Skip to content
Transcript తెలుగు
అరుణాచల శివ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, ఉపదేశ సారంలో భగవాన్ మనస్సుని, చిత్తాన్ని రెండు శక్తివంతమైనటువంటి శక్తులుగా, మూల శక్తులుగా అభివర్ణించి మానవ జీవితాన్ని ఆనందమయమైనటువంటి స్వస్థానం వైపు మనస్సుని హృదయంలో లీనం చేసేటువంటి రీతిలోకి తీసుకు వెళ్ళమని చెప్తున్నారు. భగవాన్ ఇక్కడ మనోలయము, మనోనాశనము అని రెండు మాటలు వాడారు. సాధకులంతా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, లయం కావటం నాశనం కావటం మాత్రం కాదు. లయం కావటం అంటే లీనం కావటం. ఇది అది ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. నాశనం కావటం అంటే మళ్ళీ పుట్టుక లేనటువంటి స్థితి. అది నాశనం. కొద్దిగా విచారణ చేయాలి ఇది. మనోలయం శుద్ధమైనటువంటి మనస్సు యోగాత్మకమైనటువంటి చిత్తము రెండూ సమన్వయించుకొని, ఏది హృదయ స్థానం వైపు వెళ్ళి, తన మూలమైనటువంటి ఆత్మతో రమిస్తున్నదో, కూడి ఉంటున్నదో అది లయం. కూడి ఉన్న కారణంగా సంఘ ప్రభావం చేత ఆత్మ యందు ఉన్నటువంటి అనేకమైనటువంటి శక్తులు మనస్సు పొందుతూ ఉన్నది. ఇంతకు ముందు విచారణలో హృదయంలో పుట్టినటువంటి మనస్సు ఒక రశ్మి అయి, ఒక కిరణమై శిరస్సుని చేరి, అక్కడ నుంచి ఇంద్రియాల ద్వారా తన కార్యకలాపాలు చేస్తూ అహం ప్రవృత్తితో ఉంటున్నది అహంస్పురణ ప్రవృత్తితో ఉండటం లేదు. ఇది విచారణ చేశాం. అహం వేరు, అహంస్పురణ వేరు. అహం అధమ స్థాయి, అహంకారం. అహంస్పురణ అత్యున్నతమైనటువంటి స్థాయి. మరి హృదయంలో పుట్టినటువంటి మనస్సు సంఘ దోషం కారణంగా శిరస్సులో విజృంభిస్తున్నది. అదే మనస్సు హృదయంతో సంఘ విశేషం కారణంగా, సమయోగం కారణంగా ఒక అద్భుతమైన పవిత్రతని, ఒక నిస్తబ్ధతని, నిస్తంద్ర మంద్రమైన స్థితిని, నిశ్చలమైన స్థితిని, నిరామయమైన స్థితిని తాను అనుభవిస్తున్నది. చూశారా? కాబట్టి ఇటువంటి మనస్సు, ఎటువంటి మనస్సు ఉండాలి అంటే మరల మరల పుట్టే మనస్సు కాదయ్యా. లయం చేసిన మనస్సుని నెమ్మదిగా మనోనాశనం చేసుకో. మనోనాశనం అయిపోతే మనం బతికేది ఎట్లా? ఇది కదా ప్రశ్న. ఏదో కష్టపడ్డాం, మనస్సుని సాధన చేశాం, తీసుకెళ్ళాం, ఆత్మలో ప్రవేశపెట్టాం. విచార ధార అంతా ముగిసింది. నా మనస్సు ఆత్మతో కూడి ఉంది. ఇక నేనేం పని చేయను. నాకు ఆకలి లేదు, నిద్ర లేదు అని అంటున్నాడా అంటే, ఆకలి ఉంది, నిద్ర ఉంది అంటే మనోనాశనం కాలే, మనోలయం అయింది. మనోలయం అయిన కారణంగా మహాత్ముడు అవుతున్నాడు, పవిత్రుడు అవుతున్నాడు. ఒక ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతున్నాడు. కానీ మనస్సుని ప్రాపంచికమైనటువంటి మనస్సుగా కాక ఆధ్యాత్మికమైనటువంటి మనస్సుగా He is converting the mundane mind into the spiritual mind. ఇది చాలా critical situation. spiritual mind ఎట్లా ఉంటుంది? Mandane mind అంటే నేను చాలా సాధన చేశాను. పధ్నాలుగు ఏళ్ళు తపస్సు చేశాను. ఏదో గురువుగారి ఆశ్రమంలో ఉండి అన్నీ నేర్చుకొని వచ్చేసాను. సరే హిమ-హిమాలయాలకు మధ్య వెళ్లి మళ్ళీ వచ్చాను. అక్కడేవో చాలా మంది గురువులను చూశాను. అన్న మనస్సు ఎట్లా ఉన్నది? భగవాన్ రమణులు మనోనాశనమైనటువంటి మహాత్ముడైన భగవాన్. వారి చుట్టూ లేదు వారి దగ్గరకు వెళ్ళినటువంటి మహాత్ములందరూ కూడా మనోలయమైనటువంటి మహాత్ములు. ఇది ఒక ఉదాహరణగా అందులో మనోనాశనమైన వాళ్ళు ఉన్నారు అంటే ఉండవచ్చు గాక. మనం గమనించలేం. కేవలం academic గా మాట్లాడుకోవటం కోసమే పోలిక. నిజానికి We are not supposed to draw any comparison between two individuals and we are not supposed to pronounce on the other. ఇది ఒక ఆధ్యాత్మిక సూత్రం. మనం ఎవరిని నిందించే హక్కు గాని, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడే హక్కు గాని, వీరు ఇంతే అని చెప్పేటువంటి శక్తి గాని మనం ప్రదర్శించకూడదు. ఉన్నటువంటి దాన్ని ఉన్నట్లుగా యదార్థంగా మనం కాసేపు మాట్లాడుకోవటానికే ప్రక్రియ గనుక భగవాన్ మనోనాశనం జరిగిన వ్యక్తి అయినట్లయితే, భగవాన్ అయినట్లయితే, వారి దగ్గరకు వారి దర్శనార్థం వెళ్ళిన వారంతా వాళ్ళు మహాత్ములు, ఒక స్థాయికి చెందినవారు. పరమహంస యోగానంద, నారాయణ గురువు మామూలు వాళ్ళా? వారు వెళ్లారు అక్కడికి. వెళితే వాళ్ళు ఎందుకు వెళ్లారు అని మనోలయమైనటువంటి వ్యక్తులు మనోనాశనం జరిగిన వ్యక్తి దగ్గరికి ఎందుకు వెళ్లారు అంటే, మనోనాశనం జరిగితే ఏమవుతుందో చూడాలిగా. Confirmation, consolidation. దాని కోసం వెళ్లారు.ఇక్కడ మనోలయమైనటువంటి మనం మన బోటి వాళ్ళం మనం కూడా మనోలయం చేసుకున్నాం అనుకుందాం విచారణ చేస్తున్నాం కాబట్టి ఎలా ఉంటాం మనోలయమైనటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు లేదా ఎలా ఉండాలి అంటే దేనికి పొంగక దేనికి లొంగక దేనికి కుంగక దేనికి వంగక ఎవరైతే ఉంటారో వాళ్ళు మనోలయం చెందిన వాళ్ళే మనసును హృదయ స్థానంలో పెట్టేశారు ఏది రాని ఏది పోని వాళ్ళకు పెద్దగా పట్టదు మరి కార్యకలాపాలు మనసును తీసుకెళ్లి హృదయంలో కలిపేస్తే పని చేసేది ఎట్లా అనే వాడికి భగవాన్ నే అడిగారు ప్రశ్న భగవాన్ మీరు జ్ఞాని కదా ఎప్పుడో మీ పదహారవ ఏట ఆత్మానుభవాన్ని పొందారు కదా అరుణాచలానికి వచ్చి మీతో మీరు ఉండిపోయినారు కదా మరి మీరు కూడా స్టేషన్ లో ట్రైన్ వచ్చిందా ఎవరో రావాలి వ్యక్తి వచ్చాడా ఫలానా వ్యక్తి ఆశ్రమంలో ఉన్నాడా ఇవ్వాళ వంటలు సక్రమంగా జరుగుతున్నాయా ఇవన్నీ అడుగుతున్నారే లేదు మా బోటి వాళ్ళు వస్తే మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారే proof reading చేస్తున్నారే పుస్తకాలకు అట్టలు వేస్తున్నారే సూది పెట్టి కుడుతున్నారే మరి మనోనాశనమైనటువంటి వ్యక్తికి కూడా కార్యకలాపాలు ఉంటాయా మీరు దేనితో చేస్తున్నారు అని అడిగినప్పుడు భగవాన్ అద్భుతమైన ప్రశ్న కాబట్టి సమాధానం ఇచ్చారు ఏం లేదు ఒక ఆత్మానుభవాన్ని పొందినటువంటి వ్యక్తి జ్ఞానము అంటే ఏమిటో అనుభూతిమయం చేసుకున్నటువంటి వ్యక్తి తన హృదయమనే గూట్లో ఉన్నటువంటి మనస్సుని ప్రాపంచిక కార్యకలాపాలు నిర్వర్తించటం కోసం అప్పుడప్పుడు బయటకు తెచ్చి పని ముగించగానే గూట్లో పెట్టుకుంటాడు ఉడుపు జ్ఞానికి తెలుసు ఉడుపు ఎవరికి తెలియదంటే ఇంకా అజ్ఞాన భూమికలో ఉన్నవాడు ఒకసారి గూట్లో నుంచి మనస్సును బయటకు తెచ్చాక మళ్ళీ గూట్లో చేర్చాలంటే చాలా సమయం పడుతుంది గనుక ప్రయత్నంలో ఎప్పుడూ వెనకబడి ఉంటాడు అని భగవాన్ చాలా అందమైన సమాధానం చెప్పారు దీన్ని కాస్త మనోనాశనమైన వ్యక్తేలా ఉంటారు భగవాన్ జీవితంలో ఒక సంఘటన చూద్దాం వారికి భుజం మీద సార్కోమా అంటే ఆనాడు రాచపుండు అనేవాళ్ళు ఇవ్వాళ దానికి cancer అని పేరు పెట్టాం అది వారికి ఏర్పడింది ఏర్పడితే అది ఒక కెంపు ఒక రక్తం ఎట్లా ఉంటుందో అట్లా ఎర్రగా ఉండేది అది చూసే వాడికి భగవాన్ బాధంతా అసలు ఎలా భరిస్తున్నారు అని అనుకునేవాడు కానీ ఆయనకు అదేం ఉండేది కాదు మామూలుగా వచ్చేవారు కూర్చునేవారు నొప్పి లేదా బాధ లేదా అది వ్రణమే అంటే వారు దాన్ని పెద్దగా పట్టించుకున్నట్టు మనకు అనిపించదు ఒకసారి దాన్ని operation చేయాలి అని చేస్తే మళ్ళీ రాదు అని డాక్టర్లు వచ్చి భగవాన్ ను ఒప్పించారు వారేమన్నారంటే ముందు వారిని ఉండనివ్వండి వారేదో వచ్చారు వారితో మనకేం పని అన్నారు కాదు భగవాన్ మీరు ఇలా తప్పించుకోవద్దు ఇది మిమ్మల్నే కబళించి వేస్తుంది కనుక మొదట్లోనే దీన్ని operate చేసి తీసేస్తాం అని అన్నప్పుడు మీ ఇష్టం అన్నారు ఏమన్నా చేసుకోండి మీ ఇష్టం అన్నారు చేసుకోవాలి చేయాలి అంటే ఎనస్థీషియా ఇవ్వాలి మత్తు మందు ఇవ్వాలి operation చేయాలంటే భగవాన్ అన్నారు అవన్నీ వాటి అవసరం లేదు వారెవరు మేమెవరు వారు ఒక పరాయి వస్తువు వచ్చారు వారిని మీరు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు చేసుకోండి అన్నారు ఎనస్థీషియా లేకుండా భగవాన్ భుజం మీద ఉన్నటువంటి రాచపుండుని వైద్యులు తొలగించినప్పుడు తొలగిస్తున్నప్పుడు భగవాన్ ముఖ మండలం మీద మార్పు లేదు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -42

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -42

Source: TFC Spiritual on YouTube

0:00 / 11:44

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

    Now playing
  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77