Skip to content
Transcript తెలుగు
గతంలో జీవించే వాడికి వర్తమానము లేదు ఎప్పుడూ గతంలోనే తిరుగుతూ ఉంటాడు. పొందిన సన్మానాలు, సత్కారాలు, చీత్కారాలు, పురస్కారాలు అన్నీ మనసుకి స్మృతిలోకి వస్తూ ఉండగా అదే జీవితం అనుకొని గతించిన కాలంలో జీవించేవాడు నిజానికి మృతప్రాయుడే. మరణించిన వాడితో సమానమే. అది కొంత బాధ మిగులుస్తుంది, స్మృతి మిగులుస్తుంది. స్మృతి భాజ్యమైనటువంటి బాధ మనిషికి ఆనందాన్ని కంటే కష్టాన్ని కొనితెస్తుంది. ఇక మనకు మిగిలింది ఏమిటంటే వర్తమానం. వర్తమానం అంటే Now and Here, ఇహమేవా, ఇప్పుడే ఇక్కడే. వర్తమాన కాలాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో, ఎవరు గతకాలం నుంచి జరిగిన సంఘటన నుంచి స్ఫూర్తిని పొందుతారో, ఏది కావాలి? ఎంత కావాలి? ఎప్పుడు కావాలి? దేనికి కావాలి? అన్నటువంటి అనేక ప్రశ్నలకు సమాధానంగా ఎవరు తమను తాము నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారో అటువంటి వారు వర్తమానాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు లెక్క. దీన్నే ఇవ్వాళ Power of Presence అని పాశ్చాత్యులు మనకు చాలా ఎక్కువ చెప్తున్నారు. Power of Presence దేశంలోనే ఉంది. ఇవ్వాళ రేపుకు రూపం లేదన్నారు బాబా గారు. సత్య సాయిబాబా భగవాన్ సత్య సాయిబాబా వారు. రేపుకు రూపం ఎక్కడ ఉంది? అది ఉందేమో నువ్వు ఉంటే కదా ఉన్నదని తెలిసేది. కాబట్టి రూపం ఉన్నది అంటే నిన్న జరిగిపోయిన భూతకాలం అరూపమైంది. దానికి రూపం ఉండేది ఒకప్పుడు అది అరూపమైంది. రేపు అంటూ పుట్టకపోతే భవిష్యత్తుకు రూప నిర్మాణమే జరగదు గనుక, రూపం నీకు క్షణంలో అనుభవానికి ఇస్తున్నది ఎప్పుడు అంటే ఇప్పుడే వర్తమానంలోనే. అందుకని భగవత్ భావనకి సాలోక్యంగా ఉండాలి, సామీప్యంగా ఉండాలి, సాన్నిధ్యంగా ఉండాలి. సాలోక్య, సామీప్య, సాన్నిధ్య. మూడు ఎటువైపు దారి తీస్తాయి? సాయుజ్య. దేనితో కలవవలసి ఉన్నదో ఇదంతా మనస్సుని హృదయం వైపు తీసుకు వెళ్లడానికి కావలసినటువంటి సాధన సంపత్తి ఇది. మనం అనుకుంటాం మనస్సు ఏమిటి? దాన్నేమన్నా పట్టుకోవటమా? అదేమన్నా వస్తువా? హృదయం ఏమో ఖాళీ అంటున్నారు, మనస్సు ఏమో వస్తువు అంటున్నారు, ఆలోచనలు అంటున్నారు. ఆలోచనలు Purify చేయమంటున్నారు, బలము-బలాన్ని ఇవ్వమంటున్నారు, చిత్తవృత్తులు నిరోధించమంటున్నారు, యోగ ప్రక్రియని, యోగాన్ని, ప్రాణాన్ని కలపమంటున్నారు. ఈ-ఇటువంటి యోగవంతమైన, శక్తివంతమైన, చిత్తవృత్తులు నిరోధింపబడిన, సద్వృత్తులు మాత్రమే కలిగిన, మనోవృత్తులు సమసిపోయినటువంటి మనస్సు హృదయ స్థానానికి వెళ్లినట్లయితే అది నిజమైనటువంటి పరాభక్తి. అదే భక్తి. మనం ఇవ్వాళ భక్తి అనే పేరు మీద మనం చెప్పుకుంటున్నవి ఏదీ భక్తి కాదు. మళ్ళీ పునః చెప్పాలంటే మాట్లాడుతున్నదంతా కూడా పంచకోశాల బయట జరుగుతున్నతంతే. కాస్త ఇది అయిపోయిన తర్వాత నిశ్చలంగా, నిరామయంగా, నికేతనంగా, నిరంజనంగా ఒక్కచోట కూర్చొని ఇది ఏదీ లేదు అన్నటువంటి ఒక భావనలో ఉండగలిగితే ఒక భావ శూన్య స్థితి ఏర్పడుతుంది. మనం విచారణ చేశాం. భావ శూన్య స్థితి అసలు స్థితి. భావం లేదు, ఆలోచన లేదు. ఆలోచన లేదు గనుక దానికి శక్తివంతమైన చిత్తము అక్కర్లేదు, ప్రాణాయామంలో శుద్ధి పొందిన మనస్సు అక్కర్లేదు. అక్కడ మనోలయం అవుతున్నది. మనోలయం కావాలి. మనోలయం తర్వాత జరిగేది మనోనాశనం. అది విచారణ తర్వాత. అయితే ఇక్కడ వర-- సాలోక్యంగా ఉండాలి, సామీప్యంగా ఉండాలి, సాన్నిధ్యంగా ఉండాలి. ధూమ కామ రహిత. ధూమ అంటే జన్మ. జన్మలు లేనటువంటి మరల మరల పుట్టవలసినటువంటి అవసరం లేకుండా జీవించాలి. మళ్ళీ పుట్టాం అనుకుందాం, ఇంతకంటే మంచి జన్మ పొందవచ్చు గాక. కానీ కర్మలు తప్పవే, కర్మానుభవాలు తప్పవే, కర్మ ఫలాల మూట ఏర్పడకుండా ఉండదే. మళ్ళీ జన్మలో చేసిన కర్మలన్నింటికీ కూడా కర్త ఒక మార్కులు ఇస్తున్నాడు, ఫలితాలు ఇస్తున్నాడు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం భగవాన్ అని చెప్తున్నారు. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు చెప్పారు, నువ్వు ఉత్తమమైన కర్మలు చేశావా ఉత్తమ జన్మ ఏర్పడక తప్పదు అంటున్నారు. ఆముష్మికానందము, ఐహికానందము దాటి కైవల్యానందం వైపు అడుగు వేయమని భగవత్పాదులు బోధిస్తున్నారు. వీటన్నింటినీ సమగ్రమైన విచారధారగా మనం పతంజలి యోగశాస్త్రాన్ని, శంకర భగవత్పాదుల ఆత్మబోధని, శంకరులు చెప్పినటువంటి వివేక చూడామణిని, శంకర బోధలో నుంచి వచ్చిన అనేకమైన-- ఎందుకంటే వీరంతా మనకంటే ముందు ఉన్నటువంటి వారు. వాటన్నింటినీ కూడా భగవాన్ ఒక చోటికి తెచ్చి ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనస్సుని సిద్ధపరచుకో, చిత్తాన్ని యోగమయం చేయి, సద్వృత్తులు ఎక్కువగా ఉండేట్టుగా చూసుకో, వర్తమానంలో జీవించు, రేపేమో ఎవరికి తెలుసు. క్షణాన ఏమవుతుందో ఎవరికన్నా ఎరుక ఉన్నదా? లేనే లేదే! కాబట్టి జన్మ ఏది పొందుతున్నది అంటే జన్మ పొందినప్పుడల్లా దేహం ఏర్పడుతున్నది. దేహం నశించిపోయేదే. మన కళ్ళ ముందే పతనం అవుతున్నది, పడిపోతున్నది. ఎవరో దాన్ని దహనం చేస్తున్నారు, దహింపబడుతున్నది. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా విచారణ చేయవలసినటువంటి అంశాలు.కేవలం పారాయణం చేసినంత మాత్రాన మనకి విస్తృతమైనటువంటి అచ్చమైనటువంటి జ్ఞానం లభించదు. పారాయణం వలన మనస్సు శుద్ధి పడుతుంది. లోపల జరిగేటువంటి తరంగాలు, vibrations ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా క్రమబద్దీకరణ జరుగుతాయి. ఒక్కొక్కసారి తెలియకుండానే మనకు కొన్ని లాభాలు కలగవచ్చు. కానీ అసలు లాభం ఏమిటంటే కైవల్యానందం కలగాలి. వైకల్యమే లేనటువంటి ఆనందమే కైవల్యానందం. కైవల్య ఆనంద పద లబ్ధి కోసం తపముల్ చేసిననో, మనోనియతినో, దాన వ్రతా వృత్తినో, జప మంత్రంబులనో, శృతిస్మృతులను లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్ర ముఖరుల్ భావింతురెవ్వాని. అపవర్గాధిపు ఆత్మమూర్తి సులభుండవు గాక నాకెప్పుడున్ అంటాడు శుకదేవుడు పరీక్షిత్ మహారాజుతో. నీకింకా ఏడు రోజుల్లో మరణం ఉన్నది అని పరీక్షిత్ మహారాజుకి చెప్తే, అయ్యో ఏడు రోజుల్లో నేను మరణిస్తానా అని బాధపడలా. మరణించేలోగా నేను ఏం చేయాలి విచారణ చేసుకున్నాడు. సాలోక్యంగా ఉన్నాడు. కనుక ఆయనకి భాగవతం చెప్పాలి అంటే ఒక పరమ పురుషుడు, ఒక యోగి, ఒక అవధూత, ఒక శుకదేవుడు వచ్చాడు. శుకదేవుడు ఎంత మహాత్ముడు అంటే, ఆయన వ్యాస పుత్రుడు. అటువంటి వారు వచ్చి భాగవతాన్ని చెప్పారు ఏడు రోజులు. మోక్షం వైపు వడివడిగా అడుగులు వేసేటువంటి మార్గాన్ని ఉపదేశనం చేశారు. ఇక్కడ భగవాన్ కూడా చిత్తవృత్తి నిరోధమై యోగం ఏర్పడిన తర్వాత ఏం చేయాలి అంటే సాలోక్య-సామీప్య-సాన్నిధ్యాలతో ఉండు. మళ్ళీ పునరావృత్తి రహితమైనటువంటి ఒక జన్మ ఎత్తేట్టుగా ప్రయత్నం చెయ్. దానికి ధ్యాన, ధారణ అతీతమైన చారణం చెయ్. ధ్యానం దేహం ఉన్నంత కాలం మనసుం-- ఉన్నంత కాలం చేస్తాం లేదా ఉంటాం. అనేక విషయాలు ధారణ చేస్తాం వాటికి అతీతమైన సంచారం చెయ్ అని చెప్తూ నిర్మల నిశ్చల సచ్చరిత, నిర్మలంగా ఉండాలి నిశ్చలంగా ఉండాలి. ఇవి ఏర్పడాలి అంటే వాయు నిర్-- నిరోధము లేదా ప్రాణాయామము చిత్తవృత్తి నిరోధము చేయాలంటూ భగవాన్ మనల్ని మరొక సోపానం ఎక్కిస్తున్నారు. విచారణ మనం చక్కగా కొనసాగిద్దాం.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -41

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -41

Source: TFC Spiritual on YouTube

0:00 / 9:49

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

    Now playing
  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77