No transcript for this section.
Transcript begins at 5:41.
సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జన మందారం వందే సాయి మహేశ్వరం తురియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శిల స్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక విసత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్ఫురతాంవే పరమ మహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీ చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ కొకట్ పల్లి సత్యసాయి సేవా సమితి ఈ పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా సంకల్పించిన సత్సంగానికి స్వామి భక్తులందరికీ సాదర పూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ "రమయతీతి రామః" అని ఒక మాట రామ అనేటువంటి ఒక పదం ఒక నామం వినపడగానే ఒక రమణీయాస్పదమైనటువంటి ఒక భావన మనల్ని చుట్టుముడుతుంది మనల్ని ఆవరిస్తుంది మనల్ని ఆవరిస్తుంది మనల్ని ఆవేశిస్తుంది. ఏమున్నది ఈ శ్రీరామ శబ్దంలో అంటే శ్రీ అనే దాంట్లో మూడు బీజాక్షరాలున్నాయి శకార, రకార, ఈకారములు శకారము శారదాదేవి అంటే సరస్వతీదేవి రకారము రమాదేవి ఈ అనేటువంటి బీజాక్షరము ఈశాన దేవి పార్వతీదేవి ముగ్గురమ్మల యొక్క మూల స్వరూపము ఏదైతే ఉన్నదో మూడు కలిపితే అది శ్రీ అవుతున్నది. శ్రీ అంటే మంగళప్రదము శుభప్రదము ఆనంద సంధాయకము అని అర్థం. ఇక రామ శబ్దంలో రకార, అకార, మకారాలు ఉన్నాయి రకారము రవి బీజము అకారము అగ్ని బీజము మకారము చంద్రబీజం. ఈ రామ నామస్మరణ లేదా రామ నామాన్ని విన్నంతనే ఒళ్లంతా పొంగిపోతుంది కారణం ఏంటంటే మనుష్య జన్మ పాప తాప శాపాల వలన వస్తుంది. లోకహితం గాని ఏ పని అయినా పాపమే కదా! ఇక ఈ మూడు కలిపితే నిజానికి అవి తాపత్రయాలు. తాపం ఉంటుంది. ఈ ప్రపంచం పట్ల లాలస, భోగం పట్ల ఆసక్తి, అపేక్ష ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఎవరినైనా హింసించినప్పుడు బాధించినప్పుడు వారు మనల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడినప్పుడు అది శాపమై తగులుతుంది గనుక మనుష్య జన్మ పాప శాప తాపత్రయంగా ఏర్పడింది గనుక ఈ మూడింటిని కూడా నశింప చేయగలిగినటువంటి సూర్య బీజము, అగ్ని బీజము, చంద్ర బీజము రామ నామంలో ఉన్నది గనుక శ్రీరామ అనగానే ఈ మూడు నశిస్తాయి గనుక నిరంతరము సంతత సాయి రామ నామస్మరణాంచితమైన దేహంగా ఉండాలి. సాయి రాముడికి సాకేత రాముడికి ఒక అభేదమైన స్థితి ఉంది ఆ విషయం తర్వాత. ముందుగా శ్రీరామ నామం ఇంత మహత్తు ఉన్నట్లయితే ఒక అవతారం తాను ఈ భూలోకానికి రావటానికి ముందే తాను ఏ నామంతో రాబోతున్నాడో చెప్పుకొని వచ్చిన అవతారం రామావతారం. నారదాది మునులందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శైవ వైష్ణవ సాంప్రదాయాలు సంఘర్షిస్తున్నాయి ఒకరికొకరు పొడగెట్టటం లేదు ఇది సమన్వయం చేయవలసిన సమయం వచ్చింది. లంకా నగరంలో వీర శైవాచారపరుడు అయినటువంటి రావణ బ్రహ్మ విష్ణు భక్తులందరినీ కూడా బాధిస్తూ ఉన్నాడు. అధర్మము, అనాచారము, అస్పష్టత, అవిద్య పెచ్చరిల్లిపోతున్న ఈ సమయంలో నీ రాక అవసరమని వీరు ప్రార్థించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏమిటంటే తప్పకుండా వస్తున్నాను. దశరథ రాజకుమారుడిగా దశరథుడి ఇంట పుడతా. దశకంధరుడి అంటే పది తలలు ఉన్న రావణుడి తలలు పది అంటే కుత్తుకలు ఉత్తరిస్తా అంటే రావణ సంహారం చేస్తా. మూడవది శ్రీరామ నామంతో దశ యుగాల వరకు ఆ రామ నామం వినపడేట్టుగా శ్రీరామచంద్ర నామంతో నేను జగత్తులోకి వస్తాను అని ఒక అభయం ఇచ్చాడు. ఇది చాలా అపురూప సన్నివేశం. తాను రాబోయేటువంటి అవతారానికి తాను పేరు పెట్టుకున్నటువంటి అవతారం రామావతారం. ఇక మనందరికీ తెలిసి చాలాసార్లు విన్న ఒక మాట ఉన్నది "రామో విగ్రహవాన్ ధర్మః" అని. రాముడు కేవలము ధర్మవీరుడు మాత్రమే కాదు ఆయన సత్య పరాక్రముడు. సత్యము, ధర్మము, ధర్మ సంస్థాపన ద్వారా శాంతి, తద్వారా ప్రేమ. ఈ నాలుగింటినీ కూడా త్రేతాయుగంలో రామాయణ కాలంలోనే శ్రీరామచంద్రుడు తన అవతార స్ఫూర్తి ద్వారా ఈ ప్రపంచానికి అందించిన వైనాలన్నీ మనం చక్కగా అర్థం చేసుకోవాలి.అంతే కాదు శ్రీరాముడు వాయస ప్రవేశం చేసి ఈ జగత్తులోకి వచ్చినప్పుడు రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులుగా నాలుగు విధాల ఒక స్వరూపాన్ని ఏర్పరచుకొని వచ్చి ధర్మాన్ని సంస్థాపన చేయటానికి వచ్చాడు శ్రీరామచంద్రుడు. రాముడిని ఎట్లాగైతే "రామో విగ్రహవాన్ ధర్మః" అని మనం పదే పదే అంటామో, కృష్ణుణ్ణి "కృష్ణం ధర్మ సనాతనః" అంటాం. కృష్ణుడు సనాతన ధర్మానికి ప్రతీక. సనాతన ధర్మం అంతా వైదికమైనటువంటి జ్ఞాన కాండ. శ్రీరామచంద్రుడి యొక్క అవతారం అంతా కూడా పాంచభౌతిక దేహంతో వచ్చి ఈ ప్రపంచంలో ఉన్న అధర్మాన్ని అణచి మళ్ళీ ధర్మాన్ని సంస్థాపన చేస్తాడు గనుక ఈయన ధర్మ స్వరూపుడు. ఆయన సనాతన ధర్మ స్వరూపుడు కృష్ణ పరమాత్మ. అది మనం ఆ రెండింటిని చక్కగా అర్థం చేసుకోవాలి. సరే రాముడు వచ్చాడు. రాముడు ఎనిమిదేళ్ళ వయస్సులో నగర ప్రవేశం చేశాడు. నగరాన్నంతా చూశాడు. అంతా దుఃఖమయంగా కనిపిస్తున్నది ఆయనకి. ఎక్కడా ఆనందం లేదు, సంతోషం లేదు. కిన్నుడై కూర్చున్నాడు అంతఃపురంలో. ఆ సమయంలో వశిష్టుల వారు జ్ఞాన స్వరూపుడు, ఆయన బ్రహ్మర్షి. ఆయనొచ్చి "ఏమి రామచంద్ర ఇట్లా ఉన్నావు?" అని అడిగాడు. "ఈ ప్రపంచం నాకు దుఃఖారామమై కనిపిస్తున్నది. సంతోషము, ఆనందము నాకెక్కడా కనిపించటం లేదు" అన్నాడు. అప్పుడు వశిష్టుల వారు జ్ఞానైక దృష్టితో ఒక్కసారి గమనించి, "ఎనిమిదేళ్ళ రాముడే ఇట్లా అయిపోతే, ఈ అవతారం ఎప్పటికి ముగిసేనో? ధర్మసంస్థాపన జరిగేదెట్లా? ఆయన వచ్చిన పని ఏమిటి? ఈ, ఈ దుఃఖంలో, ఈ వైకల్యంలో కూరుకుపోతే ఎట్లా?" అని రాముడితో కాసేపు మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆ రాముడితో మాట్లాడినటువంటి ముప్పై మూడు వేల శ్లోకాలే యోగవాశిష్ఠమయినయి. లేదా వశిష్ఠ గీతగా మనం చదువుకుంటూ ఉన్నాం. భగవద్గీత ద్వాపరాంతంలో, ద్వాపర వెళ్ళిపోయి కలియుగం రాబోయే టైంలో భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ రణరంగంలో చెప్తే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి ప్రారంభ కాలంలోనే యోగవాశిష్ఠాన్ని, మనస్సు యొక్క మర్మాన్ని చెప్పాడు వశిష్టులవారు. ఖేదము, మోదము, ప్రమోదము, ఆనందము, దుఃఖము, ఎత్తుపల్లాలు, జయాపజయాలు, మానవమానలు ఇవన్నీ కూడా ఈ జీవితంలో ఉంటాయి. ఇవేమీ ఎవరూ అతీతులు కారు. అన్నీ ఉంటాయి. కానీ వీటన్నింటి మధ్య తనును తాను నిలబెట్టుకున్నట్లుగా వెళ్ళాలి, "లోకే విహర రాఘవ" అని రాముడికి ఆయన అద్భుతమైనటువంటి బోధ చేశాడు. దాని నుంచి తన మనస్సుని మనోనిర్మాణం చేసుకుని తనకు కావలసిన రీతి శ్రీరామచంద్రుడు స్థిరమైన, స్థిమితమైన మనసుతో జీవితం ఏ సవాళ్లు విసరిని, ఎన్ని ఒత్తిళ్లు రాని, ఎన్ని ఆశాభంగాలు కలగని అన్నింటినీ కూడా తలవొగ్గి, విధి ఎట్లా నడిపిస్తే నేను అట్లా నడుస్తా అని నిర్ణయించుకున్నాడు. అది శ్రీరామచంద్రుడి యొక్క అవతారంలో చాలా ప్రధానమైన అంశం. ఇక కాస్త ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న చమత్కారం ఏమిటంటే, శ్రీరాముడికి బారసాల జరుగుతున్నటువంటి రోజున అంతఃపురంలో బియ్యం పోశారు. ఉంగరంతో నామకరణం చేయాలి. దాంతో నామం, పేరు పెడతారు. వశిష్టుల వారు రావటం ఆలస్యమైంది. అప్పటికే వాళ్ళు రామచంద్రుడు అని రాసుకున్నారు పేరు. వశిష్టుల వారి వయస్సు కారణంగా ఆయన దాన్ని రామభద్రుడు అని చదివాడు. "అయ్యా మేము రామభద్రుడు రాయలేదు, రామచంద్రుడు అని రాశాము" అని అన్నారు అందరూ కూడా. అంతఃపురానికి రామచంద్రుడు, సర్వలోకానికి ఆయన రామభద్రుడు అంతే అని నిర్ణయించాడు వశిష్టులవారు. అంటే ఒక అయోధ్యా నగర రాజుగా మాత్రమే కాదు ఈ వచ్చినవాడు నారాయణమూర్తి. లోకం కోసం వచ్చాడు. అయోధ్య నేలటానికి రాలేదు అని అన్యాపదేశంగా లోకానికి భద్రాయత మూర్తియై అట్లా వచ్చాడు ఆయన. అందుకనే విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఒక మాట అహల్యా శాపవిమోచన ఘట్టం అయినప్పుడు "ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి యగుచు తోచే" అంటాడు అహల్యకి. శ్రీరాముడు భద్రాభిరాముడై నేనున్నా ప్రపంచానికి ఇంకా ఏం భయం లేదా అన్నట్టుగా కనిపించాడట. అది పరతత్వానికి గొప్ప సంకేతం. సరే, కథా కథనంలోకి వెళితే, ఈ ధర్మాన్ని రాముడు ఎలా ఆచరించాలో, ఆచరించాడో, ఆచరించి ఈ జగత్తుకు ఒక బంగారు బాట, ఆధ్యాత్మికమయమైన జీవితానికి ఒక వెలుగు బాట ఎలా వేశాడో మనం విచారణ చేయాలి ఈ రోజున. రామాయణ కథ మనందరికీ తెలుసు. అసలు ఈ దేశంలో తల్లి పొత్తిళ్లలో, అంటే ఒక బాలుడో, బాలికో పొత్తిళ్లలో ఉండగానే తల్లి పక్కన పడుకున్నప్పుడు తల్లి నూరిపోసేది రామకథ. కాబట్టి రామకథ తెలియని వాడు లేడు. కానీ రాముడు తన జీవితాన్ని ఎలా పరిపూర్ణం చేసుకున్నాడు? తాను వచ్చినటువంటి పనిని కాల కార్య కారణ కర్తవ్య నిమిత్తమై వచ్చినటువంటి తన అవతారాన్ని, తన అవనీ సంచారాన్ని ఎంత భద్రంగా ముగించాడు అనేది మనం విచారణ చేస్తే తప్ప ఆ రాముడి సంపూర్ణత్వం మనకు అర్థం కాదు. పైగా శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై రెండు అవతారాలలో రామావతారం ప్రధానమైనది చాలా.ఎందుకని ప్రధానమైనది అంటే దశావతారాల్లో ఇది ఏడవ అవతారం. ఆయన వచ్చినటువంటి జన్మ ఎత్తినటువంటి నక్షత్రం ఏడవ నక్షత్రం అయినటువంటి పునర్వసు. ఇన్ని విశేషణ అయినటువంటి కర్కాటక లగ్నంలో పుట్టి సర్వశక్తులని సమకూర్చుకొని ఈ జగత్తుని ఉద్ధరించడానికి వచ్చాడు కనుకనే ఆయన జగదానందకారకుడైనాడు జగదోద్ధారకుడైనాడు. జగత్తుని ఉద్ధరిస్తూ జగత్తుకి ఆనందం ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. ఇక శ్రీరాముడు బాల్యమంతా వశిష్ఠుల వారి దగ్గర జ్ఞానబోధ అయింది ఇందాకే చెప్పుకున్నాం. పన్నెండవ ఏడు వచ్చేప్పటికి లోకగురువు విశ్వామిత్రుడు వచ్చాడు ఆయన మరొక బ్రహ్మర్షి. ఒక అవతారమూర్తికి ఇద్దరు గురువులు ఉండటం ఆశ్చర్యం, ప్రత్యేకం. అది రాముడి విషయంలో జరిగింది. లోకగురువైన విశ్వామిత్రుడు, జ్ఞానగురువైన వశిష్ఠుడు. కృష్ణుడి కాలానికి వెళ్ళేప్పటికి కృష్ణుడికి ఒక్క గురువు సాందీపుడు. సత్యసాయి భగవానునికి గురువే లేడు ఇది విశేషం. యుగయుగాంతరాలు మారుతున్నప్పుడు గురువే లేని ఓ పురుషోత్తముడు ఎవరంటే సత్యసాయి భగవానుడు. మనం ఈ తులనాత్మకమైనటువంటి విశేషాలన్నీ మనం ఇవాళ శ్రీరామనవమి నాడు చెప్పుకోవాలి. ఈ రామో విగ్రహవాన్ ధర్మః ఈ ధర్మాన్ని ఆయన ఎట్లా ఆచరించాడు విచారణ చేస్తే విశ్వామిత్రుల వారితో వెళ్ళినప్పుడు తాటక సంహారం చేశాడు మొట్టమొదట. తాటక మరణించగానే రాముడు దుఃఖించాడు. దుఃఖించి విశ్వామిత్రుల వారిని అడిగాడు, "నేను ఎందుకా ఈ జన్మ ఎత్తింది? ఒక స్త్రీని చంపటానికా నా క్షాత్రమంతా వినియోగించాను?" అన్నాడు. "రామా! నీవు అవతారమూర్తివి అయినప్పటికీ కూడా మానవ దేహాన్ని తీసుకుని వచ్చావు కనుక నీ యందు సత్వ రజస్ తమో గుణాలు మూడు ఉంటాయి. తాటక సంహారంతో నీలో ఉన్న తామసం సంహరింపబడింది ముందుకు నడవమ్" అన్నాడు. ముందుకు నడుస్తూ ఉన్నారు మనకు తెలుసు అహల్య శాపవిమోచనం అయింది. ఇక్కడ విషాదం అనుభవించలేదు రాముడు, ఆశ్చర్యాన్ని ఒక అద్భుతాన్ని చూశాడు. తన కట్టెదుట తనకు తెలియకుండానే తన ప్రమేయం లేకుండానే ఒక రాతిలో నుంచి ఒక పరమ పవిత్రమైనటువంటి ఒక స్త్రీమూర్తి బయటకు రావటం మరి పన్నెండేళ్ల బాలుడికి అది ఆశ్చర్యమే. ఆ ఆశ్చర్యంలో శ్రీరామచంద్రుడు అహల్యకు నమస్కరించాడు. నమస్కరిస్తే అప్పుడు విశ్వామిత్రుల వారి వైపు చూసి "దీనికి అర్థం ఏమిటి?" అని అడిగాడు. "నీలో రాజస గుణము నశించిపోయింది నడవమ్" అన్నాడు. అప్పుడే మిధిలా నగరం నుంచి వర్తమానం వచ్చింది. ఏది? స్వయంవరం, సీతా స్వయంవరం జరుగుతున్నది. మీరిక్కడ శిష్యులతో తిరుగుతున్నారని మాకు వర్తమానం వచ్చింది [కొట్టు] కాబట్టి మీరు మిధిలకు రావలసిందే అని విశ్వామిత్రుడు రామలక్ష్మణులని ఇద్దరినీ వెంబడి పెట్టుకొని వెళ్ళటం, శివధనుర్భంగం జరగటం, సీతమ్మవారిని పరిణయమాడటం, ఇదంతా కూడా జరిగింది. ఆ జరిగినప్పుడు మళ్ళీ క్రీగంట చూశాడు గురువు వైపు. ఇప్పుడు ఈ జరిగినది ఏమిటి? అని. అప్పుడన్నాడు "రామా! వివాహం వలన నీవు పూర్ణ పురుషుడివైనావు. సత్వగుణ ప్రధాన సంపన్నమైనటువంటి సంపూర్ణమైనటువంటి పురుషత్వాన్ని ఇప్పుడు సంపాదించుకున్నావు" అన్నాడు. [గొంతు సవరించుకుంటూ] ఇక ఆ తర్వాత విశ్వామిత్రుడి కథే లేదు రామాయణంలో. అంటే ఒక జగజ్జనని, ఒక జగదానందకారకుడైనటువంటి ఒక మహా చైత్య పురుషుడు. వాళ్ళ ఇద్దరికీ ఒక అనుసంధాన కర్తగా విశ్వామిత్రుడు ఒక బ్రహ్మర్షి తన పాత్రను తాను చక్కగా నిర్వ-నిర్వర్తించాడు. [గొంతు సవరించుకుంటూ] కనుక ఇక్కడ శ్రీరామచంద్రుడికి పూర్ణత్వాన్ని సిద్ధింపజేసిన అటువంటి వారు ఎవరు అంటే అంతఃపురం లో ముగ్గురు తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి. అరణ్యం నుంచి మిధిలా నగరం వరకు తాటక, అహల్య, సీత. కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క జీవితం మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించిన వారు ఎవరు అంటే ముగ్గురు స్త్రీమూర్తులే. సీతా కల్యాణం అయిన తర్వాత అయోధ్యా నగరానికి వెళ్ళిన తర్వాత రాముడికి మన యోగవాశిష్టంలో మనస్సు యొక్క మర్మం ఎరిగినవాడు గనుక వివాహం చేసుకోవాలి గనుక చేసుకున్నాననుకున్నాడు. యోగవాశిష్టం విన్న తర్వాత వశిష్ఠులవారు రాముడిని అడిగాడు, "ఇప్పుడు ఎలా ఉన్నది నీ మనస్సు?" అని. "నేను మనస్సన్యాసిని" అన్నాడు. అంటే మనస్సుని సన్యాసించాడు. అంటే మనస్సును వదిలాడు అని కాదు మనస్సుని సమన్యాసం చేసుకున్నాను అని అర్థం. సమన్యాసం అంటే సుఖంలో, దుఃఖంలో, ఆనందంలో ఏదో తాటకుని చంపాను ఆనందపడలే. అహల్య శాపవిమోచనం ఆశ్చర్యం కలిగింది కానీ క్షణకాలం. ధను-- శివధనుర్భంగం అయింది పెద్ద ఏమీ తేడా లేదు. సీతనే వివాహం చేసుకున్నాను అసలు ఇంకా ఏమీ లేదు. అన్నట్లుగా ఒక నిర్మోహమైనటువంటి స్థాయిలో నిర్మముడై, నిశ్చలుడై, నిరంజనుడై, నికేతనుడై, పూర్ణమైనటువంటి ఆ మానవీయంలో నిలకడ చెందినటువంటి రామభద్రుణ్ణి చూశారు. అయితే సీతమ్మవారు అట్లా కాదు కదా! ఆమె వెళ్ళి ఎవరికి చెప్పింది అంటే అత్తల ముగ్గురికీ చెప్పలేదు రాముడి గురించి. తాను వెళ్ళి అరుంధతికి చెప్పింది. అరుంధతి ఎవరు? వశిష్ఠుల వారి ధర్మపత్ని. "అమ్మా! రాముడు నన్ను పెళ్లి చేసుకొని మా నాయన దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఒక్కరోజు కూడా నాతో మాట్లాడటం లేదు, నాతో గడిపే సమయమే లేదు."ఎందుకిట్లా అని అడిగితే అరుంధతి రాముడిని మందలించి "రామా! వివాహంలో-- వివాహ వ్యవస్థలో నీవు నీ భార్యని సమభాగంగా స్వీకరించాలి. నీ భార్యకి ఒక శక్తిని, ఒక ధైర్యాన్ని, ఒక రక్తి అనురక్తిని అన్నీ కలిగిస్తూ మీరిద్దరూ చక్కగా సహజీవనం చేసి ఆదర్శ దాంపత్యానికి మార్గోపదేశం చేయాలి" అని ఉపదేశించింది ఎవరంటే అరుంధతి. ఇప్పటికీ ఆరు, ఏడవ స్త్రీమూర్తి అయిపోయింది. ఇక కథాగమనంలో ఎనిమిదవ స్త్రీమూర్తి ఆయన, ఆయన అందచందాలకు మోహితులైనట్టుగా కనిపించే శూర్పణఖ ఒక ఎత్తు. ఇట్లా అనేకమైనటువంటి పాత్రలు శ్రీరామచంద్రుడి యొక్క ఆ ధర్మచారణ అంటే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపే విధానాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా ప్రభావితం చేశారు. ఇక ధర్మం అంటే ఏమిటి? Law of truth ఇది మనం గమనించాలి. Law of truth is ధర్మ. అంటే Law of సత్య truth అంటే సత్యం. సత్యాన్ని గనుక మనం ఒక నైతిక స్థాయిలో ఈ ప్రపంచంలో అర్థం చేసుకోవాలి అంటే దానికి ధర్మమే మార్గం. ఈ ధర్మం ఎక్కడ ఉన్నది అంటే వేదోఖిలో ధర్మమూలం. వేదాల నిండా ధర్మమే ఉన్నది. ధర్మమూలమంతా వేదమై యుంది, వేదమూలమంతా ధర్మమై యున్నది గనుక వేదోఖిలో ధర్మమూలం. ఈ ధర్మాన్ని ఒక Law of truth గా మనం గనుక సత్యంగా గమనించలేకపోయినట్లయితే సత్యం వేరు, ధర్మం వేరు అని మనం అనుకుంటాం. అందుకనే సత్య జ్ఞాన అనంతములు బ్రహ్మములు అని సత్యము బ్రహ్మము, ధర్మము బ్రహ్మము, జ్ఞానము బ్రహ్మము, అనంతము బ్రహ్మము కాబట్టి అన్నీ కూడా బ్రహ్మమే కాబట్టి బ్రహ్మము అంటే ఈ కనిపిస్తున్నటువంటి manifest అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి విచారణ గనుక ఈ కథా కథనంలో నెమ్మదిగా ముందుకుని వెళ్లినట్లయితే ముందుకి ఓ రోజు దశరథులవారు "రాముడి పట్టాభిషేకం అన్నారు. రాత్రి నీ గదిలో నువ్వు కూర్చొని ధ్యానంలో ఉండాలి. మనస్సుని చాలా శుభ్రంగా ఉంచుకో. తెల్లవారేప్పటికి నీకు పట్టాభిషేకం" అన్నారు. అవుననుకున్నాడు. సీత అంటే అమ్మవారేమో అత్తల దగ్గర ఉన్నది. రాముడు తన గదిలో ఒక్కడు కూర్చొని బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి ధ్యాన ముద్రాంకితుడై ఆయన ఉన్నాడు. తెల్లవారుతున్నది ఒక తొలిజాము వస్తున్నటువంటి ఆ సమయంలో రాముడు తన తలుపు తీసుకుని తన గదిలో నుంచి కైక దగ్గరకు వెళ్ళాడు. వెళ్లి "అమ్మా! నా మనస్సు నిలవటం లేదు కారణం నా చుట్టూ ముప్పై ముక్కోటి దేవతల కంఠాలు ఘోషిస్తూ ఉన్నాయి. నువ్వు సింహాసనం ఎక్కద్దు అని చెప్తున్నాయి. నన్ను ఏం చేయమంటావు?" అని అడిగాడు. ఇక తెల్లవారితే పట్టాభిషేకం. "అదేమిటి నాయనా మర్చిపో, నువ్ ఇక్కడ నా, నా దగ్గర ఉండు అన్నీ పోతాయి" అని అనలేదు. "దైవం ఎలా నిర్ణయిస్తే రామా! నువ్వు అట్లా జీవించు" అని తలుపు వేసేసుకుంది ఆవిడ. అంటే ఎంత అద్భుతమో చూడండి రామాయణాన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. శ్రీరామనం మనకు అందుకనే వచ్చింది. వెళ్ళాడు. తెల్లవారింది. ఆమె ఏమీ చెప్పలేదు, ఏమవుతుందో చెప్పలేదు. చెప్పబడింది. "నువ్వు ఇవాళ పట్టాభిషేకం లేదు, పధ్నాలుగు సంవత్సరాల కాంతార వాసం, అడవులకు వెళ్ళాలి" అని చెప్పారు. ఏ రకంగా మనస్సుని సింహాసనం మీద అధిష్టించాలని మనస్సుని నిర్మాణం చేసుకున్నాడో అది భగ్నం అయినప్పుడు కూడా అదే మనసుతో అట్లాగే అన్నాడు రాముడు. మూడే అక్షరాలు. అవుదల దాల్చాడు అంటే తల వంచాడు. శిరసావహించాడంట ఆమె. శిరసావహించి దశరథ మహారాజు అంటే తండ్రి ఆజ్ఞను పాలించి అరణ్యాలకు వెళ్లి పోవటానికి సిద్ధపడ్డాడు. ఇక ఆయన ధర్మ ప్రసారము, ధర్మ ప్రస్థానము ప్రారంభమైన తొలి వేళలో సీతాదేవి వచ్చేసింది. "నీతో నేను వస్తాను" అంది. చూడండి సత్పురుషుడు అయినటువంటి వాడు తన భార్యను కష్ట పెట్టడు. రాబోయే కష్టాలను ఊహించి తెలుసుకుని "నువ్వు చక్కగా ఇక్కడే ఉండు. మా ముగ్గురు అమ్మలు కూడా నిన్ను చక్కగా జాగ్రత్తగా చూసుకుంటారు జానకి. నేను ఇట్లే వెళ్లి అట్టే వెనక్కి వచ్చేస్తాను. నన్ను వెళ్ళమన్నారు తప్ప నిన్ను వెళ్ళమని ఎవరూ చెప్పలేదు కదా" అంటే సీతమ్మవారు కాసేపు మాట్లాడింది. ఏమన్నదంటే "రామా! నువ్వు అరణ్యంలో నీతో గనక నేను ఉన్నట్లయితే నాకు అరణ్యం అయోధ్య. నువ్వు లేకపోతే ఈ అయోధ్య నాకు పధ్నాలుగేళ్ళ అరణ్యం. ఇక్కడ నేను అరణ్యవాసం చేసినట్లే ఉండవలసి వస్తుంది. కనుక నన్ను నీవు వెంబడి తీసుకెళ్ళు" అన్నది. పులులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, బ్రహ్మ రాక్షసులుంటారు అడవుల్లో. పైగా ఒక రోజా, రెండు రోజులా, పధ్నాలుగు సంవత్సరాలు అని కాస్త భయపెట్టడానికి ప్రయత్నించాడు రాముడు. సీత అన్నది, "నా తండ్రి నీకిచ్చి వివాహం చేస్తున్నప్పుడు ఇటువంటి పరిస్థితుల అన్నింటి నుంచి కాపాడగలిగిన వీర, ధీర, శూర, గంభీరుడువని గదా నీకిచ్చిన జనకుడు వివాహం చేశాడు. నన్ను రక్షించవలసిన బాధ్యత నీదే. ఆ బ్రహ్మ రాక్షసులు నిన్నేం చేయకపోయినా నీతో ఉంటే అవి నన్నేం చేయవునే వస్తున్నాను" అన్నది. మాట మన్నించాడు రాముడు. శాసించలేడు. మన్నించి వెంబడి పెట్టుకున్నాడు. కనుక సీతారామలక్ష్మణులు ముగ్గురూ కూడా ఈ ధర్మపథంలో నడవటం ప్రారంభించారు. ఈ ధర్మం ముందు కుటుంబ ధర్మం, ముందు రాజ్య ధర్మంలో తండ్రి మాట పాలించాడు. కుటుంబ ధర్మంలో కైక చెప్పినది విన్నాడు.అంతే కాదు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు కౌసల్యాదేవి దగ్గరికి తన తల్లి దగ్గరికి వెళ్లి అమ్మా పధ్నాలుగు ఏళ్ళు తండ్రిగారు నన్ను అరణ్యవాసం పంపించుతున్నారు. నన్ను ఆశీర్వదించమని అడిగాడు. ఆమె "ధర్మో రక్షతి రక్షితః" నువ్వు ధర్మాన్ని ఆచరించు నాయనా ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అన్నది. అక్కడ పుట్టింది ఈ మాట. అంటే మనందరికీ కూడా ఒక్కసారి ఈ రాముడి కథ రాముడి విచారణ చేసినప్పుడు ఆ రాముడు మనము అనుకుని వినాలి. అవన్నీ మనకి పాఠాలే అది కథగా కనిపించే ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం అది మనందరికీ కూడా. సరే రాముడు రాజధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, దాంపత్య ధర్మాన్ని గ్రహించాడు. ఆచరించడం మొదలుపెట్టాడు. ఇక లక్ష్మణస్వామి. లక్ష్మణుడు కూడా స్వామి అంటే జ్ఞాని అని అర్థం అంతే. లక్ష్మణుడు జ్ఞాని ఆయన ఏం చేశాడు? ఊర్మిళ దగ్గరికి వెళ్లి ఆమె permission తీసుకున్నాడు. ఇలా నా అన్న వెళ్తున్నాడు ఒక్కడే ఉంటాడు నేను నా అన్న వదినలకి సేవ చేస్తాను కాబట్టి సహాయకారిగా నేను ఉంటాను అంటే, ఏ భార్య అయినా నిన్నేమన్నా మామగారు వెళ్ళమన్నారా? వెళ్ళమని అనలేదు కదా నువ్వెందుకు వెళ్తున్నావ్? అని అనాలి. అలాగే వీళ్ళు తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఎవరు అంటే అన్న. చూడండి ఆ స్త్రీ మూర్తులలో కూడా ధర్మం ఎలా స్వరూపంగా కనబడుతున్నదో. నువ్వు పగలు రాత్రి అనకుండా రాత్రి పూట నువ్వు నిద్రపోవాలి. నువ్వు నిద్రపోతే నువ్వెళ్ళిన వెళ్ళిన ప్రయోజనం నెరవేరదు గనుక అన్నా వదినలు విశ్రాంతి చెందుతున్నటువంటి వేళ నువ్వు వాళ్ళ కాపలాగా రాత్రుళ్ళు కూడా మేలుకుని ఉండాలి పగలంతా నడుస్తూ ఉండాలి. కనుక యోగనిద్ర ద్వారా నీవు పోవలసిన నిద్రని నేను పధ్నాలుగు ఏళ్ళు నిద్రపోతాను. ఆ దానికే ఊర్మిళ నిద్ర అని పేరు వచ్చింది. అంటే లక్ష్మణస్వామికి ఇక నిద్ర అనేది లేదు. పోయింది. రామలక్ష్మణులిద్దరికీ కూడా విశ్వామిత్రుల వారు బలాతిబల విద్యలు నేర్పారు. అవి మహా మంత్రాలు. దానివలన ఆకలి దప్పిక రెండూ ఉండవ్. ఆకలి లేదు, దప్పిక లేదు, ఊర్మిళ ఊర్మిళ కారణంగా నిద్ర కూడా లేదు, బాధ లేదు మూడు లేవు అసలు మనిషికి. కనుక పూర్ణమైనటువంటి చైతన్యంతో శ్రీరామచంద్రుడు తన ధర్మ కార్యకలాపాన్ని ప్రారంభించాడు. తర్వాత జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు అంటే రాక్షస సంహార క్రీడలో ధర్మాన్ని నిలబెట్టడం మాత్రమే కాదు అధర్మాన్ని కూకటివేళ్లతో పగలించివేశాడు. అవన్నీ కథా కథనాలు మనకన్నీ తెలిసినవే. అంటే అధర్మాన్ని తీసివేయటం ధర్మాన్ని నిలబెట్టటం. కేవలం ధర్మానికి ఒక స్వరూపాన్ని ఇవ్వటం. ఆ కేవల ధర్మం ఏమిటో మళ్ళీ తాను అరణ్యంలో నుంచి ప్రారంభించి వెనక్కి రావాలి. ఇక్కడ కొద్దిగా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళినట్లయితే అరణ్యవాసానికి బయలుదేరుతుంటే అయోధ్యా నగర ప్రజలందరూ కూడా రాముడి దగ్గరకు వచ్చేశారు. "మేము కూడా నీతో వస్తాం. నువ్వు లేని అయోధ్యలో మేము ఉండలేం. పైగా పధ్నాలుగు ఏళ్ళు మేము ఎట్లా ఉండగలం?" అని ఏడుస్తున్నారు. రాముడు చాలా logical గా మాట్లాడాడు. [గొంతు సవరించుకుంటూ] ఏమిటా logic అంటే సరే ఒకవేళ నేను అంతఃపురం లోనే ఉన్నా ప్రతిరోజూ నేను కలుస్తానా మిమ్మల్ని? మీరు నన్ను ప్రతిరోజూ కలవగలరా? కలవలేరు. అవసరమైనప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను బయటికి వస్తే మనమిద్దరం కలుసుకుంటాం. అంటే ప్రజలు రాజు రోజూ కలుసుకోరు, అవసరం కూడా లేదు. ప్రజలని సుఖంగా పాలించటం రాజు యొక్క కర్తవ్యం. నిరంతరమైనటువంటి ఒక చింతనలో రాజ్య క్షేమాన్ని చూస్తూ ఆయన ఉండాలి. ప్రజలు రాజుని కాపాడుకుంటూ ఆ రాజుకి కావలసినటువంటి సర్వశక్తులని సమకూరుస్తూ వాళ్ళు ఉండాలి. కాబట్టి అలా కాసేపు మాట్లాడిన తర్వాత కాదన్నారు. మేము వస్తాం అన్నారు. అప్పుడు రాముడు ఏం చెప్పాడో తెలుసా? నన్ను ఒక్కడిని అరణ్యం ఆహ్వానిస్తుంది. అరణ్యం నన్ను కరిస్తుంది. అయోధ్యా నగర ప్రజలంతా కూడా అయోధ్యకు తాళం పెట్టి అరణ్యంలోకి గనక వచ్చేసినట్లయితే అక్కడ చెట్లు, వాటికున్న పళ్ళు, కందమూలాలు మొత్తము కూడా మనందరం కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేయటానికి వెళ్తున్నామా? నేను అధర్మ విధ్వంసానికి వెళ్తున్నానే తప్ప అక్కడ మీ అందరికీ చోటు లేదు. మీరు నవ నాగరికమైనటువంటి అయోధ్యలో మీరు ఉండి రాముడు ఉన్నాడు అనుకుని మీరు జీవించండి. ప్రతిరోజూ నేను కలుస్తున్నాను అనుకునే మీరు జీవించండి అని ఒక హితం చెప్పాడు చూడండి. పర్యావరణ సంరక్షణ ఎంత ప్రధానమైనదో రామాయణం మనకు చెప్తుంది. ఆ రాముడి మాట మన్నించారు. ఎప్పుడు మన్నించారు అంటే, అవును రావాలి రావాలని మీరంతా అయోధ్య ప్రజలంతా తపస్సు చేస్తే మా తండ్రి తపస్సు ఫలించి ఇదిగో నేను వచ్చాను. అట్లా కొన్ని ఏళ్ళు ఒక ముప్పై నలభై ఏళ్ళు ఎదురు చూశారే, పధ్నాలుగు ఏళ్ళు ఎదురు చూడలేరా? నా పని నన్ను చేయనివ్వండి, మీ పని మీరు చేస్తూ ఉండండి. ఇది యువరాజు కాబోతున్న రాముడి హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ, ఒక పరిపక్వమైనటువంటి ఆజ్ఞా స్వరం అంటాం. దాంతో నిశ్చేష్టులైపోయినారు. ఇంత పరిణితి, ఇంత అద్భుతం. నిజమే అరణ్యంలోకి అయోధ్యా ప్రజలందరూ గనక వెళితే ఎన్ని పులులు ఎన్ని సింహాలు వాళ్ళని తినేస్తాయో, వాళ్ళు అరణ్యాన్ని ఎంతగా చేస్తారో కాబట్టి ప్రకృతి ధర్మాన్ని శ్రీరామచంద్రుడు పరిపూర్ణంగా పోషించినటువంటి వాడు రామచంద్రుడు అది. అందువలన ఆయన "రామో విగ్రహవాన్ ధర్మః" అయినాడు. ఆ ధర్మ స్వరూపం ఇక [గొంతు సవరించుకున్నాడు] కాసేపుగుహుడి వైపు, శబరి వైపు, మునుల వైపు, మహాత్ముల వైపు, మహర్షుల వైపు గమనించినట్లయితే రామాయణంలో రాముడి ప్రయాణం అనమాట. అయనం అంటే ప్రయాణం. రామ ప్రయాణంలో పగలంతా రాక్షస వధ, రాత్రంతా ముని వాకిట మునులుంటారు. వాళ్ళ కుటీరాలలో విశ్రాంతి చెందటం, వారి నుంచి ఒక శాంతిని, శాంతి వచనాన్ని పొందటం. మళ్ళీ ధైర్యాన్ని, శక్తిని తీసుకోవటం. మళ్ళీ తెల్లవారగానే తన ప్రయాణ నడక ప్రారంభించటం. ఇది ఒక అద్భుతమైనటువంటి పరిణామం. పగలంతా కూడా అధర్మాన్ని అణచటంలో, రాత్రంతా కూడా జ్ఞాన నిష్ఠలో ఉండి అసలు సిసలైనటువంటి అచ్చ తెలివిని సంపాదించుకొని ఈ ధర్మాన్ని ఎలా నిలబెట్టుకోవాలో మహాత్ముల వచనాల నుంచి, మహాత్ములు చెప్పిన మంచి మాటల నుంచి, ఆ మాటలన్నీ శాస్త్రోక్తాలు కాబట్టి వైదికమైన, సనాతనమైన, ఆర్షమైన, భారతీయమైన ఒక సంప్రదాయాన్ని తనలో జీర్ణింపజేసుకుని ఆ తలతలవారుతూనే రాముడు మళ్ళీ తన ప్రయాణాన్ని సాగించటం ఒక అద్భుతమైనటువంటి చరణం. అదొక సంచారం. [గొంతు సవరించుకుంటూ] కనుక శ్రీరామచంద్రుడు మహాత్ముల యొక్క, మహర్షుల యొక్క, వాళ్ళందరీ సంబంధించినటువంటి ధర్మాన్ని తాను తెలుసుకుంటూ, ఆచరిస్తూ ధర్మసంస్థాపన చేస్తూ వెళ్ళాడు. సరే కొంత సమయం గడిచిన తర్వాత భరతుడు రావటం, దశరథ మహారాజు మరణ వార్త తెలుసుకోవటం, రాముడు సహజంగానే నేను మానవుడిగా ఉండటానికి వచ్చాను అన్నాడు. ప్రజలందరూ కూడా ఆయన్ని దేవుడని చెప్పేసినయి. "నువ్వు దేవుడివి" అంటే, "కాదు, కాదు నేను దశరథ రాజకుమారుడిగా ఉండటానికి వచ్చాను, నేను దశరథాత్మజుడిగా వచ్చాను, దశరథ నందనుడిగా వచ్చాను." ఏమిటిది? దశరథ నందనుడు అంటే దశరథుడికి ఆనందము కలిగించటానికి వచ్చాను. దశరథుడు యొక్క తనువు నుంచి రాలే, దశరథుడు యొక్క ఆత్మలో నుంచి నేను పుట్టాను. ఆత్మావై పుత్ర నామాసి. పుత్రుడు ఎలా పుడతాడు అంటే పురుషుడు యొక్క ఆత్మ భావనలో నుంచి మగబిడ్డ పుడతాడు. అలా వచ్చాను నేను. దశరథాత్మజుడిగా వచ్చాను నేను. దశరథ రాజకుమారుడిగా వచ్చాను. ఒక అధికారం ప్రకారం రాజకుమారుడిని, ఆత్మగతమైన విచారణ ప్రకారం ఆత్మజుడిని నేను, ఆత్మ ద్వారా వచ్చిన వాడిని, మూడవది ఆ దశరథ మహారాజుకి ఆనందం కలిగించటానికి వచ్చాను. కనుక నేను దేవుడిని కాదు, నేను మానవుడిగా ఉంటున్నాను అని ప్రకటించాడు ఆయన. అప్పుడు ఆయన చేసిన పని ఏమిటంటే పుత్రుడు గనుక ఉంటే పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని మన సనాతన ధర్మం చెప్తూ వచ్చింది. [గొంతు సవరించుకున్నాడు] మరి ఆయన ఒక్క కొడుకు కావాలి అని అనుకున్నాడు. నలుగురు పుట్టారు. ఈ నలుగురిలో దశరథ మహారాజు ప్రాణం వదిలిపెట్టిన వేళ రామలక్ష్మణులిద్దరూ అరణ్యంలో ఉన్నారు. భరతుడు, శత్రుఘ్నుడు మేనమామల ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఆయనకు ఆ సమయంలో ఎవరూ అక్కడికి రాలే. తర్వాత భరతుడు వచ్చాడు, అంత్యక్రియలు చేశాడు అది వేరే సంగతి. అప్పుడు మరి రాముడు తన ధర్మాన్ని, పితృ కార్యాన్ని ఎలా చేయాలి అని ఆలోచిస్తూ తన సేవలో తన రెండు రెక్కలు పోగొట్టుకున్నటువంటి జటాయువుకి అగ్నిసంస్కారం చేశాడాయన. ఎవరు ఈ జటాయువు అంటే దశరథ మహారాజుకి పరమ మిత్రుడు. మన తండ్రి స్నేహితుడు మన తండ్రితో సమానం. కాబట్టి జటాయువుకి అగ్నిసంస్కారం చేస్తూ దశరథ మహారాజు పట్ల చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మను అంటే శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో చేసే పని అని అర్థం. ఆ శ్రద్ధతో, విధివిధానంతో జటాయువుకి అగ్నిసంస్కారం చేసి ఆ రకంగా ఒక ధర్మాన్ని ఆయన ప్రకటించాడు. జటాయువు పక్షి కదా అంటే ఆత్మ స్వరూపుడైన వాడికి పక్షి కాదు, పసరము కాదు. అంతా అన్నిటా ఉన్నది ఒక్కటే, అది అఖండమైనటువంటి ఒక ఆత్మ. దాన్ని శ్రీరామచంద్రుడు ధర్మ స్వరూపుడు గనుక అలా చేశాడు. అట్లాగే దశరథ మహారాజు యొక్క క్షేమాన్ని నిరంతరము కోరేటువంటి వాడు గుహుడు. ఆ గుహుడికి ఒక ఉపశమనం కలిగించాడు. ఏదో మామూలుగా చమత్కారంలో నువ్వు-నువ్వు నీ పాదం చూకితే రాతిలో నుంచి నాతి వచ్చిందట, అది కల్పనాత్మకమైన భావన. అసలు విషయం ఏమిటంటే గుహుడు దశరథ మహారాజుకి అత్యంత ఆప్తమైనటువంటి వాడు, ఆత్మీయుడు. తన తండ్రి ఆత్మీయుడు తనకు కూడా ఆత్మీయుడే. గుహుడి పట్ల తన తండ్రి ఎట్లా ఉన్నాడో తాను కూడా అట్లాగే ఉండాలి. అంటే మనక్కూడా చూడండి మన తండ్రుల స్నేహితులుంటారు. వాళ్ళందరూ ఎవరంటే మనకి తండ్రివంటి వారు. మనకి తండ్రి ఒక్కడే కానీ వారంతా తండ్రివంటి వారు. వాళ్ళని మనం తండ్రిగా గౌరవించాలి అని రామాయణ ధర్మం, రామ ధర్మం మనకు బోధిస్తూ ఉన్నది. ఇక సరే వెళ్తున్నారు, వెళ్తున్నారు, వెళ్తూ ఉంటే సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరగటానికి ముందు మారీచుడు మారువేషంలో రావటం, మారువేషం అంటే బంగారు లేడిగా రావటం, "నాకది కావాలి" అని అమ్మవారు అడగటం, బంగారు లేడి ఎక్కడైనా ఉంటుందా అనటం, అంతఃపురానికి వెళ్ళాక మళ్ళీ నేను చేయిస్తాలే స్వర్ణకారులను పిలిచి అని రాముడు చెప్పడం అన్నీ మనకు తెలుసు. కానీ "నువ్వు నాకు తెచ్చి ఇవ్వాలి" అన్నప్పుడు రాముడు అక్కడ కూడా తలవంచాడు. ఎందుకు వంచాడు అంటే దేని పట్ల ఆయనకు వ్యామోహం లేదు. ఎందుకంటే ఆయన అప్పటికే వశిష్ఠ గీత విన్నాడు. "రామా! నీ చుట్టూ కోరికలు ఉన్నవారు ఉంటారు. నాకిది కావాలి, అది కావాలి, అది తీసుకురా అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోరికలన్నీ తీర్చు కానీ నీవు కోరిక లేనివాడివై ఉండు."అది ఆయన జీర్ణించుకున్నాడు. ఎందుకు ఆ మాట వశిష్ఠులవారు చెప్పారంటే సీతను ఉద్దేశించి కాదు, రాజు కాబట్టి ప్రజలు రోజూ ఏదో ఒకటి అడుగుతారు. "అదివ్వండి, ఇదివ్వండి, బీదవాళ్ళం డబ్బివ్వండి, అది కాపాడండి." ఏవో ఏదో ఒకటి రాజును అడుగుతారు. అవి వాళ్ళ కోరికలు. రాజు ధర్మం ఏంటంటే ఆ కోరికను తీర్చాలి. ఇక్కడ క్షాత్ర ధర్మంలో ఉన్నటువంటి రామచంద్రుడు ఆ ధర్మాన్ని నిర్వర్తించాడు. లేకపోతే ఆయనకి తెలియదా? సీతకి గట్టిగా చెప్పచ్చు కదా. చెప్పడు. ఎందుకు చెప్పడు అంటే ఈ ధర్మాచరణలో చాలా ఆటుపోట్లు ఉంటాయి. అనేకమైన ఇబ్బందులు, అననుకూలాలు ఏర్పడతాయి. రాముడు తెలియనివాడు కాదు. సరే ఇంతలోకే సీతాపహరణం జరిగింది. సీతాపహరణం జరిగినప్పుడు ఆయన విలపించినట్టుగా మనకి అన్ని రామాయణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. రాముడు సీతాపహరణానికి విలపించటం కాదు అనుభవించాడు. అనుభవించినట్లుగా కనిపించాడు. కానీ ఆయన అభినయించాడు. లోకం ఆయనను చూసినప్పుడు సీతారాముల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమానుబంధాలు లోకానికి తెలుసు గనుక ఆ రాముడి నుంచి సీత విడిపోయినట్లయితే రాముడు ఏమవుతాడు? ఏమవుతాడు అంటే రాముడి అవతారానికి ముందే జానకీ దేవిగా వచ్చేసింది ఆమె. రాముడి అవతారానికి ముందే జనక మహారాజు ఇంట నాగేట్టు చాలులో వచ్చి శక్తిగా కూర్చున్నది. మరి ఈ రాముడి యొక్క అనంత మహాశక్తి ఎవరు అంటే సీత. ఈ సీత రాముడితో కూడి ఉన్నంతవరకు రాముడికి ఆనందమే. సీతే లేకపోతే, ప్రాణమే లేకపోతే, చైతన్యమే లేకపోతే, శక్తే లేకపోతే రాముడు ఏమవుతాడు? అంటే తనకు ఉండవలసినటువంటి శక్తి తన నుంచి వైదొలగినప్పుడు రాముడు తన చుట్టూ ఉన్న పరివారం నుంచి శక్తి గ్రహించాలి. కనుకనే కిష్కింధా కాండంలోకి వచ్చేప్పటికీ సుగ్రీవ మైత్రి చేశాడు. ఈయన నరుడు, నరోత్తముడు ఈయన. నర రూపంలో ఉన్నాడు. ఎవరి సహాయం పొందాడు? మరొక రాజునికి రాజు కబురు పంపలా వానరుల యొక్క సహాయం తీసుకున్నాడు. అంటే ఒక పవిత్రమైనటువంటి ధర్మ కార్యక్రమంలో గడ్డిపోచను కూడా మనం అనుసరించాలి. ఈ ప్రపంచంలో వీడు పనికిరానివాడు, వాడు పనికొచ్చేవాడు, వీడు తెలివిగలవాడు అని మనం నిర్ణయిస్తాం. బాగా తెలివిగలవాడే ఒక్కసారి మనకు అడ్డం పడతాడు. ఏమీ తెలియని వాడు, అమాయకుడు, అజ్ఞాని వాడే ఒక్కొక్కసారి మనకు ప్రాణ రక్షకుడై నిలబడతాడు. ఇది మనం చూస్తూ ఉంటాం. కనుక తనకంటే, ఆయన ఎప్పుడూ తనకంటే తక్కువ అనుకోలేదు. కానీ లోకరీతిలో చూస్తే నరులకి వానరులకి కాస్త తేడా ఉన్నది గనుక ఉన్నప్పటికీ మొత్తం కిష్కింధలో ఉన్నటువంటి ఆ వాలి సంహారం చేసి, ధర్మసంస్థాపన చేసి, ఏది ధర్మం అంటే రాముడు ఎట్లాగైతే రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో లేదా దూరమైనాడో, ఎట్లా రమణికి, రమణి అంటే సీత, రమణికి దూరమైనాడో సుగ్రీవుడు కూడా తన అన్న కారణంగా రాజ్యం పోగొట్టుకున్నాడు. రమణికి దూరమైనాడు. మళ్ళీ అవన్నీ కూడా ఏర్పరచి ధర్మసంస్థాపన జరగాలి అంటే రాజ్యం ఒక సత్పురుషుడి చేతిలో ఉండాలి. రాజ్యం ఎవరు పడితే వాళ్ళు rule చేయటానికి లేదు. దానికి ఒక vision ఉండాలి, దానికి ఒక శక్తి ఉండాలి, ఒక ధార్మికత ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి, ఒక నియమం ఉండాలి, ఒక నిష్ఠ ఉండాలి, నీతి ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. ఉన్నటువంటి వాడు మాత్రమే రాజు కాగలడు. మిగతా వాళ్ళు రాజులు కా-కారు, కాలేరు. కనుక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి వాడి రాజ్యం వాడికి ఇచ్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి తన కార్యక్రమం తాను సాగిస్తూ వెళ్ళాడు. ఆ వెళ్తున్న సమయంలో అరణ్యకాండలో మనకి శబరి కనిపిస్తుంది. శబరి గుహుడి వలె శబర స్త్రీ, శబర స్త్రీ అంటే శ్రమణి అంటాం. ఆ శ్రమణి మాతంగ మహామునికి సేవ చేస్తూ ఉన్నది. ఎలా సేవ చేస్తున్నది అంటే తన గురువుని కూడా తాను చూడలా. ఆయన ఎట్లా ఉంటాడో కూడా ఆమెకు తెలియదు. కానీ గురువుగారు బయటకు వెళ్ళగానే కుటీరంలో ప్రవేశించి ఆయన బట్టలన్నీ ఉతికి చక్కగా చలువ చేసి మడతపెట్టి ఆశ్రమమంతా కూడా శుభ్రపరచి మళ్ళీ తన దారిన తాను వెళ్ళిపోయేది. ఇది మాతంగ మహర్షి ఆశ్రమంలో శబరి చేసినటువంటి ఉదాత్తమైనటువంటి విషయం. సరే ఒక రోజున మాతంగ మహాముని రావటం, వస్తూనే ఏమన్నాడంటే, "శబరి! రేపు రామచంద్రుడు రాబోతున్నాడు ఇక్కడికి. నువ్వు శ్రీరామచంద్ర దర్శనం చేసుకో" అన్నాడు. ఈ శబరి ఏమన్నదో తెలుసా? "అయ్యా! శ్రీరామ దర్శనం చేసుకోమని మీరు నాకు చెప్తున్నారే, మరి మీరు దర్శనం చేసుకోరా, మీకక్కర్లేదా?" అని అడిగింది. ఆయన అన్నారు, "ఈ దేహంతో వచ్చిన ఈ తనువు ఇవాళ్టితో ఇక్కడ ముగిసిపోయింది. కనుక రేపు అంటూ నాకు లేదు. రాముడు వచ్చినా నాకు లేదు. కనుక నాకు వచ్చే ఆ స్వర్ణ విమానం ఏదైతే ఉన్నదో, స్వర్ణరథం అది ఎక్కి నేను వెళ్ళవలసింది. I have to vacate the body. శరీరం వదిలిపెట్టాలి. నీవు చాలా సేవ చేశావు. రామచంద్రుడు వస్తాడు. నువ్వు ఎదురుచూస్తున్నావు రాముడి కోసం" అని చెప్పి మాతంగ మహాముని వెళ్ళిపోయినాడు. శబరి ఉన్నటువంటి కుటీరానికి ఏడు దారులున్నాయి. ఏడు, ఆ రాముడు ఏ దారిన వస్తాడో ఆమెకు తెలియదు. కనుక ఏం చేసింది? రాముడు వస్తాడు అని తెలిసిన కారణంగా ఏడు దారులు కూడా పూలదారులుగా మార్చేసింది. ఆయన ఎటునుంచి వచ్చినా ఆయన పాదాలకు ఏ ముళ్ళు గుచ్చుకోకూడదు, రాళ్ళు గుచ్చుకోకూడదు అని ఆ శబర కాంత శబరి అలా చేస్తే రాముడు ఒక దారి నుంచి వచ్చాడు.వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ ఒక ధర్మం చూడండి ఇది ఏ ధర్మం అంటే ఒక యోగి ఎలా ఉండాలో యోగికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, యతి ధర్మాలు ఉన్నాయి, అవన్నీ పాటించాడు రాముడు. సరే ఆవిడ అన్నది "బాగా అలసిపోయి వచ్చావు చాలా దూరం నువ్వు నడిచి వచ్చావు రామా! ఇదిగో ఈ నాలుగు పళ్ళు తిను" అన్నది. సినిమాల్లో చూపించిన ఎంగిలి పళ్ళు అవన్నీ పక్కన పెడదాం, అవన్నీ కళాత్మకంగా కాస్త డ్రమటైజ్ చేస్తారు. మామూలుగా పళ్ళన్నీ కడిగి తీసుకుని వస్తే రాముడు అన్నాడు "అవును ఎందుకు ఇంత కష్టపడ్డావు? ఏదో నేను నా కళ్ళు-- దారిలో నాలుగు పళ్ళు తెంపుకొని తిని వచ్చేవాడిని కదా" అని ఒక చమత్కారంగా అంటే "చేతులు నికిపూని పూలు తెచ్చితిని స్వామి, సతనువగుటను పండ్లు తెచ్చితిని స్వామి. నాకింకా చేతులు ఆడుతున్నాయి, అందుకనే పూలు కోసుకొచ్చా. ఇంకా నేను ఈ శరీరంలో ఉన్నా, కనుక పండిన పళ్ళు నీకు పట్టుకొచ్చా. ఎందుకంటే నువ్వు వస్తావన్నటువంటి ఒక ఊహ చేశాను గనుక ఇవన్నీ చేశాను" అంది. అంటే ఆ ధర్మాన్ని శబరి కాంత ఎంత అద్భుతంగా ఆచరించిందో గమనించిన రాముడు "సరే సరే" అన్నాడు. "ముందు నువ్వు పళ్ళు తిను" అన్నది. "చాలా దూరం నడిచి వచ్చాను స్నానం చేయకుండా తినకూడదు కదా" అన్నాడు. ఆమె ఏమన్నదంటే "నువ్వు రఘువంశంలో పుట్టావు రామా! నువ్వసలు నిత్య స్నాతుడివి. నీకు మళ్ళీ ఈ శరీరము, దీనికో స్నానము అవసరమా? ముందు పండు తిను" అన్నది. అంటే పైకి శబరిగా కనిపించి ఆమె జ్ఞాన శిఖరంలో ఒక స్థాయిలో నిలబడింది. రాముడితో ఇలా మాట్లాడుతున్నది. ఇక నెమ్మదిగా కాస్త చమత్కారంగా మాట్లాడుతూ "అంతా శరీరమంతా ఎండిపోయింది, కనుగుడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి, తలంతా ముగ్గుబుట్ట అయిపోయింది, ఇదంతా ఎండిన చెట్టు చివర ఒక చిన్న పువ్వు పూచినట్టుగా ఉన్నావే శబరి. ఎందుకని ఇది తలంతా ముగ్గుబుట్ట అయిపోయింది అని అంటే "ఎందుకు ముగ్గుబుట్ట అయింది అంటే "రామా! నువ్వొస్తే నీ ముందు రంగవల్లులు తీర్చిదిద్దటానికి ముగ్గుబుట్ట అయింది" అన్నది. ముగ్గుతో మనం బొమ్మలు వేస్తాం, రంగులు-- ముగ్గులు వేస్తాం కదా అని చమత్కరించింది. మూడో చమత్కారం. "రామా! నీతో ఇంత ఏకాంతంగా, ఇంత ప్రాక్సిమిటీతో, ఇంత సాన్నిహిత్యంతో, ఇట్లా one to one అంటామే ఇలా మాట్లాడేటువంటి అవకాశం అయోధ్యలో ఎవరికైనా దక్కుతుందా?" అన్నది ఒక ఆనందంలో. "దక్కదుగా" అన్నాడు. "ఎందుకు దక్కదు?" అన్నది ఎదురు ప్రశ్న. అంటే నువ్వు ఇవ్వవా? వాళ్ళు తీసుకోరా? ఎందుకు దక్కదు అన్నది. "నీవంటి వారు అక్కడ లేరు కదా" అన్నాడు రాముడు. అది ధర్మం. చూశారా? ఆ ధర్మంలో తనను తాను ఒక పవిత్రమైనటువంటి బాల్యాన్ని అనుభవిస్తున్నాడు రాముడు. కాస్త కొంటెగా రాముడు ఏమన్నా-- ఏమన్నాడంటే "నువ్వు నన్ను చాలా అభిమానిస్తున్నావు, నాయందు ప్రేమ ప్రకటిస్తున్నావు శబరి. ఎక్కడ శబరి? రాముడు చిన్నవాడు. శబరి అప్పటికే కనుగుడ్లు గోళాలైపోయినాయి, ముగ్గుబుట్ట అయిపోయింది శరీరం, ఓ క్షణంలో వదిలే సమయం. ఇంత అభిమానిస్తున్నావే ఈ రాముణ్ణి, నువ్వు నిజంగా మా సీతను గనక చూసి ఉంటే, నువ్వసలు నా గురించి ఆలోచించేదానివి కాదు. ఆమె సౌందర్యం ఎంతదో తెలుసా?" అన్నాడు. దానికి ఆమె ఏమన్నదంటే "సీత సీత సౌందర్యము భిన్నంగా కనిపిస్తున్నాయా? నీలో నేను సీతనే చూస్తున్నాను రామా" అంది. అది అద్వైత భావన. అంటే రాముడు తనకున్నటువంటి ఆ భావన శక్తి ఏదైతే ఉన్నదో దానిని శబరితో పంచుకున్నాడాయన. ఇంకా రాముడి మనస్సు సీతా వియోగంలో ఉంది. ఆయన మనస్వి అయినాడు. శ్రీరామచంద్రుడి యొక్క దర్శనానికై ఎదురుచూసి, ఎదురుచూసి, ఎదురుచూసిన శబరి మనస్సుని వదుల్చుకున్నది. నిజానికి మనస్సన్యాసిని ఎవరు అంటే ఆ క్షణంలో శబరి. కాబట్టి మనస్సన్యాసిని అయినటువంటి శబరితో మనస్విగా ఉన్న రాముడు అంటే ఒక మనస్వి, ఒక తపస్విణి ఈ ఇద్దరూ మాట్లాడుకున్న ఈ వైనంలో ఆయన చేసినటువంటి ఆ ధర్మం ఏమిటో తెలుసునా? శబరికి ఉద్ధారణ ఇచ్చాడాయన. అప్పుడన్నది "నిన్ను చూసిన, నిన్ను దర్శించిన, నీతో మాట్లాడిన ఈ దివ్యానుభూతిని దాటి ఈ ప్రపంచం నాకు ఏ ఆనందాన్ని ఇవ్వలేదు రామా! నన్ను నేను-- ఈ శరీరాన్ని నేను వదిలి పెడుతున్నాను" అన్నది. ఆమె కూడా యోగాగ్నిలో దగ్ధమైపోయింది. అంటే శ్రీరామచంద్రుడి యొక్క ధర్మ స్వరూపం పశుపక్షాదుల యెడ, వానరుల యెడ, జటాయువు యెడ ఎట్లా ఎంత ఈ ధర్మాన్ని ప్రకృతి మొత్తం కూడా ఎంత కాపాడుతూ వెళ్తున్నాడో రాముడు చూడండి. సరే మనకు తెలుసు ఉడత కథ. ఇది ఈ కథల్లో చివరి కథ ఉడత కథ. కొద్దికొద్దిగా తన చిట్టి చేతులతో కొన్ని రేణువులు ఇసుక మాత్రమే వేయగలుగుతున్నది. రాముడు అబ్బురపడిపోయినాడు, ఆనందపడిపోయినాడు. సేవకేది పరాకాష్ట. నేనేం చేయగలను, నేనేం చేయలేను, వాళ్ళంటే డబ్బున్నవాళ్ళు, వాళ్ళంటే శక్తి ఉన్నవాళ్ళకి జనబలం ఉంది అని పని చేయని వాడు ఇన్ని చెప్తాడు. పని చేయాలి అనుకున్నవాడు ఆ నాలుగు రేణువులు ఉడత వలె కార్యక్రమంలో పాల్గొంటాడు. ఆ సమయంలో ఆ రాముడి యొక్క హృదయం దయార్ద్రమైంది, కరుణా సాంద్రమైంది. ఎదురు-- ఎదురుగా కనబడుతున్న సముద్రం కంటే దాటి రామ హృదయమే కరుణా సముద్రమైంది ఆ క్షణంలో ఉడతని అరచేతుల్లో తీసుకొనివెన్ను నిమిరాడు. ఆ వెన్ను నిమరటం అంటే దానిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యోగ శక్తులన్నింటినీ జాగృతం చేశాడు. అంటే ఆ జన్మ నుంచి మరొక ఉత్తమమైనటువంటి జన్మ వచ్చేట్టుగా పరబ్రహ్మమూర్తి అయినటువంటి రామచంద్రుడు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు. అవే చారలుగా ఉన్నాయి అని మనం ఇవాళ చెప్పుకుంటాం. అది దా-- ఆ విషయం ఎట్లా ఉన్నా, ఆ రాముడి యొక్క దయ, శ్రీరామ ధర్మం ఎంత ఉదారంగా, ఎంత విస్తృతంగా అందరి యందు ఎట్లా ఉన్నదో చూడండి. అయింది. ఇక కిష్కింధ కాండ లో సుగ్రీవ మైత్రి ఏర్పడినప్పటి నుంచి రాముడి యొక్క హృదయానికి అతి సన్నిహితంగా సంచరించినటువంటి వాడు ఒక్కడే హనుమా. ఆ హనుమ యందు ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మామూలు ప్రేమ కాదు. అది మా రామరావణ సంగ్రామంలో లక్ష్మణుడు మూర్ఛిల్లిన అటువంటి వేళ ఆయన అంటాడు, "నేను భార్యను గనక పోగొట్టుకున్నట్లయితే ఇంకొక భార్య, ఇంకొక స్త్రీ ఆ రూపంలో రావచ్చు. కానీ లక్ష్మణుడు నా తమ్ముడు గనక లేకపోయినట్లయితే నేను ఎట్లా? నా తమ్ముడికి ప్రాణదానం చేసిన నీకు ఏమివ్వగలనని" కోరిలుచుకున్నాడు. అంటే కృతజ్ఞతే రాముడు. కృతజ్ఞత ఒక ధర్మం. మనం, మనం ఈ ప్రపంచంలో ఈ స్థాయికి ఇన్ని మెట్లు ఎక్కి రావటానికి మన ఒక్కరి ప్రజ్ఞ కాదు, అందరూ ఎంతమందో సహాయం చేస్తే, ఎంతమందో మనల్ని ఉత్సాహపరిస్తే, స్ఫూర్తిని కలిగిస్తే, రగిలిస్తే మనం ఇక్కడికి వచ్చాం గనక రామ, రామచంద్రుడు ఆ విషయాన్ని ఏనాడు మర్చిపోలేదు. అంతేకాదు, "ఇంత ఆనందాన్ని కలిగించిన నువ్వు నాకు భరతుడితో సమానుడివి, సమానుడివి" అన్నాడు. భరతుడితో ఎందుకు సమానుడు? లక్ష్మణ సమానుడు అన-- అనొచ్చు కదా అంటే, తన యందు తీవ్రమైనటువంటి భక్తి కలిగిన వాడు ఎవరు అంటే భరతుడు. ఆయన రాజ్యాధికారం రెండు నిమిషాలు రాముడు లేడు, పధ్నాలుగేళ్ళ దాకా రాడు. [బెల్] సింహాసనం మీద కూర్చునే అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయి. కానీ కూర్చోలా. శ్రీరామచంద్రుడి పాదుకలు తీసుకుని నందిగ్రామంలో పెట్టుకుని రాముడు వచ్చేదాకా అక్కడే ఉన్నాడు ఆయన. "ఝంకారమ్మగు సామగారములతో, శైవాలిని గీతికాలంకర్ణమైన మనోజ్ఞ దానములతో, లావణ్య రేఖా నితాంతంబై చను పాదుకా యుగమున్ ప్రొజ్జత్సింహ పీఠంబుపై శంఖాపేతముగా ఉంచి రఘువంశ స్వామిగా చూచుచున్". ఆ రెండు పాదుకలని కూడా శ్రీరామచంద్రుడి యొక్క స్వరూపంగా భావించాడు భరతుడు. తన అన్న వచ్చే వరకు ఆ రాజ్యంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకని అంటే తన అన్న తనకు దైవం. దైవం కూర్చునే చోట దాంట్లోనే కూర్చోటానికి వీలు లేదు. ఆ మర్యాద పురుషోత్తముడు. ఎవరు? భరతుడు కూడా. కనుక భరత స్వామి అని మనం పిలుస్తాం. ఇప్పుడు చెప్పిన ఈ చమత్కారాలు కానీ, ఈ భావశక్తి కానీ, ఈ దర్శనం కానీ మనకి తెలుగువారికి అనుగ్రహించినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గాని, శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో దాగిన అనేకమైన రహస్యాలలో కొన్ని. అంటే రామ ధర్మం, రాముడు కేవలం ధర్మం పాటించాడు. రాజ, రాజధర్మం, కుటుంబ ధర్మం, వ్యక్తి ధర్మం, సమాజ ధర్మం, పౌర ధర్మం, అరణ్య ధర్మం, ఆ జంతువుల పట్ల, పక్షుల పట్ల అన్నిటి పట్ల ఒక ధర్మాన్ని ఎంత పరిపూర్ణంగా, పరిపుష్టంగా ఆచరించాడో చెప్తూ వెళుతూ ఉన్నప్పుడు రామరావణ సంగ్రామం అయిపోయింది. అయిపోయిన తర్వాత రావణుడు వధింపబడ్డాడు. వధింపబడితే రావణుడి మృత శరీరం అక్కడ పడిపోయింది నేల మీద. మండోదరి అంతఃపురం నుంచి విలపిస్తూ వచ్చింది. రావణ వధ చేసినటువంటి రాముడు జగజ్జేతగా నుంచవాలి. కానీ తల వంచుకొని నుంచున్నాడు రాముడు. "తల్లీ! నీకు మహా దుఃఖాన్ని కలిగించాను. నీకు నేను ఏ రకంగా ఉపశమనం చేయగలనో నాకు చెప్పు" అని అడిగాడు. చూడండి, ఆ కరుణ. అప్పుడు మండోదరి, ఆమె మా-- పంచమహాపతివ్రతల్లో ఆమె ఒకతే. సౌందర్యంలో సీతతో సమానమైనది మండోదరి. అప్పుడు ఆమె ఏమన్నదంటే, "నాకు మాంగల్య భిక్ష ఇవ్వు" అని అడిగింది. అయ్యే పనేనా? రావణుడు మరణించాడు. ఇక మాంగల్యం వచ్చే అవకాశం లేదు. కానీ ఏమన్నాడో తెలుసా? "అట్లాగే" అని అన్నాడు. అట్లాగే ఎట్లా అవుతుంది ప్రకృతి విరుద్ధం. "కానీ ఈ రావణుడి యొక్క శరీరం దహింపబడాలి, ఈ రావణ కాష్టం ఆరకుండా చూసుకున్నట్లయితే, నీ మాంగల్యం నిలబడి ఉంటుంది". కనుకనే రావణ కాష్టం లాగా సాగుతున్నాయి పనులు అని మనం అంటాం. అంటే ఏ పనీ కానప్పుడు, ఎన్నేళ్ళైనా తెవననప్పుడు, "అదే అదో రావణ కాష్టం లేండి" అంటాం. అంటే ఏమిటో తెగలేదు ఆ పని. రావణ కాష్టం ఆరలేదు, ఆవిడ మంగళసూత్రం తురిగిపోలేదు. ఆ రాముడు ఎంత ఉదాత్తమైనటువంటి, ఎంత సునిశ్చితంగా, ఎందుకని ఆయన విజేత అయిపోయినాడు అప్పటికే. చాలా మహోత్సాహంలో ఉండాలి, లేడు ఆయన. తాను చేసిన పని ఇంకొకరికి దుఃఖం కలిగించినప్పుడు రాముడు ఆ పని చెయ్యలేడు. అది శ్రీరాముడి యొక్క ధర్మం నిరతి. అలాగే విభీషణుడు ఆ, అయిపోయింది. విభీషణుడు వచ్చాడు. హనుమంతుడు పక్కనున్నాడు. సైన్యం అంతా ఇంకా మిగిలిన సైన్యం ఉంది. లక్ష్మణస్వామి, "అన్నా! అయోధ్యా నగరం కంటే లంకా నగరం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వేదం వినపడింది. షష్టిర్యోజన విస్తీర్ణం శతయోజన సమున్నతం అష్టద్వారపురీ లంకాం సప్తప్రాకార శోభితం త్రికోణ కందకం చైవ నవకోటి శివాలయం".చాతుర్వర్ణ్యంచ లక్షాణాం రావణేన సురక్షితం అని పద్-- ఉంది కదా! నాలుగు వైపులా మాడవీధులున్నాయి, మూడు వైపులా ఖండకాలున్నాయి, ఆరు యోజనాలు విస్తీర్ణంగా ఉంది. దీంట్లో తొమ్మిది శివాలయాలున్నాయి. ఆ శివాలయాలలో ఏక నిత్యార్చన చేశాడు. ఎవరు? రావణబ్రహ్మ. తర్వాత ఈ లంక అంతా కూడా బంగారుమయంగా ఉన్నది. బంగారంతో చేశాడు ఆ లంకని. దీన్ని మనం కైవసం చేసుకుందాం. రావణ వధ అయిపోయింది. నువ్వే రాజువి." "సరే" అనమన్నాడు లక్ష్మణస్వామి. అప్పుడు రామ-- రాముడన్నాడు, "అపి స్వర్ణమయీ లంకా, ఇది లంక స్వర్ణమయం కావచ్చు కాక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి. తల్లి, మనం పుట్టిన ప్రదేశము ఏదైతే ఉన్నాయో, జన్మభూమి ఏదైతే ఉందో అది స్వర్గం కంటే గొప్పది. ఇక మిగతాది ఏదైనా మనది కాదు. మిగతా వాళ్ళంతా తల్లిలాంటి వారే గానీ తల్లి కారు. తల్లి ఒక్కతే ఉంటుంది. మిగతా వాళ్ళంతా మాతృ సమానులై ఉంటారు. మాతృమూర్తి మాత్రం ఒక్కతే ఉంటుంది. అట్లాగే మన రాజ్యం వెలుకోవటానికి మనకున్నది. ఇది విభీషణుడికి పట్టాభిషేకం చేసి వెళ్దాం. అది ఆ సంతతికి చెందింది" అన్నాడు రాముడు. ఎంత పరిణితి చూడండి! అయిపోయింది. సరే అందరూ బయలుదేరి వస్తున్నారు. అమ్మవారు అనేక మొక్కులు మొక్కుకుంది దారి నిండా. ఏది? సీతమ్మవారు. నే-- నేను ఒక మొక్కు తీర్చుకోవాలి భరద్వాజ ఆశ్రమానికి ఈ పుష్పక విమానాన్ని దింపమన్నది. అక్కడ భరతుడు రాముడితో మాటన్నాడు, "నువ్వు ఎప్పుడొస్తావో చెప్పు. ఆ క్షణం గనక ఒక్క క్షణం దాటితే నేను అగ్ని ప్రవేశం చేస్తా." కాబట్టి అక్కడ భరతుడు ఎదురుచూస్తున్నాడు. ఈమేమో విమానం దింపమంటుంది, మొక్కు తీర్చుకోవాలంటున్నది. అప్పుడు శ్రీరాముడు ఏం చేశాడంటే హనుమంతుణ్ణి మళ్ళీ పిలిచాడు. "నువ్వు వాయువేగంతో వెళ్ళి," వెళ్లగలిగిన వాడు ఆయన ఒక్కడే. "నువ్వు వెళ్ళి భరతుడికి చెప్పు నేను వస్తున్నాను అని, భరద్వాజ ఆశ్రమం దాకా వచ్చామని, ఏమీ తొందర పడక్కర్లేదని, కాస్త అటూ ఇటూగా మేము చేరుకుంటున్నామని చెప్పు" అన్నాడు. నన్ను ఆయన గుర్తుపట్టాలి కదా అని అడగలా. వెళ్ళిపోయినాడు అంతే. రాముడు చెప్పటమంటే ఆజ్ఞ పాలించటమే. అంతే ఆయన్ని రాముడే చూసుకుంటాడు. ఆయన వెళ్ళాడు. వెళ్ళేప్పటికీ ఈ-- భరతుడు హనుమంతుణ్ణి చూసి మారువేషంలో వచ్చిన రాక్షసుడు అనుకున్నాడు. అయితే సీతారామ వర్ణన, ఒక తల్లిని, ఒక తండ్రిని చేసినట్లుగా హనుమంతుడు చేసి సామగానంలో ఆయన అద్భుతమైనటువంటి గాయకుడు హనుమ. హనుమదుపాసన గనక చేస్తే చక్కటి సంగీత జ్ఞానం వస్తుంది. ఆయన చేశాడు. అందుకనే త్యాగరాజస్వామి వారు కూడా హనుమదాది అంటాడు. శివరామ హనుమదాదులని గనక మనం ఉపాసించినట్లయితే ఈ సంగీతం అంతా పట్టుబడుతుంది అని. సరే. వచ్చి చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, యుద్ధం అంతా వర్ణించాడు. మరి బయలుదేరి వస్తుంటే మేరుదను గారే మరి విమానం కిందకి దింపింది. ఆయనే కాదు సుగ్రాముడు, వీళ్ళందరూ కలిసి వస్తున్నాం, అందరూ బయలుదేరి వస్తున్నారు. కంగారు పడొద్దని చెప్పాడు. ఆ వచనాలు, ఆ మాటలు, మధురోక్తులు విన్న భరతుడు చాలా ఆనందపడిపోయినాడు. చాలా చాలా ఆనందపడి అక్కడే ఉండటం, ఆ ఉన్న తర్వాత శ్రీరాముడు అక్కడికి రావటం, రాముడు రాగానే రథం ఎక్కటం, ఇద్దరూ కలిసి వెళుతూ ఉండటం, వెళుతూ ఉన్నప్పుడు పుర ప్రజలందరూ కూడా రాముణ్ణి చూసి పధ్నాలుగు ఏళ్ళు అయిపోయింది. పధ్నాలుగు ఏళ్ళలో ఈ భరతుడు, రాముడు వాళ్ళ శరీరం యొక్క రంగు ఒకటే. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు గౌరవర్ణంతో ఉంటారు, తెల్లగా ఉంటారు. వీళ్ళు నీలివర్ణంలో ఉంటారు. ఇద్దరూ కూడా ఒకే హైట్ అనుకోండి, ఒకే రకంగా ఉంటారు, రూప లావణ్యాలు రెండూ కూడా. భరతుడి మెళ్ళో దండలు పడిపోతున్నాయి. రాముడి మెళ్ళో ఒక్క దండ పడలేదు. వస్తున్నారు. భరతుడు సిగ్గుతో తల వంచుకుంటున్నాడు. "అవన్నీ రాముడికి చెందినవి. రాముడు రాముడను" అని దండ వేస్తున్నారు. అప్పుడు "అన్నగారు ఏమిటిది నాకీ శాపం, నాకెందుకు ఈ దౌర్భాగ్యం? ఈ దండలన్నీ నీకు పడాలి కదా" అంటే, "భరతా, పధ్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం లో నా మనసంతా, నా ఆలోచనలంతా అధర్మాన్ని అణచటంతో మునిగిపోయింది. ధర్మాన్ని నిలబెట్టడంలో నిలకడ చెందింది. చివర సీతాన్వేషణలో, సీతా వియోగంలో నేను ఉండవలసిన రీతి నేను ఉండలే. ఆ దుఃఖంలో నేనున్నా. కానీ నువ్వు పధ్నాలుగు సంవత్సరాలు నిరంతరము కూడా నీ అన్న రా-- అంటే రామనామస్మరణం చేసి భ్రమర కీటక న్యాయంలో ఒక పురుగు ఎట్లా తుమ్మెద అయిపోతుందో, రామనామము, రామ భావము, రామతత్త్వము అన్నీ కూడా నువ్వు పధ్నాలుగు ఏళ్ళు అనుభవించావు. నువ్వు రాముడివైనావు భరతా! నీకు ఆ దండలో కచ్చితంగా నీ మెళ్ళోనే పడాలి" అన్నాడు. ఇది ఎంత ఉదాత్తతతో చూడండి. "ఏంటి నన్నెవరూ గుర్తించరేమిటి? నువ్వు ఇంకో రథంలో రా, అందువల్ల వాళ్ళు గుర్తించలేకపోతున్నారు" అనలా. యు డిజర్వ్. నీకే అర్హత ఉన్నది. ఇది శ్రీరాముడి యొక్క ధర్మ నిరతి. అయిపోయింది. పట్టాభిషేకం మొత్తం అంతఃపురం అంతా కూడా చక్కగా చక్కగా అలంకారం చేశారు. పుర ప్రముఖులు, వానర సమూహం, సామంతరాజులు, అంతఃపుర కాంతలు శాలంకృతుడైన రామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉన్నారు. అందరి చూపులు బారులు కట్టి శ్రీరాముడి వైపే ఉన్నాయి. శ్రీరాముడు, ఆయన రెండు కళ్ళు వెతుకుతున్నాయి. సభంతా వెతుకుతున్నది. అంతఃపురం అంతా తిరుగుతున్నది. ఏంటి ఈ సభలో, ఏంటి రాముడు ఎవరి గురించి వెతుకుతున్నాడో ఎవరికీ అర్థం కాలా.పక్కన సింహాసనం నుంచి లేచి మెట్లు దిగి వడివడిగా రెండు సింహాసనాల మధ్య వెనకగా కూర్చొని పద్మాసనంలో కూర్చున్నటువంటి హనుమంతుని చూశాడు. చూసి తట్టాడు. "హనుమా" అన్నాడు. పులుకు పలుకు లేదు, రెండూ లేవు. "హనుమా! నేను, నేను రామచంద్రుడిని వచ్చాను" అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు "ఏం చేయను నేను? నువ్వు వచ్చావని తెలుస్తున్నది. కానీ నా కళ్ళ నిండా ఆనందభాష్పాలు నిండిపోయినాయి. కనురెప్ప ఎత్తలేక బరువు ఎక్కిపోయినాయి. కన్నీరు, ఈ ఆనందం తప్పించిన రామా! ఈ కన్నీరు తప్పించవయ్యా. అప్పుడు నేను కన్ను తెరవగలను" అన్నాడు. అంటే కన్నుమూయుట కన్నువిప్పుట నీవు లేక కలుగకెట్లు? ఈశ్వరుడు లేకపోతే కనురెప్ప ఎత్తను లేము, దింపను లేము. అటువంటి ధర్మ స్వరూపుడైన హనుమని చెట్టుకేనో వేరు ఇచ్చి పక్కన పెట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళాడు రాముడు. ఇది రామధర్మంలో ఒక పరాకాష్ట. వెళ్ళి సభంతా చూశాడు. చెట్టుకేన వేలు వదిలిపెట్టలా. "కృతం హనుమతా కార్య సమవిద్ధుః దుష్కరం మనసాపి యద్ అన్యేన న శక్యం ధరణీతలే" అన్నాడు. ఇది వాల్మీకి రాసిన శ్లోకం. ఈ ప్రపంచంలో హనుమ నామంతో కొన్ని వేల మంది ఉండవచ్చు గాక, హనుమంతుడిలాగా సేవ చేద్దామని అనుకునేవారు ఉండవచ్చు గాక, కానీ హనుమా చేసినంత సేవ చేయగలిగిన వాడు ఈ ప్రపంచంలో ధరణీ మండలంలో ఏ ఒక్కడూ లేడు. ఈతడు హనుమా అని ప్రపంచానికి స్వామి పరిచయం చేశాడు. మహాసంగ్రామం జరిగింది. ఒక హనుమేనా? ఎంతోమంది వానరసేన వెళ్ళింది. సుగ్రీవుడున్నాడు, అంగదుడున్నాడు, జాంబవంతుడున్నాడు. వీళ్ళంతా ఉన్నారు కదా! కానీ ఒక హనుమని కృతజ్ఞతాపూర్వకంగా సభా పరిచయం చేసి ఆ పరిపూర్ణమైనటువంటి ఒక పరిపక్వమైనటువంటి మనోస్థితిలో శ్రీరామచంద్రుడు హనుమని ప్రపంచానికి చక్కగా పరిచయం చేసిన, అది ఒక ధర్మం. ఆ ధర్మం ఏంటంటే మనకి ఎవరు సేవ చేశారో, మనల్ని ఎవరు ఆదుకున్నారో, ఎవరు మన ఆకలి చూసి ఒక ముద్ద అన్నం పెట్టారో, మనకి ఏ కష్టం కలగకుండా చూడాలని ఎవరు సంభావన చేశారో వారి పట్ల మనము నిత్యమూ కృతజ్ఞులమై ఉండాలి. వాళ్ళని ఏనాడూ విస్మరించకూడదు. అది గురువు కావచ్చు, స్వామి కావచ్చు, శిష్యుడు కావచ్చు, భక్తుడు కావచ్చు ఎవరైనా సరే మన ఉపాధిని, మన శరీరాన్ని, మన మనస్సుని, మనకు రాబోయేటువంటి కష్ట కాలాన్ని వీటన్నింటినీ గమనించి మన క్షేమాన్ని, మన యోగాన్ని ఎవరైతే నిరంతరమూ ఆలోచిస్తూ వారి వారికి ఎన్ని ఇబ్బందులున్నా పక్కనబెట్టి, అవతల వ్యక్తి యొక్క ఇబ్బందిని గమనించి ఎవరైతే రక్షించే ప్రయత్నం చేస్తారో వారిని మనం అన్నివేళలా గమనించి ఉండాలి. గమనించి ఉండటమే కాదు, ఆ ప్రేమను ప్రకటించాలి. రామచంద్రుడు చేసిన పని అదే. అంత మహా వైభవంలో శ్రీరామ పట్టాభిషేకంలో హనుమని గుర్తుపెట్టుకుంటాడా అంటే ఈనాటి రాజులు తమకు ఎవరు సేవ చేశారో వాళ్ళని ముందు మర్చిపోతారు. అక్కడ రామచంద్రుడి యొక్క ఉదాత్తమైన ఆ ధర్మ వైఖరి, ఆ సత్య ధర్మ పరాక్రమం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఆయన ఏ వధ చేసినా చాలా యాతన పడ్డాడు. చాలా బాధపడ్డాడు. కానీ అధర్మాన్ని అణచాలి. అది ఆయన వచ్చిన అవతార కార్యక్రమమే అది. కాబట్టి ఇవన్నీ కూడా శ్రీరాముడి కథని మనం కాసేపు మాట్లాడుకొని, ఏదో రామాయణ పారాయణం చెయ్, సుందర కాండ పారాయణ పారాయణ చేయటం మంచిదే, కానీ ఆ రాముడి వలె మనం జీవించగలగాలి. ఆ రాముడు ఎట్లా ఉన్నాడో మనం అట్లా ఉండాలి. ఆ రాముడు ఎన్ని కష్టాలు, ఎవరైనా పధ్నాలుగు ఏళ్ళు, విశ్వనాథ్ వారు ఒక మాట చమత్కారంగా చెప్తారు. ఆ అరణ్యానికి బయలుదేరినప్పుడు ఆయన చెప్పులు వేసుకునే బయలుదేరాడు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత భరతుడు వచ్చి ఆ రెండు పట్టుకుపోయినాడు. అవి లేకుండా మిగతా కాలమంతా ఆయన గడిపాడు. దారిలో పడినటువంటి ముళ్ళన్నీ కూడా రాత్రిపూట ఆ పాదాల్లో నుంచి తీసి పక్కన పెట్టింది ఎవరంటే సీతమ్మవారు. పతిసేవ అలా చేసిందామె. అసలు ఎటు చూసినా, ఏ వంక చూసినా ధర్మమే అనేకమైన పాత్రల్లో మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి రామాయణం మనకు ఏం చెప్తుంది? శ్రీరామనవమి నాడు మనం ఏం చేయాలి అంటే ధర్మ స్వరూపులుగా మనం జీవితాన్ని జీవించాలి. ధర్మమే మనకు ఆయువుపట్టు. ధర్మమే మన జీవితం. మనం ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా అధర్మ ప్రవర్తన చేసిన మనల్ని ఎవ్వరూ కూడా అంగీకరించరు. ధర్మ ప్రవర్తనతో మనం కాలం ముగిసిపోయినా మనల్ని ఈ ప్రపంచం మర్చిపోదు. కాబట్టి నాటి ఆ సాకేత రాముడి యొక్క రామాయణ గాథ అతి పవిత్రమైనటువంటి, అందుకనే రాముడు మొట్ట-- వాల్మీకి రామాయణ కథా ప్రారంభంలోనే మొట్టమొదట ఒక శ్లోకం చెప్తాడు. "అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబుహు సన్మనుష్య మనోయథా" అంటాడు. భరద్వాజ మహర్షి, ఆయన వాల్మీకి వెళ్తున్నారట. ఎక్కడన్నా మంచి అనువైన ప్రదేశం ఉంటే రామాయణం రాసుకోవాలి అని. ఆ అనువైన ప్రదేశం ఏంటంటే ప్రసన్నత ఉండాలి, హాయిగా ఉండాలి. అనేక తటాకాల, ఆ రోజుల్లో అరణ్యాల నిండా చెరువులే కదా! ఒక తటాకం దగ్గరకు వచ్చి భరద్వాజ మహర్షిని పిలిచాడాయన. అకర్దమమిద, కర్దమం అంటే బురద. "అకర్దమమిదం తీర్థం భరద్వాజ" బురద లేదయ్యా చూశావా? "నిశామయ రమణీయం" ఎంత రమణీయంగా ఉన్నదో. "ప్రసన్నాంబుహు" అలలు అలజడులు లేని, కల్లోలం లేని ఒక ప్రశాంతమైన ఈ తటాకం ఎలా ఉన్నది అంటే...సత్పురుషుడు యొక్క మనస్సు లాగా ఈ చెరువు ఉన్నది, తటాకం ఉన్నది. అంటే రామాయణ కథలో సత్పురుషులందరూ మనకు అలా కనిపిస్తారు. చూడండి విభీషణుడు రాజ్యం పోగొట్టుకున్నాడు, రాజ్యం తెచ్చుకున్నాడు. సుగ్రీవుడు రాజ్యం పోగొట్టుకున్నాడు, రాజ్యం తెచ్చుకున్నాడు. శ్రీరామచంద్రుడు రాజ్యం పోగొట్టుకున్నాడు, మళ్ళీ రాజైనడు. భరత స్వామి రాజు కాగలిగిన అన్ని అవకాశాలు ఉన్నా దానిని దూరం చేసుకున్నాడు, కానీ రాజుకు తమ్ముడిగా జీవించగలిగాడు. జీవితాన్ని కూడా మనం అనేక పారిశ్రాలో, అనేక కోణాల్లో ఆవిష్కరించుకోవాలి. శబరి యందు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక శబరి లాంటి వ్యక్తితో మనం ఎలా ఉండాలి? గుహుడి వంటి వాడితో ఎలా ఉండాలి? మన తండ్రి స్నేహితులతో మనం ఎలా మెలగాలి? తండ్రి పోగానే తండ్రి స్నేహితులందరినీ వదిలిపెట్టేస్తుంది ఈ ప్రపంచం. ఆ పని చేయకూడదు. కాబట్టి నిరంతరమైనటువంటి ఈ ధర్మాన్ని అనేక రకాలుగా ఆవిష్కరించినటువంటి శ్రీమద్రామాయణాన్ని మనం స్థాలీపులాకంగా చెప్పాలంటే గనక కొన్ని రోజులు, నలభై రోజులు పడుతుంది. అక్కర్లా. రాముడు ధర్మాన్ని ఎలా ఆచరించాడో చెప్పుకుంటూ గనక వెళ్లినట్లయితే మనకి అది తెలుస్తుంది. ఇవాళ మనందరం ప్రధానంగా సత్య సాయి భక్తులం గనుక నాటి సాకేత రాముడు, ఇవాళ సాయి రాముడు. ఈ రెండూ ఒకటి సమన్వయం చేసుకున్నట్లయితే స్వామి కూడా వైదిక ధర్మానికి పెద్ద పీట వేశారు. యజ్ఞయాగాదులు చేశారు, విద్వన్ మహాసభలు పెట్టారు, వేద పురుష సప్తాహాలు చేశారు, అనేకమైనటువంటి ప్రవచనాలు చేయించారు, తాను స్వయంగా చేశారు, తాను స్వయంగా రాశారు, వాహనులన్నీ రాశారు. ఇవన్నీ ఏమిటి? ధర్మ సంస్థాపనలో మానవుణ్ణి ఒక ధర్మ మార్గంలో నడిపించటానికి వారు వేసినటువంటి బాటలు. వాటన్నింటినీ కూడా మనం రామాయణంతో సమన్వయం చేసుకుంటూ వెళ్లినట్లయితే త్రేతాయుగంలో జరిగినటువంటి ఒక ధర్మ కార్యక్రమం ఏదైతే ఉన్నదో కలియుగంలో సత్య సాయి భగవానుడు దాన్ని demonstrate చేసి మనందరినీ దగ్గరకు తీసుకున్నారు. మనందరినీ ఆయన సైన్యంలో భాగం చేశారు. సైన్యము అంటే మనందరం కూడా ఆయన ఆదర్శపూరితమైన, అసయాత్మకమైనటువంటి భావనలో మనకో భాగస్వామ్యాన్ని ఇచ్చారు. ఇదిగో ఇట్లా ఇట్లా ఇన్ని మంచి పనులు ఇలా ఇలా చేయవచ్చును. రాముడు చెప్పినట్టే సాయి రాముడు కూడా అదే చెప్పారు. ఇదిగో ఇవన్నీ నేను కొద్దికొద్దిగా మీకందరికీ సూచిగా చేసి చూపిస్తున్నాను. ఈ మార్గం అల్లుకుంటూ మీ జీవితాన్ని మీరు గడుపుతూ వెళ్ళండి అని చెప్పినటువంటి స్వామిని మనసా, వచసా, శిరసా, హృదయం నిండా నింపుకుంటూ, తలచుకుంటూ, ఏ ఆ-ఏ రామాయణము ఆదికావ్యమై, ఏ పరాస్వరూపుడైనటువంటి ఒక పరబ్రహ్మమూర్తి శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడై ఈ జగత్తులోకి వచ్చి మన వలె సామాన్యమైనటువంటి ఒక మానవుడి వలె అనివార్యమైన అనేక దుఃఖాలనన్నింటినీ కూడా అనుభవించి, జీవితం విసిరిన ప్రతి సవాలులను నెగ్గుకుంటూ తన పయనమంతా ఆఘాతం, అనేకమైనటువంటి ఆ anticipate చేయని అనూహ్యమైనటువంటి పరిణామాల అన్నింటి మధ్య తాను సానంద రాముడై మనకి జగదానంద కారకుడై, జగత్పురుషుడై, మర్యాద పురుషోత్తముడై మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఈ వేళ ఆయనకు శక్తి స్వరూపంగా ఉన్నటువంటి మన తల్లి సీతమ్మకి సేవలో ఇటువంటి హనుమ మరొకడు ఉండడు అని అనిపించుకున్న హనుమ మనకు సేవాభాగ్యంలో మనకి ఆదర్శ పురుషుడై, మూర్తియై, అలాగే భక్తి యందు భరతుడై, శ్రద్ధ యందు లక్ష్మణస్వామియై, మరి రామలక్ష్మణులిద్దరూ అడవిలో ఉంటే, భరతుడు నందిగ్రామంలో ఉంటే మరి శత్రుఘ్నుడు ఏం చేశాడు అని. సమస్తమైనటువంటి అయోధ్యా నగర ప్రజలని రాముడు ఉంటే ఏం చేస్తాడో, లక్ష్మణుడు ఉంటే ఎట్లా కాపాడుతాడో, భరతుడు ఉంటే ఏ రకంగా లాలిస్తాడో ఆ ముగ్గురి యొక్క శక్తిని తన యందు నింపుకొని శత్రువులే లేకుండా ఆ రాజ్యం మీదికి మరొకడు కన్నెత్తి చూడకుండా, రాజ్య సంరక్షణ భారాన్ని, అంతఃపుర మర్యాదని, పుర ప్రజల యొక్క సౌఖ్యాన్ని, క్షేమాన్ని అన్నింటినీ కూడా చాలా silent గా, నిశ్శబ్దంగా, నిరపేక్షంగా, ఏ రకమైన లాలస లేకుండా తన కర్తవ్యాన్ని తాను నిర్ణయించాడు. అందుకనే శ్రీరామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇవాళ మన ఇళ్లల్లో అన్నదమ్ములంగా గనక ఉంటే పాడుబడ్డ ఇళ్ల కోసం, పనికిమారని భూమి కోసం, ఏనాటికీ అక్కరరాని డబ్బు కోసం బాంధవ్యాలను తెంచుకోకూడదని, ఎవరి ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేయాలని, ధర్మాన్ని గనక ఆచరిస్తూ వెళ్లినట్లయితే మళ్ళీ ఆ నలుగురు అన్నదమ్ములు ఒక్కచోట చేరి శ్రీరాముడి యొక్క అవతార పరిసమాప్తి వరకు ఎంత అద్భుతంగా రామ-రామరాజ్య పాలన సాగిందో అటువంటి ఆ రామరాజ్య పాలన సాగేట్లుగా మనం రాజ్యాలు పాలించలేం. మనం రాజులం కాదు. కానీ మన కుటుంబం ఒక రాజ్యం. ఆ రాజ్యంలో మన భార్య, మన తల్లి, మన తండ్రి, మన అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, మన స్నేహితులు, మన బంధువులు, వీళ్ళ ఎవరినీ వదిలిపెట్టమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. అది సన్యాసం కాదు, అది పారిపోవటం. వీళ్ళ అందరి మధ్య ఉంటూ తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూ, చేయగలిగినంత సహాయం చేస్తూ, అవతల వాడి కష్టాన్ని మన కష్టంగా భావిస్తూ ఒక ఉదాత్తమైనటువంటి వైఖరిలో గనక జీవించినట్లయితే ఆనాడు మనకి మనం రాముడికి వారసులం అవుతాం.ఇవాళ రాముడికి, రాముడిని పూజించండి అని మనకు ఎవరు చెప్పనవసరం లేదు. నవనాడులలో రెండు లక్షల డెబ్బై రెండు వేల యోగనాడులలో శ్రీరామనామం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఈ దేశాన్ని ప్రేమించమని మరొకరు మనకు చెప్పనక్కర్లేదు. మనం ఈ దేశంలో పుట్టాం, ఇక్కడే పోతాం. కాబట్టి, ఈ తల్లి, ఈ నేల నడవటానికి అవకాశం ఇచ్చింది. కప్పు ఆకాశాన్ని ఇచ్చింది. పంచభూతాత్మకమైన ప్రపంచం ఈ శరీరాన్ని కాపాడుతున్నది. మహర్షుల వాక్యాలన్నీ జ్ఞాన వరదానం చేసినయి. రామాయణ, భారత, భాగవత, భగవద్గీత, యోగవాసిష్టాలు అన్నీ కూడా మానవుడు సర్వోన్నతమైన మానవీయ స్థితిలో ఎలా సంచారం చేయాలో. మానవుడు దేవుడు కావటం లేదు, కానక్కర్లేదు. దేవుడు ఒక్కడు చాలు. మానవుడు మానవుడిగా జీవించగలిగితే అది అధ్యాత్మ అన్నటువంటి సత్యసాయి భగవానుడి యొక్క దివ్య వాక్కును మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ, వైషమ్యాలు లేని, వైక్లభ్యాలు లేని, ఏ రకమైన భయాలు లేని, చూడండి అయోధ్యా నగరం అంతా భయరహితంగా ఉన్నది. నిజానికి రామరాజ్యం అంటే ఏమిటో తెలుసునా? రామరాజ్యం అంటే పట్టాభిషిక్తుడైన రాముడు ఏలిన రాజ్యం కాదు. ఏ పధ్నాలుగు ఏళ్ళు ఆయన ఒక్కమాట చెప్పి వెళ్ళాడు."నేను ఉన్నాను అనుకొని మీరు జీవించండి." అని చెప్పాడే. రాముడు అరణ్యవాస కాలంలో ఆ అయోధ్యా నగర ప్రజలంతా పధ్నాలుగు సంవత్సరాలు రాముడు ఉన్నాడు అనుకొని జీవించారు. ధర్మం తప్పలేదు, క్రమం తప్పలేదు, సాంఘిక మర్యాదలు దాటలేదు. ఏం చేశారు? ఒక మగబిడ్డ గనుక పుడితే 'రామ' అని పేరు పెట్టుకున్నారు. ఆడపిల్ల ఇంట పుడితే 'రామా' అని పెట్టుకున్నారు. సంస్కృతంలో రామ అంటే పురుష శబ్దం. దీర్ఘం రామా, మా కి దీర్ఘం ఇస్తే అది స్త్రీలింగం, స్త్రీ శబ్దం. కాబట్టి మగపిల్లలు రామ, ఆడపిల్లలు రామా. కాబట్టి వాళ్ళని పిలవాలి అంటే రామా, రామా, రామా అంటూ అయోధ్యా నగర ప్రజలందరూ ధర్మాన్ని ఆ-ఆశ్రయించి వాళ్ళ జీవితాలు గడిపిన ఆ పధ్నాలుగు సంవత్సరాలే నిజానికి రామరాజ్యం. తర్వాత అది రఘురాముడు ఏలిన రాజ్యం, అది వేరే. అది మామూలు ఒక రాజు ఏర్-రా-చేసింది. ఇక్కడ ప్రజలు ఆ రాజ్యాన్ని రామరాజ్యంగా చేశాడు. మా రాముడు ఇక్కడే ఉన్నాడు. అరణ్యంలో ఉంటే ఉండొచ్చు గాక కానీ ఇక్కడ అంతఃపురంలో ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, మాలో ఉన్నాడు, మా పిల్లల్లో ఉన్నారు, మా కడుపులో గర్భంలో ఉన్న పిండంలో ఉన్నారని అండ, పిండ, బ్రహ్మాండం అంతా కూడా రామమయం చేసినటువంటి అటువంటి రామరాజ్యాన్ని మనం స్థాపించుకోవాలి. వసుధైక కుటుంబ నిర్మాణం ఎంత ప్రధానమో, ఇవాళ రామరాజ్యం అంటే మనం ఇవాళ మన ఇంట్లో మనకొక అన్నో, ఒక తమ్ముడో, ఒక చెల్లెలో, ఒక అక్కో, ఒక స్నేహితుడో మనం అనుకునే వీళ్ళు అందరూ గనక ఉన్నట్లయితే వాళ్ళ అందరి యందు ప్రేమ. శ్రీరామచంద్రుడు ధర్మం ఎలా పాలించేవాడు అంటే, దశరథుడు దగ్గరకు వెళ్ళేటప్పుడు వాకిలి దగ్గర కాపలాదారుడు ఉంటాడు. ఆ కాపలాదారుడు రాముడి కంటే చాలా పెద్దవాడు. కానీ, రా-రాజ ధర్మం, ఉద్యోగ ధర్మం ప్రకారం రాముడు వస్తుంటే చేతులు, కాళ్ళు వణుకుతూ లేచి నుంచునే ప్రయత్నం చేస్తే రాముడు చిరునవ్వు నవ్వి దగ్గరకు వచ్చి "తాత" అని సంబోధించాడు. తన దగ్గర పనిచేసిన వాళ్ళు, పెద్దవాళ్ళందరినీ తాత అంటే, యా-- దాని-ఆ దాని వెనక దాగినటువంటి ఆత్మీయత, దాని వెనక ఉన్న మానవీయ భావన. "నీవు నుంచోవటం ఏంటి? నువ్వు కూర్చో. నువ్వు నుంచోలేవు, చాలా ఏళ్ళు నుంచోనే ఉన్నావ్. నేను నడిచి వెళ్ళగలను." అని వెళ్ళాడు. ఇవాళ మనం అహాన్ని వదిలిపెట్టాలి, ఇహంలో బతకాలి. ఇహంలో సంపూర్ణంగా బతకాలి, నిరహంకారమైన, నిరపేక్షమైనటువంటి జీవితంలోకి వెళ్ళాలి. దానికే రామాయణ స్ఫూర్తిలో నుంచి వచ్చింది Love all, serve all అంతే. ఈ రెండింటిని సమన్వయం చేసుకోగలిగినట్లయితే, ఇవాళ మనం స్వామికి ఒక అవతారమూర్తికి సమకాలీనుడిగా బతికాం మనం. ఒక రోజా? రెండు రోజులా? యాభై నాలుగేళ్ళు సుమారుగా నా పరంగా. మిగతా వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారో, తక్కువ ఉన్నారో అది పక్కన. ఏళ్ళు లెక్క కాదు, ఎలా ఉన్నాం అన్నది ప్రశ్న. ఎన్నేళ్ళు ఇక్కడ బతికాం అని కాదు, బతికినన్నాళ్ళు ఎట్లా జీవించాం అనే ప్రశ్న. కాబట్టి రామాయణ కథలో ఆ రాముడు ఎవరో కాదు. మనం-మనం మనిషిలో నుంచి దేవుణ్ణి చేయవలసిన పని లేదు. ఎందుకంటే "దేవుడే నేను, ఒట్టి మనిషినేని." అని చెప్పుకున్నాడు ఆయన. రామాయణం అంతా అదే ఉంది. స్వామిని మనమందరము దేవుడన్నాం, స్వామి ఎప్పుడన్నా నేనే దేవుణ్ణని చెప్పారా? అదే గనక అయితే రామభజన ఉండేది కాదు. సూర్యుడి గురించి పాటలుండేవి కాదు. అమ్మవారికి భజనలుండేవి కాదు. ఆయన ఏనాడూ నేను దేవుణ్ణని చెప్పలేదు. మీలో ఉన్న దివ్యాత్మను మీరు గ్రహించండి, మీరు దేవుళ్ళే గ్రహించగలిగితే, అది class. కానీ మనకి ఆ శక్తి కావాలి. దానికై మంచి విషయాలు వినాలి, విశ్లేషణాత్మకంగా మాట్లాడుకోవాలి, ప్రతి పర్వదినాన్ని సమన్వయం చేసుకోవాలి. ఇవాళ కొక్కట్ పల్లి సమితి. అందరి పేర్లు నాకు తెలుసు. పేర్లు చెప్పక్కర్లేదు. సమితిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంత నిష్టగా పన్నెండు నెలలు, ఒక సంవత్సర కాలం కొక్కట్ పల్లి పర్యంతము అంటే ఒకచోట కూర్చొని ఏదో ప్రవచనం, చిన్న ఉపన్యాసం వింట-వెళ్ళటం కాదు. విశ్లేషణాత్మకమైనటువంటి రీతిలో సాగించి, ఏ అనుభవం లేని పిల్లలు ఆ రోజుల్లో, అంటే రెండేళ్ళ క్రితం, ఇవన్నీ నేర్చుకొని, ఈ technology ని కొన్ని క్షణాలలో అలవోకగా నేర్చుకొని, వాటిని YouTube ల్లో పెట్టి, ఇది ఎవరి ప్రచారం కోసం కాదు. మనందరం మన ఆలోచనలు పంచుకోవాలి. ఎవరికి కావాలి ఆ కీర్తి? పొరపాటు చేస్తే వచ్చేది అపకీర్తే తప్ప కీర్తి కాదే. కాబట్టి పరమేశ్వరుడిని గురించినటువంటి మాటలు, పరమేశ్వర భావనకు దగ్గరగా అయ్యేటువంటి మాటలని కొక్కట్ పల్లి సమితి ముఖ్యంగా యువకులందరూ కూడా చేసిన ఆ తీరు, వాళ్ళందరినీ శర్మగారు లాంటి పెద్దవాళ్ళందరూ వాళ్ళను నడిపించిన విధానం నాకు ఎప్పటికీ ఒక చిరస్మరణీయమైనటువంటి ఒక భావన.అందుకే మళ్ళీ ఈవేళ శ్రీరామనవమి నాడు శ్రీరాముణ్ణి సత్య సాయి రాముని హాయిగా మనందరినీ కలుసుకొని ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం కాసేపు మాట్లాడుకునేటువంటి ఒక పరమాద్భుత యోగాన్ని ప్రసాదించినటువంటి స్వామికి నమస్కరిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేనికి భయపడవద్దు భయపడవలసిన పని లేదు భయపడితే మనలో immunity levels పూర్తిగా నాశనమైపోతాయి. మందులతో మందు బిళ్ళలతో మనకి శక్తి రాదు. దైవానుగ్రహంతో దైవభావనతో తప్త హృదయంతో పరమేశ్వరుడికి సమర్పణ చేసిన భావంతో కరోనా మన దాకా రాదు. అది వస్తుందేమో వస్తుందేమో అని negative గా గనక ఆలోచిస్తే చాలా దగ్గరగా అది వచ్చేస్తుంది. వచ్చినా మనల్ని ఏం చేయదు. ఎందుకంటే "తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం" కృష్ణుడు చెప్పాడు "అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం" ఎవరైతే నాతో నిత్యము కూడి ఉంటారో వారి యోగక్షేమాలు నేను వహిస్తానని కృష్ణ పరమాత్మ మనకు చెప్పాడు. మనం దానిని నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఆ వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేసి మనకి ఇంత knowledge ఇంత విజ్ఞానం ఇన్ని విషయాలు మనకు బోధించి వెళ్లారు. సర్వదా మనం కృతజ్ఞులమై ఉండాలి. అలాగే కూకట్పల్లి సమితి ఈ కరోనా occasional అని అనుకోకుండా ప్రపంచమంతా ఎలా ఈ technology ని వాడుకుంటున్నదో మళ్ళీ మీరు యువకులంతా కూడా మీ సమయాన్ని వెచ్చించండి. నెలకో మీకు వీలున్నప్పుడో convenient time లోనో అనేక విషయాలు మనం నేర్చుకోవాలి. ప్రధానంగా సత్య సాయి organization లో ఉన్న మనం కింకరత్వాన్ని అంటే నేను ఏం చేయాలి అన్న ప్రశ్నలలో నుంచి స్వామి దయవల్ల నేను ఏదైనా చేయగలను అన్న స్థాయికి వెళ్ళాలని ఆ రాముణ్ణి సాయి రాముణ్ణి మన స్వామిని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాయతమైనటువంటి సీతా రామ్ లక్ష్మణ భరతులతో పాటు హనుమతో కూడిన ఆ పంచాయతనము ఈ జగత్తును రక్షించు గాక అని మంగళాశాసనం చేస్తూ సాయి రామ్.
YouTube · audio
Satsangam on Sri Rama Navami(2021)
Satsangam on Sri Rama Navami(2021)
Source: SathyaSai Seva Sadan on YouTube
0:00 / 1:30:15