No transcript for this section.
Transcript begins at 5:06.
వందే గురునాం చరణారవిందే సందర్శిత స్వత్మ సుఖావబోధే జనశ్శే జంగలికాయమానే సంసార హాలాహల మోహ జాన్యే. కంచి మహాస్వామి జయేంద్ర సరస్వతి శ్రీచరణుల దివ్య చరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ స్వామి వారి అరవయ్యవ పీఠాధిరోహణ మహోత్సవంలో ఈ మహా సన్మంగళ సన్నివేశంలో ఒక్క క్షణమైనా ఇక్కడ దేహాన్ని మనస్సుని మనం స్పృశించుకునేటువంటి ఆత్మని ఒకచోట నిలబెట్టుకోగలిగినటువంటి ఈ అపురూప సన్నివేశానికి కారణభూతులైన వారందరికీ నమస్కరిస్తూ ఎట్లాగైతే మహాస్వామి వారు నూరు వసంతాలు నూరు శరత్తులు కంచి మహా పీఠాన్ని పరమాద్భుతంగా నడిపించారో అలాగే మన జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా పరిపూర్ణమైనటువంటి మహా శక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ అఖండ భారతావరణి కంచి నుంచి కాశ్మీరం వరకు కూడా ధర్మబద్ధమైనటువంటి ఒక విషయంగా దీన్ని స్వీకరించి ఈ ప్రపంచాన్ని ధర్మశాసనంగా నడిపిస్తారని, నడిపించాలని అనంతకోటి గురుస్వరూపాలకి మరొక్కసారి ప్రణమిల్లుతూ స్వామివారు జన జాగరణ జన కళ్యాణ అనేటువంటి రెండు మార్గాలను చక్కగా ఉపదేశనం చేసి మానవుణ్ణి జాగృతం చేసి మానవుడికి ఒక కళ్యాణ వైభోగాన్ని అనుగ్రహ వరదానం చేసినందుకు స్వామి వారికి జాతి, ఈ ప్రపంచం సర్వదా కృతజ్ఞతాపూర్వకంగా మనసా వచసా శిరసా ప్రణమిల్లుతూనే ఉంటుంది. స్వామీజీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మీ యొక్క అనుగ్రహం అఖండ భారతావనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడి యొక్క మనస్సుని, జీవితాన్ని స్పృశించు గాక. మీ అనుగ్రహ అమృతవృష్టి ఈ ప్రపంచాన్ని ధర్మ శ్రేయోమార్గంలో నడిపించు గాక అని మీకు ప్రణామం చేస్తూ ప్రార్థన చేస్తూ వినతి సమర్పిస్తూ మీరు మా జీవితంలో నలభై ఎనిమిది రోజులు మీకు సేవ చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అనుగ్రహించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా, వినయ పూర్వకంగా మీకు ప్రణామ సహస్రం సమర్పిస్తున్నాను. నేపాలనబడేటువంటి ఒకే ఒక్క హిందూ దేశం ఈ ప్రపంచంలో ఉండాలి అని పోరాడినటువంటి ఏకైక పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామివారు. ఒక్క నేపాల్ దేశమే కాదు సర్వ ప్రపంచము కూడా ఒక భారతీయ చింతన తత్వము ఆత్మ వివేచన వీటన్నింటిని కూడా ప్రోది చేసుకుని మహోజ్వలమైనటువంటి భారతీయ ఆధ్యాత్మిక స్థానంలో గురుస్థానంలో అన్నివేళలా నిలబడాలని స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి యొక్క ఆశీర్వచనాన్ని కోరుకుంటూ శబ్దం.
YouTube · audio
కంచికామకోటిపీఠాధీశ్వరులు శ్రీజయేంద్రస్వామివారికి దర్శనమ్ గురువందనమ్l , MVR SASTRY
కంచికామకోటిపీఠాధీశ్వరులు శ్రీజయేంద్రస్వామివారికి దర్శనమ్ గురువందనమ్l , MVR SASTRY
Source: DARSHANAM TV on YouTube
0:00 / 13:20