No transcript for this section.
Transcript begins at 0:00.
వందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాంశ గరుణం జ్ఞానాగ్ని శైల స్థితాం మజ్ జన్మాంతర పుణ్యపాక విషత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి శ్వరం అలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పృతామి. పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్య సాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఈనాటి ఈ సత్సంగానికి వచ్చినటువంటి సాయి సోదరీ సోదరీమణులు భక్తులు అందరికీ కూడా స్వామి యొక్క దివ్య అనుగ్రహం మహా అమృత వృష్టి వలె కురియాలని స్వామిని నాసా వచసా శిరసా ప్రార్థిస్తూ. అవతార declaration అంటే అవతార ప్రకటన. ఈ అవతార ప్రకటన భగవంతుడి ఎందుకు చేయవలసి వచ్చింది? ఇంతకు ముందు ఇటువంటి సందర్భాలు ఉన్నాయా? కొద్దిగా విచారణ చేసినట్లయితే కృతయుగంలో అవతార ప్రకటనలు లేవు. ఎందుకంటే అమృత లోకం నుంచి భూలోకంలోకి వచ్చినటువంటి అమృతస్య పుత్రాహ వాళ్ళందరూ కూడా ప్రకృతి ద్వారా అంటే అనాత్మ ద్వారా అంటే కనిపిస్తున్న ఈ manifest world ద్వారా science ద్వారా పరమాత్మని చేరుకున్నారు. దానికి వారు ఎంచుకున్న మార్గం ధ్యానం యోగం. దేనిని ఉపాసించారు అంటే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని ఉపాసన చేశారు. ఎందుకంటే అంతకు ముందు వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా భిన్న భిన్నమైనటువంటి కారణాల వల్ల కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినాయి గనుక అవి అవతార ప్రకటన ఏవీ చేయలేదు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఇక త్రేతాయుగం దశావతారాల్లో ఏడు నక్షత్రాలలో పునర్వసు అది ఏడు అయినటువంటి శ్రీరామచంద్రుడి అవతారం వెనుక ఒక చిన్న పౌరాణికమైనటువంటి విషయం ఉంది. అదేమిటంటే భూలోకంలో రావణ బ్రహ్మ వైష్ణవ ద్వేషిగా వీర శైవానికి భక్తుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వైష్ణవులు అంటే విష్ణు పరమైన ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా దాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తూ చేస్తూ తాను లోక కంటకుడిగా మారుతున్నటువంటి ఒక విషయం అది. అంటే శైవ వైష్ణవ సంప్రదాయాల మధ్య ఒక వైరుధ్యం ఏర్పడింది. దానిలో ఒక పరాకాష్టకు ఎడినటువంటి వాడు రావణ బ్రహ్మ. సర్వాంగ సుందరుడైన పరమ వీర శైవాచార్యుడైన వీణావాదనలో యాజ్ఞవల్కున్ని దాటిన వాడైన నవగ్రహాలని అష్టదిపాలకుల్ని కైలాసం చేసుకున్న వాడైన కుబేరుడి యొక్క అమరావతి నగరాన్ని జయించి వచ్చిన వాడైన ఆతని సంపదలన్నీ దోచుకున్న వాడైన నిత్యమూ కూడా నవకోటి శివాలయాలలో కోటి అంటే సమూహం అని అర్థం. తొమ్మిది శివాలయాలలో ప్రతిరోజు కూడా లంకానగరంలో అర్చన అభిషేకం చేసినటువంటి వడు వ్యాకరణ పండితుడు ఇన్ని సద్గుణాలు ఉండి ఒక నీలాంజన పర్వతం లాగా నీల వర్ణంతో కూడిన చీకటి వంటి దేహాన్ని కలిగినటువంటి ఒక రాజస తామస గుణాల యొక్క సమ్మేళనం అయినటువంటి రావణ బ్రహ్మ అప్పటికే ఆ యుగాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి వేళ భక్తులు తపస్సులు ఊనులు వీళ్లంతా కూడా విష్ణులోకానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుకి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా చెప్పుకొని స్వామి నువ్వు ఈ లోకానికి వచ్చి ఈ శైవ వైష్ణవ మతాల మధ్య జరుగుతున్న ఈ వైరుధ్యాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పవలసింది అని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే తప్పకుండా వస్తాను ధర్మోద్ధరణ భగవంతుని కార్యక్రమం అది ఆయన బాధ్యత. దశరథ మహారాజు ఇంట పుడుతా దశకంధరుడు పది తలలు అంటే కంధరుడు అంటే తల దశకంధరుడి యొక్క పది తలలు ఉత్తరిస్తా దశయుగాల వరకు వినబడేటువంటి శ్రీరామ నామంతో శ్రీరామచంద్ర నామంతో జగత్తులోకి నేను వస్తాను అని అభయం ఇచ్చాడు. ఆ ఇచ్చిన తర్వాత పుత్రకామేష్టి యాగం జరగటం శ్రీరాముడు రావడం జరిగింది. అంటే శ్రీ మహావిష్ణువు తన అవతార ప్రకటనని రామావతార ప్రకటనని లోకంలోకి రాకముందే చేశాడు. అది లోకానికి తెలీదు. ఇది రాముడి పరంగా. ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ముందు చెప్పలేదు వచ్చాకే చెప్పలేదు. మహాభారత సంగ్రామ వేళ అక్షౌహిణుల మధ్య కూర్చొని అర్జునుడికి హితబోధ చేస్తూ అంటే కర్మ భక్తి జ్ఞాన యోగాలని ఎలా వినియోగించుకోవాలో చెప్తూ చెప్తూ రెండు ప్రమాణాలు చేశాడు. అంటే మేము ఇలా వస్తాం అవతారాలు ఎందుకు వస్తాయి అని ఒకటి పరిశిష్టాం వినాశాయచ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది మొదటిది. అలాగే యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మానికి గ్లాని జరిగినప్పుడల్లా మేము వస్తూనే ఉంటాము. సృజామ్యహం మమ్మల్ని మేమే సృష్టించుకొని వస్తాం. మాకు ఆ మా సంకల్పాలు మావి అన్నట్లుగా ఒక యుగం సంపూర్ణమయ్యేటువంటి సమయంలో కృష్ణుడు చెప్పాడు. అసలు అవతారాలుచంద్రుడు ఈ రెండు పారిశ్రామిక వాళ్ళు అక్కడ పెట్టుకున్నట్లయితే ద్వాపర యుగం అయిపోయింది కలియుగానికి వచ్చేటప్పటికీ ఇరవై ఒక్క అవతారాలు విష్ణు అవతారాలలో ఇరవై ఒకటి అయిపోయాయి ఇరవై రెండోది ఒక్కటే మిగిలింది కాబట్టి ఇంకా ఆయన రావటానికి లేదు ఇరవై ఒకటి అయిపోయాయి. బ్రహ్మకి అవతారాలు లేవు శివుడికి అవతారం రాలే రాలే అంటే పూర్ణ అవతారంగా రాలేదు ఎప్పుడూ కూడా ఎలా వచ్చాడు అంటే అంశ అవతారంగా శ్రీ మహావిష్ణువు ఒక అవతారం దాల్చి వచ్చినప్పుడు ఆయనకు ఒక అననుకూల పరిస్థితి ఏర్పడినప్పుడు తాను కూడా వచ్చి మోహినీ హస్మాసుర అలాగే ఇప్పుడు రామాయణంలో ఆంజనేయ స్వామిగా కొద్దిసేపు కొంత కార్యక్రమం పూర్తి చేసి శ్రీ మహావిష్ణువుకు తోడుగా కలుపుకొని ఆ యుగాన్ని పూర్తి చేశాడు. ఇది అయిపోయింది మరి అందరూ అయిపోయినారు కదా ఎవరు అని విచారణ చేస్తే కోటి సూర్యమండలం అధిష్టాత అయినటువంటి మహా త్రిపుర సుందరి దేవి ఏమన్నది అంటే కలియుగానికి అధిష్టాత నేను ఇంకెవరూ ఇప్పుడు అవతారాలుగా రారు. అంటే ఆ అవతారాలు విష్ణువు శివుడు అనే ఆ పేరు మీద వచ్చే అవతారాలు రావు నేనే అవతారిణిగా ఉంటాను అవతారిణిగా ఉండి నేను భవతారిణిగా ఉంటాను లోకాలన్నింటిలో జీవరాశులన్నింటికి నేను ఉద్ధారణ ఇస్తాను అనంటే ముప్పైది ముక్కోటి దేవతలు త్రిమూర్తులు త్రిమాతలు అగస్త్యుడు లోపాముద్ర కుబేరుడు నవగ్రహాలు వీళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడిగారు కోటి సూర్యమండలం అధిష్టాయిన నీవు ఒక రూపం తీసుకొని ఈ జగత్తులోకి వస్తే ఈ జగత్తు ఆ చైతన్యాన్ని ఆ తేజస్సుని ఆ వేడిమిని ఆ కోడిమిని ఆ తాళమిని విగ్రహించుకోగలవా అని అడిగారు. అవును వస్తాను కానీ ఇలా వస్తాన శ్రీ లలితా దేవి అనే పేరు మీద నేను వస్తా కాబట్టి కలియుగానికి అధిష్టాత ఎవరు అంటే శ్రీ లలితా అయితే ప్రకృతి పరమాత్మ రెండు కలిసే ఉంటాయి అదే అర్థనారీశ్వర తత్వం పురుషుడిలో స్త్రీ ఉంటుంది కనుకనే అన్ని కార్యాలు ఆమె చక్కబెట్టగలుగుతుంది పురుషుడిలో స్త్రీ ఉంటాడు ఉంటుంది పురుషుడు అన్ని కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నా తాను కన్న బిడ్డలన్నీ తల్లివలే ప్రేమిస్తాడు లాలిస్తాడు ఆలిస్తాడు పాలిస్తాడు అన్ని జరుగుతుంటాయి. కాబట్టి పురుష రూపమైన ఒక చైతన్యం కూడా కావాలి కలియుగానికి ఎవరు అని ప్రశ్నించినప్పుడు ఆమె శ్రీ దత్తుడై వస్తాడు అనే అన్నది ఆ చైతన్యం అంటే కలియుగ ఆరంభ వేళలో శ్రీ లలితా దేవి అధిష్టాతగా శ్రీ దత్తుడు ఒక స్వరూపంగా పురుష రూపంగా వచ్చి సుమారు ఐదు వేల ఏడు వందల ఎనభై ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రకృతిని రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళేమీ ప్రమాణాలు చేయలే మోరు చేసింది అక్కడికి అది అయిపోయింది అది కలియుగ ఆరంభ వేళలో. సరే కాలం గడుస్తు ఉన్నది ప్రపంచం నడుస్తూ ఉన్నది అనేక పోకడలతో పోతున్నది ఇంతలోకి బుద్ధుడు రానే వచ్చాడు. బుద్ధుడు చెప్పినటువంటి దానిని సమన్వయంగా అర్థం చేసుకోలేని శిష్యుల వలన బుద్ధుడు నిరీశ్వర వాదాన్ని అంటే దేవుడు లేడు అని చెప్పాడు మా గురువు గారు అని వీళ్ళందరూ ప్రచారం చేసినందు వలన అఖండ భారతావని యాభై రెండు ముక్కలైపోయింది దేవాలయాలు మూతపడినాయి దేవీదేవతలకి ఏ రకమైన నైవేద్యాలు లేవు ధూపం లేదు దీపం లేదు ఆ నిరీశ్వర వాదం ప్రబలి పోయింది పాపభీతి పెరిగింది పాపభీతి ప్రజానికి తగ్గింది అంటే భయం తగ్గింది పాపం చేయొచ్చు అని ఆలోచన అలాగే సంఘం కూడా ఏ రకమైనటువంటి మార్గోపదేశం లేని కారణంగా విచ్ఛిన్నం కావడం మొదలైంది ఇక దేవుడే లేడు కాబట్టి దైవ ప్రీతి పాపభీతి సంఘ నీతి ఈ మూడు కూడా దూరం అయిపోయినటువంటి సమయంలో మళ్ళీ హైందవ ధర్మాన్ని అంటే సనాతన ధర్మాన్ని భారతదేశంలో మళ్ళీ నెల పెట్టడానికి పునః ప్రారంభం చేయడానికి అందరిలో భగవంతుని యందు ఒక ఆరాధనా భావాన్ని ఒక నమ్మకాన్ని గౌరవాన్ని తీసుకురావటానికి ఒకరు వచ్చారు. వారెవరంటే శంభోర్ మూర్తిహి చరతి భూనే శంకరాచార్య రూపా ఆది శంకర భగవత్పాదులు ఈ జగత్తులోకి ఆ కారణంగా వచ్చారు మరి ఎవరు ఈ శంకర భగవత్పాదులు ఇందాక మనం అనుకున్నామే పూర్ణ అవతారంగా శివుడు రాలేడు అప్పుడప్పుడు వచ్చాడు అని కనుకనే శంకర భగవత్పాదుల యొక్క అవనీ సంచారం కేవలం ముప్పై రెండు సంవత్సరాలు పూర్ణ ఆయుర్దాయంతో ఆయన లేరు. ఈ ముప్పై రెండు సంవత్సరాలలో ప్రపంచానికి ఏం చేయాలో ఏం చెప్పాలో ఏం చేస్తే మానవుడికి భగవంతుని యందు ప్రీతి కలుగుతుందో విశ్వాసం నెలకొల్ప బడుతుందో భగవంతుని దారిలో చాలులో జీవితాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలో అవన్నీ కూడా చెప్పడానికి స్తుతులు నుతులు గీతాలు భాష్యాలు ప్రకరణాలు వ్యాఖ్యానాలు ఎన్నెన్నో ఒక మహా సరస్వతీ ప్రవాహంగా శంకర భగవత్పాదులు ఈ ప్రపంచానికి అంటే ముఖ్యంగా భారతదేశానికి మార్గోపదేశనం చేసి క్షణత స్థాపనాచార్యుడై పదకొండు వందల ఇరవై ఎనిమిది పైగా మతాలు చీలికలై పోతున్నటువంటి వేళ అన్నింటినీ సమన్వయం చేసి కేవలం ఆరు మతాలు మాత్రమే చాలు అంటే ఆరు రకాలైన మార్గాలు మతము అంటే మార్గం. ఆయన ప్రారంభించి భారతదేశంలో నాలుగు ఆమ్రాయపీఠాలు సృష్టించి వాటి వాటికి నాలుగు మహా వాక్యాలకి దర్పణంగా అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే ఈ నాలుగు మహా వాక్యాలకు అనుగుణమైనఋగ్వేదం సామవేదం అధర్వణవేదం ఈ వేదాలు ఆ మహా వాక్యాలు సమన్వయం చేస్తూ భారతదేశం నాలుగు చరగుల నాలుగు అమ్రాయ పీఠాలు పెట్టారు అయితే కంచి పీఠం ఏదైతే ఉన్నదో అది అమ్రాయ పీఠ శంకర భగవత్పాదులు ప్రారంభించినది కాదు మరి ఎవరు అంటే త్రేతాయుగం కంటే ముందే ఉన్నటువంటి పీఠమే కంచి కామకోటి పీఠం ఎట్లా శంకర భగవత్పాదులు వచ్చింది ఈ నాలుగు మాత్రంగా పెట్టారు అంతకుముందు అంటే దశరథ మహారాజు కౌసల్యాదేవి నిశ్శంతులుగా ఉన్న కారణంగా దశరథ మహారాజు మనస్సు కుంగిపోతున్నది ముగ్గురు భార్యలు ఉన్నా సంతానం లేదు ఈ ఇక్ష్వాకు ధర్మాన్ని ఈ రాజ్యాన్ని ఎవరికి అప్పజెప్పాలి అని ఆలోచన పడ్డప్పుడు అయోధ్య నుంచి కంచికి వచ్చారు ఆయన వచ్చి కామాక్షి అమ్మవారికి పూజ చేస్తున్నారు అక్కడ ఆయనకు వచ్చినటువంటి నిదర్శనము మార్గోపదేశము ఏమిటంటే వెనక్కి వెళ్లి పుత్రకామేష్టి యాగం చేయించి నీకు పిల్లలు పుడతారు అని ఈయన అడిగింది ఒక్క ఒక్క బిడ్డ చాలు అనుకున్నాడు ఒక కొడుకు పున్నామ నరకము నుంచి రక్షించడానికి ఒకడు ఓ బిడ్డని ఇస్తే చాలు అనుకున్నాడు అయితే వృక్షామాకృతి యజ్ఞమూర్తిగా రాముడు వచ్చి నాలుగు వేదాలు నలుగురుగా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడుగా వచ్చి త్రేతాయుగాన్ని పరిపూర్తం చేశారు అటువంటి ఆ కంచి కామకోటి పీఠం ఇవాళ ఎక్కడ కంచిలో ఉన్నదో ఆ పీఠం ఈ యుగాల కంటే ముందు శంకర భగవత్పాదుల కంటే ముందు ఏర్పడి ఉన్నది గనుక అతి పురాతనమైనటువంటి పీఠము ఏది అంటే కంచి కామకోటి పీఠం ఇది ఒకటి రెండవది అక్కడ ఏదైతే ఏ వేదం అయితే వసుదైవ కుటుంబకం అన్నదో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కూడా కలుపుకొని వెళ్లాలని చెప్పిందో వైదికమైన ఆర్షమైన భారతీయమైన ఒక ధర్మాన్ని ఆచరణాత్మకం చేయమని చెప్పిందో సంచారం చేస్తూ ధర్మ ప్రచారము ప్రసారము ప్రబోధము బోధ అన్నీ చేయాలని చెప్పిందో అత్యంత నిరాడంబరమైనటువంటి స్థాయిలో సన్యాసి అంటే యతి స్థానంలో యతి ధర్మాలను ఆచరిస్తూ భగవత్పాదులు నిర్దేశించిన యతి జీవనాన్ని గడిపేటువంటి జగద్గురువులు ఏర్పడ్డారు ఆ ఏర్పరించినదంతా కూడా భగవత్పాదులు తర్వాతే కనుకనే శంకర భగవత్పాదులు కాలిడిలో పుట్టిన కేదారంలో శరీరం వదిలిపెట్టిన ఈ మధ్యలో చివరి దశ ఎక్కడ గడిపారు అంటే కంచిలో గడిపారు సురేశ్వరాచార్యులు కూడా అక్కడే ఉన్నారు ఆ మండన మిశ్రులు కూడా ఇంకా అక్కడే ఉన్నారు ఆ సంతతి వాళ్ళు కనుక కంచి అనేటువంటి ఒక పీఠం ఏదైతే ఉన్నదో ఆ పీఠం అరవై తొమ్మిది అరవై ఎనిమిది మంది జగద్గురువుల కంటే ముందున్న చరిత్ర స్వల్పం అంటే వాళ్ళు ఏదో వచ్చారు ధర్మాన్ని కాపాడారు హైందవ ధర్మాన్ని చేయవలసిన ప్రచారం చేశారు కానీ అరవై ఎనిమిదోవ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మనం మహాస్వామి అంటాం వారు వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని లోకంలోకి తీసుకుని వెళ్లారు వారి తర్వాత జయేంద్ర సరస్వతి స్వామివారు వచ్చి దానిని ప్రపంచం నలుమూలలకి తీసుకుని వెళ్లారు ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద స్వామి వారు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తూ పెద్ద చిన్న పామరుడు పండితుడు ఉన్నవాడు లేనివాడు అనేటువంటి ఏ భేదము లేకుండా ప్రతిరోజు సుమారుగా పన్నెండు గంటల సేపు పూజ అర్చన అభిషేకము ఆరాధన తపస్సు మౌనము వీటి ద్వారా అనంత మహా శక్తిని సాధించి దానిని ప్రపంచానికి ప్రతిరోజు ప్రపంచానికి ఏం కావాలో దాన్ని ఇస్తూ వచ్చి కంచి కామకోటి పీఠాన్ని ఆ మూల పీఠంగా అందుకనే మూలామునాయ ఆదిశంకర పరంపరానుగత మూలామునాయ సర్వజ్ఞ పీఠ కంచి కామకోటి పీఠం అని మనం అంటాం కాబట్టి ఇది ఒక ఉదాత్తమైనటువంటి వైఖరి ఇలా సాగుతుంటే అదే సమయంలో షిరిడి సంత మహారాష్ట్రం అయినటువంటి మహారాష్ట్ర దేశంలో షిరిడి స్వామి వచ్చారు ఆయన వచ్చింది దేనికి అంటే రెండు మతాల మధ్య ఒక సమన్వయం సాధించాలి ఇట్లా దేశంలో మతం కారణంగా కలహాలు ఉండకూడదు అని ఆయన నిర్ణయించుకొని అల్లా మాలక్ ఏక్ అనేటువంటి ఒక నిదాన నినాదంతో అందరినీ కూడా సమన్వయం చేసి తాము ఉన్నటువంటి ప్రదేశాన్ని చక్కగా నిర్వహించారు ఆయన కూడా ఎక్కడా అవతార ప్రకటన చేయలేదు శంకర భగవత్పాదులు అవతార ప్రకటన చేయలేదు కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలుసు గనుక వారి వారి కార్యక్రమాలని చాలా చక్కగా నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్లి పోయినారు భారత జాతిని తద్వారా అఖండ సృష్టిని ఇక కాసేపు అడిగినట్లయితే షిరిడి మహాస్వామి శరీరాన్ని వదిలిపెట్టేటువంటి కొన్ని గంటల ముందు ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏమిటి అంటే ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆంధ్రదేశంలో నేను మళ్ళీ వస్తాను అని ప్రకటన చేశారు కరెక్టుగా ఎనిమిదేళ్ళకి పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి వారి మహా అభినిష్క్రమణం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబరు ఇరవై మూడవ తారీఖున అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రాదుర్భవించినటువంటి ప్రభవావతారము అంతేకాదు వారు స్వయంభువుగా తనను తాను ప్రకటించుకొని ఈ జగత్తులోకి వచ్చి జగత్తుని నెమ్మది నెమ్మదిగా ఇంతకుముందు జరిగినదానికంటే విస్తృతంగావహించారు కనుక వారు ఎవరు అంటే అరవింద్ వారు పాండిచ్చేరి లో ధ్యానమగ్నుడు ఉండగా వారికి ఒక దృశ్యం గోచరించింది ధ్యానంలో ఏమిటా దృశ్యం అంటే ఏ కృష్ణ చైతన్యాన్ని నేను ఉపాసన చేశానో ఏ కృష్ణ చైతన్యం ద్వాపర యుగాన్ని తర్వాత వచ్చిన కలియుగాన్ని ఇంకా నడిపిస్తూ ఉన్నదో ఆ కృష్ణ చైతన్యం మళ్ళీ ఒక స్వరూపాన్ని ఒక సగుణ స్వభావ సంపన్నమైనటువంటి ఒక అవతారంగా వెలువడబోతున్నది అనేటువంటి ఒక దర్శనాన్ని ప్రపంచానికి చెప్పింది ఎప్పుడు అంటే నవంబర్ ఇరవై నాలుగు పొద్దున ఇరవై రెండున వారు దర్శించారు ఇరవై మూడున భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు ఈ ప్రపంచంలోకి ఒక అవతారమూర్తిగా వచ్చారు ఇరవై నాలుగున అరవింద్ వారు చెప్పారు ఏ కృష్ణ చైతన్యాన్ని నేను ఉపాసించానో ఏది దీని నుండి భువికి రావాలని కోరుకున్నానో దేని వలన జాతి మళ్ళీ హైందవ ధర్మం సనాతన ధర్మం చక్కగా నిలబడుతుందో సర్వ ప్రపంచం ఒకటిగా మారబోతున్నదో దానికి సారధ్యం వహించేటువంటి శ్రీ కృష్ణ చైతన్యం ఇప్పుడే అవతరించింది అని ప్రకటన చేశారు ఈ చేసిన వారు ఎవరు సామాన్యులా, కవులా, పండితులా బాగా శాస్త్రం తెలిసిన వారు లాంటి కాదు దర్శనం చూసినవారు దర్శనం చేసినవారు దర్శనం అంటే అనుభవించిన వారు పరమాత్మ యొక్క ఆగమనానికి స్వాగతం పలికిన వారు గనుక వారు అరవింద మహాయోగి కాబట్టి నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు అప్పటికి నిజానికి తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్ణమై రాబోయే అంటే ఆ ఈ నవంబర్ ఇరవై మూడవ తారీఖుకి తొంభై తొమ్మిది నుండి వందలోకి మనం ప్రవేశిస్తున్నాం అంటే ఎవరు ఆ స్వామి అంటే సత్య సాయి భగవానుడు సర్వదేవతా అతీత స్వరూపమై వచ్చింది వచ్చి తాను ఎన్నుకున్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అవతార కార్యక్రమాన్ని చాలా నిర్దుష్టంగా స్పష్టంగా గంభీరంగా ఉదాత్తంగా సర్వజనామోద యోగ్యంగా సర్వజన మనోల్లాస పులకిత పుంఖితంగా పరిపూర్ణంగా మహా పరిపూర్ణ అవతారంగా ఆవిష్కరించారు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారు వారి శతజయంతి సందర్భంగా శతవర్షం అంటున్నాం శతజయంతి సందర్భంగా మనం ఇవాళ ఇటువంటి సత్సంగానికి ఆ ఒక యోగ్యమైనటువంటి ఒక అవకాశాన్ని ప్రాప్తిని అనుగ్రహించినటువంటి స్వామికి మనందరం కూడా మనసా, వచసా, శిరసా ప్రణమిల్లుతూ ఈ స్వామి అవతార ప్రకటన చేశారు అని కదా మే ఇరవై మూడు పంతొమ్మిది వందల నలభై నాడు నేను సాయిబాబాను అని ప్రకటించారు అది ప్రకటన అది అవతార ప్రకటన కాదు తాను ఎవరో చెప్పినటువంటి సందర్భం అది ఉరోవకొండలో. కరెక్టుగా మే అయిపోయింది అక్టోబర్ ఇరవై వ తారీఖు అంటే ఇంకో రెండు రోజుల్లో స్వామి ఒక ప్రకటన చేశారు ఇట్లా అవతార ప్రకటన డైరెక్ట్ గా చేసినటువంటి తన ఆవిర్భావానికి చాలా అతి తక్కువ సమయంలోనే ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక అవతార కార్యక్రమాన్ని సర్వజనులకి సమ్మతంగా మతాతీతంగా మత సమన్వయంగా మత సమష్టిగా జనజగత్తులన్నీ ఏకమయ్యేటువంటి నేపథ్యంలో స్వామి అక్టోబర్ ఇరవై న ప్రమాణం చేశారు ప్రమాణం అంటే ప్రకటన చేశారు ఏమిటి ఆ ప్రకటన అంటే మనందరికీ తెలుసు అది దీనజనోద్ధరణ, వేదోద్ధరణ, ధర్మోద్ధరణ ఎవరు వచ్చినా ఏ అవతారమూర్తి వచ్చినా ధర్మం ప్రధానం వేదోకిలో ధర్మమూలం అందుకే స్వామి వేదము రక్షింపబడాలి వేదం చదువుకున్న వాడికి డొక్కెండకూడదు వేదాలలో ఉన్నటువంటి అనేక వైజ్ఞానిక విషయాలు కానీ పౌరాణిక గతమైనది కానీ లోకలోకాంతర ప్రాణాలను కదిలించగలిగినటువంటి విషయాలను కానీ వీటన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి అని చెప్పి సర్వ జగత్తుకి కూడా వేదోద్ధరణ ప్రధాన కార్యక్రమంగా చెప్పారు దాంతో పాటు ధర్మోద్ధరణ ఏ ధర్మం వ్యక్తి ధర్మమా, కుటుంబ ధర్మమా, సమాజ ధర్మమా, రాష్ట్ర, దేశ, ప్రపంచ ధర్మమా అంటే మానవ ధర్మాన్ని మనం రక్షించాలి మానవ ధర్మాన్ని గనుక రక్షిస్తే మాధవత్వం వైపు వెళ్ళటం చాలా తేలిక కాబట్టి [తుమ్ము] ధర్మో రక్షతి రక్షితః ధర్మాన్ని రక్షిస్తే అంటే ధర్మం అగ్ని స్వరూపం కదా దానికి చెరవట్టదే దానికి మళ్ళీ మనం రక్షించేది ఏమిటి అంటే మానవుడు తన ధర్మం నుంచి తాను వైదొలగినప్పుడు తాను చేయవలసిన పని తాను చేయనప్పుడు స్వధర్మాన్ని విస్మరించినప్పుడు తాను ఎందుకు వచ్చాడో మరచినప్పుడు ఏమి చేయాలో చేయకుండా [తుమ్ము] ఏది చేయకూడదో అది చేస్తున్నప్పుడు అపమార్గం పట్టినప్పుడు అటువంటి ఆ ధర్మాన్ని మళ్ళీ వాణ్ని మానవుణ్ణి ధర్మమార్గం వైపు నడిపించి మార్గంలో ప్రవేశపెట్టి మళ్ళీ వాడి జీవితాన్ని సుసంపన్నం చేయడమే ధర్మ రక్షణ. ఇక దీనజనోద్ధరణ దీనజనులను ఉద్ధరించాలి ఎవడు దీనుడు అంటే ఎవరి ముందు చేయి చాపుతాడు దేనికైనా వాడు దీనుడు. పరిదీనుడు ఉంటాడు నువ్వు ఎంత చేసినా వాడికి తృప్తి ఉండదు వాడు పరిదీనుడు. కడుపు నిండిందా అంటే ఏదో నిండింది అంటాడు నిండింది అని అనడు పరిదీనుడు అంటే ప్రతిరోజూ దీనత్వంతో బతికేవాడు కాబట్టి వీటన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ తన అవతార కార్యక్రమాన్ని ప్రణాళికని ఖచ్చితంగా ప్రపంచం ముందు తర-తెరిచి, పరచి, బోధ చేసి, ప్రబోధం చేసి, అందరినీ ఒక మనిషి.చేయటం ద్వారా అవతార కార్యక్రమం స్వామి ప్రారంభించారు. అది మానవజాతి చరిత్రలో ప్రపంచ సృష్టిలో తన పద్నాలుగవ ఏట ఈ అవతార కార్యక్రమాన్ని ప్రారంభించి అవతార ప్రకటన చేయటం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఈ కలికాలం నిదర్శనం లేనిదే అంగీకరించేది కాదు. ప్రతి దానికి ప్రమాణం కోరుతుంటుంది. అలా అన్నారు నిజమేనా అని అడుగుతుంది. నిజానికి స్వామి కాక ఎవరైనా అటువంటి ప్రమాణం చేసి ఉంటే ఈ కాలంలో అది సాధించగలిగేవారు కాదు కాదు కాదు. సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తి సచ్చిదానంద గురు మూర్తి గనుక స్వామి తమ కార్యక్రమాన్ని ఆ తర్వాత ఇంకా డెబ్బై రెండు సంవత్సరాలు కొనసాగించాలి. అటువంటి ఆ కార్యక్రమాన్ని బృహత్తర మహత్తర ప్రణాళికను సిద్ధం చేసి వేదోద్ధరణ చేశారు. చేస్తూనే ఉన్నారు. చేస్తూనే ఉంటారు. ధర్మోద్ధరణ ఆ ధర్మోద్ధరణకి స్వామి కేవలం ఆ ధర్మం అంటే ఇందాక చెప్పిన అనేక ధర్మాలు కాదు వీటన్నింటికీ మూలమైన సనాతన ధర్మానికి నేను సారథ్యం వహిస్తాను. సనాతన ధర్మం అంటే ఒక భారతీయ ఆత్మ ఒక జాతి యొక్క చలనం జాతిలో ఉన్న చైతన్యం వీటన్నింటినీ గమనించి సనాతన ధర్మమే అత్యుత్తమ ధర్మం మిగతావన్నీ దాని నుంచి పుట్టేవే అని అంటూ దానికి నేను సారథ్యం వహిస్తాను అన్నారు. శ్రీరామచంద్రుడు ధర్మానికి సారథ్యం వహించాడు. శ్రీకృష్ణ పరమాత్మ దుర్మార్గులని శిక్షించడానికి సారథ్యం వహించాడు. సత్య సాయి భగవానుడు సనాతన ధర్మానికి సారథ్యం వహించాడు. ఎట్లా? ఈ సనాతన ధర్మం అనగానే ఇవా-ఇటీవలి కాలంలో దానిని గురించి తెలియనివారు ఎంతో కొంత తెలిసినవారు నాకొంత తెలుసు అనుకున్నవారు రకరకాల వ్యాఖ్యానాలు చేసిన ఏ సత్యము ఏ ధర్మము శాశ్వతంగా నిత్య సత్య శాశ్వతంగా ఒక వైభోగంతో వెలిగిపోతున్నదో, దేనివలన మానవుడిలో ఉన్నటువంటి మానవీయ కోణం పెరుగుతుందో, దానవత్వాలు పోతాయో [దగ్గిన శబ్దం] దీనత్వాలు నశించిపోతాయో అటువంటి ధర్మం సనాతన ధర్మం. కాలానికి లొంగక కాలం ముందు తలవంచక కాలాజ్య విచ్ఛిన్నమై కాలాన్ని అనుశాసనం చేయగ అంటే ఆర్డర్ చేయగలిగినటువంటి ఒక ధర్మం ఏంది అంటే అది సనాతన ధర్మం. that is called eternal truth ఇంగ్లీషులో చెప్తే గాని అర్థం కాని పరిస్థితి గనుక the eternal truth ఏది ఉందంటే దానికి కాలానికి సంబంధం లేదు కాలాతీతమైంది. అలాగే it is beyond the space ఒక మనిషి మనస్సు దాన్ని comprehend చేయలేదు, ఊహించలేదు, భావించలేదు, సంభావించలేదు కానీ మానవుడు మానవుడిగా జీవించగలిగినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి ధర్మం ఏది అంటే అది సనాతన ధర్మం. అందుకనే సత్య సాయి భగవానుడు ప్రారంభించినటువంటి పత్రిక పేరు సనాతన సారథి. అందువల్ల ఆ పేరు పెట్టారు. స్వామి అంతకు ముందు ఉన్న పేరు అది కాదు. ఎవరో వచ్చి ఇలా ఈ పేరు పెడదాం స్వామి ఏదో సత్య సాయి దివ్యవాణి ఇలా ఏదో పెట్టారు. కాదు కాదు సనాతన సారథి దీని పెట్టమన్నారు. సారథ్యం వహించబోతున్నారు ఆయన. వహించబోయి ఏవేవి అవతారము చేయనటువంటి అనేక పనులు చేసినాయి వాటిని ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవాలి. ఆ పునశ్చరణలో మొట్టమొదటగా స్వామి అసలు మానవ జీవితం పన్నెండు సంవత్సరాలు ఒక ఆవృత్తం. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎనిమిది పన్నెండు తొంభై ఆరు ఆ మిగతా అంతా బోనస్ వదిలేయటం. పన్నెండు ఎనిమిది వందల తొంభై ఆరు అంటే ఎనిమిది ఆవృత్తాలుగా పన్నెండు పన్నెండు ఏళ్లుగా గడుస్తాయి. పన్నెండు ఏళ్లు కాగానే ఒక చక్రం మారిపోతుంది. రెండో phase లోకి మనం వెళ్ళిపోతాం. స్వామి ఇందాక చెప్పానే పంతొమ్మిది వందల నలభై మే ఇరవై మూడు అప్పటికి స్వామి యొక్క వయస్సు పద్నాలుగేళ్లు. పద్నాలుగేళ్లు. ఆ పద్నాలుగేళ్ల కంటే ఒక మొదటి పండంటి అయిపోయింది. అక్కడి నుంచి చేతిలో హల్వా సృష్టించటం అలాగే రోగాలు పోగొట్టటం జాడ్యాలు వదిలించ-క-కలగటం ఇవన్నీ కూడా ఒక దివ్యమైనటువంటి ఒక శక్తిని ప్రకటన చేసి అది లీలా విగ్రహంగా చేశారు. అక్కడి నుంచి ఈ అవతార ప్రకటన నుంచి అంటే మొదటి పన్నెండు అయింది పన్నెండు అయింది ఇరవై నాలుగు అయిపోయింది మళ్లీ పన్నెండు ముప్పై ఆరు ఏళ్లు వచ్చేప్పటికి ఆంధ్రదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా సత్య సాయి అంటే మహిమా మనుష్యులుగా గమనించారు. అతను ఏనా మహిమలు చేయగలరు, ఏదైనా చేయగలరు. ఆకాశంలో నుంచి లేదా యుగయుగాలలో వాడిన పాత్రలు తేవగలరు. కాబట్టి మహిమలు మహిమాకాండ సుమారుగా ఒక ముప్పై ఏళ్లు సాగింది. సాగిన తర్వాత ప్రపంచం అంతా ఆకర్షితమై స్వామి దగ్గరకు వచ్చింది. విభూతి ఎలా సృష్టిస్తారు ఆ అలాగే ఒక వస్తువుని ఎలా సృష్టిస్తారు అని అంటూ ఉండగానే స్వామి మళ్లీ ధర్మ ప్రబోధం కూడా చేస్తూ అందరినీ ఆకర్షణ వలయంలోకి తీసుకొని వచ్చి తన దగ్గర ఉంచుకొని ప్రపంచాన్ని మరమ్మత్తు చేయడం ప్రారంభించారు. ఇది అయిపోతుండగా స్వామి అవతారంలో మరొక ఘట్టం ఏర్పడింది. అదేమిటంటే విద్య. విద్య అంగడి సరుకు అయిపోయింది. డబ్బు పెట్టి కొనుక్కునేటువంటి చదువులు వచ్చినాయి. చదువుకునే పో-పోయి చదువుకొనే వచ్చినాయి. దానివలన ఆ చదువులనే మార్కులు తెస్తున్నాయి ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ మానవుల్లో అధర్మతలం ప్రారంభమైంది. మరి మళ్లీ మానవీయమైనటువంటి కోణంలో మానవతా భావాన్ని human values మనకి పరిచయమైన పదం అంటే ఈ మానవీయ భావన గనుక నశించినట్లయితేహృదయం లేని ఒక doctor ఎన్ని degrees సాధించి ప్రపంచంలోకి వచ్చినా వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న వేసుకుని ముందు విద్యా విధానాన్ని మరమ్మతు చేస్తూ education with human values అది చిన్నప్పటి నుంచి బాల వికాస్ అనేటువంటి దాంట్లో ప్రారంభం చేసి అందర్నీ కూడా మంచి మార్గంలోకి తీసుకుని వెళ్లి మంచి ఆలోచనలు discipline, devotion, dedication, discretion, వివేకం ఇవన్నీ కూడా విచక్షణ అన్నీ పొందాలని అటువంటి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలని అటువంటి చదువు కావాలని చదువులన్నీ చదివి చావంగానేటికి చావులేని చదువు చదువాలి అంటూ చావులేని చదువు ఏది ఆత్మజ్ఞానమే కాబట్టి ఆత్మ విద్యా విలాసాన్ని ఆత్మారామం అనేటువంటి గ్రంథంలో స్వామి నిక్షిప్తం చేసి ఏది చిన్న వయసులో అట్లా ఆ రకంగా స్వామి విద్యా విధానానికి ఒక పరిపూర్ణమైనటువంటి మార్పు తీసుకుని వచ్చారు. ఆ మార్పు ఎటువంటిది సాయి భక్తులందరికీ తెలుసు కానీ వాళ్ళ కోసం పునః ఏమిటంటే భారతీయమైనటువంటి ఆత్మ భారతీయమైనటువంటి ఒక అంతర్వాహిని మన గత చరిత్ర మహావీరులు, జ్ఞానులు, పుణ్యపురుషులు, పురుషోత్తములు వీళ్లంతా ఈ జాతిని ఎలా నడిపించారు ఎలా త్యాగం చేశారు వాళ్ళ తనువుని తన మనస్సుని వాళ్ళ దగ్గరున్న సంపదని ఈ దేశం కోసం ఎలా ఖర్చు పెట్టారు అటువంటి బిడ్డలను కన్న ఉత్తమోత్తములైన తల్లిదండ్రులు ఎటువంటి వారు అనే ఆ ధారాన్ని నిరంతరము గుర్తు చేస్తూ స్వామి తమ దిన్య ఉపన్యాసాలలో ప్రారంభంలో ఒక పద్యం చెప్తే ఆ పద్యం భారతీయుడి యొక్క ఆత్మ. ఈ భారత్ జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రకటన చేస్తూ జారిపోయిన కాలగర్తంలో కలిసిపోయిన మహావీరులను స్మరిస్తూ పుణ్య పురుషులకు జన్మనిచ్చిన తల్లులను గౌరవిస్తూ అలాగే తాను ఎందుకు వచ్చారో అనేక పద్యాలలో సుమారు ఆరు వందల పద్యాలలో స్వామి నాకు కొన్ని పద్యాలు ఉంచమని ఇప్పుడు తెలుసు అనే గనుక నేను చెప్పటం లేదు ఆ రామచంద్రుడే అనేటువంటి ఒక పద్యం కానివ్వండి ఆ ప్రహ్లాదుడిని ఎలా రక్షించారు అనేటువంటి ఈ పద్యాలన్నీ మనకు తెలుసు అట్లా అనేకమైనటువంటి సాహితీ స్వరూపంగా వాఙ్మయ స్వరూపంగా తనను తాను ఎప్పటికప్పుడు reveal చేసుకుంటూ తన యొక్క దివ్యత్వాన్ని ప్రకటన చేస్తూ మైన ద్వారా బోధ ద్వారా దగ్గర తీసుకురావటం ద్వారా అప్పులు చేర్చుకోవటం ద్వారా ఆనందం పంచడం ద్వారా సంతోషాన్ని అనుగ్రహించడం ద్వారా ప్రజలను గుర్తించడం ద్వారా అనేక రీతుల లక్షలాది భక్తులందరినీ కూడా సన్మార్గం వైపు సనాతన ధర్మ పథం వైపు నడిపిస్తూ వచ్చారు. అందువల్లనే తర్వాత తర్వాత కాలంలో స్వామి ప్రారంభించినటువంటి విద్యా విధానం అనేకమైన విశ్వవిద్యాలయాలలో అనేక దేశాలలో ప్రధానంగా భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆఫ్రికా దేశాలలో స్వామి యొక్క విద్యా విధానం ఒక పరమ చరమ స్థాయికి అది వెళ్ళింది దానివలన మనుషులలో శాంతము మనుషులలో ఒక దివ్యమైన ఆలోచన మనుషులలో ఒక త్యాగము పరిత్యాగము ఇవన్నీ కూడా ఏర్పడి మానవుడు మానవుడిగా మారటానికి గలిగినటువంటి ఒక విద్యని స్వామి ప్రవేశపెట్టారు. తద్వారా అనేక ఉచిత విద్య ప్రారంభం చేశారు. డబ్బు లేక చదువుకోకపోవడం చాలా దురదృష్టం. మేధావితనం ఉండి మేధాశక్తి ఉండి ఆలోచన ఉండి అవకాశం డబ్బు లేక అవకాశం పోతే ఇది సమాజం యొక్క మంచితనానికి గాని దాని ఉనికికి గాని అది మంచిది కాదు అని కలిగిన వారందరూ కూడా లేని వారికి చదువు చెప్పించండి అన్ని ధనాలలోకి విద్యా ధనం చాలా గొప్పది ఒక్క వ్యక్తిని ఒక్క కుటుంబాన్ని విద్య ద్వారా ఉన్నత స్థితికి తేగలిగినట్లయితే ఆ కుటుంబం ఇంకో కుటుంబాన్ని దీపం వెలిగిస్తుంది జ్యోతిస్స్య జ్యోతి జలాహో అని అన్నట్లుగా ఒక దీపం రెండో దీపాన్ని వెలిగిస్తుంది వెయ్యి దీపాలు వెలిగించడానికి వెయ్యి దీపాలు అక్కర్లేదు ఒకటి చాలు అనేటువంటి ఒక భావన ఆ సద్భావన సద్దృష్టి సదాచారము సమ్యక్ భావన వీటన్నింటినీ కూడా సాయి తన విద్యా విధానం ద్వారా ఈ ప్రపంచానికి మార్గోపదేశనం చేశారు. ఇది ఇట్లా జరుగుతూ ఉండగానే భక్తుల సంఖ్య పెరిగిపోతున్నది మరొక్కటి ఆలోచించాలి వైద్యో నారాయణో హరిహి అని ఒక మాట ఉంది ఆ వైద్యుడు నారాయణుడితో సమానం. స్వామి ఏమన్నారంటే అసలు నారాయణుడే వైద్యుడుగా వచ్చేశాడు ఇంకా సమానము ఎక్కువ తక్కువ లేవు ప్రతి వైద్యుడు నారాయణుడే అనేటువంటి భావనతో ఆ విద్య తర్వాత వైద్యానికి పెద్ద పీట వేసి సమాజంలో మారిపోతున్నటువంటి ఆధునికమైనటువంటి వైద్య విధానాన్ని కాదనకుండా దానిని పెంచుతూ ప్రపంచంలో ఉన్న వైద్యులందరిలోనూ ఒక పరివర్తన ఒక త్యాగ బుద్ధి ఒక విశాలమైనటువంటి సేవా దృక్పథాన్ని పొందుపరిచి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇదిగో ఇటువంటి మార్గంలోకి వెళ్ళండి అని చమత్కారంగా ఒక మాట చెప్తారు అదేమిటంటే ఒకాయనకి ఈ ఉంట్లో బాలేదు వచ్చారు స్వామి దగ్గరికి వచ్చారు వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని ఏమన్నారంటే స్వామి naturopathy try చేశాను allopathy try చేశాను అలాగే homeopathy try చేశాను ఇప్పటికే ఐదారు సంవత్సరాలు గడిచిపోయింది నాకు ఏ రకమైనటువంటి relief రాలేదు స్వస్థత నాకు చేకూరలేదు ఇక స్వామి అనుగ్రహమే అని అల్లాడుతున్నాడు అవును నువ్వు naturopathy చేశావు homeopathy చేశావు allopathy చేశావు ఒక్క ఉమాపతిని మాత్రం మర్చిపోయినావు ఉమాపతిని నువ్వు ఎందుకు మర్చిపోయినావు అని అడిగారు అడిగి ప్రసాదం ఇచ్చారు తర్వాత ఏంటో అదంతా కథ అంటే చమత్కారంగా కూడా మనిషిలో పరివర్తనం తెచ్చారు నిజానికి.ఇది కదా స్వామి అవతారంలో ముందు చమత్కారం చేస్తారు, ఆశ్చర్యపోతాం ఇది ఎలా వచ్చింది ఎట్లా వచ్చింది స్వామి ఖాళీ చేతులు కదా ఎలా పుట్టింది ఇవన్నీ ఆలోచించే ఆ చమత్కారం ద్వారా లోపలికి తీసుకుంటారు తరువాత సంస్కరిస్తారు. ప్రతి జీవుడికి అంటే ఒక ధాన్యం పొట్లకింద మీద ఎట్లాగైతే ఒక రెండు పొరలు ఉంటాయో పైన ఉండేది పొట్టు దాని కింద ఉండేది చుట్టు అంటే ఎపికార్ప్ అండ్ ఎండోకార్ప్ ఆ రెండు తీసేస్తారు మిల్లులో అప్పుడు బియ్యం బయటికి వస్తాయి. మనం ఉప్పు తినము ఎపికార్ప్ కు తినము ఎండోకార్ప్ కు తినము దాన్ని వండించి అన్నం చేసుకొని తింటాం. మరి ఆ రెండు ఏమిటి? మానవుడి శరీరం మీద, మనసు మీద, చిత్తం మీద, బుద్ధి మీద, అహంకారం మీద, ఏమి ఆవరించి ఉన్నాయి అంటే ఒకటి అహంకారము రెండవది మమకారం. ఈ అహంకారం మమకారాలు అనేటువంటి రెండు పొట్లు గనక పోతే మిగిలేది ధాన్యం బియ్యం. ఆ బియ్యపు గింజ అన్నంగా మారుతున్నది. అన్నం ఒక మెతుకులో నుంచి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఏర్పడుతున్నాయి. ఇంతటి గాథని స్వామి చెప్తూ వీళ్లందరినీ కూడా సన్మార్గం వైపు నడిపించి ఇవాళ నిన్న మొన్న జరిగింది వరల్డ్ కార్డియాలజీ మన అయ్యా మన ప్రశాంతిలయంలో అంటే ఇటువంటివి కొన్ని వేలు వేలు అసలు అగణితంగా లెక్కబెట్టడానికి వీలు లేనన్ని ఇన్ని సంవత్సరాలు చేస్తూ వైద్యులలో సేవాభావం, త్యాగబుద్ధి, నిజాయితీ, నిష్కల్మషత్వం, నిపుణత, ప్రజ్ఞ, అంకితభావం వీటన్నింటిని కూడా నేర్పి ప్రపంచం మొత్తం మీద వైద్యులందరికీ కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఒక గౌరవాన్ని తెచ్చే విధంగా వైద్య రంగాన్ని ప్రారంభించి దానికి ఉదాహరణగా ఆ రోజుల్లోనే మీరు గ్రామ సేవ చేస్తే అదే రామ సేవ అన్నటువంటి నినాదం ఇచ్చినటువంటి వాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అంటే మన స్వామి. మరి ఏ గ్రామం? మీ గ్రామం, మీ గ్రామం అని లేదు పుట్టపర్తి గ్రామాన్ని ఆయన రోల్ మోడల్ చేశారు. సూపర్ స్పెషాలిటీ అక్కడే కట్టారు, యూనివర్సిటీ అక్కడే కట్టారు, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడే కట్టారు, వాటర్ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడే కట్టారు, మైన్లన్నీ అక్కడే చేశారు. అన్నింటికీ ఒక ప్రధానమైనటువంటి ఒక ఆవరణాన్ని సృష్టించి ఆ సృష్టించినటువంటి ఆవరణంలోనే వేద విద్యకి ఒక ట్రస్ట్ ఏర్పరిచి ఆ ట్రస్ట్ ద్వారా వేదం నేర్చుకోవాలి నేర్పాలి అని చెప్తూ ఇవాళ ప్రపంచంలో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా, ఎన్నెన్ని రకాలుగా ఈ ఆధ్యాత్మిక ప్రచారం జరుగుతున్నా, ప్రపంచం మొత్తం మీద ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొద్దున్నే వేదం వినపడేటువంటి ఒకే ఒక్క ప్రదేశం అది ప్రశాంతిలయం. ఇంకెక్కడా లేదు. ఆ వేదం ఇట్లా ఉచ్ఛేశ్వరం తో వినపడుతూ ఉంటుంది. పరమాద్భుతంగా! ఆ నీలాసుక్తం, భూసుక్తం, శ్రీసుక్తం, నారాయణ సూక్తం ఒకటే రెండా భారతీయమైనటువంటి ఆధ్యాత్మిక వాజ్మయంలో ఏవున్నాయో అవన్నీ ఉంటాయి. అలాగే ప్రాణ, భావ, కాల సమన్వయమైనటువంటి ఒక భజన అమృతం ప్రతిరోజూ అక్కడ ప్రాదుర్భవించి మానవుడికి మనోల్లాసాన్ని, భగవంతుని యందు ఒక పారమ్యాన్ని, భక్తి పారమ్యాన్ని, జ్ఞాన ఉపదేశాన్ని కలిగించే రీతిగా స్వామి ప్రణాళికాబద్ధంగా భారతీయమైన ఆత్మజ్ఞానాన్ని, భారతీయమైనటువంటి భక్తి రసాయనాన్ని, భారతీయమైనటువంటి కర్మ యోగాన్ని ప్రకటన చేసి సేవా దల్ అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థని ఏర్పరిచి దానివలన కర్మ యోగంలో కర్మ సుఖౌషలం అందరినీ సేవలోకి వెళ్ళమన్నారు. సేవ వినా నిర్వాణ నాహి, సేవన నుంచి అసలు మోక్షమే లేదు కోమన్నారు. అంటే సేవ అంటే ఎవరికీ కావాలో, ఎవరిని కాపాడుకోవాలో, ఏమి చేస్తే మనకు ఆనందం కలుగుతుందో అటువంటి ఆ సేవలన్నీ కూడా సేవా యోగంగా మార్చి సేవాకృతులుగా భక్తులందరినీ కూడా ఇవాళ ముప్పై ఎనిమిది కోట్ల భక్తులున్నటువంటి ఒక అవతార మూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అంటే విద్య అయింది, వైద్యం అయింది తరువాత మీరు మీరు ఎలిక్సీర్ ఆఫ్ లైఫ్. మీరు లేకపోతే మనిషి బతకలేడు, అన్నం లేకపోతే ఇరవై ఒక్క రోజులు బతకొచ్చు, మీరు లేకపోతే బతకలేడు. అట్లా బాగా వెలకబడినటువంటి అనంతపురం మాత్రమే గాక మహబూబ్ నగర్ జిల్లా, పాడేరు ఆ అనేకమైనటువంటి చోట్ల మహబూబ్ నగర్ వీటన్నింటి చోట్ల వాటర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేసి ఇదిగో మనిషికి నీరు ఇలా ఇవ్వచ్చు, మనకున్న సంపదని ఇలా సద్వినియోగం చేయవచ్చు, ఒక్కరే చేయటానికి వీలు లేదు అందరూ కలిసి చేయాలి. ఆ కలిసి చేస్తే పదిరెట్లు ఎక్కువ చేస్తారు, ఒక్కడే చేస్తే ఒకసారిలో రెండు సార్లు చేస్తారు. అని అంటూ సేవలోకి మనిషిని తెచ్చారు. దానికి కారణం ఏనకేన ప్రకారేణ యః శకశాపి దేహినః సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవ ఈశ్వర పూజనం. ఈశ్వర పూజ, శివ పూజ, శివార్చన, విష్ణు అలంకారం ఇవన్నీ ఏమిటి అంటే ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ద్వారా తన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆనందాన్ని కలిగిన వాడు అది మాత్రమే శివపూజ అని చెప్తూ రిచువల్ నుంచి స్పిరిట్యువల్ వైపు మళ్ళించారు. ఇది పరమాద్భుతమైనటువంటిది. చూడండి రాముడికి రాజ్యం ఉంది, కోశాగారం ఉంది, సేన ఉన్నారు, పాలించడానికి ప్రజలున్నారు. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఆయన టైంలో ఆ కాలంలో రాజులు రాజ్యాలు ఏర్పడ్డాయి. కలియుగంలో రాజులు, రాజ్యాలు, జమీందారులు పోయినా, ప్రజాస్వామ్యం వచ్చినా సత్యసాయి భగవానుడు ఆయనకు రాజ్యం లేదు, కోశాగారం లేదు, వారి ముందు ఎవ్వరూ లేరు. మరి ఎట్లా ఇంతగా ఎలా సంఘటిత పరచగలిగారు అంటే పవిత్రమైనటువంటి దివ్యత్వం ద్వారా సర్వ ప్రపంచాన్ని వారు ఆకర్షించారు. ఆకర్షించి వదిలిపెట్టలాకూర్చుని ఉన్నారు. ఈవేళ ఒకరు మాట్లాడిన పది మంది విన్న అంటున్నది స్వామి, వింటున్నది కూడా స్వామి. It is nothing but a resonance, resound, reflection and reaction. ఇది గమనించినట్లయితే ఏదో ఆయన బాగా మాట్లాడారు, ఆయనేదో బాగా రాశారంటే, రాసింది స్వామి, అనేది స్వామి, వినేది, కనేది కూడా స్వామి అనేటువంటి, ఈ సర్వం ఖల్విదం బ్రహ్మ అనేటువంటి ఒక భావనలోకి ప్రపంచాన్ని తీసుకొని వెళ్ళినటువంటి సనాతన సారథి. వారి అవతారంలో కొన్ని, ఆ వైభవంలో కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి ఇవేళ. ఎందుకంటే శ్రీరాముడికి, శ్రీరాముడి సమయంలో గాయత్రి లేదు. శ్రీకృష్ణ పరమాత్మకి గాయత్రియే లేదు. షిరిడి బాబాకి అసలే లేదు. మరి స్వామి దేహంలో ఉండగా, 1977 December 24వ తారీఖు Whitefield అంటే అప్పుడు బృందావన్లో సాయి గాయత్రి పుట్టింది. "సయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః" అనగానే రెండుకోట శాస్త్రి గారికి ఇదేంటంటే తప్పు జరుగుతున్నా అని స్వామి దగ్గరికి వెళ్లిపోయారు. ఇంకా ప్రచోద యాత్రలే బయటికి. "తన్నః సర్వః అని స్వామి నన్ను క్షమించాలి. ఈ గాయత్రి ద్వారా నన్ను మీరు ఋషిని చేసేశారు. అది నా యోగ్యతా, నా అర్హతా, నా ప్రాప్తి. కానీ సత్యః అనాలి కదా తన్నః సత్యః అనాలి. నేను తన్నః సర్వః అన్నాను పొరపాటు అయింది" అన్నారు. "ఏమీ పొరపాటు లేదు. ఎందుకంటే మహా మంత్రాత్మక గ్రంధంలో సర్వభ్యః సర్వ సర్వభ్యః అని ఈశ్వరుని గురించిన మాట లేదా? ఋగ్వేదంలో ఈ మాటను నీవు మర్చిపోయినావా? కాబట్టి సర్వః అంటే అంతా నేనే, అంతా స్వామే అది correct. సత్యః అంటే ఈ దేహానికి సంబంధించింది. కాబట్టి తన్నః సర్వ ప్రచోదయాత్ నువ్వు correctగానే చెప్పావు" అన్నారు. అంతే కాదు చూడండి గాయత్రి నిర్మాణం అయిపోయిన తర్వాత ఆయన పక్కన లెక్క వేస్తున్నారు. ఏ మామూలుగా ఛందో గాయత్రి గాని వేద గాయత్రిలో గాని నూట ఎనిమిది బీజాక్షరాలు దాగి ఉంటాయి. సత్యసాయి గాయత్రిలో ఆయన లెక్కబెడితే నూట తొమ్మిదవది కనిపిస్తోంది. వినయంగా అడిగారు, "స్వామి ఇదేదో గాయత్రి సరిగ్గా లేదేమో. ఆ నూట తొమ్మిదవ బీజాక్షరం నాకు కనపడటం లేదు, అర్థం కావడం లేదంటే." "ఏమీ లేదు. వేద గాయత్రి, ఛందో గాయత్రి, మిగతా దేవీదేవతల గాయత్రులు ఉన్నాయి కదా. ఆ గాయత్రులన్నీ కూడా ఇది కావాలి అని కోరిక నువ్వు చదివినప్పుడు తప్పకుండా సిద్ధిస్తుంది. కానీ సత్యసాయి గాయత్రి చదవబోటానికి ముందే నీ-నీ పని ప్రారంభం అయిపోతుంది. ఆ నూట తొమ్మిదవ బీజాక్షరము స్వామి యొక్క అనుగ్రహము అంతే" అని చెప్పారు. అంటే స్వామి దేహంలో ఉండగా గాయత్రి ఆ పొందటం అనేటువంటిది అది స్వామి యొక్క అనుగ్రహం. అది ఆయన ప్రళయికలో ఒక భాగం. అలాగే విద్యారంగంలో కానీ, వైద్యరంగంలో కానీ, ఇంకో రంగంలో కానీ స్త్రీ పురుషులు స్త్రీల నుంచి స్త్రీలకి ప్రత్యేకం చెప్పారు. ఏం చేస్తున్నారు అంటే మీ ఉద్యోగం చెప్పండి. ఏమీ ఉద్యోగం లేని వాళ్ళు ఏం చెప్పాలంటే house wife అనే మాట అనకండి. మీరు మీ హ-house wife కాదు. మీ భర్తకు మీరు wife అది చెప్పుకోండి పర్వలా. మేము మా ఇంటి గృహలక్ష్మిలం అని చెప్పాలి. మీరు లేకపోతే ఆ గృహలక్ష్మిత్వం లేదు. మీరు లేకపోte విరుగు లేదు. మీరు లేకపోతే జ్ఞానం లేదు. మీరు లేకపోతే సంస్కృతి లేదు. మీరు లేకపోతే సంస్కారం లేదు. మీరు లేకపోతే ఏమీ లేదు గనుక మేము మా ఇంటి గృహలక్ష్మిలని గట్టిగా చెప్పండి అని చెప్పారు. ఇంకొకటి గుర్తొస్తున్నది. ఆహలాపురం తొలినాళ్లలో ఆహలాపురం వెళ్ళినప్పుడు ఒక ఎడ్లబండి మీద స్వామి నుంచుని ఉంటే అది ఒక street corner మధ్యలో ఆగారు. అప్పుడు స్వామి ఒక ప్రకటన చేశారు. చరిత్రలో అది ఇంకా ఉన్నదో కాలేదో తెలియదు. ఎవరైనా మిమ్మల్ని గనుక వివేకానందుడు రామకృష్ణ దేవా పరమహంసను అడిగినట్లుగా, నాస్తికులు ఆస్తికుల్ని అడిగినట్లుగా "మీరు దేవుణ్ణి చూశారా?" అని గనుక మిమ్మల్ని ఎవరన్నా అడిగితే "మేము దేవుణ్ణి చూశాం. ఎక్కడ చూశాం అంటే పుట్టపర్తిలో చూశామని ఎద హత్తి చెప్పండి" అన్నారు. గుండె మీద చెయ్యి వేసుకుని గట్టిగా చె-చెప్పండి భగవంతుడు అక్కడ ఉన్నాడని చెప్పమన్నారు. ఇట్లా ఎక్కడికక్కడ పామరుడికి పండితుడికి, పండితుడికేమో అహంకారం వల్ల ప్రశ్నలు. పామరుడికేమో అమాయకత్వం, అవిద్య, అస్పష్టత, అనాచారం వీటి వల్ల ఆ ప్రశ్నలు. కేతువాదికి దేవుడు ఉన్నాడో లేడో లేడో అంటూ ఉన్నాడని తెలుసుకుంటాడు. ప్రమాదం లేదు. భక్తుడు తన పని జరిగినప్పుడు అవునంటాడు. ఆ పని జరగనప్పుడు కాదంటాడు. ఈ అవును కాదు మధ్యలో ఉన్నాడు అనేటువంటి దేవుడు ఉన్నాడని మించిన పంచాక్షరం ఎక్కడున్నదో చెప్పమన్నారు. నమశ్శివాయ సరే. దేవుడున్నాడు ఆ దేవుడు శివుడా, విష్ణువా, కృష్ణుడా, రాముడా, పరశురాముడా ఎవరు వాడు అంటే అసలు నీవే. నీలో ఉన్న దివ్యత్వాన్ని నీవు గమనించమని చెప్పినటువంటి ఒకే ఒక్క అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఒక ద్వంద్వాతీతమై, త్రిగుణ రహితమై, తపస్స్వాధ్రాయ సంపన్నమై, పరిపూర్ణమై, ధవళమై, తరళమై, సంపూర్ణమైనటువంటి ఒక విజ్ఞాన భాండాగారాన్ని తీసుకొని వచ్చి జ్ఞానం వైపు నడిపించినటువంటి భగోదారమైనటువంటి అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఇక స్వామి చేసిన ప్రాజెక్టులు మనమేర చెప్పుకోనక్కర్లా. ఇంతవరకు స్వామి యొక్క వైభవాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినా, ఆచరించినా, అనుభవించినా, అనుభూతి చెందినా ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఇటువంటి అవతారం ఇంతకుముందు రాలేదు. ఇకపై రాదు.అంటే అనుభవించి కొన్ని అనుభవాలు పొంది వారు వేసినటువంటి పాటలు. సాయి మాట అంటే సాయికి ప్రత్యేకంగా మాటలే లేవు. స్వామి అన్నారు శివరాత్రి నాడు స్వామి నోటి నుంచి వచ్చిన ఒక శివ లింగాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతున్నారే, అబ్బుర పడిపోతున్నారే, మహదానందం పొందుతున్నారే కానీ ఒకటి గుర్తుకోండి, గుర్తుంచుకోండి సత్యసాయి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వేదమేనన్నారు. మగువలు చూచినట్లు, పసిపాపలు నవ్వినట్లు, తల్లులు చూచినట్లు, తలుపులు చదివినట్లు, దండపాణిని వార్కున కోదండపాణియే శరణన్న సత్యసాయి వాక్కు సకలం ముర్కు. ముర్కు అంటే వేదం. ఆ నోటి నుంచి వచ్చే మాట ఒక్కొక్కటి వేద ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. శాస్త్రంలో, ఆ భాషలో చెప్పబుక్కట్టే అధునాతనమైనటువంటి ఇలాంటి మానవుడికి ఒక వేదాంత బోధ, ఒక వేద ఆవిష్కరణ, ఒక ఉపనిషత్ సుధ. ఇదంతా కూడా ఎలా అందించారంటే చిన్న చిన్న మాటలతో అందించేశారు. బ్రహ్మము అంటే ఏమిటి అని అడిగినప్పుడు, "దేనిని ఈ కనులు చూడలేవో కానీ దేని వలన ఈ కనులు చూడగలుగుతున్నాయో అది బ్రహ్మము" అన్నారు. స్వామి మరి బ్రహ్మ పదార్థం అంటున్నాడు, పదార్థము బ్రహ్మము అని చెప్పి వచ్చేశారు. ఇట్లా స్వామి యొక్క వేగం, ఆవేగం, వృద్ధి, ఆవృత్తి వీటిని గమనించినప్పుడు ఇది మామూలు అవతారం మాత్రం కాదు. వేలూరి శివరామశాస్త్రి గారు మహో-మహోత్కృష్టమైనటువంటి పండితులు, రెండు వందల గ్రంథాలు రాసినవాడు. ఆంధ్రోద్యమంలో Library అంతా వాళ్లంతా చాలిచేసినప్పుడు విరక్తుడై ఎక్కడికి వెళ్ళాలో తోచక అరవింద ఆశ్రమంలో ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆయన పుట్టపర్తికి చేరుకున్నారు. శివరామశాస్త్రి గారి వంటి మేధావి అక్కడికి వచ్చారంటే ఏముందో అని ఆయన దగ్గరికి వెళ్ళి కాసేపు కబుర్లు ఆడి వెళ్లినటువంటి వాళ్ళు నెమ్మదిగా ఒక ప్రశ్న వేశారు. "అయ్యా! స్వామి వస్తున్నారు, దర్శనం ఇస్తున్నారు. మా కష్టాలు ఏవో తీరుతున్నాయి. కానీ అసలు ఎవరు ఈ సత్యసాయి?" అని అడిగారు. "ఏమో! నేను కూడా అదే అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను" అని అన్నారు. కొన్నేళ్ళు గడిచినాయి. ఒక రెండు, మూడేళ్ళు గడిచినాయి. మళ్ళీ ఇదే ప్రశ్న ఆయన ఎదుర్కున్నారు. "అదే చూస్తున్నాను కొంత అర్థం అవుతున్నది" అన్నారు. మూడవ స్థాయిలో మూడవ విడత ఆయన అన్నారు. "మీలాగానే నేను కూడా ఆలోచించాను, ఎవరు ఈ సత్యసాయి అని. ఎవరు అంటే ఎవరిని చెప్పాలి? ఆయన రమణ మహర్షి వంటివారు కాదు, రామకృష్ణ పరమహంస వంటివారు కాదు. సత్యసాయిబాబా వారు సత్యసాయిబాబా వారే. అది ఈ అవనీతం మీద నడవటానికి వచ్చినటువంటి బ్రహ్మ పదార్థం అది. అది పండితులకు పరీక్ష, పామరులకి శ్రీరామ రక్ష. చూశారా?" అని ఒక పద్యం రాస్తున్నారు ఆయన. వేదాలన్నీ పుకిట పెట్టాను. వేదశాస్త్ర తర్క వ్యాకరణ మీమాంసలు మొత్తం తేరిసిపోయినాయి. అయిపోయిన తర్వాత చాలా తీవ్రంగా ఆలోచించాను వీటన్నింటికీ ఏమున్నది? ఇంతగా ఇన్ని నేర్చుకున్నాను కదా, ఇదంటూ ఉన్నదంటూ ఎక్కడన్నా ఉన్నదా? చదువుకోవటం Academic pursuit వేరు. కానీ నాకు ఇంకా ఏం తెలియటం లేదని అనుకొని, ఆ ఇప్పుడు తెలిసింది. నేను చదువుకున్న ఇవన్నీ కూడా కలిపితే అది నాలుగు అక్షరాలుగా మిగిలిపోయినాయి. ఆ నాలుగు అక్షరాల పేరు స-స-త్య-సాయి. ఈ నాలుగు అక్షరాలను కూడా మళ్ళీ నేను లోతుగా విచారణ చేశా. చేస్తే నేను రాసిన పుస్తకాలు, నేను మాట్లాడిన మాటలు, నేను గడిపిన జీవిత క్షణాలు అవన్నీ కూడా మా ఇంట ముమ్ము, మా ఇంటి ముందు వేసినటువంటి ఒక ముబ్బు, ఒక రంగవల్లి ఎట్లాగైతే గాలికి కొట్టుకుపోయిందో అదే లేకుండా పోయిందో, నా గత జీవితంలో నేను చేసినటువంటి వ్యసంగమంతా పోయింది. నాలుగు అక్షరాలు మిగిలినాయి అని సంతోషించాను. ఆ నాలుగుని కూడా విచారణ చేస్తే రెండక్షరాలు మాత్రమే మిగిలినాయి అది సాయి అని. స అంటే సహ అంటే ఈశ్వరుడు, ఆయి అంటే తల్లి. అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నటువంటి శివపార్వతుల యొక్క స్వరూపమే సత్యసాయి భగవానుడు అని నా నిర్ణయానికి వచ్చాను." అని వేలూరి శివరామశాస్త్రి గారు చెప్పారు. ఈ అనుభవం చాలామందికి ఉన్నది. అది పక్కనబెడితే స్వామి కేవలము మానవ దేహాన్ని ధరించినటువంటి ఒక వ్యక్తి కాదు, అది ఒక వ్యవస్థ, అది ఒక సమష్టి, అది ఒక సృష్టి మాత, జగన్మాత, జగజ్జనని. జగజ్జనానందకరీం జయాఖ్యాం యశస్వినీం యంత్రసిధ్యయోనీం జతావితా మిత్రకృత ప్రపంచాం భజామహే శ్రీ భువనేశ్వరీం తాం. ఈ భువన భవనానికి ఈశ్వరుడిగా, ఈశ్వరిగా, తల్లిగా వచ్చినటువంటి ఏకైక అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. ఈ శతజయంతి సందర్భంగా ఎంత తలచుకున్నా, ఎన్ని విచారణలు చేసినా, ఎన్నెన్ని లోతులకు వెళ్ళినా తెలియవలసింది ఇంకా ఉండనే ఉంటుంది. కానీ తెలియగలిగింది. ఏమిటా తెలియగలిగింది అంటే స్వామి పరమాత్మ అని, స్వామి ఒక అవతారమూర్తి అని. లేకపోతే ఒక బాలుడిగా, పద八ఏళ్ళ బాలుడిగా, ఆపై పద్నాలుగు ఏళ్ళ బాలుడిగా ప్రారంభించి ఒక్కరుగా, ఏకవీరుడిగా ప్రారంభమై ఇవాళ 38 కోట్ల భక్తులు. భక్తులు కాని వాళ్ళు ఇంకా 38 కోట్లు ఉంటారు ఆయన గురించి ఆలోచించేవాళ్ళు. అంటే సుమారు ఈ వంద సంవత్సరాలలో ఒక వంద కోట్ల మంది హృదయాలలో ప్రతిరోజూ నిత్యస్మరణ, నిత్య విచారణ, నిత్య ధారణ, నిత్య జాగరణ ఎవరిని గురించి జరుగుతున్నది అంటే కేవలం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వలన మాత్రమే. వారిని గురించే విచారణ. ఇవాళ మనం ఇక్కడ ఈ గదిలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం, వింటున్నాం. ఇట్లా ప్రపంచం అంతా అనుకుంటూనే ఉన్నది.ఒక television interview లో అడిగారు బాబా గారు చేసిన అత్యద్భుతమైన miracles లో ఒక్క miracle అన్న చెప్పండి మీరు ఏ ఉపన్యాసాల్లోని miracle చెప్పకుండా మాట్లాడుతున్నారు అంటే సత్యసాయి భగవానుడే ఒక miracle దాని గురించి దాన్ని మించిన miracle ఇంకొటి లేదని చెప్పారు. అది that should be the answer. ఆయన ఉంగరం ఇచ్చారు, బంగారం ఇచ్చారు, గురుసి ఇచ్చారు పరమాత్మ ఈ అనంత మహా సృష్టిని సృష్టించినటువంటి ఒక చిట్టి చిట్టికి ఒక విరాణానికి ఓ ఉంగరం ఇవ్వడం కష్టమా? కానీ కాదు అది కాదు కావలసింది మానవుడిలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఒక దివ్యాత్మని మేలు కొలిపి you are me, I am you అన్నది. అది స్వామి english లో చెప్పారు తెలుగులో కూడా చెప్పారు నువ్వే నేను, నేనే నీవు అనేటువంటి అవతారం మనకి ఇంతకుముందు లేదు. దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు, ఆయన్ని పట్టుకోవాలి, మెట్లు ఎక్కాలి, ఆ చాలనం చేయాలి, యోగం చేయాలి, త్యాగం చేయాలి, భోగం వదిలిపెట్టాలి, ఇదంతా ఎన్నో conditions ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు సమర్పణ, శరణాగతి, వినయం, పరమాత్మ యొక్క ఉనికిని, పరమాత్మ యొక్క అస్తిత్వాన్ని, పరమాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని, దివ్య వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే దాన్ని మించినటువంటి దర్శనం మరొకటి లేదు. అలాగే మోక్షం అంటే ఏమిటంటే రెండు వందల పేజీలు రాస్తాం అక్కర్లేదన్నారు స్వామి మోక్షమే మోక్షం. మీ మోహాలను వదిలిపెట్టండి, వ్యామోహాలు విసర్జించండి, వ్యసనాల బారిన పడకండి, అహంకార మమకారాలు తుంచుకోండి, గట్టెరగనటువంటి మమకారాన్ని ఉంచుకోండి, మమకారం కంటే కూడా మమతను పెంచుకోండి. ఈ మమత విస్తృతం చేయండి. మీ కడుపున పుట్టిన బిడ్డలు మాత్రమే కాక, ఏ తల్లి ఏ బిడ్డని కన్నా మీ బిడ్డగా భావించండి అని చెప్పినటువంటి ఒక అవతారం స్వామి. అంటే వేదాన్ని, వేదాంతాన్ని, సాంఘిక జీవితాన్ని, ఒక సాంఘిక ధర్మాన్ని, సమాజ విషయాలని ఇవన్నింటిని సమన్వయం చేసి అంతటితో ఆగకుండా శ్రీరామచంద్రుడు యోగ వశిష్టం రాయలా, రాసిన వాడు వశిష్టుడు. వశిష్టుల వారు మన ఆ రాముడు మాట్లాడుకున్నటువంటి ముప్పై మూడు వేల శ్లోకాలు. కనుక రాముడు రాయలా, శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీత రాయలా అన్నాడు అంతే. రాసిన వాడు వ్యాసేన గ్రథిత పురాణమునున మధ్యే మహాభారతం వ్యాసులవారు రాశారు. కాబట్టి రాముడు రాయలేదు, కృష్ణుడు రాయలేదు. సత్యసాయి భగవానుడు పదిహేను వాహినులు రాశారు. ఆ వాహినుల అన్నింటిని కూడా మానవ జాతికి, ఈవేళ వచ్చినటువంటి జాతికి అర్థమయ్యే రీతిలో రాశారు, పరిశ్రామ చేశారు. అలాగే స్వామి మాతృమూర్తి, మాతృదేశం, మాతృభాష ఈ మూడు మర్చిపోవద్దన్నారు. తల్లే లేకపోతే తనువే లేదు. తల్లి లేకపోతే నీవే లేవు. కనుక మాతృమూర్తిని నువ్వు గౌరవించు. తన నీ చిన్నతనంలో నీ తల్లి ఎట్లా నీకు సేవ చేసి, నిన్ను కాపాడి, పెంచి పెద్దవాడిని చేసి, నీ అభ్యున్నతిని కోరుతూ, జీవితాన్ని గడుపుతూ పెద్దదై పోయిందో ఆ తల్లికి నీవు తండ్రివై, తల్లివై, గురువై, అన్నీ అయి ఆమెని చివరి దశలో కాపాడుకో. ఏ అవతారమూర్తి చెప్పలేదే ఇది. మనిషి మోక్షమార్గం చెప్పారు తప్ప మాతృసేవ చేయమని చెప్పిన వాళ్ళు లేరు. అలాగే మాతృదేశం మనకి దేహం ఉంది, దైవం ఉన్నాడు. దేహము ఉన్నది, దైవము ఉన్నది, మధ్యలో దేశం కూడా ఉన్నది మర్చిపోకండి. ఆ ఒక్క జెండా కింద నూట నలభై ఏడు కోట్ల మంది జనులు మనందరం హాయిగా నిద్రపోతూ ఉన్నాం. కాపలా కాస్తున్నటువంటి వీర జవాన్లు ఉన్నారు. వాళ్ళని కూడా మీరు ఎప్పుడూ కూడా గుర్తు పెట్టుకోండి, కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి. మీ విద్య నేర్పినటువంటి గురువులందరికీ విద్యా గురువులు, బోధ గురువులు, లోక గురువులు, ఆ విశిష్ట గురువులు, ఆజ్ఞా గురువులు, కారణ గురువులు, మహా కారణ గురువులు వీళ్ళందరినీ కూడా మీరు గౌరవించండి. జగత్ గురువులను మన్నించుకోండి, జగత్ గురువుల యొక్క ప్రేమను పొందండి. ఇన్ని విషయాలు ఎవరు చెప్పనే లేదే. కనుక మాతృభాష, మాతృదేశం, మాతృమూర్తి. మాతృభాష స్వామికి అన్ని భాషలు వచ్చు. ఎవరి అవసరము లేకుండానే మొదట్లో మాట్లాడేవారు. తర్వాత తర్వాత నెమ్మదిగా కేవలం తెలుగులోనే మాట్లాడేవారు. ఎప్పుడూ తెలుగు మాట్లాడేవారు. ఎందుకనంటే అవతరించిన ఏడు ఆంధ్రదేశము నందు జగతిని ఉద్ధరింప సత్యసాయి. అతడు ఉపన్యసింప యావత్ ప్రపంచాన దేవభాషయే తెలుగు నేడు. చూడండి దేవతలు మాట్లాడే భాష సంస్కృతం. అమర భాష, అమృత భాష అని పేరు. అది దేవతల భారం. మరి మానవుడిది మానవుడి భాష అనుకుంటే ఆ తెలుగుని స్వామి మాట్లాడినందువలన అది దేవభాష అయిపోయింది. దేవభాషయే తెలుగు నేడు. దేవతలు మాట్లాడే భాషగా తెలుగు భాషకి గౌరవం ఇచ్చారు. కాబట్టి ఇది ఒక అవతారం, ఈ వైభవం మళ్ళీ మళ్ళీ పునః రాదు. ప్రేమ ద్వారా, సేవ ద్వారా, సంఘ జీవనం ద్వారా వేదంలో ఏ cardinal principles ఉందో, ఏ మూల సూత్రం ఉందో, ఏ-ఏది అంతర్వాహినిగా నాలుగు వేదాల్లో ఇమిడి ఉందో అదేమిటి? వసుదైవ కుటుంబకం. ఈ ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం అది వేదం చెప్పింది. ఎవరూ రాయలేదు అది. అటువంటిది ఆ రాముడి కాలంలో శివుడున్నాడు, కేశవుడున్నాడు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు. కృష్ణుడి కాలంలో కులాలున్నాయి, మతాలున్నాయి, జాతులున్నాయి, వర్గాలున్నాయి, వర్ణాలున్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది ఆ కాలపు సంస్కృతి. సత్యసాయి భగవానుడు ఈ కలియుగంలో సమస్త ప్రపంచాన్ని తన దగ్గరకు తీసుకున్నాడు. మనమంతా కులం ధారల్లో కూర్చొని స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నప్పుడు గాని, ఇప్పుడు గాని మన పక్కనున్న వాడు ఏ country వాడో మనకు తెలియదు, ఏ జాతి వాడో మనకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మనుషులని ఒక కుండం తవ్వాల అనేటువంటి ఒక గొడుగు కింద కూర్చోబెట్టి వసుదైవ కుటుంబకం అంటే ఇది అని నిరూపించినటువంటి పరమాత్మఆన్ శ్రీ సత్య సాయిబాబా వారు ఇది నిజం ఎందుకంటే దీన్ని ఎవరూ కాదనలేరు చైనాలో ఉన్నటువంటి వాడు చాగరాజు కీర్తన పాడతాడు నాస్తికుడు వచ్చి దేవుడు లేడు లేడు అంటే దేవుడు అంటూ ఉంటే అది బాబా గారేనని నిర్ణయం చేసుకొని వెళ్ళిపోతాడు అలా సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని అనేకమైనటువంటి మతాలన్నీ కూడా ఈవేళ విడివిడిగా ఉంటే వీటన్నింటినీ సమన్వయం చేసినటువంటి పరమాత్మ సచ్చిదానంద గురుమూర్తి అంటాం మనం సత్ చిత్ ఆనంద స్వరూపం అది తరువాత ఎవరి ముందు చేయి జాపని వ్యక్తిత్వం ఏదైనా ఇవ్వగలిగినటువంటి మహా శక్తి సంపన్నత వీటన్నింటినీ గమనించి మనం గనుక స్వామిని correct perspective లో అర్థం చేసుకోగలిగినట్లైతే మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయగలిగాం? మన దగ్గర degrees ఉన్నాయి, సంపదలున్నాయి, FD లు ఉన్నాయి, భూములున్నాయి, ఆ... flat లు ఉన్నాయి, కడుపునిండా సంసారం సంతానం ఉన్నది కానీ మనం ఈ సమాజానికి ఏం చేశాం అని అనుకున్నప్పుడు ఒక చిన్న సహాయం చేసేటప్పుడు వీడు నా వాడా? పరవాడా? వీడు నా కులం వాడా? కాదా? వీడు నా మతాన్ని మన్నించేవాడా? కాదా? డబ్బున్నవాడా? డబ్బు లేనివాడా? పామరుడా? పండితుడా? జ్ఞానియా? అజ్ఞానియా? ఇన్నింటి మధ్య దానం చేయటం, చాద్యం చేయటం మర్చిపోతాం స్వామి ఇవి ఏవీ లెక్క పెట్టలేదు. ఎన్నెన్ని అనుమానాలు, అవమానాలు ఎన్ని ఎదురైనా తన కర్తవ్య దీక్షతో తాను ముందుకు వెళ్ళి ఇవాళ సర్వ ప్రపంచం చేత భగవంతుడంటూ ఉంటే అది కేవలం సత్య సాయి భగవానుడే. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇందాక చెప్పానే త్రేతాయుగం నుంచి ఉన్నటువంటి కంచి కామకోటి పీఠం ప్రస్తుత పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు వైజాగ్ లో మన సమితికి రమ్మనమని నేను కోరగానే మేము వస్తున్నాం అని వచ్చేశారు. వచ్చి ఆరోజు ఇరవై ఎనిమిది నిమిషాలు స్వామి గురించి మాట్లాడారు ఎవరికీ తెలియని అనేక విషయాలు చెప్పి మీరు ఆ.. ఈశ్వరమ్మో ప్రియనందనా అనేది పాడుతుంటే విన్నాను మీరు పాడుకోండి నిజమే కానీ ఆయన స్వయంభువు. ఆయన నిర్ణయించుకొని ఈ జగత్తులోకి వచ్చారు. తల్లిదండ్రులను కూడా వారే ఎన్నుకున్నారని ఇరవై ఎనిమిది నిమిషాలు మాట్లాడి వారు స్వయంభువు అని declare చేశారు. మీ క్రమశిక్షణ మీకు స్వామివారు ఇచ్చినటువంటి మార్గ ఉపదేశం స్వామివారు నేర్పినటువంటి అనేక విలువలతో కూడినవి వీటన్నింటినీ కూడా ఒక్కసారి గుర్తు చేశారు స్వామివారు. నేను ఎప్పుడు స్వామి వారిని కలిసినా స్వామి గురించి ఆ ప్రస్తావన లేకుండా ఆ.. ఆ.. విషయం కదలదు ముందుకి. ఖచ్చితంగా అడుగుతారు ఎలా ఉన్నారు? స్వామి ఎలా ఉన్నారు? కుటుంబరులు అన్నీ బాగున్నాయి కదా? అని అంటే నేను సమాధానం దాన్ని అందరూ అడుగుతారు స్వామివారు కూడా అడుగుతారు. ఒక్కమాట హృదయంలో నుంచి సత్య జయ సంజనితమైన వాక్కుగా చెప్తున్నాను స్వామి దేహం మాత్రమే వదిలిపెట్టారు చైతన్యం ఇక్కడే ఆవరించి, ఆవహించి, ఆవేశించి ఉన్నది కనుకనే స్వామి దేహంలో ఉన్నప్పడి కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా జరుగుతున్నాయి అనేది నా సమాధానం. ఇది నిజం కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నది ఇది కాబట్టి ఇవాళ చివరిగా స్వామి ఏం చేశారు? వారు ఎటువంటి వారు? ఏదో మాట్లాడుకున్నాం మరి ఇవాళ మనం ఏం చేయాలి? Think around మనం ఏం చేయాలి? What is that we have to do now? అంటే స్వామి శతజయంతి అద్భుతంగా చేద్దాం ఇంకా కొన్ని ఉపన్యాసాలు ఇది కానే కాదు. ఏ సనాతన ధర్మ పరిరక్షణకి ఒక పరమాత్మ అవతరించి జాతిని నడిపించి సనాతన సారథి అయి నిలిచి ఇన్నేళ్లుగా నడుపుతున్నారో స్వామి యొక్క ఆశలు, స్వామి యొక్క ఆదర్శాలు, స్వామి యొక్క సందేశ ఉపదేశ ఆదేశాలు ఆకళింపు చేసుకొని మనకున్నటువంటి జీవితాన్ని మనం refine చేసుకోవాలి redefine చేసుకోవాలి restructure చేసుకోవాలి అంతయుం ఈశ్వర ప్రీతికే. పరమేశ్వరుడికి సమర్పించేటువంటి భావనతో మన ఆలోచనలన్నీ సాగాలని అలాగే మన జీవితాలు చల్లగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా జరుగుతూ ఉండాలని మన రాబోయేటువంటి తరాలన్నీ కూడా సత్య సాయి ఆవరణంతో ముడిపడి ఉండాలని మనసా వచసా కోరుకుంటూ స్వామి చెప్పినట్లుగా ఏ ఇంట నా చిత్రపటం ఉండునో ఎక్కడ భగవన్నామ సంకీర్తన జరుగుతో- జరుగునో ఆ ఒక్క తరాన్ని మాత్రమే కాక వారి రాబోయే ఇరవై ఒక్క తరాలను నేను కాచుకుంటాను నేను చూసుకుంటాను అని చెప్పారు కాబట్టి ఇవాళ మనం చేసే ప్రతి పని మన రాబోయే ఇరవై ఒక్క తరాలకి అది ఆరక్ష అలాగే సత్య సాయి భగవానుడి యొక్క దివ్య భావనలన్నీ కూడా ఏది ఏ ప్రశ్నకి సమాధానం కావాలన్నా స్వామి literature లో మనకు దొరుకుతుంది. Literature అంటే స్వామి చుట్టూ రాసినవి కాదు స్వామి చెప్పినవి, స్వామి అన్నవి, స్వామి వ్రాసినవి ఇవి మాత్రమే నిత్య సత్య జీవన సూత్రాలుగా నేను భావన చేస్తూ మీ అందరికీ ఇటువంటి సందర్భంలో ఆ.. ఒక సత్సంగాన్ని ఏర్పాటు చేసుకొని మనమందరం కూర్చొని స్వామి యొక్క దివ్య లీలా వైభవాన్ని అంటే తత్ చింతం తత్ కథనం పరమేశ్వరుని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి అలాగే స్వామి యొక్క కథని చెప్పుకుంటూ ఉండాలి అది ఎలా చెప్పుకోవాలంటే చెప్పిందే చెప్పినట్లుగా చెప్పుకోకూడదు ఇంతకు ముందు చెప్పినదానికంటే భిన్నంగా, ఉన్నతంగా, ఉత్తమంగా, ఉత్కృష్టంగా, ఉదాత్తంగా కానీ యదార్థంగా ఎక్కడా కల్పనలు ఉండకూడదు ఎక్కడా అబద్ధం చెప్పకూడదు ఎక్కడా తాను అనుభవించనిది మరొకరికి చెప్పరాదు ఇది నైతిక సూత్రం ఎవరికో ఇలా అన్నది అయిందట అంటే మనకే లోపం మనకి ఏమైంది? మనం స్వామి దగ్గరికి ఎలా రాగలిగాం? వచ్చినా ఎలా నిలబడగలిగాం? నిలబడగలిగినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు ఆనందాలు వెల్లు Oచ్చి పడినా ఎక్కడా మనం పొంగలేదే, పుంగలేదే, లొంగలేదే, వంగలేదే ఒకటిగా ఎలా ఉన్నాం అనేటువంటి ఈ నిశ్చితమైనటువంటి conviction అంటే ఒక మనీష. ఆ మనీషలో నుంచి స్వామిని దర్శనం చేస్తూ మన రాబోయే తరాలకి మన జీవితాలని ఆదర్శప్రాయం చేయాలి. స్వామి చెప్పిందే మళ్ళీ My life is my message అన్నారు ఒక ఇరవై ఏళ్ల తర్వాత అన్నారు Your life should be my message అన్నారు మనం ఎలా జీవిస్తున్నామో అదే స్వామి గౌరవాన్ని తేవాలి. స్వామి అంటే ఇంటి పెద్ద కాదు ప్రపంచానికి సృష్టికర్త అటువంటి ఒక పరమోదారమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి సత్య సాయి భగవానుని యొక్క మహావతారానికి మరొక్కసారి ప్రణమిల్లుతూ స్వామి అవతార declaration అంటే అవతార ప్రకటన ఏ సందర్భంలో జరిగింది? ఆయన మాత్రమే ఎందుకని ప్రఠానిగా ఏంటా ప్రకటన చేశారు? చేసిన ప్రకారం ఎలా భూసంచారం చేశారు? దీని తర్వాత ఈ సనాతన ధర్మమైన వైదికమైనటువంటి ఈ భారతీయ ఆత్మని ఎలా విస్తృతం చేయాలో ఎన్ని ఉపాయనాలు ఎన్నెన్ని రకాలుగా బోధించారో గమనించినప్పుడు మహా బౌద్ధగా, తాత్వికవేత్తగా, ఒక పరమ గురువుగా అన్నింటికంటే సర్వదేవతా అతీత స్వరూపంగా కనిపించేటువంటి ఈ స్వామి మన హృదయాలలో నిండి మనల్ని సద్బుద్ధి వైపు, సదాచారం వైపు, జీవన సంయక్ దర్శనం వైపు చల్లగా, ప్రసన్నంగా, ప్రశాంతంగా నడిపించు గాక అటువంటి యోగాన్ని, ప్రాప్తిని స్వామి ఈ అఖండ సృష్టి మీద మహామృత దృష్టిగా కురిపించు గాక అని స్వామిని మరొక్కసారి ప్రార్థన చేస్తూ సాయిరాం. Om Sri Sai Ram
YouTube · audio
️విశిష్ట వక్త ️శ్రీ గారు ️ సాయిమాట-సాయిబాట ️యుగావతారి - ప్రేమావ తారి సత్యసాయిబాబా
️విశిష్ట వక్త ️శ్రీ గారు ️ సాయిమాట-సాయిబాట ️యుగావతారి - ప్రేమావ తారి సత్యసాయిబాబా
Source: sai mata sai bata on YouTube
0:00 / 1:09:17