No transcript for this section.
Transcript begins at 2:05.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ. అరుణాచల రమణ సాధకులందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి సప్రేమకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ, ఏ అవతారమూర్తి కానీ, గురుమూర్తి కానీ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు. దెబ్బ తీసుకో. వారి ప్రభావం వ్యక్తుల మీద, సమాజం మీద కొన్ని చోట్ల చాలా subtle గా ఉంటుంది. కొన్ని చోట్ల చాలా తీవ్రంగా ఉంటుంది. subtle గా ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి అనుభవానికి లోనైనటువంటి వారు మనకి తక్కువగా కనపడతారు, గుప్తంగా ఉంటారు. అలాగే తీవ్ర ప్రభావానికి లోనైనటువంటి వాళ్ళు మాత్రం భగవాన్ దయవల్ల ఇవన్నీ జరుగుతున్నాయని, భగవాన్ నడిపిస్తున్నారని, జీవితంలో జరిగే ప్రతి సంఘటన భగవాన్ యొక్క అనుగ్రహమేనని ఒక సద్భావనని తమ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో వెదజల్లుతూ పరివ్యాప్తం చేస్తారు. ఇది వ్యక్తుల మీద అవతారమూర్తుల యొక్క ప్రభావం. కొంతమంది అవతారమూర్తులు వారు కాలాతీత వ్యక్తులు కాబట్టి, వ్యక్తులు అంటే persons అని కాదు. దురదృష్టవశాత్తు కొన్ని తెలుగు పదాలకి English లో equivalents లేవు. వ్యక్తులు అంటే వ్యక్తమైన వారు అని అర్థం. పరమాత్మ ఎట్లాగా ఒక అవతారమూర్తిగా మనం భావిస్తామో, ఆయన కూడా వ్యక్తిగానే వస్తాడు. పంచభౌతిక దేహాన్ని ధరించి మన మధ్యలో నడయాడుతూ మన ఆలోచనలు, వారి ఆలోచనలు సమన్వయం చేస్తూ మానవుణ్ణి ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి, ఆ తర్వాత ఉత్కృష్ట స్థితికి, ఉదార స్థితికి, ఉదాత్త స్థితికి, యదార్థ స్థితికి తీసుకుని వెళుతూ వెళుతూ ఉంటారు. దానిలో గురువు వినమ్రుడు అయి ఉంటాడు. గురువు రెండవ పరిశ్రమ ఏమిటి అంటే తాను మౌనంగా ఉంటాడు, అప్రమేయంగా ఉంటాడు, తామరాకు మీద నీటి బొట్టు వలే ఉంటాడు. కానీ గురువుని, అం-- గురువు ఆంతరంగికంగా సాధకుణ్ణి నడిపిస్తూనే ఉంటాడు. ఎట్లా అంటే కుమ్మరివాడు అంటే కుండలు చేసేటువంటి వ్యక్తి. కుండ తయారు చేయడానికి కావలసిన మట్టిని ఎలాగైతే కాళ్ళతో తొక్కి పదును ఎక్కించి, ఆ పదును వచ్చేదాకా మట్టిని తనకు కావలసిన రీతిలో తయారు చేసుకొని, ఆకారాన్ని తేల్చి లోపల నుంచి తడుతూ, పైనుంచి కొడుతూ ఒక ఆకారాన్ని, రూపును తీసుకుని వస్తాడు. అట్లాగే గురువు ఎక్కడ ఉన్నాడు అంటే లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అన్నింటిలోనూ ఉన్నాడు, అన్నీ తానై ఉన్నాడు. గురువు అంటే ఆత్మే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణే. ఈశ్వరుడన్నా, అంటే కంటికి కనపడని ఈశ్వరుడన్నా, గురువన్నా, ఆత్మ అన్నా ఒకటే. అయితే ఈశావాస్యోపనిషత్తు భగవంతుని గురించి మాట్లాడుతూ ఈశ్వర స్పర్శ ఈ ప్రపంచం అన్నది. ఈశ్వర స్పర్శ అంటే జడము చైతన్యము కలబోసుకుని ఉన్నా, జడ చైతన్యాలు విడివిడిగా ఉన్నా, ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క స్పర్శే. అంటే కొండలు, కోనలు, వాగులు, వంకలు, పిట్టలు, గుట్టలు ఇవన్నీ కూడా చైతన్యవంతమైనవి. కేవలం మానవులు మాత్రమే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల అన్నింటి యందు చైతన్యం ఉన్నది గనుకనే పుడుతున్నాయి, ఉంటున్నాయి, పోతున్నాయి. కానీ అహంకారం చేత మానవుడు తానొక్కడే శాశ్వతుడని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మానవుడికి ఆ రకమైన ప్రత్యేకమైన వెసులుబాటు ఏమీ లేదు. మానవుడు కూడా దేహాన్ని ధరించాలి. ధరించాడు, వస్తాడు. ఆ దేహం ద్వారా శరీర మాధ్యం కను కర్మ సాధనం, శరీర మాధ్యం కను కర్మ సాధనం. కర్మబద్ధమైన కర్మలు చేయటానికి మాత్రమే ఈ శరీరం ఉన్నదని గ్రహించిన వాడు ముక్త జీవుడు అవుతున్నాడు. శరీరం ఆధారంగా చేసుకోకుండా కేవలము ఆత్మని ఆధారం చేసుకొని తాను ఆత్మయై, సర్వాత్మయై, అంతర్యామియై ఈ ప్రపంచాన్ని నడిపించినప్పుడు అదే ముక్త జీవనుడు జీవన్ముక్తుడవుతున్నాడు. వెంకట్రామన్ మరణానుభవాన్ని పొందటానికి ముందు ఆయన ముక్త జీవనుడు. మరణానుభవాన్ని పొందిన తర్వాత అరుణాచలానికి వచ్చి అటువంటివే రెండు, మూడు అనుభవాలు మళ్ళీ పొందిన తర్వాత తాను ఆత్మే అన్నటువంటి ఒక నిశ్చలమైన, నిశ్చితమైన, మనీషాయుక్తమైన చిత్తంలో నెలకొండి చెందినప్పుడు భగవాన్ జీవన్ముక్తులుగా మనకి అనుభవంలోకి వస్తారు. ఆయన జీవన్ముక్తుడిగానే జగత్తులోకి వచ్చారు. కానీ కొన్నాళ్ళు ముక్త జీవనులుగా జీవితాన్ని సాగించారు పదహారు, పదిహేడు సంవత్సరాల ప్రాయం వచ్చేదాకా. దీనిని జాగ్రత్తగా గనక మనం గమనించినట్లయితే ఈ ప్రభావం మన మీద ఎలా ఉంది? రమ-రమణులు ఎక్కడున్నారు? మనం ఇక్కడున్నాము. రోజూ అరుణాచలంలో ఉండము. మరి ఆ ప్రభావం మనల్ని నడిపిస్తుందా? ప్రభావం చెందామని ఎలా ఉంటుంది? వీటిని కొన్ని విశ్లేషణాత్మకంగా కాసేపు మాట్లాడుకోవాలి. ఇది సాధనలో పెద్ద భాగం. కనుకనే భగవాన్ అరుణాచలానికి వచ్చినప్పుడు ఎప్పుడూ ముక్త జీవన స్థాయిలో "అరుణాచల మనసు స్మరియించు వారల అహము నిర్మూలింపు అరుణాచలా" అంటూ ఇంకా నాలో నేను, నాది, నేను వచ్చాను, నేను చూశాను, నువ్వు నా గురువువి.ఆ అరుణాచల దేవాలయంలో అరుణాచలేశ్వర దర్శనం అయింది అనేటువంటి ఈ ద్వంద్వ భావన అది అహాన్ని అంటే అహంకారం కాదు అహం అంతవరకే కానీ అహం స్ఫురణలోకి వెళ్ళటానికి తాను కాపాడమని అడుగుతున్నారు వారలలో తనను కూడా కలుపుకున్నారు. ఏది అరుణాచలమనుచు స్మరియించు వారల. దాంట్లో మనుషులున్నారు తాను కాని వారంతా ఉన్నారు కానీ నిజానికి తాను కానిదంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు అంటూనే ఆ భగవాన్ తమ జీవితాన్ని యావత్తు మరణానుభవాన్ని పొందిన తర్వాత యాభై నాలుగు సంవత్సరాలు అదే దేహంలో ఉంటూ జన జగత్తులతో మమేకమై ప్రాపంచిక లౌకిక భౌతిక వ్యాపారాలలో కూడా అప్పుడప్పుడు మనస్సుని ప్రవేశపెట్టి కానీ తనకేమీ సంబంధం లేని ఒకానొక స్థితిలో సంచారం చేసిన జీవన్ముక్తులు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఇక వారిని అవతారమూర్తిగా మనం మన మన అనుభవాలను బట్టి మనకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను బట్టి వారిని ఆంతరంగికంగా దర్శనం చేసుకుంటూనే ఉంటాం. ఇక్కడ చాలామంది ఒక అన్నామలై స్వామే కాదు అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఇవాళ అన్నామలై స్వామి జీవిత చరిత్రని చెప్పాలని అనుకోవటం లేదు ఎందుకంటే అది అందరికీ తెలిసిందే కానీ ఆ జీవన సారస్యంలో నుంచి దానిలో నుంచి ఏమి పొందాడు అన్నామలై స్వామి అంటే ఆయన అన్నామలై మాత్రమే తర్వాత స్వామి అయినారు స్వామి అంటే జ్ఞాని అని అర్థం స్వామి అంటే తనను తాను ఎరిగిన ఎరుకలో నిలకడ చెందిన వాడు అని ఒక అర్థం గురు ఆజ్ఞను పాటించి గురువంతటి వాడు కావటం రెండవది. ఈ రెండవ పార్శ్వంలో ఇవాళ మనం అరుణాజ్-- అన్నామలై స్వామిని అరుణాచలంలో మనం గనక గమనించినట్లయితే రమణ ఆశ్రమ నిర్మాణంలో నిజానికి ఆయన ఆయన తండ్రి భగవాన్ దగ్గరికి తీసుకువచ్చి చదువుకోవటం లేదు మీరు అనుగ్రహించండి అని అడగటం అలాగే చదివిస్తాను వాడు జ్ఞాని అవుతాడు అనేటువంటి పదాలు వాడకుండా అన్నామలై స్వామిని తన దగ్గర పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా ఆత్మజ్ఞానం అణుక్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రం వైపు ఔదార్యంతో నడిపించినటువంటి కరుణాపూర్ణ శతాబ్ది భగవాన్ శ్రీ రమణులు. అంటే లోకవిద్య ప్రమాణం కాదు, లౌకికమైన దేహ సౌందర్యం ప్రమాణం కాదు, ప్రాపంచికమైన స్థితిగతులు ప్రమాణం కాదు, శాస్త్రము, కవిత్వము, పాండిత్యము ప్రమాణం కాదు, అనేకమైన లలిత కళలు ప్రమాణాలు కావు. మరి ఏది ప్రమాణం అంటే ఆత్మనిష్ఠో భవత్వం. నేను ఆత్మనన్న ఎరుకలోకి వెళ్ళటానికి మనస్సుని ప్రవేశపెట్టగలిగితే అక్కడ ప్రారంభం అవుతుంది. వీటన్నింటిని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు అరుణాచల రమణులు ఆయన్ని ఎలా శిక్షణ ఇచ్చారు, ఎలా తీర్చిదిద్దారు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. గురు కృప ఎలా ఉంటుంది అనేదానికి కబీరు జీవితం ఒక ఉదాహరణ. కబీరు రామభక్తుడు. కబీరుకు కూడా ఒక సూఫీ గురువు ఉన్నాడు. ఆ సూఫీ గురువు తప్ప మరెవరూ ఆయనకి అసలు భగవంతుడన్న ఆలోచనే లేదు. కానీ ఒకానొక సమయంలో గురువు నువ్వు నా నుంచి దూరంగా ఉండి ఎడంగా ఉండి నీ జపము తపము నువ్వు చేసుకో అని అనటం ఆయన వెళ్ళటం జరిగింది. జరిగిన తర్వాత గురువు దయా-- దయామయుడు నిర్దయుడు కాదు అప్పటిదాకా తన దగ్గర ఉన్నటువంటి కబీర్ ని తానే దూరంగా వెళ్ళమని చెప్పాడు కనుక ప్రతిరోజూ శిష్యుడి దగ్గరికే కబ్-- గురువుగారు వెళ్ళేవారు. అలా కొన్నాళ్ళు జరుగుతూ జరుగుతూ ఉండగా ఓ రోజున గురువుగారు ఎవరినో వెంబడి పెట్టుకొని వచ్చారు. ఆయన కూడా గురువు వలె ప్రకాశమానంగా ఉన్నాడు. దూరం నుంచి కబీర్ రాకకో-- గురువుగారి రాక కోసం ఎదురుచూస్తున్నాడు. గురువుగారు మాత్రమే కాదు ఇంకెవరో కూడా తత్తుల్యమైనటువంటి తత్సమానమైనటువంటి ఒక వ్యక్తి ఎవరు వస్తున్నారు, ఇంత వెలిగిపోతున్నారు ఆయన ఎవరు అని నిజమే ఆయన వస్తున్నారు మరి ముందు నేను ఎవరికి నమస్కరించను. నిత్యమూ నా ఆత్మోన్నతికై పాటుపడి నన్ను లాలించి, పాలించి, ఆలించి, అదలించేటువంటి గురువుకి నమస్కరించనా, ఆ కొత్తగా వచ్చిన అతిథి దేవోభవ అనే భావనలో ఆయనకు నమస్కరించనా అని కబీరు మనస్సు రెండుగా చీలిపోయినప్పుడు వివేకం మేల్కొన్నది. లోపల నుంచి ఒక ప్రజ్ఞాభూమిక ఆవిష్కృతమై లోపల హ్యహం మహమితి సాక్షాత్ ఆత్మ రూపేణ భాతి అది కదా భగవాన్ ప్రకటన. ఆత్మ రూపేణ భాతి ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఒక హెచ్చరిక చేసింది. అది ఏమిటి అంటే వచ్చారు గురువుగారు వచ్చారు. ఆ పక్కన ఉన్నవాడిని కబీర్, “రోజూ నువ్వు నామస్మరణ చేసుకుంటున్నావు కదా, ఏదో ఒక మూర్తిని, ఏదో ఒక భావనని నువ్వు తలచుకుంటూ ఉన్నావు కదా, అదిగో ఈ వచ్చిన వాడే భగవంతుడు” అని చెప్పాడు. గురువుగారు చెప్పగానే ఇంకా సందేహంలో పడ్డాడు. వచ్చిన వాడినేమో భగవంతుడని గురువు చెప్తున్నారు, మరి నా గురువుకి నమస్కరించనా, గురువుకి కూడా భగవంతుడని భగవంతుడికి నమస్కరించనా. ఆ వివేకం మేల్కొని ఒకటే అనుకున్నాడు. గురు గోవిందు దోను-- దోను ఖడే కాటే లాగూ పాయే బలిహారి అపనే గురు గోవింద దియో బతాయే. అంటే ఏం లేదు మా గురువుగారు వచ్చారు వెంబడి పెట్టుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు కానీ నా గురువు చెప్తున్నాడు. నువ్వు తలచుకున్నటువంటి భగవంతుడు ఇతడే అని చెప్పాడే, అందువలన భగవంతుడు ఉన్నాడని, ఉంటే ఇట్లా ఉంటాడని ఇదిగో అని చెప్పినందువలన భగవంతుణ్ణి చూపించినందుకు నా గురువుకే నేను ముందు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇది ప్రథమ నమస్కారం చేసుకున్నాడు. అంటేగురువు కంటే భగవంతుడు ప్రత్యేకంగా ఉన్నాడా? అంటే భగవాన్ ఆశ్వాసనలో, భగవాన్ అనుశాసనంలో, భగవాన్ మాటల్లో, భగవాన్ ప్రకటనల్లో, భగవాన్ మాట్లాడిన అనేక సందర్భాలలో దేవుడన్న పదాన్ని వాడని అవతారమూర్తి భగవాన్ శ్రీ రమణ మహర్షి. దేవుడనే పదం వాడలేదు. ఎందుకంటే అసలు దేవుడు మనకంటే భిన్నంగా లేడు. మళ్ళీ ఆ దేవుడు ఎవడు? మీలో ఉన్నటువంటి ఆత్మే. "ఆత్మ రూపే ఇడ భాతి" మర్చిపోకూడదు. కాబట్టి సత్య సాయిబాబా వారు కూడా చాలా అందమైన పదంతో తేట తెలుగులో చెప్పారు. "దేవుడనగా వేరు దేశమున లేడు. తాను చేయు పనుల యందు తగిలి ఉండు." అంటే మన కర్మానుష్టానంలో మనం చేసేటువంటి మన మంచి పనులలో, మంచి ఆలోచనలలో, మంచి భావనలో, మంచి తలపులో దాని యందు ఉన్నటువంటి ఎవరైతే శక్తి ఉన్నదో అదే భగవంతుడంటూ వేరుగా, వేరే ప్రదేశంలో లేడు సర్వాంతర్యామిగా ఉన్నటువంటి వాడే మనలో అంతర్యామిగా కూడా ఉన్నాడు అన్నారు. అంటే ఈ ప్రభావం మనకి ఎలా కనిపిస్తుంది అంటే కబీర్ మీద చూడండి. ఎంత ప్రభావం ఉందో, గురు ప్రభావం. సాక్షాత్తు పరమాత్మ వచ్చి దేహంతో తన కళ్ళ ముందు నిలబడి ఉన్నా గురువుకే నమస్కారం అన్నాడు. అది అటువంటి అచంచలమైన, అనిర్వచనీయమైనటువంటి ఒక భావ సంపద. అది ఆధ్యాత్మిక సంపద. దాన్ని మనం నిలబెట్టుకో-- ముందు పొందాలి. పొందటానికి సాధన చేయాలి. సాధన చేసి పొందిన తర్వాత నిరంతరము "నిరంతరాధ్యాస నిరంతరాభ్యాసాం" అంటారు. అభ్యాసలో ఉండాలి, అభ్యాస యోగంలో ఉండాలి. నిరంతరము అనుకోవాలి. "తత్ చింతనం తత్ కథనం" భగవంతుని కథలు చెప్పుకోవాలి. భగవంతుని తలుపులుండాలి. ప్రపంచంలో మనకేదో మంచి జరిగింది భగవంతుని వల్ల అనుకుందాం. మంచి జరగలేదు లేదా మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు అది కూడా భగవంతుని ఆలోచనే అనేటువంటి ఒక భావనలోకి మనం వెళ్లగలిగినట్లయితే మనకి ఏ రకమైనటువంటి బరువు గాని, బాధ్యత గాని ఒక క్షేదము గాని, దుఃఖము గాని, అననుకూలత గాని, వ్యాకులత గాని ఏదీ మనకు ఏర్పడదు. అటువంటి నిశ్చల, నిర్మల, నిశ్చిత మనీషా బుద్ధి కావాలి అంటే గురువు యొక్క ప్రభావం మన మీద ఉండాలి. గురువు యొక్క ప్రభావం డైరెక్టా, ఇన్డైరెక్టా? అంటే కాసేపు డైరెక్ట్, కాసేపు ఇన్డైరెక్ట్. ఎట్లా అంటే ఇక్కడి నుంచి నేను హిమాలయాల వైపు ఉదాహరణకి సిమ్లా వైపు నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నా, మొట్టమొదటి రోజు. నాకా ప్రాంతమంతా కొత్తగా ఉంది. కానీ నా ఎదురుగా ఉన్నటువంటి సహ ప్రయాణికుడికి సిమ్లా తెలుసు. ఆ ఊరికి చెందిన వాడే ఆయన. నేను పదే పదే గడియారం చూస్తూ ఆయన్ని అడుగుతున్నాను "ఇంకా ఎంత టైంలో సిమ్లా వెళ్తాము? ఇంకెంత దూరం ఉంది? ట్రైన్ సరిగ్గా వెళుతున్నదా లేదా? టైం maintain అవుతున్నదా?" ఇవన్నీ అడుగుతూనే ఉన్నాను అనుకోండి. ఆయన కూడా చాలా వినయంగా, ప్రశాంతంగా "ఇగో ఇంకో అరగంటలో వస్తుంది", "ఇంకో పావుగంటలో వస్తుంది" అని చెప్తున్నాడు. కానీ ఆతృత వలన, ఆ వస్తువుని ఇంకా చూడనందువలన, ఆ సిమ్లా అనుభవం లేనందువలన మనస్సు ఆందోళన యత్తమై పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఒక చల్లని మలయ పవనం వీచింది. మామూలుగా ఉండేటువంటి temperature ని దాటి, మాయం చేసి చల్ల చల్లగా, మెల్లగా మలయ పవనం సమీరంగా వస్తూ వస్తూ ఆ చల్లదనం గాఢమై భరించలేనంత చల్లదనం వచ్చేసరికి ఆయన్ని అడగవలసిన పని లేకపోయింది. కారణం సిమ్లా యొక్క చల్లదనం చెప్పీ చెప్పకనే మీ దగ్గరకు వచ్చారని చెప్పింది. అనుభవం లేనంత వరకు అడుగుతూ ఉంటాం. అనుభవం పొందిన తర్వాత అడగటానికంటూ ఏమీ లేదు గనుక ఆ అనుభవాన్ని నిత్య సాధనగా మార్చుకోవాలి. అది గురువు యొక్క అనుగ్రహం కూడా. ఇదిగో ఇలాగే ఈ మలయ పవనం లాగా ఆ time వచ్చినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు, మన ప్రాప్తి మన యోగము తరించినప్పుడు, మనకు దాని అవసరమైనప్పుడు గురువు యొక్క అనుగ్రహం మన మీద ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. అడగటమే అలవాటుగా ఉన్న మనం అడగటం మానేస్తాం. దుఃఖించటమే ఒక జీవిత ఆ భాగంగా చేసుకున్న మనం దుఃఖాన్ని దూరం చేస్తాం. ఆనందంలో మాత్రమే మునిగి తేలుతున్నటువంటి మనం నెమ్మదిగా ఆనందం ఏమిటి, దుఃఖం ఏమిటి, రెండూ మనసు చేసే గారడీ కదా అనేటువంటి భావనలో మనోమయులైనటువంటి మన బోటి సాధకులందరం కూడా మనసు నుంచి విముక్తమై మనసును దాటినటువంటి ఉన్మని యోగము అంటాం. ఉన్న-ఉన్మని అంటే ఉత్తమమైన మనసు. మనం ఈ ప్రపంచంలో ఇరవై నాలుగు గంటలు కించిత్ మనసుతో కాదు గ్రాస్ గా ఉండేటువంటి మనసుతో మనసుకు లోబడి మనసు ఎలా చెప్తే అట్లా వింటూ దానికి బానిసలమై, దాసులమై జీవితాన్ని గడుపుతాం. మరి నిన్నేం చేయాలి? మనసును మనకు కావలసినట్లుగా మార్చుకోవాలి. అది అధ్యాత్మ సాధన. మనకేం కావాలి? దేని వలన ఆనందం కలుగుతుందో, ఏ నామ, రూప, భావ, తత్వాలను విచారణ చేసినప్పుడు శరీరం అంతా కూడా పులకాంతుర ప్రకారం అవుతుందో అటువంటి ఆ దివ్య భావన వైపు, ఆ గరిమ వైపు, ఆ సిద్ధి వైపు మన మనసును మనం నడిపిస్తూ ఉన్నప్పుడు అది ఒక ప్రసన్నమైనటువంటి ఒక ఖేలా. ఖేలా అంటే ఆట. దాన్ని హిందీలో "ఖేల్" అన్నా, మనం "ఖేలా" అన్నా ఒకటే. కాబట్టి మనసు చేసే ఈ ఆటలో మనం ఎప్పుడూ గెలవాలి. అది ఎన్నో కోరుతుంటుంది. అది కావాలి, ఇది కావాలి, ఇది లేకపోతే ఎట్లా, అది లేకపోతే ఎట్లా. ఆందోళన పడుతుంది, ఆందోళన పెడుతుంది. ఇటువంటి మనస్సుని నిర్మలం చేసుకోవాలి అంటే మన అన్నామలై తాపీ మేస్త్రీగా ప్రారంభించి భగవాన్ ప్రతిరోజూ పర్యవేక్షించి కంటి చూపు ద్వారా అతనికి అనేక పనులు నేర్పి, ఆతడు పని చేసినంత కాలము అతని పక్కనే ఉండి రమణాశ్రమ నిర్మాణంలో అరుణాచ్-అన్నామలైని చాలా వినియోగించారు స్వామి. అంటే అతని యందున్నటువంటి ప్రజ్ఞ ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో దానిని వినియోగించిసంపూర్ణమైనటువంటి కర్మయోగంలో అన్నామాలైన నిలబెట్టారు భగవాన్ కర్మయోగం లేని భక్తి యోగం వృధా భక్తియోగం లేని జ్ఞాన యోగం వృధా కనుక జ్ఞాని జ్ఞాని అయినటువంటి వాడు భక్త అవుతాడు భక్తుడు అయినటువంటి వాడు మళ్ళీ కర్మయోగంలో కి రావాలి కాబట్టి కర్మ భక్తి జ్ఞాన యోగాలు అంటూ మనం ఒక descending order లో చెప్పుకుంటాం మళ్ళీ descending order లోకి వచ్చినప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు చేసేటువంటి ఆ భక్తిలో పూజాతే విశేషోపభోగ రచన ఉపనిషెతారంలో భగవాన్ చెప్పినట్లు ఒకదాని కంటే ఒకటి ఉత్తమమైనదని కడగా మౌనం వహించాలని చెప్తూ ఆ సోపానాలు అన్నీ కూడా మనకి పరిచయం చేశారు కాబట్టి మనం ఏమి చేయాలి అంటే పూజలు ఉండాలా ఉండాలి ఎప్పటి వరకు మెట్టు దాటే వరకు దాటిన తర్వాత ఆ పూజలు మనకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కానీ సంప్రదాయాన్ని ఒక సామాజిక ధర్మాన్ని ఒక భారతీయమైనటువంటి ఆత్మని మనం ఆవిష్కరించుకునేటువంటి దిశగా కర్మయోగ సాధన లో వీటన్నింటినీ కూడా పూజ గుడికి వెళ్ళటం ఆరాధన అర్చన వేడుక ఉత్సవము జాతర ఇవన్నీ కూడా మనం దాటుతూ దాటుతూ వెళ్లి మన మనసుని మనకు కావలసినట్టుగా పదును ఎక్కించుకోవాలి ఆ పదును ఎక్కించినటువంటి మనసుతో అన్నామాలై భగవాన్ దగ్గర అరుణాచల ఆశ్రమ రమణాశ్రమ నిర్మాణం అయిపోయిన తర్వాత అయిపోతున్న సమయంలో దానికంటే ముందు కొద్ది రోజుల ముందు భగవాన్ దగ్గరకు వెళ్లి ధర్మాధికారి అంటే ఆశ్రమ అధికారి నిరంజనానంద స్వామి నన్ను కాస్త ఇబ్బంది పెడుతున్నారు కోప్పడుతున్నారు ఇబ్బంది అంటే కోప్పడుతున్నారు అది చేయలేదు ఇది చేయలేదు టైం కావటం లేదని విసుక్కుంటున్నారు అని చెప్తే వారిని అలా విసుక్కునివ్వండి మీరు విసుక్కోకుండా పని చేసుకోండి అన్నారు దీనికి కారణం యోగవాసిష్టంలో శ్రీరామచంద్రుడికి వశిష్ఠులవారు ఒక మాట చెప్తాడు రామచంద్ర ఇప్పుడు నీ వయస్సు ఎనిమిది సంవత్సరాలు ఏదో ఒక సమయంలో నువ్వు ఈ రాజ్యానికి రాజు అవుతావు రాజువైన తర్వాత నువ్వు యువరాజుగా ఉండగానే అయోధ్య ప్రజలంతా నీ దర్శనానికి వస్తారు కొందరు అనేక కోరికలతో వస్తారు వాళ్ళందరినీ రానివ్వు వాళ్ళ వాళ్ళ కోరికలు నువ్వు తీర్చగలవని కదా నీ దాకా వస్తారు రానివ్వు కానీ రాఘవ నీవు ఏ కోరిక లేకుండా జీవితాన్ని మాత్రం కొనసాగించు అన్నప్పుడు భగవాన్ ఇచ్చిన ఈ ఉపదేశం పరమాద్భుతమైన ఉపదేశం ఎవరు విసుక్కునివ్వండి ఎవరు మనల్ని నమ్మండి నమ్మకపోనివ్వండి మనల్ని కించపరచనివ్వండి లేదా మనల్ని పొగడనివ్వండి మనల్ని ఆరాధించనివ్వండి వాటన్నింటికీ కూడా మనస్సుని ఆ ఉన్మనీ స్థితిలో నిలబెట్టుకోవాలి ఆ నిలబెట్టుకోవటానికి సాధనా పూర్వకంగా నిరంజనానంద స్వామి అన్నామాలైకి చాలా ఉపయోగపడ్డారు అప్పుడు ఆ తర్వాత నుంచి ఆ క్షణం భగవాన్ చెప్పిన మరుక్షణం నుంచి స్వామి నిరంజనానంద స్వామి వారు ఏ ఏమీ అన్నా ఏం కోప్పడ్డా ఏమీ పట్టించుకునేవాడు కాదు భగవాన్ చెప్పిన పని నిర్దుష్టంగా చేయాలి perfectly గా చేయాలి సమయానికి అనుగుణంగా చేయాలి కాలాతీతంగా చేయటానికి వీలు లేదు ఇవాళ చేసే పని రేపు రేపటిది ఎల్లుండి అని procrastination అనేది లేకుండా భగవాన్ చెప్పినవన్నీ కూడా సూచనలు పాటిస్తూ రమణాశ్రమ నిర్మాణం అయిపోయింది అయిపోయే నాటికి అన్నామాలై ఇంకా స్వామికాల్యా ఎలా ఉన్నాడంటే అమ్మయ్య ఇదిగో ఈ పని అంతా పూర్తయింది తర్వాత ఏం పని చెప్తారు అని ఆయన మనస్సు ఎదురు చూస్తూ ఉన్నది సహజం కదా అందులో భగవాన్ స్వయంగా పక్కన ఉండి ప్రతిరోజూ అన్నామాలై తాపీ పట్టిన క్షణం నుంచి ఆరోజు పని అయ్యేవరకు భగవాన్ వెంబడి ఉండేవారు ఆయనకి ఆరోజు కూలి వచ్చిందా లేదా వాళ్ళు ఇచ్చారా లేదా అవి భగవాన్ కి పట్టిన విషయం కాదు పని చేయించటం వరకే ఆయన పెట్టుకున్నారు ఆ పని చేయించటం అంటే అది కర్మయోగ సాధనని భగవంతుడు స్వయంగా చేయించినటువంటి ఒక పరమాద్భుత దృశ్యం అరుణాచలం లో అంటే గురువు సూచిస్తాడు ఈ దారిలో వెళ్ళు అని చెప్తాడు కానీ భగవాన్ ఆ పని చేయలేదు ఎలా చేయాలో పక్కన ఉండి చేయించారు అది చాలా గొప్ప విషయం ఏ సద్గురువు అయినా తన ఆవరణంలోకి వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఉన్నతిని కోరుతాడు తనలో ఉన్నటువంటి ఆనంద రేఖని వాడికి పంచుతాడు వాడు దానిని ఎలా అనుభవించాలో ఆనందించాలో తెలియకపోతే తెలియచెప్తాడు తెలియజెప్తూ ఆనందం కలిగిస్తాడు ఆ ఆనందంలో నుంచి కర్మనిష్ఠ లోకి ప్రవేశపెడతాడు ఆ కర్మలు అప్పటిదాకా మామూలుగా సాగిపోయే కర్మలు సమయాన్ని పాటించుతూ సమయం ప్రకారంగా పనిచేస్తూ తాను తన పని చేసుకుంటూ మళ్ళీ వైయక్తిక అంటే వ్యక్తిగతమైనటువంటి తన పనుల పట్ల శ్రద్ధని ఆసక్తిని సహనాన్ని ఔదార్యాన్ని అన్నింటినీ ఉపాయాన్ని అన్నీ కూడా పెట్టుకుంటూ తన కార్యకలాపాలు సాగిస్తాడు వీటన్నింటి వెనుక ఉన్న మార్మికత ఏమి దాని వెనుక ఉన్నటువంటి శక్తి ఏమి అంటే అది గురువు యొక్క అనుగ్రహం మాత్రమే మరొక్కటి మాత్రం కాదు ఆ గురువు నేను నిన్ను ఇలా మారుస్తున్నాను నీలో ఈ మార్పులన్నీ వచ్చేశాయి నువ్వు అద్భుతంగా తయారయినావు అన్నాడా పెద్ద గురువు ఏం కాదు ఆయన ఆయనేం చెప్పడు అంతే కానీ ఆ వ్యక్తిలో వచ్చేటువంటి మార్పులనన్ని కూడా గమనిస్తాడు మరి ఇంత పని చేసిన తర్వాత అన్నామాలైకి ఒక ఆలోచన కలిగింది మళ్ళీ భగవాన్ నాకు ఏ పని ఇస్తారో ఈ భగవాన్ సన్నిధి సాన్నిధ్యము ఇదంతా కూడా నాకు ఎట్లా ఇంకా ఎక్కువ కావాలి దాన్ని ఏ మార్గంలో చెప్పమొస్తున్నారని ఆలోచనలో ఉన్నాడు ఆ సమయంలోఏది జరగకూడదని అనుకుంటామో అది జరిగింది. ఏది జరగాలని భగవాన్ నిర్ణయించారో అదే జరిగింది. చూశారా మనం అనుకునేది వేరు భగవాన్ అనుకునేది వేరు. భగవాన్ అంటే పరమాత్మ చిచ్ఛక్తి phenomenon కాబట్టి చూడు అన్నాములై ఇక్కడ నీ పని పూర్తయిపోయింది ఇక నీవు ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళవచ్చును అన్నారు. అది అశనిపాతం అది ఒక ఆఘాతం ఏ గురు హృదయంతో తన హృదయాన్ని రాపిడి చేసుకున్నాడో ఏ గురువు ఆవరణ ప్రభావం చేత మనస్సుని సున్నితం చేసుకున్నాడో ఏ గురువు యొక్క సంస్పర్శ చేత సర్వాంగీనమైనటువంటి దేహంలో ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగ నాడులు ప్రదీప్తి చెందినయో ఏ భగవాన్ స్వయంగా చేయి పట్టి దగ్గర ఉండి ఇంతటి కార్యక్రమాన్ని అతి సునాయాసంగా చేసేట్టుగా చేశారో అటువంటి భగవాన్ ఇక్కడే ఉండు అని అనకుండా నీ పనైంది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవచ్చును అన్నారు. అర్థం కాలేదు అన్నామలైకి అయోమయంలో పడిపోయినాడు. కానీ అప్పటికే గురు స్పర్శ చేత అంటే దర్శన, స్పర్శన, సంభాషణ ఇది పుణ్యత్రయం అంటాం. మహాత్ముల్ని దర్శించటం అది మొట్టమొదట. అసలు వారితో కాసేపు మాట్లాడటం అది మరో గొప్ప విషయం. తర్వాత స్పర్శన వారు మనల్ని తాకటం. ఈ మూడు గనక ఎవరి జీవితంలో జరుగుతుందో వారు జీవన్ముక్తులయ్యే ఉంటారు. నిరంతరమూ ఆ గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యం ఎలా ఉంటుందంటే ఒక అనిర్వచనీయమైన అద్వయమైన అద్వితీయమైనటువంటి ఒక ఆధ్యాత్మిక భావనా భూమికలో అది నెలకొని చెంది ఉంటుంది. భగవాన్ ఏవో చోట్ల అంటారు కదా ఒక గురువు నోట గురువు అనేటువంటి వాడి దగ్గరికి నిజమైనటువంటి శిష్యుడు వచ్చినప్పుడు ఆ శిష్యుణ్ణి గురువు అన్ని విధాలా అంగీకరించినప్పుడు వాడి స్థితి ఏమిటి అంటే గురువుగారు పులి శిష్యుడు పులి నోట పడ్డ మాంసపు కండ. అది జీర్ణమయ్యే దాకా గురువు వదిలిపెట్టడు. వెంబడిస్తూనే ఉంటాడు వెంట ఉంటాడు నడిపిస్తాడు అదలిస్తాడు ఆదలిస్తాడు ఆదరిస్తాడు మందలిస్తాడు లాలిస్తాడు పాలిస్తాడు ఇవన్నీ చేస్తాడు కానీ జీర్ణం చేస్తాడు. జీర్ణం చేసుకో అంటే మనోలయం చేస్తాడు లీనము చేస్తాడు తనలో ఒక భాగం చేసుకుంటాడు నిర్విశేషంగా నిశ్శేషం చేస్తాడు. ఇది గురువు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఈ ప్రయోగానికి గురైనటువంటి నిజంగా రమణ భక్తులలో రమణ అనుయాయులలో రమణలని స్వయంగా చూసి జీవించిన వారిలో ఈ స్థాయికి వెళ్లినటువంటి వారు నా వరకు నాకు అన్నామలై కనిపిస్తారు. ద్వంద్వాన్ని దాటారు. మామూలుగా ఏమైనా లే గురువు దగ్గర నేనేం తప్పు చేశానో చెప్పండి ఆశ్రమం నుంచి నన్ను ఎందుకు వెళ్ళమంటున్నారు మీరు చెప్పింది నేను చేయలేదు ఇలాంటి ఒక యాభై అడుగుతాడు వాడు. ఆయన గురు ఆజ్ఞను నువ్వు పని చెయ్యి అంటే చేశాడు ఇక నీ పని ఇక్కడి నుంచి అయిపోయింది అన్నప్పుడు అక్కడి నుంచి నిరామయంగా వెళ్లిపోయినాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఊరు చివరకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పూరి గుడిసె వేసుకున్నాడు. ఆ కథ అంతా మీకు తెలుసు. ఎట్లాగైతే కబీరు జీవితంలో గురువు ప్రతిరోజూ సాయంత్రం వచ్చాడో అలాగే భగవాన్ అన్నామలై కోసం ప్రతిరోజూ వెళ్ళేవారు. మాటలుండేవి కాదు. నిజానికి అది ఎంత ఉత్తమ స్థాయికి చెందింది అంటే భగవాన్ గురించి వీళ్లంతా చెప్తూ ఉండేవారు. ఇవాళ భగవాన్ ఇలా ఉన్నారు అలా ఉన్నారు వాళ్ళతో మాట్లాడారు ఏదో VIP లు వచ్చారు సామాన్యులు వచ్చారు అంటే ఆశ్రమంలో జరిగిన విశేషాలన్నీ కూడా అన్నామలైకి ప్రతిరోజూ చెప్పేటువంటి ఇద్దరు ముగ్గురు వెళ్లి చెప్తూ ఉండేవారు. నిర్లిప్తుడుగా ఉన్నాడాయన. ఈ భాగ్యం నాకు దూరమయ్యిందా అని ఖేద పడలేదు. నన్ను భగవాన్ ఎందుకు దూరం చేశారని ఒక్క క్షణం కూడా చింత చేయలేదు. చింతన చేశాడు. ఆ చింతన ఏమిటంటే ఎట్లాగైతే భగవాన్ అరుణాచల దేవాలయంలో మొట్టమొదట ప్రవేశం చేసి తండ్రీ నీ ఆజ్ఞ ప్రకారం వచ్చేసాను ఇకపై అంతా నీ ఇష్టమని సంపూర్ణ శరణాగతి సమర్పణ వినయము ముప్పేటగా భావన చేశారో అలాగే ఆశ్రమం నుంచి బయటకు వెళ్లి ఆశ్రమం వెలుపల జీవిస్తున్నటువంటి అన్నామలై హృదయంలో కూడా గురువు ఏం చెప్పారో చేయటమే ఇంక వేరే మార్గం లేదు. వేరే మార్గం ఉన్నది అంటే ఆ గురువుని మనం నమ్మినట్టు కాదు గురువు పట్ల మనకు పూర్ణ విశ్వాసం లేనట్లే అని ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి అన్నామలై అరుణాచల ఆశ్రమ రమణాశ్రమంలో జరిగే అనేక విషయాలు ప్రతిరోజూ చెప్పగా విని మామూలుగా ఉండేవాడు. నిర్మమంగా ఉండేవాడు. పోనీ ఒక్కసారి ఆశ్రమానికి వెళ్లి భగవాన్ దర్శనం చేసుకుందామా అని అనిపించేది కాదు. ఎందుకు అంటే భగవాన్ గనక నిర్ణయిస్తే అక్కడికి వెళ్ళక తప్పదు. ఆయనే రప్పించుకుంటాడు. భగవానే అన్నారు కదా నేను వద్దామని వచ్చానా? తిరుచ్చుళ్ళు వదిలాను అది వదిలాను ఇది వదిలాను అరుణాచలానికి నా అంతట నేను వచ్చానా? పాతాళ గుహంలోకి నేను వెళ్ళానా? పైగా అరుణాచల శిఖరంలో ఆ స్థాయిలో ఆ సంచారం చేశానా? సానువులలో ఇక్కడ ఉన్నానా? మళ్ళీ పైకి వెళ్లి స్కందాశ్రమంలో ఉన్నానా? మరి ఇవన్నీ ఎలా జరిగినయి అంటే ఏదో శక్తి నా చేత ఇవన్నీ చేయించింది నన్ను నడిపించింది. ఆ నడిపించినటువంటి శక్తికి భగవంతుడని కాక దాన్ని ఆత్మగానే భావిస్తున్నానన్నారు. అందుకనే చూడండి భగవాన్ చరిత్రలో అరుణాచల దేవాలయాన్ని మళ్ళీ భగవాన్ తిరిగి దర్శించలేదు. అలాగే వెళ్ళాలి అని అనుకోలేదు. కానీ ఒకానొక్క సంఘటన మాత్రం వారి జీవితంలో జరిగింది. అంటే వ్యక్తి మీద ప్రభావం అన్నామలై మీద ఎలా ఉంటుందంటే ముందు గురువు ఆ పా పరమాత్మ స్వరూపమైనటువంటి రమణుల మీద ఎంతగా ఉన్నదో చూడండి. అరుణాచలేశ్వరుడిది ఉరేగింపు వచ్చింది. గోశాల వైపు ఉన్నటువంటిగేటు దగ్గర కూర్చున్నారు చీకట్లో అందరికీ కనపడకుండా కూర్చున్నారు అందరూ వస్తారు అని ఇంతలోకే రథం రానే వచ్చింది ఊరేగింపు రానే వచ్చింది అరుణాశ్రమం main gate దగ్గరే ఆపారు అందరూ దానికి హారతులిచ్చారు కొబ్బరికాయలు కొట్టారు దండం పెట్టుకున్నారు ఆ ఉత్సవం సాగింది ఈ రెండవ gate దగ్గరికి వచ్చి మళ్ళీ ఆగింది అప్పుడు భగవాన్ ఒక్క మాటన్నా-- ఆ ఆగింది ఆయన చూశారు వెళ్ళిపోయింది ఈ gate దగ్గర ఉన్నవాళ్ళు ఏమిటి మళ్ళీ రెండోసారి ఆగిందని వస్తే అక్కడ భగవాన్ కూర్చుని ఉన్నారు వాళ్ళు అడిగారు భగవాన్ ఒక్క మాట చెప్తే మేము కూడా ఇక్కడ రెండోసారి దర్శనం చేసుకునేవారు కదా ఆ మీకు ఎలా ఉన్నది ఇప్పుడు ఎట్లా అనిపిస్తున్నది అని అంటే ఏమీ లేదు కుమారుడు తండ్రిని చూసి చాలా ఏళ్ళు అయిపోయింది ఆ తండ్రికి కూడా కుమారుడిని చూడాలని అనిపించి ఉండవచ్చు అలా వచ్చి ఉంటారు అన్నారంతే ఇది ఎంత వైరాగ్య విభూతి చూడండి ఆలోచించండి మనం తిరిగి తిరిగి తిరిగి ఆ గురువు చుట్టూ తిరిగి వాళ్ళు ఎత్తుకొని కదా ఎత్తుకునేవాడు గురువు కాడు తన చుట్టూ మనుషులను పెట్టుకునేవాడు గురువు కాడు మనుషుల మధ్యలో ఉండేవాడు గురువు ఎవరికి అక్కరో ఎవరికి అవసరమో దాని విలువ ఏమిటో తెలిసి తాను తనంతట తాను అక్కడికి వెళ్ళేవాడు గురువు అత్తరకు వచ్చేవాడు గురువు ఆధ్యాత్మికలో కాబట్టి ఈ అరుణాచలేశ్వరుడి యొక్క ప్రభావం అరుణాచల ప్రభావం భగవాన్ మీద ఎలా ఉన్నదో వారిని కూడా వ్యక్తిగా అనుకున్నట్లయితే జరిగినాయి కదా సంఘటనలు అన్నీ కూడా అరుణ-- అన్నామలైలో ఏ రకమైన చలనం లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కలవాలి భగవాన్ ని ఒక్కసారి మీ దగ్గర ఉంటాను రెండు మూడు రోజులు అనాలి ఏమీ లేదు నిర్లిప్తంగా కూర్చొని ఉన్నాడు ఇంతలోపే రానే వచ్చింది ఏప్రిల్ పధ్నాలుగు పంతొమ్మిది వందల యాభై రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు భగవాన్ యొక్క మహా భవిష్క్రమణం జరిగింది ఏ రమణులు అరుణాచల స్థానములలో ఒక జీవితాన్ని సాగించి పరి-- పరిసమాప్తం చేసుకొని మళ్ళీ తనలో ఉన్నటువంటి అఖండమైన చిద్ఘనమైన దివ్య జ్యోతిని అరుణాచల లో విలీనం చేసుకున్నారో ఆ క్షణం అన్నామలైకి కబురు వెళ్ళింది భగవాన్ దేహాన్ని వదిలిపెట్టారు అని మామూలుగా అయితే దుఃఖ వివశమై ఒక్కసారి కడసారి చూపు అనేది మనకుంది చిట్టచివరి చూపు అని వెళుతూ ఉంటాం మరి ఆ చిట్టచివరి చూపు మళ్ళీ భగవాన్ ఆ దేహంతో రారు వచ్చే అవకాశం లేదు తనకే అవకాశం లేదు తనకు ఇక మిగిలింది ఏమిటంటే గురువుని కడసారిగా చూడటం మాత్రమే మిగిలింది కానీ ఆ క్షణంలో అన్నామలై ఒక్క మాట అనుకున్నాడు గురువు ఎక్కడికి వెళ్ళాడు ఇంతకాలము అరుణాచలానికి బయట కూర్చొని ఉన్నాడు నా గురువు ఇవాళ తాను అరుణాచలం అయిపోయినాడు కనుక నేను అరుణాచలాన్ని చూస్తూ నా గురువుని దర్శించుకుంటా అన్నాడే కానీ ఆశ్రమం లోపలికి పోలేదు ఇది అన్నామలై మీద ఇంత ప్రభావం ఉన్నటువంటి భక్తులు నాకు ఎవరూ ఇంతవరకు ఉన్నారేమో తెలియదు నా పరిధి నా అనుభవము నా అధ్యయనము నా స్వాధ్యాయము నా ధారణలో అన్నామలైని మించినటువంటి ప్రభావితమైన వ్యక్తులు మాత్రం మరొకరు లేరని మాత్రం చెప్పగలను ఎందుకంటే ఈ ప్రభావం వలన గురువు యొక్క ప్రభావం ఎలా ఉండాలి అంటే మనని మన నీడ మనని ఎట్లా వెన్నంటి ఉంటుందో అట్లాగే గురువు యొక్క ప్రభావం కూడా మన మీద ఉండాలి ఇది భగవాన్ దేహం వదిలిపెట్టడానికి కొద్ది రోజుల ముందు భగవాన్ అక్కడికి వెళ్ళినప్పుడు కొద్ది రోజులు కాదు కొద్ది నెలల ముందు వెళ్ళినప్పుడు అన్నామలైతో స్వామి వారు మాట్లాడారు భగవాన్ మాట్లాడారు అన్నామలై నీవు గురువాక్యాన్ని పాటించి గురువుని హృదయంలో పెట్టుకొని గురు స్మరణ చేస్తూ పొందినటువంటి అనేక ఆధ్యాత్మిక అనుభవాలను నెమరువేసుకుంటూ నీవు నీలో ఉంటూ ధ్యానిస్తూ నిన్ను నీవు ధ్యానించుకుంటూ నీతో నీవు ఉండి నీవు యోగించి పొందినందువలన ఈ క్షణం నుంచి నిన్ను ఈ ప్రపంచం అన్నామలై స్వామి అని పిలుస్తుంది అని అన్నాడు స్వామి అంటే జ్ఞాని అని వివేకము విచక్షణ కలవొస్తే దాని పేరు జ్ఞానం అనేక శాస్త్రాల మీద అపారమైనటువంటి పాండిత్యం కలిగి ఉంటే అతడు పండితుడు అవుతాడు ఊహాత్మకమైన భావ ప్రపంచాన్ని సృష్టిస్తే భాషాపరమైనటువంటి పదాలను ప్రయోగిస్తూ కీర్తిస్తే అతడు మంచి కవి అవుతాడు కొన్ని చోట్ల ఊహ వాస్తవము కలబోసుకొని శాస్త్ర జ్ఞానాన్ని కూడా అవగతం చేసుకుంటే వాడు కవి పండితుడు అవుతాడు దీనిని శాస్త్రీయంగా అంటే scientific గా analyze చేసుకుంటూ తన అనుభవాన్ని తన జీవితంతో సమన్వయం చేసుకుంటూ తాను పొందినటువంటి అనుభవాన్ని గుప్తంగా లోపల ఉంచుకుంటూ అవసరమైనప్పుడు మాత్రమే ఈ ప్రపంచానికి అందిస్తూ ఎవరు తనలో తాను ఒక తాదాత్మ స్థితిలోకి వెళ్లి ఉంటారో ఈ సారమంతా భగవాన్ ఎక్కడ చెప్పారంటే అప్పడప్పాట్లో చెప్పారు అప్పడప్పాట అప్పడం ఎలా తయారు చేయాలో ఏనా-- ఎలా తినాలో తింటే ఏమవుతుందో అది కాదు అది స్థూల అర్థం కానీ మనల్ని మనం తినాలి మనల్ని మనం తెలుసుకోవాలి మన లోపలికి మనం వెళ్ళాలి మనల్ని మనం తాకాలి భగవాన్ని మనం దర్శనం చేయటం నేను చేశాను అంటున్నప్పుడు భగవాన్ వేరు నువ్వు వేరే కదా భగవాన్ నాతో మాట్లాడారు అన్నప్పుడు మాట్లాడిన భగవాన్ వేరు విన్న నీవు వేరు కదా భగవాన్ని నేను తాకాను అన్నప్పుడు ఆ తాకినటువంటి నేను తా-- తాకబడినటువంటి భగవాన్ వేరు అవన్నీ ద్వంద్వాలే కదా మరి ఈ దర్శన పరిచన సంభాషణలన్నీ దాటి భావాత్మకమైన ఒక ప్రపంచంలో మనిషి నెలకొల్ల్చండి తనను తాను నిలబెట్టుకుంటూ ఏది రాని ఏది పోనిఏది జరగని ఏది జరక్కపోని సాక్షాత్తు గురువే దేహాన్ని వదిలిపెట్టినప్పుడు కూడా ఆ దేహాన్ని చూడాలన్న ప్రాంతి కూడా లేనటువంటి హati ఎవరు భ్రాంతి పోగా హatiగా మిగిలినటువంటి వారు అన్నామలై స్వామి. స్వామి అంటే జ్ఞాని. జ్ఞాని అంటే ఇక తాను తెలుసుకోవలసినదంటూ ఏమీ లేదని, తెలుసుకున్న దానిని నిత్యమూ అనుభవించాలని, ఆ అనుభవం స్వాత్మానంద స్థితిలో నిలకడ చెందాలని, తన ఉనికి, తన అస్తిత్వము, తన వ్యక్తిత్వము ఈ ప్రపంచాన్ని ఇలాగే ప్రభావితం చేస్తూ ఉంటుందని ఎవరైతే ఏ రకమైన ఆలోచన లేని కించిత్ మనసుతో కించిత్ మన-- చాలా స్వల్పమైన మనసు. ఇప్పుడు మనం ఒక hundred percent మనసుతో జీవిస్తే కోట్లు సంపాదించచ్చు. అనేక గ్రంథాలు రాయచ్చు. అనేక ఉపన్యాసాలు చేయచ్చు. ఇవన్నీ జరగొచ్చు. సంపద సృష్టించవచ్చు. ప్రాపంచికమైన అన్ని సుఖాలు అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో జీవించటానికి కావలసింది మాత్రం కేవలం కించిత్ మనసు మాత్రమే. ఈ కించిత్ మనసును గనక మనం జాగ్రత్తగా గమనిస్తే నిత్య నైమిత్తికమైనటువంటి జీవితాలని గమనించుకుంటూ ప్రతిరోజూ సాధనామయం చేసుకొని సాధనా మాత్రంగా మన జీవితాలను మనం చక్కగా సుసంపన్నం చేసుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిరుప-నిరుపమానమైనటువంటి ఉదాహరణ ఎవరన్నా ఉన్నారా అన్నప్పుడు ఇదిగో ఇది వ్యక్తిత్వ ప్రభావం. కబీర్ మీద ఆయన గురువు. భగవాన్ మీద అరుణాచలం. కేవలం అరుణాచలా అనే పదమే ఆయన్ని ప్రభావితం చేసింది. దానికి అనుగుణంగా భగవాన్ జీవించారు. తనతో ఉన్నటువంటి వారందరినీ అలా జీవించితే మంచిదని ఒక సూచన చేయలే. చూసి నేర్చుకోమని వదిలేశారు. ఎవరికీ బోధ చేయలేదు. ఉపదేశాలు ఇవ్వలేదు. దీక్షలు ఇవ్వలేదు. మంత్రోపదేశాలు ఇవ్వలేదు. ఏమీ లేదు ఊరకుండండి అన్నారే. ఆ ఊరకుండ-ఉండటమే ఏ ప్రభావానికి లోను కాకుండా ఉండటం. కానీ ప్రభావానికి లోను కావటం అంటే ఏమిటంటే గురు ఆజ్ఞను పాటించటమే, పాలించటమే, ఆలకించడమే, ఆచరించడమే, ఆచరించడమే జీవించటమే అనేటువంటి దివ్య భావనని తన జీవిత కాలంలో సంపూర్ణంగా అనుభవించినటువంటి అన్నామలై స్వామిని, ఆయన చరిత్రని, ఆయన జీవితాన్ని, ఆయన లోపల జరిగినటువంటి అనేక సంఘటనని పునః స్మరించుకుంటూ మనం కూడా అటువంటి స్థాయికి వెళ్ళాలి. మనం స్వాములమో, జ్ఞానులమో కానక్కర్లేదు. అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. విజ్ఞానం అంటే knowledge is only a gateway అనేటి-- gateway for what? ముక్త జీవనం నుంచి జీవన్ముక్తులుగా భగవాన్ ఎలా పరిణామం చెంది మనకు చూపించారో మనం కూడా భక్తులుగా, కార్యశీలులుగా, కర్మధీరులుగా, కర్మవీరులుగా, గంభీరులుగా, ఉదాత్తంగా మన జీవితాలను సాగించుకుంటూ ముందుకు వెళుతూ మన లోపలికి చూసుకుంటూ, తొంగి చూసుకుంటూ వీటిని మరణము చేసుకుంటూ, దీనినే నిదిధ్యాసనం చేసుకుంటూ జీవితాన్ని సాగించడమే పరమోత్కృష్టమైన అధ్యాత్మ సాధనగా నేను భావన చేస్తూ, ఇవాళ లావణ్యారావు గారు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం అనేక పనుల మధ్య మాట్లాడవలసి వచ్చింది ఇవాళ. కానీ మాట్లాడేనా, నేను మాట్లాడేనా, నేను మాట్లాడడం లేదని ఆంతరంగికమైనటువంటి ఒక స్పర్శానుభూతి వాగ్విభూతిగా బయటకు వచ్చిందని మాత్రమే నేను భావన చేస్తూ అన్నామలై స్వామిని మనసులో ఒక స్మృతిగా, ఒక దివ్య భావనగా, ఒక guide post గా అలాగే beacon light గా నేను భావన చేస్తూ సమస్త ప్రపంచానికి సులిప్తమైనటువంటి ఒక జీవన విధానాన్ని సృష్టించుకోవటానికి మార్గదర్శనం చేసినందుకు అన్నామలై స్వామికి నమస్కరిస్తూ అటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఒక సాధకుణ్ణి ఈ ప్రపంచానికి చెక్కి చెక్కి చెక్కి స్థాన పెట్టి పెట్టి పరిమళాలు అద్ది అలది అందించిన సర్వ గురు స్వరూపాల యొక్క సమ్యక్ సమగ్ర సమాహారమైనటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి దివ్య శ్రీ చరణారవిందాలకు మరొక్కసారి ప్రణామములతో అరుణాచల శివా. చాలా ధన్యవాదాలండి. చక్కటి ఉపన్యాసాన్ని భగవాన్ యొక్క ప్రభావం ఇతర వ్యక్తుల మీద అనేటువంటి అంశం మీద వివరించారు. చాలా సంతోషం. మూర్తి గారి గురించి చెప్పాలంటే recent గా వారు project start చేశారు. గో విజ్ఞాన ప్రాంగణం అనేటువంటి project. దానికి నేను వెళ్లడం జరిగింది. దాని గురించి ఏదన్నా కొంత వివరణ ఇస్తారేమో వాయన్ని అడుగుతాను మళ్ళీ. తప్పకుండా. ఆ సార్ చెప్పండి. అది గో-గో వేద విజ్ఞానం. వేదం కూడా ఉంటుంది. నేను scientific research research in Vedas చేశాను కాబట్టి దానిలో ఉన్న అనేకమైనటువంటి శాస్త్రాలన్నింటినీ కూడా ఈనాటి యువతకి వేదాలలో ఏమీ లేదనే వాడు ఒకడు, ఉపనిషత్తులు చదివితే లాభమేమిటనే వాడు ఒకడు, భగవాన్ రమణుల గురించి తెలుసుకుంటే వచ్చేదేమిటనే వాడు ఉన్న ఈ లోకంలో అవన్నీ తెలుసుకోగలిగితే ఏం లాభమో యువతకి ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కంచి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారు ఒక పరమాద్భుతమైనటువంటి project ని సంకల్పించారు కేవలం ఇరవై ఎనిమిది రోజుల క్రితం. ఇప్పటికి ఇవాళ్టికి ముప్పై రోజులయింది. అయి మూర్తి గారు దీన్ని సంకల్పించాము దీన్ని మీరు తీసుకుని ముందుకు తీసుకువెళ్ళండి అన్నారు అంతే. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అంటే ఈశ్వర కృప మాకు సిద్ధాంతంగా ఒక అద్భుతమైనటువంటి buildingఆ ఆవలనమంతా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేది మా చేతిలో పెట్టేశారు వాళ్ళు. వాళ్ళిద్దరూ doctors. అది అక్కడ గో, గో విజ్ఞానం. అది గోశాల కాదు. సుమారుగా పెద్ద స్వామి వారు ఉన్నప్పుడు కంచిలో ఇరిని అని గ్రీకు princess ఆవిడ వచ్చి స్వామివారు కామాక్షి అమ్మవారి దగ్గరకు morning వెళ్ళాను అభిషేకం జరిగింది. ఇక్కడ చంద్రమౌళేశ్వరుడికి అభిషేకం జరుగుతున్నది మీకు నాకు ఎక్కడా పెద్దగా ఆవులు కనిపించలేదు. ఆ ఎలా ఈ ఆవు పాలు ఎక్కడి నుంచి మీకు వస్తున్నాయి అని అడిగినప్పుడు వారు పరమ నిర్లిప్తులు గనుక ఒక మాట అన్నారు. మాకు కావలసినంత భగవంతుడు ఇస్తున్నాడు. మాకు ఎంత ఉందో దానిలో సర్దుకుంటూ మేము అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాం. అన్నప్పుడు ఆవిడ ఏమడిగిందంటే మీరు అనుమతిస్తే మీరు అనుగ్రహిస్తే కొన్ని ఆవులను నేను ఇస్తాను అన్నది. మా దేశంలో ఉన్న ఆవులను కూడా నేను పంపిస్తాను అని అన్నప్పుడు వారు మౌనం వహించారు. గురువు ఎప్పుడూ కూడా అలాగే చెయ్యి తీసుకురా అనడు. అలాగే చెయ్యి అంటాడు. ఆ చేసేవాడికి అవకాశం ఉండాలి ఉండకపోవచ్చు. ఆమె తన దేశానికి వెళ్ళిన తర్వాత నూట ఎనిమిది గోవులను విమానాల్లో పంపించి కంచి పీఠానికి అప్పజెప్పింది. ఆమె రెండు నెలల క్రితం దేహం వదిలినప్పుడు ఇప్పుడున్నటువంటి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు, అందుకని అండి భగవంతుని కంటే కృతజ్ఞత ఎవరూ ప్రకటించరు. మీకు గుర్తుంటుంది భగవాన్ ఇంకో కొన్ని నిమిషాలలో తన దేహాన్ని తమ దేహాన్ని వదిలిపెట్టబోతున్న సమయంలో తమ పరిచారకులను పిలిచి రేపటి నుంచి దుప్పటి మార్చవలసిన పని లేదు అని అలా సూటిగా చూస్తూ thanks అన్నారు. అతనికి అర్థం కాలేదు. అతనికి English రాదు. అంటే ఏం లేదు కృతజ్ఞుణ్ణి అన్నారు భగవాన్. కృతజ్ఞత అనే భగవంతుని యొక్క గొప్ప గుణం అది మనకు కూడా అలవాటు కావాలి. ఈ స్వామివారు తమ పరమ గురువులకి కంచి పీఠానికి ఆవిడ చేసిన దానికి గుర్తుగా princess ఇరినే అని ఆమె పేరు వచ్చేట్లుగా కూడా చూడండి అని నాకు సూచన చేశారు. అందుకని గోధామము అని పేరు పెట్టాం. అది గోశాల కాదు. ఆ గోధామంలో రేపు పొద్దున scientific research జరగబోతున్నది. అలాగే వేద విజ్ఞానాన్ని అలాగే మన సామగానంలో ఉన్నటువంటి అనేకమైనవి ప్రధానంగా ఋగ్వేదంలో అణుశాస్త్రము, పక్షి శాస్త్రము, సామాజిక శాస్త్రం అన్నీ ఏవేవైతే ఉన్నాయో ఒక్కొక్క దానిని బయటకు తీసి సుమారుగా ఇరవై, ఇరవై ఐదు మంది యువకులను మాత్రమే, ఇది ప్రపంచానికి విస్తృతంగా ఆ ప్రచారం చేసేటువంటి విషయం కాదు. It is research oriented. దానిలో development చేయాలి. ఆ compendium తయారు చేయాలి. అది బృహత్ కార్యక్రమం అది. అక్కడ రోజూ జరిగేట్లుగా భజనలు ఇవన్నీ ఉండవ్. నాకు నేనే అక్కడ సత్సంగం లాంటివి చెయ్యను అక్కడ. ఎందుకంటే అక్కడ నా పని వేరు. విశ్లేషణాత్మకంగా scientific గా rational గా ఆ approach towards our శాస్త్రస్ and our వేదాస్. అలాగే గోవులో అనేక దేవతలు ఉన్నాయని అలాగే ఆ తోక తాకితే వైతరణి తాటిస్తుందని ఇవన్నీ కూడా మనకున్నాయి. ఇవాళ ప్రపంచానికి నిరూపణ కావాలి, నిదర్శనం కావాలి. అవన్నీ నిజమేనా? ఈ ముప్పై ముక్కోటి దేవతలు ఆ ఒక గోవు శరీరంలో ఉన్నదా? ఉన్నారా-- ఉన్నాయా? వీటన్నింటినీ కూడా scientific research ద్వారా ఒక ఏడాది పడుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఆ compendium ని అక్కడే ఆవిష్కరిస్తాం. ఈ లోగ సనాతన ధర్మాన్ని ఆచరించడానికి స్త్రీలు ప్రధానమైనటువంటి వ్యక్తులు. పురుషులు చాలా తక్కువ చేస్తారు. ధర్మ ప్రచారానికి ఎవరు మూలం అంటే స్త్రీమూర్తులే. వారిని సత్య సాయి భగవానుడు ఒక మాట అన్నారు. వాళ్ళు house wives కాదు వాళ్ళని గృహలక్ష్ములుగా మాట్లాడుతూ ఉండండి అన్నారు. ఆ ఇంటికి దీపం పిల్లలు అవుతున్నది గనుక అట్లా పెళ్లి కాబోతున్న పిల్లలు ఒక భాగం. అప్పుడే పెళ్లైన పిల్లలు కొంత భాగం. పెళ్లయి కొంత జీవితాన్ని గడిపి నడిమి వయసుకు వస్తున్న ఈ మూడు ఆ వర్గాలని కూడా నెమ్మది నెమ్మదిగా ఒక చోటికి తీసుకు వచ్చి కట్టుబొట్టు, తలలో పువ్వు ఎందుకు పెట్టుకోవాలి, కాలికి పా-- అవన్నీ కూడా చెప్తూ అనేకమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటివన్నీ కూడా చెప్పాలి. ప్రపంచాన్ని మనం ఆ జెండాలతో ఎజెండాలతో మార్చలేము. జీవితాన్ని ఆదర్శప్రాయంగా గనక మలుచుకోగలిగినట్లయితే సనాతన ధర్మం ఆ ఊరేగింపులుగా debates ల్లో సాగేది కాదు. ముందు స్వామివారు చెప్పారు ముందు ఉపకారం చేయండి తర్వాత ఉపదేశం ఇవ్వండి. ముందే ఉపదేశం ఇస్తాం అంటే తీసుకునేవాడు లేడు. ఉపకారం చేయండి. ఇది చేసినందువలన మీరు, మీ భర్త, మీ ఇల్లు, మీ కుటుంబం, మీ ఇరవై ఒక్క తరాలు భద్రతమంగా ఉంటాయి అని ఆ సనాతన ధర్మాన్ని ఏ ఋషులైతే దర్శించి మనకిచ్చారో, ఏ అవతార మూర్తులు ఈ జగత్తులోకొచ్చి మనకిదంతా బోధించారో, ఆచరించారో, వాళ్ళ జీవితాన్ని పణం పెట్టారో ఆదిశంకర భగవత్పాదులు, వ్యాసులు, వాల్మీకి వీళ్ళందర్నీ మహర్షి గణాలు వీటన్నింటినీ పునః స్మరించుకుంటూ మనం ఆ సాగించాలని దానికి కావలసిన syllabus ఒక నెల రోజుల్లో syllabus అంతా complete చేసి గో విజ్ఞానము, వేద విజ్ఞానం రెండు parallel గా సాగుతాయి. మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నా. కానీ ఆ సమయం వచ్చినప్పుడు నేను తప్పకుండా ఆహ్వానాన్ని ఇస్తాను. మీరందరూ రండి. తెలుసుకోండి ఇది ముందు ఈ వారు అడిగారు గనుక ఉన్నదంతా కూడా మీ ముందు పరచి చెప్పాను. మా కార్యక్రమం కొంత consolidate అయిన తర్వాత We will all meet and do the same thing. సో ఇందువల్ల ఇది కంచి మహాస్వామి వారు త్రేతాయుగం నుంచి ఉన్నటువంటి ఆదిశంకర మూలామునాయ సర్వజ్ఞ పీఠ శంకరాచార్య జగద్గురు ఎంత ఉందో చూడండి. త్రేతాయుగం నుంచి ఉన్నటువంటిది కంచి పీఠం. ఆదిశంకరుల వారు స్థాపించినటువంటి చతురామునాయ పీఠాలు. కాబట్టి శంకరుల కంటే ముందు ఉన్న పీఠం ఏది అంటే అది కంచి పీఠం. అటువంటి కంచి పీఠ జగదాచార్యులు అయినటువంటి స్వామివారు ఇవాళ ఈ ఉపదేశాన్ని ఒక చిన్న ఆదేశాన్ని ఇస్తే అది ఇలా జరగటం మాత్రం అది జగద్గురు కృపగా నేను భావిస్తూ అన్నీ ప్రసన్నంగా జరిగిపోయినయి. ఇంతటి పెద్ద వయసులో నేను మీరు రండి తప్పకుండా అని అన్నందుకు లావణ్యారావు గారు ఆరోజు వచ్చారు proceedings అన్నీ చూశారు. పది గంటలకు మొదలు పెట్టాం పన్నెండున్నరకి అయిపోయింది. ఇవన్నీ కూడా discipline, dedication, punctuality, discretion ఇవన్నీ కూడా మనకు ఉండాలి. ఇవే నిజమైనటువంటి అధ్యాత్మ సాధనా భూమికలుగా భావన చేస్తూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ శుభకామనలు తెలియజేస్తూ అరుణాచల శివం.
YouTube · audio
Influence Of Bhagawan On Individuals-2 - Saket Ramana Satsang Hyderabad
Influence Of Bhagawan On Individuals-2 - Saket Ramana Satsang Hyderabad
0:00 / 52:18
More in this series