Skip to content
Transcript తెలుగు
[మ్యూజిక్] "అగజానపద్మార్కం జానన మహర్నిశం అనేకతం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే" అని భక్తజనాళి అంతా కూడా విఘ్నేశ్వరుడిని, వినాయక స్వామిని, గణపతిని పూజ చేస్తూ, కీర్తిస్తూ, ఆవాహన చేస్తూ, ఆరాధిస్తూ, గౌరవిస్తూ, పూజిస్తూ, ప్రేమించేటువంటి ఒక మహత్పూర్ణ సన్నివేశమే వినాయక చవితి. వినాయకుడి ఉత్పత్తి కథాక్రమం మాత్రమే కాక అనేకమైనటువంటి మార్మికమైన విషయాలున్నాయి. వాటిని ఇవాళ మనం చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఖగోళానికి, భూగోళానికి, అనుగ్రహానికి, మహిమకు ఉన్న తేడా, అలాగే అనుగ్రహానికి, ప్రేమకు, దివ్య ప్రేమకు, కాల కార్య కారణ సంబంధాలకు ఒక అవినాభావమైన సంబంధం ఉందని హైందవ సమాజము, సనాతన ధర్మము నమ్ముతూనే ఉంటుంది గనుక వీటన్నింటినీ కూడా కాస్త లోతుగా, విస్తృతంగా విచారణ చేసుకునేటువంటి ఒక చక్కని సన్నివేశమే వినాయక చవితి. ముందుగా ఖగోళానికి వెళ్దాం. ఖగోళంలో వినాయక చవితి నాడు తెల్లవారుజామున ఆకాశం మేఘావృతం కాకపోతే, అంటే నిర్మలంగా clear గా గనక ఉంటే ఒక నక్షత్రాల గుంపు కనిపిస్తుంది. అది ప్రతి సంవత్సరము రోజున అలాగే కనిపిస్తుంది. నక్షత్రాల గుంపు ఎలా ఉంటుందని-- చుక్కల వలే ఉంటాయి. నక్షత్రాలు చుక్కలు కదా! చుక్కలన్నింటినీ కలుపుకుంటూ వెళితే అది ఒక ఏనుగు ఆకారంలో ఉంటుంది. కనుక అది హస్తి. హస్తిలో భాద్రపద శుద్ధ చవితి ఉన్నది కనుక దాని పేరు నక్షత్ర ప్రమాణం ప్రకారం హస్త అని పేరు పెట్టారు. భాద్రపద మాసము, హస్త నక్షత్రము, ఏనుగుల గుంపు హస్తిగా ఉన్నది గనుక ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. సమయంలో నక్షత్రాల గుంపు అంతా కూడా మిణుకుమిణుకుమంటూ ఉండవు. చాలా సుస్పష్టంగా కనిపిస్తాయి. కనిపించిన దానిని ఇవాళ సాంకేతికమైనటువంటి ఒక విషయంగా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, అక్కడి నుంచి మనం కాస్త వెనక్కి వెళ్లి భాద్రపద మాసం అని పేరు ఎందుకు పెట్టారు మన వాళ్ళు? మనందరికీ తెలుసు శ్రావణం, భాద్రపదం వరుసగా చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. కానీ భాద్రపదము అంటే నిజానికి అది భద్రపదము అని అర్థం. ఎవరి భద్రపదం అది? ఏనుగు యొక్క భద్రపదం. ఏనుగు పదమే భద్రం. అ-అరణ్యాలలో ఉండేటువంటి అనేకానేకమైనటువంటి జంతు సమూహాలలో ఒక గంభీరమైనది, చాలా పెద్దదైనటువంటి శరీరం కలిగి ఉన్నది ఏది అంటే అది ఏనుగు. నిజానికి నేల నుంచి సుమారుగా పదహారు అడుగుల నుంచి ఇరవై ఒక్క అడుగుల వరకు కూడా పెరిగి ఉంటుంది. కాస్త భాద్రపద మాసము భద్రపదము ఎట్లా ఏనుగు వాడుకుంటుంది అనంటే త్వరత్వరగా వెళుతున్నప్పటికీ కూడా ఎక్కడో పదహారు అడుగుల పైన సమాంతరంగా ఉన్నటువంటి రెండు కళ్ళలో నుంచి సూక్ష్మమైన దృష్టితో తన పాదాలకేదైనా జంతువులు అడ్డంగా పరిగెత్తుతున్నాయా? ఉదాహరణకు కుందేలు పరిగెత్తుతున్నది. అప్పుడు ఏనుగు ఏం చేస్తుంది అని. పరిగెత్తుతున్న ఏనుగు ఆగిపోనన్నా ఆగిపోతుంది లేదా కుందేలు ఒంటిమీద తన కాలు పడకుండా కాలు నిలబెట్టి ప్రాణిని కాపాడుతుంది. ఇది భద్రపదం. అంతే కాదు, తాను నడుస్తూ వెళుతూ ఉన్నటువంటి వేళ సింహపు అడుగుజాడలను గనక గుర్తించినట్లయితే తన మందకు ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఒక సంకేతము "నా రక్షణకు రండి" అని కావచ్చు, "మీరు వాడి శిక్షకు గురి కాకుండా మిమ్మల్ని కాపాడుకోండి" అని కావచ్చు. ఎట్లాగైనా సరే శబ్దం ఏనుగుకి అర్థమవుతాయి. మిగతా గ్రూప్ కంతా అర్థమవుతుంది గనుక గుంపులన్నీ చక్కగా తమ ప్రాణాలను తాము రక్షించుకుంటాయి. అంతే కాదు, సింహం ఉన్నది. కలలో ఏది వచ్చినా అది పెద్ద పట్టించుకోదు. కానీ సింహం కలలోకి గనక ఏనుగు వచ్చినట్లయితే సింహం ప్రాణం విలవిలలాడిపోతుంది. ఇక తనకు మరణం ఆసన్నం అవుతుంది అని జాగ్రత్త పడుతుంది, ఆందోళన పడుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. అంతే కాదు, తన తొండము నేల వరకు నేలకి తాకకుండా జన్మ అద్భుతంగా పెరుగుతుంది. జన్మ శరీరం అలా ఎంతగా పెరుగుతుందంటే తొండము నేలకు ఆనించకుండా ఉండేట్టుగా శరీరం పెరుగుతుంది. ఒక ఏనుగు, ఏనుగు పెద్దదైనా, ఉన్న ఏనుగైనా భూ స్థలం మీద నుంచి పైకి ఉంటుంది. అంటే కేవలమైనటువంటి భౌతిక స్థాయిని దాటి ఒక intellectual altitude లో, plane లో సంచారం చేయగలదు అనటానికి గుర్తు ఏమిటయ్యా అంటే ఏనుగు యొక్క కళ్ళు. మనందరి కళ్ళు కూడా ఒక సరళ రేఖ గీసినట్టుగా ఉంటాయి. ఏనుగు కళ్ళు అట్లా ఉండవు. Offset అయి ఉంటాయి. అటూ ఇటూ ఉంటాయి.అటు ఇటు ఉన్నందువలన మూడు వందల అరవై డిగ్రీలలోది ప్రపంచాన్ని చూడగలదు. కళ్ళు చాలా చిన్నది. కానీ ఒళ్ళు చాలా పెద్దది. చిన్న కళ్ళు ఏవి అంటే సూక్ష్మ సూక్ష్మీతరమైనటువంటి విషయాలను కూడా సునాయాసంగా పట్టుకోగలిగినటువంటి ఒక చూపు. దానికి శక్తి ఉన్నది. కనుకనే మనం ఒక చిన్న సూది నేల మీద వదిలేసి ఏనుగు ముందు గనక పెడితే తన తుండంతో సన్నటి సూదిని తీసి మన చేతిలో పెట్టగలదు. ఇది రెండు. చామర కర్ణ గజానన అని భజన చేస్తాం. ఏమిటి చామర కర్ణాలు? అంటే రెండు విసనకర్రలు అలా ఊపుతూ ఉంటుంది గనుక అని అంటే కాదు కాదు. చాలా పెద్ద చెవులవి. ఎందుకంటే అరణ్యంలో జరుగుతున్న ఆర్తనాదాలు కానీ, చిన్న చిన్న క్రిమికీటకాదులు చేసే శబ్దాలు కానీ అన్నింటినీ ఒక చెవి తీసుకుంటుంది. అవసరమైన వాటిని ఉంచుకొని మిగతా వాటిని వదిలి పెడుతుంది. విషయంలో అది మానవజాతి కంటే సర్వోత్కృష్టమైనటువంటి జాతి జన్మ ఏనుగు జన్మ. ఇక తుండము కిందకు వేలాడదీసినట్లుగా ఉంటుంది. అవసరమైనప్పుడు తుండము ఎత్తినప్పుడు ఎలా ఉంటుందంటే అది ఓంకారం లాగా ఉంటుంది. ఓంకారము నాదబ్రహ్మమైనటువంటి పరమాత్మకు సంకేతంగా విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక శరీరం చాలా పెద్దది. ఎంత ఉన్నా ఏనుగు ఇంత శరీరం కదా ఎలా ఏం తింటుంది అని. It is perfectly a pure vegetarian అని. మాంసం ముట్టుకోదు. ఇంకొక జీవిని చంపదు. అంటే దానిలో సంపూర్ణమైన సత్వగుణం దాని యందు ఉన్నది. అటువంటి ఏనుగు గురించి ఇవాళ ఇంత సేపు ఎందుకు చెప్పుకున్నాం అంటే చామర కర్ణ గజానన అన్నారు కదా. అంతేగా. అంతే కాదు, అగజానన పద్మార్కం, గజాననం అహర్నిశం. పదాలన్నీ ఒక వరుసగా ఆయన కూర్చాలే. దాన్ని చాలా విభజించుకొని అర్థం చేసుకోవాలి. అగజానన అంటే ఎవరు? అగజము అంటే కదలనిది. అంతే కదా. కదలనిది ఏమిటి? హిమవత్పర్వతం. హిమాలయ పర్వతానికి కూతురు ఎవరు? పార్వతీదేవి. ఆమె-ఆమె ముఖ మండలం ఎట్లా ఉందట అంటే పద్మం లాగా ఉందట. అగజానన పద్మార్కం. ఏ-దేనిని చూసి పద్మం వలె వికసించి హాయిగా ఉన్నది అంటే గజాననం. ఏనుగు తలను ధరించిన వినాయకుడిని చూస్తే అమ్మవారి ముఖం వికసిస్తున్నదట. అగజానన పద్మార్కం గజాననం. అది అప్పుడప్పుడునా, ఎప్పుడు ఆమెకు ఆనందం కలిగినప్పుడా లేకపోతే ఆయన ఆమెకు ఆనందం కలిగించినప్పుడా అంటే, ఆయన ఎప్పుడూ ఆనందం కలిగిస్తాడు. ఆమె ఎప్పుడూ ఆనందిస్తూనే ఉంటుంది. అహర్నిశం. అహ-అహర్నిశం అంటే అహం లేదు నిశా అంటే పగలు లేదు రాత్రి లేదు సర్వకాల సర్వ అవస్థల యందు కూడా తన కుమారుడు అయినటువంటి గజాననుడిని చూసి అమ్మవారి ముఖం పద్మం వలె వికసిస్తున్నది. బాగుంది కదా. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అది. అంటే అనేకదం మన వాళ్ళు పద్యాలు పాటలు పాడేవాళ్ళు చాలా ప్రముఖమైనటువంటి వాళ్ళు కూడా అనేకదంతో అనేకదంతో అని పాడతారు. అనేకదంతాలు ఏవున్నది. ఉన్నదే ఏకదంతం. అనేకదం అనేకాన్ని ఇచ్చేవాడు దం అంటే ఇచ్చేవాడు. అనేకము ఏకము కానివి ఇచ్చేవాడు. కానీ ఏకదంతం ఒక దంతమే ఉన్నటువంటి వాడు. అటువంటి ఆయనని నేను ప్రణమిల్లుతున్నాను ఆయనకి అని అర్థం. ఏకదంతం ఉపాస్మహే. ఆయన్ని నేను ఉపాసిస్తున్నాను అన్నటువంటి ఒక చల్లని భావన. ఇక ద-వినాయక స్వామి ఎలా పుట్టారో ఒక రెండు నిమిషాలు మనకి కథంతా తెలుసు. అది అంతా చెప్పుకోనక్కర్లే. అమ్మవారు స్నానానికి వెళ్తున్నది. ఇది కదా కథ. ఒంటిమీద ఉన్న నలుగు పిండి అక్కడే పెట్టి ఒక చిన్న బొమ్మను చేసి దానికి మనందరిలాగానే అమ్మ కూడా ప్రాణం పోసి ఆమె స్నానానికి వెళ్ళింది. గజాసుర సంహారం చేసి వచ్చినటువంటి పరమశివుడికి కైలాసం దాకా రాగలిగాడు గానీ కైలాసం లోపలికి పోవటానికి అవకాశం దక్కలే. కారణం అమ్మ సృష్టించినటువంటి అంటే తన నలుగులో నుంచి తన తనువులో నుంచి సృష్టించినటువంటి తన తనయుడికి ఒక instruction ఇచ్చింది. నా స్నానం పూర్తయ్యేదాకా ఎవరూ లోపలికి రావటానికి వీల్లేదు నువ్వు చూసుకో నాయనా అంది. మనసా వచసా శిరసా దాన్ని ఆజ్ఞను పాలించి వినాయకస్వామి పరమశివుడ్ని ఆపినప్పుడు పరమశివుడు అప్పుడే గజాసుర సంహారం చేసి రజోమూర్తి అయినటువంటి శివ పరమాత్మ శిరస్సును ఖండించాడు. అదే సమయానికి ఆమె స్నానం చేయటం పూర్తయి వస్తే ఒక్కసారి మొండెము తల విడిపోయి ఉన్నటువంటి తాను ప్రాణం పోసినటువంటి పిండి బొమ్మ కనిపిస్తూ ఉన్నది. ఎంతైనా తాను సృష్టించి తాను రచించి సర్వ జగద్రక్షణి అయినటువంటి తనకు ఒక రక్షణగా పెట్టినటువంటి మహా శక్తి అంటే క్షణంలో అమ్మవారి శక్తంతా ఆయన యందు పిండి బొమ్మ యందు పెట్టింది అని అర్థం. శక్తిని ఈయన తల తుంచాడే అని అనుకుంటున్నటువంటి వేళ సరే వాళ్ళిద్దరి మధ్య ఏదో సంభాషణ జరిగి ఉంటుంది అప్పుడు ఆయన అన్నాడు. సర్వోన్నతమైనటువంటి స్థితిలో గజాసురుడి యొక్క తలని పెట్టాలి అని నా భక్తుడు కోరుకున్నాడు.ప్రాణము పోసినటువంటి పిండి బొమ్మకు ప్రాణము తీసిన నేను మళ్ళీ ప్రాణము శక్తి అన్నీ ఇచ్చి నీ కొడుకును నేను ఇదిగో అప్పజెబుతున్నాను అని ఇచ్చాడు. అంటే ఒకరు ప్రాణం పోసేవారు రెండవ వారు ప్రాణం తీసేవారు రెండూ కలిపినటువంటి ఒక ప్రాణానికి ఒక ఐక్యతా భావంగా ఒక వారధిగా ఒక కారణంగా ఒక కార్యంగా ఒక కలాపంగా ఒక విలాసంగా ఉన్నటువంటి శ్రీ వినాయక విలాసమే ఆయన ఉత్పత్తియే ఒక విలాసం. విలాసం అంటే రెండు అర్థాలున్నాయి విలాసము అంటే ఆయన చరిత్ర, ఆయన వైభవము, ఆయన కీర్తి, ఆయన శక్తి, ఆయన అనుగ్రహించే విభూతి అవన్నీ. విలాసము అంటే address అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి వినాయక విలాసం ఎక్కడ అంటే కైలాసమే ఆయన విలాసం ఒకటి. తల్లిదండ్రులు ఎవరంటే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు. పుట్టుక ఎక్కడిది అంటే అయోనిజుడు గర్భాలయంలో ఏం కూర్చోలేదు ఆయన. అప్పటికప్పుడు సద్యస్ఫూర్ణగా అమ్మవారి హృదయంలో నుంచి, సంకల్పంలో నుంచి, శక్తిలో నుంచి ఆవిర్భూతమైనటువంటి వినాయకుడికి గజాననమైనటువంటి అంటే ఏనుగు తల సంకల్పించబడటం అది తండ్రి ఇచ్చినటువంటి అనుగ్రహం. అంటే తల్లి తండ్రి ప్రపంచానికి మనకు కూడా ఆయువు తల్లి పోస్తే శరీరాన్ని పోషించి పెద్ద చేసి నిలబెట్టి జీవితాంతము facilitate చేసేటువంటి వాడు ఎవరంటే అదిగో తండ్రి అవుతున్నాడు. కనుక ఉంటే పార్వతీ పరమేశ్వరుల వలె తల్లిదండ్రులు ఉండాలి. కొడుకు ఎలా ఉండాలి అంటే ఉండగలిగితే వినాయకుడి వలె ఉండాలి అని మనకి కథ చెబుతున్నది. ఇది. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన గజాననుడు అన్నాం ఆననం అంటే ముఖం. గజము అనేటువంటిది ఎక్కడో కైలాసంలో ఉంటే కుదరదుగా కాబట్టి అది ఏం చేయాలి అంటే అసలు గజము అంటే ఏమిటంటే ఏనుగు అని అర్థమేనా అంటే అంటే పుట్టేది గత్ అంటే పోయేది. ఏది పుడుతున్నదో అది పోక తప్పదు, ఏది పోవలసి ఉన్నదో అది పుట్టక తప్పదు. కాబట్టి చావుపుట్టుకలు రెండూ కూడా సమానంగా స్వీకరించగలిగిన ఒక ఆధ్యాత్మిక ధీశక్తి గలవాడు ఎవరంటే గజ ఆననము ధరించినటువంటి వినాయకస్వామి. ఇక ఆయన శరీరం ఎట్లా ఉన్నది ఆకృతిని కాసేపు మనం మాట్లాడుకుందాం. పెద్ద తల సన్నని నడుము దాని చుట్టూ పేరుకున్నటువంటి పెద్ద బొజ్జ మనం ఏమంటాం కదా తొరపు బొజ్జ ఇది వమహస్తము అని చదువుతాం కదా భజన. కాబట్టి ఎలా ఉన్నాడంటే చామర కర్ణాలు చెప్పుకున్నాం, కన్ను చెప్పుకున్నాం, తరవాత తొండం చెప్పుకున్నాం ఓంకార స్వరూపమేను అని. తర్వాత మన నోళ్లన్నీ బయటకు కనబడుతూ ఉంటాయి తినడానికి సిద్ధంగా. ఏనుగు యొక్క నోరు తొండం వెనక దాక్కొని ఉంటుంది. ఎవరైనా ఏదైనా పెట్టాలంటే చాటుగా మాటుగా పెట్టాలి public గా పెట్టినప్పటికీ కూడా. ఏం చేస్తుంది అంటే దానికి అపారమైన జీర్ణశక్తి ఉన్నది. ఎంతగా అంటే తెలుగులో ఒక సామెత పుట్టింది కరి మింగిన వెలగ పండు అని ఒక సామెత. కరి అంటే ఏనుగు, ఏనుగు మింగిన వెలగ పండు. ఏమిటి ఏనుగు వెలగ పండు ఏమిటి? కరి మింగిన వెలగ పండు ఏమిటంటే మనకి మన అదృష్టవశాత్తు పూర్వ పుణ్య విశేషంతో భగవంతుడు అపారమైన సంపద ఇస్తాడు. మన అహంకారం చేత మనకున్నటువంటి negativities చేత సంపదను పోగొడతాం. ఇచ్చినవాడు పరమాత్మ పోగొట్టేది జీవుడు. కానీ వినాయకుడు ఒక వెలగ పండుని ఎలా తింటాడంటే నోట్లో వెలగ పండు పెడితే వెలగ పండు లో ఉన్నటువంటి గుజ్జు మాత్రమే తీసుకుంటాడు shell బద్దలు కాకుండా బయటకు విసిరేస్తాడు నోట్లో నుంచి. ఎట్లా అంటే శరీరంలో ఏనుగు శరీరంలో ఉన్నటువంటి animated heat అంటాం దానికి గుజ్జు కరిగిపోయి దానికి పొట్టలోకి వెళ్ళిపోతుంది తనకు పనికిరానిది బయట పడేస్తుంది. చూశారా అందువలన కరి మింగిన వెలగ పండు అని సామెత వచ్చింది. ఇక ఆయన ఇందాక చెప్పాం పదహారు నుంచి ఇరవైఒక అడుగుల ఎత్తున ఉంటాడు అని. అయితే ఇరవైఒక అడుగుల ఎత్తున ఉన్నటువంటిది కింద పరిగెత్తుతున్నటువంటి క్రిమి కీటకాలను కూడా చూడగలదు. సింహంపు అడుగుజాడలు చూసి తన route మార్చుకొని వెళ్లగలదు. అత్యంత మేధాశక్తి కలిగినటువంటిది గజాననుడు ఏనుగు. ఎంతటి జ్ఞాపక శక్తి అంటే ఒక sound ని పట్టుకుంటే mind లో record చేసుకుంటుంది. ఇంతటి ఏనుగు అనేకమైనటువంటి నాడీ మండలాలన్నీ కూడా దాని కుంభస్థలం మీద తల మీద ఉంటాయి. కుంభస్థలం అంటే కుంభము వలే ఉంటుంది పెద్ద కుండలాగా ఉంటుంది తల. పైన ఉన్నటువంటి అనేక నాడీ మండలాలలో ఎప్పుడైనా ఒక direction తీసుకోవాలి అన్నప్పుడు మావటి వాడి చేతిలో ఉన్నటువంటి ఒక అంకుశాన్ని అక్కడక్కడ acute pressure గనక చేస్తే ప్రశాంతం అయిపోతుంది. అంటే ఎంత మేధాశక్తి ఉన్నా, ఎంత జ్ఞాని శక్తి ఉన్నా, అవతల వాడు చెప్పేది వినయంగా వినాలి అని మాకు నేర్పుతున్నది. లేకపోతే నువ్వేమిటి నాకు చెప్పేదని వాడిని కింద పడేయొచ్చుగా పడేయదు. తాను మానం మావటి వాడు తనని నడిపిస్తున్నటువంటి వాడు గనుక ఆతడు చెప్పినట్లు నడుచుకుంటుంది. ఇది వినాయక స్వామి కూడా తల్లిదండ్రులు ఏం చెప్తే అదే చేశాడు ఆయన. ఇవన్నీ అట్లా ఉండగా మూడు రంగులలో ఏనుగు కనిపిస్తుంది. దాన్ని ఇవాళ pachyderm అంటాం English లో. అది ఎట్లా ఉన్నా grey color లో ఉన్నటువంటివి ఎక్కువ కనిపిస్తాయి. నల్లగా ఉన్నవి కాస్త తక్కువగా కనిపిస్తాయి.తెల్లగా ఉన్నవి అరుదుగా కనిపిస్తాయి మూడు ఉంటాయి బూడిద రంగులో కూడా ఉంటుంది దాన్ని మనం తెల్ల రంగు grey తర్వాత ఇదిగో black అయితే అసలు ఏనుగు లక్షణం ఏమిటి అంటే absolute intelligence deep knowledge గ్రహణ శక్తి tremendous memory power దేనినైనా గ్రహించగలిగి retain చేయగలిగినటువంటి intellectual quotient అంతే కాదు ఒక మావటి వాడు ఒక trainer తనకి ఏమి నేర్పాడో ఏం చేయమని చెప్పాడో తూ.చా. తప్పకుండా సన్నివేశాన్ని బట్టి తనను తాను ఆవిష్కరించుకునేటువంటిది జ్ఞానంలో నుంచి పుట్టింది విజ్ఞానంలో నుంచి పుట్టింది మన గణేషుడు వినాయక స్వామి కూడా తద్భిన్నం ఏం కాదు ఎందుకంటే ఆయన తల తలలోనిగా అసలు ఉన్న తలపులన్నీ తలలోనే ఉన్నాయి కనుక ఏనుగు ప్రాపంచిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గణేషుడికి ఉన్నాయి గణేషుడికి ఏమున్నాయో అవన్నీ ఇక్కడ ఏనుగుకి కూడా ఉన్నాయి కనుక రెండు ఒక అభేదమైన స్థాయిలో సంచారం చేస్తాయి. ఒకానొక సందర్భంలో ఒక చిన్న పోటీ ఏర్పడింది ప్రమథ గణాలకి సైన్యాధ్యక్షుడు ఎవరు ఉండాలి అని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కొడుకులు మనకు తెలుసు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు. ఒక చిన్న చూపు ఉండేది కార్తికేయ స్వామికి చాలు ఆయన అందగాడు సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం కాదది సుబ్రహ్మణ్యం సు అంటే ఉదాత్తమైన ఉన్నతమైన ఉత్కృష్టమైన సమున్నతమైనటువంటి బ్రాహ్మణ్య స్థితిలో ఉండేటువంటి వాడు సుబ్రహ్మణ్యం. ఆయన అన్నగారేమో గణేషుడు ఈయన ఇక్కడ ఉన్నాడు సర్వసైన్యాధ్యక్షుడు కావాలి అనే కోరిక గణే-- కార్తికేయుడికి ఉన్నది సరే తల్లిదండ్రులు నువ్వు ఉండరా నువ్వు వద్దు రా అని వాళ్ళు చెప్పరు కదా వాళ్ళు చిన్న పరీక్ష పెట్టారు ఎవరైతే అనేక నదీ నదాల్లో స్నానం చేసి ముందుగా మా దగ్గరికి వస్తారో వాళ్ళు సర్వసైన్యాధ్యక్షులు అవుతారు అని తండ్రి శివ మహా స్వామి చెప్పటమైంది. కార్తికేయుడు అనుకున్నాడు మా అన్న పెద్ద పొట్ట ఉంది చిన్న పాదాలు కాళ్ళు చిన్నవి రూపం కాస్త మరువుజ్జుగా ఉంటుంది తల పెద్దది అయినా ఎప్పటికి వెళ్ళేనో ఏం చేయనో పైన పైగా ఆయనకేమో వాహనమేమో ఎలుక ఎలుక మనసు చంచలమైంది అది కాశీ వెళ్ళు అంటే ప్రయాగ తీసుకెళుతుంది ప్రయాగ తీసుకెళితే ఇంకో చోటికి తీసుకెళుతుంది కాబట్టి మా అన్నగారు సంపూర్ణంగా అనర్హుడు అని నిర్ణయించుకున్నాడు. పైగా ఏమన్నాడంటే నేను మయూర వాహనుడిని నెమలి నా వాహనం ఇలా మొదలు పెట్టానంటే ఆకాశాన్ని చీల్చుకొని తీసుకెళ్ళగలిగిన వేగం ఉంది దానికి అని అనుకున్నాడు. వినాయక స్వామి ఆయనకీ ఆలోచనలు ఏవీ లేవు నా-- తన శరీరం సహకరించనిదని గానీ తనకు ఇన్ని అననుకూలాలు ఉన్నాయని గానీ తాను సర్వసైన్యాధ్యక్షుడు కావాలని గానీ ఏమీ లేదు కానీ తండ్రి పరీక్ష పెట్టినప్పుడు గెలిచినా ఓడినా ముందు పరీక్షలో పాల్గొనాలి కాబట్టి అప్పటికే వెళ్ళిపోయినాడు ఎవరు కార్తికేయుడు వెళ్ళిపోయినాడు బయల్దేరి అందరికన్నా ముందు వెళ్ళాలి కదా అన్నాడు సమస్త ప్రపంచమూ తల్లిదండ్రులు అయినటువంటి మేము మీ యందే మీ ముందే ఉన్నది గనుక నా అన్ని స్థితులనీ గమనించుకొని నా తల్లిదండ్రులకు మూడు ప్రదక్షిణాలు చేసుకుంటాను అదే నేను చేయగలిగినటువంటి యాత్ర అన్నాడు. మీ పాదాలలో గంగ ఉన్నది సర్వ నదులు ఉన్నాయి మీ యందు లేనిదంటూ ఏం లేదు మీరు ఆది దంపతులు మాకు అట్లాగే తల్లిదండ్రులు మీరు అని వినయ పూర్వకంగా సమర్పణగా వినయంగా శరణాగతితో చక్కగా మూడు ప్రదక్షిణాలు చేసుకున్నాడు. జరిగిన విచిత్రం ఏంటంటే కుమారస్వామి నదిలో స్నానం చేసి బయటకు ఒడ్డుకు చేరుతున్నాడో అప్పటికి గణేషుడు స్నానం చేసి వెళ్ళిపోతున్నట్టు కనిపించేంది దృశ్యం ఇదేమిటి ఆశ్చర్యపోయినాడు మా అన్నగారేమిటి ఇలా ఇంత fast గా వచ్చేసాడు అని కాబట్టి ఏమిటి ఇంత వేగవంతంగా వెళ్ళిపోతున్నాడని అయినా నాకు అనవసరం నేను గెలవబోతున్నాను అని నిర్ణయంతో ఆయన వెళ్ళాడు సరే గణేషుడు ఎక్కడికీ వెళ్ళలేదు కైలాసంలో తల్లిదండ్రుల పాద పద్మాల దగ్గర కూర్చున్నాడు. తిరిగి వచ్చేప్పటికీ కార్తికేయుడు ఏమన్నాడంటే నేను చిట్టచివర నదీ స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు కూడా అన్నగారే బయటకు వచ్చారు కనుక అన్నగారే విజేత అని ఆయన ప్రకటించాడు అది సుబ్రహ్మణ్య స్థాయి అంటే అది లేదు నాకెక్కడా కనపడలేదు అసలేమిటి పోటీలో లేడని ఈనాటి వాళ్ళలాగా మాట్లాడలా నా అన్నగారే విజేత అని ప్రకటించాడు సమసిపోయింది కనుక ప్రమథ గణాలకి ప్రప్రథమ సైన్యాధ్యక్షుడు గణాధిపతి ఎవరు అంటే ఈయన గణాలు అంటే మనకి గ్రహాలు అని చెప్తున్నారు గ్రహాలు కావు గణాలన్నీ కూడా ప్రమథ గణాలు ప్రమథ గణాలన్నీ కూడా ఈశ్వరుడి యొక్క బలాలు ఈశ్వర సైన్యం శత్రు సంహార క్రీడలో ప్రమథ గణాలన్నీ కూడా ముందు బయలు-- బయలుదేరుతాయి అవే తర్వాత శైవాచారంలో వస్సర భస్సర అంటూ అడవుల్లో ప్రణవం నాదం చేసుకుంటూ వెళ్ళిపోయి శత్రువులను జయిస్తారు కాబట్టి మూల కథలో కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే స్వామి ఒకసారి చెప్తారు సత్యసాయిబాబా వారు ఎచటనన్నవాడు సాయి అని ఎన్ని విధంబుల వెదకి చూచెనన్ పత్రిని లేను పత్తిని లేను సర్వ హృదయంబుల నిండి ఉంటిరిను సత్యమౌ తల్పగా వచ్చెను సాయియై సత్య సాయియై మీరు నన్ను ఎక్కడ పెట్టుకుంటారు నా కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి పోనీ నా విలాసం ఏమిటంటే ఒక భక్తుని హృదయమేనా విలాసం కృష్ణ పరమాత్మ యోగేశ్వరుడు అదే చెప్పాడు భక్తుల హృదయాలలోనే నేను అధిష్ఠితమై నిష్ఠితమై ఉపవిష్ఠితమై అని వేళలా అక్కడే నివాసం చేస్తానని అంటే సర్వోత్తముడు అయినటువంటి ఒక పరమాత్మ యొక్క విలాసం ఏందంటే మన హృదయ మందిరమే అది నమ్మిన వాడు ఎవరంటే గణేషుడు సరే గణేషుడు చెప్పుకున్నా వినదాక పుడుతుంది పోతుంది భాద్రపద మాసంలో మనం జరుపుకో-జరుపుకోవటానికి ఇంకా కొన్ని క్షణాలు ఉన్న సమయంలో ఏమవుతుంది అంటే నెల అంతా కూడా వర్షం కురిసి పదును ఎక్కి ఉంటుంది భూమి అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి వృక్ష సంతతి అంతా కూడా మళ్ళీ ఒక్కసారి మొలకెత్తి ప్రకృతిని పరవశింపజేసేటువంటి సందర్భం ఇది దానిలో ఇరవై ఒక్క గరికలు ఇరవై ఒక్క మూలికా సంపద ఉన్నటువంటి మొక్కలు వృక్ష జాతులన్నీ కూడా ఉన్నాయి వినాయక స్వామి వీటన్నింటినీ కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు మనం పూజలో పెట్టుకున్నట్లయితే స్వామి మనకిచ్చే అభయం ఏమిటి వరదానం ఏమిటి అంటే మీరు ప్రకృతిని రక్షించండి ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది అది ఇవాళ మనం పత్రి అంటే మనకి అక్కరలేనివి మనం పెట్టకూడనివి అన్నీ మూటగట్టి ఆయన ముందు పడేసి ఇగో నైవేద్యమని పెట్టి మనమన్నీ చేసుకుంటున్నాం అలా చేయకూడదు ఇవాళ నగరాలలో వనాలు పోయినయి రోజుల్లో వనాల మధ్యలో ఎక్కడైనా ఒక రాజుగారి నగరం ఉండేది అంతే కదా కాబట్టి ఒక అరవై ఏళ్ల క్రితం మా వయస్సు మా చిన్నతనంలో కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకి పొలాల్లోకి వెళ్లి ఒక teacher వెంబడి రాగా ఆయన మొక్క కొయ్యి మొక్క తుంచు కోమ కావాలి అది కావాలి అని చెప్తూ ఒక్కొక్క దాన్ని పత్రి అంటాం పత్రిని అన్నీ కూడా ఏమి పెట్టాలో ఏది నివేదన చేయాలో ఏవి మన ఇరవై ఒక్క తత్వాలు మానవ శరీరంలో ఉన్నాయ్ ఇరవై ఒక్క తత్వాలకి అనుగుణమైనటువంటి పత్రి ఏమిటో మనకిచ్చి మనందరి చేత స్వయంగా వాటిని విధ్వంసం చేయకుండా కొద్దికొద్దిగా తెచ్చుకొని రోజు మనం పూజ చేసుకొనే వాళ్ళం కదా సరే ఇవాళ పత్రి మనం చెప్పక్కర్లేదు అలాగే పాలవెల్లి ఉన్నది పాలవెల్లి అంటే భూమండలానికి నాలుగు అంచులు ఏదైతే ఉన్నాయో ఎనిమిది దిక్కులు ఎట్లా ఉన్నాయో దిక్కులకు అనుగుణంగా మనం అనేక ఫలాలతో వాటిని నిలబెట్టి దేవతలకి దిక్పాలకులకి మనం పూజ చేసుకుంటాం దిక్పాలకులు ఎవరికి ఆచ్ఛాదన ఎవరికి గొడుగు అంటే ఆయన గొడుగుతో సంబంధం ఉంటుంది గొడుగు మనం వేసుకునే గొడుగు కాదు అదే పాలవెల్లి పాలవెల్లి కింద స్వామి ఉంటాడు స్వామికి ఎలుక ఎలుక లేని వినాయకుడిని మనం తెచ్చుకోకూడదు ఎందుకంటే వినాయక వాహనం లేనటువంటి వినాయకుడు ఉండడు ఉండరాదు అ-అది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే తుండము కుడి ఎడమలుగా తిరిగి ఉంటుంది దేనికి సంకేతం అంటే కుడివైపు తిరిగి ఉన్నటువంటి తుండము అది జ్ఞానానికి సంకేతం ఎడమ వైపు తిరిగి ఉంటే విజ్ఞానానికి సంకేతం అంతే తప్ప ఇది మంచిది అది చెడ్డది అని కాదు మనకు విజ్ఞానము కావాలి తద్వారా జ్ఞానము కావాలి రెండూ ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే వినాయక స్వామి అలాగే మనం పూజ చేసుకుంటాం చేసుకొని ఎవరైనా సరే సంగీతమైనా సరే సాహిత్యమైనా సరే కావ్య రచన అయినా సరే ఏది చేసినా వినాయకుడికి నమస్కరించంది మనం పని చెయ్యము దీనికి ఉదాహరణ మహాభారత రచన చేయాలి పెద్ద గ్రంధం అది ఆ-ఆ రోజుల్లో ఎనిమిది వేల శ్లోకాలు రాయాలని వ్యాసులవారు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుంటే ఆయనతో సమానంగా వేగాన్ని తట్టుకుని రాయగలిగిన వాడు ఒక్కడు దొరకలేదు ఎవరో చెప్పారు ఆయనకి వినాయకుడు బాగా రాస్తాడు ఆయన్ని అడగకూడదా అని ఆయన ఎలా రాస్తాడు అనుకున్నారు వ్యాసుల వారు అయినా పని తనది కాబట్టి వెళ్లి అడిగితే ఆయన ఏమన్నారంటే "నువ్వు చెప్తూ ఉండు నేను రాస్తూ ఉంటా కానీ నువ్వు చెప్పలేక ఒక చిన్న pause తీసుకుంటావే అక్కడ నా గంటం ఆగిపోతుంది ఏనే రాయను" కాబట్టి అంటే ఇవాళ single breath లో పాట పాడాడంటే వాడికి భారతరత్న ఇస్తున్నాం మనం అంతేనా single breath లో పాట పాడాడంటే మూడు నిమిషాల్లో నాలుగు నిమిషాల్లో ఎనిమిది వేల శ్లోకాలు రాస్తూ ఉంటే నువ్వు ఆపావా చెప్పడం ఆపావా నేను రాయడం ఆపేస్తాను అన్నాడు వ్యాసులవారు అంగీకరించారు కానీ వినయంగా అడిగాడు స్వామి ఎట్లా రాస్తారు మీరు అని ఏనుగుకి అందం ఏమిటి కళ్ళు కావు ఒళ్ళు కాదు తోక కాదు పాదాలు విస్తృతమైన పాదాలు కావు ఏవీ కావు మరి ఏమిటి అంటే దాని దంతాలని బట్టి దాని age ఒకటి దాని సౌందర్యం అవి age వస్తున్న కొద్ది తెల్లగా తయారవుతాయి ఏనుగు దంతాలు అంటాం కదా మనం మనకి పళ్ళు కూడా తెల్లగా ఉంటే మెరిసిపోతున్నాయండి ఏనుగు దంతాల వలే అంటాం అది పోలిక ఆయన ఏం చేశాడు తర్వాత మనందరికీ కూడా మనకు జుట్టు అంటే చాలా ఇష్టం అవునా మన ఒళ్ళు అంటే మనకిష్టం మనం వేసుకున్న dress అంటే మనకిష్టం అలంకరణ చేసుకున్న తర్వాత మనం వెళ్లి అద్దంలో చూసుకుని Yes I am presentable to the society ప్రపంచంలోకి నేను ఇలా వెళ్ళొచ్చు అని నిర్ణయించుకుంటాం మరి ఏనుగు అందం అంతా ఎక్కడ ఉన్నది అని దంతాలలో ఉన్నది మనకి కర్మణా ప్రజయా ధనేన చాగేనైకే అమృతత్వమానశుభు అని ఒక మాట ఉందిఇది కైవల్య ఉపనిషత్తు లో చెప్పబడిన మాట అంటే ఒరేయ్ నీకున్న ధనబలం గాని అంగబలం గాని అర్థబలం గాని ఏవి కూడా పనికిరావు. నిన్ను అమృత పుత్రుడిని చేయు కొంతకాలం నువ్వు చేసిన దానాలు గుర్తుంటాయి. నీ friends నిన్ను నీ అంతటి వాడు లేడన్న వారు వాళ్ళు కాలం చెందుతారు. తర్వాత నీ దగ్గర ఉన్న సంపద ఎటు పోతుందో ఎవరి పాలు అవుతుందో ఎవడికి తెలియదు. కానీ త్యాగేనైకే అమృతత్వం ఆనశుభు, ఎంత గొప్ప మాట ఇది. త్యాగం వలన మాత్రమే నువ్వు అమృత పుత్రుడువి అవుతావని వే-వేదము, ఉపనిషత్తులు చెప్పినయి. కాబట్టి మనం ఇవ్వేళ ఆ-ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడతాం గాని తల మీద ఉన్న జుట్టు ఇవ్వటానికి మనం ఒప్పుకోం. అదేదో పది రోజుల్లో వస్తుంది, మళ్ళీ మొలుస్తుంది కానీ మనకు భయం, ఇవ్వం. అందం పది రోజుల్లో పోతుందేమో అని. తన అందం పట్ల రకమైనటువంటి ఆకర్షణ, రకమైన లాలసా లేనటువంటి వినాయక స్వామి తన ఒక తొండాన్ని, ఒక దంతాన్ని విరిచాడు. దంతము విరిచి దంతంతో రాయటం అంటే అది అరిగేది కాదు, కరిగేది కాదు, ఏం కాదు. దానితో మహాభారత రచన సంస్కృతంలో గణేషుడు రాశాడు. చెప్పిన వాడు వ్యాసులవారు. అది. కాబట్టి త్యాగం చేశాడు. ఆయనకి త్యాగం యొక్క విలువ తెలుసు. కనుకనే ఆయన అమృత పుత్రుడై అమృత సమానుడై ఈవేళ మన కైవారం అందుకుంటున్నాడు. మన కైంకర్యాన్ని స్వీకరిస్తున్నాడు. చూడండి ఒక్క వినాయకుడి చుట్టూ ఎన్ని పరుచుకొని, తెరుచుకొని ఉన్నాయో. ఇంకా నిజానికి గణేశ ఉపనిషత్తు అని ఒకటుంది. ఉపనిషత్తులో ఒక రహస్యం ఉన్నది. శివపార్వతులు కూడా వాళ్ళు ఏదైనా కార్యక్రమాన్ని ప్రపంచానికి జగదోద్ధారణ కోసం ఇవ్వాలి అని సంకల్పించినప్పుడు, కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు వినాయకుడికి చెప్పి చేస్తారు. చూశారా. వినాయకుడికి పూజ చేస్తారని కాదు, చెప్పి చేస్తారు, "నాయనా! మేము పని చేయబోతున్నాం" అని. ఎందుకు? స్థానం తల్లిదండ్రుల స్థానం కాబట్టి జోడించి నమస్కరించరు, చేతులు జోడించి. కానీ ఆయనకి చెప్పకుండా పని చేయరని ఒక రహస్యం ఉన్నది. కాబట్టి ఈవేళ వినాయక చవితి అంటే అటు భూగోళం, ఇందాక చెప్పుకున్న పొలాలలో, పుట్టలలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి వృక్ష జాతులన్నింటినీ ప్రకృతిని ఉపాసన చేసినట్లుగా వినాయక స్వామికి సమర్పించుకుంటే, భావంతో చేస్తే, ఎందుకంటే భూదేవి నిత్య గర్భిణి. ఆమెకి చూలు ఎప్పుడూ ఉన్నది. చూలు అంటే pregnancy. అది ఎప్పుడూ ఉన్నది. దానిలో రత్నాలు పుడతాయి, నదులు పుడతాయి, వృక్షాలు పుడతాయి, పర్వతాలు మొలుస్తాయి, అన్నీ అక్కడి నుంచే వస్తున్నాయి. కాబట్టి భూదేవికి మనం నమస్కరించాలి. అందుకనే నిద్ర లేవగానే గురువుకి, తల్లిదండ్రులకి, తర్వాత పెట్టిన భూదేవికి నమస్కరించి మనం నిద్ర నుంచి లేవాలి. ఇది ఒక సంప్రదాయం. ఎందుకని? అలాగే నిలదొక్కుకొని లేవాలి. టక్కున నిద్రలో నుంచి ఉలికిపాటున, అదరుపాటున లేవకూడదు. రెండు కాళ్ళు నేల మీద పెట్టి భూదేవికి మానసికంగా నమస్కారం చేసుకొని లేవాలి. ఎందుకంటే భూదేవి మనకు ఆధారం. ఈవేళ మనం ఇక్కడ కూర్చున్న, తొంభై అంతస్తులో కూర్చున్న దానికి ఆధారభూతమైనది భూమి కనుక భూమిని, అగ్నిని, వాయువుని, వీటి పంచభూతాలు అన్నింటినీ కూడా, నీటిని అన్నింటినీ సమర్పించుకుంటూ వినాయక స్వామి యొక్క చరిత్రలో ఉన్న మహత్తరమైన విషయాలన్నీ మనం ఆకళింపు చేసుకోవాలి. గజాననుడి మహా తత్వం ఏమిటి అంటే, ఇరవై యొక్క తత్వాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇరవై యొక్క పత్రి ఒకచోట దొరుకుతుందా? దేశం గాని దేశంలో ఉన్నాం. మనం ఏం చేయగలం? మనకి ఇవన్నీ దొరకవు కదా. శాస్త్రం బానే ఉంది వినటానికే, అనటానికి. దొరకనే ఉంటాయి. అన్ని ప్రదేశాలలో అన్నీ ఉండవు. ఏం చేయాలి అంటే, ఏమి నీకు దొరకకపోయినా గరికతో పూజ చేసుకో. గరికే తర్వాత గర్భం అవుతుంది. గర్భం కూడా ఒక వృక్ష జాతే. అది మంత్రానికి పనిచేస్తుంది. మంత్ర శక్తిని నాకు ఇవ్వమని అడగటమే గరిక పూజ. రోజున మనం "ఏ కార్యారంభం కరిష్యామి" అంటూ మొదలుపెట్టి చేస్తున్నానని చెప్తూ ఆయన దగ్గర మనం సంగీతం నేర్చుకున్నట్లయితే పాట పాడుకొని, సాహిత్యకారులమైతే ఆయనకేదో పద్యమో, పాటో, కవిత్వమో ఏదో రాసుకొని, ఏమీ తెలియకపోతే గుంజిళ్ళు తీసి ఆయనకు నమస్కారం చేసుకొని, "నీ ముందు మేము ఎప్పుడూ చిన్నవాళ్ళమే, మమ్మల్ని రక్షించమని" అడుగుతూ పిల్లలకి పెద్దలందరూ, పెద్దలు కూడా కొత్త బట్టలు కట్టుకొని, అంటే ఏమిటి? మేము పాత శరీరాన్ని కాసేపు మర్చిపోతున్నాం. మాకు ఈవేళ ఇంకో కొత్త శరీరాన్ని ఇవ్వవయ్యా అని అడగటమే కొత్త బట్టలు కట్టుకోవటం. అంతేగాని బయటికి వెళ్ళు, డ్రెస్ కొట్టు, తెచ్చుకో, వేసుకో అది కాదు. అలంకారానికి కాదు. శరీరం అజంఖలు కర్మ సాధనం. నాకు శరీరం బలంగా ఉంటే నేను ఎంత పనినైనా చేస్తా. నాకు ధీశక్తి కావాలి, ఆలోచనా శక్తి కావాలి. ఆచరణకి కరచరణాది అవయవాలు ఉండాలి. ఏనుగు బలం అంటాం. ఏనుగు బలం కావాలి. ఆత్మ శక్తి కావాలి. సూక్ష్మంగా గ్రహించగలిగిన మేధాశక్తి కావాలి. కాబట్టి భౌతిక, ఆధి భౌతిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో వినాయక స్వామి మనకు అనుగ్రహించేది అనంతమైనది, అమితమైనది. ఇది, దీనికి, వినాయక విలాసానికి సంస్కృతంలో ఒక పదం ఉంది. అది, దాని పేరు "గకేళి". "గకేళి" అంటే అందరికీ అర్థం కాదు గనుక వినాయక విలాసం అని మనం పేరు పెట్టుకున్నాం. "గ" అంటే జ్ఞానం. "గ" అంటే మూలాధారం. కుండలినీ గాని, యోగులు గాని, సిద్ధులు గాని, సాధువులు గాని వాళ్ళు ఆంతరంగికంగా ధ్యాన ప్రాణాయామ ప్రక్రియలు చేయాలంటే ఏం చేస్తారు? మంత్రం ఏమిటి? మూలాధారం నుంచి బయలుదేరాలి.మూలాధార స్వాధిష్ఠాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాల దాకా ప్రయాణం షట్ చక్రాలలో మూలమైనటువంటి "గ" అనేటువంటి బీజం ఎక్కడున్నది అంటే మూలాధారంలో ఉన్నది. అందుకనే "ఓం గం గణపతయే నమః" అంటాం. గణపతికి మూలాధారం "గం" అనేటువంటి బీజాక్షరం. "గం" పై నుంచి కిందకి సో వద్దాం అనుకుందాం. పై నుంచి అంటే సహస్రారం నుంచి మూలాధారంలోకి వస్తే "గం" వచ్చి "గ" తో కలుస్తుంది. అంతేనా? మూలాధారంలో మొదలు పెడతానండి ఏమవుతుందో చూస్తా అండి. ఏం కాదు అదే అవుతుంది. మళ్ళీ "గ" తో మొదలు పెడతావ్ "గ" జ్ఞానంతో ఎండ్ అవుతావ్. కింద నుంచి గాని, పై నుంచి గాని, పక్క నుంచి గాని ఎట్లా చదివినా గంగ గంగే. గంగ అంటే జ్ఞాన గంగ. అది అమృత సరస్సు, అమృత వాహిని. ఇది మధువిద్యా విలాసానికి వినాయకస్వామి మూలాధారం అయినటువంటి వాడు. దాని వలన ఆయనను ఉపాసించినందువలన మంచి వాక్పటుత్వం ఏర్పడుతుంది. అపారమైన మేధాశక్తి ఏర్పడుతుంది. ప్రపంచంలో ఎలా ఎవరికీ హాని చేయకుండా అడవిలో ఏనుగు ఎట్లా నడుస్తున్నదో మనం కూడా ప్రపంచంలో మనం ఎవరినీ కూడా ఆహ్ గాయపరచకుండా ఎవరికీ హాని తలపెట్టకుండా జీవించేటువంటి ఒక సబ్బుద్ధి కలిగినటువంటిది ఆహ్ వినాయకుడి యొక్క శిరస్సు. ఇక ఈవేళ కాలం మారిపోయింది. కాస్త భూగోళం చెప్పుకున్నాం, కాస్త ఖగోళం చెప్పు-చెప్పుకున్నాం, కాస్త బయాలజీ చెప్పుకున్నాం, కాస్త జువాలజీ చెప్పుకున్నాం అన్నీ దీంట్లో వచ్చినాయి. అంటే సర్వ విద్యలకు మూలమైనది అది. తరువాత ముత్తుస్వామి దీక్షితర్ రాసినటువంటి కీర్తనలు అన్నీ వినాయక స్వామి. శ్యామశాస్త్రి రాసినవన్నీ అమ్మవారివి. త్యాగరాజస్వామి వారు రాసినవన్నీ కూడా అయ్యవారివి. కనుక అమ్మ, అయ్య, కొడుకు సంగీత ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేసి సంగీతానికి మూల స్థానం అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు తరువాత గణేషుడు ఒక్కచోట ఉన్నారు. నిజానికి శంకర భగవత్పాదులు సరస్వతీ దేవిని శివ కామసుందరి అని పిలుస్తారు. శివ కామసు-శివ కామసుందరి అంటే పార్వతీదేవి కదా అంటే కాదు. ఇక్కడ శివ కామసుందరి అంటే సరస్వతీదేవి. కాబట్టి అనేకమైనటువంటి పౌరాణిక వాంగ్మయాన్ని గనుక జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే అంతా ప్రతీకాత్మకం. వాళ్ళు ఇలా ఏనుగు ఎనాటమీ గురించి చెప్పరు. ఏనుగు సైకాలజీ గురించి చెప్పరు. ఇవాళ మనకి బ్రాంచెస్ మనం తెచ్చుకున్నాం. ఇవాళ మనం సైకాలజీ మాట్లాడుకున్నాం, IQ చెప్పుకున్నాం, EQ చెప్పుకున్నాం. అమితమైనటువంటి ప్రేమ కలిగినప్పుడు ఒక మానవుడు ఎలా స్పందిస్తాడో ఏనుగు కూడా అలాగే స్పందిస్తుంది. స్పందన ఎట్లా ఉంటుందంటే బహు సున్నితంగా ఉంటుంది. కన్నీటి ధారలు చారగట్టేట్టుగా అది ఆ-అది ఆనందభాష్పం కావచ్చు, దుఃఖంతో కూడా కలగొచ్చు కానీ emotional చారలు ఏవైతే ఉన్నాయో అవి మనం కంటికి దాని యందు చూడగలుగుతాం. ఉన్నది గాని తినదు. ఎంతవరకు కావాలో అంతవరకు సర్వమూ మితంగా ఉంటుంది. కానీ అమితమైన శరీరాన్ని తాను పోషించుకుంటూ తాను ఉదాత్తమైనటువంటి వైఖరిలో ప్రపంచంలో నడుస్తూ ఉంటుంది గనుక ఇవాళ వినాయక చవితి నాడు శివపార్వతుల్ని మనం స్మరించుకోవాలి. వారి వలన ఒక ఉత్పత్తి జరిగినటువంటి పుట్టినటువంటి కాదుగా ఉత్పత్తి జరిగినటువంటి ఉత్పత్తి కూడా షడైశ్వర్యాలలో, షడూర్మములలో, షడ్వికారములలో మొట్టమొదటిది ఉత్పత్తి, పరిణామం, తరువాత ఉరిగిపోవటం మధ్యలో expansion ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వినాయక చవితి ఇవాళ తరానికి మనం చాలా విషయాలు చెప్పాలి, చెప్పవలసి ఉన్నది. ఉరికే వినాయక వ్రత కథ ఒకటి చదివేసి మనం తొందర తొందరగా భోజనం చేయటం కాదు. తల్లి తండ్రి తమ బిడ్డల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఇదిగో ఇంత ఉన్నది వినాయకుడిది ఇంకా చాలా ఉంది. ఆహ్ చాలా ఎంత ఉన్నదో, మనకెంత అర్థమయ్యిందో, ఏది relevant ఓ, part వల్ల వాడికి భగవంతుని యందు, astronomy యందు, భూప్రపంచం అంటే ప్రకృతి యందు ఒక గౌరవం, భద్రత కలుగుతుందో విధంగా వాడికి విద్యా వరదానం చేయవలసినటువంటి చాలా ఉదాత్తమైనటువంటి రోజు వినాయక చవితి. ఇవాళ మనం కార్యక్రమం తలపెట్టినా నిజంగా పరమాద్భుతంగా జరుగుతుంది. ఇద్దరు బయల్దేరుతారు ఒకడు దొంగ రెండో వాడు భక్తుడు. ఇద్దరూ వినాయకుడి గుడికి వెళ్తారు. దొంగ ఏం కోరుకుంటాడంటే, స్వామి ఈవేళ నేను దొంగతనానికి బయలుదేరుతున్నాను నన్ను ఎవరూ పట్టుకోకుండా చూడు అని ప్రార్థిస్తాడు ఆయనని. వాడలా వెళ్ళగానే పోలీసు వస్తాడు. నేను ఈవేళ దొంగని పట్టుకోవటానికి వెళ్తున్నాను ఎలాగైనా నా నేను పట్టుకోవటంలో విఫలం చెందకుండా కాపాడు అంటాడు. మరి స్వామి ఏం చేయాలి మధ్యలో అని. రెండు చేస్తాడు. ఎలా చమత్కారం చేస్తాడంటే దొంగతనం జరగకుండానే పోలీసుకి పట్టుబడతాడు. క-కనుక వాడికి శిక్ష ఉండదు. అంటే దొంగ బయటపడిపోయినాడు పోలీసు పట్టుకోలేదు నువ్వు పొరపాటు పడ్డాడని వదిలేస్తాడు. ఇద్దరూ విముక్తులైపోతారు. దొంగతనం జరిగింది అనుకుందాం. దొంగతనం జరిగితే పోలీసులు చూసి దొంగ మూట అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. పోలీసు దొంగ ఇద్దరూ కూడా రక్షింపబడతారు. అలాగే మనలో ఉన్న వ్యతిరిక్త భావాలు negative thoughts and positive thoughts రెండూ ఒక ఘర్షణకు లోనైనప్పుడు positive thoughts ని నిలబెట్టేటువంటి దిశగా వినాయకస్వామి మనందరినీ కూడా కాపాడుతాడు. negative thought పుట్టని mind ఉండదు, ఉండకూడదు నిజానికి. కానీ ఉండకుండా ఉండదు ఇది సత్యం.మరి positive thoughts ఎలా రావాలంటే చిత్తైకాగ్రతతో ఉండాలి. అన్నింటికంటే తల్లిదండ్రులైన భగవంతుడిగా దేవీదేవతలుగా పూజించాలి. నిజంగా నమ్మి భావనతోనే వాళ్ళని మనం గౌరవించుకోవాలి, ప్రేమించుకోవాలి. వాళ్ళి-- వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళని కన్న బిడ్డలు చంటి బిడ్డలవలె వాళ్ళని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా ఒకటి. రెండవది, ఏది చేసినా విద్యారంగం గాని, సంగీతం గాని, సాహిత్యం గాని, వైజ్ఞానిక రంగం గాని దేనిలోనైనా number one స్థాయికి వెళ్ళేట్లుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇది రెండవది. మూడవది, ఏం చేసినా ఎన్ని సాధించినా వినయంగా ఉండాలి. వినయమే భూషణం అవుతుంది మనకి. అంటే ఆభరణం అవుతుంది. humble గా ఉండేటువంటి ఒక nature ఏదైతే ఉన్నదో దాని ద్వారా మనం ప్రపంచానికి దగ్గరవుతాం మనం. ప్రపంచం కూడా మనల్ని దగ్గర తీసుకొని మనల్ని ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, ప్రేమిస్తుంది, లాలిస్తుంది, పాలిస్తుంది పైగా రక్షిస్తుంది. ఇన్ని విషయాలు వినాయక చవితి నిండా ఉన్నాయి గనుక ఇక ఆయన చంద్రుడు నవ్వటము, పొట్ట పగిలిపోవటం అవన్నీ కూడా మనకిక్కడ relevant కావు. ఎందుకంటే, ఇవాళ body shaming అని మాట వచ్చిందిగా కొత్తది, అది ఇవాళ పుట్టలే, వినాయకుడికే పుట్టింది. చంద్రుడు నవ్వాడు అని. నవ్వితే ఇదేదో అయింది అని. కథంతా అది కథా కథనం, పురాణం ఎప్పుడన్నా చెప్పుకుంటే దాన్ని వాటి జోలికి వెళ్దాం. వాటిని దీంట్లో మనం కలుపుకోకుండా ఒక వైజ్ఞానిక భూమికలో metaphysical state లో మన వినాయక చవితిని గనుక అర్థం చేసుకుంటే అందరమూ నేర్వవలసినది చాలా ఉన్నది. చిట్టచివరగా, ఒక్కమాట. ముందే అనుకున్నాం, 'జ' అంటే పుట్టేది, 'గత్' అంటే పొయ్యేది. అంటే దాని పేరు జగత్తు. అంతే కదా. పుట్టింది పోవలసిందే, పోవలసింది మళ్ళీ పుట్టవలసిందే. పునరపి జననం, పునరపి మరణం. అంతే కదా. సరే. ఇక్కడ వినాయక స్వామి గురూ-- మనం వినాయకుడి మండపాలు కడతాం. నిజానికి మండపాలు కావు అవి మంటపాలు వాటి పేరు. మన ఇళ్లల్లో ప్రతిష్ఠ చేస్తాం, రథం మీద తీసుకొస్తాం, పెద్ద పెద్ద music తో ఆయన్ని ఆహ్వానం చేసి తీసుకొస్తాం, కూర్చోబెడతాం, పొద్దున్న, సాయంత్రం పూజలు చేస్తాం, నైవేద్యం పెడతాం, గుజ్జెలు తీస్తాం, నువ్వు రక్షించమని అడుగుతాం, అన్నీ చేస్తాం. కానీ గణేశ నవరాత్రులు అయిన తర్వాత దాన్ని మళ్ళీ రథం మీద తీసుకెళ్ళి నీళ్ళల్లో తోసేస్తాం. అంటే తొమ్మిది రోజులు మధ్యాహ్నం చేస్తాం. మధ్యాహ్నం అంటే స్నానం. తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తాం. ఇక శరీరానికి మళ్ళీ స్నానం లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త బొమ్మ రావలసిందే. కొత్త వినాయకుడు, వినాయకుడు అంటే విశిష్టమైనటువంటి leader. విశిష్టమైనటువంటి నాయకుడు కాబట్టి మనం కూడా పుట్టాం, శరీరాన్ని ధరించాం, కొన్నాళ్ళు ఉన్నాం, ఎంతవరకు ఉండాలో మనం అంతవరకు ఉంటాం. ముందు వెళదాం అంటే అవకాశం లేదు, కాసేపు ఆగుదాం అంటే అవకాశం, అవసర-- లేనేలేదు. కాబట్టి పుట్టు, చావు, పుట్టుకలు రెండూ కూడా అత్యంత సహజమైనవి, అనివార్యమైనవి అని చెప్తూ గణేశ ఉత్సవాలు మనకి ఒక అద్భుతమైన వేదాంతాన్ని బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి గణేశ ఉత్సవాల చివరి రోజున నిమజ్జనం చేసేటువంటి సమయంలో ఎలా మా-- మర్యాదగా ఆయన్ని తీసుకొచ్చామో అంతే మర్యాదగా నిమజ్జనం చేయాలి. అంతే గౌరవంతో. దీనిలో రకమైన వేడుక కాదది, జాతర కాదు. అది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం. యజ్ఞానికి వినాయకుడు విఘ్నం కలగకుండా మన రాష్ట్రమూ, మన దేశమూ రకమైనటువంటి విఘ్నాలకి లోను కాకుండా, ప్రపంచ దేశాల్లో తలమానికమైనటువంటి ఆహ్ దేశంగా, పుణ్యభూమిగా నిలబడాలంటే పురాణ వాఙ్మయాన్ని చక్కగా correct perspective లో వాటిని అర్థం చేసుకోవాలి. ఏమున్నది పురాణాలలో అంటే ముందు వెతకాలి కదా, ముందు చదవాలి కదా, ముందు అర్థం చేసుకోవాలి కదా. అప్పుడన్నీ ఏమున్నాయో అప్పుడు తెలుస్తాయి కాబట్టి మన యువత ప్రధానంగా ఇవాళ పురాణ వాఙ్మయాన్ని చక్కగా చదివేటువంటి ఒక ప్రయత్నం ప్రారంభించండి. EAMCET రాస్తున్నాం, LAW-CET రాస్తున్నాం, NEET రాస్తున్నాం, ఏం కావాలో అవన్నీ అవుతున్నాం. లే, అవుదాం. అవ్వాలి. ముగ్గురూ కూడా కావలసిందే. engineer కావాలి, doctor కావాలి, lawyer కావాలి, అందరూ ఉండాలి. కానీ మానవుడు కావాలి ప్రపంచానికి. మానవతా భావంతో పరిమళంతో వికాసమానం చెందే ఒక పరమాద్భుతమైన మానవజాతి పునఃనిర్మాణం జరగాలని, దానికి కావలసిన మహా శక్తిని, అనంతమైనటువంటి అవకాశాలని విఘ్నేశ్వరుడు మనకు సదా అనుగ్రహించు గాక అని మంగళాశాసనం చేస్తూ స్వస్తి. [ outtro music playing ] స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్త లోకాః సుఖినో భవంతు.
YouTube · audio

Sri Vinaayaka Vilasam

Home

Sri Vinaayaka Vilasam

Source: SATHYA PEETHAM on YouTube

0:00 / 48:17