No transcript for this section.
Transcript begins at 0:00.
నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన బ్రాహ్మణ్యం స్థితోతుపితరం వటమూలవాసం సంస్మారయంతమచలం తమనుస్మరామి ఓం నమో భగవతే శ్రీ రమణాయ భగవాన్ అవని సంచారానికి వచ్చి నూట నలభై రెండు సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక మహా సన్మంగళ వేళ ఒక పరమ పురుషుణ్ణి, జ్ఞానాదిత్యుణ్ణి, ఒక మహర్షిని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఆత్మ విచార మార్గాన్ని ప్రపంచానికి సూటిగా బోధించినటువంటి ఒక జ్ఞాన వరదాయి భగవాన్ శ్రీ రమణ మహర్షి తిరుచ్చుళిలో జన్మ ఎత్తి మధురైలో విద్యాభ్యాసనం ప్రారంభించి పదహారేళ్లు దాటి పదహారవ ఏడు వస్తున్న-- పదహారు ఏళ్లు దాటి పదిహేడవ సంవత్సరం వస్తున్నటువంటి సమయంలో తమ ఇంటికి ఒక బంధువు వచ్చినటువంటి వేళ ఆ బంధువుని సాగనంపేటువంటి సమయంలో తమ తండ్రి "అవును మీరు ఎక్కడి నుంచి వచ్చారు?" అని అడిగినప్పుడు అరుణాచలం నుంచి అన్న మాట ఆనాటి వెంకట్రామన్ చెవి సోకినప్పుడు ఒక్కసారి ఒక తాదాత్మ్యము, భావోద్వేగము కలిగింది. భావస్థిరాణి జనాంతర సౌహృదాణి అంటాడు కాళిదాసు. గతించిన జన్మలలో అనేకమైన స్మృతులు అనేకమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడు మళ్ళీ ఈ జన్మలో వాటికి మనం connect అవుతాం. అంటే అనుసంధానం అవుతాం. అలా ఈ వెంకట్రామన్ కి కలిగిన అనుభూతి వర్ణనాతీతమైన అనుభూతి. ఆ క్షణం నుంచి ఆయన మనస్సు, ఆయన బుద్ధి, ఆయన ఆలోచన, ఆయన తలపుల నిండా అరుణాచలం నిండిపోయింది. ఎక్కడున్నది అరుణాచలం అన్న ప్రశ్న లేదు కానీ తాను అరుణాచలానికి చెందిన వాడిని అన్న భావం స్థిరపడిపోయింది. చదువు, సంధ్యల పట్ల ఆసక్తి సన్నగిల్లింది. తనలో తాను తాదాత్మ్యం చెందుతూ ఉన్నటువంటి ఒకానొక సందర్భంలో వారొకరు ఒక మంచం మీద పడుకొని ఉండగా ఒక అనుభూతి కలిగింది. ఆ అనుభూతి అనుభవాన్ని దాటిన అనుభూతి. అంటే అనుభవం కలిగి అనుభూతి స్థిరపడటానికి సమయం పడుతుంది. అనుభవము, అనుభూతి ఏకకాలంలో జరిగినయి. అది ఏమిటి అంటే తాను ఉంటున్నానని, తన శరీరంలో నుంచి ఏదో బయటకు వెళుతున్నదని, అది బయటకు వెళ్లినా తాను మిగలకుండా ఉన్నానని, ఆ బయటకు వెళ్ళింది మళ్ళీ తనలోకి వచ్చి ఉంటున్నదని, ఇదంతా ఏమిటి అని అనుకున్నప్పుడు ఈ శరీరము నశించేది, నశించనిది లోపల ఉన్నది అనేటువంటి ఒక స్థిర భావన కలగటమే దానికి మరణానుభవంగా మనం పేరు పెట్టాం. అంటే మరణించటం మరణించకపోవటం కాదు. ఏది మరణిస్తున్నది, ఏది మరణించటం లేదు తెలుసుకోవటం. కాలగమనంలో ఈ భావం స్థిరపడినప్పుడు దీనికి అనువైనటువంటి ఒక ప్రదేశం ఏది అనుకున్నప్పుడు ఆయన మనస్సు నిండా నిండినటువంటి అరుణాచలమే ఆయనకు ఒక మార్గోపదేశనం చేసినట్లుగా మనం భావన చేయాలి. ఆ సమయం రానే వచ్చింది. స్కూల్ ఫీజు కట్టడానికి ఇంట్లో వారు కొంత డబ్బు ఇస్తే స్కూల్ ఫీజు కట్టకుండా ఒక చిన్న ఉత్తరం రాశారు. స్కూలు ఫీజు కట్టలేదు ఇవ్వబడిన సొమ్ములో కొంత తీసుకుని ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నది. నేను అన్న పదం ఆయన నుంచి ఇంకా రాలేదు. ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నది. దీనిని వెతికే శ్రమ మీరెవరూ పెట్టుకోవద్దు అంటూ ఆయన స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఒక ట్రైన్ వచ్చి ఆగటం, తనకు అరుణాచలం ఎక్కడున్నదో తెలియకుండానే అదే ట్రైన్ లో ఎక్కటం, అనేక మంది జనుల మధ్య, గందరగోళాల మధ్య తనలో తాను తాదాత్మ స్థితిలో నిలకడ చెంది ఉంటే ఒక మౌల్వీ ఈ వెంకట్రామన్ ని చూసి చిన్న పిల్లవాడు ఆకలి అనటం లేదు, దప్పిక అనటం లేదు, ఎంత గందరగోళం ఉన్నా నిశ్చలంగా ఉన్నాడు ఎవరూ అనుకుంటుండగానే ట్రైన్ విల్లుపురం దగ్గరికి వచ్చింది. ఇక ఆ తర్వాత ట్రైన్ వెళ్ళటానికి వీల్లేదు, అందరూ దిగిపోతున్నారు అప్పుడు మౌల్వీ భుజం తట్టి, "ట్రైను ఇకపై వెళ్ళదు మీరు కూడా దిగండి" అన్నప్పుడు వారు దిగటం. విల్లుపురం లో దిగినటువంటి వెంకట్రామన్ కి అరుణాచలం ఎక్కడ ఉన్నదో తెలియదు. కానీ అరుణాచలం వైపు మాత్రమే ఆయన పాదాలు సాగినాయి. నడిచి నడిచి సుమారు మూడు రోజుల తర్వాత వారు అరుణాచలానికి చేరుకున్నారు. అరుణాచలానికి చేరుకొని వారు వెళ్ళినటువంటి ప్రదేశం ఏమిటంటే అరుణాచలేశ్వర దేవాలయం. నిజానికి పూజాది కాలాన్ని ముగించుకొని పూజారి తలుపు తాళం పెట్టుకొని వెళ్ళాలి. ఆ రోజున తాళం వేయటం మర్చిపోయినాడు ఆయన. ఆయన వెళ్ళిపోయినాడు. దేవాలయంలో ఎవ్వరూ లేరు. ఆ సమయంలో ఎవరో పిలిచినట్లుగా ఎటాయకన అరుణాచలేశ్వర దేవాలయ గర్భాలయంలోకి వెళ్ళి అరుణాచలేశ్వర లింగాన్ని ఆలింగనం చేసుకొని, "తండ్రీ! నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను. ఇకపై అంతా నీ ఇష్టం" అన్నారు. ఇది శరణాగతి.సమర్పణ చేసుకుని బయటకు వచ్చేశారు. కోనేట్లో తన దగ్గర మిగిలి ఉన్నటువంటి డబ్బుతో శిరోముండనం చేయించుకున్నారు. తనకున్నట్టు తనకు కట్టుకున్నటువంటి బట్టలు విప్పి పక్కన పడేసి కౌపీనం ధారణ చేసి ఆ మిగిలిన డబ్బు కూడా కోనేట్లో పడేసి అక్కడే ఉన్నటువంటి పాతాళ లింగం అనేటువంటి ఒక లోతుగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్లి పాతాళ లింగానికి ఒక మూల, ఐమూలగా కటిక చీకటిలో తరుణ్ తాను నిలబెట్టుకున్నారు. ఆ నిలబెట్టుకోవటం నిలబెట్టుకోవటం చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు శేషాద్రి స్వామి అని ఆయన ఒక అవధూత, ఆయన ఒక ఉన్మత్తుడు. ఆయన అరుణాచల దేవాలయంలో అటూ ఇటూ హడావుడిగా తిరుగుతూ ఉంటే, "ఏమి స్వామి ఎందుకక్కడ తిరుగుతున్నారు?" అని అందరూ అడిగితే, "మీకెవరికీ తెలియదు, పాతాళ లింగం వెనుక ఒక మహాపురుషుడు తీవ్రమైన తపస్సులో ఉన్నారు వారిని బయటకు తీసుకురండి" అంటే అప్పటికి ఈ వెంకట్రామన్ దేహానికి మొత్తం పురుగులు పట్టి ఉన్నది శరీరం. పాములు కరిచినై, తేళ్లు పాకినై కానీ చరణం లేదు. గోళ్ళు పెరిగినై. ఆ తల జుట్టంతా కూడా బాగా పెరిగిపోయింది. శిరోజాలు నేలకంటే ఎంతగా ఉన్నాయి. అటువంటి సంస్కారహీనమైనటువంటి ఒక స్థితిలో ఉండగా శేషాద్రి స్వామి ఎవరినో పిలిచి వారిని బయటకు తీసుకురమ్మంటే ఒక కట్టెని మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చారు. ఆ సమయంలో సంస్కరణ చేసి ఆ సంస్కార క్రతువు పూర్తి కాగానే వారికి స్నానం చేస్తే, చేయిస్తే, అక్కడి నుంచి ఆయన అరుణాచలం మీదికి వెళ్లిపోయినారు. అప్పుడు ఆయనకి ఉన్నటువంటి పేరు బ్రాహ్మణ స్వామి లేదా మౌన స్వామి. ఇలా సాగుతున్నటువంటి సమయంలో మహా మంత్రద్రష్ట సంస్కృతాంధ్ర భాషలలో అపురూపమైనటువంటి అంచులు చూసినటువంటి ఒక మహాపురుషుడు మహా తపస్వి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ఒక మహాత్ముణ్ణి వెతుక్కుంటూ వచ్చి అరుణాచలానికి రావటం అరుణాచలంలో పైన మహర్షి ఉండటం అప్పటికి ఇంక ఆయన మహర్షి కానే, ఇంకా వెంకట్రామన్ లేదా మౌనస్వామి లేదా బ్రాహ్మణ స్వామిగా పిలవబడుతున్నటువంటి సమయంలో ఈ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని రమణుల దగ్గరకు వెళ్లి "పధ్నాలుగు సంవత్సరాల చిర తపస్సు చేశాను. కానీ నాకు చిత్తశాంతి లేదు, కారణం ఏమిటి?" అని అడిగినప్పుడు రమణ మహర్షి ఇంకా రమణ మహర్షిత్వాన్ని పొందనటువంటి వెంకట్రామన్ కంఠనాళాలు సవరించుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క పలుకు పలుకుతూ "నేను అనబడేటువంటి ఒక భావన ఎక్కడ ప్రారంభమై తిరిగి తిరిగి ఏ నేనులో లీనమై పోతున్నదో అది తెలుసుకోగలిగితే దాని పేరు తపస్సు" ముగిస్తాడు ప్రవచనం. గణపతి మునికి తపస్సు అంటే ఏమిటో అర్థమైంది. కానీ రెండవ ప్రశ్న మిగిలిపోయింది. "తపస్సు అంటే ఏమిటో నాకు చెప్పండి. నా తపస్సు ఫలించినట్లు నాకు గుర్తు ఎట్లా?" అని అడిగారాయన. అప్పుడు వెంకట్రామన్ "తపస్సు చేస్తున్నంత సేపు మీరు ఈ ప్రపంచంలో ఉంటారు. తపస్సు ముగియగానే ప్రపంచం మొత్తం మీలో ఉంటుంది. అదే పూర్ణత్వం, అదే తపస్సు" అని సమాధానం ఇచ్చిన సమయంలో దక్షిణ దిక్కు నుంచి ఆరు కాంతి కిరణాలు వెంకట్రామన్ ఆజ్ఞాచక్రం మీద అంటే కనుబొమ్మల మధ్య మనం ఎక్కడైతే తెలిక ధారణ చేస్తామో దానిమీద ఆ కిరణాలు ఆరు సార్లు వచ్చి తాకినప్పుడు సహజమైనటువంటి కవితాధార ఉన్నటువంటి వాఙ్మయ మూర్తి వాఙ్మయ స్ఫూర్తి అయినటువంటి గణపతి ముని "మీరు స్కందులా?" అని అడిగారు. అంటే "మీరు సుబ్రహ్మణ్యస్వామి యొక్క అంశ?" అని అడిగారు. దానికి "మేము ఎవరైతే మీకేమి? మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మమ్మల్ని గురించి తెలుసుకున్నందువల్ల మీకు కలిగే లాభం ఏమీ లేదు. మీ ప్రయత్నం మీరు కొనసాగించండి" అని ప్రథమ ఉపదేశం చేశారు గణపతి మునికి. ఆ స-- ఇక ఆ క్షణం నుంచి సాగినదంతా కూడా ఒక అపురూప సన్నివేశం. ఆ సందర్భంలోనే ఈ వెంకట్రామన్ అనే పేరు కాదు అని ఆయన, ఈయన రమణ అనేటువంటి పదానికి సంపూర్ణమైన అర్హత ఉన్నటువంటివారు. కారణం రమణ శబ్దంలో మరణం ఉన్నది, రణం ఉన్నది, చరణం ఉన్నది, కారణం ఉన్నది, విచారణ ఉన్నది. ఇన్ని ఉన్నాయి గనుక మీరు సాక్షాత్తు భగవత్ స్వరూపమే. గనుక భగవాన్ రమణ మధ్యలో శ్రీ శకార, రకార, ఈకారములు మూడు కలిపితే ఒకటి శ్రీకారం అవుతున్నది గనుక భగవాన్ శ్రీ రమణ. అక్కడికి వచ్చాయి. వీరిని ఏమనాలి? అంటే మహర్షి అని పిలవాలి. ఎందుకంటే మనిషి మనీషి అవుతాడు, మనీషి ఋషి అవుతాడు, ఋషి బ్రహ్మర్షి అవుతాడు, బ్రహ్మర్షి మహత్తుని ఎరిగినప్పుడు మహర్షి అవుతాడు గనుక సర్వజ్ఞుడు అయినటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మకు సంకేతమైన ఈ వెంకట్రామన్ ఇకపై భగవాన్ శ్రీ రమణ మహర్షిగా లోకప్రసిద్ధులు అవుదురు గాక అని తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ క్షణం నుంచి తిరుచ్చీలో పుట్టి మదురై మెట్టి అరుణాచలానికి చేరుకున్నటువంటి వెంకట్రామన్ భగవాన్ శ్రీ రమణ మహర్షిగా ఇక్కడ మనకి అనుభవంలోకి వచ్చారు. ఇవన్నీ కూడా మనం తలుచుకున్నట్లయితే శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు తదదిగా గల అవతార మూర్తులంతా కూడా వారు పుట్టిన ప్రదేశాల నుంచి దూరంగా వెళ్లిపోయినారు.అలాగే ఒక్కసారి అంటే కాలాంతరంలో ఇన్ని అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి కదా, ఇంత వేడి ప్రదేశం అయినటువంటి అరుణాచలాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు అని భగవాన్ ని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా కరుణామృత జలధి అరుణాచలం ఇది" అని. ఇక్కడ దేవీదేవతలను ఉపాసించినప్పుడు అనేక మంత్రాలు, అనేక క్రతువులు, యజ్ఞాలు ఇవన్నీ చేయాలి. ఇక్కడ కేవల స్మరణం చేత మాత్రమే అంటే అరుణాచల శివ అంటే చాలు నీకు పరముక్తి లభిస్తుంది. ముక్తి వేరు, పరముక్తి వేరు. ముక్తి అంటే జీవన బాంధవ్యాల నుంచి, బంధనాల నుంచి బయటపడటం. పరముక్తి అంటే జన్మ చక్రాల నుంచి, ఆ బంధనంలో నుంచి బయటపడటం. కాబట్టి "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలదా" బై మీర్ చాంటింగ్ అరుణాచల మీకేం వస్తుందంటే పరముక్తి లభిస్తుందని ఒక శాసనం చేశారు. ఆ శాసనం ప్రకారమే భగవాన్ జీవితం అంతా కూడా సాగిపోయింది. దీనిలో అనేకమైనటువంటి విషయాలు. ప్రధానంగా ఆత్మవిచార మార్గాన్ని భగవాన్ ఈ ప్రపంచానికి అందించటానికై వచ్చారు. ఎందుకని అంటే వేద వాంగ్మయంలో ఎక్కడా ఆత్మను గురించిన విచారణ లేదు. ఉపనిషత్తులలో అక్కడక్కడ చెప్పబడింది. యోగీశ్వర కృష్ణుడు వచ్చేసరికి, నిజానికి ఈ రెండింటి మధ్య కాలంలో ఉన్న రామచంద్రుడి సమయంలో అంటే త్రేతాయుగంలో వశిష్టుల వారు, రాముడు ఆత్మ గురించి మాట్లాడుకోలే, మనస్సు గురించి మాట్లాడుకున్నారు. దాని పేరే యోగవాసిష్ఠం. ద్వాపర యుగం వచ్చి, ద్వాపర యుగ అంతంలో చివరిలో మహాభారత సంగ్రామ వేళ రణమధ్యంలో ఉన్నటువంటి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ప్రబోధం చేస్తూ అప్పుడు "ఆత్మ నీట నానదు, నిప్పున కాలదు, కుంగదు, పొంగదు, లొంగదు" అని ఆత్మ స్థితిని చెప్పి అక్కడ వదిలేస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి శంకర భగవత్పాదులు కలియుగంలో "శంభోర్ మూర్తిశ్చరతి భూనే శంకరాచార్య రూపా" పరశివు-పరశివావతారం అయినటువంటి శంకర భగవత్పాదులు ఆత్మను గురించి ఆత్మబోధ చేశారు, అద్వైతం చెప్పారు, ద్వంద్వం చెప్పారు, ద్వైతం చెప్పారు, ద్వంద్వాతీతం చెప్పారు, గురువుల గురించి చెప్పారు, దక్షిణామూర్తిని గురించి చెప్పారు. నూట నలభై మూడు ప్రకరణాలు భాష్యాలు రాశారు. కానీ ఇన్ని చెప్పిన భగవత్పాదులు కూడా చివరికి ఆత్మ అంటే ఏమిటి? అంటే ఆత్ అంటే ఏమి? మా అంటే లేదు. ఏమీ లేదు అంటే లేదని కాదు, ప్రత్యేకంగా లేదు. "సర్వం ఖల్విదం బ్రహ్మ" ఉన్నదంతా బ్రహ్మమే అని ఒక ప్రతిపాదన చేసినటువంటి సమయంలో మానవుడు ప్రశ్నల ద్వారా, సందేహాల ద్వారా సమాధానాలు పొందుతాడు. వాడు జిజ్ఞాసి. కనుక అందరూ ఆత్మను గురించి చెప్పారు. మన శరీరంలో అసలు ఆత్మ ఎక్కడ ఉన్నది? దాని స్వరూపం ఏమిటి? దాన్ని కనుగొనటం ఎట్లా? జీవిత పరమార్థం ఏమిటి? అని అనేక ప్రశ్నలు పొటమరించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ఆగమనమే భగవాన్ శ్రీ రమణ మహర్షి. వారు ఆత్మ విచార మార్గాన్ని ఎందుకు చెప్పారు అంటే, నేనెవరు అన్న ప్రశ్న వేసుకో, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు దాటి, మనో, బుద్ధి, చిత్త అహంకారాలు దాటి, ఎనిమిదవ గదిలోకి వెళ్ళినప్పుడు అనుభవంలోకి వచ్చేది ఆత్మ కాబట్టి, ఆ గది మన లోపలే ఉన్నది గనుక అది ఎక్కడ ఉన్నది అంటే మామూలుగా మూలాధార, స్వాధిష్ఠాన, మణిపూరక, అనాహత చక్రాల వరకు వచ్చి అంటే హృదయ స్థానం వరకు వచ్చి, కుడి రొమ్ము వైపు గనుక మనం ప్రయాణం చేయగలిగినట్లయితే అక్కడ హృద్గుహ అని ఒకటి ఉన్నది. అంటే It is a cave like heart. "హృదయ గుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం, యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి, హృది విశ మనసా స్వం చిన్వతా మజ్జతా వా, పవన చలన రోధాత్ ఆత్మ నిష్ఠో భవత్వం". ఒక దీపాన్ని వెలిగించి చిలులు ఉన్నటువంటి ఒక పాత్రను దానిమీద పెట్టినప్పుడు, దాని చుట్టూ ఎన్ని జంజామారుతాలు వీచినా, లోపల ఉన్నటువంటి దీప కళిక నిశ్చలంగా ఎలా ఉన్నదో, శరీరానికి తొమ్మిది ద్వారాలు ఉన్నప్పటికీ కూడా ప్రాణం ఎటు నుంచి పోతుందో ఎవరికీ తెలియనప్పటికీ, ప్రాణం పోయినా నిలకడ చెంది ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది నీ యందు "యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి" ప్రకాశమానమై, జ్యోతిర్మయమై నిలకడ చెందింది. దీనికి ఆత్మనిష్ఠ, ఇదే ఆత్మవిద్య అని ఒక అద్భుత శ్లోకంలో శరీరంలో ఉన్నటువంటి ఆత్మ స్థావరాన్ని, ఆత్మ యొక్క స్థితిని మనకి అర్థమయ్యేట్లుగా చెప్పారు. ఇక ఆ తర్వాత అనాహతం దాటి గనుక వెళ్లినట్లయితే విశుద్ధ చక్రం ఉంది, ఆజ్ఞా చక్రం ఉంది, అక్కడన్నీ దృశ్యాలు కనిపిస్తాయి. సహస్రారం దాకా వెళ్తాం. అది ఒక త్రీయ స్థితి. త్రీయాతీతమైన ఎనిమిదవ చక్రం కూడా ఉంది. అది యట్ చక్రం అంటాము. అది సోమ చక్రం అని కూడా దానికి పేరు. అది యోగశాస్త్రం. కాబట్టి భగవాన్ రమణులు ఆత్మ మన దేహంలో ఎక్కడ ఉన్నదో చెప్పి గొప్ప పరిష్కారాన్ని ఈ ప్రపంచానికి చూపించారు. అయితే కేవలము జ్ఞాని అయినందువలన ప్రాపంచిక బంధనాల నుంచి దూరంగా ఉన్నారా, జ్ఞానికి కర్తవ్యాలు ఉంటాయా అని ప్రశ్న వేసినప్పుడు "ఎందుకుండవు?" అన్నారు. ప్రారబ్ధాలు కూడా ఉంటాయా అని మరొకరు ప్రశ్న వేశారు. "అవి మాత్రం ఎందుకుండవు? తనకు అక్కరలేని ఒక దేహాన్ని తీసుకుని ఈ ప్రపంచంలోకొచ్చి ఉన్నంతకాలము దాన్ని నిలబెట్టటం అనేది ప్రారబ్ధం కాక ఇంకేమి?" అని సమాధానం ఇచ్చారు.అయితే భగవాన్ అనంగానే మౌనాన్ని గురించిన దక్షిణామూర్తిని గురించిన ఆలోచనలు మనకు కలుగుతాయి. వారు అస్సలు మాట్లాడకుండా ఉండలేదు. మాట్లాడవలసినప్పుడు ఈ ప్రపంచానికి ఏది అవసరమో, ఏది అక్కరకు వస్తుందో, ఏది తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్లి జీవిత పరమార్ధాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలడో దానికి కావలసినటువంటి మాటలు మాత్రం చెప్పారు. భగవద్గీత మీద మాట్లాడారు, కైవల్యనవనీతం మీద మాట్లాడారు, విదియపురాణం మీద మాట్లాడారు. అనేకమైన సనాతనమైన వైదికమైన ఆర్షమైన భారతీయమైనటువంటి ఒక మహా సంస్కృతిని మామూలు ఆత్మవిచార మార్గంలోకి తీసుకొచ్చి కేవలం కర్మ భక్తి యోగాలు మాత్రమే కాదు జ్ఞానయోగమే అత్యుత్తమమైనది. జ్ఞానంతో కూడిన భక్తి, జ్ఞానంతో కూడిన కర్మ ఇది ఒక విచార ధారగా ఈ ప్రపంచానికి అందించినటువంటి మహా చైత్య పురుషులు ఎవరు అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి. అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఆయన ప్రపంచానికి ఏ రకమైనటువంటి ఆ మభ్యపెట్టేటువంటిది కాకుండా ఒక సత్యాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరిస్తూ నిన్ను మించి ఈ ప్రపంచంలో మరొకటి లేదని అలాగే వారి జీవిత కాలంలో ఏనాడూ కూడా దేవుడు అన్నమాట వాడలేదు. కారణం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. కంటికి కనబడని ఈశ్వరుడు ఎప్పటికైనా కనుగొనవలసినటువంటి ఆత్మ ఈ రెండింటిని అనుభవిస్తున్నటువంటి ఈ జీవుడు అట్లాగే ఈ జీవుడు ఈ జగత్తు జగన్నాయకుడైన జగదీశ్వరుడు అన్నీ ఒక్కటే అంతా ఒక్కటే కానీ అనేకమై కనిపిస్తున్నాయి. ఏకోహం బహుష్యామ్ అని ఒకటి. ఏకం సత్ సత్యం ఒక్కటే విప్రా బహుధా వదంతి. విజ్ఞులైనవారు, ప్రాజ్ఞులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు అదే విషయాన్ని అనేక కోణాల్లో చెప్తున్నారని అనేకమైన విషయాలకి ఆయన పరిష్కారం చూపి జ్ఞాన మార్గోపదేశనం చేసి ఒక అనుభూతిని, ఒక అనుభవాన్ని కర్మనిష్ఠలో నుంచి మోక్ష ప్రాప్తి వరకు ఉన్నదాన్ని ఉపదేశ సారంగా మనకు అందించారు. కర్తృరాజ్నయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జలం అంటూ ఒక మహోదృతతో సాగిపోయేటువంటి ఉపదేశ సారమంతా కూడా భారతీయ తత్వ సిద్ధాంతానికి యోగశాస్త్రానికి నిఖశోపలం అంటే గొప్ప ఉదాహరణ. అది, అది వాఙ్మయ సృష్టి. అలాగే అనేకమైనటువంటి విషయాలు అతి సులభంగా భక్తులకి సూచన చేశారు. ఇక దేహాత్మ భావన వదిలిపెట్టమని చెప్పిన భగవాన్ రమణులు నిజానికి దేహాత్మని ఆయన జయించారు, దాటేశారు. ఒకరోజున ఇరవై ఒక్క అడుగులు ఉన్నటువంటి గోధుమ వన్నె తాచుపాము ఆయన పాదాల మీదిగా పాకుతూ వెళ్ళిపోతూ ఉంటే వారికి స్పృహ లేదు. అందరూ భయపడిపోయి భగవాన్ని కాటు వేస్తుందేమో, కాళ్ళను చుట్టేస్తుందేమో కానీ దాన్ని ముట్టుకోకు, ముట్టుకుంటే మనకేమి ప్రమాదం అని అనుకుంటే అది ఏమి చేయలేదు పొదల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత భగవాన్ని అడిగారు, "ఈ పాము మీ మీదగా పాకి పోతున్నప్పుడు మీకు భయం కలగలేదా?" అని. అప్పుడు వారన్నారు, "It was cold and moist." చల్లగా, చెమ్మగా ఉంది అంతే అన్నారు. అంటే ఆ శరీరం దీనిని స్పృశించినప్పుడు ఆయన ఇంద్రియాలకు లోబడిన ఒక అనుభూతిని అంత అందంగా చెప్పేశారు. అలాగే కోతులు, ఉడతలు భగవాన్ దగ్గర చుట్టూ ఒక పరివారం లాగా, బంధువుల్లాగా, బిడ్డల్లాగా చేరితే అక్కడ భక్తులందరూ కొబ్బరికాయ కొట్టి లోపలికి వస్తూ ఉంటే, "కోతులన్నీ ఎత్తుకుపోతున్నాయి భగవాన్! ఏమి మేము తీసుకెళ్లలేకపోతున్నాం, ఇక్కడ ఇవ్వలేకపోతున్నాము. వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేయించండి" అని అడిగినప్పుడు వారు ఒక మాట అన్నారు. "నిజమే, వారున్న ప్రదేశంలోకి మనం వచ్చి వారిని వెళ్ళమనటం ఏమిటి? వారు మనల్ని ఇక్కడ ఉండనిచ్చారు, వారి పట్ల కృతజ్ఞతతో ఉందాం" అన్నారు. తర్వాత వాడు, అది అనే రెండు పదాలు ఆయన జీవితకాలంలో ఆయన వాడలేదు. అది జడమైన చెట్టు కావచ్చు, నెమలి కావచ్చు, చీమ కావచ్చు, కాకి కావచ్చు, ఇవి ఏదైనా గోవు కావచ్చు దేనినైనా, ఏ వస్తువునైనా వారు అని ఆ సర్వ జీవుల యందున్నటువంటి ఆత్మతో ఒక అనుసంధానమైనటువంటి మహా జ్ఞాన స్వరూపులు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అలాగే ఎంతో, ఎంతోమంది భక్తులు వారి దగ్గరకు వచ్చి అనేక సందేహాలు వెలిబుచ్చినప్పుడు ఆయా దేశకాల పరిస్థితులకి ఆ అడిగిన సాధకుడి యొక్క ప్రాప్తిని బట్టి, యోగ్యతను బట్టి, అర్హతను బట్టి, పరిణామ ప్రాప్తిని బట్టి సమాధానమిస్తూ భారతీయమైనటువంటి ఒక అధ్యాత్మని సంపూర్ణము, సుసంపన్నము చేసినటువంటి వారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. వారిని చిదంబరం రావలసిందిగా చిదంబరం ప్రజలందరూ వచ్చి వారిని అడిగితే వారు కదలలేదు. "మరి వెళ్లాలేదా? చిదంబరంలో నటరాజస్వామి దేవాలయం. ఏముందో ఒకరోజు అక్కడికి వెళ్లి రావచ్చు కదా" అంటే వారు ఒక్క మాట అన్నారు. "చూడండి, చిదంబరంలో నటరాజ దర్శనం కన్నా, తిరువయ్యూరులో జన్మ ఎత్తటం కన్నా, కాశీలో గంగాస్నానం కన్నా అరుణాచలంలో నిలకడగా ఉండటమే పరముక్తికి దారి" అని చెప్పారు. అంతే కాదు, "ఇక్కడ అరుణాచలంలో అరుణాచల దేవాలయంలో ఉన్న అరుణాచలేశ్వరుడు పలకడు. అరుణాచలమైనటువంటి కొండ పలకదు. మహర్షి పలకడు. ఇక్కడ మౌనమే విభూతి" అని అంటూ అక్కడ శివకామసుందరి ఎక్కడ చిదంబరంలో నటరాజస్వామి అచలుడై కూడా ఉండవలసి కూడా పరమేశ్వరుడు తన భార్య అయినటువంటి శివకామసుందరితో కలిపి నాట్యం చేస్తాడు. అది ఒక స్థాయి. అరుణాచలంలో అభీత కుజాంబిక ఒకే గర్భాలయంలో ఉండదు. ఆమె గదిలో ఆమె ఉంటుంది.ఆయన గదిలో ఆయన ఉంటారు. ఎవరి దారి వారిదిగా ఉండి ఒక జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అని మనం అంటాం. ఆ ఇద్దరూ కూడా ఉండి జగత్పాలన చేస్తూ అపీత కృచాంబికగా అమ్మవారు స్థిమితమైన అచలమూర్తిగా అరుణాచలేశ్వరుడు అరుణాచలం అంటున్న రుణానచల అరుణాచల. అరుణాచలం వెళ్లినట్లయితే ప్రాపంచిక బంధనాలన్నీ రుణాలు తెగిపోతాయి. అలాగే అటూ ఇటూ పరిగెత్తేటువంటి మనస్సు చలమై స్థిరమై సంస్థితమై నిభృతమై నికేతనమై నిరంజనమై నిరాకార పరబ్రహ్మ తత్వాన్ని అవగాహనకి అనుభవ పరిధిలోకి తెచ్చేటువంటి అరుణాచలమే సమున్నతమైనది అని భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచల మహాత్మ్యాన్ని కేవల పురాణ గాథగా కాక ఒక విశేషమైనటువంటి అర్థంతో వారు చెప్పారు. అందుకనే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు తమ పదహారవ ఏట అరుణాచలానికి వెళ్లి అక్కడి నుంచి వచ్చిన తర్వాత భజన సాంప్రదాయంలో మొట్టమొదటి భజన రాశారు. మానస భజరే గురు చరణం దుస్తర భవసాగర తరణం అని ఆ భజన రాస్తూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో అంటూ అరుణాచలానికి విశేషమైన ప్రాముఖ్యాన్ని దాని విశిష్టతని ప్రపంచానికి తాము కూడా తెలియపరిచారు. దాన్ని కూడా వెళ్ళ గుర్తు చేసుకోవాలి. అలాగే జీవ కారుణ్యం అందరి యెడ సమభావం. ఎవరికీ మంత్రదీక్షలు గాని ఇది చేయండి జరుగుతుంది అనేటువంటి భావన గాని లేకుండా కర్త ఏ ఏది చేయాలని నిర్ణయించాడో దాని ప్రకారం వెళ్ళండి. ఎందుకంటే జీవుడు తన ప్రారబ్ధాన్ని బట్టి కర్త చేత ఆడింపబడతాడు. కనుక మనం ఏదో అనుకున్నాము ఇది జరుగుతుంది అనుకుంటాం అది జరగదు. ఇది జరగకూడదు అని ఎంతో నిరోధిస్తాం అది జరగక మానవు. కాబట్టి దీనిలో మన కర్తవ్యం ఏమిటంటే మౌనం వహించటమే అత్యుత్తమం అని తన తల్లి అడగమ్మకి చేసిన బోధ సార్వకాలికమై విశ్వజనీనమై ఆ మానవాళి ఉన్నంత కాలం కూడా మన జీవితాన్ని పరామర్శ చేస్తుంది. కాబట్టి భగవాన్ తన దగ్గర వచ్చినటువంటి గోవు ఆ గోవుకి లక్ష్మి అని పేరు. ఇవాల్టికీ ఆ సంతతి ఉంది. ఆ గోవులో తల్లిని చూశారు ఆయన. అలాగే అక్కడికి వచ్చిన పాశ్చాత్య దేశీయులు ఒక పాల్ బ్రంటన్ చాడ్విక్ కోహన్ ఆ అర్థర్ అస్బోర్న్ ఆ లూషియా అస్బోర్న్ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి వారో అక్కడికి వచ్చినప్పుడు మనం ఆనాటి అరుణాచలాన్ని గనక గుర్తు చేసుకున్నట్లయితే ఏ వసతీ లేదు. యాభై రెండు డిగ్రీలలో మలమలు మార్చేటువంటి ఎండ. మరి భగవాన్ వీళ్ళందరూ చలి ప్రదేశం నుంచి వచ్చి ఇక్కడ ఏముందని వచ్చి ఇక్కడ కూర్చున్నారు? వీళ్ళు ఎవరు? అని అడిగినప్పుడు భగవాన్ ఒక పరిష్కారం చెప్పారు. వీరంతా అసలు ఇక్కడి వారే. ఆ-ఆ దేశాలు ఎలా ఉంటాయో అని ఒక ఆలోచన కలిగి వారక్కడ జన్మ తీసుకుని మళ్ళీ వారి మూల స్థానంలోకి వచ్చారు. మనం ఎప్పుడైనా మూలంలోకి వెళ్ళాలి. సుఖం కలిగినా దుఃఖం కలిగినా అనుభవం కలిగినా కలగకపోయినా దీనికి కారణం ఏమిటన్న ప్రశ్న వేసుకుని ఆ మూలంలోకి దొరబడి మనం వెళ్లగలిగినట్లయితే మూలాన్వేషణలో అంతా సరిపోతుంది అని ఒక అద్భుతమైనటువంటి భావన. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణా మూర్తిని గురించి చెప్పమని అడిగినప్పుడు నిజంగా మౌనంలో అంత సేపు ఉండగలవా అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యధా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం అన్నటువంటి దక్షిణామూర్తిని గురించి భగవాన్ ఒక్క పలుకు పలకల. పెదవి విప్పలేదు. అటువంటి సమయంలో ఈ అడిగిన వారందరూ కూర్చుని ఉన్నారు. దక్షిణామూర్తి గురించి చెప్పమని వీళ్ళు అడిగిన మరుక్షణమే వారు మౌనం వహించారు. ఆ మౌనం కొన్ని గంటలు సాగింది. ఉన్నటువంటి వారంటే అడిగిన వారికి కూడా అదే అనుభవం కలిగింది. అంటే వారు వీక్షణ దీక్ష ద్వారా కంటి చూపు ద్వారా తలపు ద్వారా ఆలోచన ద్వారా సంకల్పం ద్వారా సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఇది సర్వోత్తమమైనటువంటి దృష్టి. ఇక వారిని కూడా మాయ అంటే ఏమిటి అని ఎవరో అడిగారు. ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు వచ్చి వారి దగ్గర మూడు రోజులు కూర్చున్నారు. భగవాన్ ఆయనతో మాట్లాడలా. ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేయలా. మూడు రోజులు ఉన్నారు. మూడు రోజులు అయిపోయింది ఆయన లేచి భగవాన్ కి నమస్కరించుకొని ఆ బయటకు వెళ్తున్నటువంటి సమయంలో మాయ అంటే ఏమిటి అని అడిగిన వాడు ఒక్కడు భగవాన్ దగ్గర ఉన్నారు. మిగిలిన వారంతా ఆయన వెంబడి వెళ్లారు. అప్పుడు భగవాన్ న-నవ్వుతూ చమత్కార పూర్వకంగా ఏమన్నారంటే మాయ అంటే వారు ఇక్కడికి వచ్చి ఏ మహా స్థితిలో ఇక్కడ మూడు రోజులు గడిపారో వారి వెంబడి వెళ్లిపోయినారు అసలు దాన్ని వదిలిపెట్టి దీన్ని మించిన మాయ ఏమున్నది అన్నారు. చూశారా. కాబట్టి అనేకమైనటువంటి విషయాలని ప్రతీకాత్మకంగా పరోక్షంగా అపరోక్షంగా అద్భుతంగా ఆవిష్కరించినటువంటి భగవాన్ రమణులు వారికి శరీరానికి అంటే ఎడమ భుజం మీద ఒక వ్రణం ఏర్పడింది. ఆ వ్రణము నెమ్మది నెమ్మదిగా పండిపోతున్నప్పుడు పెరిగిపోతున్నప్పుడు అది పగిలి చీము నెత్తురు కారుతున్నప్పుడు భక్తులు తట్టుకోలేక మీ పేరు చెప్పి మీ ఫోటో ముందు పెట్టుకొని మాకున్న కష్టాలన్నీ విన్నవించుకుంటే అన్నీ పోతున్నాయి. మీరు మీ ఒంటి మీద వచ్చినటువంటి వ్రణాన్ని కూడా అలా వెళ్లగొట్టకూడదా? చూట్టానికి బాధగా ఉంది అంటే వారన్నారు. నిజమేమీరు చాలా మంది వచ్చారు ఇందులో ఏ ఒక్కరినైనా వెళ్లిపోండి అని ఎప్పుడన్నా మేము అన్నమా? అనలేదే. లేదు మీరు ఉండండి అని పిలిచామా? వారు అలాగే వచ్చారు. వారు ఉండవలసినంత కాలం ఉంటారు. వారి దారిన వారిని ఉండనివ్వండి అన్నారు. అది. ఇది ఆ ఆధ్యాత్మిక చరిత్రలో ఆ ఒళ్ళు జలదరించేటువంటి సన్నివేశం. అయినా భక్తులు పట్టు వీడకుండా, "భగవాన్ మీరు అలా తప్పించుకోవద్దు. ఏమైనా సరే మీరు ఇవాళ సంకల్పం చేసి ఆ పుండు మానేట్టుగా చూడండి" అన్నప్పుడు ఒక బేలగా నిస్సహాయంగా ఒక పసిబాలుడు వలె అందరి వైపు చూస్తూ, "అవును సంకల్పాలు చేసుకోవటానికి మీ అందరికీ మీ మీ మనసులున్నాయి. ఇక్కడ మనసే లేదే! అది ఎప్పుడో లీనమై, లయమై, నశించిపోయిందే. ఎలా సంకల్పించటం?" అని బేలగా అడిగిన సందర్భం చూసినప్పుడు అది ఒక జ్ఞాని, ఒక పరమోత్కృష్టమైనటువంటి ఆ అవతారమూర్తి ఎలా ఉంటారు అనేది మనకి ఆ ఒక అనుభవంలోకి వస్తుంది. అటువంటి భగవాన్ మరి కాలగమనంలో శరీరం వచ్చింది కాబట్టి శరీరం పోవాలి. అది అసలు పోవటానికే వస్తుంది కాబట్టి వారికి కూడా ఆ సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ పధ్నాలుగు, పంతొమ్మిది వందల యాభై, రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలకి పరమ ప్రశాంతంగా వారి దేహం వదిలిపెట్టారు. ఆ దేహం వదిలిపెట్టడానికి కొన్ని క్షణాల ముందు ఒక పరిచారకుణ్ణి పిలిచారు. అతను వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇక భగవాన్ ఉండరు అని అందరూ అనుకుంటున్నారని విన్నాడు. అప్పుడు భగవాన్ అన్న మాటలు రెండు మాటలు. "రేపటి నుంచి ఈ పక్క మీద దుప్పటి మార్చవలసిన పని లేదు" ఒకటి. అనగానే ఇంకా ఏడుస్తున్నాడు. అప్పుడు భగవాన్ చెప్పారు "Thanks" అన్నారు. వాడికి English రాదు. అర్థం కాక అలా చూస్తున్నాడు. అంటే "ఏమీ లేదు Thanks అంటే సంతోషం" అన్నారు కన్నుమూసి. అటువంటి భగవాన్ దేహ పరిత్యాగం, మహాభినిష్క్రమణం జరిగినప్పుడు ఒక వింత జరిగింది. ఆ వింత ఏమిటంటే వారి దేహత్యాగం జరిగిన మరుక్షణమే వారి హృదయ స్థానం నుంచి ఒక కాంతిపుంజం ఒక బంతి వలె ఆకాశమంతా కూడా ఆ వెన్నెల చుమ్ముతున్నట్టుగా వెళ్లి అరుణాచలంలో అది లీనమైపోయింది. ఇది ఆనాటి ప్రముఖ పత్రికలన్నీ కూడా ఫోటోలు తీసినాయి. చూసినవారు చెప్పారు. ఇదంతా అంటే అరుణాచలంకి వచ్చిన భగవాన్ అరుణాచలంలో లీనమై అరుణాచలాన్ని వారు ఇవాళ రమణాచలం చేశారు. ఇది ఒక పరమాద్భుతమైన సన్నివేశం. ఇవాళ ఒక జయంతి నుంచి అంటే స్వామి భగవాన్ పుట్టినటువంటి ఆ క్షణం నుంచి దేహ పరిత్యాగం వరకు మనం కేవలం స్థాలీపులాక న్యాయంగా క్లుప్తంగా దాన్ని మనం ఇవాళ peripheral outline అంటాం. అంతమాత్రమే మాట్లాడుకున్నాం. భగవాన్ చెప్పిన మాటలు, భగవాన్ జీవితంలో జరిగిన అనేకానేక సంఘటనలు, అవన్నీ కూడా ఆ రమణ వైభవాన్ని చెప్పుకోవాలి అంటే అన్న చాలా సమయం పడుతుంది. అయినా ఇవాళ యువత ప్రధానంగా యువత అంటే మన తర్వాత తరానికి రమణుల యొక్క relevance ఏమిటి? వారు ఇంకా అవసరమా ఈ ప్రపంచానికంటే? ఈ జాతి ఉన్నంత కాలం రమణుల అవసరం ఉంది. ఎందుకంటే దేనికి పొందని, దేనికి లోబడని, కేవలము దేహమే నేనుగా, సంపదే నాదిగా, బాంధవ్యాలన్నీ మనవిగా, కడుపున పుట్టిన బిడ్డలందరూ మమతగా, దేహాభిమానం పెరిగిపోతున్నటువంటి ఈ సమయంలో దేహం ఉండేది కాదు. ఇప్పుడు చెప్పుకున్న ఏ ఒక్కటీ ఉండేది కాదు. అవన్నీ మన నుంచి విడిచిపోయవే. కాబట్టి వీడిపోయవి అవే. మన నుంచి ఊడిపోయవి కూడా అవే గనుక మన నుంచి తల్లి గర్భాలయంలో నుంచి వచ్చి మళ్ళీ సమాధి గతమయ్యే వరకు జరిగేటువంటి ఈ జీవన యాత్రంతా కూడా దేహపరంగా జీవనయాత్ర, ఆత్మపరంగా అనంత అమృతయాత్ర అనేటువంటి ఒక భావాన్ని, భారతీయ తత్వ సిద్ధాంతంలో ఉన్న ఒక మౌలిక అంశాన్ని, తన పదహ-పదిహేడవ ఏట పొందినటువంటి ఒక మరణానుభవాన్ని యాభై నాలుగు సంవత్సరాలు అదే దేహంలో నిలబెట్టుకొని నిలకడ చెందటం ఆధ్యాత్మిక చరిత్రలో ఒక పరమోన్నత రమణీయ ఘట్టం అది. అటువంటి భగవాన్ శ్రీ రమణులకు, రమణ మహాస్మృతికి, మహర్షి ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆత్మవిచార మార్గానికి, నేనెవరు అన్న ప్రశ్నకు మనందరం కూడా కృతజ్ఞతాబద్ధులమై, ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ జీవితంలో మనం వాటిని ఆచరిస్తూ మనం కూడా అధ్యాత్మ అనుభవాలని తద్వారా అనుభూతిని కడగా ఆత్మ స్వరూపులమై, అఖండమై, చిద్ఘనమై, అవ్యయమై, అన్వయమై, అద్వయమై, అద్భుతమై నిలకడ చెందే స్థాయికి మనందరినీ కూడా భగవాన్ రమణుల యొక్క దివ్య మహాస్మృతి నడిపించు గాక అని మంగళాశాసనం చేస్తూ ఓం నమో భగవతే శ్రీ రమణాయ.
YouTube · audio
Bhagavan Ramana Maharshi Life history II II Kshetra Channel
Bhagavan Ramana Maharshi Life history II II Kshetra Channel
Source: kshetra channel on YouTube
0:00 / 35:50