌనంలో ఉన్నాము" అంటారు. మౌనం దీక్షా మౌనం మాత్రమే. ఒక్కరోజు కొన్ని గంటలు మౌనం వహిస్తారు, తర్వాత మామూలు అయిపోతారు. దానివలన ప్రయోజనం ఉన్నదా అంటే ఏదో మనం కూడా ఒక వ్రతంలో ఉన్నాం గా, ఒక దీక్షలో ఉన్నాం కదా, కనీసం ఇది కూడా అయినా చేస్తున్నాం గా అనే సంతృప్తే తప్ప దానివలన ప్రయోజనం సున్నా. ఏం లేదు. ఇక రెండవ మౌనం ఏమిటంటే జాగ్రదవస్థలో ఉంటూనే, ప్రపంచంలో అనేక కార్యకలాపాలలో పాల్గొంటూనే, మనస్సుని ఒకవైపు వాటియందు ప్రవేశపెడుతూనే ఒక పారుశ్వమైనటువంటి మనస్సుని మౌన భూమికలో నిలకడ చెందించటం అది సర్వోత్తమమైనటువంటి మౌనభూమిక. అది రమణ మహర్షి భగవాన్ జీవితంలో వారు చేసింది అంతే. ఆశ్రమంలో ఉన్నారు.అనేకమైన పనులు చేశారు, చేయించారు. వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కానీ ఒక పారశ్రంలో వారు ఎక్కడ ఉన్నారంటే మౌనంలోనే ఉన్నారు. మౌన భూమిక రెండవ స్థాయికి చెందినటువంటి మౌన భూమికలో వారు ఉండి, మౌనం ఎటు నుంచి వస్తుంది? మౌనాన్ని మనకు అనుగ్రహించేటువంటి అంగము ఏది లోపల? బుద్ధా? చిత్తమా? అహంకారమా? ఆత్మ? లేదు వెనక్కి వెళితే కనబడుతున్న స్థూల శరీరమా? నిద్రావస్థలో ఉన్న సూక్ష్మ శరీరమా? రెండు దాటిన కారణ మహాకారణ శరీరాదా? ఏమిటి అని ప్రశ్న వేసుకున్నప్పుడు మౌనానికి మూలము, మౌనానికి అంత్యము ఏది అంటే మన మనస్సే అవుతున్నది. మనస్సు అంటే ఆలోచనల సమూహము లేదా ఆలోచనల పుట్ట. ఒక్క ఆలోచన కూడా మనస్సే. అలాగే అదే ఆలోచనమను అనేకసార్లు పునః పునః అనుకుంటూ అనుకుంటూ ఉంటే, మననా త్రయతే ఇతి మంత్రాః అదే ఆలోచన అనుకోగా, అనుకోగా, అనుకోగా అది మంత్రం అయిపోతున్నది. బలాన్ని పుంజుకుంటున్నది. అంటే మనలో ఉన్నటువంటి అనేకమైన చిత్తవృత్తులు, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మూల వాసనలు, వాసనలు tendencies and treats ఇవన్నీ కూడా మన ఆ-ఆలోచనని ప్రభావితం చేస్తూ, ఆలోచనలన్నింటినీ కూడా ఒక చోటికి తెచ్చి దానికి మనస్సు అని మనం పేరు పెట్టుకున్నాం. మనస్సు ఏం చేస్తుందయ్యా అంటే ఇంద్రియాలను శాసిస్తూ ఉంటుంది. అదిగో బొమ్మ చూడు, ఇదిగో పాట విను, అదిగో మంచి పరిమళం వస్తున్నది దానిని ఆస్వాదించు, ఇదిగో చాలా సుతిమెత్తగా ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ఒక పువ్వు దానిని రేకని తాకు అని స్పర్శ, రస, గంధాదులన్నింటినీ కూడా పరిచయం చేస్తూ అంటే ఐదు కర్మేంద్రియాలని, ఐదు జ్ఞానేంద్రియాలని నడిపించేటువంటి ప్రధానమైన మూలకమైన చోదక శక్తి ఏది అంటే అది మన మనస్సు అవుతున్నది. మరి మనస్సు దానంతట అదే పని చేస్తున్నదా? మన ఆలోచనలో నుంచి పుట్టింది, ఆలోచనలన్నీ కలిపితే మనస్సు అని మనం అనుకుంటున్నాం కదా! మరి ఆలోచన ఎక్కడి నుంచి పుడుతున్నది? అది కూడా ఆలోచించాలి. అంటే మూలంలోకి వెళ్ళాలి. భగవాన్ విచారణా మార్గం అంతా కూడా మూలంలోకి వెళ్ళటమే. ఆలోచన ఎక్కడ కలుగుతున్నది, ఎట్లా పుడుతున్నది, ఎక్కడ పుడుతున్నది అంటే మన యందే పుడుతున్నది. మన ఊహ యందు, మన భావన యందు, మన భావము నందు, మన తలపు నందు, మన సంకల్ప వికల్పాల నుండి అన్నింటిని నుండి కూడా ఇది ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఆలోచనలన్నీ కలిసి మౌనం అవుతున్నాయి. మనస్సు అవుతున్నది. మనస్సు మాట్లాడుతోంది, పాడుతోంది, అరుస్తోంది, కాసేపు ఆగుతున్నది, పరిగెత్తుతున్నది, పరిగెత్తిస్తున్నది, అలసి పోతున్నది. అన్నీ జరుగుతున్నాయి. కానీ దానికి కూడా ఒక స్ప్రుహ ఉన్నది. ఏమిటి అంటే ఎంతకాలం మాట్లాడ్డం? ఎంతకాలం పని చేయటం? ఎంతకాలం ప్రశ్నోత్తరాలకు జవాబులిస్తూ ఉండటం? మౌనం వహిస్తే ఎంత బాగుండును అని మనస్సు కనిపిస్తుంది. అది దానికే వేళ మనం మానసిక మౌనము అని పేరు పెట్టుకున్నాం. వాచా మౌనం వేరు, మానసిక మౌనం వేరు, ప్రాపంచికమైనటువంటి మౌనం వేరు, పరాప్రకృతులను దాటినటువంటి అలౌకికమైన ఆనంద తారక స్థితిలో నెలకని చెందే మౌనం వేరు. కాబట్టి మౌనము యొక్క శక్తి, దాని efficacy మనకి ఏమిటి అంటే అదంతా కూడా మన జీవన విధానాన్ని శాసించేటువంటిది. కనుక భగవాన్ అనేకసార్లు, అనేకసార్లు వారిని ఎంతోమంది ఎన్నో రకాల ప్రశ్నలు వేసినా, "ఉపదేశం ఏదన్నా ఇవ్వండి, మాకు ఏదన్నా మంచి మాట ఒకటి చెప్పండి మాకు అధ్యాత్మ సాధనకి" అంటే వారు చెప్పింది ఒక్కటే, "ఏమీ లేదు, ఉరకుండండి." ఉరికే ఉండండి అంతే. ఉరికే ఉన్-ఉందామని ఉంటుంది మనకి. ఉండనివ్వనిది ఏందంటే మనస్సు కాబట్టి. వాచా మౌనాన్ని దాటి, దీక్షా మౌనాన్ని దాటి, మౌనాన్ని గనక మనం నిజంగా అనుభవించటం మొదలు పెట్టినట్లయితే, ఏది నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో జాగ్రదావస్థలో కూడా మనం గనక అలా ఉండగలిగినట్లయితే మౌనం మహా శక్తివంతమైనది. అది ఒక thousand turbines ఇచ్చే శక్తిని మనకిస్తుంది అది. మౌనంలో నుంచి శుద్ధ వాక్కు బయటికి వస్తుంది. వాక్ శుద్ధి, వాక్ సిద్ధి, వాక్పటుత్వము మూడు ఏర్పడతాయి. వాక్కు పుట్టాలి అంటే మళ్ళీ ఆలోచన కలగాలి. ఆలోచన కలగాలి అంటే మన మూల వాసనలలోకి వెళ్ళాలి. మూల వాసనలు మన సంస్కారంలో నుంచి వచ్చినయి. సంస్కారాలన్నీ కూడా సంస్కృతి వలన ప్రభావితమైనయి. రెండూ దాటి అనేక జన్మలు, అక్కడ చేసిన కర్మలు, దాని నుంచి ఏర్పడినటువంటి వాసనల అన్నింట్లలో నుంచి ఒక ఆలోచన, అది positive thought or negative thought ఏదన్నా కానివ్వండి. ప్రతికూల, అనుకూల భావాలు మన యందు కలిగితే ఆలోచనను గనక మనం పట్టుకోగలిగితే, ఒకే ఆలోచనతో మనం నెలకడ చెంది ఉండగలిగినట్లయితే efficacy of silenceని మనం experience చేయగలం. మిగతాదింత power అంతా మనం వాడుకోవటమే. అది వాడుకునే విధానం. అది activity. ఇక్కడ efficacyకి activity లేదు. లక్ష్యగమ్యాలలో మనల్ని స్పష్టంగా నడిపించేటువంటి ఒక ఆంతరంగికమైనటువంటి ఒక శక్తి ఏదైతే ఉన్నదో అది మౌన శక్తిగా మనం ఈవేళ భావన చేయాలి. ఉదాహరణకిమనసు ఉండనే ఉంది ఎందుకంటే మనసు లేని మనం లేనే లేము. ఏం చేయాలన్నా మనసు కావాలి. మంచికి మనసు కావాలి చెడుకి మనసు కావాలి. అసలు మానవుడు ఎవరు అని గనక మనల్ని ప్రశ్నిస్తే మనోమయుడు మాత్రమే మానవుడు. అసలు మనస్సంటూ ఉందని, దానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయని, దీనిని ఇలా వాడుకోవాలని, మనస్సు అప్పుడప్పుడు బాధ పడుతుందని, మనస్సు ఆనందతాండవం చేస్తుందని, ఇవన్నీ అభివ్యక్తం చేసే వాడు బయటకు చెప్పగలిగిన జాతి ఏదంటే కేవలం మనుష్య జాతి మాత్రమే. మిగతా పశువుల అన్నింటికీ కూడా బాధ ఉంటుంది. బాధ, భయము ఉంటుంది. రెండూ ఉంటాయి కానీ అభివ్యక్తి చేయలేవు. బయటకు చెప్పలేవు. మౌనంగా రోదిస్తాయి, అనుభవిస్తాయి అని మనం చూస్తూ ఉంటాం. కానీ మానవుడు మౌనంగా రోదించలేడు. రోదించటానికి కూడా ఒక రాగం కావాలి. చూశారా! కాబట్టి అభివ్యక్తి కూడా కేవలం మానవుడికిందే. Man is endowed with the power of reasoning and discretion. ఇవి రెండూ దేనివల్ల నడుస్తాయి అంటే మన మనస్సు యొక్క స్థితిని బట్టి. కాబట్టి మౌనంలోకి వెళ్ళాలి, మౌనం అంటే ఏమిటో తెలుసుకోవాలి, అది మనకు ఎందుకు అవసరమని తెలుసుకునే లోగా మనం చేయవలసిన పని ఏంటంటే మన మనస్సు ఏమిటో మనం తెలుసుకొని ఉండాలి. మన మనస్సు భయభ్రాంతమైనప్పుడు గుడికి పరిగెత్తుతాం, గురువుగారి దగ్గరికి పరిగెత్తుతాం. లేకపోతే ఇంకెవరో మహాపురుడి దగ్గరికి వెళ్తాం. మన గోడు వెళ్లబోసుకుంటాం. ఆయన "వద్దులే మంచి కాలం వస్తుందిలే జాగ్రత్తగా ఉండు" అంటాడు. ఆయన దారి ఆయన్నే, మన దారి మనదే. కానీ అధ్యాత్మ సాధనలో, రమణ మార్గంలో దీనికి తావు లేదు. నీ లోపల ఉన్నటువంటి సంస్కారాలని, నీ వాసనలని, మూలవాసనలని, నీ ఆలోచనలను, నీ భావనా పరిధిని, భావస్థితిని, మనస్సు యొక్క సంకల్ప వికల్పాల మధ్య తారాడు పారాడేటువంటి శక్తిని, దీనినంతా కూడా నీ అంతట నీవే గమనించుకోవాలి ఇది. నీ అంతట నీవే గమనించుకోవటమే నిజమైన సాధన. మన అంతట మనం ఎప్పుడు చేస్తాం అంటే మనకు ఆనందం కావాలి అంటే మనసుకు కారణం తెలియాలి. దుఃఖం కలుగుతున్నది అంటే మనసుకు కారణం తెలుసు. కాబట్టి తెలియని దానికి కారణం ఎరగాలి. తెలిసిన దాని కారణాన్ని వినిర్మూలనం చేయాలి. మనస్సుని మన అధీనం చేసుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సు మన చేత ఉంటుందో మౌనంలోకి వెళ్లటం చాలా తేలిక. లేదా It's vice versa. మౌనంలో గనక మనం ఉండగలిగినట్లయితే మౌనం ఏమిటో ఇప్పుడు అర్థం చేసుకుని మనం కాస్త మౌనంగా అంటే మౌనం ఎంత? అది ఏమన్నా మైళ్ళు బ్యా-బ్యాండ్విడ్త్ ఉన్నదా? లీనియర్ గా ఉందా? హారిజాంటల్ గా ఉందా? ఎట్లా ఉంది? వర్టికల్ గా ఉందా? మల్టీ డైమెన్షనల్ గా ఉందా? అంటే ఇక్కడ ఆగి మనం ఒక్కసారి మౌనాన్ని గురించి కాస్త తీవ్ర విచారణ చేయాలి. ముందు మౌనము అంటే ఏమిటో తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనం పాటించవలసింది నిజానికి వాచామౌనమే. మనకి మౌనం అంటే మా-మాటలు ఆగిపోవడం మౌనం అనుకుంటాం. మాటలే కాదు తలపులు ఆగాలి. తలపుల పుట్టుకలన్నీ కూడా మనస్సు కాబట్టి మనస్సుని ఆపాలి. మనస్సును నియంత్రించాలి. నియంత్రించబడినటువంటి మనసుతో జీవించటం మొదలు పెట్టాలి. దాంట్లో ఆలోచనకి ఆలోచనకి మధ్య ఒక విరామ కాలం ఉంటుంది. ఒక ఆలోచన పుట్టి అది మనలో నిలకడ చెంది మరొక ఆలోచన పుట్టటానికి విరామ కాలం అంటాం. అది ఎంత ఉంటుంది అంటే ఇంట్రా మాలిక్యులార్ స్పేస్ ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే ఒక సెకనులో లక్షోవంతు ఉంటుంది. ఎందుకంటే అరవై వేల ఆలోచనలు పుట్టించగలదు ఒక నిమిషానికి మన బ్రెయిన్. కాబట్టి దాన్ని బట్టి ఆలోచిస్తే ఒక్క సెకనులో లక్షోవంతులో ఉన్నటువంటి దాన్ని, సూక్ష్మంగా ఉన్న దాన్ని గనక పట్టుకోగలిగితే ఒక ఆలోచన రాగానే రెండవ ఆలోచన పుట్టే లోగా మనం గనక మొదటి ఆలోచన దగ్గరే ఆగి మనస్సుని ఆపగలిగితే క్షణం మౌనం పుడుతుంది. మౌనం మన యందు ఏర్పడుతుంది. మౌనం, "నేను పన్నెండు గంటలు మౌనంలో ఉన్నాను" వృథా. "నేను ఎనిమిది గంటలు ఇవాళ మౌనం సాధించాను" వృథా. ఏం చేయాలంటే ముందు humble beginning. సాధనలో మౌనాన్ని మనం ఆశ్రయించాలి. చూడండి ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి కాలం అది చాలా సూక్ష్మమైనటువంటిది. Subtlest of the subtle అంటాం. గ్రాస్ గా ఎలా చేయాలంటే పనికి పనికి మధ్య ఉన్నటువంటి విరామ కాలం. పొద్దున ఒక పని చేస్తూ ఏదో ఆర్టికల్ రాసుకుంటూ కూర్చున్నాం. అది అయిపోయింది. రెండో పని ఇంకేదో ఎదురు చూస్తున్నది. పనికి పనికి మధ్య ఉన్నటువంటి కాలంలో మాట్లాడటానికి ఏం లేదు. చేయవలసింది మాత్రమే ఉన్నది. కాబట్టి క్షణాలను గనక ఒడిసి పట్టుకొని వాటితో గనక నిలకడ చెంది ఉండగలిగితే మనకి మౌనం యొక్క అర్థం తెలుస్తుంది. మౌనం అంటే ఏమిటంటే, this is in fact an internal resonance అది. మనం మనసు గురించి మాట్లాడుకున్నాం, బుద్ధి చిత్తు అహంకారాల గురించి మాట్లాడుకున్నాం, వాసనలు, మూలవాసనలు మాట్లాడుకున్నాం, సంస్కారాలు, సంస్కృతులు మాట్లాడుకున్నాం, జన్మలు, కర్మలు మాట్లాడుకున్నాం. వీటన్నింటికంటే అతీతమైనటువంటి ఒకానొక వస్తువు మన యందున్నది. దాని resonaceే మౌనం. ఏమిటా వస్తువు అంటే దాని పేరు సద్వస్తువు, ఆత్మ. Atma is like a battery in a watch. అది ఏం కదలదు. It is ever charged as long as it is not discharged.కాబట్టి ఉన్న తన చుట్టూ ఉన్న వాటన్నింటిని మూడు ముళ్ళని కదిలించినట్లుగా ఆత్మ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో ఇక్కడ ది పవర్ అక్కడ efficacy లేదు There we have to use the power of the self అనమాట. power of the self ఏం చేస్తుందంటే మనస్సుని trigger చేస్తుంది. ఒక వీణ మీద ఉన్నటువంటి ఒక తీగని ఒక్కసారి మీటగానే ఒక నాదము, ఒక స్వరము, ఒక సంగీతం ఎలా పుడుతూ ఉన్నదో అట్లాగే ఆత్మ ఒక్కసారి దాన్ని trigger చేయగానే మనస్సు పనిచేయటం ప్రారంభిస్తుంది. మనసుకు పనేముంది? ప్రత్యేకమైన పని, దానికి పని లేదు. అదేం చేస్తుందంటే ప్రకంపనాలు, emanations and vibrations ఏవైతే ఉన్నాయో వాటిని ఇంద్రియాలకు పంపిస్తుంది. ఉదాహరణకి ఇక్కడ మీరందరూ వినాలి అని కూర్చున్నారు. చెప్పాలి అని నేను కూడా కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నా యందు ఉన్నటువంటి ఆత్మ నా మనస్సును trigger చేయగానే నాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు, భావాలు, భాష, చెప్పాలి అనేటువంటి ఒక structure ఇదంతా కూడా దానంతట అది ఏర్పడిపోతున్నది. అంటే, అంటే ఆత్మ కదిలించి వదిలిపెట్టింది, కదిలిస్తూ నడిపిస్తూ ఉన్నది మనస్సు ప్లస్ ఇంద్రియాలు. ఐదు కర్మేంద్రియాలు ప్లస్ ఐదు జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు ఏకాదశ రుద్రం అంటే అదే. రుద్రము అంటే ఇంద్రియమే రుద్రం. రుద్రాలన్నీ కూడా ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నప్పుడు నేను మాట్లాడాను, నేను బొమ్మ గీశాను, నేను విన్నాను అని మనం అంటాం. వింటున్నటువంటి వారి ఆత్మ కూడా వారి మనస్సును trigger చేసింది గనుక ఒక్క శ్రవణేంద్రియానికి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. అది వినాలి, విన్నదాన్ని absorb చేసుకోవాలి, శ్రవణ, మనన, నిధిధ్యాసనలు చేసుకొని దానినే మననం చేస్తూ ఒక ఆనందాన్ని అనుభవించాలి అని వింటున్నవాడు ఆత్మ స్వరూపుడై వింటూ ఉన్నాడు. అంటున్నవాడు ఆత్మ స్వరూపుడే, వింటున్నవాడు ఆత్మ స్వరూపుడే. వింటున్న, అంటున్న దానికి కారణమైన మూలం ఏదంటే మనస్సు కాదు, ఆత్మ. ఆత్మ పని ఏమిటంటే నువ్వు విన్నావా లేదా, నీకు అర్థమైందా కాదా, అది ఆత్మ పని కాదు. ఆత్మ పని విను అని చెప్తుంది. అను అని నా ఓటి వాడికి చెప్తుంది. కాబట్టి వానిద్దరం ఆత్మకు బద్ధులమే గాని మనసుకు బద్ధులం కాదు, బందీలం కూడా కాదు. కాబట్టి మనస్-- మనం చెప్పుకునే ఈ, మౌన భూమికలో మనస్సు ఎలా పనిచేస్తుంది దీన్ని మనం విచారణ చేయాలి. ఇప్పుడు మనందరికీ మౌనం అంటే a small component gross level లో పనికి, పనికి మధ్య ఉన్న విరామ కాలం. Subtle గా ఉంటే ఆలోచనకి, ఆలోచనకి మధ్య ఉన్న విరామ కాలం. అలాగే అవస్థకి, అవస్థకి మధ్య ఉన్న transition time. పడుకున్నాము, నిద్రలోకి వెళ్ళాలి అంటే జాగ్రదవస్థ నుంచి నిద్రలోకి వెళ్ళాలి. అక్కడ ఏం మాట్లాడేవాడే లేడు. ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఎవరికి వాళ్ళు నిద్రపోతున్నారు ఇంకా. మనమే పడుకోవాలి. కాబట్టి అక్కడ ఏర్పడినటువంటి కాలంలో మనం ఎవ్వరితోనూ మాట్లాడటంలే. వాచా మౌనం లేదు. నిజానికి మానసిక మౌనమూ లేదు. మౌన భూమికలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఎక్కడ? సూక్ష్మ శరీరంతో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ తలవారుతున్నదే, అయ్యో! రేపు చేయవలసిన పనులు to do, not to do మన దగ్గర list ఉందే అని ఎప్పుడైతే ఆత్మ ఒక trigger చేస్తుందో మనస్సు వెంటనే ఇంద్రియాలను మేల్కొలుపుతుంది. మనం మేల్కోవటం అంటే మన మనస్సు మేల్కొనటం. మనం మేల్కొనటం అంటే మన ఇంద్రియాలన్నీ కూడా activate అవ్వటం. ఒక సుషుప్తి అవస్థలో, ఒక నిద్రావస్థలో ఉన్నటువంటి వాణ్ణి జాగృతం చేయటం, activate చేయటం, actualize చేయటం. కాబట్టి దీని అన్నింటికీ కూడా, ఇవన్నీ జరగాలి అంటే ఆత్మ శక్తి ఎలాగూ ఉన్నది. కానీ ఆత్మ శక్తిని నెలకడగా, నిబ్బరంగా, నిర్దుష్టంగా ఉంచుకోవాలి అంటే ఏది, దేని ద్వారా దాన్ని అట్లా పెట్టుకోగలము అంటే, చూడండి battery charging ఉంది కదా. power లో పెట్టగానే charging అయిపోతుంది battery. అలాగే ఆత్మ తన కొంత శక్తిని ఇంద్రియాలకి, మనసుకి ఇచ్చి కార్యకలాపాల్లో జీవుడు తన వ్యాపారం, అంటే తన పని తాను చేస్తున్నప్పుడు ఆత్మ కొంత శక్తిని spend చేసింది, expend చేసింది. మరి దాన్ని మళ్ళీ మనం reimburse చేయాలి. ఎలా చేయాలి అంటే మాటల ద్వారా కాదు, చేతల ద్వారా కాదు. కేవలము మానసికమైన మౌన భూమికలో మన ఇంద్రియాలన్నీ గనక తాబేలు తన ఇంద్రియాలను ముడుచుకొని ఒట్టి దొప్ప మాత్రమే పైకి కనిపిస్తున్నట్లు ఎట్లా ఉన్నదో, దేహము లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు కూడా అలా ఉండగలిగినట్లయితే ఇంద్రియాలన్నీ కూడా అణగి, మణగి, నిగ్రహంతో ప్రసన్నంగా, ప్రశాంతంగా ఉన్నటువంటి వేళ మనం మౌనాన్ని అనుభవించగలుగుతాం. చూడండి ఇప్పుడు పొద్దున్నుంచి రాత్రి పది గంటల దాకా చెప్పేవాళ్ళం చెప్తూనే ఉన్నాం, వినే వాళ్ళు ఎన్నో వింటున్నారు. వాళ్ళు ఎన్నో అంటున్నారు. అనటము, వినటం అనేటువంటి కార్యకలాపం అంతా కూడా మన energy ని drain చేసేస్తుంది. వినటం కూడా చాలా, అనటం తేలికే గాని వినటమే కష్టం. శ్రవణం చాలా కష్టం. దానికి చిత్త ఏకాగ్ర స్థితి, మూలాగ్ర స్థితి అనేకమైనటువంటివి ఏకాగ్ర స్థితులన్నీ ఉంటేనే విషయం అర్థమవుతుంది. లేకపోతే they go above the head అంటాం. అది వింటా వెళ్ళిపోతుంది. ఏం చేశారంటే, బాగా చెప్పారంటారు. ఏం చెప్పారయ్యా? ఏదో చెప్పారు గాని బాగా చెప్పారంటారు. కాదు. చిత్త ఏకాగ్ర స్థితిని సాధించటానికి మౌనం, మనం మౌనాన్ని ఆశ్రయించాలి. భగవాన్ రమణులు మౌనాన్ని ఎలా అనుభవించారోఎలా అనుభవంలోకి మన బోటి వారికి తెచ్చారో దాన్ని కాస్త విచారణ చేద్దాం. వారు ఏమీ లేదు ఉరికే ఉండండి అని మామూలు మాటగా చెప్పినా దానిలో ఇప్పటిదాకా చెప్పుకున్న సమస్తమైన సాధనా కార్యక్రమం ఇమిడి ఉంది. మనం ఏమీ లేదు అంటే బతకలేం. మనకు అన్నీ కావాలి. ఉన్నవి చాలవు. చూశారా! వస్తువులన్నీ పోగు చేస్తూనే ఉంటాం. ఎందుకు అంటే ఏమో ఎప్పటికైనా అవసరమేమో అని. ఎప్పటికైనా అవసరం అంటే మన అహంకారం వల్ల మనం శాశ్వతులమని, మనం ఇంకో పదేళ్ల తర్వాత ఇది ఉపయోగిస్తుందని పోగు చేస్తాం. ఒక నిత్య వైరాగ్య వైభోగంలో ఉండేటువంటి మహర్షి వంటి మహాత్ములు, అవతారమూర్తులు, జ్ఞాన స్వరూపులు మరుక్షణాన్ని గురించి కూడా వారు ఆలోచించరు. మరుక్షణ రాబోయే మరుక్షణాన్ని గురించి వారికి స్పురణ ఎట్లా ఉండదో జరిగిపోయిన దానిని గురించి కూడా వారికి విచారం ఉండదు. మరి దేని యందు ఉంటుంది అంటే లిప్త కాలమైన వర్తమానం మీద మాత్రమే వారి మనస్సు ఉంటుంది. వర్తమానమైనటువంటి లిప్త కాలం అంటే just a fraction of second అది వాళ్ళు జీవితంగా భావిస్తారు. అది ఒక బిందువుగా ఉంటుంది. Just like a dot. dot అనే పరిధిలో అనేక కార్యకలాపాలు మనం చాలా చేశాం అనుకుంటాం. మనం చేసేదానికంటే కొన్ని లక్షల రెట్లు వాళ్ళు బిందు పరిధిలోనే చేస్తారు. ఎలా చేస్తారు? అంటే మౌనం ద్వారా చేస్తారు. మౌనం ద్వారా ఎలా చేస్తారు? ఇదిగో paper పట్టుకురా, అదిగో పుస్తకం పట్టుకురా, ఇదిగో గరిట తీసుకురా, లేకపోతే ఇదిగో అరిటి పండు అనటానికి మాటలు కావాలి కదా! అంటే వారు అవేమీ చెయ్యరు. ఏం చేస్తారు? సంకల్పిస్తారు. సంకల్పం అంటే మనసుకి వారు ఒక ఆజ్ఞ ఇస్తారు. మనసు వారికి ఆజ్ఞ ఇవ్వదు. వారే మనసుకు ఆజ్ఞ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన నాలుగైదు పనులు వరుసగా వెంబడే టక టక అయిపోతాయి. కాబట్టి వారి మౌన శక్తి అంతా కూడా వారు అనుభవించేటువంటి ఆంతరంగిక మౌనంలో, మానసిక మౌనంలో ఇమిడి ఉన్నది. భగవాన్ కూడా మనసు ఉన్నదా? ఇది ప్రశ్న. కదా. మనం in the light of రమణ మహర్షి మాట్లాడుకోవాలి. వారికి మనసే లేదని వారే చెప్పారు. మనసు లేకపోవడం ఏంటి? పుస్తకాలు కుట్టారు, అట్టలు వేశారు, proof reading చేశారు, పిండి రుబ్బారు, కౌపీనాలు తుక్కున్నారు, వచ్చిన వాళ్ళతో మాట్లాడారు, గోశాలకు వెళ్లారు. ఎన్నో అన్ని పనులలో వారున్నారు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ సమాధానాలు ఇచ్చారు. ఆయన పూర్ణ మౌనాన్ని వారు ఎప్పుడూ కూడా ఆశ్రయించలే. మన బోటి వాళ్ళు వెళ్ళినప్పుడు సమాధానాలు ఇచ్చారు. day by day with భగవాన్ దేవరాజ్ మొదలయ్యారు వీళ్ళంతా record చేశారు. అట్లాగే ఆశ్రమానికి సంబంధించిన కొన్ని పనులు పురోగమి౦చేటప్పుడు కూడా మాట్లాడారు. అదిగో వారు వచ్చారా, train వచ్చిందా లేదా enquiry చేశారు. కానీ అది కేవలము బాహ్య రకమైనటువంటి ఒక సూప్-superficial mind తో పనిచేశారు. దానికి మరి superficial అనే పదం వాడకుండా ఏం లేదప్పా ప్రపంచంలో బతకాలి, చేయాలంటే కించిత్ మనసు కావాలిగా అన్నారు. కించిత్ మనస్సు అంటే ఏంటంటే చింతన లేని, చింత లేని ఒక స్వభావసిద్ధమైన, స్వధర్మాత్మకమైన, స్వాభావికమైన సద్వస్తువుల నుంచి పుట్టినటువంటి మౌనమే, మౌనం యొక్క resonace మనసు కాబట్టి ఆ-ఆ మనస్సుని మనం అర్థం చేసుకోగలిగితే దానికి పూర్ణ మనస్సు అని, శుద్ధ మనస్సు అని మనం చెప్తూ ఉంటాం. అందుకనే భగవాన్ మన బోటి వాళ్ళందరికీ ఒక opportunity ఇచ్చారు. mind ని ఉండనివ్వండి mind లేకపోతే మనందరినీ జూలో పెట్టేస్తారు. కానీ pseudo mind మనల్ని operate చేయకుండా జాగ్రత్త పడండి. But ninety-nine percent of us are guided by our pseudo mind. దానికి hypocrisy అని పేరు. మనం ఫలానా ఆయన భక్తులం అనుకుంటాం, భక్తుల్లా ప్రవర్తించం. నేను జ్ఞానిని అనుకుంటాం, జ్ఞానిలా behave చేయం. నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటాం. నాకు తెలుసు అనటంలోనే అహం ఉన్నది. ఇంకా తెలుసుకోవలసినది ఎంతో ఉన్నది అనే దాంట్లో వినయం ఉన్నది. చూశారా, ఇదంతా మనస్సు pseudo mind మనం ప్రపంచానికి పరిచయం చేస్తాం. పరిచయం అయ్యేది కూడా అదే. కానీ real mind, absolute mind, pure mind and divine mind ఏదైతే ఉన్నదో అది మాత్రమే resonance of the self. అంటే ఆత్మ నుంచి మనస్సు, మనస్సు నుంచి ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి కరణ-కరచరణాది అవయవాలు, ఇవన్నీ కూడా link up అయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మౌనంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కేవలము నోరు, మనస్సు, బుద్ధి synchronize అయినాయి. చెయ్యి ఇలా కదలటానికి దానికేం పని లేదు. కానీ ఇది ఏమిటి అంటే దాని resonance అది, reflection అది, reaction అది. కాబట్టి resonance, reflection and reaction is these three emanate only from pure mind. దానిలో నుంచే పరమేశ్వర సంకల్పితం అంటాం. పరమేశ్వర్ కాసేపు పక్కన పెడితే ఆత్మ యొక్క సంకల్పంలో నుంచే ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి మనం మళ్ళీ మనం మూలంలోకి వెళ్ళినప్పుడు మౌనాన్ని ఆశ్రయించి భగవాన్ ఒకసారి అరుణాచలంలో అందరూ అంటారు భగవాన్ ఎప్పుడూ హాయిగా మౌనంలో ప్రశాంతంగా, ప్రసన్నంగా, నిండుగా, పరమ సంతృప్తిగా, కరుణాపూర్ణ సుధాభిగా, అసలు ఏమీ అక్కరలేని వారిగా ఎలా ఉండగలుగుతారాయనా? దక్షిణామూర్తిని గురించి విన్నాము, మళ్ళీ రమణ మహర్షి గురించే వింటున్నాం కానీ మౌనం ఏమిటో మాకు అర్థం కావటం లేదని పది మందికి ఆలోచన వచ్చి ఇవాళ సాయంకాలం భగవాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం దక్షిణామూర్తి తత్వం, మౌన వ్యాఖ్య అంటే ఏమిటో, మౌనం అంటే ఎలా ఉంటుందో ఒక్కసారి భగవాన్ ని అడుగుదాం.అడగాలి కదా గురువుని అడక్కపోతే వారు ఎందుకు చెప్తారు వారి మౌనంలో వారుంటారు మన మౌనంలో మనం ఉంటాం మన మౌనం ఎంత సేపు అంటే భగవాన్ ఎప్పుడు మాట్లాడతారా ఎప్పుడు మనల్ని చూస్తారా ఎప్పుడు భగవాన్ మళ్ళీ లోపలికి వెళ్ళగానే మనందరం మనం బయటికి పోవచ్చునా మన మౌనం పరిమితమైనటువంటి ఒక సమయానికి లోబడి ఉంటుంది అపరిమితమైన అఖండ అవియమైనటువంటి మౌనంలోనేమో భగవాన్ కూర్చుని ఉంటారు కాబట్టి సందేహ నివృత్తి చేసుకుందామని అరుణాచలంలో యదార్థంగా జరిగిన సంఘటన ఇది ఆరోజు సాయంత్రం ఒక పది పదిహేను మంది ఏకాత్మ భావన భగవాన్ నుంచి మౌనం అంటే ఏమిటి దక్షిణామూర్తి తత్వం అంటే ఏమిటి మౌనంతో వ్యాఖ్యానం ఎలా చేసేవారాయన తెలుసుకుందామని వెళ్లి కూర్చున్నారు అయితే భగవాన్ వారు సహజ స్థితిలో వారున్నారు అందులో ఒకడు చక్కగా అడగగలిగిన వాడు లేచి వినమ్రంగా భగవాన్ కి నమస్కరించి దక్షిణామూర్తి స్వరూపాన్ని గురించి దక్షిణామూర్తి తత్వాన్ని గురించి మౌన వ్యాఖ్య గురించి బాగా గట్టిగా చదువుకున్నాం భగవాన్ వారు ఇలా చేసేవారట శిష్యులంతా కూర్చుని ఉండేవారట అనేక సందేహాలతో వాళ్ళంతా జ్ఞాన వృద్ధులట వయస్సులో కూడా చాలా వృద్ధులేనట కానీ ఒకవైపున దక్షిణామూర్తి కూర్చుని ఉన్నారట మరి ఎవ్వరితోనూ మాట్లాడలేదట కానీ ఎదురుగా కూర్చున్నటువంటి జ్ఞాన స్వరూపాలకి ఉన్న సందేహాలన్నీ పటాపంచలై పోతున్నాయట ఇది ఎట్లా జరిగింది కొద్దిగా మౌన భూమికలోకి ఎలా వెళ్లాలో వెళితే ఏమవుతుందో మాకు చెప్పండి అని అడిగాడు భగవాన్ అయితే చాలా మంచి ప్రశ్న వేశావ్ కూర్చో అని అనలే ప్రశ్నా అడుగుతూ ఉండగానే మిగతా వారందరూ అడుగుతున్నాయని అందరినీ కూడా మౌన భూమికలోకి భగవాన్ తీసుకుని వెళ్లారు తీసుకుని వెళ్లటం అంటే మీరు రండి చూపిస్తాను అన్నారా తాను మౌనభూమికలో నిలకడ చెందారు ఎప్పుడైతే ప్రశ్న వేసినటువంటి వ్యక్తి ఉన్నాడో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మౌనభూమికలోకి అత్యంత సహజంగా ప్రవేశం చేశారు రాత్రి భోజనానంతరం ప్రారంభమైనటువంటి మౌనభూమిక తెల్ల తెలవారే వరకు కొన్ని గంటల సేపు మౌనభూమికలో నిలకడ చెందించారు ఇది ఒక అద్భుతమైనటువంటి demonstration of the efficacy of మౌన అప్పుడు వాళ్ళందరూ కళ్ళు తెరిచి చూసినప్పుడు మౌనంలో వాళ్ళకు కలిగిన ఆనందం మనస్సు ఆగిపోయిన క్షణాలు దానిలో ఏర్పడని అలజడులు అసలు ఏమీ లేదు ఒక నిర్లిప్త మహాస్థితి అది ఆలోచనలు లేవు ప్రకంపనాలు లేవు ప్రవాహాలు లేవు వాహినులు లేవు సర్వంతులు లేవు జంఝామారుతాలు లేవు జరులు లేవు ఏమున్నాయంటే మహానిశ్శబ్దం గండ శిలవలె మనస్సుని ఆక్రమించిన సందర్భం సందర్భంలో భగవాన్ కది అత్యంత సహజం కానీ జిజ్ఞాసు అయినటువంటి వాడు అడిగింది అద్భుతమైనటువంటి ప్రశ్న మామూలు ప్రశ్న కాదది అంతేగాక మా అమ్మాయి పెళ్లి ఎప్పుడవుతుంది మా అబ్బాయికి వీసా ఎప్పుడొస్తుంది అవి కాదు అడిగాడు అసలు అది ఏమిటో మాకు చెప్పండి అంటే మామూలుగా చెప్పి గనక ఉంటే ఇట్లాగో ఒక ప్రవచనం చేయవలసి వచ్చేది భగవాన్ కి ప్రవచనాలు చేసే ఇది లేదు వీక్షణ దీక్ష మొదటిది రెండవది మౌన దీక్ష మౌనంలో నుంచి వ్యాఖ్యానం చేశారు అప్పుడు వారందరూ కూడా బయటపడ్డారు ఇదంతా నిజమేనండి రమణ మహర్షి దగ్గర జరిగిందంటే వారు మహాత్ములు కదా మీకు కూడా ఎప్పుడన్నా అనుభవం అయ్యిందా అని నన్ను ఒకాయన ప్రశ్న వేశారు ఇది చాలా critical question చెప్పుట సులభము చేయుటే కష్టము కదా ఇగో మనస్సు అంటే ఇది బుద్ధి అంటే అది అవన్నీ చెప్పడానికి ఏం పెద్ద అద్భుతమైన తెలివితేటలు అక్కర్ల కావలసింది ఏమిటంటే నీవు దానిని అనుభవించావా ఎప్పుడైనా నిజంగా అనుభవించావా అనుభవిస్తే దానికి నువ్వు పెట్టుకున్న పేరు ఏమిటి క్షణాన నువ్వేం చేశావు ఇక్కడ విషయం చెప్పటం కోసమే చెప్తున్నాను తప్ప ఇక్కడ విఎస్ఆర్ మూర్తిని మర్చిపోండి కాసేపు ఆయన్ని వదిలేయండి ఎవరో ఒక వ్యక్తి అనుకోండి అది నేను అనుకోండి కాసేపు తెలుసు గనక సుమారుగా 2008వ సంవత్సరంలో 2005 వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నేను camp చేశా అప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు మాట్లాడుతూనే నేను అక్కడ ఉన్న వారి guest house లో అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఇటువంటి ఆలోచన ఒకటి కలిగి అయ్యా శిబిరాలు ఏర్పడుతున్నాయి ఏసీ రూముల్లో ధ్యానం గురించి చెప్తున్నారు అసలు వేళ ధ్యానం చుట్టుముట్టేస్తోంది మమ్మల్ని నిజమైనటువంటి ధ్యానం అంటే ఏమిటో మాకు అనుభవపూర్వకంగా మీరు చెప్పాలి అని అడిగారు అనుభవపూర్వకమైతే ధ్యానం కూడా చెప్పేది కాదు మౌనం లాగానే కేవలం అనుభవ రససిద్ధమైనటువంటిది కాబట్టి రోజున తెల్లవారుజామున ఇదిగో నిన్న మొన్న పరుల పాలైపోయిన గంగా port ఏదైతే ఉందో గంగవరం port అప్పుడే clear అవుతున్నటువంటి సమయం తెల్లవారుజామున నాలుగు గంటలకి higher officials ఇద్దరో ముగ్గురో అలాగే section heads కొంతమంది అందులో ఒక ఆమె ఒక స్త్రీమూర్తి అందరం కలిసి తెల్లవారుజామున వెళ్ళాం వెళ్లి నిజానికి చీకటివేళ తెల్లవారబోతున్నటువంటి వేళ సముద్రంలో నుంచి మండ్ర గబ్బలు తేళ్లు ఒక్కొక్కసారి పాము పిల్లలు ఇవన్నీ కూడా బయటకు వస్తుంటాయి నీళ్లలో నుంచి నీటి పాములవి కూడా అసలు వెళ్ళాము కూర్చున్నాముమౌనంగా ఉండాలి. ధ్యానం అంటే ధ్యానంలోనే మౌనం మౌనమే ధ్యానం రెండు సినానిమ్. కూర్చుంటే తెల్లవారుజామున నాలుగున్నరకి ఒకళ్ళతో ఒకళ్ళు ఎవరు మాట్లాడుకోలేదు పదిహేను మంది ఉన్నాం. ఇది అలా నడిచి పోతూ ఉన్నది ఎంత సేపు అయిందో మాకు తెలియదు దానికి ధ్యానం బాగా కుదిరిందని తర్వాత పేరు పెట్టుకున్నా ధ్యానము ఎలా కుదిరింది అంటే మౌనం వలన కలిగింది. మౌనం ఎలా కలిగింది అంటే నిశ్శబ్దంలో నుంచి మౌనం ఏర్పడింది. తెల్లవారుతున్నటువంటి వేళ సముద్ర ఘోష లేదు వినపడటం లేదు. సముద్రం అలలు నెమ్మది నెమ్మదిగా నిష్కంద్ర మందంగా సాగుతూనే ఉన్నాయి. మరి ఎవరు మిమ్మల్ని వచ్చి అవస్థ నుంచి బయట పడేశారు అంటే సూర్య భగవానుడి యొక్క ఆగమనంతో సముద్రపు అలల మీద కదలికల మీద సూర్య కిరణాలు ప్రసారమై వెలుగు మా మీద ప్రసారమైనప్పుడు ఏదో తెల్లవారిందే అన్నట్లుగా అందరికీ బాహ్య స్మృతి ఏర్పడింది. ఇది ఒకరి తర్వాత ఒకరికి రాలా ఎట్లాగైతే అందరూ మౌనభూమికలోకి వెళ్లారో అట్లాగే ఒకేసారి బాహ్య స్మృతిలోకి రావటం జరిగింది. దీనికి ఏం పేరు పెట్టుకోవాలి అంటే మౌనం ద్వారా ధ్యానం చేయటం అంటే ధ్యానంలో ఉండటం ఎందుకంటే చేసేది ధ్యానం కాదు ఏమీ చేయకపోవటమే ధ్యానం. ఏమీ లేదు ఊరకుండండి ఏమీ లేదు ఊరకుండండి అంటే మౌనము ప్లస్ ధ్యానము ఈస్ ఈక్వల్ టు దట్. కాబట్టి మౌనము యొక్క efficacy ని ఆరోజు వాళ్ళు అనుభవించారు. వారు రాసిన ఉత్తరం ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఇంకా ఉంది నా దగ్గర. ఎందుకని అంటే వాళ్ళు ఎవరు ధ్యానులు కారు. వాళ్ళకేం పెద్ద అనుభవాలేం లేవు. అంటే వాళ్ళు తెలుసుకున్నది ఏమిటి అంటే మౌనం చాలా గొప్పది. మౌనం వలన మనం చాలా శక్తివంతులం అవుతాము. మాట్లాడుకుంటూ ఉండండి ఇలా కొన్ని గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఉండండి. ప్రయోజనకరమైనవి ప్రయోజనం లేనివి మనలో ఉన్న శక్తి అంతా కూడా drain out అయిపోతుంది. మౌనం is a source is a way to conserve our energy. అది మూడు energies ఉన్నాయి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తి అంటే ఇచ్ఛ, క్రియా, జ్ఞాన శక్తులు మూడు మన యందు ప్రవేశిస్తాయి. ఉండి మనల్ని చాలా బలాఢ్యుల్ని చేస్తుంది శక్తివంతుల్ని చేస్తుంది. కనుక ఇక మనల్ని ఆలోచనా చుట్టుముట్టదు ఆలోచనా బాధించదు మహా సంతోషం ఉల్లోపడ్డ మనమేం చలించం మహా దుఃఖం ముంచెత్తినా కళ్ళ వెంబడి అశ్రుధారలు కారవు. ఒక state of neutrality ని అనుగ్రహించేటువంటిది ఏది అంటే మౌనమే. కనుక భగవాన్ మానసిక మౌనాన్ని ఆశ్రయించిన కారణంగానే ఆశ్రమంలో దొంగలు పడ్డనాడు గాని ఆశ్రమంలో నిరంజనానంద స్వామి ని ఎవరో ఎత్తుకొని వెళ్ళినప్పుడు గాని ఆశ్రమంలో జరిగిన అనేక సంఘటనలకు గాని వారు ఎక్కడా ప్రతిస్పందన లేని నిరామయమైన స్థితిలో వాళ్ళు-వారు ఉండగలిగారు. ఎలా ఉండగలిగారు అంటే ఇది మౌన శక్తి, సహజ ధ్యాన శక్తి, సహజ స్థితి ఇవన్నీ కలపగా ఒక ఆత్మ శక్తి లేదా ఒకే ఆత్మ శక్తి అదే మౌనమై, ధ్యానమై, సంకల్ప వికల్ప రహితమై పరమాద్భుతమైనటువంటి ఒక state లో భగవాన్ ఉండగలిగారు. దానిని వారు సహజ స్థితి అన్నారు. సమాధి స్థితి అనలా మనకు సమాధి స్థితులు పనికిరావు ఎందుకంటే ప్రపంచంలో మనం చాలా పనులు చేయాలి. సమాధి స్థితిలో ఉంటే మనం ఏమీ చేయం. కనుక సమాధి-సమాధి స్థితి అనేదానికి కూడా అర్థం ఏమిటంటే సర్వమూ అధీనమైన స్థితి సమాధి స్థితి. సమాధి అంటే చలువరాతితో చేసిన సమాధి కాదు. సర్వమూ అధీనమా సర్వమూ ఏమిటంటే ప్రకృతి, పరాప్రకృతి, మనస్సు, ఇంద్రియాలు మనలో ఉన్న ఇరవై ఒక్క తత్వాలు అన్నీ కూడా ఒకే సమస్థితిలో మనకు అధీనమై ఉండేటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళాలి అంటే మౌనము is a power there అక్కడ అది power. ఇక్కడ efficacy. power efficacy రెండు నిజానికి రూపాయి నాణానికి బొమ్మా పురుసు లాంటివి. వాడుకుంటున్నప్పుడు అది energy వాడుకుంటున్నప్పుడు అది power ఇది అని తెలుసుకుంటున్న సమయంలో తెలుసుకున్న దానిని అనుభవించబోతున్న సమయంలో అనుభవించే దాకా that is efficacy. కాబట్టి భగవాన్ రమణులు ఇటు efficacy ని ఎక్కువ వాడారు ఎక్కువ లోపల నిలుపుకున్నారు power ని చాలా తక్కువ వాడారు. ఎందుకంటే వారికి ప్రపంచంతో పని లేదు. ప్రపంచాతీతమైన ఒక మూలమైన సద్వస్తువు యందు నిత్య సద్దర్శనం చేస్తూ ఉన్నారు. నిజానికి అరుణాచలంలో భగవాన్ couch మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఒక స్వాత్మానంద స్థితిలో చాలా సేపు నిలకడ చెందినప్పుడు వారి ముఖ మండలం వెలిగిపోతున్నప్పుడు ఒక భక్తుడు అడిగాడు "భగవాన్! మేము ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మాకు తేజస్సు గాని, పరమ ప్రశాంతి గాని మా ముఖం మీద ఎందుకని ప్రతిఫలించటం లేదు. ఇంతకీ ఒక్క ప్రశ్న మీరు మౌనంగా ఆకాశంలోకి చూస్తూ ఉంటారే దేనిని చూస్తున్నారు ఆకాశంలోకి మేము చూస్తున్నాం పగటిపూట సూర్యున్ని, రాత్రిపూట చంద్రున్ని, నక్షత్రల్ని, తారక మండలాల్ని, మేఘ మాలికల్ని చూస్తూనే మేము ఉన్నాం. కానీ మాకు ఆనందం కలగటం లేదే. మీకు కలుగుతున్న బ్రహ్మానందం ఏమిటి? దేనిని మీరు చూస్తున్నారు?" అని ప్రశ్న వేశాడు. భగవాన్ చక్కటి సమాధానం ఇచ్చారు "ఆ క్షణాలలో నన్ను నేను చూసుకుంటున్నాను".ఇది మౌనం. క్షణాలలో నన్ను నేను చూసుకుంటున్నాను. ఈవేళ మనం మనల్ని చూసుకోవటం మానేసి చాలా రోజులైపోయింది. ఎప్పుడైనా రోజుకు రెండు మూడు సార్లు బయటికి వెళ్లాలంటే అద్దం ముందుకెళ్లి ఎలా ఉన్నామో చూసుకున్నాం తప్ప మనల్ని మనం ఎక్కడ చూసాం? వాడు ఇట్లా, వీడు ఇట్లా, వాడి పొడుగు, వీడి లావు, వీడి సన్నం దీంతోనే వస్తువులను చూడటంతో మనం అలసిపోతున్నాం. చూస్తూ విశ్లేషించటంతో మనస్సు అలసిపోతున్నది. విశ్లేషించి ఒపీనియన్ అనేటిది కావటంతో మనస్సు ఇంకా అలసిపోతున్నది. దీని ద్వారా మనము సంపాదించి నిలబెట్టుకోవలసిన మౌనము నెమ్మదిగా పల్చబడి పోతున్నది. మౌనము అంటే అది. వాచా మౌనాన్ని దాటాలి. ఏదో గురువారం నాడు ఉంటాను, శనివారం నాడు మౌనం, ప్రయోజనం లేదు. సౌజ్ఞాపూర్వకమైనటువంటి మౌనం కూడా పెద్ద గొప్ప స్థితేం కాదు. ఎందుకంటే పలక తీసుకుంటాం. పలక మీద బలపం పట్టుకుంటాం. గురువుగారు ఎవ్వరితో మాట్లాడరటరా కానీ పలక మీద ఒకటి రాసిస్తారట. రాసేటప్పుడు మనస్సు ఎక్కడికి పోయింది? రాయాలంటే అక్షరాలు కావాలిగా! పలక ఉంటుందని, చేతిలో బలపం ఉందని, చెప్పవలసిన విషయం ఉందని, తాను చెప్తున్నానని ఇక్కడ అక్కడి తృత్వం ఎక్కడుంది? భగవాన్ ఏనాడూ పలకల మీద మాటలు రాయలే, రాశారా? నీటి మీద రాయలా ఏం చేశారంటే తన మనస్సుని అంటే ఆత్మతో కూడిన మనస్సుని, కించిత్ మనస్సుని మనబోటి వారి మనసుతో అనుసంధానం చేశారు. అనుసంధానం attunement అంటాం. ఎలా చేశారు అంటే It is through intense మౌన, intense silence. Intense silence మనకు అర్థం కాదు. అంటే silence అంటే మన ఒక్క చెవి దగ్గరే మనకు వినపడితే శబ్దం, వినకపో-పోతే నిశ్శబ్దం అంతే కదా! అనుకుంటాం. కానీ భగవాన్ మౌనం అంతా ఎక్కడ ఉన్నదంటే కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి భగవాన్ రెండు నేత్రాంచలాలలో నుంచి, అది మురుగనారు వర్ణిస్తాడసలు. దానిలో నుంచి ప్రవహించేటువంటి కాంతిలో నేను స్నానం చేశానంటాడు ఆయన. అంటే దానిని అందుకోగలగాలి. ఒక మురుగనారు అందుకున్నాడు, రాసుకున్నాడు. మనం భగవాన్ నన్ను చూశారు. ఇప్పుడు ప్రయోజనం ఏమిటి? ఏం కలిగింది నీకు? భగవాన్ చూట్టం కాదు, భగవాన్ యొక్క కించిత్ మనస్సు మన సూడో మైండ్ తో కలిపినప్పుడు అది కించిత్ మనస్సుగా మారుతుంది గనుక మౌనము, ధ్యానము, యోగము, సమాధి ఇవన్నీ కలిపి దీనికి మూలమైనది ఏది అంటే ఆత్మే అనేటువంటి ఒక నిర్మల నిశ్చల భావనా భూమికలోకి భగవాన్ మనల్ని నడిపించారు. ఇది చాలా గంభీరమైన విషయం. ఎందుకంటే మౌనం అంటే తెలియాలి. వారు వీక్షణ దీక్ష ఎవరిచ్చారు? ఇచ్చారు. ప్రకృతిలో చేప వీక్షణ దీక్ష చేస్తుంది. తన నుంచి గుడ్లను నీళ్ల మీదకు వదిలేస్తుంది. నీటి ప్రవాహానికి అవి వెళ్లిపోతూ ఉంటాయి. వెళ్ళాలి కదా. గుడ్లు చాలా తేలిగ్గా ఉంటాయి, నీరు వెళ్తూ ఉంటుంది. వాటి వెనక చేప కూడా నెమ్మదిగా అదే pace లో నడుస్తూ ఉంటుంది. అంటే ఈదుతూ ఉంటుంది. కానీ దాని దృష్టి బేని మీద ఉండదు. తనను ఎవరో తినటానికి వస్తున్నారని గాని, వల వేసి పట్టుకోబోతున్నారని గాని, efficacy of that particular eyesight is focused entirely on the embryo of the fish. అది. గుడ్డు మీద పడుతుంది. పడగానే చూపు వలన అవి నెమ్మదిగా చేప పిల్లలైపోతాయి. అందుకనే అమ్మవారి యొక్క ఒక పార్శ్వ మధురలో ఉన్నటువంటి, మధురైలో ఉన్నటువంటి మధుర మీనాక్షి. మీనము వంటి కన్నులు అంటే పైకి చేప వంటి కన్నులని బొమ్మ గీస్తాడు artist. అమ్మ అక్కడ ఉండి మనందరినీ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా నడిపించగలదు కనుక ఆమె మీనాక్షి అయింది. అటువంటి మీనాక్షి యొక్క తత్వాన్ని, మరి మధురైలోనే వచ్చారుగా భగవాన్, ఆయనది కూడా మీనాక్షి తత్వమే. ఆయన కూడా వీక్షణ దీక్షే. ఎవరి వైపైనా వారి దృష్టి సారింపబడింది అంటే అప్పటిదాకా ఉన్న కర్మలన్నీ దగ్ధమై, వాడి మనస్సు చేతనావస్థని, అచేతనావస్థ నుంచి చేతనావస్థలోకి, చేతనలో నుంచి చైతన్యంలోకి, చైతన్యంలోనికి ఆధ్యాత్మిక భూమికలోకి అది ప్రవాహ వేగంతో కేవల క్షణకాలమే. వారం గంటలు గంటలు అలా కూర్చొని, ఎవరో గురువుగారు చెయ్యి పట్టుకొని రెండు గంటలు కూర్చుంటే చెయ్యి నొప్పి పుడుతుంది తప్ప ప్రయోజనం లేదు. జరిగేది వీక్షణ దీక్ష. మనం మర్చిపోకూడదు పదం. ఒక ఉడత, మనం photo చూస్తాం. భగవాన్ హిందువు చదువుకుంటూ, కళ్ళజోడు పెట్టుకొని హిందువు చదువుకుంటుంటే వారి దగ్గర అరచేతిలో ఒక ఉడత కూర్చొని ఉంటుంది. ఉడత పిరికి. ఊరికే మనం అలికిడి వింటేనే పారిపోతుంది అది. అలాంటిది భగవాన్ అరచేతులలో అది నిలకడ చెంది నిశ్శబ్దంగా అటూ ఇటూ కదలకుండా తన మనస్సును నిగ్రహించుకొని ఆ-ఆ photo చాలా ఉదాత్తమైన మన సాధనకు చాలా పనికొచ్చేటువంటిది. అంటే భగవాన్ హిందువు చదువుతున్నారు అనేది మిష. వారి అనుగ్రహము, వారి చూపు దేని మీద ఉన్నదంటే అరచేతిలో ఉన్న ఉడత మీద ఉన్నది. కనుకనే పిరికితనం పోయింది. అటూ ఇటూ పరిగెత్తే స్వభావం పోయింది. ఒట్టి ఒక బొమ్మలాగా కూర్చుంది అది. ఆ-ఆ క్షణాలు దాటిన తర్వాత వీక్షణ దీక్ష ఉపసంహారం కాగానే ఉడత ఎగిరి అక్కడి నుంచి పారిపోయింది. చూశారా! మన మనస్సు ఉడత. ఉడతని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలంటే భగవాన్ కి సమర్పణ చేయాలి. నిజంగా రమణ మహర్షి చెప్పిన మౌనాన్ని, భగవాన్ చెప్పిన ధ్యాన స్థితిని, భగవాన్ ప్రపోండ్ చేసి చెప్పిన దక్షిణామూర్తి తత్వాన్ని నిజంగా literalగా actualగా virtualగా అనుభవించాలి అంటే ఇంత సాధన చేయాలి. ఇంత శాస్త్రం తెలియాలి. శాస్త్రం అంటే శాస్త్రం కోసం కాదు, మనకి దారి తెలియాలి.ఆ దారిలో సూచన మార్గాలన్నీ తెలుసుకోవాలి. మనల్ని మనం నిబ్బరించుకోవాలి. మనల్ని మనం సాధన చేసుకోవాలి. దీనికన్నింటికీ కూడా మనం మౌనం మీద, ఇవ్వాళ నిజానికి ఇందాకే అన్నట్లు మౌనం మీద మాట్లాడటమేంటి అసలు మాట్లాడకుండా ఉండటమే మౌనం కదా. కానీ తెలుసుకోవాలి గనుక ఎకడమిక్ గా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి గనుక దానికోసమై మౌన శక్తిని power of silence ని గురించి మనం వీటినన్నింటినీ కూడా విచారణ చేసుకోవాలి. దీనిని మనం గనక ఆధ్యాత్మిక స్థాయిలో అర్థం చేసుకోవాలంటే ముందు భౌతిక స్థాయిలో ఇవన్నీ కూడా మనం practice చేయాలి. కేవలం పారాయణం, కేవలం ఉపన్యాసం, కేవలం ఏదో ఒక routine గా ఏదో ఉద్గ్రంథాలు, ఏదో సుందర కాండ పారాయణ ఇంకో పారాయణ. పారాయణం అనేది అది ఒక మానసికమైన ritual అంతే. దాన్ని కూడా దాటమన్నారు భగవాన్. దేనిని పారాయణం చేయమన్నారంటే, నేనెవరు అన్నటువంటి విచార ధారణి పారాయణం చేయాలి. నేనెవరు అంటే, ఏముందండి నేనెవరు అంటే, నా degree లు ఉన్నాయి, నా visiting card, debit card అన్నీ card లు ఉన్నాయి కదా ఇవ్వాళ. ఆధార్ card, visiting card, credit card అన్నీ card లే. ఇవన్నీ they are to be discarded. మనకి నిజమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కావాలి అంటే చాలా శ్రమ పడాలి. అంటే రామకృష్ణ అని ఒక రామకృష్ణన్ from మదురై. ఆయన వచ్చారు భగవాన్ దగ్గరికి. అతనంటే వయసులో ఆయనకి ఇరవై ఏళ్లు. రెండు నెలలు ఉన్నాడు అరుణాచలంలో. ప్రతిరోజూ భగవాన్ దగ్గర కూర్చున్నాడు. వీలైనప్పుడు గిరి ప్రదక్షిణ చేసి అన్నీ మంచి పనులు చేశాడు. కానీ చివర ఇక వెళ్ళాలి కదా ఇంటికి, ఏదో రోజున వెనక్కి వెళ్ళాలి. భగవాన్ దగ్గర నుంచొని ఎంత hypocrisy లేకుండా చాలా open గా "భగవాన్, రెండు నెలలు మీ దగ్గర నేను ఉన్నాను. మీరు చెప్పిన గిరి ప్రదక్షిణ చేశాను. మౌనం వహించాను. మీ సన్నిధిలోనే కూర్చున్నా ప్రతిరోజూ పొద్దున్న, సాయంత్రం సాధ్యమైనంత ఎక్కువ సమయం. కానీ నాకు ఏమీ కలగలేదు" అన్నాడు. ఎవరైనా అంటారా మాట? "భగవాన్ అసలు మీరు చూశారు, నాకన్నీ కూడా అర్థమైపోయాయి"నే అంటాడు. అది hypocrisy. "నాకేమీ కలగలేదు" అంటే భగవాన్, ఆయన దయామయుడు, కరుణాపూర్ణ సుధాబ్ధి. ఎన్నిసార్లు చెప్పుకున్నా. ఆయన ఏమన్నారో తెలుసా? "ఏదన్నా పొందాలి అంటే కొంతైనా ఉన్నది పోగొట్టుకోవాలిగా. మనం పోగొట్టుకోనంత కాలం దేనినీ రాబట్టుకోలేంగా" అనుకులోచేశారు. అంటే ఏమిటి? అబ్బాయి ఏమి పొందాలని వచ్చాడో అతనికే తెలుసు. ఏమి పోగొట్టుకోలేకపోయినాడో అతనికే తెలుసు, భగవాన్ కి తెలుసు. కాబట్టి భగవాన్ reminded him on one aspect. If you have to get or if you want to get something you have to get rid of something. get rid of భగవాన్ ఆవరణంలో ఏంటంటే మన మనస్సుని దూరం చేసుకొని కించిత్ మనసుతో బతకటం నేర్చుకోవాలి. కించిత్ మనస్సే మనల్ని అధ్యాత్మ స్థాయిలో అరుణాచల శిఖరం వైపు నడిపించేది. మన మనస్సు కాదు, మన కాళ్లు కాదు. భగవాన్ అనుగ్రహించారని అంటాం, మనది సంకల్పం అంటాం, నా సంకల్పానికి భగవాన్ ఆశీర్వచనం అంటాం. అన్నీ మన మనస్సు చెప్పవే. మరి చేస్తున్నది ఏది? మనల్ని అక్కడిదాకా నడిపించేది ఏదంటే కించిత్ మనస్సు. ప్రాపంచికమైన మనస్సును దాటి సర్వోన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మనస్సుని చేరుకునే దాకా చేరుకోవటానికి వీలైనటువంటి ఒక instrument గా ఏదైతే ఉన్నదో కించిత్ మనసుతో మనం ఉన్నంత కాలం మనకి ఇంకా rituals అక్కర్లేదు. కావలసినది, అంటే rituals వద్దని కాదు. rituals ద్వారానే spirituality ని పట్టుకోవాలి. కానీ ఏదో ఒక సమయంలో, కాయ వాంగ్ మనా కార్యముత్తమం. ఉపదేశ సారంలో వారు చెప్పనిదంటూ లేదు. చెప్పవలసినవన్నీ చెప్పేశారు. దానిలో ఏది దేనికంటే ఉత్తమమైనది, స్థితి దేనిక, ఏది ఎటు దారితీస్తుంది, అకర్తృత్వంలో నుంచి ఆత్మ భావనలోకి పరమాద్భుతంగా నడిపించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నదంతా ఇప్పుడు మనం చెప్పుకున్నదే. ఏం భిన్నం ఏం కాదు. కాబట్టి వీటన్నింటినీ కూడా విచారణ చేసి ఈవేళ మన pocket లో మన అందరి ఇళ్లలో TV ఉండనే ఉంది. కాసేపు మౌనంలో ఉండి కాసేపు TV చూస్తాను అనుకున్నట్లయితే ప్రయోజనం ఏముంది? అంటే అన్నీ మనకున్నాయి కానీ ఏదీ మనది కానిదవుతుంది. నిజమైనటువంటి భగవాన్ చెప్పిన నిజమైనటువంటి ఆత్మ విచార మార్గంలోకి వెళ్లాలన్నా, ఆత్మ స్పురణని అనుభవించాలన్నా, ఆత్మ విద్యని అర్థం చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా మనమే చేయవలసి ఉన్నాయి కాబట్టి వీటిని సాధనా మార్గంగా మార్చుకోవాలని తదనుగుణంగా ఇవాళ లావణ్య రావు గారు ప్రారంభించినటువంటి మహోద్యమం లేదా ఒక మహాయజ్ఞం, యజ్ఞం నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలని అట్లాగే భగవాన్ ని కేవలం మహిమామూర్తిగా, అనుగ్రహ మూర్తిగా మాత్రమే కాక ఒక ఆధ్యాత్మిక చిచ్ఛక్తిగా ఎట్లా అనుభవించాలో అనేక విధాల మన విచారధారని కొనసాగిస్తూ భగవాన్ కరుణని, అది ఎప్పుడూ మన దగ్గర ఉండనే ఉంది. అదేమన్నా పదార్థమా నేను ఇవ్వటానికి అన్నారాయన. అదేమన్నా లడ్డూనా అనుగ్రహం నా దగ్గర, అక్కడే ఉంది మీరు పట్టుకుపోండి అన్నారు. కాబట్టి వీటన్నింటినీ కూడా వారి బోధనలని, వారి జీవన విధానాన్ని, వారు ప్రవచించిన దాన్ని, శాస్త్రాలని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని వీటన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక స్థితి మరింత సుసంపన్నం కావాలని, సుసంపన్నము అంటే zero in on అంటాం చూడండి. మన దగ్గర we have everything yet we need something. The day we feel that we don't need anything but we should become nothing. That is the real hallmark of spirituality. అటువంటి స్థాయిలోకి కరుణాపూర్ణ సుధాబ్ధి అయినటువంటి, పదం పదే పదే ఎందుకు వాడతానంటే భగవాన్ దగ్గర అనుగ్రహాలేం లేవు, కరుణ ఉంది. అనుగ్రహము, మహిమ, ఆశీర్వచనము ఇవన్నీ కూడా ఒక స్థాయికి చెందినవి. కరుణ మనం అడిగి పొందేది కాదు. మన అర్హతను బట్టి, అవసరాన్ని బట్టి మనస్, మనకున్నటువంటి ప్రాప్తిని బట్టి తానే అనుగ్రహించేది కరుణ. అడక్కుండా పొందితే, అడిగి పొందేది వరం, అడక్కుండా లభించేది కరుణ. అది పూర్ణంగా ఉన్నటువంటి క్షీరసాగర సమానమైనటువంటి భగవాన్ దివ్య మహాస్మృతికి మరొక్కసారి ప్రాంజలి ఘటిస్తూ, మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
YouTube · audio

Efficacy Of Silence / Mouna Sakthi

Home

Efficacy Of Silence / Mouna Sakthi

Source: Venkata Lavanya Rao Pamaraju on YouTube

0:00 / 1:01:51