Skip to content
Transcript తెలుగు
సాయిరాం సౌందర్య సార సర్వస్వం మందస్మిత మనోహరం వందారు జనమందారం వందే సాయి మహేశ్వరం త్రియాతీత పదస్థితాం సకరుణం జ్ఞానాగ్ని శైలస్థితాం మజ్జన్మాంతర పుణ్యపాక వశత్ ప్రాప్తం సద్గురుం సత్యసాయి ఈశ్వరం ఆలంబేన విహీనం యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తత్ బ్రహ్మ స్పురతాం మే పరమమహేశ్వర స్వరూపుడు సచ్చిదానంద గురుమూర్తి అయిన భగవాన్ సత్యసాయి దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ ఉపనిషత్తులలో అది ఒక మహా ప్రవాహమై ప్రవాహంలో మొట్టమొదటి ప్రారంభ వేళలు దేనితోను అంటే ఈసావాస్యోపనిషత్తుతో ప్రారంభమైంది శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం శంకరపా-- శంకర భగవత్పాదుల మహా దివ్యస్మృతికి మరొక్కసారి ప్రాంజలి ఘటిస్తూ పది ఉపనిషత్తులు మానవుణ్ణి జగత్తుతో ప్రారంభించి కడగా తనను తాను ఎరుగు ఎరుకలోకి తీసుకువెళ్ళేటువంటి ఒక దివ్య జీవన విధానాల్ని భాష్యంగా వర్ణించి విశ్లేషించి ఆవిష్కరించి వాఙ్మయ స్వరూపాన్ని ఇచ్చారు అటువంటి వాటిలలో ఇవాళ మనం ఈశావాస్యోపనిషత్తుని చెప్పుకుంటూ ఉన్నాం. ఈశావాస్యోపనిషత్తు యొక్క ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే జీవుడు జగత్తు ఈశ్వరుడు నిజానికి మూడు ఒకటే ఇది ప్రతిపాదన. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని ఇది రెండవ ప్రతిపాదన అంటే జగత్తు జీవుడు జగదీశ్వరుడు ఎట్లాగో ఈశ్వరుడు గురువు ఆత్మ మూడు కూడా ఒకటే భిన్న భిన్నంగా మనకి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అభిన్నమైన అద్వయ-- అద్వయమైన అద్వైతమైన అనన్యమైన ఒక పరిపూర్ణమైనటువంటి భావనా సబలత భావనాశక్తే ఈశావాస్యోపనిషత్తు కాబట్టి అంటే ఈశావాస్యం ఇదం జగత్ అనేటువంటి సూత్రంతో ప్రారంభమవుతుంది అంటే జగత్తంతా ఈశ్వరమయమే అని చెప్పటం మనం. మనం కాదు కాదు జగత్తు జగత్తే ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడని గానే ఆకాశంలోకి చూపిస్తూ ఆత్మ ఎక్కడున్నదో తెలియక మూడు మూడు అనుకొని ఇబ్బంది పడిపోతాం కానీ ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిని కంటికి కనపడని ఈశ్వరుడన్నా ఎప్పటికైనా కంటితో లేదా హృదయంతో తెలుసుకోవలసిన ఆత్మ అన్నా రెండూ కలిపితే వచ్చేటువంటి స్వరూపము గురువు అన్నా మూడు ఒకటే. మూర్తి భేద విభాగిని మూర్తిత్వం చేత అంటే బొమ్మలు మూడు బొమ్మలుగా కనిపిస్తున్నాయి కానీ మూడు బొమ్మలలో దాగినటువంటి ఏకత్వం ఏమిటి అంటే బ్రహ్మము కనుక ముందు మనం జగత్తుతో ప్రారంభించినట్లయితే జగత్తు మంచిదా చెడ్డదా అని ముందు మనం ప్రశ్న వేసుకుంటాం. ఎవరెవరి జీవితానుభవాన్ని బట్టి ప్రపంచం మంచిది కాదని ఇది చాలా దిగజారిపోయిందని దీనిలో రకమైన ధర్మం నశించిందని విలువలు పాడైపోయినాయని మనిషికి ఎక్కడా ఆందోళన తప్ప ఆవేదన తప్ప పరివేదన తప్ప ఆనందమే కనపడనప్పుడు ప్రపంచం ఏనాడు మనకు ఆనందాన్ని ఇచ్చింది గనుక కనుక ప్రపంచం మంచిది కాదు అని ఒకడు అసలు ప్రపంచమే లేకపోతే పరమాత్మను నేను ఎలా తెలుసుకోగలిగేవాడిని ప్రపంచమే లేకపోతే వాఙ్మయాన్ని ఎలా చదువుకునే వాడిని ప్రపంచమే లేకపోతే కష్టము సుఖము దుఃఖము ఆనందము అతిశయము అలాగే ద్వంద్వాలైనటువంటి ఎత్తుపల్లాలు చీకటి వెలుగులు జనన మరణాలు ఇవన్నీ కూడా నేను అనుభవించడానికి వేదికే గనుక నాకు లేకపోయినట్లయితే నేను ఏమైపోయి ఉండేవాడిని అని కాస్త కొద్దిగా చదువుకున్నటువంటి వాడు జిజ్ఞాసి అయినటువంటి వాడు ఒక ప్రశ్నని తనంతట తానే రేకెత్తించుకొని జవాబులు వెతుకుతూ అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఇదే జగత్తులో పారాడుతూ తారాడుతూ వెలుగు కోసం వెతుక్కుంటూ మధ్యస్తంగా ఒకడుంటే అసలు జీవితమే కృష్ణ సంగీతం ఇది అత్యంత మధురమైనటువంటి సంగీత విధానం ఇది సంగీతంలో ఉదాత్త అనుదాత్త స్వరాలు ఎట్లా ఉన్నాయో జీవితంలో కూడా ఎత్తుపల్లాలు ఉంటాయి కష్టసుఖాలు ఉంటాయి కష్టం వెనక సుఖం పులి వలే కాచుకొని ఉంటుంది సుఖం వెనక మళ్ళీ ఒక ప్రశాంతమైనటువంటి కష్టం కష్టం ప్రశాంతం ఏమిటి సుఖం పులి ఏమిటి అంటే ఇది విచారణ. సుఖంగా కనిపించేదంతా దుఃఖం వైపు దారి తీస్తుంది దుఃఖంగా కనిపించేదంతా సుఖం వైపే దారి తీస్తుంది గనుక మనం రెండు పదాలు వాడాలి మనం అనుకుంటాం సుఖం చాలా చల్లగా చెలిగా హాయిగా ప్రసన్నంగా మనకు ఆనందం కలిగించేలాగా మన తోడు నీడగా ఉన్నది అనుకుంటాం అనుకునే లోగా క్షణమాత్ర కాలంలో వెంటనే అది మారిపోయి ఏదో దుఃఖం నెత్తిన పడిపోయి ఏమిటి ఇట్లా అయిపోయిందని ఉద్వేగానికి లోనవుతాం కాబట్టి ఇటువంటి జగత్తును గురించినటువంటి ఒక తీవ్రమైనటువంటి విచారణ చేసినటువంటిది ఈశావాస్య ఉపనిషత్. సరే మనం ముందే చెప్పుకున్నాం ఉపనిషత్ అంటే దేనినైనా పరమాత్మ భావనకు దగ్గరగా లేదా ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనకు దగ్గరగా కూర్చొని దానితో మమేకమై దానిని అధ్యయనం చేసి ఆచరించి అనుభవాన్ని పొంది కడగా విభూతి స్థాయికి వెళ్ళాలి అని చెప్పేవే ఉపనిషత్తులు గనుక మనం గురువుకి చాలా దగ్గరగా ఉండటం నేర్చుకోవాలి అయితే గురువు ఎలాంటి వాడు అంటే చలిమంట లాంటివాడు.ఆ చలిమంట వేసినప్పుడు మా చలిమంట ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది. గురువుట్లో గనక అతి చనువు తీసుకుని గనక చెయ్యి పెట్టినట్టయితే చెయ్యి కాలిపోతుంది. కదా! కాబట్టి గురువుకి దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండవలసిన పని లేదు కానీ చలి కాచుకున్నట్లుగా గురువు యొక్క భావనని అందుకోవాలి. అందుకై ఉపనిషత్తు జగత్తును గురించి తీవ్రమైనటువంటి విచారణ చేసి, జగత్తుతో పాటు మరి జగదీశ్వరుడు ఎక్కడున్నాడు అని. దేవుడు అనంగానే అక్కడ, వాడు, అది, ఎక్కడో ఇవన్నీ వాడితాం పదాలు. లేనే లేదు. దూరాత్ దూరాత్ అంతికేచ దూరం దూరం అనుకుంటున్నావే! నీకు దగ్గరగా ఉన్నాడు పరమాత్మ. సత్యసాయి భగవానుడు దీని మీద ఒక చక్కని వ్యాఖ్యానం చేశారు. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అంటే మన వైకుంఠం, కైలాసం, బ్రహ్మ లోకం ఇంకేదో అవన్నీ చెప్తాం. పురాణ వాఙ్మయం ఇదంతా చెబుతుంది. ఇక్కడ ఉపనిషత్తులలో పురాణ వాఙ్మయానికి చోటు లేదు. ఇక్కడ నిష్కర్ష, నిర్దుష్టమైన స్పష్టత, ఒక జీవితానుభవం, యదార్థికమైనటువంటి విషయం absolute reality ని గురించి మాత్రమే చెబుతుంది గనుక ఉపనిషత్తులలో మనకి ఆవేశము, ఉద్వేగము కలిగించేటువంటి కథా కథనాలేమీ లేవు. వాటి జోలికి కూడా మనం వెళ్ళకూడదు. సరే. అయితే జగదీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే స్వామి చెప్పిన మాట "నయనాంజన రేఖ వలె ఉన్నాడు" అన్నారు స్వామి. జగత్తు తర్వాత. నయనాంజన రేఖ అంటే నయనము అంటే కన్ను, అంజనం అంటే కాటుక. కంటికి కాటుక ఎంత దగ్గరగా ఉన్నదో, పరమేశ్వరుడు నీకు అంత దగ్గరగా ఉన్నాడు. ఇది చెప్పటానికి నిజానికి కొన్ని వేల వేల గ్రంథాలు చదివితే తప్ప ఇది చెప్పలేం. స్వామి సర్వాత్మ గనుక ఆయన దూరాత్ దూరాత్ అంతికేచ అంటూ చెప్తూనే నయనాంజన రేఖ వలె ఉన్నాడు. కానీ స్వామి ఎప్పుడూ ఒక statement ఇచ్చిన తర్వాత ఒక కామా పెడతారు. statement కంటే కామా బలమైంది. కామా తర్వాత ఏం చెప్తారు అంటే నయనాంజన రేఖ వలె ఉన్నాడు గాని ఒక స్త్రీమూర్తి గనుక ఎంత అలవాటు ఉన్నా కంటికి కాటుక పెట్టుకోగానే ఆమె సరి చూసుకోవటానికి ఒక అద్దం కావాలి. అద్దంలో చూసుకుని బానే పెట్టుకున్నాను అనుకుని అద్దం పక్కన పెడుతుంది. జీవుడు కూడా జగదీశ్వరుడి యొక్క అనుభవాన్ని పొందాలంటే జగత్తు మొత్తాన్ని పరమేశ్వర స్వరూపంగా చూడాలి. శంకర భగవత్పాదులే భాష్యం చెప్పారు గనుక వారే ఒక మాట చెప్పారు. విశ్వం దర్పణ దృశ్యమానగరీతుల్యం నిజాంతర్గతం తశ్చన్నాత్మ తలోకానిమయయా బహిరోద్భుతం యథా నిద్రయా యసాక్షాత్ కురుతే ప్రభోస సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని ప్రపంచం అంతా ఒక అద్దంలో బొమ్మ లాగా ఉంది. అంటే బొమ్మ ఎక్కడో ఉందన్నమాట. కానీ అద్దం అనేది మన దగ్గర లేకపోయినట్లయితే బొమ్మ కనపడదు కదా! మనమైనా అంతే కదా! అద్దం ముందు నిల్చుంటే మనం కనపడతాం. అద్దం నుంచి మనం పక్కకు వెళ్లినా, మన నుంచి ఎవరైనా అద్దం పక్కకి తొలగించినా మనకు మనమే కనపడం. కాబట్టి జగత్తంతా అద్దంలో బొమ్మలాగా ఉన్నది అని చెప్తూ స్వామి కూడా నయనాంజన రేఖ వలె ఉన్నది [తుమ్ము] అని అన్నప్పుడు ఓహో! ఇంత దగ్గరగా పరమాత్మ ఉన్నాడన్నమాట. జగత్తు, జగదీశ్వరుడు కలిసే ఉన్నారు. కలిసి ఉన్నారు అని అనుకోవటానికి ఒక అనుభవం పొందటానికి మధ్యలో ఉన్నాడు జీవుడు. మూడు గనక లేకపోయినట్లయితే త్రిపుటి పూర్తి కాదు. Three dimensions అవి. జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు మూడు చాలా ప్రధానమైనటువంటి అంశాలని చాలా తీవ్రంగా విచారణ చేస్తుంది. జగత్తుని మనం కాసేపు విచారణ చేసినట్లయితే, జా అంటే పుట్టేది, గత్ అంటే పోయేది అని అర్థం. ఏది పుడుతున్నదో అది పోతున్నది. యదృశ్యం తన్నశ్యం. ఏది పోతున్నదో, పోవలసి ఉన్నదో అది కాసేపు కనబడుతున్నది. అంతే కదా! కాబట్టి కనపడేది పోక తప్పదు, పోయింది మళ్ళీ కనపడక తప్పదు. ఇది హైందవ సాంప్రదాయంలో ఉన్న పునర్జన్మకు సంబంధించిన ఒక ఉదాత్త వైఖరి. దాన్ని ఓ-ఈశావాస్యోపనిషత్తు చాలా చక్కగా గత్ అంటే పోయేది అని ఒక అర్థం, మారుతూ ఉండేది అని రెండో అర్థం. ప్రపంచం అంతా మారుతూ ఉంటుంది. నిన్న వలె ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఇంకో రోజు ఉండదు. మనం ఆకాశం వైపు చూస్తాం, weather ఎట్లా ఉందో చూస్తాం, వర్షం వస్తుందా రాదా చూస్తాం. అంటే చలత్ చలితమైనటువంటి జగత్తు జీవుణ్ణి ఇదిగో ఇది చాలా transient, impermanent, అశాశ్వతమైన, అనిశ్చితమైనటువంటి జగత్తులో నువ్వు ఉన్నావ్. దానిలో నీవు కూడా దేహంగా ఉన్నంతవరకు నీవు అనిశ్చితుడివే, నీవు అశాశ్వతుడివే. కానీ, నీ యందున్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది నిత్యమై, సత్యమై, శాశ్వతమై అన్ని కాలాల, అన్ని వేళల, అన్ని యుగాల నిరంతరమై ఉన్నది. కాబట్టి మా-మరణము అనేటువంటిది ఎరగని ఆత్మ, మరణం ఎప్పటికైనా పొందవలసిన-పొందేటువంటి దేహము రెండూ కలిసి ఒక చోట ఉన్నాయి. కాబట్టి జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు అనేటువంటి మూడు భావనలని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే జీవితం మనకి చాలా నేర్పుతుంది, చాలా స్పష్టతనిస్తుంది. మనం మనకి స్పష్టత లేని కారణంగా మనం ఏం చేస్తామంటే అన్నీ ప్రణాళికలు వేస్తాం, schedules వేస్తాం. ఇగో యాభై ఏళ్ళు వచ్చేప్పటికి పని చేస్తా, అరవై ఏళ్ళు వచ్చేప్పటికి పని చేస్తా.డెభై ఎనిమిది ఇది సప్తతి మహోత్సవం చేసుకుంటా తర్వాత అషీతి చేస్తా తర్వాత సహస్ర చంద్ర దర్శనం చేస్తా అని డైరీలో రాసుకుంటాం. అన్ని అవ్వాలని ఎక్కడా లేదు. కాకపోవచ్చు కూడా, అవ్వచ్చు కూడా. అంటే ఎంత నిశ్చితమైన దాన్ని మనం శాశ్వతం అనుకుంటున్నామో, అసలు రేపుకే రూపం లేదే మనం ఎప్పుడో రాబోయే పదేళ్ల నాటి మాట ఇవాళ మాట్లాడుకుని ప్లాన్ చేస్తున్నాం చూడండి అది జరగదు. ఎందుకంటే, ఏదైనా సరే ఈశ్వర కృప, ఈశ్వరాజ్ఞకు లోబడి మాత్రమే జరుగుతుందని దీన్ని భగవాన్ రమణ మహర్షి కూడా ఉపదేశ సారంలో చెప్పారు. "కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం" అని. అంటే, నీవు చేసే సత్కర్మల వలన నీవు ఉన్నతమైన జన్మ పొందుతావు. ఉదాత్తమైనటువంటి భావనా స్థితి చేత మరి మరొక మంచి జన్మ ఎత్తుతావు తప్ప జన్మ రాహిత్య నీకు రాదు. ఎందుకంటే కర్మలు పరదైవతాలు కాదు గనుక. కానీ భగవంతుడితో కూడి అంటే భగవద్భావనతో కూడి మనం గనుక ప్రపంచంలో మనం రోజూ చేసే పనులు కూడా, పని చేయనండి ఉద్యోగం, వ్యాపారం, ఏది లేకపోయినా రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూడా చేసే ఆలోచన కూడా పరమేశ్వర భావనతో కూడి చేస్తే దాని పేరు కర్మ యోగము అన్నారు. అది కర్మయోగం అంటే. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు మనకి ఏం చెప్తుంది? ఇదిగో ఇవన్నీ ముందు నువ్వు జగత్తు అర్థం చేసుకో. పొద్దున సూర్యోదయం అవుతుంది. నీకు చెప్పీ చెప్పకుండానే సమయం ప్రకారం సూర్యుడు అస్తమిస్తాడు. అస్తమిస్తాడు అంటే గత్తా వెళ్ళిపోయినాడా? మళ్ళీ రేపు పొద్దున వస్తున్నాడు కదా. ఆయన వెళుతున్నాడు, చంద్రుడు వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నిగమము ఆగమము రెండు ఉన్నాయి. నిగమాగమము అంటే అది. అంటే వచ్చేది వెళ్ళేది. జీవుడు అంటే వస్తాడు పోతాడు. మనం కూడా అంతే కొన్నాళ్ళు ఉంటాం ఇక్కడ. మనం చేయవలసిన మన designated duties ఉంటాయి. మనకివ్వవలసిన కర్తవ్యాలు ఉంటాయి. మనం చేయవలసిన బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ నెరవేరుస్తాం. మనం ఇక్కడి నుంచి నిష్క్రమిస్తాం. ఎందుకంటే "అంతము లేని భూనమంత పురాతన పాంధశాల అందిరు సంజలు రంగుల వాకిళ్ళు బహరాం జమిషీడులు పాదుశాలు వేనకు వేలుగా కొంత సుఖించిపోయి రెటకో తెరవారికి చోటు సంగుచున్" రాజులు, చక్రవర్తులు, మహానుభావులు ప్రపంచంలోకి వచ్చి అవతార మూర్తులు వచ్చి కొద్ది రోజులు ఇక్కడ ఉండి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తించి మళ్ళీ ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియదు కదా అని వైదాంతిక భూమికని ఉపనిషత్తు మనకి మనలో ఒక ఇన్స్పిరేషన్ ఒక ఇగ్నిషన్ అంటాం. మనలో ఒక జ్ఞానాగ్ని, ఒక జిజ్ఞాసను రగుల్చేటువంటి భావన ఈశావాస్యోపనిషత్తు మనకి చెప్తుంది. అయితే సరే జగత్తు మారిపోతూ ఉంటుంది. మారుతున్న జగత్తుతో పాటు మనిషి మారుతాడు. మనము అరవై ఏళ్ల క్రితం చిన్న ఒక పాప రాగా జగత్తులోకి వచ్చాం. ఆరు దశాబ్దాలు, ఆరున్నర దశాబ్దాలు దాటి పోతున్నాయి. నెమ్మదిగా అడుగులు వృద్ధాప్యం వైపు వెళుతున్నాయి. బాల్యం గాని, కౌమారం గాని, యవ్వనం గాని, మధ్య వయస్సు గాని మనకు చెప్పి వెళ్లిపోలే. అవి వెళ్లిపోయిన తర్వాత అయ్యో బాల్యం అయిపోయిందే కౌమారంలోకి వచ్చామా అని మనం అనుకున్నాం తప్ప అవి ఏవీ మనకు వీడ్కోలు చెప్పలేదు, స్వాగతాలు చెప్పలేదు. కాబట్టి వీటన్నింటినీ సమన్వయం చేసుకున్నప్పుడు తల్లి గర్భాలయంలో నుంచి జగత్తులోకి మనం వచ్చి మళ్ళీ సమాధి గతమయ్యే వరకు ఉండే మధ్యలో ఉండేటువంటి జీవితాన్ని ఎంత చక్కగా జీవించాం అనేదే మానవుడు వేసుకోవలసిన ప్రశ్న. ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది పుట్టావు, నీలాగా ఇంకా ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు పుట్టి ఉన్నాయి జగత్తులో. వాటికి చరిత్ర లేదు. పుడుతున్నాయి, గిడుతున్నాయి, పుడుతున్నాయి, పోతున్నాయి, మళ్లీ మళ్లీ పుడుతున్నాయి. కానీ మనిషి అట్లా వీలు లేదు. అట్లా బతకటానికి వీలు లేదు. "అన్ని శబ్దాలు పుట్టే నిశ్శబ్దం అందు, అన్ని యుగాలు మొదలాయ యోగమందు, అన్ని జన్మల చివరాయ నరజన్మ, అరయా నారాయణాన్వేషితం". నారాయణుడు మన యందే ఉన్నాడు. విషయానికి వచ్చినప్పుడు అది అర్థం అవుతుంది గనుక లోపల ఉన్న నారాయణుడిని మనం ఎలా తెలుసుకోవాలో, అందుకై మనకి మానవ జన్మ ఇవ్వబడింది. ఇటువంటి జన్మలు మనం ఎన్నెత్తి ఇప్పటిదాకా వచ్చామో, ఇక్కడిదాకా వచ్చాం. జ్ఞానం అంటే ఏమిటి? ఉపనిషత్తు అంటే ఏమిటి? ఈశావాస్యోపనిషత్తులో ఏముంది? అని మనం అడుగుతున్నాం, అంటున్నాం, దానినే వింటూ ఉన్నాం అంటే మనము దశలు దాటి వచ్చినటువంటి ఒక మంచి భావనలో జన్మలో ఉన్నాము అని అర్థం. సరే. అయిన తర్వాత జగత్తు మారిపోయే జగత్తులో మనము మారిపోతున్నాం కదా. మారి మారి మారి మార్పు ఎక్కడ ఆగుతుందో దానికి దాని పేరు మరణం. మరణం అనే దాన్ని మనం ఒక భయానకమైన దృశ్యంగా మనం భావిస్తాం. మరణం అంటే మార్పేనన్నారు రమణ మహర్షి. స్వామి అన్నారు "It's a simple transition" అన్నారు. గదిలో నుంచి గదిలోకి వెళ్లినట్లు అన్నారు ఒకటే మాట. గదిలో అంటే ప్రపంచంలో ఉన్నాం. ఇది కానీ ఇంకో గదిలోకి వెళ్తున్నాం. ఇంకో గది ఉందా అంటే, నువ్వు ఉన్నది అనుకుంటే అక్కడికి వెళ్తున్నావు లేకపోతే ఇక్కడే ఉన్నావు అని. ఇహమేవా వేదం చెప్పింది. ఈశావాస్యోపనిషత్తు అంతా మంత్రమయం. అద్భుతమైనటువంటి పదాలు. వాటన్నింటి విశ్లేషణ కంటే రససారం ఏదున్నదో అది మనం గ్రహించగలిగితే ఉపనిషత్తు మనం చదివినట్లే లెక్క. కనుక జీవుడు జగత్తు తర్వాత జీవుడు అంటే మనం ఉన్నాం. మనందరం ఉన్నాం. ఎలా వచ్చాం? ఎలాగో అందరూ వచ్చినట్లే మనం వచ్చాం. వచ్చి ఏం చేశాం? ఒకే తల్లి గర్భంలో నుంచి ముగ్గురు బిడ్డలు వస్తారు. మనం మన తోబుట్టువులు siblings అంటాం. నా అన్న ఉన్నట్లు నేను లేను, నేను ఉన్నట్లు నా తమ్ముడు లేడు. చూశారా? మళ్ళీ ముగ్గురినీ కూర్చో నిల్చోబెడితే ముగ్గురూ మూడు రకాల మనస్తత్వాలతో ఉన్నారు. మనస్తత్వాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినయి అంటే జన్మాంతర సంస్కారాలు వాళ్ళు మూటలు కట్టుకొని వచ్చారు.వారి వారి మూటలను బట్టి వారి నేపథ్యాలను బట్టి వారు గతించిన జన్మలలో వారు చేసుకున్నటువంటి అనేక కర్మలను బట్టి ఇవాళ వ్యక్తి ప్రపంచంలో ఒక ప్రవర్తనతో జీవిస్తాడు గనుక కర్మాను బంది మనుష్య లోకే, మనుష్య లోకమంతా కూడా కర్మకు లోబడే ఉంటుంది, కర్తవ్యానికి లోబడి ఉంటుంది, కాలానికి లోబడి ఉంటుంది, ఒక్క కారణానికి లోబడి ఉంటుంది. ఒకే ఒక్క కారణం. ఒకే ఒక్క కారణం ఏమిటంటే, నిజమే నేను ఇదిగో దేహం తీసుకొని వచ్చాను, నాకు ఎవరో పేరు పెట్టారు, ఎవరో పేరు పెట్టి నీ పేరు ఇది అన్నారు, అవును అనుకున్నాం. పేరే school కి వెళ్ళింది, university కి వెళ్ళింది, ఇంక ఎక్కడికో వెళ్ళింది, అదే పేరు వెళ్తున్నది. పేరు కూడా మనది పుట్టు పేరు కాదు మనది పెట్టు పేరే. మనకు పుట్టు పేరు ఏమిటి అని? పుట్టు పేరు ఆత్మ. మనందరం కూడా అదే. మరి అందరికీ ఒకటే ఆత్మ అని పేరు పెట్టొచ్చు కదా అంటే identification కావాలిగా. ప్రపంచంలో అందరూ మనల్ని ఏదో పేరుతోనో, రూపంతోనో గుర్తించుకోవాలి కదా. కాబట్టి identification aspect పేరే పేరు గనుక, పేరు మనం ఉన్నంత కాలం ఉంటుంది. మన తర్వాత దాంతో పాటు చరిత్రలో అది కూడా కలిసిపోతుంది. కాబట్టి ఏదీ శాశ్వతం కాదు మనం అంటాం, నా పేరు చరిత్రలో సువర్ణాక్షర లిఖితం కావాలి అని. అంటే నా పేరు బంగారపు అక్షరాలతో ఎవడన్నా చెక్కీ అక్కడ పెట్టాలి అని. ఉప్పెన వస్తే, సునామీ వస్తే, ఒక అననుకూలత ఏర్పడితే అన్నీ కొట్టుకుపోయినట్లే పేరు కూడా కొట్టుకుని పోతుంది. కానీ పేరు నిలబెట్టుకోవటానికి ఎలా జీవించాలి? అంటే నిజానికి ఈశావాస్యోపనిషత్తు వైదాంతిక భూమికలో ఒక వైరాగ్యాన్ని మనకు చెప్తుంది. అలాగే ఒక హెచ్చరిక చేస్తుంది. అలాగే ఒక ఉపదేశాన్ని ఇస్తుంది. ఉపదేశం ఏమిటంటే, నువ్వు అరవై ఏళ్ళు బతికావా, డెబ్భై ఏళ్ళు బతికావా, తొంభై, వంద బతికావా అది కాదు. నువ్వు మరణించిన తర్వాత ఒక్క రోజన్నా జీవించావా లేదా అది చెప్పేస్తుంది. మరణించిన-- ఎంతో మంది మరణిస్తుంటారు రోజూ. వాళ్ళకి చరిత్రలేం లేవు. కానీ చరిత్ర సృష్టించిన వాళ్ళు, చరిత్రలో భాగమైన వారు, చరిత్రకు కారకులైన వారు అంటే వారిని స్రష్టలు, ద్రష్టలు అని పేరు పెడతాం. స్రష్టలు, ద్రష్టలు వీళ్ళు ఏంటంటే visionaries. రేపటి గురించి ఆలోచించి తమను పరిత్యాగం చేసుకుంటారు గనుక జీవుడు ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వంతో, పరిపక్వమైనటువంటి మనస్తత్వంతో, ఒక పరిపూతమైనటువంటి భక్తి భావనతో, జ్ఞాన సంబంధంతో గనుక జీవించినట్టయితే జీవితంలో ఎదురయ్యే ఇందాక చెప్పిన ద్వంద్వాలు వాణ్ని తాకవు. శీతోష్ణస్థితులు అతనికి రకమైనటువంటి ప్రభావం అతని మీద చూపించవు. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రతి వాడు తెలుసుకోవాలి అని. విషయం అందరికీ ఉంటుంది. కొందరు గ్రహించగలుగుతారు, ఇంకొందరు ఆచరిస్తారు, కొంతమంది అనుభవిస్తారు, అనుభూతిని చెంది హాయిగా నిలకడ చెందుతారు. ఈశావాస్యోపనిషత్తు మనకిది చెప్తుంది. కాబట్టి జగత్తు, జీవుడు పెద్దగా-- జగత్తు ఎలా మారుతూ ఉంటుందో జీవుడి జీవితం, జీవుడి శరీరం కూడా మారిపోతూ ఉంటుంది. జీవుడి ఆలోచనలు కూడా మారిపోతూ ఉంటాయి. ఆలోచనలు పరిపక్వమా, అపరిపక్వమా వాటన్నిటినీ విచారణ చేసుకుంటూ జీవుడి యొక్క విచారణ అయిన తర్వాత ఇక జగదీశ్వరుడు ఎవరు? జగత్తుకి ఈశ్వరుడు ఎవరు అని. ఈశ్వరుడు అంటే నాశము లేనివాడు ఈశ్వరుడు. ఈశ్వరుడంటే శివుడని కాదు. ఎవరికి నాశనము లేదో, ఎవరికి మార్పు లేదో, ఎవరు సుఖదుఃఖాలకు అతీతంగా ఉన్నాడో, మనం గురువుని గురించి చెప్తాం, బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్త్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీహి సాక్షిభూతం అంటాం. అంటే సమస్తమును ఒక సాక్షిగా చూసేటువంటి వాడు. ఏది ఏది అక్కరలేదు, ఏది వచ్చినా కాదనడు, దాని పట్ల స్పర్శ ఉండదు. ఇది కావాలి, ఇది బాగున్నది, ఇది లేదు అనడు. ఇది లేకపోతే నా జీవితం ఎట్లా అనుకోడు. నాకే కష్టం ఎందుకు వచ్చింది అనుకోడు. ఇంత ఆనందం నాకెందుకు కలుగుతున్నది అని అనుకోడు. గగన సదృశ్యంగా ఉన్నాడు. శూన్యుడై ఉన్నాడు గురువు. గురువే పూర్ణుడై ఉన్నాడు. పూర్ణంగా కనిపిస్తున్నాడు కానీ ఆయన శూన్యుడు. అయ్యో ఈయన దగ్గర ఏం లేదే, ప్రాపంచికంగా మన దగ్గర ఉన్న వస్తువులు కూడా ఈయనకి లేవు, ఈయన జీవితం ఎలా గడుపుతాడు అంటే, ప్రాపంచిక వస్తువుల కంటే కూడా తనదైనటువంటి సద్ వస్తువు ఏ-- ఆత్మ అనబడేటువంటి వస్తువు ఉన్నదో దాన్ని గురువు ఎరిగి ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు గనుక సద్ వస్తువే తనదైనప్పుడు ప్రాపంచికమైన వస్తువులు అతనికి అవసరం లేదు, అవి అక్కరకు రావు. వాటి ఆలోచనే ఆయనకు ఉండదు. కనుక నిత్య తృప్తుడై, నిత్య సుఖయై, నిత్యమూ ఆనంద తారక స్థితిలో తనను తాను నెలబెట్టుకొని పరిపూర్ణమైనటువంటి రాజయోగాన్ని లోపల అనుభవిస్తూ ఉంటాడు గనుక ఇటువంటి గురువు-- అంటే గురువు అన్నా, జగదీశ్వరుడన్నా ఒకటే కాబట్టి జగదీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన లేనిదంటూ లేదు. దీనికి మనకి భాగవతంలో పద్యం ఉంది. ఒక్కసారి జగదీశ్వర తత్వాన్ని గనుక మనం తెలుసుకుంటే జగత్తు ఏమిటో తెలిసింది, జీవుడు అంటే తెలిసింది, ఈశ్వరుడు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని. దేవుడు అనే పదానికి స్వామి ఇచ్చిన నిర్వచనం చాలా అద్భుతమైన నిర్వచనం. దేముడు అని రాస్తారు, రాయకూడదు దేవుడు అని రాయాలి. దేవా అంటే ఆట అని అర్థం. ఆట ఆడేవాడు తానే, ఆడించేవాడు తానే, గెలిచేవాడు తానే, ఓడేవాడు కూడా తానే. కాబట్టి తనను మించి మరొక వస్తువు ప్రపంచంలో లేదు అని చెప్పడానికి దేవుడు అనబడేటువంటి ఒక concept అనండి. concept ని రమణ మహర్షిని కూడా అడిగారు. దేవుడు దేవుడు దేవుడు అంటారే ఎక్కడ ఉన్నాడు ఆయన? మరి GOD God అంటారు కదా అంటే GOD God generation, organization and destruction is equal to God అని ఎవరో చెప్పారు పదాలకి. సరేఇది అయిన తర్వాత అయ్యా మరి ప్రపంచం అంతా ఉన్నది కదా జగదీశ్వరుడు ఎక్కడ ఉన్నాడు కాస్త చెప్పండి అని అడిగితే పోతనామాత్యుడు ఒక పద్యం రాశాడు మనందరికీ తెలుగు వాళ్ళకి నోటికి వచ్చిన పద్యం కానీ దాన్ని మనం చాలా అర్థం తెలియకుండాను మన masterలు ఎలా చెప్తే అలా బట్టి వేశాం గనుక దాని పూర్ణ విషయం మనకు తెలియకుండా అయిపోయింది. పద్యం ఏమిటంటే ఎవనిచే జనించు జగము అసలు జగత్తు ఎవడి వలన సృష్టింపబడుతున్నది ఎవనిచే జనించు జగము ఎవ్వరి లోపల ఉండు లీనమై ఎవరితో కూడి ఉంటున్నదో ఎవరి వలన వస్తున్నదో ఎవరితో కూడి ఉంటున్నదో ఎవ్వరి యందు డిందు అంటే ఎవరి యందు లీనం పరిపూర్ణంగా లయమైపోతున్నదో కనుక ఎవనిచే జనించు జగము ఎవని యందుండు లీనమై లీనమై ఎవని యందుండు అనమాట ఎవని యందు డిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూలకారణంబు ఎవ్వడు అనాది మధ్య లయుడు ఎవ్వడు ఆది మధ్యాంత రహితుడు ఎవ్వడు సర్వము తాన అయినవాడు ఎవ్వడు తాను అయిన వాడు కాదు తాన అంటే తాను మాత్రమే అయిన వాడు సర్వము అంటే జగత్తు జీవుడు కూడా అనమాట సర్వము తానయైన వాడు ఎవ్వడు వానిన్ ఆత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్ అన్నాడు గజేంద్రమోక్షంలో పద్యం ఇది. అంటే ఈశ్వరునే శరణంబు వేడెదన్ అటువంటి వాడు ఒకడు ఉన్నాడు గనుక ఉండి ఉండాలి గనుక ఇంక ఆయనకు అనుభవం కాలా కాబట్టి అటువంటి వాడినే నేను శరణు చొచ్చుతాను అన్నాడు ఎవరు గజేంద్రుడు రెండవ పదం ఏమిటంటే వానిన్ ఆత్మభవున్ నే శరణంబు వేడెదన్ ఇది వైయక్తికం ప్రతి individual అట్లా సమర్పణ శరణాగతి వినయం అన్నటువంటి మూడు భావనలతో ఎప్పుడైతే మనం జగదీశ్వరుడు it is a concept it is a force and feeling within అన్నారు రమణ మహర్షి అంటే ఒక ఆంతరంగిక శక్తి అదే అనంత చైతన్యం కూడా అదే రెండు లోపలే ఉన్నాయి జీవుడి లోపల ఉన్నాయి గనుక జీవుడి లోపల ఇందాక మొదట శంకర భగవత్పాదులు చెప్పినట్లు సర్వ ప్రపంచము మనలో ఉన్నది మనం కూడా ప్రపంచంలో ఉన్నాం ఇందాక కూడా ఆయన చెప్పినట్లుగా కాబట్టి సర్వము తానయైన వాడెవ్వడు సర్వము జీవుడు జగత్తు జగదీశ్వరుడు నింగి నేల నిప్పు గాలి అన్నీ ఈశ్వరుడే అయినాడు అని చెప్తూ ఇటువంటి జగదీశ్వరుడు జీవుడు జగత్తు ఒక్కటేనయ్యా మూడు స్థితులుగా అనుభవిస్తున్నావ్ జగదీశ్వరుడు ఎక్కడో ఉన్నాడనుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నావ్ జగదీశ్వరుడు కూడా జగత్తుకి ఈశ్వరుడై ఉన్నాడు తాను కూడా ఒక పంచభౌతిక దేహం తీసుకొని వస్తున్నాడు జగత్తులో ఉన్నంత సేపు ఈశ్వరుడై ఉన్నాడు నశ్వరుడై ఉన్నాడు రకమైన మార్పు లేకుండా ఉన్నాడు కానీ కాల గమనంలో ఒక అవతార పరిసమాప్తి చేసి మళ్ళీ తన మూల కారణంబెవ్వడు మూలంలోకి వెళ్తున్నాడు అని ఒక తీవ్రమైనటువంటి విచార ధారని మనకు కలిగించేటువంటిది ఈశావాస్యోపనిషత్తు కాబట్టి జగత్తు మంచిది కాదు చెడ్డది కాదు దానికున్న లక్షణాలతో దానికున్న గుణాలతో దానికున్న స్వభావాలతో అది ఎట్లా ఋతువులో ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నది గనుక జగత్తు ఒక పార్శ్వం అయితే జగదీశ్వరుడు మరొక పార్శ్వం అయితే జీవుడు రెండింటి మధ్య ఇటు ప్రకృతిని భౌతికంగా అనుభవిస్తూ ఆంతరంగికంగా జగదీశ్వరుని అనుభవిస్తూ ఒక ఉదాత్తమైన మానవ జన్మను పొందాడు గనుక జీవుడి జన్మ పూర్ణమైన జన్మ ఇక్కడ జీవుడు అంటే నిజానికి మానవ జన్మగా భావన చేయాలి ఎందుకని ఆత్మ చీమలో దోమలో అన్నింట్లలో ఉన్నా వాటి ఆలోచన ఇంత దాకా వెళ్ళదు మానవుడు జిజ్ఞాసి గనుక పరిణామ క్రమంలో అనేక మార్పులు వాడి యందు కలుగుతాయి గనుక నేను ఎవరు ఎందుకు వచ్చాను ప్రపంచంలో నేను చేస్తున్న పని ఏమిటి ఒక్కోసారి మనం ఏదో చదువుకుంటాం ఏదో ఉద్యోగం వస్తుంది ఏదో వ్యాపారం చేస్తాం ఏదో డబ్బు వస్తుంది మనం అనుకున్న దానికి జరుగుతున్న దానికి అసలు పొంతనే లేకుండా జీవితం సాగిపోతూ ఉంటుంది అటువంటి చోట అసలు నేను ఎవరు ఎందుకు వచ్చాను నా తత్వం ఏమిటి అసలు ప్రపంచంలో నేను ఉండవలసిన రీతి ఏమిటి ఇవన్నీ ఆలోచించుకునేవాడే జీవాత్మగా ఉన్నాడు గనుక జీవ జగత్తు జగదీశ్వరులు ముగ్గురు ఒక్కటే మూడు ఒకటి అనుకున్న తర్వాత రెండవ ప్రశ్న ఉపనిషత్తులన్నీ కూడా ప్రశ్నలే ప్రశ్న మనమే వేసుకోవాలి సమాధానం కూడా మనమే పొందాలి ఎవరైనా మనల్ని అడుగుతారు అయ్యా ఇప్పుడు ఉపనిషద్ వాహిని చదవకపోతే ఏమిటి వచ్చే నష్టం అది పక్కన పెట్టండి చదివితే వచ్చే లాభం ఏమిటో ముందది చెప్పండి అంటాడు ఇది నేర్చుకోవాలి మనం సమాధానం ఈశావాస్యోపనిషత్తు చాలా గంభీరంగా చెప్పింది ఒకటి నువ్వు ఎప్పుడైతే జగత్తుని స్పష్టంగా అర్థం చేసుకున్నావో అధివాస్తవిక స్థితిలో నీవు ఉన్నావో దీనిని absolute reality తో చూడటం మొదలు పెట్టావో నీకు రకమైన సుఖ దుఃఖాలు నిన్ను తాకవు జయాపజయాలు నిన్ను ప్రభావితం చేయవు నువ్వు ఎట్లా స్థిమితంగా సం-- స్థితంగా హాయిగా ఉన్నావో నిబ్బరంగా ఉన్నావో అట్లాగే ఉంటావు కాబట్టి మనకి చలచలితమైనటువంటి ప్రపంచం లాంటి ఒక మనసు మన యందు ఉన్నది కాబట్టి మనమంతా మనోమయులం కాబట్టి మనకి మనస్సే ప్రధానమైన అంశము మనకున్నటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బంది అడ్డంకి అదే గనుక అటువంటి మనస్సుని నిలువరించగలిగినటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి ఉపనిషత్తు గనుక తెలుసుకుంటే అర్థం చేసుకుంటే నీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్తుంది నిజానికి మనం చూడండి ఇవాళ ప్రపంచంలో psychiatrist దగ్గరికి వెళ్ళని వాడు లేడు every alternate person is approaching ఎందుకనితన మనస్సే తనకు తెలియదు. మనస్సు ఎందుకు ఏడిపిస్తున్నదో, ఎందుకు మహానందాన్ని ఇస్తున్నదో, ఎందుకు నేను అల్పుడ్ని అనే భావన కలిపిస్తున్నదో, అసలు నాకంటే గొప్పవాడు లేడని అనిపిస్తున్నదో, ఏమిటీ మనస్సు అని ఆలోచించి తెలియక, ప్రపంచం విసిరేటువంటి అనేక ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదుర్కోలేక మనస్సు ఆందోళనాయుక్తమై పోతున్నప్పుడు, మనకున్న దైహిక, మానసిక శక్తులు ఏవీ చాలక, ఆధ్యాత్మిక శక్తి మన యందు అసలే లేక మనం ఇంకోళ్ళని ఆశ్రయిస్తాం అంతే. ఆశ్రయించినప్పుడు వాడు బుజ్జగిస్తాడు మనస్సుని. మనం పని చేసుకుంటే ఆయనతో మనకు పని లేదు. మనకా నేర్పు లేదు. మనకా తెలివితేటలు లేవు. కాబట్టి ఈశావాస్యోపనిషత్తు ముందు మొట్టమొదట నేర్పేది మనస్సు యొక్క సంయమనాన్ని నేర్పుతుంది. సంయమనం అంటే నిబ్బరం. Equanimity, Equilibrium and Equipoise అని మూడు మాటలు. అవి ఇంగ్లీషులో ఉన్న చాలా గొప్ప మాటలు. ప్రతి స్థితిలో సమస్థితిలో ఉండాలి. Equilibrium ఉండాలి. ఏదో రాగానే పొంగిపోవటం, ఏదో దుఃఖం రాగానే కుంగిపోవటం ఇలా చేయకూడదు. అన్నింటినీ సమంగా, సమత్వాన్ని మనం సాధించుకోవాలి. అది ఒక ఇంటర్నల్ గా మన అంతరంగంలో గనక జరిగితే మనస్సు బాగుంటుంది. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది. శరీరము, మనస్సు రెండూ బాగుంటే బుద్ధి కుశలత ఏర్పడుతుంది. బుద్ధి కూడా దానికి తోడైతే మన ఆలోచనలు సక్రమరీతి సాగి మనల్ని మనం నిలువరించుకొని, నిబ్బరించుకొని, నిగ్రహించుకుంటూనే మనం ఎవరికీ అపకారం గానీ, హాని గానీ, అహితం గానీ చేయనటువంటి ఒక చక్కని స్థితిలో, ఒక ఉదాత్త వ్యక్తిత్వంతో మనం జీవిస్తాం గనుక ఈశావాస్యోపనిషత్తు మనకు అనుగ్రహించేది "మనోనిబ్బరము, మనోనిగ్రహము నీకు అవసరము" అని చెప్తుంది. రెండూ వచ్చిన తర్వాత మనకేదో కలగాలి. వచ్చినదే బానే ఉంది, దాన్ని ఏం చేయాలి అని త్యాగం నేర్పుతుంది. త్యాగమే అమృతత్వానికి సిద్ధిస్తుంది. అమృతత్వం వైపు నడిపిస్తుంది. నువ్వు అమరుడవు అవుతావు. కలకాలం మరణించిన తర్వాత కూడా జీవిస్తావు అని చెప్తూ "న కర్మణା ప్రజయా ధనేన చాగేనైకేయ అమృతత్వమానశుః". నీ దగ్గర ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్థబలం ఉన్నా, ఎంత జనబలం ఉన్నా, ఎంత బంధుబలం ఉన్నా వీళ్ళెవ్వరూ నీకు అక్కరకు రారు. మరి నీకు ఏది అక్కరకు వస్తుంది? అక్కరకంటే నీకు ఏది ఉపయోగానికి వస్తుంది అని అంటే త్యాగం చేసినట్లయితే నీకు ముందు అది అక్కరకు వస్తుంది. త్యాగం చేయటం అంటే నేను చందా ఇచ్చాను గనుక పుణ్యం వస్తుందని, ఏదో ఇంకో చాకిరీ చేశాను గనుక ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని ఇది అర్థం కాదు. మానవుడిలో సహజంగా వచ్చే రెండు గుణాలున్నాయి. అవి ఒకటి అహంకారము, రెండవది మమకారము. అహంకారం, అహంకారం అంటే ఏమిటి? నేను మాత్రమే చేయగలను, ఇది నా వల్లనే సాధ్యం, ఇది ఎవరి వల్ల కాదు. అన్నీ నేనే, నేనే I am number one అంటుంటామే అది అహంకారం. మమకారం అయ్యో నా భార్య, నా పిల్లలు, నా స్నేహితులు, నా బంధువులు, నా ఆస్తి, ఇవన్నీ నేను పోతే ఏమైపోతుంది? నీకెందుకు? పోయిన తర్వాత నీకు వాటికి రిలేషనే లేదు. రిలేషన్ లేదు అని చెబుతుంది గనుక అది ముందే తెలుసుకోవయ్యా అని చెప్పేది ఉపనిషత్తు కాబట్టి దాంట్లో "న కర్మణా" నువ్వు సత్కర్మలు చేశావ్. చాలా మంచి పనులు చేశావ్. గుడి కట్టించావ్, చెరువులు తవ్వించావ్, చెట్లు నాటించావ్. ఏం వస్తుంది అంటే దీనికి తగిన మరొక ఉత్తమ జన్మ వస్తుంది. అంతేతప్ప జన్మరాహిత్యం ఏర్పడదు. జన్మ లేకుండా ఉండదు. మళ్ళీ మరొక అందమైన జన్మ వస్తుంది. కాబ-- కానీ అహంకారం గనక ఉన్నట్లయితే నువ్వు చెట్టు నాటేలిద్ది లేదు, నాటిన చెట్టు నీడలో నువ్వు బతికేది ఉండదు. అహంకారమే నిన్ను రోజూ కట్టెను అంటుకొని ఉన్నటువంటి నిప్పు ఎట్లాగైతే కట్టెను దహనం చేస్తూ, చేస్తూ కేవలం ఒక బూడిదగా మారేదాకా ఎట్లా ఉంటుందో, అహంకారం ఉండనా గురువు చిక్కడు. స్వామి మాట ఇది. అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారం ఉండదు. అది స్వామి అద్భుతమైన revelation. నీకు, నాకు సత్యసాయి భగవానుడు నిజమైన గురువు అని గనుక నేను నమ్మితే, నాకు ఉండకూడని qualification ఏమిటంటే అహంకారం నాకు ఉండకూడదు. నాకున్నది అయినా నేను "స్వామి నా గురువు" అంటే అదేం కుదిరేది కాదు. అది మనల్ని మనం వంచన చేసుకోవటం. కాబట్టి అహంకారం ఉండనా గురువు చిక్కడు, గురువు చిక్కనా అహంకారం ఉండదు. అది పోతుంది. ఎందుకు? గురువు అంటే మనకంటే పెద్దవాడు. మనం చిన్న గీత, ఆయనే పెద్ద గీత. పెద్ద గీత రాగానే చిన్న గీత చిన్న గీతగా ఉండిపోతుంది. పెద్ద గీత అవ్వదది. పెద్ద గీత దాకా అయితే దానికంటే పెద్ద గీత ఇంకేదో వస్తుంది. కాబట్టి అనివార్యమైనటువంటి క్రమపరిణామంలో సత్కర్మలు చేయాలి. కానీ అహంతో చేయకూడదు. ప్రేమతో చేయాలి. భగవంతుడు నాకు వంద రూపాయలు ఇచ్చాడు ఇవాళ. దీంట్లో ఒక రూపాయి కూడా లేనివాడు ఎవడో ఉన్నాడు. లేదా ఒక మంచి పని చేసే ఇంకో వ్యక్తి ఉన్నాడు. దానిలో నేను రెండు రూపాయలు అక్కడ ఇస్తాను. తప్పులేదు, చెయ్యాలి. చేయకపోతే ప్రపంచం నడవదు. సత్కర్మల యందు, సత్కార్యముల యందు మన సంపద వినియోగ పడాలి. అందుకే భగవంతుడు మనకి సంపద ఇస్తాడు. మనకోసం మనకు ఎంత కావాలి? ఎంత ఇస్తే మనకు చాలు అంటాం? ఎంత ఇచ్చినా చాలదనే అంటాం. కాబట్టి కర్మల వలన మళ్ళీ ఉత్తమ జన్మ ఏర్పడుతుంది తప్ప అమృతత్వం రాదు. "న ప్రజయా" ఎన్ని లక్షల కోట్ల మంది మనకు పరిచయస్తులున్నా మనకి అవసరమైన వేళ వాడు ఒక్కడు మనకి దొరకడు, కనపడడు. చూశారా? ప్రపంచం అలా కనపడకుండా చేస్తుంది. ఎందుకంటే కనీసం అప్పటికైనా వైరాగ్యం వస్తుందా రాదా అని. నువ్వు అతిశయించావు కదా, నాకు ఒక లక్ష మంది తెలుసు, I am very popular, everybody knows me ఇవన్నీ మాటలు వింటుంటాం కదా. కానే కాదు. నీకు అవసరమైన వేళ, ఆకలి వేళ ఎవరైతే నీ దగ్గరకు వచ్చి "నేనున్నాను" అని నిలబడతాడో అటువంటి వాడు నీకు నిజమైనటువంటి ఆప్తుడై ఉంటున్నాడు.కనుక కానీ దాని వల్ల సందేహం సమస్య తీరుతుంది తప్ప అమృతత్వం రాదు. నా కర్మణా నా ప్రజయా నా ధనీన డబ్బుంది మన దగ్గర చాలా డబ్బుంది. చూశాం ఎంతమందిని ఎన్ని కోట్ల మందిని చూశాం. చూడకపోగా ఎంతమంది గురించి మనం విన్నాం. మన కళ్ళ ముందు ఎంత ధనరాసులు ఉన్నవాడు ఒక్క నిమిషంలో మృత్యువుకి లొంగి వెళ్లిపోయినాడు ఇక్కడినుంచి. వెళ్లిపోతాడు కాబట్టి నా ధనీన ఎంత డబ్బున్నా ఉదాహరణకి బాగా డబ్బున్నటువంటి వాడికి ఎక్కడైనా పూజలు చేయటం విన్నామా? బాగా మంచి దానం చేసిన వాడికి గౌరవం ఇచ్చాం గాని డబ్బున్నవాడికి గౌరవం ఇవ్వలేదు ప్రపంచంలో. వాడు ఎప్పటికైనా పనికొస్తాడేమోనని అనుకున్నారు తప్ప వాడు పూజలు అందుకోలే. వినయము, విద్య, ప్రజ్ఞ, సంస్కారము, శీలము, మధుర వర్తన ఇటువంటివన్నీ positivitys ఎవరి యందున్నాయో అతన్ని భగవంతుడితో వాడు దైవం లాంటి వాడు అన్నామే తప్ప వాడే దైవం అని కూడా అనలేం మనం. కాబట్టి జన్మ ఎత్తిన తర్వాత మనం అమృతత్వంలోకి వెళ్ళాలి. కాబట్టి, నా కర్మణా నా ప్రజయా నా ధనేన త్యాగేనైకే అమృతత్వం ఆనశుః నువ్వు త్యాగం గనుక చేసినట్లయితే నువ్వు అమృత-అమృతుడు-పుత్రుడువి అవుతావు. అంటే కలకాలం నువ్వు ఉంటావని. ఏమి త్యాగం చేయాలి? ఇందాక చెప్పిన అహంకారం, మమకారాలు రెండు మనం వదిలిపెట్టాలి. మమకారం మనం పెంచుకున్నది, అహంకారం మనం వదులుకోలేకపోతున్నది. రెండింటి నడుమ మనిషి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటాడు గనుక ఈశావాస్యోపనిషత్తు నాయనా! నువ్వు దానం చెయ్, ధర్మం చెయ్, సత్కర్మలు చెయ్, మంచి మాటలు చెప్పు, మంచి మాటలు విను, ఆత్మీయ హస్తాన్ని ఎవరికన్నా అందించు, ఎవరన్నా విచారధారలో ఉన్నట్లయితే, విచారణలో ఉన్నట్లయితే, దుఃఖంలో ఉన్నట్లయితే వాళ్ళకి సహాయపడు. ఇవన్నీ కూడా ఒక moral philosophy ని మనకి చెప్పి చివరగా నువ్వు త్యాగం వైపు వెళ్ళమని చెప్తుంది. ఇక మూడవ aspect కొస్తే ఈశావాస్యోపనిషత్తు మనకి నువ్వు తృప్తిగా ఉండటం నేర్చుకో అని చెప్తుంది. తృప్తి మనిషికి లేనిది ఏదన్నా ఉన్నదా అంటే తృప్తే లేదు. తృప్తి లేని వాడు ఎవడు అంటే ఒక మనిషి మాత్రమే. ఇది విచిత్రం. కనుకనే ఉపనిషత్తు చెప్పింది మానవ జన్మ ఎత్తిన నీవు తృప్తి పడటం నేర్చుకో. మరి ఇట్లా గనుక contentment is a hindrance to progress కదండీ. నేను తృప్తి పడ్డాను అంటే నాకు పురోగమనం లేదు కదా. నేను మరి చాలా గొప్పవాడిని కావాలి, చాలా పెద్దవాడిని కావాలి, అందుకోవలసినవి చాలా ఉన్నాయి, ఎక్కవలసిన మెట్లు ఎక్కువ ఉన్నాయి, మరి నన్ను ఏం చేయమంటారు, ఎక్కడ తృప్తి పడమంటారు అంటే మనం వేసే తృప్తి ఉపనిషత్తులు చెప్పలే. తృప్తి అంటే నా వాకిట్లోకి ఆకలి అయిన వాడు ఒకడు వచ్చాడు. ఆదరణ లేని వాడు ఒకడు నా వాకిట్లోకి వచ్చాడు, మన వాకిట్లోకి. వాడికి పిడికెడు అన్నం పెట్టాం. వాడి కష్టాన్ని విన్నాం. వాడికి మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. మనం డబ్బులిచ్చాము, మందులు కూడా కొనిపెట్టాం. అవి ఇస్తున్నప్పుడు వాడి ముఖంలో ఒక ఆనందం కలుగుతుంది. అంటే సమాజం ఇంత దయారహితమైనది కాదు, సమాజం మనల్ని కాపాడుతుంది, కాచుకుంటుంది అని నమ్మకం కలిగినప్పుడు వాడికి ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకని? వచ్చిన వాడు మనకి చుట్టం కాదు. మనమూ వాడికి చుట్టం కాదు. రకమైన బంధనాలు లేవు మనకి. రాగ-అనురాగ బంధాలు దాటినటువంటి ఒకానొక స్థితిలో ఎప్పుడైతే మనం త్యాగం చేస్తామో, అహంకారం వదిలిపెడతామో, తృప్తి వైపు వెళుతూ వాడిని తృప్తి పరచామో, వాడు తృప్తి పడ్డాడో, వాడి ముఖంలో వెలిగేటువంటి ఒక ఆనందాన్ని గనక మనం చూస్తే అది మనకు నిజమైనటువంటి తృప్తి. తృప్తి అంటే ఎవరికీ వాడు satisfy అయిపోవటం కాదు. ఇంకొకడి దుఃఖాన్ని నివారణ చేసి, ఇంకొకడి కష్టం నుంచి వాడిని బయట పడేసి, ఎవరైతే ఒక వ్యక్తి తనను తాను తెలుసుకొని తన కర్తవ్యాన్ని నిస్వార్థంగా, నిర్మమంగా, నిర్మలంగా, నిశ్చితంగా, ఖచ్చితంగా ఎవరైతే సమస్య నుంచి అవతల వాడిని బయట పడేసి వాడికి తనకున్న పరిధిలో ఆనందాన్ని గనక ఇవ్వగలిగినట్లయితే వాడి ముఖంలో వెలిగేటువంటి ఆనందమే తృప్తిగా మారి, అయ్యా! ఇవాళ అసలు ఇలా బతికి బట్ట కడతానని గాని, ఇవాళ అన్నం పెట్టేవాళ్ళు ఒకళ్ళు దొరుకుతారని గాని, ఒక రూపాయి బిళ్ళ చేతిలో పెట్టేవాడు దొరుకుతాడని గాని అనుకోలేదు. భగవంతుడు ఉన్నాడయ్యా మిమ్మల్ని చల్లగా చూడాలి అంటాడు. చల్లగా చూడాలి అంటే నావంటి-నాకే ఇవ్వమని కాదు. నాలాంటి వాళ్ళు ఎందరున్నారో, అవసరం వచ్చినప్పుడు వచ్చేయ్, అందుకే నీకు పరమేశ్వరుడు సంపదనిచ్చాడు అని చెప్తున్నప్పుడు వాడికి కలిగిన ఆనందంలో నుంచి మనకు తృప్తి కలుగుతుంది. ఆనందాన పర్వాలేదు. ఇవాళ నేను కూడా నిద్ర లేచిన తర్వాత భగవంతుడు బతకటానికి నాకో రోజు అవకాశం ఇచ్చినందున నేను ఇంకొకడికి దుఃఖానికి ఉపశమనం కలిగించగలిగాను, ధైర్యాన్ని ఇవ్వగలిగాను, వాత్సల్యంగా వాడిని తాకగలిగాను, స్పృశించాను, నీకేం భయం లేదు నేనున్నానని అనగలిగాను అనటముందే అది నిజమైనటువంటి తృప్తి. కాబట్టి త్యాగం ఉండాలి, త్యాగంలో నుంచి తృప్తి ఉండాలి, తృప్తిలో నుంచి ఆనందాన్ని పొందాలి, ఆనందంలో నుంచి మనిషి తన మనస్సుని స్థిమిత పరచుకోవాలి. మనస్సు ఎప్పుడూ దానికి అది ఒక కడలి, సముద్రం లాంటిది. దానిలో కెరటాలు, అలలు, తుంపరలు పుడుతుంటాయి, ఒడ్డు దాకా వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కూడా కష్టసుఖాలన్నీ కూడా ఒడ్డు దాకా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళేవే తప్ప మనల్ని బయట విసిరేసేవి కాదు అని తెలుసుకోమని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. మరి ఎవరు అంటే దైవమ్మ అనుష రూపేణఇందాక చెప్పాం మన వాకింగ్ లోకి ఎవరో వచ్చారు మనం ఏదో అతనికి చేశాం అతనికి తృప్తి కలిగింది ఆనందం కలిగింది తద్వారా నాకు తృప్తి కలిగింది అన్నామే క్షణాన మనిషిలో దైవం ఒక ప్రేరణ ఇచ్చిన కారణంగానే మనం పని చేస్తాం కాబట్టి స్వామి అన్నారు దేవుడనగా వేరు దేశమున లేడు తాను చేయు పనుల యందు తగిలి ఉండు అందుకే మనం వెళుతూ ఉంటాం రోడ్డు మీద వెళుతూ ఉంటాం మనం కారులో వెళుతున్నాం ఎవరో కింద పడిపోయాడు మనం కారు టక్కున పక్కకు తీశాం అతన్ని లేవదీశాం నీళ్ళు చల్లాం నిలబెట్టాం కష్టం కనుక్కున్నాం ఒక పది నిమిషాలు అతనితో గడిపాం అతను లేదులే బాబయ్యా ఏదో కన్ను దొరికింది నేను న-నడిచి వెళ్లిపోతాను అన్నాడు వెళ్ళాడు క్షణాన అతను ఏమంటాడో తెలుసా దేవుడల్లే వచ్చి కాపాడావ్ అంటాడు అంటే మానవుణ్ణి కాపాడేది దేవుడే దేవుడు రూపంలో వచ్చాడన్నమాట. వాడికి స్పృహ ఉన్నది అంత మాత్రమే అని వాడు అన్నాడు గనుక నేనే దేవుణ్ణని అనుకోకూడదు అది ప్రమాదం ఇక్కడే మన బుద్ధికుశలతను జాగ్రత్తగా అర్థం చేసుకుని అహంకారం మమకారాలు రెండూ కూడా మనం వదులుచుకోవాలి అని ఈశావాస్యోపనిషత్తు మనకు చెప్తూ దీని తర్వాత తృప్తి కలిగిన తర్వాత సమన్వయం కావాలి సంఘర్షణ జీవితంలో ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వదు అది negative result ఇస్తుంది సమన్వయం చేసుకోవాలి చిన్న ఉదాహరణ మన కళ్ళముందు ఉన్న ఉదాహరణ ఒక్క సత్యసాయి భగవానుడు ఒక్కడుగా నవంబర్ ఇరవై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరు లో ఆయన ఒక్కరుగా ప్రపంచంలోకి వచ్చారు ఎంత సమన్వయం చేశారో చూడండి జాతులు మతాలు కులాలు వర్గాలు వర్ణాలు ఉన్నవాడు లేనివాడు అందరూ సమానమైన స్థితిలో స్వామి ఎదురుగా కూర్చునేటువంటి ఒక అద్భుతమైన సమన్వయాన్ని సాధించారు ఆయన సంఘర్షణ ఉన్నదా మన కంటే చాలా పెద్ద officer ఉంటాడు ఆయనతో కూడా మనం హాయిగా స్వేచ్ఛగా మాట్లాడుతాం ఆయన కూడా మనతో స్వేచ్ఛగా మాట్లాడుతాడు ఎక్కడ సత్యసాయి organisation లో మాట్లాడుతాడు అక్కడ ఎందుకు మాట్లాడుతాడు బయట ఎందుకు మాట్లాడడు అంటే ఇక్కడ నిజంగా మాట్లాడితే బయట కూడా అదే మాట్లాడుతాడు [గొంతు సవరించిన శబ్దం] మందిరంలోనూ ఒకలాగ-ఒకలాగానే ఉంటాడు మైదానంలో కూడా ఒకలాగానే ఉంటాడు ఉండాలి కాబట్టి సంయమనం నేర్పాలి అంటే అదిగో ఇందాక చెప్పినవన్నీ క్రమంగా గనుక క్రమ స్వాధ్యాయం అంటాం క్రమ పరిణామంలో గనుక విచారణ చేసినట్లయితే మనం సంయమనం సమన్వయం రెండు కావాలి సంయమనం అంటే కాస్త నిబ్బరంగా ఉండటం సమన్వయం అంటే మనమందరం ఒక్కటే We all belong to స్వామి We all belong to ఒక పరదేవత మన కంటికి కనపడని ఒక మహా చిచ్ఛక్తి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన వాళ్ళందరం కలిసి మనం పని చేస్తున్నాం కనుక ఇక్కడ మన అస్తిత్వాలు మన ఉనికి మన వ్యక్తిత్వాలు మనం అంటూ ఏమీ ఉండదు నదీనాం సాగరో గతిః అన్ని నదులు కూడా ఈశ్వరుడి అనబడేటువంటి మహాసముద్రంలోకి ఎలా వెళ్లినయో జీవులందరూ కూడా ఈశ్వరుడి యందు ప్రవేశించాలి ఈశ్వరుడి నుంచే జగత్తే పుట్టింది జగత్తులో మనం పుట్టాం ఎవరిచే జనించు జగము అక్కడ ఆగాలి ఎవరితో కూడి ఉన్నది [గొంతు సవరించిన శబ్దం] పరమేశ్వరుడితో కూడి ఉన్నది అది ఎవరితో లయమవుతున్నది మనం అంటాం He reached the lotus feet of భగవాన్ అంటాం ఎవరో వెళ్ళిపోతే అంటే మనకు తెలుస్తున్నది అతను మళ్ళీ మూలంలోకే వెళ్ళాడు అని తన మూలాలు ఎక్కడ ఉన్నాయని ఆత్మే తన మూలం కనుక పరిణామాన్ని మనం చాలా intellectual quotient తో అర్థం చేసుకుంటే తప్ప మనకు ఉపనిషత్తులు నిజానికి అర్థం కావు అవి మహా సముద్రాలు అయితే ఇక్కడి-ఇక్కడిదాకా వచ్చినటువంటి జీవుడు ఈశావాస్యోపనిషత్తులో సమస్త ప్రపంచము సర్వం ఖల్విదం బ్రహ్మ ఉన్నదంతా బ్రహ్మమే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ బ్రహ్మము తప్ప ఇంకొకటి లేదు ఉన్నది ఒక్కటే ఏకమే అనేకమైంది మళ్ళీ అనేకమంతా కలిస్తే ఏకం అవుతున్నది అనేటువంటి భావనలోకి మనం spiritual గా ఆధ్యాత్మిక స్థాయిలో మనం ఎప్పుడూ కూడా విచారణ చేయాలి కేవలం భౌతిక స్థాయిలో విచారణ చేస్తే దీనికి దానికి పొంతన ఉండదు physical level దాటాలి మనకి భగవంతుడు intellect ఇచ్చాడు కాబట్టి దాన్నీ దాటాలి intellect ఏం చెప్తుంది పుస్తకాల్లో ఏముందో బాగా చెప్తుంది పురాణాల్లో ఏముందో మనకు అర్థమయ్యేట్టు చెబుతుంది శ్లోకానికి ఇది అర్థము ఇది టీకా ఇది తాత్పర్యం అని చెప్తుంది మరి అనుభవం ఎవరిస్తారని నువ్వు జీవించే జీవితం ఇస్తుంది జీవితాన్ని పరిపుష్టంగా పరమాత్మ భావనతో అంటే పరమాత్మకు దగ్గరగా ఉన్నటువంటి భావనతో గనుక చేసినట్లయితే అది నిజమైనటువంటి ఉపనిషత్తు యొక్క అధ్యయనం ఉపనిషత్తు మంత్రాలు చదివినంత మాత్రాన మనకు వచ్చేదేం లేదు మంత్రాలున్నాయని తెలుస్తాయి నోటికొన్ని వస్తాయి అంతే కానీ దాని భావం ఏమిటి దానిలో ఉన్న రసస్వరూపం ఏమిటి జగత్తు అంటే ఏమిటి జగద్భావన ఏమిటి జగత్తు చెడ్డదా మంచిదా ఇవన్నీ అనుకుంటూ వెళితే మనం అమృతత్వం వైపు వెళ్ళాలి మరణించిన తర్వాత కూడా జీవించగలగటమే అమృతత్వం అది అంతేతప్ప మరణమే లేకపోవడం అంటూ ఉండదు ఎందుకంటే అనివార్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య విలసితమైనటువంటి సన్నివేశం ఉంటే దాని పేరు మరణము మనం ఏడుస్తాం దుఃఖిస్తాం మనకు అర్థం కాదు ఎందుకు ఏడుస్తున్నాం అంటే బంధన వలన బాంధవ్యం వలన మోహావేశం వలన అయ్యో అయ్యో అని అరుస్తూ ఉంటాం కానీ కాదు మరణం కూడా ఒక సంధ్యా సమయం లాంటిది సూర్యాస్తమయం లాంటిది మళ్ళీ జన్మ కూడా సూర్యోదయం లాంటిది అని తెలుసుకో అని చెబుతుంది ఈశావాస్యోపనిషత్తు జగత్తుని నువ్వు ఎప్పుడూ నిందించకు ఇది చెడ్డ జగత్తు అని పాడు ప్రపంచము, చీడ ప్రపంచము, కీడు ప్రపంచము అవన్నీ నీ మనస్సు ఎట్లా ఉన్నదో నీ ప్రపంచం అట్లా కనిపిస్తుంది అందుకనే ఉపనిషత్తు చిట్టచివరి ఉపనిషత్తు అయినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు దేన్ని విస్తృతంగా వ్యాఖ్యానం చేస్తుందో దానిని ఇక్కడ ఒక బీజప్రాయంగా ఒక చిన్న విత్తనంగా ఒక చిన్న సూచనగా చెప్పి వదిలేస్తుంది ఏం చెప్తుందంటే మనసే దైవం ఉంటుంది.మనసే దైవమని ఉపనిషత్తులు అన్నాయి మనిషి అంటల్ల మనసు దయ్యం అంటున్నాడు దయ్యాల కొంప అంటున్నాడు చాలా దుర్భరంగా దాన్ని తిడుతున్నాడు దాన్ని దూషిస్తున్నాడు అభిశంసిస్తున్నాడు తీవ్రంగా గ్రహిస్తున్నాడు కానీ మనసే దైవం ఎందుకంటే మనస్సు రెండు చూపిస్తుంది ప్రపంచంలో నువ్వు తరించే మార్గం అదే చూపిస్తుంది అంతరించే మార్గం కూడా అదే చూపిస్తుంది మార్గం ఎన్నుకోవటం మన చేతిలో ఉన్నది తప్ప మనసు చేతిలో లేదు ఎప్పుడు ఉంటుంది మనం ఎన్నుకోవటం మన చేతిలో అంటే మనస్సుని కూడా మనం జయించగలిగిననాడు అందుకనే ఇంద్రియాలను జయించు ఇంద్రియాలను జయించు అని వేదాంతులు చెప్తారు నిజమే ఇంద్రియాలను మనం కచ్చితంగా జయించాలి నిజానికి కొంత సాధన చేస్తే తేలిక కానీ జయించిన ఇంద్రియాలతో జీవించటం కష్టం ఎందుకంటే ఇంద్రియాలను జయించడానికి ఒక పదేళ్లు పడితే జయించిన ఇంద్రియాలతో జీవించడానికి తొంభై ఏళ్లు ఉండగలమా అని అంత సేపు నిలబడగలమా నిజమేనా ప్రాపంచికమైన ఆకర్షణలు వీటన్నింటినీ దారుణ రామనీయమైనటువంటి ఆకర్షణలన్నాడు సాహిత్యంలో కాబట్టి ఇవి దారుణమైనవి కానీ రమణీయంగా కనిపిస్తున్నాయి కానీ ఆకర్షణ అంటే ఆకర్షణ ఒక వల వల ఆకర్షణలోకి వెళ్ళామా మనం మళ్ళీ దాని నుంచి బయటకు రాలేం గనుక ఆత్మ సంయమనం చేయమని మనో నియమం చేసుకోమని మనో నిగ్రహాన్ని చేసుకోమని మనో నిగ్రహం కోసమే విగ్రహారాధన అని హైందవ ధర్మము ఉపనిషత్తులు మనకు బోధిస్తున్నాయి ఎందుకండీ విగ్రహారాధన విగ్రహంలో ఏం లేదు కదా అనే వాళ్ళకి జవాబు ఏమిటంటే విగ్రహారాధన అంతా కూడా నా మనో నిగ్రహం కోసం కోసం మాత్రమే అంతే కాదు నాలో ఏర్పడేటువంటి అనేక పరస్పర విరుద్ధ భావజాలాలు వ్యతిరేక్త భావాలు వీటన్నింటినీ సమన్వయం చేసుకొని ప్రశాంతంగా ప్రసన్నంగా నన్ను నేను తెలుసుకుంటూ ప్రపంచాన్ని తెలుసుకోవాలి ప్రపంచాన్ని తెలుసుకుంటూ కూడా నా యొక్క పరిమితులు నేను తెలుసుకోవాలి రెండింటి ఆధారంలో నా జీవిత విధానం ఏమిటి నేను ఎందుకు వచ్చాను నా కర్తవ్యాలు ఏమిటి నేను చేయవలసినవన్నీ చేస్తున్నానా లేదా నేను ఇంకొకరి మెప్పు కోసం చేస్తున్నానా లేదా నా ఆత్మ తృప్తి కోసం చేస్తున్నానా కాక నా జన్మను చరితార్ధం చేసుకోవటానికి చేసుకుంటున్నానా ఇన్ని ప్రశ్నలు వేసుకుంటే తప్ప ఈశావాస్య ఉపనిషత్తు మనకు అర్థం కాదు ఇది వీటన్నింటి ఆధారంతో గనుక ఉపనిషత్తుని క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే చివరికి ఏమవుతుంది అంటే ఒక పెద్ద రెండు మూడు చెరుకు గడలు తీసుకోవచ్చాం మనకి నమిలే టైం లేదు తినే టైం లేదు తాగటానికి ఎక్కువ టైం పట్టదు చెరుకు రసం ఏం చేస్తాం మూడు గడలు చెరుకు రసం మిషన్లో పెడతాం పెట్టగానే అవతల జ్యూస్ వచ్చేస్తుంది మనకు కావలసింది పిప్పా జ్యూసా అంటే జ్యూసే కావాలి పిప్పిని పక్కన పెడదాం జ్యూస్ ని తాగుదాం అందుకనే దశోపనిషత్తుల యొక్క సారాన్ని మనం అర్థం చేసుకుంటూ దీన్ని మూల మూల గ్రంథంలోకి అంటే ఆకర గ్రంథాలు అంటారు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు అర్థమయ్యే రీతి మనకు ఏర్పడినప్పుడు మనం వాటి వైపు వెళ్ళొచ్చు గనుక వీటన్నింటినీ కూడా మనస్సు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకో మనసును నిబ్బరం చేసుకో మనసును నిగ్రహం చేసుకో అని చెప్తూ మనసు ద్వారా నువ్వు ప్రపంచాన్ని చూశావా నీకు స్పర్ధలు ఏర్పడతాయి divisions ఏర్పడతాయి విఘాతాలు ఆఘాతాలు ఏర్పడతాయి వీడు మంచి వీడు చెడ్డ వాడు గొప్ప వడు వీడు అల్పుడు నేను అధికుడిని మరొకడు నా అంతటి వాడు ఇంకొకడు లేడు ఇవన్నీ మనసు చేసేటువంటి పెద్ద గారడి ఇదే ప్రపంచాన్ని నీ నిర్మల నిశ్చలమైనటువంటి హృదయంతో ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి absolute reality తో నీవేమిటో తెలుసుకున్నావు ఎందుకంటే నువ్వేం ఉండబోవటం లేదు జగత్త మారిపోతూ ఉంటుంది నువ్వు ఉన్నా లేకపోయినా జగత్తు అట్లాగే ఉంటుంది జగత్తులో నువ్వొక భాగం ప్రకృతి అంటే ఆత్మ అనాత్మ ఆత్మ పరమేశ్వరుడు అయితే అనాత్మ జగత్తు కాబట్టి అనాత్మ అంటే ఆత్మ కానిది అని కాదు ఆత్మ లేనిది అని కాదు ఆత్మగా కాకుండా ఇంకోలాగా ఉన్నది అని అంతే ఆత్మ లేకుండా ఏం లేదు నదీ నదారలో అరుణాచలంలో అరుణాచల గిరి కొండని భగవాన్ రమణ మహర్షి సాక్షాత్తు శివుడే అన్నారు అంటే ఒక కొండలో ఆత్మను చూశారు ఆయన సత్యసాయి భగవానుడు మనకు పద్యం మనం ఎప్పుడూ చెప్పుకునే పద్యమే మీకు అందరికీ నోటికొచ్చిన చుక్కలు అన్నీ ఇవ్వు బ్రహ్మ చదువుకుంటుంటే ఇంత ఉన్నదా ఇంత ఉన్నదా ప్రపంచాన్ని మనం ఇలాగ చూడవలసింది మనం బ్రహ్మమును చూడటం లేదు బొమ్మను చూసి ఆగిపోతున్నామే అంటే మనకి మన మనస్సు బొమ్మను మాత్రమే చూపిస్తున్నది బ్రహ్మము నీకెందుకు ఇప్పుడు అంటున్నది అవునులే ఇప్పుడెందుకు అరవై ఏళ్లు రా అని అంటుంది అరవై ఏళ్లు దాటాక చేసేది ఏం లేదు ఏమీ లేదు లేదు లేదు లేదు అప్పుడు మొదలు పెడితే ఊరికే శబ్దాలకు అర్థాలు తెలుస్తే ఆహా ఎంత బాగా ఉన్నాయో అనుకుంటాం ఎంత బాగా ఉన్నాయో కాదు ఏమున్నదో తెలుసుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు గనుక మనం వెళ్లినట్లయితే అధ్యాత్మలోకి నెడుపాటి జీవితం తొంభై ఏళ్లు అధ్యాత్మ జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది ఎనభైవ ఏట అధ్యాత్మలోకి వచ్చి భాగవతమో భారతమో మొదలు పెడితే ఒకవేళ చాలా తొందరగా నేర్చుకున్న అనుభవించడానికి జానెడు కూడా కాలం మన చేతిలో లేదు కాబట్టి విస్పష్టమైనటువంటి భావనతో ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగిణే జీవుడు జగత్తు జగదీశ్వరుడు మూడు ఒకటేనని చెప్తూ ప్రపంచాన్ని నువ్వు మనసుతో చూడటం కాసేపు ఆపేసేయ్ ఎందుకంటే నీ మనసు నీ పక్కన నీ తమ్ముడు నీ అన్న నీ అక్క నీ చెల్లెలు నీ తల్లి నీ తండ్రి వీళ్ళ మనసులు వేరు వేరు వేరు కాబట్టి నీదైన మనసుతో జగత్తుని చూసినంత సేపు నీకు బీటలు వారిన అటువంటి చీలికలు పీలికలుగా కనిపిస్తున్న వైవిధ్యంతో వైరుధ్యంతో కూడిన ప్రపంచమే కనిపిస్తుంది తప్ప ఒక సృజనాత్మకమైన మంగళాత్మకమైనటువంటి సన్మంగళ శ్రీకాంతమైనటువంటి ప్రపంచం నీకు గోచరం కాదని చెప్తూ ప్రపంచాన్ని నీదైన హృదయంతో సహృదయంతో చూడటం మొదలు పెట్టు హృద్ అనేటువంటి ధాతువులోనే ఒక సంపూర్ణత ఒక ఖాళీతనం ఒక వైరాగ్యం ఒక వేదాంతంఒక నాదం ఒక సంగీతం ఇట్లా అనేకమైనటువంటివన్నీ దాని యందు ఒక ఖాళీ పాత్ర వలె మన యందే ఉన్నది గనుక హృదయంతో మనం ప్రపంచాన్ని చూడండి. ఒక simple analogy ఏంటంటే మనమందరం స్వామిని చూశాం స్వామి కూడా మనందరినీ చూశారు. మనం స్వామిని మనసుతో చూశాం. కనుక స్వామి పెద్దవారు అయిపోయారు, స్వామికి ఒంట్లో బాలేదు, స్వామి చిన్నప్పుడు అలా ఉండేవారు పెద్దవారు అవుతూ ఇలా వంగిపోయారు ఇవన్నీ అన్నది ఎవరు మనస్సు అన్నది. హృదయంతో చూడండి స్వామి యొక్క జగజ్జేగీయమైనటువంటి ఒక అద్భుతమైన తేజో రూపం మన కళ్ళ ముందు కనిపించి ఆయన వయస్సుతో గాని దేహంతో గాని చూపులతో గాని సంబంధమూ లేని ఒక అద్భుతమైన తారక స్థితిని మనం అనుభవిస్తాం గనుక. ఈశావాస్యోపనిషత్తు మనకు స్పష్టంగా చెప్తుంది మనసుతో చూశావా ప్రపంచం స్పర్ధను create చేస్తుంది హృదయంతో చూశావా అందరూ మనము అనే అనిపిస్తుంది. కాబట్టి సమన్వయము, సంయమనము, నిబ్బరము, నికేతనము, నిరంజనము, తృప్తి, ఆత్మసంయమనము, మనోనిగ్రహము అనేటువంటి అనేకమైనటువంటి భావాలన్నింటినీ కూడా మనకు దగ్గరగా తీసుకువచ్చేటువంటి ఉపనిషత్తు ఏమిటంటే ఈశావాస్యోపనిషత్. అంటే సమస్తము సర్వం ఖల్విదం బ్రహ్మ బ్రహ్మమే. స్వామి చెప్పినట్లుగా అసలు ఏది బ్రహ్మము కాదు. అసలు బ్రహ్మము ఒట్టనిదంటూ ప్రపంచంలో ఏదన్నా ఉన్నదా? ఆయన తాకనిదంటూ, ఆయన లేనిదంటూ ఏదైనా వస్తువు ఉన్నదా? చిన్న ఉదాహరణ, ఇవాళ ఇక్కడ కరోనా కారణంగా ఇవాళ నేను ఎక్కడ ఉంటానో నా ఇంట్లో నేను ఒక కుర్చీలో కూర్చొని మీ అందరితో కాసేపు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక technology కారణంగా కొన్ని లక్షల మంది మనందరం వినగలుగుతున్నాం. మరి technology కి నమస్కరించాలి. అది మానవుడు సృష్టించుకున్న మేధా గతమైనటువంటి ఒక ప్రజ్ఞ. దాన్ని మనం ఎలా వాడుకున్నాం అనేది మన చేతిలో ఉన్నది అంతే. ప్రపంచం కూడా అంతే, ప్రపంచాన్ని మీరు ప్రేమించండి ప్రపంచం మిమ్మల్ని ప్రేమిస్తుంది. అంతే కాదు రెండు మూడు ఉదాహరణలు చెప్తా, ఒకటి మన వాకిట్లో ఒక చిన్న పూల మొక్క ఉంది. నాకు బాగా గుర్తుంది హైదరాబాద్ AG's office లో మాట్లాడుతూ మాట ఎప్పుడో ముప్పై ఏళ్ల నాడు చెప్పాను. మీ వాకిట్లో ఉన్నటువంటి ఒక పూల మొక్క దగ్గరికి వెళ్లి నువ్వు office కి ఇంటికి తాళం పెట్టి వెళ్ళేటప్పుడు ఒక్క క్షణం ఒక్క second ఆగి పూల మొక్కని మీరు ప్రేమగా తడవండి మూడు పూలు పూసేటువంటి తలవారి పత్తికి ఆరు పూలు పూస్తుంది. స్పర్శ దానినే కింపురుష లోకం అన్నారు. మానవుడు చూడండి మనం ఒంట్లో బాగా లేని వాడి దగ్గరికి వాడు ఏవి తినకూడదో అవన్నీ bucket లు bucket లు తీసుకొని వెళ్తాం. వాడికి అవసరం లే. వాడికి కావాల్సింది స్పర్శ కావాలి. నీకేం భయం లేదు మేమున్నాం ఒక మాట, దానికి కాసు ఖర్చు లేదు. నువ్వు తీసుకెళ్లినవన్నీ ఆయన ఏం తినడు. నర్సులకో వాళ్లకో ఇస్తాడు. ఇవ్వవలసినది ఏమిటంటే ప్రేమ ఇవ్వాలి. ప్రేమని సేవా రూపంలో ఇవ్వాలి. దీనినే ఈశావాస్యోపనిషత్తు చెప్పినటువంటి మూడు వందల అరవై డిగ్రీలలో చెప్పబడినటువంటి పోతనామాత్యుడు చెప్పిన యవనిచే జనించు జగము అనే పద్యానికి అలాగే అహంకార మమకారాలు వదిలిపెట్టాలి అని విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీమద్రామాయణ కల్పవృక్షం రాసిన తర్వాత చూడండి ఆయన ఋషి అయినాడు. పండి పండిన పండి అయినాడు. ఆయన పుస్తకాన్ని గ్రంథాన్ని release చేయాలి ఆవిష్కరించాలి అంటే governors వీళ్ళందరూ వచ్చేవాళ్ళు కానీ ఆయన అన్నాడు "సజ్జోనిర్గతమైన సర్వ భావనా సంభారం వెళ్ళ నైవేద్యంబిచ్చితి నీకు రామచంద్ర ప్రభువా" ఇవన్నీ నే రాసానంటయ్యా నువ్వు నా సజ్జోనిర్గతంగా అప్పటికప్పుడు నాలో ఆలోచనలు పుట్టించావు. పుట్టించి ingredients అన్నీ నాకు ఇచ్చావు, నేను రాశాను. "సజ్జోనిర్గతమైన సర్వ భావనా సంభారం వెళ్ళ నైవేద్యంబిచ్చితి నీకు రామచంద్ర ప్రభువా విశ్వాసమున్ పూనవే ఆద్యంబగు జీవ లక్షణము సంహారంబు కావింపవే" నాలో మొట్టమొదటగా నా తల్లి గర్భంలో ఉండగానే రెండు లక్షణాలతో నేను జీవ లక్షణాలతో వచ్చా. అవే మమకారము, అహంకారము. రెండింటిని నా నుంచి దూరం చేయి, నశింపజేయి. సత్యంబై తన చోటు నీ దివ్య తేజంబు సారింపంగదే గుండియన్నన్నాడు. నీ దివ్యమైనటువంటి నీ దృష్టి నా మీద ప్రసారమయ్యేట్టు చూడవయ్యా అని ఆయన అడిగినట్లుగా మనం ఈశ్వరుణ్ణి మనం చూడటం కాదు, ఈశ్వరుడు మనల్ని చూడాలి. మనం పరమాత్మని సత్యసాయి భగవానుణ్ణి ఈశ్వరమ్మ కొడుకుగా చూశాం, స్వామిగా చూశాం, జ్ఞానిగా చూశాం, గురువుగా చూశాం, సర్వ దేవతలకీ అతీతమైన భావన అని భావించాం. అది మనం-మనం చూసిన చూపు. స్వామి మనల్ని ఎలా చూశారంటే మన పేరుతో గాని మన ఉనికితో గాని సంబంధం లేకుండా మీరంతా దివ్యాత్మ స్వరూపులు, మీరంతా ప్రేమాత్మ స్వరూపులు. అంటే మనం మనసుతో ఆయన్ని చూస్తే ఆయన తన హృదయంతో మనల్ని చూశారు. హృదయము విశ్వ హృదయం కాబట్టి సర్వోన్నతమైనటువంటి విశాల భావనా స్థితిలోకి మనందరం వెళ్లాలని ఉపనిషత్తులు మనకు చెప్పనిదంటూ లేదని వాటిని నిత్య జీవితంతో మనం అనుసంధానం చేసుకోవాలని నిత్య జీవితం మనకు పరమేశ్వరుడు అనుగ్రహించిన ఒక రత్న వేదిక అని రత్న వేదిక మీద మన ఆలోచనలన్నీ కూడా ప్రసన్నంగా, ప్రఫుల్లంగా, ప్రశాంతంగా, హాయిగా సాగుగాక అని మంగళాశాసనం చేస్తూ సర్వ దేవతాతీత స్వరూపులైనటువంటి స్వామి మనందరినీ కూడా ఉపనిషత్ భావనా జరిలో మనందరినీ అంటున్నది నేనేమీ అనటంలే స్వామి అంటున్నారు నేను ప్రథమ శిరోతురాలినంతే. నేను ఏది వింటున్నానో మీతో చెప్తున్నాను. కనుక మనందరినీ కూడా సన్మార్గంలో నడిపించాలని, ఉపనిషన్మూర్తుల వలె మనందరినీ తీర్చిదిద్దాలని, జీవితాన్ని చాలా స్పష్టంగా ఒక జననాన్ని, మరణాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని అన్నింటినీ కూడా clear గా చూడగలిగినటువంటి ఒక నైతిక, భౌతిక, లౌకిక, ధార్మిక, ఆధ్యాత్మిక, చేతనా చేతనా స్థితులు అన్నింటినీ కూడా స్వామి మనందరి మీద మహామృత వృష్టి వలె కురిపించు గాక అని స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ సాయిరాం.
YouTube · audio

Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 2

Home

Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 2

Source: Sai-Showers on YouTube

0:00 / 1:15:15

More in this series

Upanishad Vahini — Samagra Vyakhyanamu

3 episodes · 3 hr 26 min

  1. 58 min 1

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 1

  2. 1 hr 1 min 2

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 2

    Now playing
  3. 51 min 3

    Upanishad Vahini - Samagra Vyakhyanamu — Part 3