Skip to content
Transcript తెలుగు
[సంగీతం] మా గురువు గారు శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ప్రత్యేకమైన సాయంకాలం తలసేమియా society ఏది సంకల్పించిన దాని వెనుక ప్రజా హృదయాల స్పందన భగవంతుడి ఆశీర్వచనం వారి వెంట ఉంటూనే ఉన్నది ఇవాళ పిల్లలు stage మీద perform చేసినప్పుడు కళ్ళవెంట నీరు ఆగలేదు అది ఆనందానికి కారణం అందుకనే announcement లేకుండా మేమందరం నుంచొని అటువంటి తలసేమియా లేని ఒక రోజు ఎప్పుడొస్తుందా అని ఒక మంగళాశాసనం చేసుకున్నాం మనసులో తలసేమియా తెలంగాణలోనే కాదు యావత్ ప్రపంచంలో తలసేమియా అనేటువంటి disorder లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా రాష్ట్రం తొలి అడుగు వేస్తున్నందుకు దాని వెనుక చంద్రకాంత్ అగర్వాల్ గారి నేతృత్వంలో రత్నావళి doctor సుమన్ మిగతా అందరు సభ్యులు కూడా నిరంతరం కృషి చేస్తున్నందుకు వారికి అనంత కోటి గురు స్వరూపాల యొక్క అనుగ్రహం అన్నివేళలా ఉంటుంది వారికి positive energy ప్రపంచం ఇస్తుంది ఇక్కడ ఉన్న మన ప్రతి ఒక్కళ్ళం కూడా ఇవాళ ఒకే ఒక resolve చేయాలి eradication of thalassaemia కి మనవంతుగా మనం ఏం చేయగలము అని ఒక చిన్న ప్రశ్న వేసుకుని ఇందాక చంద్రకాంత్ అగర్వాల్ గారు నాతో మాట్లాడినారు అందరి నుంచి మేము డబ్బు ఆశించటం లేదు ధన్ ధన్ మన్ మనసు మాకు ఇచ్చేసేయండి అది మాకు మహదాశీర్వచనం అన్నారు మనసే కాదు డబ్బు వస్తుంది అనుగ్రహం వస్తుంది తలసేమియా ప్రపంచం నుంచి తరిమి కొట్టటానికి ఇవాళ వేదిక సత్యసాయి భగవానుడు సంచారం చేసిన దివ్య మహా ప్రాంగణం నుంచి ఇది మహోద్యమం అయి సాగుతుంది అలాగే వారు తలపెట్టినటువంటి కల వారు స్వప్నించినటువంటి కల 2017 December ముప్పై ఒకటి లోగా building operate అవుతుంది అని నేను ఆశీర్వచనం చేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సమాజంలో ఒక రుగ్మత ఏర్పడినప్పుడు ఒక అవసరం ఏర్పడినప్పుడు ఒక బలం కావలసినప్పుడు ఒక శక్తి కావలసినప్పుడు ఇది మళ్ళీ పడుకున్నది లేస్తుందా లేచింది నడుస్తుందా నడిచేది పరిగెత్తుతుందా అని అన్నప్పుడు ఒక మానవతా మూర్తి ఇరుగుమా వెంకటరమణ రాజు గారు ఇక్కడ మన పక్కన కూర్చొని ఇదే వేదిక మీద తలసేమియా పిల్లలకి ఒక్క కోటి రూపాయలు ఇచ్చిన సందర్భం నా కళ్ళ ముందు ఇంకా చెదిరి పోలేదు వారికి పిల్లల యొక్క మహదాశీర్వచనం అంతా కూడా వారికి బలంగా సుదీర్ఘమైనటువంటి ఆయుష్షుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని వారికి కలగాలని వారి కుటుంబం అంతా కూడా సేవలో తరించాలని అలాగే చంద్రకాంత్ అగర్వాల్ గారు వారి కుటుంబ సభ్యులు సుమారు నలభై మందిని నాకు పరిచయం చేశారు వాళ్ళంతా కూడా ఉద్యమంలో పాల్గొంటున్నందుకు వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రవదన్ గారు లాంటి వారు అప్పుడు పార్థసారథి గారి లాంటి వారు ధనంజయ రెడ్డి గారు లాంటి వారు వారెవ్వరినీ మనం మర్చిపోకూడదు ఎందుకంటే స్పందన ఒక అధికారి గనక హృదయ స్పందన ఉన్నట్లయితే ఇటువంటి పనులు చేయటం చాలా చాలా చాలా తేలిక హృదయమే లేని officer గనక ఉన్నట్లయితే చేయగలిగింది లేదు కానీ ఇవాళ సభకి చంద్రవదన్ గారు రావటం మా రత్నావళి ప్రతిరోజూ ఆయన గురించి చెప్తూనే ఉంటుంది మంచితనం వారి సామర్థ్యం వారి మానవతా దృక్పథం మన society కి అపూర్వమైనటువంటి ఆభరణంగా నేను భావన చేస్తూ తలసేమియా లేని రోజు ప్రపంచంలో మనం కన్నుమూయక ముందే దాన్ని చూడాలని నేను కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. [సంగీతం]
YouTube · audio

Speech | Thalassemia And Sickle Cell Society | Thal Beats 2017

Home

Speech | Thalassemia And Sickle Cell Society | Thal Beats 2017

Source: ILLUSIONZ MEDIA WORKS on YouTube

0:00 / 4:26