Skip to content
Transcript తెలుగు
ఆలోచించాడు. ఎట్లా? ఆలోచన కలిగితే కదా పద్యం పారేది అనుకున్నాడు. భగవంతుడికి తన మనస్సును సమర్పించుకున్నాడు. శరణాగతి పొందాడు. అయ్యా నా వల్ల కావటం లేదు. నువ్వే వచ్చి, నీవే పద్యం నా చేత రాయించమని అడిగాడు. ఇది కవులందరికీ కలిగినటువంటి అనుభవమే. వాళ్ళు ఇటువంటి అనుభవంలో నుంచి ఒక ఉదాత్తమైనటువంటి ప్రకృతిని ఉపాసన చేసేటువంటి ఒక మార్గంలోకి వాళ్ళు వెళ్ళగలిగారు. వెళితే, ఒకరోజున తెల తెలవారుతున్నటువంటి వేళ ఇంకా చంద్రుడు పోలేదు, సూర్యుడు రాలేదు. సువర్ణముఖి నదిలో ఉన్నటువంటి ప్రవాహం నెమ్మదిగా సాగుతున్నది. రాత్రి ఇంకా విడిపోలేదు, పగలు పుట్టలేదు. సమయంలో అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా చీకటి ఆవరించి ఉన్నటువంటి సమయంలో తూర్పు కొండ వైపు చూశాడు. దూర్జటి. ఉదయ గ్రాము పానవట్టము అభిషేకోద ప్రవాహము వార్ధి ధరీ ధ్వంతము ధూప ధూమము జ్వలదీప ప్రభా రాజీ కౌముది తారా నివహంబులు అర్పిత సుమంబుల్గా తమోదూర సౌఖ్యదమై శీత గభస్తి బింబ శివ లింగంబు పె ప్రచీదిశన్. ఏం జరిగిందయ్యా అంటే పద్యం అందమైన పద్యం. ప్రకృతిని మనం ఎట్లా ఉపాసన చేయాలో, ఇవాళ పర్యావరణ రక్షణ అనేటువంటిది వీళ్ళంతా పద్యం నేర్చుకోవాలి. ఉదయ గ్రామం తూర్పు కొండ నాకు పానవట్టం లాగా ఉంది. పానవట్టం మీద నుంచి వస్తున్నటువంటి జలాలన్నీ కూడా సువర్ణముఖి నది జలాలన్నీ కూడా అభిషేక జలాలుగా కనిపిస్తున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలన్నీ కూడా నదీ జలాలలో నిస్తంద్ర మంద్రంగా నెమ్మదిగా పారుతున్నటువంటి నీట పూజా పుష్పాల వలే ప్రతిఫలిస్తున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి చంద్రకాంతి భగవంతుడికి ఇచ్చిన నీరాజనం కర్పూర హారతై గోచరిస్తూ ఉన్నది. ఇదంతా తమోదు నా చుట్టూ ఉన్నటువంటి చీకటి అగరువత్తులు వెలిగించినందువలన కలిగిన ధూపము నన్ను ఆవరించినట్లుగా ఉన్నది. నాలో ఏర్పడినటువంటి చీకట్లను పోకార్చి, వెలుగును వెలార్చి నన్ను ముందుకు తీసుకు వెళుతున్నటువంటి తూర్పు కొండ నాకు శివుడి వలే తోస్తున్నది అన్నాడు. ప్రకృతిలో పరమాత్మను దర్శనం చేయటం అంటే ఇది. భావం కలగాలి, దీనికి కారణం ఏమిటి అంటే ఉపదేశ సారం లో భగవాన్ రమణులు చెప్తున్నారు, ప్రపంచాన్ని భగవంతుడి యొక్క ప్రతిరూపంగా భావించు. ప్రపంచానికి కూడా ఒక శ్వాస ఉంది. ప్రపంచం యొక్క నడకకి ఒక లయ ఉంది. ఒక రిథం అంటాం. రిథం అండ్ మూమెంటం అంటాం. రెండు ఉన్నాయి. ఒక వేగ ఆవేగాలున్నాయి. ఒక వెలాసిటీ ఉంది. వీటన్నింటినీ గనక చక్కగా అర్థం చేసుకుంటే ప్రకృతిలో ఉన్నటువంటి మనం మనతో కూడి ఉన్నటువంటి ప్రకృతి అభిన్న అద్వయ రమణీయ మనోజ్ఞ భావనా భూమిక. ఇదే అద్వైతం. పరమేశ్వరుడు వేరు, ప్రకృతి వేరు, ప్రపంచం వేరు, కొండ వేరు, నది వేరు అనుకునే జాతి కాదు భారత జాతి. సమస్త ప్రపంచంలో సమస్త వస్తువులలో జడాత్మకమైన రాయిలో, రప్పలో, నీటిలో, నింగలో, వాగులో, వంకలో అన్నిటా పరమేశ్వరుడున్నాడు, ఈశ్వరుడు లేడు అనేటువంటి భావనే లేని జాతి. ఇవాళ పరమేశ్వరుడితో కూడి ప్రపంచం ఉన్నదీ. అసలు నిజానికి ప్రపంచమే పరమేశ్వరుడు. జగత ఈధసి యుక్త సేవనం అట్లా భావన చెయ్. నీ చుట్టూ ఉన్నటువంటి పర్యావరణాన్ని, నీ చుట్టూ ఏర్పడిన స్థలాన్ని, ప్రదేశాన్ని, అంతెందుకు నీ దేహాన్ని ఇప్పుడు మనం ఉన్నాం. మన దేహానికి రోజుకు మూడు సార్లు దానికి స్నానం చేయిస్తాం. పొద్దున వేసుకున్న బట్టలు మధ్యాహ్నం వేసుకోం, మధ్యాహ్నం వేసుకున్నవి సాయంత్రం వేసుకోం. ఇది నిత్యమూ జరిగేటువంటి ఒక అద్భుత ప్రక్రియ. దేహాన్ని శుభ్రపరచుకున్నంత శ్రద్ధ ప్రదేశాన్ని శుభ్రపరచడంలో మనకు లేదు. ఎక్కడా నలుసు, మట్టి లేకుండా, ఎక్కడా నలుసు, కల్మషం లేకుండా మన చుట్టూ ఉన్నది భగవంతుడున్నాడు. అంతేందుకు? మనల్ని ఎవరో వారి ఇంటికి పిలిచారు మనల్ని, అనుకుందాం. వెళ్ళాం. మనం వస్తాము అని తెలియగానే ఇంటి ఇల్లాలు, గృహమేధి అంటే యజమాని ఇద్దరూ కలిసి డ్రాయింగ్ రూమ్ అంతా అద్భుతంగా తీర్చిదిద్దుతారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాటిన్నింటినీ క్రమంగా పెడతారు. దానికి ఒక సౌందర్యాన్ని నుడిపింపజేస్తారు. అగరువత్తులు వెలిగిస్తారు. లైట్లు పనిచేస్తున్నాయా లేదా చూస్తారు. అంటే ప్రదేశాన్ని శుభ్రపరుస్తూ మన బోటి వారిని అక్కడికి పిలిచినప్పుడు వారు చేస్తున్నటువంటి ఇదంతా కూడా ఒక పవిత్రతకి, శుభ్రతకి దారితీస్తుంది. అట్లా ఎవరికోసమో గాక ప్రతిరోజూ భగవంతుడు మనతో ఉన్నాడు అన్నప్పుడు ఇల్లు ఎట్లా ఉంటుంది? దేవాలయం వలే ఉంటుంది. నిజానికి సనాతన ధర్మం మాట చెప్పింది. దేహో దేవాలయ ప్రోక్తో అంటే, నీ దేహంలో భగవంతుడున్నాడు. కనుకనే దీనికి స్నానం చేయించాలి, మంగళస్నానం చేయించాలి, తలస్నానం చేయించాలి, శరీరాన్ని శుభ్రపరచుకోవాలి, చక్కగా పెట్టుకోవాలి, దానికి అలంకారం చేసుకుంటాం. సరిగ్గా దువ్వుకున్నామా లేదా, కాటుక పెట్టుకున్నామా లేదా, వస్త్రాలు సరిగ్గా ధరించామా లేదా, మనం సరిగ్గా ఉన్నామా లేదా, ఇవన్నీ మనం ఎట్లాగైతే చూసుకుంటూ దేహాన్ని ఒక ప్రాకారంగా కేవలం రక్త మాంసాలతో, ఎముకలతో, మజ్జతో కూడి ఉన్నటువంటి వస్తువుగా కాక దీన్ని సజీవమైనటువంటి ఒక స్వరూపంగా, ఒక సౌందర్య భావనగా మనం స్వీకరించామో, ప్రకృతిని, నీ చుట్టూ ఉన్న పరిసరాలని భగవన్మయం చెయ్. భగవదారాధనతో దాన్ని నింపంటూ దూర్జటి పద్యం చెప్తూ...కాళహస్తీశ్వర శతకం రాస్తూ ఇక్కడ రమణులు ఉపదేశ సారంలో చెప్పిన దానికే చింతన ఎక్కడ పుడుతుంది అనేదానికి ఒక పద్యం చెప్పాడాయన. శ్రీ విద్యుత్ కలితా జవం జవ మహా జీమూత పాపాంబుధారా వేగంబునన్ మన్మనోజ్య సముదీర్ణత్వంబు కోల్పోయితిన్ దేవా! కరుణా శరత్ సమయం ఇంతే చాలు చద్భావనా సేవన్ తామరతంపరై మణియదన్ శ్రీ కాళహస్తీశ్వరా! ఏమిటిది? అనేకమైన సంపదలు అనేక కార్యకలాపాలు చేశా. నీ ప్రమేయం లేకుండా భగవంతుడు అన్న ఆలోచన లేకుండా చేశా. దానివలన అనేక సంపదలు నాకు ఏర్పడ్డాయి. సంపదలు నాకు కావలసిన దానికంటే ఎక్కువ వచ్చినయ్. అక్కరలేనంత డబ్బు వచ్చింది నాకు సంపద, ఐశ్వర్యం. ఎప్పుడైతే నాకు అక్కరలేనంత మితిమీరినటువంటి డబ్బు వచ్చిందో నేను పాప కార్యాలు చేశా. పాప కార్యాలు చేయగా చేయగా అవన్నీ కాల మేఘాలై కాల మేఘాలై నా జీవితాన్ని ఆవరించి ఆవహించినయ్. అవి ఈవేళ మేఘాలు బళ్ళున త్రిళ్లి పాపాంబుధారా వేగంబున నిరంతరం వర్షం పడుతున్నది నా మీద. దానివలన మన్మనోజ్య సముదీర్ణత్వంబు కోల్పోయితిని. బయట ఉన్నటువంటి కుండీలో ఉన్నటువంటి ఒక మొగ్గ మీద నిరంతరం గనుక వర్షం పడుతూ ఉంటే మొగ్గ మాడిపోతుంది. అది పువ్వు అవ్వదు. [గొంతు సవరించిన శబ్దం] కావలసినంత పడి ఆగాలి. సూర్యుడి వేడిమి, తాడిమి, పోలిమి అన్నీ పొడిమి ఉండాలి. ఎప్పుడైతే వేడి తాళిమి పోడిమి మూడు ఉన్నాయో మొగ్గ తనను తాను వికాసమానం చేసుకుంటుంది. చేసుకొని దానిలో దాగినటువంటి సౌందర్యాన్ని ఆవిష్కృతం చేస్తుంది. పచ్చిగా ఉన్నటువంటి ఒక మొగ్గ తెల్లవారుగానే ఒక పుష్పంగా వికాసమానం చెందగానే దివ్యమైనటువంటి పరిమళాలను వెదజల్లుతూ మనకి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నదే పరమేశ్వరా! కనిపిస్తున్నటువంటి చరాచరమైన జగత్తు నువ్వు కాక మరొకటి ఏమిటి? సర్వనాకు సర్వే సర్వత్రా. ఈశావాస్యోపనిషత్తు లో చెప్పినట్లుగా సర్వమూ ఈశ్వరమయమై ఉన్నది. ఈశ్వరుడు లేని ప్రదేశం కానీ, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందని వస్తువు గానీ, ప్రపంచంలో లేదు. అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి సృష్టి ఆనంద సంధాయకమై వెలిగిపోతున్నది గనుక ప్రకృతికి నేను నమస్కరిస్తున్నాను. ఇది భారతీయ భావన. ప్రకృతికి నేను మనసా, వచసా, చిరసా అదే గనక లేకపోయినట్లయితే నా ఉనికి, నా అస్తిత్వం, నా వ్యక్తిత్వం, నా సంస్కారం, నా సంస్కృతి, నా యందున్నటువంటి గత జన్మల జీవధార ఇవన్నీ ఏమైపోతాయి? అనేటువంటి ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది గనుక ప్రపంచాన్ని నేను పరమేశ్వర స్వరూపంగా భావన చేస్తున్నాను. దీన్నే మరొక్క కోణంలో గనక విచారణ చేసినట్లయితే శంకర భగవత్పాదులు "శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం" లోకానికి సౌందర్యాన్ని, మంగళాన్ని, శోభను, ఆనందాన్ని ఒక పూర్ణమైన నివృత్తి మార్గాన్ని అనుగ్రహించటానికి వచ్చిన కరుణా స్వరూపమే శంకర భగవత్పాదులు. ఆయన అంటారు ఓచోట మన దక్షిణామూర్తి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకమే "విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే". ప్రపంచం అంతా ఎట్లా ఉన్నదంటే అద్దంలో బొమ్మలాగా ఉంది. అద్దాన్ని గనక మనం బయటకు తిప్పితే బయట ఉన్నదంతా అద్దంలో కనిపిస్తుంది. అట్లా ఉన్నదయ్యా ఇది. అయితే నాకు రాత్రి ఒక కల వచ్చింది. కలలో ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు నా పక్కనున్న ప్యాక్ టేబుల్ మీద కూర్చుంది. నాతో మా-మనుష్య భాషలో సంభాషించింది. నేను దాంతో మాట్లాడాను. స్వప్నం కన్నాను. తెల్లవారు లేచాను. ఏనుగు లేదు. రావటం అసంభవం. గదిలోకి ఏనుగు ఎలా వస్తుంది? ఒకవేళ వచ్చినా అంత పెద్ద జంతువు చిన్న టేబుల్ మీద కూర్చుంటుందా? కూర్చుంది. కానీ ఇదంతా కూడా స్వాప్నిక అనుభవం. స్వప్నంలో ఏర్పడినటువంటి అనుభవం గనుక ప్రపంచం కూడా ఒక జగత్తు. అంటే పుట్టేది, గత్ అంటే పోయేది. యదృశ్యం తన్నశ్యం అంటే ఏది కనిపిస్తున్నదో అది పోవటానికి వచ్చింది, ఏది పోవలసి ఉన్నదో అది కనపడటానికి వచ్చింది అని ఒక అద్భుతమైనటువంటి భావ సంపదని శంకర భగవత్పాదులు చెప్తూ, ఇటువంటి ప్రబుద్ధ సమయం అంటే వికాసమానమైనటువంటి ఒక భావన నాకు కలిగింది చూడు అది అద్భుతం అని అంటూ దూర్జటి కూడా కరుణా శరత్ సమయం ఇంతే చాలు. నేను ఏం పోగొట్టుకున్నానో నాకు తెలిస్తే ఇక ఏది రాబట్టుకోవాలో ఏది అక్కర్లేదో నేను తెలుసుకుంటా. ఎంత సేపు తీసుకోవటమే గనక నాకు అలవాటైనట్లయితే పోగొట్టుకున్నదేమిటో నాకు తెలియకపోతే నా జీవితాన్ని నేను ఎలా సర్దుకుంటాను? మనం కూడా చూడండి ఇరవై ఏళ్ళు వస్తాయి. ఏం పోగొట్టుకున్నామో తెలుసు-తెలీదు. ఏం పోగొట్టుకున్నాం? బాల్యాన్ని పోగొట్టుకున్నాం. యవ్వనంలోకి వచ్చాం, కౌమారాన్ని పోగొట్టుకున్నాం. మధ్య వయసులోకి వచ్చాం, యవ్వనాన్ని పోగొట్టుకున్నాం. వృద్ధాప్యంలోకి వచ్చాం, మధ్య వయస్సు పోయింది. పోగొట్టుకోవటం అంటే నువ్వు పోగొట్టుకోలేవు. ప్రకృతిలో జరిగే క్రమ పరిణామ దశ ఇది. పరమాద్భుతమైనటువంటి కవితా సౌందర్యాన్ని ఒక దూర్జటి గాని, శంకర భగవత్పాదులు గాని, ఇదిగో జ్ఞాన స్వరూపులైనటువంటి భగవాన్ శ్రీ రమణులు గాని జగత ఈదశి-జగత్తుతో కూడినటువంటి ఈశ్వరుణ్ణి పూజ చెయ్. యుక్త సేవనం చేస్తూ చేస్తూ అష్ట విధాలుగా ఉన్నటువంటి అష్టదళ పద్మంగా ఉన్నటువంటి నీ దేహాన్ని దేవాలయంగా దేవాలయంలో నీలో ఉన్నటువంటి ఆత్మని దైవంగా దైవమే నీవుగా నీకంటే దైవం భిన్నం కాదనేటువంటి త్వమేవాహం సంశయః. పరమేశ్వరా ఇవ్వాళ అర్థమైందయ్యా! నీకు నాకు ఏం తేడా లేదు. నువ్వు నేను ఒకటే. నిజమైనా? మనము భగవంతుడు ఒకటేనా అంటే ఒక రకంగా ఒకటే. ఎప్పుడు? స్థాయికి వెళ్ళినప్పుడు. రామాయణంలో రావణ వధ అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం అయిన తర్వాత ఆంజనేయస్వామి రాముడు కలిసి కాసేపు మాట్లాడుకున్నప్పుడు పాత స్మృతులన్నీ కూడా ఒక్కసారి తలుచుకున్నప్పుడు "హనుమా! మొట్టమొదటిసారి మనం కలుసుకున్నప్పుడు ఏమనిపించింది?" అని అడిగాడు. తర్వాత ఏమనిపిస్తున్నది రెండో ప్రశ్న వేశాడు. "రామా! కిష్కింధలో మొట్టమొదటిసారి నీ దర్శనం చేసుకున్నప్పుడు నీవు దశరథ రాజకుమారుడైన రామచంద్రుడివి. నేను సుగ్రీవుడి బంటుని, సుగ్రీవుడి మంత్రిని. అప్పుడు నేను ఆంజనేయుడిని. నీ పేరు రాముడు, నా పేరు ఆంజనేయుడు. నీవు రాజకుమారుడివి, నేను ఇక్కడొక మంత్రిని. నీతో కలిసి నాలుగు అడుగులు వేశాను. సీతమ్మ వారి యొక్క అన్వేషణలో, రామకార్యంలో భుజం భుజం కలిపినట్లుగా, నీ అడుగుజాడల్లో, నీ ఆజ్ఞలో, నీ కనుసన్నలలో నా జీవితాన్ని నేను గడిపాను. అప్పుడు ఏమైంది అంటే, నీవు రాజువైనావు నేను బంటునైనాను. అయితే శ్రీరామచంద్ర పదపద్మాధీన చేతస్కమైనటువంటి అంటే నిరంతరమూ నీ పాదాలని నిరంతరమూ నీ నామాన్ని రోమరోమాన నిలుపుకున్న కారణంగా రామా! ఇవ్వాళ నీకూ నాకూ తేడా లేదు. ఆంజనేయుడంటూ ఒకడు లేడు, రాముడంటూ మరొకడు లేడు. మనిద్దరికీ ఉన్నటువంటి అభేదమే పూర్ణాద్వైతమై భాసిస్తున్నది. త్వమేవాహం సంశయః. త్వమేవా అహం. నువ్వే నేను, నేనే నువ్వు." ఇటువంటి భావన నిజానికి హుయామై అనేటువంటి ఒక ప్రశ్న ఎక్కడైతే చింతన పుట్టిందో పుట్టిన చోటు నుంచి భగవాన్ రమణులు మనల్ని పరమ రమణీయార్ద్రంగా దీన్నుంచి ప్రపంచం వైపు నడిపిస్తూ ప్రపంచాన్ని పరమేశ్వరుడిగా భావించమని చెప్తారు.
YouTube · audio

Upadesa Saaram | Realistic commentary | Episode -17

Home

Upadesa Saaram | Realistic commentary | Episode -17

Source: TFC Spiritual on YouTube

0:00 / 16:03

More in this series

Upadesa Saaram | Realistic commentary

77 episodes · 15 hr 43 min

  1. 14 min 1

    Upadesa Saaram | Realistic commentary | Episode -1

  2. 14 min 2

    Upadesa Saaram | Realistic commentary | Episode -02

  3. 13 min 3

    Upadesa Saaram | Realistic commentary | Episode -03

  4. 17 min 4

    Upadesa Saaram | Realistic commentary | Episode -04

  5. 13 min 5

    Upadesa Saaram | Realistic commentary | Episode -05

  6. 14 min 6

    Upadesa Saaram | Realistic commentary | Episode -06

  7. 14 min 7

    Upadesa Saaram | Realistic commentary | Episode -07

  8. 13 min 8

    Upadesa Saaram | Realistic commentary | Episode -08

  9. 12 min 9

    Upadesa Saaram | Realistic commentary | Episode -09

  10. 13 min 10

    Upadesa Saaram | Realistic commentary | Episode -10

  11. 15 min 11

    Upadesa Saaram | Realistic commentary | Episode -11

  12. 15 min 12

    Upadesa Saaram | Realistic commentary | Episode -12

  13. 13 min 13

    Upadesa Saaram | Realistic commentary | Episode -13

  14. 13 min 14

    Upadesa Saaram | Realistic commentary | Episode -14

  15. 13 min 15

    Upadesa Saaram | Realistic commentary | Episode -15

  16. 14 min 16

    Upadesa Saaram | Realistic commentary | Episode -16

  17. 14 min 17

    Upadesa Saaram | Realistic commentary | Episode -17

    Now playing
  18. 11 min 18

    Upadesa Saaram | Realistic commentary | Episode -18

  19. 13 min 19

    Upadesa Saaram | Realistic commentary | Episode -19

  20. 14 min 20

    Upadesa Saaram | Realistic commentary | Episode -20

  21. 13 min 21

    Upadesa Saaram | Realistic commentary | Episode -21

  22. 14 min 22

    Upadesa Saaram | Realistic commentary | Episode -22

  23. 15 min 23

    Upadesa Saaram | Realistic commentary | Episode -23

  24. 13 min 24

    Upadesa Saaram | Realistic commentary | Episode -24

  25. 13 min 25

    Upadesa Saaram | Realistic commentary | Episode -25

  26. 6 min 26

    Upadesa Saaram | Realistic commentary | Episode -26

  27. 9 min 27

    Upadesa Saaram | Realistic commentary | Episode -27

  28. 9 min 28

    Upadesa Saaram | Realistic commentary | Episode -28

  29. 10 min 29

    Upadesa Saaram | Realistic commentary | Episode -29

  30. 9 min 30

    Upadesa Saaram | Realistic commentary | Episode -30

  31. 12 min 31

    Upadesa Saaram | Realistic commentary | Episode -31

  32. 10 min 32

    Upadesa Saaram | Realistic commentary | Episode -32

  33. 10 min 33

    Upadesa Saaram | Realistic commentary | Episode -33

  34. 10 min 34

    Upadesa Saaram | Realistic commentary | Episode -34

  35. 8 min 35

    Upadesa Saaram | Realistic commentary | Episode -35

  36. 9 min 36

    Upadesa Saaram | Realistic commentary | Episode -36

  37. 11 min 37

    Upadesa Saaram | Realistic commentary | Episode -37

  38. 8 min 38

    Upadesa Saaram | Realistic commentary | Episode -38

  39. 10 min 39

    Upadesa Saaram | Realistic commentary | Episode -39

  40. 10 min 40

    Upadesa Saaram | Realistic commentary | Episode -40

  41. 8 min 41

    Upadesa Saaram | Realistic commentary | Episode -41

  42. 10 min 42

    Upadesa Saaram | Realistic commentary | Episode -42

  43. 9 min 43

    Upadesa Saaram | Realistic commentary | Episode -43

  44. 6 min 44

    Upadesa Saaram | Realistic commentary | Episode -44

  45. 7 min 45

    Upadesa Saaram | Realistic commentary | Episode -45

  46. 10 min 46

    Upadesa Saaram | Realistic commentary | Episode -46

  47. 10 min 47

    Upadesa Saaram | Realistic commentary | Episode -47

  48. 9 min 48

    Upadesa Saaram | Realistic commentary | Episode -48

  49. 9 min 49

    Upadesa Saaram | Realistic commentary | Episode -49

  50. 9 min 50

    Upadesa Saaram | Realistic commentary | Episode -50

  51. 9 min 51

    Upadesa Saaram | Realistic commentary | Episode -51

  52. 10 min 52

    Upadesa Saaram | Realistic commentary | Episode -52

  53. 9 min 53

    Upadesa Saaram | Realistic commentary | Episode -53

  54. 11 min 54

    Upadesa Saaram | Realistic commentary | Episode -54

  55. 9 min 55

    Upadesa Saaram | Realistic commentary | Episode -55

  56. 8 min 56

    Upadesa Saaram | Realistic commentary | Episode -56

  57. 10 min 57

    Upadesa Saaram | Realistic commentary | Episode -57

  58. 10 min 58

    Upadesa Saaram | Realistic commentary | Episode -58

  59. 8 min 59

    Upadesa Saaram | Realistic commentary | Episode -59

  60. 9 min 60

    Upadesa Saaram | Realistic commentary | Episode -60

  61. 10 min 61

    Upadesa Saaram | Realistic commentary | Episode -61

  62. 9 min 62

    Upadesa Saaram | Realistic commentary | Episode -62

  63. 9 min 63

    Upadesa Saaram | Realistic commentary | Episode -63

  64. 10 min 64

    Upadesa Saaram | Realistic commentary | Episode -64

  65. 9 min 65

    Upadesa Saaram | Realistic commentary | Episode -65

  66. 10 min 66

    Upadesa Saaram | Realistic commentary | Episode -66

  67. 10 min 67

    Upadesa Saaram | Realistic commentary | Episode -67

  68. 8 min 68

    Upadesa Saaram | Realistic commentary | Episode -68

  69. 10 min 69

    Upadesa Saaram | Realistic commentary | Episode -69

  70. 9 min 70

    Upadesa Saaram | Realistic commentary | Episode -70

  71. 7 min 71

    Upadesa Saaram | Realistic commentary | Episode -71

  72. 9 min 72

    Upadesa Saaram | Realistic commentary | Episode -72

  73. 9 min 73

    Upadesa Saaram | Realistic commentary | Episode -73

  74. 9 min 74

    Upadesa Saaram | Realistic commentary | Episode -74

  75. 10 min 75

    Upadesa Saaram | Realistic commentary | Episode -75

  76. 10 min 76

    Upadesa Saaram | Realistic commentary | Episode -76

  77. 8 min 77

    Upadesa Saaram | Realistic commentary | Episode -77