Skip to content
Transcript తెలుగు
ఆలంబేన విహీనం యో మాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురు రూపం తత్ బ్రహ్మ స్పురతాం మే. భగవాన్ శ్రీ రమణుల దివ్య శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ, భగవాన్ ఉపదేశించిన, సందేశించిన, ఆదేశించిన ఉపదేశ సారంలో తొలి శ్లోకాన్ని ఇప్పటిదాకా విచారణ చేశాం. అది "కర్తృర రాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం". విచారణ తర్వాత అయితే కర్మలు చేయవద్దా అని ఒక ప్రశ్న మనలో కచ్చితంగా కలిగి తీరుతుంది. చేయవలసి వస్తే కర్మలు చేయాలి అన్న విచారణ కలిగినప్పుడు రెండవ శ్లోకంలో భగవాన్ చెప్తున్నారు "కృతి మహోదధౌ పతన కారణం ఫలమ శాశ్వతం గతి నిరోధకం". అసలు శబ్దాలే చాలా గంభీరమైన శబ్దాలు. ఎందుకనంటే "కృతి మహోదధౌ పతన కారణం" ఇది కర్మకాండమునదే, కర్మలు చేయటం అనేదిందే ఒక జీవన సాగరంలో అలలు ఎరిగినటువంటిది, కెరటాలు తెలిసినటువంటిది, సముద్ర సమానమైనటువంటి, గంభీరమైనటువంటిది, గభీరమైనటువంటిది అంటే లోతైనటువంటిది, కనుచూపు పట్టలేనంత విస్తృతమైనది గనుక కర్మలు చేస్తున్నాను, చేస్తున్నాను మంచి ఫలితాలు రావాలి అని అనుకుంటూ దానం చేశాను, ధర్మం చేశాను, యాగం చేశాను, యోగం చేశాను, త్యాగం చేశాను అని అంటున్నావే! దీనివలన దీనికి తగిన equivalent ఫలితం ఏదన్నా ఉన్నదా అనంటే, నిజానికి నిష్కామ కర్మ చేయాలి, కర్మలు చేయటం కాదు నిష్కామ కర్మ. మరి ఇప్పుడు చెప్పినవన్నీ ఏమిటి? అవన్నీ కాం-కామిక కర్మలు, కాయక కర్మలు. కామ్యసిద్ధి కోసం యాగం చేయటం, ఫలితం పొందటం, యజ్ఞం చేయటం ఫలితం పొందటం. అది విశ్వ శాంతి కూడా పాయలోకి వస్తుంది గనుక ఇక్కడ భగవాన్ అంటున్నారు "కృతి మహోదధౌ పతన కారణం". రమణులే అంటున్నారా, ఇంకెవరైనా కూడా అన్నారా మాట? అంటే శంకర భగవత్పాదుల వివేక చూడామణిలో మూడు రకాల పనులు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో. ఐహికానందం కోసం కొన్ని, ఆముష్మిక ఆనందం కోసం కొన్ని, ముముక్షత్వాని కైవల్యానందం కోసం మూడవస్తాయి. మనం ఇక్కడ ఐహిక ఆనందం. నేను అద్భుతమైన ఆ-కార్యకలాపాలు చేశాను, అనేక సత్కర్మలు చేశా, దానధర్మాలు బాగా చేశా ఏం కలుగుతుంది అని? జీవన్ముక్తి రాదు. మళ్ళీ మర-మహోన్నతమైన మరొక జన్మ నీకు ఏర్పడుతుంది, అంతే. జన్మ ఎందుకు ఏర్పడింది అంటే మంచి పనులు చేశావు గనుక ఏర్పడింది. చెడ్డ పనులు చేస్తే ఇంకా క్రూరమైన జన్మ ఏర్పడుతుంది. మరి జన్మే లేకుండా ఉండటం చేయాలంటే? భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. ప్రతి జీవి మరణం ఒక కామ. వెళుతూ వెళుతూ వెళుతూ చేయగా చేయగా ఎక్కడో ఒక రోజున [గొంతు సవరించిన శబ్దం] ఇక జన్మే అక్కరలేనటువంటి, ఎత్తవలసిన అవసరం లేని ఒక పరిస్థితి రావచ్చు. అప్పుడు నీకు జన్మ రాహిత్యం ఏర్పడుతుంది. దానాలు చేశాను, యజ్ఞాలు చేశాను, నాకిది ఆఖరి జన్మ అని ఎవరైనా అనుకున్నట్లయితే పప్పులో కాలి ఎద్దంటున్నారు శంకర భగవత్పాదులు కూడా. కాబట్టి నీకు ఐహిక ఆనందం కోసం కొన్ని, ఆముష్మిక ఆనందం కోసం మనస్సుని ఎప్పుడూ స్థిమితంగా ఉంచుకొని, పవిత్రంగా ఉంచుకొని, నా వలన ప్రపంచానికి రకమైన చెడు జరగకూడదని అనుకుంటూ ఎవరైతే తమ కార్యకలాపాలు చేస్తారో వారికి ఇంతకంటే ఒక మంచి జన్మ ఏర్పడుతుంది. ఇక కైవల్యానందం ఎవరికి అంటే ఉపదేశ సారంలో మనం నిన్న, మొన్న మాట్లాడుకున్నామే "కర్తృర రాజ్ఞయా ప్రాప్యతే ఫలమని" అటువంటి కర్మలు చేసిన వాడికి మాత్రం కైవల్యానందం కలుగుతుంది. కైవల్యం అన్నా, మోక్షం అన్నా ఒకటే. అయితే కైవల్యం అంటే వైకల్యం లేనిదే కైవల్యం. disorder లో లేకపోతే అది order. అజ్ఞానం లో-లేకపోతే అది జ్ఞానం. చీకటి లేకపోతే అది వెలుగు. కాబట్టి వెలుగు వెలుగే, చీకటి చీకటే కాదు. చీకటి లేకపోతే లేదా పోతే వెలుగు అవుతున్నది. వెలుగు పోతే, వెలుగు లేకపోతే అది చీకటి అవుతున్నది. అట్లాగే కైవల్యానందంలో కూడా వైకల్యం లేకుండా ఉండాలి. బుద్ధి వక్రీకరించకుండా ఉండాలి. ఆలోచనలు సక్రమగతిలో ఉండాలి. ఉన్నట్లయితే మానవుడి యొక్క జీవితం ఇక్కడే "ఇహమేవా" అన్నది వేదం. అంటే now and here. ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడే ఇక్కడేని జీవన కాలం అరవై ఏళ్ళ, ముప్పై ఏళ్ళ, నలభై ఏళ్ళ, వంద ఏళ్ళ తెలీదు. ఎంత కాలం మనం ఇక్కడ ఉన్నాం అని కాదు, ఎట్లా ఉన్నాం అన్నది ప్రశ్న గనుక ఇక్కడ "కృతి మహోదధౌ పతన కారణం" పతనం అంటే నిన్నేదో పతనం చేస్తుంది అని కాదు, నిన్ను ఆపుతుంది అని. పరిగెడుతున్న వాడిని ఆపుతుంది, ఆగిన వాడిని పడుకోబెడుతుంది గనుక సత్కర్మలకు కూడా అర్థం ఎరిగి చేయమన్నారు. అర్థం ఎరిగి చేయకపోతే జీవితమే వ్యర్థం అయిపోతుంది గనుక ఇక్కడ భగవాన్ శ్రీ రమణులు దీనివలన అనేక సత్కర్మల వలన శంకర భగవత్పాదులు చెప్పిన భావాన్ని ఇంకా స్పష్టంగా, రకమైన ambiguity లేకుండా మనకు చెప్తున్నారు. మీరు కర్మలు చేయండి, కర్మలు చేస్తూ ఉండండి, ఫలితం కర్తకు వదిలేసేయండి. వాడెవడో ఇచ్చేవాడు ఉన్నాడు. వాడు ఏమిస్తాడో ఆలోచిద్దాం. దాన్ని పక్కన పెట్టండి. కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళగా వెళ్ళగా మీకు ఐహికానందం కోసం చేద్దామా, ఆముష్మికానందం కోసం చేద్దామా, కైవల్యానందం కోసం చేద్దామా? దారి ఏర్పడిపోతుంది.ఈ మూడు దారుల్లో ఏదో ఒక దారి తప్పదు. ఐహికానందం కోసం గనక అయితే moral philosophy ని ఆశ్రయించండి. అబద్ధం ఆడకండి, ఎప్పుడూ సత్యం పలకండి, ఎవరి గురించి చెడు తలవకండి, చెడు చూడకండి. ఇవన్నీ moral philosophy. ఆముష్మికానందంలో నా ప్రజ్ఞ ద్వారా, నా intellect ద్వారా, నా మేధ ద్వారా, నా ఆలోచనాగతి ద్వారా నేను ప్రపంచానికి హాని చేయని రీతిలో నేను గనక ఉండగలిగినట్లయితే అది ఆముష్మికమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మూడవది కైవల్యానందం. నాకేమీ అక్కర్లేదు. అంతా భగవంతుడే చేయిస్తున్నాడు అని మొదటి శ్లోకంలోనే నిర్ణయించుకున్నా. భగవంతుడే చేయిస్తున్నప్పుడు నేను చేస్తున్న పనులు correct గా చేయాలి. పని ఒళ్ళు దాచుకోకుండా చేయాలి. నా దగ్గర ప్రజ్ఞ ఉండి నేను గనక పని చేయకపోతే నేను గజ దొంగని. నా దగ్గర ప్రజ్ఞ లేకుండా ఏదైనా చేయగలను అంటే నేను దొంగని. కాబట్టి రీతిలో నేను ఉండదలచుకున్నానంటే నా ప్రజ్ఞకు అనుగుణమైన, నా శక్తికి లోబడిన, పరిమితులు ఎరిగిన నేను, నేను కర్మ చేస్తున్నాను, ఫలితమా నాకు సంబంధం లేదు. అంటే ఒకటిని రెండుని రెండు శ్లోకాలని మనం సమన్వయం చేసుకోవాలి. ఇది తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం కాదు. రమణులు ఉపదేశించిన ఉపదేశ సారంలో ముప్పై మెట్లు ఇవి. ఒకదానిని మించి, ఒకదానిని మించి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఉత్తమ స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఉత్కృష్ట స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఆపై యదార్థ స్థితికి చేర్చేటువంటి ఒక సోపాన క్రమం కాబట్టి ఇది మొదటిది అర్థమైంది వదిలేద్దామని కాదు. దాని నుంచి రెండవ శ్లోకంలోకి మనల్ని తీసుకువస్తూ కార్యకలాపాలున్నవే మహాసముద్రం అంటున్నారు భగవాన్. నిజమే, అంతేక్కడ? అలుపెరగని జీవన పోరాటంగా మన జీవితాన్ని వర్ణించుకుంటాం. అవిశ్రాంతంగా ఉన్నామంటాం. క్షణము తీరిక లేదంటున్నాం. అంటే పనులు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? కామ్యసిద్ధి కోసం చేస్తున్నాం. కీర్తి కోసం చేస్తున్నాం. డబ్బు కోసం చేస్తున్నాం. ఇవి ఏవీ కాకుండా చేయవలసిన విధివిధానాలు ఏవైతే నీకు నిర్ణయించబడి ఉన్నాయో designated duties ని గనక నువ్వు చక్కగా చేస్తూ వెళ్లినట్లయితే ఎంత బాగుండును. అవి పతనం వైపు దారితీయవు. నిన్ను నిలబెడతాయి. ఎందుకంటే ఏం చేస్తున్నావో నీకు తెలుసు, ఎందుకు చేస్తున్నావో తెలుసు, ఎంతవరకు చేయగలుగుతున్నావో అదీ తెలుసు. కడగా దీని పర్యవసానం ఏమిటో కూడా నీకు తెలుసు గనుక నీకు పతనం లేదు. లేదు, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా, పరిగెత్తుతున్నట్లుగా, గానుగెద్దుగా, గంగిరెద్దుగా జీవితాన్ని గనక గడిపినట్లయితే అనేక కార్య విశ్రాంతి ఎరగకుండా, ఎక్కడా మనల్ని మనం ఎరుగు ఎరుకలోకి వెళ్ళకుండా, మనస్సుని స్థిమితం చేసుకోకుండా, ఎండమావుల వెంట పరిగెత్తి పరిగెత్తి అలసిపోతామే తప్ప దాహం తీరదు. తృష్ణ ఉన్నవాడికి కృష్ణానదిని మింగినా తాగినా తృష్ణ తీరదు. కాబట్టి తృష్ణ, లాలస, భోగము ఇవన్నీ కూడా జీవుడు దాటాలి. దాటగలిగినటువంటి ఒక పరమాద్భుతమైనటువంటిది ఏది అంటే భగవంతుని వైపు కర్తవ్యాన్ని వదిలిపెట్టి, ఆయనకు విడిచిపెట్టి మన పనులు మనం చేసుకుంటూ వెళితే కృతి మహోదధు చేయబడినదంతా సముద్రం అవుతున్నది. చెట్టుకి పూత పూస్తుంది మామిడి పూత. యజమాని ఆనందపడిపోతాడు. సంవత్సరం ఎన్ని వేల కాయలు కాస్తాయో, కాయలలో కొన్ని వందల పళ్ళు ఏర్పడతాయి, బాగా డబ్బు వస్తుంది అనుకుంటాడు. ఇంతలో మంచు కురుస్తుంది. పూలు మాడిపోతాయి. అనేకం కాయలే కావు. ఒకవేళ కాయలైనా అవి పండనే పండవు. ఏమవుతున్నది? అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి. అది జీవితం. కాబట్టి దీంట్లో మనకి పతనం ఏమవుతున్నదంటే అత్యాశ, పేరాశ, దురాశ, కడకు నిరాశ. కాబట్టి మనస్సును నియంత్రించుకోవాలి. ఆనంద పదలబ్ధి కోసం ఆనందిస్తూ పని చేయాలి. ఆనందాన్ని అనుభవిస్తూ చేయాలి. ముందు మనకి ఆనందం కలిగించాలి మనం చేసే పని. వీటన్నింటినీ విచారణ చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. లేకపోయినట్లయితే పతనం తప్పదంటున్నారు. ఆగిపోవటం తప్పదు. నీకు రావలసిన ఫలితం అందకపోతే అదే పతనం. నీవు ఎలా ఉన్నావు అని అడుగుతాం. బాగానే ఉన్నాను అంటాం. బాగా ఉండటం అనేది relative. ఉండవలసినంతగా లేకపోతే బాగా లేనట్లే లెక్క. ఉండవలసినంతగా అనేది కూడా relative యే కాబట్టి ఇంకా బాగా, ఇంకా బాగా, ఇంకా బాగా ఆత్మ విచారణలోకి వెళ్ళాలి. మనల్ని మనం అర్థం చేసుకోవాలి, తర్వాత లోకాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం గనక అర్థం చేసుకున్నట్లయితే లోకాన్ని, లోకేశ్వరున్ని కూడా అర్థం చేసుకున్నట్లే. మనల్ని మనం తెలుసుకోకుండా ప్రపంచాన్ని అనుభవించలేం. కాబట్టి ఆత్మ విచార మార్గంలో ప్రధానమైన, మౌలికమైనటువంటి మూల సూత్రం ఏమిటంటే మనల్ని మనం తెలుసుకోవటం. మనల్ని మనం తెలుసుకోకుండా ఉదాహరణ, ప్రపంచంలో మనం ఒక లక్ష మందికి తెలుసు. లక్ష మందిలో కొన్ని వేల మందికి కాస్త దగ్గరగా తెలుసు. కొన్ని వందల మందికి ఇంకాస్త దగ్గరగా తెలుసు. పది మందికి, పట్టుమని పది మందికి మరింత దగ్గరగా తెలుసు. ప్రయోజనం ఏదన్నా ఉన్నదా? వీరంతా అయిపోయిన తర్వాత వచ్చేవారే. అవుతున్న వేళ ఎవరున్నాడు అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఎవడు స్నేహితుండు? ఈశ్వరుండే. పంచ ప్రాణాలు మనతో ఉన్నాయి. అవి మనతో సహచర్యం చేస్తున్నాయి. మన యందున్నాయి. విచార ధారలో నుంచి పతనం కాని రీతిలో మనం పనులు చేస్తూ వెళ్ళాలి. అంటే ఏతావాతా ఏమిటి అంటే కైవల్యానందం కావాలి అని గనక కోరుకున్నట్లయితే ఆత్మ విచార మార్గంలోకి వెళ్లి 'నేనెవరన్న' ఒక చిన్న ప్రశ్న వేసుకుని, నేను కనిపిస్తున్న వ్యక్తి నేనా? ఇది స్థూలం. కాదు నేను ఊహించుకున్న వ్యక్తినా? అది నీ ఊహ. కాదు మరి నిజమైన వ్యక్తిని నేనెవరు అనే ప్రశ్న మనం వేసుకోము. నువ్వెవరు అన్న ప్రశ్న వేయకుండా ఉండం. మీరెవరు? మీరేం చేస్తారు? ఇవన్నీ అడుగుతాం. information అంతా మన దగ్గర ఉంటుంది. అంతెందుకు చిన్న ఉదాహరణ. ఒక పేజీ, ఒక చిన్న తెల్ల కాగితం ఇచ్చి మీరెవరిని గురించైనా కాస్త రాసి పెట్టండి అని అడుగుతారు. మనకు ఒక పేజీ చాలుదు. ఇరవై పేజీలు రాయగలుగుతాం. అదే మనకో పేజీ, ఒక కాగితం ఇచ్చి కాస్త మీ గురించి కూడా రాయండి అంటాం. అక్కడ అయిపోతాం. ఐదు లైన్లు కూడా దాటం. ఎందుకనంటే అవతల వ్యక్తి గురించి ఇరవై పేజీలు మనకు తెలుసు. మన గురించి అర పేజీ, అర ఠావు కూడా మనకు తెలియదు. ఇది మనం reverse చేసుకోవాలి. ముందు మనల్ని మనం ఎరగాలి. మనము అంటే engineering ఆ, ఫ్యాక్టరీలా, డబ్బా, కీర్తే, ఎవరో ఇచ్చిన బిరుదులా, మనం చేసిన అనేక కార్యకలాపాలా, సాధించిన విజయాలంటే అవి ఏవీ కావు. మరి ఎవరు నేనెవరు నేనెవరన్న ప్రశ్న వేసుకున్నప్పుడు నేను అంటే అఖండ చిద్ఘనమైన ఆత్మ.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -10

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -10

Source: TFC Spiritual on YouTube

0:00 / 15:06

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

    Now playing
  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77